LATEST NEWS
  అస‌లే కాంగ్రెస్ ఆపై మంత్రిప‌ద‌వుల‌కు ఆశావ‌హులు చాలా మందే ఉంటారు. ఆ మాట‌కొస్తే అక్క‌డ ముఖ్యమంత్రి ప‌ద‌వి కోసం కూడా పోటీ పెద్ద ఎత్తునే ఉంటుంది. అలాంటిది మంత్రి ప‌దవిపై మాత్రం కాంపిటిష‌న్ ఉండ‌దా?  మొద‌టి లొల్లి మైనార్టీ  నాయ‌కుల  నుంచి  మొద‌లైందట‌. అజారుద్దీనే మైనార్టీ నేత  అయితే మ‌రి మేమంతా  ఎవ‌రు? అని నిల‌దీస్తున్నారు ఫిరోజ్  ఖాన్, సీనియ‌ర్ లీడ‌ర్  ష‌బ్బీర్ అలీ.  వీరిద్ద‌రూ ఫ‌క్తు రాజ‌కీయ నాయ‌కులు. అజారుద్దీన్ లా స్పోర్ట్స్ కోటాలో ప‌ద‌వి కొట్టేసిన  బాప‌తు కాదు. దీంతో మాకెందుకివ్వ‌లేదు మంత్రి ప‌ద‌వి? అన్న‌ది వీరి ప్ర‌శ్న‌. అజారుద్దీన్ కన్నా మాకేం  త‌క్కువ‌. అజార్ క‌న్నా తెలుగు రాదు. అదే  మాకు అలాక్కాదు క‌దా.. తెలుగులోనూ మాట్లాడి క‌వ‌ర్ చేస్తాం.. అంటారు వీరు. అజారుద్దీన్ అంటే గ‌తంలో జూబ్లీహిల్స్ రేసు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాబ‌ట్టి.. ఆయ‌న్ని మంత్రిని చేస్తే జూబ్లీహిల్స్ లోని మైనార్టీ ఓటు బ్యాంకును విశేషంగా ఆక‌ట్టుకోవ‌చ్చ‌న్న‌ది అధిష్టానం ఆలోచ‌న. అయితే  నేను ఇక్క‌డి నుంచి పోటీ  చేయాల్సింది. నేను త్యాగం  చేయ‌డం వ‌ల్లే న‌వీన్‌కి  వ‌చ్చిందా టికెట్ కాబ‌ట్టి నాకు క‌దా  ప‌ద‌వి ఇవ్వాల్సింద‌ని అంటారు అంజ‌న్ కుమార్ యాద‌వ్. ప‌దేళ్లుగా బీఆర్ఎస్ తో కొట్లాడిన నాకు మంత్రి ప‌దవి ఏదీ? అంటూ నిల‌దీస్తారు జీవ‌న్ రెడ్డి. ఇలా మంత్రి  ప‌ద‌వుల‌పై బీభ‌త్స‌మైన గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. అదృష్ట‌మో దుర‌దృష్ట‌మో.. ఇక్క‌డ గోపీనాథ్ మ‌ర‌ణించ‌డం. ఆ టికెట్ అజారుద్దీన్ ఆశించ‌డం. అటు పిమ్మ‌ట  దానికి న‌వీన్ యాద‌వ్ పోటీ రావ‌డం. అజారుద్దీన్ని ఎలాగైనా  స‌రే బుజ్జ‌గించాల్సిందే అన్న ప్ర‌శ్న త‌లెత్తిన‌ప‌పుడు మిగిలి ఉంచిన మూడు మంత్రి ప‌ద‌వుల్లో ఒక‌టి ఆయ‌న‌కు మైనార్టీ కోటా కింద ఇవ్వ‌డం జ‌రిగింది. అప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న‌రావు స్తానంలో హెచ్. సీ. ఏ అధ్య‌క్ష ప‌ద‌వికి  అజారుద్దీన్ని పంపాల‌నుకున్నారు.  కానీ, అందుకు ఆయ‌న స‌సేమిరా అన‌డంతో.. ఎమ్మెల్సీని చేసి ఆపై మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డానికి సిద్ధ ప‌డింది కాంగ్రెస్ అధిష్టానం. అలాగ‌ని ఈ ఎపిసోడ్ ఇక్క‌డితో ముగిసిపోలేదు. ఎమ్మెల్యేల‌కు నామినేటెడ్ పోస్టులు ఇవ్వ‌డంపైనా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ్. జ‌గ్గారెడ్డి, మ‌ధు  యాష్కి వంటి సీనియ‌ర్లు ఈ విష‌యంలో గుర్రుగా ఉన్నార‌ట‌. త‌మ‌ను అడ‌క్కుండా,  బుజ్జ‌గించ‌కుండా ఇలా ఎలా చేస్తార‌ని వారు అంటున్నారట‌. కొంద‌రైతే వీరెన్ని చేసినా  జూబ్లీహిల్స్ లో పార్టీ గెలుపు అంతంత మాత్ర‌మే అని ఓపెన్ కామెంట్లు చేస్తున్నార‌ట‌.
  జూబ్లీహిల్స్‌లో బిల్లారంగాలు ఆటోల్లో తిరుగుతున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి (కేటీఆర్, హరీష్ రావును ఉద్దేశించి) అన్నారు. శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండలో కార్నర్‌ మీటింగ్‌‌లో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. దివంగత నేత పేదల మనిషి పి.జనార్ధనరెడ్డి అకాల మరణంతో 2008  ఉప ఎన్నిక ఆయన ఫ్యామిలీని ఏకగ్రీవంగా ఇవ్వాలని నిర్ణయం జరిగింది. పీజేఆర్‌ కుటుంబానికి ఎన్నిక ఏకగ్రీవం చేయాలని ఆనాడు తెలుగు దేశం పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. కానీ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ ఆ ఉప ఎన్నికలో పోటీ అభ్యర్థిని నిలబెట్టారు.  ఒక దుష్ట సంప్రదాయానికి కేసీఆర్ ఆనాడు తెరలేపారని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. ఆస్తిలో వాటా అడుగుతుందని సొంత చెల్లి కవితనే ఇంటి నుంచి పార్టీ నుంచి తరిమివేసినోడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అలాంటోడు జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీతను గెలిపించాలని తిరుగుతున్నాడు. ఇదంతా చూస్తుంటే.. కన్నతల్లికి అన్నం పెట్టనోడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాడట’ అనే సామేత గుర్తొస్తుందని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు.  బోరబండకు పీజేఆర్ పేరు పెడతామని సీఎం అన్నారు. జూబ్లీహిల్స్‌లో గత పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదన్నారు.  ఇక్కడ ఎంతో మంది పేదలకు పి.జనార్ధనరెడ్డి ఆశ్రయం కల్పించారని గుర్తు చేశారు. పేదలకు పీజేఆర్ ఇళ్లు కట్టించారని ఆయన అన్నారు. బోరబండ చౌరస్తాకు పీజేఆర్ పేరుతో పాటు విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్‌ను అడ్డం పెట్టుకొని కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులు అక్రమంగా వేల కోట్లు సంపాదించుకున్నారని కవిత ఆరోపణలు చేస్తున్నది. దమ్ముంటే ముందు ఆ ఆరోపణలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. బోరుబండ అభివృద్ధి చెందాలంటే నవీన్ యాదవ్‌ను గెలిపించాలని అని రేవంత్ తెలిపారు.
  సీఎం రేవంత్‌రెడ్డి అబద్దాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతు కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచాక నియోజకవర్గంలో రూ.4 వేల కోట్ల అభివృద్ధి జరిగిందని సీఎం చెప్తున్నాడు. నిజంగా నాలుగు వేల కోట్ల అభివృద్ధి జరిగినట్లు నిరూపిస్తే ఆ క్షణమే నేను సనత్‌నగర్ ఎమ్మెల్యేకి  రాజీనామా చేస్తాని తలసాని సవాల్ విసిరారు.  సీఎం రేవంత్‌రెడ్డి భాష మార్చుకోవాలని ఆయనకు ధైర్యం ఉంటే ఒపీనియన్ పోల్‌కు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.  23 నెలల్లో రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ఎక్కడ తిరిగారో చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 44 వేల కోట్లు హైదరాబాద్ నగరంలో ఖర్చు పెట్టామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కేవలం రూ. 4,600 కోట్లు మాత్రమే ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు పెట్టిందని అన్నారు.  హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇళ్లు అయినా కట్టారా..? అని ప్రశ్నించారు. కేటీఆర్ హైదరాబాద్ తిరగలేదని అంటున్నారు.. ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో ఉన్నారా..? లేక వేరే దేశంలో ఉన్నారా..? అని తలసాని ప్రశ్నించారు.ఎన్టీఆర్‌కు మాగంటి గోపీనాథ్ వీరాభిమాని అని, ఎన్టీఆర్‌తో కలిసి మాగంటి గోపీనాథ్ తిరిగారని తలసాని అన్నారు.  
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో ఎప్పుడు ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా.. అన్ని పార్టీల దృష్టీ తెలుగుదేశం వైపే ఉంటుంది. విభజన తరువాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో క్రీయాశీల రాజకీయాలకు ఒకింత దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అందుకు ప్రధాన కారణం పార్టీకి రాష్ట్రంలో నాయకత్వం లేకపోవడమే.  తెలంగాణలో తెలుగుదేశం నాయకులంతా వేర్వేరు కారణాలతో తమ దారి తాము చూసుకున్నా.. పార్టీ క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా ఉండటంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఆ తెలుగుదేశం క్యాడర్ మద్దతు కోసం ఎన్నికల సమయంలో అర్రులు చాస్తుంటాయి. ఇసుమంతైనా భేషజానికి పోకుండా తెలుగుదేశం జెండా మోస్తుంటాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రస్, బీజేపీ సహా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ తెలుగుదేశం జెండా చేతబట్టి ప్రచారం చేయడాన్ని మనం చూశారు. ఇప్పుడు జూబ్లీహాల్స్ ఉప ఎన్నిక వేళ కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కూడా తెలుగుదేశం అండ కోసం అర్రులు చాస్తున్నాయి.  తెలుగుదేశం ప్రాపకం పొందేందుకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి  మాగంటి సునీత కొన్ని రోజుల కిందట తన ప్రచారంలో ఎన్టీఆర్ ను స్మరించు కున్నారు. తన భర్త, దివంగత మాగంటి గోపీనాథ్ కు ఎన్టీఆర్ పిత్రు సమానులని చెప్పుకున్నారు. అలాగే ఎన్టీఆర్ కూడా మాగంటిని పుత్ర వాత్సల్యంతో ఆదరించారని చెప్పుకొచ్చారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన రోడ్ షోలో హైదరాబాద్ నడిబొడ్డున అంటే మైత్రీవనం వద్ద ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపన ప్రస్తావన తెచ్చారు. ఆయన విగ్రహాన్ని మైత్రీవనంలో  ఏర్పాటు చేయించి తానే ఆవిష్కరిస్తానని చెప్పారు. ఇందుకు ప్రధాన కారణం  జూబ్లీ ఉప  ఎన్నికలో తెలుగుదేశం  పార్టీ క్యాడర్ ఎటుమెగ్గు చూపితే అటే విజయం వరిస్తుందన్న నమ్మకమే అని పరిశీలకులు అంటున్నారు. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే.. ఆ పార్టీ అధినాయత్వం ఎన్డీయేతో పొత్తు నేపథ్యలో బీజేపీకే మద్దతు ఇవ్వాలని క్యాడర్ కు ఇప్పటికే పిలుపునిచ్చింది. ఇలా ఏ విధంగా చూసుకున్నా.. తెలంగాణలో పార్టీలన్నీ తెలుగుదేశం భజన చేస్తున్నాయని చెప్పక తప్పదు. 
ఇలా అజారుద్దీన్ ని కేబినెట్ లో చేర్చుకుని..   అలా ఆయ‌న్ను త‌న ప్ర‌చార ర‌థంఎక్కించి.. జూబ్లీ హిల్స్ ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మ్యాజిక్ చేశారు. సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం (అక్టోబర్ 31)న నిర్వహించిన రోడ్ షో తో ఒక మ్యాజికల్ షో చేశారని చెప్పవచ్చు. ఒక వైపు అజారుద్దీన్ ను పక్కన పెట్టుకుని చేసిన రేవంత్ రెడ్డి రోడ్ షో నియోజకవర్గంలోని మైనారిటీలను ఆకర్షించింది. అదే సమయంలో  మ‌ధ్య మ‌ధ్య‌లో పిజేఆర్ కుమార్తె విజ‌యారెడ్డిని సైతం త‌న ప్ర‌చారంలో ఒక భాగం చేస్తూ  రేవంత్ రెడ్డి ఓటర్లను ఆకట్టుకున్నారని పరిశీలకులు అంటున్నారు. అక్కడితో ఆగకుండా నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న సెటిలర్స్ ను మెప్పించేలా..  ఎన్టీఆర్  విగ్ర‌హ‌ ప్రతిష్ఠాపన ప్ర‌స్తావ‌న చేసి.. దటీజ్ రేవంత్ అనిపించుకున్నారంటున్నారు.    టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్  అజారుద్దీన్ రేవంత్ కేబినెట్ లో మంత్రిగా చేరారు. శుక్రవారం (అక్టోబర్ 31) మధ్యాహ్నం ఆయన చేత రాజ్ భవన్ లో గవర్నర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.  ఆ వెంటనే సాయంత్రం అజారుద్దీన్ ను వెంటపెట్టుకుని రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లో  రోడ్ షోలో పాల్గొన్నారు    అజారుద్దీన్ ఇక్క‌డ ఒక సారి పోటీ చేసి ఓడిపోతే ఆయ‌న్ను ఎమ్మెల్సీ చేసి అటు పిమ్మ‌ట మంత్రిగానూ ప్ర‌మాణం  చేయించి.. మీ ముందుకు తెచ్చాన‌ని ఈ సందర్భంగా  రేవంత్ ప్రజలకు చెప్పారు. అజార్ కూడా న‌వీన్ యాద‌వ్ గెలుపున‌కు త‌న వంతు కృషి చేస్తాన‌న్నారు. ఇక పీజేఆర్ త‌న‌య‌ విజ‌యారెడ్డి సంగ‌తి స‌రే స‌రి. అప్ప‌ట్లో మాస్ లీడ‌ర్ పీ. జ‌నార్ధ‌న్ రెడ్డి చ‌నిపోయిన‌పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాజ‌కీయ వైరుధ్యాల‌ను ప‌క్క‌న పెట్టి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను ఏక‌గ్రీవం చేస్తానంటే.. ఇదే కేసీఆర్ పీజేఆర్ భార్యా పిల్ల‌ల్ని మూడు గంట‌ల పాటు నిల‌బెట్టి ఒట్టి  చేతుల‌తో పంపించేశార‌ని గుర్తు చేశారు. అందుకు సాక్ష్యం విజ‌యారెడ్డేన‌ని రేవంత్ ఆమెను పక్కన పెట్టుకుని మరీ చెప్పడం ద్వారా ప్రజల సెంటిమెంట్ ను టచ్ చేశారు.  ఎక్కే ఫ్లైటు దిగే బెంజికార్లే జీవితంగా  ఇన్నాళ్లు బ‌తికిన బిల్లా రంగాలు ప్ర‌స్తుతం ఆటోలో తిరుగుతూ.. మిమ్మ‌ల్ని మాయ చేయ‌డానికి వ‌స్తున్నార‌నీ.. సొంతింటి ఆడ‌బిడ్డ‌నే రోడ్డున  ప‌డేసిన వీరు.. మాగంటి సునీత కార్చే క‌న్నీళ్ల ద్వారా  గెల‌వాల‌ని  చూస్తున్నార‌నీ.. వీరి వేషాల‌ను చూసి మోస‌పోవ‌ద్ద‌ని జూబ్లీ ఓటర్లను రేవంత్ హెచ్చరించారు.   ఇక మైత్రీ వ‌నంలో అంద‌రికీ ఆరాధ్య దైవం ఎన్టీఆర్ కి విగ్ర‌హం  పెట్టించే బాధ్య‌త   న‌వీన్ కి అనిల్ కి అప్ప‌గించాన‌నీ.. తానే స్వ‌యంగా  వ‌చ్చి ఆ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తాన‌ని మాటిస్తూ... ఇటు సెటిల‌ర్లను సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.  అంటే ఇటు అజారుద్దీన్ ద్వారా మైనార్టీ ఓట్ల‌ను, ఆపై ఈ ప్రాంతంలో   మాస్ లీడ‌ర్ గా ఉన్న పీజేఆర్ అభిమాన‌గ‌ణాన్ని.. ఇక కృష్ణాన‌గ‌ర్ వంటి ప్రాంతాల్లో అధికంగా నివ‌సించే సెటిలర్లను  ఆక‌ట్టుకునేలా రేవంత్ రోడ్ షో సాగింది.  గ‌తంలో ఏ ముఖ్య‌మంత్రి కూడా  మీ మొహం చూసిన వారు కాద‌ని.. ఇదే నియోజ‌వ‌క‌ర్గం నుంచి మూడు సార్లు గెలిచిన గోపీనాథ్ ఒక్క‌టంటే ఒక్క సారి కూడా అసెంబ్లీలో ఈ సెగ్మెంట్ గురించి మాట్లాడింది లేద‌ని.. ఆపై ఆయ‌న ఈ ప‌ద‌హారునెల‌ల్లో ఈ నియోజక‌వ‌ర్గానికిది కావాలి అది కావాల‌ని త‌న ద‌గ్గ‌ర‌కు ఒక కాగితం కూడా తేలేద‌ని అన్నారు సీఎం రేవంత్.   అలాగ‌ని మాగంటి కుటుంబంపై త‌న‌కు ఎలాంటి వ్య‌తిరేక‌త లేద‌ని.. ఆ ఫ్యామిలీ ప‌ట్ల సానుభూతి అలాగే ఉంద‌ని.. అయితే.. గ‌త మూడు ప‌ర్యాయాల పాటు ఏమీ చేయ‌లేని వారు నాలుగోసారి గెలిపిస్తే మాత్రం ఏం చేయ‌గ‌ల‌ర‌నీ ప్ర‌శ్నించారు. గత రెండు నెల‌లుగా ఈ నియోజ‌క వ‌ర్గానికి తమ ప్ర‌భుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసింది కాబ‌ట్టి.. ఇక్క‌డ గ‌ల్లీ గ‌ల్లీ తెలిసిన  వ్య‌క్తి.. న‌వీన్ యాద‌వ్ ని గెలిపించి.. నాకు సిటీలో ఒక కుడి భుజాన్ని అందివ్వాల్సిందిగా కోరారు సీఎం రేవంత్. మ‌రి సీఎం రేవంత్ అభ్య‌ర్ధ‌న ఇక్క‌డి ఓట‌ర్లు మ‌న్నిస్తారా.. లేదా?  తెలియాలంటే న‌వంబ‌ర్ 14 వ‌ర‌కూ వేచి చూడాల్సిందే. 
ALSO ON TELUGUONE N E W S
  సూపర్ స్టార్ మహేష్ బాబు తన 29వ సినిమాని దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. కె.ఎల్.నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ కి 'SSMB29' అనేది వర్కింగ్ టైటిల్. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అభిమానులను ఆనందపరుస్తూ తాజాగా బిగ్ అప్డేట్ వచ్చింది.   'SSMB29' ఫస్ట్ రివీల్ నవంబర్ లో ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. నవంబర్ 15 సాయంత్రం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ లో టైటిల్ ని రివీల్ చేయడంతో పాటు, ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసే అవకాశముంది. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ ఈవెంట్ ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది.   Also Read: జ్యోతిలక్ష్మీ చివరి రోజులు ఎలా గడిచాయి?   సినిమాలకు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లు జరగడం కామన్. ఇలా ఫస్ట్ రివీల్ కోసం ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేయడం ఇదే మొదటిసారని చెప్పవచ్చు.   మహేష్-రాజమౌళి సినిమాకి రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల 'వారణాసి' టైటిల్ ప్రముఖంగా వినిపించింది. మరి ఈ మూవీ టైటిల్ ఏంటనేది త్వరలోనే తేలిపోనుంది.    
  సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ కి 'వారణాసి' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు 'వారణాసి' టైటిల్ తో తెలుగులో ఓ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకి ఓ స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ పని చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.   సనాతన ధర్మం గొప్పదనాన్ని తెలియజేస్తూ రామభక్త హనుమా క్రియేషన్స్ బ్యానర్‌‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘వారణాసి’. ‘రఫ్’ చిత్ర దర్శకుడు సుబ్బారెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే గ్రాండ్ లాంచ్ తో ఈ మూవీని ప్రారంభించబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు.    Also Read: ప్రశాంత్ వర్మ బ్యాడ్ టైం.. ఆగిపోయిన ప్రభాస్ ప్రాజెక్ట్..!    ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. సనాతన ధర్మం ఎంత గొప్పదో తెలియజేస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక స్టార్ హీరో నటిస్తుండగా, ఓ స్టార్ డైరెక్టర్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. దీంతో ఆ స్టార్ హీరో, డైరెక్టర్ ఎవరనే చర్చ జరుగుతోంది.     భారతదేశంలో అతి పవిత్ర ప్రదేశమైన వారణాసి పుణ్యక్షేత్రంలోనే షూటింగ్ మొత్తం జరుగుతందని దర్శకుడు సుబ్బారెడ్డి తెలియజేశారు. ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలతో త్వరలో మీ ముందుకు వస్తామని రామభక్త హనుమా క్రియేషన్స్ సంస్థ తెలియజేసింది.  
  దర్శకుడు ప్రశాంత్ వర్మకు వరుస షాక్ లు ఓ వైపు నిర్మాతల ఫిర్యాదులు మరోవైపు ప్రభాస్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు   పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ది రాజా సాబ్', 'ఫౌజీ' సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత స్పిరిట్, సలార్-2, కల్కి 2, బ్రహ్మ రాక్షస వంటి పలు ప్రాజెక్ట్ లు లైన్ లో ఉన్నాయి. అయితే వీటిలో 'బ్రహ్మ రాక్షస' ఆగిపోయినట్లు వార్తలొస్తున్నాయి.    హనుమాన్ తో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఇంతవరకు తన దర్శకత్వంలో మరో సినిమాని పట్టలెక్కించలేదు. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో తలపెట్టిన బ్రహ్మ రాక్షస ఆగిపోయింది. నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ప్రకటనకే పరిమితమైంది. హనుమాన్ కి సీక్వెల్ గా అనౌన్స్ చేసిన జై హనుమాన్ ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇక ఇప్పుడు ప్రభాస్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ కాకముందే ఎండ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. (Prasanth Varma)   ప్రభాస్ తో ఓ సినిమా చేసే అవకాశాన్ని ప్రశాంత్ వర్మ దక్కించుకున్నారు. ఇది రణవీర్ సింగ్ తో చేయాలనుకున్న బ్రహ్మ రాక్షస అనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు బ్రహ్మ రాక్షస ప్రాజెక్ట్ కి మరోసారి బ్రేకులు పడినట్లు న్యూస్ వినిపిస్తోంది.   Also Read: జ్యోతిలక్ష్మీ చివరి రోజులు ఎలా గడిచాయి?   ప్రస్తుతం ప్రశాంత్ వర్మ టైం అంతగా బాలేదు. ప్రశాంత్ వర్మ వల్ల తమకు నష్టం జరిగింది అంటూ హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. హనుమాన్ తర్వాత అధీర, మహాకాళి, జై హనుమాన్, బ్రహ్మరాక్షస సినిమాలు చేస్తానని రూ.10 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడని ఆరోపించారు. అలాగే, మరో పది కోట్లతో ఆక్టోపస్ అనే సినిమా రైట్స్ కొనిపించారని పేర్కొన్నారు. అడ్వాన్స్ తీసుకొని సినిమాలు చేయట్లేదని, తమకి జరిగిన నష్టానికి పరిహారంగా రూ.200 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు.   అయితే హనుమాన్ నిర్మాత ఆరోపణలను ప్రశాంత్ వర్మ ఖండించారు. తాను అడ్వాన్స్ లు తీసుకొని సినిమాలు చేయట్లేదన్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపాడు. నిజానికి హనుమాన్ లాభాల్లో తనకి వాటా ఇవ్వాల్సి ఉందని.. అది ఇవ్వకపోగా, ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.    మరోవైపు ప్రశాంత్ వర్మ కి అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతల్లో ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా డబ్బు తిరిగి చెల్లించమని ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలో ప్రభాస్ ప్రాజెక్ట్ కూడా ఆగిపోవడం ప్రశాంత్ వర్మ బిగ్ షాక్ అని చెప్పవచ్చు. మరి ఇందులో వాస్తవమెంతో తెలియాల్సి ఉంది.  
Baahubali The Epic released on 31st October with premieres on 30th October and early premieres in selected locations in USA. The movie makers have combined both the parts to make it one and re-release as part of tenth anniversary celebrations. The movie is now eyeing Thalapathy Vijay record for re-releases.  The movie has made a huge debut with Rs.9.5 crores Nett gross on Day 1 just in India. If the housefull shows are anything to go by, the movie is heading towards crossing highest ever re-release collections of Ghilli. Vijay's movie collected almost Rs.28 crores share like a new release blockbuster.  If Baahubali The Epic continues its run like this for the week, it could earn more than Rs.30 crores share at the box office, worldwide. In USA, the movie has collected US$425K on the first day and the weekend, being Halloween holidays, it might collect 1 Million in the weekend.  Baahubali remains to be the biggest blockbuster ever in Indian Cinema as it rules the hearts of Indian Cinema fans even after 10 years. Prabhas, Rana Daggubati, Nassar, Ramya Krishnan, Anushka Shetty, Sathyaraj and Tamannaah have eternalised this SS Rajamouli creation.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
- ‘మాస్‌ జాతర’కు మొదట అనుకున్న హీరో - ‘మాస్‌ జాతర’ గురించి ప్రేక్షకులు ఏమంటున్నారంటే..? - రవితేజ ఎనర్జీ ప్లస్ అయిందట   సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌ విచిత్రంగా సెట్‌ అవుతూ ఉంటాయి. ఒక హీరోతో అనుకున్న సినిమా కొన్ని కారణాల వల్ల మరో హీరో చేస్తారు. అందులో కొన్ని సూపర్‌హిట్‌ అవుతాయి, మరికొన్ని ఫ్లాప్‌ అవుతుంటాయి. ఏ హీరో ఏ క్యారెక్టర్‌ చెయ్యాలి అనేది ముందే డిజైన్‌ చేసి ఉంటుందనే నమ్మకం ఇండస్ట్రీలో బాగా ఉంది. ఒక హీరోతో అనుకున్న సినిమాను మరో హీరో చేసిన సందర్భాలు అనేకం వున్నాయి.   తాజాగా రవితేజ(Raviteja) హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన ‘మాస్‌ జాతర’(Mass Jathara) అక్టోబర్‌ 31న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకి డివైడ్‌ టాక్‌ ఉన్నప్పటికీ రవితేజ చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడని, విలన్‌గా నటించిన నవీన్‌ చంద్ర పెర్‌ఫార్మెన్స్‌ బాగుందనే టాక్‌ వినిపిస్తోంది. రవితేజ, శ్రీలీల(Sreeleela) పాటల్లో వేసిన స్టెప్స్‌ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయని తెలుస్తోంది.    గతంలో రవితేజ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కొన్ని సినిమాల్లో నటించారు. మరోసారి ‘మాస్‌ జాతర’తో అలాంటి క్యారెక్టర్‌లో కనిపించారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా కథలో కొత్తదనం లేకపోయినా రవితేజ ఎనర్జీ, శ్రీలీల గ్లామర్‌, యాక్షన్‌ సీక్వెన్సులను ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారు.    ఈ సినిమాను మొదట రవితేజతో చెయ్యాలని దర్శకుడు అనుకోలేదట. అంతకుముందు కొన్ని సినిమాల్లో పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో నటించిన గోపీచంద్‌(Gopichand)కి ఈ కథను చెప్పారు డైరెక్టర్‌ భాను. అప్పటికి గోపీచంద్‌ కొన్ని సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ఈ సినిమా చెయ్యలేకపోయారు. దాంతో ఈ కథ రవితేజ దగ్గరికి వచ్చింది. కథ విన్న రవితేజ తనకు యాప్ట్‌ అయ్యే సబ్జెక్ట్‌ అనుకున్నారు. తన నుంచి ప్రేక్షకులు కోరుకుంటున్న అంశాలన్నీ ఈ కథలో ఉన్నాయని రవితేజ ఫీల్‌ అయ్యారు. అందుకే వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. 
The curtains have closed on October and the spooky season reached its peak, bringing a wealth of major new movies and series to your favorite streaming platforms. From the terrifying origins of a famous clown to star-studded high-stakes thrillers, here is your essential guide to the biggest releases that dropped this week. Idli Kadai (Movie) Platform: Netflix Release Date: October 29, 2025 Genre: Tamil Drama, Feel-Good A successful international chef abandons his promising career and urban life to return to his village following the death of his father. He must use his modern culinary skills to revive the family's traditional, beloved idli shop while reconnecting with his roots. Jurassic World Rebirth (Movie) Platform: Peacock Release Date: October 30, 2025 Genre: Sci-Fi, Action, Adventure The newest high-stakes entry in the dinosaur franchise picks up years after the last film, as a pharmaceutical company commissions a team to retrieve vital DNA samples from the last living dinosaurs. The team must navigate the treacherous equatorial exclusion zones to face a new threat: the deadly mutant D-Rex. Kantara: Chapter 1 (Movie) Platform: Prime Video Release Date: October 31, 2025 Genre: Mythological Action, Drama, Folklore This powerful mythological prequel expands the universe of Kantara, detailing the origins of the sacred Bhuta Kola festival and the divine deity that has protected the forest and its people for centuries. It is a grand narrative exploring the divine oath, destiny, and the clash between man and nature. Lokah Chapter 1: Chandra (Movie) Platform: JioHotstar Release Date: October 31, 2025 Genre: Supernatural Fantasy, Action A new Indian superhero project that blends Kerala folklore with modern fantasy, centering on Chandra, a young woman with the mysterious and powerful abilities of an immortal Yakshi. She must confront a forgotten past and a rising evil, kickstarting a new cinematic universe. IT: Welcome To Derry (Season 1) Platform: HBO Max (U.S.) / JioHotstar (India) Release Date: October 26, 2025 Genre: Horror, Prequel, Mystery This chilling prequel series to the blockbuster It films delves into the dark and cursed history of the small town of Derry, Maine, decades before the Losers' Club. It explores the sinister origins of the evil entity known as Pennywise and how the cycle of terror first took root in the 1960s. Anne Rice's Talamasca: The Secret Order (Season 1) Platform: AMC / AMC+ Release Date: October 26, 2025 Genre: Supernatural, Mystery, Drama The newest addition to the Anne Rice Immortal Universe focuses on a secretive society of agents known as the Talamasca, tasked with tracking and containing all supernatural activity across the globe. The series begins as a law school student is suddenly thrust into this perilous world of immortal beings and ancient secrets. Ballad of a Small Player (Movie) Platform: Netflix Release Date: October 29, 2025 Genre: Drama, Thriller, Noir Colin Farrell stars in this atmospheric thriller as a British gambler fleeing a troubled past and mounting debt, seeking a temporary hideout in the neon-lit, high-stakes world of Macau's casinos. It is a moody character study exploring themes of ruin, chance, and a desperate search for redemption. Hedda (Movie) Platform: Prime Video Release Date: October 29, 2025 Genre: Drama, Classic Adaptation A provocative and modern cinematic reimagining of Henrik Ibsen's classic play Hedda Gabler, starring Tessa Thompson as the titular manipulative woman. Trapped in a loveless marriage, she finds her long-repressed desires and hidden tensions erupt into a dangerous spiral of betrayal. Hazbin Hotel (Season 2) Platform: Prime Video Release Date: October 29, 2025 Genre: Adult Animation, Musical, Fantasy The fan-favorite animated adult series returns to follow Charlie Morningstar, the Princess of Hell, in her unique mission to rehabilitate demons and curb the kingdom's overpopulation. Season 2 features more songs and action as Charlie fights to maintain the Hotel's goals against new challenges and an escalating conflict with Heaven. Down Cemetery Road (Season 1) Platform: Apple TV+ Release Date: October 29, 2025 Genre: Mystery, Thriller, Detective Drama Based on the novel by Mick Herron, this gripping series follows a woman who becomes convinced that a missing young girl is tied to a mysterious explosion in her quiet Oxford neighborhood. She enlists a private investigator to help unravel the secretive plot and find the truth. Aileen: Queen of the Serial Killers (Documentary) Platform: Netflix Release Date: October 31, 2025 Genre: True Crime, Documentary This deep-dive true-crime documentary revisits the complex life and brutal murders committed by Aileen Wuornos, one of history's most infamous female serial killers. The film uses never-before-seen death row interviews and powerful archival footage to give her a voice in her own tragic story. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  - రామ్‌చరణ్ బర్త్ డే గిఫ్ట్‌గా ‘పెద్ది’ - మోస్ట్ ఫెరోషియస్‌గా అచ్చియ్యమ్మ క్యారెక్టర్ - రెండు పోస్టర్స్‌లోనూ అదరగొట్టిన జాన్వీ   ఉప్పెన వంటి డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీతో అందరి దృష్టినీ ఆకర్షించిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా ‘పెద్ది’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.    జాన్వీ కపూర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించబోతోందనే విషయాన్ని ప్రకటించారు మేకర్స్‌. చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. అయినప్పటికీ సినిమాలో జాన్వీ లుక్‌ ఎలా ఉండబోతోందనే విషయాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు.    తాజాగా ఈ సినిమాలో జాన్వీ క్యారెక్టర్‌ పేరును, ఆమె లుక్‌ను రివీల్‌ చేశారు. సినిమాలో ఆమె అచ్చియ్యమ్మ అనే పాత్రలో నటిస్తోంది. జాన్వీ లుక్‌కి సంబంధించిన రెండు పోస్టర్స్‌ను నవంబర్‌ 1న విడుదల చేశారు. సోషల్‌ మీడియాలో విడుదలైన ఈ రెండు పోస్టర్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి.      Also Read: ‘అఖండ2’ లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇదే.. బాలయ్య ప్రభంజనం సృష్టించడం ఖాయం!   ‘పెద్ది’ చిత్రంలో జాన్వీ పోషిస్తున్న పాత్ర చాలా ఫెరోషియస్‌గా ఉంటుందని తెలుస్తోంది. పెద్ది లవర్‌గా, డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ విలేజ్‌ గర్ల్‌గా సినిమాలో కనిపిస్తుంది. ఓ పోస్టర్‌లో జీపు మీదెక్కి రెండు చేతులెత్తి కాన్వాస్‌ చేస్తున్న జాన్వీ, మరో పోస్టర్‌లో మైక్‌ పట్టుకొని పాట పాడటానికి రెడీగా ఉన్న సింగర్‌గా కనిపించింది.    Also Read: కెమెరా ముందుకి బాలకృష్ణ చిన్నకూతురు   స్పోర్ట్స్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. జాన్వీ కపూర్‌కి ఈ సినిమా డెఫినెట్‌ ఒక డిఫరెంట్‌ మూవీ అవుతుందని చెప్పొచ్చు. ఈ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశారు. 
బుల్లితెర మీద జబర్దస్త్ ఎంత పాపులర్ షోనో అందరికీ తెలుసు. అలాంటి షో ద్వారా గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది బాగా ఫేమస్ అయ్యారు. వీళ్ళు లేకుండా జబర్దస్త్ కానీ, ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ లేదు అన్నట్టుగా ఉంది. ఐతే వీళ్ళు రీసెంట్ గా స్విజ్జర్లాండ్ వెళ్లారు. ఆటో రాంప్రసాద్, హెపర్ ఆది ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. డాడీ మూవీ నుంచి "మందారం బుగ్గల్లోకి" అనే సాంగ్ పాడుతూ వీడియో చేసారు. ఆ వీడియోని రాంప్రసాద్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు. ఇక వీళ్ళను చూసిన నెటిజన్స్ కామెంట్స్ వరద కురిపించారు. అందులోనూ సుడిగాలి సుధీర్ గురించి కూడా అడుగుతున్నారు. "అన్నా మీరిద్దరే ఉన్నారు సుధీర్ అన్న ఎక్కడ...జబర్దస్త్ మీకు ఎంత మేలు చేసింది బ్రదర్, అన్నా ఎటు చూసినా సాల్ట్ ఏ ఉంది ఏంటన్నా ? సన్నీని తీసుకువెళ్లలేదా ? నాకేంటి సొంతం మూవీ సీన్స్ గుర్తొస్తున్నాయి ? ఛిల్ల్ అవ్వండి జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్, హాయ్ రాంప్రసాద్ గారు మీ వీడియో చాలా బాగుంది జబర్దస్త్ టీమ్ అందరికి హ్యాపీ డేస్ ...మీ పని బాగుంది అన్న, అన్న ఈడ సలి సరిపోలేదని ఆడికి పోయారా, సూపర్ ప్లేస్ అన్నయ్య, ఆది గారు మంచు బాగా గట్టిగా ఉంటదండి జాగ్రత్తండీ.." అంటూ కామెంట్స్ చేస్తున్నారు. https://www.instagram.com/reel/DQd6VZcEof_/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Sharwanand has been working hard for his next film, based on Dirt Bike races and the movie is titled as Biker. The actor has undergone huge physical transformation to look and play the part. The movie teaser has been released today and it looks good. The movie is introducing first-of-its-kind visuals to Telugu Screens.  Interestingly, makers of the film have decided to clash with Nandamuri Balakrishna's Akhanda 2. With Boyapati Srinu at the helm and looking at NBK's current hit streak, it seems suicidal to go against such a gigantic film. But the makers have confidently locked 6th December release date for their film.  Abhilash Reddy Kankara is directing Biker while UV Creations are producing it. Akhanda 2 is a sequel to established IP like Akhanda and it also involves Boyapati Srinu joining hands with NBK after a 4-year gap. So, the mass circuits would be alive and looking forward to Akhanda 2 in a big way.  On the other hand, Biker looks like more youth oriented film and highly urban related content. While it would be tough to predict this early, but looking at the markets they are catering, both films could surprise by reaching to their targeted audiences. Let's wait and see.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  - బాక్సాఫీస్‌ని టార్గెట్ చేసిన బాలకృష్ణ, బోయపాటి - మధ్యప్రదేశ్‌లో నాలుగు రోజులపాటు భారీ సాంగ్ - అఖండ2పై ఇండస్ట్రీలోనూ భారీ ఎక్స్‌పెక్టేషన్స్   నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్‌, అఖండ చిత్రాలు భారీ విజయాలు అందుకొని ఇద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ చిత్రాలుగా నిలిచాయి. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లోనే రెండో హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టేందుకు అఖండ2 తాండవం చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.    పవర్‌ఫుల్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన బాలకృష్ణ, బోయపాటి.. ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు అఖండ2 చిత్రంతో రాబోతున్నారు. డిసెంబర్‌ 5న పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ అయినా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది.   Also Read: పవన్‌కళ్యాణ్‌తో దిల్‌రాజు సినిమా.. అనఫీషియల్ న్యూస్‌లో అనేక మార్పులు   అఖండ2పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే మేకర్స్‌ ఈ చిత్రాన్ని వారి అంచనాలకు మించే స్థాయిలో నిర్మిస్తున్నారు. అఖండ చిత్రంతో కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించి దానికి సీక్వెల్‌గా వస్తున్న అఖండ2తో మరోసారి బాక్సాఫీస్‌ను టార్గెట్‌ చేశారు బాలయ్య, బోయపాటి.     Also Read: మాస్ జాతర మూవీ రివ్యూ   ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాటను ప్లాన్‌ చేశారు. ఈ పాటకు సంబంధించిన షూటింగ్‌ నవంబర్‌ 3 నుంచి నాలుగు రోజులపాటు మధ్యప్రదేశ్‌లో జరగనుంది.    బాలకృష్ణ పోషిస్తున్న అఘోర పాత్ర సినిమాలో ఎంతో కీలకంగా ఉండబోతోందని తెలుస్తోంది. దానికి సంబంధించిన కొన్ని సీన్స్‌ను మహా కుంభమేళాలో చిత్రీకరించారు. ఆ తర్వాత లెక్కకు మించిన డాన్సర్లతో ఒక భారీ సాంగ్‌ను షూట్‌ చేశారు. ఇప్పటివరకు విడుదలైన స్టిల్స్‌గానీ, గ్లింప్స్‌గానీ చూస్తే సినిమాలో ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే భారీ ఎలిమెంట్స్‌ ఉన్నట్టు అర్థమవుతుంది. ఒక విభిన్నమైన కథతో, డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనే కాదు, ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.    Also Read: బాహుబలి ది ఎపిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా!   ఈ సినిమాకి సంబంధించి ఇండస్ట్రీ ప్రముఖులు కూడా చర్చించుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని మరోసారి అఖండ2లో చూడబోతున్నామని యంగ్‌ హీరోలు సైతం ఎంతో ఉత్సాహంగా చెబుతున్నారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సెకండ్‌ హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టేందుకు వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో, కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డులు క్రియేట్‌ చేస్తుందో చూడాలి. 
మీరు కొత్త సంవత్సరంలో తీసుకున్న దృఢ నిర్ణయాలు సంగతి ఏమిటి? వాటి సంగతే మర్చిపోయారు కదూ! ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే తప్ప గుర్తుకురావడం లేదు కదూ! మీరే కాదు, ఇలాగే చాలా మంది 'కొత్త సంవత్సరంలో బరువు తగ్గాలనీ, వేకువజామున లేచి వ్యాయామం చేయాలనీ, లేదా నడకకు వెళ్ళాలనీ, ప్రతి రోజూ ఫలానా సమయంలో చదువుకోవాలనీ, తినడం తగ్గించాలనీ' తాము ఇలా మారాలనుకున్న విషయాలను జనవరి 1వ తేదీన సంప్రదాయంగా తీసుకునే నిర్ణయాలుగా మార్చి, ఈపాటికి మర్చిపోయే ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో నిర్ణయాలు తీసుకునేవారు ఇరవైనాలుగు గంటలు గడవకముందే తమ ప్రమాణాలను తీసి గట్టున పెడతారని ఒక సర్వేలో తేలింది. మనం తీసుకునే ఇలాంటి కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మనకు ప్రయోజనాలను చేకూరుస్తాయని తెలిసినా నిర్ణయాలకు కట్టుబడి ఉండడం లేదు. మొదటి రోజున్నంత దృఢ నిశ్చయం ఆ తరువాత లేకపోవడం, అవి కేవలం ఉద్వేగభరితమైన మాటలుగానే మిగిలిపోవడం చాలామందికి నిత్యం అనుభవమే. సంకల్పబలం, క్రమశిక్షణ మాత్రమే అంతర్గత శక్తిని మేల్కొలిపి, బలహీనతల్ని జయించేలా చేయగలవు. జీవితంలో ఏదైనా మార్పు తీసుకురావాలంటే పై రెండూ సహకరించకుండా ఏదీ సాధ్యం కాదు. సంకల్పబలం : సంకల్పబలం కలిగినవాళ్ళు మానసిక బలహీనతలకు దూరంగా ఉంటారు. సోమరితనాన్నీ, వాయిదా మనస్తత్వాన్నీ ఆమడదూరంలో ఉంచుతారు. జీవితంలో తమదంటూ ప్రత్యేకశైలితో ఉంటూ విజయం వైపు పయనిస్తారు. అనవసరమైన, పనికిరాని అలవాట్లకు బానిసలు కారు. వారిలోని అంతర్గత శక్తి వారిని ఉద్వేగాలకు గురి కాకుండా మార్పునకు వ్యతిరేకధోరణిని వ్యక్తం చేయనీయ కుండా వారిని మానసికంగా బలవంతులుగా తయారుచేస్తుంది.  క్రమశిక్షణ : క్రమశిక్షణ అనేది సంకల్పబలంతో కలసి పనిచేసే మానసిక శక్తి. అనుకున్నవి సాధించే ప్రయత్నంలో భాగంగా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే మానసిక, శారీరక, ఆధ్యాత్మిక శక్తినిచ్చేదే క్రమశిక్షణ. ముఖ్యంగా క్షణికసుఖాలను దూరంగా ఉంచి ఉత్తమ నిర్ణయాలను తీసుకునే శక్తిని కూడా ఇస్తుంది. ఉదాహరణకు క్రమశిక్షణ కలిగిన విద్యార్థి సంకల్పబలం తోడైతే గంటసేపు టీవీ చూసే కన్నా చదువు మీదే పెట్టే సమయం వల్ల ప్రయోజనం కలుగుతుందనీ, పొద్దున్న ఇంకా నిద్రపోవడం కన్నా వాకింగ్ చేయడం, యోగాభ్యాసం చేయడం ఉత్తమమనీ తెలుసుకుంటాడు. ప్రయోజనాలు: సంకల్పబలం, క్రమశిక్షణ తోడైతే మనిషి తన ప్రవర్తనలను, చర్యలను, ఉద్వేగాలను అదుపులో ఉంచుకునే చైతన్యస్థితిలో ఉంటాడు. అవి లేనివారు వాటికి బానిసలవుతారు. మీ విషయంలోనే ఆలోచించండి. మీరు కచ్చితంగా ఈ సారి చేయాలని నిర్ణయించుకున్న పనులు ఎన్ని వాయిదా వేసుకున్నారు? ఒక పని మొదలు పెట్టి తరువాత వదిలేసిన అనుభవాలున్నాయా? పై బలహీనతల నుంచి బయట పడి, అనుకున్న పని అనుకున్న సమయంలోనే పూర్తిచేసినప్పుడు కలిగే విజయగర్వం, మానసిక తృప్తి, తత్సబంధ ఫలితాలు అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇలా భావాల్ని అదుపులో ఉంచుకుని క్రమశిక్షణతో జీవించడమంటే జీవితాన్ని నిస్సారంగానో, నిస్తేజంగానో గడిపినట్లు అనుకుంటారు కొంతమంది. నిజానికి ఇలా జీవించడమే, అనవసర ఆలోచనలను దూరం చేసి ఉత్సాహంగా ఉండటమంటే...                                   ◆నిశ్శబ్ద.
సాధారణంగా చాలామంది ఈకాలంలో ఆన్లైన్ షాపింగ్ విషయంలో ఎప్పుడూ ముందుంటారు. ఆన్లైన్ షాపింగ్ డెలివరీ సేవలు పల్లెపల్లెకు విస్తరించడంతో పట్టణాల నుండి మాత్రమే కాకుండా పల్లెల నుండి షాపింగ్ చేసేవారే ఎక్కువయ్యరు. ఈ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ లు ఇచ్చే ఆఫర్ లు, కొన్ని ముఖ్యమైన రోజుల్లో ఇచ్చే డిస్కౌంట్ లు, ఓ నిర్ణీత ధరకు షాపింగ్ చేయడం వల్ల ఫ్రీ డెలివరీ ఇవ్వడం వంటి కారణాల వల్ల వీటిలో సందడి బాగానే ఉంటుంది.  టౌన్స్ లో సూపర్ మార్కెట్లు, డీ మార్ట్ లు, రిలయన్స్ మార్ట్ మొదలైనవి ఉండటం వల్ల కొన్ని అవసరమైనవి బయటకెళ్లి తెచ్చుకుంటూ ఉంటారు. కానీ పల్లెల్లో నివసించేవాళ్లకు సీన్ రివర్స్ లో ఉంటుంది. లోకల్ వస్తువుల లిస్ట్ చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పటి ఇంటి అవసరాలకు ఉపయోగపడే వస్తువుల నుండి, ఫుడ్ ఐటమ్స్ వరకు లోకల్ లో దొరకడం కష్టమే. ఇలాంటి వాటిని పాయింట్ చేసుకుని ఆన్లైన్ అమ్మకాల జోరు పెరిగింది. దుస్తులు, కిచెన్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, చెప్పులు లాంటివి అన్ని ఆన్లైన్ లో దొరికేస్తున్నాయి. అయితే ఈ ఆన్లైన్ షాపింగ్ మాయలో పడి సాధారణం కంటే ఎక్కువ ఖర్చులు చేసేస్తున్నారు అందరూ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంతకు చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటి?? ఆన్లైన్ షాపింగ్ ను  ఎలా చేయడం వల్ల మంచిది? ఆఫర్స్ చూసి ఎగబడద్దు! చాలామంది ఆఫర్స్ చూశారంటే చాలా తొందరపడతారు. స్టాక్ అయిపోతే కొంప కొల్లేరు అయిపోతుందేమో అన్నంత ఫీలవుతారు. అందుకే తొందరగా కార్ట్ లో వేయడం, వెంటనే ఆర్డర్ పెట్టేయడం చేస్తారు. పూర్తి డెలివరీ అయిన తరువాత వచ్చిన ఐటమ్స్ చూసి ఏడుపెత్తుకుంటారు. కొంతమంది ఏమవుతుందిలే రిటర్న్ చేసేయచ్చు అనే తెలివి ఉపయోగిస్తారు అయితే అక్కడే పప్పులో కాలువేస్తున్నారు. కొన్ని ఐటమ్స్ కు రిటర్న్ పాలసీ ఉండదు. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. టచ్ చేయద్దు! చాలామంది డిస్కౌంట్ చూశారంటే డమాల్ అయిపోతారు. అబ్బాబ్బా ఎంత ఖరీదైన వస్తువు ఎంత తక్కువ ధరకు వస్తుంది అని తెగ ఖుషీ అయిపోతారు. ఆ వస్తువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు చాలా తక్కువ ధరకు ఇస్తున్నాడంటే అందులో ఉన్న ఇన్నర్ పార్ట్శ్ నకిలివి కావచ్చు. ఇలాంటి ఫ్రాడ్ లకు ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ బాధ్యత వహించదు. కాబట్టి అవగాహన రిటర్నబుల్  పాలసీ ఉంటే తప్ప ఎలక్ట్రానిక్ పరికరాలు కొనద్దు. అనవసరంగా కొనద్దు! కొందరికి ఆఫర్లు, డిస్కౌంట్ చూసి అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు కొనాలనిపిస్తుంది. అలా కొనడం వల్ల ఆ వస్తువును ఎప్పుడు వాడతారో ఆ దేవుడికే తెలియాలి. చాలామంది ఇళ్లలో ఇలాంటి స్టఫ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటి కోసం పెట్టె ఖర్చుతో కొన్ని ఇంటి అవసరాలు తీరవచ్చు. కాబట్టి మధ్యతరగతి, దిగువ తరగతి వారు ఇలాంటి ఆఫర్ల మాయలో పడి డబ్బు వేస్ట్ చేసుకోకండి. స్పెషల్ డేస్! పండుగలకు ముందు, ఆయా షాపింగ్ వారి యనివర్సరీ రోజుల్లో మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్లు పడుతుంటాయి. అలాంటి సమయాల్లో కావలసిన వస్తువులను రిటర్న్ పాలసీ చూసి కొనుగోలు చేయవచ్చు. వస్తువు బాగుంటే ఉంచుకుంటాం. లేకపోతే రిటర్న్ పెట్టేయచ్చు.  కొందరు అనుకుంటారు. ఇంత తక్కువ ధరకు ఎలా ఇస్తారు అని. ఎక్కువగా అమ్ముడుపోతుంటే వాటిని తయారుచేసే వారికి తయారీ సరుకు కొనుగోలుకు కూడా ధర తక్కువగా పడుతుంది. కిలో మామిడిపళ్ళు కొనేవాడు ఏకంగా బుట్ట పళ్ళు కొంటె వాడికి ఒక్కొక్క పండు తక్కువ ధరకు వస్తుంది. అదే విధంగా ఈ ఆన్లైన్ మార్కెట్లలో కూడా వస్తువుల ఉత్పత్తుల విషయంలో జరుగుతుంది. కాబట్టే తక్కువ ధరకు అమ్మకానికి పెడతారు. ఇలాటి ఆఫర్ల సమయంలో మరీ అంత నాణ్యమైనవి కాకపోయినా పెడుతున్న ఖర్చుకు సాటిసిఫై అయ్యేలా ఉండే వస్తువులను పొందడం మాత్రం తప్పనిసరి. ఏది ఏమైనా ఆన్లైన్ షాపింగ్ విషయంలో మరీ అంత దూకుడుగా ఉండొద్దు.                                 ◆ వెంకటేష్ పువ్వాడ.
ఆచార్య చాణక్యుడు తన జ్ఞానం, బోధనలు, నైతికతకు నేటికీ ప్రసిద్ధి చెందాడు. మన జీవితంలో చాణక్యుడి సూత్రాలను పాటించడం ద్వారా మనం విజయవంతమైన జీవితాన్ని పొందవచ్చు. డబ్బు, ఆరోగ్యం, వ్యాపారం, వైవాహిక జీవితం మొదలైన అనేక అంశాలపై చాణక్యుడు తన నీతిలో చాలా ఆలోచనలను వివరించాడు. ఆయన సూత్రాలకు నేటికీ ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి తన జినాలోని కొన్ని ఆలోచనలను ఇతరులతో పంచుకోకూడదని చెప్పాడు. ఈ విషయాలు ఎల్లప్పుడూ దాచుకోవాలి.  ఎందుకంటే ఇది మనకు హాని కలిగిస్తుంది. కాబట్టి ఇతరుల నుండి ఎప్పుడూ దాచవలసిన ఆలోచనలు ఏమిటో తెలుసుకుందాం. మీ వయస్సు గురించి: ఆచార్య చాణక్య తన చాణక్య నీతిలో ఒక వ్యక్తి తన వయస్సు గురించి ఎవరికీ చెప్పకూడదని.. అతని వయస్సును ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచాలని చెప్పాడు. ఎందుకంటే మీ శత్రువులు దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు. బహుమతిని రహస్యంగా ఉంచండి: ఆచార్య చాణక్యుడు ప్రకారం, గురువు ఏదైనా ప్రత్యేక మంత్రాన్ని లేదా జ్ఞానాన్ని ఒక వ్యక్తికి అప్పగిస్తే, అతను దానిని మరెవరికీ చెప్పకూడదు. దానధర్మం చేయడం పుణ్య కార్యంగా పరిగణించబడుతున్నప్పటికీ, ఇతరుల ముందు దానధర్మం చెప్పకూడదు.  మీరు మతపరమైన కార్యకలాపాల కోసం ఇచ్చిన విరాళాల గురించి ఎవరితోనూ పంచుకోకూడదు. ఎందుకంటే మీరు దీని నుండి ఎటువంటి పుణ్యాన్ని పొందలేరు. వైవాహిక జీవితం గురించి: వైవాహిక జీవితం అనేది భార్యాభర్తల మధ్య ప్రేమ, సంరక్షణ నుండి కలహాల వరకు అనేక అంశాలను కలిగి ఉంటుంది. చాలా విషయాలు  రహస్యంగా ఉంటాయి, అటువంటి పరిస్థితిలో, మీరు మీ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలను మూడవ వ్యక్తితో పంచుకుంటే, మీ ఇద్దరికీ నష్టం జరగవచ్చు. మీ వైవాహిక జీవితం గురించి చాలా మంది ఆడుకోవచ్చు. సంపద గురించి: ఆచార్య చాణక్యుడు ప్రకారం, తన సంపద, సంపాదన గురించి ఎవరికీ చెప్పకూడదు. మీరు ఎల్లప్పుడూ మీ ఆదాయాలను గోప్యంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రజలు దానితో మిమ్మల్ని బాధపెడతారు. పై ఆచార్య చాణక్యుడి ఆలోచనలను మనం ఎప్పుడూ రహస్యంగా ఉంచాలి. లేకపోతే, అది మీకు మరిన్ని సమస్యలకు దారితీయవచ్చు. ఇది మిమ్మల్ని కోపం..అసంతృప్తికి గురి చేస్తుందని గుర్తుంచుకోండి.  
తమలపాకుకు మన సంప్రదాయంలో, సంస్కృతిలో,  ఆహారంలో ఒక విశిష్టమైన స్థానం ఉంది. సాధారణంగా పూజలలో తమలపాకు అగ్రస్థానంలో ఉంటుంది. ఆ తరువాత పాన్, తాంబూలంలో వాడతారు. కానీ తమలపాకు  ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో సరైన పద్ధతిలో తీసుకుంటే ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. చలికాలంలో తమలపాకు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..  తమలపాకు చలికాలంలో తినవచ్చా? చలికాలంలో తమలపాకు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, ఎందుకంటే ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచే స్వభావం కలిగి ఉంటుంది. . చలితో వచ్చే కఫం, దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఎక్కువగా తినకూడదు. రోజుకు ఒక ఆకుకన్నా ఎక్కువ తీసుకుంటే దాని వేడి శక్తి వల్ల కడుపు మండడం, నోరు ఎండిపోవడం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  ఏ సమయంలో తినాలి? తమలపాకు తీసుకునే సమయం కూడా చాలా ముఖ్యం. ఉదయం భోజనం తరువాత లేదా సాయంత్రం భోజనం తరువాత..  ఈ రెండు సమయాల్లో ఏదైనా ఒకసారి తినడం ఉత్తమం. ఎందుకంటే భోజనం తర్వాత జీర్ణక్రియను సులభం చేస్తుంది. తిన్న వెంటనే కాదు  భోజనం తర్వాత 10–15 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి. ఎలా తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే.. తమలపాకును తినే పద్ధతిని బట్టి దాని ప్రయోజనాలు ఉంటాయి. సాధారణ పద్ధతి.. ఒక తాజా తమలపాకు తీసుకుని, దానిపై చిన్నమొత్తం ఎలకులు పొడి లేదా సొంపు వేసి మెల్లగా నమిలాలి. ఇది జీర్ణక్రియకు సహాయం చేస్తుంది,  నోరు తాజా వాసన ఇస్తుంది. దగ్గు లేదా చలి ఉన్నప్పుడు: ఒక తమలపాకును తేలికగా మంట మీద వేడి చేసి దానిపై కొంచెం తేనె రాసి తినండి. ఇది కఫం తగ్గిస్తుంది, గొంతు నొప్పి తగ్గిస్తుంది. జీర్ణక్రియ కోసం: తమలపాకు మీద కొంచెం చింతపండు, ఉప్పు వేసి నమిలితే, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తమలపాకు ఆరోగ్య ప్రయోజనాలు భోజనం తర్వాత తీసుకుంటే గ్యాస్, బరువుగా ఉండటం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తేనెతో కలిపి తింటే గొంతు సమస్యలు తగ్గుతాయి.కఫం, దగ్గు నియంత్రణ అవుతుంది.  నోటి దుర్వాసన తగ్గిస్తుంది ఇది సహజమైన మౌత్ ఫ్రెషనర్ గా పని చేస్తుంది. చలికాలంలో వేడి శక్తి ఇస్తుంది.  శరీరానికి తాపాన్ని అందిస్తుంది. తమలపాకులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇమ్యునిటీ పెంచుతుంది.  చిన్న రక్తనాళాలను శుభ్రం చేస్తుంది. తద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది   తినటంతో పాటు తమలపాకు నూనెతో మసాజ్ చేస్తే   ఉపశమనం లభిస్తుంది.  జాగ్రత్తలు.. ఎక్కువగా తింటే కడుపు మండడం లేదా నోరు ఎండిపోవడం జరుగుతుంది.  చలికాలంలో రోజుకు ఒక ఆకుకంటే ఎక్కువ కాదు. సున్నం  లేదా సుపారితో తినడం మాత్రం వద్దు.. అవి ఆరోగ్యానికి హానికరం. గర్భిణీ స్త్రీలు లేదా గుండె, రక్తపోటు సమస్యలున్నవారు తీసుకునే ముందు వైద్యుని సలహా తీసుకోవాలి.                     *రూపశ్రీ.
  మనం ఏమి చేసినా అది మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మన ఆహారపు అలవాట్ల నుండి మన జీవనశైలి వరకు..  ఉదయం నిద్రలేచిన తర్వాత మనం చేసే ప్రతి పనీ మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. మనం మంచి అలవాట్లను అలవర్చుకుంటే, శరీరం,  మనస్సు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా ఉదయం పూట  పాటించే అలవాట్లు బరువు మీద చాలా ప్రభావం చూపిస్తాయి. కొంతమంది బరువు తగ్గడానికి ట్రై చేస్తుంటారు.  బరువు తగ్గాలనుకుంటే ఉదయం నిద్రలేచిన తర్వాత కొన్ని అలవాట్లను అలవర్చుకోవడం వల్ల అనుకున్నది సాధించగలుగుతారు.  అలవాట్లలో చిన్న మార్పులే మంచి  ఫలితాలు ఇస్తాయి.  త్వరగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. బరువు తగ్గడానికి సులభంగా అలవాటు చేసుకోగల  అలవాట్లు ఏంటంటే.. ఉదయం నిద్రలేచని తర్వాత గోరువెచ్చని నీరు త్రాగాలి. ఇది  మరింత ప్రభావవంతంగా పని చేయడానికి, నిమ్మరసం జోడించవచ్చు. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. కాబట్టి, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవచ్చు. క్రమం తప్పకుండా వేగంగా వాకింగ్ చేయాలి. నడక ద్వారా బరువును  తగ్గించుకోవచ్చు. అయితే క్రమశిక్షణ చాలా అవసరం. ఏదో చెస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్టు కాకుండా జాగ్రత్త పడాలి.  నడకను మరింత ప్రభావవంతంగా చేయడానికి, నడక వేగాన్ని గంటకు 6 కిలోమీటర్లుగా ఉండేలా చూసుకోవాలి. ఉదయం అల్పాహారం ప్రభావవంతంగా,  సులభంగా జీర్ణమయ్యేలా ఉండాలి. అల్పాహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. అల్పాహారం కోసం ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. చక్కెర వీలైనంత వరకు మానేయడం మంచిది. బరువు పెరగడానికి అతిపెద్ద కారణమైన జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఉదయం ఎండలో కొంత సమయం గడపాలి.  లేదా 10-15 నిమిషాలు బయట కూర్చోవాలి.. ఉదయం సూర్యకిరణాల నుండి లభించే విటమిన్ డి ఎముకలకు చాలా బలంగా ఉంచుతుంది. రోజంతా కనీసం నాలుగు లీటర్ల నీరు త్రాగాలి. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటానికి నిరంతరం నీరు త్రాగుతూ ఉండాలి. ఉదయాన్నే నిద్రలేవాలి.  ఇది చెప్పడం సులభం, చేయడం కష్టంగా అనిపిస్తుంది. కానీ ఒకసారి ఉదయాన్నే నిద్రలేవడం అలవాటు చేసుకుంటే ఇక వెనక్కి తిరిగి చూడరు. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల  తగినంత సమయం లభిస్తుంది.  ఈ సమయంలో శ్రద్దగా అన్ని పనులు చేయవచ్చు. ఇది మీ రోజంతా తాజాగా,  సంతోషంగా గడిచిపోయేలా చేస్తుంది. ఈ సమయంలో జాగింగ్ లేదా రన్నింగ్  కోసం సమయం కేటాయించవచ్చు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. హాయిగా నిద్రపోవాలి.  7 నుండి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకవాలి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలి. నిద్రను పూర్తిగా జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత, ఎందుకంటే సమయానికి నిద్రపోకపోవడం వల్ల ఉదయం త్వరగా లేవలేము. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం , తక్కువ నిద్రపోవడం అస్సలు  నిద్రపోకపోవడం వల్ల మానసిక ఒత్తిడి కూడా వస్తుంది. ఇది కూడా బరువు పెరగడానికి దారితీస్తుంది.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఖర్జూరాలు డ్రై ఫ్రూట్స్ లో ఒక  భాగం. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి.  ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాస సమయంలో  ఖర్జూరం తినడం తోనే ఆ రోజు ఉపవాసాన్ని విరమిస్తారు. పోషకాలు పుష్కలంగా ఉండే ఖర్జూరాలు ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు చేకూరుస్తాయి.  ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన 2 ఖర్జూరాలు తింటూ ఉంటే కలిగే మ్యాజిక్ ఫలితాలేంటో తెలుసుకుంటే తప్పకుండా ప్రతిరోజూ ఖర్జూరాలు తినడం మొదలుపెడతారు.. ఫైబర్.. నానబెట్టిన ఖర్జూరంలో అధికమొత్తంలో ఫైబర్ ఉంటుంది.  ఇది జీర్ణవ్యవస్థను బలంగా మారుస్తుంది.  జీవక్రియను మెరుగుపరుస్తుంది.  మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది.  పేగు  ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎనర్జీ.. నానబెట్టిన ఖర్జూరాలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల శరీరానికి గొప్ప శక్తి అందుతుంది.  ఇది రోజును ఉత్సాహంగా ప్రారంభించేందుకు తోడ్పడుతుంది. రోజంతా చురుగ్గా ఉండాల్సి న వ్యక్తులు నానబెట్టిన ఖర్జూరం తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. స్కిన్.. చర్మం ఆరోగ్యం మీద దృష్టి ఉన్నవారు నానబెట్టిన ఖర్జూరం తినడం చాలా అవసరం.  ఎందుకంటే నానబెట్టిన ఖర్జూరం చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.  ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె.. ఖర్జూరంలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.   ఇవి రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.  అధిక రక్తపోటు ఉన్నవారు రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తింటే చాలా మంచిది. ఎముకలు.. ఖర్జూరంలో ఐరన్, కాల్షియం,  విటమిన్లు మంచి మొత్తంలో ఉంటాయి.  ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి.  ఎముకలు బలహీనంగా ఉన్నవారు ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తినడం చాలా మంచిది. మధుమేహం.. ఖర్జూరం తీపి ఎక్కువగా ఉన్నా నానబెట్టిన తరువాత వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఈ కారణంగా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకునే వారు నానబెట్టిన ఖర్జూరం తింటే చక్కెర స్థాయిలు ఆరోగ్యంగానే ఉంటాయి. రక్తహీనత.. భారతదేశంలో ఎక్కువ మంది మహిళలు రక్తహీనత తో బాధపడుతున్నారు.  ఖర్జూరంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల నానబెట్టిన ఖర్జూరాలు రోజూ ఉదయమే తింటూ ఉంటే హిమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. ఒత్తిడి.. ఖర్జూరాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.  ఒత్తిడితో పోరాడేవారు రోజూ ఉదయం నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఒత్తిడి తగ్గుతుంది. తల్లిపాలు.. పరిశోధనల ప్రకారం పిల్లలకు పాలిచ్చే తల్లులు ఉదయాన్నే నానబెట్తిన ఖర్జూరం తింటూ ఉంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది.                                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...