LATEST NEWS
  పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనుమడు చంద్ర కుమార్ బోస్ అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల వేడి కొనసాగుతున్న తరుణంలో, నేతాజీ వారసుడు మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీలో చేరడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. గతంలో భారతీయ జనతా పార్టీలో కీలక నేతగా ఉన్న చంద్ర కుమార్ బోస్, 2023లో ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి రావడం, అది కూడా బెంగాల్ గడ్డపై పట్టున్న టీఎంసీని ఎంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సెక్యులర్ విలువలు, సమ్మిళిత రాజకీయాల పట్ల టీఎంసీ చూపిస్తున్న నిబద్ధత తనను ఆకర్షించిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్టీలో చేరిన అనంతరం చంద్ర కుమార్ బోస్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలను బీజేపీ తుంగలో తొక్కిందని ఆయన ఆరోపించారు. మతపరమైన విభజన రాజకీయాలకు పాల్పడుతూ, దేశ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఆ పార్టీ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. 2016లో భారీ అంచనాల మధ్య బీజేపీలో చేరిన బోస్, ఆ పార్టీలో శరత్ చంద్ర బోస్ మరియు నేతాజీ ఆశయాలకు చోటుంటుందని భావించినట్లు తెలిపారు. అయితే, బీజేపీ విధానాలు రాజ్యాంగ విలువలకు భిన్నంగా ఉండటంతో తాను ఆ పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని వివరించారు. ఈసారి నిర్ణయం తీసుకునే ముందు లోతుగా ఆలోచించి, ప్రజాస్వామ్య విలువల కోసం టీఎంసీ సరైన వేదిక అని గుర్తించినట్లు ఆయన స్పష్టం చేశారు. గతంలో 2016 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ చంద్ర కుమార్ బోస్ బీజేపీ తరపున పోటీ చేశారు. అయితే, ఆ రెండు పర్యాయాల్లోనూ ఆయనకు విజయం లభించలేదు. అయినప్పటికీ, నేతాజీ వారసత్వం కారణంగా బెంగాల్ ప్రజల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆయన రాకతో టీఎంసీలో కొత్త ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, నేతాజీ కుటుంబ సభ్యుడు తమ గూటికి రావడం మమతా బెనర్జీకి కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నేతాజీ వారసత్వాన్ని తమ పార్టీకి అనుకూలంగా మలుచుకోవడంలో టీఎంసీ విజయం సాధించిందని వారు విశ్లేషిస్తున్నారు. రానున్న రోజుల్లో చంద్ర కుమార్ బోస్ బెంగాల్ వ్యాప్తంగా పర్యటించి, టీఎంసీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేసే అవకాశం ఉంది. నేతాజీ ఆశయాల సాధన కోసం తృణమూల్ పార్టీని బలోపేతం చేయడమే తన తదుపరి లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఆయన రాకతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో వేచి చూడాలి.
ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే సీపీఐ నారాయణ ఏ విషయం మీదనైనా సరే ఎలాంటి బేషజాలూ లేకుండా ముక్కుసూటిగా మాట్లాడతారు. అటువంటి నారాయణ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడారు. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులపై నడుస్తున్న కేసులపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.   సీపీఐ సీనియర్ నాయకుడు డాక్టర్ కె. నారాయణ  తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం, తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తినెయ్యి వినియోగం, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అవినీతి, అక్రమాలు తదితర కేసులలో ఎవరికీ శిక్ష పడే అవకాశం లేదని విస్పష్టంగా చెప్పారు.    రెండు రాష్ట్రాల్లోనూ కూడా  ప్రభుత్వాలు మారిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణలు ముమ్మరమయ్యాయి. ఏపీలో మద్యం కుంభకోణం, తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం, ఇక తెలంగాణలో కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ తదితర కేసుల విచారణ సాగుతోంది.   ఈ నేపథ్యంలోనే ఈ కేసులు  ఎక్కడి వరకు వెళ్తాయి? రాజకీయ నాయకులకు శిక్షలు పడతాయా? అన్న తెలుగువన్  ప్రశ్నకు నారాయణ  ఒకరి మీద ఒకరు రాళ్లు వేసుకోవడం తప్ప, ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల సహకారంతో సాగే ఈ వ్యవహారాల్లో అసలైన దోషులకు శిక్షలు పడటం అసాధ్యమని కుండబద్దలు కొట్టేశారు.  సివిల్ సర్వెంట్స్ రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నారన్న నారాయణ, ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనీ, రిటైర్మెంట్ తర్వాత కార్పొరేట్ సంస్థల్లో పదవుల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు.  మీ పదవి ఎక్కడికీ పోదు, జీతం తగ్గదు.. మరి తప్పు చేయమని అడిగినప్పుడు ఎందుకు రిజెక్ట్ చేయలేకపోతున్నారు?" అని సూటిగా ప్రశ్నించారు.   ఇకఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అడిగిన ప్రశ్నకు అది చంద్రబాబు అత్యుత్సాహం అని అన్నారు. గతంలో ఆయన అత్యుత్సాహొం వల్లే అమరావతి నిర్మాణంలో సమయం వృధా అయ్యిందన్నారు.   రైతుల దగ్గర భూములు తీసుకోవడం చంద్రబాబు వల్ల మాత్రమే సాధ్యమైందని, కానీ వేల ఎకరాల భూమిని ఒకేసారి అభివృద్ధి చేయాలనుకోవడం వల్ల అప్పట్లో జాప్యం జరిగిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవనోపాధిని దెబ్బతీయకుండా అభివృద్ధి జరగాలని, కేవలం భవనాలు కడితే సరిపోదని సూచించారు.  గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి తన నెగటివ్ పాలిటిక్స్ ద్వారా చంద్రబాబు గెలుపునకు ఎలా సహకరించారో,   చంద్రబాబు   ప్రజల సమస్యలను విస్మరిస్తే ఆయనకు కూడా వచ్చే ఎన్నికల్లో అదే పరిస్థితి ఎదురౌతుందన్నారు.    ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత అధికారులపై కక్షసాధింపు చర్యలు అన్నది  ఒక ఆచారంగా మారిందన్న నారాయణ.. ఈ వైఖరి  వ్యవస్థకు చేటు చేస్తుందని హెచ్చరించారు. అమరావతి రాజధానిని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా చట్టబద్ధం చేయడం మంచిదే అయినా.. ప్రజల్లో ఉన్న ఇన్సెక్యూరిటీని తొలగించి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సాధించడంపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. జగన్  మావిగన్ ను పట్టించుకోవలసిన అవసరం లేదన్నారు.    
ప్రస్తతుం ఆంధ్రప్రదేశ్ లో జగన్ మావిగన్ పై ఎడతెగని చర్చ జరుగుతోంది. వైసీపీయూలు మావిగన్ ను ఆంధ్రప్రదేశ్ ను సకల కష్టాల నుంచీ తొలగించే సంజీవనిలా, సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ లా అభివర్ణిస్తుంటే.. తెలుగుదేశం కూటమి పార్టీలే కాకుండా, మేధావులూ, సామాన్య జనం కూడా మావిగన్ ప్రతిపాదన చేసిన  జగన్ ను ఓ జోకర్ గా అభివర్ణిస్తున్నారు. అదే తీరుగా నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  అయితే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్  ఏబీ వెంకటేశ్వరరావు మాత్రం జగన్ మావిగన్ ప్రతిపాదన ఆషామాషీగా చేయలేదని హెచ్చరిస్తున్నారు. ఆ ప్రతిపాదన వెనుక భారీ కుట్ర దాగుందని చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.  మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  మావిగన్’  వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందంటున్నారాయన. ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు.  విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.   జగన్  మావిగన్  వ్యూహం అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడానికి ఉద్దేశించినదేనని విశ్లేషించారు. ముఖ్యంగా పెట్టబడి దారులను బెదరించి వెనక్కు పంపడం కోసమే ఆయన మావిగన్ ప్రతిపాదన చేశారన్న ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.  అంతర్జాతీయ స్థాయిలో అమరావతికి వస్తున్న పెట్టుబ డిదారులను భయభ్రాంతులకు గురిచేయడమే జగన్ లక్ష్యం అన్నారు. రాజధానిపై జగన్ తన వ్యతిరేకతను ఈ విధంగా వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగకుండా అడ్డుకట్ట వేయాలన్న కుట్ర చేస్తున్నారన్నారు.  సపోజ్ ఫర్ సపోజ్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతి పరిస్థితి దారుణంగా మారుతుందని ఏబీ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం, వేసిన రోడ్లను తవ్వేయడం, కేబుళ్లు,  పైపులను తరలించడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని  ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా అమరావతిని గ్రాఫిక్స్ అని, స్మశానమని అభివర్ణించి పెట్టుబడిదారులు రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేసిన ఏబీ వెంకటేశ్వరరావు.. ఇప్పుడూ అదే చేస్తున్నారన్నారు.   కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి విషయంలో పూర్తిస్థాయి నిబద్ధతతో లేదని విమర్శించిన ఏబీవీ.. ఢిల్లీ పాలకులు కేవలం తమ రాజకీయ అవసరాల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారనీ, రైతుల త్యాగాలకు తగిన న్యాయం జరగడం లేదనీ చెప్పారు.   సీఆర్డీఏ  చట్టం ఉండటం వల్లనే ఇప్పటివరకు అమరావతి కొంతైనా నిలబడిందని చెప్పిన ఏబీవీ..  ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు.  ప్రస్తుత ప్రభుత్వం రాజధాని పనులను 2028 నాటికి పూర్తి చేస్తామని చెబుతున్న నేపథ్యంలో, ఆ దిశగా వేగంగా అడుగులు వేయాలని కోరారు. అమరావతి కేవలం నగరం కాదనీ,  వేలాది మంది రైతుల నమ్మకమని అన్నారు.  
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మంత్రి సీతక్క లీగల్ నోటీసు పంపించారు. మంత్రి సీతక్క కేసీఆర్ కు లీగల్ నోటీసు పంపించడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అంగన్ వాడీలకు మొబైల్ ఫోన్ ల కొనుగోలు వ్యవహారంలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మంత్రి సీతక్క కేసీఆర్ కు నోటీసులు పంపారు. బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియా కార్యకలాపాలకు ఆ పార్టీ అధినేతగా కేసీఆర్ బాధ్యత వహించాలని పేర్కొన్న సీతక్క, ఆ పోస్టులన్నిటినీ వెంటనే తొలగించి.. 48 గంటలలోగా తనకు కేసీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్ని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. తాను విధించిన నిర్ణీత గడువులోగా కేసీఆర్ స్పందించకుంటే ఆయనపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.  సీతక్క కేసీఆర్ కు లీగల్ నోటీసు పంపించిన వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.  
భారత ఎన్నికల ప్రచారంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగ ప్రవేశం చేసింది.  రాజకీయ ప్రచారాల్లో సాధారణంగా నాయకులు ప్రత్యక్షంగా ర్యాలీలు నిర్వహిస్తారు. అలాగే సామాజిక మాధ్యమ వేదిక ద్వారా సందేశాలు పంపిస్తారు. అయితే ఈ సారి తమిళనాట సాంకేతిక విప్లవాన్ని కూడా ప్రచారంలో జోడించారు.  తమిళరాజకీయాలలోకొ కొత్తగా ప్రవేశించిన నటుడు విజయన్.. తన ప్రచార సరళిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.  ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత దళపతి విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయడానికి   ఏఐని వినియోగించుకుంటున్నారు.   తమిళనాడులో ఆదివారం (ఏప్రిల్ 12) జరిగిన ఒక రోడ్‌షోలో  హలోగ్రాఫిక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. విజయ్ స్వయంగా అక్కడ ప్రచారంలో పాల్గొన లేదు. కానీ ఏఐ ద్వారా విజయ్ రూపం, గొంతుఓటర్ల ముందుకు తీసుకువచ్చారు.  దీనికి సంబంధించిన వీడియోలు  సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రజలు తమ అభిమాన నాయకుడు సాక్షాత్తు తమ మధ్యే నిలబడి మాట్లాడుతున్నట్లు భావించేలా ఆ ప్రచారం సాగింది.   ఈ ప్రచారంలో  దృశ్య రూపంతో పాటు   విజయ్ గొంతును కూడా ఏఐ ద్వారా రీ-క్రియేట్ చేసి ప్రసంగాలను వినిపించారు.  క్షేత్రస్థాయిలో నేత అందుబాటులో లేని సమయంలో    ఏఐ  ఆడియో, వీడియో అద్భుతంగా పనిచేస్తోందని అంటున్నారు. భారతదేశంలో ఎన్నికల ప్రచారంలో  ఏఐని ఉపయోగించడం ఇదే మొదటి సారి.   గత కొద్ది రోజులుగా టీవీకే  తన ప్రచార జోరును పెంచిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా టీవీకే అధినేత విజయ్ కటౌట్లు, పోస్టర్లతో పార్టీ శ్రేణులు హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు  ఏఐ ప్రచారం మొదలు కావడం ఆ పార్టీలో జోష్ ను పెంచింది.  వినూత్న ఆలోచన కేవలం తమిళనాడులోనే కాకుండా, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఇతర రాజకీయ పార్టీలకు కూడా మార్గదర్శకం కానుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  విజయ్ పార్టీ  ఈ సృజనాత్మకత  డిజిటల్ యుగంలో రాజకీయ ప్రచారం ఎలా ఉండబోతోందో కళ్లకు కట్టిందంటున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
- ప్రాచీన భారతదేశ చరిత్ర నేపథ్యంలో 'భరతవర్ష' - గోపీచంద్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా సెన్సేషన్ మ్యాచో స్టార్ గోపీచంద్(Gopichand) ఒక భారీ పీరియడ్ డ్రామాతో మన ముందుకు రాబోతున్నారు. 'ఘాజీ' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న 33వ చిత్రానికి 'భరతవర్ష' (BharataVarsha - Saga of Shula) అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టైటిల్ గ్లింప్స్ ను పరిశీలిస్తే.. 642 AD లోని 'శూల' అనే ప్రాంత నేపథ్యంలో కథ సాగనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. వీడియో ప్రారంభంలోనే ఒక అగ్నిపర్వతం పేలుడు, నల్లటి పర్వతాల మధ్య ఉన్న ఒక గిరిజన తెగను చూపించి సంకల్ప్ రెడ్డి తన మార్క్ టేకింగ్‌ను చాటుకున్నారు. ఒక భారీ యుద్ధ సన్నివేశంతో వీరుడిలా గోపీచంద్ పాత్రను పరిచయం చేసిన తీరు అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. ఇక గ్లింప్స్ చివర్లో గోపీచంద్ తన రెండు చేతుల్లో మండుతున్న కర్రలను పట్టుకుని గంభీరంగా నడుచుకుంటూ వచ్చే షాట్ హైలైట్ గా నిలిచింది. గోపీచంద్ ఈ చిత్రం కోసం తన రూపురేఖలను పూర్తిగా మార్చుకున్నారు. కండలు తిరిగిన దేహం, పొడవైన జుట్టు, గడ్డంతో ఒక పవర్ ఫుల్ యోధుడిగా కనిపిస్తున్నారు. సంకల్ప్ రెడ్డి గత చిత్రాలు 'ఘాజీ', 'అంతరిక్షం' లాగే ఈ సినిమా కూడా ఒక విజువల్ వండర్‌గా ఉండబోతుందని గ్లింప్స్ లోని గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ చూస్తే అర్థమవుతోంది. ఈ భారీ ప్రాజెక్టులో గోపీచంద్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.  ప్రాచీన భారతదేశ చరిత్రలో మనకు తెలియని ఒక కీలక ఘట్టాన్ని, వీరత్వాన్ని ఈ సినిమా ద్వారా వెలికి తీయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. గ్లింప్స్‌లో వినిపిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ చూస్తుంటే గోపీచంద్ తన కెరీర్‌లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ అందుకోవడం ఖాయమనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. "గోపీచంద్ కు సరైన డైరెక్టర్ దొరికాడు", "విజువల్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కేవలం 56 సెకన్ల వీడియోతోనే సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు సంకల్ప్ రెడ్డి. కొంతకాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్.. ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తారేమో చూడాలి.
- ఎస్క్వైర్ ఇండియా కవర్‌పై మెగా పవర్ స్టార్  - స్టైలిష్ అవతార్‌లో రామ్ చరణ్ రచ్చ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆయన ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ మ్యాగజైన్ 'ఎస్క్వైర్ ఇండియా' (Esquire India) కవర్ ఫోటోపై మెరిశారు. ఈ మ్యాగజైన్ కోసం చరణ్ చేసిన ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మునుపెన్నడూ చూడని విధంగా చాలా క్లాసీగా, స్టైలిష్‌గా కనిపిస్తున్న చరణ్ ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఈ కవర్ ఫోటోలో రామ్ చరణ్ ధరించిన అవుట్‌ఫిట్స్‌, ఆయన బాడీ లాంగ్వేజ్ ఒక ఇంటర్నేషనల్ ఐకాన్ లా ఉన్నాయని ఫ్యాషన్ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఆయన కళ్ళలో కనిపిస్తున్న ఆ ఇంటెన్సిటీ, రాయల్ లుక్ మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఈ షూట్ కోసం ఆయన ఎంచుకున్న రంగులు, డిజైన్లు చరణ్ పర్సనాలిటీని మరింత ఎలివేట్ చేశాయి. "గ్లోబల్ ఐకాన్ ఇన్ ది మేకింగ్" అంటూ ఈ మ్యాగజైన్ చరణ్‌ను అభివర్ణించడం విశేషం. ఈ ఘనత సాధించిన రెండవ తెలుగు హీరోగా రామ్ చరణ్ రికార్డ్ సృష్టించారు. గతంలో టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే ఈ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిశారు. ఇప్పుడు చరణ్ కూడా అదే జాబితాలో చేరడంతో 'ఆర్ఆర్ఆర్' హీరోలిద్దరూ గ్లోబల్ వేదికలపై తెలుగు సినిమా సత్తాను చాటుతున్నారని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ ఫోటోషూట్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉందని, అయితే అది తన బాధ్యతను మరింత పెంచిందని ఆయన పేర్కొన్నారు. తండ్రిగా తన బిడ్డలతో గడిపే సమయాన్ని తాను ఎంతో ఎంజాయ్ చేస్తున్నానని చరణ్ తెలిపారు. రామ్ చరణ్ కెరీర్ విషయానికి వస్తే..  త్వరలో ఆయన 'పెద్ది' (Peddi) సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.   
Ram Charan's star power shows no signs of slowing down. Ever since the massive international success of RRR, the actor has maintained a firm grip on the global spotlight. His latest photoshoot is a clear reminder of exactly why he commands such a massive following and why his every move becomes a celebration for fans everywhere. The new set of images for Esquire Magazine Cover Story captures his undeniable presence perfectly. The actor moves effortlessly between two distinct vibes. The striking water-based photographs highlight a fierce, raw energy, while his modern street-style wardrobe brings out a smooth, sophisticated charm.  Pulling off such contrasting looks with natural ease proves his strong grasp of fashion and visual presentation. This striking off-camera appearance is only adding to the massive excitement surrounding his next big project, Peddi.  Backed by producer Venkata Satish Kilaru, director Buchi Babu Sana, and the legendary AR Rahman, the film is already generating a huge amount of buzz. While the initial teasers and musical tracks have set the stage, it is Ram Charan’s unmatched magnetism and evolving style that keep the anticipation at an all-time high as audiences eagerly await his return to the big screen.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో వస్తున్న 'డ్రాగన్' (Dragon) సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 'దేవర'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాలో తన విశ్వరూపాన్ని చూపించడానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ చేస్తున్న ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఒక జిమ్ ఫోటో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ ఫోటోలో ఎన్టీఆర్ తన కండలు తిరిగిన వీపును చూపిస్తూ పవర్ ఫుల్ బ్యాక్ డబుల్ బైసెప్స్ పోజ్ ఇచ్చారు. ఈ ఫోటోకు ఆయన ఇచ్చిన క్యాప్షన్ "Built. Not bought." (కష్టపడి నిర్మించుకున్నది.. కొన్నది కాదు) అనేది ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ పడ్డ కఠోర శ్రమకు, క్రమశిక్షణకు ఈ బాడీ ఒక నిదర్శనం అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆయన భుజాలు, చేతులు, బ్యాక్ మజిల్స్ చూస్తుంటే ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం ఆయన ఎంతలా సిద్ధమయ్యారో అర్థమవుతోంది. ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక సీక్రెట్స్.. ఎన్టీఆర్ ట్రైనర్ కుమార్ మన్నవ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక ఉన్న సీక్రెట్స్ పంచుకున్నారు. ఈ లుక్ కోసం ఎన్టీఆర్ ఏడు వారాల వ్యవధిలో సుమారు 9.5 కిలోల బరువు తగ్గినట్లు సమాచారం. అయితే ఇది కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, శరీరంలోని కండరాలను మరింత షార్ప్‌గా, చురుగ్గా మార్చుకోవడమే లక్ష్యంగా ఈ శిక్షణ సాగింది. ఇందుకోసం ఎన్టీఆర్ తన వర్కౌట్ స్టైల్‌ను కూడా మార్చేశారు. హెవీ వెయిట్ ట్రైనింగ్ నుంచి ఫంక్షనల్ ఎక్సర్‌సైజులు, కార్డియో సెషన్ల వైపు మళ్ళారు. డైట్ మార్చేసిన ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకున్న డైట్ కూడా చాలా విభిన్నంగా ఉంది. సాధారణంగా బాడీ బిల్డింగ్ కోసం హై-ప్రోటీన్ డైట్ తీసుకుంటారు, కానీ ఎన్టీఆర్ ఈసారి 'లో-ప్రోటీన్' డైట్‌ను ఎంచుకున్నారట. గత కొన్ని ఏళ్లుగా పెంచుకున్న కండరాలను కరిగించి, ఒక లీన్ అండ్ షార్ప్ లుక్ లో కనిపించడమే దీని ఉద్దేశ్యం అని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ పలు రకాల అవతారాల్లో కనిపిస్తారని, అందులో ఈ 'బీస్ట్' లుక్ ప్రధాన ఆకర్షణ కానుందని టాక్. 'డ్రాగన్' మూవీ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో ఈ యాక్షన్ డ్రామాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలను ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ మరింత పెంచేసింది. మొత్తానికి, ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరో సునామీ లోడింగ్ అని అర్థమవుతోంది. 'డ్రాగన్' సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డులను తిరగరాస్తారో చూడాలి. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఈ మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ విడుదలయ్యే అవకాశముంది. https://www.instagram.com/p/DXDg7ooEV-n/
The recent box office result of Coolie seems to have left Superstar Rajinikanth quite disturbed and confused. Eager to break away from a continuous streak of action entertainers, the legendary actor has firmly set his sights on delivering a monumental Rs. 1000 crore grosser for Tamil cinema. However, this immense pressure is reportedly causing him to second-guess his project choices.  Industry rumors suggest that his previous interventions in the Vettaiyan screenplay contributed to its failure, leaving him swinging between different ideas as he struggles to perfectly analyze what will hit that massive box office milestone. Now, his next film with Kamal Haasan's RKFI, is going through second director change after Sundar C walked away as rumors strongly state that Cibi Chakravarty is also replaced.  Initially, director Cibi Chakravarty was on board for Rajinikanth's next film, backed by Kamal Haasan’s RKFI. Cibi pitched a RAW agent story that balanced action with comedy. While Rajinikanth wanted to shape it into something akin to Dhurandhar, he ultimately decided not to move forward with the subject for now. Adding to the complications, Cibi faced a compensation dispute with a Telugu producer over a dropped Nani film.  Although the director agreed to return his advance, the producer pushed for Rs. 5 crore or a co-production stake in the RKFI film. Kamal Haasan's banner firmly rejected this arrangement. Ultimately, more than the legal disputes, it was Rajinikanth's shifting outlook on the script that led to Cibi being ousted. Seeking a fresh direction, the superstar has now brought in director Ashwath Marimuthu to craft a light-hearted entertainer. Ashwath, who also has Simbu's next film after Arasan in his lineup, has already narrated a promising storyline and is currently hard at work developing the script.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
-ఎన్నికల బిజీలో విజయ్  -రీసెంట్ గా విజయ్ పై పవన్ కీలక వ్యాఖ్యలు  -దేశ భక్తి, ప్రకృతి పరిరక్షణకి మొదటి ప్రాధాన్యం  ఇళయదళపతి విజయ్(Vijay)పొలిటికల్ పార్టీ స్థాపించిన దగ్గర్నుంచి పవన్ కళ్యాణ్ స్పందన కోసం ఎదురుచూసే ఆశావహుల నెంబర్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. మరి తాజాగా చేరిన ఆశావాహుల్లోని ఎవరి జాతకం బాగుందో కానీ రీసెంట్ గా పవన్ స్పందించాడు. ఆ వివరాలు చూద్దాం. జనసేనాని విత్ జెన్ జీ పేరిట పవన్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించాడు. సదరు ప్రోగ్రాంలో    విజయ్ కి రాజకీయంగా సలహాలు ఏమైనా ఇస్తారా అనే ప్రశ్న పవన్ కి ఎదురైంది.  పవన్ బదులిస్తూ నేను ఎవరికి సలహాలు ఇవ్వను. నా పిల్లల విషయంలో కూడా అంతే . విజయ్ మాత్రం చాలా పెద్ద స్టార్ తో పాటు ఎంతో సమర్థుడు. రాజకీయాల్లో ప్రతిఫలం ఆశించకుండా పని చెయ్యాలని  చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు వైరల్ గా మారాయి.  Also read: Silk smitha: తన కోరిక తీర్చని మగాడిని ఏం చేసిందో చూడండి ఇదే ఇంటర్వ్యూ లో మీరు కంటెంట్ క్రియేటర్ అయ్యి ఉంటే ఎలాంటి వీడియోస్ చేస్తారని అడిగారు. దేశ భక్తి, ప్రకృతి పరిరక్షణపై చేస్తానని పవన్ చెప్పాడు. ఇక పవన్, విజయ్ మధ్య సుదీర్ఘ కాలం నుంచి పరిచయం ఉంది.  విజయ్ సినిమాలు కొన్నిటిని పవన్ రీమేక్ చేసాడు.  ఆ ఇద్దరు కలిసి చాలా సినిమాల ఫంక్షన్స్ కి హాజరయ్యారు.   
  -రాజనర్తకి సింహనందిని ఎంత పని చేసిందో చూడండి  -కోరిక తీర్చకపోతే ఉరిశిక్ష వరకు తీసుకెళ్లింది -మరి చివరకి ఏం జరిగింది    తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకులు, నందమూరి అభిమానులు సంపాదించిన ఆస్థి 'ఆదిత్య 369'. ఎక్స్ పైరీ డేట్ అనేది లేని విధంగా ఎన్ని తరాలైనా నిలబడిపోతుంది.  టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ తో సైన్స్ ఫిక్షన్ చిత్రంగా రుపొందగా ప్రతి సన్నివేశంతో పాటు నటీనటుల పెర్  ఫార్మెన్సు చూపు పక్కకి తిప్పుకోనివ్వదు. బాలకృష్ణ(Balakrishna)చేసిన ద్విపాత్రాభినయంలోని శ్రీకృష్ణ దేవరాయలు క్యారక్టర్ అయితే నభూతో నభవిష్యత్. ఆ క్యారక్టర్ లో నమకం దగ్గరనుంచి చమకం, వాచకం వరకు సాక్షాత్తు శ్రీకృష్ణ దేవరాయలు కనపడేలా చేయడం బాలకృష్ణ నిబద్దతకి నిదర్శనం. మరి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో జరిగిన ఒక సన్నివేశాన్ని గుర్తు చేసుకుందాం. సింహ నందిని శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో రాజనర్తకి. మంచి అందగత్తె. నృత్యంలో తనని ఓడించే వారు ఈ భూమ్మీదనే లేరని తన నమ్మకం. కృష్ణకుమార్ పై మోజు పడి తన కోరిక తీర్చమని అడుగుతుంది. కానీ కృష్ణకుమార్ ఒప్పుకోడు. దీంతో శ్రీకృష్ణదేవరాయలు దగ్గరకి వచ్చి కృష్ణ కుమార్ నన్ను పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకొని ఇప్పుడు హేమ(మోహిని) వెంట పడుతున్నాడని చెప్తుంది. కృష్ణ కుమార్ అదంతా  అబద్దమని  చెప్తాడు. దీంతో కొన్ని పరిణామాల నేపథ్యంలో కృష్ణ కుమార్ ప్రియురాలు హేమ, సింహ నంది మధ్య నాట్యంలో పోటీ జరుగుతుంది. ఆ పోటీలో సింహ నందిని గెలిస్తే సింహ నందిని కృష్ణ కుమార్ పెళ్లి చేసుకోవాలి. కానీ హేమ గెలవడంతో సింహ నందిని మరింత ఆగ్రహాన్ని తెచ్చుకుంటుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు పవిత్రంగా పూజించే అత్యంత విలువైన శివమణిని  కృష్ణ కుమార్ దొంగిలించాడనికి చూశాడని రాయలు నమ్మేలా ప్లాన్ చేస్తుంది. దాంతో కృష్ణ కుమార్ కి రాయలు వారు ఉరిశిక్ష విధిస్తారు. ఆ తర్వాత రాయలు వారే కృష్ణ కుమార్ ని విడిపిస్తాడనుకోండి.  కానీ ఒక ఆడది తనకి నచ్చిన వాడు తన పొందుని ఇష్టపడకపోతే ఎంత దూరం వెళ్తుందో ఆ సన్నివేశం చెప్తుంది. Anasuya: అనసూయ చీర వీడియోపై సెటైరికల్ కౌంటర్.. శివాజీ సృష్టించాడా!  కృష్ణ కుమార్ గా, శ్రీకృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ, రాజనర్తకి సింహ నందిని గా సిల్క్ స్మిత(Silk Smitha)ల పెర్ఫార్మ్ లోని  మ్యాజిక్ మనల్ని కట్టిపడేస్తుంది. మరియు ఆ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కేవలం వినోదం కోసమే కాకుండా, విజయనగర రాజుల కాలం నాటి రాజసానికి ప్రతీకగా నిలుస్తాయి. సదరు సన్నివేశం జరుగుతున్నంత సేపు బాలయ్య తన గాంభీర్యంతో,బాడీ లాంగ్వేజ్ తో,  డైలాగ్ డెలివరీతో రాయలవారిని కళ్ళముందు ఉంచితే, సిల్క్ స్మిత తన నటనతో మరియు నృత్యంతో ఆ సన్నివేశానికి ఒక ప్రత్యేకమైన గ్లామర్‌ని అద్దింది. తెలుగు సినిమా చరిత్రలో 'ఆదిత్య 369' ఒక మైలురాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు(Singitham srinivasarao)ఆ విధంగా తీర్చిదిద్దారు.మేస్ట్రో ఇళయరాజా నుంచి వచ్చిన సంగీతం,సెట్ డిజైన్ మనల్ని నిజంగానే విజయనగర సామ్రాజ్యానికి తీసుకెళ్తాయి. నేటి ఆధునిక కాలంలో ఎన్ని గ్రాఫిక్స్ ఉన్నా, 1991లోనే ఎంతో పరిమితమైన వనరులతో అద్భుతమైన విజువల్స్ చూపించారు. ఈ క్లిప్ చూస్తుంటే పాత తరం టాలీవుడ్ సినిమాలు ఎంత నాణ్యంగా ఉండేవో అర్థమవుతుంది. బాలయ్య అభిమానులకి మాత్రమే కాకుండా, సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ సన్నివేశం ఒక విందు లాంటిది. వింటేజ్ టాలీవుడ్ మ్యాజిక్ మళ్ళీ అనుభవించాలనుకుంటే ఈ వీడియో తప్పక చూడాల్సిందే.  
ఇంకా బ్యాచిలర్‌గానే ఉస్తాద్ రామ్..  పెళ్లి ఎప్పుడు అంటే అసలు విషయం చెప్పేసిన ఎనర్జిటిక్ స్టార్! టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి తన ఎనర్జీతో, డ్యాన్సులతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న రామ్.. గతేడాది చివర్లో 'ఆంధ్ర కింగ్ తాలూకా' (Andhra King Taluka) సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. అయితే, రామ్ కి అభిమానుల నుంచి తరచూ ఎదురయ్యే ప్రశ్న.. "పెళ్లి ఎప్పుడు?". తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్.. తన సింగిల్ స్టేటస్ గురించి, పెళ్లిపై వస్తున్న రూమర్ల గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏకాంతం అంటేనే ఇష్టం.. తాను ఎందుకు ఇంకా సింగిల్‌గానే ఉన్నానో రామ్ రీజన్ చెప్పారు. తాను చిన్నప్పటి నుంచే ఒంటరిగా ఉండటానికి అలవాటు పడ్డానని తెలిపారు. "చాలామంది ఖాళీ సమయం దొరికితే బోర్ ఫీల్ అవుతుంటారు. కానీ నేను నా ఏకాంతాన్ని (Solitude) ఎంతో ఇష్టపడతాను. నా కోసం నేను సమయాన్ని కేటాయించుకోవడంలో నాకు తెలియని ప్రశాంతత దొరుకుతుంది. ఆ ప్రశాంతతే నన్ను రీఛార్జ్ చేస్తుంది" అని రామ్ వివరించారు. నా జీవితంలోకి ఎవరైనా వస్తే.. సింగిల్‌గా ఉండటం అనేది తాను కావాలని తీసుకున్న నిర్ణయం కాదని, అది తన సహజ వ్యక్తిత్వం అని రామ్ చెప్పారు. "నా జీవితంలోకి ఎవరైనా వస్తే వారితో సమయం గడపడానికి నేను సిద్ధమే. కానీ ఒకవేళ ఎవరూ రాకపోయినా, నేను ఒంటరిగా ఉన్నా కూడా అంతే సంతోషంగా ఉండగలను. షూటింగ్ సమయంలో నిరంతరం వందలాది మంది మధ్య ఉంటాను కాబట్టి, పని పూర్తయ్యాక నాకు నేనుగా ఉండే ఆ కొద్ది సమయం ఎంతో విలువైనది" అని చెప్పుకొచ్చారు. లాక్‌డౌన్ అనుభవాలు.. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో దాదాపు ఏడాదిన్నర పాటు తానూ ఒంటరిగానే ఉన్నానని, ఆ సమయంలో కూడా తాను ఎక్కడా అసౌకర్యానికి లోను కాలేదని రామ్ గుర్తు చేసుకున్నారు. తనకంటూ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించుకున్నానని, అందుకే పెళ్లి గురించి లేదా రిలేషన్ షిప్ గురించి తనకు ఎప్పుడూ తొందర లేదని రామ్ మాటలను బట్టి అర్థమవుతోంది. మొత్తానికి, రామ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "ప్రశాంతత కోసం సింగిల్‌గా ఉండటమే మేలు" అని ఆయన చెబుతున్న విధానం చూస్తుంటే, ఈ ఇస్మార్ట్ శంకర్ పెళ్లి పీటలు ఎక్కడానికి ఇంకాస్త సమయం పట్టేలాగే ఉందని అభిమానులు భావిస్తున్నారు. గతంలో రామ్ - భాగ్యశ్రీ బోర్సే మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేసిన సంగతి తెలిసిందే. రామ్ మాటలను బట్టి చూస్తే.. అందులోనూ వాస్తవం లేదనే అనిపిస్తోంది.
Mass Ka Das Vishwak Sen has been finding it tough to deliver successful films lately and he is now, testing his luck with Devara Producer. He is teaming up with the blockbuster production house Yuvasudha Arts, known for bankrolling the massive pan-Indian NTR film. This upcoming movie marks the third production for the banner, and the journey has officially started with an auspicious pooja ceremony held today. Moving away from his usual intense action roles, this new film is touted to be a refreshing, new-age romantic comedy. The project is already building strong anticipation among fans even before the regular shooting has commenced. During the formal launch event today, successful director Koratala Siva sounded the ceremonial clapboard to initiate the proceedings.  Renowned producer Shyam Prasad Reddy handed over the bound script to the team, which was followed by the traditional camera switch-on ritual. The film is being helmed by director Rajath, who previously worked on Dev. The technical crew looks very promising, with Aravind Vishwanathan taking charge of the cinematography and Thejas Krishna composing the music. The entire team is aiming to deliver a youthful and engaging cinematic experience for the audience. Adding to the excitement, Vishwak Sen is not just playing the lead but is also presenting this romantic comedy.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
The momentum for Nagabandham: The Secret Treasureis reaching a fever pitch following the immense success of its initial glimpse and the soul-stirring Namo Re. Director Abhishek Nama, known for his grand vision, is now pivoting from the film's intense mythological tone to a celebratory mood. The team has officially confirmed that the second single, Sura Sura, will be unveiled on April 19th, promising to be the definitive festive anthem of the year. This track is set to be a visual extravaganza, meticulously crafted to showcase a traditional wedding in all its glory. Unlike the previous devotional offering, "Sura Sura" highlights the vibrant cultural tapestry and the joyous energy inherent in Indian festivities. Abhishek Nama’s direction ensures that while the film scales a pan-Indian canvas, the music remains deeply rooted in authentic human emotions and heritage, making it a perfect treat for family audiences. The collaboration between the musical duo Junaid Kumar-Abhe and the legendary choreographer Ganesh Acharya is one of the song's most exciting highlights. By blending high-octane folk rhythms with Acharya’s signature "mass" choreography, the makers have created a sequence that feels both epic and energetic. With a massive ensemble of dancers and rich production design, the song is poised to become a staple at weddings and celebrations across the country. Bringing this anthem to life is a powerhouse vocal team featuring Anurag Kulkarni, Kaala Bhairava, Mangli, and Kanakavva, ensuring a rich texture that spans generations. The lyrics by Kasarla Shyam add a poetic yet grounded touch to the high-energy composition. Produced by Kishore Annapureddy and Nishitha Nagi Reddy under NIK Studios, and featuring a stellar cast including Virat Karrna, Nabha Natesh, and Jagapathi Babu, Nagabandham is quickly proving to be a musical powerhouse.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుని పాటల పల్లకిలో కోయిలలా ప్రయాణిస్తూ వచ్చింది. కానీ సంగీత ప్రపంచాన్ని విషాదం కమ్మేసింది.  ఆమె గాత్రానికి ఇక మౌనంగా ఉండిపోమని విధి శాసించిందేమో.. ఆమె పూర్తీగా తన శ్వాసనే వదిలేసింది.  ప్రముఖ గాయని ఆశా భోస్లే మరణం ఇప్పుడు భారతదేశాన్ని, ప్రపంచాన్ని కూడా   విషాదంలోకి నెట్టివేసింది. వైవాహిక జీవితంలో విషాదం నుండి,  కూతురిని కోల్పోవడం.. ఆమె జీవితంలో ఎన్నెన్నో విషాదాలు కూడా ఉన్నాయి,  ఆమె సాధించిన ఘనతలు ఉన్నాయి.   ఆశా భోస్లే గురించి చాలా మందికి తెలియని విషయాల గురించి తెలుసుకుంటే.. ఆశాభోస్లే ప్రస్తుత వయసు 92 సంవత్సరాలు.. శనివారం ఆమె గుండెపోటుకు గురవడంతో ఆసుపత్రిలో చేరిందని సమాచారం.  ఆయాసం ఎక్కువ కావడం,  ఛాతీ ఇన్పెక్షన్ కారణంగా ఆమె మరణించిందని సోషల్ మీడియా వార్తల సారాంశం. బాలీవుడ్‌లో పెద్ద బ్రేక్ రాకముందు, ఆశా భోస్లే తన 10 ఏళ్ల చిన్న వయసులోనే సినిమాల కోసం మరాఠీ పాటలు పాడుతూ తన గాన ప్రస్థానాన్ని ప్రారంభించారట. గాయనిగా ఆమె ప్రయాణం అక్షరాలా 80 ఏళ్లకు పైమాటే.. ఆశా బోస్లే ను ముద్దుగా ఆశా తాయ్ అని పిలుచుకుంటారు.  ఆమె రష్యన్, మలయ్ బాషలతో సహా  20 కి పైగా భాషలలో 12వేలకు పైగా పాటలు పాడారు. ఇలా ఇన్ని పాటలు పాడిన నేపథ్య గాయనిగా,  అత్యధిక స్టూడియో ట్రాక్ లను రికార్డ్ చేసినందుకు  గిన్నిస్ వర్డ్ రికార్డ్ లో కూడా ఆమె స్థానం సంపాదించారు. 16 ఏళ్ల వయసులో ఆశా బోస్లే  1949లో తన కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా తనకంటే రెట్టింపు వయసున్న 31ఏళ్ల గణప్రతాప్ భోస్లే తో పారిపోయి వివాహం చేసుకున్నారు.  వీరికి హేమంత్,  వర్ష,  ఆనంద్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆశా, గణ ప్రతాప్ 1960లో విడిపోయారు. 1980లో ఆశా బోస్లే తనకంటే ఆరు సంవత్సరాల చిన్న వాడైన ప్రఖ్యాత సంగీత స్వరకర్త ఆర్.డి బర్మన్ ను వివాహం చేసుకున్నారు.  ఆయనను ముద్దుగా పంచమ్ దా అని పిలిచేవారు. వీరిద్దరూ కలిసి దమ్ మారో దమ్.. పియా తు అబ్ తో ఆజా వంటి ఎన్నో ఎవర్ గ్రీన్ హిట్ లను అందించారు. కొన్ని వార్తా సమాచారాల ప్రకారం ఆశా కూతురు  వర్ష డిప్రెషన్ తో బాధపడుతూ 56 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఆమె చిన్న కుమారుడు హెమంత్ 2015లో క్యాన్సర్ తో మరణించాడు. ఆశా ఒక విజయవంతమైన వ్యాపారవేత్త కూడా, ఆమె పలు దేశాలలో “ఆశాస్” అనే పేరుతో రెస్టారెంట్ల చైన్ ను  నడుపుతున్నారు. గానంపై ఉన్న అభిరుచితో పాటు, ఆశా భోస్లే తన వంట నైపుణ్యాలకు కూడా ప్రసిద్ధి చెందారు. ఆమె దుబాయ్, కువైట్, అబుదాబి, దోహా , బహ్రెయిన్ వంటి నగరాల్లో 'ఆశాస్' అనే పేరుతో రెస్టారెంట్ల చైన్ ను  నడుపుతున్నారు. ఆశా గారెకి శాస్త్రీయ సంగీతంలో చాలా లోతైన పరిజ్ఞానం ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్‌తో కలిసి 'లెగసీ' అనే ఆల్బమ్‌లో పనిచేసినందుకు ఆమె గ్రామీ నామినేషన్ గెలుచుకుంది. పాప్ , ఫ్యూజన్ ప్రధాన స్రవంతిగా మారడానికి చాలా కాలం ముందే, వాటితో ప్రయోగాలు చేసిన తొలి భారతీయ గాయకులలో ఆమె ఒకరు. ఆశా భోస్లే కూడా నటనారంగంలోకి అడుగుపెట్టి, 2013లో 'మై' అనే మరాఠీ చిత్రంలో తల్లి పాత్రతో రంగప్రవేశం చేశారు. తన విశిష్టమైన కెరీర్‌లో ఆశా భోస్లే అనేక గౌరవాలను అందుకున్నారు. 2000లో భారత ప్రభుత్వం ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయగా, 2008లో పద్మవిభూషణ్‌ను ప్రదానం చేసింది. ఆమె జీవితం క్రమశిక్షణ, సాహసోపేతమైన నిర్ణయాలు, నిరంతరం కొత్త ఆవిష్కరణలు చేయడం వంటి వాటితో ఆమె జీవితం నిండి ఉంది.                              *రూపశ్రీ.
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు.. ఇలా జీవితం ఎంత సాఫీగా గడుస్తోంది అనుకున్నా.. మనిషి లోపల మాత్రం మనసు తృప్తిగా, సంతోషంగా అనుభూతి చెందడం లేదు. చాలామందిలో ఈ గందరగోళం కనిపిస్తూ ఉంటుంది.  ఏదో కోల్పోయినట్టు కనిపిస్తూ ఉంటారు. అయితే దీనికి రివర్స్ గా.. సంతోషంగా ఉండే వ్యక్తులు మాత్రం జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సులువుగా అధిగమించగలరు, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోగలరు,  వీరికి జీవితం అసలు కష్టంగా అనిపించదు.  కానీ సంతోషంగా ఉండటం ఎలా.. మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండటం కేవలం నాలుగు అలవాట్ల వల్ల సాధ్యం అవుతుందని అంటున్నారు మానసిక ఆరోగ్య నిపుణులు.  ఆ నాలుగు అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. జాగ్రత్తగా వినడం.. కొంతమంది తమ గురించి మాత్రమే పట్టించుకుంటారు, ఇతరులు చెప్పేది వినడానికి ఇష్టపడరు. అలాంటి వారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. మీరు మాట్లాడే దానికంటే ఎక్కువగా వినడం నేర్చుకోవాలి. ఇతరులు చెప్పేది శ్రద్దగా వినగలిగే వ్యక్తులు జీవితంలో ఎన్నో సమస్యలను క్లిష్టతరం కాకుండా,  అసలు సమస్యలుగా మారకుండా ముందుగానే వాటిని పరిష్కారం చేసుకోగలుగుతారు. తద్వారా జీవితాన్ని డిస్టర్బ్ చేసేంత సమస్యలు ఏవీ వారికి ఉండవు. పాజిటివ్ మైండ్ సెట్.. సానుకూల భావాలు అంటే పాజిటివ్ మైండ్ సెట్  ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ తమ జీవితాలతో సంతోషంగా ఉంటారు,  వారికి దొరికే ఏ కొద్ది సమయాన్ని అయినా సంతోషంగా గడపడానికి,  ఆ సమయాన్ని మధురమైన జ్ఞాపకాలుగా మార్చుకోవడానికి, పదిలపరుచుకోవడానికి ఇష్టపడతారు. ఈ విషయాలు క్రమంగా వారిని సంతోషంగా ఉంచుతాయి. ఒత్తిడికి దూరంగా ఉండటం.. సంతోషంగా ఉండే వ్యక్తులకు ఒత్తిడి లేకుండా నిద్రపోవడం  అలవాటుగా మారుతుంది. ఈ అలవాటు  సంతోషంగా ఉంచడానికి సహాయపడుతుంది.  నిద్రపోయేటప్పుడల్లా అస్సలు  ఏ చింతా లేకుండా,  ఏ సమస్య గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోయేందుకు ప్రయత్నం చేయాలి.  ఇది ఒత్తిడిని దూరంగా ఉంచుతుంది. తమ మీద తాము జాలి పడటం.. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే వ్యక్తులు తమ మీద తాము జాలి పడటం అస్సలు పాటించరు. వారు ఏదో ఒకటి నేర్చుకుని, తప్పులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. తమ తప్పులను తాము దాచిపెట్టడం లేదా తమ అసమర్థతను ఒప్పుకోకుండా ఇతరులతో గొడవ పడటం లాంటివి చేయరు.   పైన చెప్పుకున్న లక్షణాలు ఉన్న వ్యక్తులు తమ జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.  ఆ లక్షణాలు వ్యక్తులను సంతోషంగా ఉండటానికి ప్రేరేపిస్తాయి,  సహాయపడతాయి కూడా.                                          *రూపశ్రీ  
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే... గొప్ప వ్యక్తులలో ఉండే అతిగొప్ప లక్షణం తక్కువ మాట్లాడటం.  తక్కువ మాట్లాడేవాడు తన చేతల్లోనే తన విజయాన్ని చూపిస్తాడు అని తరచుగా చెబుతూ ఉంటారు కూడా. ఇతరుల కంటే తక్కువ మాట్లాడేవారే ఎక్కువ తెలివైనవారని, జ్ఞానులని ఎందుకు అంటారు? తక్కువ మాట్లాడేవారు ఎందుకు ప్రత్యేకమైనవారిగా పరిగణించబడతారు? తక్కువ మాట్లాడటం అనేది గొప్ప లక్షణంగా ఎందుకు పరిగణించబడుతుంది? వివరంగా తెలుసుకుంటే.. తక్కువ మాట్లాడితే మాట విలువ పెరుగుతుంది.. ఎప్పుడూ  మాట్లాడుతూ ఉండే వ్యక్తులపై  చుట్టూ ఉన్నవారు  శ్రద్ధ పెట్టడం తగ్గిస్తారట.చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తి మాట్లాడినా కూడా ప్రజలు శ్రద్ధగా వింటారు. తక్కువ మాట్లాడటం వల్ల  వ్యక్తి మాటలకు విలువ పెరిగి, సమాజంలో వారికి మరింత గౌరవం లభిస్తుందని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. ఆలోచనా శక్తి.. తక్కువ మాట్లాడేవారు తమ మెదడును ఎక్కువగా ఉపయోగిస్తారు. వారు స్పందించడానికి తొందరపడరు.  ముందుగా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని, ఆ తర్వాతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే  వారు కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకున్నారని అందరూ ఒప్పుకునే విధంగా ఉంటాయి.   సమాజం కూడా ఇలా తక్కువ మాట్లాడే వారికి చాలా తెలివైన వారు అని చెబుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం..  తక్కువ మాట్లాడేవారు ఆర్భాటాలు చేయరు. వారికి తమపై పూర్తి విశ్వాసం ఉంటుంది, కాబట్టి ఇతరులను ఆకట్టుకోవడానికి  పనికిమాలిన మాటలు మాట్లాడరు. ఇలా  నిశ్శబ్దంగా ఉండే స్వభావమే వారి నిజమైన బలం అవుతుందని చాణక్యుడు అంటాడు.  తక్కువ మాట్లాడినప్పుడు వారిలో ఎన్నో విషయాలు వారిలోనే రహస్యంగా ఉండిపోతాయి. అదే ఎప్పుడూ మాట్లాడేవారు ఏ చిన్న సంఘటన జరిగినా బయటకు చెప్పేసుకుంటారు. దీని వల్ల వారికి విలువ, గౌరవం తగ్గిపోతుంది. అర్థం చేసుకునే అవకాశం.. తక్కువ మాట్లాడటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం  ఇతరుల మాటలను వినడానికి  అవకాశం లభించడం. ఇతరులు చెప్పేది బాగా వినగలిగే వ్యక్తి మాత్రమే  ఇతరుల బలహీనతలను, అవసరాలను అర్థం చేసుకోగలరని చాణక్యుడు చెబుతాడు. మౌనంగా ఉండి ఇతరుల మాటలను విన్నప్పుడు, వారి ఆలోచనలపై  ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇది నిర్ణయాలు తీసుకోవడానికి,  విజయం సాధించడానికి అత్యంత కీలకం అవుతుంది.                                 *రూపశ్రీ.
  మన శరీరంలో మెదడు తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన అవయవం కాలేయం (Liver). జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి, రక్తాన్ని శుద్ధి చేయడం వరకు కాలేయం సుమారు 500 పైగా పనులను నిర్వహిస్తుంది. అయితే, ప్రస్తుతం మనం తీసుకునే జంక్ ఫుడ్, ఆల్కహాల్, అధిక ఒత్తిడి మరియు సరైన వ్యాయామం లేకపోవడం వల్ల లివర్ తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. చాలా సందర్భాల్లో లివర్ 70% నుండి 80% వరకు దెబ్బతినే వరకు మనకు ఎటువంటి బయటి లక్షణాలు కనిపించవు. అందుకే దీన్ని 'సైలెంట్ కిల్లర్' అని కూడా అంటారు. అయితే, మన శరీరం ఇచ్చే కొన్ని ముందస్తు హెచ్చరికలను గమనిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు. ఈ ప్రత్యేక వీడియోలో, ప్రముఖ నాడిపతి (Nadipathy) నిపుణులు డాక్టర్ పెన్మెత్స కృష్ణమ్ రాజు (Dr. P Krishnam Raju) గారు లివర్ ఆరోగ్యం గురించి, అది దెబ్బతిన్నప్పుడు శరీరం చూపే లక్షణాల గురించి లోతుగా వివరించారు. ఈ Video లింక్‌ను క్లిక్ చేసి తెలుసుకుందాం. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ప్రధానాంశాలు: అలసట మరియు నీరసం:- ఎటువంటి పని చేయకపోయినా విపరీతమైన నీరసంగా అనిపించడం లివర్ సమస్యకు ప్రాథమిక సంకేతమా? చర్మం మరియు కళ్ళ రంగు:- కళ్లు పసుపు రంగులోకి మారడం (Jaundice) మరియు చర్మంపై దురదలు రావడం వెనుక ఉన్న అసలు కారణాలు. ఆకలి మందగించడం:- ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, వాంతులు వచ్చేలా ఉండటం దేనికి సంకేతం? పొత్తికడుపులో మార్పులు:- కడుపు ఉబ్బరంగా ఉండటం లేదా కుడి వైపున నొప్పి రావడం ఎందుకు జరుగుతుంది? నాడిపతి చికిత్స:- మందులు లేకుండా కేవలం నాడి నిదానం మరియు ప్రకృతి సిద్ధమైన పద్ధతులతో లివర్ సమస్యలను ఎలా నయం చేసుకోవచ్చు? మీరు లేదా మీ కుటుంబ సభ్యులు తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటే, ఈ వీడియో తప్పక చూడండి. కాలేయాన్ని సహజ పద్ధతుల్లో ఎలా శుద్ధి చేసుకోవాలో డాక్టర్ గారి సూచనలను పాటించండి. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు తెలుసుకోవడానికి మా  TeluguOne Health Youtube Channel సందర్శించండి! మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి,  ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో కొంతకాలంగా యువతలో గుండెపోటులు సంభవిస్తున్నాయి. గుండెను బలోపేతం చేయడానికి ఆహారంలో నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవడం ఎంతో ఉత్తమం అని ఆహార నిపుణులు అంటున్నారు. నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు గుండెను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అసలు గుండె బలంగా ఉండటానికి నైట్రేట్ ఎందుకు అవసరం? నైట్రేట్ ఆ కూరగాయలలో అధికంగా ఉంటుంది? ఆహార నిపుణులు ఏం చెబుతున్నారు? పూర్తీగా తెలుసుకుంటే.. ఆరోగ్యకరమైన గుండెకు నైట్రేట్ ఎందుకు ముఖ్యం? శరీరంలో నైట్రేట్, నైట్రిక్ ఆక్సైడ్‌గా మార్చబడుతుంది. నైట్రేట్ ఆక్సైడ్ రక్తనాళాలను విస్తరింపజేస్తుంది, ఇది రక్తపోటును నియంత్రిస్తుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అధిక రక్తపోటు సమస్య.. కొన్ని సంవత్సరాల క్రితం అధిక రక్తపోటును వృద్ధాప్య వ్యాధిగా పరిగణించేవారు. ఆ తరువాత 40 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారిలో అధిక రక్తపోటు కనిపించేది. ఇప్పుడు 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు కూడా అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. అధిక రక్తపోటును సకాలంలో కంట్రోల్ చేయలేకపోతే అది గుండె జబ్బులు, పక్షవాతం , మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది. అధిక రక్తపోటు అంటే ధమనులలో రక్తపోటు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం. నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు.. పాలకూర.. పాలకూరలో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో నైట్రేట్లు కూడా ఉంటాయి. పాలకూరను తినడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది , గుండె కండరాలను బలపరుస్తుంది. బీట్‌రూట్ .. బీట్‌రూట్ రసంలో నైట్రేట్లు ఉంటాయి. బీట్‌రూట్ రసం తాగడం వల్ల ఓపిక పెరిగి, గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఆకుకూర సలాడ్లు.. ఆకుపచ్చ ఆకు కూరల సలాడ్లలో నైట్రేట్లు ఉంటాయి.  ఆహారంలో సలాడ్లను చేర్చుకోవచ్చు.  ఆహారంలో ఆకుపచ్చ ఆకు కూరల సలాడ్లను చేర్చుకోవడం గుండె ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరం. మెంతులు.. మెంతిలో పీచుపదార్థం, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో నైట్రేట్లు కూడా ఉంటాయి, ఇవి గుండె జబ్బులను నివారించడంలో , చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. కాలీఫ్లవర్.. క్యాబేజీలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మాత్రమే కాకుండా ధమనులలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడే నైట్రేట్లు ఉంటాయి.                      *రూపశ్రీ.
వేసవి కాలంలో శరీరానికి నీరు చాలా అవసరం. నీటి కొరత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజుకు 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగమని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. అదనంగా మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు త్రాగమని కూడా సిఫార్సు చేస్తారు. కొందరు ఆరోగ్యానికి కొబ్బరి నీరు బెటర్ అని చెబితే.. మరికొందరు మజ్జిగ చాలా మంచిది అంటారు.  ఈ రెండూ ఆరోగ్యకరమైనవే.. అయినప్పటికీ రెండింటిలో కూడా ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది అనే విషయం దగ్గర చాలా మంది కన్ప్యూజ్ అవుతుంటారు.  కొబ్బరి నీరు,  మజ్జిగ.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేసే డ్రింక్ ఏంటో తెలుసుకుంటే.. కొబ్బరి నీరు.. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం , సోడియం ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం నివారించబడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, తక్షణ శక్తిని అందిస్తుంది.  తేలికగా, సులభంగా జీర్ణమవుతుంది.  అధికంగా చెమట పట్టినప్పుడు లేదా వ్యాయామం చేసినప్పుడు కొబ్బరి నీళ్లు తాగమని డైటీషియన్లు సిఫార్సు చేస్తారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ సమతుల్యత చేయబడుతుంది. మజ్జిగ.. మజ్జిగలో జీర్ణవ్యవస్థను బలపరిచే ప్రోబయోటిక్ గుణాలు ఉంటాయి. మజ్జిగ తాగడం జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ప్రతిరోజూ మజ్జిగ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ ,  ఉబ్బరం నుండి ఉపశమనం లభిస్తుంది. మజ్జిగ తాగితే  శరీరం  చల్లబడుతుంది. బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. గ్యాస్ లేదా అజీర్ణం వంటి కడుపు సమస్యలతో బాధపడుతుంటే, మజ్జిగ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తేడా.. కొబ్బరి నీరు శరీరానికి తక్షణమే తేమను అందిస్తుంది. మరోవైపు, మజ్జిగ జీర్ణక్రియను బలపరుస్తుంది. కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండగా, మజ్జిగలో ప్రోటీన్ , ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఎప్పుడు ఏది ఎంచుకోవాలి..?  డీహైడ్రేషన్ లేదా అలసటగా అనిపిస్తే కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఇది శరీరాన్ని తిరిగి ఎనర్జీగా మారుస్తుంది.  శరీరంలో ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత తగ్గిస్తుంది. భోజనం తర్వాత మజ్జిగ తాగవచ్చు. ఇది ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.  అలాగే ఎండలో బయటకు వెళ్లే ముందు కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఎండ నుండి వచ్చిన తర్వాత కూడా కాసింత చల్లగా ఉండే మజ్జిగ తాగవచ్చు. మజ్జిగ, కొబ్బరి నీరు రెండూ మంచివే అయినా.. శరీర పరిస్థితిని బట్టి కొబ్బరి నీరు, మజ్జిగ వేర్వేరు ఫలితాలు ఇస్తాయి,  వేర్వేరుగా ఉపయోగపడతాయి.                              *రూపశ్రీ.