LATEST NEWS
2019 ఎన్నికలకు ముందు అప్పటికి పొత్తులో ఉన్న తెలుగుదేశం, బీజేపీల మధ్య చిచ్చు పెట్టింది తానేనని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా 2018 నాటి రాజకీయ పరిణామాలపై ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ హాట్ చర్చ నడుస్తోంది. బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రెండు పార్టీఅ మధ్యా విభేదాలు పొడసూపి, అవి ముదిరి మైత్రిబంధం తెగిపోవడానికి 2016 నుంచి తాను ప్రయత్నాలు చేశాననీ, చివరకు ఆ ప్రయత్నాలు 2018 నాటికి ఫిలించాయని అప్పట్లో వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయి రెడ్డి తాజాగా చెప్పారు.  ఈ వ్యాఖ్యలను ఆయన తిరుపతిలో ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికలలో అంటే 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశం,  బీజేపీ, జనసేన మధ్య పొత్తు  ఉండేది. ఎన్నికల అనంతరం తెలుగుదేశం నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ,  ప్రత్యేక హోదా, కేంద్ర నిధులు, రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలపై సైకిల్, కమలం పార్టీల మధ్య విభేదాలు పొడసూపాయి.   2018లో తెలుగుదేశం బీజేపీతో పొత్తు తెంచుకుని,  ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. ఈ పరిణామం అప్పట్లో  రాష్ట్ర రాజకీయ సమీకరణాలను సమూలంగా మార్చివేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. వైసీపీ ఘన విజయం సాధించి అధికారపగ్గాలను చేపట్టింది.   నాటి పరిణామాలపై తాజాగా నోరు విప్పిన విజయసాయి రెడ్డి.. 2016 నుంచి 2018 వరకు టీడీపీ, బీజేపీ మధ్య దూరం పెంచేందుకు తాను అనేక విధాలుగా ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చారు.  అలా దూరం పెంచి, ఆ రెండు పార్టీల పొత్తునూ విచ్ఛిన్నం చేయడంలో సక్సెస్ అయ్యాను కనుకనే.. 2019 ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించిందని ఆయన చెప్పకనే చెప్పారు. అప్పట్లో వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం సిద్ధించి అధికార పగ్గాలు చేపట్టడం వెనుక ఉన్నది తానేనని విజయసాయి అన్యాపదేశంగా చెప్పారు.     [Vijayasai Reddy Behind Differences Betweem BJP And TDP, Split, TDP BJP Alliance, 2018,  YS Jagan Political Advantage,   2019 AP Elections,Andhra Pradesh Politics, Telugu One]
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీ్ు అధినేత   విజయ్ ఎన్నికకు సంబంధించిన వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చెన్నైలోని మద్రాస్ హైకోర్టు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై  తుది తీర్పును ఈ నెల  14కు వాయిదా వేసింది. పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయ్ గెలుపును సవాలు చేస్తూ  దినేశ్  అనే వ్యక్తి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ విజయ్ దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. తమిళనాడు  అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్ నియోజకవర్గం నుంచి విజయ్  తన సమీప ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్‌పై 53 వేల 715 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అయితే విజయ్ ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదని ఆరోపిస్తూ  దినేశ్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఆరోపణల ఆధారంగా ఆయన ఎన్నికను రద్దు చేయాలని పిటిషన్‌లో  కోరారు.  పిటిషనర్ తరఫున విజయ్‌కు సంబంధించిన కొన్ని ఆస్తుల వివరాలు ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తిగా వెల్లడించలేదని వాదించారు. ముఖ్యంగా పన్రుటి ప్రాంతంలో కొనుగోలు చేసినట్లు పేర్కొన్న వ్యవసాయ భూమి విలువ సుమారు  30 కోట్ల రూపాయలు ఉంటుందనీ,   దాని వివరాల వెల్లడిపై అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. అలాగే కొడైకెనాల్‌లోని విల్పట్టి గ్రామంలో ఉన్నట్లు పేర్కొన్న 50 సెంట్ల భూమి ప్రభుత్వ భూమి అయి ఉండవచ్చని రెవెన్యూ రికార్డులను ప్రస్తావించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనిపై విజయ్ తరఫు న్యాయవాదులు  ఎన్నికల అఫిడవిట్‌లో అవసరమైన సమాచారాన్ని వెల్లడించామని, చిన్నపాటి లోపాలు లేదా వివరాలపై వివాదాలను మాత్రమే ఆధారంగా చేసుకుని ఎన్నికను రద్దు చేయలేమని వాదించినట్లు సమాచారం. ఆస్తుల వివరాలపై వచ్చిన ఆరోపణలు ఎన్నికల ఫలితాన్ని ఎలా ప్రభావితం చేశాయో చూపాల్సిన అవసరం ఉందని కూడా   పేర్కొన్నారు.  ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం పిటిషన్‌పై తుది తీర్పు  అక్టోబర్ 14న ప్రకటించనున్నట్లు కోర్టు తెలిపింది. అప్పటిలోగా సంబంధిత పక్షాలు తమ రాతపూర్వక వాదనలు సమర్పించాలని సూచించింది. ప్రస్తుతం కోర్టు ముందున్న ప్రశ్న విజయ్ ఎన్నికను వెంటనే రద్దు చేయాలా అన్నది మాత్రమే కాదు; ఆయన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా,  లేదా అన్న అంశంపైనా కోర్టు తీర్పు వెలువరించనుంది.    [Verdict on Tamilnadu CM Vijay Election Case,    Madras High Court, Perambur Constituency, Election Affidavit, Tamil Nadu Politics, October 14 Verdict, Telugu One]
సింహం సింగిల్ గానే వస్తుందంటూ తన భుజాలను తానే చరచుకునే జగన్ ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ, తాను కన్ఫ్యూజన్ లో ఉన్నానని చెప్పకనే చెబుతున్నారు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ ఆయనలోని అయోమయానికీ, కన్ఫ్యూజన్ కు అద్దంపట్టింది.   గతంలో ఢిల్లీలో  కాక్రోచ్ జనతా పార్టీ  ఉద్యమం జరుగుతున్నప్పుడు, తాను కూడా   పోరాడే  బొద్దింకనని జగన్ ప్రకటించారు. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడేందుకు తాను కాక్రోచ్ ల ఉద్యమంలో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నానని విస్పష్ట సందేశాన్నిచ్చారు. జగన్ తన రాజకీయ జీవితంలో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా ఒక స్టేట్ మెంట్ ఇవ్వడం అదే ప్రథమం.  దీంతో జగన్ ఇక తన పొలిటికల్ మార్గాన్ని బీజేపీకి వ్యతిరేకంగా ఆరంభిస్తున్నారా అన్న అనుమానాలు అప్పట్లో వెల్లువెత్తాయి. దానికి కొనసాగింపుగానే జగన్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి దగ్గరౌతున్నారన్న విశ్లేషణలూ వెల్లువెత్తాయి. ఇక సీపీఐ నేతలు ఆయనతో భేటీ కావడం ఈ విశ్లేషణలకు బలం చేకూర్చాయి కూడా. అయితే తాను ఏ కూటమిలోనూ భాగస్వామిని కాబోవడం లేదని జగన్ వివరణ ఇచ్చుకున్నారు.  ఇప్పుడు తాజాగా ప్రభుత్వాధినేతగా పాతికేళ్ల ప్రస్థానం ( గుజరాత్ సీఎంగా, పీఎంగా)  పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలపడం ద్వారా జగన్ తన కన్ఫ్యూజన్ ను బయటపెట్టుకున్నారు. మోడీని అభినందిస్తూ ఆయన చేసిన ట్వీట్ లో ప్రజా సేవలో మోడీ చారిత్రాత్మక మైలు రాయిని చేరుకున్నారని పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత భారతదేశ ప్రధానమంత్రిగా పాతికేళ్లుగా  నిరంతర ప్రజా సేవను పూర్తి చేసుకున్న గౌరవనీయులైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ జగన్ సోషల్ మీడియాలో ఓ సందేశం షేర్ చేశారు. నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  మొత్తానికి ఒకే సమయంలో  రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న  రాజకీయ నాయకుడిగా జగన్ ను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  [YS Jagan Praises Narendra Modi, Jagan Modi Tweet, YCP, CJP,  Andhra Pradesh Politics, Jagan Political Strategy, Duel Standards, Confusion, Telugu One]
విజయవాడలో జరగనున్న దసరా ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు బుధవారం(సెప్టెంబర్ 7)  తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను కలిశారు. ఈ ఆహ్వానంపై విజయ్ సానుకూలంగా స్పందించారని, ఆయన ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది జరిగి 24 గంటలు కాక ముందే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తమిళనాడు సీఎం విజయ్ తో భేటీ అయ్యారు. తన భర్త అనిల్ లో కలిసి చైన్నైలో విజయ్ ను కలిసిన షర్మిల తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా తమిళనాడు సీఎం విజయ్ ను ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను షర్మిల స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయగా అది క్షణాల్లో వైరల్ అయ్యింది.  మొత్తంగా ఒక రోజు వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు సీఎం విజయ్ కు రెండు ఆహ్వానాలు అందడం విశేషం. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.    [YS Sharmil Meet Vijay Thalapathy, Tamil Nadu CM Vijay, AP Congress, Sharmila Vijay Meeting, Anjili Reddy Wedding, Vijay TVK, Andhra Pradesh Politics, Telugu One]
వైఎస్ కుటుంబంతో దశాబ్దాల పాటు కలిసి పనిచేసిన విజయసాయిరెడ్డి, 2024లో వైసీపీ  అధికారం కోల్పోయిన తర్వాత జగన్‌కు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌లో తన సొంత రాజకీయ పార్టీని స్థాపించే పనిలో  ఉన్నారు.ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి అనుసరిస్తున్న వ్యాహాలు, చేస్తున్న కుల, మత ప్రస్తావనలు సంచలనంగా మారాయి. ఆయన తీరు పట్ల సర్వత్రా చర్చ జరుగుతోంది.విజయసాయి ప్రతి అంశంలోనూ కుల, మత కోణాలను వెలికి తీస్తూ సంచలన రాజకీయమే తన బాణి, వాణి, బాట అని చాటుతున్నారు.  తాజాగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముస్లింలు, క్రైస్తవులు హిందూ దేవాలయాలకు వచ్చినప్పుడు అక్కడి ప్రసాదాన్ని గానీ, పవిత్ర వస్త్రాలను గానీ స్వీకరించరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే  సమయంలో హిందువులు చర్చిలు లేదా మసీదులకు వెళ్ళినప్పుడు మాత్రం అక్కడి నిబంధనలను పాటించాల్సి ఉంటుందన్నారు.  అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్‌లో తన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, దళితులను ఆలయాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునే అగ్రవర్ణాల వారికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించేలా ఒక కొత్త చట్టాన్ని తీసుకువస్తానని  ప్రకటించారు. సాధారణంగా లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులపరమైన విభజనలు ఉన్నప్పటికీ, కొన్నేళ్ల క్రితం వరకు మతపరమైన అసమ్మతి లేదా విభేదాల ఛాయలు  ఇసుమంతైనా కనిపించేవి కావు. అయితే ఇప్పుడు విజయసాయి రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో.. ఆంధ్రప్రదేశ్‌ను కేవలం రెండు కుటుంబాలు, రెండు వర్గాలు మాత్రమే పాలించాలా? అనే ప్రశ్నను లేవనెత్తారు. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలకు చెందినవారే ముఖ్యమంత్రి కావాలా? కాపులు, వెలమలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీల నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎందుకు ఉండకూడదని  ప్రశ్నించారు. కొత్త పార్టీ ప్రకటనకు విజయసాయి సన్నద్ధమౌతున్న వేళ విజయసాయి చేసిన ఈ వ్యాఖ్యలను ఆయన రాజకీయ వ్యూహంలో భాగంగానే చూడాల్సి ఉంటుంది. అయితే..  పార్టీ నిర్మాణం, విధివిధానాలు, ప్రధాన రాజకీయ లక్ష్యాలు పూర్తిగా వెల్లడించిన తరువాత మాత్రమే విజయసాయి  వ్యాఖ్యల రాజకీయ ప్రభావాన్ని ఏ మేరకు ఉంటుందన్నది తెలుస్తుంది.   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు  ఎప్పుడూ కీలక అంశమే.   రెడ్డి, కమ్మ, కాపు తదితర సామాజిక వర్గాల రాజకీయ ప్రాతినిధ్యంపై   చర్చ జరుగుతూనే ఉంది. 2024 ఎన్నికల సందర్భంలోనూ రాష్ట్ర రాజకీయాల్లో కుల సమీకరణాల ప్రభావంపై విశ్లేషణలు వెలువడ్డాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి అదే అంశాన్ని మరోసారి చర్చకు తీసుకువచ్చారు. అయితే కులం, మతం ప్రస్తావించడం మాత్రమే ఒక కొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది అవుతుందా?  అంటే పరిశీలకులు ఆ అవకాశం లేదని కుండబద్దలు కొడుతున్నారు.  ఏది ఏమైనా విజయసాయి రెడ్డి తాజా వ్యాఖ్యలు మత ప్రస్తావన, ఏపీ రాజకీయాలలో కొత్త చర్చకు తెరతీశాయని చెప్పవచ్చు.  అయితే ఈ రాజకీయ వ్యూహం ఆయన కొత్త పార్టీకి ఏ మాత్రం ప్లస్ అవుతుందన్నది అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు.  [Vijayasai Reddy Political Strategies, Sai Reddys New Party, Jagan, YCP, TDP, Caste politics, Religious politics, Reddy Vote Bank, AP Politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే.. ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరించేందుకు భారీ లైనప్ సిద్ధమైంది. ఈ వారం ఏకంగా 20కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ డిజిటల్ వేదికల్లోకి రాబోతున్నాయి. ముఖ్యంగా ‘ఎపిక్’, ‘మండాడి’, ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటితో పాటు విభిన్న జానర్లలో కొత్త కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామాకు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. లివిన్ రిలేషన్, ప్రేమ, తల్లిదండ్రుల ఆశలు, యువత తమ కలలను నెరవేర్చుకునే క్రమంలో ఎదుర్కొనే పరిస్థితుల నేపథ్యంలో కథ సాగుతుంది. అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. మండాడి: సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ తమిళ యాక్షన్ డ్రామా అక్టోబర్ 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సముద్ర తీర ప్రాంతంలో జరిగే పడవ పందేలు, ఇద్దరి మధ్య వైరం వంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులో ఉంది. ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్: పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో నటించిన ఈ మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. పోలీసు విధుల్లో ఎదురయ్యే సవాళ్లు, దర్యాప్తు చుట్టూ కథ తిరుగుతుంది. రిపోర్టింగ్ లైవ్: వార్తా ప్రపంచం, దర్యాప్తు అంశాలతో తెరకెక్కిన ఈ హిందీ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. థ్రిల్లర్ కథలను ఇష్టపడేవారికి ఇది మరో ఆప్షన్. లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్: హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన ఈ తెలుగు కామెడీ సిరీస్ అక్టోబర్ 9 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. పెళ్లి వయసు దాటిపోతున్న యువకుడిపై కుటుంబం, సమాజం నుంచి వచ్చే ఒత్తిళ్లు.. ఆ క్రమంలో చోటుచేసుకునే హాస్యభరిత సంఘటనల నేపథ్యంలో ఈ సిరీస్ రూపొందింది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ తెలుగు డబ్బింగ్ వెర్షన్, హారర్ చిత్రం ‘ఇన్సిడియస్: ఔట్ ఆఫ్ ద ఫర్దర్’ వంటి సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. ఖలీఫా: మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఐస్: మలయాళ క్రైమ్ మిస్టరీ సిరీస్ ‘ఐస్’ సోనీ లివ్‌లో అక్టోబర్ 9 నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. సస్పెన్స్, క్రైమ్ కథలను ఇష్టపడేవారికి ఇది మరో ఎంపిక. మొత్తానికి ఈ వారం ఓటీటీల్లో తెలుగు ప్రేక్షకులకు ‘ఎపిక్’, ‘మండాడి’, ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. వీటితో పాటు ఇతర భాషల థ్రిల్లర్లు, యాక్షన్ సినిమాలు కూడా ఉన్నాయి.  ఇది కూడా చదవండి: నానా పటేకర్‌ చివరి మెసేజ్.. అర్ధరాత్రి ఏం జరిగింది.. ఫ్రెండ్ ఆ మెసేజ్ చూసుంటే.?       [OTT Releases This Week, Telugu OTT Movies, Least Eligible Bachelor, Epic First Semester, Mandaadi Movie, Khalifa Movie, Pradhama Drishtiya Kuttakkar, Spider Man Brand New Day, Eyes Web Series]  
సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్‌కు ఇప్పుడు బాలీవుడ్‌లో తన సత్తా చాటుకునే అవకాశం వచ్చింది. గతంలో కొన్ని హిందీ సినిమాలకు పనిచేసిన ఆయన.. ఇప్పుడు ఏకంగా ఒక పూర్తి హిందీ సినిమా ఆల్బమ్‌కు సంగీతం అందిస్తున్నారు. యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘నయీ నవేలీ’ సినిమాకు పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను కూడా ఆయనే సమకూర్చారు. అక్టోబర్ 16న విడుదల కానున్న ఈ సినిమాపై జీవీ ప్రకాష్ చాలా ఆశలు పెట్టుకున్నారు. నిజానికి జీవీ ప్రకాష్‌కు బాలీవుడ్ కొత్తేమీ కాదు. గతంలో ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించడంతో పాటు ‘జోకర్’, ‘అగ్లీ’ వంటి చిత్రాలకు పాటలు కంపోజ్ చేశారు. అయితే ఒక హిందీ సినిమాకు పూర్తి స్థాయిలో సంగీతం అందించడం మాత్రం ‘నయీ నవేలీ’తోనే జరుగుతోంది. ఆనంద్ ఎల్. రాయ్ నిర్మాణంలో, మారి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న బాలాజీ మోహన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ జీవీ ప్రకాష్ కెరీర్‌లో కీలకమైన మైలురాయిగా మారనుంది. ఇక ఈ ఏడాది జీవీ ప్రకాష్‌కు కలిసొస్తున్నట్టే కనిపిస్తోంది. గతంలో ఆయన సంగీతం అందించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయినా.. ఈ ఏడాది మాత్రం వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, ‘ఇరుముడి’, ‘మండాడి’ వంటి సినిమాలతో బిజీగా ఉన్న ఆయనకు ‘అమరన్’ చిత్రానికి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు జాతీయ అవార్డు కూడా దక్కింది. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. సంగీతానికి భాషా సరిహద్దులు ఉండవని నమ్మే జీవీ ప్రకాష్.. తెలుగు, తమిళ సినిమాలకు పనిచేసినట్టే హిందీ చిత్రానికీ పూర్తి స్థాయిలో సంగీతం అందించడం మరో సవాలుగా భావిస్తున్నారు. ‘నయీ నవేలీ’ పాటలు ప్రేక్షకులకు నచ్చితే బాలీవుడ్‌లో మరిన్ని పెద్ద అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ హారర్ కామెడీ సినిమా జీవీ ప్రకాష్‌కు హిందీలో మంచి గుర్తింపు తీసుకొస్తుందా? ఆయన కెరీర్‌కు కొత్త మలుపు అవుతుందా? అనేది చూడాలి.     [GV Prakash Kumar, Nayyi Navelli Movie, GV Prakash Bollywood Debut, Yami Gautam Nayyi Navelli, Nayyi Navelli Release Date, GV Prakash Latest News, Aanand L Rai Movies]
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆయన.. ఇటీవల ‘ఐ యామ్ గేమ్’తో మలయాళంలోకి రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. విడుదల సమయంలో కొన్ని ప్రాంతాల్లో షోలు రద్దు కావడం, సినిమా కంటెంట్‌పై ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడంతో దుల్కర్‌తో పాటు ఆయన నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్‌పై కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది.  తాజాగా ఈ సినిమా ఫలితంపై దుల్కర్ సల్మాన్ స్పందించారు. సినిమా వైఫల్యంపై తనకు వచ్చిన విమర్శల్లో నిజం ఉందని అంగీకరిస్తూనే, ఒక సినిమాను రూపొందించడం అంత సులభమైన విషయం కాదని చెప్పారు. తెరపై కనిపించే తుది ఫలితాన్ని విశ్లేషించడం సులభమేనని, కానీ ఒక సినిమా వెనుక వందల మంది కష్టం ఉంటుందని వివరించారు. అందరూ తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ, కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అనుకున్నట్టుగా ఉండవని పేర్కొన్నారు. సినిమా నిర్మాణంలో తప్పులు జరిగితే వాటికి తననే బాధ్యుడిగా చూడాలని, తన టీమ్‌ను మాత్రం తాను ఎప్పుడూ సమర్థిస్తానని చెప్పడం ఆయన హుందాతనాన్ని చాటింది.  ‘ఐ యామ్ గేమ్’ విడుదలైన నెల రోజుల తర్వాత దుల్కర్ ఈ విధంగా స్పందించడంతో అభిమానులు కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఒక సినిమా విజయం సాధించడానికి నిర్దిష్టమైన ఫార్ములా ఏదీ ఉండదని, పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగడమే ముఖ్యమని ఆయన వ్యాఖ్యల సారాంశం. గతంలో తెలుగులో వరుస విజయాలు అందుకున్న దుల్కర్‌కు ఇటీవల ‘కాంత’, ‘ఐ యామ్ గేమ్’ సినిమాల ఫలితాలు నిరాశ కలిగించాయి. దీంతో ఇప్పుడు ఆయన తదుపరి తెలుగు సినిమా ‘ఆకాశంలో ఒక తార’పై దృష్టి పెట్టారు.  పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దుల్కర్ సరసన సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తున్నారు. కలలు, ఆశయాల నేపథ్యంలో సాగే ఈ సినిమా నవంబర్ 20, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ‘ఆకాశంలో ఒక తార’తో దుల్కర్ మళ్లీ విజయాల బాట పడతారా? తెలుగు ప్రేక్షకుల్లో తనకున్న క్రేజ్‌ను మరోసారి బాక్సాఫీస్ విజయంగా మార్చుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.     [Dulquer Salmaan, I'm Game Movie Failure, Dulquer Salmaan Latest News, Aakasamlo Oka Tara Movie, Dulquer Salmaan Upcoming Movies, Aakasamlo Oka Tara Release Date, Dulquer Salmaan Box Office Failure]
ప్రముఖ నటుడు నానా పటేకర్ మరణం సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. 75 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. అయితే మరణానికి కొన్ని గంటల ముందు ఆయన తన స్నేహితుడికి పంపిన ఓ మెసేజ్ ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.  నానా పటేకర్ గోవాలోని తన నివాసంలో ఉండగా అక్టోబర్ 8 తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి సుమారు 2.30 గంటలకు తనకు ఒంట్లో బాగోలేదని స్నేహితుడికి మెసేజ్ పంపించారు. అయితే అర్ధరాత్రి కావడంతో ఆ మెసేజ్‌ను స్నేహితుడు వెంటనే చూడలేదు. ఆ తర్వాత నానా స్వయంగా ఫోన్ చేసి తన పరిస్థితి గురించి చెప్పడంతో.. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆయన ఇంటికి చేరుకున్నాడు. నానా ఇంటికి వెళ్లిన స్నేహితుడికి అక్కడ కనిపించిన పరిస్థితి ఆందోళన కలిగించింది. అప్పటికే ఆయన ఒళ్లంతా చెమటలు పట్టి, క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్తున్నారు. దీంతో వెంటనే అంబులెన్స్ ని పిలిపించి, అనంతరం ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు నానాను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. 45 నిమిషాలకు పైగా సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. తెల్లవారుజామున 5.20 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. నానా పటేకర్ పంపించిన మెసేజ్‌ను ఆయన స్నేహితుడు వెంటనే చూసి ఉంటే.. మరింత ముందుగానే సహాయం అందేదేమోనన్న చర్చ ఇప్పుడు మొదలైంది. ఆయనను త్వరగా ఆసుపత్రికి తరలించి ఉంటే ఫలితం మరోలా ఉండేదా? అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: రణబాలి ట్రైలర్ లాంచ్‌లో రష్మిక మిస్సింగ్: ఆమె రాకపోవడానికి అసలు కారణమేంటి.?        [Nana Patekar Last Message, Nana Patekar Friend, Nana Patekar Death Reason, Nana Patekar Passed Away, Nana Patekar News, Nana Patekar, Telugu News]  
ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ మరణం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. 75 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూయడంతో అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మరణానికి సంబంధించి గోవాలోని పనాజీ పోలీసులు ‘అన్‌నేచురల్ డెత్’ కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసి, మరణానికి సంబంధించిన పరిస్థితులపై విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్ 8న గోవాలోని దోనా పౌలా ప్రాంతంలో ఉన్న తన నివాసంలో నానా పటేకర్ అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఆయనను బాంబోలిమ్‌లోని మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. అయితే మరణానికి సంబంధించిన పూర్తి వివరాలను నిర్ధారించేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు.  అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. పోలీసులు ‘అన్‌నేచురల్ డెత్’ కేసు నమోదు చేసినంత మాత్రాన నానా పటేకర్ మరణంలో ఏదైనా కుట్ర లేదా అనుమానాస్పద చర్య ఉన్నట్లు అర్థం కాదు. ఒక వ్యక్తి ఆసుపత్రికి మృతదేహంగా తీసుకొచ్చినప్పుడు, మరణానికి గల కారణాలను నిర్ధారించేందుకు చట్టపరమైన ప్రక్రియలో భాగంగా ఇలాంటి కేసు నమోదు చేయవచ్చు. ఈ కేసులోనూ మరణానికి సంబంధించిన పరిస్థితులను పరిశీలించడమే పోలీసుల ప్రాథమిక ఉద్దేశంగా తెలుస్తోంది.  మరోవైపు.. మరణానికి సంబంధించిన వివరాలను సేకరించడంతో పాటు అవసరమైన వైద్య, చట్టపరమైన ప్రక్రియలను పోలీసులు చేపట్టారు. విచారణలో సహజ మరణమేనని నిర్ధారణ అయితే కేసును ముగించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏవైనా అనుమానాస్పద అంశాలు బయటపడితే తదుపరి చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, నానా పటేకర్ మరణానికి గుండెపోటు కారణమై ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. పోలీసుల విచారణతో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.  నానా పటేకర్ దాదాపు ఐదు దశాబ్దాల పాటు హిందీ, మరాఠీ చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘పరిందా’, ‘క్రాంతివీర్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. ఆయన మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఒక విలక్షణ నటుడిని కోల్పోయింది.     [Nana Patekar Death, Nana Patekar Death Case, Nana Patekar Latest News, Nana Patekar Unnatural Death Case, Goa Police Nana Patekar, Nana Patekar Death Investigation, Nana Patekar Heart Attack, Bollywood News, Nana Patekar News Today, Nana Patekar Biography]
పెళ్ళి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ‘రణబాలి’. అక్టోబర్ 16న ఈ సినిమా థియేటర్లలోకి రానుండటంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రష్మిక హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో ఆమె ఎందుకు రాలేదనే ప్రశ్నలు మొదలయ్యాయి. అక్టోబర్ 8న హైదరాబాద్‌లో ‘రణబాలి’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండతో పాటు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు రష్మిక కూడా వస్తుందని ముందుగా ప్రచారం జరిగినప్పటికీ.. ఆమె కనిపించలేదు.  దీంతో ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు రష్మిక ఎందుకు రాలేదంటూ ఫ్యాన్స్ చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే 'రాకా' షూటింగ్ కారణంగానే రష్మిక ఈ ఈవెంట్ కి రాలేకపోయారని తెలుస్తోంది.  అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'రాకా' మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న రష్మిక కూడా ఆ షూటింగ్ లో పాల్గొతున్నట్లు సమాచారం. అందుకే ‘రణబాలి’ వెంట్‌కు రాలేకపోయిందని అంటున్నారు. ఈ విషయంపై విజయ్ కూడా స్పందించారు. రష్మిక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. షూటింగ్స్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా సమన్వయం చేసుకోవాల్సి వస్తోంది. అందుకే ట్రైలర్ లాంచ్ కు ఆమె రాలేకపోయినట్లు చెప్పారు. అంతేకాదు, నెక్స్ట్ జరిగే రణబాలి ప్రమోషనల్ కార్యక్రమాల కోసం రష్మిక వస్తుందని విజయ్ తెలిపారు. ఇది కూడా చదవండి: తమిళ రాజకీయాల్లో ట్విస్ట్.. పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న లతా రజనీకాంత్.?       [Ranabaali Trailer Launch Event, Rashmika Absent, Ranabaali Trailer, Ranabaali Movie, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Telugu Film News]  
యంగ్ హీరో నితిన్‌ నటిస్తున్న కొత్త సినిమా ‘అలియాస్ రుక్మిణి’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను సమర్పిస్తుండగా.. యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.  అయితే ఈ సినిమాలో రుక్మిణి ఎవరు? అనే ప్రశ్నకు మాత్రం చిత్ర బృందం ఇంకా సమాధానం చెప్పలేదు. అక్టోబర్ 13న రుక్మిణి గురించి కీలక వివరాలు వెల్లడించనున్నట్లు ప్రకటించి సస్పెన్స్‌ను మరింత పెంచారు. దీంతో నితిన్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇప్పటివరకు కథానాయిక వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్‌ కూడా వినూత్నంగా ఉంది. దర్శకుడు మురళీ కాంత్ ఈ సినిమా కథను నానికి వివరిస్తున్నట్లు వీడియో మొదలవుతుంది. ఇది కృష్ణుడి కథ అని దర్శకుడు చెప్పడంతో నాని ఆసక్తిగా వింటారు. అయితే అక్కడ కనిపించే పుస్తకాలన్నీ రుక్మిణి రాసినవని తెలిసి.. ‘ఈ రుక్మిణి ఎవరు?’ అని ప్రశ్నిస్తారు. అప్పటివరకు నిద్రపోతున్న నితిన్ మేల్కొని ‘రుక్మిణి నా భార్య’ అని చెప్పడంతో గ్లింప్స్ ముగుస్తుంది. ఈ చిన్న సన్నివేశంతోనే సినిమా కథపై ఆసక్తి పెంచారు. ఇక ఈ చిత్రంలో సాయికుమార్, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జోమోన్ టీ. జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు. సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. టైటిల్ గ్లింప్స్‌తోనే ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా.. డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 13న రుక్మిణి పాత్రకు సంబంధించిన వివరాలు బయటకు వస్తే ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది.      [Nithiin Alias Rukmini, Alias Rukmini Release Date, Nithiin New Movie, Nani Presents Alias Rukmini, Murali Kanth Devasoth, Alias Rukmini Heroine, Nithiin Movies, Vijai Bulganin, Telugu Movie Updates, Alias Rukmini December 4]
సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఒకప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పార్టీ ఏర్పాటు చేసి తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని అభిమానులు ఆశించారు. కానీ చివరి నిమిషంలో ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ రాజ్యసభకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రపతి కోటాలో తనను రాజ్యసభకు నామినేట్ చేయాలని కోరుతూ లతా రజనీకాంత్ కేంద్రంలోని కీలక నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి తదితరులతో ఆమె మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ కావచ్చని తెలుస్తోంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని చాలాకాలం పాటు చర్చ జరిగింది. 2017లో రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. ఆ తర్వాత పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేసినా, 2020 చివర్లో అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ పార్టీని ప్రారంభించడం లేదని స్పష్టం చేశారు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశంపై అప్పటివరకు ఉన్న అంచనాలకు తెరపడింది. అయితే ఇప్పుడు లతా రజనీకాంత్ పేరు తెరపైకి రావడం ఆసక్తిని పెంచుతోంది. ఆమెకు రాజ్యసభ సభ్యత్వం లభిస్తే రజనీకాంత్ కుటుంబం రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లవుతుంది.  తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రముఖుల ప్రభావం ఎప్పటి నుంచో ఉంది. ఎంజీఆర్, జయలలిత నుంచి తాజాగా విజయ్ వరకు సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పలువురు ప్రజాదరణతో కీలక స్థానాలకు చేరుకున్నారు.  తమిళనాడులో తమ రాజకీయ బలాన్ని పెంచుకోవాలని చూస్తోన్న బీజేపీకి.. రజనీకాంత్ కుటుంబంతో సాన్నిహిత్యం రాజకీయంగా ఉపయోగపడుతుందనే అంచనాలు వ్యక్తమయ్యాయి. లతా రజనీకాంత్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా రజనీ అభిమానుల మద్దతు పొందవచ్చని బీజేపీ భావిస్తోందన్న ప్రచారం ఉంది. ఇది కూడా చదవండి: విజయ్ దేవరకొండపై నెగెటివ్ ప్రచారం.. వెనకుండి నడిపిస్తున్నది ఎవరు.?       [Latha Rajinikanth Rajya Sabha, Rajya Sabha Nomination, Latha Rajinikanth, Rajinikanth Wife, Tamil Nadu Politics, Rajinikanth, BJP Tamil Nadu, Amit Shah, Rajnath Singh, Telugu News]  
విజయ్ దేవరకొండ మరోసారి తనపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపై స్పందించాడు. తన సినిమాలను టార్గెట్ చేస్తూ కొందరు కావాలనే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆరోపించాడు. ఒకే సమయంలో ఒకే రకమైన రీల్స్‌ను పలు అకౌంట్లలో షేర్ చేయడం వెనుక ఏదో వ్యవహారం ఉందని వ్యాఖ్యానించాడు. అసలు తనపై, తన సినిమాలపై ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఏడేళ్లు పట్టిందని విజయ్ చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా ‘రణబాలి’. ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాల దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. అక్టోబర్ 16న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో గురువారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తనపై, తన సినిమాలపై కొందరు కావాలనే నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని విజయ్ ఆరోపించాడు. ఇది కేవలం విద్వేషం మాత్రమే కాదని, కొన్ని గ్రూపులు ప్రత్యేకంగా పోస్టులు పెడుతున్నాయని చెప్పాడు. ఇందుకు ఉదాహరణగా ఒకే రకమైన రీల్‌ను పలు అకౌంట్లలో ఒకేసారి షేర్ చేస్తున్న విషయాన్ని ప్రస్తావించాడు. ‘తెలుగు సినిమా రణబాలికి వెళ్లకుండా జైలర్ 2కి వెళ్దాం’ అనే తరహా సందేశంతో ఒకే రీల్‌ను పలు అకౌంట్లలో షేర్ చేస్తున్నారని విజయ్ తెలిపాడు. ఇలా ఒకే సమయంలో ఒకే కంటెంట్ ప్రచారం అవుతుంటే, దాని వెనుక ఎవరైనా ఉండి డబ్బులు ఖర్చు చేస్తున్నారేమోనని తనకు అనిపిస్తోందని వ్యాఖ్యానించాడు.  తనపై, తన సినిమాలపై జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవడానికి ఏడేళ్లు పట్టిందని విజయ్ చెప్పాడు. గతేడాది ఈ వ్యవహారంపై తనకు స్పష్టత వచ్చిందని వెల్లడించాడు. ఇక తనను విమర్శించే వారి గురించి కూడా విజయ్ ఘాటుగా స్పందించాడు. తన కలలు, తన కష్టం ఇతరులకు అనవసరంగా అనిపిస్తే తాను ఆగిపోవాలా? తన నిజాయతీని అహంకారంగా భావిస్తే నటించడం మానేయాలా? తనపై తనకున్న నమ్మకాన్ని బలుపుగా చూస్తే తాను ఎందుకు తగ్గాలని ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలతో తనను విమర్శించే వారికి గట్టిగానే సమాధానం ఇచ్చాడు. ఇది కూడా చదవండి: కామ్రేడ్ కళ్యాణ్ సినిమా రివ్యూ       [Vijay Deverakonda On Negative Trolls, Ranabaali Trailer Launch, Vijay Deverakonda Comments, Ranabaali Movie, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Telugu Film News]  
నటీనటులు: శ్రీ విష్ణు, మహిమా నంబియార్, రాధికా శరత్‌కుమార్, వెన్నెల కిషోర్, సుదర్శన్, షైన్ టామ్ చాకో, సత్య.   సాంకేతిక వర్గం: రచన: జానకిరామ్ మారెళ్ల, భాను భోగవరపు, నందు సవిరిగాన సంగీతం: విజయ్ బుల్గానిన్ సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్ ఎడిటింగ్: చోటా కె ప్రసాద్ దర్శకత్వం: జానకిరామ్ మారెళ్ల నిర్మాతలు: వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి సమర్పణ: కోన వెంకట్   శ్రీ విష్ణు తనదైన శైలిలో ప్రేక్షకులను నవ్విస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్న ఆయన, ఇప్పుడు కామ్రేడ్ కళ్యాణ్ (Comrade Kalyan) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.   కథ: కళ్యాణ్ (Sree Vishnu) తన ఊరిలో ఒక పాత థియేటర్‌ను నడుపుతుంటాడు. ఆ ఊరిలో కమ్యూనిజం ప్రభావం ఎక్కువగా ఉండటంతో, ఆర్. నారాయణమూర్తి సినిమాలు ఆడిస్తూ డబ్బులు సంపాదించాలని చూస్తాడు. మరోవైపు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ (Shine Tom Chacko) నక్సలైట్ల కోసం తీవ్రంగా గాలిస్తుంటాడు. ఈ క్రమంలో ఒరియా అమ్మాయి సితార (Mahima Nambiar)తో కళ్యాణ్ ప్రేమలో పడతాడు. మరోపక్క, తన తల్లి (Radhikaa) చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కుంటూ కళ్యాణ్‌కు సమస్యలు తెచ్చిపెడుతుంటుంది. జీవితంలో ఎదగాలంటే దుబాయ్ బాబు (Satya) వల్లే అవుతుందని కళ్యాణ్ నమ్ముతాడు. అయితే, తన అన్నయ్య చేసిన అప్పుల వల్ల ఒక వ్యక్తి తనను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నాడని సితార చెబుతుంది. ఆమె అప్పు తాను తీర్చాలని అనుకున్న కళ్యాణ్, ఊహించని విధంగా కామ్రేడ్ కళ్యాణ్ గా మారుతాడు. ఎందుకు? ఆ తర్వాత ఏమైంది? అన్నది మిగతా కథ.   విశ్లేషణ: శ్రీ విష్ణు తన పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించినా, స్క్రిప్ట్ లో పెద్దగా బలం లేదు. ఆయన డైలాగ్ డెలివరీ కూడా రొటీన్ గా అనిపిస్తుంది. కొత్తదనం కోసం ఆయన తన పాత శైలి నుంచి బయటకు రావాలి. కొన్ని సన్నివేశాల్లో మహిమా నంబియార్ నటన పర్వాలేదనిపించినా, ఆమె మేకప్ అంతగా సెట్ కాలేదు. రాధికా శరత్‌కుమార్, సుదర్శన్ పాత్రలను సరిగ్గా వాడుకోలేదు. సత్య, వెన్నెల కిషోర్ నవ్వించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. షైన్ టామ్ చాకో నటన అతిగా అనిపిస్తుంది. రచయితలు భాను, నందు గతంలో మంచి కథలు, మాటలు అందించినా, ఈ సినిమా లో వారు ఆశించిన స్థాయిలో మెప్పించలేదు.  విజయ్ బుల్గానిన్ పాటలు బాగున్నాయి, కానీ నేపథ్య సంగీతం ఇంకా మెరుగ్గా ఉండొచ్చు. కథ, స్క్రీన్‌ప్లే 80ల నాటి సినిమాలను గుర్తుచేస్తాయి. 2026లో ఉన్న ప్రేక్షకులకు ఈ కథ ఎలా ఉండబోతుందో ముందే అర్థమైపోతుంది. కామెడీ వర్కౌట్ కాలేదు, రొటీన్ డైలాగులతో ప్రతి సన్నివేశం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. దర్శకుడు జానకిరామ్ (Janakiram Marella) తన విజన్‌ను తెరపై చూపించడానికి కష్టపడినా, సినిమా వేగాన్ని సరిగ్గా నడిపించలేకపోయాడు. పాతకాలం నాటి కథనం చాలా చోట్ల విసుగు తెప్పిస్తుంది. అయితే, సినిమా రన్‌టైమ్ తక్కువగా ఉండటం, నిర్మాణ విలువలు బాగుండటం కాస్త కలిసొచ్చే అంశం. పాత కథ అయినా పర్వాలేదు అనుకునే వారు ఈ సినిమాను ఒకసారి ట్రై చేయవచ్చు.   ప్లస్ పాయింట్స్: కొన్ని సన్నివేశాల్లో శ్రీ విష్ణు టైమింగ్ దుబాయ్ షేక్ పాత్రలో సత్య పాటలు నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్: నెమ్మదిగా సాగే కథనం మెరుపులు లేని స్క్రీన్‌ప్లే ఆకట్టుకోని డైలాగులు రొటీన్‌గా అనిపించే శ్రీ విష్ణు మ్యానరిజమ్స్   చివరి గా: పాత కథ అంతే పాత కథనం వెరసి నీరసం!!    రేటింగ్: 2.25/5   గమనిక: ఈ రివ్యూలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతమైనవి. దీనికి సంస్థకు ఎలాంటి బాధ్యత లేదు. పాఠకులు తమ సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవాలి.
తెలుగువారి ఇళ్లల్లో ఆదివారం ఉదయమైనా, విశేషమైన పండుగల వేళ అయినా అందరూ ఎంతో సంబరంగా చేసుకునే ప్రత్యేక ఉపహారాల్లో పూరీ ఒకటి. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ఇంట అందరూ ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుంటూ తినే ఈ పూరీలలో ఒకే ఒక్క సమస్య ప్రతీ ఇంటా ఇల్లాళ్లను తరచూ వేధిస్తూ ఉంటుంది. అదేంటంటే పూరీలు కడాయిలోని నూనెను విపరీతంగా పీల్చేయడం. అలా నూనె జిడ్డుగా మారిన పూరీలు తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాకపోగా, రుచిని మరియు తినే ఉత్సాహాన్ని పూర్తిగా పాడుచేస్తాయి. అయితే ఈ నిత్యం ఎదురయ్యే సమస్యకు సులువైన, అద్భుతమైన పరిష్కారంతో ప్రముఖ కంటెంట్ క్రియేటర్ అనితా మోహన్ కొన్ని ప్రతిరోజూ పాటించదగిన కిచెన్ హ్యాక్స్ పంచుకున్నారు. చాలామంది పూరీ పిండిని నలిపేటప్పుడు చపాతీ పిండిలా బాగా మెత్తగా కలుపుతుంటారు, కానీ అది చాలా పెద్ద పొరపాటు. అనితా మోహన్ చెప్పిన వివరణ ప్రకారం, పూరీ పిండిని ఎప్పుడూ తగినన్ని నీళ్లు మాత్రమే పోస్తూ చాలా గట్టిగా, బిగుతుగా కలుపుకోవాలి. పిండి ఎంత గట్టిగా ఉంటే, పూరీలు వేయించేటప్పుడు నూనెను అంత తక్కువగా పీల్చుకుని, పూరి గుల్లగా బంతిలా పొంగుతుంది. దీనితో పాటు పిండి కలిపే సమయంలో కేవలం ఒకట్రెండు స్పూన్ల ఉప్మా రవ్వ (సుజీ)ని కలిపితే చాలు. ఇది పూరీలు వేడెక్కిన తర్వాత కూడా త్వరగా మెత్తబడిపోకుండా, ఎక్కువసేపు కరకరలాడుతూ ఉండేలా చేస్తుంది. మరొక ముఖ్యమైన వినూత్న చిట్కా ఏమిటంటే, పిండి కలిపిన వెంటనే పూరీలు ఒత్తేసి వేయించడం కంటే, ఆ పిండిపై మూతపెట్టి కనీసం 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చల్లబడిన పిండితో పూరీలు ఒత్తి వేడి నూనెలో వేసినప్పుడు, ఉష్ణోగ్రత వైవిధ్యం వల్ల పిండి నూనెను అస్సలు పీల్చుకోదు. ముఖ్యంగా పండుగ రోజుల్లో లేదా ఇంట్లో గెస్టులు వచ్చినప్పుడు ముందుగానే పిండి సిద్ధం చేసుకునేవారికి ఈ ఫ్రిజ్ టెక్నిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక పూరీలు వేయించడానికి కడాయి పొయ్యిపై పెట్టి నూనె బాగా కాగుతున్న సమయంలో, ఆ నూనెలో చిటికెడు ఉప్పు వేయాలి. ఇలా వేసిన ఉప్పు నూనెపై ఒక రక్షక పొరలా పనిచేసి పూరీలు ఎక్కువ నూనెను పీల్చకుండా అడ్డుకుంటుంది. అయితే వేసే ఉప్పు పరిమాణం చాలా చిటికెడు మాత్రమే ఉండాలి, లేకపోతే వేడి నూనె పైకి తుల్లే ప్రమాదం ఉందని గుర్తుంచుకోవాలి. చివరగా, పూరీలు రుద్దేటప్పుడు చాలామంది పొడి పిండిని చల్లుతుంటారు. ఆ పొడి పిండి వేడి నూనెలో రాలిపోయి మాడిపోవడం వల్ల నూనె రంగు మారి నూనె పాడవుతుంది. అందుకే పూరీ పీట, లంబకోణ కర్రకు కాస్త నూనె రాసి మాత్రమే పూరీలను సమానంగా ఒత్తుకోవాలి. నూనె పొగలు రాకుండా బాగా వేడెక్కిన తర్వాతే మీడియం-హై ఫ్లేమ్‌పై పూరీలను వేయించాలి. చల్లటి లేదా తక్కువ వేడి ఉన్న నూనెలో వేస్తే పూరీ స్పాంజిలా నూనె మొత్తాన్ని తాగేస్తుంది. ఈ చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే తక్కువ నూనెతో, ఎంతో హెల్దీగా, బంతిలా పొంగే కరకరలాడే రుచికరమైన పూరీలను మీ ఇంట్లోనే అత్యంత సులభంగా తయారు చేసుకోవచ్చు!       [Poori Making Tips, Crispy Poori, Oil Free Cooking Tips, Anita Mohan, Poori Recipe, Kitchen Hacks, Suji Poori, Perfect Puffy Poori, Cooking Tips Telugu, Indian Breakfast Recipes]  
సూది గుచ్చుకుంటే విపరీతమైన భయం వేస్తుందా? ఇంజెక్షన్ తీసుకోవడం లేదా క్యాన్యులా అమర్చుకోవడం వంటి చిన్న వైద్య ప్రక్రియల సమయంలో కలిగే నొప్పులు మిమ్మల్ని కలవరపెడుతున్నాయా? అయితే మీకో అద్భుతమైన శుభవార్త! మీ ఫేవరెట్ మ్యూజిక్ వినడం ద్వారా ఇటువంటి శారీరక నొప్పులను గణనీయంగా తగ్గించుకోవచ్చని ఇటీవల జరిగిన ఒక క్లినికల్ పరిశోధనలో సైంటిస్టులు నిరూపించారు. నొప్పు నివారణకు మందులు వాడకుండానే సంగీతం ఒక నాచురల్ నివారిణిగా పనిచేస్తుందని ఈ వైద్య పరిశోధన స్పష్టం చేస్తోంది. పరిశోధకులు నిర్వహించిన ప్రత్యేక ప్రయోగాల్లో, తమకు ఇష్టమైన పాటలు లేదా సంగీతాన్ని విన్న వ్యక్తులలో నొప్పిని తట్టుకునే శక్తి (Pain Tolerance) గణనీయంగా పెరిగినట్లు తేలింది. సాధారణంగా సంగీతం వినడానికి ముందు సగటున 33.8 సెకన్ల పాటు మాత్రమే నొప్పిని ఓర్చుకోగలిగిన వారు, తమకు నచ్చిన ట్యూన్స్ వింటున్న సమయంలో ఏకంగా 56.2 సెకన్ల పాటు నొప్పిని తట్టుకోగలిగారు. అంటే సంగీతం వినడం వల్ల వారి నొప్పి सहनశక్తి సుమారు 66 శాతం మేర పెరిగిందని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. మ్యూజిక్ పూర్తయిన తర్వాత కూడా ఈ ప్రభావం కొంతసేపు ఉండి, నొప్పి ఓర్పు సమయం 45.4 సెకన్లుగా నమోదైంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న మొత్తం 20 మంది ప్రయోగ అభ్యర్థులలో ఏకంగా 85 శాతం మంది (17 మంది) తమకు ఇష్టమైన సంగీతం వింటున్నప్పుడు తక్కువ నొప్పిని అనుభవించామని, ఎక్కువ సేపు ఓర్పు ప్రదర్శించగలిగామని ధృవీకరించారు. అంతేకాకుండా శస్త్రచికిత్సలు లేదా చిన్నపాటి వైద్య ప్రక్రియల సమయంలో రోగులకు నచ్చిన పాటలను ప్లే చేయడం వల్ల వారిలో ఆందోళన స్థాయిలు (Anxiety Scores) భారీగా తగ్గాయి. అంతేకాక కోలుకునే వేగం (Quality of Recovery) సూచికలలో 123 శాతానికి పైగా ఆశించిన స్థాయి కంటే మెరుగైన ఫలితాలు నమోదైనట్లు సైంటిస్టులు గుర్తించారు. మనస్సును మైమరిపించే పాటలు వింటున్నప్పుడు మెదడులో విడుదలయ్యే ఎండోర్ఫిన్లు మరియు డోపమైన్ వంటి కెమికల్స్ నొప్పి సంకేతాల తీవ్రతను తగ్గిస్తాయి. ముఖ్యంగా, రోగికి సంబంధం లేని సాధారణ సంగీతం కంటే, వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఎంచుకున్న ఫేవరెట్ పాటలే 85 శాతానికి పైగా ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని నిపుణులు తేల్చారు. ఆసుపత్రుల్లో ఇంజెక్షన్లు, చిన్న సర్జరీలు, లేదా మోకాలి ఆపరేషన్ల తర్వాత ఇచ్చే నొప్పి నివారణ మందుల (Analgesics) వాడకాన్ని తగ్గించడంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుందని వైద్య రంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. [Music Therapy, Pain Relief, Pain Tolerance, Clinical Research, Favorite Music, Endorphins, Dopamine, Anxiety Reduction, Postoperative Recovery, Pain Management]  
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే.. భారత వైమానిక దళం ఎలా మొదలైందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..! ఈనాడు భారతదేశ గగనతలాన్ని కాపాడుతున్న భారతీయ వాయుసేన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దళాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆకాశంలో శబ్దవేగాన్ని మించి దూసుకెళ్లే రఫేల్, సుఖోయ్, తేజస్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు భారత సైనిక సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. అయితే ఈ ప్రస్థానం ఎలా ప్రారంభమైందో తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. కేవలం నాలుగు పాత రకం రెండు చక్రాల విమానాలు, ఐదుగురు యువ పైలట్లతో చాలా చిన్నదిగా ప్రారంభమైన వాయుసేన, ఈ రోజు ప్రపంచం మెచ్చే స్థాయికి ఎదిగింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 8న జరుపుకునే ఎయిర్ ఫోర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని భారతీయ వాయుసేన ఆవిర్భావం, దాని తొలి అడుగుల వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్రను తెలుసుకుంటే.. ఎప్పుడు ప్రారంభమైంది? భారతీయ వాయుసేన అధికారికంగా 1932 అక్టోబర్ 8న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాక్ట్ ప్రకారం బ్రిటిష్ ఇండియాలో రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు అనుబంధ దళంగా రూపుదిద్దుకుంది. ఆ సమయంలో బ్రిటన్‌లోని క్రాన్‌వెల్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కాలేజీలో శిక్షణ పొందిన ఐదుగురు భారతీయ యువకులు పైలట్లుగా బాధ్యతలు స్వీకరించారు. హరీష్ చంద్ర సిర్కార్, సుబ్రతో ముఖర్జీ, భూపేంద్ర సింగ్, ఐజాద్ బక్ష్ అవాన్ , అమర్జీత్ సింగ్ ఈ చారిత్రక ఘట్టంలో భాగమయ్యారు. మరో యువకుడు జె.ఎన్. టాండన్ ఎత్తు తక్కువగా ఉండటం వల్ల విమానం నడపడానికి అవకాశం లభించక, సైనిక సరుకుల రవాణా విభాగానికి మారాల్సి వచ్చింది. రెండు చక్రాల విమానాలతో ప్రారంభం.. వాయుసేన ఏర్పడిన మరుసటి సంవత్సరం అంటే 1933 ఏప్రిల్ 1న కరాచీలోని డ్రిగ్ రోడ్ ప్రాంతంలో మొదటి స్క్వాడ్రన్ రూపుదిద్దుకుంది. ఈ స్క్వాడ్రన్‌కు 'ఎ' ఫ్లైట్ అని పేరు పెట్టారు. దీనికి నాయకత్వం వహించడానికి మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అనుభవజ్ఞుడైన డెసిల్ బౌచర్ ముందుకు వచ్చారు. ఈ విభాగం దగ్గర ఉన్నవి కేవలం నాలుగు వెస్ట్‌ల్యాండ్ వాపిటి రకానికి చెందిన రెండు చక్రాల విమానాలు మాత్రమే. ఇవి వేగంగా దాడి చేసే యుద్ధ విమానాలు కావు, కేవలం నిఘా , సైన్యానికి సహకారం అందించడానికి మాత్రమే ఉపయోగపడేవి. అయినప్పటికీ భారతీయ పైలట్లు తమ విమానయాన ప్రయాణాన్ని వీటితోనే ఎంతో  ఆత్మవిశ్వాసంతో ప్రారంభించారు. స్వాతంత్ర్య కాంక్షే ఊపిరి పోసింది.. ఆ రోజుల్లో డ్రిగ్ రోడ్‌లోని సైనిక నివాస ప్రాంగణాన్ని అక్కడి సిబ్బంది గాంధీ హిల్ అని పిలుచుకునేవారు. అప్పటికే దేశంలో స్వాతంత్ర్య కాంక్ష ఎంత బలంగా ఉందో ఈ చిన్న అంశం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 1937లో వాయుసేన తన మొదటి ప్రత్యక్ష సైనిక చర్యలను వజీరిస్థాన్ ప్రాంతంలో నిర్వహించింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఈ దళం వేగంగా విస్తరించింది. బర్మా సరిహద్దుల్లో, ఇంఫాల్ ప్రాంతంలో శత్రువులపై సాధించిన విజయాలు భారత వాయుసేన ప్రతిష్టను ప్రపంచానికి చాటిచెప్పాయి. ఈ సేవలను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం 1945లో దీనికి 'రాయల్' అనే గౌరవ పదాన్ని చేర్చి రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని పేరు మార్చింది. ఆ తర్వాత 1950లో  గణతంత్ర రాజ్యంగా మారినప్పుడు 'రాయల్' అనే పదాన్ని తొలగించి మళ్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గా స్థిరపరిచారు. వాయుసేన పితామహుడు సుబ్రతో ముఖర్జీ.. ఆరంభంలో ఉన్న ఐదుగురు పైలట్లలో ఒకరైన సుబ్రతో ముఖర్జీ భారత వాయుసేన చరిత్రలో మైలురాయిగా నిలిచారు. ఈయన 1954 ఏప్రిల్ 1న భారతీయ వాయుసేనకు తొలి భారతీయ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. అందుకే ఈయన్ను భారతీయ వాయుసేన పితామహుడిగా గౌరవిస్తారు. ఇక తొలిసారిగా నాలుగు చిన్న విమానాలతో మొదలైన మొదటి స్క్వాడ్రన్ ఇప్పటికీ క్రియాశీలంగా పనిచేస్తుండటం విశేషం. ప్రస్తుతం 'ది టైగర్స్' అని పిలిచే ఈ స్క్వాడ్రన్ గ్వాలియర్ కేంద్రంగా మిరాజ్ 2000 యుద్ధ విమానాలను నడుపుతోంది. వాయుసేనకు ఆదర్శ వాక్యం ఇదే.. భగవద్గీతలోని 11వ అధ్యాయం నుండి తీసుకున్న 'నభః స్పృశం దీప్తం' అంటే 'గగనాన్ని దేదీప్యమానంగా స్పృశించు' అనే  సూక్తిని వాయుసేన తన ఆదర్శవాక్యంగా స్వీకరించింది. తొంబై ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న భారత వాయుసేన, కరాచీలోని చిన్న విమానాశ్రయం నుంచి ప్రయాణం మొదలుపెట్టి నేడు ఆధునిక సాంకేతికతతో ఆకాశమే హద్దుగా దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది.                                                                                                                                                 *రూపశ్రీ.
మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..! నేటి వేగవంతమైన ప్రపంచంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ఎంతగానో ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రతి ఏటా అక్టోబరు 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు. మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడం , ఈ విషయాలపై బహిరంగంగా మాట్లాడటాన్ని ప్రోత్సహించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ప్రస్తుత కాలంలో ఉద్యోగ ఒత్తిడి, సరిపడా నిద్ర లేకపోవడం, సోషల్ మీడియా అధికంగా వాడటం , వ్యక్తిగత సమస్యలు మన మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయి. మనసు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండటానికి రోజువారీ జీవితంలో అలవర్చుకోవాల్సిన కొన్ని సులభమైన అలవాట్లు ఫాలో అవ్వాలి.  అవేంటో తెలుసుకుంటే.. నిద్ర.. తగినంత నిద్రపోవడం ప్రశాంతమైన మనస్సుకు పునాది లాంటిది. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి మేల్కొనడం అలవాటు చేసుకోవాలి. రాత్రి వేళల్లో ఎక్కువ సమయం మొబైల్ వాడటం తగ్గించడం వల్ల నాణ్యమైన నిద్ర పడుతుంది. ఇది రోజంతా మంచి మూడ్, ఏకాగ్రత , ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాయామం.. క్రమం తప్పకుండా చిన్నపాటి వ్యాయామం చేయడం వల్ల మానసిక అలసట దూరమవుతుంది. రోజూ అర గంట పాటు నడవడం, యోగా చేయడం లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల శరీరంతో పాటు మనస్సు కూడా ఉత్తేజితమవుతుంది. డిజిటల్ బ్రేక్.. సామాజిక మాధ్యమాలకు కాసేపు దూరంగా ఉండటం మనస్సుకు మంచిది. ఎప్పుడూ ఫోన్ చూడటం, ఇతరుల జీవితాలతో మనల్ని పోల్చుకోవడం వల్ల తెలియకుండానే ఒత్తిడి పెరుగుతుంది. అందుకే రోజులో కొంత సమయం డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉంటూ డిజిటల్ బ్రేక్ తీసుకోవడం అవసరం. ఒత్తిడి.. మనసులోని బాధను లేదా ఒత్తిడిని లోపలే దాచుకోకుండా నమ్మకమైన వ్యక్తులతో పంచుకోవాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా ఆత్మీయులతో సమస్యల గురించి మాట్లాడటం వల్ల మనసు తేలికపడుతుంది. ధ్యానం.. రోజూ కొన్ని నిమిషాలు ధ్యానం , ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని నెమ్మదిగా శ్వాస తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి మనసు అదుపులోకి వస్తుంది. ఆహారం.. మనం తినే ఆహారం కూడా మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్లు ఉన్న సమతుల ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం తగ్గించి, తగినన్ని నీళ్లు తాగుతుండాలి. విరామం.. పని లేదా చదువు మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోవడం చాలా ముఖ్యము. గంటల తరబడి ఒకేచోట కూర్చుని పనిచేయడం వల్ల మానసిక అలసట పెరుగుతుంది. మధ్యమధ్యలో కాసేపు నడవడం లేదా కళ్లకు విశ్రాంతి ఇవ్వడం వల్ల తిరిగి ఉత్సాహంగా పనిచేయవచ్చు. పర్సనల్ టైమ్.. వ్యక్తిగత సమయాన్ని కేటాయించుకోవడం మర్చిపోకూడదు. మనసుకు నచ్చిన సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, మొక్కల పెంపకం లేదా ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టడం వల్ల రోజువారీ ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ చిన్న మార్పులను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని సులభంగా కాపాడుకోవచ్చు.                                                                                                                                                   *రూపశ్రీ.
చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడం, అరికాళ్లు మంటగా అనిపించడం, నడిచేటప్పుడు పాదాల్లో మంట లేదా సూదులు గుచ్చినట్లుగా ఉండటం వంటి సమస్యలను చాలామంది సాధారణంగా తీసుకుంటారు. ముఖ్యంగా షుగర్ ఉన్నవారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అవి మధుమేహం వల్లే వచ్చాయని భావిస్తుంటారు. అయితే ప్రతి సందర్భంలోనూ కారణం షుగర్ మాత్రమే కాకపోవచ్చు. మన శరీరంలో నరాల పనితీరు సక్రమంగా ఉండటానికి కొన్ని ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు అవసరం. వీటిలో Vitamin B12, Vitamin B1, Folate, Calcium వంటి పోషకాలు ముఖ్యమైనవి. వీటిలో ఏదైనా లోపించినప్పుడు నరాలపై ప్రభావం పడి చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, మొద్దుబారడం, మంట, బలహీనత లేదా నడకలో అసౌకర్యం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో Vitamin D లోపం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఇలాంటి లక్షణాలతో సంబంధం కలిగి ఉండవచ్చు. అదే సమయంలో మధుమేహం ఎక్కువకాలం నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీనిని Diabetic Neuropathy అంటారు. ముఖ్యంగా పాదాల్లో మంట, నొప్పి, తిమ్మిర్లు, స్పర్శ తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కేవలం షుగర్‌నే కారణంగా భావించకుండా, అసలు కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. అయితే శరీరంలో పోషక లోపం ఉందని లక్షణాలను బట్టి మాత్రమే నిర్ణయించలేం. అవసరమైన సందర్భాల్లో వైద్యులు సూచించే రక్త పరీక్షలు, షుగర్ పరీక్షలు, Vitamin B12 వంటి పోషకాల స్థాయిలను పరిశీలించడం ద్వారా సమస్యకు కారణం ఏమిటో తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో చేతులు, కాళ్లలో తిమ్మిర్లు ఎందుకు వస్తాయి? అరికాళ్లలో మంటకు షుగర్‌తో పాటు ఇంకా ఏ కారణాలు ఉండవచ్చు? Vitamin B12, B1, Folate, Calcium వంటి పోషకాల లోపాన్ని ఎలా గుర్తించాలి?  వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో Dr. Swathi సులభమైన తెలుగులో వివరిస్తున్నారు. తరచుగా చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడం, పాదాల్లో మంట లేదా నొప్పి ఉండటం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వాటి వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడం అవసరం. ఈ లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే లేదా తీవ్రంగా ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి. గమనిక: ఈ కథనం మరియు వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీకు ఉన్న లక్షణాలకు కారణాన్ని స్వయంగా నిర్ధారించుకోకుండా, అవసరమైన పరీక్షలు మరియు చికిత్స కోసం అర్హత కలిగిన వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
డయాబెటిస్ ఉన్నవారిలో తరచుగా కనిపించే కొన్ని సమస్యలు రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా కూర్చొని లేవగానే తల తిరగడం, నిలబడినప్పుడు తూలినట్లు అనిపించడం, శరీరంలో బలహీనత, కండరాల బలం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. తల తిరగడానికి షుగర్ కారణమా? లేక చెవి, మెదడు, మెడకు సంబంధించిన సమస్యల వల్ల Vertigo వస్తుందా? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. ఈ వీడియోలో డాక్టర్ ప్రవీణ్ కుమార్ డయాబెటిస్ మరియు Vertigo గురించి సులభమైన తెలుగులో ముఖ్యమైన విషయాలను వివరిస్తున్నారు. షుగర్ పూర్తిగా Zero అవుతుందా? డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయగలమా? Type 1 Diabetes, Type 2 Diabetes మధ్య తేడా ఏమిటి? శరీరంలో Insulin Resistance ఎలా ఏర్పడుతుంది? డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు అవసరం? వంటి సాధారణ సందేహాలకు ఈ వీడియోలో వివరణ లభిస్తుంది. డయాబెటిస్‌లో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా పర్యవేక్షణ, శారీరక చురుకుదనం వంటి అంశాల ప్రాధాన్యతను కూడా తెలుసుకోవచ్చు. దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే శరీరంపై ఎలాంటి ప్రభావాలు ఉండవచ్చు? కండరాల బలం ఎందుకు తగ్గుతుంది? బలహీనత, లైంగిక సమస్యలు వంటి ఇబ్బందులకు డయాబెటిస్‌తో సంబంధం ఉందా? అనే విషయాలను కూడా డాక్టర్ వివరిస్తారు. ఇక తల తిరగడం లేదా Vertigo విషయానికి వస్తే ప్రతి తల తిరుగుడూ ఒకే కారణంతో ఉండదు. Vertigoలో వివిధ రకాలు ఉంటాయి. ముఖ్యంగా తల లేదా శరీరాన్ని ఒక పొజిషన్ నుంచి మరో పొజిషన్‌కు మార్చినప్పుడు అకస్మాత్తుగా తల తిరిగినట్లు అనిపించే BPPV (Benign Paroxysmal Positional Vertigo) గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అలాగే చెవికి సంబంధించిన సమస్యలు, Aural Vertigo, మెడకు సంబంధించిన Cervical Spondylosis, శరీర స్థితి (Posture) వంటి కారణాల వల్ల కూడా తల తిరగడం లేదా బ్యాలెన్స్ సమస్యలు రావచ్చని వివరిస్తున్నారు. తల తిరుగుతున్నప్పుడు అసలు కారణాన్ని గుర్తించడం ఎందుకు ముఖ్యమో, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలో కూడా ఈ వీడియో ద్వారా అర్థం చేసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షుగర్‌ను క్రమం తప్పకుండా ఎలా మానిటర్ చేయాలి? శరీరంలో బలహీనత, కండరాల నష్టం రాకుండా ఎలాంటి జీవనశైలి పాటించాలి? Vertigo ఉన్నప్పుడు చెవుల ఆరోగ్యం, శరీర భంగిమ, రోజువారీ అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి ఉపయోగకరమైన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. అదేవిధంగా Homeopathy Approach గురించి కూడా ఈ వీడియోలో ప్రస్తావించారు. అయితే డయాబెటిస్ లేదా Vertigo వంటి సమస్యలకు స్వయంగా మందులు తీసుకోవడం లేదా ఇప్పటికే వాడుతున్న వైద్య చికిత్సను ఆపడం కాకుండా, అర్హత కలిగిన వైద్యుడి సలహాతోనే చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. షుగర్ కంట్రోల్, డయాబెటిస్‌లో వచ్చే సమస్యలు, తల తిరగడానికి కారణాలు, Vertigo రకాలు, BPPV, చెవి సమస్యలు, Cervical Spondylosis, ఆహారం మరియు రోజువారీ ఆరోగ్య జాగ్రత్తల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఈ వీడియోలో అందించిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. డయాబెటిస్, Vertigo లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు వ్యక్తిగత చికిత్సను వైద్యుల సలహా లేకుండా మార్చకండి లేదా మందులను నిలిపివేయకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)