Home

»

Latest News

'వారణాసి' వాయిదా నిజమేనా.. షూటింగ్ ఎంతవరకు వచ్చింది.. రాజమౌళి ఏమన్నారంటే? 

Jun 26, 2026 2:36PM

ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ ఇండియన్ మ్యాగ్నమ్ ఓపస్ 'వారణాసి' (Varanasi) సినిమాపై దర్శకుడి ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) సంచలన అప్‌డేట్స్ ఇచ్చారు. రీసెంట్ గా అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ 'వారణాసి' సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుందని స్పష్టం చేశారు. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి సంబంధించిన హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే విజయవంతంగా పూర్తయిందని ఆయన వెల్లడించారు. ఇక మిగిలి ఉన్న కొన్ని కీలకమైన కనెక్టింగ్ సీన్స్ మాత్రమే చిత్రీకరించాల్సి ఉందని, ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి వారణాసి చిత్రానికి సంబంధించిన మొత్తం షూటింగ్‌ పూర్తవుతుందని రాజమౌళి తెలిపారు.

అలాగే ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్‌ గురించి కూడా రాజమౌళి ఆసక్తికర విషయం పంచుకున్నారు. సాధారణంగా పెద్ద సినిమాలను నార్మల్ కెమెరాలతో షూట్ చేసి, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో భారీ స్క్రీన్ల కోసం ఐమ్యాక్స్ ఫార్మాట్‌లోకి మారుస్తూ ఉంటారు. కానీ రాజమౌళి మాత్రం సరికొత్త చరిత్ర సృష్టిస్తూ, 'వారణాసి' చిత్రాన్ని మొదటి రోజు మొదటి షాట్ నుండి గ్రౌండ్ లెవెల్ లోనే పక్కా ఐమ్యాక్స్ టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నారు. కేవలం విజువల్స్ ని కన్వర్ట్ చేయడం కాకుండా, థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే ఈ పద్ధతిని ఎంచుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ సినిమా స్క్రీన్‌ప్లేతో పాటు విజువల్ డిజైన్‌ను కూడా కేవలం ఐమ్యాక్స్ లార్జ్ ఫార్మాట్ స్క్రీన్‌లకు సరిపోయేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేశారు. భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, టెక్నికల్ వండర్ గా నిలిచే సినిమాగా 'వారణాసి' హిస్టరీ క్రియేట్ చేయబోతోందని ఈ విషయంతో స్పష్టమవుతోంది.

టెక్నాలజీ పరంగా ఎంతటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నప్పటికీ, రాజమౌళి తన అసలైన బలాన్ని మాత్రం అస్సలు మర్చిపోలేదు. ఈ సందర్భంగా ఆయన ఒక గొప్ప విషయాన్ని గుర్తుచేశారు. టెక్నాలజీ, విజువల్స్ లేదా భారీ గ్రాఫిక్స్ అనేవి కేవలం కథను అద్భుతంగా చెప్పడానికి ఉపయోగపడే కొన్ని శక్తివంతమైన సాధనాలు మాత్రమేనని ఆయన నొక్కి చెప్పారు. సినిమా స్కేల్ ఎంత పెద్దదైనా, విజువల్ వండర్స్ ఎన్ని ఉన్నప్పటికీ, ప్రేక్షకుడిని థియేటర్ సీట్లో కట్టిపడేసేది కేవలం అందులోని బలమైన భావోద్వేగాలు (Emotions), హృదయాన్ని కదిలించే నరేషన్ (కథా గమనం) మాత్రమేనని, అందుకే 'వారణాసి'లో ఎమోషన్స్ కి మొదటి ప్రాధాన్యత ఇచ్చామని రాజమౌళి స్పష్టం చేశారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తున్న ఈ విజువల్ వండర్ పై రాజమౌళి ఇచ్చిన ఈ క్రేజీ అప్‌డేట్‌తో టాలీవుడ్ తో పాటు గ్లోబల్ ఆడియన్స్ లో కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా 2027, ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాయిదా పడుతుందని ఇటీవల వార్తలు వచ్చినప్పటికీ, షూటింగ్ దాదాపు పూర్తయిందన్న తాజా అప్డేట్ తో.. చెప్పిన డేట్ కే వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com