LATEST NEWS
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది. దేశ రాజధాని వెలుపల తొలిసారిగా నిర్వహించిన ఈ వేడుక 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని చాటుతూ దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రతిభను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ఈ కార్యక్రమంలో దేశరాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దిగ్గజ నటులు, దర్శకులు  సాంకేతిక నిపుణులు తమ పురస్కారాలను అందుకున్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో విశేష సేవలందించినందుకు గాను ప్రముఖ దిగ్గజ నటుడు అనంత నాగ్‌ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుని అందరి ప్రశంసలు పొందారు. ఉత్తమ నటుడిగా సంయుక్తంగా ఇద్దరు దిగ్గజ నటులు ఈ పురస్కారాన్ని దక్కించుకోవడం విశేషం. 'చందూ ఛాంపియన్' చిత్రంలోని అద్భుతమైన నటనకు గాను కార్తీక్ ఆర్యన్, అలాగే 'భ్రమయుగం' చిత్రంలో విలక్షణ నటనతో మెప్పించిన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఉత్తమ నటుడిగా సంయుక్తంగా జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ముఖ్యంగా మమ్ముట్టి తన విజయంతో అందరి అభినందనలు అందుకుంటూ స్టేడియంలో స్టాండింగ్ ఒవేషన్ పొందారు. ఇక ఉత్తమ నటి విషయానికి వస్తే, 'ఆర్టికల్ 370' చిత్రంలో అసాధారణ అభినయాన్ని ప్రదర్శించిన యామీ గౌతమ్ ఉత్తమ నటి పురస్కారాన్ని దక్కించుకున్నారు. అలాగే ఇదే చిత్రం ఉత్తమ చలన చిత్రంగా ఆర్టికల్ 370గా నిలవడం విశేషం. దర్శకత్వం  సాంకేతిక విభాగాల్లోనూ పలు చిత్రాలు జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. 'అమరన్' చిత్రానికి గాను రాజ్‌కుమార్ పెరిసామి ఉత్తమ దర్శకుడిగా ఎంపిక కాగా, ఇదే చిత్రానికి గాను జీవీ ప్రకాష్ కుమార్ ఉత్తమ నేపథ్య సంగీతం, ఆర్. కలైవనన్ ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలు సాధించారు. ఇక తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణంగా, టాలీవుడ్ నుంచి 'కల్కి 2898 ఏడీ' చిత్రం ఉత్తమ వినోదాత్మక ప్రజాదరణ పొందిన చిత్రంగా (Best Popular Film Providing Wholesome Entertainment) నిలిచింది. అలాగే 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. ఈ చిత్రానికి సంబంధించి పీ రవికుమార్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ పురస్కారాన్ని దక్కించుకోవడం విశేషం. అలాగే పిల్లల చిత్రాల విభాగంలో 'చిన్న కథ కాదు' ఉత్తమ బాలల చిత్రంగా నిలిచింది. మిగతా విభాగాలకు వస్తే, 'పుష్ప 2' చిత్రం నుంచి సుకుమార్ ఉత్తమ స్క్రీన్ ప్లే, దీపాలి నూర్ మరియు శీతల్ శర్మ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో అవార్డులు గెలుచుకున్నారు. అలాగే 'లక్కీ భాస్కర్' చిత్రానికి గాను వెంకీ అట్లూరి ఉత్తమ సంభాషణల రచయితగా నిలిచారు. 'మహారాజా' చిత్రానికి అన్ అరాసు ఉత్తమ యాక్షన్ డైరెక్షన్‌గా, 'భ్రమయుగం' చిత్రానికి షెహనాద్ జలాల్ ఉత్తమ సినిమాటోగ్రఫీగా ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ భాషల నుంచి ఎంపికైన ఈ విజేతలందరితో గుజరాత్‌లోని ఏక్తా నగర్ వేదికగా భారతీయ సినీ కళా వైభవం అంబరాన్ని అంటింది.     [ 72nd National Film Awards, Mammootty, Kartik Aaryan, Kalki 2898 AD, Committee Kurrollu, National Film Awards winners,  Telugu One, Telugu News  ]  
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు  పండుగ రోజు. దివంగత ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహావిష్కరణకు తొలిసారి నియోజకవర్గానికి ఆనందంగా ఉందని రాప్తాడు ఎమ్మెల్యే, మాజీమంత్రి పరిటాల సునీత అన్నారు. రాప్తాడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో సునీతమ్మ మాట్లాడుతూ... రాప్తాడు నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో చాలామందిని ఇబ్బంది పెట్టారు. కనీసం పెళ్లిళ్లకు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు. కార్యకర్తలు బెదరకుండా ధైర్యంతో నిలబడ్డారు. ఎన్టీఆర్ పిలుపుమేరకు పరిటాల రవీంద్ర రాజకీయాల్లోకి వచ్చారు. నాడు అన్న ఎన్టీఆర్ వద్దన్నా మంత్రి పదవి ఇచ్చి ఆదరించారు. చంద్రబాబు పిలుపుమేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను.  ఆనాడు కార్యకర్తలే నా వెన్నంటి నడిపించారు. చంద్రబాబు మూడుసార్లు టిక్కెట్ ఇచ్చి, ఒకసారి మంత్రినిచేసి మా కుటుంబాన్ని ఆదరించారు.  గత ప్రభుత్వంలో నాపై 22, శ్రీరామ్‌పై 34, కార్యకర్తలపై 20కి పైగా కేసులు పెట్టారు. ఆ కేసుల గురించి ఆలోచించాలని లోకేష్‌ను  కోరుతున్నా. రాప్తాడు నియోజకవర్గంలో అన్ని సామాజికవర్గాలు మాకు అండగా నిలబడ్డాయి. ప్రత్యర్థులు చేతిలో ప్రాణాలు కోల్పోయిన తగరకుంట ప్రభాకర్  ఆరుగురి బిడ్డలను చంద్రబాబు చదివించి ప్రయోజకులను చేశారు. పరిటాల రవితోపాటు చనిపోయిన వారి పిల్లలను చదివించారు. వాడుకుని పక్కనపడేసే పార్టీ కాదు తెలుగుదేశం. రాప్తాడు నియోజకవర్గంలో 11మందికి కార్యకర్తల సంక్షేమనిధి అందించారు. యువనేత లోకేష్ కార్యకర్తలకు ధైర్యాన్నిస్తూ యువగళం పాదయాత్ర చేసి స్పూర్తినిచ్చారు.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వెనుక చంద్రబాబు, లోకేష్ రెక్కల కష్టం దాగిఉంది. అందువల్లే రాప్తాడులో దాదాపు 25వేలకు పైగా మెజారిటీ వచ్చింది. ఈ నియోజకవర్గంలో చిన్న సైకోను సాగనంపాలని ప్రజలు,కార్యకర్తలు నిర్ణయించుకొని, ఎన్నికల్లో నెరవేర్చుకున్నారు. రాప్తాడు నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందించే రూ.800 కోట్ల అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు అందించినందుకు కృతజ్జతలు. రైతులకు త్వరగా పరిహారం అందించాలని కోరుతున్నా. రాప్తాడు మండలంలో జూనియర్ కాలేజి మంజూరు చేయండి. రామగిరిలో హాస్టల్ భవనం, ఆత్మకూరులో కాలేజి మంజూరు చేయండి. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు వచ్చాకే స్కూళ్లు బాగుపడ్డాయి. చదువుకునే ప్రతిబిడ్డకు తల్లికి వందనం అందిస్తున్నారు. మీ ఆదేశాల మేరకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సునీత చెప్పారు.  స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించాలి..! హిందూపురం ఎంపి బికె పార్థసారధి మాట్లాడుతూ... దివంగత ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహావిష్కరణకు యువనేత లోకేష్ రాప్తాడు రావడం ఆనందంగా ఉంది. ఆనాడు పరిటాల రవీంద్ర  దివంగతులయ్యాక వచ్చిన ఎన్నికల్లో పార్టీ కేడర్ వెన్నుచూపకుండా 15వేల మెజారిటీతో పార్టీని గెలిపించారు. 2019లో అధికారం కోల్పోయాక బెదిరించారు. రామగిరి పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేశాం. ఎక్కడా భయపడలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చిన్నచిన్న విభేదాలను పక్కనబెట్టి ఏకపక్షంగా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి. 2019-24లో అభివృద్ధి జరగలేదు. చంద్రబాబు గారు హంద్రీనీవాను 3వేలకోట్లతో విస్తరించి కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లారు. యువనేత లోకేష్ యువగళంలో ఇచ్చిన 20లక్షల ఉద్యోగాల హామీమేరకు పరిశ్రమలు పెద్దఎత్తున ఎపికి వస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలి, పార్టీ బాగుంటేనే అందరం బాగుంటాం. మరో 20ఏళ్లు తెలుగుదేశం అధికారంలో ఉండాలని అన్నారు.  స్థానిక ఎన్నికల్లో ఇదే ఉత్సాహాన్ని కొనసాగించండి :శ్రీరామ్ ధర్మవరం ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ... మీ అందరి సహకారంతో లోకల్ బాడీలో అద్భుత విజయాన్ని సాధించబోతున్నాం.  పార్టీ కార్యకర్తలంతా గ్రామాల్లోకి వెళ్లి ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలి. యువగళం రథసారధి లోకేష్‌కు ఘనస్వాగతం పలికిన పార్టీ కేడర్‌కు  అభినందనలు తెలిపారు.  పార్లమెంటు పార్టీ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు మాట్లాడుతూ... కార్యకర్తల సంక్షేమం ధ్యేయం మొట్టమొదటిసారిగా కార్యకర్తల సంక్షేమనిధిని ఏర్పాటుచేసిన నాయకుడు లోకేష్. గత చీకటి పాలనను ఎదురొడ్డి యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రప్రజలకు అండగా నిలబడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ దుర్మార్గాలకు చరమగీతం పాడారు. ఒకవైపు రాష్ట్రాభివృద్ధి, మరోవైపు కార్యకర్తల సంక్షేమం కోసం శ్రమిస్తున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు ఆశయాలను కొనసాగిస్తున్న భవిష్యత్ నాయకుడు లోకేష్ అని కొనియాడారు.        [ Nara Lokesh, Paritala Sunitha, Rapthadu, TDP, Telugu Desam Party, Chandrababu Naidu, Paritala Ravindra, Paritala Sriram, BK Parthasarathi, TDP Cadre, Rapthadu TDP, Local Body Elections, Youth Gala, Upper Pennar Project, Telugu One, Telugu News  ]  
వైసీపీ అధినేత జగన్, ఆయన సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల మధ్య రాజకీయ, కుటుంబ వివాదాలు, విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి.  షర్మిల కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహం నేపథ్యంలో జగన్‌ను ఆమె కలిశారంటూ సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వారిరువురి మధ్యా సయోధ్య కుదిరిందనీ పెద్ద ఎత్తున వార్తలు వినవచ్చాయి. అయితే వీటన్నిటినీ ఖండిస్తూ షర్మిల జగన్ తో తన విభేదాలు కొనసాగుతున్నాయని పరోక్షంగానైనా క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో తాను జగన్ ను కలిసిన మాట వాస్తవమేననీ, అయితే అది కేవలం తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక అందించడానికేనని విస్పష్టంగా చెప్పారు. తాను జగన్ తో భేటీకి ఎటువంటి రాజకీయ కోణం లేదని కుండబద్దలు కొట్టేశారు.  జగన్-షర్మిల మధ్య ఉన్న రాజకీయ విభేదాలు,  ఆస్తుల వివాదం కారణంగా  గత కొన్నేళ్లుగా ఏ సందర్భంలోనైనా ఒకే  సందర్భంలో ఇరువురరూ కనిపిస్తే.. రాజకీయ అర్థాలు వెతకడం మామూలైపోయింది. వారి తండ్రి వైఎస్ జయంతి, వర్ధంతి సందర్భంగా ఇరువురూ ఇడుపుల పాయలో కలిస్తే.. ఇంకేముందు జగన్, షర్మిల మధ్య సయోధ్య అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడం రివాజుగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే షర్మిల తన కుమార్తె వివాహానికి జగన్ ను ఆహ్వానించడానికి వెళ్లడంతో మరోసారి ఆ ప్రాచారం ఉధృతమైంది.   ఈ నేపథ్యంలోనే షర్మిల క్లారిటీ ఇచ్చారు.   జగన్‌ను తాను గతంలో ఎప్పుడు కలిశారు, ఇప్పుడు ఎందుకు కలిశారన్న దానిపై ఆమె పూర్తి స్పష్టత ఇచ్చారు. గతంలో తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించిన సమయంలో జగన్‌ను కలిశాననీ, ఆ తరువాత ఇదిగో ఇప్పుడు, తన కుమార్తె వివాహానికి ఆహ్వానించడానికి కలిశాననీ విస్పష్టంగా చెప్పారు.  తమ కుటుంబంలో శుభకార్యానికి జగన్ నుఆహ్వానించడాన్ని రాజకీయ పరిణామంగా చూడకూడదన్నది షర్మిల అన్నారు. , తన కుమార్తె పెళ్లికి అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానిస్తానని, ఆ క్రమంలోనే జగన్ నూ ఆహ్వానించాననీ పేర్కొన్న షర్మిల ఇందులో ప్రత్యేకం ఏమీ లేదన్నారు. షర్మిల తాజాగా ఇచ్చిన క్లారిటీలో  కుటుంబ శుభకార్యాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేసినట్లైంది.  తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.   [YS Sharmila, Daughter Marriege, Invitation, YS Jagan Mohan Reddy, YS Anjili Reddy wedding, APCC Chief Sharmila, TeluguOne]
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'రాకా' చిత్రం విడుదలకు ముందే ఒక అరుదైన ఘనతను సాధించి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఆశ్చర్యపరిచింది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తుండగా, సన్ పిక్చర్స్ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త అప్‌డేట్ టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 'రాకా' సినిమా నిర్మాణ దశలోనే ఏకంగా ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.  హాలీవుడ్‌లో 'అవతార్' లాంటి అద్భుతమైన చిత్రాలకు వాడిన అత్యున్నత మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఈ సినిమా కోసం దర్శకుడు అట్లీ అత్యంత ప్రతిష్టాత్మకంగా వాడుతున్నారు. ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఒకేసారి రికార్డు స్థాయిలో 37 మంది నటుల హావభావాలను మరియు కదలికలను రియల్‌టైమ్‌లో మోషన్ క్యాప్చర్ చేయడం ద్వారా ఈ అరుదైన గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదైంది. 'Most People Motion-Captured in Real-Time' విభాగంలో ఈ రికార్డును సాధించడం ద్వారా భారతీయ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి మరోసారి చాటిచెప్పారు.  ఈ రికార్డుకు సంబంధించిన అధికారిక సర్టిఫికెట్‌ను గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు నేరుగా దర్శకుడు అట్లీకి మరియు హీరో అల్లు అర్జున్‌కు అందజేయడం విశేషం. మూడు విభిన్న కాలాల నేపథ్యంలో, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కేవలం కంటెంట్ పరంగానే కాకుండా టెక్నికల్ వాల్యూస్‌లోనూ సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేస్తున్న 'రాకా' చిత్రంపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. గిన్నిస్ రికార్డు సాధించడంతో ఈ సినిమాపై ఉన్న హైప్ ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకుంది.       [ Raaka Movie, Allu Arjun, Atlee, Guinness World Record, Motion Capture Technology, Deepika Padukone ]  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాకినాడ జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకుని ఆ పార్టీలో చేరారు. కాకినాడ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్‌ను కలిసిన వరుపుల సుబ్బారావు.. జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాలకు చెందిన పలువురు వైసీపీ మాజీ కౌన్సిలర్లు కూడా జనసేనలో చేరారు. వైసీపీ విధానాలు తనకు నచ్చకపోవడంతోనే పార్టీని వీడినట్లు వరుపుల సుబ్బారావు తెలిపారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్నప్పటికీ తనకు తగిన గౌరవం దక్కలేదని అన్నారు. గతంలో వైఎస్ జగన్ తన వయసు ఎక్కువైందని వ్యాఖ్యానించేవారని సుబ్బారావు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ విధానాలు నచ్చడంతోనే జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే జనసేనలో చేరేందుకు తాను ఎలాంటి పదవి, ప్రత్యేక హామీ లేదా కమిట్‌మెంట్‌ కోరలేదని స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. వరుపుల సుబ్బారావు గతంలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందించారు. 2014 నుంచి 2019 వరకు ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా కొనసాగారు. తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరడం కాకినాడ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాకినాడ జిల్లాలో వైసీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు పార్టీని వీడుతున్న నేపథ్యంలో వరుపుల సుబ్బారావు రాజీనామా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు పెద్దాపురం ప్రాంతానికి చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా త్వరలో జనసేనలో చేరనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.     [ Big shock for YCP, Former MLA Varupula Subbarao, Deputy CM Pawan Kalyan, Kakinada District,   Peddapuram, Samarlakota, YS Jagan, YSRCP,  Telugu One, Telugu News ]
ALSO ON TELUGUONE N E W S
నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వినగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆయన పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ. "కత్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తా", "చూడు ఒకవైపే చూడు.. రెండో వైపు చూడకు", "ఫ్లూటు జింక ముందు ఊదు... సింహం ముందు కాదు"... ఇలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడంలో బాలయ్యకు ఆయనే సాటి, ఆయనే పోటీ. అలాంటి బాలకృష్ణ ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ అందిస్తే ఆ హైప్ వేరే లెవెల్ లో ఉంటుంది. కానీ, ఎందుకనో బాలయ్య అలా వాయిస్ ఓవర్ అందించిన సందర్భాలు మాత్రం చాలా తక్కువే.  బాలకృష్ణ వాయిస్ ఓవర్ విషయానికొస్తే, మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది 2002లో వచ్చిన 'యువరత్న' సినిమా గురించి. తారకరత్న హీరోగా నటించిన ఈ సినిమాకు బాలకృష్ణ వాయిస్ ఓవర్ అందించారు. నిజానికి ఇది తారకరత్న హీరోగా నటించిన మొదటి సినిమా అయినప్పటికీ, రెండో సినిమాగా విడుదలైంది. తన నందమూరి కుటుంబం నుంచి వచ్చిన యువ హీరోని ప్రోత్సహించడం కోసం.. అప్పుడు అన్నయ్య హరికృష్ణతో కలిసి బాలకృష్ణ వాయిస్ అందించారు. ఆ సినిమా హరికృష్ణ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయ్యి, బాలయ్య వాయిస్ తో ఎండ్ అవుతుంది.  ఇక ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ బాలకృష్ణ ఒక సినిమా ట్రైలర్ కు వాయిస్ ఓవర్ అందించారు. అదే మలయాళ యాక్టర్ ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'. ఈ ట్రైలర్‌కు బాలయ్య వాయిస్ ఓవర్ అందించడం ఒక ఎత్తైతే.. అసలు ఆ సినిమా టైటిల్ రావడమే బాలయ్య ఐకానిక్ డైలాగ్ నుండి కావడం మరొక విశేషం. "డోంట్ ట్రబుల్ ది ట్రబుల్..." అంటూ బాలయ్య చెప్పిన మాస్ డైలాగ్ ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్కా మీడియా ప్రొడక్షన్, రాజమౌళి సమర్పణలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు బాలయ్య ఇచ్చిన వాయిస్ ఓవర్ ట్రైలర్‌కే ఓ రేంజ్ హైప్ తెచ్చిపెట్టింది. ఏది ఏమైనా తారకరత్న తర్వాత బాలకృష్ణతో వాయిస్ ఓవర్ చెప్పించుకున్న హీరోగా ఫహద్ ఫాజిల్ నిలిచాడు. ఇది కూడా చదవండి: సింహాద్రి 175 డేస్ రికార్డు.. ఎవరూ టచ్ చేయలేని రికార్డు సృష్టించిన ఎన్టీఆర్.! మీకు నచ్చవచ్చు: 'ప్రాణం ఖరీదు' వెనుక ఉన్న సీక్రెట్స్.. చిరంజీవి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.? తెలుగు సినిమాలో పౌరాణిక చిత్రాల ప్రయాణం.. ఎన్టీఆర్ నుంచి నేటి వారణాసి వరకు       [Balakrishna Voice Over Movies, NBK Voice Over Movies, Nandamuri Balakrishna, Dont Trouble The Trouble Trailer, Fahadh Fassil, SS Rajamouli, Taraka Ratna, Yuvarathna Movie, Telugu Film News, Telugu News]  
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘ఆదర్శ కుటుంబం – AK47’ సినిమా విడుదల తేదీ మారింది. తొలుత ప్రకటించిన తేదీ కంటే వారం ఆలస్యంగా, ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. నిజానికి అక్టోబర్ 9 కి ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా పడనుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. కానీ, మూవీ టీం మాత్రం ముందుగా ప్రకటించినట్టుగా అక్టోబర్ 2 నే వస్తామని చెప్పుకొచ్చింది. తీరా ఇప్పుడు రిలీజ్ డేట్ ఛేంజ్ చేస్తూ సర్ప్రైజ్ చేసింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో వెంకటేష్ పాత్రను పరిచయం చేస్తూ.. కామెడీ, ఎమోషన్, యాక్షన్ అంశాలతో టీజర్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఇది కూడా చదవండి: సింహాద్రి 175 డేస్ రికార్డు.. ఎవరూ టచ్ చేయలేని రికార్డు సృష్టించిన ఎన్టీఆర్.! ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. మీకు నచ్చవచ్చు: 'ప్రాణం ఖరీదు' వెనుక ఉన్న సీక్రెట్స్.. చిరంజీవి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.? తెలుగు సినిమాలో పౌరాణిక చిత్రాల ప్రయాణం.. ఎన్టీఆర్ నుంచి నేటి వారణాసి వరకు       [Aadarsha Kutumbam On October 9th, Aadarsha Kutumbam Release Date Changed, Aadarsha Kutumbam Postponed, Aadarsha Kutumbam October 9 Release, Victory Venkatesh, Trivikram Srinivas, Telugu Film News, Telugu News]  
మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్‌కు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. ‘పుష్ప’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఆయన.. ఇప్పుడు ఓ తెలుగు సినిమాలో హీరోగా అలరించేందుకు సిద్ధమయ్యారు. ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. రాజమౌళి సమర్పణలో వస్తున్న ఈ సినిమాపై ట్రైలర్ ఆసక్తిని పెంచుతోంది. ఈ ట్రైలర్‌కి నందమూరి బాలక‌ృష్ణ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ను చూస్తే ఈ సినిమా ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందినట్లు అర్థమవుతుంది. హైదరాబాద్ నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో ఫహాద్ ఫాజిల్ మ్యాజిక్‌లు చేసే వ్యక్తిగా కనిపించనున్నారు. అనాథగా ఉన్న ఓ చిన్నారితో అతడికి పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆ పాపతో హీరోకు ఎలాంటి అనుబంధం ఏర్పడింది? ఆమెకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు రావడంతో అతడి జీవితంలో ఎలాంటి సమస్యలు మొదలయ్యాయి? అనే అంశాలతో కథ సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ట్రైలర్‌లో ఫహాద్ ఫాజిల్ పాత్రను సరదాగా, అదే సమయంలో కొన్ని ఆసక్తికరమైన మలుపులతో చూపించారు. ఓ వైపు మ్యాజిక్‌లు చేస్తూ ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం కనిపిస్తుండగా.. మరోవైపు పాపకు వచ్చిన సూపర్ పవర్స్ కారణంగా కథలో అసలు సమస్య మొదలవుతుందని తెలుస్తోంది. ఫాంటసీ, కామెడీ, ఎమోషన్ అంశాలను కలిపి సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఇదిలా ఉంటే.. ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ సినిమాను ఎస్‌.ఎస్‌. రాజమౌళి సమర్పిస్తున్నారు. ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ, రాజమౌళి తనయుడు ఎస్‌.ఎస్‌. కార్తికేయ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో సినిమాపై ప్రారంభం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ఫహాద్ ఫాజిల్ విషయానికి వస్తే.. మలయాళ సినిమాలతో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ‘పుష్ప’లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇప్పుడు ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’తో నేరుగా తెలుగు సినిమాలో హీరోగా కనిపించనుండటం విశేషం. మొత్తంగా చూస్తే.. మ్యాజిక్ చేసే హీరో, అనాథ పాప, ఆమెకు వచ్చే ప్రత్యేక శక్తులు, వాటి కారణంగా ఎదురయ్యే సమస్యలు.. ఇలా విభిన్నమైన కాన్సెప్ట్‌తో ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ తెరకెక్కినట్లు ట్రైలర్ చెబుతోంది. మరి ఈ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.     [Fahadh Faasil, Dont Trouble The Trouble, Dont Trouble The Trouble Trailer, Fahadh Faasil Telugu Movie, Fahadh Faasil New Movie, SS Rajamouli, SS Karthikeya, Shobu Yarlagadda, Fahadh Faasil Fantasy Movie, Telugu Movie Trailer, Tollywood News, Malayalam Star Fahadh Faasil]
2003 జులై 9న విడుదలైన 'సింహాద్రి' సినిమా తెలుగు చిత్రసీమ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ ఎలాంటిదో ఇప్పటి తరానికి ఊహించడం కూడా కష్టమే. కేవలం 20 ఏళ్ల వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ తన నటవిశ్వరూపంతో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అసలు ఈ సినిమా రికార్డుల విషయానికి వస్తే.. ఆ కాలంలో ఉన్న పెద్ద పెద్ద మాస్ సినిమాల రికార్డులన్నింటినీ 'సింహాద్రి' ఒక్కదెబ్బతో తుడిచిపెట్టేసింది. 150కి పైగా కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకోవడమే కాకుండా, ఏకంగా 52 డైరెక్ట్ సెంటర్లలో 175 రోజులు దిగ్విజయంగా ప్రదర్శించబడి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. షిఫ్టులతో కలిపి చూస్తే 55 సెంటర్లలో ఈ చిత్రం 175 రోజుల వేడుకలు జరుపుకోవడం అప్పట్లో ఒక ఊహించని సంచలనం. ఇప్పుడు 175 రోజుల రికార్డు సంగతి అటుంచితే, అసలు 50 రోజులు ఆడటం కూడా వింతే. ఎంతటి గొప్ప సినిమా అయినా రెండు నుంచి నాలుగు వారాలకే పరిమితమవుతున్నాయి. ఈ లెక్కన 'సింహాద్రి' 175 రోజుల రికార్డు ఎప్పటికీ బ్రేక్ అవ్వకుండా, చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు.  ఇది కూడా చదవండి: 'ప్రాణం ఖరీదు' వెనుక ఉన్న సీక్రెట్స్.. చిరంజీవి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.? మీకు నచ్చవచ్చు: రాయిని ఆడది చేసిన రాముడివా.. 44 ఏళ్ళ క్రితం వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ సాంగ్.! ఇండియాస్ రియల్ జేమ్స్ బాండ్.. RAW వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ ఇతనే.!       [Simhadri 175 Days Record, Simhadri 175 Days Centers, Simhadri Movie Records, Simhadri Industry Hit, Simhadri All Time Record, Rajamouli Simhadri Movie, Jr NTR Simhadri Movie, Telugu Film News, Telugu News]  
Victory Venkatesh and Trivikram Srinivas’ much-awaited entertainer Aadarsha Kutumbam - AK47 will now release worldwide on October 9, 2026. The makers have decided to postpone the release by a week to bring the film to audiences with the complete entertainment experience it deserves. The recently released teaser, which offers a glimpse into Venkatesh’s middle-class family world filled with fun, emotions and action, has received a strong response from audiences. Written and directed by Trivikram Srinivas, the film stars Venkatesh, Srinidhi Shetty, Nara Rohith, Nivetha Pethuraj, Rao Ramesh, Satya, Brahmaji, Vennela Kishore and others. Produced by S. Radha Krishna under Haarika & Hassine Creations, with Music by Thaman S, Aadarsha Kutumbam - AK47 is now set to arrive in theatres worldwide a week later and it is expected to create a grand sensation everywhere.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
టాలీవుడ్‌లో తనదైన కామెడీ, ఎంటర్‌టైనింగ్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు ఓ అభిమాని ఊహించని విధంగా తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. దీంతో అనిల్ రావిపూడి అసహనం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో అనిల్ రావిపూడిని కలిసేందుకు ఓ అభిమాని వచ్చాడు. ఈ సందర్భంగా అతడు దర్శకుడి కాళ్లపై పడి నమస్కరించాడు. వెంటనే స్పందించిన అనిల్ రావిపూడి.. తన కాళ్లపై ఎందుకు పడుతున్నారని ప్రశ్నించారు. అభిమాని అలా చేయడాన్ని సున్నితంగా వారించారు. ఇది కూడా చదవండి: రోజుకు రూ.100 కోట్లు ఇచ్చినా రాను.. ఐశ్వర్యలక్ష్మి షాకింగ్ కామెంట్స్ అనంతరం తనకు అభిమానులంటే ఎంతో గౌరవం ఉందని అనిల్ రావిపూడి చెప్పినట్లు సమాచారం. తనను ఒక దర్శకుడిగా, మనిషిగా అభిమానించడం తనకు సంతోషమేనని.. అయితే ఇలా కాళ్లపై పడటం మాత్రం తనకు నచ్చదని స్పష్టం చేశారు. అభిమానులు తనను గౌరవిస్తే చాలని, ఇలాంటి విధానాల్లో అభిమానం చూపించాల్సిన అవసరం లేదని సూచించారు. ఈ సందర్భంగా తాను సాయిబాబా గుడి నిర్మిస్తున్నానని కూడా అనిల్ రావిపూడి చెప్పినట్లు తెలుస్తోంది.అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనిల్ రావిపూడి స్పందించిన తీరుపై నెటిజన్లు కూడా చర్చించుకుంటున్నారు. అభిమానులు తమ అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యక్తం చేస్తుంటారు. అయితే అభిమాని తన కాళ్లపై పడటాన్ని అనిల్ రావిపూడి సున్నితంగా అడ్డుకోవడం ఈ వీడియోలో ప్రత్యేకంగా కనిపిస్తోంది. మీకు నచ్చవచ్చు: నిర్మాత ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి, పవన్‌కళ్యాణ్ తీసుకున్న సంచలన నిర్ణయం     [Anil Ravipudi, Anil Ravipudi Fan, Anil Ravipudi Viral Video, Anil Ravipudi Latest News, Anil Ravipudi Fan Event, Anil Ravipudi Reaction, Mana Shankara Vara Prasad Garu, Chiranjeevi, Chiranjeevi Anil Ravipudi, Tollywood News, Telugu Cinema News]
టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విభిన్నమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్న ఆమె.. ఇప్పుడు ‘మైసా’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రష్మికపై దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని పెంచుతున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతూ రవీంద్ర పుల్లే సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా తన సినిమా ‘మైసా’ గురించి కూడా ప్రస్తావించారు. ఈ సినిమా ప్రయాణంపై నమ్మకం ఉంచి తమకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా రష్మిక మందన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. ఇది కూడా చదవండి: రోజుకి 100 కోట్లు ఇచ్చినా రాను.. ఐశ్వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్. ‘మైసా’ సినిమాను నమ్మి తనతో ఎంతో విశ్వాసంగా రష్మిక ముందుకు సాగారని రవీంద్ర పుల్లే పేర్కొన్నారు. ఈ సినిమా కోసం ఆమె నిజాయితీ, అంకితభావంతో పనిచేశారని ప్రశంసించారు. రష్మికతో కలిసి పనిచేయడం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని, ఆమె ఈ ప్రయాణంలో ముఖ్యమైన భాగం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆమె చూపించిన నిబద్ధత తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని దర్శకుడు వెల్లడించారు. ఇక ‘మైసా’ విషయానికి వస్తే.. రష్మిక ఈ సినిమాలో ఇప్పటివరకు కనిపించని సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. గోండు గిరిజన మహిళ పాత్రలో ఆమె నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో రష్మిక యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు. ఆయుధాలు చేతబట్టి పోరాడే పవర్‌ఫుల్ పాత్రలో ఆమె కనిపించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ పాత్ర కోసం రష్మిక ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. యాక్షన్ సన్నివేశాల కోసం ఆమె తీవ్రంగా శ్రమించినట్లు సమాచారం. సినిమా షూటింగ్‌లో భాగంగా కీలకమైన యాక్షన్, అండర్‌వాటర్ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘మైసా’లో రష్మికతో పాటు పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. నవంబర్ 27, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మీకు నచ్చవచ్చు: నంది అవార్డులు పున:ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే ప్యారడైజ్ సినిమా చూశాక.. నా దగ్గరకి రావడానికి కూడా భయపడతారు       [Rashmika Mandanna, Rashmika Mandanna Maisa, Maisa Movie, Maisa Movie Telugu, Rashmika Maisa, Ravindra Pulle, Ravindra Pulle Comments, Maisa Director, Rashmika Dedication, Rashmika Action Movie, Maisa Teaser, Rashmika Mandanna Movies, Telugu Cinema, Tollywood News]
The Andhra Pradesh government is bringing back the prestigious Nandi Awards to honor the outstanding talent in the Telugu film and television industry. FDC Chairman P. Bharath Bhushan announced that the government will present the previously declared awards for the years 2012 to 2016. To bridge the recent gap, four awards per year will be given for the 2017 to 2024 period, which includes two production and two special jury awards. The awards for the year 2025 will also been officially confirmed. All the awards will be distributed by December 2026. The process will begin with the formation of selection committees in October, followed by the finalization of winners in November. The award ceremonies are scheduled to take place in December. The Nandi Film and National Film Awards will be hosted in either Amaravati or Vijayawada, while the Nandi TV Awards will take place in Tirupati. A total of 46 awards will be presented in the film category and 48 in the television segment, covering various crafts including acting, directing, and technical brilliance. The National Film Awards segment will carry significant cash prizes, including five lakhs for the NTR National Film Award, and two lakhs each for the BN Reddy, Nagireddy-Chakrapani, and Raghupathi Venkaiah awards. Winners across all categories will receive gold, silver, bronze, or copper Nandi idols along with cash rewards and appreciation certificates. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
వరుణ్ సందేశ్, వితికా శేరు దంపతులు దాదాపు పదకొండేళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారనే వార్తలతో ‘డియర్ ఆస్ట్రోనాట్’ సినిమాపై మొదట్లో ఆసక్తి ఏర్పడింది. ముఖ్యంగా ఈ చిత్రంలో వితికా శేరు వ్యోమగామి పాత్రలో కనిపించనున్నారని, చిన్నప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలనే కలను సాకారం చేసుకునే ఓ మహిళ కథగా సినిమా తెరకెక్కుతోందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొద్ది రోజుల క్రితం తాను, తన భర్త వరుణ్ సందేశ్ ‘డియర్ ఆస్ట్రోనాట్’ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వితికా శేరు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్ని వివాదాస్పదం చేయడం తమ ఉద్దేశం కాదని, అయితే ఇకపై ఈ ప్రాజెక్ట్‌తో తమకు సంబంధం లేదని ఆమె పేర్కొన్నారు. సినిమా కారణంగా తాము కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నట్లు ఆమె చేసిన ప్రకటనను బట్టి తెలుస్తోంది. అయితే ఈ జంట స్థానంలో ఎవరిని తీసుకుంటారనే విషయం మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుంచి తాజాగా మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రముఖ దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో డేవిడ్ థామస్ అనే పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. దర్శకుడు కార్తీక్ భాగ్యరాజా మాట్లాడుతూ.. గౌతమ్ మీనన్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని, సినిమాలో ఆయన క్యారెక్టర్ హైలైట్‌గా నిలుస్తుందని తెలిపారు. ‘డియర్ ఆస్ట్రోనాట్’ కథ విషయానికి వస్తే.. చిన్నప్పటి నుంచి అంతరిక్షంలోకి వెళ్లాలని, నక్షత్రాల మధ్య విహరించాలని కలలు కనే ఓ మహిళ తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంది అనేదే ప్రధాన కథాంశం. ఆకాశాన్ని అందుకోవాలనే ఆమె ఆశయం వెనుక ఉన్న సవాళ్లు, పట్టుదల, ఆశ, భావోద్వేగాలను సినిమాలో చూపించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. దీంతో ఇది సాధారణ ప్రేమకథకు భిన్నంగా స్ఫూర్తిదాయకమైన కథగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇక సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని దర్శకుడు తెలిపారు. అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు, ఇకపై సినిమాలోని ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ ‘క్యారెక్టర్ రివీల్ వీక్’ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే మొదటగా గౌతమ్ మీనన్ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు. మరోవైపు ప్రధాన పాత్రలో నటించిన వితికా శేరు, కీలక పాత్రలో ఉన్న వరుణ్ సందేశ్ సినిమా నుంచి తప్పుకున్న నేపథ్యంలో.. వారి పాత్రలను మళ్లీ ఇతర నటీనటులతో షూట్ చేస్తారా? లేక ఏదైనా పరిష్కారం ద్వారా ఈ జంటను తిరిగి ప్రాజెక్ట్‌లోకి తీసుకొస్తారా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై చిత్రబృందం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. మనస్విని భాగ్యరాజా సమర్పణలో యువన్ కృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. కార్తీక్ భాగ్యరాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ బి. కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు.     [Dear Astronaut, Dear Astronaut Movie, Dear Astronaut First Look, Gautham Vasudev Menon, Gautham Menon Dear Astronaut, Varun Sandesh, Vithika Sheru, Vithika Sheru Dear Astronaut, Dear Astronaut Telugu Movie, Karthik Bhagyaraja, Dear Astronaut Character Reveal, Dear Astronaut October Release, Telugu Cinema, Tollywood News]
Nani's highly awaited pan-India entertainer 'The Paradise' is ready for a grand worldwide theatrical release on September 24. Produced by Sudhakar Cherukuri under the SLV Cinemas banner and directed by Srikanth Odela, the film features Kayadu Lohar as the female lead. During a recent press meet, the actress opened up about the massive scale of the film. Kayadu credited director Srikanth Odela for believing in her and giving her this career-defining opportunity. "Srikanth sir is a very different director with a great vision. He gave me a lot of challenges, and I believe our hard work will yield great results," she shared, adding that sharing the journey with talents like Nani and Anirudh is a great experience. She revealed that she loved Nani's character in the film. She said, "Nani will be seen with dreadlocks in this film. Acting and performing action sequences like that is not easy at all. He worked very hard for this film. His journey is very inspiring, and I learned a lot from him." Kayadu further called him a very sweet and down-to-earth person with no starry tantrums.  She also had great words of appreciation for the passionate production values of the movie. "Sudhakar sir is a very sweet and genuine person who has immense passion for movies. This is a very huge project, and it was produced without compromising anywhere," Kayadu noted. On a final note, she teased the audience about her character and the film's overall commercial appeal. "I play Subbulakshmi, a very crucial character with many surprises. Overall, The Paradise is like a full commercial package that will give audiences a theatrical adrenaline rush," she confidently stated.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
నిద్ర పట్టడం లేదా బెడ్‌పై ఈ వస్తువులు అస్సలు పెట్టకండి! రోజంతా అలసిపోయినా రాత్రి పడుకున్న తర్వాత సరిగ్గా నిద్ర పట్టడం లేదా? తరచూ నిద్ర మధ్యలో మెలకువ రావడం, నిద్ర సరిగా లేకపోవడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. నిద్రలేమి వల్ల మరుసటి రోజు అలసట, చిరాకు, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మంచి నిద్ర కోసం మనం తీసుకునే ఆహారం, జీవనశైలి, నిద్రించే సమయం మాత్రమే కాకుండా పడకగదిలోని వాతావరణం కూడా ముఖ్యమని వాస్తు నిపుణుడు దంతూరి పండరినాథ్ గారు వివరిస్తున్నారు. ముఖ్యంగా బెడ్‌పై లేదా పడక దగ్గర ఎలాంటి వస్తువులు ఉంచకూడదు?అవి నిద్రకు ఎలా ఆటంకం కలిగిస్తాయి? నిద్రలేమికి కారణమయ్యే అంశాలు ఏమిటి? మంచి నిద్ర కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకోవచ్చు. నిద్ర సరిగా పట్టకపోవడం, తరచూ నిద్రకు ఆటంకం కలగడం వంటి సమస్యలు ఉన్నవారు ఈ వీడియోలోని సూచనలను తెలుసుకోండి. అలాగే నిద్ర సమస్యలు నిరంతరం కొనసాగితే వైద్య నిపుణుల సలహా తీసుకోవడం కూడా ముఖ్యం. మంచి నిద్ర కోసం బెడ్‌పై ఉంచకూడని వస్తువులు, నిద్రలేమికి కారణాలు, పాటించాల్సిన జాగ్రత్తలు  తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి.
మన వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయల్లో బంగాళాదుంప (ఆలూ) మొదటి వరుసలో ఉంటుంది. వేపుడు, కుర్మా, ఫ్రైస్ లేదా సమోసాలు.. వంటకం ఏదైనా సరే ఆలూ ఉంటే ఆ రుచే వేరు. అయితే ఇల్లాళ్లకు, వంట ప్రియులకు నిత్యం ఎదురయ్యే ఒక పెద్ద సమస్య ఏమిటంటే.. బంగాళాదుంపల పొట్టు తీసి ముక్కలుగా కోసి పక్కన పెట్టగానే అవి కొద్ది నిమిషాల్లోనే నల్లగా లేదా గోధుమ రంగులోకి మారిపోతుంటాయి. అలా రంగు మారిన దుంపలను చూస్తే వంట చేయాలనే ఉత్సాహం తగ్గడమే కాకుండా, అవి పాడైపోయాయేమోననే అనుమానం కూడా వస్తుంది. సాధారణంగా ఉదయం పూట ఆఫీసులకు, పిల్లల స్కూల్ బాక్సులకు త్వరగా వంట పూర్తి చేయాలని ముందుగానే ఆలూ ముక్కలను కోసి పెట్టుకునే వారికి ఈ సమస్య మరింత చిరాకు కలిగిస్తుంది. అసలు బంగాళాదుంప ముక్కలు అంత వేగంగా ఎందుకు నల్లగా మారతాయి? దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? మరియు అలా మారకుండా ఎల్లప్పుడూ తెల్లగా, ఫ్రెష్‌గా ఉంచడానికి ఉపయోగపడే కిచెన్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బంగాళాదుంపలు నల్లగా మారడానికి ప్రధాన కారణం  ఎంజైమాటిక్ బ్రౌనింగ్  (Enzymatic Browning) అనే సహజమైన రసాయన చర్య. బంగాళాదుంపల్లో పాలీఫెనాల్ ఆక్సిడేస్ (Polyphenol Oxidase) అనే ప్రత్యేకమైన ఎంజైమ్‌తో పాటు ఫినోలిక్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. మనం దుంపను చాకుతో కోసినప్పుడు, దానిలోని కణాలు దెబ్బతిని లోపలి భాగం నేరుగా గాలిలోని ఆక్సిజన్‌తో స్పర్శలోకి వస్తుంది. ఈ ఆక్సిజన్, ఎంజైమ్‌లతో చర్య జరపడం వల్ల మెలనిన్ (Melanin) అనే నల్లటి వర్ణద్రవ్యం ఉత్పత్తి అవుతుంది. ఇదే ఆలూ ముక్కలు రంగు మారడానికి అసలు కారణం. ఈ మార్పు వల్ల రుచిలో పెద్దగా తేడా రాకపోయినా, చూడటానికి అస్సలు బాగుండవు. పైగా ఇలా గాలికి ఎక్కువసేపు ఉంచడం వల్ల అందులోని కొన్ని నీటిలో కరిగే పోషకాలు కూడా నశించే అవకాశం ఉంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి మన వంటింట్లోనే దొరికే కొన్ని సులువైన పదార్థాలతో అద్భుతమైన పరిష్కారాలు కనుగొనవచ్చు. మొదటిది మరియు అత్యంత ప్రభావవంతమైన పద్ధతి  చల్లని నీటి చిట్కా . బంగాళాదుంపలను కోసిన వెంటనే గాలి తగలకుండా ఐస్ వాటర్ లేదా చల్లని నీళ్లు ఉన్న గిన్నెలో మునిగేలా వేయాలి. నీరు ఆక్సిజన్‌కు, ఆలూ ముక్కలకు మధ్య ఒక కవచంలా పనిచేసి ఆక్సీకరణ ప్రక్రియను అడ్డుకుంటుంది. నీటిలో 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టడం వల్ల ముక్కలలో ఉండే అదనపు స్టార్చ్ బయటకు వచ్చి, ఫ్రైస్ చేసినప్పుడు అవి మరింత క్రిస్పీగా వస్తాయి. ఇంకా ఎక్కువ సమయం అంటే 4 నుంచి 5 గంటల పాటు నిల్వ ఉంచాలనుకుంటే, ఆ నీటిలో అర టీస్పూన్ నిమ్మరసం లేదా కొద్దిగా తెల్ల వెనిగర్ (White Vinegar) కలపాలి. నిమ్మరసంలోని విటమిన్ సి (ఆస్కార్బిక్ యాసిడ్) మరియు వెనిగర్‌లోని అసిడిటీ ఎంజైమ్‌ల పనితీరును పూర్తిగా నిరోధించి ముక్కలు గంటల తరబడి తెల్లగా మెరిసేలా చేస్తాయి. మరొక అద్భుతమైన మార్గం  ఉప్పు నీటి శుద్ధి . ఒక లీటర్ నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు కలిపి అందులో కోసిన బంగాళాదుంప ముక్కలను వేసి ఉంచడం వల్ల అవి రంగు మారవు. ఉప్పు నీరు ఎంజైమాటిక్ చర్యను మందగించేలా చేస్తుంది. అలాగే, వంటను మరుసటి రోజుకి ప్లాన్ చేసుకుంటుంటే, ముక్కలను నీటిలో వేసి గాలి చొరబడని ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే 24 గంటల పాటు అవి ఏమాత్రం రంగు మారకుండా తాజాగా ఉంటాయి. ఒకవేళ మీరు ముక్కలను నీటిలో వేయకూడదు అనుకుంటే, వాటిపై కొద్దిగా వంటనూనె (Cooking Oil) రాసి గాలి తగలకుండా ఉంచవచ్చు. ఈ చిన్న చిన్న కిచెన్ హాక్స్ పాటించడం వల్ల వంటగదిలో మీ సమయం ఆదా అవ్వడమే కాకుండా, బంగాళాదుంపలతో చేసే ప్రతి వంటకం ఎంతో రుచిగా, ఆకర్షణీయంగా మారుతుంది.     [ Potatoes, Potato Browning, Enzymatic Browning, Polyphenol Oxidase, Potato Storage, Kitchen Hacks, Prevent Potato Browning, Cold Water Soak, Lemon Juice, White Vinegar ]
మనం రోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నప్పుడు లేదా నిమ్మకాయతో చేసిన వంటకాలను తింటున్నప్పుడు ఎప్పుడో ఒకసారి పొరపాటున నిమ్మ విత్తనం (నిమ్మ గింజ) నోట్లోకి వెళ్లడం, దాన్ని అనుకోకుండా మింగేయడం మనందరికీ ఏదో ఒక సందర్భంలో జరిగే సాధారణ విషయమే. అయితే, అలా గింజ లోపలికి వెళ్లగానే చాలామందిలో ఒకరకమైన అపరిమితమైన భయం, ఆందోళన మొదలవుతాయి. చిన్నప్పుడు సరదాగా విన్నట్లు కడుపులో చెట్టు మొలుస్తుందేమోననే అమాయకపు ఆలోచన నుంచి, ఆ గింజ కడుపులోని ప్రేగుల్లో ఎక్కడైనా అడ్డుపడి తీవ్రమైన ప్రమాదానికి దారితీస్తుందేమోననే ఆరోగ్య భయాల వరకు మనస్సును ఎన్నో ప్రశ్నలు చుట్టుముడతాయి. కానీ, నిజంగానే మన జీర్ణవ్యవస్థలోకి నిమ్మ గింజ వెళ్లినప్పుడు మన శరీరంలో అసలు ఏం జరుగుతుంది? దానివల్ల ఆరోగ్యానికి ఏమైనా ముప్పు ఉందా లేదా అనేది సైన్స్ ఆధారంగా క్షుణ్ణంగా తెలుసుకోవడం ఎంతైనా అవసరం. మన మానవ జీర్ణవ్యవస్థ చాలా శక్తివంతమైనది, అద్భుతమైనది. నిమ్మ గింజ పరిమాణం సాధారణంగా చాలా చిన్నదిగా, మృదువైన లేదా సులభంగా జారే ఆకారంలో ఉంటుంది. మనం దాన్ని మింగిన వెంటనే అది అన్నవాహిక గుండా ప్రయాణించి నేరుగా జీర్ణాశయంలోకి చేరుకుంటుంది. మన జీర్ణాశయం (Stomach) లో అత్యంత శక్తివంతమైన హైడ్రోక్లోరిక్ ఆసిడ్ (HCl) ఉత్పత్తి అవుతుంది. ఈ ఆమ్లం జీర్ణక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. నిమ్మ గింజ పైన గట్టి పొర (Seed Coat) ఉన్నప్పటికీ, కడుపులోని శక్తివంతమైన ఆమ్లాలు దాని తీవ్రతను తగ్గిస్తాయి. నిజానికి నిమ్మ గింజలు విషపూరితమైనవి కావు. వాటిలో సెల్యులోజ్ అధికంగా ఉంటుంది. మానవ శరీరం సెల్యులోజ్‌ను సంపూర్ణంగా అరిగించుకోలేకపోయినప్పటికీ, మన జీర్ణనాళం ఆ గింజను ఒక వ్యర్థ పదార్థంగా భావించి ప్రేగుల ద్వారా ముందుకు నెట్టివేస్తుంది. అనుకోకుండా ఒకటి లేదా రెండు నిమ్మ గింజలను మింగడం వల్ల శరీరానికి ఎలాంటి హాని జరగదు. 99 శాతం సందర్భాల్లో ఈ గింజలు జీర్ణనాళం గుండా సురక్షితంగా ప్రయాణించి, మనకు తెలియకుండానే మలం రూపంలో శరీరం నుంచి బయటకు విసర్జించబడతాయి. వీటివల్ల కడుపులో చెట్లు మొలవడం అనేది కేవలం ఒక అపోహ మాత్రమే, ఎందుకంటే కడుపులోని ఆమ్ల వాతావరణం, ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఏ విత్తనం కూడా లోపల మొలకెత్తలేదు. పైగా, నిమ్మ గింజల్లో కొద్ది మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు, సాలిసిలిక్ యాసిడ్ వంటి సహజ మూలకాలు ఉంటాయి. కాబట్టి పొరపాటున ఒక చిన్న గింజ పొట్టలోకి వెళ్లినా అది ఎటువంటి విషపూరిత రసాయనాలను విడుదల చేయదు. అయితే, కొన్ని అరుదైన మినహాయింపులను మనం ఖచ్చితంగా గమనించాలి. చాలా చిన్న పిల్లలు లేదా జీర్ణ సంబంధిత తీవ్ర సమస్యలు ఉన్నవారు ఒకేసారి ఎక్కువ సంఖ్యలో నిమ్మ గింజలను నమలకుండా మింగితే, అవి ప్రేగుల్లో అడ్డుపడే (Intestinal Obstruction) స్వల్ప అవకాశం ఉంటుంది. అలాగే, నిమ్మ గింజను మింగేటప్పుడు అది జీర్ణనాళానికి బదులుగా శ్వాసనాళంలోకి వెళ్తే (Aspiration) తీవ్రమైన దగ్గు, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మింగిన తర్వాత తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, లేదా మింగడంలో ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. కానీ, సాధారణ పరిస్థితుల్లో ఒకటి లేదా రెండు నిమ్మ గింజలను మింగడం వల్ల ఎలాంటి భయం అవసరం లేదు. మీ శరీరం దానిని సహజంగానే బయటకు పంపించేస్తుంది.     [ Lemon Seeds, Swallowed Lemon Seed, Digestive System, Stomach Acid, HCl, Seed Digestion, Intestinal Health, Aspiration Risk, Intestinal Obstruction, Health Myths ]  
క్రియాటినిన్ అంటే ఏమిటి? మన శరీరంలో క్రియాటినిన్ స్థాయిలు ఎందుకు పెరుగుతాయి? క్రియాటినిన్ ఎక్కువగా ఉంటే కిడ్నీల పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలకు దీనికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ వీడియోలో Creatinine Test, Creatinine Levels, Kidney Functionగురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ Dr. Sree Bhushan Raju, MD, Nephrology వివరంగా తెలియజేస్తున్నారు. రక్తంలో క్రియాటినిన్ స్థాయిని ఎలా పరీక్షిస్తారు, రిపోర్టులో వచ్చే ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోవచ్చు.  క్రియాటినిన్ స్థాయి పెరగడానికి కిడ్నీ సమస్యలతో పాటు డీహైడ్రేషన్, కండరాలకు సంబంధించిన సమస్యలు, అధిక శారీరక శ్రమ వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. అందుకే ఒకసారి క్రియాటినిన్ ఎక్కువగా వచ్చిందని మాత్రమే కిడ్నీ ఫెయిల్యూర్ అని భావించకూడదు. అవసరమైన ఇతర పరీక్షలతో పాటు వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. కిడ్నీల ఆరోగ్యం, క్రియాటినిన్ స్థాయిలు, కిడ్నీ ఫిల్టరింగ్ సామర్థ్యం, గుండె ఆరోగ్యంతో ఉన్న సంబంధం గురించి ఈ వీడియోలో మరిన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
మెడలో గడ్డ లేదా వాపు కనిపించగానే చాలామందికి క్యాన్సర్‌ గురించి భయం మొదలవుతుంది. కానీ మెడలో వచ్చే ప్రతి గడ్డ క్యాన్సర్‌ కావాల్సిన అవసరం లేదు. థైరాయిడ్‌ సమస్యలు, లింఫ్‌ నోడ్స్‌ వాపు, ఇన్ఫెక్షన్లు తదితర కారణాల వల్ల కూడా మెడలో గడ్డలు ఏర్పడవచ్చు. మెడలో గడ్డలు ఎందుకు వస్తాయి? థైరాయిడ్‌ వాపు ఎలా ఉంటుంది? లింఫ్‌ నోడ్స్‌ ఎందుకు పెరుగుతాయి? మెడలో గడ్డ కనిపిస్తే ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి? సమస్యను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు అవసరం? వంటి ముఖ్యమైన విషయాలను సీనియర్ ENT, హెడ్ & నెక్ సర్జన్ డాక్టర్ అశోక్ పృథ్వీరాజ్ మొగంటి ఈ వీడియోలో సులభంగా వివరిస్తున్నారు. మెడలో గడ్డను నిర్లక్ష్యం చేయకుండా, దాని కారణాన్ని వైద్యుల సలహాతో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో మెడలో గడ్డలు, థైరాయిడ్‌ సమస్యలు, లింఫ్‌ నోడ్స్‌ వాపు మరియు అవసరమైన వైద్య పరీక్షల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. గమనిక: మెడలో గడ్డ లేదా వాపు ఉంటే స్వయంగా నిర్ధారణ చేసుకోకుండా వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ఎర్ర గోంగూర.. కేవలం తెలుగు రాష్ట్రాల రుచుల్లోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదిచుకుంది. ఆకుకూరల్లో గోంగూరకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తెల్ల గోంగూరతో పోలిస్తే ఎర్ర గోంగూరలో ఆరోగ్య గుణాలు, పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది దీని పులుపుదనం వల్ల లేదా పులుపు ఎక్కువైతే ఏమన్నా సమస్యలు వస్తాయేమోనని కాస్త దూరంగా ఉంటారు. కానీ, ఎర్ర గోంగూర రోజూ లేదా వారానికి రెండు మూడు సార్లు తింటే శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఉంటాయని ఆరోగ్య నిపుణులు  చెబుతున్నారు. అసలు ఎర్ర గోంగూరలో  ఉండే పోషకాలు ఏమిటి? ఎర్ర గోంగూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ విషయాలు తెలుసుకుంటే ఎర్ర గోంగూరను అస్సలు వదిలిపెట్టరు.  ఎర్ర గోంగూర గురించి వివరంగా తెలుసుకుంటే.. ఎర్ర గోంగూర అందించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రక్తహీనతకు చెక్ పెడుతుంది:  నేటి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రక్తహీనత. ఎర్ర గోంగూరలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో ఎర్ర గోంగూర ఒక సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది:  వయసు పెరిగే కొద్దీ ఎముకల బలహీనత, కీళ్ల నొప్పులు సహజంగా వస్తుంటాయి. ఎర్ర గోంగూరలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, భాస్వరం ఎముకలను దృఢంగా ఉంచడానికి ఎంతగానో తోడ్పడతాయి. చిన్నపిల్లల పెరుగుదలకు, ఎముకల ఎదగడానికి ఇది చాలా మంచిది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:  ఎర్ర గోంగూరలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును వేగవంతం చేసి, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. తిన్న ఆహారం త్వరగా అరగడానికి, పేగుల్లో ఉన్న వ్యర్థాలను బయటకు పంపడానికి ఇది సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:  ఈ ఆకుకూరలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తినందిస్తుంది. కంటి చూపు పెరిగేందుకు దోహదం చేస్తుంది:  ఎర్ర గోంగూరలో విటమిన్ ఏ తగినంత ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రేచీకటి, కళ్ళు పొడిబారడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తూ, దృష్టి లోపాలు రాకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యానికి రక్షణ:  ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా నిరోధించడంలో ఎర్ర గోంగూర  కీలకంగా పనిచేస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు:  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి, ముడతలు పడకుండా చూడటానికి ఇది దోహదపడుతుంది. అలాగే తలకు అవసరమైన పోషకాలను అందించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి:  ఎర్ర గోంగూరలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి, పీచు పదార్థం ఎక్కువ. ఇది తిన్న తర్వాత కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. దీంతో అతిగా తినే అలవాటు తగ్గి సులభంగా బరువు తగ్గొచ్చు. ఇన్ని రకాల ఔషధ గుణాలు ఉన్న ఎర్ర గోంగూరను  దైనందిన ఆహారంలో పప్పు రూపంలోనో, పచ్చడి రూపంలోనో లేదా ఇతర కూరల్లో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.                       *రూపశ్రీ.