LATEST NEWS
పోలింగ్ జరగడానికి ముందు వైసీపీ ‘వైనాట్ 175’ అని ఊగారుగానీ, పోలింగ్ అయిపోయిన తర్వాత ఓటర్ల రెస్పాన్స్ చూసి వాళ్ళకు పరిస్థితి అర్థమైపోయింది. అంతకుముందు ‘బుస్’ అన్నవాళ్ళు ఇప్పుడు ‘తుస్’ అని కూడా అనడం లేదు. పైకి మేకపోతు గాంభీర్యాలు, ఉత్తుత్తి బిల్డప్పులు ప్రదర్శిస్తున్నప్పటికీ, వైసీపీ నాయకులు - కార్యకర్తలు అందరి మనసులలో ‘జూన్ 4 తర్వాత నా పరిస్థితి ఏమిటి దేవుడా’ అన్న ఆలోచనే మెదులుతోంది. అయితే మొన్నామధ్య వరకు జగన్ ఈసారి కూడా గెలుస్తాడు అని వేణుస్వామి చెప్పడం చూసి వైసీపీ వర్గాలు నిజమే అనుకున్నాయి. అయితే కేసీఆర్ గెలుస్తాడని వేణుస్వామి చెప్పాడు. కేసీఆర్ తుక్కుతుక్కుగా ఓడిపోయాడు. అప్పటి నుంచి వైసీపీ నాయకుల గుండెల్లో గుబులు మొదలైంది. లేటస్ట్.గా ఐపీఎల్‌లో గెలుస్తారని వేణు స్వామి చెప్పిన హైదరాబాద్ సన్ రైజర్స్ ఫైనల్స్.లో దఢేల్‌మనడంతో మరోసారి వైసీపీ వర్గాల గుండెల్లో బాంబులు పేలాయి. మొదట్లో జగన్ గెలుస్తాడని వేణుస్వామి చెప్పగానే మురిసి ముద్దయిపోయిన ఈ బ్యాచ్, వేణుస్వామి జగన్ గెలుస్తాడని కాకుండా చంద్రబాబు గెలుస్తాడని చెప్పినట్లయితే ఎంత బాగుండేదో అనుకుంటున్నారు. వేణుస్వామి చెప్పిన మాటల మీద నమ్మకం పోయింది గానీ, ఇప్పుడు వైసీపీ నాయకులు తాము గెలవబోతున్నామనే దానికి మరికొన్ని‘ఆధారాలను’ చూపిస్తూ ఆనందపడిపోతున్నారు. ఆ ‘ఆధారాలు’ ఏమిటో చూస్తే, కొంతమంది వైసీపీ నాయకుల మెంటల్ కండీషన్ ఏ స్థాయిలో వుంది అర్థమవుతుంది. ఆధారం-1: జూన్ 3వ తేదీ నుంచి దాదాపు పదీ పదిహేను రోజులపాటు వైజాగ్‌లో వున్న హోటళ్ళన్నిటిలోనూ రూమ్స్ మొత్తం బుక్కయిపోయాయి. అంటే అర్థం ఏమిటి.. ఈ ఎన్నికలలో జగన్ గెలవబోతున్నాడు. దాంతో వైజాగ్‌లో రాజధాని హడావిడి మొదలైపోతుంది. పైగా ప్రమాణ స్వీకారం కూడా అక్కడే జరుగుతుంది కాబట్టి రూమ్స్ బుక్ అయిపోయాయి. వైసీపీ గెలుస్తుందన్న నమ్మకం లేకపోతే వైజాగ్‌లో ఈ స్థాయిలో హోటల్ రూమ్స్ ఎందుకు బుక్ అవుతాయి? ఆధారం-2: సాధారణంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వుంటే వర్షాలు కురవవు. అదే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నా, జగన్ ముఖ్యమంత్రిగా వున్నా వర్షాలు బాగా కురుస్తాయి. మామూలు మేఘాలు మాత్రమే కాకుండా ‘క్యుములోనింబస్’ మేఘాలు కూడా ఏర్పడుతూ వుంటాయి. జూన్ నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ కేంద్రం వాళ్ళు చెబుతున్నారు. అంటే, వర్షాలు బాగా కురవబోతున్నాయి కాబట్టి, జగనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఆధారం-3:  సాక్షి మీడియా వాళ్ళు ఏపీలో జనం ముందు మైకులు పెట్టి ఎవరు గెలుస్తారు అని అడిగితే, జగనే గెలుస్తాడు అని చెబుతున్నారు. అంటే అర్థమేంటి? జగనే గెలుస్తాడు. ఆధారం-4: పోలింగ్‌కి కొద్ది రోజుల ముందు జగన్ తన నివాసంలో రాజశ్యామల యాగం చేయించాడు కాబట్టి కంపల్సరీ జగన్ గెలుస్తాడు. ఇవే కాక, ఇలాంటి వింత వింత ఆధారాలను నమ్ముకుని, వైసీపీ వర్గాలు ఊహల్లో బతికేస్తున్నాయి.
కృష్ణాజిల్లా పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థి బోడె ప్రసాద్ విక్టరీ ఖాయమైంది. పెడన నుంచి పారిపోయి వచ్చి, ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జోగి రమేష్ పెడన నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారి, ఇంతకాలం రౌడీరాజ్యం నడిపించారు. అక్కడ నుంచి ప్రజలు తరిమిన నేపథ్యంలో పెనమలూరు స్థానం నుంచి రంగంలోకి దిగారు. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బోడె ప్రసాద్‌ని రంగంలో నిలపడంతోనే ఓటర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఒక పర్యాయం ఎమ్మెల్యేగా సేవలు చేసి, ఆ తర్వాతి కాలంలో ఓడిపోయినా నియోజకవర్గ ప్రజల సేవలోనే వున్న బోడె ప్రసాద్ మరోసారి టీడీపీ నుంచి పోటీ చేయడం నియోజకవర్గ ఓటర్లకు సంతోషాన్ని కలిగించింది. ఎక్కడి నుంచో పారిపోయి తమ నియోజకవర్గానికి వచ్చిన దుష్టగ్రహాన్ని వదిలించుకునే మార్గం దొరికిందని సంతోషించారు. మే పదమూడున తమ నిర్ణయాన్ని ఓట్ల రూపంలో ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ సరళిని గమనించిన రాజకీయ పరిశీలకులు ఈ స్థానం నుంచి బోడె ప్రసాద్ విక్టరి కన్ఫమ్ అని క్లియర్‌గా చెబుతున్నారు. తెలుగుదేశం నాయకత్వం పెనమలూరు స్థానం నుంచి బోడె ప్రసాద్‌ని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు జోగి రమేష్ మైండ్ గేమ్ ప్రదర్శించారు. ఇక తన విజయం ఫిక్సయిపోయిందని బిల్డప్పు ఇస్తూ బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. అయితే అదంతా వాపే తప్ప బలుపు కాదని ఆ తర్వాత జోగి రమేష్‌కి అర్థమైంది. జనంలో తనకు బలం లేదని ప్రచారం సందర్బంగా పూర్తిగా అర్థం చేసుకున్న ఆయన జనబలం ఎలాగూ లేదు కాబట్టి, ధనబలం, అధికార బలం, రౌడీల బలంతో అయినా విజయం సాధించాలని ఫిక్సయ్యారు. జనాన్ని ప్రలోభాలకు గురిచేయడం, అధికార దుర్వినియోగం చేయడం దగ్గర్నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తల మీద దాడులు జరపడం వరకు జోగి రమేష్ చేయని అడ్డదారి ప్రయత్నాలు లేవు.  గత 20 ఏళ్ళ చరిత్రలో పెనమలూరు నియోజకవర్గంలో ఏనాడూ ఘర్షణలు జరగలేదు. పెడన నుంచి పారిపోయి వచ్చిన జోగి రమేష్ పుణ్యమా అని ఇక్కడ కూడా ఘర్షణల సంస్కృతి ప్రవేశించింది.  జోగి రమేష్ తరహాలో అడ్డుగోలు వ్యవహారాల్లో తలదూర్చకుండా, స్ట్రెయిట్ ఫార్వర్డ్.గా వుండే బోడె ప్రసాద్ వైపు పెనమలూరు ప్రజలు నిలిచారు. ఆయన ప్రచారం చేస్తున్న సమయంలోనే ఆయన ఏ స్థాయి విజయం సాధించబోతున్నారనేది స్పష్టంగా అర్థమైంది. అది చూసి ఓర్చుకోలేని జోగి రమేష్ టీడీపీ నాయకులు, కార్యకర్తల మీద భౌతిక దాడులకు తన గూండాలను ప్రోత్సహించారు. ఆ దాడులను కూడా టీడీపీ కేడర్ విజయవంతంగా తిప్పికొట్టారు. మాటకు మాట, చేతకు చేత అన్నట్టుగా బోడె ప్రసాద్ బలంగా నిలవడంతో జోగి రమేష్‌కి తోక ముడవక తప్పలేదు. నియోజకవర్గంలో పోలింగ్ సరళిని గమనించిన జోగి రమేష్ తన ఓటమి ఖాయమని ఫిక్సయ్యారు. అందుకే అప్పటి నుంచి అయ్యగారి నోటి నుంచి వాయిస్ లేదు. ఫలితాలు వచ్చిన తర్వాత నియోజకవర్గం నుంచి పెట్టేబేడా సర్దుకుని నియోజకవర్గం నుంచి వెళ్ళిపోయే ఆలోచనలో జోగి రమేష్ ఉన్నట్టు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో జాతకాలు, జోతిష్యం చెబుతూ సంచలన కామెంట్స్ చేస్తూ మీడియాలో నిత్యం కనిపించే స్వామి వేణుస్వామి.  సినీ తారల జీవితాలను టార్గెట్ చేసుకొని ఆయన చెప్పే జోతిష్యం ట్రెండింగ్, ట్రోలింగ్‌ అవుతుంటాయి.  జాతకాల పేరుతో తనకు ఇష్టం లేని వాళ్లపై పిచ్చికూతలు కూసే వేణుస్వామి వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమే. ఆ హీరో చనిపోతాడని.. ఈ హీరోయిన్ చనిపోతుందని ఇలా చావు జోస్యాలు చెప్పిన చ‌రిత్ర కూడా ఈ స్వామిది.  అయితే ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలపై కూడా ఆయ‌న నోటి దూల తీర్చుకుంటున్నారు.  డబ్బుల కోసం ఎలా కావాలంటే అలా జాతకాలు చెబుతాడని పేరు తెచ్చుకున్న ఆయన,  వైసీపీ పెయిడ్ చానల్స్ లో జగన్ గెలుస్తాడని జోస్యాలు చెబుతూ హడావుడి చేస్తున్నారు. ఏపీకి మళ్లీ జగనే సీఎం అవుతారంటూ,  పేరు మోసిన జ్యోతిష్యుడు వేణుస్వామి ప‌లు ఇంటర్వ్యూలో చెబుతూనే వున్నారు.  నేను రోజుకో మాట మాట్లాడటానికి రాజకీయ విశ్లేషకుడిని కాదు, జ్యోతిష్యుడిన‌నే ద‌బాయిస్తుంటారాయ‌న‌. ఒక్కసారి చెప్పిన మాట మీదే నేను నిలబడతాను. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్న తర్వాత వైసీపీ విజయం ఖాయమైంద‌నేది ఆయ‌న జోస్యం.  ఇటీవ‌ల స్వామి చెప్పిన జోస్యం క‌నీసం ఒక్క‌టైనా నిజ‌మైందా అంటే.....వేణుస్వామి కేసీఆర్ గెలుస్తారని చెప్పారు. ఏం అయింది.... కేసీఆర్ ఓడిపోయారు. వేణుస్వామీ హైదరాబాద్ టీం, ఐపీఎల్ గెలుస్తుందని జోస్యం చెప్పారు.. కానీ కనీస పోటీ ఇవ్వలేదు. ఇదే వేణుస్వామి గత మూడు నెలలుగా జగన్ గెలుస్తాడని చెబుతున్నారు.. అది విష‌యం... ఇప్పుడీ స్వామి ప‌రిస్థితి ఎలా వుందంటే ఆ స్వామివి, పిచ్చికూత‌ల‌ని వైసీపీ ఫ్యాన్స్ కూడా కొట్టి ప‌డేస్తున్నారు. స్వామి మాట‌లు న‌మ్మి ఎవ‌రూ బెట్టింగ్ పెట్ట‌వ‌ద్ద‌ని జ‌గ‌న్ అభిమానులే చెబుతున్నారు.  సినీ సెలబ్రిటీల దగ్గర నుంచి, రాజకీయాల వరకూ ట్రెండింగ్ అంశాల మీద జ్యోతిష్యం చెప్తూ ఫేమస్ అయ్యాన‌ని చెబుతుంటారు ఈ స్వామి.  వాస్తవానికి ఆయన చెప్పినవాటిల్లో జరిగినవి ఏమైనా ఉన్నాయా అంటే వాటిని వేళ్లమీద లెక్క పెట్టొచ్చు. జరగనవైతే లెక్కబెట్టలేనంత ఉంటాయి. వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి రాజకీయ నేతల జాతకాలు నా వద్ద ఉన్నాయి. అయితే ఆయన జాతకం ప్రకారం వైఎస్ జగన్‌కు తిరుగు ఉండదు. చంద్రబాబుకు కొన్ని గ్రహాల అనుకూలత లేదు. కాబట్టి ఆయనకు ఎలాంటి రాజయోగం లేదు. పవన్ కల్యాణ్ ఎప్పటికీ ఏపీ రాజకీయాలను శాసించే స్థాయికి రాలేడు. కానీ ఓ పార్టీ మాత్రం ఏపీలో ఉండదు అంటూ వేణుస్వామి జోస్యం పేరుతో ఇలా త‌న నోటి దూల తీర్చుకుంటున్నాడు.   అయితే ప్రస్తుతం వేణుస్వామి చెప్పిన పరిస్థితులకు భిన్నంగా క్షేత్రస్థాయిలో అభిప్రాయలు విభిన్నంగా కనిపిస్తున్నాయి. - ఎం.కె. ఫ‌జ‌ల్‌
రెమాల్ తుపాను ప్రభావం తెలంగాణపైనా పడింది. అకాల వర్షం అన్నదాతలకు నష్టం మిగల్చడమే కాదు, పలుచోట్ల అమాయకుల ప్రాణాలు బలిగొంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా ఈదురుగాలులు, వడగళ్ల వానతో జనజీవనం స్తంభించింది. ఒక్క నాగర్‌కర్నూల్ జిల్లాలోనే వర్షబీభత్సానికి వేర్వేరు చోట్ల ఏడుగురు మృత్యువాత పడ్డారు. తాడూరు శివారు ఇంద్రకల్‌ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో నిర్మాణంలో ఉన్న షెడ్డు కూలి నలుగురు మృతి చెందారు. ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. తెలకపల్లి మండల శివారులో పిడుగు పడి లక్ష్మణ్ అనే 13 ఏండ్ల బాలుడు చనిపోయాడు. తిమ్మాజీపేట మండలం మారేపల్లిలో వ్యవసాయ క్షేత్రం వద్ద పొలం పనులు చేస్తున్న కుమ్మరి వెంకటయ్య అనే రైతు మృతి చెందాడు. రేకుల షెడ్డు ఇటుక పడి మరో వ్యక్తి విగతజీవిగా మారాడు. గాయపడ్డవారితో పాటు మృతదేహాలను నాగర్‌కర్నూల్‌ జిల్లా ప్రభుత్వాసుత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో వేసవి విడిది కోసం ఇంటికొచ్చిన ఇద్దరి ఉసురు తీసింది గాలివాన. వ్యవసాయ పొలం వద్దకెళ్లి సరదాగా గడుపుతుండగా ఒక్కసారిగా వచ్చిన ఈదురుగాలులకు కోళ్ల ఫామ్‌ గోడకూలి ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో చెట్టు విరిగి ద్విచక్రవాహనంపై పడటంతో, దానిపై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉంజుపల్లి వద్ద ట్రాక్టర్‌పై చెట్టుపడి 5 మందికి గాయాలు కాగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నల్గొండ జిల్లాలో ఈదురుగాలుల ధాటికి పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. రేకుల ఇళ్లపైన కప్పులు గాలికి కొట్టుకుపోయాయి. పానగల్ రిజర్వాయర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లి సైదులు అనే యువకుడు గల్లంతయ్యాడు. వికారాబాద్ జిల్లాలో చెట్లు కరెంట్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మరోవైపు హైదరాబాద్‌ను సైతం అకాలవర్షం అతలాకుతలం చేసింది. ఎండ తాకిడి నుంచి వాహనదారులకు ఉపశమనం కోసం జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన, గ్రీన్ మ్యాట్ షెడ్ కూలిపోయి ఓ బస్సు, ఇన్నోవాపై పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. మల్కాజిగిరి, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్, మన్సూరాబాద్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షాలు నేలకూలాయి.
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ క్యాబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన యెర్నేని సీతాదేవి ఈ ఉదయం కన్నమూశారు. హైదరాబాద్‌లోని నివాసంలో గుండెపోటుతో ఆమె మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ముదినేపల్లి నుంచి రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన సీతాదేవి విజయ డెయిరీ డైరెక్టర్‌ గానూ పనిచేశారు. ఆమె స్వస్థలం కైకలూరు మండలంలోని కోడూరు. 2013లో సీతాదేవి బీజేపీలో చేరారు. సీతాదేవి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె భర్త నాగేంద్రనాథ్ (చిట్టి) ఏపీ రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా, కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టా డ్రైనేజీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. నిరుడు ఆయన కన్నుమూశారు. నాగేంద్రనాథ్-సీతాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. నాగేంద్రనాథ్ సోదరుడు దివంగత యెర్నేని రాజారామచందర్ కైకలూరు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీతాదేవి మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.
ALSO ON TELUGUONE N E W S
రోజురోజుకీ పెరుగుతున్న టెక్నాలజీతో ఎంతో నాణ్యమైన ఫోటోలు, వీడియోలు ప్రజల్లోకి వెళుతున్నాయి. ఈమధ్యకాలంలో ఎ.ఐ. టెక్నాలజీ బాగా వాడుకలోకి వచ్చింది. దానితో ఫోటోలను, వీడియోలను మరింత అందంగా చేసుకునే అవకాశం ఉంది. మే 28 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డా. ఎన్‌.టి.రామారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రాలకు మరిన్ని మెరుగులు అద్ది అందంగా తీర్చిదిద్దింది తెలుగువన్‌. ఆ ఫోటోలను అన్నగారి అభిమానుల కోసం అందిస్తున్నాం.  
అర్జునుడి పాశుపతాస్త్రానికి ఎంతటి శక్తీ ఉందో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకి అంతే శక్తీ ఉంది. నటనకి సంబంధించిన అన్ని యాంగిల్స్ లోను అధ్భుతంగా నటించగలడు . కెమెరా కూడా ఎన్టీఆర్ నటనకి మైమరిచిపోతుందని ఆయనతో పని చేసిన చాలా మంది  దర్శకులు చెప్తారు. ఆర్ఆర్ఆర్ లోని కొమరం భీముడో పాటనే అందుకు  ఉదాహరణ. లేటెస్ట్ గా దేవర తో ముస్తాబవుతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన తాజా అప్ డేట్ అభిమానుల్లో అమితోత్సాహాన్ని కలిగిస్తుంది. దేవర షూటింగ్ కి మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా ప్రస్తుతం కంటిన్యూగా సాగుతుంది. లేటెస్ట్ గా ఒక భారీ సెట్ ని వేశారు.  క్లైమాక్స్ సీన్  కోసమే సెట్ వేశారనే ప్రచారం జరుగుతుంది. ఇండియన్ సినిమా హిస్టరీ లోనే  దేవర లాంటి భారీ క్లైమాక్స్ సెట్ ఇంకోటి లేదనే ప్రచారం  ఫిలిం సర్కిల్స్ లో జోరుగా సాగుతుంది. అందులో  ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్ ల  మధ్య క్రేజీ ఫైట్ సీక్వెన్సెస్ ను ప్లాన్ చేస్తున్నారని టాక్.  విలన్ గా సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నాడనే విషయం అందరకి తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ వచ్చిన రెండేళ్ళకి ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దేవర పై ఫ్యాన్స్  భారీ ఆశలే పెట్టుకున్నారు. ప్రేక్షకుల్లో కూడా జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ ,కొరటాల శివ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న దేవర ద్వారా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు తెరకి పరిచయం అవుతుంది. ఆ ఇద్దరి ఫెయిర్ సిల్వర్ స్క్రీన్ మీద ఎన్ని మ్యాజిక్ లు  చేస్తుందో చూడాలి. అక్టోబర్ పది విడుదల కాబోతుంది. ఇటీవల వచ్చిన ఫస్ట్ సాంగ్ అయితే యూట్యూబ్ లో రికార్డులు సృష్టించే పనిలో ఉంది.అనిరుద్ సంగీత దర్శకుడు. ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత దేవర  సునామి రెండు  తెలుగు రాష్ట్రాల్లో పక్కా.    
Vishwak Sen, known for his versatility and dedicated performances, is steadily gaining more recognition. His upcoming project, "Gangs of Godavari," promises to be an intense gangster drama. Scheduled for release on May 31, the film is written and directed by Krishna Chaitanya. Alongside Vishwak Sen, actresses Anjali and Neha Sshetty will portray the female leads, adding to the anticipation. Adding to the buzz is the involvement of music composer Yuvan Shankar Raj, making the movie even more appealing to audiences. One of the leading ladies of the movie, Neha Sshetty, interacted with the media about the movie today. Excerpts from the interview: I play Bujji in Gangs of Godavari. She is a beautiful, elegant, and vulnerable girl. She is a rich girl in a village. The specialty of Bujji is that she is a very strong woman. So far, whatever was shown in the trailer and songs was that of a quiet and vulnerable girl, but the surprise factor is that Bujji will be seen as a very strong woman. In general, women in villages are very vulnerable. They don’t even look up. But how one such girl becomes very strong is Bujji in Gangs of Godavari. This is a very different kind of script. Set against a 1990s backdrop, this is a life’s story between Rathnakar and Bujji. Our director showed me references to senior actress Sobhana Garu—be it the kajal, saree draping, or hairstyle, our director wanted it that way. In fact, my hair colour for the past year has been only one thing because we were very particular about Bujji. Even for looks, we did a lot of homework. In the 1990s, acting wasn’t outgoing. It is inward and quiet. It was very delicate, yet strong. Everything was through expressions. They show vulnerability and strength. That’s the specialty of Bujji. I have done 20s characters and outgoing characters, but this is different. Moreover, since I come from a rich family in the movie, my slang does not have the same Godavari accent as Rathnakar (Vishwaksen) will speak. The story of the Gangs of Godavari is a journey. It starts from the younger days to the more mature days. The film is more about emotions. All the emotions that a woman goes through will be shown in this film. Working with Vishwak was very good. We had known each other before the film, and working with him and doing romantic scenes was very comfortable. Our combination scenes came out very well. Our director, Krishna Chaitanya, is a great human being. In one line, he is a man of few words. After watching the way he has written and done this film, you won't believe he is a man of few words. I feel like there is so much more to Krishna Chaitanya than this film, and it was great working with him. Our director is also from the Godavari side. The situations in the movie are something he has seen and grew up with. So he wrote about his experiences. Going by the trailer and posters, many people think that this film has a lot of killing and violence, but I would like to clarify that this film is a balance of a lot of genres except horror. There is romance, thriller, comedy, action, and a lot of emotion. The audience will be thoroughly entertained. Both Anjali and I have been through the end of the film. It was a very healthy competition between us. We had combination scenes, although not many. Whatever we did, they were great. In real life, Anjali is very bubbly. She interacts with everyone on set. As soon as the director says action, she becomes quiet and completely gets into the acting zone. She is, of course, a senior actress, and she is great at her work. We shot from summer to summer for exactly one year. The heat in Rajahmundry was terrible. I even heard that people on sets were fainting because of the extreme heat. We also had situations where we felt like nature was by our side. During one of the romantic scenes on the bridge between the hero and heroine, suddenly there was a drizzle. The mood was also naturally set for us. For me, Sithara Entertainments is home. I am looking forward to doing more work with him. I am glad that we did good films that worked well, and I think our relationship has been very good with good films.
  తెలుగు సినిమా దర్శక, నిర్మాతలు కొత్త కాన్సెప్ట్ తో , ఫ్రెష్ కంటెంట్ తో ముందుకొస్తున్నారు. తాజాగా థియేటర్లలో రిలీజైన కొన్ని సినిమాలు ఆకట్టుకున్నాయి. అందులో కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ అయితే మరికొన్ని హారర్ కామెడీ, ఫ్యామిలీ డ్రామా జానర్ సినిమాలున్నాయి.  సినిమా ఇండస్ట్రీలో కొత్తనటీనటులతో వచ్చిన సినిమాలు కొన్ని భారీ విజయమే సాధించాయి. అయితే కంటెంట్ ఫ్రెష్ ఉంటుంటే.. కథనాన్ని ఆసక్తికరంగా  మలచగలిగితే హిట్ అయినట్టే అని కొందరు కొత్త దర్శకులు కొత్త కంటెంట్ తో వస్తున్నారు. అలా రాబోతుందే ' నమో ' సినిమా. సర్వైవల్ కామెడీ థ్రిల్లర్ గా  వస్తున్న ఈ మూవీ తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో అనురూప్ కటారి, విశ్వం దుద్దంపూడి, విస్మయ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీనేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ప్రశాంత్ ఈ మూవీని నిర్మించారు.  ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకుడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు మేకర్స్. జూన్ 7 థియేటర్లలో ఈ సర్వైవల్ కామెడీ మూవీ రిలీజవ్వనుంది. ఓ అడవిలో జంతువులని వేటాడుతూ బ్రతికే ఆదివాసుల తెగ ఉంటుంది‌. అదే అడవిలోకి ఇద్దరు యువకులు ట్రెక్కింగ్ కి వెళ్తారు. అనుకోకుండా ఆదివాసుల గుప్లిట్లోకి ఈ యువకులు వెళ్తారు. మరి వారి నుండి హీరో అతని ఫ్రెండ్ సర్వైవ్ అయ్యారా లేదా అనేది మిగతా కథ. రీసెంట్ గా రిలీజైన టీజర్  కామెడీగా ఉంది. మరి జూన్ మొదటి వారంలో వస్తున్న ఈ సినిమాని థియేటర్లలో చూసేయ్యండి.   
ఈమధ్యకాలంలో ఎక్కువ దుమారం రేపిన అంశం బెంగళూరు రేవ్‌ పార్టీ. పక్కా సమాచారంతో బెంగళూరు పోలీసులు రేవ్‌ పార్టీ జరుగుతున్న జి.ఆర్‌. ఫామ్‌హౌస్‌కి చేరుకొని అందులో పాల్గొన్న వారందర్నీ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ పార్టీలో పలువురు సినీ ప్రముఖులు కూడా ఉండడంతో ఆసక్తికరంగా మారింది. మొత్తం 103 మంది బ్లడ్‌ శాంపిల్స్‌ కలెక్ట్‌ చేసారు పోలీసులు. వారిలో 86 మంది డ్రగ్స్‌ వాడారని నిర్ధారించారు. వారిలో హేమ కూడా ఉంది. ఈ పార్టీ వ్యవహారంలో నటి హేమ మొదటి నుంచి అనుసరించిన తీరు బెంగళూరు పోలీసులతోపాటు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. పోలీసులను తప్పు దోవ పట్టించేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఎట్టకేలకు అందరితోపాటు హేమకు కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు పంపారు. మే 27న విచారణకు హాజరు కావాల్సింది తెలిపారు. కానీ, హేమ విచారణకు హాజరు కాలేదు. తను వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నానని, విచారణకు హాజరు కావడానికి తనకు మరికొంత సమయం కావాలని బెంగళూరు పోలీసులకు లేఖ రాసింది. దీనిపై సీరియస్‌ అయిన పోలీసులు తాజాగా మరో నోటీసు పంపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.  రేవ్‌ పార్టీ విషయం వెలుగులోకి వచ్చినరోజు నుంచి రకరకాల వీడియోలతో సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్న హేమ తాజాగా మరో వీడియోలో రేవ్‌ పార్టీపై స్పందించింది. ‘ఒకవేళ మనం తప్పు చేసినా మనం ఏం దేవుళ్లం కాదు.. తప్పు చేసినా, పొరపాటు జరిగినా సారీ చెప్పొచ్చు. ఒక అబద్ధం చెబితే దాన్ని కవర్‌ చేయడానికి 100 అబద్ధాలు ఆడాలి.. అందుకని 99.9 శాతం అబద్ధాలు ఆడకుండా ఉండటం చాలా బెటర్‌.. అందుకే నేను చాలా హ్యాపీగా ఉంటాను’ అని వీడియో ద్వారా తెలిపింది. మొదటి నుంచీ తాను రేవ్‌ పార్టీలో లేనని చెబుతూ వచ్చిన హేమ.. ఇప్పుడు ప్లేటు మార్చింది. తప్పు చేస్తే సారీ చెప్పొచ్చు అంటూ కొత్త కథకి శ్రీకారం చుట్టింది. మరి హేమ విషయంలో బెంగళూరు పోలీసులు ఎలా స్పందిస్తారో.. ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. 
Mass Maharaj Raviteja, after continuous flops in action dramas, is now seeking a change of pace with entertaining stories. After a string of action-packed roles, Raviteja is eager to delve into the realm of light-hearted and engaging narratives. In a notable shift, he has set his sights on collaborating with writer Bhanu Bhogavarapu, whose commendable work, especially his contribution to blockbuster "Samajavaragamana," has earned him widespread acclaim. The film announced recently and it is tentatively titled as "RT75." The film will goes to floors very soon. There were lot of rumours about the film's female lead. We've got an exclusive info that most happening actress, who faced series of flops Sree Leela signed this project. This Jodi previously worked together in Dhamaka. The excitement is now sky high with Sree Leela's news. The actress will complete her doctor exams and join the shoot. Bhanu is poised to make his directorial debut with Raviteja's next project, marking an exciting new chapter in both their careers.  The blockbuster production house Sithara Entertainments will be bankrolling this entertainer. With Raviteja's penchant for entertaining performances and Bhanu Bhogavarapu's promising directorial debut on the horizon, expectations are high for this upcoming collaboration. As details about the project emerge, anticipation builds.
Following an extraordinary teaser reveal of the futuristic vehicle named ‘Bujji’, the fifth and ultimate hero of the upcoming sci-fi epic ‘Kalki 2898 AD’, the hype raises to next level. This highly anticipated film is going to release in multiple Indian and international languages. Now, we've learnt that the makers already prepared 3D content. The film will be releasing in 2D and 3D. The 3D visuals are going to showcase this futuristic sci-fi film in a new dimension for the audience, giving greatest experience. Featuring an ensemble star cast including Amitabh Bachchan, Kamal Haasan, Prabhas, Deepika Padukone and Disha Patani in key roles, ‘Kalki 2898 AD’ is directed by Nag Ashwin and produced by Vyjayanthi Movies. A multilingual, mythology-inspired sci-fi spectacle set in the future, the film hits the screens on June 27, 2024.
సినిమా టాక్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్ల ని రాబట్టే అతి తక్కువ మంది హీరోల్లో మహేష్ బాబు (mahesh babu)కూడా ఒకడు. ఈ సంవత్సరం ప్రారంభంలో వచ్చిన గుంటూరు కారంతో ఆ మాట నిజమని మరోసారి అర్ధమయ్యింది. రీసెంట్ గా మహేష్ బాబు ఒక ట్వీట్ చేసాడు. ఒక మాములు హీరో చేసిన ట్వీటే వైరల్ గా మారే రోజులు ఇవి. అలాంటిది  సూపర్ స్టార్  చేస్తే ఇంకేమైనా ఉందా. పైగా తన ఫ్యామిలీ గురించి చేస్తే.  ట్విట్టర్ రికార్డు వ్యూస్ తో బద్దలయ్యి పోదు. ఇప్పుడు అదే జరుగుతుంది. మహేష్ బాబు కి కొడుకు గౌతమ్ కృష్ణ (gowtham krishna)కూతురు సితార (sitara)లు ఉన్నారు. వారిద్దరు అంటే మహేష్ కి ఎంతో ప్రాణం.  గౌతమ్ ఇటీవలే  తన గ్రాడ్యుయేషన్ ని  పూర్తి చేసాడు. ఈ సందర్భంగా గౌతమ్ ని అభినందిస్తు  మహేష్ ఒక  ట్వీట్ చేసాడు.నా హృదయం గర్వంతో నిండిపోయింది. ఇక నుంచి నీ కెరీర్ లో కొత్త అధ్యాయం మొదలవ్వబోతుంది. కాకపోతే ఆ అధ్యాయాన్ని నువ్వే రాసుకోవాలి. నీ కలలను సాధించేందుకు ముందుకు సాగు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో. నీపై మా ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. ఈ రోజు తండ్రిగా నిన్ను చూసి గర్వపడుతున్నాను. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినందుకు శుభాకాంక్షలు అంటు ట్వీట్ చేసాడు. ఇప్పుడు మహేష్ చేసిన ఈ ఎమోషనల్ ట్వీట్ వైరల్ గా మారింది.    కాకపోతే అభిమానులు  మాత్రం ఒక్కసారి గతంలోకి వెళ్లిపోయారు. 2014 లో  మహేష్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో  వన్ నేనొక్కడినే అనే మూవీ వచ్చింది. అందులో  చిన్నప్పటి మహేష్ గా గౌతమ్  నటించాడు. ఏడేళ్ల వయసులోనే  ఎలాంటి బెరుకు లేకుండా నటించి తన  బ్లడ్ లోనే నటన  ఉందని నిరూపించాడు. దీంతో గౌతమ్ హీరోగా రావాలని ఫ్యాన్స్  కోరుకుంటున్నారు. ఇక మహేష్ ప్రస్తుతం ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్  రాజమౌళి (Rajamouli)సినిమాతో బిజీగా ఉన్నాడు. షూటింగ్ ఇంకా స్టార్ట్ కానప్పటికీ తన  లుక్ విషయంలో శ్రద్ద తీసుకుంటు బిజీగానే ఉన్నాడు.ఇండియన్ సినిమా హిస్టరీలోనే  కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకుంటుంది. ప్రతిష్టాత్మక సంస్థ దుర్గ ఆర్ట్స్ ఆ చిత్రాన్ని నిర్మిస్తుంది  
2006 లో వచ్చిన ఫోటో చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన  భామ  అంజలి (anjali)ఆ మూవీ తర్వాత  తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో  పదహారు సినిమాలు దాకా  చేసింది. వాటన్నింటిలో కూడా తనే  హీరోయిన్. దీన్ని బట్టి ఆమె స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. తిరిగి 2013 లో వచ్చిన  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో తెలుగు తెరకు రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (ram charan)సరసన గేమ్ చేంజర్ (game changer)లో చేస్తుంది. తాజాగా ఈ మూవీ గురించి ఆమె చేసిన కొన్ని  వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.  ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్(shankar)చరణ్ కాంబోలో  గేమ్ చేంజర్ తెరకెక్కుతుంది. కియారా అద్వానీ (kiyara adwani)హీరోయిన్. అంజలి కూడా స్క్రీన్ షేర్ చేసుకోనుంది. కాకపోతే  క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించబోతుందనే  వార్తలు మీడియాలో వస్తున్నాయి.  దీని పైనే అంజలి తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చింది. గేమ్‌ ఛేంజర్‌లో నేను హీరోయిన్ ని కాదని ఎవరు చెప్పారు. క్యారక్టర్ ఆర్టిస్ట్ ని అని  మేకర్స్  ప్రకటించలేదు కదా. నేను కూడా మూవీలో  ఒక హీరోయిన్ నే. నా  క్యారక్టర్ కి  ఫ్లాష్‌బ్యాక్‌ ఉంది.ఒక  అందమైన పాట కూడా ఉంది. ఇంతకుమించి నేను ఏం చెప్పలేనంటు చెప్పుకొచ్చింది. చాలా రోజులుగా గేమ్ చేంజర్ లో చరణ్   డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో  అంజలి ఒక చరణ్ కి జోడిగా  మెరవబోతుందని అంటున్నారు.   అంజలి అచ్చమైన తెలుగు అమ్మాయి. రవి తేజ తో బలుపు, సూర్య తో సింగం టూ, విక్టరీ  వెంకటేష్, రామ్  ల మసాలా, తనే ముఖ్య పాత్రల్లో  తెరకెక్కిన గీతాంజలి సిరీస్, బాలకృష్ణ తో డిక్టేటర్, నితిన్ మాచర్ల నియోజకవర్గం తో పాటు మరికొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతానికి  అన్ని భాషలు కలుపుకొని యాబై కి పైగా చిత్రాల్లో నటించింది.  
HanuMan director Prasanth Varma is making a massively budgeted period film with Bollywood star Ranveer Singh. We've revealed that this biggie titled as "Brahmarakshasa." Ranveer Singh, Prasanth Varma and Mythri Movie Makers are confirmed to team up for a film. It will be the immediate film in Prasanth Varma's cinematic universe and will got onto the floors even before Jai Hanuman. The film's formal Pooja was recently held. Ranveer Singh joined test shoot recently in Hyderabad for the glimpse, which makers planned to release as a announcement video. A massive set was constructed for the shoot. The film is rumored to be titled Brahmarakshasa and is said to be a periodic drama with loads and loads of action. The ongoing rumors say that Ranveer Singh walked out of the film due to creative differences with Prasanth Varma. He decided not to sign the film. But we've learnt that the project is still on. Prasanth Varma revealed that he will do the film with Ranveer Singh and it goes to floors very soon. Mythri Movie Makers are the producers of this mega budget film. An official announcement is expected to be made soon. Its a part of the movie Universe PVCU as well. The film will release in 2025.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నేటి వేగవంతమైన ప్రపంచంలో ఉద్యోగ జీవితాలు కూడా అంతే వేగంగా ఉంటాయి. పోటీ దృష్ట్యా ప్రతి సంస్థ 24 గంటలు తమ కార్యకలాపాలు కొనసాగించాలని అనుకుంటుంది. ఈ కారణంగానే సాధారణ పనివేళలు మాత్రమే కాకుండా నైట్ షిఫ్టులు కూడా కొనసాగిస్తుంది.  వేతనం గురించో ఇతర కారణాల వల్లనో చాలామంది నైట్ షిప్టులో పనిచేస్తుంటారు.  అయితే సాధారణ పని వేళల్లో పనిచేసేవారి కంటే నైట్ షిప్టులో పనిచేసేవారిలో చురుకుదనం తక్కువగా ఉంటుంది. అంతేనా సాధారణంగా నిద్రపోవాల్సిన సమయంలో ఉద్యోగాలు చెయ్యడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నైట్ షిఫ్టు డ్యూటీ చేసేవారు  ఆరోగ్యంగా, యాక్టీవ్ గా ఉండటానికి  కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే.. నిద్ర.. నైట్ షిఫ్టు లో పనిచేసేవారు నిద్ర షెడ్యూల్ ను కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. నిద్రా చక్రమైన సిర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలిగించకుండా చూసుకోవాలి. సిర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలిగితే  నిద్ర ఆటంకాలు, అలసట కలుగుతాయి.  ఈ సిర్కాడియన్ రిథమ్ గడియారాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి సెలవు దినాలలో కూడా ఒకే సమయానికి పడుకోవాలి. ఆహారపు అలవాట్లు.. నైట్ షిఫ్టుల సమయంలో చాలామంది ఎనర్జీగా ఉండటం కోసం ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ తినడం మీద ఆసక్తి చూపిస్తారు. పైపెచ్చు సాధారణ భోజన సమయాలు కాకపోవడం వల్ల రాత్రి పూట ఆకలేసినప్పుడు ఇలాంటి ఆహారానికే ప్రాధాన్యత ఇస్తారు. అయితే వీటికి బదులుగా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. నైట్ షిఫ్ట్ అంతా చిన్న చిన్న మొత్తాలలో ఆహారం తీసుకోవాలి. నీరు బాగా త్రాగాలి. వ్యాయామం.. నైట్ షిప్టులలో పనిచేసేవారు ఉదయం సమయాల్లో పడుకుంటూ ఉంటారు. దీని వల్ల చాలామంది ఉదయం వేళ చెయ్యాల్సిన వ్యాయామాన్ని స్కిప్ చేస్తుంటారు. లేదా పగటి సమయాన్ని లేజీగా గడిపేస్తూ  ఉంటారు. కానీ వ్యాయామాన్ని తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. జాకింగ్, వాకింగ్, యోగా, సైక్లింగ్ వంటివి మంచి ఎంపిక. ఒత్తిడి.. పనిచేసే సమయవేళలు మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. ఇది ఒత్తిడి, ఒంటరితనం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఒత్తిడి రాకుండా చూడటం కోసం  లోతైన శ్వాస, శ్వాస వ్యాయామాలు,  ధ్యానం,  తీరిక సమయాలలో స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటివి చేయాలి.  ఒకవేళ ఒత్తిడి సమస్య ఉంటే మానసిక నిపుణులను కలిసి కౌన్సెలింగ్ తీసుకోవాలి. ప్లానింగ్.. నైట్ షిఫ్టులలో పనిచేసేవారు తమ పనిని చాలా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. పని చేసేటప్పుడు అలసిపోకుండా పనిని ఏకధాటిగా కాకుండా చిన్నచిన్న భాగాలుగా విభజించుకొని ఫినిష్ చేయాలి. ఇది పక్కాగా అమలుకావడం కోసం కోలీగ్స్,  అధికారులతో సంప్రదించి వారి మద్దతు తీసుకోవాలి.                                     *నిశ్శబ్ద.  
జీవించడమూ ఒక కళ అని ఎంతోమంది చెబుతూ ఉంటారు. ప్రస్తుత సమాజంలో మనిషి రెండు విధాలుగా బ్రతుకుతున్నాడు. ఒకటి, తనకు తోచిన విధంగా, రెండు ఓ పద్ధతి ప్రకారం. కానీ మూడవ పద్ధతి ఒకటి ఉంది. ఈ పద్ధతిలో అమితమైన స్వేచ్ఛ ఉంటుంది. ఈ పద్ధతిలో బ్రతకడమే జీవించడం అంటే, ఈ పద్ధతినే జీవించే కళ అంటారు. ఇప్పుడు విదేశాలలో క్రొత్తరకం జీవనోపాధి ఒకటి స్వైరవిహారం చేస్తోంది. అదేమిటంటే మంచి వాక్చాతుర్యం కలిగి, జీవితంలో గొప్పగా సాధించిన ఒక వ్యక్తి ఇతరులకు ఎలా జీవించాలో, ఏ విధంగా జీవన పద్ధతి పాటిస్తే నిండైన విలువైన జీవితం దొరుకుతుందో వివరిస్తూ, అందులో శిక్షణా తరగతులూ, ప్రసంగాలూ ఇస్తూ ఎంతో మంచి పాతవైన, భారమైన జీవితాలని అందమైన తీరాలవైపు మళ్ళిస్తున్నారు. ఈ విధంగా జీవించేకళలో శిక్షణ ఇచ్చే మనిషిని లైఫ్ కోచ్ అని అంటున్నారు.  ఇప్పుడు ఈ లైఫ్ కోచ్ ల ఆవశ్యకత మన భారతదేశానికె అవసరం అంటున్నారు. ఎందుకంటే ప్రపంచానికే వెలుగు చూపింది మన భారతదేశం. ఆధ్యాత్మికంగా ప్రపంచ ప్రజలకు తలమానికంగా నిలచింది మన దేశమే. ఇప్పుడు కూడా ఏ దేశానికీ వెళ్ళనంత ఎక్కువ జనాభా, భారతదేశానికి వచ్చి ఆధ్యాత్మిక జీవనం నేర్చుకొని వెళ్తున్నారు. ఇక్కడ నేర్చుకొన్న గొప్ప విద్యను, జ్ఞానాన్ని వారి దేశాల్లో వినియోగిస్తూ, లైఫ్ కోచ్ లుగా, పబ్లిక్ స్పీకర్లుగా, ప్రేరణా రచయితలుగా మారి కోట్లకు కోట్లు సంపాదిస్తూ పదిమంది జీవితాలను ఉన్నతదిశగా మారుస్తూ తృప్తిగా హాయిగా జీవిస్తున్నారు. మన దేశంలో పూస్తున్న మల్లెల సువాసనను మన తుమ్మెదలు గ్రహించలేని స్థితిలో ఉంటే... విదేశాలనుండి వచ్చిన తుమ్మెదలు ఆ అద్భుత సౌరభాలను హాయిగా ఆస్వాదించి... తిరిగి మన తుమ్మెదలకే మల్లెల సువాసనలు గురించి పరిచయం చేస్తున్నాయి. ఈ విషయం ఎంత విచిత్రమో కదా అనిపించడం లేదూ... ఇక్కడ తప్పు మన తుమ్మెదలదా, విదేశీ తుమ్మెదలదా. ఆలోచిస్తే ముమ్మాటికీ మన తుమ్మెదలదే. మన దేశంలో దొరికిన కాసింత జ్ఞానాన్ని వాళ్ళు గ్రహించి దాంతోటే వాళ్ళ దేశంలో అద్భుతాలు సృష్టిస్తుంటే, ఇక్కడ పుట్టి, ఇక్కడే పెరిగి మన భారతీయ విజ్ఞానంపై సర్వహక్కులూ కలిగి ఉండి,  నేర్చుకోగల అవకాశాలు ఉండికూడా భారతీయులు విఫలమవుతున్నారు.  ఈ అపాయకరమైన పరిస్థితిని గమనించి ఎందరో భారతీయ గురువులూ, తత్వవేత్తలూ, ఆధ్యాత్మిక ప్రవచకులూ గొంతు అరిగేలా అరిచి అరిచి చెప్తున్నా... కనీసం కొంచెమైనా పట్టించుకోలేని భయానకమైన స్థితిలో దేశప్రజలు దిగజారిపోతున్నారు. ఎందుకంటే... ప్రజలు తమకు తోచిన విధంగానే బ్రతకాలని నిర్ణయించుకున్నారు. ఎవరైనా జీవించడం గురించి చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించే విషయం ఒకటే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు అందుకే ఇలా చెబుతారు అని.  ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్టు  జీవించే పద్ధతిలో జీవితం వారిని కాలసర్పంలా కాటేస్తున్నా ఆ విషవలయాల మధ్య రొప్పుతూ బ్రతికేస్తున్నారు. విద్యార్థి దశనుండీ... పరీక్షల్లో ర్యాంకులైతే తెచ్చుకోగలరు కానీ జీవితంలో నిరంతరం పరాజయం పొందుతూనే ఉన్నారు. ఎందుకంటే జీవితం గురించిన పాఠాలు ఏ పాఠశాలలోనూ బోధించడం లేదు.  నేర్చుకుంటున్న విద్య  కడుపునిండా తిండి పెట్టగల్గుతోంది. కానీ ప్రశాంతమైన నిద్రను ఇవ్వడం లేదు. కలకాలం హాయిగా జీవించడానికి పనికిరాని విద్య... అసవరమే లేదు. ఆ విషయాన్ని ఎవరూ గ్రహించడం లేదు. అటువంటి విద్యతో బ్రతకగలరేమోగానీ జీవించలేరు. ఎలాగైనా బ్రతికేయడం...  జీవితమవుతుందా?? జీవించడమంటే.... వెయ్యేళ్ళు ప్రజల గుండెల్లో వర్ధిల్లాలి. జీవితమే భావితరాలకు జీవితకళను నేర్పే పాఠం కావాలి. గొప్పగా జీవించలేకపోయినా కనీసం తన కుటుంబంలోని సభ్యులతో ఏ చీకూచింతా లేకుండా, నిండు ఆరోగ్యంతో, నీతిగా, ధర్మబద్దంగా ప్రతిరోజూ ఆనంద పరవశులౌతూ మనసారా తృప్తిగా జీవించగల్గితే చాలు. తమ బిడ్డలకు నైతిక విలువలు నేర్పిస్తూ, దయా, కరుణ, ప్రేమతత్వాన్ని వారికి అమృతంలా అందిస్తూ... వారు సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా తయారయ్యేలా చేస్తూ... కనీసం వెయ్యి మందిలో ఒక్కరైనా నిజంగా జీవించగలుగుతున్నారా?... ఇవన్నీ ప్రశ్నించుకుంటే జీవించడం గురించి ఓ అవగాహన వస్తుంది.                                      ◆నిశ్శబ్ద.
  నేటి కాలంలో చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. కొందరి ప్రేమకథ పెళ్లికి దారితీయదు. ఏదైనా ప్రేమ బంధం దృఢంగా ఉండాలంటే సద్గురువు చెప్పిన ఈ మాటలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.  కొన్నిసార్లు ఇది బంధాన్ని విజయవంతం చేయడానికి సరిపోదు. బంధంలో నివసిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య అలాంటి కొన్ని సమస్యలు తలెత్తుతాయి. వారు తమ కోసం వేర్వేరు మార్గాలను ఎంచుకోవాలి.  వివాహాన్ని ప్రేమకు గమ్యస్థానంగా పరిగణించనప్పటికీ, జీవితాంతం కలిసి ఉండటమే అత్యంత అందమైన, పవిత్రమైన బంధం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు తమ ప్రేమికుడితో కలిసి కుటుంబాన్ని గడపాలని కలలు కంటారు. కానీ మీ ప్రేమను పెళ్లి దశకు ఎలా తీసుకురావాలో మీకు తెలియదు. అలాంటి వారికి సద్గురు సలహా ఉపయోగపడుతుంది. సంబంధాన్ని కాపాడుకోవడానికి సద్గురు సలహా: ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడైన సద్గురు, యువ తరం సమస్యలను బాగా అర్థం చేసుకుని, వారికి బాధ కలిగించకుండా వాటిని ఎలా పరిష్కరించాలో తెలిసిన మత గురువులలో ఒకరిగా పరిగణిస్తున్నారు. ప్రేమ సంబంధాన్ని మెరుగుపరచడానికి.. అతను ఇచ్చిన చిట్కాలను అనుసరించడం ద్వారా, మీరు మీ సంబంధాన్ని ప్రతి సమస్య నుండి కాపాడుకోవచ్చు. దానిని విజయవంతం చేయవచ్చు. ఈ విషయం మాత్రమే ప్రేమ సంబంధాన్ని విజయవంతం చేస్తుంది: సద్గురు చెప్పినట్లుగా, మీలో ఉన్న ప్రేమ సఫలీకృతం కావాలంటే, మీరు ముందుగా ఓడిపోవడం నేర్చుకోవాలి, ఎక్కువ కాలం ఉండకూడదు లేదా అంతం కాదు. మీ సంబంధాన్ని గెలవాలంటే మీరు ప్రేమలో ఓడిపోయిన వ్యక్తి అయి ఉండాలి. సంబంధంలో జీవిస్తున్న ఇద్దరూ దీనిని అర్థం చేసుకున్నప్పుడు, వారి జీవితమంతా ఏదీ వారిని వేరు చేయదు. వారి ప్రేమ అజరామరం. ప్రేమలో ఓడిపోవడం అంటే ఏమిటి? జీవితంలో ఎప్పుడూ ఓడిపోకండి, కానీ మీ ప్రేమికుడితో మీ సంబంధాన్ని చిరస్థాయిగా మార్చుకోవడానికి మీరు ఓడిపోవడం మంచిది. యుద్ధాల్లో గెలవాలంటే ఓడిపోయినట్లే, ప్రేమ కూడా వీటిలో ఒకటి మాత్రమే. అయితే అంతకు ముందు రిలేషన్ షిప్ లో లూజర్ అంటే అర్థం తెలుసుకోండి. మీ భాగస్వామి కోసం ఏదైనా చేయండి: ప్రతి ఒక్కరూ ప్రేమలో లావాదేవీల గురించి మాట్లాడుతారని సద్గురు చెప్పారు. అయితే అందులో ఓడిపోయిన వారిని ఎంచుకుంటేనే మీరు మీ ప్రేమ వ్యవహారాన్ని విజయవంతం చేయగలరు. దీని కోసం మీరు కోల్పోయేది ఏమీ లేదు. మీ భాగస్వామి నుండి మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ చేయడం అంటే. ఇలా చేయడం వల్ల మాత్రమే ప్రేమ పెరుగుతుంది. సంబంధాలు చిరస్థాయిగా ఉంటాయి. అటువంటి వ్యక్తుల సంబంధం విజయవంతం కాదు: ఇతరులు మీ నుండి తీసుకోవాలని మీరు ఎల్లప్పుడూ ఆశించినట్లయితే, ఎవరూ మీతో సంబంధాన్ని కలిగి ఉండకూడదని సద్గురు వివరిస్తున్నారు. మీరు ఎల్లప్పుడూ మీ గురించి ఆలోచించకూడదు: రిలేషన్‌షిప్‌లో ప్రతి ఒక్కరికీ కొన్ని అంచనాలు ఉంటాయి. భాగస్వామి మీతో నిజాయితీగా ఉండాలి, మిమ్మల్ని గౌరవించాలి, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు. అంతే కాకుండా అనవసరమైన అంచనాల భారాన్ని వారి భుజాలపై వేసుకోవడం సరికాదు. ఇది మీ సంబంధాన్ని నాశనం చేస్తుంది. విజయవంతమైన ప్రేమ సంబంధం అంటే ఏమిటి? ప్రేమ సంబంధం  విజయం ప్రతి జంటకు భిన్నంగా ఉంటుంది. కొందరు వివాహ దశకు చేరుకోవడం ద్వారా తమ సంబంధాన్ని విజయవంతంగా భావిస్తారు, కొందరు దీనిని ఎల్లప్పుడూ ఒకరికొకరు సుఖంగా ఉన్నట్లు భావిస్తారు, తద్వారా మూడవ వ్యక్తి రాక వారి సంబంధాన్ని మార్చదు.
కలబంద.. చర్మం, జుట్టు, ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.దీనిని రోజూ తీసుకోవడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులు దూరంగా ఉంటాయి. కలబందలో ఉండే విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్ మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో అలోవెరా జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తిని, జీవక్రియను మెరుగుపరుస్తుంది.మలబద్ధకం, రక్తహీనత వంటి తీవ్రమైన వ్యాధులకు చెక్ పెడుతుంది. అనేక తీవ్రమైన వ్యాధుల చికిత్సలో ఆయుర్వేదంలో అలోవెరాను సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ సీజన్‌లో కలబంద ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు దీన్ని జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. చల్లటి వాతావరణంలో అలోవెరా జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో.. ఏయే వ్యాధులను దూరం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం నుండి ఉపశమనం: ఆంత్రాక్వినోన్ అనే సమ్మేళనం కలబందలో ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది కాకుండా, కలబంద వినియోగం కడుపు తిమ్మిరిని నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల, ఈ సీజన్‌లో, మీరు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి  అలోవెరా జ్యూస్ తాగవచ్చు. రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది: ఈ సీజన్‌లో, చాలా మందిలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా, అటువంటి వ్యక్తులు అనేక సీజనల్ వ్యాధులకు గురవుతారు. అందువల్ల, ఈ సీజన్‌లో మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, మీరు కలబంద జ్యూస్ తాగాలి. శరీరం నిర్విషీకరణ : అలోవెరా జ్యూస్ శరీరంలోని టాక్సిక్ ఎలిమెంట్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. వాస్తవానికి, శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలను ఆహ్వానించే అనేక విష పదార్థాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, కలబంద రసం తీసుకోవడం ఈ తొలగింపు ప్రక్రియలో సహాయపడుతుంది. అలోవెరా జ్యూస్ ను క్రమం తప్పకుండా తాగుతే ఆరోగ్యంతోపాటు అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. రక్తహీనత సమస్యకు చెక్: నేటికాలంలో చాలా మంది రక్తహీనతకు లోనవుతున్నారు. అటువంటి పరిస్థితిలో, ఒక గ్లాసు కలబంద రసం ఈ సమస్యను వదిలించుకోవడానికి మీకు సహాయపడుతుంది. నిజానికి కలబంద రసాన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి రక్తహీనత సమస్య దూరమవుతుంది. పొడి చర్మం నుండి ఉపశమనం: చలికాలంలో తరచుగా చర్మం పొడిబారుతుంది. అందువల్ల, ఈ సీజన్‌లో కూడా మీ ముఖం పోషణతో ఉండాలంటే, కలబంద రసాన్ని మీ ముఖానికి అప్లై చేయడమే కాకుండా, దాని జ్యూస్ తాగండి. నిత్యం ఈ జ్యూస్ తాగడం వల్ల మీ ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. ఎప్పుడు తాగాలి? మీరు కలబంద జ్యూస్‌ని సాయంత్రం పూట కూడా తాగవచ్చు. అయితే ఉదయం పూట కలబంద జ్యూస్ తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు.  
సీజన్ల వారిగా లభించే పండ్లలో నేరేడు పండ్లు కూడా ప్రముఖమైనవి.  వేసవి కాలం ఇక ముగుస్తుందనగా మార్కెట్లలోకి చొచ్చుకువచ్చి సందడి చేసే నేరేడు పండ్లు రుచిగా ఉండటమే కాదు, బోలెడు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. వైలెట్ కలర్ లో ఉంటూ ఉప్పగా, వగరుగా ఉండే ఈ నేరేడు కాయలు  క్రమంగా నల్లగా మారి నిగనిగలాడుతూ చెప్పలేనంత తియ్యదనంగా మారుతాయి.  జామూన్ ఫ్రూట్ గా పిలిచే ఈ నేరేడు లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యం దీనికున్న ప్రత్యేక లక్షణం. అయితే నేరేడు పండ్లు అందరూ తింటారు. కానీ గింజలు ఉపయోగించే వారు తక్కువ. నేరేడు పండ్లలానే వాటి గింజలు కూడా అంతే ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే అవి మధుమేహం నియంత్రించడంలో అద్భుతాలు చేయడమే కాకుండా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. నేరేడు గింజల పొడి ప్రయోజనాలను తెలుసుకుంటే నేరేడు పండ్లు తినగానే ఆ విత్తనాలను ఇకమీదట పడెయ్యరు. నేరేడు గింజలు పొడి తీసుకోవడం ద్వారా కలిగే అయిదు అద్భుత ప్రయోజనాలు ఏమిటంటే.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి, గ్లైకోసూరియాను తగ్గించడానికి నేరేడు విత్తనాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పండు గింజలు జంబోలిన్ మరియు జాంబోసిన్ అనే క్రియాశీల పదార్ధాలను కలిగి ఉంటాయి, ఇవి రక్తంలోకి విడుదలయ్యే చక్కెర రేటును నెమ్మదిస్తాయి. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. శాస్త్రీయంగా, ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంది, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఫలితంగా  మూత్రవిసర్జన, చెమటలను సహజంగా నిర్వహించడంలో సహాయపడుతుంది.  నేరేడు విత్తనాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణం కారణంగా, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టానికి వ్యతిరేకంగా పోరాడుతాయి, కాలేయ కణాలను రక్షిస్తాయి. ఇంకా ఈ గింజలు పొడిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి, ఇది కాలేయంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.  నేరేడు గింజల పొడిలో ఎల్లాజిక్ యాసిడ్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి రక్తపోటు వేగవంతమైన హెచ్చుతగ్గులను నియంత్రించడంలో  సహాయపడతాయి. నేరేడు గింజలు ఫ్లేవనాయిడ్లు, ఫినాలిక్ సమ్మేళనాల వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ అయిదు ప్రయోజనాలు పొందడానికి నేరేడు గింజల పొడిని తీసుకోవడం మంచిది. ◆నిశ్శబ్ద
ద్రాక్ష ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనది. దీని రుచి చాలా బాగుంటుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ద్రాక్షలో అనేక రకాలు ఉన్నాయి.  ఎరుపు, నలుపు,  ఆకుపచ్చ రంగులలో లభిస్తుంది. వీటిలో ఎర్ర ద్రాక్ష కాస్త ప్రత్యేకం. ఎర్ర ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. ఎర్ర ద్రాక్షలో విటమిన్ ఎ,  సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం, కాపర్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ  శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలు. ఎర్ర ద్రాక్ష వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓ లుక్కేస్తే...  రోగనిరోధక వ్యవస్థ.. ఎర్ర ద్రాక్షను క్రమం తప్పకుండా తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు ఎముకలతో పాటు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. కంటి ఆరోగ్యం.. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎర్ర ద్రాక్ష మంచి ఎంపిక. ఎర్ర ద్రాక్ష ఆక్సీకరణ ఒత్తిడిని,  కళ్ల మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎర్ర ద్రాక్షను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కంటిశుక్లం రాకుండా చేస్తుంది. బీపీ పై నియంత్రణ.. ఎర్ర ద్రాక్ష తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్,  ఫినోలిక్ యాసిడ్లు గుండెను వ్యాధుల నుండి రక్షించడానికి పని చేస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని  మెరుగుపరుస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యం.. ఎర్ర ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్,  యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కిడ్నీ సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి.  కిడ్నీ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియ.. ఎర్ర ద్రాక్షలో ఉండే పొటాషియం,  ఫైబర్  జీర్ణక్రియకు సహాయపడతాయి. జీర్ణ సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా ఎర్ర ద్రాక్షను ఆహారంలో చేర్చుకోవాలి. కొలెస్ట్రాల్‌.. ఎర్ర ద్రాక్ష కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.  ఆహారంలో ఎర్ర ద్రాక్షను చేర్చుకోవడం ద్వారా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. ఇది జ్ఞాపకశక్తిని,  మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా అల్జీమర్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.                                                    *నిశ్శబ్ద.