LATEST NEWS
  ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించుకున్నారా? కేవలం మార్పులు, చేర్పులే కాకుండా.. మోడీ కేబినెట్ ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారా? అంటే ఎన్డీయే వర్గాల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. గత పదేళ్లుగా నరేంద్ర మోదీ  క్యాబినెట్ దాదాపు మార్పులు లేకుండానే కొనసాగుతోంది. ముఖ్యంగా కీలక శాఖల మంత్రులు సుదీర్ఘ కాలంగా అవే శాఖలలో కొనసాగుతున్నారు.  అయితే ఇప్పుడు ప్రధాని మోడీ కీలక శాఖల మంత్రులను మార్చాలని భావిస్తున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న మంత్రులపై క్షేత్రస్థాయిలో వ్యక్తమౌతున్న వ్యతిరేకత కారణంగానే మోడీ ఈ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.  మొత్తంగా ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ  తన కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని  అంటున్నారు.  మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోడీ సోమవారం (జూన్ 29)  క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు.   కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా భేటీ కావడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ముర్ముతో భేటీలో   అమిత్ షా కేంద్ర క్యాబినెట్ మార్పుల గురించిన   సమాచారాన్నిఆమెకు వివరించినట్లు ఎన్డీయే వర్గాల ద్వారా తెలుస్తున్నది. అదలా ఉంటే..  ఈ కేబినెట్ ప్రక్షాళనలో విత్త, విద్యా శాఖ మంత్రులకు ఉద్వాసన లేదా స్థాన చలనం తప్పదన్న చర్చ జోరుగా సాగుతోంది.  వీరిలో నిర్మలాసీతారామన్ గత పదేళ్లుగా దేశ ఆర్థిక మంత్రిగా  కొనసాగుతున్నారు.  ఇక విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్రప్రదాన్ పై ఇటీవలి నీట్ పేపర్ లీక్ తరువాత దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. కాక్రోచ్ జనతాపార్టీ అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనే ఏకైక ఎజెండా, డిమాండ్ తో దేశ వ్యాప్త ఆందోళనలు చేపట్టింది.  అదీ కాకుండా.. నీట్ పేపర్ లీక్   ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించడంతో.. ఆయనకు ఉద్వానస పలకాలని ప్రధాని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కు కేబినెట్ నుంచి ఉద్వాసన కాకుండా, ఆమె శాఖను మార్చే అవకాశాలున్నాయంటున్నారు. నిర్మలా సీతారామన్ కు మానవవనరులు లేదా మరో శాఖను అప్పగించే అవకాశాలున్నాయని ఎన్డీయే వర్గాల భోగట్టా.  వీరే కాకుండా మరి కొందరు మంత్రులకు కూడా శాఖల మార్పు లేదా ఉద్వాసన ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇప్పటి వరకూ మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కేంద్రం నురంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు.  
కాపు సామాజికవర్గ అగ్రనేత, కాపు ఉద్యమ కారుడు ముద్రగడ పద్మనాభం   తీవ్ర అనారోగ్యంతో  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొంత కాలంగా  అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి  విషమించడంతో, కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఒక  ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి  చికిత్స అందిస్తున్నారు.   అయితే ముద్రగడ పద్మనాభం 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులపై తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా.. 2024 ఎన్నికల్లో వైసిపి మళ్లీ గెలవకపోతే తన పేరును  ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని అప్పట్లో శపథం చేశారు. ఆ ఎన్నికలలో  వైసిపి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ముద్రగడ పద్మనాభం తన మాట నెరవేర్చుకుని తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు.  2024 ఎన్నికల ఘోర పరాభవం తర్వాత కూడా ఆయన జగన్ వెంటే నిలిచారు.  జగన్ కోసం ముద్రగడ తన సొంత సామాజిక వర్గం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. జగన్ కనీసం ఆయనను పరామర్శిండానికి కూడా రాకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  తన కోసం సర్వస్వం ఒడ్డిన నేతను చూడటానికి జగన్ స్వయంగా రాకుండా..  సజ్జల రామకృష్ణారెడ్డి పంపించడంపై వైసీపీయులలోనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  ముద్రగడ పద్మనాభం కుమార్తె  క్రాంతి  జగన్ తీరుపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్‌పై ఉన్న తన తండ్రిని చూడటానికి కూడా రాకుండా జగన్ ముఖం చాటేయడం దారుణమని విమర్శించారు.   గతంలో ముద్రగడ చేసిన సేవలను, వైసిపి కోసం ఆయన పడ్డ కష్టాన్ని జగన్  విస్మరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  నమ్మి వచ్చిన  నేతలను జగన్ ఇలాగే నట్టేట ముంచుతారంటూ జగన్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గం చుట్టూ తిరుగుతున్న పరిణామాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ ఇటీవల నిర్వహించిన కాపు ఆత్మీయ సమావేశం, సాయికృష్ణ కేసును అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలపై జనసేన పార్టీ ఘాటుగా స్పందించింది. తెలుగువన్ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడిన   జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్  వైసీపీ యత్నాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు అసలైన కాపు నాయకులు కారని..  వారు కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బానిసలుగా పనిచేస్తున్నారని   శ్రీనివాస్ విమర్శించారు. గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్‌ను, ఆయన కుటుంబాన్ని బూతులు తిట్టించినప్పుడు ఈ నేతల ఆత్మగౌరవం ఎటు పోయిందని  ప్రశ్నించారు. జగన్ హయాంలో కాపు రిజర్వేషన్లను రద్దు చేసినప్పుడు, విదేశీ విద్యా దీవెన వంటి పథకాలను అణచివేసినప్పుడు నోరు మెదపని వీరు..  ఇప్పుడు హఠాత్తుగా కులప్రేమను ఒలకబోయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు. 14 ఏళ్ల మైనర్ బాలిక కుటుంబానికి అన్యాయం జరిగితే పరామర్శించని వైసీపీ నేతలు..  కేవలం రాజకీయ లబ్ధి కోసమే సభలు పెడుతున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనే ఈ వైసీపీ నేతలంతా ఘోరంగా ఓడిపోయారని, దీన్ని బట్టే కాపు యువత వీరిని నాయకులుగా అంగీకరించడం లేదనేది స్పష్టమవుతోందని  టట శ్రీనివాస్  పేర్కొన్నారు. చారిత్రకంగా కాపు సామాజిక వర్గం నుంచి ఎందరో మహానుభావులు సమాజానికి సేవలందించారని, కానీ కోడిగుడ్డు ఆమ్లెట్ కథలు చెప్పే అంబటి రాంబాబు, బియ్యం కేసుల్లో ఉన్న పేర్ని నాని వంటి వారిని నేటి తరం ఆదర్శంగా తీసుకోబోరని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రాభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నారన్న శ్రీనివాస్  ప్రజాప్రతినిధులు ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఇప్పటికే చంద్రబాబు నాయుడు కొందరు ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారని గుర్తుచేశారు. కులాల గోడలు బద్దలు కొట్టి, రాష్ట్ర ప్రగతి కోసం జనరేషన్ జెడ్  ఆలోచనలకు అనుగుణంగా ముందుకెళ్లడమే కూటమి లక్ష్యమని పునరుద్ఘాటించారు. వైసీపీ ఆడుతున్న ఈ కుల రాజకీయ డ్రామాలను కాపు సామాజిక వర్గం గమనిస్తోందని, భవిష్యత్తులో వారికి తగిన బుద్ధి చెబుతుందని ముగించారు.
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ రజతోత్సవ వేడుకల వేదికగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఆసుపత్రి వ్యవస్థాపక దినోత్సవంలో క్యాన్సర్ నుండి కోలుకున్న స్వప్న అనే యువతి మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ వైసీపీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న తప్పుడు ప్రచారాలపై ప్రముఖ నటుడు కిరాక్ ఆర్పీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.    సాక్ష్యాలతో సహా   వీడియోను ఆధారంతో అసలు వాస్తవాలను బహిర్గతం చేశారు. ఇటీవల జరిగిన బసవతారకం ఆసుపత్రి 25 ఏళ్ల వార్షికోత్సవానికి నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు విశిష్ట అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గతంలో క్యాన్సర్‌తో బాధపడి ఈ ఆసుపత్రిలో ఉచిత వైద్యం పొంది పూర్తిగా కోలుకున్న స్వప్న అనే అమ్మాయి వేదికపైకి  వచ్చి తన కృతజ్ఞతలు తెలిపింది.  నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మా ఊరిలో  జగన్ సార్ మా ఇంటికి వచ్చి, బాలకృష్ణ సార్‌తో మాట్లాడించి నన్ను ఈ ఆసుపత్రిలో చేర్పించారు అని ఆమె పేర్కొంది.అయితే, ఆ అమ్మాయి నోట 'జగన్ సార్' అనే మాట రాగానే..  అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ  సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆ అమ్మాయి చెప్పిన  జగన్ సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదని, ఆయన అనంతపురానికి చెందిన  అనంతపురం జగన్  అని ఆర్పీ స్పష్టం చేశారు. నందమూరి కుటుంబానికి, ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకు ఆయన దశాబ్దాలుగా వీరాభిమానిగా ఉన్నారని తెలిపారు.   ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా బాలయ్య చేసే సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటుంటారని వివరించారు.గతంలో అనంతపురం జిల్లాలో సదరు బాలిక క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఈ అభిమాని జగన్.. స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి  పరామర్శించారు. ఆ వెంటనే బాలకృష్ణకు ఫోన్ చేసి విషయం చెప్పగా.. బాలయ్య చొరవ తీసుకుని ఆ అమ్మాయిని బసవతారకం ఆసుపత్రిలో చేర్పించి ఉచితంగా వైద్యం అందించారు. దీనికి సంబంధించిన పాత ఫోటోలను, బాలయ్య ఆ పాపను ఆసుపత్రిలో పరామర్శించిన విజువల్స్‌ను ఆర్పీ  చూపించారు. సొంత చెల్లిని, కన్నతల్లిని దూరం పెట్టి, బాబాయి మరణంపై రాజకీయం చేసిన వ్యక్తికి.. ఇలాంటి మానవతా కార్యక్రమాలతో ఏం సంబంధం ఉంటుందని ఆర్పీ ప్రశ్నించారు. ఏ చిన్న మంచి పని జరిగినా, వేరే వాళ్లు తెచ్చిన కంపెనీలైనా తమ ఖాతాలో వేసుకుని క్రెడిట్ కొట్టేయాలనుకోవడం  వైసీపీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. రేపు ప్రపంచంలో  జగన్ అనే పేరున్న వాళ్లు ఏ మంచి పని చేసినా అది వైఎస్ జగనే చేశాడంటూ క్లెయిమ్ చేసుకునేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ నిజాలు తెలుసుకోకుండా కేవలం పేరు ఒక్కటే చూసి వైసీపీ సోషల్ మీడియా బృందంక్రెడిట్ చోరీకి పాల్పడటం   సిగ్గుచేటని ఆర్పీ విమర్శించారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని, వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హితవు పలికారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ విజయవాడ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న ఈ హైప్రొఫైల్ కేసులో తాజాగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజును పోలీసులు అరెస్టు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ మిస్సింగ్ ఉదంతం వెనుక ఉన్న భయంకరమైన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో ఇటు లీగల్ వర్గాల్లోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అసలు సాయికృష్ణ మిస్సింగ్ వెనుక ఏం జరిగింది, ఒక పోలీస్ అధికారి అరెస్ట్ వరకు ఈ వ్యవహారం ఎందుకు దారితీసింది అనే కోణంలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఈ పరిణామంపై ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.  ఈ కేసు తీవ్రతను గమనించిన కోర్టు ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని గట్టిగా నిలదీసింది. సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం, జూన్ 29వ తేదీ లోపు పూర్తి వివరాలతో కూడిన సమాధానాన్ని సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. మరోవైపు ఈ ఉదంతం దేశ రాజధాని ఢిల్లీకి సైతం చేరింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఎంపీలు తనూజ మరియు గురుమూర్తి ఇద్దరూ కలిసి   జాతీయ మానవ హక్కుల కమిషన్ కి అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు  స్థానిక పరిధిలోనే కాకుండా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.  దీనిపై భరద్వాజ్.. సిఐ నాగరాజును అరెస్ట్ చేయకుండా తప్పించుకునే పరిస్థితి పోలీసు శాఖకు లేకుండా పోయిందన్నారు.   బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.  మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ సీఐ బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన తీరు ప్రజా బాహుళ్యంలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిందన్నారు. అయితే ఈ సింపతీని పక్కదారి పట్టించడానికి ఒక వ్యూహాత్మక నెరేటివ్ కూడా తెరపైకి వచ్చిందన్న ఆయన.. సాయికృష్ణపై గతంలో ఉన్న 23 క్రిమినల్ కేసుల రికార్డును ఎస్టాబ్లిష్ చేస్తూ, అతనొక ప్రమాదకరమైన గంజాయి పెడ్లర్ అనీ.. అతని వల్ల సమాజానికి ముప్పని ప్రచారం చేయడం ప్రారంభించారు. కృష్ణలంక ప్రాంతంలో మహిళలు రోడ్ల మీదకు వచ్చి కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తూ సిఐ నాగరాజుకు మద్దతు తెలపడం ప్రత్యేకంగా గుర్తించాలన్నారు. గతంలో సురేంద్రబాబు  హయాంలో బుడ్డ శంతన్, పిల్లి దుర్గాప్రసాద్ ఎన్ కౌంటర్ల సమయంలో ఇలాంటి ప్రజా మద్దతు కనిపించినప్పటికీ, చట్టం ముందు ఇవేవీ నిలబడలేదని గుర్తు చేస్తూ ఇప్పుడూ అదే జరుగుతుందన్నారు. కేవలం ఒక పాత నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బిడబ్ల్యూ) అమలు కోసం తీసుకొచ్చిన వ్యక్తిని పోలీస్ స్టేషన్‌లో ప్రాణాలు పోయేలా కొట్టడం వెనుక ఏదో బలమైన రాజకీయ ఒత్తిడి లేదా మాఫియా ప్రమేయం ఉందని భరద్వాజ్ అన్నారు. సాయికృష్ణ తీవ్రమైన ఇంటరాగేషన్ తట్టుకోలేక మరణించాడని, ఆ తర్వాత అతని మృతదేహాన్ని ఎక్కడో గుర్తుతెలియని బస్టాప్ సమీపంలో అనాథ శవంగా దహనం చేసేశారని ప్రచారం జరుగుతోందనీ. కనీసం తల్లికి బూడిద కూడా దక్కకుండా సాక్ష్యాధారాలను పూర్తిగా తుడిచిపెట్టేయడం వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘోరం వెనుక కేవలం సిఐ నాగరాజు ఒక్కరే లేరని, మొత్తం ఇంటరాగేషన్ టీమ్ కానిస్టేబుళ్లు కూడా ఉన్నారని, అయితే స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా సిఐ కేంద్రబిందువు అయ్యారని భరద్వాజ్ అన్నారు.  ఈ మొత్తం వ్యవహారం వెనుక ఆంధ్రప్రదేశ్‌ను పట్టిపీడిస్తున్న గంజాయి, డ్రగ్స్ సిండికేట్ లింకులు ఉన్నాయన్నారు. కేవలం నైజీరియన్లు లేదా సినిమా వాళ్లే కాకుండా, స్థానిక పొలిటికల్ లీడర్ల అండదండలతో ఈ డ్రగ్ నెట్‌వర్క్ భారీ ఆర్థిక వనరుగా నడుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో గంగవరం పోర్టులో దొరికిన 4 కంటైనర్ల డ్రగ్స్ ఉదంతం లాగే, ఈ సాయికృష్ణకు కూడా కీలకమైన పొలిటికల్ డ్రగ్ లింకులు ఏమైనా తెలిసి, బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించడం వల్లే ఈ హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు సాగాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం  ఈ కేసును లోతుగా విచారించి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిజాలను బయటపెట్టాలని,  సిఐ నాగరాజు నుంచి నేర అంగీకార వాంగ్మూలం (కన్ఫెషన్ స్టేట్‌మెంట్) తీసుకుని, కేసును ఆయనతోనే ముగించేయడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు భరద్వాజ అనుమానం వ్యక్తం చేశారు. 
ALSO ON TELUGUONE N E W S
ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ ఇండియన్ మ్యాగ్నమ్ ఓపస్ 'వారణాసి' (Varanasi) సినిమాపై దర్శకుడి ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) సంచలన అప్‌డేట్స్ ఇచ్చారు. రీసెంట్ గా అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ 'వారణాసి' సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుందని స్పష్టం చేశారు. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి సంబంధించిన హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే విజయవంతంగా పూర్తయిందని ఆయన వెల్లడించారు. ఇక మిగిలి ఉన్న కొన్ని కీలకమైన కనెక్టింగ్ సీన్స్ మాత్రమే చిత్రీకరించాల్సి ఉందని, ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి వారణాసి చిత్రానికి సంబంధించిన మొత్తం షూటింగ్‌ పూర్తవుతుందని రాజమౌళి తెలిపారు. అలాగే ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్‌ గురించి కూడా రాజమౌళి ఆసక్తికర విషయం పంచుకున్నారు. సాధారణంగా పెద్ద సినిమాలను నార్మల్ కెమెరాలతో షూట్ చేసి, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో భారీ స్క్రీన్ల కోసం ఐమ్యాక్స్ ఫార్మాట్‌లోకి మారుస్తూ ఉంటారు. కానీ రాజమౌళి మాత్రం సరికొత్త చరిత్ర సృష్టిస్తూ, 'వారణాసి' చిత్రాన్ని మొదటి రోజు మొదటి షాట్ నుండి గ్రౌండ్ లెవెల్ లోనే పక్కా ఐమ్యాక్స్ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నారు. కేవలం విజువల్స్ ని కన్వర్ట్ చేయడం కాకుండా, థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే ఈ పద్ధతిని ఎంచుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ సినిమా స్క్రీన్‌ప్లేతో పాటు విజువల్ డిజైన్‌ను కూడా కేవలం ఐమ్యాక్స్ లార్జ్ ఫార్మాట్ స్క్రీన్‌లకు సరిపోయేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేశారు. భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, టెక్నికల్ వండర్ గా నిలిచే సినిమాగా 'వారణాసి' హిస్టరీ క్రియేట్ చేయబోతోందని ఈ విషయంతో స్పష్టమవుతోంది. టెక్నాలజీ పరంగా ఎంతటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నప్పటికీ, రాజమౌళి తన అసలైన బలాన్ని మాత్రం అస్సలు మర్చిపోలేదు. ఈ సందర్భంగా ఆయన ఒక గొప్ప విషయాన్ని గుర్తుచేశారు. టెక్నాలజీ, విజువల్స్ లేదా భారీ గ్రాఫిక్స్ అనేవి కేవలం కథను అద్భుతంగా చెప్పడానికి ఉపయోగపడే కొన్ని శక్తివంతమైన సాధనాలు మాత్రమేనని ఆయన నొక్కి చెప్పారు. సినిమా స్కేల్ ఎంత పెద్దదైనా, విజువల్ వండర్స్ ఎన్ని ఉన్నప్పటికీ, ప్రేక్షకుడిని థియేటర్ సీట్లో కట్టిపడేసేది కేవలం అందులోని బలమైన భావోద్వేగాలు (Emotions), హృదయాన్ని కదిలించే నరేషన్ (కథా గమనం) మాత్రమేనని, అందుకే 'వారణాసి'లో ఎమోషన్స్ కి మొదటి ప్రాధాన్యత ఇచ్చామని రాజమౌళి స్పష్టం చేశారు.  సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తున్న ఈ విజువల్ వండర్ పై రాజమౌళి ఇచ్చిన ఈ క్రేజీ అప్‌డేట్‌తో టాలీవుడ్ తో పాటు గ్లోబల్ ఆడియన్స్ లో కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా 2027, ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాయిదా పడుతుందని ఇటీవల వార్తలు వచ్చినప్పటికీ, షూటింగ్ దాదాపు పూర్తయిందన్న తాజా అప్డేట్ తో.. చెప్పిన డేట్ కే వచ్చే అవకాశం కనిపిస్తోంది.   
  అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని( Akhil Akkineni) నుంచి రాబోతున్న సరికొత్త చిత్రం 'లెనిన్'(Lenin). 'ఏజెంట్' వంటి భారీ యాక్షన్ చిత్రం తర్వాత అఖిల్ నుంచి వస్తున్న మూవీ  కావడంతో, లెనిన్ పై ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. మురళి కిషోర్ అబ్బురి  దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా పూర్తి వైల్డ్ మాస్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ అండ్ ఫ్యామిలీ వార్ కాన్సెప్ట్‌తో  కథను డిజైన్ చేశారు.  సరికొత్త లుక్, మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ బాడీ లాంగ్వేజ్‌తో అఖిల్ ఈ చిత్రంలో ఊరమాస్ అవతారంలో కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియో గ్లింప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ, ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి.ఈ చిత్రంలో అఖిల్ సరసన టాలీవుడ్ క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. "ప్రేమని మించిన యుద్ధం లేదు" అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో రీసెంట్‌గా విడుదలైన 'సోల్ ఆఫ్ లెనిన్' వీడియో సాంగ్ థియేటర్లలో పెద్ద సంచలనమే సృష్టించింది. 'పెద్ది' మూవీ ప్రదర్శించబడుతున్న థియేటర్లలో ఈ సాంగ్‌ని  అటాచ్ చేయగా, ప్రేక్షకుల నుంచి 100 శాతం బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ లవ్ అండ్ యాక్షన్ సాంగ్‌లో అఖిల్ చూపించిన రౌద్ర రసం, భాగ్యశ్రీ గ్లామర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేశాయని చెప్పాలి. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గాయని వాగ్దేవి ఆలపించిన పవర్‌ఫుల్ వోకల్స్ ఈ పాటను నెక్స్ట్ లెవెల్‌ కి తీసుకెళ్లాయి. కేవలం 2 వారాల్లోనే ఈ సినిమా ట్రైలర్ మరియు సాంగ్స్ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి.  also read:  RajaShivaji: రాజా శివాజీ ఓటిటి డేట్ వచ్చేసింది.. స్పెషల్ ఇదే   ఈ భారీ ప్రాజెక్టును మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, దాదాపు 60 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ విజువల్ వండర్‌ను నిర్మిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా ఫస్ట్ కట్ చూసిన కింగ్ నాగార్జున స్వయంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "లెనిన్ ఫస్ట్ కట్ చూశాను, జూన్ 26న మీరు ఒక సరికొత్త అఖిల్‌ను థియేటర్లలో చూడబోతున్నారు. నేను చాలా గర్వంగా, నమ్మకంగా చెబుతున్నాను" అంటూ ట్వీట్ చేయడం సినిమాపై హైప్‌ను ఆకాశానికి తీసుకెళ్లింది. థియేట్రికల్ రిలీజ్ డేట్ జూలై 10 కి ఫిక్స్ అవ్వడంతో, బాక్సాఫీస్ వద్ద అఖిల్ సరికొత్త రికార్డుల వేట మొదలుపెట్టడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్, లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి. అక్కినేని అభిమానులు ఈ వైల్డ్ మాస్ యాక్షన్ పండగ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.    
SS Rajamouli has shared a significant update on Varanasi, his ambitious action-adventure starring Superstar Mahesh Babu. Speaking about the film's progress, the visionary director revealed that the team has successfully wrapped the massive IMAX action episodes shot in Varanasi. Rajamouli stated that only the dramatic portions of the Varanasi schedule are left to be filmed. He added that the production is progressing exactly as planned, with everything firmly on track for the film's worldwide release on April 7, 2027. Mounted on a grand scale, the film is being designed as a visual spectacle, with several sequences filmed exclusively for the IMAX format to offer an immersive theatrical experience. With the technically challenging action blocks now completed, the team will focus on wrapping up the remaining emotional and dramatic scenes before moving to the next stage of production.  Rajamouli's reassurance about the schedule has also put to rest any speculation regarding potential delays. Priyanka Chopra Jonas and Prithviraj Sukumaran are playing other leading roles in the movie. MM Keeravaani is composing music for this larger-than-life mythological time travel film.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Shreyas Talpade and Kajal Aggarwal lead the powerful new narrative in the upcoming film, The India Story: Slow Poison in Progress. The recently released teaser highlights the dark reality of pesticide farming and its devastating impact on society. Presented by Zee Studios in association with MIG Production & Studios, the thought-provoking project is directed by Chettan DK and produced by Sagar B. Shinde. The compelling teaser gives viewers a stark look into the dangerous truth of everyday food consumption. It captures the protagonists' intense fight for justice against a system that allows toxic substances to enter the daily diets of millions. Through a deeply emotional narrative, the footage effectively showcases the severe health risks this hidden crisis poses, particularly to the younger generation. Sharing his thoughts on the project, director Chettan DK explained that the film aims to spark a much-needed conversation about this silent health crisis. Shreyas Talpade stated that he was drawn to the subject because it affects every household, hoping audiences connect with his character's fight against a massive system. Kajal Aggarwal also expressed that the story deeply resonated with her as a mother, wishing to raise awareness about the food we consume and its future impact. The movie is supported by a talented technical team, including music composer Mangesh Dhakde, cinematographer Nishant Bhagwat, and editor Ashish Mhatre. Backed by co-producers Swati Vinayak Saindane, Anita Jadhav, and others, The India Story is gearing up for a worldwide theatrical release on July 24th, and will be available in Hindi, Telugu, and Tamil.   Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
విక్టరీ వెంకటేష్ (Venkatesh) వరుస క్రేజీ ప్రాజెక్టులతో టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఎంటర్‌టైనర్లతో అలరిస్తున్న వెంకీ మామ, ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్స్ అన్నింటినీ చకచకా పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'ఆదర్శ కుటుంబం' చేస్తున్నారు. అలాగే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సంక్రాంతి టార్గెట్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత వెంకటేష్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను డైరెక్టర్ వశిష్ట(Director Vassishta)తో చేయడానికి అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ‘బింబిసార’ వంటి టైం ట్రావెల్ సోషియో ఫాంటసీ బ్లాక్‌బస్టర్‌తో టాలీవుడ్‌ను ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్న వశిష్ట, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ అనే సోషియో ఫాంటసీ విజువల్ వండర్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా భారీ గ్రాఫిక్స్‌తో సుమారు 150 కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ మెగా ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే వశిష్ట, విక్టరీ వెంకటేష్ తో చేతులు కలపబోతున్నట్లు వినికిడి. వెంకటేష్ కోసం వశిష్ట ఒక విభిన్నమైన లైన్ సిద్ధం చేశారట. వెంకటేష్ కెరీర్‌లో ఇప్పటివరకు టచ్ చేయని ఒక కొత్త జోనర్‌లో, మైథాలజీ ఎలిమెంట్స్ కలగలిసిన ఒక వినూత్న కథను వశిష్ట వినిపించగా, దానికి వెంకీ ఇంప్రెస్ అయి వెంటనే సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ క్రేజీ కాంబినేషన్‌ను సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు, ప్రొడ్యూసర్ నల్లమలపు బుజ్జి సంయుక్తంగా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో వెంకటేష్ నటుడిగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే నల్లమలపు బుజ్జి నిర్మాణంలో వెంకటేష్ నటించిన ‘లక్ష్మి’, ‘చింతకాయల రవి’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి.  సుదీర్ఘ విరామం తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, నల్లమలపు బుజ్జి కలిసి వెంకటేష్‌తో ఈ భారీ బడ్జెట్ సినిమాను బ్యాంక్రోల్ చేయనుండటం ట్రేడ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్ ముగిసిన తర్వాత, వశిష్ట కూడా చిరంజీవి సినిమా బాధ్యతల నుంచి ఫ్రీ అయ్యాక ఈ కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించి పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తారని తెలుస్తోంది.  
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక్కటే చర్చ నడుస్తోంది అదే పూణే హత్య కేసు. ఒక నెటిజన్ ఈ విషయం మీద డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ని అడిగిన ప్రశ్నకు ఆయన ఒక సుదీర్ఘమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇక చిన్మయి శ్రీపాద ఐతే "రాహుల్ లాంటి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకోండి లేదంటే పెళ్లి చేసుకుని బాధలు పడకండి. ఇది నా సజెషన్ మాత్రమే. ఆ తర్వాత మీ ఇష్టం మీ జీవితం " అని చెప్పారు. అలాగే స్టేటస్ లో కూడా ఇప్పుడు ఉన్న ఈ సొసైటీలో పెళ్లి చేసుకోకుండా అమ్మాయిలు మీ ప్రాణాలు కాపాడుకోండి అంటూ ఇప్పుడున్న పరిస్థితిని చెప్పుకొచ్చారు. ఇక రాహుల్ పెట్టిన పోస్ట్ ఏంటంటే "నాకు అన్నీ తెలుసని నేను అనుకోవడం లేదు.   తప్పైతే చెప్పండి, నేర్చుకుంటాను. కానీ స్త్రీలు  పురుషులపై దౌర్జన్యాలు చేస్తున్నారనే కోణంలో  నేను చూడడం లేదు.   చెడు మనస్తత్వం ఉన్న కొంతమంది మహిళలు  నేరాలు చేస్తున్నారు అంతే.కానీ మరోవైపు, చాలా ఏళ్లుగా కొనసాగుతున్న సమాజ వ్యవస్థ మహిళలను అణిచివేయడం కూడా  నేను చూస్తున్నాను. మహిళలు రోజూ ఎదో సందర్భంలో వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు  వారికి సమాన అవకాశాలు లభించడం లేదు. నా చుట్టూ చాలా మంది మహిళలు ఇలా మౌనంగా బాధపడటం నేను చూశాను. అందుకే ఒక పురుషుడిగా, ఆ అసమానత వల్ల  బాధ్యతతో ఈ కథ చెప్పాలనుకున్నాను.ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న  చర్చ జరుగుతున్నా  ఈ కేసు గురించి  పూర్తిగా తెలుసుకోలేదు. తెలుసుకున్నక చెప్పదగ్గ కథ అనిపిస్తే దానిపైనా సినిమా తీస్తాను. కానీ అది ఒక మహిళ చేసిన నేరం గురించి మాత్రమే ఉంటుంది. దాన్ని మొత్తం మహిళలపై ముద్ర వేసే కథగా చూపించను. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది.అలాంటి నేరాలు చాలా దారుణమైనవే. కానీ నేను చెప్పాలనుకున్న కథకు వాటికి సంబంధం లేదు.'ది గర్ల్‌ఫ్రెండ్' మూవీలో  విక్రమ్ హంతకుడు కాదు  శారీరక హింస కూడా చేయడు. తన ప్రేమకు నమ్మకంగా ఉండే వ్యక్తే. అయినా ఈ సినిమాపై కొందరు ఎందుకు అంతగా స్పందిస్తున్నారో ఒకసారి ఆలోచించండి.అయితే ఎవరికైనా నా సినిమా లేదా నా అభిప్రాయంపై అభ్యంతరాలు ఉంటే చెప్పండి. నేను ఆ విమర్శలను స్వీకరిస్తాను. వాటిపై ఆలోచిస్తాను. మనం ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు మాట్లాడుకోవడం చాలా అవసరం." అంటూ రాహుల్ చెప్పుకొచ్చారు.
  మరాఠా యోధుడు 'ఛత్రపతి శివాజీ మహారాజ్' జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం   'రాజా శివాజీ. మే 1 న రిలీజయ్యి  రికార్డుల వర్షం కురిపించిన ఈ విజువల్ వండర్ 110 కోట్లకి పైగా కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. టైటిల్ రోల్ ని  రితేష్ దేశ్‌ముఖ్  పోషించడమే కాకుండా  స్వయంగా దర్శకత్వం వహించాడు. ముంబై ఫిల్మ్ కంపెనీ మరియు జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా రితేష్ దేశ్‌ముఖ్ అద్భుతమైన నటన, అజయ్-అతుల్ అందించిన  సంగీతం ప్రేక్షకులని  థియేటర్లకు పరుగులు పెట్టించాయి ఇప్పుడు ఈ మూవీ  జూన్ 26 అంటే ఈ రోజు నుంచి  ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది. మరాఠీ సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, విడుదలైన రోజు నుండే అద్భుతమైన వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను సృష్టించింది. చత్రపతి శివాజీ మహారాజ్ వీరగాథను కళ్లకు కట్టినట్లు చూపించగా  ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్‌ని మెప్పించడానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అడుగుపెట్టింది. బాక్సాఫీస్ లెక్కల విషయానికి వస్తే,సుమారు ₹75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రన్‌లో 130 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, సంచలనం సృష్టించింది. తద్వారా మరాఠీ చిత్ర పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆల్-టైమ్ నంబర్ 1 చిత్రంగా రికార్డు సృష్టించింది. అంతకుముందు రికార్డులో ఉన్న ప్రముఖ సినిమా "సైరాట్" (Sairat) సాధించిన110 కోట్ల రికార్డును ఈ చిత్రం అధిగమించింది. భారతదేశ వ్యాప్తంగా ఈ చిత్రం నెట్ వసూళ్ల పరంగా 105.26 కోట్లు సాధించి100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి మరాఠీ చిత్రంగా సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. Also read: Ajith kumar: 180 కోట్ల రెమ్యునరేషన్ వివాదం..సంచలన నిర్ణయం తీసుకున్న అజిత్ కేవలం రితేష్ నటన మాత్రమే కాకుండా, ఈ సినిమాలో భారీ తారాగణం నటించడం మరో విశేషం. శివాజీ మహారాజ్ భార్య సాయిబాయి పాత్రలో రితేష్ నిజజీవిత భాగస్వామి జెనీలియా దేశ్‌ముఖ్ నటించగా, శక్తివంతమైన విలన్ అఫ్జల్ ఖాన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటించారు. అలాగే విద్యాబాలన్, అభిషేక్ బచ్చన్, ఫర్దీన్ ఖాన్, భాగ్యశ్రీ వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. వీటన్నింటికీ మించి బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరవడం అభిమానులకు పూనకాలు తెప్పించింది. ఈ అద్భుతమైన చారిత్రక కావ్యాన్ని థియేటర్లలో మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు.  
అక్కినేని హీరో అఖిల్ (Akhil Akkineni) నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘లెనిన్’ (Lenin) థియేట్రికల్ రిలీజ్‌కు టైమ్ దగ్గరపడుతోంది. గతంలో వచ్చిన ‘ఏజెంట్’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత అఖిల్ దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా కావడంతో అక్కినేని అభిమానులు ఈ ప్రాజెక్ట్‌పై కొండంత ఆశలు పెట్టుకున్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అయితే సినిమా విడుదల తేదీకి పట్టుమని 15 రోజులు కూడా సమయం లేదు. జూలై 10న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కానీ ఇండస్ట్రీ వర్గాల్లోనూ, అటు సోషల్ మీడియాలోనూ ‘లెనిన్’ ప్రమోషన్స్ హడావుడి మాత్రం అస్సలు కనిపించడం లేదు. ఎక్కడా సరైన సౌండ్ లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా మొదట మే 1న విడుదల కావాల్సింది. ఆ తర్వాత జూన్ 26కు వాయిదా వేశారు. చివరగా కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) వర్క్ పెండింగ్ ఉండటం వల్ల అక్కినేని నాగార్జున స్వయంగా రంగంలోకి దిగి జూలై 10కి రిలీజ్ డేట్‌ను లాక్ చేశారు. అభిమానులకు 100 శాతం క్వాలిటీతో కూడిన ఒక పర్ఫెక్ట్ సినిమాను అందించాలనే ఉద్దేశంతోనే ఈ అదనపు సమయం తీసుకున్నట్లు ప్రొడక్షన్ టీమ్ వెల్లడించింది. ప్రొడ్యూసర్ నాగార్జున సైతం ‘మనోడు జూలై 10న థియేటర్లలోకి వస్తున్నాడు, స్క్రీన్‌పై ఒక కొత్త అఖిల్‌ను చూస్తారు’ అంటూ ట్విట్టర్ వేదికగా పెద్ద స్టేట్‌మెంటే ఇచ్చారు. అయితే రిలీజ్ దగ్గరపడుతున్నా ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ అవలంబిస్తున్న ‘సైలెంట్ స్ట్రాటజీ’ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటిదాకా రిలీజ్ అయిన కంటెంట్ కి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. ఆ బజ్ ను నెక్స్ట్ లో తీసుకెళ్లే ప్రమోషనల్ ఈవెంట్స్ ఏవీ ఇప్పటివరకు ప్లాన్ చేయలేదు. సాధారణంగా ఒక పెద్ద హీరో సినిమా వస్తోందంటే కనీసం నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్స్ హోరెత్తించాలి. ముఖ్యంగా అఖిల్ లాంటి హీరో బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాల్సిన తరుణంలో ఈ రేంజ్ సైలెన్స్ సినిమాపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందేమోనని ట్రేడ్ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే క్రేజ్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు మనం ఎంటర్‌ప్రైజెస్ లాంటి టాప్ బ్యానర్స్ తోడున్నా కూడా ప్రచారంలో జోరు తగ్గడం గమనార్హం.  ప్రస్తుతం ఉన్న తక్కువ వ్యవధిలోనే ట్రైలర్ లాంచ్, ప్రీ-రిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్స్, సిటీ టూర్స్ అంటూ భారీ ప్రమోషనల్ ప్లాన్స్ చేయకపోతే థియేటర్ల వద్ద ఓపెనింగ్స్ రాబట్టడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  అయితే కొన్ని సినిమాలు కావాలని భారీ అంచనాలను పెంచకుండా, సైలెంట్ గా వచ్చి కంటెంట్ తో సర్ ప్రైజ్ చేస్తుంటాయి. అలాంటి సినిమాలు ఓపెనింగ్స్ కంటే, లాంగ్ రన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి. మరి ‘లెనిన్’ టీమ్ ఆలోచన కూడా అదేనా అనేది తెలియాల్సి ఉంది. మరి రాబోయే వారం రోజుల్లో ‘లెనిన్’ టీమ్ ఎలాంటి కౌంటర్ ప్లాన్‌తో సౌండ్ చేస్తుందో, బాక్సాఫీస్ వద్ద అఖిల్ ఎలాంటి విద్వంసం సృష్టిస్తాడో చూడాలి.  
  తమిళనాట థలా 'అజిత్' కి ఉన్న స్టార్ స్టేటస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. తమిళ రాజకీయాల్ని ఒంటి చేత్తో శాసించే దమ్ము కూడా ఉంది. మాజీ దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఒక సందర్భంలో నా తర్వాత నా రాజకీయ వారసుడు అజిత్ అని కూడా చెప్ప్పిందంటే అజిత్ అనే కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. అటువంటి అజిత్  వెండితెరపై కనిపించి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. 2025 ఏప్రిల్ 10న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో విడుదలైన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా భారీ విజయాన్ని సాధించింది. ఆ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఆయన తన 64వ చిత్రాన్ని (AK64) కూడా అదే దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లోనే చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ సిద్ధమై చాలా నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటా అని ఆరా తీస్తే, అసలు సమస్య అంతా అజిత్ రెమ్యునరేషన్‌తోనే వచ్చిపడిందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం అజిత్ కుమార్ ఏకంగా రూ. 180 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి మొదట 'రోమియో పిక్చర్స్' అధినేత రాహుల్ ముందుకు వచ్చినప్పటికీ, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా అంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడం వర్కవుట్ కాదని భావించారట. పారితోషికం కాస్త తగ్గించుకోవాలని రాహుల్ కోరిన విజ్ఞప్తిని అజిత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు టాక్ నడుస్తోంది. స్టార్ హీరోల చిత్రాలకు లాభాల్లో షేర్ ఇచ్చే విధానంపై నిర్మాతల మండలి నుంచి ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో, ఈ రెమ్యునరేషన్ డీల్ కుదరకపోవడంతో సినిమా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. Also read: vijay deverakonda: షూటింగ్ కారవాన్ విషయంలో ఏం జరుగుతుంది.. అసలు నిజం చెప్పిన బడా నిర్మాత ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అజిత్ కుమార్ ఎవరిపైనా ఆధారపడకుండా ఒక సాహసోపేతమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తన సినిమా కోసం ఏకంగా తానే సొంతంగా ఒక నిర్మాణ సంస్థను  స్థాపించి, స్వీయ నిర్మాణంలో ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బెల్జియంలో జరుగుతున్న అంతర్జాతీయ కారు రేసింగ్ షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్న అజిత్, ఆ రేస్ పూర్తి చేసుకుని చెన్నై తిరిగి రాగానే ఈ కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించే అవకాశం ఉండటంతో, అజిత్ నిర్మాతగా మారబోతున్న ఈ సినిమాపై అటు అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.  
హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక షాకింగ్ రూమర్ తెగ హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'రణబాలి' (Ranabaali) అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సెట్స్‌లో విజయ్ ప్రవర్తన అస్సలు బాలేదని, ఆయన ప్రొడ్యూసర్లను విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారంటూ కొన్ని ఎక్స్ (ట్విట్టర్) ఖాతాల్లో ప్రచారం మొదలైంది.  హీరో విజయ్ దేవరకొండ షూటింగ్ లొకేషన్‌కు ఏకంగా 50 మంది అసిస్టెంట్లను తీసుకువస్తున్నారని, తనతో పాటు తన స్టాఫ్ కోసం ఏకంగా 7 క్యారవాన్లు కావాలని ప్రొడక్షన్ టీమ్‌ను తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారనేది ఆ వార్తల సారాంశం. అంతేకాదు, ఈ వ్యవహారంపై విసిగిపోయిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారంటూ కొన్ని ప్రముఖ న్యూస్ పోర్టల్స్ పేరిట సృష్టించిన ఫేక్ స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అయ్యాయి. ఈ ప్రచారం కాస్తా టాలీవుడ్ వర్గాల్లో పెద్ద దుమారమే రేపడంతో అసలు నిజం ఏంటో తెలుసుకోవడానికి ప్రముఖ మీడియా ప్రతినిధులు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన యలమంచిలి రవిశంకర్ ని నేరుగా సంప్రదించారు. ఈ వార్తలపై రవిశంకర్ స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆ కథనాలన్నీ వంద శాతం అబద్ధమని, పూర్తిగా బేస్‌లెస్ వార్తలని ఆయన తేల్చిచెప్పారు. విజయ్ అత్యంత ప్రొఫెషనల్ యాక్టర్ అని, సినిమా షూటింగ్ ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎంతో స్మూత్‌గా సాగిపోతోందని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడి నుంచో ఇలాంటి లేనిపోని కథలు అల్లేసి నెట్టింట ప్రచారం చేయడం వెనుక ఎవరి కుట్ర ఉందో అర్థం కావడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. అసలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు వెళ్లాల్సిన అవసరమే రాలేదని, విజయ్ తమకు పూర్తి సహకారం అందిస్తున్నారని మైత్రీ సంస్థ స్పష్టం చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 'రణబాలి' చిత్రం 2026 సెప్టెంబర్ 11న గ్రాండ్‌గా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి హైప్ ఉన్న సినిమాపై కొందరు కావాలనే మైలేజ్ కోసం దుష్ప్రచారం చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం వల్ల అవి ఎక్కువుగా  కుళ్ళిపోతాయి.  ఇది చాలా మంది ఎదుర్కునే  సాధారణ సమస్య. వాటిని సరిగ్గా నిల్వ చేయడం ద్వారా పాడవకుండా నివారించవచ్చు. అందుకోసం టమాటాలను ఎలా నిల్వ చేయాలి తెలుసుకుంటే.. పచ్చి టమాటాలు.. టమాటా పూర్తిగా పండకపోయినా, ఇంకా కొంచెం గట్టిగా ఉంటే, దానిని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకోవచ్చు. పండని టమాటాలను డైరెక్ట్ సన్ లైట్ కు  దూరంగా ఉంచాలి. పచ్చి గా ఉన్నవి, పూర్తీగా  పండని టమాటాలను ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. దీనివల్ల అవి  రుచిని కోల్పోయి, సరిగ్గా పండకుండా ఉంటాయి. పండిన టమోటాలు.. టమోటాలు పూర్తిగా పండి, ఎర్రగా ఉంటే, అవి గట్టిగా ఉంటే..  వాటిని గది ఉష్ణోగ్రత వద్ద కౌంటర్‌పై నిల్వ చేయాలి.  ఈ టమోటాలను 1 నుండి 2 రోజుల వరకు ఉపయోగించవచ్చు. టమోటాలను కాడ భాగం కిందికి ఉండేలా నిల్వ చేయాలి. దీనివల్ల కాడ చుట్టూ ఉన్న తేమ బయటకు పోతుంది , అవి త్వరగా వాడిపోకుండా  ఉంటాయి. టమోటాలను ఒకదాని మీద ఒకటి కాకుండా అన్నింటికి పక్కన పక్కన ఉంచి నిల్వ చేయాలి. బాగా పండిన టమోటాలు.. టమోటాలు బాగా పండితే పాడైపోతాయని చాలామంది భయపడతారు. వాటిని రిఫ్రిజిరేటర్‌లోని చల్లదనంలో ఉంచడం వల్ల పండే ప్రక్రియ నెమ్మదిస్తుంది. రిఫ్రిజిరేటర్ నుండి తీసిన వెంటనే టమోటాలను తినకూడదు. అవి గది ఉష్ణోగ్రతకు వచ్చినప్పుడు మాత్రమే తినాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. టమోటాలను కడగకుండా, ఆరబెట్టకుండా ప్లాస్టిక్ సంచులలో నిల్వ చేయకూడదు. దీనివల్ల అవి త్వరగా పాడైపోతాయి. టమోటాలు పండినప్పుడు, అవి ఇథిలీన్ వాయువును విడుదల చేస్తాయి. అందువల్ల, బాగా పండిన టమోటాలను ఎక్కువగా ఒకేచోట నిల్వ చేయడం వల్ల అవి త్వరగా పాడైపోతాయి. టమోటాలను అతి చల్లని ఉష్ణోగ్రతలలో నిల్వ చేయడం వాటి రుచిని పాడు చేస్తుంది. దీనివల్ల వాటి తొక్క బలహీనపడి, మరింత త్వరగా పాడైపోతాయి.                                         *రూపశ్రీ.
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా అనుకోవచ్చు. కానీ  కొందరు ప్రేమలో పదేపదే మోసపోతుంటారు. ఇలా పదే పదే  జరిగే మోసాలు దురదృష్టం వల్ల కాకుండా మనిషి చేసే  పొరపాటు వల్ల జరుగుతాయి. కొన్నిసార్లు, మనం తెలియకుండానే చేసే పొరపాట్లు పదేపదే మోసాలకు దారితీయవచ్చు. ప్రేమలో పదే పదే మోసపోయే వారు చేసే పొరపాట్లు ఏమిటో.. ఎందుకు జరుగుతాయో.. వివరంగా తెలుసుకుంటే.. హెచ్చరికలు.. ప్రేమలో మోసపోతున్నారని చెప్పడానికి కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ తెలుస్తూ ఉంటాయి.  అబద్దాలు చెప్పడం, వింతగా ప్రవర్తించడం,  విషయాలు దాచడం,కేవలం మాటలు చెప్పడం,  చేతల్లో ఏమీ ఉండకపోవడం వంటివి ప్రేమలో మోసపోవడానికి హెచ్చరికలు. ఇవన్నీ చేసే వ్యక్తి ఏదో ఒకరోజు మోసం చేసే అవకాశం ఉంటుంది. ప్రాధాన్యత.. భాగస్వామిని సంతోషపెట్టాలనే కోరికలతో ఆత్మగౌరవాన్ని వదిలి  తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటే, అవతలి వ్యక్తి  తేలికగా తీసుకుంటారు. అందుకే తమను తాము ఎప్పుడూ  ప్రేమించుకుని, గౌరవించుకోవాలి. అది జరగనంత వరకు  అవతలి వ్యక్తి  విలువ ఇవ్వరు.  భాగస్వామి  విలువ ఇవ్వనప్పుడు,  ఎప్పుడైనా మోసం చేయగలరు. అందుకే సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్ చాలా కీలకం. తొందరపాటు నిర్ణయాలు.. చాలాసార్లు, గతంలో  విడిపోవడం వల్ల కలిగిన బాధను తగ్గించుకోవడానికి లేదా తుడిచివేయడానికి,  ఆలోచించకుండా కొత్త సంబంధాలను వెతుక్కుంటారు.  సంబంధంలోకి వెళ్లడానికి  ఎప్పుడూ తొందరపడకూడదు, ఎందుకంటే ఇది  అవతలి వ్యక్తిపై మానసికంగా ఆధారపడేలా చేస్తుంది. గుడ్డి నమ్మకం..  భాగస్వామిని గుడ్డిగా నమ్మడం సరికాదు. ఒక సంబంధంలో ఓపెన్ గా మాట్లాడుకోవడం చాలా అవసరం.  భాగస్వామిని గుడ్డిగా కాకుండా, తార్కికంగా నమ్మాలి. ఏ సంబంధంలోనైనా నమ్మకం కాలక్రమేణా ఏర్పడుతుంది. భాగస్వామిని గుడ్డిగా నమ్మితే, మోసపోవచ్చు.                                     *రూపశ్రీ.
ఈ రోజుల్లో ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు ఎక్కువగా విఫలమవుతున్నాయి? ప్రేమలో నమ్మకం, పరస్పర అవగాహన, స్వేచ్ఛ ఎంత ముఖ్యమో ఈ వీడియోలో సి. కళ్యాణ్ వివరంగా చర్చించారు. బ్రేకప్‌ల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? బంధాలను బలంగా నిలబెట్టుకోవడానికి ఏం చేయాలి? వంటి అంశాలపై ఆసక్తికరమైన విశ్లేషణను తెలుసుకోండి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న జీవనశైలి వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. చాలా మంది రక్తంలో చక్కెర స్థాయిలను మాత్రమే నియంత్రిస్తే సరిపోతుందని భావిస్తారు. అయితే డయాబెటిస్ వల్ల గుండె, కిడ్నీలు, కళ్ళు, నరాలు వంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణుడు డా. హరిచరణ్ డయాబెటిస్‌కు సంబంధించిన ముఖ్యమైన అంశాలను వివరించారు. ఈ వీడియోలో తెలుసుకునే విషయాలు: ✔ నార్మల్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎంత ఉండాలి? ✔ భోజనం తర్వాత షుగర్ స్థాయిలు ఎంత వరకు సాధారణంగా పరిగణిస్తారు? ✔ HbA1c అంటే ఏమిటి? ✔ HbA1c విలువల ఆధారంగా ప్రీ-డయాబెటిస్ మరియు డయాబెటిస్‌ను ఎలా గుర్తిస్తారు? ✔ ప్రీ-డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ✔ డయాబెటిస్ వల్ల గుండె జబ్బులు ఎందుకు వస్తాయి? ✔ సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే ఏమిటి? ✔ షుగర్ ఉన్నవారిలో హార్ట్ ఎటాక్ లక్షణాలు ఎందుకు స్పష్టంగా కనిపించకపోవచ్చు? ✔ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు అవసరం? డయాబెటిస్ ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే నరాల దెబ్బతినడం వల్ల కొంతమందిలో హార్ట్ ఎటాక్ వచ్చినా సాధారణ ఛాతినొప్పి కనిపించకపోవచ్చు. దీనినే "సైలెంట్ హార్ట్ ఎటాక్" అంటారు. అందుకే షుగర్ ఉన్నవారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, HbA1c స్థాయిలను పర్యవేక్షించడం మరియు గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. డయాబెటిస్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన ఆహారం, వ్యాయామం మరియు వైద్యుల సూచనలతో నియంత్రిస్తే అనేక సమస్యలను నివారించవచ్చు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
ఈ రోజుల్లో, ఫిట్‌గా , ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది జిమ్‌కు వెళ్తున్నారు.  శరీరాకృతి మెరుగ్గా కనిపించాలని,  ఫిట్‌నెస్ కోసం చేసే ఈ ప్రయత్నంలో, చాలా మందికి తెలియకుండానే కొన్ని తప్పులు జరుగుతాయి. అవి వారి ఆరోగ్యం పై చాలా తీవ్రమైన ప్రభావం చూపుతాయి.  తెలియకుండా చేసే కొన్ని తప్పులు  కొన్ని సార్లు చాలా డేంజర్ గా మారతాయి.  ఫిట్‌నెస్ నిపుణుల ప్రకారం జిమ్ లో చేసే  ఒక పొరపాటు ప్రాణానికి ప్రమాదాన్ని కూడా తెచ్చిపెడుతుంది.  అలాంటి తప్పులేంటో తెలుసుకుంటే.. జిమ్ కు వెళ్ళినప్పుడు ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడవచ్చు. పళ్లు బిగించడం.. జిమ్‌లో వ్యాయామం చేసేటప్పుడు చాలా మంది తెలియకుండానే పళ్ళు బిగిస్తారు లేదా కొరుకుతారు. బరువైన వెయిట్ లిఫ్టింగ్, పుష్-అప్స్, ప్లాంక్స్, డెడ్‌లిఫ్ట్స్ లేదా ఇతర శ్రమతో కూడిన వ్యాయామాలు చేసేటప్పుడు ఈ అలవాటు ప్రత్యేకంగా సాధారణం.   సమస్య.. ఫిట్‌నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, వ్యాయామం చేసేటప్పుడు  పళ్ళు బిగిస్తే, దవడ కండరాలు నిరంతరం ఒత్తిడికి గురవుతాయి. ఈ ఒత్తిడి క్రమంగా తలకు ఇరువైపులా ఉండే కణతల కండరాలకు , మెడ కండరాలకు వ్యాపిస్తుంది. దీని ఫలితంగా, వ్యాయామం తర్వాత తల బరువుగా అనిపించడం, ఒత్తిడి తలనొప్పులు , మెడ పట్టేయడం వంటివి జరుగుతాయి. దవడ , మెడ కండరాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. పళ్ళు బిగపట్టడం వల్ల  మెడ కండరాలు కూడా అనవసరంగా బిగుసుకుపోతాయి. దీనివల్ల మరుసటి రోజు మెడ బిగుసుకుపోవడం, నొప్పి , మెడను కదపడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు. ఈ సమస్య ఎవరికి వస్తుంది? బరువులు ఎత్తే వ్యక్తులు, కొత్తగా జిమ్‌కు వెళ్లేవారికి,  ఒత్తిడి లేదా ఆందోళన ఉన్న వ్యక్తులకు,  వ్యాయామం చేసేటప్పుడు తమ శరీరాన్ని అతిగా బిగుతుగా ఉంచుకునేవారికి ఇది వస్తుంది. వ్యాయామం తర్వాత మీకు తరచుగా తలనొప్పి, దవడ నొప్పి, చెవుల చుట్టూ ఒత్తిడి లేదా మెడ బిగుసుకుపోవడం వంటివి ఎదురైతే, అది కేవలం అలసట వల్ల మాత్రమే కాకుండా, వ్యాయామం చేసేటప్పుడు పళ్ళు కొరికే అలవాటు వల్ల కూడా కావచ్చు అనే  విషయాన్ని గుర్తుంచుకోవాలని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ చిన్న తప్పును సరిదిద్దుకోవడం చాలా మంచిది.                                      *రూపశ్రీ.
ప్రస్తుత జీవనశైలిలో అధిక బరువు మరియు బెల్లీ ఫ్యాట్ సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఎంత డైట్ చేసినా, ఎంత వ్యాయామం చేసినా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో చాలామంది నిరుత్సాహానికి గురవుతున్నారు. అలాంటి వారికి ఉపయోగపడే కొన్ని సహజమైన ఆయుర్వేద చిట్కాలను ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు డా. చిట్టిబొట్ల మధుసూదన శర్మ ఈ వీడియోలో వివరించారు.  శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించడానికి ఆహారపు అలవాట్లు, జీవనశైలి, జీర్ణవ్యవస్థ పనితీరు వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన చెబుతున్నారు.  అలాగే బరువు తగ్గాలంటే కేవలం మందులు లేదా ఇంటి చిట్కాలపై మాత్రమే ఆధారపడకుండా, సరైన ఆహారం, క్రమం తప్పని శారీరక వ్యాయామం, తగినంత నిద్ర కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు సహజమైన ఆయుర్వేద పద్ధతులను అనుసరించడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చని ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.  బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలని, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన ఆరోగ్య అవగాహన వీడియో ఇది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!