LATEST NEWS
హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో జరిగే గణేష్ లడ్డూ వేలంపాటలు ప్రతిసారీ దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. తాజాగా నగరంలోని బండ్లగూడ జాగీర్ పరిధిలో ఉన్న విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన లడ్డూ వేలం అంబరాన్ని అంటింది. కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన లడ్డూ వేలంలో స్థానిక నివాసితులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక వేలంపాటలో రికార్డు స్థాయిలో పోటీ నెలకొంది. చివరకు ఈ లడ్డూ ఏకంగా కోటి ఎనభై ఏడు లక్షలకు పైగా ధర పలకడం విశేషం. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి లడ్డూ ధర భారీగా పెరిగింది. గతేడాది ఇదే ప్రాంగణంలో జరిగిన వేలంలో లడ్డూ సుమారు కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. తాజా వేలంలో మరో అరవై లక్షలకు పైగా అదనంగా ధర పలకడంతో నిర్వాహకులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ భారీ వేలం వెనుక ఒక గొప్ప సామాజిక స్పూర్తి దాగి ఉంది. ఈ కమ్యూనిటీకి చెందిన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏటా లడ్డూ వేలం ద్వారా వచ్చే నిధులను పేద విద్యార్థుల చదువులు, వైద్య సాయం, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. వ్యాపార, సేవా రంగాల్లో రాణించే ప్రముఖులు ఈ వేలంలో పాల్గొనడం పరిపాటిగా మారింది. హైదరాబాద్‌లో బాలాపూర్ లడ్డూ వేలానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో, ఇటీవల కాలంలో గేటెడ్ కమ్యూనిటీల్లో జరుగుతున్న ఈ రకమైన వేలాలు కూడా అంతే స్థాయిలో ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి. కేవలం భక్తి భావమే కాకుండా సమాజ సేవకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఇక్కడి నివాసితులు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ భారీ మొత్తాన్ని సేకరించడం ద్వారా అనేక మంది అభాగ్యులకు అండగా నిలవవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఎలాంటి పరిపాలనా ఖర్చులు లేకుండా పూర్తిగా స్వచ్ఛందంగా ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వినాయక నిమజ్జనోత్సవ వేళ వెలువడిన ఈ భారీ వేలం వార్త ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. భవిష్యత్తులో ఈ సంప్రదాయం మరింత విస్తరించి, మరిన్ని సేవా కార్యక్రమాలకు ఈ నిధులు బాటలు వేస్తాయని స్థానికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.       [ Hyderabad Ganesh Laddu Auction, Kirti Richmond Villas Laddu Price, Bandlaguda Ganesh Festival, Telangana Vinayaka Chavithi News, TeluguOne News Regional Updates ]  
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే జంక్షన్‌లలో ఒకటైన విజయవాడ పరిసర ప్రాంతంలో ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రైలు ప్రయాణంలో భాగంగా ఒక కోచ్ నుంచి దట్టమైన పొగలు రావడంతో పాటు మంటలు ఎగసిపడ్డాయి. ఈ హఠాత్తుగా రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా కంగారుపడ్డారు. ఏం జరుగుతుందో అర్థంకాక వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపటి వరకు రైలు లోపల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీసేందుకు యత్నించినట్లు సమాచారం. సమయానికి స్పందించిన రైల్వే సిబ్బంది  సాంకేతిక నిపుణులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పుతుందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మంటలను వెంటనే అదుపులోకి తీసుకురావడంతో పెను విపత్తు నివారించబడింది. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక సమాచారం ప్రకారం, రైలులోని ఒక నిర్దిష్ట కోచ్‌లో షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర సాంకేతిక లోపాలు కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ తర్వాతే అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇలాంటి హై-స్పీడ్ రైళ్లలో భద్రతా తనిఖీలను మరింత కఠినతరం చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ దేశంలోని పలు మార్గాల్లో నడుస్తున్న రైళ్లలో ఇలాంటి అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. రోజూ వేలాది మంది ప్రయాణించే ఈ ప్రీమియం రైళ్లలో సాంకేతిక లోపాలు పునరావృతం కాకుండా రైల్వే శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అనూహ్య ఘటన కారణంగా కొద్దిసేపు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది. అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని సమీక్షించడంతో పాటు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంపై దృష్టి పెట్టారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రైల్వే యంత్రాంగం ముందస్తు తనిఖీలను ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.     [ Vande Bharat Express fire, Vijayawada railway station news, Train coach fire incident, Indian Railways safety updates, Indian railways, High-speed trains,Telugu One, Telugu News ]    
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది. తెరపై నాని యాక్షన్‌ సందడి చేస్తుంటే.. ఇంటర్వెల్‌లో తెలంగాణ సంప్రదాయ రుచి ప్రేక్షకులను పలకరించనుంది. నేచురల్‌ స్టార్‌ నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన *‘ది ప్యారడైజ్‌’*పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో కయాదు లోహర్‌ కథానాయికగా నటించారు. మోహన్‌బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్‌ జుయల్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానుండగా.. ఇప్పటికే ప్రీమియర్స్‌కు రంగం సిద్ధమైంది. ఇదే సమయంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ విషయం సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.‘ది ప్యారడైజ్‌’ను థియేటర్‌లో చూసే ప్రేక్షకులకు ఇంటర్వెల్‌లో తెలంగాణ ఫేమస్‌ స్నాక్‌ ‘సర్వపిండి’ని అందించేందుకు మైత్రీ థియేటర్స్‌ సిద్ధమైంది. తెలంగాణ సంప్రదాయ వంటకాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సర్వపిండిని.. కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో ఇంటర్వెల్‌ స్నాక్‌గా అందించనున్నట్లు మైత్రీ థియేటర్స్‌ ప్రకటించింది. మైత్రీ విమల్‌, మైత్రీ శివ గంగా థియేటర్లలో ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.  అంతేకాదు.. ఏకంగా 77 ఏళ్ల బామ్మ స్వయంగా సర్వపిండిని తయారు చేయనున్నట్లు థియేటర్స్‌ యాజమాన్యం వెల్లడించింది. సినిమా చూడటానికి వచ్చే ప్రేక్షకులకు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా.. తెలంగాణ మట్టి వాసన, స్థానిక సంస్కృతి, సంప్రదాయ ఆహారపు రుచిని కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ వినూత్న ప్రయత్నం చేస్తున్నట్లు మైత్రీ థియేటర్స్‌ తెలిపింది. దీంతో నాని ‘ప్యారడైజ్‌’ను తెరపై చూడటంతో పాటు.. ఇంటర్వెల్‌లో తెలంగాణ సాంప్రదాయ సర్వపిండి రుచిని ఆస్వాదించేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..! రాబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో విజయం లక్ష్యంగా బీజేపీ అధినాయకత్వం పార్టీ సంస్థాగత యంత్రాంగంలో భారీ మార్పులు చేపట్టింది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు, సహ ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధికారికంగా జాబితాను ప్రకటించారు. ప్రాంతీయ రాజకీయ పరిస్థితులు, ఎన్నికల సమీకరణాలు, పార్టీ భవిష్యత్ వ్యూహాలను పరిగణనలోకి తీసుకుని కీలక నేతలకు ఆయా రాష్ట్రాల బాధ్యతలను అప్పగించారు. పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమన్వయం, ఎన్నికల వ్యూహాల అమలులో కొత్త ఇన్‌చార్జ్‌లు కీలకంగా వ్యవహరించనున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల వారీగా పార్టీ పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రముఖ నాయకురాలు స్మృతి ఇరానీకి కీలకమైన బాధ్యతలు అప్పగించారు.  ఆమెకు హర్యానా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల పార్టీ ఇన్‌ఛార్జి బాధ్యతలను కేటాయించారు. గత కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న స్మృతి ఇరానీకి రెండు ముఖ్యమైన రాష్ట్రాల బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీలో ఆమె ప్రాధాన్యత మరింత పెరిగినట్లయింది. మరోవైపు, పార్టీలో కీలక వ్యూహకర్తగా పేరుగాంచిన సునీల్ బన్సల్‌కు తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఇన్‌ఛార్జి బాధ్యతలు కేటాయించారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జాతీయ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్: అర్వింద్ భదౌరియా ఇంచార్జ్‌గా, తమిళనాడు మాజీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ సహ-ఇంచార్జ్‌గా వ్యవహరిస్తారు.ఒడిశా: దగ్గుబాటి పురందేశ్వరి ఇంచార్జ్‌గా, డాక్టర్ స్వదేశ్ సింగ్ సహ-ఇంచార్జ్‌గా నియమితులయ్యారు. తమిళనాడు: రామ్ మాధవ్ ఇంచార్జ్‌గా ఎంపికవ్వగా, కో-ఇంచార్జ్‌లుగా డీకే అరుణ, నిర్మల్ కుమార్ సురాణా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదే క్రమంలో మరికొద్ది మంది సీనియర్ నాయకులకు కూడా ముఖ్యమైన రాష్ట్రాల బాధ్యతలు దక్కాయి. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న రామ్ మాధవ్‌కు తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాల బాధ్యతలను కేటాయించారు. అలాగే, వినోద్ తావ్డేను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా, వినయ్ సహస్రబుద్ధేను ఢిల్లీ ఇన్‌ఛార్జిగా నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా మొత్తం 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ఇన్‌ఛార్జీలు, సహ-ఇన్‌ఛార్జీల పూర్తి జాబితాను బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసేందుకు, రాబోయే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ తాజా మార్పులు ఎంతగానో ఉపయోగపడతాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.       [ BJP state in charges, Smriti Irani, Sunil Bansal, Telangana BJP, Ram Madhav, BJP news updates, Arvind Bhadauria, Daggubati Purandeswari, DK Aruna,Ram Madhav, Nitin Nabeen ]  
బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. రేణుకాస్వామి దారుణ హత్య కేసులో ఏ1 (A1) నిందితురాలిగా జైలు జీవితం గడుపుతున్న పవిత్రా గౌడ, విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట తన రోదనను వెళ్లగక్కింది. జైలు గదిలో తాను ఎదుర్కొంటున్న నరకయాతనను వివరిస్తూ ఆమె కన్నీటిపర్యూరాలయ్యారు. తనతో పాటు అదే బ్యారక్‌లో ఉంటున్న కొందరు నైజీరియన్ మహిళా ఖైదీల వల్ల తీవ్రమైన మానసిక, శారీరక వేధింపులకు గురవుతున్నానని ఆమె వాపోయారు.  రాత్రి సమయాల్లో వారు చేసే అల్లరి, గొడవల కారణంగా తనకు కంటి మీద కునుకు కూడా లేకుండా పోతోందని, వారి ప్రవర్తన చూసి తీవ్ర భయాందోళనకు గురవుతున్నానని తెలిపారు. ఇక్కడ ఒక్క క్షణం కూడా బతకలేనని, తనను వెంటనే వేరే బ్యారక్‌కు మార్చాలని ఆమె కోర్టును వేడుకున్నారు. ఒకవేళ తనను ఆ వేధింపుల నుండి రక్షించలేకపోతే, కనీసం తనకు బెయిల్ అయినా మంజూరు చేయాలని, లేదా ఇక్కడ బతకలేకపోతున్నందున కొద్దిగా విషమైనా ఇప్పించండి తాను చనిపోతానంటూ పవిత్రా గౌడ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి.  రేణుకాస్వామి హత్య కేసులో మొదట్నుంచీ అనేక సంచలన పరిణామాలు చోటుచేసుకుంటుండగా, తాజాగా జైలు నుంచి బయటికి వస్తున్న ఈ వార్తలు టాలీవుడ్ వర్గాలతో పాటు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జైలు అధికారుల అజమాయషీ  అక్కడ నెలకొన్న భద్రతా పరిస్థితులపై కూడా ఈ ఘటనతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నటుడు దర్శన్ తో కలిసి ఈ కేసులో అరెస్టయిన పవిత్రా గౌడ ప్రస్తుతం చట్టపరమైన పోరాటం చేస్తూనే, మరోవైపు జైలు గోడల మధ్య పడుతున్న ఇబ్బందులను ఇలా బయటపెట్టడం అందరినీ ఆలోచింపజేస్తోంది. న్యాయస్థానం ఈ విజ్ఞప్తిపై ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది.      [ Pavithra Gowda, Bengaluru Central Jail, Renukaswamy murder case, Actor Darshan, Nigerian prisoners, jail harassment, Parappana Agrahara Central Jail, Telugu One, Telugu News ]
ALSO ON TELUGUONE N E W S
    నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల ల  'ది ప్యారడైజ్' కోసం ఎంతలా అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూసారంటే ఎదురుచూడని వాళ్ళు సినీ ప్రేమికులు కాదేమో అనేలా.. దీంతో ప్రీమియర్స్ నుంచే తమ ఆశ నెరవేరే మహా భాగ్యం దక్కడంతో  నెల చివర కూడా లెక్కచేయకుండా 500 Rs  కాగితాన్ని కూడా లెక్కచేయకుండా థియేటర్స్ ముందు బారులు తీరారు. కానీ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో అభిమానులు, సినీ ప్రేమికులు జీర్ణించుకోలేక పోతున్నారు   ప్యారడైజ్ కి ప్రధానమైన ప్లస్ పాయింట్స్ చూస్తే, నాని నటనా విశ్వరూపం అని చెప్పవచ్చు. తన రెగ్యులర్ ఇమేజ్‌ను పక్కన పెట్టి రా అండ్ రస్టిక్ అవతారంలో జడల్ క్యారక్టర్ లో జీవించాడు. ఫస్టాఫ్ అంతా సీట్ ఎడ్జ్ డ్రామాతో, అదిరిపోయే నాని ఇంట్రడక్షన్, ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్స్, గ్రాండ్ మేకింగ్ విలువలతో ప్రేక్షక దేవుళ్లను కట్టిపడేస్తుంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన నేపధ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసి, రక్తం ఉడికేలా చేసే యాక్షన్ ఎపిసోడ్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. మోహన్ బాబు విలనిజం వింటేజ్ శైలిని గుర్తుచేస్తుండగా, సాయి సిహెచ్ సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అత్యున్నత ప్రమాణాల్లో నిలిచాయి. ఇది కూడా చదవండి: తస్మాత్ జాగ్రత్త: కంటెంట్ బాగోపోతే.. దుకాణ్ బంద్!   అయితే  కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో కథనం కొంతవరకు దారితప్పడం, వేగం నెమ్మదించడం ప్రధాన లోపంగా కనిపిస్తుంది. ఇంటర్వెల్ లో ఇచ్చిన భారీ హైని సెకండాఫ్‌లో పూర్తిగా నిలబెట్టలేకపోయారని, అనవసర రాజకీయాన్ని చొప్పించడంతో కథలోని భావోద్వేగం కాస్త దెబ్బతిన్నదని విమర్శలు వస్తున్నాయి. హీరోయిన్ కయాదు లోహర్ ట్రాక్ కూడా కథా గమనానికి అంతగా సహకరించలేదు. అలాగే కొన్ని చోట్ల శబ్ద స్థాయిల వల్ల డైలాగ్స్ సరిగా వినపడకపోవడం ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తుంది.మొత్తానికి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎమోషన్ కంటే యాక్షన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ, మాస్ ఆడియెన్స్‌ను అలరించే అంశాలు, నాని అద్భుత నటన, అనిరుధ్ మ్యూజిక్ థియేటర్లలో మంచి అనుభూతిని అందించే అవకాశాలు ఉన్నాయనే టాక్ మూవీ చూసిన వాళ్ళ దగ్గరనుంచి వినపడుతుంది.     [The Paradise Movie Public Talk, Nani, The Paradise, Srikanth Odela, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]
ఒక సినిమా కోసం ఎంత కష్టపడి షూటింగ్ చేసినా.. ఫైనల్ అవుట్‌పుట్ అనేది పోస్ట్ ప్రొడక్షన్‌లోనే తేలుతుంది. ముఖ్యంగా ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, డీఐ, విజువల్ ఎఫెక్ట్స్ వంటి పనులకు తగినంత సమయం కేటాయించాల్సి ఉంటుంది. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఈ పనులను హడావుడిగా పూర్తి చేస్తే.. ఆ ప్రభావం చివరికి థియేటర్‌లో కనిపించే అవుట్‌పుట్‌పై పడుతుంది. తాజాగా ‘ది ప్యారడైజ్’ విషయంలోనూ ఇదే తరహా విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమాలో ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్ విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయనే అభిప్రాయాలు ప్రేక్షకుల నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో నేరేషన్‌కు, సౌండ్‌కు మధ్య సరైన బ్యాలెన్స్ లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘ప్యారడైజ్’ షూటింగ్‌కు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చాలా సమయం తీసుకున్నారనే విషయం తెలిసిందే. భారీ స్కేల్‌లో సినిమాను తెరకెక్కించడంతో షూటింగ్ దశలోనే ఎక్కువ సమయం వెళ్లిపోయింది. దాంతో రిలీజ్ డేట్ దగ్గర పడే సమయానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుకున్నంత సమయం దొరకలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఒక సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ అనేది చిన్న విషయం కాదు. షూటింగ్ పూర్తయిన తర్వాత ఎడిటింగ్‌లో కథను మరింత టైట్ చేయడం.. అవసరం లేని సన్నివేశాలను తొలగించడం.. సౌండ్ ఎఫెక్ట్స్‌ను పర్ఫెక్ట్‌గా సెట్ చేయడం.. డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మధ్య సరైన బ్యాలెన్స్ తీసుకురావడం.. ఇవన్నీ ఫైనల్ అవుట్‌పుట్‌ను మార్చగలవు. ముఖ్యంగా భారీ యాక్షన్ సినిమాల విషయంలో సౌండ్ మిక్సింగ్‌కు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. స్క్రీన్‌పై యాక్షన్ ఎంత బాగా కనిపించినా.. దానికి తగ్గ సౌండ్ ఇంపాక్ట్ లేకపోతే ప్రేక్షకుడికి ఆ సీన్ ఇచ్చే ఎక్స్‌పీరియన్స్ తగ్గిపోతుంది. ఇది కూడా చదవండి: గ్లోబల్ స్టార్ బాలయ్య.. ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో ట్రంప్‌ను ట్రోల్ చేసిన ఇరాన్.! ఇటీవల టాలీవుడ్‌లో కొన్ని సినిమాల విషయంలో ఇదే తరహా చర్చ జరుగుతోంది. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత.. ఆ తేదీని మిస్ కాకూడదనే ఉద్దేశంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సినిమా షూటింగ్‌కు నెలలు, సంవత్సరాలు కేటాయించి.. చివరి దశలో మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తక్కువ సమయం ఇవ్వడం ఎంతవరకు సరైనదనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున కూడా ‘లెనిన్’ మూవీ ఈవెంట్‌లో ప్రస్తావించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా తగినంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి సినిమా ఎంత పెద్ద స్కేల్‌లో ఉన్నా.. ప్రేక్షకుడికి థియేటర్‌లో కనిపించేది ఫైనల్ కట్ మాత్రమే. షూటింగ్ సమయంలో దర్శకుడు పడిన కష్టం, లొకేషన్స్, భారీ సెట్స్, వందల మంది టెక్నీషియన్ల శ్రమ.. ఇవేవీ ప్రేక్షకుడికి నేరుగా కనిపించవు. కానీ ఎడిటింగ్‌లో ఓ చిన్న తప్పు జరిగినా.. సౌండ్ మిక్సింగ్‌లో సరైన బ్యాలెన్స్ లేకపోయినా.. ఆ లోపం మాత్రం వెంటనే ప్రేక్షకుడికి అనిపిస్తుంది. అందుకే సినిమా షూటింగ్ ఎంత ముఖ్యమో.. పోస్ట్ ప్రొడక్షన్ కూడా అంతే ముఖ్యం. ఒక సినిమా రిలీజ్ డేట్‌ను టార్గెట్ చేసుకుని షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌ను రేసులా పూర్తి చేయడం కంటే.. ఫైనల్ అవుట్‌పుట్‌కు అవసరమైన సమయం ఇవ్వడం కీలకం. ‘ది ప్యారడైజ్’ విషయంలో వస్తున్న ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్ విమర్శలు కూడా ఇప్పుడు ఇదే విషయాన్ని మరోసారి చర్చలోకి తీసుకొచ్చాయి. భారీ సినిమాలకు బడ్జెట్ ఎంత ముఖ్యమో.. పోస్ట్ ప్రొడక్షన్‌కు కేటాయించే సమయం కూడా అంతే ముఖ్యమని ఇండస్ట్రీ గుర్తించాల్సిన అవసరం ఉందనే చర్చ మొదలైంది. మీకు నచ్చవచ్చు: ది ప్యారడైజ్ మూవీ రివ్యూ బాక్సాఫీస్ క్లాష్.. రాయుడు ముందు నిలబడలేకపోయిన బాస్.!       [Paradise Post Production, The Paradise Movie Review, Nani Paradise Review, Paradise Negative Talk, Paradise Public Talk, The Paradise Review, Natural Star Nani, Telugu Film News, Telugu News]  
తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌ (TFTDDA)లో కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో జరిగిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నట్లు సమాచారం. తనపై కొందరు దాడి చేయడంతో పాటు ప్రాణహాని బెదిరింపులకు పాల్పడ్డారంటూ అసోసియేషన్ అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమలతా దేవి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. సమావేశం జరుగుతున్న సమయంలో అసోసియేషన్‌కు సంబంధించిన మినిట్స్ బుక్, అజెండా పత్రాలు, ఇతర ముఖ్యమైన రికార్డులను కొందరు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించారు. వాటిని అడ్డుకునే ప్రయత్నం చేసిన సమయంలో కొందరు మహిళలు తనను చుట్టుముట్టి దాడి చేశారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు ఎం. రాములు, సమిలి అనే మహిళపై కూడా దాడి జరిగినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఈ వ్యవహారం వెనుక రఘు మాస్టర్ వర్గానికి చెందిన కొందరు డ్యాన్సర్లు ఉన్నారని సుమలత ఆరోపించారు. లిఖిత, పూజిత, కళ్యాణి, సుమతి, విమల, కోకిల, మాధుర్య, శృతి, శ్రీదేవి, ఏడుకొండల శ్రీను తదితరులు తనపై దాడిలో పాల్గొన్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే శేఖర్ మాస్టర్, రఘు మాస్టర్, భాను మాస్టర్, అజయ్ సాయి మాస్టర్, జోసెఫ్ ప్రకాష్ తదితరులు మరో సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల వాదన ఈ కథనంలో వెల్లడి కాలేదు. అంతేకాదు.. అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని, లేకపోతే చంపేస్తామని బెదిరించినట్లు సుమలత పోలీసులకు తెలిపారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ రక్షణ కల్పించాలని కోరారు. ఘటనకు సంబంధించిన వాస్తవాలను తెలుసుకునేందుకు రాఘవ గెస్ట్ హౌస్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు సమావేశానికి సంబంధించిన మొబైల్ వీడియోలు, ఆడియో రికార్డులను పరిశీలించాలని పోలీసులను కోరారు. మరోవైపు అసోసియేషన్‌కు సంబంధించిన కొన్ని రికార్డులు తీసుకెళ్లారని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. తనపై జరిగిన ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. సినీ పరిశ్రమలో డ్యాన్సర్లు, డాన్స్ డైరెక్టర్ల సంక్షేమం కోసం పనిచేసే సంఘంలో అంతర్గత విభేదాలు ఇలా బహిరంగంగా బయటపడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల దర్యాప్తు తర్వాత ఈ వ్యవహారంలో వాస్తవాలు ఏంటనేది స్పష్టమయ్యే అవకాశం ఉంది.     [TFTDDA, Sumalatha Devi, Dancers Association Dispute, Telugu Film TV Dancers Association, Sumalatha Devi Complaint, Dancers Association News, Film Industry Dispute, Hyderabad Film Industry, Dancers Association President, Telugu Cinema News]
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్‌’ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలైన నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియాలో మరో అంశం ఆసక్తికరంగా మారింది. అదే సినిమాలో నటుడు ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే శంకర్ పాత్ర. ‘ది ప్యారడైజ్‌’లో ప్రియదర్శి ఓ ఎమ్మెల్యే పాత్రలో కనిపించారు. ఆయన గెటప్‌, బాడీ లాంగ్వేజ్‌, హావభావాలు, తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్‌లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన పాత్రను చూసిన కొందరు నెటిజన్లు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోలి ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ప్రసంగించే సమయంలో కనిపించే శైలి, మాటతీరు, హావభావాలు కొన్ని సందర్భాల్లో ఆయనను గుర్తు చేస్తున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే సినిమాలో ప్రియదర్శి పోషించిన శంకర్ పాత్ర ఎలా ఉంటుంది? కథలో అతడి ప్రాధాన్యం ఏంటి? అనే విషయాలు సినిమా చూసిన తర్వాతే పూర్తిగా అర్థమవుతాయి. ఇప్పటికే థియేటర్లలో సినిమా చూసిన కొందరు ప్రేక్షకులు మాత్రం ప్రియదర్శి నటనపై ప్రత్యేకంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఆయన చెప్పిన డైలాగ్‌లు బాగా ఆకట్టుకున్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రియదర్శి ఇప్పటికే విభిన్నమైన పాత్రలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కామెడీ పాత్రలతో పాటు సీరియస్ క్యారెక్టర్లలోనూ మెప్పిస్తున్న ఆయన.. ‘ది ప్యారడైజ్‌’లో మరో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడం ఆసక్తిని పెంచింది. మరోవైపు సినిమాలో మరో పాత్ర కూడా సోషల్ మీడియాలో చర్చకు వస్తోంది. సీనియర్ నటుడు ఎన్టీఆర్‌ను పోలినట్లు అనిపించే పాత్ర సినిమాలో ఉందంటూ కొందరు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. విజయ్ కుమార్ పోషించిన ఆ పాత్రలో ఎన్టీఆర్ పోలికలు కనిపిస్తున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో నాని ‘ది ప్యారడైజ్‌’ సినిమా విడుదలైన రోజే ఈ పాత్రల గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. మొత్తంగా.. సినిమా విడుదలతో పాటు ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే శంకర్ పాత్ర కూడా ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఆయన గెటప్‌, తెలంగాణ యాస, హావభావాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ‘ది ప్యారడైజ్‌’కు మరింత ఆసక్తిని తీసుకొస్తోంది.       [The Paradise Movie, Nani The Paradise, Priyadarshi The Paradise, Priyadarshi MLA Shankar, The Paradise Priyadarshi Look, Nani Movie 2026, Srikant Odela The Paradise, Priyadarshi Telangana Dubbing, The Paradise Movie Update, Nani Priyadarshi Movie]
హీరో శర్వానంద్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ప్రస్తుతం దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ‘జార్జ్ క్రిష్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో కీలక అప్‌డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. ఇందులో హీరోయిన్‌గా నటించబోయేది ఎవరో అధికారికంగా ప్రకటించారు. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్‌కు జోడీగా మానస వారణాసి నటించనున్నారు. ఇటీవల విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మానస.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా శర్వానంద్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. సినిమాలో ఆమె పాత్రకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. మరోవైపు ‘జార్జ్ క్రిష్’కు శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు తనదైన శైలిని జోడించే శ్రీను వైట్ల.. ఈసారి శర్వానంద్‌తో ఎలాంటి కథను తెరకెక్కిస్తున్నారనే ఆసక్తి నెలకొంది. శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 14, 2027న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. శర్వానంద్‌కు సంక్రాంతి సెంటిమెంట్ కూడా ఉంది. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘శతమానం భవతి’, ‘నారి నారి నడుమ మురారి’ వంటి సినిమాలు సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు ‘జార్జ్ క్రిష్’ కూడా అదే సీజన్‌లో విడుదల కానుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాశ్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. నందు సవిరిగాన, గోపీ మోహన్ కథను అందించారు. ఇదిలా ఉంటే.. ‘జార్జ్ క్రిష్’ ఫస్ట్ గ్లింప్స్‌ను సెప్టెంబర్ 24న విడుదల చేయనున్నట్లు సమాచారం. మానస వారణాసి పాత్రకు సంబంధించిన ప్రత్యేక అప్‌డేట్ కూడా రానుంది. దీంతో శర్వానంద్, మానస జోడీ తెరపై ఎలా ఉంటుందో, శ్రీను వైట్ల తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.       [Sharwanand George Krish, George Krish Movie, Sharwanand New Movie, Manasa Varanasi, Sharwanand Manasa Varanasi, Sreenu Vaitla, George Krish Heroine, George Krish Release Date, Sharwanand Sankranthi Movie, George Krish Telugu Movie, Anup Rubens, AK Entertainments]
బండి మీద ఇల్లు ఇల్లు తిరిగి పెద్ద ఉల్లిపాయలు, స్టీల్ సామాన్లు అమ్ముకునే వాళ్లే మేము   పలానా ఐటమ్స్ అమ్ముతున్నామని కస్టమర్స్  ఎట్రాక్ అయ్యేలా ఒక ప్రాసెస్ ప్రకారం పిలుస్తూ ఉంటారు. అంటే కంటెంట్. మరి కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అంతకంటే గొప్పదైన టైంని కూడా ఉపయోగించి సినిమా తెరకెక్కిస్తునప్పుడు కంటెంట్ ఎంత బాగుండాలి.  కానీ నిన్న ప్రీమియర్స్ నుంచే  ఎన్నో అంచనాలతో విడుదలైన ‘ది ప్యారడైజ్’ చిత్రం చూస్తే కంటెంట్ ని గాలికి వదిలేశారని క్లియర్ గా అర్ధమవుతుంది. పని చేసే వాళ్ళకంటే పెత్తనం చేసే వాళ్ళు ఎక్కువయ్యారని, దైవం లాంటి  కంటెంట్ గొప్ప తనం తెలియని మేధావులు తలదూర్చి 'షో' చేశారనే విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. ఇప్పుడు ఇదే టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్‌గా మారాయి. అసలు ఈ నెగెటివ్ టాక్‌కి ప్రధాన కారణం ఏంటి? మేకర్స్ కథలోని కీలకమైన కంటెంట్‌ను పక్కన పెట్టి, కేవలం భారీతనం పైనే దృష్టి పెట్టడం వల్ల ఈ పరిస్థితి ఎదురైందా అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రమోషన్ల సమయంలో మేకర్స్ ఇచ్చిన హైప్, మేకింగ్ వీడియోలు చూసి ప్రతి ఒక్కరూ థియేటర్లలో ఏదో కొత్త అనుభూతిని పొందుతామని ఆశించారు. అయితే, సినిమా థియేటర్లలోకి వచ్చాక అసలు కథే వేరుగా మారిపోయింది. కథనంలో అసలైన కంటెంట్, బలమైన ఎమోషన్స్ కొరవడటమే దీనికి ప్రధాన కారణం. గెటప్స్, కెమెరా యాంగిల్ కోసం సినిమా తీయ్యడం ఏంటి? దాదాపు 150 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో మొదటి 45 నిమిషాల పాటు కేవలం క్యారెక్టర్ ఎలివేషన్లు, అద్భుతమైన విజువల్స్ చూపించడానికే ప్రాధాన్యత ఇచ్చారు. దర్శకుడు విజువల్ ప్రెజెంటేషన్ పై చూపించిన శ్రద్ధలో 30 శాతం కూడా కథా కథనాల పై చూపించలేకపోయారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే కీలకమైన సీన్స్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. 20 నుంచి 25 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ ఫైట్ కేవలం సాంకేతికంగా బాగుందే తప్ప, ప్రేక్షక హృదయాలను తాకలేకపోయింది.     ఇది కూడా చదవండి: The Paradise Movie Review Telugu: ది ప్యారడైజ్ మూవీ రివ్యూ   ఈ రోజుల్లో ప్రేక్షకులు కేవలం సెట్లు, డ్రోన్ షాట్లు, లేదా భారీ యాక్షన్ సీక్వెన్సెస్ చూసి సంతోషపడే పరిస్థితిలో లేరు. కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద సినిమానైనా తిరస్కరించే చైతన్యం ప్రేక్షకుల్లో వచ్చింది. ‘ది పారడైజ్’ విషయంలో మేకర్స్ ఈ చిన్న సూత్రాన్ని విస్మరించి తప్పు చేశారా అనే సందేహం వ్యక్తమవుతోంది.ప్రేక్షకులు అంత అమాయకులా, కేవలం పబ్లిసిటీ గిమ్మిక్కులతో సినిమాని ఆదరిస్తారా అనుకోవడం విశ్లేషకుల ఆలోచనా విధానానికే పెద్ద సవాలుగా మారింది. సినిమా బడ్జెట్‌లో 60 శాతానికి పైగా కేవలం యాక్షన్ ఘట్టాలు, విఎఫ్ఎక్స్ (VFX) పనులకే వెచ్చించిన మేకర్స్, స్క్రిప్ట్ అభివృద్ధికి తగినంత సమయం కేటాయించలేకపోయారు. మేకర్స్ ఇప్పటికైనా కేవలం గ్రాఫిక్స్, భారీతనం వెనుక పరుగులు తీయకుండా కంటెంట్‌కి  ప్రాధాన్యత ఇస్తేనే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించగలరని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రేక్షకులు కూడా పెద్ద హీరో, హిట్ కాంబినేషన్ అని థియేటర్స్ కి వసున్నారు. దయచేసి సినిమాని ఖునీ చెయ్యకండి. 'షో' అనేది జస్ట్ ఒక వర్డ్ మాత్రమే.    దానిని సినిమాకి రుద్దితే ఎలా అని సోషల్ మీడియా వేదికగా సినీ ప్రేమికులు కామెంట్స్ చేస్తున్నారు.   [The Paradise Movie Anyalsis, The Paradise Movie Review Telugu, Nani, Srikanth odela, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]
బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 8 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి వర్షిణి వెంకట్‌ ప్రస్తుతం ఓ కేసులో అరెస్ట్ అయ్యారు. షార్ట్‌ఫిల్మ్ నిర్మాణం పేరుతో ఓ యువకుడి నుంచి డబ్బులు తీసుకోవడంతో పాటు, అనంతరం అతడిని బెదిరించి నగదు వసూలు చేశారనే ఫిర్యాదు ఆధారంగా చెన్నై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో వర్షిణిని కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. పోలీసులు, ఫిర్యాదుదారుడు తెలిపిన వివరాల ప్రకారం.. 26 ఏళ్ల తరుణ్ అనే యువకుడికి వర్షిణితో పరిచయం ఏర్పడింది. షార్ట్‌ఫిల్మ్ నిర్మించేందుకు పెట్టుబడి పెట్టాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది. అయితే డబ్బులు తిరిగి ఇవ్వాలని తరుణ్ అడగడంతో వివాదం మొదలైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆగస్టు 22న గిండి ప్రాంతంలోని ఓ హోటల్‌ వద్ద తరుణ్‌ను వర్షిణి, ఆమె స్నేహితుడు సంజయ్‌తో పాటు మరో ఇద్దరు కలిశారని పోలీసులు తెలిపారు. అక్కడ తనపై దాడి చేసి రూ.50 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లు తీసుకున్నారని తరుణ్ ఆరోపించాడు. అనంతరం ఫోన్ ద్వారా బెదిరింపులు రావడంతో మరికొంత డబ్బును బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. వివిధ వార్తా కథనాల ప్రకారం మొత్తం రూ.5.5 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రూ.3 లక్షలు వర్షిణి బ్యాంకు ఖాతాకు, రూ.2 లక్షలు సంజయ్ ఖాతాకు బదిలీ అయినట్లు పోలీసులు తెలిపారు. మరో రూ.27 లక్షలు ఇవ్వాలని కూడా బెదిరించినట్లు ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. ఫిర్యాదు అందుకున్న గిండి పోలీసులు వర్షిణి, సంజయ్ సహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన తర్వాత వర్షిణి ఖాతాకు డబ్బు బదిలీ అయినట్లు నిర్ధారించుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఆమె నుంచి ఓ ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వర్షిణిని కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసులో ఆమెతో పాటు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్, మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది.     [Varshini Venkat Arrest, Bigg Boss Fame Varshini, Varshini Venkat News, Varshini Venkat Arrested, Bigg Boss Tamil Actress, Varshini Venkat Case, Varshini Venkat Extortion Case, Varshini Venkat Police Case, Bigg Boss Tamil 8, Chennai Police, Varshini Venkat Latest News]
తెలుగునాట నానికి ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ నానికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన కథల ఎంపిక, నటన కారణంగా ఓ ప్రత్యేకమైన ఆడియన్స్‌ను సంపాదించుకున్నారు. అలాంటి నాని నటించిన ‘ది ప్యారడైజ్’పై మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. సినిమా విడుదలైన వెంటనే భారీగా నెగెటివ్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఏ సినిమాకి అయినా నెగెటివ్ కామెంట్స్ సహజమే అయినప్పటికీ, నాని లాంటి యంగ్ స్టార్ సినిమాకి ఈ రేంజ్ నెగటివిటీ కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక బిగ్ స్టార్ సినిమా రిలీజ్ అయినప్పుడు.. మొదటి షో కూడా పూర్తి కాకుండానే యాంటీ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి నెగటివిటీ వస్తుందో అంతటి నెగటివిటీ వస్తోంది. దీంతో నానిని టార్గెట్ చేస్తూ కొందరు కావాలనే నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారా? అనే ప్రశ్న కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. 'ప్యారడైజ్' హిట్ అయితే ఎక్కడ నాని బిగ్ స్టార్ అవుతాడోనన్న భయంతోనే కొందరు ఆయనను టార్గెట్ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఇది కూడా చదవండి: ది ప్యారడైజ్ మూవీ రివ్యూ ‘ప్యారడైజ్’కు ముందు నాని వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆయన నటించిన గత నాలుగు సినిమాల్లో మూడు 100 కోట్ల సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ‘ప్యారడైజ్’ హిట్ అయితే 200-300 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమనే అంచనాలు విడుదలకు ముందు ఏర్పడ్డాయి. తీరా మూవీ రిలీజ్ అయ్యాక డివైడ్ టాక్ రావడంతో.. ఇదే అదునుగా నానిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతూన్నాయి. మీకు నచ్చవచ్చు: బాక్సాఫీస్ క్లాష్.. రాయుడు ముందు నిలబడలేకపోయిన బాస్.! రాయలసీమ రామన్న చౌదరి.. మోహన్ బాబు ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడాలి.!       [Negativity On Nani, Negativity On Paradise, The Paradise Movie Review, Nani Paradise Review, Paradise Negative Talk, Paradise Public Talk, The Paradise Twitter Review, Natural Star Nani, Telugu Film News, Telugu News]  
టాలీవుడ్ సినిమాలకు ఇప్పుడు మరోసారి గ్లోబల్ రేంజ్‌లో క్రేజ్ కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా సీన్ ఏకంగా అంతర్జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఇరాన్.. బాలయ్య సినిమా క్లిప్‌ను ఉపయోగించడం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇటీవల ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ విషయంలో కఠిన వ్యాఖ్యలు చేశారు. ఒక ఒప్పందం కుదరని పక్షంలో ఇరాన్‌ను నాశనం చేసే నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చంటూ ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల తర్వాత ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియా వేదికగా ట్రంప్‌ను ట్రోల్ చేసింది.  జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ తన అధికారిక ట్విట్టర్(X) ఖాతాలో ఓ 58 సెకన్ల వీడియోను షేర్ చేసింది. అందులో బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’లోని ఓ యాక్షన్ సీన్ ఉంది. భారీగా ఆయుధాలతో వచ్చిన వ్యక్తులను బాలయ్య ఎదుర్కొనే సన్నివేశాన్ని ఈ పోస్టులో ఉపయోగించారు. ‘ట్రంప్ ఇరాన్‌ను నాశనం చేస్తానంటున్నారు. కానీ ఇరాన్ అంత బలహీనమైన దేశం కాదని ఆయనకు తెలుసు’ అనే అర్థం వచ్చేలా ఇరాన్ ఎంబసీ ఈ వీడియోను షేర్ చేసింది. అంతేకాదు.. ట్రంప్ హాలీవుడ్ కంటే బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నారేమో అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేసింది. ఇది కూడా చదవండి: ది ప్యారడైజ్ మూవీ రివ్యూ https://x.com/IRANinZIMBABWE/status/2102683645752352883 అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. ఇరాన్ ఎంబసీ ఈ సినిమాను బాలీవుడ్ సినిమాగా పేర్కొంది. కానీ వారు షేర్ చేసిన క్లిప్ బాలీవుడ్‌కు చెందినది కాదు.. మన తెలుగు సినిమా ‘భగవంత్ కేసరి’ది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ 2023లో విడుదలైంది. బాలకృష్ణతో పాటు శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ తదితరులు ఇందులో నటించారు. యాక్షన్‌తో పాటు భావోద్వేగ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ ఓ సన్నివేశంలో ఏకంగా ఓ మ్యాన్‌హోల్ కవర్‌ను షీల్డ్‌లా ఉపయోగిస్తూ తుపాకులతో దాడి చేసే వ్యక్తులను ఎదుర్కొంటారు. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్లను ఉపయోగించే యాక్షన్ సీన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదే సీన్ అంతర్జాతీయ స్థాయిలో వైరల్ కావడం విశేషం. ఇప్పటికే తెలుగు సినిమా పాటలు, డైలాగ్స్, యాక్షన్ సీన్లు సోషల్ మీడియాలో గ్లోబల్‌గా వైరల్ అవుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఓ తెలుగు సినిమా సీన్‌ను ఏకంగా ఓ దేశ రాయబార కార్యాలయం అంతర్జాతీయ రాజకీయ వ్యాఖ్యలకు సమాధానంగా ఉపయోగించడం మాత్రం ఆసక్తికరంగా మారింది. మీకు నచ్చవచ్చు: రాయలసీమ రామన్న చౌదరి.. మోహన్ బాబు ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడాలి.! 55 ఏళ్ళ క్రితం కృష్ణ సాహసం.. సూపర్ స్టార్ బాటలో పయనించిన స్టార్స్ వీళ్ళే.!       [Bhagavanth Kesari Viral Video, Bhagavanth Kesari Clip, Nandamuri Balakrishna, Balakrishna Action Scene, Iran Trump Viral Video, Bhagavanth Kesari Scene, Balakrishna Viral, Iran Embassy, Donald Trump, Telugu Film News]  
Cast: Nani, Kayadu Lohar, Mohan Babu, Sampoornesh Babu, Raghav Juyal, Sonali Kulkarni  Crew:  Written by Srikanth Odela, Vinay Sagar Jonnala, Thota Srinivas, Madhava Murthy Bojanapu, Arjuna Paturi, Vamshi Krishna Pinnika, Manupati Karunakar, Vasanth Masadi Editing by Navin Nooli  Music by Anirudh Ravichander  Cinematography by CH Sai  Directed by Srikanth Odela  Produced by Sudhakar Cherukuri    Nani and Srikanth Odela promised a high octane revolutionary action drama with The Paradise. After Dasara, both have come together to deliver this big intense and raw actioner. After several delays, the movie released today. Let's discuss about it in detail.    Plot:  Jadal (Nani) is the son of Sammakka (Sonali Kulkarni) who wishes to bring identity to their Savvari tribe. Local Zamindar Shikanja Malik (Mohan Babu) decides to never let this tribe get their identity as Indian citizens. He tortures a young Sammakka forcing birth of Jadal which kills his twin sister.  Jadal gets into a brawl with Vikram Malik (Raghav Juyal) for a biriyani piece at a very young age. Shikanja Malik forces a tattoo on Jadal and he is arrested for 14 years in jail. After he is released, he decides to go for a brutal war against Malik family. But he hates his mother and even distances from his love Subbu (Kayadu Lohar). Why? How does the ear for identity end? Watch the movie to know more.    Analysis:  Nani is good as Jadal and his body language, transformation are visible on screen. He did his best to excel in many scenes and fights. His hardwork is visible in certain scenes but he is undermined by lackluster writing. Sonali Kulkarni leaves an impression. Mohan Babu is good but underused. Raghav Juyal wasted and Kayadu Lohar is clueless.  Main problem lies with Srikanth Odela's writing and execution. He has an idea to present certain things on big screen but they are just cool looking blocks on paper and lack a cohesive narrative. Many scenes and sequences seem to have been written because action films are made in a certain way.  He doesn't try to innovate or bring a better scene and structure to the story rather than filling it all up with blood, random women being harassed. Each scene seems to have been thought in several ways on how we can present torture on women and babies rather than evoking emotion.  It gets tiring as the screenplay follows a template and there is no real struggle. It looks like everything happens easy and resolved only through action. Even action sequences become random with launchers, people being hanged to death but saving themselves. Srikanth Odela lacked proper screenplay to stitch everything together and went overboard in many scenes.  Even Anirudh Ravichander couldn't really salvage the situation while cinematography is also not that good. Editing by Navin Nooli is forgettable and production values are good. Overall, The Paradise fails to create an impact such stories need to connect with audiences.    Positives: Nani's performance  Mohan Babu look and performance  Anirudh Ravichander songs  Production Values  Negatives:  Random Narration  Weak Screenplay  Lack of impactful emotional core  Too Gore action sequences  Srikanth Odela's dependency on torture scenes    Bottomline:  Nani fans and action movie lovers can try it once but Srikanth fumbled!    Rating: 2.5/5    Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మన శరీరంలో ఎముకలు బలంగా ఉండటానికి మరియు శారీరక ఎదుగుదలకు క్యాల్షియం, విటమిన్ డి ఎంతటి కీలక పాత్ర పోషిస్తాయో మనందరికీ తెలిసిందే. ఆధునిక కాలంలో ఆహారపు అలవాట్లలో మార్పులు, ఎండలో తిరగకపోవడం మరియు మారుతున్న జీవనశైలి కారణంగా మెజారిటీ ప్రజలు విటమిన్ డి మరియు క్యాల్షియం లోపంతో బాధపడుతున్నారు. వైద్య ఆరోగ్య నివేదికల ప్రకారం, భారతదేశంలో దాదాపు 70% నుండి 90% మంది ప్రజలు విటమిన్ డి లోపంతో సతమతమవుతుంటే, సుమారు 50% పైగా ప్రజలు రోజువారీ శరీరానికి అవసరమైన క్యాల్షియం మోతాదును పొందలేకపోతున్నారు. ఈ క్రమంలో చాలామంది వైద్యులను సంప్రదించినప్పుడు లేదా సొంతంగా మెడికల్ షాపుల్లో సప్లిమెంట్లు కొనుగోలు చేసినప్పుడు విటమిన్ డి మరియు క్యాల్షియం బిళ్ళలను ఒకేసారి కలిపి వాడుతుంటారు. అయితే, ఈ రెండింటినీ ఎల్లప్పుడూ కలిసే తీసుకోవాలా లేదా విడివిడిగా తీసుకోవడం మంచిదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ అంశంపై ప్రముఖ ఆరోగ్య నిపుణులు మరియు వైద్యులు విప్లవాత్మకమైన విషయాలను వెల్లడించారు. మానవ శరీర జీవక్రియలో విటమిన్ డి మరియు క్యాల్షియం మధ్య ఒక అద్భుతమైన భాగస్వామ్యం ఉంది. మనం ఆహారం లేదా సప్లిమెంట్ల ద్వారా తీసుకునే క్యాల్షియాన్ని మన ప్రేగులు సరిగ్గా గ్రహించాలంటే (Absorption) శరీరంలో తగినంత విటమిన్ డి ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ శరీరంలో విటమిన్ డి లోపిస్తే, మనం ఎంత క్యాల్షియం తీసుకున్నప్పటికీ అందులో కేవలం 10% నుండి 15% మాత్రమే శరీరం పీల్చుకోగలుగుతుంది. అదే విటమిన్ డి సరైన మోతాదులో ఉంటే క్యాల్షియం గ్రహణ సామర్థ్యం ఏకంగా 30% నుండి 40% వరకు పెరుగుతుంది. అందుకే ఎముకల సాంద్రతను పెంచడానికి, ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల బలహీనత వ్యాధులను నివారించడానికి వైద్యులు ఈ రెండింటి కాంబినేషన్‌ను ఎక్కువగా రికమండ్ చేస్తుంటారు. అయితే ప్రతి ఒక్కరూ ఈ రెండు సప్లిమెంట్లను నిరంతరం కలిపే తీసుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి శరీరంలో విటమిన్ డి స్థాయిలు తీవ్రంగా తగ్గి (లేబొరేటరీ పరీక్షల్లో 20 ng/mL కంటే తక్కువగా ఉన్నప్పుడు), క్యాల్షియం స్థాయిలు సాధారణంగా ఉంటే, వారికి కేవలం విటమిన్ డి సప్లిమెంట్లు (వారం ఒకసారి ఇచ్చే 60,000 IU డోస్) మాత్రమే సరిపోతాయి. అలాగే, ఆహారం ద్వారా తగినంత క్యాల్షియం పొందుతున్న వారికి ప్రత్యేకంగా క్యాల్షియం టాబ్లెట్లు అవసరం లేదు. మోతాదుకు మించి క్యాల్షియం సప్లిమెంట్లను విచక్షణారహితంగా తీసుకోవడం వల్ల రక్తంలో క్యాల్షియం పెరిగి కిడ్నీలలో రాళ్లు (Kidney Stones) ఏర్పడే ప్రమాదం 20% వరకు పెరుగుతుంది. అంతేకాకుండా, అధిక క్యాల్షియం రక్తనాళాల్లో పేరుకుపోయి గుండె జబ్బుల ముప్పును పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సప్లిమెంట్లు తీసుకునే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించడం ఎంతో ఆవశ్యకం. విటమిన్ డి అనేది కొవ్వులో కరిగే (Fat soluble) విటమిన్, కాబట్టి దీనిని కొద్దిగా కొవ్వు పదార్థాలు ఉండే ఆహారంతో (ఉదాహరణకు పాలు లేదా పెరుగు) తీసుకుంటే శరీరం వేగంగా గ్రహిస్తుంది. క్యాల్షియం టాబ్లెట్లను భోజనం చేసిన తర్వాత తీసుకోవడం మంచిది. ముఖ్యంగా, ఒకేసారి 500 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ క్యాల్షియాన్ని శరీరం గ్రహించలేదు కాబట్టి, ఎక్కువ డోస్ ఉంటే రోజులో రెండు సార్లుగా విభజించి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. థైరాయిడ్ లేదా ఐరన్ సప్లిమెంట్లు వాడేవారు క్యాల్షియం టాబ్లెట్లకు కనీసం 2 నుండి 4 గంటల సమయం వ్యవధి ఇవ్వాలి. కాబట్టి సొంత వైద్యం మానుకుని, రక్త పరీక్షల ద్వారా మీ శరీరంలో ఏ పోషకం లోపించిందో తెలుసుకుని, డాక్టర్ సలహా మేరకే సరైన డోసేజ్ వాడటం ఆరోగ్యానికి అత్యంత సురక్షితం.     [ Vitamin D, Calcium, Calcium Supplements, Vitamin D Deficiency, Calcium Deficiency, Bone Health, Osteoporosis, Calcium Absorption, Kidney Stones, Nutritional Supplements ]
దక్షిణ భారతదేశపు పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తుకువచ్చే అత్యంత ప్రసిద్ధమైన, ఆరోగ్యకరమైన ఉపాహారం నోరూరించే వేడివేడి ఇడ్లీ. తెల్లగా, మల్లెపూవులా మెత్తగా ఉండే ఇడ్లీలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆహారప్రియుల హృదయాలను కొల్లగొట్టాయి. అత్యుత్తమమైన, సులభంగా అరిగే పౌష్టికాహారంగా పేరుగాంచిన ఈ ఇడ్లీలకు ఒక ప్రత్యేకమైన రాజధాని నగరం ఉందంటే మీరు నమ్ముతారా? అవును, దక్షిణ భారతదేశంలో ఎన్నో ప్రాంతాలు రకరకాల ఇడ్లీలకు ప్రసిద్ధి చెందినప్పటికీ, తమిళనాడులోని చారిత్రాత్మక మరియు ఆధ్యాత్మిక నగరమైన మధురై (Madurai) నగరానికి  వరల్డ్ ఇడ్లీ క్యాపిటల్  లేదా ప్రపంచ ఇడ్లీ రాజధాని అనే ఘనమైన కీర్తి లభించింది. వీధి చివర ఉండే చిన్న చిన్న టిఫిన్ బండ్ల నుండి ఐదు నక్షత్రాల హోటళ్ల వరకు, మధురై నగరం అందించే ఇడ్లీల రుచి అత్యంత ప్రత్యేకమైనది మరియు మరెక్కడా లభించనిది. మధురై నగరానికి ఇడ్లీలతో ఉన్న అనుబంధం కేవలం ఒక ఆహార అలవాటు మాత్రమే కాదు, అదొక గొప్ప సంస్కృతి మరియు జీవనశైలి. ఈ నగరంలో దాదాపు 24 గంటల పాటు నిరంతరాయంగా వేడివేడి ఇడ్లీలు లభిస్తూనే ఉంటాయి. మధురైలోని ఐకానిక్ ఇడ్లీ బ్రాండ్  మురుగన్ ఇడ్లీ షాప్  (Murugan Idli Shop) ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ నగరంలో ప్రసిద్ధి చెందిన ప్రతి టిఫిన్ సెంటర్ రోజుకు వేలాది సంఖ్యలో ఇడ్లీలను విక్రయిస్తుంది. సాధారణంగా ఒక సగటు మధురై నివాసి తన రోజువారీ ఆహారంలో కనీసం 3 నుండి 4 ఇడ్లీలను భాగం చేసుకుంటారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ లభించే ఇడ్లీ ప్రత్యేకత ఏమిటంటే, వాటి మెత్తదనం మరియు వాటితో పాటు వడ్డించే రకరకాల పచ్చళ్లు. ఒక్కో ప్లేట్ ఇడ్లీతో పాటు కనీసం 4 రకాల విభిన్నమైన చట్నీలు (తేంగై చట్నీ, కార చట్నీ, కొత్తిమీర చట్నీ, పుదీనా చట్నీ) మరియు ఘుమఘుమలాడే సాంబార్ అందించడం మధురై సంప్రదాయం. ఆహార పరిశోధకులు మరియు నిపుణుల విశ్లేషణ ప్రకారం, మధురై ఇడ్లీలు అంత మెత్తగా ఉండటానికి అక్కడ వాడే నీటిలోని ఖనిజ లవణాలు మరియు బియ్యం, మినపప్పుల కచ్చితమైన నిష్పత్తి ప్రధాన కారణం. సాధారణంగా 4.1 నిష్పత్తిలో బియ్యం, మినపప్పులను నానబెట్టి, పిండిని కనీసం 8 నుండి 12 గంటల పాటు సహజ సిద్ధంగా పులియబెట్టడం (Fermentation) వల్ల ఇడ్లీలు ఎంతో సాఫ్ట్‌గా వస్తాయి. పోషకాహార నిపుణుల ప్రకారం, ఆవిరిపై ఉడికించే ఒక సాధారణ ఇడ్లీలో కేవలం 39 నుండి 40 క్యాలరీల శక్తి మాత్రమే ఉంటుంది. ఇందులో 0 గ్రాముల సంతృప్త కొవ్వు (Saturated Fat) మరియు 0 గ్రాముల కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఇడ్లీలను టిఫిన్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన 2 గ్రాముల ప్రోటీన్, 8 గ్రాముల కార్బోహైడ్రేట్లు మరియు అవసరమైన అమినో యాసిడ్లు అందుతాయి. మధురైలో ఇడ్లీల హడావుడి ఎంతలా ఉంటుందంటే, ప్రతిరోజూ తెల్లవారుజామున 4.00 గంటలకే హోటళ్లు మరియు టిఫిన్ సెంటర్లు ప్రారంభమై అర్ధరాత్రి 2.00 గంటల వరకు నిరంతరాయంగా సాగుతాయి. కేవలం మధురై నగరంలోనే రోజుకు సుమారు 500 కంటే ఎక్కువ ప్రధాన ఇడ్లీ తయారీ కేంద్రాలు మరియు వేలాది చిన్న వ్యాపారాలు నడుస్తున్నాయి. ఏటా మార్చి 30న జరుపుకునే  ప్రపంచ ఇడ్లీ దినోత్సవం  (World Idli Day) సందర్భంలో మధురై నగరంలో ప్రత్యేకంగా వందల రకాల ఇడ్లీ ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇక్కడి ప్రసిద్ధ మల్లి పూవు ఇడ్లీ (Malli Poo Idli), కరివేపిలై ఇడ్లీ, మరియు పొడి ఇడ్లీలను రుచి చూడటానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది దేశీ, విదేశీ పర్యాటకులు మధురైకి తరలివస్తుంటారు. నాణ్యత, రుచి, పౌష్టికత మరియు నిరంతర లభ్యత విషయంలో ప్రపంచంలోని ఏ నగరం కూడా మధురైకి సాటిరాదని, అందుకే ఈ నగరం ప్రపంచ ఇడ్లీ రాజధానిగా నిలిచిందని ఆహార ప్రియులు ముక్తకంఠంతో కొనియాడతారు.     [ Madurai, World Idli Capital, Idli, Murugan Idli Shop, South Indian Breakfast, Tamil Nadu, Idli Varieties, Fermented Foods, World Idli Day, South Indian Cuisine ]   
చిన్నతనంలో ఎదురయ్యే చేదు అనుభవాలు, మానసిక గాయాలు మరియు గృహ హింస లేదా సమాజంలో చూసే హింసాత్మక సంఘటనలు పిల్లల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై శాస్త్రవేత్తలు, మానసిక నిపుణులు చేసిన నూతన పరిశోధనలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాల్యంలో తీవ్రమైన ట్రౌమా లేదా మానసిక ఆఘాతానికి గురైన పిల్లలు పెద్దయ్యాక ప్రవర్తన లోపాలు, అణచివేయలేని కోపం, నియంత్రణ లేని ఆవేశం మరియు సామాజిక వ్యతిరేక ప్రవర్తనను ప్రదర్శించే అవకాశం అత్యధికంగా ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. పిల్లల లేత మనస్సులపై హింస కలిగించే ప్రతికూల ప్రభావం వారి మెదడు అమరికను మరియు హార్మోన్ల సమతుల్యతను శాశ్వతంగా మార్చివేస్తుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిశోధనలోని గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. హింస మరియు మానసిక గాయాలకు గురైన యువతలో దాదాపు 40% కంటే ఎక్కువ మంది తీవ్రమైన ప్రవర్తనా వైపరీత్యాలతో సతమతమవుతున్నారని అధ్యయనం వెల్లడించింది. సాధారణ పిల్లలతో పోలిస్తే, మానసిక ఆఘాతాన్ని అనుభవించిన పిల్లలలో కోపం మరియు ఆవేశాన్ని నియంత్రించుకునే సామర్థ్యం 3 రెట్లు తక్కువగా ఉంటుందని సైంటిస్టులు గుర్తించారు. అంతేకాకుండా, ఈ పిల్లలలో పాఠశాలల నుంచి మధ్యలోనే బడి మానేసే (డ్రాపౌట్) అవకాశాలు 50% పైగా పెరుగుతుండగా, ప్రతికూల వాతావరణంలో పెరిగిన వారిలో భవిష్యత్తులో నేరప్రవృత్తి వైపు మళ్లే ప్రమాదం 2.5 రెట్లు ఎక్కువగా ఉంటుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మానసిక గాయాలు ఎదుర్కొన్న పిల్లల మెదడులో భయము మరియు ఆందోళనలను నియంత్రించే  అమిగ్డాలా  భాగం అతిగా స్పందించడం ప్రారంభిస్తుంది. దీనివల్ల చిన్న చిన్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారు తీవ్రమైన భయానికి లేదా అపరిమితమైన కోపానికి గురవుతారు. తమను తాము కాపాడుకోవడానికి వారు ఆత్మరక్షణ ధోరణిలో సహజంగానే దాడి చేసేందుకు సిద్ధపడతారు. దీనినే మానసిక నిపుణులు ఫైట్ ఆర్ ఫ్లైట్రె స్పాన్స్ అని పిలుస్తారు. ఈ పరిస్థితి వల్ల వారు తోటి పిల్లలతో కలవలేకపోవడం, నిరంతరం అభద్రతా భావంతో ఉండటం, పాఠశాలల్లో ఉపాధ్యాయులతో లేదా ఇంట్లో పెద్దలతో తరచూ గొడవలకు దిగడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ ప్రవర్తనా లోపాలను ప్రారంభంలోనే గుర్తించకపోతే, అది వారి విద్యాభ్యాసానికే కాకుండా భవిష్యత్తులో వారి వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలకు తీవ్ర ముప్పుగా మారుతుంది. అయితే, సరైన సమయంలో మానసిక వైద్యుల పర్యవేక్షణ, కౌన్సెలింగ్, మరియు కుటుంబం ఇచ్చే ఆప్యాయత ద్వారా ఈ పిల్లలను సాధారణ స్థితికి తీసుకురావడం సాధ్యమేనని నిపుణులు సూచిస్తున్నారు. కోగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) మరియు ట్రౌమా ఇన్ఫార్మ్డ్ కేర్ వంటి అత్యాధునిక వైద్య విధానాల ద్వారా పిల్లల మానసిక గాయాలను మాన్పించవచ్చని చెబుతున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనలో అకస్మాత్తుగా వచ్చే మార్పులను నిశితంగా గమనిస్తూ, వారికి సురక్షితమైన మరియు ప్రేమపూర్వక వాతావరణాన్ని అందించడమే ఈ సమస్యకు ఏకైక శాశ్వత పరిష్కారం.     [ Childhood Trauma, Childhood Violence, Mental Health, Child Behavior, Emotional Trauma, Aggression, Amygdala, Fight or Flight Response, Cognitive Behavioral Therapy, Trauma Informed Care ]  
వినాయక చవితి పూజలో వెలగపండు ఖచ్చితంగా ఉంటుంది. ఎంతో  ప్రత్యేకంగా కనిపించే వెలగపండును కేవలం నైవేద్యానికే పరిమితం చేస్తుంటారు. చాలా ఇళ్లలో వెలగపండు నైవేధ్యంగా పెట్టాక వాటిని వినాయకుడితో పాటు నిమజ్జనం చేయడం లేదా పడేయడం లేదా వాటిని అలాగే వదిలేయడం చేస్తుంటారు. కానీ ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో వెలగ పండుకు  చాలా ప్రాధాన్యత ఉంది. పైకి గట్టి పెంకుతో సాధారణంగా కనిపించినప్పటికీ, లోపల ఉన్న గుజ్జు అమృతంతో సమానమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ పండు కలిగించే ప్రయోజనాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అవేంటో తెలుసుకుంటే.. జీర్ణవ్యవస్థ.. వెలగపండులో   ఫైబర్ అధికంగా ఉంటుంది, అలాగే అందులో ఉండే  టానిన్లు జీర్ణక్రియను వేగవంతం చేయడమే కాకుండా గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తాయి. ముఖ్యంగా మలబద్ధకం లేదా విరేచనాలతో బాధపడేవారికి ఈ పండు సహజమైన ఔషధంగా తోడ్పడుతుంది. కడుపులో ఉన్న చెడు బ్యాక్టీరియాను నశింపజేసి ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోగనిరోధక శక్తి  విటమిన్ సీ, విటమిన్ ఏ , వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు వెలగపండులో  పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చేరే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి, కణాల నాశనాన్ని అడ్డుకుంటాయి. రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా వెలగపండు పాత్ర ప్రశంసనీయం. క్రమంతప్పకుండా పరిమితంగా తీసుకోవడం వల్ల రక్తంలోని మలినాలు తొలగిపోతాయి. కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం.. కాలేయం, మూత్రపిండాల రక్షణకు వెలగపండు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో కాలేయానికి సహాయపడి, దాని పనితీరును సమర్థవంతంగా ఉంచుతుంది. అలాగే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడి మూత్రసంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. డయాబెటిస్ .. డయాబెటిస్ లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలనుకునేవారికి వెలగపండు మంచి ఆహారం. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించడంలో సాయపడుతుంది. శరీరం శక్తి కోల్పోకుండా, తక్షణ శక్తిని అందించడంలో దీనిలోని పోషకాలు తోడ్పడతాయి. మహిళల ఆరోగ్యానికి.. మహిళల ఆరోగ్యానికి కూడా వెలగపండు చాలా మేలు చేస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో, అలాగే పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తి పెరగడంలో వెలగపండు గుజ్జు సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచడానికి ఇందులోని యాంటీఆక్సిడెంట్లు దోహదపడతాయి. వెలగపండును గుజ్జు రూపంలో నేరుగా లేదా కొద్దిగా బెల్లం లేదా తేనె కలిపి తీసుకోవచ్చు.  వెలగపండు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఏ ఆహారమైనా పరిమితికి మించి తీసుకుంటే సమస్యలు రావచ్చు. అతిగా తింటే కడుపునొప్పి లేదా జీర్ణసమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున, సరైన పరిమాణంలో తింటూ వెలగపండు నుంచి ఆరోగ్య లాభాలను పొందడం మంచిది.                   *రూపశ్రీ.  
రాత్రి వేళల్లో నిద్రపోయే ముందు ఫోన్ చూడటం, ఆ తర్వాత దానిని దిండు కింద లేదా తలకు దగ్గర్లో  పెట్టుకుని నిద్రపోవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. పొద్దున్నే అలారం వినపడటం సులువవుతుందని కొందరు, అర్ధరాత్రి ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే ఎత్తవచ్చని మరికొందరు ఇలా చేస్తుంటారు. అయితే, ఈ అలవాటు మన ఆరోగ్యంపై, నిద్ర నాణ్యతపై ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతుందో తెలిస్తే ఖచ్చితంగా దిగ్భ్రాంతి చెందుతారు. ప్రశాంతమైన నిద్రను దూరం చేయడమే కాకుండా, శరీరానికి ప్రమాదకరమైన సమస్యలను కొనితెచ్చే ఈ అలవాటు గురించి ప్రతీ ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. దిండు కింద ఫోన్ పెట్టుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రమాదాలు,  ఆరోగ్య సమస్యల గురించి వివరంగా తెలుసుకుంటే.. మన శరీరంలో నిద్రను నియంత్రించడానికి మెలాటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. రాత్రి వేళ చీకటి పడినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది. అయితే స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్ నుండి వచ్చే నీలి రంగు వెలుతురు (బ్లూ లైట్) మెలాటోనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఫోన్ దిండు కింద ఉన్నప్పుడు, తరచుగా వచ్చే నోటిఫికేషన్లు, రింగ్ టోన్లు లేదా లైట్లు మన గాఢ నిద్రకు భంగం కలిగిస్తాయి. దీనివల్ల పొద్దున్నే లేచినా అలసటగా అనిపించడం, రోజంతా నీరసంగా ఉండటం జరుగుతుంది. స్మార్ట్‌ఫోన్లు పనిచేస్తున్నప్పుడు , నెట్‌వర్క్ సిగ్నల్స్ కోసం వెతుకుతున్నప్పుడు   రేడియేషన్ బయటకు వస్తుంది. ప్రతిరోజూ రాత్రి పూట ఎనిమిది గంటల పాటు ఫోన్‌ను తలకు అతి సమీపంలో ఉంచుకోవడం వల్ల ఈ రేడియేషన్ ప్రభావం నేరుగా మెదడుపై పడే అవకాశం ఉంటుందని  పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల తలనొప్పి, ఏకాగ్రత లోపించడం, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా యాప్ నడుస్తున్నప్పుడు వేడి ఉత్పత్తి అవుతుంది. ఫోన్‌ను దిండు కింద పెట్టినప్పుడు ఆ వేడి బయటకు వెళ్ళడానికి దారి ఉండదు. దిండు, పరుపు వేడిని పట్టి ఉంచుతాయి. దీనివల్ల ఫోన్ తీవ్రంగా వేడెక్కి బ్యాటరీ పేలిపోవడం లేదా పరుపుకు నిప్పు అంటుకోవడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నిద్రలేమి వల్ల కేవలం ఉదయం అలసట మాత్రమే కాకుండా దీర్ఘకాలంలో అధిక రక్తపోటు, మధుమేహం, బరువు పెరగడం , గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మరుసటి రోజు జ్ఞాపకశక్తి, పనిలో సామర్థ్యం తగ్గుతాయి. ఈ  అలవాటు నుంచి బయటపడటానికి కొన్ని సులువైన మార్గాలు: నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను  మంచానికి కనీసం ఐదు నుంచి ఆరు అడుగుల దూరంలో ఉంచడం మంచిది. అలారం కోసం ఫోన్ వాడేవారైతే, దానికి బదులుగా ఒక సాధారణ టేబుల్ క్లాక్ లేదా అలారం గడియారాన్ని ఉపయోగించడం అలవాటు చేసుకోండి. నిద్రపోవడానికి అరగంట ముందే ఫోన్‌ను పక్కన పెట్టేసి, వైఫై లేదా మొబైల్ డేటాను ఆపివేయడం మంచిది. ఈ చిన్న మార్పులు చేసుకోవడం వల్ల  ఇలా చేస్తే నిద్ర నాణ్యత పెరగడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఎవరిని వారు  కాపాడుకోవచ్చు.                     *రూపశ్రీ.
క్రియాటినిన్ అంటే ఏమిటి? మన శరీరంలో క్రియాటినిన్ స్థాయిలు ఎందుకు పెరుగుతాయి? క్రియాటినిన్ ఎక్కువగా ఉంటే కిడ్నీల పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలకు దీనికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ వీడియోలో Creatinine Test, Creatinine Levels, Kidney Functionగురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ Dr. Sree Bhushan Raju, MD, Nephrology వివరంగా తెలియజేస్తున్నారు. రక్తంలో క్రియాటినిన్ స్థాయిని ఎలా పరీక్షిస్తారు, రిపోర్టులో వచ్చే ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోవచ్చు.  క్రియాటినిన్ స్థాయి పెరగడానికి కిడ్నీ సమస్యలతో పాటు డీహైడ్రేషన్, కండరాలకు సంబంధించిన సమస్యలు, అధిక శారీరక శ్రమ వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. అందుకే ఒకసారి క్రియాటినిన్ ఎక్కువగా వచ్చిందని మాత్రమే కిడ్నీ ఫెయిల్యూర్ అని భావించకూడదు. అవసరమైన ఇతర పరీక్షలతో పాటు వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. కిడ్నీల ఆరోగ్యం, క్రియాటినిన్ స్థాయిలు, కిడ్నీ ఫిల్టరింగ్ సామర్థ్యం, గుండె ఆరోగ్యంతో ఉన్న సంబంధం గురించి ఈ వీడియోలో మరిన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)