LATEST NEWS
తెలంగాణ అధికార కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది అంటే చెప్పలేకపోయినా.. ఏదో జరుగుతోందని మాత్రం అందరికీ అర్ధమౌతోంది. రాష్ట్ర పార్టీలోఅంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా నేతలు గళమెత్తుతున్నారు. విమర్శల స్థాయి, ఆరోపణల తీరు ఒకింత తీవ్రంగానే ఉన్నాయి.  స్వయంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయా అంటూ చేసిన వ్యాఖ్యలు  హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యమంత్రి పదవి దక్కగానే రేవంత్‌కు అహంకారం పెరిగిందని, కళ్ళు నెత్తికెక్కాయా అంటూ ఆమె ఘాటుగా విమర్శించడం, అలాగే సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి సైతం రేవంత్ వనపర్తి టికెట్ తనకు ఇవ్వకుండా అమ్ముకున్నారు అని వ్యాఖ్యానించడం చూస్తుంటే.. పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తి రగులుతోందనడానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ విషయంలో.. తెలుగువన్  న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన సీనియర్ జర్నలిస్టు వీవీ రావు  మాట్లాడారు.  సుస్మిత పటేల్ కంటే ముందు పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు కూడా రేవంత్  ప్రభుత్వ పనితీరు, హామీల అమలుపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్నిగుర్తు చేశారు. తమ నియోజకవర్గాల్లో పనులు కావడం లేదని, మంత్రులు, సలహాదారులు తమను కనీసం లెక్కచేయడం లేదని వారు బాహాటంగా చేసిన వ్యాఖ్యలు విమర్శలు రేవంత్ పై అసంతృప్తి పెచ్చరిల్లుతోందనడానికి నిదర్శనమన్నారు. చిన్నారెడ్డి అయితే.. తనకు వనపర్తి టికెట్ ఇవ్వమని సోనియా గాంధీ స్వయంగా చెప్పినా రేవంత్ ఆ టికెట్ తనకు ఇవ్వకుండా అమ్ముకున్నారని విమర్శించిన విషయాన్నీ,  అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా రేవంత్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు.   కాంగ్రెస్‌లో పాత నేతలు వర్సెస్ వలస నేతల మధ్య సాగుతున్న ఈ   సమరం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ అయితే పార్టీలో ఉందని వీవీరావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన తర్వాత ఈ అంతర్గత తిరుగుబాటుపై ఎలా స్పందింస్తారు? ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉందన్నారు.  ఇక కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ తీరు పట్లా, ఆయనపై రాష్ట్ర నేతల్లో వ్యక్తం అవుతున్న అసంతృప్తి పట్లా స్పందించకుండా మౌనంగా ఉండటం చూస్తుంటే.. ముందస్తు ఎన్నికల అంశాన్నీ కొట్టిపారేయలేని పరిస్థితి ఉందని వీవీరావు అన్నారు.  Konda Sushmitha Comments, Revanth Reddy Konda Sushmitha, Telangana Congress Politics, Pocharam, Chinnareddy 
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో దశాబ్దాలుగా తమదైన శైలిలో ప్రభావం చూపిన ఇద్దరు నేతలు ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తు పై ఆందోళనలో ఉన్నారు.   వై సీపీకి చెందిన ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, జకియా ఖానంల పదవీ కాలం త్వరలో ముగియనుండటంతో  ఖాళీ అయ్యే రెండు స్థానాలూ తెలుగుదేశం కూటమి కైవశం చేసుకోవడం ఖాయం.  ఈ క్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణలు రేసులో నిలిచారు. ఆ ఇద్దరూ కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.  గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయ సమీకరణాలను శాసించిన దేవినేని, వంగవీటి కుటుంబాల వారసులు ఇప్పుడు పదవుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితిలో ఉన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమాకు కూటమి సర్దుబాట్లలో భాగంగ 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కలేదు. పార్టీ క్లిష్ట సమయాల్లో ముందుండి పోరాడిన దేవినేని ఉమాకు ఈ సారి ఎమ్మెల్సీ ఖాయమన్న భావన ఆయన అనుచరుల్లో బలంగా వ్యక్తమౌతోంది.   మరోవైపు వంగవీటి రాధా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇటీవలి ఎన్నికల రాజకీయంలో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం రాని ఆయనకు, ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు.   అయితే త్వరలో ఖాళీకానున్న ఎమ్మెల్సీ స్థానాల భర్తీ విషయంలో తెలుగుదేశం  అధిష్ఠానం  సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమతుల్యత, కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు ఇవ్వాల్సిన ప్రాతినిధ్యం వంటి అంశాలను   పరిగణనలోకి తీసుకునే ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రాజకీయాలలో ఉమా,  రాధాలకు ఈ సారైనా ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉందా అన్న ఉత్కంఠ నెలకొంది.   Devineni Uma, Vangaveeti Radha, Krishna District Politics, MLC Seats, NDA Alliance
విద్యాహక్కు చట్టం  ఆర్టీఈ కింద ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల సంఖ్య భారీగా పెరిగిందని విద్యాశాఖమంత్రి నారా లోకేష్ అన్నారు.  శాసనమండలిలో ఆర్టీఈ కింద ఉచిత ప్రవేశాల అమలు తీరుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేశ్ సమాధానమిచ్చారు.   పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన చదువు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్న ఆయన  ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ, నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు చేరువ చేయడంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు.  విద్యాహక్కు చట్టం  నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాలు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పాతిక శాతం సీట్లను తప్పనిసరిగా కేటాయించే ప్రక్రియను రాష్ట్రంలో   సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. గత కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించారు. జగన్ హయాంలో  2022-23 విద్యా సంవత్సరంలో ఆర్టీఈ కింద కేవలం రెండు వేల పైచిలుకు మాత్రమే విద్యార్థుల నమోదు జరగగా,  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం  బాధ్యతలు చేపట్టిన అనంతరం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన విద్యా సంవత్సరాల వారీగా అడ్మిషన్ల పురోగతిని సభ ముందుంచారు.  2024-25 విద్యా సంవత్సరంలో ఆర్టఈ కింద అడ్మిషన్లు  29 వేలు అన్నారు. ఆ తరువాత కూడా ఇదే వేగం కొనసాగిందని వెల్లడించారు. 2022 నుంచి ఇప్పటివరకు   ప్రైవేట్ బడులలో సీట్లు పొందిన పేద విద్యార్థుల సంఖ్య  లక్షా నాలుగు వేల 40 కు చేరుకుందని గణాంకాలతో వివరించారు. అడ్మిషన్ల కేటాయింపులో ఎలాంటి అక్రమాలకు, సిఫార్సులకు తావులేకుండా ఉండేందుకు ఆన్‌లైన్ ద్వారానే నమోదు,  సీట్ల కేటాయింపు ప్రక్రియ  నిర్వహిస్తున్నట్లు చెప్పిన ఆయన.. సాంకేతికతను వినియోగించుకోవడం వల్ల అర్హులైన ప్రతి పేద విద్యార్థికి పారదర్శకమైన పద్ధతిలో అడ్మిషన్ దక్కుతోందన్నారు.   రాబోయే రోజుల్లో కూడా విద్యాహక్కు చట్టం నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేసి, పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి, వారి ప్రకాశవంతమైన భవిష్యత్తుకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని సభకు హామీ ఇచ్చారు. Nara Lokesh, RTE Admissions Andhra Pradesh, Education Minister Lokesh, Private School Free Admissions, AP Legislative Council News
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో  తృణమూల్ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాభవం ఇసుమంతైనా తగ్గలేదనీ, ఎన్నికలలో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆమె ప్రజాదరణ చెక్కు చెదరకుండా నిలిచే ఉందనీ తేలింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఆ ఎన్నికలలో మమతా బెనర్జీ స్వయంగా పరాజయం పాలయ్యారు. అయినా పొలిటికల్ గా ఆమె బలం, పట్టు అలాగే ఉన్నాయి.   తాజాగా పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్   ఘనవిజయాన్ని సాధించడమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు మరియు టీఎంసీ   బలంపై  అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో.. తాజాగా జరిగిన  బార్ కౌన్సిల్ ఎన్నికల టీఎంసీ విజయం మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపిందనడంలో సందేహం లేదు.   బార్ కౌన్సిల్ ఎన్నికల మొత్తం 23  స్థానాలకు గానూ  తృణమూల్ కాంగ్రెస్  15 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని చాటింది. ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడంటే మూడు స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది.   లెఫ్ట్ ఫ్రంట్ 3 స్థానాలు,   కాంగ్రెస్ 2 స్థానాలను గెలుచుకున్నాయి.   బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత టీఎంసీ  ప్రభ  కోల్పోయిందన్న విమర్శలకు బార్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలు ఒక విధంగా చెక్ పెట్టాయని చెప్పాలి.   Mamata Banerjee, TMC victory, West Bengal Bar Council, Bengal politics, Bar Council election results
తెలుగుదేశం సీనియర్ నాయకుడు వర్ల రామయ్య బుధవారం (ఆగస్టు 19) ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఎమ్మెల్సీగా, ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా ఏక కాలంలో  చట్టసభలలో ప్రతినిధులుగా ఉన్ననట్లైంది.  రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే పలు  కుటుంబాలు రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆ జాబితాలోకి ఇప్పుడు  వర్ల కుటుంబం  చేరింది.వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా  పామర్రు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.   వర్ల రామయ్య  తెలుగుదేశంలో  కీలకమైన నాయకుడిగా, విశ్లేషకుడిగా సేవలు అందిస్తున్నారు. గతంలో ఆయన  ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ,   విజయాన్ని అందుకోలేకపోయారు. అయినా  పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా నిలబడి, పార్టీ సిద్ధాంతాలను గట్టిగా వినిపించారు.  ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన  వర్ల రామయ్య  సేవలకు గుర్తింపుగా, పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధతకు ప్రతిఫలంగానూ అధిష్టానం ఆయనను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక  చేసింది. ఈ నిర్ణయంతో ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి తగిన గౌరవం లభించిందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు సభ్యులు ఏకకాలంలో చట్టసభలలో సభ్యులుగా ఉండటం ఇదే ప్రథమం కాదు కానీ, ఇది అరుదుగా జరిగే విషయం.   నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, నాగబాబు,  చింతకాయల అయ్యన్నపాత్రుడు, చింతకాయల విజయ్..  వంటి ఇలా తండ్రీ కొడుకులు ఒకే సమయంలో చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇప్పుడు వర్ల రామయ్య, వర్ల కుమార్ రాజా వారి సరసన చేరారు.    Varla Ramaiah MLC, Varla Kumar Raja Pamarru MLA, AP Politics,  Father MLC Son MLA,  Andhra Pradesh, TeluguOne
ALSO ON TELUGUONE N E W S
ఇండిపెండెంట్ ఆర్టిస్టులను ప్రోత్సహించే తరుణంలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇటీవల లేథోవిస్ అనే మ్యూజిక్ లేబుల్ ప్రారంభించడం జరిగింది. ఈ లేబుల్ ద్వారా ఇప్పటికే నాలుగు పాటలు విడుదలై, మ్యూజిక్ లవర్స్ నుండి అద్భుతమైన ఆదరణను పొందాయి.  కొన్ని నెలల క్రితం ఏర్పాటు చేసిన ఈ లేబుల్ ద్వారా వచ్చిన తొలి గీతం 'ముమ్ముకుస్సు' వివిధ భాషలలో రావడంతో ప్రత్యేక ఆదరణ లభించింది. ఆ తర్వాత వచ్చిన రాసింది కీరవాణి కూసింది చంద్రబోస్ అంటూ సాగే పాటకు గాయని లిప్సిక తన గాత్రం అందించారు. ఆ తరువాత వచ్చిన రాహుల్ సిప్లిగంజ్ 'సర్పంచ్ కూతురు' వైరల్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఈ లేబుల్ నుండి వచ్చిన నాలుగవ పాట 'అన్‌ఫైర్ లైఫ్' ఒక వినూత్న విధంగా షార్ట్ ఫిలిం తరహాలో వచ్చింది.  అయితే ఇప్పుడు ఈ లేబుల్ నుండి వచ్చిన 5వ పాటను ప్రముఖ మలయాళ సింగర్ సితార కృష్ణకుమార్ పాడటం విశేషం. ఆమెతో కలిసి కీరవాణి తొలిసారి వీడియోలో కనిపిస్తూ రానున్న సాంగ్ 'చాయురంగ్'. ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతున్న ఈ పాటకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయడంతో ఈ పాటపై ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ నుండి ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి.  ఇప్పటికే ఈ లేథోవిస్ మ్యూజిక్ లేబుల్ నుండి వచ్చిన పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించడంతో ఈ పాట ఎలా ఉండబోతుందో అంటూ అందరూ ఈ పాటపై ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.  అంతేకాక ఈ లేథోవిస్ మ్యూజిక్ లేబుల్ నుండి మరెన్నో పాటలు రానున్నట్లు, రాబోయే కొన్ని నెలలలో మరిన్ని పాటలు విడుదల కానున్నాయని తెలుస్తుంది. ఇక ఆ పాటలు ఎలా ఉండబోతాయో వేచి చూడాలి.       MM Keeravani, Lethowis, Chayurang Song  
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటేనే వివాదాలకి కేరాఫ్ అడ్రస్. అయితే, తాజాగా ఆయన తన సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్ల బకాయిల విషయంలో కార్మిక సంఘం నుంచి గట్టి ఒత్తిడి ఎదుర్కొన్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న టెక్నీషియన్ల వేతనాలను ఎట్టకేలకు వర్మ క్లియర్ చేయడంతో, ఆగిపోయిన షూటింగ్ మళ్ళీ పట్టాలెక్కింది. తాజాగా వర్మ దర్శకత్వంలో 'పోలీస్ కంపెనీ' సినిమా షూటింగ్ ముంబైలో మొదలైంది. అయితే, సెట్స్‌లోకి ప్రవేశించిన సినీ కార్మికుల సంఘం (FWICE) ప్రతినిధులు, బకాయిలు అందే వరకు షూటింగ్‌ను కొనసాగనివ్వమని తేల్చి చెప్పారు. దీంతో వర్మ వెంటనే స్పందించి, రూ. 1.32 కోట్ల మొత్తాన్ని చెల్లించడంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఈ బకాయిల చరిత్ర చూస్తే.. ఇవి కేవలం ఇప్పటివి కావు. వర్మ గతంలో తెరకెక్కించిన 'సర్కార్', 'సర్కార్ 3' వంటి సినిమాల సమయంలోనే టెక్నీషియన్లకు చెల్లించాల్సిన వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని కార్మిక సంఘం ఆరోపిస్తోంది. 2019లోనే ఈ బకాయిలను చెల్లిస్తానని వర్మ రాతపూర్వకంగా హామీ ఇచ్చినప్పటికీ, అవి ఆచరణలో అమలు కాలేదని సంఘం ప్రతినిధులు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా వర్మ అందుబాటులో లేకపోవడం, ఆఫీసులు మూసివేయడం వంటి కారణాలతో టెక్నీషియన్లకు డబ్బులు అందలేదు. అయితే, వర్మ గోవాలో ఉన్నారని తెలిసి కూడా ప్రయత్నాలు జరిగాయని, తాజాగా ఆయన హైదరాబాద్‌లో చిన్న సినిమాలతో బిజీగా ఉండటంతో, 'పోలీస్ కంపెనీ' షూటింగ్‌ను అడ్డుకోవడం ద్వారా సంఘం గట్టిగా నిలదీసింది. పరిశ్రమలోని పలువురు ప్రముఖులు మధ్యవర్తిత్వం వహించడంతో, వర్మ మొత్తాన్ని చెల్లించేందుకు ఒప్పుకున్నారు. డబ్బులు అందిన తర్వాతే షూటింగ్‌కు అనుమతి ఇచ్చినట్లు FWICE అధ్యక్షుడు బీఎన్ తివారీ తెలిపారు. ఈ సంఘటన ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక వర్మ తాజా ప్రాజెక్ట్ 'పోలీస్ కంపెనీ' విషయానికి వస్తే.. ఇందులో హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో, ప్రఖ్యాత దయా నాయక్ పాత్రను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు వెంకీ అట్లూరి, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ఈ స్థాయి స్పందన రావడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన లభిస్తోంది.  ఈ కథ వినగానే సూర్య గారి రియాక్షన్ ఏంటి? కథ వినగానే సూర్య గారికి చాలా నచ్చేసింది. నిజానికి ఆయన ఒక ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్నారు. అదే విషయం నాకు చెప్పారు. ఈ కథ నా దగ్గర అప్పటికే సిద్ధంగా ఉండటంతో, ఆయనకు వినిపించాను. సూర్య గారికి కథ చాలా నచ్చింది. అయితే ఈ కథకు అనవసరమైన కామెడీ లేదా కమర్షియల్ అంశాలు జోడించకుండా.. నిజాయితీగా చెబుదామని అన్నారు. అందుకే క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాము. ముఖ్యంగా ఏ పాత్ర పడిపోకుండా జాగ్రత్త పడ్డాము. సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు సూర్య గారు చూశారు. తాను ఏదైతే నమ్మారో, అదే తెరమీద కనిపించడంతో ఆయన చాలా సంతోషపడ్డారు. త్రివిక్రమ్ గారి రచనలో ఉండే బలం, మీ రచనలో కనిపిస్తుంది అనే ప్రశంసలు రావడం ఎలా ఉంది? నేను సినీ పరిశ్రమలోకి రావడానికి స్ఫూర్తి నింపినది మణిరత్నం గారు, త్రివిక్రమ్ గారు. అలాంటిది త్రివిక్రమ్ గారితో నన్ను పోల్చడం అనేది గౌరవంగా భావిస్తున్నాను. దానిని నిలబెట్టుకోవడం కోసం మరింత బాధ్యతగా పని చేస్తాను. త్రివిక్రమ్ గారి 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా అంటే నాకు చాలా ఇష్టం. సంభాషణలు సరదాగా ఉంటూనే, జీవిత సత్యాలు చెబుతాయి. ఆ సినిమా నాలో ఎంతో స్ఫూర్తి నింపింది. ఆ తరహా రచన రాయడానికి ఇష్టపడతాను. అసలు ‘విశ్వనాథ్ & సన్స్’ కథ ఎలా పుట్టింది? వయసు వ్యత్యాసం ఉన్న బంధంపై కథ రాయాలని మొదట అనుకున్నాను. 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళి చేసుకోకపోవడానికి బలమైన కారణం ఉండాలి. దాని చుట్టు అల్లుకున్న కథ ఇది. నా దృష్టిలో మనుషులు చెడ్డవారు కాదు. పరిస్థితుల వల్ల ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటారు. అదే విషయాన్ని సినిమాలో చెప్పడం జరిగింది. ఈ కథ నేను 2022 లోనే అనుకున్నాను. అప్పుడు సూర్య గారిని దృష్టిలో ఉంచుకొని రాయలేదు. సూర్య గారికి నచ్చిన తర్వాత, ఆయన బాడీ ల్యాంగ్వేజ్ కి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేయడం జరిగింది. సినిమాలో ఆర్ట్ వర్క్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఇంటి సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిపై ఎలాంటి హోంవర్క్ చేశారు? నేను, మా ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్, డీఓపీ నిమిష్ ముగ్గురం కూర్చొని దీని గురించి చర్చించుకున్నాం. ఇల్లు అనగానే విశాలంగానే కాదు, కొత్తగా ఉండాలి అనుకున్నాం. రిచ్ నెస్ కనిపిస్తూనే, కొత్తదనం కనిపించాలి అనుకున్నాము. ‘విశ్వనాథ్ & సన్స్’ చూసి త్రివిక్రమ్ గారి రియాక్షన్ ఏంటి? త్రివిక్రమ్ గారికి సినిమా చాలా నచ్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రూపొందే సినిమాల నిర్మాణంలో ఆయన భాగస్వామిగా ఉన్నారు కాబట్టి, దాదాపు అన్ని సినిమాలు చూస్తుంటారు. అయితే త్రివిక్రమ్ గారు సినిమా చూసిన తర్వాత చిన్న చిన్న మార్పులు చేర్పులు సూచిస్తూ ఉంటారు. కానీ, ఈ సినిమా విషయంలో మాత్రం.. ఎలాంటి మార్పులు చెప్పకుండా, చాలా బాగుంది అన్నారు. ఈ సినిమా విషయంలో ఎడిటింగ్ ప్రభావం ఎంత ఉంది? నా దృష్టిలో ఏ సినిమా అయినా ఎడిట్ టేబుల్ మీద బెటర్ అవుతుంది. మనం తీసిన ప్రతిదీ సినిమాలో ఉండాలి అనుకోకుండా, ఎడిటర్ కి స్వేచ్ఛ ఇస్తే.. ఖచ్చితంగా మంచి అవుట్ పుట్ వస్తుంది. ‘విశ్వనాథ్ & సన్స్’ విషయంలోనూ అదే జరిగింది.  తమిళ వెర్షన్ లో షూట్ చేశారు కానీ, తెలుగులోనే ఎక్కువ వసూళ్లు వస్తుండటంపై మీ అభిప్రాయం? సూర్య గారి మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని తమిళంలో చిత్రీకరించాము. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో థియేటర్ల సంఖ్య తక్కువ. టికెట్ ధరలలో కూడా వ్యత్యాసం ఉంది. అందుకే అక్కడ వసూళ్లు తక్కువ వచ్చాయని అనిపిస్తుంది. కానీ, మన దగ్గరతో పోలిస్తే అక్కడ లాంగ్ రన్ ఉంటుంది. కరుప్పు విషయంలో అదే జరిగింది. ‘విశ్వనాథ్ & సన్స్’ కూడా లాంగ్ రన్ లో తమిళంలో భారీ వసూళ్లు సాధిస్తుంది. మమితా బైజు ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు? ప్రేమలు సినిమా చూసి ఈ పాత్రకు మమితా బైజు సరిపోతుంది అనిపించింది. ఆమెకు తమిళం మీద కూడా పట్టుంది. కామెడీ చేయాలంటే భాష మీద పట్టుండాలి. అదే విషయాన్ని రుజువు చేస్తూ, ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు మమిత. వరుసగా సితార బ్యానర్ లోనే సినిమాలు చేయడానికి కారణం? డబ్బు, అగ్రిమెంట్ లకు అతీతమైన బంధం సితార బ్యానర్ తో ఏర్పడింది. నన్ను నమ్మి అవకాశమిచ్చిన ఆ బ్యానర్ లో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఫ్యామిలీ సినిమాలకు ఈ స్థాయి వసూళ్లు వస్తుండటంపై మీ అభిప్రాయం? ఒకప్పుడు అన్ని రకాల జానర్ సినిమాలు వచ్చేవి. కానీ, గత కొన్నేళ్లుగా ఫ్యామిలీ సినిమాలు తగ్గిపోయాయి. అందుకే ఒక మంచి ఫ్యామిలీ సినిమా వస్తే, ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.       Vishwanath And Sons, Venky Atluri, Suriya, Mamitha Baiju  
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కలసి కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం రేపు(ఆగష్టు 21) థియేటర్లలో అడుగుపెట్టనుంది. 'ఇరుముడి' సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ, ఆడియన్స్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. తండ్రి-కూతుళ్ళ అనుబంధం, అయ్యప్ప దీక్ష నేపథ్యం, అద్భుతమైన పాటలు, పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ కలగలిపి రూపుదిద్దుకున్న ఈ చిత్రం రవితేజకు పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇస్తుందని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇక బిజినెస్ లెక్కల విషయానికి వస్తే.. 'ఇరుముడి' సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. రవితేజ కెరీర్‌లో రీసెంట్ ఫ్లాప్‌లను పరిగణనలోకి తీసుకుని, బయ్యర్లకు ఏమాత్రం రిస్క్ లేని విధంగా చాలా రీజనబుల్ అండ్ సేఫ్ ప్రైస్‌కే ఈ రైట్స్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రాంతాల వారీగా బిజినెస్ చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లోదాదాపు రూ.16 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ హక్కులు కలిపి దాదాపు రూ. 4 కోట్లకు అమ్ముడయ్యాయి. దీంతో 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ సాధించి, క్లీన్ హిట్‌గా నిలవాలంటే..  రూ. 21 కోట్ల షేర్ (రూ. 40 కోట్ల వసూళ్లు) సాధించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 40 కోట్ల గ్రాస్ మార్క్ దాటితే 'ఇరుముడి' సేఫ్ జోన్‌లోకి వచ్చి, మాస్ మహారాజాని హిట్ ట్రాక్ ఎక్కిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దానికి పాజిటివ్ టాక్ కూడా తోడైతే, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయడం ఖాయమే.       Irumudi Movie, Ravi Teja, Shiva Nirvana  
Suriya’s latest film VISWANATH & SONS, directed by acclaimed filmmaker Venky Atluri, features Mamitha Baiju as the female lead. Presented by Srikara Studios and produced jointly by Suryadevara Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas, the film hit theatres on August 14, 2026. With its natural humour, heartfelt emotions and relatable family drama, ‘VISWANATH & SONS’ is receiving an overwhelming response from audiences. The film has crossed the ₹150 crore gross mark worldwide within just four days and is continuing its successful run. In a recent interaction with the media, director Venky Atluri shared his happiness over the film’s success and spoke about Suriya’s faith in the story, the writing process, the film’s art work, Trivikram Srinivas’s reaction, Mamitha Baiju’s casting and several other interesting aspects of the film. How does it feel to receive such an overwhelming response for ‘VISWANATH & SONS’? I am extremely happy. The response has been phenomenal and far beyond what we expected. It is truly gratifying to see audiences embracing the film with so much love. What was Suriya sir’s reaction when he first heard the story? Suriya sir immediately liked the story. In fact, he was looking for a family-oriented film, and he had mentioned that to me. I already had this story ready, so I narrated it to him. He really connected with it. He felt that we should tell the story honestly without unnecessarily adding comedy or commercial elements. That is why we were particularly careful with the climax. We also made sure that no character was compromised in the process. Suriya sir watched the film a few days before its release. He was very happy because what he had believed in was exactly what he saw on screen. I feel very happy that we could live up to the faith he placed in the story. You are being praised for having the strength of writing seen in Trivikram Srinivas’s films. How do you feel about that comparison? Mani Ratnam sir and Trivikram sir are two of the biggest inspirations behind my decision to enter the film industry. So, being compared with Trivikram sir is a great honour for me. I also understand the responsibility that comes with such a compliment, and I will work even harder to live up to it. I particularly love Trivikram sir’s ‘Nuvvu Naaku Nachav’. The dialogues are entertaining and humorous, yet they convey profound truths about life. That film inspired me tremendously, and I enjoy writing in a similar space. How did the story of ‘VISWANATH & SONS’ originate? Initially, I wanted to write a story around a relationship involving a significant age difference. If a person reaches the age of 40 without getting married, there has to be a strong reason behind that decision. The story evolved around that idea. I believe that people are not inherently bad. Circumstances make them behave differently. That is one of the central ideas we tried to convey through the film. I conceived this story back in 2022. At that time, I did not write it keeping Suriya sir in mind. Once he liked the story, we made certain changes to suit his body language and screen presence. The art work, particularly the house set, has become one of the highlights of the film. What kind of homework went into creating it? Our production designer Banglan, cinematographer Nimesh and I sat together and discussed the visual design extensively. When we thought about the house, we did not want it to be merely spacious. We wanted it to feel fresh and different. At the same time, it had to reflect richness and grandeur while retaining a sense of novelty. We worked closely on achieving that balance. What was Trivikram sir’s reaction after watching ‘VISWANATH & SONS’? Trivikram sir really liked the film. Since he is involved in the production of films made under the Sithara Entertainments banner, he watches almost all the films associated with the banner. Usually, after watching a film, he suggests small changes or additions. But in the case of ‘VISWANATH & SONS’, he did not suggest any changes. He simply said that the film was very good. That meant a lot to me. How important was the editing process in shaping the film? In my view, every film becomes better on the editing table. We should not feel that everything we shoot necessarily has to be part of the final film. If we give the editor the freedom to make the best decisions for the film, the output will definitely improve. We followed the same approach with ‘VISWANATH & SONS’, and the editing played an important role in shaping the final product. The film was shot in Tamil, but the Telugu version is currently generating higher collections. What is your take on this? We shot the film in Tamil keeping Suriya sir’s market in mind. Compared to the Telugu states, Tamil Nadu has fewer theatres, and there is also a difference in ticket pricing. I feel that these factors have contributed to the difference in the initial collections. However, Tamil films generally have longer theatrical runs. We saw the same thing happen with ‘Karuppu’. I believe ‘VISWANATH & SONS’ will also have a strong long run in Tamil Nadu and eventually deliver substantial collections there. How did Mamitha Baiju come on board? After watching ‘Premalu’, I felt that Mamitha Baiju would be perfect for this role. She also has a good command of Tamil. To perform comedy effectively, an actor needs to have a strong understanding of the language and its nuances. Mamitha proved that she had exactly what the role required and did complete justice to the character. What is the reason behind continuing to make films with Sithara Entertainments? My relationship with the Sithara banner goes beyond money and agreements. It has evolved into a bond built on trust. They believed in me and gave me opportunities, and I would love to continue making more films with a banner that has placed such faith in me. Family films are once again witnessing strong theatrical collections. What do you think is the reason? There was a time when films across different genres were being made regularly. But over the last few years, the number of family-oriented films has reduced considerably. That is why, whenever a genuinely good family film comes along, audiences are eager to return to theatres. I believe the response to ‘VISWANATH & SONS’ is a reflection of that audience appetite for wholesome family entertainers. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఫౌజీ' నుంచి రెండు మైండ్ బ్లోయింగ్ మాస్ అప్‌డేట్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమాలో 20 రోజుల పాటు నాన్-స్టాప్‌గా చిత్రీకరించిన ఒక భారీ అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు.. నరసింహస్వామి థీమ్‌తో సాగే పవర్‌ఫుల్ డివోషనల్ ఫైట్ సీక్వెన్స్ ఉండబోతోందని సమాచారం. ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేస్తున్నారు. అందులోనూ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పిరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా సంబంధించి రెండు మైండ్ బ్లోయింగ్ విషయాలు లీక్ అయ్యాయి. ఈ సినిమాలో ఒక భారీ అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతోందట. కేవలం ఒక్క యాక్షన్ సీన్ కోసమే చిత్రబృందం నాన్-స్టాప్‌గా ఏకంగా 20 రోజుల పాటు అండర్‌వాటర్ షూటింగ్ నిర్వహించిందంటే ఆలోచించండి.. ఆ సీన్ ఏ స్థాయిలో డిజైన్ చేసి ఉంటారో. బిగ్ స్క్రీన్ మీద ఈ అండర్‌వాటర్ ఫైట్ చూస్తున్నప్పుడు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమంటున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు చూడని ఒక సరికొత్త విజువల్ ఫీస్ట్‌ను హను రాఘవపూడి ప్లాన్ చేశారట. ఇక ఈ సినిమాలో నరసింహస్వామి థీమ్ చుట్టూ సాగే ఒక హెవీ డివోషనల్ అండ్ ఎమోషనల్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందట. హెవీ బ్లడ్, పీక్స్ ఎమోషన్‌తో సాగే ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలవనుందట. లార్డ్ నరసింహ అవతార్‌ను గుర్తుచేసేలా, రౌద్రంతో నిండిన ఉగ్రరూపంలో ప్రభాస్ చేసే ఆ విధ్వంసం థియేటర్లలో ప్రేక్షకులను సీట్లలో కూర్చోనివ్వదని అంటున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ ఒక్క మాసివ్ డివోషనల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా ముగ్గురు టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు పని చేశారట. ఈ ముగ్గురు ఫైట్ మాస్టర్స్ కలిసి ప్రభాస్ మాస్ ఇమేజ్‌కి, నరసింహస్వామి థీమ్ ఉగ్రత్వానికి పర్ఫెక్ట్‌గా సరిపోయేలా ప్రతీ ఫ్రేమ్‌ను చాలా కేర్‌ఫుల్‌గా, హై-వోల్టేజ్ యాక్షన్ కాంబినేషన్‌గా డిజైన్ చేశారని సమాచారం. ఒకవైపు 20 రోజుల పాటు తీసిన అండర్‌వాటర్ యాక్షన్.. ఇంకోవైపు ముగ్గురు ఫైట్ మాస్టర్స్ సంయుక్తంగా డిజైన్ చేసిన లార్డ్ నరసింహ థీమ్ డివోషనల్ మాస్ ఫైట్. ఈ రెండు సీన్లు చాలు 'ఫౌజీ' సినిమా స్థాయి ఏంటో చెప్పడానికి. హను రాఘవపూడి విజన్, డార్లింగ్ ప్రభాస్ కటౌట్ కలిసి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాయో ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.       Prabhas, Fauzi Movie, Hanu Raghavapudi  
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మూవీ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. '90s' వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకుడు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా మూడో పాట ‘మనసా వాచా’ విడుదలైంది. ప్రేమ, విరహం, అనురాగం వంటి సున్నితమైన భావోద్వేగాలను హృదయాన్ని హత్తుకునేలా ఆవిష్కరించే ఈ గీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ఈ పాటకు దిగ్గజ గాయనీమణి కె. ఎస్. చిత్ర, ప్రముఖ గాయకుడు ఎస్. పి. చరణ్ తమ గాత్రంతో ప్రాణం పోశారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ మధురమైన స్వరకల్పనకు చిత్ర, చరణ్‌ల భావోద్వేగభరితమైన గానం తోడవడంతో ‘మనసా వాచా’ ఓ అద్భుతమైన సంగీత అనుభూతిగా నిలిచింది. శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించిన ఈ పాటలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య పాత్రల మధ్య ప్రేమ, అనుబంధం, వారి మనసుల్లో చోటుచేసుకునే భావోద్వేగాలను ఎంతో అందంగా ఆవిష్కరించారు. పాటకు అనుగుణంగా తెరకెక్కించిన విజువల్స్ కూడా ఆ భావోద్వేగాలకు మరింత బలాన్ని చేకూరుస్తూ, వారి ప్రేమ ప్రయాణంలోని సున్నితమైన కోణాలను ఆవిష్కరిస్తున్నాయి. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రేమ, యవ్వనం, స్నేహం, భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 11, 2026న విడుదల కానుంది.       Epic Movie, Manasa Vacha Song, Anand Deverakonda, Vaishnavi Chaitanya  
టాలీవుడ్ గ్లామర్ క్వీన్, బుట్టబొమ్మ పూజా హెగ్డేకి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన పురస్కారం లభించింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఘనంగా జరిగిన ఓ ప్రత్యేక గాలా వేడుకలో ఆమె పాల్గొనగా, అక్కడ ఆమెను ప్రజా ప్రతినిధులు, నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ మైలురాయిపై పూజా హెగ్డే స్పందిస్తూ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. న్యూయార్క్ సిటీ పబ్లిక్ అడ్వకేట్ నుంచి ఈ గౌరవాన్ని అందుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని పూజా తెలిపారు. ఈ ప్రత్యేకమైన వేడుకలో తనను భాగం చేసిన నిర్వాహకులకు ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడి ప్రజల నుంచి లభించిన అపారమైన ప్రేమ తనలో మరింత ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. తనకు లభించిన ఈ గౌరవంపై స్పందిస్తూ 'ఇది కేవలం ఆరంభం మాత్రమే.. మున్ముందు సాధించాల్సింది చాలా ఉంది' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ శక్తితో మళ్లీ త్వరలోనే పూర్తిస్థాయి 'వర్క్ మోడ్'లోకి వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస విజయాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఏలిన పూజా హెగ్డే, స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించారు. అల వైకుంఠపురములో, అరవింద సమేత వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దశాబ్దకాలం పాటు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేశారు. మధ్యలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, తనదైన గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్‌తో క్రేజ్ కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా తమిళంలో భారీ చిత్రంలో నటించిన ఆమె, ప్రస్తుతం 'కాంచన 4' తో పాటు మరెన్నో క్రేజీ ప్రాజెక్ట్‌లలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. గ్లోబల్ వేదికపై తమ అభిమాన నటి ఘనత సాధించడంతో పూజ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. 'కంబ్యాక్ క్వీన్' అంటూ కామెంట్స్ చేస్తూ ఈ పిక్స్, వార్తలను ట్రెండ్ చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని పెద్ద ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు రానున్న పూజా హెగ్డే, రాబోయే చిత్రాలతో మళ్లీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతుందనే నమ్మకంతో ఉన్నారు ఆమె అభిమానులు.   Pooja Hegde, Pooja Hegde New York Honor, Telugu Cinema Actress 
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ ఓజి 2 . పవన్ నే స్వయంగా నిర్మిస్తుండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు ఓజి 2 కోసం ఎంతో రీగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఇంకా షూటింగ్ కి వెళ్లాల్సి ఉంది. ఈ లోపు పవన్ తనకి తగిలిన భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే  రేపటి నుంచి 20 రోజుల పాటు కేరళలోని ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రంలో చికిత్స చేయించుకోనున్నారు. ఇటీవలే ముంబైలో  శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. కేరళ నుంచి రాగానే ఓజి 2 పై అప్ డేట్ ఏమైనా వస్తుందేమో చూడాలి. సుజీత్ తో పాటు దాదాపుగా ఓజి టెక్నీషియన్స్ వర్క్ చేసే అవకాశం ఉంది.    Also Read: టాలీవుడ్‌లో ఫోన్ హ్యాకింగ్ కలకలం.. లిస్ట్ ఇదే Pawan kalyan, Og 2, Kerala   
  దేనోడు దానికే ఉంటాడనే సామెత రీతిలో ఫోన్ హాకింగ్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు వాళ్ల చూపు టాలీవుడ్ పై పడింది. దీంతో టాలీవుడ్ లో  ఎక్కడ చూసినా ఫోన్ హ్యాకింగ్ విషయమే హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా సైబర్ నేరగాళ్లు సామాన్య ప్రజలని టార్గెట్ చేస్తూ ఉంటారు, కానీ ఈ మధ్య వాళ్ళకి కూడా కళాభిమానం ఎక్కువయిందేమో హ్యాకర్లు  తమ రూటు మర్చి  సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఫోన్లను వరుసగా హ్యాక్ చేస్తుండటం కలకలం రేపుతోంది.  డిజిటల్ యుగంలో ఉన్నాం కాబట్టి స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. మన నిత్య జీవితంలో ఆర్థిక లావాదేవీల నుండి వ్యక్తిగత సమాచారం వరకు అంతా ఫోన్లలోనే భద్రపరుచుకుంటున్నాం. సైబర్ సెక్యూరిటీ నివేదికల ప్రకారం, ప్రతి 10 స్మార్ట్‌ఫోన్లలో కనీసం 4 ఫోన్లు ఏదో ఒక రకమైన సైబర్ అటాక్ బెదిరింపులను లేదా మాల్‌వేర్ ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయని తెలుస్తోంది. ఈ తరుణంలో టాలీవుడ్ సెలబ్రిటీల ఫోన్లు వరుసగా హ్యాక్ అవుతున్న ఘటనలు అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.   ఇటీవల జరిగిన ఒక ఘటనలో సినీ పరిశ్రమకు చెందిన ఒకనాటి ప్రముఖ సీనియర్ నిర్మాత ఫోన్ హ్యాకింగ్‌కు గురైంది. హ్యాకర్లు ఆయన ఫేస్‌బుక్ ఖాతాతో పాటు వాట్సాప్, కాంటాక్ట్ లిస్ట్‌ను ఉపయోగించుకుని  మోసానికి తెరలేపారు. ఆ నిర్మాత సీనియర్ కావడంతో ఇండస్ట్రీలోని పలువురు నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఆయన ఖాతాల నుండి వరుసగా మెసేజ్‌లు వెళ్లాయి. ఆ మెసేజ్‌లలో ఒక ఏపీకే (APK) ఫైల్ లింక్ ఉంచి, దాన్ని వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. అనుమానం రాని కొందరు ఆ లింక్ క్లిక్ చేయడంతో, వారి ఫోన్లు కూడా మాల్‌వేర్ బారినపడి హ్యాక్ అయినట్లు తెలిసింది. అంతేకాకుండా, ఆ నిర్మాత ఫోన్‌లోని కాంటాక్ట్స్‌కి భారతీయ నంబర్లతో కాకుండా విదేశీ కంట్రీ కోడ్‌లు కలిగిన అనుమానాస్పద నంబర్ల నుండి వింతైన మెసేజ్‌లు కూడా వెళ్లడం గమనార్హం.  ఈ ఘటన మరవక ముందే, టాలీవుడ్‌కి చెందిన మరో ప్రముఖ సీనియర్ ఫోటోగ్రాఫర్ ఫోన్ కూడా సరిగ్గా ఇదే పద్ధతిలో హ్యాకింగ్‌కు గురైంది. ఆ ఫోటోగ్రాఫర్ ఫోన్‌లోని సమాచారాన్ని, వ్యక్తిగత డేటాని  హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకుని, ఆయనకు తెలిసిన వ్యక్తులకు హానికరమైన డౌన్‌లోడ్ లింక్‌లను పంపడం మొదలుపెట్టారు.  Also Read: ఓటిటిలోకి సుస్మిత కొణిదెల మూవీ.. ప్రకాష్ రాజ్ పవర్ ఫుల్ మ్యూజిక్ డ్రామా!  ఇలా ఒకరి తర్వాత ఒకరిగా ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అవ్వడం ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ రకమైన దాడులు కేవలం డేటా చోరీకే కాకుండా, సెలబ్రిటీల పేరిట డబ్బులు వసూలు చేయడానికి లేదా వారి వ్యక్తిగత ఫోటోలు, చాట్‌లను విశ్లేషించి బ్లాక్‌మెయిల్ చేయడానికి కూడా దారితీసే ప్రమాదముంది.  ఈ నేపథ్యంలో సైబర్ నిపుణులు అందరికీ కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచిత వ్యక్తుల నుండే కాకుండా, తెలిసిన వారి నుండి వచ్చినప్పటికీ అనుమానాస్పద APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేయకూడదని స్పష్టం చేస్తున్నారు. ఏవైనా యాప్‌లు కావాలనుకుంటే కేవలం అధికారిక గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఫోన్లలో నిరంతరం సెక్యూరిటీ అప్‌డేట్లు చేసుకోవడం, పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మార్చడం, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) ఆన్ చేసుకోవడం వల్ల ఇలాంటి హ్యాకింగ్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మీ ఫోన్ కూడా వింతగా ప్రవర్తిస్తున్నా లేదా అనుమతి లేని యాప్‌లు కనిపిస్తున్నా వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.   
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది,  స్వేచ్ఛను సంపాదించుకుంది.  ఈ సందర్బంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం  జరుపుకుంటారు. 1947లో బ్రిటిష్ వలస పాలన నుండి దేశానికి లభించిన విముక్తికి గుర్తుగా దేశమంతా జరుపుకునే పండుగే  స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన లెక్కలేనంత మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, అవిశ్రాంత కృషికి ఈ రోజు ఒక నివాళి. స్వాతంత్ర పోరాటం ముగిసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక శకం ముగిసి,  కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి చేసిన కృషి,  జరిగిన సంఘటనలు, త్యాగాల గురించి వివరంగా తెలుసుకుంటే.. పోరాటం.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగిన ఒక సుదీర్ఘమైన, కఠిన ప్రయాణం. ఇది 1857 తిరుగుబాటుతో ప్రారంభమైంది.  దీనిని మొదటి స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు, ఇందులో భారతీయ సైనికులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన జాతీయ చైతన్యాన్ని రగిలించింది, ఇది చివరికి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. 20వ శతాబ్దం ప్రారంభంలో గాంధీజి వంటి ప్రముఖ నాయకులు ఉద్భవించారు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల ద్వారా అహింసాయుత ప్రతిఘటనను సమర్థించారు. ఈ ఉద్యమాలు బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరడానికి లక్షలాది మంది భారతీయులను ఉత్తేజపరిచాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీని భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు .   ట్రైస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం.. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన చారిత్రాత్మక "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (విధితో వాగ్వాదం) ప్రసంగాన్ని అందించారు. సుబాష్ చంద్రబోస్.. ఆజాద్ హింద్ సేన.. సుభాష్ చంద్ర బోస్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అహింసా ఉద్యమం వల్ల నెమ్మదిగా ఉన్న పోరాటానికి  నిరాశ చెందిన బోస్, స్వాతంత్ర్యం సాధించడానికి మరింత దూకుడు మార్గాలను అన్వేషించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు. భారతీయ సైనికులు , ప్రవాసులతో కూడిన ఆజాద్ హింద్ సేన, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది. భారతదేశానికి విముక్తి కల్పించడంలో సైన్యం విజయం సాధించనప్పటికీ, బోస్ చేసిన ప్రయత్నాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి . భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. స్వాతంత్ర్యం కోసం బోస్ చేసిన కృషి  వర్ణించలేనిది. గోవా, హైదరాబాద్ విమోచనం.. 1947 స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు విదేశీ లేదా రాచరిక పాలనలో ఉన్నాయి. పోర్చుగీసు వలస ప్రాంతమైన గోవా, “ఆపరేషన్ విజయ్” అనే సైనిక తిరుగుబాటు తర్వాత 1961లో విముక్తి పొందింది. భారత సాయుధ దళాలు గోవాను భారత యూనియన్‌లో విజయవంతంగా విలీనం చేసి, 451 సంవత్సరాల పోర్చుగీసు పాలనకు ముగింపు పలికాయి. హైదరాబాద్ నిజాం మొదట్లో స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు, కానీ చివరికి 1948లో “ఆపరేషన్ పోలో” అనే సైనిక తిరుగుబాటు ద్వారా భారతదేశంలో విలీనం చేయబడింది. ఇది కొత్తగా ఏర్పడిన భారత గణతంత్ర రాజ్యంలో ఆ సంస్థానం యొక్క ఏకీకరణను నిర్ధారించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్.. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్, విచ్ఛిన్నమైన సంస్థానాలను భారత యూనియన్‌గా ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా మరియు హోం మంత్రిగా, ఈ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యేలా చూడటానికి పటేల్ దౌత్యపరమైన , కొన్నిసార్లు బలప్రయోగ చర్యలను కూడా ఉపయోగించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఆయన చేసిన కృషి, ఆయనకు అపారమైన గౌరవాన్ని , భారత చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించిపెట్టింది. బలమైన, ఐక్య భారతదేశానికి పునాది వేయడంలో పటేల్ దార్శనికత, నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. దేశానికి ఆయన చేసిన సేవలకు నిదర్శనంగా నిలుస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయన వారసత్వాన్ని శాశ్వతంగా నిలిపింది.                                  *రూపశ్రీ.  
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది,  స్వేచ్ఛను సంపాదించుకుంది.  ఈ సందర్బంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం  జరుపుకుంటారు. 1947లో బ్రిటిష్ వలస పాలన నుండి దేశానికి లభించిన విముక్తికి గుర్తుగా దేశమంతా జరుపుకునే పండుగే  స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన లెక్కలేనంత మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, అవిశ్రాంత కృషికి ఈ రోజు ఒక నివాళి. స్వాతంత్ర పోరాటం ముగిసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక శకం ముగిసి,  కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి చేసిన కృషి,  జరిగిన సంఘటనలు, త్యాగాల గురించి వివరంగా తెలుసుకుంటే.. పోరాటం.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగిన ఒక సుదీర్ఘమైన, కఠిన ప్రయాణం. ఇది 1857 తిరుగుబాటుతో ప్రారంభమైంది.  దీనిని మొదటి స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు, ఇందులో భారతీయ సైనికులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన జాతీయ చైతన్యాన్ని రగిలించింది, ఇది చివరికి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. 20వ శతాబ్దం ప్రారంభంలో గాంధీజి వంటి ప్రముఖ నాయకులు ఉద్భవించారు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల ద్వారా అహింసాయుత ప్రతిఘటనను సమర్థించారు. ఈ ఉద్యమాలు బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరడానికి లక్షలాది మంది భారతీయులను ఉత్తేజపరిచాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీని భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు .   ట్రైస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం.. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన చారిత్రాత్మక "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (విధితో వాగ్వాదం) ప్రసంగాన్ని అందించారు. సుబాష్ చంద్రబోస్.. ఆజాద్ హింద్ సేన.. సుభాష్ చంద్ర బోస్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అహింసా ఉద్యమం వల్ల నెమ్మదిగా ఉన్న పోరాటానికి  నిరాశ చెందిన బోస్, స్వాతంత్ర్యం సాధించడానికి మరింత దూకుడు మార్గాలను అన్వేషించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు. భారతీయ సైనికులు , ప్రవాసులతో కూడిన ఆజాద్ హింద్ సేన, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది. భారతదేశానికి విముక్తి కల్పించడంలో సైన్యం విజయం సాధించనప్పటికీ, బోస్ చేసిన ప్రయత్నాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి . భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. స్వాతంత్ర్యం కోసం బోస్ చేసిన కృషి  వర్ణించలేనిది. గోవా, హైదరాబాద్ విమోచనం.. 1947 స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు విదేశీ లేదా రాచరిక పాలనలో ఉన్నాయి. పోర్చుగీసు వలస ప్రాంతమైన గోవా, “ఆపరేషన్ విజయ్” అనే సైనిక తిరుగుబాటు తర్వాత 1961లో విముక్తి పొందింది. భారత సాయుధ దళాలు గోవాను భారత యూనియన్‌లో విజయవంతంగా విలీనం చేసి, 451 సంవత్సరాల పోర్చుగీసు పాలనకు ముగింపు పలికాయి. హైదరాబాద్ నిజాం మొదట్లో స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు, కానీ చివరికి 1948లో “ఆపరేషన్ పోలో” అనే సైనిక తిరుగుబాటు ద్వారా భారతదేశంలో విలీనం చేయబడింది. ఇది కొత్తగా ఏర్పడిన భారత గణతంత్ర రాజ్యంలో ఆ సంస్థానం యొక్క ఏకీకరణను నిర్ధారించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్.. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్, విచ్ఛిన్నమైన సంస్థానాలను భారత యూనియన్‌గా ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా మరియు హోం మంత్రిగా, ఈ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యేలా చూడటానికి పటేల్ దౌత్యపరమైన , కొన్నిసార్లు బలప్రయోగ చర్యలను కూడా ఉపయోగించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఆయన చేసిన కృషి, ఆయనకు అపారమైన గౌరవాన్ని , భారత చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించిపెట్టింది. బలమైన, ఐక్య భారతదేశానికి పునాది వేయడంలో పటేల్ దార్శనికత, నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. దేశానికి ఆయన చేసిన సేవలకు నిదర్శనంగా నిలుస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయన వారసత్వాన్ని శాశ్వతంగా నిలిపింది.                                                                                                                                                   *రూపశ్రీ.
మనుషుల నుండి ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆహారం తీసుకోవడం పరిపాటి.  తీసుకునే ఆహారం నుండి లభించే శక్తితోనే శరీరం నిలబడుతుంది. ఇక అన్ని ప్రాణులలోకి మనిషి చాలా విభిన్నమైన వాడు. మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అలవాట్లు ఉంటాయి.  అంతేకాదు.. ఆహారం తినే విధానంలో కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది.  కొందరు నిదానంగా తింటారు.  మరికొందరు చాలా వేగంగా తింటారు.  అయితే.. వేగంగా తినే వ్యక్తుల వ్యక్తిత్వం గురించి వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. వేగంగా ఆహారం తినే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. వేగంగా తినడం... మన చుట్టూ చాలామంది ఉంటారు.  కుటుంబ సభ్యులు అయినా,  స్నేహితులు అయినా.. తెలిసిన వారు అయినా.. కలిసి భోజనం చేసేటప్పుడు లేదా ఏదైనా ఆహారం తినేటప్పుడు.. అందరూ కలిసి మొదలు పెడితే.. పక్క వాళ్లు ఇంకా సగం కూడా తినకుండానే మధ్యలోనే తమ ఆహారం పూర్తీ చేసే వారు కొందరు ఉంటారు.  వారు చాలా బిజీ లైఫ్ స్టైల్ కు అలవాటు వడటం వల్ల అలా వేగంగా తినడం అలవాటు అయి ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇది నిజమే అయినా ఇలా వేగంగా తినే వారి స్వభావం విభిన్నంగా ఉంటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు. వేగంగా తినే వారిలో ఉండే వ్యక్తిత్వ లక్షణాలు.. వేగంగా తినే వ్యక్తులు ఎక్కువగా ఫినిష్ లైన్ ను చేరుకోవడంపై దృష్టి పెడతారు. అదే మనస్తత్వం జీవితంలోని ఇతర రంగాలలో కనిపిస్తుందట. వారు చేయవలసిన పనుల లిస్ట్ నుండి పనులను మార్క్  చేయడం, సమర్థవంతంగా పనిచేయడం , ఒక పనిలో ఆలస్యం  కాకుండా ఆ తరువాత  సవాలును స్వీకరించడం వంటివి వీరిలో ఉంటాయట.   స్ట్రాంగ్ ప్రాక్టీస్  ఉన్నవారు తరచుగా భోజనంతో సహా రోజువారీ దినచర్యలో వేగాన్ని , సామర్థ్యాన్ని ఇష్టపడతారని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. తినడాన్ని ఆస్వాదించడం, అనుభూతి చెందడం  కంటే తినడాన్ని కూడా ఒక  పనిగా భావిస్తారని అంటున్నారు.  తినే వేగాన్ని బట్టి వ్యక్తిత్వం లక్షణాలను,  తినే వేగానికి,  వ్యక్తిత్వానికి మధ్య గల సంబంధాలను వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు కనుక్కున్నారు. వేగంగా తినేవారు తరచుగా వేచి ఉండటానికి ఇష్టపడరు. ఇది క్యూలలో నిలబడినా, నెమ్మదిగా మీటింగ్స్  లో ఉన్నా లేదా ఆహారం వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చినా.. ఇలా అన్ని సందర్బాలలో వారు అన్ని వేగంగానే జరగాలని కోరుకుంటారట.  అన్ని విషయాలలోనూ సహజంగా వేగాన్ని వీరు ఇష్టపడతారట. ఈ ధోరణి భోజన చేయడం వరకు తీసుకువెళుతుందట.  చాలామందిలో తినే స్వభావం మానసిక , పర్యావరణ కారకాల ద్వారా ఏర్పడతాయని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు.   వేగంగా తినే వ్యక్తులలో ఇతర పనులను కూడా వేగంగా పూర్తీ చేసే సామర్థ్యం ఉంటుందట. వర్తమానంతో పూర్తీగా నిమగ్నమవడానికి బదులుగా  తరువాత ఏమి జరుగుతుందో  అనే విషయం పై దృష్టి పెట్టేలా చేస్తుందట.  ఈ కారణంగా వీరికి భవిష్యత్తు గురించి స్పష్టమైన అంచనాలు, ప్రణాళికలు కూడా ఉంటాయట. అలాగని వేగంగా తినడాన్ని సమర్థించడం లేదు. ఎందుకంటే.. వేగంగా తినడం అనేది ఆహారం సరిగా నమలకపోవడం, తినే ఆహారం మీద దృష్టి పెట్టలేకపోవడం,  ఆహారం అతిగా తినడం.. ఇలా చాలా సమస్యలకు కారణం అవుతుంది.                                                                                                                                                   *రూపశ్రీ.  
గ్యాస్, ఎసిడిటీ, ఛాతిలో మంట, తరచూ తేన్పులు రావడం వంటి సమస్యలను చాలామంది సాధారణమైనవిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇవే లక్షణాలు తరచూ లేదా ఎక్కువ కాలం కొనసాగితే GERD (Gastroesophageal Reflux Disease) వంటి సమస్యకు సంకేతం కావచ్చు. దీర్ఘకాలంగా ఉండే యాసిడ్ రిఫ్లక్స్‌ను నిర్లక్ష్యం చేస్తే అన్నవాహికపై ప్రభావం పడే అవకాశం ఉందా? GERDకు Esophageal Cancer కు ఏమైనా సంబంధం ఉందా? ఏ లక్షణాలు కనిపిస్తే వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించాలి? ఈ వీడియోలో గాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ రాకేష్ ఈ విషయాలను సులభంగా వివరిస్తున్నారు. గ్యాస్, ఎసిడిటీ, GERD మధ్య తేడా ఏమిటి? దీర్ఘకాలిక లక్షణాలను ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు? ఎలాంటి హెచ్చరిక సంకేతాలను గుర్తించాలి? వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గ్యాస్ లేదా ఎసిడిటీ అని అనుకుని మీ ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. తరచూ లేదా దీర్ఘకాలంగా లక్షణాలు ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. గమనిక: ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇందులోని సమాచారం వైద్యుల వ్యక్తిగత వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు నిరంతరంగా లేదా తీవ్రమైన లక్షణాలు ఉంటే అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించండి.మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
  మోకాళ్ల నొప్పులు, కీళ్ల సమస్యలు ఒకప్పుడు 60–70 ఏళ్ల వయసులో ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు 40లలో ఉన్నవారిలో కూడా మోకాళ్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొందరికి చిన్న వయసులోనే Knee Replacement అవసరమయ్యే పరిస్థితి ఎందుకు వస్తోంది? ఈ సమస్యలకు సరైన వ్యాయామం లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం, Vitamin D, Vitamin B12 లోపం వంటి కారణాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయి? ఎముకలు, కీళ్లు, మోకాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో Dr. Anvesh Reddy (MS Ortho) మోకాళ్లు, కీళ్లు, ఎముకల ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అలాగే Vitamin D, Vitamin B12 లభించే ఆహారాలు, రోజువారీ జీవితంలో పాటించాల్సిన వ్యాయామాలు, మోకాళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలియజేస్తున్నారు. 40 ఏళ్లలోనే మోకాళ్ల సమస్యలు ఎందుకు వస్తున్నాయి? Vitamin D, B12 లోపం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఏ ఆహారాల్లో ఈ విటమిన్లు లభిస్తాయి? మోకాళ్ల ఆరోగ్యం కోసం ఎలాంటి వ్యాయామాలు చేయాలి? వంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి.  గమనిక: మోకాళ్ల నొప్పులు లేదా ఇతర కీళ్ల సమస్యలు ఉంటే స్వయంగా చికిత్స చేసుకోకుండా వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
గుడ్లు పోషకాహారం యొక్క పవర్హౌస్.  ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గుడ్డు తినడం చాలామంచిదని చెబుతూ ఉంటారు.  అయితే  రోజూ రెండు ఉడికించిన గుడ్లు తినడం  మంచిదేనా? ఫిట్‌నెస్ ట్రైనింగ్ లో ఉన్నవారు,  పోషకాహార లోపంతో ఉన్నవారు ప్రతిరోజూ గుడ్డు తినాలని చెబుతుంటారు.  రోజుకు రెండు ఉడికించిన గుడ్లు తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇది శరీరం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వివరంగా తెలుసుకుంటే.. ఎముకలను బలోపేతం చేస్తుంది.. గుడ్లలో విటమిన్ డి , కాల్షియం పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముక సాంద్రతను మెరుగుపరచడంలో , బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే ఎముకల బలానికి కావలసినంత కాల్షియం,  విటమిన్-డి పొందవచ్చు. మెదడు ఆరోగ్యానికి.. గుడ్లలో కోలిన్ ఉంటుంది, ఇది మెదడు పనితీరు,  జ్ఞాపకశక్తికి చాలా అవసరం. క్రమం తప్పకుండా రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే.. అది మెదడు  చురుగ్గా ఉండటానికి,  మెదడు  ఆరోగ్యానికి తోడ్పడుతుంది ,  అలాగే నరాల పనితీరును  కూడా మెరుగ్గా ఉంచుతుంది. కంటి ఆరోగ్యానికి.. గుడ్లలో ల్యూటిన్ , జీక్సాంథిన్ ఉంటాయి. ఇవి వయస్సు సంబంధిత మాక్యులర్ డిజెనరేషన్ నుండి కళ్ళను రక్షించే యాంటీఆక్సిడెంట్లు.  మొత్తం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి.. గుడ్లలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, సమతుల్య ఆహారంతో పాటు మితంగా గుడ్లు తినడం వల్ల మంచి HDL కొలెస్ట్రాల్ పెరిగి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ప్రోటీన్ కు మంచిది.. రెండు ఉడికించిన గుడ్లు సుమారు 12 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్‌ను అందిస్తాయి. ఇవి కండరాల నిర్మాణం, మరమ్మత్తు , కడుపు నిండిన ఫీలింగ్ ఇవవ్డంలో సహాయపడతాయి. ఫిట్‌నెస్ ప్రియులకు , లీన్ కండరాలను కాపాడుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచిది. బరువు నిర్వహణకు.. గుడ్లలో అధిక ప్రోటీన్ , తక్కువ కేలరీలు ఉంటాయి.  దీని కారణంగా ఉడికించిన గుడ్లు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి , శరీరానికి కావలసిన పోషకాలు కూడా మెరుగ్గా అందిస్తాయి. ఇవి అతిగా తినడాన్ని,  వెంటనే ఆకలి కావడాన్ని అరికట్టడానికి , బరువు నిర్వహణకు సహాయపడతాయి.                                                                                                                                                   *రూపశ్రీ.