LATEST NEWS
  ఏపీ అసెంబ్లీ వర్షాకాల పనిదినాలు 8 రోజులకు ప్రభుత్వం కుదించారు. దీంతో ఈనెల 27 వరకు సమావేశాలు జరగనున్నాయి. శాసన సభ  వర్షాకాల సమావేశాలు 10 రోజుల పాటు నిర్వహించాలని సభాపతి అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో తొలుత నిర్ణయించారు. కానీ, ఆ తర్వాత 8 రోజులకు కుదించారు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరగనుంది.  సభలో చర్చించేందుకు 18 అంశాలను టీడీపీ, 9 అంశాలను బీజేపీ ప్రతిపాదించింది. ప్రశ్నోత్తరాలతో పాటు శూన్య గంటలోనూ మంత్రులు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు రేపు మధ్యాహ్నం రూ. 1.30 గంటలకు సీఎం అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరగనుంది. సభలో ఆమోదించాల్సిన అంశాలపై చర్చించనుంది.  
  అమరావతి తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కీలక సమావేశం నిర్వహించారు. సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ నిర్వహణ తీరు, మండలిలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. జగన్ ఈ సందర్భంగా అసెంబ్లీ, మండలి వ్యవహారాలపై విస్తృతంగా వ్యాఖ్యానించారు.“అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి తెలుసుకోవాలన్న తపన కనిపించడం లేదు,” అని ఆయన విమర్శించారు.  కొంతమంది తనకు సలహాలు ఇచ్చారని, టీడీపీ ఎమ్మెల్యేల్ని లాగేసి ప్రతిపక్షం బలహీనపరచాలని సూచించారని చెప్పారు.“కానీ మేము అలా చేయలేదు. వారి అభిప్రాయాలూ గౌరవించాం. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది ఎవరూ గొంతు విప్పకూడదనేది అధికార పక్షం అభిప్రాయంగా కనిపిస్తోంది అని జగన్ తెలిపారు. అసెంబ్లీలో నాలుగు పార్టీలు ఉన్నప్పటికీ, మూడు పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ అధికార పక్షానికే అనుకూలంగా ఉన్నాయని, నిజమైన ప్రతిపక్షం వైయస్సార్‌సీపీ మాత్రమేనని జగన్ స్పష్టం చేశారు.  మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తే సభలో తగిన సమయం దొరుకుతుంది. ప్రజల తరఫున గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఆ గుర్తింపు ఇవ్వడంలేదు,” అని అన్నారు.అందుకే మీడియా వేదికగా ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నామని తెలిపారు. అయితే మండలిలో వైయస్సార్ కాంగ్రెస్‌కు మంచి బలం ఉందని, ఆ వేదికలో ప్రజల తరఫున గొంతు విప్పాలని ఎమ్మెల్సీలకు సూచించారు. మండలి సభ్యుల పాత్ర చాలా కీలకం. ప్రజల తరఫున ధైర్యంగా, ఆధారాలతో మాట్లాడాలి. అక్కడ మన వాయిస్ బలంగా వినిపించాలి,” అని జగన్ పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ, మండలిలో తీసుకోవాల్సిన వ్యూహాలపై చర్చించి, తమ సూచనలు కూడా ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి సమయం ఇవ్వకపోవడం, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు నిరాకరణపై వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై మండలిని ప్రధాన వేదికగా ఉపయోగించాలని ఎమ్మెల్సీలను ఆదేశించారు.
  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు గేమ్ ఛేంజర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన, ఈ సంస్కరణలు ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. సంస్కరణలు అంటే నేనప్పుడు ముందుంటాను. అభివృద్ధికి కృషి చేస్తేనే సంపద పెరుగుతుంది. సంపద సృష్టించకుండా సంక్షేమం ఇవ్వడం సరికాదు. అప్పులు చేసి సంక్షేమం పంచడం సమంజసం కాదు, అని సీఎం అన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు జరిగాయని గుర్తుచేశారు. వన్ నేషన్ – వన్ విజన్ అడుగులు వేస్తున్నామని, దేశం–రాష్ట్రం ప్రాధాన్యమని తెలిపారు. గతంలో 4 టైర్ల పన్ను వ్యవస్థ (5%, 12%, 18%, 28%) ఉండేదని, ఇప్పుడు 5% మరియు 18% శ్లాబులతో సరళతరం చేశారని వివరించారు. పండుగల వేళ వినియోగం పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రధాని మోదీ సంస్కరణల ఫలితంగా పరోక్ష పన్ను చెల్లింపుదారులు 2017లో 65 లక్షల నుంచి ప్రస్తుతం 1.51 కోట్లకు పెరిగారని, జీఎస్టీ రిసిప్టులు 2018లో రూ.7.19 లక్షల కోట్ల నుంచి ఇప్పుడు రూ.22.08 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు పేదల జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయని, వన్ నేషన్ – వన్ విజన్ నినాదంతో భారత్ డబుల్ ఇంజిన్ గ్రోత్ సాధించే దేశంగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పాలేరు నియోజకవర్గంలో తాను గెలవకుండా చూస్తానంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ పొంగులేటి బదులిచ్చారు. పాలేరులో నా గెలుపును ఆపడానికి నీ తండ్రి వల్లే కాలేదు. నా గెలుపును ఆపడానికి మీ నాయన మూడు సార్లు ముక్కు నేలకు రాసిన..ఆయన వల్లే కాలేదని  పొంగులేటి అన్నారు.  నీ వల్ల అవుద్దా..బచ్చాగాడివి ఘాటు  వ్యాఖ్యలు చేశారు. మూడున్నరేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల వరకు అసలు నువ్వు ఇండియాలో ఉంటావా..సంచి సర్దుకుని అమెరికాకు చెక్కుతవా..అన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిర్ణయించడానికి సిద్దంగా ఉన్నారు.. దమ్ముంటే రానున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మీ పార్టీ సత్తా చూపించండని మంత్రి పొంగులేటి తెలిపారు. గురువారం వరంగల్ క్రాస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.  అనంతరం వివిధ పార్టీలకు చెందిన సుమారు 80 కుటుంబాలకు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి  ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శించారు. "ప్రతి సంవత్సరం లక్ష ఇళ్లు కట్టినా, పదేళ్లలో పది లక్షల పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరేది. కానీ గత ప్రభుత్వం కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల కమీషన్లపైనే దృష్టి పెట్టింది తప్ప పేదల గృహ నిర్మాణాన్ని పట్టించుకోలేదు" అని ఆయన ఆరోపించారు.
ఆ ఎమ్మెల్యే రైతులను యూరియా కష్టాల నుంచి బయటపడేయాలని తపన పడ్డారు. తపనపడి ఊరుకోలేదు..లక్ష మంది రైతులకు ఒక్కొక్కరికీ ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేయడానికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ సొమ్ముల కోసం ఆయన ఏకంగా తన కుమారుడి వివాహ రిసెప్షన్ ను రద్దు చేశారు. ఆ రిసెప్షన్ కోసం వ్యయం చేద్దామని కేటాయించిన రెండు కోట్ల రూపాయలను రైతుల కోసం ఇచ్చేశారు. ఇంతకీ ఆయన ఎవరంటే.. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. తన కుమారుడి వివాహ రిసెప్షన్ ను రద్దు చేసుకుని మరీ రెండు కోట్ల రూపాయలను రైతులకు ఇవ్వాలని నిర్ణయించుకున్న ఆయన ఆ మేరకు గురువారం (సెప్టెంబర్ 18) తన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రెండుకోట్ల రూపాయల చెక్కు అందించారు. ఆ రెండు కోట్లనూ తన నియోజకవర్గంలోని రైతులకు ఒక్కొక్కరికి ఒక బస్తా చొప్పున యూరియా అందజేయాలని ఈ సందర్భంగా బత్తుల లక్ష్మారెడ్డి సీఎంను కోరారు.   ఇటీవలే ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. ఆ వివాహ రిసెప్షన్ ను మిర్యాల గూడలో భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు బత్తుల లక్ష్మారెడ్డిని కదిలించాయి. అంతే కుటుంబ సభ్యులతో చర్చించి కుమారుడి వివాహ రిసెప్షన్ ను  రద్దు చేసి.. ఆ సొమ్ముతో రైతులకు యూరియా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.  
ALSO ON TELUGUONE N E W S
Ram Charan known as Global Icon, has been named the first-ever brand ambassador for the Archery Premiere League (APL). His role in RRR as archer Alluri Seetha Rama Raju has been inspiration behind this move say association officials. His portrayal of an archer in RRR made him the perfect choice to promote the sport. The APL hopes to train talented individuals for the 2028 Olympics and give them a platform to showcase their skills. President of the Archery Association of India, Shri Arjun Munda, said, "The dream envisioned by us is the dream that has lived for many years in every young archer across India’s villages. Having Ram Charan as our Brand Ambassador further strengthens our mission, as his global influence will inspire countless young people to take an interest in archery." Ram Charan expressed his hope that the league will give the sport of archery more recognition and help aspiring archers reach their full potential. The league will be held from 2nd to 12th October 2025 in Yamuna Sports Complex, New Delhi. 
తెలుగు సినిమా జననం, నటసామ్రాట్, ఎవర్ గ్రీన్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత 'అక్కినేని నాగేశ్వరరావు'(ANR)గారి సినీ రంగ ప్రవేశం ఇంచు మించు ఒకేసారి జరిగిందని చెప్పవచ్చు. ఆయనతో పాటే తెలుగు సినిమా కూడా ఎదిగింది. ఏడున్నర దశాబ్దాల సినీ ప్రస్థానం 'ఏఎన్ఆర్' సొంతం. దీన్ని బట్టి నటనా రంగంలో  ఆయన సృష్టించిన ప్రభంజనాన్ని అర్ధం చేసుకోవచ్చు. జానపద, పౌరాణిక,సాంఘిక, భక్తి రసచిత్రాల్లో ఆయన పోషించని క్యారక్టర్ లేదు. ఎన్నో అద్భుతమైన క్యారక్టర్ లు నేటికీ ప్రతి తెలుగువాడి గుండెల్లో పదిలంగా ఉన్నాయి..  ఏఎన్ ఆర్ 101 వ జయంతి సెప్టెంబర్ 20 న జరగనుంది. ఈ సందర్భంగా ఆయన వారసుడు కింగ్ 'నాగార్జున'(Nagarjuna)తన తండ్రి నటించిన ఎన్నో మరుపురాని చిత్రాల్లోని డాక్టర్ చక్రవర్తి, ప్రేమాభిషేకం సినిమాలని అభిమానులతో పాటు,ప్రేక్షకుల కోసం రెండు తెలుగు రాష్టాల్లో విడుదల చేస్తున్నారు. కాకపోతే వీటిని ఉచితంగా ప్రదర్శించనున్నారు. ఇందుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఎంపిక చేసిన థియేటర్స్ వివరాలు 'బుక్ మై షో' లో అందుబాటులో ఉన్నాయి. గత సంవత్సరం కూడా నాగార్జున ఈ అవకాశాన్ని కలిపించిన విషయం  తెలిసిందే.   దీంతో థియేటర్స్ లో 'ఏఎన్ఆర్' అభిమానుల కోలాహలం నెలకొంది. ఈ సంవత్సరం కూడా అంతకు మించిన కోలాహలం నెలకొని ఉంటుందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి  లేదు. ఎప్పటిలాగానే రెండు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులు  'ఏఎన్ఆర్' జయంతి వేడుకల్ని ఎంతో ఘనంగా జరపనున్నారు.    
పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్'(Prabhas)తన అప్ కమింగ్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja Saab)కి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ 'కేరళ' లో పాటల చిత్రీకరణలో ఉందని, ఆ తర్వాత విదేశాల్లో మరికొన్ని పాటలని చిత్రీకరించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రాజాసాబ్ తో పాటు హను రాఘవపూడి(Hanu Raghavapudi)దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీని కూడా 'ప్రభాస్' పారలాల్ గా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్ పరిశీలనలో ఉండగా, కొన్ని షెడ్యూల్స్ ని కూడా జరుపుకుంది. పీరియాడిక్  అంశాలతో కూడిన మూవీ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీలో బాలీవుడ్ బడా హీరో 'అభిషేక్ బచ్చన్'(Abhishek Bachchan)నటించబోతున్నాడనే వార్తలు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై హాట్ టాపిక్ గా నిలిచాయి. ప్రభాస్ తర్వాత కథలో ఒక కీలకమైన క్యారక్టర్ ఉందని, ఆ క్యారక్టర్ కి బాలీవుడ్ హీరో అయితే సరిపోతాడని భావించి, మేకర్స్ 'అభిషేక్ బచ్చన్' ని సంప్రదించారనే వార్తలు ఇండియన్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు అభిషేక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా అంటున్నారు. కొంత కాలం నుంచి హిందీ చిత్రసీమకి చెందిన హీరోలు, తెలుగు చిత్రాల్లో నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిషేక్  నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడనే చర్చ కూడా జరుగుతుంది.   అభిషేక్ సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)నట వారసుడిగా రెండున్నర దశాబ్డల క్రితమే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. హీరోగా ఎన్నో వైవిద్యమైన క్యారక్టర్ లని పోషించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. ఏ క్యారక్టర్ లో అయినా ఒదిగిపోయి నటించడం అభిషేక్ స్పెషాలిటీ. ఈ  ఏడాది' హౌస్ ఫుల్ 5 ', 'కాళిధర్ లాపాతా' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్(Chhatrapati Shivaji Maharaj)జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న రాజాశివాజీ లోను టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ప్రభాస్ బాహుబలి దగ్గర్నుంచి  నార్త్ లో తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఇద్దరి కాంబో పాన్ ఇండియా లెవల్లో సరికొత్త క్రేజ్ ని ఏర్పాటు చేసుకోవడం ఖాయం.  
Cast: Ankith Koyya, Nilakhi Patra, Naresh, Vasuki, Muralidhar Goud, Nithin Prasanna, Prasad Behra Crew:  Written by RV Subramanyam, Dev Cinematography by Shrie Saikumaar Daara Music by Vijay Bulganin Editing by S.B. Uddhav Direction by JSS Vardhan Produced by Vijaypal Reddy Adidhala, Umesh Bansal Talking about teenage love and relationships that form at a tender age, many movies have been made in Telugu Cinema. Now, Ankith Koyya, who made a good impression with his performances in films like AAY, Bachchala Malli, and others, played leading role in Beauty. Nilakhi Patra is debuting in Telugu with the movie. Let's discuss about the film in detail.  Plot:  Narayana (Naresh), a cab driver in Vizag, loves his daughter, Alekhya (Nilaki Patra) and makes her wish as his command. He tries to move clouds for her and does anything for her. Her mother (Vasuki) tries to discipline her but Alekhya acts on her own as Narayana doesn't like to scold her.   She falls in love with Arjun (Ankit Koyya) and their relationship gets stronger with each day. One day, Alekhya invites Arjun to her house and gets caught to her neighbor. Later, she gets caught chatting with Arjun to her mother. What she does after that? Will Narayana be able to change her mind? Watch the movie to know more.  Analysis:  Ankith Koyya is good in the role and his performance is apt. But his dialogue delivery needs a little bit more refinement as at places he is unable to match the intensity in his body language. Nilakhi Patra looked very cute and she delivered a good performance. Her character did require her to be clingy and she did not let the meter go into cringe zone. Naresh delivered yet another fine performance and Vasuki did not have much to do.  Screenplay of the film engages us throughout from the start to finish. It concentrates on a young girl who is loved by her parents and thinks about only her aspirations. She thinks everyone around her are like her parents but she gets to realise how hard it is in life without their support. But the way, narrative unfolds her struggle between love and parents, is treated in an engaging fashion.  Technically, the movie delivers on visual front and music as well. Director Vardhan has masterfully explored the different relationships around the girl in a beautiful manner. The twists and turns in the second hour dive deep into the relationship of father and daughter. Each frame enhaces drama but the predictibility does drop the intensity. As such thrillers have been common it feels slightly routine but it delivers a decent cinematic experience.  Bottomline:  The movie engages with its twists and it is a decent thriller.    Rating: 2.75/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
  'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి దీపికా పదుకొణె(Deepika Padukone)ను తొలగిస్తున్నట్లు వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 'కల్కి'లో సుమతి అనే కీలక పాత్ర పోషించింది దీపిక. నిజానికి ఆమె పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. అలాంటిది సీక్వెల్ నుంచి దీపికను తొలగించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే దీపిక పెడుతున్న మితిమీరిన కండిషన్స్ ని తట్టుకోలేకనే.. మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. (Kalki 2)   'కల్కి-2' నుంచి దీపికను తొలగించడంతో ఆమె స్థానంలో ఎవరు నటిస్తే బాగుంటుందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కల్కి-2 లాంటి భారీ సినిమాకి గ్లోబల్ స్థాయి గుర్తింపు ఉన్న ప్రియాంక, ఐశ్వర్యలలో ఒకరిని తీసుకునే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్ నుంచి అలియా భట్ పేరు కూడా బాగానే వినిపిస్తోంది. సుమతి పాత్రకు సరిగ్గా సరిపోతుందంటూ కొందరు ఏఐ ఫొటోలు కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇక ఇటీవల మలయాళ చిత్రం 'లోకా'తో సంచలనం సృష్టించిన కళ్యాణి ప్రియదర్శన్ కూడా బెస్ట్ ఆప్షన్ అంటున్న వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. వీరితో పాటు రుక్మిణి వసంత్, కృతి సనన్, అనుష్క శెట్టి, సమంత, నయనతార వంటి పేర్లు కూడా కొందరు సూచిస్తున్నారు.   కల్కి సీక్వెల్ లో దీపిక స్థానంలో ఎవరు నటిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.  
సినిమా పేరు: బ్యూటీ   తారాగణం:  అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర, సీనియర్ నరేష్, నితిన్ ప్రసన్న, వాసుకి, ప్రసాద్ బెహ్రా, నాగేంద్ర మేడిద తదితరులు  మ్యూజిక్: విజయ్ బుల్గానిన్ ఎడిటర్: ఎస్ బి ఉద్ధవ్  రచన, దర్శకత్వం: జె ఎస్ ఎస్ వర్ధన్  సినిమాటోగ్రాఫర్: శ్రీ సాయికుమార్ దార బ్యానర్:  మారుతీ టీం వర్క్స్, వానర స్టూడియోస్  నిర్మాత: అడిదాల విజయపాల్ రెడ్డి  విడుదల తేదీ: సెప్టెంబర్ 19 ,2025  రాజా సాబ్(The Raja saab)మారుతీ' టీం సమర్పణలో 'ఆయ్' మూవీ ఫేమ్ అంకిత్ కొయ్య(Ankith Koyya),నూతన కథానాయిక 'నీలఖి పాత్ర'(Nilakhi Patra) జంటగా తెరకెక్కిన మూవీ 'బ్యూటీ'(Beauty). ప్రచార చిత్రాల ద్వారా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసుకోగా, రేపు థియేటర్స్ లో సందడి చేయనుంది. సినిమాపై నమ్మకంతో మేకర్స్ ఒక రోజు ముందుగానే చాలా ఏరియాల్లో ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ  అలేఖ్య (నీలఖి పాత్ర) మధ్యతరగతికి చెందిన అందమైన అమ్మాయి. తాను ఏంజెల్' ని అని తన నమ్మకం. అమాయకత్వం,కోపం, సంతోషాన్ని ఒకేసారి ప్రదర్శించే అలేఖ్య, 'వైజాగ్' లో  ఇంటర్ మీడియట్ చదువుతుంటుంది. అలేఖ్య తండ్రి నారాయణ(నరేష్) క్యాబ్ డ్రైవర్. కూతురు అంటే పంచ ప్రాణాలు. ఎన్ని కష్టాలు పడైనా తన తాహతకి మించి అలేఖ్య అడిగింది ఇస్తుంటాడు. అర్జున్ ( అంకిత్ కొయ్య) పెట్ లవర్ తో పాటు వాటికి ట్రైనర్. ఇన్ స్టాగ్రామ్ లో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ కూడా ఉంటారు. అలేఖ్య, అంకిత్ కి పరిచయం జరుగుతుంది. ఆ పరిచయం ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమగా మారుతుంది. ఇంకో వైపు అమ్మాయిల్ని మంచి మాటలతో, మాయలో పడేలా చేసి, శారీరకంగా అనుభవించే ఒక బ్యాచ్ తిరుగుతుంటుంది. తమ కోరిక తీరాక డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేయడంలో సదరు బ్యాచ్ స్పెషల్. అలేఖ్య, అంకిత్ చేసిన తప్పు వల్ల ఆ ఇద్దరు వైజాగ్ వదిలి 'హైదరాబాద్' వస్తారు. ఆ ఇద్దరి కోసం నారాయణ హైదరాబాద్ వస్తాడు. అమ్మాయిల్ని బ్లాక్ మెయిల్ చేసే ముఠా కూడా హైదరాబాద్ వస్తుంది. అలేఖ్య, అంకిత్ లకి పరిచయం ఎలా జరిగింది? ఆ ఇద్దరు  చేసిన తప్పేంటి?  హైదరాబాద్ ఎందుకు వచ్చారు? బ్లాక్ మెయిల్ ముఠా హైదరాబాద్ ఎందుకు వచ్చింది? అలేఖ్య ని నారాయణ కలిశాడా? అలేఖ్య, అర్జున్ ప్రేమలో హైదరాబాద్ పోలీస్ పాత్ర ఏంటి?  అలేఖ్య, అంకిత్ ప్రేమ చివరకి ఏమైంది అనేదే 'బ్యూటీ' చిత్ర కథ. ఎనాలసిస్  ఇలాంటి కథలు ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో 'సెల్యులాయిడ్' పైకి రావాల్సిన అవసరం చాలా ఉంది. ఒక అమ్మాయి ప్రేమ ఎలాంటి కలుషితం లేకుండా ఎంత నిర్మలంగా ఉంటుందో చెప్పడం బాగుంది. ప్రేమించిన వాడికోసం కుటుంబాన్ని సైతం వదిలి ఎలా  వస్తుందో  చెప్పే ప్రయత్నం చేసారు. అదే విధంగా సోషల్ మీడియా అనేది  మరో కోణంలో ఎంత ప్రమాదకరమో కూడా చక్కగా చూపించారు. కాకపోతే రొటీన్ స్క్రీన్ పై అవ్వడమే కొంచం మైనస్ గా పరిగణించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా చిత్రాలు ఇంచు మించు ఈ కోవలోనే వచ్చాయి. కాబట్టి ఈ కథకి సంబంధించిన మెయిన్ పాయింట్ కి లింక్ అయ్యేలా, బ్యాక్ గ్రౌండ్ వేరేలా సెట్ చేసుకొని ఉండాల్సింది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే అలేఖ్య ఎంట్రీ సీన్ తో పాటు ఫ్యామిలీ సీన్స్  బాగున్నాయి. అలేఖ్య యాటిట్యూడ్ కూడా కథ కి సెట్ అయ్యింది. కాకపోతే  నాలుగు మంచి మాటలకే ఒక అబ్బాయి ప్రేమలో పడటం అనేది కొంచం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా కాకుండా అతన్ని పలు కోణాల్లో చెక్ చేసిన తర్వాత ప్రేమిస్తే బాగుండేది. పైగా అలేఖ్య క్యారక్టరయిజేషన్  కి  సూటయ్యేది. అంకిత్ కూడా అలేఖ్య ని  చెక్ చేసుకున్న తర్వాతే ప్రేమించి ఉండాల్సింది. ఈ విధంగా చేసుంటే ఈ కథ ఇంకా కట్టిపడేసేది. పరిచయమైన రెండు రోజులకే ఒకరికొకరు కన్న, కన్నమ్మ అని పిలుచుకోవడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. దర్శకుడు తాను అనుకున్న పాయింట్ కి అలా పిలవడం కరెక్ట్ అనుకున్నాడేమో. కానీ ప్రతిసారి అలా పిలవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎట్ లీస్ట్  ఈ పేర్లని తాము ఫిక్స్ చేసినట్టుగా ఒకరికి ఒకరు చెప్పుకుని ఆ తర్వాత పిలుచుకున్నా బాగుండేది. అలేఖ్య,అంకిత్ మధ్య వచ్చే లవ్ సీన్స్ బాగున్నాయి. ఇంకో పక్క పారలల్ గా నారాయణ సీన్స్ నడుస్తుండటంతో అలేఖ్య పై మనకి తెలియకుండానే  కోపం వస్తుంది. అందమైన అమ్మాయిలని సోషల్ మీడియాతో పాటు, మంచి మాటలతో ట్రాప్ చేసే సన్నివేశాలని కూడా చూపిస్తూ ఉండాల్సింది. ఇంటర్వెల్ ట్విస్ట్ సూపర్. సెకండ్ హాఫ్ చాలా వేగంగా కదిలింది. కూతురు ఉన్న ప్రతి తండ్రి కన్నీళ్లు పెట్టుకునే విధంగా సీన్స్ ఉన్నాయి. పోలీస్ లు కూడా ఎంట్రీ ఇవ్వడంతో కధనంలో  వేగం పెరిగింది. కాకపోతే డబ్బు కోసం ఆశపడి,హెడ్ కానిస్టేబుల్ అలేఖ్య,అర్జున్ ని అసాంఘిక కార్యక్రమాలు జరిగే లాడ్జీకి పంపించడం బాగోలేదు. బయట ప్రపంచం ఎలా ఉంటుందో  కూడా చూపించారు. చివరి పదిహేను నిముషాలు ఎక్సలెంట్.  క్లైమాక్స్  సీన్ ని అలేఖ్య పై వేరేలా ప్లాన్ చేసుండాల్సింది. ముఖ్యంగా అలేఖ్య, అర్జున్ రొమాన్స్ చేస్తుంటే, అలేఖ్య ఏమైపోయిందనే ఆలోచనలో ఉన్న నారాయణ, చిన్నపాపగా ఉన్న అలేఖ్య ని  స్నానం చేయిస్తున్నట్టు ఊహించుకునే  సన్నివేశం  ఒళ్ళు జలదిరిస్తుంది. మనకి తెలియకుండానే  కన్నీళ్లు వచ్చేస్తాయి.  నటీనటులు సాంకేతిక నిపుణల పని తీరు  'అలేఖ్య' గా  'నీలఖి పాత్ర' ఎంతో పరిణితి చెందిన నటనని ప్రదర్శించింది. అన్ని వేరియేషన్స్ లోను ఎంతో అనుభవమున్న నటిలా చేసింది. తెలుగు సినిమాకి ఇంకో మంచి యువ కథానాయిక దొరికినట్టే. అర్జున్ క్యారక్టర్ లో అంకిత్ కొయ్య  మరో సారి తనదైన ఎనర్జీ తో నటించాడు. తన మునుపటి చిత్రాల కంటే ఎంతో మెరుగ్గా ఉంది. ఇతర హీరోల ఇన్స్పిరేషన్ తో డైలాగ్ డెలివరి లేకుండా తన కంటూ ఓన్ మేనరిజం ని సెట్ చేసుకుంటే బెటర్. ఇక నారాయణగా చేసిన నరేష్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరోసారి తనకి మాత్రమే సాధ్యమయ్యే నటనతో ప్రేక్షకులని కట్టిపడేసాడు. నరేష్ గారి కోసమైనా సినిమాకి వెళ్ళాలి అనేలా తన నట  జైత్రయాత్ర కొనసాగింది. తల్లిగా చేసిన వాసుకి తన అద్భుతమైన నటనతో తెలుగు సినిమాకి రెగ్యులర్ తల్లి నేనే అని మరో సారి చెప్పినట్టయింది. సిఐ 'అన్వర్' గా పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ లో చేసిన మలయాళ నటుడు 'నితిన్ ప్రసన్న'(Nithin Prasanna)నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏ క్యారక్టర్ లో అయినా మెస్మరైజ్ చేస్తాడని మరోసారి నిరూపించాడు. ఫ్యూచర్ లో తెలుగులో బిజీ నటుడుగా మారవచ్చు. దర్శకుడిగా  వర్ధన్(Jss Vardhan)సక్సెస్ అయ్యాడు. ప్రతి షాట్ ని ఎంతో అందంగా మలిచాడు. కథనాల విషయంలో  రచయితగా మాత్రం తడబడ్డాడని చెప్పవచ్చు.  డైలాగ్స్ బాగున్నాయి.  విజయ్ బుల్గానిన్ పాటలు  , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాయికుమార్ ఫొటోగ్రఫీ,  ప్లస్ పాయింట్. విజయపాల్ రెడ్డి  నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే కథ బాగున్నా, కథనాల విషయంలో  మేకర్స్ కొంచం తడబడ్డారు. కానీ నటీనటుల అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ ఆ లోటు తెలియనీయలేదు. నేటి ఆధునిక తరం అమ్మాయిలు తప్పనిసరిగా చూడాల్సిన మూవీ. నిజమైన 'బ్యూటీ' ఎక్కడ ఉందో తెలుస్తుంది.   రేటింగ్ 2 .75 / 5                                                                                                                                                                                                                                                                                      అరుణాచలం     
  సరిగ్గా వారం రోజుల్లో 'ఓజీ' తుఫాన్ రాబోతుంది. పవన్ కళ్యాణ్ నటించిన ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ సెప్టెంబర్ 25న థియేటర్లో అడుగుపెట్టనుంది. ఇంతవరకు ట్రైలర్ విడుదల కాలేదు, భారీ ప్రమోషన్స్ కూడా లేవు. అయినప్పటికీ ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. అక్కడ సంచలనాలు సృష్టిస్తోంది. తెలుగునాట బుకింగ్స్ ఓపెన్ అయితే.. ఇక్కడ కూడా సరికొత్త రికార్డులు నమోదు కావడం ఖాయమనే అంచనాలున్నాయి. ఇప్పుడు ఆ అంచనాలకు రెట్టింపు చేసేలా సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది. (They Call Him OG)   తాజాగా 'ఓజీ' సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకి సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఓజీ మూవీ చూసిన సెన్సార్ సభ్యులు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్ ని సుజీత్ చూపించిన తీరు అదిరిపోయిందట. పవన్ లుక్, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అంటున్నారు. ఇంట్రడక్షన్ సీన్ తోనే ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేయబోతున్నాడట సుజీత్. యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయట. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్ అయితే వేరే లెవెల్ అని చెబుతున్నారు. యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయిందట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుందని టాక్. ఇక ఈ సినిమాలో రెండు బిగ్ సర్ ప్రైజ్ లు ఉన్నాయట. అవి థియేటర్లలో ప్రేక్షకులకు థ్రిల్ పంచడం ఖాయమనే మాట వినిపిస్తోంది.   ఇప్పటికే 'ఓజీ'పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పుడు సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గా ఉండటంతో.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనే ఆసక్తి నెలకొంది.  
  ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన చిత్రం 'కల్కి 2898 AD'. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా.. గతేడాది విడుదలై, వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 'కల్కి 2898 AD'కి సీక్వెల్ కూడా ఉంది. అయితే ఈ సీక్వెల్ నుంచి కథకి కీలమైన సుమతి పాత్ర పోషించిన దీపికను తప్పించారు. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించడం విశేషం. (Deepika Padukone)   "కల్కి 2898 AD సీక్వెల్‌లో దీపికా పదుకొణె భాగం కాదని అధికారికంగా ప్రకటిస్తున్నాము. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాము. కల్కి లాంటి సినిమాకి నిబద్ధత మరియు మరెన్నో అవసరం. ఆమె భవిష్యత్ ప్రాజెక్ట్ లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము." అంటూ వైజయంతి మూవీస్ కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా ఈ ప్రకటనలో "కల్కి లాంటి సినిమాకి నిబద్ధత అవసరం." అనే లైన్ హాట్ టాపిక్ గా మారింది. (Kalki 2)   నిజానికి ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రూపొందనున్న 'స్పిరిట్'లో కూడా దీపిక హీరోయిన్ గా నటించాల్సి ఉంది. కానీ, దీపిక డిమాండ్స్ దారుణంగా ఉండటంతో ఆమె స్థానంలో తృప్తి డిమ్రిని తీసుకున్నారు. మరి 'స్పిరిట్' ప్రభావమో లేక 'కల్కి 2' విషయంలో కూడా దీపిక డిమాండ్స్ అలాగే ఉన్నాయో కానీ.. ప్రభాస్ నటిస్తున్న రెండు భారీ సినిమాల నుంచి దీపికను తొలగించడం సంచలనంగా మారింది.     
  In a surprising turn of events, actress Deepika Padukone will not be returning for the highly anticipated sequel to her blockbuster Telugu debut, Kalki 2898 AD. Padukone's portrayal in the film alongside Prabhas was met with widespread critical and audience acclaim, making her departure a shock to many fans. The reason is stated to be her unreasonable demands like she asked for Sandeep Reddy Vanga's Spirit.    ​The news report was officially confirmed by the production house, Vyjayanthi Movies, via a tweet on their official X account.    The tweet reads: ​"This is to officially announce that @deepikapadukone will not be a part of the upcoming sequel of #Kalki2898AD. ​After careful consideration, We have decided to part ways. Despite the long journey of making the first film, we were unable to find a partnership. ​And a film like @Kalki2898AD deserves that commitment and much more. We wish her the best with her future works."   Director Nag Ashwin is reportedly hard at work on the script for the sequel. The first film was a massive global success, grossing a staggering Rs. 1100 crores worldwide. Further announcements about the sequel's cast and plot are expected from the makers soon.  
  కొద్దిరోజుల క్రితం తెలుగు సినీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సమ్మెను విరమింప చేయడంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుని రంగంలోకి దింపి.. నిర్మాతలు, కార్మికుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులతో సమావేశారు. సమ్మెలకు పోతే రెండు వైపులా నష్టం జరుగుతుందన్న రేవంత్.. సినీ కార్మికుల సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. (Tollywood)   తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో భేటీ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "హైదరాబాద్ ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాను. ప్రభుత్వం నుంచి సినిమా కార్మికులకు ఏమీ కావాలో చర్చించుకుని చెప్పండి. సినిమా కార్మికులను విస్మరించవద్దని నిర్మాతలకు చెప్పాను. సినిమా కార్మికులలో నైపుణ్యాల పెంపుకు సహకరించాల్సిందిగా నిర్మాతలను కోరాను. స్కిల్ యూనివర్సిటీ లో సినిమా కార్మికులకు శిక్షణ ఇస్తాం. సినిమా కార్మికులు కూడా తమ నైపుణ్యాలను పెంచుకోవాలి. అన్ని భాషల చిత్రాలు తెలంగాణ లో షూటింగ్ జరిగేలా సహకరించాలి. చిన్న సినిమా నిర్మాతలకు సహకరించాలి. పరిశ్రమలో పని వాతావరణాన్ని చెడగొట్టుకోవొద్దు. సమ్మెలకు పోతే రెండు వైపులా నష్టం జరుగుతుంది. సమస్యను సమస్యగానే చూస్తా, వ్యక్తిగత పరిచయాలను చూసుకోను. సినిమా కార్మికుల తరుపున నిర్మాతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఈ ప్రభుత్వం మీది.. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది. నేను కార్మికుల వైపు ఉంటాను.. అదే సమయంలో నాకు రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముఖ్యం. సమ్మె జరుగుతుంటే చూస్తూ ఊర్కోలేం. సినిమా కార్మికుల కు హెల్త్ ఇన్సూరెన్స్ అందజేసే ప్రయత్నం చేస్తాం. సినీ కళాకారులకు గద్దర్ అవార్డ్ లను ఇచ్చాం. 10 ఏళ్ల పాటు సినిమా వాళ్లకు అవార్డు లు కూడా ఇవ్వలేదు." అన్నారు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఆచార్య చాణక్యుడు తనదైన రాజనీతితో చరిత్రలో చెరగని ముద్ర వేశాడు.  ఈయన కేవలం రాజనీతి మాత్రమే కాకుండా తత్త్వ బోధన,  ఆర్థిక సూత్రాలు కూడా బోధించారు. చాణక్యుడి  ప్రణాళికల కారణంగానే మగధ రాజు చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చాణక్యుడు చెప్పిన ఎన్నో విషయాలు నేటికీ ఆచరించదగినవిగా ఉన్నాయి. ముఖ్యంగా చాణక్యుడు చెప్పిన ఆర్థిక సూత్రాలు పాటిస్తే వ్యక్తి జీవితంలో ఎంతో గొప్ప స్థాయికి వెళ్లవచ్చు.  ఆచార్య చాణక్యుడు చెప్పిన ఆర్థిక సూత్రాలలో ధనవంతులు కావాలంటే కొన్ని ప్రదేశాలకు దూరంగా ఉండాలి అనేది కూడా చాలా ముఖ్యం.  ఇంతకీ ధనవంతులు కావాలని కోరుకునేవారు ఏ ప్రదేశాలకు దూరంగా ఉండాలో.. చాణక్యుడు చెప్పినవి ఏంటో తెలుసుకుంటే.. ఏ ప్రదేశాలకు దూరంగా ఉంటే ధనవంతులు అవుతారు.. చాణక్యుడి ప్రకారం  వ్యాపార కార్యకలాపాలు దగ్గరలో  లేని ప్రదేశంలో నివసించడం మంచిది కాదు. వ్యాపారం లేని ప్రదేశంలో నివసించే ప్రజలు తమ జీవితాలను పెద్దగా అబివృద్ది లేకుండా  గడుపుతారు. అదేవిధంగా, ఒక ప్రదేశంలో వేదాల పరిజ్ఞానం ఉన్న పండితులు లేదా బ్రాహ్మణులు లేకపోతే, అక్కడ నివసించడం ప్రయోజనకరం కాదు. బ్రాహ్మణులు సమాజం  మతపరమైన,  సాంస్కృతిక విలువలను కాపాడతారని చాణక్యుడు చెబుతాడు. వారు లేనప్పుడు ఆ ప్రదేశం పురోగతికి అనుకూలంగా ఉండదట. నీరు లేకుండా జీవితాన్ని ఊహించలేము. అందువల్ల నదులు, చెరువులు లేదా ఇతర నీటి వనరులు అందుబాటులో లేని ప్రదేశాలలో నివసించడం మంచిది కాదు. నీరు లేనప్పుడు జీవితం కష్టమవుతుంది.   అభివృద్ధి కూడా ఆటంకం కలిగిస్తుంది. ముఖ్యంగా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో నివసించడం వల్ల నీటి సేకరణకే సమయం గడిచిపోతుంటుంది. దీని వల్ల కొన్ని ఆదాయ అవకాశాలకు సమయం వృధా అవుతుంది.  వైద్య సదుపాయాల అవసరం ఈ కాలంలో చాలా చాలా ముఖ్యం. ఈ విషయాన్ని చంద్రగుప్త కాలానికే చాణక్యుడు చాలా గట్టిగా చెప్పాడు. ఏదైనా వ్యాధి, ప్రమాదం లేదా ఆరోగ్య సమస్య ఎదురైతే దాని  పరిష్కారానికి వైద్య సేవలు అవసరం. వైద్యుడు లేదా వైద్య సదుపాయాలు   లేని ప్రదేశంలో నివసించడం మంచిది కాదు. చాణక్యుడు చెప్పినట్టు పైన చెప్పిన వనరులు లేని ప్రదేశాలలో నివసించడం వల్ల ఆర్థికంగా అస్సలు ఎదుగుదల ఉండదు. ఎంత ప్రయత్నించినా సరే.. ఆర్థికంగా బలపడటానికి తగిన అవకాశాలు, సమయాన్ని పొదుపు చేసే మార్గాలు,  ఆరోగ్యాన్ని రక్షించుకునే పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల ఆర్థికంగా ఎప్పటికప్పుడు దిగజారిపోతూ ఉంటారు.  కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుంటే ధనవంతులుగా ఎదిగే మార్గం దొరికినట్టే.                            *రూపశ్రీ.
కాలేజీలకు వెళ్లి చదువుకోవడం, మంచి ర్యాంకులు తెచ్చుకోవడం,  ఉద్యోగాలు సాధించడం,  ఇల్లు, కారు,  బ్యాంక్ బాలెన్స్ సమృద్దిగా ఉండటం.. ఇవన్నీ చదువులో రాణించడం వల్ల మంచి ఉద్యోగం వల్ల సాధించుకోవచ్చు ఏమో.. కానీ వివాహం చేసుకోవడం, వైవాహిక బంధాన్ని పదిలంగా ఉంచుకోవడం అలాంటిది కాదు. వైవాహిక బంధానికి చదువు,  లెక్కలు,  లాజిక్ ల కంటే.. అవగాహన,  అర్థం చేసుకునే తత్వం, సర్థుబాటు చేసుకునే గుణం ఇవన్నీ చాలా ముఖ్యం. నేటికాలానికి తగ్గట్టు భార్యాభర్తలు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు రావు అన్నది వాస్తమే.. కానీ వివాహం తర్వాత భార్య అయినా,  భర్త అయినా కొన్ని తప్పులు చేస్తారు. ముఖ్యంగా వివాహం తర్వాత మగవాళ్లు చేసే కొన్ని తప్పుుల వల్ల  వైవాహిక బంధాలు నాశనం అవుతాయి.  అవేంటో తెలుసుకుంటే.. వివాహం తర్వాత మరొక స్త్రీ పట్ల ఆకర్షితులవడం నైతికంగానే కాకుండా సామాజిక దృక్కోణం నుండి కూడా తప్పు. ఇది వైవాహిక జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టడమే కాకుండా, అవతలి వ్యక్తి మనోభావాలను కూడా దెబ్బతీస్తుంది. ఇటువంటి ప్రవర్తన వల్ల మొత్తం కుటుంబం చాలా డిస్టర్బ్ అవుతుంది.  జీవితంలో సంతృప్తిని కూడా చాలా ముఖ్యం.   ఎప్పుడూ ఎక్కువ పొందాలనే కోరిక కలిగి ఉండటం,  ప్రస్తుతం ఉన్న వాటితో అసంతృప్తి చెందడం మగవాడిని  అశాంతి,  అసంతృప్తికి గురి చేస్తుంది.  ఇది  వైవాహిక జీవితానికి మంచిది కాదు. మగవాడు తీసుకునే నిర్ణయం అతని కుటుంబ భవిష్యత్తు పై ఆధారపడి ఉంటుంది. ఒక  నిర్ణయం తీసుకునే ముందు దాని  అన్ని అంశాలను తీవ్రంగా పరిగణించడం చాలా ముఖ్యం. తొందరపడి తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ఇబ్బందులను కలిగిస్తుంది.                                     *రూపశ్రీ.
ఈ సృష్టిలో ప్రతి వ్యక్తి ఎవరికి వారు ప్రత్యేకమైనవారు.   అందుకే ఏ ఇద్దరు వ్యక్తులు పూర్తిగా ఒకేలా ఉండలేరు అని అన్నారు. ఈ తేడాలు మొదట్లో బంధాల మధ్య  ఆకర్షణను సృష్టిస్తాయి.  కానీ తరువాత ఈ తేడాలు పగ లేదా సంఘర్షణకు కూడా కారణం కావచ్చు. కానీ సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి బదులుగా, ఈ తేడాలను తెలివిగా ఉపయోగించడం  వలన బంధం  మరింత బలపడుతుంది. ఏదైనా ఒక గొడవ జరగగానే అది చిన్న గొడవే అయినా సరే.. వీళ్లతో కలిసి ఉండలేం.. విడిపోదాం అనే ఆలోచన చాలా మందికి పెళ్ళైన  తర్వాత అప్పుడప్పుడూ అయినా వస్తూ ఉంటుంది.  అలా కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాలో అవ్వాలి.  తేడాలు? కొంతమంది తమ జీవితాలను క్రమబద్ధంగా,  ప్రణాళికాబద్ధంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు, మరికొందరికి మార్పు,  స్వేచ్ఛ అవసరం. కొందరు స్వభావరీత్యా ప్రశాంతంగా ఉంటారు, మరికొందరు గందరగోళంలో కూడా ఓదార్పు కావాలి అనుకుంటారు. విభిన్న స్వభావాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు, వారికి తేడాలు ఉండటం సహజం. అయితే ఇది చెడ్డ విషయం కాదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి,  నేర్చుకోవడానికి ఒక అవకాశం అనుకోవాలి. అప్పుడు ఈ తేడాల వల్ల గొడవలకు బదులు అర్థం చేసుకునే గుణం అలవాటు అవుతుంది తేడాలను ఎలా నిర్వహించాలి? వ్యక్తుల మధ్య తేడాలు ఉన్నప్పుడు అది సంబంధంలో కూడా కనిపిస్తూ ఉంటుంది.  ఇలా  తేడాలు తలెత్తినప్పుడు వెంటనే ఏదో ఒకటి  స్పందించడం కంటే తగిన విధంగా రియాక్ట్ కావడం ముఖ్యం. మార్పు కాదు..  సమన్వయం కావాలి..  భాగస్వామిని మార్చడానికి ప్రయత్నించే బదులు వారితో సమన్వయం చేసుకోవడం నేర్చుకోవాలి. ఇద్దరూ  సరిగ్గా ఒకేలా ఉండనవసరం లేదు, కానీ ఒకరి కోసం ఒకరు ప్రయత్నం చేయడం ముఖ్యం. తిరస్కారం కాదు..అంగీకారం ముఖ్యం..  భాగస్వామిని వారు ఉన్న విధంగానే అంగీకరించండి. ఒకరి అంతర్గత స్వభావాన్ని మార్చమని బలవంతం చేయడం మంచిది కాదు.  భాగస్వామిని వారి లోపాలతో అంగీకరించినప్పుడే నిజమైన ప్రేమ ఉన్నట్టు అర్థం. తేడాలు ఉంటే వాటిని ఇబ్బందిగా కాదు.. వాటిని ఇద్దరూ మానసికంగా డవలప్ అవ్వడానికి  అవకాశంగా  చూడాలి. వాటిని పోరాడటానికి కారణాలుగా కాకుండా, ఒకరి నుండి ఒకరు నేర్చుకుని ఇద్దరి  పరిధులను విస్తరించుకునే అవకాశాలుగా పరిగణించాలి. సంభాషణాత్మకంగా,  కరుణతో ఉండాలి.. గొడవ జరిగినప్పుడు  ఇరిద్దరూ భిన్నంగా ఉన్నారని తెలియజేసే సమాచారంగా దాన్ని చూడాలి. ఒకరినొకరు అగౌరవపరచకుండా మీ దృక్పథాన్ని వ్యక్తపరచాలి.   భాగస్వామిని మీలాగే ఉండమని బలవంతం చేయకుండా ప్రేమ,  కరుణతో వారికి సపోర్ట్ ఉండాలి. అతను నాలాగా లేడు, ఆమె నాలాగా లేదు.. అతని పద్దతి నాకు నచ్చట్లేదు.. ఆమె అలవాట్లు బాలేవు.. ఇలా అనుకోవడం మానేయాలి.  మనం మనకు ఎలా నచ్చుతామో.. వారికి కూడా వారంటే ఇ,్టం,  వారి అలవాట్ల పట్ల ఒక కారణం ఉంటుంది. దాన్ని చూపించి వ్యతిరేకించకూడదు. ఇద్దరూ ఒకరినొకరు అంగీకరించాలి. అంగీకరించడం అంటే వ్యక్తి అలవాట్లు,  ప్రవర్తన, పద్దతి తో సహా.. అన్నీ అంగీకరించడం. ఇలా చేస్తే గొడవ జరిగినప్పుడు ఇది తన పద్దతి అనే విషయం అర్థమై దాన్ని విడిపోదాం అనే ఆలోచన వరకు తీసుకెళ్లరు.                                 *రూపశ్రీ.
ఆయుర్వేదం నుండి ఆధునిక శాస్త్రం వరకు పేగు ఆరోగ్యం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. మనిషి శరీరంలో వచ్చే చాలా వ్యాధులకు మార్గం ఇక్కడే మొదలవుతుంది. పేగు మురికిగా ఉంటే.. క్రమంగా కొవ్వు, చక్కెర, విషపదార్థాలు పెరుగుతాయి. ఇది వందలాది వ్యాధులకు కారణమవుతుంది. పేగు ఆరోగ్యానికి ఉత్తమమైన 10 ఆహారాలు ఉన్నాయి. వీటిని స్నాక్‌గా తినవచ్చు. ఇవి కడుపు,  ప్రేగులను సరిగ్గా శుభ్రపరచడంలో, ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచడంలో,  జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన స్నాక్స్ తింటే ఏమవుతుంది..  ఆరోగ్యం క్షీణించడానికి అతిపెద్ద కారణం అనారోగ్యకరమైన చిరుతిళ్లు.  ఆకలిని తీర్చుకోవడానికి  వాటిని తింటాము . ప్యాక్డ్ ఫుడ్,  మార్కెట్ స్నాక్స్‌లో  కేలరీలు, ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రంగులు ఉంటాయి. ఇవి పోషకాహార పరంగా సున్నా. అవి జీర్ణక్రియను,  ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సంఖ్యను  తగ్గిస్తాయి. పేగు ఆరోగ్యాన్నిమెరుగుపరిచే స్నాక్స్ గురించి తెలుసుకుంటే.. వేయించిన శనగలు..  గ్రీకు పెరుగు + బెర్రీలు.. వేయించిన మఖానా.. ఆపిల్ + పీనట్ బటర్ .. మిక్స్డ్ సీడ్స్ + గుమ్మడికాయ గింజలు కూరగాయలు.. ఉండికించినవి.. పచ్చిగా తినదగినవి. డార్క్ చాక్లెట్ (70%+).. మొలకెత్తిన పెసలు. మజ్జిగ.. ముఖ్యంగా మూడు ఆహారాలు పేగు ఆరోగ్యానికి చాలా దృఢంగా ఉంచుతాయి. మజ్జిగ.. పెరుగు నుండి వెన్నను తొలగించడం ద్వారా మజ్జిగ తయారు చేస్తారు. ఇది జీర్ణం కావడానికి తేలికగా ఉంటుంది.  ప్రోబయోటిక్స్‌తో నిండి ఉంటుంది. ప్రతి రోజూ తాజా మజ్జిగను తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బాక్టీరియా పెరుగుతుంది. డార్క్ చాక్లెట్.. డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. చాలా పరిశోధనలు దీనిని తినడం వల్ల  మానసిక స్థితి మెరుగుపడుతుందని, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చెబుతున్నాయి. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.  పోషకాలు గ్రహించబడతాయి. వేయించిన శనగలు.. వేయించిన శనగలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి . అన్నింటిలో మొదటిది..  ప్రోటీన్, ఫైబర్,  ఐరన్ లభిస్తాయి. ఫైబర్ గట్ బాక్టీరియాను మెరుగుపరుస్తుంది. ప్రోటీన్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది.                               *రూపశ్రీ.
కొంతమంది త్వరగా నిద్రపోయినా కూడా ఉత్సాహంగా ఉండటం, మరికొందరు అర్థరాత్రి వరకు మేల్కున్నా సరే  ఉదయాన్నే లేవడం   బాగా పని చేయడం చేస్తారు. ఇలాంటివాళ్లను  ఎప్పుడైనా గమనించారా? నిద్ర సమయం కేవలం విశ్రాంతి కోసమే కాదు, అది  ఆరోగ్యానికి  సంబంధించినది.  ఒక అధ్యయనం ప్రకారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల మధ్య  నిద్రకు ఉపక్రమించే వారికి  గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని తేలింది.  శరీరం  సహజ లయ ప్రకారం నిద్రపోవడం గుండె,  ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని ఇది ప్రూవ్ చేస్తుంది. నిద్రించడానికి సరైన సమయం వయస్సును బట్టి మారుతుంది. పిల్లలకు ఎక్కువ నిద్ర అవసరం, టీనేజర్లు అర్ధరాత్రి వరకు  మేల్కొని ఉంటారు, ఆలస్యంగా నిద్రపోతారు. పెద్దలకు పని,  విశ్రాంతి మధ్య సమతుల్యత అవసరం.  వృద్ధులు త్వరగా నిద్రపోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఏ వయసు వారికి ఎంత నిద్ర అవసరం? పిల్లలు (5–12 సంవత్సరాలు) ఉన్నవారికి  రాత్రి 7:30–9:00 మధ్య నిద్రపోవడం మంచిది. వీరికి 9–12 గంటలు నిద్ర అవసరం. పిల్లలు బాగా పెరగడానికి, చదువులో దృష్టి పెట్టడానికి,  భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవడానికి తగినంత నిద్ర అవసరం. త్వరగా,  క్రమం తప్పకుండా నిద్రపోవడం వారిని మంచి మానసిక స్థితిలో ఉంచడానికి, ఏకాగ్రత పెరగడానికి,  రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. కౌమారదశ (13–18 సంవత్సరాలు)లో ఉన్నవారు  రాత్రి 10:30–11:30 మధ్య తప్పనిసరిగా నిద్రపోవాలి. వీరికి  8–10 గంటలు నిద్ర తప్పనిసరిగా ఉండాలి. చాలామంది తల్లిదండ్రులు చదువు పేరుతో వీరిని నిద్రకు దూరం చేస్తుంటారు. ఇది చాలా తప్పు. టీనేజర్ల క్రమం తప్పకుండా నిద్రపోవడం వల్ల  మెదడు అభివృద్ధి, మానసిక స్థితి,  విద్యా పనితీరుకు సహాయపడుతుంది. నిద్రపోయే ముందు  ఫోన్ లేదా టీవీ వాడకాన్ని పరిమితం చేయాలి.రాత్రి పడుకునే ముందు మంచి పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోవాలి.  యువత,  మధ్య వయసు.. (18–64 సంవత్సరాలు)ల మధ్య ఉండేవారందరూ ఒకే నిద్ర సమయాన్ని అనుసరించాలి.  రాత్రి 10:00–11:00 మధ్య నిద్రపోవాలి.  ప్రతిరోజూ తప్పనిసరిగా 7–9 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఈ వయసు వారు శరీర సహజ లయ ప్రకారం నిద్రపోవాలి. ఈ సమయంలో బయట పనుల కారణంగా   అలసట, శరీరంలో శక్తి తగ్గడం,  మధుమేహం లేదా అధిక రక్తపోటు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రాత్రిపూట కెఫిన్,  భారీ భోజనం మానుకోవాలి.   క్రమం తప్పకుండా ఒక సమయంలో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. వృద్ధులు (65 ఏళ్లు పైబడినవారు) రాత్రి 9:00–10:00 గంటల మధ్య నిద్రపోవాలి. వీరికి కూడా తప్పకుండా  7–8 గంటలు నిద్ర ఉండాలి. వృద్ధులు త్వరగా మేల్కుంటూ ఉంటారు.   తక్కువ నిద్రపోతారు. త్వరగా నిద్రపోవడం గుండె ఆరోగ్యానికి, మెదడు పదునుగా ఉండటానికి,  మొత్తం ఆరోగ్యానికి మంచిది. నిద్రవేళకు ముందు కాస్త వాకింగ్, హెర్బల్ టీ లేదా ధ్యానం చేయడం వల్ల  నిద్ర  మెరుగుపడుతుంది. ఎన్ని గంటలకు నిద్రపోతారు అనేదే కాదు.. ఎన్ని గంటలు నిద్రపోతారనేది కూడా ముఖ్యం. వయస్సు ప్రకారం సరైన సమయంలో నిద్రపోవడం మానసిక స్థితి,  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సరైన నిద్ర హార్మోన్లు, రోగనిరోధక శక్తి, జీవక్రియను సమతుల్యంగా ఉంచుతుంది.  మధుమేహం,  డిప్రెషన్  వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.                                  *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
బంగాళదుంప చాలా మందికి ఇష్టమైన దుంప కూరగాయ.  దీంతో ఫ్రై చేసినా,  మసాలా కూర వండినా, చిప్స్ చేసినా లేదా వేరే స్నాక్స్ ఏమైనా చేసినా చాలా ఇష్టంగా తింటారు. అయితే చాలా ఇళ్ళలో కనిపించే సాధారణ సంఘటన ఏంటంటే.. బంగాళదుంపలను ఉల్లిపాయలతో కలిపి ఒక బుట్టలో నిల్వ చేయడం. ఇలా బంగాళదుంపలను ఉల్లిపాయలతో కలిపి నిల్వ చేయడం ఆరోగ్యానికి ఎంత వరకు మంచిది? అనే విషయం చాలా మందికి తెలియదు.  కేవలం నిల్వ చేయడం గురించే కదా అనే అనుమానం చాలా మందికి రావచ్చు.  దీని గురించి కాస్త వివరంగా తెలుసుకుంటే.. బంగాళదుంపలు,  ఉల్లిపాయలు ఒకే బుట్టలో లేదా కంటైనర్ లో నిల్వ చేయడం గురించి చాలా షాకింగ్ నిజాలు వెలువడ్డాయి.  ముఖ్యంగా బంగాళదుంపలలో పెద్ద మొత్తంలో సెలీనిన్,  అల్లెన్ సల్పైడ్ లు ఉంటాయి.  ఇక ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఉల్లిపాయలను, బంగాళదుంపలను కలిపి ఉంచడం వల్ల రెండింటినలో ఉండే రసాయనాల చర్య వల్ల బంగాళదుంపలు మొలకెత్తుతాయి. మొలకెత్తిన బంగాళదుంపలలో సోలనిన్, చాకోనిన్,   క్లోరోఫిల్ ఏర్పడతాయి. ఈ రసాయనాలు ఉన్న బంగాళదుంపలు తింటే అవి శరీరంలో విషాన్ని కలిగిస్తాయి.  ఇది ప్రాణాంతకం అయ్యే అవకాశం కూడా ఉంటుందని ఆహార నిపుణులు అంటున్నారు.  ముఖ్యంగా దీని ప్రభావం ఎక్కువగా పిల్లలపై ఉంటుందట. పై కారణంగా  ఉల్లిపాయలు, బంగాళదుంపలను ఒకే కంటైనర్ లో నిల్వ చేస్తే అది కాస్తా ఫుడ్ పాయిజన్ కు కారణమయ్యే అవకాశం ఉంటుంది.  అందుకే మార్కెట్ నుండి ఉల్లిపాయలు,  బంగాళదుంపలు తెచ్చినా.. వాటిని విడివిడిగా నిల్వచేయాలి.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...