LATEST NEWS
సింహం సింగిల్ గానే వస్తుందంటూ తన భుజాలను తానే చరచుకునే జగన్ ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ, తాను కన్ఫ్యూజన్ లో ఉన్నానని చెప్పకనే చెబుతున్నారు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ ఆయనలోని అయోమయానికీ, కన్ఫ్యూజన్ కు అద్దంపట్టింది.   గతంలో ఢిల్లీలో  కాక్రోచ్ జనతా పార్టీ  ఉద్యమం జరుగుతున్నప్పుడు, తాను కూడా   పోరాడే  బొద్దింకనని జగన్ ప్రకటించారు. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడేందుకు తాను కాక్రోచ్ ల ఉద్యమంలో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నానని విస్పష్ట సందేశాన్నిచ్చారు. జగన్ తన రాజకీయ జీవితంలో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా ఒక స్టేట్ మెంట్ ఇవ్వడం అదే ప్రథమం.  దీంతో జగన్ ఇక తన పొలిటికల్ మార్గాన్ని బీజేపీకి వ్యతిరేకంగా ఆరంభిస్తున్నారా అన్న అనుమానాలు అప్పట్లో వెల్లువెత్తాయి. దానికి కొనసాగింపుగానే జగన్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి దగ్గరౌతున్నారన్న విశ్లేషణలూ వెల్లువెత్తాయి. ఇక సీపీఐ నేతలు ఆయనతో భేటీ కావడం ఈ విశ్లేషణలకు బలం చేకూర్చాయి కూడా. అయితే తాను ఏ కూటమిలోనూ భాగస్వామిని కాబోవడం లేదని జగన్ వివరణ ఇచ్చుకున్నారు.  ఇప్పుడు తాజాగా ప్రభుత్వాధినేతగా పాతికేళ్ల ప్రస్థానం ( గుజరాత్ సీఎంగా, పీఎంగా)  పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలపడం ద్వారా జగన్ తన కన్ఫ్యూజన్ ను బయటపెట్టుకున్నారు. మోడీని అభినందిస్తూ ఆయన చేసిన ట్వీట్ లో ప్రజా సేవలో మోడీ చారిత్రాత్మక మైలు రాయిని చేరుకున్నారని పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత భారతదేశ ప్రధానమంత్రిగా పాతికేళ్లుగా  నిరంతర ప్రజా సేవను పూర్తి చేసుకున్న గౌరవనీయులైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ జగన్ సోషల్ మీడియాలో ఓ సందేశం షేర్ చేశారు. నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  మొత్తానికి ఒకే సమయంలో  రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న  రాజకీయ నాయకుడిగా జగన్ ను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  [YS Jagan Praises Narendra Modi, Jagan Modi Tweet, YCP, CJP,  Andhra Pradesh Politics, Jagan Political Strategy, Duel Standards, Confusion, Telugu One]
విజయవాడలో జరగనున్న దసరా ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు బుధవారం(సెప్టెంబర్ 7)  తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను కలిశారు. ఈ ఆహ్వానంపై విజయ్ సానుకూలంగా స్పందించారని, ఆయన ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది జరిగి 24 గంటలు కాక ముందే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తమిళనాడు సీఎం విజయ్ తో భేటీ అయ్యారు. తన భర్త అనిల్ లో కలిసి చైన్నైలో విజయ్ ను కలిసిన షర్మిల తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా తమిళనాడు సీఎం విజయ్ ను ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను షర్మిల స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయగా అది క్షణాల్లో వైరల్ అయ్యింది.  మొత్తంగా ఒక రోజు వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు సీఎం విజయ్ కు రెండు ఆహ్వానాలు అందడం విశేషం. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.    [YS Sharmil Meet Vijay Thalapathy, Tamil Nadu CM Vijay, AP Congress, Sharmila Vijay Meeting, Anjili Reddy Wedding, Vijay TVK, Andhra Pradesh Politics, Telugu One]
వైఎస్ కుటుంబంతో దశాబ్దాల పాటు కలిసి పనిచేసిన విజయసాయిరెడ్డి, 2024లో వైసీపీ  అధికారం కోల్పోయిన తర్వాత జగన్‌కు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌లో తన సొంత రాజకీయ పార్టీని స్థాపించే పనిలో  ఉన్నారు.ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి అనుసరిస్తున్న వ్యాహాలు, చేస్తున్న కుల, మత ప్రస్తావనలు సంచలనంగా మారాయి. ఆయన తీరు పట్ల సర్వత్రా చర్చ జరుగుతోంది.విజయసాయి ప్రతి అంశంలోనూ కుల, మత కోణాలను వెలికి తీస్తూ సంచలన రాజకీయమే తన బాణి, వాణి, బాట అని చాటుతున్నారు.  తాజాగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముస్లింలు, క్రైస్తవులు హిందూ దేవాలయాలకు వచ్చినప్పుడు అక్కడి ప్రసాదాన్ని గానీ, పవిత్ర వస్త్రాలను గానీ స్వీకరించరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే  సమయంలో హిందువులు చర్చిలు లేదా మసీదులకు వెళ్ళినప్పుడు మాత్రం అక్కడి నిబంధనలను పాటించాల్సి ఉంటుందన్నారు.  అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్‌లో తన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, దళితులను ఆలయాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునే అగ్రవర్ణాల వారికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించేలా ఒక కొత్త చట్టాన్ని తీసుకువస్తానని  ప్రకటించారు. సాధారణంగా లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులపరమైన విభజనలు ఉన్నప్పటికీ, కొన్నేళ్ల క్రితం వరకు మతపరమైన అసమ్మతి లేదా విభేదాల ఛాయలు  ఇసుమంతైనా కనిపించేవి కావు. అయితే ఇప్పుడు విజయసాయి రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో.. ఆంధ్రప్రదేశ్‌ను కేవలం రెండు కుటుంబాలు, రెండు వర్గాలు మాత్రమే పాలించాలా? అనే ప్రశ్నను లేవనెత్తారు. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలకు చెందినవారే ముఖ్యమంత్రి కావాలా? కాపులు, వెలమలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీల నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎందుకు ఉండకూడదని  ప్రశ్నించారు. కొత్త పార్టీ ప్రకటనకు విజయసాయి సన్నద్ధమౌతున్న వేళ విజయసాయి చేసిన ఈ వ్యాఖ్యలను ఆయన రాజకీయ వ్యూహంలో భాగంగానే చూడాల్సి ఉంటుంది. అయితే..  పార్టీ నిర్మాణం, విధివిధానాలు, ప్రధాన రాజకీయ లక్ష్యాలు పూర్తిగా వెల్లడించిన తరువాత మాత్రమే విజయసాయి  వ్యాఖ్యల రాజకీయ ప్రభావాన్ని ఏ మేరకు ఉంటుందన్నది తెలుస్తుంది.   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు  ఎప్పుడూ కీలక అంశమే.   రెడ్డి, కమ్మ, కాపు తదితర సామాజిక వర్గాల రాజకీయ ప్రాతినిధ్యంపై   చర్చ జరుగుతూనే ఉంది. 2024 ఎన్నికల సందర్భంలోనూ రాష్ట్ర రాజకీయాల్లో కుల సమీకరణాల ప్రభావంపై విశ్లేషణలు వెలువడ్డాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి అదే అంశాన్ని మరోసారి చర్చకు తీసుకువచ్చారు. అయితే కులం, మతం ప్రస్తావించడం మాత్రమే ఒక కొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది అవుతుందా?  అంటే పరిశీలకులు ఆ అవకాశం లేదని కుండబద్దలు కొడుతున్నారు.  ఏది ఏమైనా విజయసాయి రెడ్డి తాజా వ్యాఖ్యలు మత ప్రస్తావన, ఏపీ రాజకీయాలలో కొత్త చర్చకు తెరతీశాయని చెప్పవచ్చు.  అయితే ఈ రాజకీయ వ్యూహం ఆయన కొత్త పార్టీకి ఏ మాత్రం ప్లస్ అవుతుందన్నది అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు.  [Vijayasai Reddy Political Strategies, Sai Reddys New Party, Jagan, YCP, TDP, Caste politics, Religious politics, Reddy Vote Bank, AP Politics, Telugu One]
ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ రాటుదేలుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతగా పార్టీని ముందుండి నడిపించడంలో గతం కంటే ఎంతో మెరుగ్గా సాగుతున్నారు. ప్రభుత్వ అణచివేత చర్యలకు దీటుగా స్పందిస్తున్నారు. కేసులు, అరెస్టులతో భయపెట్టలేరని కుండబద్దలు కొడుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ణానేశ్వర్ రాజీనామా డిమాండ్ తో చేపట్టిన ఆందోళన సందర్భంగా రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు వరుసగా అరెస్టు చేశారు. ఎన్నికల సంఘం ముట్టడి సందర్భంగా మంగళవారం, (అక్టోటబర్ 6)జంతర్ మంతర్ వద్ద ఆందోళన సందర్భంగా బుధవారం (అక్టోబర్ 7) అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  దీనిపై రాహుల్ ఘాటుగా స్పందించారు. ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.   ఎన్ని కేసులు నమోదైనా రాజ్యాంగ పరిరక్షణ కోసం  చేస్తున్న ఈ పోరాటాన్ని ఆపేది లేదన్న రాహుల్ వ్యాఖ్యలు.. పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నారనడానికి సంకేతాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ)  జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ను రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు.  ఎఫ్‌ఐఆర్‌ను ప్రజలపక్షాన నిలిచినందుకు దక్కిన మెడల్‌ గా అభివర్ణించడం ద్వారా రాహుల్ ముందుముందు మరింత దూకుడుగా ముందుకు సాగనున్నారని అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు.  అంతే కాకుండా ఎన్నికల సంఘంపై ప్రారంభించిన ఈ పోరాటాన్ని జ్ణానేశ్ కుమార్ రాజీనామాతో లాజికల్ ఎండ్ కు తీసుకువెళ్లే వరకూ విరమించేది లేదని విస్పష్టంగా చాటినట్లేనని అంటున్నారు. [Rahul Gandhi, 100 FIRs arget, Rahul Gandhi FIR, Election Commission Protest, Gyanesh Kumar, INDIA Bloc, Telugu One]
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సంఘం వ్యవహారంపై పొలిటికల్ టెన్షన్ అంతకంతకూ పెరుగుతోంది. కొనసాగుతోంది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్)పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు నిర్బంధాలు, నిషేధాలకు బెదిరేదే లే.. ఆందోళనలు కొనసాగించే విషయంలో తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. మంగళవారం (అక్టోబర్ 6) ఈసీ కార్యాలయం వైపు చేపట్టిన మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడం, అనంతరం రాహుల్ గాంధీ సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకోవడం తెలిపిందే. ఇప్పుడు తాజాగా జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు రాహుల్ గాంధీ పిలుపునివ్వడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ పరిణామాలు మరింత ఉత్కంఠకు దారితీశాయి.  ఈ నేపథ్యంలోనే  నిర్దేశిత నిరసన స్థలమైన జంతర్ మంతర్‌కు వెళ్లాలని విపక్షాలు నిర్ణయించాయి. బుధవారం (సెప్టెంబర్ 7) రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సుమారు 300 మంది ఎంపీలు ఈసీని కలవాలని ప్రయత్నించినా అవకాశం దక్కలేదన్నారు. అందుకే జంతర్ మంతర్‌లో నిరసన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.  సర్ ప్రక్రియ, ఓటర్ల జాబితాలో మార్పుల విషయంలో తగ్గేదేలే అంటున్న రాహుల్.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయన్న రాహుల్ సహా ప్రతిపక్షాల విమర్శలను ఎన్నికల సంఘం, అధికార బీజేపీ ఖండిస్తున్నాయి.  విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.  అదలా ఉంటే..  మంగళవారం (అక్టోబర్ 6) సాయంత్రం వరకు ఏ రాజకీయ పార్టీ కూడా తమను అధికారికంగా అపాయింట్‌మెంట్ కోరలేదని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. అనంతరం రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఎంపీల బృందం ఈసీని కలవాలని కోరినట్లు పేర్కొంది. అయితే పార్లమెంట్ అనెక్స్‌లో సమావేశం నిర్వహించాలన్న ప్రతిపాదన తమ ప్రోటోకాల్‌కు అనుగుణంగా లేని కారణంగా రిజెక్ట్ చేశామని వివరణ ఇచ్చింది.   [Rahul Gandhi Jantar Mantar Protest, Delhi Protest, CEC Gyanesh Kumar Resign Demand, Election Commission, SIR, INDIA, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘రణబాలి’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విజయ్ మాట్లాడిన మాటలు, చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ యాసలో బ్రిటీషర్లపై విజయ్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బ్రిటీషర్ల పాలన, అప్పటి అణచివేత గురించి మాట్లాడుతూ విజయ్.. ఆ రోజుల్లో మనవాళ్లు తిరగబడి ఉంటే తెల్లదొరలను అప్పుడే తరిమేసేవాళ్లమని చెప్పాడు. ఈ సందర్భంగా సినిమాలో తాను చెప్పిన డైలాగ్‌ను కూడా స్టేజ్‌పై చెప్పాడు. “సింగనమల బొబ్బిలి రణబాలిరా నీ అక్క.. ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’ అంటూ విజయ్ గర్జించడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాయలసీమ యాసలో విజయ్ చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ‘రణబాలి’ గురించి విజయ్ మాట్లాడుతూ.. మన చరిత్రలో నిజమైన విప్లవ వీరుల పేర్లు చాలావరకు మరుగున పడిపోయాయని చెప్పాడు. బుర్రకథలు, జానపద కథల్లో మాత్రమే మిగిలిపోయిన అలాంటి యోధుల గురించి ప్రపంచానికి చెప్పే ప్రయత్నమే ఈ సినిమా అని వివరించాడు. అప్పటి తీవ్ర కరువు పరిస్థితులు, సింగనమల ప్రాంత పోరాటం, మన పూర్వీకుల త్యాగాలను సినిమాలో చూపించినట్టు తెలిపాడు. ఈ కథ తెలుగు సినిమా చరిత్రలోనే అత్యుత్తమ స్క్రిప్ట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని విజయ్ ధీమా వ్యక్తం చేశాడు. హీరోయిన్ రష్మిక మందన్న షూటింగ్ కారణంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరు కాలేకపోయింది. దీంతో విజయ్ స్టేజ్‌పైనే ఆమెకు ఫోన్ చేసి మాట్లాడాడు. తన కెరీర్‌తో పాటు రష్మిక ఫిల్మోగ్రఫీలో కూడా ‘రణబాలి’ ప్రత్యేకంగా నిలిచిపోతుందని విజయ్ చెప్పాడు. రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 16న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.       [Vijay Deverakonda, Ranabaali, Ranabaali Movie, Vijay Deverakonda Ranabaali, Ranabaali Dialogue, Vijay Deverakonda Dialogue, Ranabaali Trailer, Vijay Deverakonda Rayalaseema Dialogue, Ranabaali Viral Dialogue, Singanamala Bobbili Ranabaali, Rashmika Mandanna, Rahul Sankrityan, Ranabaali Trailer Launch, Vijay Deverakonda Latest News, Ranabaali Movie Update, Telugu Cinema, Tollywood, Vijay Deverakonda New Movie]
ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన వ్యక్తిత్వ, ప్రచార హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, ఫొటో, గొంతును అనుమతి లేకుండా ఉపయోగించడంతో పాటు ఫేక్ న్యూస్, ఏఐ సాయంతో రూపొందిస్తున్న కంటెంట్ వల్ల తన ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ప్రతివాదులకు సమన్లు జారీ చేసింది. కంగనా తరఫున న్యాయవాది సాకేత్ సిక్రీ కోర్టులో వాదనలు వినిపిస్తూ.. ఆమెకు సంబంధించిన అభ్యంతరకరమైన పలు వెబ్ లింకులను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వీటిలో కొన్ని యానిమేటెడ్ వీడియోలు, మీమ్స్ కూడా ఉన్నాయని కోర్టు గుర్తించింది. అయితే ప్రస్తుతం ఆ కంటెంట్‌ను తొలగించాలని తాము పట్టుబట్టడం లేదని కంగనా తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. ఇప్పటికే కోర్టు నోటీసులు అందుకున్న కొందరు ప్రతివాదులు అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించినట్లు కూడా తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు కంగనా పిటిషన్‌పై ప్రతివాదులకు సమన్లు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వుల కోసం దాఖలు చేసిన దరఖాస్తుపై కూడా నోటీసులు ఇచ్చింది. పిటిషన్ నుంచి కొందరు ప్రతివాదుల పేర్లను తొలగించిన నేపథ్యంలో సవరించిన జాబితాను దాఖలు చేయాలని కంగనా న్యాయవాదిని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను 2027 ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది. ఇటీవల కాలంలో సెలబ్రిటీలు తమ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం కోర్టులను ఆశ్రయించడం పెరుగుతోంది. అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, రజనీకాంత్, జాకీ ష్రాఫ్ తదితర ప్రముఖుల విషయంలోనూ ఢిల్లీ హైకోర్టు గతంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఫేక్ న్యూస్, డీప్‌ఫేక్‌లు, ఏఐతో తయారవుతున్న నకిలీ కంటెంట్‌కు వ్యతిరేకంగా కంగనా దాఖలు చేసిన పిటిషన్ ప్రాధాన్యం సంతరించుకుంది.     [Kangana Ranaut, Kangana Ranaut News, Kangana Ranaut Delhi High Court, Kangana Ranaut AI Content, Kangana Ranaut Fake News, Kangana Ranaut Personality Rights, Kangana Ranaut AI Generated Content, Delhi High Court, Kangana Ranaut Lawsuit, Kangana Ranaut Latest News, AI Generated Content, Fake News, Celebrity Personality Rights, Bollywood News, Kangana Ranaut Legal Case]
ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘ఫౌజీ’ విషయంలో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా షూటింగ్ తుది దశకు చేరుకుంది. తాజాగా సినిమా రిలీజ్ డేట్‌పై కూడా క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ‘ఫౌజీ’ని 2027 మార్చి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ‘ఫౌజీ’ టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.  ఇప్పటికే ‘ఫౌజీ’పై ఉన్న అంచనాలకు ప్రభాస్ బర్త్‌డే టీజర్ మరింత హైప్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇంకా రెండు యాక్షన్ ఎపిసోడ్స్ పూర్తి చేయాల్సి ఉందని సమాచారం. వాటిలో ఒక ఫైట్ ప్రస్తుతం షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ యాక్షన్ బ్లాక్స్ పూర్తయిన తర్వాత సినిమా క్లైమాక్స్ షూటింగ్‌పై ఫోకస్ పెట్టనున్నారు. ‘ఫౌజీ’ క్లైమాక్స్ కోసం మేకర్స్ భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు దాదాపు నెల రోజుల పాటు క్లైమాక్స్ షూట్ చేయనున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తయితే సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ అయినట్టే. ‘ఫౌజీ’ మార్చిలో విడుదలైతే ఇప్పటికే మార్చిపై కర్చీఫ్ వేసిన ప్రభాస్ మరో మూవీ 'స్పిరిట్' రిలీజ్ డేట్ మారే అవకాశముంది. ఇది కూడా చదవండి: రణబాలి ట్రైలర్ రివ్యూ.. విజయ్ దేవరకొండకు బిగ్ టర్నింగ్ పాయింట్ అయ్యేలా ఉంది.!       [Fauzi New Release Date, Prabhas Fauzi Movie, Fauzi On March 18th 2027, Spirit Movie, Rebel Star Prabhas, Hanu Raghavapudi, Sandeep Reddy Vanga, Telugu Film News]  
'టాక్సీవాలా' తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘రణబాలి’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను పెంచేసింది.  1870ల నాటి రాయలసీమను, కరువు-ఆకలి-బ్రిటిష్ దోపిడీని నేపథ్యంగా తీసుకుని ఒక భారీ యాక్షన్ డ్రామాను చూపించబోతున్నారు.  సింగనమల కొండపై ఉన్న భద్ర మల్లన్న స్వామి గురించి చెబుతూ బుర్రకథతో ట్రైలర్ ను ప్రారంభించిన తీరు ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆకలితో అల్లాడుతున్న ప్రజలు, కరువుతో కుంగిపోయిన ప్రాంతం, మరోవైపు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేసే బ్రిటిష్ పాలకులను చూపిస్తూ కథలో ఉన్న ఎమోషన్ ను చూపించారు.  ఆ తర్వాత రణబాలిగా విజయ్ దేవరకొండ ఎంట్రీ, జయమ్మ(రష్మిక)తో పెళ్లి వంటి సన్నివేశాలు కూడా మెప్పించాయి. అయితే బ్రిటిష్ వారిపై రణబాలి తిరగబడిన సీన్స్ మాత్రం గూస్ బంప్స్. రౌద్ర రూపంలో విజయ్ విరుచుకుపడ్డాడు అని చెప్పొచ్చు. ముఖ్యంగా లాస్ట్ షాట్ మాత్రం హైలైట్. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. మొత్తానికి ‘రణబాలి’ ట్రైలర్‌ మెప్పించింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ కొత్త అవతారం.. 1870ల రాయలసీమ నేపథ్యం.. ఆకలి, దోపిడీ నుంచి పుట్టిన తిరుగుబాటు.. బాగా వర్కవుట్ అయ్యాయి. ఇది కూడా చదవండి: ఈ వారం 7 సినిమాలు..‘ఆదర్శ కుటుంబం’ వాయిదాతో ఆ మూవీపైనే ఆశలు.!       [Ranabaali Trailer Review, Ranabaali Trailer, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Telugu Movies 2026, Telugu Film News]  
టాలీవుడ్‌లో గత కొన్ని వారాలుగా థియేటర్ల దగ్గర సరైన సందడి కనిపించడం లేదు. ముఖ్యంగా గత వారం ఏకంగా పదకొండు సినిమాలు విడుదలైనా.. చెప్పుకోదగ్గ కమర్షియల్ సక్సెస్ ఏదీ దక్కలేదు. దీంతో ఈ వారం వచ్చే సినిమాలపై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ అందరూ ఆశలు పెట్టుకున్న ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా పడటంతో సీన్ మొత్తం మారిపోయింది. ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు మొత్తం ఏడు సినిమాలు రానున్నాయి. వీటిలో ఐదు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాగా.. రెండు డబ్బింగ్ సినిమాలు. అయితే వీటిలో కాస్త ఎక్కువ అంచనాలు ఉన్న సినిమా మాత్రం శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’. శ్రీవిష్ణు, మహిమా నంబియార్ జంటగా నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న థియేటర్లలోకి వస్తోంది. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాధిక, షైన్ టామ్ చాకో, సత్య, ఉపేంద్ర లిమాయే తదితరులు కీలక పాత్రలు పోషించారు. నక్సలైట్ బ్యాక్‌డ్రాప్ అయినప్పటికీ ఇది కామెడీ సినిమాగా రూపొందటం విశేషం. ఈ వారం వస్తున్న మరో సినిమా ‘బా.. బా.. బ్లాక్ షీప్’. మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన ఈ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీలో ఉపేంద్ర లిమాయే, టీనూ ఆనంద్, రాజా రవీంద్ర, అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్ తదితరులు నటించారు. గుణి మంచికంటి దర్శకత్వం వహించారు. ‘మయూఖ’ కూడా అక్టోబర్ 9నే వస్తోంది. పాయల్ చెంగప్ప ప్రధాన పాత్ర పోషించిన ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌కు శ్రీతేజ్ ఎస్.కె. దర్శకత్వం వహించారు. బిగ్‌బాస్ ఫేమ్ అమన్ మసూద్, దేవ్ డి, మురళీధర్ గౌడ్ తదితరులు నటించారు. ఇక ‘చకోర’ ఒక మ్యూజికల్ లవ్ స్టోరీగా వస్తోంది. శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా నటించిన ఈ సినిమాకు మంగా శ్రీనివాస్ దర్శకుడు. ‘గుడ్ టైమ్’ కూడా ఈ వీకెండ్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నిఖిల్ గాజుల, అన్యుక్త నలాని, హృతిక్ శెట్టి, ధనరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను చాణక్య జిల్లా తెరకెక్కించారు. ఈ ఐదు స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో పాటు రెండు డబ్బింగ్ సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. తమిళంలో ఇప్పటికే విడుదలైన ‘సప్త సాగరాలు సప్త గిరులు’ ఒక వారం ఆలస్యంగా తెలుగులోకి వస్తోంది. మరోవైపు హిందీలో మంచి విజయాన్ని అందుకున్న ‘హనుమాన్ అంశ్’ను తెలుగులో విడుదల చేస్తున్నారు. మరి ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి. ఇది కూడా చదవండి: అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఒకే స్ట్రాటజీ.. ఇద్దరూ అదే పని చేస్తున్నారు.!       [This Week Releases Telugu, Comrade Kalyan, Hanuman Ansh, Saptha Sagaralu Saptha Girulu, Mayookha, Baa Baa Black Sheep, Chakora, Good Time, Telugu Film News]  
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ మూవీ ‘రణబాలి’. 19వ శతాబ్దం నాటి బ్రిటీష్ ఇండియా నేపథ్యంలో 1854-1878 మధ్య జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమా భారత స్వాతంత్య్ర‌ పోరాటం గురించి మాత్రం కాదని దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ క్లారిటీ ఇచ్చారు. ఇది ఒక ఊరి కథ అని, తమ ఊరు, పొలిమేరలు, అక్కడి మనుషులను కాపాడుకునే వీరుల కథ అని చెప్పారు. రణబాలితో సహా సినిమాలోని పాత్రలకు దేశం ఎంత పెద్దది అనే విషయం కూడా తెలియదని రాహుల్ తెలిపారు. వారికి తమ ఊరు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మాత్రమే తెలుసని, మద్రాస్ ఎక్కడ ఉందో కూడా తెలియదని చెప్పారు. తమ ఊరినే ఒక దేశంగా భావించే పరిస్థితిలో ఆ పాత్రలు ఉంటాయని, జాతీయ భావన కంటే తమ ఊరిని, తమ మనుషులను కాపాడుకోవాలనే ఆలోచనతో ముందుకు వెళ్తారని వివరించారు. అయితే ఈ కథలో చూపించే సమస్య మాత్రం దేశంలోని ప్రతి ఊరికి కనెక్ట్ అవుతుందని, అప్పట్లో కరువు పరిస్థితులను ఎన్నో ప్రాంతాలు ఎదుర్కొన్నాయని చెప్పారు. ఇక సినిమాలో బ్రిటీష్ పాత్రలను కూడా ప్రత్యేకంగా చూపించామని రాహుల్ తెలిపారు. బ్రిటీషర్లు అంటే యూనిఫామ్ వేసుకుని గన్స్ పట్టుకున్నట్టుగా కాకుండా, మన తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలను చూసినప్పుడు కలిగే ఫీలింగ్ వచ్చేలా ఆ పాత్రలను డిజైన్ చేశామని చెప్పారు. సినిమాలో బ్రిటీష్ పాత్రలు ఎక్కువగా ఇంగ్లీష్‌లోనే మాట్లాడతాయని, అవసరమైన సందర్భాల్లో మాత్రం తెలుగులో కూడా డైలాగ్స్ ఉంటాయని తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘రణబాలి’ అక్టోబర్ 16న దసరా సందర్భంగా పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘టాక్సీవాలా’ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడం, అలాగే పెళ్లి తర్వాత విజయ్-రష్మిక తొలిసారి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.     [Ranabaali, Ranabaali Movie, Vijay Deverakonda Ranabaali, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Ranabaali Story, Ranabaali Movie Story, Ranabaali Independence Struggle, Ranabaali Freedom Struggle, Vijay Deverakonda New Movie, Vijay Rashmika Movie, Ranabaali Release Date, Mythri Movie Makers, Telugu Cinema, Tollywood, Ranabaali Latest Update]
Suriya’s upcoming film Scene is continuing to build curiosity with its unusual promotional material. After the title glimpse introduced Suriya as a rather unconventional cop, the makers have now released the first single, Ammo Idi Evarraa, offering another glimpse into the film’s distinct visual world. The song is designed around a gaming concept, with Nazriya Nazim introduced as a fearless street-fighter character within an animated game. The video follows a young girl, played by Thansika, playing the game while choreographer Raj Priyan appears as its singing guide. The animation-driven presentation gives the song a different visual identity, with several frames deliberately designed to resemble a modern video game rather than a conventional film song. Sushin Shyam’s music is another major highlight. The composer builds the track around an addictive tune, while the prominent use of the veena gives the arrangement an unusual texture. Rakendu Mouli’s lyrics and Vinayak’s vocals add to the quirky, intriguing mood of the number. The street-fighter persona seen in the game also appears to offer a hint about Nazriya’s character in the film. Directed by Jithu Madhavan, Scene is said to be an investigative thriller with Naslen playing a prominent role alongside Suriya and Nazriya. The film is produced by Suriya and Jyothika under 2D Entertainment and Zhagaram Studios and is scheduled to release on November 6 for Diwali.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
టాలీవుడ్‌లో ఇద్దరు స్టార్స్ ఇప్పుడు ఒకే తరహా వ్యూహంతో ముందుకు సాగుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజా ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అల్లు అర్జున్, ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు దాదాపు ఒకేలా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్నారు. పైగా ఈ రెండు సినిమాలూ రెండు భాగాలుగా తెరకెక్కుతున్నాయని ప్రచారం జరుగుతోంది. వీలైనంత త్వరగా రెండు భాగాల చిత్రీకరణను పూర్తి చేసి, పెద్ద గ్యాప్ లేకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది ఇద్దరి ప్లాన్‌గా చెబుతున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమా చేస్తున్నారు. మొదట ఈ సినిమా ఒకే భాగంగా తెరకెక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే కథ, స్కేల్‌ను దృష్టిలో పెట్టుకుని దీన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్టు టాక్. ఇక ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ కూడా రెండు భాగాలుగా రూపొందుతోందని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా భారీ షెడ్యూల్స్‌తో కొనసాగుతోంది. సాధారణంగా ఒక సినిమా రెండు భాగాలుగా వస్తే.. మొదటి భాగం విడుదలైన తర్వాత రెండో భాగం కోసం ఎక్కువ సమయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్, ఎన్టీఆర్ సినిమాల విషయంలో మాత్రం అలా కాకుండా.. ‘ధురంధర్’ తరహాలో రెండు భాగాలను వీలైనంత తక్కువ గ్యాప్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అందుకే ఇద్దరూ ముందుగా అనుకున్న సమయం కంటే ఎక్కువగా తమ ప్రస్తుత సినిమాల షూటింగ్స్‌కు కేటాయిస్తున్నారని టాక్. ఈ రెండు భాగాల షూటింగ్ పూర్తయిన తర్వాతే కొత్త సినిమాల వైపు వెళ్లాలని ఇద్దరూ భావిస్తున్నట్టు సమాచారం. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో టెన్షన్.. ‘గాడ్ ఆఫ్ వార్’ విషయంలో ఎందుకీ భయం.!       [NTR Allu Arjun Same Strategy, Raaka Movie, Dragon Movie, Allu Arjun, Jr NTR, Prashanth Neel, Atlee, Telugu Film News]  
ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే భారీ అంచనాలు. ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారన్న వార్త వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది. పైగా ఈసారి మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ పాన్ ఇండియా సినిమాగా రాబోతుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాపై అభిమానుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం ‘గాడ్ ఆఫ్ వార్’ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. కార్తికేయ స్వామి కథతో అత్యంత భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కనుంది. ఇంత భారీ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు అసలు సమస్య షూటింగ్ కాదు.. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అనే చర్చ మొదలైంది. దీనికి కారణం త్రివిక్రమ్ తాజా ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమా అక్టోబర్ 9న విడుదల కావాల్సి ఉండగా మరోసారి వాయిదా పడింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు ‘గాడ్ ఆఫ్ వార్’ను గుర్తు చేసుకుంటున్నారు. ‘ఆదర్శ కుటుంబం’ లాంటి సాధారణ కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు కూడా చివరి దశలో మార్పులు, వాయిదాలు చోటుచేసుకుంటే.. భారీ మైథలాజికల్ సినిమాను త్రివిక్రమ్ ఎలా హ్యాండిల్ చేస్తారన్న ప్రశ్న సోషల్ మీడియాలో మొదలైంది.  ప్రస్తుతం ఫ్యాన్స్‌లో ఉన్న టెన్షన్ అంతా ‘సినిమా ఎలా ఉంటుంది?’ అన్న దానికంటే.. ‘ఇంత భారీ సినిమాను త్రివిక్రమ్ ఎంత పక్కాగా ప్లాన్ చేస్తారు?’ అన్నదే. మరి ‘ఆదర్శ కుటుంబం’ తర్వాత త్రివిక్రమ్ తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారు? ‘గాడ్ ఆఫ్ వార్’ కోసం ఆయన తన వర్కింగ్ స్టైల్‌ను మార్చుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: గరివిడి లక్ష్మి ఎవరు.. బయోపిక్ తీసే అంతలా ఆమె ఏం చేసింది.?       [NTR Fans Worry About God of War, Jr NTR Fans, God Of War Movie, Trivikram Srinivas, Aadarsha Kutumbam Movie, Victory Venkatesh, Telugu Film News]  
Itllu Arjuna is leaning heavily into its youthful romantic appeal with its latest single, Yellow Chunni. The film’s promotional material has highlighted the chemistry of the leads Aniesh and Anaswara Rajan. This song further intensifies the duo's magic on the big screen.  Composed by S Thaman, Yellow Chunni is built as a slow, contemporary melody rather than a conventional romantic number. Vishal Mishra’s vocals give the song its smooth texture, while the English portions and Sreejo’s lyrics add to its modern, Gen-Z flavour. The arrangement grows gradually, making it a good melody. The visuals undeline Anaswara Rajan's beauty and her chemistry with Aniesh. Playing a character who cannot speak, Aniesh has to rely heavily on expressions and body language, and the song gives him considerable space to do that. His chemistry with Anaswara is too good and intrigues people to watch it on big screens.  Directed by Mahesh Uppala, Itllu Arjuna revolves around a young man who cannot speak and the lengths he goes to for the woman he falls in love with. Venky Kudumula is making his debut as a producer with the film, which is scheduled to release on October 30. The songs and teaser have created good buzz for the film, till date.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఆధునిక వేగవంతమైన జీవనశైలిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, సరైన పోషకాహారం తీసుకోవడం అత్యంత కీలకమైన అంశంగా మారింది. ముఖ్యంగా శరీర బరువు తగ్గించుకోవాలని నిరంతరం ప్రయత్నించే వారికి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాల్సిన డయాబెటిస్ బాధితులకు రోజువారీ ఆహారం ఎంతో శ్రద్ధతో ఎంచుకోవాల్సి ఉంటుంది. అటువంటి వారి కోసం అస్సలు ఒక్క బొట్టు నూనె కూడా వాడకుండా, ఎంతో రుచికరంగా, ఆరోగ్యకరంగా ఇంట్లోనే తయారుచేసుకునే ఒక అద్భుతమైన సాంప్రదాయ వంటకమే "సొరకాయ జొన్న రొట్టె". ఉదయం అల్పాహారంగా గానీ లేదా రాత్రి వేళ సులభంగా అరిగే రాత్రి భోజనంగా గానీ ఈ రొట్టెను చాలా సులభంగా సిద్ధం చేసుకోవచ్చు. మన వంటింట్లో లభించే అతి సాధారణమైన పదార్థాలతోనే లంచ్ లేదా డిన్నర్ సమయాల్లో డిఫరెంట్ రుచిని ఆస్వాదించవచ్చు. ఈ రుచికరమైన ఆరోగ్యకరమైన రొట్టె తయారీకి కావలసిన కొలతలు మరియు పదార్థాలను పరిశీలిస్తే: 1 కప్పు తొక్క తీసి నీళ్లు పిండకుండా సిద్ధం చేసుకున్న సొరకాయ తురుము, 1 కప్పు మంచి జొన్న పిండి, 1/4 కప్పు శనగ పిండి, 1 చిన్నదిగా తరిగిన ఉల్లిపాయ, 2 నుండి 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, కొద్దిగా కరివేపాకు తరుగు, 1/2 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు మరియు అవసరమైతే కొద్దిగా కారం తీసుకోవాలి. ముందుగా సొరకాయను బాగా కడిగి తురుముకోవాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే సొరకాయ తురుము నుండి నీటిని అస్సలు పిండకూడదు. ఎందుకంటే సొరకాయలోని సహజ సిద్ధమైన తడిదనమే పిండిని చక్కగా కలపడానికి ఎంతగానో సహాయపడుతుంది. వంట తయారీ విధానంలోకి వస్తే, ఒక వెడల్పాటి గిన్నెలో సొరకాయ తురుము, జొన్న పిండి, శనగ పిండిలను వేసి, వాటికి తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ధనియాల పొడి మరియు ఉప్పు చేర్చి మొదట నీళ్లు పోయకుండా సొరకాయ తడితోనే బాగా కలుపుకోవాలి. పిండి గట్టిగా అనిపిస్తే మాత్రమే కొద్దికొద్దిగా నీరు చిలకరిస్తూ చపాతీ పిండి కంటే కాస్త మృదువుగా ఉండేలా కలుపుకోవాలి. రొట్టెను వత్తడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది; నూనె వాడకుండా ఉండటానికి ఒక కాటన్ తడి వస్త్రాన్ని నీటిలో ముంచి బాగా పిండేసి, ఆ తడి గుడ్డపై పిండి ముద్దను ఉంచి చేతితో సన్నగా రొట్టెలా వత్తుకోవాలి. వేడెక్కిన పెనంపై ఈ తడి గుడ్డలోని రొట్టెను బోర్లించి వస్త్రాన్ని జాగ్రత్తగా తీసివేస్తే రొట్టె పెనంకు అంటుకోకుండా నీట్‌గా వస్తుంది. రొట్టెను రెండు వైపులా తక్కువ మంటపై బంగారు రంగు వచ్చేవరకు చక్కగా కాల్చుకోవాలి. నూనె లేకపోవడం వల్ల రొట్టె ఎండిపోయినట్లు అనిపిస్తే కొద్దిగా నీటి చుక్కలను చిలకరించి మెత్తగా ఉడికించుకోవచ్చు. ఈ సొరకాయ జొన్న రొట్టెలో పీచు పదార్థం (ఫైబర్) అత్యధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ వేగవంతమై కడుపు ఉబ్బరం తగ్గడమే కాకుండా, ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. గ్లూటెన్ రహితమైన జొన్న పిండి మరియు తక్కువ క్యాలరీలు ఉండే సొరకాయ కలయిక వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగవు. కొలెస్ట్రాల్ మరియు బరువు సమస్యలతో బాధపడేవారికి, జొన్న రొట్టెలు తినడానికి మారాం చేసే పిల్లలకు ఈ సొరకాయ జొన్న రొట్టె ఒక ఉత్తమమైన ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం.       [Sorakaya Jonna Rotte, Bottle Gourd Jowar Roti, Jowar Flour, Bottle Gourd Recipes, Healthy Breakfast, Diabetes Diet, Weight Loss Diet, Oil Free Recipes, Gluten Free Food, High Fiber Foods]
ప్రస్తుత ఆధునిక ఉద్యోగ జీవనశైలిలో డెస్క్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) చేసే ఉద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీనితో పాటే మెడ నొప్పి, తీవ్రమైన వెన్నునొప్పి సమస్యలు కూడా ఆందోళనకర రీతిలో హెచ్చరిస్తున్నాయి. పూర్వం కేవలం వయసు పైబడిన వారిలోనే కనిపించే ఈ ఎముకలు, కండరాల బలహీనతలు నేడు 20 ఏళ్ల లేత వయసులోని యువతను, టీనేజర్లను కూడా తీవ్రంగా వేధిస్తున్నాయి. ఐటీ, కార్పొరేట్ ఉద్యోగాలు చేసే ఆడా, మగా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం నరకం చూస్తున్నామని వాపోతున్నారు. వైద్య నిపుణుల పరిశోధనల ప్రకారం, కార్యాలయ ఉద్యోగులు తమ పనివేళల్లో దాదాపు 81.8% సమయం కదలకుండా కూర్చోవడానికే కేటాయిస్తున్నారు. ఈ సుదీర్ఘ గంటల కదలికలేని జీవనశైలి వల్ల సుమారు 65% కంటే ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు ఏదో ఒక రకమైన ఎముకలు, వెన్నెముక లేదా కండరాల నొప్పులకు గురవుతున్నారు. ఈ సమస్యలన్నింటికీ ప్రధాన కారణం గంటల తరబడి ల్యాప్‌టాప్, కంప్యూటర్ల ముందు సరైన అవగాహన లేకుండా, వంకరగా తప్పు కోణంలో కూర్చోవడమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్ చిన్నదిగా ఉండటం వల్ల ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకోవడం లేదా టేబుల్‌పై తక్కువ ఎత్తులో ఉంచి చూసే క్రమంలో తలను ముందుకు వంచుతుంటాం. మానవ శరీరంలో మన మెడకు ప్రకృతిసిద్ధంగా ఒక విశిష్టమైన బాధ్యత ఉంది. అది మన తలను సమతుల్యం చేస్తూ అన్ని దిశల్లోనూ సునాయాసంగా తిప్పడానికి సహాయపడుతుంది. సాధారణంగా మన తల బరువు 10 నుండి 12 పౌండ్లు ఉంటుంది. అయితే, మనం ల్యాప్‌టాప్ చూస్తూ తలను కేవలం 15 డిగ్రీల కోణంలో ముందుకు వంచినప్పుడు, మెడ కండరాలపై పడే విపరీతమైన ఒత్తిడి ఏకంగా 27 పౌండ్లకు పెరుగుతుంది. అదే తలను 60 డిగ్రీల కోణంలో కిందికి వంచితే, మెడపై పడే భారం ఏకంగా 60 పౌండ్లకు సమానమవుతుంది. రోజుకు 8 నుండి 10 గంటల పాటు నిలబడటం కంటే కూర్చోవడం వల్ల నడుము భాగంలోని వెన్నెముక డిస్క్‌లపై దాదాపు 40% అదనపు ఒత్తిడి పెరుగుతుంది. ఈ అదనపు ఒత్తిడి వల్ల మెడ వెనుక భాగంలోని కండరాలు తీవ్ర అలసటకు గురై, క్రమంగా భుజాలు పట్టేయడం, తలనొప్పి రావడం మరియు చేతుల్లో తిమ్మిర్లు రావడం వంటి తీవ్రమైన సమస్యలు మొదలవుతాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే వెన్నెముక తన సహజసిద్ధమైన ఆకారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే, ఈ నొప్పుల నుంచి విముక్తి పొందడానికి ఉద్యోగాలు వదిలేయాల్సిన అవసరం లేదు; కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. మొదటిగా, మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్ ఎత్తును మీ నేరు కంటి చూపు లెవెల్‌కు సరిపోయేలా 'ల్యాప్‌టాప్ స్టాండ్' సహాయంతో సరిచేసుకోవాలి. దీనివల్ల స్క్రీన్ చూసేందుకు మెడను కిందికి వంచాల్సిన అవసరం ఉండదు. రెండోది, కూర్చునే భంగిమలో మార్పు తెచ్చుకోవాలి. వీపు మరియు వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకుంటూ కుర్చీ వెనుక భాగానికి ఆనుకుని సౌకర్యవంతంగా కూర్చోవాలి. అలాగే కూర్చున్నప్పుడు మీ రెండు పాదాలు నేలకు పూర్తిగా సమాంతరంగా ఆని ఉండటం చాలా ముఖ్యం. అన్నింటికంటే కీలకమైన సూత్రం ప్రతి 40 నుండి 45 నిమిషాలకు ఒకసారి చిన్న విరామం ఇవ్వడం. ఒకే చోట గంటల కొద్దీ కదలకుండా కూర్చోకుండా, కుర్చీ నుంచి లేచి రెండు నిమిషాలు గదిలో నడవాలి. నిపుణుల అధ్యయనాల ప్రకారం, క్రమం తప్పకుండా ప్రతి గంటకూ రెండు నిమిషాల సమయం వెచ్చించి శరీరాన్ని కాస్త కదిలించడం లేదా తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల రాబోయే మెడ, వెన్ను నొప్పుల తీవ్రతను 44% నుంచి 17% కి తగ్గించవచ్చని రుజువైంది. ఆఫీసు సమయంలో చిన్నచిన్న వ్యాయామాలు చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి తోడ్పడుతుంది. కానీ, మీ మెడ లేదా వెన్ను నొప్పి తీవ్రమై, మెడను సాధారణంగా తిప్పలేకపోవడం, భుజాలు లేదా చేతులు మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అర్హత కలిగిన ఆర్థోపెడిక్ లేదా ఫిజియోథెరపీ వైద్యుడిని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం శ్రేయస్కరం.       [Neck Pain, Back Pain, Desk Jobs, Work From Home, Poor Posture, Laptop Ergonomics, Spine Health, IT Employees, Stretching Exercises, Physiotherapy]  
చాణక్యుడు చెప్పిన మాట.. దయచేసి ఇలాంటి పరిస్థితులలో మాత్రం మౌనంగా ఉండండి..  మానవ జీవితంలో మాట అనేది ఎంత శక్తివంతమైనదో, మౌనం కూడా అంతే ప్రయోజనకరమైనది. ఎన్నో  సందర్భాల్లో మనం మాట్లాడే మాటల కంటే మౌనంగా ఉండటమే మనకు గొప్ప గౌరవాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. నోటి నుంచి వచ్చిన మాటను తిరిగి తీసుకోలేము. కొన్నిసార్లు ఎంత మంచి ఉద్దేశంతో మాట్లాడినా, సమయం , సందర్భం సరిగ్గా లేకపోతే అది తీవ్రమైన గొడవలకు, మనస్పర్థలకు దారితీస్తుంది. అందుకే  గొప్ప దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు అయిన ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో మాటల వల్ల జరిగే సంఘటనల గురించి, మౌనం  గొప్పతనం గురించి వివరంగా చెప్పారు. జీవితంలో ప్రశాంతంగా, విజయవంతంగా ఉండటానికి ఎలాంటి పరిస్థితులలో మౌనంగా ఉండాలో చాణక్యుడు స్పష్టంగా మార్గదర్శనం చేశారు. ఆ ముఖ్యమైన ఆరు సందర్భాల గురించి  వివరంగా తెలుసుకుంటే.. ఇద్దరు వ్యక్తులు గొడవపడుతున్నప్పుడు.. ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్న  సమయంలో పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోకుండా మధ్యలో దూరి అభిప్రాయం చెప్పడం చాలా ప్రమాదకరం. సమస్యను పరిష్కరించాలనే మంచి ఉద్దేశం  ఉన్నప్పటికీ, అక్కడ ఉన్నవారు మీ మాటలను వేరేలా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మీ మాటలు ఒకరికే అనుకూలంగా ఉన్నాయని భావించి, మిమ్మల్ని కూడా ఆ వివాదంలోకి లాగుతారు. కాబట్టి ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు వాతావరణం ప్రశాంతంగా మారే వరకు వేచి చూడటం, మాట్లాడకుండా మౌనంగా ఉండటమే మంచిది. ఎదుటి వ్యక్తి  సలహాను స్వీకరించడానికి  ఇష్టపడనప్పుడు.. ఒక మనిషికి సలహా ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉందంటే, ఆ వ్యక్తి దానిని వినడానికి, అర్థం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎవరైనా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసి, మీ మాటలను అస్సలు పట్టించుకోవడానికి ఇష్టపడనప్పుడు, వారికి పదే పదే  చెప్పాలని చూడటం వల్ల ప్రయోజనం ఉండదు. పైగా అది అనవసరమైన వాదనలకు దారితీస్తుంది. అటువంటి సమయంలో మీ అభిప్రాయాలను వారిపై రుద్దకుండా మౌనంగా వెనక్కి తగ్గడమే వివేకవంతమైన పని. మీ మాటలకు లేదా అభిప్రాయాలకు  గౌరవం లభించని చోట.. మీరు ఎంత మంచి విషయాలు చెప్పినా ఎదుటివారు మిమ్మల్ని తేలిగ్గా తీసుకుంటున్నా, లేదా మీ మాటలను పదే పదే  తోసిపుచ్చుతూ హేళన చేస్తున్నా అక్కడ పదే పదే మాట్లాడటం సరికాదు. ప్రతిసారి మిమ్మల్ని మీరు సరైనవారని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మాటలను  అక్కడితో ముగించి మౌనంగా ఉండటం ద్వారా మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవచ్చు. ప్రతి వాదనలోనూ గెలవడం కంటే మన ప్రశాంతతను, గౌరవాన్ని నిలబెట్టుకోవడమే ముఖ్యం. పూర్తి సమాచారం లేదా స్పష్టత లేనప్పుడు.. సగం సగం తెలిసిన విషయాలతో లేదా కేవలం అంచనాలతో సలహాలు ఇవ్వడం చాలా నష్టం కలిగిస్తుంది. ముఖ్యంగా తీవ్రమైన లేదా సున్నితమైన విషయాలలో అవగాహన లేకుండా మాట్లాడితే ఇతరులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అందుకే ఒక విషయం గురించి సరిగ్గా తెలియనప్పుడు, దాని గురించి ముందుగా పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. నాకు ఈ విషయం పూర్తిగా తెలియదు అని అంగీకరించి మౌనంగా ఉండటమే నిజమైన తెలివితేటలకు నిదర్శనం. ఇతరుల కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వివాదాల్లో.. ఇతరుల కుటుంబ విషయాలలో బయటి వ్యక్తులకు పూర్తి వివరాలు లేదా వారి మధ్య ఉండే పాత బంధాలు, భావోద్వేగాలు తెలియవు. అడిగి అడగకుండా అటువంటి విషయాల్లో సలహాలు ఇవ్వడం లేదా కల్పించుకోవడం అస్సలు మంచిది కాదు. కాలక్రమేణా కుటుంబ సభ్యులు తమ సమస్యలను తామే పరిష్కరించుకుని ఒకటవుతారు, కానీ ఆ సమయంలో మీరు అన్న మాటలు మాత్రం వారి మనస్సులో అలానే ఉండిపోతాయి. కాబట్టి ఇతరుల ఇంటి సంబంధిత గొడవల్లో మౌనంగా ఉండటమే మంచిది. ఎదుటి వ్యక్తి తీవ్రమైన కోపంలో ఉన్నప్పుడు.. కోపంలో ఉన్న మనిషి సాధారణ స్థితిలో ఆలోచించలేడు. ఆ సమయంలో మనం చెప్పే మంచి మాటలు లేదా ఇచ్చే సరైన సలహాలు కూడా వారికి విమర్శలాగానో లేదా వ్యతిరేకతలాగానో కనిపిస్తాయి. దీనివల్ల కోపం ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందే తప్ప తగ్గే అవకాశం ఉండదు. అందుకే ఎదుటివారి కోపం చల్లారే వరకు ఓపికగా, మౌనంగా ఉండాలి. సరైన సమయం చూసి, ప్రశాంత వాతావరణంలో మాట్లాడితే వారు మీ మాటను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. పైన చెప్పుకున్న ఆరు పరిస్థితులలో చాణక్యుడు చెప్పినట్లుగా మౌనాన్ని ఆశ్రయించడం వల్ల మన ప్రశాంతత దక్కడమే కాకుండా, అనవసరమైన చిక్కులు, గొడవలు, ఆత్మీయులతో మనస్పర్థలు రాకుండా చూసుకోవచ్చు. సరైన సమయంలో మాట్లాడటం ఎంత ముఖ్యమో, సరైన సందర్భంలో మౌనంగా ఉండటం కూడా అంతే గొప్ప కళ.                              *రూపశ్రీ.  
చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడం, అరికాళ్లు మంటగా అనిపించడం, నడిచేటప్పుడు పాదాల్లో మంట లేదా సూదులు గుచ్చినట్లుగా ఉండటం వంటి సమస్యలను చాలామంది సాధారణంగా తీసుకుంటారు. ముఖ్యంగా షుగర్ ఉన్నవారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అవి మధుమేహం వల్లే వచ్చాయని భావిస్తుంటారు. అయితే ప్రతి సందర్భంలోనూ కారణం షుగర్ మాత్రమే కాకపోవచ్చు. మన శరీరంలో నరాల పనితీరు సక్రమంగా ఉండటానికి కొన్ని ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు అవసరం. వీటిలో Vitamin B12, Vitamin B1, Folate, Calcium వంటి పోషకాలు ముఖ్యమైనవి. వీటిలో ఏదైనా లోపించినప్పుడు నరాలపై ప్రభావం పడి చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, మొద్దుబారడం, మంట, బలహీనత లేదా నడకలో అసౌకర్యం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో Vitamin D లోపం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఇలాంటి లక్షణాలతో సంబంధం కలిగి ఉండవచ్చు. అదే సమయంలో మధుమేహం ఎక్కువకాలం నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీనిని Diabetic Neuropathy అంటారు. ముఖ్యంగా పాదాల్లో మంట, నొప్పి, తిమ్మిర్లు, స్పర్శ తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కేవలం షుగర్‌నే కారణంగా భావించకుండా, అసలు కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. అయితే శరీరంలో పోషక లోపం ఉందని లక్షణాలను బట్టి మాత్రమే నిర్ణయించలేం. అవసరమైన సందర్భాల్లో వైద్యులు సూచించే రక్త పరీక్షలు, షుగర్ పరీక్షలు, Vitamin B12 వంటి పోషకాల స్థాయిలను పరిశీలించడం ద్వారా సమస్యకు కారణం ఏమిటో తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో చేతులు, కాళ్లలో తిమ్మిర్లు ఎందుకు వస్తాయి? అరికాళ్లలో మంటకు షుగర్‌తో పాటు ఇంకా ఏ కారణాలు ఉండవచ్చు? Vitamin B12, B1, Folate, Calcium వంటి పోషకాల లోపాన్ని ఎలా గుర్తించాలి?  వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో Dr. Swathi సులభమైన తెలుగులో వివరిస్తున్నారు. తరచుగా చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడం, పాదాల్లో మంట లేదా నొప్పి ఉండటం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వాటి వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడం అవసరం. ఈ లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే లేదా తీవ్రంగా ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి. గమనిక: ఈ కథనం మరియు వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీకు ఉన్న లక్షణాలకు కారణాన్ని స్వయంగా నిర్ధారించుకోకుండా, అవసరమైన పరీక్షలు మరియు చికిత్స కోసం అర్హత కలిగిన వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
డయాబెటిస్ ఉన్నవారిలో తరచుగా కనిపించే కొన్ని సమస్యలు రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా కూర్చొని లేవగానే తల తిరగడం, నిలబడినప్పుడు తూలినట్లు అనిపించడం, శరీరంలో బలహీనత, కండరాల బలం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. తల తిరగడానికి షుగర్ కారణమా? లేక చెవి, మెదడు, మెడకు సంబంధించిన సమస్యల వల్ల Vertigo వస్తుందా? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. ఈ వీడియోలో డాక్టర్ ప్రవీణ్ కుమార్ డయాబెటిస్ మరియు Vertigo గురించి సులభమైన తెలుగులో ముఖ్యమైన విషయాలను వివరిస్తున్నారు. షుగర్ పూర్తిగా Zero అవుతుందా? డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయగలమా? Type 1 Diabetes, Type 2 Diabetes మధ్య తేడా ఏమిటి? శరీరంలో Insulin Resistance ఎలా ఏర్పడుతుంది? డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు అవసరం? వంటి సాధారణ సందేహాలకు ఈ వీడియోలో వివరణ లభిస్తుంది. డయాబెటిస్‌లో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా పర్యవేక్షణ, శారీరక చురుకుదనం వంటి అంశాల ప్రాధాన్యతను కూడా తెలుసుకోవచ్చు. దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే శరీరంపై ఎలాంటి ప్రభావాలు ఉండవచ్చు? కండరాల బలం ఎందుకు తగ్గుతుంది? బలహీనత, లైంగిక సమస్యలు వంటి ఇబ్బందులకు డయాబెటిస్‌తో సంబంధం ఉందా? అనే విషయాలను కూడా డాక్టర్ వివరిస్తారు. ఇక తల తిరగడం లేదా Vertigo విషయానికి వస్తే ప్రతి తల తిరుగుడూ ఒకే కారణంతో ఉండదు. Vertigoలో వివిధ రకాలు ఉంటాయి. ముఖ్యంగా తల లేదా శరీరాన్ని ఒక పొజిషన్ నుంచి మరో పొజిషన్‌కు మార్చినప్పుడు అకస్మాత్తుగా తల తిరిగినట్లు అనిపించే BPPV (Benign Paroxysmal Positional Vertigo) గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అలాగే చెవికి సంబంధించిన సమస్యలు, Aural Vertigo, మెడకు సంబంధించిన Cervical Spondylosis, శరీర స్థితి (Posture) వంటి కారణాల వల్ల కూడా తల తిరగడం లేదా బ్యాలెన్స్ సమస్యలు రావచ్చని వివరిస్తున్నారు. తల తిరుగుతున్నప్పుడు అసలు కారణాన్ని గుర్తించడం ఎందుకు ముఖ్యమో, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలో కూడా ఈ వీడియో ద్వారా అర్థం చేసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షుగర్‌ను క్రమం తప్పకుండా ఎలా మానిటర్ చేయాలి? శరీరంలో బలహీనత, కండరాల నష్టం రాకుండా ఎలాంటి జీవనశైలి పాటించాలి? Vertigo ఉన్నప్పుడు చెవుల ఆరోగ్యం, శరీర భంగిమ, రోజువారీ అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి ఉపయోగకరమైన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. అదేవిధంగా Homeopathy Approach గురించి కూడా ఈ వీడియోలో ప్రస్తావించారు. అయితే డయాబెటిస్ లేదా Vertigo వంటి సమస్యలకు స్వయంగా మందులు తీసుకోవడం లేదా ఇప్పటికే వాడుతున్న వైద్య చికిత్సను ఆపడం కాకుండా, అర్హత కలిగిన వైద్యుడి సలహాతోనే చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. షుగర్ కంట్రోల్, డయాబెటిస్‌లో వచ్చే సమస్యలు, తల తిరగడానికి కారణాలు, Vertigo రకాలు, BPPV, చెవి సమస్యలు, Cervical Spondylosis, ఆహారం మరియు రోజువారీ ఆరోగ్య జాగ్రత్తల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఈ వీడియోలో అందించిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. డయాబెటిస్, Vertigo లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు వ్యక్తిగత చికిత్సను వైద్యుల సలహా లేకుండా మార్చకండి లేదా మందులను నిలిపివేయకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ఉదయాన్నే  పరగడుపున టీ లేదా కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. రోజును చురుగ్గా ప్రారంభించడానికి కాఫీ, టీ లు తాగుతూ ఉంటారు.  అయినప్పటికీ ఇవి శరీరంలో  అసిడిటీ, హార్మోన్ల అసమతుల్యత , ఇతర జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. వీటి స్థానంలో శరీరాన్ని చురుగ్గా ఉంచుతూనే శరీరంలో ఉన్న అనారోగ్యాలను, జబ్బులను, ఇబ్బందులను తగ్గించగల పానీయం తాగడం చాలా మంచిది.  ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు తొలగిపోవడమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంతకీ అంత శక్తివంతమైన ఆ పానీయం ఏమిటో? దాన్ని ఎలా తయారుచేసుకుని తాగాలో.. వివరంగా తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. ధనియాలు,  జీలకర్ర,  సోంపు ,  వాము  పైన పేర్కొన్న దినుసులలో ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ​తయారీ విధానం... ఈ పానీయాన్ని తయారు చేయడం చాలా సులభం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని తీసుకుని మరిగించాలి. అందులో అర టీస్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ సోంపు , పావు టీస్పూన్ వాము వేయాలి. ఈ మిశ్రమాన్ని నీరు సగం అయ్యేంత వరకు చిన్న మంటపై బాగా మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. రుచి కోసం లేదా అదనపు ఆరోగ్య ప్రయోజనాల కోసం కాస్త నిమ్మరసం లేదా తేనె కూడా కలపవచ్చు. ఈ పానీయం తాగడం వల్ల శరీరానికి కలిగే  ఉపయోగాలు.. ​హార్మోన్ల సమతుల్యత.. మహిళల్లో ఎదురయ్యే థైరాయిడ్, పిసిఓడి , పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం  వంటి సమస్యలకు ఈ పానీయం చాలా మేలు చేస్తుంది. ధనియాలు , సోంపు శరీరంలో హార్మోన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరించడానికి తోడ్పడతాయి. ​జీర్ణవ్యవస్థ మెరుగుదల.. జీలకర్ర , వాము జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ , మలబద్ధకం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ​రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ.. టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారికి ఈ పానీయం సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గేందుకు సహాయం.. శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడంలో జీలకర్ర , వాము కీలక పాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా ఈ పానీయం తాగడం ద్వారా శరీర మెటబాలిజం పెరిగి బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ​చర్మ సౌందర్యం , డిటాక్సిఫికేషన్.. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఫలితంగా చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం సహజంగా మెరుస్తుంది. ​కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం.. ఈ పదార్థాల్లో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు , వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ​ఈ డిటాక్స్ డ్రింక్‌ను ప్రతిరోజూ ఉదయం పరగడుపున క్రమం తప్పకుండా తాగడం ద్వారా శరీరంలో సహజమైన మార్పులను గమనించవచ్చు. టీ, కాఫీలకు ప్రత్యామ్నాయంగా ఈ నేచురల్  పానీయాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా శరీరంలో చాలా మార్పులు గమనించవచ్చు.                       *రూపశ్రీ.