Latest News

తెలంగాణలో భారీ వర్షాలు

posted on: Mar 30, 2026 9:41AM

మండు వేసవిలో వరుణులు విజృంభించనున్నాడా? అంటే వాతావరణ శాఖ ఔననే అంటోంది. రాగల రెండు రోజులలో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయనీ, ఈ సందర్భంగా బలమైన ఈదురుగాలులతో పాటు వడగళ్లు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఈ అకాల వర్షాలకు పంటలు దెబ్బతినకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే పిడుగుపాటుకు అవకాశం ఉన్నందున వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...