LATEST NEWS
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజాగా కీలకమైన తీర్పును వెలువరించింది. ఈ పరిణామంతో ప్రధాన ప్రతిపక్షమైన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని షాక్ తగిలినట్లయింది. సమగ్ర సర్వే ప్రక్రియ పూర్తికాకుండా, అలాగే కొత్త ఓటర్ల జాబితాను పరిగణలోకి తీసుకోకుండా పాత లిస్టుతోనే ఎన్నికలకు వెళ్లాలని చూడటంపై కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. సర్వే ముగిసిన తర్వాతే తదుపరి ప్రక్రియ చేపట్టాలని, కొత్త జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ తరఫున కోరారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఓట్ల తొలగింపు ప్రక్రియ  ఇతర అంశాలను ప్రస్తావిస్తూ దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలపై న్యాయస్థానం ఇరువర్గాల వాదనలను వినడం జరిగింది. అయితే, వైసీపీ లేవనెత్తిన అభ్యంతరాలను  వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్ల వాదనాబలం లేదంటూ ఆయా పిటిషన్లను కోర్టు డిస్మిస్‌ చేసింది. అంతేకాకుండా, రాబోయే ఆరు వారాల వ్యవధిలోనే స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తాజా తీర్పుతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. త్వరలోనే ఎన్నికల సమరం మొదలుకానుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే పనుల్లో నిమగ్నమైనప్పటికీ, ఈ తీర్పుపై తదుపరి ఎలాంటి కార్యాచరణ ఉంటుందనేది చర్చనీయాంశమైంది. ఒకవేళ ఈ తీర్పును సవాల్‌ చేస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని పార్టీ భావిస్తే ప్రక్రియలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. లేనిపక్షంలో, అధికార యంత్రాంగం విపక్షాలు హుటాహుటిన ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధం కావాల్సి ఉంటుంది. కోర్టులో ప్రతికూల తీర్పు రావడంపై పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌‌మోహన్‌రెడ్డి  ముఖ్య నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానాంశంగా మారింది.       [ AP High Court, YSRCP, Local Body Elections AP, Lella Appi Reddy, AP Political News, CM Chandrababu, Naralokesh, TDP, YS Jagan, Telugu One, Telugu News ]
ఒకవైపు వేలాది మంది విద్యార్థుల చదువులు.. మరోవైపు పచ్చదనంతో కళకళలాడే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌.. అలాంటి ప్రాంగణంలో గంజాయి మొక్క కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. .ఉస్మానియా యూనివర్సిటీకి పచ్చదనంతో ప్రత్యేక గుర్తింపు ఉంది. యూనివర్సిటీ అధికారిక సమాచారం ప్రకారం క్యాంపస్‌లో విస్తారమైన గ్రీన్‌ కవర్‌తో పాటు ఉద్యానవనాలు, గ్రీన్‌బెల్ట్ ప్రాంతాలు ఉన్నాయి. క్యాంపస్‌లోని వృక్షజాలంపై నిర్వహించిన అధ్యయనంలో 839 రకాల మొక్కల జాతులు నమోదైనట్లు వెల్లడైంది. ఇలాంటి పచ్చని ప్రాంగణంలో ఇప్పుడు గంజాయి మొక్క కనిపించడం ఆసక్తికరంగా మారింది. సహజంగానే మొలిచిందా? లేక ఎవరైనా కావాలనే నాటారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎవరైనా గంజాయి సిగరెట్‌ లేదా విత్తనాలను అక్కడ పడేయడంతో మొక్క మొలిచిందా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్యాంపస్‌లో కనిపించినది ఒక్క మొక్కేనా? మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి మొక్కలు ఉన్నాయా? అన్నదానిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విశాలమైన క్యాంపస్‌లోని పచ్చదనం, పొదలు, ఖాళీ ప్రదేశాలు, ఉద్యానవన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తే అసలు పరిస్థితి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు నిత్యం సంచరించే ప్రాంగణంలో గంజాయి మొక్క కనిపించడంతో యూనివర్సిటీ అధికారులు అప్రమత్తం కావాలని విద్యార్థులు కోరుతున్నారు. క్యాంపస్‌లో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి.. ఇలాంటి మొక్కలు మరెక్కడైనా ఉన్నాయా అన్నది గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.అసలు ఈ మొక్క అక్కడ ఎలా పెరిగింది?  అనే అంశాలపై యూనివర్సిటీ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ యంత్రాంగం ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? క్యాంపస్‌లో పూర్తిస్థాయి తనిఖీలు చేపడుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.       [ Osmania University campus, Marijuana, Marijuana cigarette, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Hyderabad police, Telugu One, Telugu News ]
కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన ఎంపీ విజయసాయిరెడ్డి, వరుస ప్రెస్ మీట్లతో ఒకదాని వెంట ఒకటిగా సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఆయన వైజాగ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పిన విషయాలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన చెప్పిన విషయం, ప్రస్తావించిన అంశం, వెల్లడించిన వివరాలను అలా ఉంచితే..   పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.  విజయసాయిరెడ్డి  కొత్త పార్టీ రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనేది పక్కనపెడితే..  వైసీపీ అధినేత  జగన్‌  సమావేశాల కంటే సాయిరెడ్డి ప్రెస్‌మీట్లే ప్రజల్లో ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.  వివిధ అంశాలపై వైఎస్ జగన్ సుదీర్ఘంగా ప్రసంగించడమే కాకుండా, గణాంకాలు, పోలికలపైనే ఎక్కువ దృష్టిపెడుతుంటారు. దీంతో ఆయన విలేకరుల సమావేశాలు సాగదీతగా, రొడ్డకొట్టుడు ప్రసంగాలుగా మీడియా ప్రతినిథులు చెబుతుంటారు. అంతే కాకుండా జగన్ ప్రెస్ మీట్లలో గణాంకాల విషయంలో ఫ్యాక్చువల్ ఎర్రర్స్ సర్వసాధారణమి  చెబుతారు.దీంతో ఆయన మాట్లాడే విషయంలోని తప్పులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవ్వడమే కాకుండా, జగన్ ను కూడా ట్రోల్ మెటీరియల్ గా మర్చేస్తుండటం కద్దు. అయితే అందుకు భిన్నంగా విజయసాయిరెడ్డి మీడియా సమావేశాలు రంజుగా, పసందుగా, పదునుగా, స్ట్రాటజిక్ గా సాగుతుంటాయి.  గణాంకాల జోలికి పోకుండా, ప్రజలను,  మీడియాను ఇట్టే ఆకట్టుకునే సంచలన రాజకీయ విమర్శలకు విజయసాయి ప్రాధాన్యత ఇస్తారు.   ఉదాహరణకు చెప్పాలంటే.. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం, మత మార్పిడులు, వైసీపీలో సజ్జల ఆధిపత్యం, పార్టీలో అంతర్గతంగా ఆయన సాగిస్తున్న అరాచకం, తననే స్వయంగా కొట్టారంటూ సజ్జలపై సంచలన ఆరోపణలు,   విశాఖపట్నం వర్సెస్ మావిగున్   వంటి వాటిని ఆయన ప్రస్తావిస్తూ, ఇటు మీడియానూ, అటు ప్రజలనూ ఏకకాలంలో ఆకట్టుకోగలుగుతున్నారు. అన్నిటికీ మించి దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికీ, వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచీ జగన్ కు సన్నిహితంగా మెలిగిన విజయసాయి రెడ్డి.. ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలను సహజంగా జనం నమ్ముతున్నారు. కేవలం సంచలన వ్యాఖ్యలుగా కొట్టిపారేయకుండా, అందులో వాస్తవం ఉండే ఉంటుందన్న కోణంలో చర్చ జరుగుతోంది.  ఈ కారణంగానే జనం విజయసాయి ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారు? ఏ సంచలన విషయాలు వెల్లడిస్తారు? అని ఆసక్తిగా చూస్తున్నారు.   [Vijayasai Reddy Jagan, AP Politics, Visakhapatnam, Press meet, YSR Congress Party, Vijayasai, New Party, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  బందర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని ఎప్పుడు వార్తల్లో ఉంటుంటారు. తనదైన వాగ్ధాటితో  ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలు రేకెత్తడానికి దోహదపడుతుంటారు. అసలు పేర్ని నాని పరిచయం అక్కర్లేని పేరు.  అయితే తాజాగా ఆయన తన సహజ శైలికి భిన్నంగా ఇటీవల ఎక్కడ లేని అసహనాన్నీ ప్రదర్శించారు. విషయమేంటంటే..   ఇటీవల బందర్ లో ఆయన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ కార్యకర్తలతో పేర్ని నాని భేటీ అవ్వడం కొత్తేం కాదు. చాలా మంది నేతల కంటే చాలా చాలా ఎక్కువ సార్లు ఆయన కార్యకర్తలతో సమావేశం అవుతుంటారు. వారిలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతుంటారు. అలా నింపడానికి ఆయనకున్న వాగ్ధాటి దోహదపడుతుంటుంది. అందుకే పేర్ని నాని సమావేశం ఏర్పాటు చేశారంటే కార్యకర్తలు ఉత్సాహంగా ఆ భేటీకి తరలి వస్తుంటారు. అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది.  అందుకు కారణమేంటంటే.. ఐదేళ్ల వైసిపి హయాంలో   తన సొంత సామాజిక వర్గానికి, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు ఆశించిన స్థాయిలో న్యాయం చేయలేదంటూ  ఈ సమావేశంలో కార్యకర్తలు పేర్ని నానిని నిలదీశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నోసార్లు సామాజిక సమీకరణలను తనకు అనుకూలంగా మార్చుకుని లబ్ధి పొందిన పేర్ని నాని.. కార్యకర్తలు నిలదీయడంతో సహనం కోల్పోయారు. పొలిటీషియన్లు, ఎమ్మెల్యేలకు కులాలేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన కార్యకర్తలపై ఒక్క సారిగా సామాజిక సమీకరణాలంటారేంటి అంటూ విరుచుకుపడ్డారు. దీంతో కార్యకర్తలు విస్మయానికి గురయ్యారు. సామాజికవర్గం పేరు చెప్పుకుని ఎదిగిన నాని ఒక్కసారిగా ఇలా రివర్స్ అవ్వడమేంటంటూ విస్తుపోయారు.  తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాటవేతకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను సొంత పార్టీ నేతలకు నిలదీస్తుంటే.. వారిని సముదాయించడం చాతకాక, మంత్రి కొల్లు రవీంద్రపై నోరు పారేశసుకున్నారు.  తెలుగుదేశం పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారని, తాను మాత్రం కేవలం విధేయత చూపిన వాళ్లకే పదవులు ఇచ్చాననీ పరోక్షంగా కొల్లును విమర్శిస్తూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమౌతోంది. స్థానిక ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. పేర్ని తీరు, వ్యాఖ్యలు.. బందర్ లో వైసీపీ సీన్ అయిపోయిందా? లేక వైసీపీలో పేర్ని నాని సినిమా అయిపోయిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  బందర్ నియోజకవర్గంలో తెలుగుదేశం కూటమి బలోపేతం అయ్యిందనీ, ఇందు కోసం మంత్రి కొల్లు రవీంద్ర చురుకుగా వ్యవహరిస్తున్నారనీ, ఈ నేపథ్యంలోనే సొంత పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుని పార్టీని నడిపించడంలో విఫలమైన నాని, డిఫెన్స్ లో పడి.. అసహనంతో రగిలిపోతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  దానికి తోడు.. తన రాజకీయ వారసుడిగా ఎదుగుతాడని ఆశించిన పేర్ని కిట్టూ కూడా ప్రజాక్షేత్రంలో ఆకట్టుకోవడంలో విఫలం కావడం కూడా పేర్ని నాని అసహనానికి కరాణంగా చెబుతున్నారు.   [Perni Nani, Machilipatnam, Kollu Ravindra, Y CP , AP Politics, Andhra Pradesh Politics, Restlessness, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన తాజా రాజకీయ సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు నెలల పాటు నిర్వహించిన ఈ సర్వేలో ప్రజాభిప్రాయం, స్థానిక రాజకీయ పరిస్థితులు, ఎమ్మెల్యేల పనితీరు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పాలన, కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన బీజేపీ మధ్య సమన్వయం, వైసీపీ బలం వంటి పలు అంశాలను పరిశీలించినట్లు చాణక్య స్ట్రాటజీస్ వెల్లడించింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ సర్వేలోని అంశాలు ఏపీ రాజకీయాల్లో  ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 175 స్థానాల్లో 164 సీట్లు గెలుచుకుంది. వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తియిన సందర్భంగా.. కూటమి పాలనపై ప్రజాల అభిప్రాయం, జనం మూడ్ ఎలా ఉందన్న అంశాన్ని తాజా సర్వే పరిశీలించింది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, జాబ్ క్యాలెండర్, పెంచిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వంటి పథకాలు అమలవుతున్నప్పటికీ.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో క్షేత్రస్థాయి నాయకత్వం, కార్యకర్తలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్న అభిప్రాయం చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో  తేలింది.  ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచడం, నెల నెలా ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ వంటి అంశాలు ప్రజలకు చేరుతున్నాయని సర్వే పేర్కొంది. అయితే గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా జరిగిన పెన్షన్ పంపిణీ సమయంలో కనిపించిన ప్రచార స్థాయి ఇప్పుడు కనిపించడం లేదన్న అభిప్రాయం జనంలో  వ్యక్తమౌతోంది. ఇక తల్లికి వందనం పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలోనూ కూటమి నేతలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సర్వే ఫలితంలో వెల్లడైంది.   అన్నిటికీ మించి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లడంలోనూ, ప్రభుత్వంపై వైసీపీయులు చేసే విమర్శలను తిప్పి కొట్టడంలోనూ తెలుగుదేశం వినా, కటమిలోని మిగిలిన రెండు భాగస్వామ్య పార్టీల నేతలూ పెద్దగా ముందుకు రావడం లేదన్న అభిప్రాయం కూడా ఈ సర్వేలో తేటతెల్లమైంది.   జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.  మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబుపై, ఆయన పాలనపై ప్రజల్లో విశ్వాసం ఇసుమంతైనా సడలలేదని సర్వే స్పష్టం చేసింది.  చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలరన్న విశ్వాసం ప్రజల్లో  ప్రస్ఫుటంగా వ్యక్తమౌతోంది. అయితే స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల పనితీరుపై మాత్రం క్షేత్రస్థాయిలో జనంలో తీవ్ర అసంతృప్తి ఉందని  చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో తేలింది.  ఇసుక, మట్టి, ఇతర స్థానిక వ్యవహారాల్లో అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లపై వస్తున్న ఫిర్యాదులు, చిన్న చిన్న ప్రజా సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదన్న అసంతృప్తి  క్షేత్రస్థాయిలో ప్రజలలో కనిపిస్తోందని సర్వే పేర్కొంది.   ఏపీలో భారీ పెట్టుబడులు వస్తున్నాయని, వాటి ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని కూటమి ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. ఆ పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమలు వాస్తవంగా ఎప్పుడు ప్రారంభమవుతాయన్న చర్చ ప్రజలలో విస్తృతంగా జరుగుతోందని సర్వే పేర్కొంది. కొన్ని పరిశ్రమలకు భూ కేటాయింపులు జరిగినప్పటికీ.. అనేక చోట్ల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా సర్వే పేర్కొంది. అమరావతి నిర్మాణ పనులకు ప్రతిరోజూ అప్‌డేట్లు వస్తున్నట్టే.. పరిశ్రమలు, పెట్టుబడి ప్రాజెక్టుల పురోగతిపై కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం స్పష్టమైన సమాచారాన్ని ప్రజలకు అందిస్తే విశ్వాసం మరింత పెరుగుతుందన్న అభిప్రాయం సర్వేలో  వ్యక్తమైంది. శంకుస్థాపనలు ఎప్పుడు పూర్తవుతాయి.. పరిశ్రమలు ఎప్పుడు ప్రారంభమవుతాయి.. ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయన్న ప్రశ్నలకు జనం సమాధానం కోరుకుంటున్నారని తేలింది.   గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెమ్మదించిన పలు సాగునీటి ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసిందన్న అంశాన్ని కూడా సర్వే ప్రస్తావించింది. వెలిగొండ, పోలవరం ఎడమ గట్టు కాలువ, కుప్పం ప్రాంతానికి తాగు, సాగునీరు, పులివెందులకు తాగునీరు అందించే ప్రాజెక్టులు వంటి వాటిని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లిందని పేర్కొంది. అయితే ఈ పనుల గురించి ప్రజల్లోకి బలంగా వెళ్లే స్థాయిలో ప్రచారం జరగడం లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం అధికార కూటమికి ఇబ్బందికరంగా మారుతోందని సర్వే విశ్లేషించింది. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై విమర్శలను విస్తృతంగా ప్రచారం చేస్తోందని, వాటికి దీటుగా కౌంటర్ ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం, కూటమి భాగస్వామ్య పార్టీలో విఫలమౌతున్నాయని సర్వే తేల్చింది.  ఇక రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పార్టీలలో కీలకమైన జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య విభేదాలపై జరుగుతున్న ప్రచారం కూడా జనంలో చర్చనీయాంశంగా మారిందని సర్వే పేర్కొంది. వైసీపీ నుంచి జనసేనలోకి భారీగా వలసలు జరుగుతుండటం ఆ అభిప్రాయానికి కారణంగా సర్వే పేర్కొంది.  గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న కాలంలో.. స్థానికంగా టీడీపీ నాయకులతో రాజకీయంగా తలపడిన నేతలు జనసేనలో చేరుతుండటం, ఆయా ప్రాంతాల్లోని టీడీపీ నాయకులతో  ముందుముందు జనసేన సమన్వయం దెబ్బతినే అవకాశం ఉందన్న అభిప్రాయం, ఆందోళన అయా ప్రాంతాలలోని స్థానికులలో బలంగా వ్యక్తమౌతోందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే పేర్కొంది.  మరీ ముఖ్యంగా ఈ పరిస్థితి స్థానిక ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నట్లు సర్వేలో తేలింది.  ఇక తెలుగుదేశం   సీనియర్ నాయకులకు, మంత్రి నారా లోకేష్‌కు మధ్య సమన్వయం, ప్రాధాన్యత వంటి అంశాలపై కూడా సర్వేలో  పరిశీలించింది. పార్టీలో సీనియర్లకు గతంలో ఉన్నంత ప్రాధాన్యత ప్రస్తుతం లేదన్న అభిప్రాయం కొంతమంది నాయకుల్లో ఉందని పేర్కొంది. కీలక పదవులు, నిర్ణయాల్లో సీనియర్ల అభిప్రాయాలను తగిన స్థాయిలో పరిగణనలోకి తీసుకోవడం లేదన్న అసంతృప్తి కూడా ఉందని తెలిపింది. అదే సమయంలో పవన్ కల్యాణ్, లోకేష్ మధ్య విభేదాలు, ఆధిపత్య పోరు వంటి ప్రచారం క్షేత్రస్థాయిలో వినిపిస్తోందని సర్వే పేర్కొంది. అయితే బహిరంగంగా మాత్రం ఇరువురు నేతలు కూటమి కొనసాగుతుందని చెబుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించింది. ఈ తరహా ప్రచారానికి కూటమి అగ్రనాయకత్వం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వేలో వ్యక్తమైంది. భవిష్యత్తులో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ కలిసి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కూటమి ఐక్యతపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొంది. ఇక వైసీపీ విషయానికి వస్తు.. వైసీపీ, కూటమి మధ్య అంతరం తగ్గుతోందన్న అభిప్రాయం ముఖ్యంగా కడప, కర్నూలు జిల్లాల్లో కనిపిస్తోందని సర్వే పేర్కొంది. కడప జిల్లాలో కమలాపురం మినహా మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ వైపు ఓటర్ల మొగ్గు కనిపిస్తోందని తెలిపింది. కర్నూలు జిల్లాలోనూ కూటమి నాయకులు ఆశించిన స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదన్న అసంతృప్తి ప్రజలలో బలంగా వ్యక్తమైందని సర్వే పేర్కొంది.   కూటమి వైఫల్యాలను వైసీపీ నిర్మాణాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే ఆ పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉందన్న విశ్లేషణను సర్వే చేసింది. అయితే ఇది సర్వే సంస్థ అభిప్రాయం మాత్రమేనని, వాస్తవ ఎన్నికల ఫలితాలను ముందుగానే నిర్ణయించే అంశంగా చూడలేమని చాణక్య స్ట్రాటజీస్ పేర్కొంది.  అలాగే స్థానిక ఎన్నికల విషయానికి వస్తే.. కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం, సర్దుబాట్లే కీలకమని సర్వే పేర్కొంది.   జనసేన నాయకులు ఎక్కువ సంఖ్యలో స్థానాలను కోరుతున్నారని, రోవైపు ఇప్పటికే గ్రామస్థాయిలో తమకు బలమైన పట్టు ఉందని భావిస్తున్న టీడీపీ నాయకులు సీట్లను వదులుకోవడానికి సిద్ధంగా ఉండరన్న అభిప్రాయం కూడా ప్రజలలో ఉందని సర్వే పేర్కొంది. టీడీపీ, జనసేన నాయకత్వం క్షేత్రస్థాయిలో విభేదాలను ముందుగానే పరిష్కరించకపోతే వాటి ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉందని సర్వే విశ్లేషించింది. గతంలో పరస్పరం పోటీ చేసిన లేదా విమర్శలు చేసుకున్న నాయకులు ఇప్పుడు కలిసి ప్రచారం చేయాల్సిన పరిస్థితి రావడం కూడా కూటమికి కీలక సవాలుగా మారనుందని పేర్కొంది. మొత్తంగా చూస్తే.. చాణక్య స్ట్రాటజీస్ తాజా సర్వేలో కూటమి ప్రభుత్వానికి కొన్ని అంశాల్లో ప్రజల నుంచి సానుకూల స్పందన ఉన్నప్పటికీ.. స్థానిక ప్రజాప్రతినిధుల పనితీరు, కూటమి పార్టీల మధ్య సమన్వయం, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం, పెట్టుబడుల అమలు, జనసేనలో చేరికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకం వంటి అంశాలు కీలకంగా మారుతున్నట్లు పేర్కొంది. ఈ అంశాలను కూటమి నాయకత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందన్నది రాబోయే రాజకీయ పరిణామాల్లో ఆసక్తికరంగా మారనుంది. [AP Political Survey, Chanakya Strategies Survey, AP Political Survey, Chandrababu, TDP, Janasena, BJP, YCP, AP Local Body Elections, Andhra Pradesh Politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
సినిమా.. అందులోనూ తెలుగు సినిమా.. సరైన తెలుగు సినిమా పడిందంటే దివి నుంచి దేవతలు సైతం దిగొచ్చి మానవరూపంలో సినిమా చూసి తెలుగు ప్రేక్షకులు ఎంతటి అదృష్టవంతులు అని ఈర్ష్య పడుతుంటారని సినీ ప్రేమికులు తమ చాయ్, బిస్కెట్ కబుర్లలో చెప్పుకుంటూ ఉంటారు. అంతటి కథ, కథనం, పాటలు, మాటలు, పెర్ ఫార్మెన్స్  కలగలిపిన తెలుగు సినిమా చాలా ఏళ్ళ నుంచి దిగులని మనసులో ఉంచుకొని పైకి మాత్రం నవ్వుతు ఉంది. అందుకు కారణమేంటో చూద్దాం. తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు ఒక హిట్ సినిమా వచ్చిందంటే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టి, అదే సినిమాని రెండు మూడు సార్లు చూసే సంస్కృతి స్పష్టంగా కనిపించేది. కానీ ఈ డిజిటల్ యుగంలో ఆ ‘రిపీట్ వాచ్ కల్చర్’ క్రమంగా మాయమవుతోందనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, దీర్ఘకాలం థియేటర్లలో నిలబడటానికి రిపీట్ ఆడియన్స్ ఎంతో కీలకం. అయితే నేటి కాలంలో ఒక్కసారి చూస్తే చాలు అనే భావన ప్రేక్షకుల్లో పెరిగిపోవడానికి అసలు కారణాలు ఏమిటి?  ఇది కూడా చదవండి: ఈ సారి 'ఇరుముడి'ని మించిన టైటిల్: ఏడూకొండల వాడ వెంకటేశా! .ఈ పరిస్థితికి ప్రధాన కారణాల్లో మొదటిది ఆకాశాన్నంటిన టికెట్ ధరలు మరియు స్నాక్స్ ఖర్చులు. మల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్ ధర . 295 నుంచి . 413 వరకు పెరిగిపోవడం, దానికి తోడు 300 నుంచి 500 వరకు ఉండే ఆహార పదార్థాల ధరలు సగటు కుటుంబ బడ్జెట్‌ను దెబ్బతీస్తున్నాయి. నలుగురు ఉన్న ఒక కుటుంబం సినిమాకు వెళ్తే  2,000 నుంచి 3,000 వరకు ఖర్చవుతుండటంతో, థియేటర్ అనుభవం కాస్త భారం గా మారుతోంది.      ఇక రెండవ ముఖ్యమైన అంశం ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్‌ల వేగవంతమైన విస్తరణ. థియేటర్ విడుదలైన కేవలం 3 నుంచి 4 వారాల వ్యవధిలోనే (వంద శాతం ఓటీటీ విండో) డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుండటంతో, సెకండ్ టైమ్ చూడాలనుకునే వారు ఓటీటీ రిలీజ్ కోసమే వేచి చూస్తున్నారు. ఇది ఓటీటీ హక్కుల ద్వారా నిర్మాతలకు 20% నుండి 30% వరకు అదనపు రాబడిని అందిస్తున్నప్పటికీ, థియేట్రికల్ ఫుట్‌ఫాల్స్‌పై మాత్రం తీవ్ర ప్రభావం చూపుతోంది.   అంతేకాకుండా కంటెంట్ నాణ్యత కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తోంది. మొదటి రోజు ఉదయం ఆట పూర్తయిన 5 గంటల్లోపే సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ టాక్, రివ్యూలు విస్తృతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. సినిమా కథలో బలమైన ఎమోషన్లు, రిపీట్ వాల్యూ లేకపోతే ప్రేక్షకులు కేవలం ఒకసారి చూసి వదిలేస్తున్నారు. పైగా రిలీజ్ అయిన 5 గంటల్లోనే పైరసీ వెర్షన్లు అందుబాటులోకి రావడం కూడా థియేటర్ రన్ సమయాన్ని తగ్గిస్తోంది. ఇటీవల టికెట్ ధరలను అందుబాటులో ఉంచిన మీడియం బడ్జెట్ సినిమాలు, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న చిత్రాలు మాత్రమే థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులతో మంచి విజయం సాధించడం గమనార్హం.అయితే ఆ సినిమాలకి కూడా రిపీట్ ఆడియెన్స్ ఉండటం లేదు. ఏది ఏమైనా రిపీట్ ఆడియన్స్ ఉన్నప్పుడే తెలుగు సినిమా పూర్తి ఆనందంతో ఉండగలదు.
  'ఇరుముడి'తో మాస్ మహారాజ రవితేజ మంచి జోష్ లో ఉన్నాడు. ఫ్యాన్స్ అయితే మా మాస్ మహారాజా ఇక పట్టిందల్లా బంగారం అనే మూడ్ లో సరిపోదా శనివారం ఫేమ్ 'వివేక్ ఆత్రేయ' దర్శకత్వంలో తెరకెక్కే మూవీ సెట్స్ పైకి వెళ్లే శుభ సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా కథాంశం ఒక సరికొత్త హారర్ కామెడీ థ్రిల్లర్ జానర్‌లో ఉండబోతున్నట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా 'తులా భారం’ అనే విభిన్నమైన మరియు శక్తివంతమైన టైటిల్‌ని  పరిశీలించి ఖరారు చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌కి 'తులా భారం' అనే పేరును లాక్ చేయడం వెనుక పెద్ద కాన్సెప్ట్ దాగ ఉందనే చర్చ మొదలైంది. ఇప్పటివరకు రవితేజ తన సుదీర్ఘ కెరీర్‌లో మాస్, యాక్షన్, సెంటిమెంట్, ప్యూర్ కామెడీ జానర్లలో అనేక సినిమాలు చేసినప్పటికీ, పూర్తి స్థాయి హారర్ కామెడీ థ్రిల్లర్ జానర్‌‌ను ఎంచుకోవడం ఇదే ప్రథమం. ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబం: ఈ సారి అలాంటి అనుమానాలు వద్దు!     ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను దర్శకుడు వివేక్ ఆత్రేయ ఇప్పటికే 100 శాతం పూర్తి చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కథ, కథనాలపై సంపూర్ణ స్పష్టతతో ఉన్న దర్శకనిర్మాతలు ఈ దసరా పండుగ శుభ ముహూర్తాన సినిమాని  అధికారికంగా లాంచ్ చేసి సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా 'ఓజీ' బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా 'తులాభారం' అనే టైటిల్ ఫిక్స్ అయితే బాక్స్ ఆఫీస్ తుక్కు రేగిపోవడమే. పైగా ఏడుకొండల వాడి భక్తులతో పాటు అన్ని దేవుళ్ళ భక్తుల హృదయాల్లో తులాభారానికి ఎంతో విశిష్టత ఉంది.   [Ravi Teja And Vivek Athreya New movie Title, Ravi Teja, Vivek Athreya, Tula Bharam, Ravi Teja Next Movie, RT Vivek Athreya Movie, telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood]       
  నిర్మాతగా అభిమానులని సంపాదించడం చాలా అరుదు. అలాంటి అరుదైన వాళ్ళల్లో నాగ వంశీ ఒకరు. ఈ నెల 9 న విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల  'ఆదర్శ కుటుంబం'తో మరో సారి సెల్యులాయిడ్ పై అడుగుపెట్టనున్నాడు. సోషల్ మీడియాలోను యాక్టీవ్ గా ఉండే నాగవంశీ రీసెంట్ గా' మా బ్యానర్ పై మీకు అనుమానం ఉండవచ్చు. కానీ ఈ సారి ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు. అనుకున్న డేట్ కే 'ఆదర్శ కుటుంబం' వస్తుంది. 6 న ట్రైలర్ లాంచ్ ఉంటుంది.మరుసటి రోజు నుంచి బుకింగ్స్ స్టార్ట్ అవుతాయి. దసరాని మా సినిమాతోనే స్టార్ట్ చెయ్యండని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసాడు. ఇది కూడా చదవండి: వారణాసి తర్వాత ప్రియాంక చోప్రా నెక్స్ట్ హీరో ఎవరో తెలుసా! దశాబ్దకాలం నిరీక్షణకి తెరపడనుందా?   హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌‌పై  నాగ వంశీ బాబాయి  ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తుండగా నాగవంశీ సమర్పకుడు. వెంకటేష్ సరసన కేజియఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, నారా రోహిత్, నివేతా పేతురాజ్, డింపుల్ హయతి, సత్య, రావు రమేష్ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో  చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ముఖ్యంగా 'నారాయణమ్మ' లిరికల్ సాంగ్ సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టి శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది.    [Naga Vamsi About Aadarsha Kutumbam, Aadarsha Kutumbam Trailer Update, Aadarsha Kutumbam, Venkatesh Aadarsha Kutumbam Trailer, Trivikram Srinivas, telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood]  
  'ఇరుముడి'లో కామవాంఛ ఉన్న ఒక ప్రజాప్రతినిధి దగ్గరకి ప్రభుత్వ పాఠశాల టీచర్ విద్యార్థులని పంపిస్తూ ఉంటుంది. థియేటర్ లో ఈ సన్నివేశానికి సంబంధించిన సీన్స్ వస్తుంటే రక్తం మరగని ప్రేక్షకుడు లేడు. మరి ఇలాంటి సంఘటనే నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుంది పరిస్థితి.  ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలో తల్లిదండ్రులు నమ్మి పంపిన బిసి వెల్ఫేర్ హాస్టల్‌లోని అమాయక మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని, ఒక ముఠాలాగా దారుణానికి ఒడిగట్టిన తీరు స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సరిగ్గా ఇటీవలే విడుదలైన ‘ఇరుముడి’ సినిమా కథను తలపించేలా, నిజ జీవితంలోనూ అత్యంత దారుణమైన కుట్రకు తెగబడటం అందరినీ కలవరపెడుతోంది. విద్యార్థినులకు రక్షణగా నిలవాల్సిన హాస్టల్ సిబ్బందే ఈ ఘోరానికి ప్రధాన పాత్రధారులుగా మారడం పట్ల సర్వత్రా తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘోరానికి సూత్రధారిగా మారిన జరుగుమల్లి బిసి హాస్టల్ వంటమనిషి శారద, అక్కడి ఇద్దరు బాలికలను లక్ష్యంగా చేసుకుంది. ఇటీవల ఒక బాలిక తండ్రి మరణించడంతో, ఆ కుటుంబానికి రావాల్సిన డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తానంటూ ఆమెకు మాయమాటలు చెప్పింది. డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తానని, డీఆర్‌డీఏ (DRDA) శాఖలో పనిచేసి రిటైర్ అయిన వెంకట్రావు వద్దకు వెళితే పని త్వరగా పూర్తవుతుందని నమ్మబలికింది. ఆ విధంగా ప్రణాళిక ప్రకారమే ఆ ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థినులను హాస్టల్ నుంచి బయటకు తీసుకువచ్చి, నిందితుడైన రిటైర్డ్ ఉద్యోగి వెంకట్రావు సెల్ నంబర్ ఇచ్చి అతని ఇంటికి పంపించింది. రిటైర్డ్ ఉద్యోగి వెంకట్రావు ఇంటికి చేరుకున్న ఆ బాలికలకు మొదట బిర్యానీ తినిపించి ఆశ చూపాడు. ఆ తర్వాత తన నిజస్వరూపాన్ని బయటపెడుతూ, తన సెల్‌ఫోన్‌లో ఉన్న నీలిచిత్రాలు (పోర్న్ వీడియోలు) చూపిస్తూ వారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందని, ఆ వృద్ధుడి ప్రవర్తనలో తేడా ఉందనే విషయాన్ని సమయస్ఫూర్తితో గ్రహించిన ఒక 9వ తరగతి బాలిక, తన స్నేహితురాలితో కలిసి అత్యంత చాకచక్యంగా అక్కడ నుంచి బయటపడి తప్పించుకుంది. అక్కడ నుంచి బయటకు వచ్చిన ఆ బాలికలు భయంతో ఒంగోలులోని ఒక స్థానిక పార్కులో కొంతసేపు గడిపారు. కానీ, సాయంత్రం వేళ మళ్లీ ఆ కామాంధుడి వద్దకే వెళ్లాల్సి రావడంతో నిందితుడు వెంకట్రావు మరలా వారిపై పాశవికంగా విరుచుకుపడి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే, బాలికలు ధైర్యం కోల్పోకుండా అత్యంత సమయస్ఫూర్తితో వెంటనే తమ ఫోన్ ద్వారా 112 అత్యవసర నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడమే కాకుండా తమ బంధువులకు కూడా విషయాన్ని తెలియజేశారు. 112 అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ నుండి సమాచారం అందుకున్న వెంటనే ఒంగోలు పోలీసులు వేగంగా స్పందించారు. స్థానిక టూటౌన్ పోలీసులు నిందితుడి ఇంటిపై దాడి చేసి, రిటైర్డ్ ఉద్యోగి వెంకట్రావును అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై కఠినమైన పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించారు. ఇది కూడా చదవండి:  నాని పర్మిషన్ తోనే వచ్చారా? శ్రీకాంత్ ఓదెలపై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!     ఈ సంఘటన కలకలం రేపడంతో బిసి వెల్ఫేర్ అధికారి ఎస్.నిర్మల జ్యోతి, జరుగుమల్లి తహశీల్దార్ కె.వెంకటేశ్వరరావు వెంటనే హాస్టల్‌ను సందర్శించి పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి బాలికలను బయటకు పంపిన వంటమనిషి శారదను విధుల నుంచి తక్షణమే తొలగించడమే కాకుండా, నిర్లక్ష్యంగా ఉన్న హాస్టల్ వార్డెన్ తెరెజమ్మపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. జరుగుమల్లి ఎస్‌ఐ భాగ్యరాజ్ నేతృత్వంలో వీరిద్దరినీ కూడా విచారణ కోసం ఒంగోలుకు తరలించారు. హాస్టళ్లలో భద్రతపై సమగ్ర విచారణకు అంతర్గత కమిటీ వేసినట్లు అధికారులు వెల్లడించారు. బాలికల సమయస్ఫూర్తి, 112 నంబర్‌కు కాల్ చేసే అవగాహన వారిని పెద్ద ప్రమాదం నుండి కాపాడాయి.   Irumudi style Ongole Retired Employee Hostel Girls incident, Irumudi Scenes, Irumudi, Ongloe, Raviteja, telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood  
భారతీయ సంగీత ప్రపంచంలో 'ఇసైజ్ఞాని'గా నీరాజనాలు అందుకుంటున్న దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆయన స్వరపరిచిన ఆల్‌‌టైమ్ క్లాసిక్ సాంగ్ 'ఎన్ ఇనియ పొన్ నిలవే' పాట కాపీరైట్ వివాదంలో.. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము ఏమాత్రం జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేస్ వివరాల్లోకి వెళ్తే... 1980ల కాలంలో వచ్చిన 'మూడు పాని' చిత్రంలోని ప్రఖ్యాత గీతం 'ఎన్ ఇనియ పొన్ నిలవే'. కాగా ఇటీవల 'అఘతియా' అనే చిత్రంలో ఈ పాటను రీక్రియేటెడ్ వెర్షన్ గా లైసెన్స్ ఇచ్చే విషయంలో వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే ప్రముఖ మ్యూజిక్ సంస్థ 'సరిగమ' తమకు ఆ పాట సౌండ్ రికార్డింగ్ పై పూర్తి హక్కులు ఉన్నాయని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఇళయరాజా ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. తాజాగా జస్టిస్ జె. బి. పార్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌‌లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక సినిమా పాటలో ఇళయరాజా కేవలం ఆ పాట యొక్క సంగీతాని(ట్యూన్)కి మాత్రమే హక్కుదారుడు. అంతే తప్ప, లిరిక్స్, పూర్తి సౌండ్ రికార్డింగ్, దాన్ని ఇతరులకు రీక్రియేట్ చేయడానికి లైసెన్స్ ఇచ్చే సర్వాధికారాలు ఆయనకు ఉండవని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో పాటల కాపీరైట్స్ వివాదంలో ప్రసిద్ధ మ్యూజిక్ లేబుల్ 'సరిగమ'కు విక్టరీ లభించినట్లైంది. ఇది కూడా చదవండి: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. సుడిగాలి సుధీర్ 'GOAT'కు మోక్షం.!       [Ilaiyaraaja Copyright Case, Supreme Court Sensational Verdict, Ilaiyaraaja Supreme Court, En Iniya Pon Nilave, Saregama Vs Ilaiyaraaja, Ilaiyaraaja Songs, Ilaiyaraaja Case, Telugu Film News]  
టెలివిజన్ సెన్సేషన్ సుడిగాలి సుధీర్ నటించిన మాస్ ఎంటర్‌టైనర్ 'GOAT'. అనేక వాయిదాలు, రకరకాల వివాదాలు, ఎన్నో అడ్డంకుల తర్వాత... ఎట్టకేలకు ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌‌కు డేట్ ఫిక్స్ చేసుకుంది. నవంబర్ 12న థియేటర్లలో సందడి చేసేందుకు 'గోట్' సిద్ధమైపోయింది. అసలు ఈ సినిమా మొదలైనప్పుడు 'పాగల్' మూవీ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించారు. అయితే షూటింగ్ సాగుతుండగానే దర్శక నిర్మాతలకు మధ్య తీవ్రస్థాయిలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. దీంతో ఊహించని విధంగా నరేష్ కుప్పిలి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. కానీ నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ ఏమాత్రం వెనకడుగు వేయకుండా, దర్శకుడు వేదవ్యాస్‌కు బాధ్యతలు అప్పగించి, ఫస్ట్ కాపీని సిద్ధం చేశారు. నిజానికి ఈ యేడాది ప్రారంభంలోనే సెన్సార్ పనులు పూర్తి చేసుకుని మార్చిలోనే థియేటర్లలోకి రావాల్సి ఉంది. ఆ తర్వాత కూడా కొన్ని రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈసారి మాత్రం నవంబర్ 12న పక్కాగా థియేటర్లలో ల్యాండ్ అవుతున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమాలో తమిళ బ్యూటీ దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తుండగా.. సర్వదమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, బ్రహ్మాజీ, పృథ్వీ, 'ఆడుకాలం' నరేష్, రాజేంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇది కూడా చదవండి: రూ.7000 కోట్లు ఇవ్వాల్సిందే.. AI కంపెనీకి షాకిచ్చిన బాలయ్య హీరోయిన్.!     [Sudigali Sudheer GOAT release date, Sudheer GOAT November 12, Sudheer GOAT Release Date, Sudigali Sudheer GOAT Movie, GOAT Movie Telugu, Sudigali Sudheer, Divya Bharti, Telugu Film News]  
Vijay Deverakonda’s new skincare brand Unhype has recorded a strong opening, with its limited launch edition selling out within two weeks of pre-bookings. The brand has sold all 10,000 VD Signature Routines, amounting to 30,000 individual skincare products across its Acne Safe and Brightening ranges. The launch edition has generated Rs 1.3 crore in revenue during the two-week period. Pre-bookings opened on September 11, while the first shipments began from September 21. Each routine follows a three-step format comprising a face wash, moisturiser and sunscreen. Reacting to the sell-out, Vijay thanked customers for backing the brand and said, “We knew we had built something we believed in, but seeing 10,000 routines sell out in two weeks is incredible.” He also acknowledged those who could not purchase the limited edition, adding, “We’re coming back with more. This is just the beginning. There’s a lot more coming from UNHYPE.” With the launch edition now sold out, Unhype will open sales of its regular Acne Safe and Brightening Routines from October 3 through its website. This will mark the next phase for Deverakonda’s venture beyond cinema, which he has co-founded and been directly involved in developing. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో 'డాకు మహారాజ్' సినిమాతో టాలీవుడ్‌లో సందడి చేసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. వాల్తేరు వీరయ్యలో స్పెషల్ సాంగ్‌తోనూ రచ్చ చేసిన ఈ భామ, ఇప్పుడు గ్లోబల్ లెవెల్‌లో ఏకంగా ఒక ఏఐ (AI) కంపెనీ పైనే యుద్ధం ప్రకటించింది. ఏకంగా ఏడు వేల కోట్ల రూపాయల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ హాలీవుడ్ వేదికగా ఒక మైండ్ బ్లాకింగ్ లీగల్ నోటీస్ ఇచ్చింది. అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌కి చెందిన ఒక ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ, ఊర్వశి రౌతేలా యొక్క 'పర్సనాలిటీ రైట్స్'ని ఉల్లంఘించిందట. అంటే.. ఊర్వశి ముందస్తు అనుమతి గానీ, కనీస కాన్సెంట్ గానీ తీసుకోకుండా ఆమె పేరు, ఫొటోలు, విజువల్స్, వాయిస్‌ను.. తమ బిజినెస్ ప్రమోషన్ల కోసం, AI మోడల్స్ అభివృద్ధి కోసం వాడుకున్నారని ఊర్వశి లీగల్ టీమ్ ఆరోపిస్తోంది. ఈ విషయంపై ఊర్వశి రౌతేలా టీమ్ చాలా ఘాటుగా స్పందించింది. "మీరు ఏఐ కంపెనీని అభివృద్ధి చేసుకోండి.. మీ బ్రాండ్ వాల్యూని పెంచుకోండి.. అంతేకానీ, పర్మిషన్ లేకుండా ఊర్వశి పేరుని, ఆమె ఇమేజ్‌ని మీ వ్యాపారంలోకి లాగితే చూస్తూ ఊరుకోం" అంటూ స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అంతేకాదు, తమ పర్సనాలిటీ రైట్స్‌కి జరిగిన నష్టానికిగానూ ఏకంగా 7000 కోట్ల రూపాయల డ్యామేజెస్ పే చేయాలని ఆ AI కంపెనీని డిమాండ్ చేసింది. అయితే, ఈ కేస్‌పై సదరు AI కంపెనీ CEO షీరాజ్ హసన్ కూడా వెంటనే కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టారు. "అసలు టెక్నాలజీపై కనీస అవగాహన లేకుండా ఇలాంటి కోట్ల రూపాయల డిమాండ్లు చేయడం పూర్తిగా అర్థరహితం" అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. షీరాజ్ హసన్ మాట్లాడుతూ... "సినిమా ఇండస్ట్రీలో, ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో AI అనేది భవిష్యత్తు. ముందుగా అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, దాని ఉపయోగాల గురించి నాలెడ్జ్ పెంచుకోవాలి. చనిపోయిన నటీనటులతో స్క్రీన్ మీద పెర్ఫార్మ్ చేయించడం నుంచి, ప్రపంచంలో ఏ భాషలోనైనా నేచురల్ వాయిస్‌తో డబ్బింగ్ చెప్పించడం వరకు.. మున్ముందు AI తో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. సాంకేతికత తీసుకొస్తున్న ఈ మార్పును ఇలాంటి నిరాధార వివాదాలతో ఎవరూ ఆపలేరు!" అని చాలా ఓపెన్‌గా క్లారిటీ ఇచ్చేశారు. ఇది కూడా చదవండి: 500 సార్లు సూసైడ్ చేసుకోవాలి.. బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.!       [Urvashi Rautela 7000 Crore Demand, Urvashi Rautela AI Lawsuit, Urvashi Rautela vs AI Company, Daku Maharaj Actress, Nandamuri Balakrishna, Urvashi Rautela, Telugu Film News]  
"జీవితంలో మన కోసం మనం బతకాలి.. పక్కవారి కోసం కాదు" అని బండ్ల గణేష్ చెప్పిన ఒక్క మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా జరిగిన 'తెల్లకాగితం' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్ హత్తుకుంటోంది. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన యూత్‌ఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా మూవీ 'తెల్లకాగితం'. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకలో నిర్మాత బండ్ల గణేష్ అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అయితే ఈ ఈవెంట్‌లో దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మాట్లాడుతూ.. సినిమా మేకింగ్ సమయంలో తాను పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. దర్శకుడు అలా బాధపడటం చూసిన బండ్ల గణేష్ వెంటనే స్పందించి ఆయనకు కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. బండ్ల మాట్లాడుతూ.. "నీలాగా నేను బాధపడితే జీవితంలో 500 సార్లు సూసైడ్ చేసుకోవాలి" అంటూ తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులను గుర్తుచేశారు. కష్టాలు అనేవి ప్రతీ ఒక్కరి జీవితంలోనూ వస్తాయని, అంత మాత్రాన నిరాశపడిపోకూడదని హితవు పలికారు. "పక్కవారి కోసం కాదు.. మన కోసం మనం ఆలోచించాలి. జీవితంలో ఎప్పుడూ ఉన్నత స్థాయికి ఎదిగేందుకే నిరంతరం కష్టపడాలి" అంటూ బండ్ల గణేష్ ఇచ్చిన సందేశం అక్కడ ఉన్న వారందరిలోనూ కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. కష్ట సమయాల్లో గుండె నిబ్బరంతో ఎలా నిలబడాలో బండ్ల గణేష్ తనదైన మాటలతో చాలా స్పష్టంగా చెప్పారు. ఇది కూడా చదవండి: అమితాబ్‌కు తీవ్ర గాయం.. అసలేం జరిగింది.. ఇప్పుడెలా ఉంది.?       [Bandla Ganesh Emotional Speech, Thella Kaagitham Pre Release Event, Bandla Ganesh Speech Viral, Thella Kaagitham Movie, Bandla Ganesh Speech, Thella Kaagitham, Bandla Ganesh, Telugu Film News]
  తెలుగు సినిమా గర్వపడే నటుడు కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ మోహన్ బాబు. తెలుగు సినిమా ఉన్నంతకాలం ఆ నట ప్రవాహ శైలి కొనసాగుతూనే ఉంటుంది. అడ్డుకట్ట వెయ్యాలని చూసినా అసాధ్యం. ఈ విషయాన్నీ మరో సారి ప్యారడైజ్ తో నిరూపించాడు. 'శికంజా మాలిక్' అనే క్రూరమైన క్యారక్టర్ లో చించి పడేసాడని చెప్పవచ్చు. ఇటీవల జరిగిన 'ది ప్యారడైజ్' ప్రెస్ మీట్ మరియు సక్సెస్ మీట్ వేదికగా శ్రీకారం చుట్టిన ఈ ఆసక్తికర విశేషాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రెస్ మీట్‌లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనదైన నైజంతో బహిరంగంగా, స్పష్టంగా మాట్లాడుతూ చేసిన సరదా వ్యాఖ్యలు సినీ అభిమానులలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. శ్రీకాంత్ ఓదెల తన వద్దకు వచ్చి కథ చెప్పిన సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను మోహన్ బాబు సరదాగా పంచుకున్నారు. శ్రీకాంత్ వినయంగా కథ వివరించిన తర్వాత, "కథ అంతా బాగానే ఉంది కానీ, హీరో నాని కదా... నానిని అడిగే నా దగ్గరకు వచ్చావా అని అడిగాను" అని మోహన్ బాబు పేర్కొన్నారు. దానికి శ్రీకాంత్ ఓదెల చాలా ఆప్యాయంగా "మా నాని అన్న పర్మిషన్ తీసుకునే మీ వద్దకు వచ్చానండి" అని చెప్పడంతో మోహన్ బాబు మనసులో ఒక్కసారిగా ఈగో దెబ్బతిన్నంతగా అనిపించిందట! "ఏంటి, నన్ను ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం పెట్టుకోవడానికి నాని రికమెండేషన్ తో వచ్చావా?" అని అనుకున్నానని మోహన్ బాబు నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. అయితే, "ఏదేమైనా నాని అన్న పర్మిషన్ తీసుకొని వచ్చాడు కాబట్టి.. థాంక్యూ నాని" అంటూ వేదికపై మోహన్ బాబు చెప్పిన ఈ వ్యాఖ్యలు ప్రెస్ మీట్‌లో ఉన్నవారందరినీ విశేషంగా నవ్వించాయి.   అంతటితో ఆగకుండా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతిభను మోహన్ బాబు విపరీతంగా ప్రశంసించారు.  ఇది చదవండి: పాన్ ఇండియా సినిమా అప్పుడే ఉందా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు! ఒకప్పుడు సీనియర్ దర్శకుడు దాసరి నారాయణరావు గారిపై నిర్మాతలు ఎలాంటి అపారమైన నమ్మకాన్ని ఉంచేవారో, అదేవిధంగా ఈ చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి కూడా దర్శకుడు శ్రీకాంత్‌పై పూర్తి విశ్వాసాన్ని ఉంచి ఈ భారీ ప్రాజెక్టును అప్పగించారని గుర్తుచేశారు. సెట్స్‌లో శ్రీకాంత్ ఒక సీన్ తీసే సమయంలో నటుల నుంచి తనకు కావలసిన విద్వత్తును ఎలా రాబట్టుకుంటాడో, ప్రతి సన్నివేశంలో ఎంత కోపం కనబరచాలో, ఎలాంటి ఎమోషన్ చూపించాలో సూక్ష్మంగా వివరిస్తూ నటులలోని ఉత్తమ నటనను బయటకు తీస్తాడని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. అలాగే నాని నటనా విశ్వరూపాన్ని కొనియాడుతూ, కేవలం డాన్సులు మాత్రమే చేసే కొంతమంది నటుల కంటే నాని నవరసాలు పండించగల నిజమైన ప్రతిభావంతుడని, అతని నటన చూసి ఎంతో గర్వపడుతున్నానని కొనియాడారు.   14 ఏళ్ల జైలు శిక్ష తర్వాత తెగబడే జడల్ పాత్రలో నాని నటన థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అయ్యే సీట్ ఎడ్జ్ అనుభూతిని ఇస్తోంది. దాదాపు 175 నిమిషాల నిడివితో కూడిన ఈ భారీ యాక్షన్ డ్రామాలో నాని మరియు మోహన్ బాబుల ముఖాముఖి సీన్లు ఎపిక్ లెవెల్లో డిజైన్ అయ్యాయి. ఈ కామెంట్స్, వెనుక ఉన్న సినిమా విశేషాలు కలసి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ 'ది ప్యారడైజ్' క్రేజ్‌ను మరింత ఆకాశానికి ఎత్తేస్తున్నాయి.    [Mohan babu comments on srikanth odela nani the paradise, The Paradise Movie, Mohan Babu Comments, Nani The Paradise, telugu Cinema News, Telugu Cinema, Tollywood Cinema News, Tollywood]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నేటి వేగవంతమైన జీవనశైలిలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరిగి చాలామంది కఠినమైన డైట్ ప్రణాళికలను అనుసరిస్తున్నారు. వారం పొడవునా తక్కువ కేలరీలు, పోషకాలు ఉన్న ఆహారాన్ని తింటూ తమ శరీరాన్ని క్రమశిక్షణలో ఉంచుకుంటారు. అయితే వారం చివర్లో లేదా ప్రత్యేకమైన సందర్భాలలో చాలామంది తమకు అత్యంత ఇష్టమైన ప్రాసెస్డ్ ఫుడ్, నూనెలో వేయించిన తినుబండారాలు, తీపి పదార్థాలు మరియు ఫాస్ట్ ఫుడ్‌ను ఆస్వాదించడానికి  చీట్ డే  (Cheat Day) లేదా  చీట్ మీల్  క్రమాన్ని ఎంచుకుంటారు. వారం మొత్తం పడిన కష్టానికి ఇది ఒక రివార్డులా అనిపించినప్పటికీ, ఒక్కసారిగా అత్యధిక కేలరీలు, అధిక మోతాదులో సోడియం (ఉప్పు), సంతృప్త కొవ్వులు (Saturated Fats) మరియు ప్రాసెస్డ్ చక్కెరలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన హృదయనాళ వ్యవస్థ (Cardiovascular System) పై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో ఒకేసారి భారీగా కేలరీలు చేరుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ మరియు ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు హఠాత్తుగా పెరుగుతాయి. దీనివల్ల రక్తనాళాలలో తాత్కాలికంగా వాపు (Inflammation) ఏర్పడి, రక్తనాళాలు కుంచించుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఒక్క చీట్ మీల్ వల్ల రక్తపోటు (Blood Pressure) తాత్కాలికంగా పెరగడమే కాకుండా, గుండె రక్తాన్ని పంప్ చేయడానికి సాధారణం కంటే ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. నిపుణుల పరిశోధనల ప్రకారం, వారంలో క్రమం తప్పకుండా తీసుకునే కఠినమైన డైట్ కంటే, చీట్ డే సమయంలో ఒకేసారి పరిమితికి మించి ఎక్కువ కేలరీలు తీసుకోవడం గుండె ఆరోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్ లేదా కుటుంబంలో గుండెజబ్బుల చరిత్ర ఉన్నవారు చీట్ మీల్స్ విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తే అది తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. అయితే చీట్ డేస్ అనేవి కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక సమతుల్యతను కూడా ప్రభావితం చేస్తాయి. డైట్ క్రమంలో ఇష్టమైన ఆహారానికి దూరంగా ఉండటం వల్ల కలిగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి పరిమితమైన చీట్ మీల్స్ తోడ్పడతాయి. కానీ దీనిని ఆరోగ్యకరంగా నిర్వహించడం చాలా అవసరం. చీట్ డే రోజున ఆకలిని తట్టుకోలేక ఒకేసారి పెద్ద మొత్తంలో తినడానికి బదులుగా, పోర్షన్ కంట్రోల్ (పరిమిత పరిమాణం) పాటించడం అత్యంత ముఖ్యం. ఉదాహరణకు చీట్ మీల్‌లో అధికంగా ఆయిల్ ఉన్న పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ చికెన్ వంటి ప్రాసెస్డ్ పదార్థాలకు దూరంగా ఉంటూ.. ఇంటి వద్ద తక్కువ నూనెతో శుభ్రంగా తయారుచేసిన ఇష్టమైన వంటకాలను ఎంచుకోవచ్చు. అలాగే ఆహారాన్ని నమిలి మెల్లగా తినడం వల్ల తక్కువ ఆహారంతోనే కడుపు నిండిన భావన కలిగి గుండెపై అదనపు భారం పడకుండా ఉంటుంది. చీట్ మీల్ తీసుకున్న తర్వాత రోజంతా పుష్కలంగా నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు, అధికంగా ఉన్న సోడియం సమర్థవంతంగా బయటకు వెళ్లిపోతాయి. అంతేకాకుండా చీట్ మీల్ తిన్న తర్వాత కొద్దిసేపు తేలికపాటి నడక లేదా వ్యాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి. ఆహారాన్ని ఎంజాయ్ చేయడం ఎంత ముఖ్యమో, దాని పరిమితులను గుర్తించి గుండెను కాపాడుకోవడం అంతకంటే ప్రధానం. కఠినమైన డైటింగ్ మినహాయింపుల పేరుతో గుండె ఆరోగ్యాన్ని పణంగా పెట్టకుండా, సమతుల్య ఆహారం మరియు క్రమబద్ధమైన వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు.     Cheat day impact on heart health, high calorie cheat meal risks, junk food effect on heart, cheat meals cardiovascular risk, fitness cheat day heart warning.
మన పూర్వీకులు 80 నుండి 90 ఏళ్ల వయస్సు వచ్చినా కూడా ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేకుండా చాలా ఆరోగ్యంగా, చలాకీగా తమ పనులు తామే చేసుకుంటూ జీవించేవారు. వారు అంతటి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటానికి ముఖ్యమైన కారణం మన సాంప్రదాయ ఆయుర్వేద విలువలు కలిగిన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే. ముఖ్యంగా పొలం గట్లపై, ఇంటి చుట్టుపక్కల దొరికే ప్రకృతి ప్రసాదిత ఆకుకూరలను రోజూవారి వంటకాల్లో భాగంగా పప్పు, పచ్చడి రూపంలో తీసుకునేవారు. అటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో ప్రధానమైనది తెల్ల గలిజేరు . సాధారణంగా చూసేందుకు పొలాల్లో ఏదో పిచ్చిమొక్కలా కనిపిస్తున్నప్పటికీ, ఆయుర్వేద వైద్యంలో దీనిని  పునర్నవ అని ఎంతో గౌరవంగా పిలుస్తారు. శాస్త్రీయంగా బోరేవియా డిఫ్యూసా (Boerhavia diffusa) అని పిలిచే ఈ మొక్క పేరులోని  పునః  అంటే మళ్లీ,  నవ  అంటే కొత్తగా అని అర్థం. అంటే పాడైపోయిన శరీర కణాలకు మరియు ముఖ్యమైన అవయవాలకు మళ్లీ కొత్త జీవాన్ని పోసి పునరుజ్జీవింపజేసే గొప్ప శక్తి ఈ తెల్ల గలిజేరుకు ఉంది. వైద్య నిపుణులు మరియు ఆయుర్వేద పరిశోధకుల ప్రకారం, తెల్ల గలిజేరు సుమారు 350కి పైగా రకాల కిడ్నీ సంబంధిత వ్యాధులకు మరియు మూత్రనాళ సమస్యలకు ఒక దివ్యౌషధంగా లేదా సంజీవనిగా పనిచేస్తుంది. ఆధునిక కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న మూత్రనాళ ఇన్ఫెక్షన్లు (UTI), యూరియా మరియు క్రియాటినిన్ స్థాయిలు పెరగడం, శరీరంలో విపరీతంగా నీరు చేరి వాపులు రావడం వంటి తీవ్రమైన సమస్యలకు ఇది అద్భుతంగా తోడ్పడుతుంది. తెల్ల గలిజేరులో విటమిన్ సి, విటమిన్ డి, క్యాల్షియం, ఐరన్ తో పాటు పొటాషియం నైట్రేట్ మరియు హైడ్రోక్లోరైడ్ వంటి అత్యంత కీలకమైన బయోయాక్టివ్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని విషపదార్థాలను సమర్థవంతంగా బయటకు పంపి, డయాబెటిస్ బాధితుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే రక్తపోటును సమతుల్యం చేసి, గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాలను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇంతటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తెల్ల గలిజేరును మన ఇంట్లోనే ఎంతో రుచికరమైన పచ్చడి రూపంలో సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ పచ్చడి తయారీకి 3 కప్పుల శుభ్రం చేసిన తెల్ల గలిజేరు ఆకులు, పావు కప్పు వేరుశనగ గుళ్లు (పల్లీలు), 3 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, 1 చెంచా జీలకర్ర, 2 చెంచాల ధనియాలు, పావు చెంచా మిరియాలు, నిమ్మకాయ పరిమాణమంత చింతపండు, చిటికెడు ఇంగువ, 6 వెల్లుల్లి రెబ్బలు మరియు తగినంత ఉప్పు, నూనె అవసరమవుతాయి. తయారీ విధానంలో భాగంగా ముందుగా గలిజేరు ఆకులను బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి. బాండీలో నూనె లేకుండా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వేరుశనగ గుళ్లు, మిరియాలను దోరగా వేయించి చల్లార్చుకోవాలి. వీటిని మిక్సీలో బరకగా పొడి చేసిన తర్వాత, అందులో గలిజేరు ఆకులు, చింతపండు, వెల్లుల్లి, ఉప్పు చేర్చి కొద్దిగా నీటితో మిక్సీ పట్టుకోవాలి. చివరగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఇంగువతో నూనెలో తాలింపు వేస్తే నోరూరించే తెల్ల గలిజేరు పచ్చడి సిద్ధమవుతుంది. ఈ తెల్ల గలిజేరు పచ్చడి సుమారు 4 రోజుల పాటు చెక్కుచెదరకుండా నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంతో పాటు ఇడ్లీ, దోశల్లోకి కూడా ఇది ఎంతో రుచిగా ఉంటుంది. వారానికి 2 నుండి 3 సార్లు ఈ పచ్చడిని లేదా ఆకుకూరను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మూత్రపిండాల పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది. అయితే ఆయుర్వేద నిపుణుల సూచన ప్రకారం, ఐరన్ మరియు శక్తివంతమైన మూలికా ప్రభావం ఎక్కువగా ఉండే తెల్ల గలిజేరును గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు మరియు 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు తీసుకోకూడదు. తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలు లేదా ఆటో ఇమ్యూన్ జబ్బులు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే దీనిని వాడటం శ్రేయస్కరం. ఈ సహజసిద్ధమైన ఆయుర్వేద మూలికను మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు.     Learn how to make Tella Galijeru (White Punarnava) leaves chutney, an ancient Ayurvedic natural remedy known for supporting kidney health and boosting immunity.
భారతీయ వంటకాల్లోనూ, సాంప్రదాయ గృహ వైద్యంలోనూ వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. వెల్లుల్లి కేవలం వంటకాలకు రుచి, సువాసనను అందించడమే కాకుండా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుందని శతాబ్దాలుగా విశ్వసిస్తున్నారు. చాలామంది రాత్రి వేళల్లో శ్వాస సరిగ్గా ఆడటానికి, శ్వాసనాళాలు శుభ్రపడటానికి లేదా ప్రశాంతమైన నిద్ర కోసం వెల్లుల్లిని తినడం లేదా దిండు కింద పెట్టుకోవడం వంటి చిట్కాలను పాటిస్తుంటారు. అయితే, నిద్రపోతున్న సమయంలో వెల్లుల్లి ఘాటైన వాసన శ్వాసనాళాలను శుభ్రం చేసి శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుందనే వాదనను బలంగా నిర్ధారించే ఎలాంటి ప్రత్యక్ష మానవ వైద్య ఆధారాలు (Human Clinical Trials) ప్రస్తుతం లేవు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వెల్లుల్లికి వచ్చే ప్రత్యేకమైన ఘాటైన వాసనకు మరియు రుచికి అందులోని  అల్లిసిన్  (Allicin) అనే శక్తివంతమైన సమ్మేళనం ప్రధాన కారణం. వెల్లుల్లి రెబ్బలను కోసినప్పుడు, నలిపినప్పుడు లేదా మెత్తగా చేసినప్పుడు ఈ అల్లిసిన్ ఏర్పడుతుంది. ప్రయోగశాల (Laboratory) స్థాయిలో జరిగిన అధ్యయనాలలో అల్లిసిన్‌కు అద్భుతమైన యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (ఉపాధి, వాపు నిరోధక) లక్షణాలు ఉన్నట్లు తేలింది. అల్లిసిన్ కలిగిన వెల్లుల్లి సప్లిమెంట్లను వాడిన ఒక చిన్న అధ్యయనంలో జలుబు కేసులు తక్కువగా నమోదైనప్పటికీ, ఈ ప్రయోగశాల ఫలితాలను నేరుగా మనుషులలో నిద్ర సమయంలో శ్వాస మెరుగుపడటానికి అన్వయించలేమని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అనేకమంది భావిస్తున్నట్లుగా వెల్లుల్లి తినడం లేదా దాని వాసన పీల్చడం ద్వారా రాత్రివేళ శ్వాసనాళాలు శుభ్రపడి గురక, ముక్కు దిబ్బడ తగ్గుతాయని చెప్పడానికి అందుబాటులో ఉన్న ఆధారం చాలా పరిమితం. అందువల్ల ఆస్తమా, గురక, స్లీప్ అప్నియా (Sleep Apnea) వంటి తీవ్ర శ్వాసకోశ సమస్యలకు వెల్లుల్లిని ఒక ప్రాథమిక వైద్య చికిత్సగా భావించడం ఎంతమాత్రం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెల్లుల్లిని సాధారణ ఆహారంలో భాగంగా పప్పులు, కూరలు, సూప్‌లలో పరిమిత మోతాదులో (రోజుకు 1,2 రెబ్బలు) తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తికి, గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కానీ నిద్రలో ఊపిరి ఆడకపోవడం, ఛాతిలో తీవ్రమైన నొప్పి లేదా విపరీతమైన గురక వంటి సమస్యలు ఉన్నవారు సొంత వైద్యంపై ఆధారపడకుండా వెంటనే అర్హులైన వైద్యులను సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరం.     Eating garlic before bed health effects, garlic and sleep apnea breathing, nighttime raw garlic benefits risks, garlic before sleep breathing issues, garlic side effects at night.
క్యాన్సర్ పేరు వినగానే భయపడాల్సిన అవసరం లేదు. అయితే శరీరంలో చాలాకాలంగా కొనసాగుతున్న కొన్ని అసాధారణ మార్పులను నిర్లక్ష్యం చేయకుండా, వాటికి కారణం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా సాధారణ సమస్యలుగా భావించే కొన్ని లక్షణాలు తరచూ కనిపిస్తుంటే వైద్యుల సలహా తీసుకోవడం అవసరం. నోటిలో తగ్గకుండా ఉండే పుండ్లు, రొమ్ములో కనిపించే మార్పులు, జీర్ణవ్యవస్థలో సమస్యలు, కారణం లేకుండా బరువు తగ్గడం, శరీరంలో అసాధారణ మార్పులు వంటి వాటిని ఎప్పుడు సీరియస్‌గా తీసుకోవాలి? క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు ఎంతవరకు ఉపయోగపడతాయి? ఏ వయసులో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? అంతేకాదు, క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సా విధానాలు ఏమిటి? రోబోటిక్ సర్జరీ, ఆంకో-రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ, మైక్రోసర్జరీ, బ్రెస్ట్ రీకన్‌స్ట్రక్షన్ వంటి విధానాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సీనియర్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి క్యాన్సర్‌కు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరించారు. క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోవడంతో పాటు, శరీరం ఇచ్చే అసాధారణ సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. గమనిక: ఈ వీడియో అవగాహన కోసం మాత్రమే. ఏదైనా అసాధారణ లక్షణం కొనసాగితే స్వయంగా నిర్ధారణ చేసుకోకుండా వైద్య నిపుణులను సంప్రదించండి.మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఒక వినూత్నమైన వ్యాయామ విధానం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. నెమ్మదిగా, ప్రశాంతంగా, డాన్స్ చేస్తున్నట్లుగా సాగే ఆ కదలికలే "తాయ్ చి". నార్మల్ గా అందరూ చేసే  జిమ్ వర్కౌట్లు, వేగంగా రన్నింగ్ చేయడం వంటివి కాకుండా  మానసిక ప్రశాంతతతో పాటు శరీరానికి  దారుఢ్యాన్ని ఇచ్చే ఈ ప్రాచీన విధానం వైపు నేటి యువత, ఫిట్‌నెస్ ప్రేమికులు విశేషంగా ఆకర్షితులవుతున్నారు. సోషల్ మీడియా లో రీల్స్, షార్ట్స్ లో వేలాదిమంది దీనికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుండటంతో ఇది నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఏమిటీ తాయ్ చి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? వివరంగా తెలుసుకుంటే.. తాయ్ చి.. తాయ్ చి అనేది చైనాకు చెందిన ఒక ప్రాచీన మార్షల్ ఆర్ట్ విధానం. మొదట్లో  ఇది ఒక ఆత్మరక్షణ విద్యగా ఉద్భవించినప్పటికీ, కాలక్రమేణా ఇది ఒక అద్భుతమైన ఆరోగ్య, ఫిట్‌నెస్ సాధనగా రూపాంతరం చెందింది. దీనిని తరచుగా మూమెంట్ మెడిటేషన్ అని పిలుస్తారు. ఈ విధానంలో వేగవంతమైన కదలికలు ఉండవు. చాలా నెమ్మదిగా, శ్వాసపై ధ్యాస ఉంచుతూ, శారీరక సమతుల్యతను కాపాడుకుంటూ ఒక పోజిషన్ నుంచి మరొక పొజిషన్ కు  శరీరాన్ని తిప్పుతారు. శ్వాస ప్రక్రియను శరీర కదలికలతో అనుసంధానించడమే దీనిలోని ప్రధాన సూత్రం. ఇది శరీరంలోని అంతర్గత శక్తిని నిద్రలేపి, శరీరం అంతటా సరిగ్గా ప్రసరించేలా చేస్తుంది. చైనీస్ సంస్కృతిలో దీనిని 'చి' అని పిలుస్తారు. తాయ్ చి చేసే విధానం.. తాయ్  చి సాధనలో మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయి.. నెమ్మదిగా చేసే కదలికలు.. శరీరంలోని ప్రతి కండరాన్ని ఉపయోగిస్తూ, కీళ్లపై ఎటువంటి ఒత్తిడి పడకుండా చాలా సజావుగా కదలికలు ఉంటాయి. లోతైన శ్వాస.. కదలికలకు అనుగుణంగా ప్రశాంతంగా, లోతుగా శ్వాస తీసుకోవడం , వదలడం జరుగుతుంది. మానసిక ఏకాగ్రత.. వ్యాయామం చేసే సమయంలో దృష్టి మొత్తం శరీరం , శ్వాసపైనే ఉంటుంది. దీనివల్ల బయటి ఆలోచనల నుంచి మనస్సుకు విశ్రాంతి లభిస్తుంది. తాయ్ చి అందించే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. సోషల్ మీడియాలో ఇది కేవలం ఒక ఫ్యాషన్ గా మాత్రమే ట్రెండ్ కావడం లేదు, దీని వెనుక ఎన్నో శాస్త్రీయ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి తగ్గింపు.. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన సర్వసాధారణమయ్యాయి. తాయ్ చి లోని లోతైన శ్వాస , ఏకాగ్రతతో కూడిన కదలికలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. ఇది శారీరక ఒత్తిడిని తగ్గించి, మనస్సుకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. శరీర బ్యాలెన్స్ , దృఢత్వం.. వయసు పైబడిన వారికి లేదా కాళ్ళ బలం తక్కువగా ఉన్నవారికి తాయ్ చి ఒక వరప్రసాదం. ఇది కాళ్ళు, నడుము భాగాల్లోని కండరాలను బలోపేతం చేసి, శరీర సమతుల్యతను పెంచుతుంది. దీనివల్ల కింద పడిపోయే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.. ఇది తక్కువ తీవ్రత కలిగిన వ్యాయామం అయినప్పటికీ, రక్తాప్రసరణను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది, గుండె పనితీరు మెరుగుపడుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం.. ఆర్థరైటిస్ (కీళ్ల వాతం) లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. వేగవంతమైన వర్కౌట్ల వల్ల కీళ్లపై పడే భారంతో పోలిస్తే, తాయ్ చి కీళ్లను మెల్లిగా కదిలిస్తూ నొప్పులను తగ్గిస్తుంది. శ్వాసకోశ వ్యవస్థకు మంచిది.. దీనిలో శ్వాసపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శరీరంలోని ప్రతి కణానికి ప్రాణవాయువు సమృద్ధిగా అందుతుంది. నిద్రలేమి సమస్యకు పరిష్కారం.. ప్రతిరోజూ కొద్దిసేపు తాయ్ చి సాధన చేయడం వల్ల రాత్రి వేళల్లో మంచి, ప్రశాంతమైన నిద్ర పడుతుందని అనేక పరిశోధనల్లో తేలింది. ఏకాగ్రత , జ్ఞాపకశక్తి.. శరీరం , మనస్సు రెండింటినీ ఒకేసారి ఉపయోగించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇది ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచడంలో దోహదపడుతుంది. ఎవరైనా చేయవచ్చా? తాయ్ చి యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, దీనికి ప్రత్యేక పరికరాలు కానీ, పెద్ద స్థలం కానీ అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి వయోవృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ దీనిని సాధన చేయవచ్చు. ఎటువంటి శారీరక శ్రమ లేకుండా, సున్నితమైన పద్ధతిలో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన మార్గం.                    *రూపశ్రీ.
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో బొప్పాయి పండుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.  పీచు పదార్థాలు, విటమిన్లు, అలాగే జీర్ణక్రియకు దోహదపడే పపైన్ అనే ప్రత్యేక ఎంజైమ్ బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి. ఇది కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడమే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఎంతో సహాయపడుతుంది. ఉదయాన్నే పరగడుపున లేదా సాయంత్రం వేళల్లో బొప్పాయిని తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే ఎంతటి ఆరోగ్యకరమైన ఆహారమైనా దాన్ని తినే విధానం సరిగ్గా ఉండాలి. ముఖ్యంగా బొప్పాయిని కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనాలకు బదులు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. జీర్ణ వ్యవస్థను దెబ్బతీసే అటువంటి కొన్ని ఆహార కలయికల గురించి వివరంగా తెలుసుకుంటే.. పాలు , డైరీ ఉత్పత్తులు.. చాలామంది పండ్లతో పాటు పాలు లేదా ఇతర పాల పదార్థాలను తీసుకోవడం అలవాటుగా చేసుకుంటారు. ఎక్కువ శాతం మంది పండ్లతో మిల్క్ షేక్ తీసుకోవడానికే ఇష్టపడతారు.  కానీ బొప్పాయిని పాల ఉత్పత్తులతో కలిపి తీసుకున్నప్పుడు అందులోని ఎంజైములు రియాక్షన్ జరిపి కడుపులో గ్యాస్, యాసిడిటీ , ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తాయి. జీర్ణవ్యవస్థపై ఇది తీవ్రమైన భారాన్ని పెంచి పొట్టలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.  అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలు.. బొప్పాయిలోని ఎంజైములు ప్రోటీన్లను సులభంగా విచ్ఛిన్నం చేయగలవు. అయితే మాంసం, గుడ్లు లేదా పప్పు ధాన్యాలు వంటి అధిక ప్రోటీన్ కలిగిన భారీ ఆహారాలతో బొప్పాయిని ఒకేసారి తీసుకోవడం వల్ల జీర్ణక్రియలో తేడా జరుగుతుంది.  కాబట్టి బొప్పాయిని ఎల్లప్పుడూ తేలికపాటి ఆహారంతో మాత్రమే తీసుకోవడం శ్రేయస్కరం. నూనెలో వేయించిన పదార్థాలు.. బొప్పాయి వేగంగా అరిగిపోయే గుణం కలిగి ఉండే పండు, కానీ వేపుళ్లు లేదా నూనె పదార్థాలు జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఈ రెండింటిని కలిపి తిన్నప్పుడు జీర్ణ వ్యవస్థ  సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల కడుపులో భారం, అసౌకర్యం , గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. ఆహారం తినగానే పండ్లు తినే అలవాటు ఉండేవారు నూనెలో వేయించిన ఆహారాలు తిన్న వెంటనే బొప్పాయి తినడం అంత మంచిది కాదు.  పులియబెట్టిన లేదా ఈస్ట్ తో తయారు చేసిన ఆహారాలు..  ఫర్మెంటేషన్ ప్రక్రియ ద్వారా తయారయ్యే ఆహార పదార్థాలతో బొప్పాయిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ కాంబినేషన్ వల్ల ఇబ్బందులు మరింత ఎక్కువవుతాయి. అరటిపండు కాంబినేషన్.. అరటిపండు,  బొప్పాయి రెండూ పండ్లే అయినప్పటికీ, అరటిపండు , బొప్పాయిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిది కాదు. ఈ రెండింటినీ కలిపి తింటే జీర్ణక్రియ వేగం బాగా తగ్గిపోతుంది. ఫలితంగా ఎప్పుడూ  కడుపు నిండిపోయినట్లు, భారంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి బొప్పాయి ఇచ్చే సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే దాన్ని ఇతర ఆహారాలతో కలపకుండా విడిగా మాత్రమే తినడం మంచిది. అది కూడా ఆహారం తీసుకున్న వెంటనే కాకుండా కనీసం అరగంట నుండి గంట సమయం వ్యవధి ఇచ్చి పండిన బొప్పాయిని సరైన మోతాదులో తీసుకుంటే  ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.                                                                                                                                                     *రూపశ్రీ.