LATEST NEWS
తెలంగాణలో  అధికార, ప్రతిపక్షాల మధ్య సాగే  విమర్శలు, ప్రతి విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.  విమర్శల జోరు పెరిగుతోంది. తీవ్రత ఎక్కువ అవుతోంది. అనకూడని మాటే అంటూ.. అనుచిత వ్యాఖ్యలు కూడా దొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్ లో విమర్శల వర్షం కురిపించారు. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.  ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చేయించుకున్న సొంత సర్వేలోనే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు స్పష్టంగా తేలాయని కేటీఆర్ సంచలన అంచనాను ప్రకటించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 78 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆ నివేదికల ఆధారంగా ధీమా వ్యక్తం చేశారు. కేవలం సీఎం సొంత సర్వే మాత్రమే కాకుండా, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు, స్వతంత్ర మీడియా సంస్థలు క్షేత్ర స్థాయిలో సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణలలో కూడా ఇదే సత్యం వెల్లడైందని ఆయన నొక్కి చెప్పారు. ఈ గణాంకాలు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు అద్దం పడుతున్నాయని అన్నారు. అనకూడని మాటే అయినా అనక తప్పడం లేదని చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి అనే దరిద్రుడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారంటూ దుయ్యబట్టిన కేటీఆర్..   అధికారులు ఇంజనీర్లు చెబుతున్న మాటలను కూడా పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సీఎం  రేవంత్ రెడ్డిని బుర్ర తక్కువోడు అనాలా,దరిద్రుడు అనాలా,సన్నాసి అనాలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏర్పడిన కరవు పరిస్థితులు కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డి తీసుకువచ్చారని కేటీఆర్ విమర్శించారు.   KTR Sensational Comments, CM Revanth Reddy Survey, BRS 78 Seats, Telangana Politics, Hydra Demolitions 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబునాయుడు వైసీపీకి ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన కనీస లక్షణాలు లేవని విమర్శించారు. గొడ్డలి, ఫేక్ ప్రచారాలే వైసీపీ అస్త్రాలన్న చంద్రబాబు.. వైసీపీ చరిత్ర మొత్తం రక్త చరిత్రేనన్నారు.  తెలంగాణ షాబాద్ లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ కు, సొంత బాబాయిపై గొడ్డలి వేటు, సొంత తల్లీ, చెల్లిని గెంటేసిన జగన్ కూ మనస్తత్వ పరంగా పోలీకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణలో  ఒక వ్యక్తి తనపై పోక్సో   కేసు పెట్టిందన్న కక్షతో బాధితురాలితో పాటు ఆమె కుటుంబాన్ని, అలాగే తనకు సహకరించలేదనే కోపంతో సొంత కుటుంబాన్ని కలిపి మొత్తం ఆరుగురిని అత్యంత క్రూరంగా హతమార్చిన వ్యక్తికీ, సరిగ్గా అలాగే..  సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపడం, కన్నతల్లి మరియు చెల్లిని దూరం పెట్టే విషయంలో జగన్ ప్రవర్తించిన తీరుకూ చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు.  నేర ప్రవృత్తిని, దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యపరచాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు.   కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో కేవలం ఒకే ఒక్క వ్యక్తి అవినీతి దాహానికి లక్షల కోట్ల రూపాయల విలువైన ఆంధ్రప్రదేశ్ సహజ సంపద పూర్తిగా ఆవిరైపోయిందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ నెపంతో యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని దుయ్యబట్టారు. బ్రహ్మణీ స్టీల్స్‌కు గతంలో కేటాయించిన భూములను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా వెనక్కి తీసుకుందని,  ఓబులాపురం మైనింగ్ అంశంపై విచారణ ఇంకా ముగియలేదని చెప్పిన చంద్రబాబు. జగన్   స్వార్థపూరిత నిర్ణయాల వల్ల ఎంతోమంది ఐఏఎస్  అధికారులు జైలుపాలయ్యారనీ, ఎంతోమంది వ్యాపారవేత్తలు సర్వనాశనమయ్యారని వివరించారు.  వైసీపీ నైజాన్ని చంద్రబాబు  హిట్, రన్ అండ్ ఎస్కేప్ (కొట్టడం, పారిపోవడం, దాక్కోవడం) గా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక విధ్వంసం సృష్టించడం, ఆ వెంటనే పక్క రాష్ట్రమైన కర్ణాటకలోని బెంగళూరు ప్యాలెస్‌కు వెళ్లి తలదాచుకోవడం   అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే భయంతోనే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను బెదిరించి, పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, పోలవరం ప్రాజెక్టు, వెలిగొండ ప్రాజెక్టులు వేగంగా పూర్తికావస్తుండటంతో ఈ గొడ్డలి పార్టీలో తీవ్రమైన టెన్షన్ మరియు భయం మొదలైందని చంద్రబాబు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న వ్యక్తిత్వ హననంపై చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను వాడుకుని మహిళలను బ్లాక్ మెయిల్ చేయడం, తప్పుడు పోస్టులతో సమాజంలో అలజడి సృష్టించడం అత్యంత ప్రమాదకరంగా మారిందన్నారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలను, అసత్య పోస్టులను పూర్తిగా కట్టడి చేసేందుకు త్వరలోనే ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్  ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు.   Chandrababu makes sensational comments, Chandrababu Naidu, YS Jagan Mohan Reddy, YSRCP Axe Party, Andhra Pradesh Politics, Social Media Task Force AP, Kadapa Steel Plant Corruption
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్.! కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ పరిశ్రమ ఏర్పాటు కోసం గతంలో కేటాయించిన వేల ఎకరాల భూములను వెనక్కి తీసుకోవాలని  చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.  దాదాపు 19 ఏళ్లు గడుస్తున్నా అక్కడ ఎలాంటి పరిశ్రమ ఏర్పాటు కాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ ఏర్పాటుకు భారీగా భూములు కేటాయించారు.  ఎకరం భూమి  18 వేల రూపాయల చొప్పున దాదాపు 10 వేల ఎకరాలకు పైగా భూములను అప్పట్లో గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె పేరిట ఉన్నబ్రాహ్మిణి స్టీల్స్  సంస్థకు కేటాయించింది. దీనికోసం కేవలం 19 కోట్ల రూపాయలను గాలి జనార్ధన్ రెడ్డి ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు. ఆ తర్వాత 2008లో విమానాశ్రయం ఏర్పాటు నెపంతో మరో 3,115 ఎకరాల భూములను 25 కోట్ల రూపాయలకే రాసిచ్చారు. పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. గతంలో ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు, రుణాలు ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్ వంటి జాతీయ బ్యాంకులు కోర్టులను ఆశ్రయించాయి. భూములు తమ అధీనంలో ఉన్నాయని వాదించాయి. అయితే, పూర్తి హక్కులు లేని భూములపై బ్యాంకులు ఏ విధంగా రుణాలు ఇస్తాయని కోర్టులు సైతం తీవ్రంగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ప్రస్తుత జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఈ 10,000 ఎకరాల భూములను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియ ఊపందుకుంది. ఈ ఉదంతంపై  విశ్లేషకుడు  మధుసూదన్ రెడ్డి తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  నాటి వైఎస్సార్ క్యాబినెట్ లో మంత్రులుగా ఉండి, నేడు కూటమి ప్రభుత్వంలోనూ మంత్రులుగా కొనసాగుతున్న కొందరు నేతల సమష్టి బాధ్యతను ప్రశ్నించారు. పరిశ్రమలు పెట్టకుండా కాలయాపన చేయడం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లడమే కాకుండా, స్థానిక నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.  భవిష్యత్తులోనైనా ఏ ప్రభుత్వమైనా పరిశ్రమలకు భూములను శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేయకుండా, కేవలం లీజు ప్రాతిపదికన మాత్రమే ఇవ్వాలనన్నారు. అప్పుడే పారిశ్రామికవేత్తలు భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టకుండా, నిజాయితీతో పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గాలి జనార్ధన్ రెడ్డి ఆర్థిక సామ్రాజ్యానికి, బ్రాహ్మణి స్టీల్స్ భూముల ఉదంతం ఒక పెద్ద ఎదురుదెబ్బేనని మధుసూదన్ రెడ్డి  అన్నారు.  పూర్తి ఇంటర్వ్యూ తెలుగువన్ న్యూస్ చానల్ లో వీక్షించండి.  
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2028 ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. అలాఇలా కాదు.. ఏకంగా భద్రాద్రి రాములోరి మీద ఒట్టేసి మరీ  ఈ విషయం చెప్పారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లా  జగన్నాథపురంలో నిర్వహించిన రైతు భరోసా చివరి విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నరేవంత్ రెడ్డి  రాబోయే ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని  చెబుతూ.. భద్రాచలం రాముడి మీద ఆన... వచ్చే ఎన్నికల్లో   117 స్థానాల్లో గెలిచి తీరుతాంమని ప్రకటించారు.   రాష్ట్రంలో ప్రస్తుతం 119 శాసనసభ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే రాబోయే పార్లమెంటు సమావేశాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన లేదా స్థానాల పెంపు బిల్లు   ఆమోదం పొందితే, తెలంగాణలో సీట్లు దాదాపు 50 శాతం మేర పెరగనున్నాయన్న రేవంత్.. ఈ పెంపుదల ప్రకారంగా ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు భవిష్యత్తులో 182 స్థానాలకు చేరనున్నాయన్నారు.    అలాగే.. ముందస్తు ఎన్నికల ప్రచారాలపైనా సీఎం  స్పష్టత ఇచ్చారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రశక్తే లేదని   స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకున్నారని తాము ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.    తమకు ఏ రాజకీయ పార్టీతోనూ పంచాయితీ లేదని, ప్రజలే తమ బలమని, ప్రజలతోనే కలిసి నడుస్తూ విజయం అందుకుంటామని  పేర్కొన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పులమయం చేయడం వల్లే  కొంత ఇబ్బంది ఎదురౌతోందన్న రేవంత్.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా  తాము 80 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని, అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. Revanth Reddy vow on Lord Ram, Telangana assembly seats increase 182, Revanth Reddy 117 seats Congress, Telangana early elections clarity
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో లాయరు, జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్ కుమార్  నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో నిలుస్తుంటారు. తాజాగా ఆయన మరోసారి ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఈ సారి ఆయన   వైసీపీ టార్గెట్ లో విరుచుకుపడ్డారు.  వైసీపీ నేతల ఆర్థిక మూలాలు,  పార్టీ ఫండింగ్ వ్యవహారాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో..వైసీపీ నేతలు..అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు వెనకేశారన్న జడ శ్రవణ్ కుమార్.. వాళ్లు ఎంగిలి మెతుకులను కూడా వదిలిపెట్టకుండా దోచుకున్నారని విమర్శించారు.  నిన్న మొన్నటి వరకూ వైసీపీకి, వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు అనుకూలంగా గళమెత్తిన జడ శ్రవణ్ కుమార్ అంత లోనే.. ఇలా యూటర్న్ తీసుకుని వైసీపీపై విరుచుకు పడటం విశేషం. తనకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వైసీపీ దోపిడీని ఎండగట్టారు. వైసీపీ తనకు ఫండింగ్ చేయడమేంటని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదలకుండా దోచేసుకుంటారని దుయ్యబట్టారు. జగన్ పాలనా కాలమంతా దోపిడీ రాజ్యమేలిందని విమర్శలు గుప్పించారు.  జగన్  హయాంలో తీసుకున్న  పలు   నిర్ణయాలను విమర్శలతో తూర్పారబట్టారు. జగన్ ఐదేళ్ల పాలనలో వందల కొద్దీ కాంట్రాక్టులు, మైనింగ్ లీజులు కేవలం పార్టీకి అనుకూలంగా ఉండే క్రోనీ క్యాపిటలిస్టులకు మాత్రమే దక్కాయన్న జడ శ్రవణ్ కుమార్.. ఆ క్రమంలో దాదాపు 5 వేలకోట్ల రూపాయలకు పైగా నిధులు క్విడ్ ప్రో కో పద్ధతిలో పార్టీ ఫండింగ్ రూపంలోకి మారాయన్నారు.  మద్యం పాలసీ, ఇసుక అక్రమ రవాణా ద్వారా వచ్చిన ఆదాయంలో దాదాపు 35 శాతం నేరుగా తాడేపల్లి ప్యాలెస్‌కే చేరిందని సంచలన ఆరోపణలు చేశారు. సాధారణ ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసిన పన్నుల సొమ్మును ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు   ఉపయోగించారన్నారు.   ఎంతో నైతికతతో రాజకీయాలు చేస్తున్నామని చెప్పుకున్న వైసీపీ నేతలు, ఇప్పుడు అడ్డగోలుగా దొరికిపోతున్నారన్న ఆయన..  అమరావతి భూముల వ్యవహారంలోనూ, విశాఖపట్నంలో ల్యాండ్ గ్రాబింగ్ ద్వారా సుమారు రూ. పది వేల కోట్ల విలువైన భూములను వైసీపీ అస్మదీయులు హస్తగతం చేసుకున్నారనీ,  దళిత, వెనుకబడిన వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, కేవలం కొద్దిమంది బడా బాబుల జేబులు నింపడమే లక్ష్యంగా జగన్ పాలన సాగిందని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో ఈ ఆర్థిక అక్రమాలపై పూర్తిస్థాయి కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ జరగాలని.. అప్పుడే అసలు దొంగలు బయటపడతారనీ జడ శ్రావణ్ అన్నారు.   YSRCP Funding Allegations, AP Politics Shocking Comments, YSRCP Corruption Scandals, Andhra Pradesh Latest News
ALSO ON TELUGUONE N E W S
దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. తన అమాయకత్వంతో కూడిన గొంతుతో, మంత్రముగ్ధులను చేసే ఆలపనలతో ఆరు దశాబ్దాల పాటు కోట్లాది మంది హృదయాలను ఓలలాడించిన దిగ్గజ నేపథ్య గాయని ఎస్. జానకి (88) జూలై 11 శనివారం సాయంత్రం మైసూరులో కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. జానకమ్మ మృతితో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాకు చెందిన పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంప‌తుల‌కు ఎస్‌.జాన‌కి జ‌న్మించారు. ఆమె తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడిగా, ఆయుర్వేద వైద్యుడిగా పనిచేశారు. 1959లో వి.రామ్‌ప్రసాద్‌తో ఆమె వివాహం జరిగింది. జానకమ్మ సంగీత ప్రస్థానంలో ఆమె భర్త రామ్‌ప్రసాద్ గారు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు, ప్రతి రికార్డింగ్‌కు ఆమెతో పాటే తోడుగా ఉండేవారు. ఆయన 1997లో గుండెపోటుతో మరణించారు. జాన‌కి, రామ్‌ప్ర‌సాద్ దంప‌తుల‌కు మురళీకృష్ణ అనే ఏకైక కుమారుడు ఉన్నారు. ఆయన భరతనాట్య కళాకారుడిగా, నటుడిగా (తెలుగులో 'వినాయకుడు', 'మల్లెపువ్వు' వంటి చిత్రాల్లో నటించారు) గుర్తింపు తెచ్చుకున్నారు. మురళీకృష్ణ కూడా ఇటీవలే 2026 జనవరిలో హఠాన్మరణం చెందారు. ఆయన భార్య పేరు ఉమ (క్లాసికల్ డ్యాన్సర్). వీరికి వర్ష, అప్సర అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1. ఆరు దశాబ్దాల ప్రస్థానం.. 50 వేలకు పైగా పాటలు! 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో జన్మించిన జానకమ్మ.. చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. 1957లో తమిళ చిత్రం 'విధియిన్ విలయట్టు' ద్వారా గాయనిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. అదే ఏడాది 'ఎమ్మెల్యే' సినిమాలోని “నీ నవ్వే నీ జగాన…” అనే పాటతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు దాదాపు 17 భాషల్లో 50,000 పైగా పాటలు పాడి భారతీయ సంగీత ప్రపంచంలో అరుదైన రికార్డు సృష్టించారు. పసిపిల్లల గొంతుతో పాడాలన్నా, పండితులను మెప్పించే శాస్త్రీయ సంగీతమైనా, పల్లె పదాల జానపదాలైనా జానకమ్మకు వెన్నతో పెట్టిన విద్య. 'స్వాతిముత్యం' సినిమాలో “చిన్నారి పొన్నారి కిట్టయ్య…” పాటలో ఆమె పలికించిన పసితనం, అమాయకత్వం ఎప్పటికీ మరువలేనివి. గానగంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆమె పాడిన వేలాది యుగళ గీతాలు తెలుగు సినీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతాయి. రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి వంటి దిగ్గజాల చిత్రాలకు ఆమె పాటలే ప్రాణ ప్రతిష్ఠ చేశాయి. అవార్డులు.. పద్మభూషణ్‌ తిరస్కరణ! ఎస్.జానకి అద్భుత ప్రతిభకు ఎన్నో పురస్కారాలు దాసోహమన్నాయి. ఉత్త‌మ గాయ‌నిగా నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 31 సార్లు రాష్ట్ర స్థాయి పురస్కారాలు (అత్యధిక నంది అవార్డులతో సహా).  అయితే, 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'పద్మభూషణ్' అవార్డును ఆమె నమ్రతతో తిరస్కరించారు. దక్షిణ భారత కళాకారులకు దక్కాల్సిన గుర్తింపు చాలా ఆలస్యంగా దక్కుతోందని, దేశంలోనే అత్యున్నతమైన 'భారతరత్న'కు మాత్రమే ఆమె అర్హురాలని అభిమానులు ఎప్పుడూ నమ్ముతారు. 2016లోనే పాటలకు స్వస్తి.. వయసు రీత్యా, 2016లో కన్నడ సినిమా ‘ప్రవాసి’ కోసం పాడిన ‘అమ్మ పూజే’ అనే పాటతో ఆమె తన సుదీర్ఘ గాన ప్రయాణానికి అధికారికంగా విరామం ప్రకటించారు. ఆ తర్వాత మైక్ పట్టుకోనని చెప్తూ, ప్రశాంతమైన విశ్రాంత జీవితాన్ని గడుపుతూ వచ్చారు. సంగీత ప్రియుల నివాళి: జానకమ్మ భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆమె పాడిన వేలాది పాటలు తరాలు మారినా ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. తెలుగు వారి గుండెల్లో ‘గాన కోకిల’గా ఆమె స్థానం శాశ్వతం. 
Veteran playback singer S. Janaki, fondly known as the "Nightingale of South India," passed away on Saturday due to age-related health complications. She breathed her last at Apollo BGS Hospital in Mysuru, leaving behind an unparalleled musical legacy that spanned more than six decades.  Born on April 23, 1938, S. Janaki became one of India's most celebrated playback singers, enchanting generations of music lovers with her soulful voice. Her remarkable versatility allowed her to effortlessly render classical compositions, folk songs, melodies, devotional tracks, and emotional film songs, making her one of the most respected voices in Indian cinema. During her illustrious career, Janaki recorded over 48,000 songs in 17 languages, an achievement few singers in the world can match. She worked with several generations of composers and actors across Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi cinema, creating countless evergreen classics that continue to resonate with audiences. Her immense contribution to Indian film music earned her widespread acclaim, numerous awards, and the unwavering love of millions of fans. With her distinctive voice and unmatched emotional expression, S. Janaki became an integral part of South Indian cinema's golden era and remained an inspiration to aspiring singers. The news of her demise has sent shockwaves across the Indian film and music fraternity. Actors, musicians, filmmakers, and fans have been paying heartfelt tributes to the legendary singer, remembering her extraordinary contribution to Indian music. While S. Janaki is no longer with us, her timeless songs will continue to live on for generations.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్యనటుడిగా, ప్రతిభావంతుడైన దర్శకుడిగా, అభిరుచి గల నిర్మాతగా తనదైన ముద్ర వేసిన మహానటుడు పద్మనాభం. దాదాపు ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో 400 కంటే ఎక్కువ చిత్రాల్లో నటించి అశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు అగ్ర నటుడిగా వెలుగొంది, అప్పటి కాలంలోనే ఒక్కో సినిమాకు భారీ పారితోషికం అందుకున్న ఘనత ఆయనది. అయితే, వెండితెరపై కోట్లాది మందిని నవ్వించిన ఈ హాస్య బ్రహ్మ జీవితంలో చివరి రోజుల్లో మాత్రం తీవ్రమైన విషాదం నెలకొంది. నమ్మినవారే నట్టేట ముంచడంతో ఆయన తీవ్ర ఆర్థిక సవాళ్లు ఎదుర్కొన్నారనే చేదు నిజాన్ని తాజాగా ఆయన కుటుంబ సభ్యుడు, జబర్దస్త్ ఫేమ్ తిరుపతి ప్రకాష్ ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. కమెడియన్ పద్మనాభం తనకు వరుసకు పెద్దనాన్న అవుతారని తిరుపతి ప్రకాష్ ఈ సందర్భంగా వెల్లడించారు. పద్మనాభం స్వగ్రామం కడప సమీపంలోనే ఉంటుందని, తన చిన్నతనంలోనే తన ఫోటోలు చూసి, తమ ఇంట్లో జరిగే వేడుకలకు పెద్దనాన్న వచ్చేవారని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, గతంలో ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్, జె.డి. చక్రవర్తి హీరోలుగా వచ్చిన ఒక సినిమాలో తాను, పెద్దనాన్న పద్మనాభం కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నామని తెలిపారు. అయితే అంతటి ఘన చరిత్ర ఉన్న నటుడు కెరీర్ ముగింపు దశలో ఎదుర్కొన్న కష్టాలు వింటే గుండె తరుక్కుపోతుందని ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. పద్మనాభం గారు కేవలం నటనకే పరిమితం కాకుండా సినిమా డిస్ట్రిబ్యూషన్‌లో అడుగుపెట్టి భారీగా నష్టపోయారని ప్రకాష్ తెలిపారు. ముఖ్యంగా గుంతకల్‌లోని 'బసవరాజా డిస్ట్రిబ్యూషన్స్' వల్ల ఆయనకు ఊహించని స్థాయిలో పెద్ద నష్టం వాటిల్లిందని విన్నారు. పరిశ్రమలో తనకు బాగా తెలిసినవారే, తాను ఎంతగానో నమ్మినవారే ఆయనను దారుణంగా మోసం చేశారని చెప్పారు. ఈ వరుస నష్టాల కారణంగా ఆయన జీవితం చివరి అంకంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను చవిచూడాల్సి వచ్చింది. చనిపోయే సమయానికి ఆయన ఒక దిగువ మధ్యతరగతి స్థితికి చేరుకున్నారని, చివరికి చెన్నైలో ఉన్న సొంత ఇల్లు కూడా అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చిందని తిరుపతి ప్రకాష్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం పద్మనాభం పిల్లలతో తనకు ఎలాంటి కాంటాక్ట్ లేదని కూడా స్పష్టం చేశారు.
టాలీవుడ్‌లో విభిన్నమైన కథాంశంతో, మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్‌గా రూపొందిన 'త్రికాల' చిత్రం ఇప్పుడు డిజిటల్ వేదికలపై సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. 'A Script of God' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ చిత్రం మే 28న థియేటర్లలో విడుదలై విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది. వెండితెరపై ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ విజువల్ వండర్, దాదాపు రెండు నెలల విరామం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై అడుగుపెట్టింది. మొదట గురువారం నాడు సన్ నెక్స్ట్ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ను ప్రారంభించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి ఊహించని రీతిలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రేజ్ చూసి కేవలం రెండు రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఈ సినిమాను తమ వీక్షకులకు అందుబాటులోకి తెచ్చాయి. ప్రస్తుతం ఈ మూడు టాప్ ఓటీటీల్లో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో స్ట్రీమింగ్ అవుతూ 'త్రికాల' చిత్రం సాలిడ్ ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎండీబీలో ఏకంగా 9.1 రేటింగ్ సాధించి టాలీవుడ్‌లో ఈ మూవీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు మణి తెల్లగూటి ఈ చిత్రాన్ని కేవలం డైలాగులకే పరిమితం చేయకుండా కрма సిద్ధాంతం, గో సంరక్షణ ప్రాధాన్యత, పునర్జన్మల వైవిధ్యాన్ని వెండితెరపై అద్భుతమైన విజువల్ వండర్‌గా ఆవిష్కరించారు. మైథాలజీ, సైకాలజికల్ హారర్, డార్క్ ఫాంటసీ అంశాలను అద్భుతంగా మేళవించి ప్రతి ఫ్రేమ్‌ను ఒక క్లాసిక్‌లా డిజైన్ చేశారు. ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడంలో పవన్ చెన్న అందించిన డార్క్ విజువల్స్, షాజీద్ హ్యుమాయన్, హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ ప్రధాన బలాలుగా నిలిచాయి. చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధిక శ్రీనివాస్ ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను మించిపోయేలా హోమ్ థియేటర్లలో ఈ చిత్రం ఇప్పుడు ప్రేక్షకులను భయపెడుతూ, ఆలోచింపజేస్తోంది. సినిమా కథ విషయానికి వస్తే, తరతరాలుగా ఒక రాజవంశాన్ని వెంటాడుతున్న భయంకరమైన శాపం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ శాపం కారణంగా సూర్యుడి వెలుగును అస్సలు చూడలేని, కేవలం చీకట్లోనే బతకాల్సిన విచిత్రమైన స్థితిలో వైతరణ్ అనే పాత్ర జన్మిస్తుంది. ఈ ఛాలెంజింగ్ పాత్రలో నటుడు అజయ్ అద్భుతంగా నటించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన వైతరణ్‌ను అతని సవతి తల్లి, సీనియర్ నటి ఆమని ప్రాణప్రదంగా చూసుకుంటుంది. అయితే, తీవ్రమైన సైకలాజికల్ బైపోలార్ డిజార్డర్‌తో బాధపడే వైతరణ్ జీవితంలో ఎన్నో అనూహ్యమైన, భయానక సంఘటనలు ఎదురవుతాయి. అతనికి మానసిక చికిత్స అందించడం కోసం సైకియాట్రిస్ట్ మాయ రంగంలోకి దిగుతుంది. ఈ గ్రిప్పింగ్ క్యారెక్టర్‌లో శ్రద్ధా దాస్ తన నటనతో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే శంకరపల్లి గ్రామంలోని కాటేరమ్మ ఆలయ రహస్యం ఏంటి, అసలు వైతరణ్ వంశాన్ని పట్టిపీడిస్తున్న ఆ శాపానికి కారణం ఎవరు, అసలు ఈ కథలో 'త్రికాల వర్మ' ఎవరు అనే ప్రశ్నలు వీక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తాయి. దుష్ట శక్తులు సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నప్పుడు త్రికాల వర్మ ఏం చేశాడు, వీరందరికీ అలాగే యువ జంట శివ, నిధిలకి మధ్య ఉన్న పాత జన్మల బంధం ఏంటి అనే అంశాలను దర్శకుడు ఆద్యంతం సస్పెన్స్‌తో నడిపించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించి ఇప్పుడు హీరోగా మారిన మాస్టర్ మహేంద్రన్, సాహితి అవంచ జంటగా నటించగా, ప్రభాకర్, రవి వర్మ, రోహిణి తమ నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. 
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎలాంటి కాంబినేషన్లు సెట్ అవుతాయో ఊహించడం కష్టం. కానీ కొన్ని క్రేజీ కలయికలు మాత్రం అనౌన్స్ కాకముందే ఇండస్ట్రీ సర్కిల్స్‌లో పెను సంచలనం సృష్టిస్తుంటాయి. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినబడుతున్న ఒక టాక్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. స్టార్ హీరోగా రాణిస్తూనే, తన సొంత నిర్మాణ సంస్థ 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్‌పై ప్రయోగాత్మక చిత్రాలను నిర్మిస్తున్న నేచురల్ స్టార్ నాని ఒక భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ క్రేజీ సినిమాలో యంగ్ హీరో నితిన్ హీరోగా నటిస్తుండగా, మోస్ట్ వాంటెడ్ పాన్-ఇండియా బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా జోడీ కట్టబోతోంది. ఈ ముగ్గురి కాంబినేషన్ కుదిరిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం జోరుగా చర్చకు దారితీస్తోంది. నిర్మాతగా నాని ప్రయాణం చాలా వైవిధ్యమైనది. కేవలం కమర్షియల్ ఫార్ములాను నమ్ముకోకుండా, సరికొత్త ఐడియాలతో వచ్చే నూతన దర్శకులను ప్రోత్సహించడం ఆయన ప్రత్యేకత. నాని నిర్మాణంలో వచ్చిన మొదటి సినిమా 'అ!' విమర్శకుల ప్రశంసలతో పాటు ఏకంగా రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన 'హిట్' ఫ్రాంచైజీ (HIT 1, HIT 2, HIT 3) టాలీవుడ్‌లో క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌కు సరికొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచింది. ఇటీవల ప్రియదర్శి ప్రధాన పాత్రలో వాల్ పోస్టర్ సినిమా నిర్మించిన 'కోర్ట్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి నానికి ప్రొడ్యూసర్‌గా మరో మైలురాయి లాంటి విజయాన్ని అందించింది. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవితో ఒక భారీ సినిమాను ప్లాన్ చేస్తున్న నాని, సమాంతరంగా నితిన్‌తో ఈ సోషల్ డ్రామాను పట్టాలెక్కించడానికి సర్వం సిద్ధం చేశారు. మరోవైపు హీరో నితిన్ కెరీర్‌లో ఒక పవర్ ఫుల్ కమ్‌బ్యాక్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. 'భీష్మ' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆయన నటించిన 'మాచర్ల నియోజకవర్గం', 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్', 'రాబిన్ హుడ్', 'తమ్ముడు' వంటి వరుసగా అరడజను చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. ఈ పరాజయాలు నిరాశ పరిచినప్పటికీ, నితిన్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా సరికొత్త కాన్సెప్ట్‌లతో ముందుకు సాగుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేష్ఠ మూవీస్ వంటి పెద్ద బ్యానర్లలో సినిమాలు చేస్తూనే, ఇప్పుడు నాని లాంటి అభిరుచి గల నిర్మాతతో చేతులు కలిపారు. నాని జడ్జిమెంట్, వాల్ పోస్టర్ సినిమా బ్రాండ్ వాల్యూ ఖచ్చితంగా నితిన్‌కు ఒక గ్రాండ్ సక్సెస్ అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది హీరోయిన్ రుక్మిణి వసంత్. కన్నడ చిత్రం 'సప్త సాగరాలు దాటి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఈ కన్నడ బ్యూటీ, ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆమె లీడ్ రోల్‌లో నటించిన కన్నడ విజువల్ వండర్ 'కాంతార చాప్టర్ 1' బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 800 కోట్లకు పైగా అద్భుతమైన కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ 'డ్రాగన్' మూవీలో కూడా రుక్మిణి వసంత్ నటిస్తోంది. ఇంతటి పాన్-ఇండియా క్రేజ్ మరియు సక్సెస్ రేట్ ఉన్న హీరోయిన్ నితిన్ సరసన చేరడం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ క్రేజీ కాంబినేషన్‌ను హ్యాండిల్ చేయబోయే లక్కీ ఛాన్స్ ఒక సరికొత్త ప్రతిభావంతుడికి దక్కింది. సమాజంలోని కుల వ్యవస్థ, సామాజిక వివక్ష మరియు గ్రామీణ నేపథ్యంలోని మానవ సంబంధాలను చావు చుట్టూ తిరిగే పాయింట్‌తో, 'బలగం' సినిమా తరహాలో అత్యంత సహజంగా తెరకెక్కించిన చిత్రం 'దండోరా'. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సరికొత్త దర్శకుడు మురళీకాంత్ దేవాసోత్ టాలెంట్‌ను నాని గుర్తించారు. కమర్షియల్ హంగులకు పోకుండా హృదయానికి హత్తుకునేలా కథలు చెప్పే మురళీకాంత్‌కు నాని ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారు. సామాజిక అంశాలతో కూడిన ఒక బలమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.     Nani Wall Poster Cinema, Nithiin, Rukmini Vasanth 
కోలీవుడ్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ కావ్య మారన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వీరిద్దరూ త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారని కోలీవుడ్ మీడియా సర్కిల్స్ గట్టిగా చెప్తున్నాయి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం... వీరి వివాహ వేడుకలు ఈ ఏడాది నవంబర్ 11, 12, 13 తేదీలలో మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ఇందులో ముఖ్యంగా నవంబర్ 12న వీరి పెళ్లి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రేజీ వెడ్డింగ్ కోసం ఒక విభిన్నమైన లొకేషన్‌ను ఎంచుకున్నారట. ఇండియాలో కాకుండా, ప్రకృతి అందాలకు నిలయమైన సౌత్ ఆఫ్రికాలో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. గతంలో వీరిద్దరిపై ఎన్నో రూమర్స్ వచ్చినప్పటికీ... ఇటీవల అనిరుధ్ బాబాయ్, సీనియర్ నటుడు వై.జి. మహేంద్రన్ ఓ ఇంటర్వ్యూలో వీరి పెళ్లిని కన్ఫర్మ్ చేస్తూ మాట్లాడటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ‘జైలర్’, ‘బీస్ట్’ వంటి చిత్రాలకు అనిరుధ్ సంగీతం అందించిన సమయంలోనే వీరి మధ్య పరిచయం ఏర్పడిందని, అది కాస్తా ఇప్పుడు పెళ్లి పీటల వరకు వచ్చిందని టాక్. అయితే, ఈ మూడు రోజుల వివాహ వేడుకలు మరియు సౌత్ ఆఫ్రికా డెస్టినేషన్ వెడ్డింగ్ వార్తలపై అటు మారన్ ఫ్యామిలీ కానీ, ఇటు అనిరుధ్ కానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం సస్పెన్స్‌గా ఉన్న ఈ మెగా వెడ్డింగ్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఇరు వర్గాల అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్‌లో విభిన్నమైన మరియు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఇద్దరు అగ్ర నిర్మాతలు చేతులు కలిపితే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలెంటెడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన సొంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్‌, యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ తన "బన్నీ వాస్ వర్క్స్" బ్యానర్‌పై సంయుక్తంగా ఒక సరికొత్త క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. ఈ విలక్షణమైన చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి "ఇడుపు కాయితం" అనే విభిన్నమైన, వెరైటీ టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. పూర్తిగా తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనింగ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం, ఇటీవలే సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమా అనౌన్స్ అయిన అతి తక్కువ సమయంలోనే "ఇడుపు కాయితం" అనే విలక్షణమైన టైటిల్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అసలు ఈ టైటిల్ వెనుక ఉన్న నేపథ్యం ఏంటి, కథ ఏమై ఉంటుంది అనే ఆసక్తి తెలుగు సినీ లవర్స్‌లో రోజురోజుకూ పెరిగిపోతోంది. టైటిల్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ప్రేక్షకుల్లో భారీ హైప్ తీసుకొచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాలో తెలంగాణ ప్రసిద్ధ జానపద గీతాల ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పై, ముఖ్యంగా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో విపరీతమైన క్రేజ్ మరియు పాపులారిటీ తెచ్చుకున్న ప్రముఖ నటి నాగదుర్గ హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం కాబోతోంది. ప్రియదర్శి, నాగదుర్గల విభిన్నమైన కాంబినేషన్‌తో పాటు ఈ చిత్రంలో ఒక అద్భుతమైన హోమ్లీ స్టార్ కాస్టింగ్ ఉండటం విశేషం. బుల్లితెరపై మరియు సోషల్ మీడియాలో అలరించే శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), సుజాత (జోర్దార్), చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు వంటి ఎంతోమంది గుర్తింపు తెచ్చుకున్న నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను వేగంగా ముగించుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించుకోనుంది. ఎలాంటి బ్రేకులు లేకుండా, సింగిల్ షెడ్యూల్‌లో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసేందుకు చిత్రబృందం పక్కా ప్లాన్ రెడీ చేసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ ఫస్ట్ వీక్‌లోనే ఈ సినిమాను గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. సుకుమార్ మార్క్ స్క్రీన్ ప్లే వాల్యూస్, బన్నీ వాస్ ప్రొడక్షన్ ప్లానింగ్, ప్రియదర్శి మార్క్ కామెడీ అండ్ ఎమోషన్స్ కలగలిసిన "ఇడుపు కాయితం" బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.     Idupu Kayitham, Priyadarshi New Movie, Sukumar Writings, Bunny Vas, Nagadurga Heroine, Idupu Kayitham Release Date
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా వస్తోందంటే ఒకప్పుడు టాలీవుడ్‌లో అదో రకమైన వైబ్రేషన్ ఉండేది. స్టార్ హీరోలతో సినిమాలు చేసినా, అసలు గుర్తింపు లేని కొత్తవాళ్లతో ప్రయోగాలు చేసినా కేవలం తన బ్రాండ్ నేమ్ చూపిస్తూ థియేటర్ల వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టడం పూరి జగన్నాథ్‌కే చెల్లింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 'లైగర్' మరియు 'డబుల్ ఇస్మార్ట్' వంటి భారీ పరాజయాలు బాక్సాఫీస్ వద్ద ఆయన మార్కెట్‌ను భారీగా దెబ్బతీశాయి. పూరి సినిమా అంటే ఉండే నమ్మకాన్ని ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలు కాస్త తగ్గించుకున్న మాట వాస్తవం. దీనికి తోడు గత చిత్రాల ఆర్థిక లావాదేవీల వల్ల ఏర్పడ్డ వివాదాలు ఇప్పటికీ ఆయనకు పెద్ద తలనొప్పిగా మారాయి. వాటిలో కొన్ని సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకుండా కోర్టులు, పంపిణీదారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఈ ఆర్థిక వివాదాల చిక్కులు ఎప్పుడు పూర్తిగా తొలగిపోతాయో కాలమే సమాధానం చెప్పాలి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సరికొత్త ప్యాన్ ఇండియా మూవీ 'స్లమ్ డాగ్'. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ఎప్పుడో పూర్తి కావడం విశేషం. కొన్ని నెలల క్రితం విడుదల చేసిన 'స్లమ్ డాగ్' అఫీషియల్ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముంబై మాఫియా సెటప్‌తో ఈ కథ నడుస్తున్నట్లు అనిపించినప్పటికీ, పూరి ఈసారి ఏదో ఒక కొత్త తరహా కథను చెప్పబోతున్నారనే క్లారిటీ అందరికీ వచ్చేసింది. కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ బిచ్చగాడు, టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ 'పోకిరి' చిత్రాలను కలిపి ఒకే సినిమాలో చూపిస్తే ఏ రకమైన హై వస్తుందో, సరిగ్గా అలాంటి డిఫరెంట్ ట్రీట్‌మెంట్‌తో ఈ సినిమా ఉంటుందని ఇన్ సైడ్ టాక్ గట్టిగా వినిపిస్తోంది. అంతా బాగుంది కానీ, అసలు సమస్య అంతా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరే వచ్చి పడింది. ఇంతవరకు 'స్లమ్ డాగ్' విడుదల ఎప్పుడనే అధికారిక స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఒక సినిమాపై సోషల్ మీడియాలో క్రేజ్ మరియు బజ్ తగ్గకుండా ఉండాలంటే, మేకర్స్ నిరంతరం రెగ్యులర్ అప్డేట్స్‌ ఇవ్వాలి. అంతేకాకుండా అనుకున్న సమయానికి, ఎలాంటి జాప్యం లేకుండా థియేటర్లలోకి తీసుకురావడం చాలా ముఖ్యం. కానీ ఈ రోజుల్లో ఓటిటి డీల్స్ ఆలస్యం కావడం, థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ కాకపోవడం, డిస్ట్రిబ్యూటర్లతో రేట్ల విషయంలో జరిగే మంతనాలు, బేరాలు వంటి వందలాది సమస్యలతో నిర్మాతలు సతమతమవుతున్నారు. వందల కోట్ల భారీ బడ్జెట్ పెట్టిన పెద్ద సినిమాలకు కూడా ఈ కష్టాలు తప్పడం లేదు. మరి మన పూరి జగన్నాథ్ 'స్లమ్ డాగ్' చిత్రానికి ఎలాంటి ఆర్థిక చిక్కులు ఎదురవుతున్నాయో అని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. టీజర్ ఇచ్చిన జోష్‌ను కంటిన్యూ చేయకుండా ఈ సినిమా మళ్లీ సైలెంట్ అయిపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సినిమాలో క్యాస్టింగ్ పరంగా పూరి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి మరియు క్రేజీ బ్యూటీ సంయుక్త మీనన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటి టబు ఒక కీలక పాత్రలో కనిపించనుంది. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాల ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. గత సినిమాల పరాజయాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి కథా చర్చల్లో ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఇచ్చిన విలువైన సలహాలను కూడా పూరి తీసుకున్నారట. ఈ భారీ యాక్షన్ డ్రామా 2026లోనే విడుదలవుతుందని చెప్తున్నప్పటికీ, ఆ కచ్చితమైన డేట్ ఎప్పుడనేది మాత్రం ఇప్పటికీ పెద్ద సస్పెన్స్‌గానే మిగిలిపోయింది.     Puri Jagannadh, Slum Dog, Vijay Sethupathi, Samyuktha Menon 
అఖిల్ అక్కినేని బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తున్నాడు. గత చిత్రం ‘ఏజెంట్’ రూపంలో ఎదురైన పరాజయాన్ని మర్చిపోయేలా, అభిమానులు కాలర్ ఎగరేసుకునే రేంజ్‌లో ఊర మాస్ కంబ్యాక్ ఇచ్చాడు. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన అఖిల్ లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే సరికొత్త రికార్డులను బద్దలు కొడుతూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కెరీర్‌లో, ఈ చిత్రం సరికొత్త ఊపిరి పోసింది. అక్కినేని ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాలిడ్ హిట్ ‘లెనిన్’ రూపంలో దక్కిందని ట్రేడ్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన రికార్డులు చూస్తే అఖిల్ కంబ్యాక్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో అర్థమవుతుంది. అఖిల్ గత చిత్రం ‘ఏజెంట్’ తన పూర్తి రన్ టైమ్‌లో సాధించిన మొత్తం వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ కేవలం ₹6.90 కోట్ల షేర్ మాత్రమే. కానీ, ఇప్పుడు ‘లెనిన్’ చిత్రం కేవలం తన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ₹7.26 కోట్ల భారీ షేర్ వసూలు చేసి సరికొత్త సంచలనం సృష్టించింది. ఒక సినిమా పూర్తి రన్ టైమ్ షేర్ కలెక్షన్లను, సరికొత్త సినిమా కేవలం 24 గంటల్లోనే దాటేయడం టాలీవుడ్‌లో అఖిల్ మాస్ పవర్‌కు నిదర్శనంగా నిలిచింది. మొత్తానికి ‘ఏజెంట్’ ఇచ్చిన షాక్ నుండి అఖిల్ అక్కినేని 2.0 వెర్షన్‌తో ‘లెనిన్’ ద్వారా ఊర మాస్ కంబ్యాక్ ఇచ్చి బాక్సాఫీస్ విజేతగా నిలిచారు.     Akhil Akkineni, Lenin collections, Lenin vs Agent, TeluguOne  
టాలీవుడ్‌లో ఒకప్పుడు సెన్సేషనల్ క్రేజ్ సంపాదించుకున్న కుర్ర హీరోయిన్ శ్రీలీల చుట్టూ ఇప్పుడు అకస్మాత్తుగా సోషల్ మీడియాలో నెగెటివిటీ పెరిగిపోతోంది. ఇటీవల అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన 'లెనిన్' చిత్రం థియేటర్లలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా సక్సెస్ సాధించినప్పటి నుండి నెట్టింట శ్రీలీల గురించే తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఎందుకంటే, నిజానికి ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు అందులో హీరోయిన్‌గా నటించింది శ్రీలీలనే. ఫస్ట్ లుక్ టీజర్‌లో కూడా అఖిల్ పక్కన ఆమె మెరిసింది. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని అనుకోని పరిణామాల వల్ల శ్రీలీల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆమె స్థానంలోకి బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే వచ్చి చేరింది. ఇప్పుడు 'లెనిన్' సినిమాలో భాగ్యశ్రీ నటనను చూసి, ఆమె బెస్ట్ ఛాయిస్ అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. ఇదే సమయంలో ఒకవేళ ఆ పాత్రలో శ్రీలీల ఉండి ఉంటే ఈ రేంజ్ ఎఫెక్ట్ వచ్చేది కాదంటూ నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఒక సినిమా జయాపజయాలు కేవలం హీరోయిన్ మీద మాత్రమే ఆధారపడవు. ఒకవేళ శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకోకుండా 'భారతి' పాత్రలో నటించి ఉన్నా కూడా సినిమా రిజల్ట్ లో ఎలాంటి మార్పు ఉండేది కాదు. ఎందుకంటే ఇది పూర్తిగా హీరో డ్రివెన్ సబ్జెక్ట్. తనకు ద్రోహం చేసిన అయినవాళ్ల మీద పగతో ఒక యువకుడు సాగించిన మారణకాండ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. స్టోరీలో మెయిన్ పాయింట్ హీరోయిన్ భారతినే అయినప్పటికీ, హీరో ఎలివేషన్లదే కీలక పాత్ర. కొన్ని మంచి సీన్లు, ఎమోషనల్ గా నటించే అవకాశం దక్కిన మాట నిజమే, వాటిని భాగ్యశ్రీ బోర్సే తన ప్రయత్న లోపం లేకుండా చక్కగా నిలబెట్టింది. ఒకవేళ శ్రీలీల ఆ క్యారెక్టర్ చేసి ఉంటే, దర్శకుడు ఆమె ఇమేజ్‌కు తగ్గట్టుగా ప్రెజెంట్ చేయడానికి ఖచ్చితంగా కసరత్తు చేసేవారు. ఇప్పటివరకు శ్రీలీలకు నటిగా తన ప్రతిభను నిరూపించుకోవడానికి దక్కిన అవకాశాలు చాలా తక్కువ అనే చెప్పాలి. శ్రీలీల కెరీర్ గ్రాఫ్ గమనిస్తే, 'పెళ్లి సందడి' సినిమా నుండి మహేష్ బాబు 'గుంటూరు కారం' దాకా ఆమె చేసిన దాదాపు అన్ని సినిమాల్లోనూ హీరోతో ప్రేమలో పడటం, అద్భుతంగా డాన్సులు చేయడం మినహా నటనకు పెద్దగా స్కోప్ దొరకలేదు. 'పరాశక్తి' సినిమాలో ఆమెకు నటనకు స్కోప్ దొరికినప్పటికీ, కేవలం కంటెంట్ బాగోలేకపోవడం వల్లే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిలయ్యింది. అయితే 'భగవంత్ కేసరి' సినిమాలో నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్ హీరో ఎదురుగా కూతురి లాంటి పాత్రలో శ్రీలీల ఎంత అద్భుతంగా మెప్పించిందో మనమంతా చూశాం. కాబట్టి ఆమెలో నటన ప్రతిభ లేదనుకోవడం ముమ్మాటికీ పొరపాటే అవుతుంది. 'లెనిన్' సినిమాలో ఆమె చేసినా చేయకపోయినా, ప్రస్తుతం శ్రీలీల కెరీర్‌కు కావాల్సింది సరైన కాంబినేషన్లు, బలమైన కంటెంట్ ఉన్న కథలు మాత్రమే. మరోవైపు శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ కూడా అంతకంతకూ ఆలస్యమవుతుండటం ఆమె కెరీర్‌పై ప్రభావం చూపుతోంది. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన ఆమె నటిస్తున్న హిందీ సినిమా అసలు ఏ స్టేజిలో ఉందో, ఎప్పుడు రిలీజవుతుందో ఇప్పటికీ క్లారిటీ లేకుండా అంతుచిక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ సమీకరణాల ప్రకారం హీరో, దర్శకుడి తర్వాతే మిగిలిన టెక్నీషియన్లు, ఆర్టిస్టుల కౌంట్ లోకి వస్తారు. కాబట్టి ఒక సినిమా హిట్ లేదా ఫ్లాప్ క్రెడిట్‌ను హీరోయిన్‌కు ఆపాదించడం సరైన పద్ధతి కాదు. అందుకే 'లెనిన్' సినిమా సక్సెస్‌ను అడ్డం పెట్టుకుని శ్రీలీలని సోషల్ మీడియాలో ఇలా టార్గెట్ చేయడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని ఆమె అభిమానులు బలంగా వాదిస్తున్నారు.     Sreeleela, Akhil, Lenin Movie, Bhagyashri Borse
  ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.. బయట ఎన్ని సమస్యలు ఉన్నా,  ఎంత ఇబ్బందులు ఎదుర్కున్నా ఇంటికి రాగానే సంతోషం బోలెడు ప్రశాంతత,  జీవితంలో ఊరట కలుగుతోంది అంటే.. ఆ కుటుంబం ఎంతో ఆరోగ్యంగా ఉందని అర్థం. కానీ కొన్ని కుటుంబాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండదు. ఇలా ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోతే కుటుంబ సభ్యులు చాలా వరకు మానసికంగా డిస్టర్బ్ అవుతుంటారు. అయితే  కుటుంబ వాతావరణం అనారోగ్యంగా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో తరాల అంతరం వల్ల కుటుంబంలో వాతావరణం సరిగా లేకుండా ఉండే అవకాశం ఉంది, అలాగే కుటుంబ అలవాట్ల వల్ల కూడా వాతావరణం దెబ్బతింటుంది. కానీ కుటుంబ జీవితంలో నిర్లక్ష్యం చేయకూడని విషయాలు కొన్ని ఉన్నాయి.  వాటిని తెలుసుకుంటే.. కుటుంబం తిరిగి ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు.  ఇంతకీ ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే.. ఎమోషన్స్ దుర్వినియోగం.. కుటుంబంలో సులభంగా గుర్తించగలిగే ప్రమాదకరమైన విషయాలు ఏవీ ఉండవు. కానీ చాలా సున్నితంగా ఉంటూనే మనుషుల్ని బాధపెడతారు. ఎమోషన్స్ తో ఇబ్బంది పెడతారు. కుటుంబ సభ్యులు తమదే తప్పు అన్న భావనను కుటుంబంలో  వ్యక్తికి కలిగిస్తారు. కొన్నిసార్లు, వారు బాధితులుగా నటిస్తూ ఎదుటివారిని ఎక్కువగా నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాతావరణం ఉన్న ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం, సంతోషం ఉండవు. నిర్ణయాల దగ్గర బంధనం..  కుటుంబంలో జీవిత నిర్ణయాల గురించి మిమ్మల్ని అడగకుండా, తమకు తాము నిర్ణయాలు తీసుకుని ఆఖరిగా మీకు చెబుతూ ఉంటే.. ఒకవేళ అదే నిజమైతే, ఇది నిర్లక్ష్యం చేయకూడని విషయమని లైఫ్ స్టైల్ నిపుణులు చెబుతున్నారు. . ఈ నియంత్రణ చిన్నతనం నుండి కౌమారదశ వరకు ఆరోగ్యకరంగానే ఉంటుంది. , కానీ  పెద్దయ్యాక కుటుంబ సభ్యుల నుండి ఇదే వైఖరి కొనసాగడం మంచిది కాదు. హద్దులు లేకపోవడం.. ప్రతిఒక్కరూ ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు గౌరవించుకున్నప్పుడే కుటుంబ సంబంధాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. అలా చేయడంలో విఫలమైతే, కాలక్రమేణా విషపూరితమైన సంబంధాలకు దారితీయవచ్చు. అంతేకాకుండా, ఈ విషయాలు  వ్యక్తి యొక్క భావోద్వేగ ఎదుగుదలకు చాలా కీలకమైనవి. గొడవల పరిష్కారం.. పరిష్కారం కాని కుటుంబ వివాదాలు చాలా కుటుంబాలలో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి పదేపదే మరో వాదనకు లేదా ఘర్షణకు దారితీసి, పరిస్థితిని మరింత తీవ్రం చేస్తాయి. దీనివల్ల, ఆ విషయం పరిష్కారమైన తర్వాత కూడా ఎమోషనల్ దూరం పెరగవచ్చు. పట్టించుకోకపోవడం.. కుటుంబంలో మీ భావాలను లేదా అభిప్రాయాలను ఎప్పుడూ  పట్టించుకోవడం జరిగితే అది కుటుంబ సభ్యుల నుండి దూరాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఎప్పుడైతై ఎమోషనల్ సపోర్ట్ లేదా అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం జరుగుతుందో అప్పుడు ఆ ఇంట్లో వ్యక్తి పరాయివాడుగా ఫీలవుతారు.                                     *రూపశ్రీ.
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం.  భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది.  భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది.  అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది. కానీ కోడలిగా వచ్చిన ఆడపిల్లను బాధపెట్టే అత్తమామలు ఉంటే.. ఆ ఆడపిల్లల జీవితం నరకప్రాయంగా ఉంటుంది.  అయితే.. బాధపెట్టే అత్తమామలు ఉన్నారని, వివాహ బంధాన్ని తెంచుకుని వెళ్లలేరు చాలామంది అమ్మాయిలు,  బాధపెట్టే అత్తమామలతో  ఎలా ఉండాలో,  వాళ్లతో కలిసి ఎలా జీవించాలో లైఫ్ స్టైల్ నిపుణులు చెబుతున్నారు..  వీటి గురించి తెలుసుకుంటే.. మార్చాలని అనుకోకూడదు.. కొన్నిసార్లు  అత్తమామలు కోడళ్ల మీద ఒత్తిడిని, ఇబ్బందులను కలిగిస్తారు. బాధపెట్టే అత్తమామల గురించి చాలా మంది జోక్ గా చెప్తూ ఉంటారు. కానీ బాధపెట్టే అత్తమామలు ఉండటం జోక్ కాదు.. అది ఆడపిల్లలను చాలా బాధపెడుతుంది, చాలా ఒత్తిడిలోకి నెడుతుంది.  అలాంటి అత్తమామలు  మానసిక ప్రశాంతతను, వివాహ బంధాన్ని కూడా ప్రభావితం చేస్తారు. చాలా మంది కోడళ్లు తమ అత్తమామలు మారితే బాగుండు అని అనుకుంటారు. కానీ అత్తమామలు మారాలని,  వాళ్లను  మార్చాలని అనుకోవడం వ్యర్థం. అత్తమామలు ఏ విషయాల పట్ల బాధపెడతారో తెలిసినప్పుడు వాటి గురించి పట్టించుకోకుండా ఉండటమే  మంచిది. పరిమితులు..  బాధపెట్టే అత్తమామలు ఉన్నప్పుడు, ప్రతి కోడలు తన భర్త సహాయంతో  కొన్ని సొంత పరిమితులను నిర్దేశించుకుని, వాటికి కట్టుబడి ఉండడం  మంచిది. పరిమితులు ఏర్పాటు చేసుకున్నప్పుడు పెద్దవాళ్లు, అత్తమామలు మాట్లాడే ఏ మాటలు లేదా ప్రవర్తన పరిమితులను దాటి జీవితంలోకి తీసుకుని బాధపడే పరిస్థితి రాదు.   సమస్య, పరిష్కారం.. ఏదైనా సమస్యను పరిష్కరించే ముందు, దాని మూల కారణాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. అత్తమామల చెడు  ప్రవర్తన అకస్మాత్తుగా జరగదు. వారు ప్రతీదీ తమకు నచ్చినట్టుగా జరగాలని కోరుకోవడం, తమ భావాలను అదుపు చేసుకోలేకపోవడం, లేదా గతంలోని మానసిక గాయాలను మోయడం వంటి కారణాల వల్ల ఇది తరచుగా జరుగుతుంది. కొన్నిసార్లు, అత్తమామలు కోడలు పెరిగిన విధానాన్ని, కోడలి పుట్టింటి వారి పద్దతులను,  నియమాలను అగౌరవపరుస్తారు, మరికొన్ని సార్లు  స్వార్థపరురాలు అనే ట్యాగ్ వేసి  వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘిస్తారు, లేదా కుటుంబంలో కలహాలు సృష్టించి కోడలిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ పద్ధతులను గుర్తించడమే కోడళ్లు అత్తారింట్లో బాధపెట్టే అత్తమామలతో కలిసి ఎలా జీవించాలనే విషయాన్ని అర్థమయ్యేలా చేస్తాయి.                                      *రూపశ్రీ.
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. కొత్త వాతావరణం, కొత్త ఉపాధ్యాయులు, కొత్త తరగతులు మరియు కొత్త స్నేహితులు ఉత్సాహంతో పాటు ఆందోళనను కూడా కలిగిస్తాయి. చాలా మంది పిల్లలు మొదట్లో పాఠశాలలో తమకు ఎదురయ్యే విషయాలను, తమ మనసులోని విషయాలను  మనసు విప్పి చెప్పలేరు. అయితే తల్లిదండ్రుల బాధ్యత కేవలం పిల్లలను బడికి పంపడమే కాదు.. పిల్లల గురించి ఎన్నో విషయాలు తల్లిదండ్రులు ఆలోచించాలి. మరీ ముఖ్యంగా..  కొత్తగా స్కూల్ కు వెళ్తున్న పిల్లలను కొన్ని ప్రశ్నలు తప్పకుండా అడగాలి. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. ప్రతిరోజూ పిల్లలను అడాగాల్సిన ప్రశ్నలు.. నచ్చిన విషయం.. ఈ రోజు పాఠశాలలో అన్నింటి కన్నా నీకు నచ్చిన విషయం ఏదని పిల్లలను అడగాలి.  ఈ ప్రశ్న పిల్లలో సానుకూల విషయాలను వెలికితీయడానికి సహాయపడుతుంది.  కొందరు పిల్లలు బడికి వెళ్లొచ్చిన తర్వాత మళ్లీ బడికి వెళ్లమని మారం చేస్తుంటారు. కానీ బడిలో వారికి నచ్చిన విషయాన్ని గుర్తు చేయడం వల్ల పిల్లలకు పాఠశాల పట్ల ఉత్సాహం పెరుగుతుంది.  అలాగే తల్లిదండ్రులు పిల్లలతో ఇలా మాట్లాడటం వల్ల పిల్లలు  స్వేచ్ఛగా మాట్లాడటం నేర్చుకుంటారు,  ఏ విషయాన్ని అయినా బెరుకు లేకుండా చెప్పగలుగుతారు. ఇది పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. పిల్లలకు ఏ విషయాల మీద ఆసక్తి ఉందో కూడా తల్లిదండ్రులకు అర్థం అవుతుంది. ఎవరితో ఆడుకున్నావు లేదా మాట్లాడావు అని అడగాలి.. పిల్లలు పాఠశాలలో ఎవరితో ఆడుకున్నారు, మాట్లాడారు అనే విషయాలు కొత్త స్నేహితుల గురించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది.  పిల్లలకు సామాజిక అవగాహన అర్థం అవుతుంది. పిల్లలు బడిలో ఒంటరిగా ఉంటారా లేదా ఇతరులతో కలుస్తున్నారా,  ఎవరితో అయినా కలవడంలో  ఇబ్బంది ఫీలవుతున్నారా?  అనే విషయాలు అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులకు సహాయపడుతుంది. ఏదైనా భయం లేదా బాధ పెట్టే విషయం ఉందా అని అడగాలి.. కొందరు పిల్లలు స్కూల్ లో తోటి విద్యార్థుల వల్ల, ఉపాధ్యాయుల వల్ల బాధపడటం, భయపడటం జరుగుతూ ఉంటుంది. దీని వల్ల పిలల్లు బడికి  వెళ్లాలంటే భయపడటారు.  ఈ కారణంగా చదువు మీద ఆసక్తి కూడా తగ్గిపోతుంది. పిల్లల భయాన్ని తగ్గించినప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజు ఏం నేర్చుకున్నావని అడగాలి.. పిల్లలను  ఈ రోజు ఏం నేర్చుకున్నావని ప్రతి రోజూ అడిగితే వారికి ఏ విషయం పట్ల ఆసక్తి ఎక్కువ ఉందో అర్థమవుతుంది. తద్వారా పిల్లలను ప్రోత్సహించడంలో తల్లిదండ్రులకు ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇలా అడిగినప్పుడు పిల్లలు అన్ని చెబుతూ ఉంటే.. పిల్లలలో జ్ఞాపకశక్తి,  వారిలో బావ వ్యక్తీకరణ వంటివి మెరుగు పడతాయి.                          *రూపశ్రీ.
మన శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉండటం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. జీవనశైలి మార్పులు, సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల రక్తంలో క్లాట్స్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అలాగే అధిక బరువు కూడా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.  ఈ వీడియోలో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు Dr. Chittibotla Madhusudana Sharma గారు వంటింట్లో సులభంగా లభించే కొన్ని సహజ పదార్థాలతో సంప్రదాయ ఆయుర్వేదంలో ఉపయోగించే చిట్కాలను వివరించారు. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, బరువు నియంత్రణకు తోడ్పడే ఆహారపు అలవాట్లు మరియు సహజ పద్ధతుల గురించి ఆయన విలువైన సూచనలు అందించారు. అలాగే ఏయే ఆహార పదార్థాలను తీసుకోవాలి, ఎలాంటి జీవనశైలి పాటించాలి, ఆరోగ్యాన్ని సహజంగా ఎలా మెరుగుపరుచుకోవాలి వంటి విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.  ఆయుర్వేదం చెప్పే ఈ సంప్రదాయ చిట్కాలను తెలుసుకుని, మీ రోజువారీ జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరచుకోండి.  గమనిక: ఈ వీడియోలో తెలిపిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఇప్పటికే రక్తం గడ్డకట్టే సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడి సలహా మేరకు మాత్రమే చికిత్స తీసుకోవాలి. వైద్యుల సూచన లేకుండా ఎలాంటి మందులను ఆపడం లేదా ప్రారంభించడం చేయవద్దు.  
నేటికాలంలో ఉపవాసం కేవలం దేవుడు, సంప్రదాయం, మతానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు..  ఫిట్‌నెస్ ప్రపంచంలో కూడా ఉపవాసం  బాగా ప్రాచుర్యం పొందింది. 16:8 డైట్ వంటి పద్ధతుల నుండి రోజుకు ఒకసారి తినడం వరకు,  తక్కువ తినడానికి, త్వరగా బరువు తగ్గడానికి , ఆరోగ్యంగా ఉండటానికి ఉపవాసం  ఒక సులభమైన మార్గంగా అందరికీ కనిపిస్తుంది. ఇలాంటి వాటిలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా ఉంది. దీన్నే మధ్యంతర ఉపవాసం అని కూడా పిలుస్తారు.  అయితే ఇది ఆరోగ్యానికి మేలు చేయడం కంటే.. హాని చేయడమే ఎక్కువ ఉంటుందని అంటున్నారు. ఇది పరిశోధనలలో తేలిందని కూడా అంటున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. పరిశోధనలు తేల్చిన నిజం.. ఇటీవల 20,000 మందికి పైగా ప్రజలపై జరిపిన ఒక విశ్లేషణలో, రోజుకు ఎనిమిది గంటలు లేదా అంతకంటే ఎక్కువ  సమయం వరకు  ఆహారం తీసుకోకుండా ఉండే వారికి గుండె జబ్బులతో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రమాదం 91 శాతం వరకు ఎక్కువగా ఉంటుందట. దీని అర్థం ఉపవాసం అందరికీ హానికరం అని కాదు, కానీ తక్కువ తినడం, ఎక్కువ సమయం ఆహారం లేకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు. వైద్యులు ఏం చెప్తున్నారంటే.. ఎక్కువసేపు ఆహారం తీసుకోకుండా ఉండటం  అనేది  శరీరంలో అనేక ఆకస్మిక మార్పులకు కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా హెచ్చుతగ్గులకు గురవుతాయి, ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి, , కొవ్వు స్థాయిలు కూడా ప్రభావితమవుతాయి. ఈ మార్పులన్నీ గుండెపై ఒత్తిడిని కలిగిస్తాయట. మరోవైపు ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల  చక్కెర, ఖనిజాలు , హార్మోన్లలో హెచ్చుతగ్గులకు కారణమవుతుందని, ఇది  హృదయ స్పందనలు గాడి తప్పే పరిస్థితి తీసుకొస్తుందని అంటున్నారు. నీటి కొరత.. ఆహారం ఎక్కువ సేపు తీసుకోకుండా ఉపవాసం ఉండటం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది.  శరీరం డీహైడ్రేషన్ అవుతుంది.  ప్రజలు ఎక్కువ సేపు ఆహారం తీసుకోనప్పుడు, తక్కువ నీరు తాగుతారు. దీనివల్ల సాధారణ గుండె కొట్టుకోవడానికి అవసరమైన పొటాషియం , మెగ్నీషియం వంటి అవసరమైన ఖనిజాలు శరీరంలో తగ్గిపోతాయి. ఈ ఖనిజ లోపాలు డీహైడ్రేషన్  కారణంగా హృదయ స్పందన సజావుగా సాగడం కోసం గుండె చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఉపవాసం ఆరోగ్యానికి మంచిది కాకపోయినా.. ఇది అందరికీ ఒకే ఫలితాన్ని ఇవ్వదు. కొందరికి ఇది సమస్య కలిగిస్తుంది, మరికొందరికి మంచి ఫలితాలు కూడా ఇవ్వవచ్చు.  ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు లేదా గుండె సమస్యలు,  ముందు నుంచే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా, కొన్ని రకాల మందులు తీసుకునే వారికి  ఉపవాసం మంచిది కాదు,, ఆహారం తినకుండా మందులు వేసుకోలేం, ఆహారం తినకుండా మందులు వేసుకున్నా అది  ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉంటే..  తరచుగా అలసట, తలతిరగడం, ఛాతిలో ఇబ్బందిగా ఉండటం లేదా గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు శరీరం మీద ఒత్తిడి ఎక్కువగా ఉందని చెప్పే లక్షణాలు. కాబట్టి ఉపవాసం పేరుతో ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉండటం,  శరీరాన్ని ఇబ్బందికి గురిచేసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది.  అందుకే.. బరువు తగ్గాలన్నా, ఫిట్ గా ఉండాలన్నా మంచి పద్దతులలో ఆహారం తీసుకుంటూనే గోల్ రీచ్ అవ్వాలి.                                    *రూపశ్రీ.
మెనోపాజ్ (Menopause) వచ్చిన తర్వాత మళ్లీ బ్లీడింగ్ రావడం సాధారణ విషయం కాదు. చాలా మంది మహిళలు దీనిని చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇది కొన్ని సందర్భాల్లో గర్భసంచి క్యాన్సర్ (Endometrial Cancer / Uterine Cancer) కు తొలి హెచ్చరిక కావచ్చు.  ఈ వీడియోలో ప్రముఖ గైనకాలజిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్నేహా సాగర్ గారు గర్భసంచి క్యాన్సర్ గురించి ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను చాలా సులభంగా వివరించారు.  ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యమైన విషయాలు:  ✅ మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ రావడానికి కారణాలు ఏమిటి? ✅ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే ఏమిటి? ✅ గర్భసంచి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఏమిటి? ✅ ఎవరికి ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ? ✅ ఎప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి? ✅ బయాప్సీ ఎందుకు అవసరం? ✅ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో ఎలా గుర్తిస్తారు? ✅ శస్త్రచికిత్స (Surgery), కీమోథెరపీ (Chemotherapy), రేడియేషన్ థెరపీ (Radiation Therapy) వంటి చికిత్సల గురించి పూర్తి వివరాలు.  ప్రారంభ దశలో గర్భసంచి క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్స విజయవంతంగా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మెనోపాజ్ తర్వాత ఎలాంటి బ్లీడింగ్ వచ్చినా ఆలస్యం చేయకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం ఎంతో ముఖ్యం.