LATEST NEWS
ఈ ఎన్నికలలో గెలుపు ఆశలు వదిలేసుకున్న వైసీపీ నాయకులు ఎప్పుడో ఒకసారి మీడియా ముందుకు వచ్చి విజయం మాదే అని వణుకుతున్న గొంతుతో చెబుతున్నారు. వారి గొంతుల్లో వణుకే టీడీపీ విజయాన్ని చెప్పకనే చెబుతోంది. ఐదేళ్ళపాటు రాష్ట్రాన్ని అన్నివిధాలా నాశనం చేసిన దండుపాళ్యం బలుపు, పులుపు తగ్గించే రోజులు దగ్గర్లోనే వున్నాయి. జూన్ 4వ తేదీ అనేది నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మేలు మలుపుగా నిలవబోతోంది. ఎందుకంటే ఆరోజు వైసీపీ ఘోరంగా ఓడిపోబోతోంది.
పిఠాపురంలో  ఏది జరిగినా  సెన్సేషనే..! ఎందుకంటే..అక్కడ జనసేన అధినేత పవన్  పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని తెలిసిన‌ప్ప‌ట్టి నుంచీ ట్రెండింగ్ లో ఉన్న సెగ్మెంట్ ఇది. అక్కడ ప్రచారం ఎంత హోరాహోరీగా జరిగిందో.. పోలింగ్‌ కూడా అంతే ఆసక్తిగా కొన‌ సాగింది. యువ‌త అర్థ‌రాత్రి వ‌ర‌కు ఓటు వేశారు. ఎన్నికల ఫలితాల ముందు అదికాస్త…చాలా పీక్స్‌కు చేరుకుంది. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఎవరికివాళ్లు… మా తాలుకా అంటే.. మా తాలుకా అని.. బోర్డులు తగిలించుకొని తిరుగుతున్నారు. వాహనాలకు నెంబర్‌ పేట్లకు బదులు.. మా పిఠాపురం ఎమ్మెల్యే ఫలానా అని.. రేడియంతో స్టిక్కరింగ్‌ చేయిస్తున్నారు.  జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య స్టిక్కర్ వార్ నడుస్తోంది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా అంటూ పవన్ అభిమానులు బైకులు, ఆటోలు, కార్లపై స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. మనల్నెవడ్రా ఆపేది అనే కొటేషన్స్ తో రచ్చ చేస్తున్నారు.  ‘మా MLA పవన్' అంటూ రాయించుకుంటున్నారు.    అటు  జనసేన కార్యకర్తలకు ధీటుగా వైసీపీ అభ్యర్థి వంగా గీతా అభిమానులు కూడా స్టిక్కర్లు  వేయించుకుంటున్నారు.  కాబోయే డిప్యూటీ సీఎం వంగా గీతా అంటూ బైక్ లపై స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. పిఠాపురంలో స్టిక్కర్ల వార్ కాకరేపుతోంది. ఎవరి నమ్మకంతో వాళ్లు స్టిక్కర్లు వేసుకొని హడావిడి చేస్తున్నారు.  ఇలా తిరుగుతున్న వాహనాల వీడియోలు.. సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  రిజల్ట్స్ కు ముందే పిఠాపురంలో రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ ఫ్లెక్సీలతో హంగామా చేస్తున్నారు. పిఠాపురంలో ఆధిపత్యపోరు ఓ రేంజ్‌లో నడుస్తుందనడానికి ఈ సంఘ‌ట‌న‌లు అద్దం ప‌డుతున్నాయి.  పవన్‌ అనుచరులు మొదలు పెట్టిన మైండ్‌ గేమ్‌కి వైసీపీ  కౌంటర్‌ ఇస్తోంది. మేమేం తక్కువ అంటూ సేం క్యాప్షన్‌ని.. వైసీపీ కి అప్లై చేసి రాసేస్తున్నారు. కొందరైతే ఇంకో అడుగు ముందుకేసి వంగా గీత కు పదవి కూడా ఇచ్చేశారు. వంగా గీత డిప్యూటీ సీఎం అంటూ కార్ల వెనుక రాయించుకుంటున్నారు. టూవీలర్‌ల నెంబర్‌ ప్లేట్లను గీత పేరుతో నింపేస్తున్నారు.  ఇక్క‌డ‌ పొలిటికల్ హీట్  ఏ మాత్రం తగ్గడంలేదు.   పిఠాపురంలో కూటమి అభ్యర్థిగా పవన్ కల్యాణ్  బరిలో ఉండగా, వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేశారు. అయితే వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని ప్రచారం చివరి రోజు సీఎం వైఎస్ జగన్ ప్రకటించడంతో అక్కడి ఫలితం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. 
వైసీపీ ఓటమి ఖరారని తెలుగుదేశం కూటమి నేతలు, పరిశీలకులు, రాజకీయ పండితులు చెప్పడం కాదు. స్వయంగా వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డే అంగీకరించేశారు. ఈ సారి ఎన్నికలలో తెలుగుదేశం కంఫర్ట్ బుల్ గా విజయం సాధించబోతోందని ఆయన అన్యాపదేశంగా కేడర్ కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. అదే సమయంలో గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు సాధిస్తామన్న జగన్ రెడ్డి మాటలు అబద్ధమని కూడా తేల్చేశారు. పోలింగ్ జరిగిన నాటి నుంచి చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేశారు. పోలిసులు పూర్తిగా తెలుగుదేశంతో కుమ్మక్కైపోయారు. నిజాయితీగా పని చేసే అధికారులను మార్చేశారు అంటే శోకన్నాలు పెట్టిన సజ్జల ఇప్పుడు తాజాగా మీడియా ముందుకు వచ్చి మాచర్లలో ఈవీఎం ధ్వంసమైనా తెలుగుదేశం రీపోలింగ్ కోసం ఎందుకు డిమాండ్ చేయడం లేదంటూ ప్రశ్నలు గుప్పించారు. రీపోలింగ్ డిమాండ్ చేయలేదంటే అక్కడ  తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా పోలింగ్ జరిగినట్లే కదా అని ఆయనే జవాబు కూడా చెప్పేశారు. సాధారణంగా విజయం సాధిస్తామని నమ్మకం ఉన్నపార్టీ రీపోలింగ్ కోసం డిమాండ్ చేయదు. అదే fవిాషయాన్ని సజ్జల చెప్పారు. అక్కడితో ఆగకుండా ఆయన చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నానని భావిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు వ్యూహాల ముందు ఎవరూ పనికిరారని అన్యాపదేశంగా అంగీకరించేశారు. ఎవరైనా సరే చంద్రబాబు మాట వినాల్సిందేనని చెప్పారు. చివరాఖరికి మోడీ కూడా చంద్రబాబు ట్యూన్ కు డ్యాన్స్ చేయాల్సిందేనని సజ్జల అన్నారు. వాస్తవానికి సజ్జల   చెబుదామనుకున్నారంటే.. చంద్రబాబు పోల్ మేనేజ్ మెంట్ ద్వారా పోలింగ్ మొత్తం  తెలుగుదేశం కూటమికి అనుకూలంగా మారిపోయిందనీ, అందుకకు బీజేపీ సహకరించిందనీ చెప్పేశారు. అలా చెప్పడం ద్వారా ఆయన చంద్రబాబును పొగడడమే కాకుండా వైసీపీ ఓటమిని కూడా అంగీకరించేశారు. ఇక ఇప్పటి వరకూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ క్యాడర్  జారిపోకుండా ఉండేందుకు వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాలు,  ఇచ్చిన హైప్ అన్నీ వ్యర్థంగా మారిపోయాయి.
హైదరాబాద్ లో ఒకే రోజు రెండు ఫేక్ కాల్స్ వచ్చాయి. ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క నివాసముండే ప్రజా భవన్ కు ఉదయం ఉత్తుత్తి బాంబు బెదిరింపు వస్తే సాయంత్రం నాంపల్లిక్రిమినల్ కోర్టుకు ఇదే తరహా కాల్ వచ్చింది.   తెలంగాణ‌లో వ‌రుస బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ క‌ల‌కలం సృష్టిస్తున్నాయి. ఇవాళ ఒకే రోజు ప్రజాభ‌వ‌న్‌, నాంప‌ల్లి కోర్టుకు ఇలా బాంబ్ బెదిరింపు ఫోన్ కాల్స్ రావ‌డం గ‌మ‌నార్హం. మొద‌ట ప్ర‌జాభ‌వ‌న్‌లో బాంబ్ పెట్టామంటూ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మంగ‌ళ‌వారం ఉద‌యం పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ సాయంతో విస్తృతంగా సోదాలు నిర్వ‌హించారు. కానీ, ఎలాంటి బాంబ్ లేక‌పోవ‌డంతో అంద‌రూ ఊపీరి పీల్చుకున్నారు. దాంతో ఈ ఫేక్ కాల్ చేసిన వ్య‌క్తి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఒక‌వైపు విచార‌ణ జ‌రుగుతుండ‌గానే తాజాగా నాంప‌ల్లిలోని కోర్టుకు బాంబ్ బెదిరింపు కాల్ రావ‌డం క‌ల‌క‌లం రేపింది. నాంప‌ల్లి కోర్టులో బాంబు పెట్టామ‌ని, మ‌రి కాసేప‌ట్లో కూల్చేస్తామ‌ని ఆగంత‌కుడు పోలీసుల‌కు ఫోన్ చేశాడు. దీంతో వెంట‌నే అల‌ర్ట్ అయిన పోలీసులు హైకోర్టులో బాంబ్ స్క్వాడ్ బృందాల‌తో విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హించారు. కానీ, ఎలాంటి బాంబ్ ఆన‌వాళ్లు ల‌భ్యం కాక‌పోవ‌డంతో ఫేక్ కాల్‌గా పోలీసులు నిర్ధారించుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఎడు విడతలుగా జరుగుతున్న ఎన్నికలలో చివరి విడత పోలింగ్ జూన్ 1న జరుగుతుంది. ఆ తరువాత నాలుగు రోజులకు అంటే జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. ఈ సారి దేశ వ్యాప్తంగా ఎలాంటి ట్రెండ్ కనిపించనప్పటికీ, ఏపీ ఎన్నికల విషయంలో మాత్రం దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రిపోల్, పోస్ట్ పోల్ అంచనాలన్నీ తెలుగుదేశం కూటమి విజయాన్నే సూచిస్తున్నాయి.   ఈ నేపథ్యంలోనే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన తేదీ దగ్గర పడే కొద్దీ ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంటోంది. ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లూ చేసేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల లెక్కింపు జూన్ 4 ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. ఆ తరువాత 8.30 గంటలకు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మొదలౌతుంది.  ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఓట్ల లెక్కింపు మచిలీపట్నంలోకి కృష్ణా వర్సిటీలో జరుగుతుంది.  జిల్లాలో అందరి దృష్టి గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలపైనే ఉంది. ఈ నియోజకవర్గాలలో ఉండటానికి పోటీలో పన్నెండీసి మంది ఉన్నా ప్రధాన పోటీ మాత్రం తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థుల మధ్యే జరుగుతున్నది. గుడివాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీ అభ్యర్థిగా,  తెలుగుదేశం తరఫున వెనిగండ్ల రాము పోటీ పడుతున్నారు. గుడివాడ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు మొత్తం 17 రౌండ్లలో జరుగుతుంది.  ఫలితం మధ్యాహ్నానికే వచ్చేసే అవకాశం ఉంది. ఇక్కడ పోలింగ్ సరళిని బట్టి చూస్తే తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాము స్పష్టమైన ఆధిక్యత సాధిస్తారన్న అంచనాలు ఉన్నాయి. మరో వైపు వైసీపీ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నది.  ఇక గన్నవరం నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ పోటీ ప్రధానంగా తెలుగుదేశం అభ్యర్థి  యార్గగడ్డ వెంకటరావు, వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మధ్యే ఉంది. ఈ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు 22 రౌండ్లలో సాగుతుంది. దీంతో ఈ నియోజకవర్గ ఫలితం తేలేందుకు ఒకింత ఆలస్యం కావచ్చునని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ కూడా పోలింగ్ సరళిని బట్టి చూస్తే యార్లగడ్డ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయి. 
ALSO ON TELUGUONE N E W S
The film S.I.T (Special Investigation Team) starring Arvind Krishna and Natasha Doshi was directed by Vijaya Bhaskar Reddy and produced by S Nagi Reddy, Tej Palli, and Guntaka Sreenivas Reddy. This movie has been streaming on ZEE 5 since May 10th. The crime, suspense, and thrilling elements in the movie have awestruck the OTT audience. Director Vijaya Bhaskar Reddy expressed happiness as this movie is getting a superb response. He recalled his journey in the film industry, on the occasion. “I was born and brought up in Kadapa district. I did my schooling and college education there. We are a joint family. We were all together in one place. I know the plight of farmers. My father made sure all of us were educated so that we would not suffer the hardships he faced. After completing graduation, I came to Hyderabad. At that time, I took coaching for ICET and DF-Tech courses. I did an MPA from Central University. After that, I entered the industry. I have worked with various directors as an assistant and co-director. I am making my debut as a director with the movie SIT. My family doesn't want me to get into movies. But my elder brother stood by me. I was able to stay in the industry because of him. I have been in the industry for fifteen years. This project started with funding from my degree friends. They suggested to me that it would be better if this story was made into a film rather than a web series. Nagi Reddy and Bal Reddy have been encouraging me from the beginning. We met producer Teja in Vizag through a friend. Srinivas, Ramesh and we all together made this movie. Arvind Krishna acted brilliantly in this film. I will never forget his contribution. Natasha also played her part well. I was able to make this movie so well with the help of actors and technicians. This movie has been made for OTT since the beginning, so we released it on the streaming platform. Finally, our movie has arrived on OTT. The movie is getting a good response. Everyone is enquiring about the second and third parts. It seems that the movie has got pan-India reach. Currently, our film is trending in the top 5 position on ZEE 5. I am very happy with such a great response.”
1000 Waala, Starring AMITH in the Lead Role, has been Produced by SHARUKH in Super Hit Movie Makers Banner is Busy in post production work. The film is being directed by Afzal, who shot to fame with Ten Rupees film. The film stars Suman, Mukthar Khan and Pilla Prasad will be seen in key roles. The film is currently Busy with Post-Production work. Recently, the First look Poster of the Film was Released on Social Media. After seeing the response on social media, the Producers said, "The First Look of Our film 1000 Waala has impressed the social media audience. Looking at the Likes and comments, we were confident that our film will Definitely be Successful. The shooting has been completed. The first copy is getting ready. It will be released soon".
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి రికార్డులకి ఏదో అవినాభావ సంబంధం ఉందనుకుంటా.  తన  తొలి సినిమా గంగోత్రి నుంచి తెలుగు చలన చిత్ర సీమలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. లేటెస్ట్ గా తన ఖాతాలో మరో భారీ రికార్డుని చేర్చుకున్నాడు. బన్నీ అప్ కమింగ్ మూవీ పుష్ప 2 . ప్యాన్స్ తో పాటు ప్రేక్షకులు పుష్ప హంగామా చూడటం కోసం రీగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక కొన్ని రోజుల క్రితం  పుష్ప 2 నుంచి  సాంగ్ రిలీజ్ అయ్యింది. పుష్ప పుష్ప పుష్ప అనే లిరిక్ తో స్టార్ట్ అయ్యే ఆ  సాంగ్ ఇప్పుడు  యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటి వరకు 100 మిలియన్స్  వ్యూస్  ని సాధించింది. అదే విధంగా  2.26 మిలియన్స్ లైక్స్  ని కూడా పొందింది. దీన్ని బట్టి పుష్ప మానియా ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.  ఇక రేపు సెకండ్ సింగల్  రిలీజ్ కానుంది.మరి ఆ పాట ఎన్ని వ్యూస్ ని కొల్లగొడుతుందో చూడాలి.  రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుండగా ఫహాద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్ తదితరులు  కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా  విడుదల అవుతుండగా సుకుమార్ దర్శకుడు. బన్నీ సుక్కు కాంబోలో హ్యాట్రిక్ మూవీగా నిలవాలని యూనిట్ అహర్నిశలు శ్రమిస్తోంది. పార్ట్ వన్ ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ నే ఇప్పుడు పార్ట్  టూ ని కూడా నిర్మిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్  మ్యూజిక్ ని అందిస్తున్నాడు.    
అగ్గంటుకుంది సంద్రం  దేవ.. భగ్గున మండె ఆకసం.. అరాచకాలు భగ్నం దేవ.. చల్లారే  చెడు సాహసం.. జగడపు దారిలోముందడుగైన సేనాని..జడుపును నేర్పగా అదుపున ఆపే సైన్యాన్ని..దూకే ధైర్యమా జాగ్రత్త రాకే తెగబడి రాకే. దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే. ఈ పాటికే అర్ధమయ్యింది కదా  ఎన్టీఆర్ (ntr) దేవర(devara) లోని సాంగ్ అని. రామజోగయ్యశాస్త్రి కలం నుంచి  ఏ ముహూర్తాన వచ్చిందో గాని లేటెస్ట్ గా ఒక  అరుదైన ఘనతని సాధించింది సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ అయిన యూట్యూబ్ లో దేవర సాంగ్ ఇరవై తొమ్మిదవ స్థానం సాధించింది.వరల్డ్ మొత్తానికి చెందిన  వంద పాటలని పరిగణలోకి తీసుకుంటే  దేవర ఇరవై తొమ్మిదవ స్థానం సాధించింది. దీన్ని బట్టి సాంగ్ కి ఎంత ఆదరణ లభిస్తుందో అర్ధమవుతుంది.ఒక సారి విన్న వాళ్ళు సైతం పదే పదే వింటున్నారు.ముందు ముందు నెంబర్ వన్ సాంగ్ గా కూడా నిలబడటం ఖాయమని  ఫ్యాన్స్ అంటున్నారు.ఇక దేవర  అక్టోబర్ పది న ప్రేక్షకుల ముందుకు రావడానికి శరవేగంగా ముస్తాబు అవుతుంది.  ఆర్ఆర్ఆర్(rrr)తర్వాత రెండు సంవత్సరాలకి వస్తున్న మూవీ కావడంతో అందరిలో భారీ అంచనాలే  ఉన్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కి జతగా చేస్తుంది. ఇంకో హీరోయిన్ కూడా ఉందనే వార్తలు వస్తున్నాయి. మరి కొన్ని రోజుల్లో ఆ విషయం మీద అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ బడా హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకుడు .ఆచార్య ప్లాప్ తో చాలా కసిగా దేవరని తెరకెక్కిస్తున్నాడు. దేవర 2 కూడా ఉంది  
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవలే పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకున్న చిరంజీవి.. ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని పొందారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) గోల్డెన్‌ వీసాను చిరు అందుకున్నారు.  వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి దుబాయ్ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది. ఇప్పటికే చిరంజీవి కుటుంబం నుంచి ఆయన కోడలు, రామ్ చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన ఈ వీసాను అందుకోవడం విశేషం. అలాగే తెలుగు హీరోలలో అల్లు అర్జున్ కూడా దుబాయ్ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఇతర భాషలకు చెందిన స్టార్స్ లో.. రజినీకాంత్, కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ వంటి వారు గోల్డెన్‌ వీసాను అందుకున్న వారిలో  ఉన్నారు.
జోజు జార్జ్ ప్రతి ఒక్కరికి సుపరిచయమైన నటుడు. ఎన్నో చిత్రాల్లో మెమొరబుల్ రోల్స్ పోషించారు. అద్భుతమైన నటన కనబరిచారు. నటుడిగా కొనసాగుతూనే జోజు జార్జ్ డెబ్యూ డైరెక్టర్ గా 'పణి' అనే చిత్రంతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. పణి చిత్ర యూనిట్ తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. జోజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మాస్ కథాంశం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రివేంజ్ డ్రామాగా అలరించబోతోంది.  జోజు ఈ చిత్రానికి దర్శకుడు మాత్రమే కాదు.. ఈ చిత్ర కథానాయకుడు కూడా ఆయనే. జోజు నుంచి చిత్రాలు కోరుకునే వారు ఈ ఫస్ట్ లుక్ తో సూపర్ హ్యాపీగా ఉన్నారు. అభినయ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ లుక్ ఇప్పుడే రిలీజ్ చేశారు. మూవీ 100 రోజుల షూటింగ్ పూర్తయ్యాక.. థియేటర్స్ లోకి రానుంది. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ సాగర్, జునైస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  తన 28 ఏళ్ళ సినీ కెరీర్ లో జోజు తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. జోజు జూనియర్ ఆర్టిస్ట్ గా,  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా నటించారు. ఇప్పుడు ఆయన పేరు ముందు డైరెక్టర్ అనే పదం చేరబోతోంది. జోజు నటుడిగా కార్తీక్ సుబ్బరాజ్-సూర్య చిత్రంతో పాటు బాలీవుడ్ లో అనురాగ్ కశ్యప్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న అనురాగ్ కశ్యప్ చిత్రాన్ని జోజు స్వయంగా నిర్మిస్తున్నారు.
Presented by the prestigious production company UV Creations, the movie "Bhaje Vaayu Vegam," starring Kartikeya Gummakonda, is produced under the banner of UV Concepts. Iswarya Menon is playing the heroine, while Rahul Tyson of "Happy Days" fame plays a pivotal role. Director Prashant Reddy is making this film, an emotional action thriller, with Ajay Kumar Raju P. acting as co-producer. "Bhaje Vaayu Vegam" is set for a worldwide grand theatrical release on the 31st of this month. On this occasion, director Prashant Reddy shared some highlights in a recent interview. - "I worked in the direction department for the movie 'Run Raja Run.' After that, I continued with 'Saaho.' Before COVID, this subject was approved. Kartikeya was then busy with '90ML' and 'Chaavu Kaburu Challaga.' A year and a half was wasted due to COVID. After starting the shooting of 'Bhaje Vaayu Vegam' and completing 70 percent, Kartikeya went to shoot 'Bedurulanka 2012.' After finishing that, we completed our 'Bhaje Vaayu Vegam.'" - "According to the story of 'Bhaje Vaayu Vegam,' the first half needs a performer, and heroism should be elevated in the second half. Karthikeya seems to be the best option for me. He performs well and has a hero's personality. This is the reason for choosing Karthikeya. Also, the heroine is a traditional girl who grows up in a middle-class locality. If you look at Iswarya Menon's profile, you will see pictures in half-sari and saree, making her the right choice for this character in the movie." - "There are reasons for the delay of 'Bhaje Vaayu Vegam.' Due to some technical problems, the edited version lost footage, and the editing took three more months. We took extra time for quality in post-production. It would have been pressuring for the first movie to be delayed for some time." - "Father's sentiment is revealed in the trailer, but the concept of father sentiment is timeless. At the end of the trailer, Rahul tells Karthikeya that his father is not his father, and some have commented that the story is familiar. However, the trailer shows that there will be many variations in the story seen in theaters. The trailer does not show any twists as the story should not be revealed. Whether the hero has achieved his goal as a cricketer is not hinted at anywhere in the trailer. Rahul's dialogue in the trailer actually comes at the beginning of the movie. We are all very confident about the film." - "The hero has a brother character in the story, a very key role. It is a hero-like character after the hero. While thinking about who to cast for this role, UV suggested Rahul Tyson. He had taken a gap in between. I also felt that Karthikeya's brother would be fresh. That's how Rahul came into the movie." - "We all come from town to town to achieve something. We will lose some here and there in order to come. We will earn some. Finally, we see whether our goal is reached or not. There are those who do not achieve what they want. The hero comes to the city with a goal like that. At the time he is trying to achieve his goal, other problems surround him. He leaves his goal and goes to solve them. The audience feels that his goal is different." - "Ours is Medak district. Rajamouli's Sye movie was shot in our village. From that time, I also had a desire to enter the industry. Now, I am not qualified enough to say that I came to the industry after seeing Rajamouli. After the release of the movie, if you all like it, tell me his name." - "In the second half of the movie, there will be a chase-like screenplay. It is believed that you will not look at your phone in the second half. So gripping. We could give a title like 'Speed' to our movie, but because of the English title, we named it 'Bhaje Vayu Velya.' UV liked it, so we registered it immediately. Director Anil, who is going to make a film with Akhil in UV, saw this film and suggested the title." - "Director Sujeeth likes editing. After seeing the movie 'Bhaje Vaayu Vegam,' he liked it and gave an interview to our team. Usually, Sujeeth doesn't do interviews. In that interview, Sujeeth's words about Chiranjeevi, NTR, and Pawan Kalyan's OG are going viral. All their fans are thanking me. We request these fans to come to the theaters and watch our movie 'Bhaje Vaayu Vegam.'" - "Special care has been taken for the BGM of this movie. We allocated about three months for the background score. Kapil, a newcomer, gave the BGM. Radhan sang. I didn't do BGM with Radhan because if he was in Chennai, I wouldn't have time to go back and forth. There will not be a single song in the second half. The screenplay is racy. If the story goes at a fast pace, the audience will not want a song to be there. Moreover, it is considered a speed breaker." - "Audiences have come into the trend of watching reels. Even if they get bored for a moment, they will change the reel. In such a time, my idea is to engage the audience without giving a small gap. We followed this approach in the movie 'Bhaje Vaayu Vegam.' We call him a hero, so I think a hero should have a bigger goal. The audience will connect with the hero. They should have a hero character to inspire them." - "You can learn a thousand times more by directing a movie than what you learn as an assistant director. A film can be improved in several stages. No other creative job has this opportunity." - "Hero characters are very common in Rajamouli's movies. But they face unusual problems. I think the hero should be like that in my film too. The audience comes to the cinema with many problems, and I think we should entertain them for a while without irritating them in the theater." - "I have some scripts at the moment. I will announce my new movie after the release of the 'Bhaje Vaayu Vegam' movie."
దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ జూన్ 4వ తేదీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆరోజు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఆరోజుతో వరుసగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని అవుతారా లేదా తేలిపోతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా అదే తేదీన రాబోతున్నాయి. దీంతో జూన్ 4 కోసం ఏపీ ప్రజలు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సరిగ్గా వారం రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ క్రమంలో సీనియర్ నటుడు నరేష్ చేసిన డిమాండ్ సంచలనంగా మారింది. ఓట్ల లెక్కింపు రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని నరేష్ కోరారు. సోషల్ మీడియా వేదికగా ఈ డిమాండ్ ని ఆయన తెరపైకి తీసుకొచ్చారు. "లక్షలాది మంది కొత్త ఓటర్లు.. మార్పు కోసం తమ ఓటును వినియోగించుకున్నారు. దీని దృష్టిలో పెట్టుకొని.. పోలింగ్ రోజుని ఎలాగైతే సెలవు దినంగా ప్రకటించారో.. అలాగే ఓట్ల లెక్కింపు రోజును కూడా సెలవు దినంగా ప్రకటించాలి. టీవీల ముందు కూర్చుని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూసేందుకు యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చర్య ఎక్కువ మంది వ్యక్తులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అద్భుతమైన ప్రేరణగా ఉపయోగపడుతుంది." అని నరేష్ రాసుకొచ్చారు.
Renowned director Lokesh Kanagaraj is stepping into the role of producer for an intriguing new film titled "Benz," starring actor and director Lawrence in the lead. The film marks the directorial debut of B Kannan, who is set to bring fresh vision and creativity to the project.  This collaboration promises to be an exciting venture, given Kanagaraj's reputation for producing high-quality, engaging cinema. In a thrilling development, top actor Suriya will be making a guest appearance in "Benz," further heightening anticipation for the film.  Suriya's previous collaboration with Lokesh Kanagaraj in the blockbuster "Vikram," where he played the memorable character Rolex, garnered widespread acclaim. His portrayal was so impactful that Kanagaraj announced Suriya's character would have a significant role in the upcoming "Vikram 2."  Suriya's involvement in "Benz" is expected to add significant value and attract a broader audience. Meanwhile, Lawrence has been actively engaged with several projects in the Tamil film industry, although his presence in the Telugu market had diminished. With "Benz," Lawrence aims to make a strong comeback, selecting the right project to reestablish his foothold. The combination of Lokesh Kanagaraj's production expertise, Suriya's guest role, and Lawrence's dynamic performance is set to create substantial buzz and anticipation around "Benz," making it one of the most awaited films in the coming months.
ప్రముఖ హీరో అల్లరి నరేష్(allari naresh)కి తెలుగు ప్రేక్షకులకి మధ్య ఉన్న అనుబంధం రెండు దశాబ్దాల పై మాటే. 2002 లో వచ్చిన అల్లరి ఆయన మొదటి మూవీ. కామెడీ నటుడు గానే  తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించినా ఇప్పుడు  అల్లరి నరేష్ ని  కామెడీ నటుడు అనలేని పరిస్థితి.  ప్రాణం, గమ్యం, ఉగ్రం,శుభప్రదం, నాంది, నా సామి రంగ లాంటి చిత్రాలతో వర్సటైల్ యాక్టర్ అనిపించుకున్నాడు.టు డే  టాక్ అఫ్ ది డే గా నిలిచాడు. అల్లరి నరేష్ నయా మూవీ బచ్చల మల్లి (bachchala malli) కాసేపటి క్రితమే  ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది. రిక్షా లో కూర్చోని  నోట్లో బీడీ పెట్టుకున్న నరేష్ స్టిల్ సూపర్ గా ఉంది.. ఒక రకంగా   చెప్పాలంటే ఊర మాస్ లుక్ తో అదరగొట్టాడు.  పక్కా మాస్ ఎంటర్ టైనర్ తో మూవీ తెరకెక్కనుందనే  విషయం అర్ధమవుతుంది. పైగా మేకర్స్ మూవీ  గురించి ప్రస్తావిస్తు  పేరు  మల్లి, ఇంటి పేరు  బచ్చల చేసేది ట్రాక్టర్ డ్రైవింగ్..ఖచ్చితంగా బచ్చల మల్లి   మీకు చాలా రోజులు గుర్తుండిపోతాడు అని  ప్రకటించడంతో అల్లరి నరేష్ అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలోకి వెళ్లాయి. 2020 లో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సోలో బతుకే సోలో బెటర్ ఫేమ్  డైరెక్టర్ సుబ్బు మంగాదేవి దర్శకుడు కాగా ఊరుపేరు భైరవ కోన, సామజవరగమనా, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం  ప్రొడ్యూసర్ రాజేష్ దండా నిర్మాత. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు.ప్రస్తుతానికి  అయితే శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. హనుమాన్ మూవీ ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్ గా చేస్తుండటం విశేషం. అల్లరి నరేష్ గత మూవీ  ఆ ఒక్కటి అడక్కు..ఒక మోస్తరు విజయాన్ని అందుకుంది.      
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
చాలామంది సంకల్పబలం, క్రమశిక్షణల గురించి ఓ అరగంట ప్రసంగించమంటే తడుముకోకుండా మాట్లాడతారు. కానీ వాటిని పాటించే విషయంలోనే వస్తాయి చిక్కులన్నీ. తమ దాకా వచ్చేసరికి అవి అందరికీ సాధ్యం కాదని తేల్చేస్తారు. అది పుట్టుకతోనే రావాలని చల్లగా జారుకుంటారు. అలాంటి వారికి సమాధనమే ఈ కింది విషయాలు.. దృఢనిర్ణయాలు తీసుకోవాలంటే? ...  మీ మానసిక బలాన్ని పరీక్షించుకొని, పెంపొందించుకొనే మార్గాల్లో ముఖ్యంగా ప్రతి నిత్యం జీవితంలో కొన్ని ఇష్టం లేని, కష్టంగా కనిపించే పనుల్ని చేయడం ఒకటి. అలా తరచూ సాధన చేయాలి. వీటి వల్ల ప్రయోజనాలు కలుగుతాయని తెలిసినా మీ మనసు ఆ పనుల్ని ఏదో ఒక వంకతో వ్యతిరేకిస్తూనే ఉంటుంది. అయినా సరే ఆ పనులు చేయాలి. అలా చేయడం ద్వారా మీ మెదడులో నిక్షిప్తమైన వ్యతిరేక భావాలను అధిగమించగలుగుతారు. అంతర్గతంగా ఉన్న వ్యతిరేక శక్తులను అధిగమించడం ద్వారానే మనకు అవసరమైన అంతర్గత శక్తిని మేల్కొల్పగలం. ఉదాహరణకు మీరు బస్సులో ప్రయణిస్తున్నారనప్పుడు సీటు దొరికితే హాయిగా కూర్చుంటారు, లేకపోతే తప్పదు కాబట్టి నిలబడి ప్రయాణిస్తారు. ఒకవేళ మీకు సీటు దొరికినా సరే ఆ సీటును ఇంకొకరికి ఇవ్వండి. ఓ పదిహేను లేదా ఇరవై నిమిషాలు నిలబడి ప్రయాణించండి. ఈ చిన్న విషయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, మీలోని మానసిక నిరోధ భావాలను గమనించండి. అయినా మనస్సు మాట వినకుండా ఇంకొకరికి ఆ సీటు ఇచ్చి, ప్రయాణం చేయండి. ఆ తరువాత చూడండి. మీరు ఈ నిరోధ భావాల నుంచి బయటపడడానికి చేసిన సంఘర్షణ, చివరికి సాధించడం చూస్తే మీలో మీకే తెలియని ఆత్మవిశ్వాసం, ధైర్యం కలుగుతాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు, అర్జునుడితో మానసిక దౌర్బల్యాన్ని జయించాలని చెబుతూ ఎవరికైనా మనస్సును అదుపులో ఉంచుకోవడం దుస్సాధ్యమే, కానీ అభ్యాస, వైరాగ్యాల ద్వారా దాన్ని సాధించవచ్చని బోధిస్తాడు. మీ ఇంట్లోని వారికి వారి పనుల్లో ఎప్పుడైనా సహాయం చేశారా?  ఈసారి ఈ విధంగా ప్రయత్నించండి! నేరుగా వంటింట్లోకి వెళ్ళి అమ్మతో "అమ్మా! నేను ఏదైనా సహాయం చేయనా?” అని అడగండి, ఎప్పుడూ ఆ మాట అడగని మీరు ఈ ప్రశ్న వేసేసరికి ఆవతలివారు కాస్త కంగారు పడి, మిమ్మల్ని కొత్తగా చూడడం సహజమే. అయినా సరే, వంటిల్లు సర్దడంలోనో, కూరలు తరగడంలోనో, గిన్నెలు కడగడంలోనో సహాయం చేయండి. అది చిన్న పనే అయినా, మీకిష్టం లేని పని చేసిన తరువాత ఒక్కసారి వారి కళ్ళలోని ఆ వెలుగును చూడండి. రెండూ మిమ్మల్ని సంకల్ప బలం వైపు నడిపిస్తాయి.  ఒక్కోసారి మీరు అలసిపోయి ఇంటికొస్తారు. రాగానే మీ శరీరాన్ని సోఫాలో పడేసి అందుబాటులో ఉన్న టీవీ రిమోట్ తీసుకొని, అలా ఎంతసేపు ఛానల్స్ మారుస్తూ కూర్చుంటారో మీకే తెలియదు. అప్పుడు స్నానం చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ బద్దకం మీ కన్నా బలమైంది కాబట్టి, అది అక్కడ నుంచి లేవనీయదు. అయితే ఈ సారి మీ బద్ధకం మాట వినకండి. కష్టమైనా సరే లేచివెళ్ళండి. చేయాలనుకున్న పని వాయిదా వెయ్యకుండా చేయండి. అప్పుడు చూడండి మీపై మీకే తెలియని దృఢత్వం,  ఒక నమ్మకం, ధైర్యం కలుగుతాయి. ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఒకరోజు మీరు కాఫీ, టీ, పాలల్లో చక్కెర లేకుండా తాగేందుకో లేదా కనీసం పెరుగన్నంలో ఉప్పు లేకుండా తినేందుకో ప్రయత్నించండి. మీ కన్నా ముందు మీ నాలుక ఈ ప్రయోగానికి ఒప్పుకోదు. దాన్ని జయించడానికేగా ఈ ప్రయత్నమంతా! అలాగే వేడినీళ్ళ  స్నానం అలవాటున్న వాళ్ళు వరుసగా వారం రోజులు చన్నీటి స్నానం చేసి మీలోని శారీరక, మానసిక నిబ్బరాన్ని పరీక్షించి సాధించండి. చదువుకునేటప్పుడు కష్టమైన సబ్జెక్టుతో వాయిదా వేయకుండా పోరాడండి. కొన్ని మాటలు మాట్లాడే కన్నా మాట్లాడకుండా ఉంటేనే ఎక్కువ ప్రయోజనం ఉన్నప్పుడు మౌనాన్ని ఆశ్రయించండి. మీ ఉద్వేగాన్ని అదుపులో ఉంచుకోండి.  ఇలా అన్నీ ఒక్కొక్కటిగా మీ జీవితంలో ఫాలో అయ్యారంటే మీ మీద మీరు విజయం సాధిస్తారు కచ్చితంగా.                                      ◆నిశ్శబ్ద.
నేటి వేగవంతమైన ప్రపంచంలో ఉద్యోగ జీవితాలు కూడా అంతే వేగంగా ఉంటాయి. పోటీ దృష్ట్యా ప్రతి సంస్థ 24 గంటలు తమ కార్యకలాపాలు కొనసాగించాలని అనుకుంటుంది. ఈ కారణంగానే సాధారణ పనివేళలు మాత్రమే కాకుండా నైట్ షిఫ్టులు కూడా కొనసాగిస్తుంది.  వేతనం గురించో ఇతర కారణాల వల్లనో చాలామంది నైట్ షిప్టులో పనిచేస్తుంటారు.  అయితే సాధారణ పని వేళల్లో పనిచేసేవారి కంటే నైట్ షిప్టులో పనిచేసేవారిలో చురుకుదనం తక్కువగా ఉంటుంది. అంతేనా సాధారణంగా నిద్రపోవాల్సిన సమయంలో ఉద్యోగాలు చెయ్యడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నైట్ షిఫ్టు డ్యూటీ చేసేవారు  ఆరోగ్యంగా, యాక్టీవ్ గా ఉండటానికి  కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే.. నిద్ర.. నైట్ షిఫ్టు లో పనిచేసేవారు నిద్ర షెడ్యూల్ ను కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. నిద్రా చక్రమైన సిర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలిగించకుండా చూసుకోవాలి. సిర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలిగితే  నిద్ర ఆటంకాలు, అలసట కలుగుతాయి.  ఈ సిర్కాడియన్ రిథమ్ గడియారాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి సెలవు దినాలలో కూడా ఒకే సమయానికి పడుకోవాలి. ఆహారపు అలవాట్లు.. నైట్ షిఫ్టుల సమయంలో చాలామంది ఎనర్జీగా ఉండటం కోసం ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ తినడం మీద ఆసక్తి చూపిస్తారు. పైపెచ్చు సాధారణ భోజన సమయాలు కాకపోవడం వల్ల రాత్రి పూట ఆకలేసినప్పుడు ఇలాంటి ఆహారానికే ప్రాధాన్యత ఇస్తారు. అయితే వీటికి బదులుగా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. నైట్ షిఫ్ట్ అంతా చిన్న చిన్న మొత్తాలలో ఆహారం తీసుకోవాలి. నీరు బాగా త్రాగాలి. వ్యాయామం.. నైట్ షిప్టులలో పనిచేసేవారు ఉదయం సమయాల్లో పడుకుంటూ ఉంటారు. దీని వల్ల చాలామంది ఉదయం వేళ చెయ్యాల్సిన వ్యాయామాన్ని స్కిప్ చేస్తుంటారు. లేదా పగటి సమయాన్ని లేజీగా గడిపేస్తూ  ఉంటారు. కానీ వ్యాయామాన్ని తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. జాకింగ్, వాకింగ్, యోగా, సైక్లింగ్ వంటివి మంచి ఎంపిక. ఒత్తిడి.. పనిచేసే సమయవేళలు మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. ఇది ఒత్తిడి, ఒంటరితనం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఒత్తిడి రాకుండా చూడటం కోసం  లోతైన శ్వాస, శ్వాస వ్యాయామాలు,  ధ్యానం,  తీరిక సమయాలలో స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటివి చేయాలి.  ఒకవేళ ఒత్తిడి సమస్య ఉంటే మానసిక నిపుణులను కలిసి కౌన్సెలింగ్ తీసుకోవాలి. ప్లానింగ్.. నైట్ షిఫ్టులలో పనిచేసేవారు తమ పనిని చాలా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. పని చేసేటప్పుడు అలసిపోకుండా పనిని ఏకధాటిగా కాకుండా చిన్నచిన్న భాగాలుగా విభజించుకొని ఫినిష్ చేయాలి. ఇది పక్కాగా అమలుకావడం కోసం కోలీగ్స్,  అధికారులతో సంప్రదించి వారి మద్దతు తీసుకోవాలి.                                     *నిశ్శబ్ద.  
జీవించడమూ ఒక కళ అని ఎంతోమంది చెబుతూ ఉంటారు. ప్రస్తుత సమాజంలో మనిషి రెండు విధాలుగా బ్రతుకుతున్నాడు. ఒకటి, తనకు తోచిన విధంగా, రెండు ఓ పద్ధతి ప్రకారం. కానీ మూడవ పద్ధతి ఒకటి ఉంది. ఈ పద్ధతిలో అమితమైన స్వేచ్ఛ ఉంటుంది. ఈ పద్ధతిలో బ్రతకడమే జీవించడం అంటే, ఈ పద్ధతినే జీవించే కళ అంటారు. ఇప్పుడు విదేశాలలో క్రొత్తరకం జీవనోపాధి ఒకటి స్వైరవిహారం చేస్తోంది. అదేమిటంటే మంచి వాక్చాతుర్యం కలిగి, జీవితంలో గొప్పగా సాధించిన ఒక వ్యక్తి ఇతరులకు ఎలా జీవించాలో, ఏ విధంగా జీవన పద్ధతి పాటిస్తే నిండైన విలువైన జీవితం దొరుకుతుందో వివరిస్తూ, అందులో శిక్షణా తరగతులూ, ప్రసంగాలూ ఇస్తూ ఎంతో మంచి పాతవైన, భారమైన జీవితాలని అందమైన తీరాలవైపు మళ్ళిస్తున్నారు. ఈ విధంగా జీవించేకళలో శిక్షణ ఇచ్చే మనిషిని లైఫ్ కోచ్ అని అంటున్నారు.  ఇప్పుడు ఈ లైఫ్ కోచ్ ల ఆవశ్యకత మన భారతదేశానికె అవసరం అంటున్నారు. ఎందుకంటే ప్రపంచానికే వెలుగు చూపింది మన భారతదేశం. ఆధ్యాత్మికంగా ప్రపంచ ప్రజలకు తలమానికంగా నిలచింది మన దేశమే. ఇప్పుడు కూడా ఏ దేశానికీ వెళ్ళనంత ఎక్కువ జనాభా, భారతదేశానికి వచ్చి ఆధ్యాత్మిక జీవనం నేర్చుకొని వెళ్తున్నారు. ఇక్కడ నేర్చుకొన్న గొప్ప విద్యను, జ్ఞానాన్ని వారి దేశాల్లో వినియోగిస్తూ, లైఫ్ కోచ్ లుగా, పబ్లిక్ స్పీకర్లుగా, ప్రేరణా రచయితలుగా మారి కోట్లకు కోట్లు సంపాదిస్తూ పదిమంది జీవితాలను ఉన్నతదిశగా మారుస్తూ తృప్తిగా హాయిగా జీవిస్తున్నారు. మన దేశంలో పూస్తున్న మల్లెల సువాసనను మన తుమ్మెదలు గ్రహించలేని స్థితిలో ఉంటే... విదేశాలనుండి వచ్చిన తుమ్మెదలు ఆ అద్భుత సౌరభాలను హాయిగా ఆస్వాదించి... తిరిగి మన తుమ్మెదలకే మల్లెల సువాసనలు గురించి పరిచయం చేస్తున్నాయి. ఈ విషయం ఎంత విచిత్రమో కదా అనిపించడం లేదూ... ఇక్కడ తప్పు మన తుమ్మెదలదా, విదేశీ తుమ్మెదలదా. ఆలోచిస్తే ముమ్మాటికీ మన తుమ్మెదలదే. మన దేశంలో దొరికిన కాసింత జ్ఞానాన్ని వాళ్ళు గ్రహించి దాంతోటే వాళ్ళ దేశంలో అద్భుతాలు సృష్టిస్తుంటే, ఇక్కడ పుట్టి, ఇక్కడే పెరిగి మన భారతీయ విజ్ఞానంపై సర్వహక్కులూ కలిగి ఉండి,  నేర్చుకోగల అవకాశాలు ఉండికూడా భారతీయులు విఫలమవుతున్నారు.  ఈ అపాయకరమైన పరిస్థితిని గమనించి ఎందరో భారతీయ గురువులూ, తత్వవేత్తలూ, ఆధ్యాత్మిక ప్రవచకులూ గొంతు అరిగేలా అరిచి అరిచి చెప్తున్నా... కనీసం కొంచెమైనా పట్టించుకోలేని భయానకమైన స్థితిలో దేశప్రజలు దిగజారిపోతున్నారు. ఎందుకంటే... ప్రజలు తమకు తోచిన విధంగానే బ్రతకాలని నిర్ణయించుకున్నారు. ఎవరైనా జీవించడం గురించి చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించే విషయం ఒకటే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు అందుకే ఇలా చెబుతారు అని.  ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్టు  జీవించే పద్ధతిలో జీవితం వారిని కాలసర్పంలా కాటేస్తున్నా ఆ విషవలయాల మధ్య రొప్పుతూ బ్రతికేస్తున్నారు. విద్యార్థి దశనుండీ... పరీక్షల్లో ర్యాంకులైతే తెచ్చుకోగలరు కానీ జీవితంలో నిరంతరం పరాజయం పొందుతూనే ఉన్నారు. ఎందుకంటే జీవితం గురించిన పాఠాలు ఏ పాఠశాలలోనూ బోధించడం లేదు.  నేర్చుకుంటున్న విద్య  కడుపునిండా తిండి పెట్టగల్గుతోంది. కానీ ప్రశాంతమైన నిద్రను ఇవ్వడం లేదు. కలకాలం హాయిగా జీవించడానికి పనికిరాని విద్య... అసవరమే లేదు. ఆ విషయాన్ని ఎవరూ గ్రహించడం లేదు. అటువంటి విద్యతో బ్రతకగలరేమోగానీ జీవించలేరు. ఎలాగైనా బ్రతికేయడం...  జీవితమవుతుందా?? జీవించడమంటే.... వెయ్యేళ్ళు ప్రజల గుండెల్లో వర్ధిల్లాలి. జీవితమే భావితరాలకు జీవితకళను నేర్పే పాఠం కావాలి. గొప్పగా జీవించలేకపోయినా కనీసం తన కుటుంబంలోని సభ్యులతో ఏ చీకూచింతా లేకుండా, నిండు ఆరోగ్యంతో, నీతిగా, ధర్మబద్దంగా ప్రతిరోజూ ఆనంద పరవశులౌతూ మనసారా తృప్తిగా జీవించగల్గితే చాలు. తమ బిడ్డలకు నైతిక విలువలు నేర్పిస్తూ, దయా, కరుణ, ప్రేమతత్వాన్ని వారికి అమృతంలా అందిస్తూ... వారు సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా తయారయ్యేలా చేస్తూ... కనీసం వెయ్యి మందిలో ఒక్కరైనా నిజంగా జీవించగలుగుతున్నారా?... ఇవన్నీ ప్రశ్నించుకుంటే జీవించడం గురించి ఓ అవగాహన వస్తుంది.                                      ◆నిశ్శబ్ద.
కొలెస్ట్రాల్ అనేది ఒక ప్రధాన  సమస్యగా మారుతోంది.  దీనికి సరైన ఆహారం, దిగజారుతున్న జీవనశైలి, ఒత్తిడి. కారణం అవుతున్నాయి. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్‌ విషయంలో ఆహారపు అలవాట్లు కూడా చాలా బాధ్యత వహిస్తాయి. అయితే డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా గుండె  ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్‌లను తినకూడదని కొందరు హెచ్చరిస్తుంటారు. ఈ వాదనలో నిజమెంతో తెలుసుకుందాం.  జీడిపప్పులో ఉండే పోషకాల గురించి మాట్లాడితే, ఆరోగ్యానికి అవసరమైన 44 శాతం కొవ్వు, 30 శాతం కార్బోహైడ్రేట్స్, 18 శాతం ప్రోటీన్లను కలిగి ఉంటుంది. జీడిపప్పు పోషకాల పవర్ హౌస్‌గా పరిగణిస్తారు. పోషకాలు అధికంగా ఉండే జీడిపప్పు వినియోగం కొలెస్ట్రాల్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంతో తెలుసుకుందాం.  జీడిపప్పు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? జీడిపప్పు అనేది డ్రై ఫ్రూట్, ఇది కొలెస్ట్రాల్‌ను పెంచని ఆహారం. సాధారణంగా జంతు ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే జీడిపప్పులో మాత్రం జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. జీడిపప్పు చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్‌డిఎల్‌ను తగ్గించడమే కాకుండా, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులను కూడా నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.  నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీడిపప్పు మొక్కల ఆధారిత ఆహారం. జీడిపప్పులో ఉండే కొవ్వులో ఎక్కువ భాగం స్టెరిక్ యాసిడ్ నుండి వస్తుందని, ఇది రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్‌పై ఎటువంటి ప్రభావం చూపదని అనేక పరిశోధనలలో నిరూపించారు. రోజుకు గుప్పెడు జీడిపప్పులు తినడం వల్ల గుండెకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.  జీడిపప్పు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది జీడిపప్పు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీడిపప్పు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీడిపప్పులో ఉండే మెగ్నీషియం గుండె జబ్బులను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆహారంలో తగినంత మొత్తంలో మెగ్నీషియం తీసుకోవడం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.    బ్రెడ్ గులాబ్ జామూన్ తయారీ విధానం.. గులాబ్ జామున్ అనేది మన సాంప్రదాయ స్వీట్, భారతదేశంలో చాలా మంది అత్యంత ఇష్టపడే స్వీట్‌లలో గులాబ్ జామూన్ ఒకటి. ఈ ఇంట్లో తయారుచేసుకునే ఈ గులాబ్ జామూన్ ను మనం ఇప్పుడు బ్రెడ్, క్రీమ్, పాల పౌడర్‌తో తయారు చేయవచ్చు. ఇది రుచికరం మాత్రమే కాదు, తయారు చేయడం కూడా చాలా సులభం.   
కలబంద.. చర్మం, జుట్టు, ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.దీనిని రోజూ తీసుకోవడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులు దూరంగా ఉంటాయి. కలబందలో ఉండే విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్ మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో అలోవెరా జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తిని, జీవక్రియను మెరుగుపరుస్తుంది.మలబద్ధకం, రక్తహీనత వంటి తీవ్రమైన వ్యాధులకు చెక్ పెడుతుంది. అనేక తీవ్రమైన వ్యాధుల చికిత్సలో ఆయుర్వేదంలో అలోవెరాను సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ సీజన్‌లో కలబంద ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు దీన్ని జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. చల్లటి వాతావరణంలో అలోవెరా జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో.. ఏయే వ్యాధులను దూరం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం నుండి ఉపశమనం: ఆంత్రాక్వినోన్ అనే సమ్మేళనం కలబందలో ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది కాకుండా, కలబంద వినియోగం కడుపు తిమ్మిరిని నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల, ఈ సీజన్‌లో, మీరు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి  అలోవెరా జ్యూస్ తాగవచ్చు. రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది: ఈ సీజన్‌లో, చాలా మందిలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా, అటువంటి వ్యక్తులు అనేక సీజనల్ వ్యాధులకు గురవుతారు. అందువల్ల, ఈ సీజన్‌లో మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, మీరు కలబంద జ్యూస్ తాగాలి. శరీరం నిర్విషీకరణ : అలోవెరా జ్యూస్ శరీరంలోని టాక్సిక్ ఎలిమెంట్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. వాస్తవానికి, శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలను ఆహ్వానించే అనేక విష పదార్థాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, కలబంద రసం తీసుకోవడం ఈ తొలగింపు ప్రక్రియలో సహాయపడుతుంది. అలోవెరా జ్యూస్ ను క్రమం తప్పకుండా తాగుతే ఆరోగ్యంతోపాటు అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. రక్తహీనత సమస్యకు చెక్: నేటికాలంలో చాలా మంది రక్తహీనతకు లోనవుతున్నారు. అటువంటి పరిస్థితిలో, ఒక గ్లాసు కలబంద రసం ఈ సమస్యను వదిలించుకోవడానికి మీకు సహాయపడుతుంది. నిజానికి కలబంద రసాన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి రక్తహీనత సమస్య దూరమవుతుంది. పొడి చర్మం నుండి ఉపశమనం: చలికాలంలో తరచుగా చర్మం పొడిబారుతుంది. అందువల్ల, ఈ సీజన్‌లో కూడా మీ ముఖం పోషణతో ఉండాలంటే, కలబంద రసాన్ని మీ ముఖానికి అప్లై చేయడమే కాకుండా, దాని జ్యూస్ తాగండి. నిత్యం ఈ జ్యూస్ తాగడం వల్ల మీ ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. ఎప్పుడు తాగాలి? మీరు కలబంద జ్యూస్‌ని సాయంత్రం పూట కూడా తాగవచ్చు. అయితే ఉదయం పూట కలబంద జ్యూస్ తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు.  
సీజన్ల వారిగా లభించే పండ్లలో నేరేడు పండ్లు కూడా ప్రముఖమైనవి.  వేసవి కాలం ఇక ముగుస్తుందనగా మార్కెట్లలోకి చొచ్చుకువచ్చి సందడి చేసే నేరేడు పండ్లు రుచిగా ఉండటమే కాదు, బోలెడు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. వైలెట్ కలర్ లో ఉంటూ ఉప్పగా, వగరుగా ఉండే ఈ నేరేడు కాయలు  క్రమంగా నల్లగా మారి నిగనిగలాడుతూ చెప్పలేనంత తియ్యదనంగా మారుతాయి.  జామూన్ ఫ్రూట్ గా పిలిచే ఈ నేరేడు లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యం దీనికున్న ప్రత్యేక లక్షణం. అయితే నేరేడు పండ్లు అందరూ తింటారు. కానీ గింజలు ఉపయోగించే వారు తక్కువ. నేరేడు పండ్లలానే వాటి గింజలు కూడా అంతే ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే అవి మధుమేహం నియంత్రించడంలో అద్భుతాలు చేయడమే కాకుండా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. నేరేడు గింజల పొడి ప్రయోజనాలను తెలుసుకుంటే నేరేడు పండ్లు తినగానే ఆ విత్తనాలను ఇకమీదట పడెయ్యరు. నేరేడు గింజలు పొడి తీసుకోవడం ద్వారా కలిగే అయిదు అద్భుత ప్రయోజనాలు ఏమిటంటే.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి, గ్లైకోసూరియాను తగ్గించడానికి నేరేడు విత్తనాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పండు గింజలు జంబోలిన్ మరియు జాంబోసిన్ అనే క్రియాశీల పదార్ధాలను కలిగి ఉంటాయి, ఇవి రక్తంలోకి విడుదలయ్యే చక్కెర రేటును నెమ్మదిస్తాయి. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. శాస్త్రీయంగా, ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంది, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఫలితంగా  మూత్రవిసర్జన, చెమటలను సహజంగా నిర్వహించడంలో సహాయపడుతుంది.  నేరేడు విత్తనాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణం కారణంగా, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టానికి వ్యతిరేకంగా పోరాడుతాయి, కాలేయ కణాలను రక్షిస్తాయి. ఇంకా ఈ గింజలు పొడిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి, ఇది కాలేయంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.  నేరేడు గింజల పొడిలో ఎల్లాజిక్ యాసిడ్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి రక్తపోటు వేగవంతమైన హెచ్చుతగ్గులను నియంత్రించడంలో  సహాయపడతాయి. నేరేడు గింజలు ఫ్లేవనాయిడ్లు, ఫినాలిక్ సమ్మేళనాల వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ అయిదు ప్రయోజనాలు పొందడానికి నేరేడు గింజల పొడిని తీసుకోవడం మంచిది. ◆నిశ్శబ్ద