LATEST NEWS
   తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన నూతన రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు, కవితకు అధికారిక పత్రాలను అందజేశారు. గత కొద్దికాలంగా తన రాజకీయ ప్రస్థానంపై సస్పెన్స్ కొనసాగించిన కవిత, ఇటీవల మేడ్చల్ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో సొంత పార్టీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ఆమె తన పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’గా ప్రకటించారు. కానీ, ఎన్నికల సంఘం నిబంధనలు మరియు సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ పేరులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. తుది నిర్ణయం ప్రకారం, కవిత పార్టీ పేరును ‘తెలంగాణ రక్షణ సేన’  గా ఎన్నికల సంఘం ఖరారు చేసింది. విశేషమేమిటంటే, ఈ పార్టీ సంక్షిప్త నామం ‘టీఆర్ఎస్‌’ గా ఉండబోతోంది. గురువారం మధ్యాహ్నం ఎన్నికల సంఘం ప్రతినిధులు బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి చేరుకుని, పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని స్వయంగా ఆమెకు అందజేశారు. తెలంగాణ అస్తిత్వం, రక్షణే ధ్యేయంగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లనున్నట్లు కవిత ఇప్పటికే స్పష్టం చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ నుంచి ‘తెలంగాణ రక్షణ సేన’గా పేరు మారినా, లక్ష్యం మాత్రం మారబోదని ఆమె అనుచరులు పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ అనే పాత సెంటిమెంట్ పేరు మళ్లీ తెరపైకి రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. తొలుత పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సేన’గా ప్రకటించినప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ‘రక్షణ సేన’గా మారడం వెనుక ప్రాంతీయ ప్రయోజనాల పరిరక్షణ అనే భావన బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లే లక్ష్యంగా కవిత తన భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ అధికారిక ఆమోదంతో కవిత తన తదుపరి కార్యాచరణపై దృష్టి సారించనున్నారు. త్వరలోనే పార్టీ జెండా, గుర్తు, మరియు కమిటీల ప్రకటన ఉండే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లాల పర్యటనలకు కూడా ఆమె సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కవిత దరఖాస్తు చేసుకున్న “తెలంగాణ రక్షణ సేన” పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ సందర్భంగా కవిత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిన విషయాన్ని సమస్త తెలంగాణ సమాజానికి తెలియజేయడం ఆనందంగా ఉంది. రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, పునరుజ్జీవం కోసం నేను చేస్తున్న కృషిని కొనసాగిస్తూ, ఇకపై కూడా తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే లక్ష్యంగా అంకితభావంతో పనిచేస్తాను” అని పేర్కొన్నారు. అలాగే, “జనవరి 2026లో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నాం. అందులో మూడవ ప్రాధాన్యతగా ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించడం కేవలం యాదృచ్ఛికమేనేమో… లేక ‘టీఆర్ఎస్’ నాకు రాసిపెట్టి ఉందేమో!” అంటూ చమత్కారంగా ట్వీట్ చేశారు. కవిత దరఖాస్తులో సూచించిన పేర్లు ఇవి: తెలంగాణ ప్రజా జాగృతి తెలంగాణ జాగృతి తెలంగాణ రక్షణ సేన తెలంగాణ రాష్ట్ర జాగృతి తెలంగాణ ప్రజాశక్తి ఈ ఐదు పేర్లలో ఏదో ఒక పేరుతో రాజకీయ పార్టీ స్థాపనకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కవిత కోరగా, అప్లికేషన్‌లో మూడో ప్రాధాన్యతగా పేర్కొన్న “తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)” పేరుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.  
దక్షిణ భారత రాజకీయాల్లో కీలకమైన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న తరుణంలో  వివిధ జాతీయ,  ప్రాంతీయ  సంస్థలు బుధవారం (ఏప్రిల్ 29) వెల్లడించిన  ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కే పట్టం కట్టాయి.  సుదీర్ఘ విరామం తర్వాత కేరళలో అధికార మార్పిడి జరగబోతోందనీ, ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్  సర్కార్ గద్దె దిగడం ఖాయమని  దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్సూ కూడా అంచనా వేశాయి. కేరళలో  కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నాయి.  మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో  ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71.  బుధవారం (ఏప్రిల్ 29)   వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే  అధికారమని అంచనా వేశాయి. పినరయి విజయన్ వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు లేవని పేర్కొన్నాయి.  ఇందుకు  యాంటీ ఇంకంబెన్సీ,  కారణమని పేర్కొన్నాయి. దానికి తోడు..  కాంగ్రెస్ దూకుడు కూడా పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కార్ వెనుకబాటుకు కారణమని విశ్లేషించాయి.  కాగా.. కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. తెలంగాణకు చెందిన మంత్రుల బృందంతో కలిసి ఆయన కేరళలో  ఇంచుమించు  పది రోజుల పాటు విస్తృతంగా పర్యటించి..  యూడీఎఫ్ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేశారు.   ఈ ప్రచార సమయంలో కేరళ సీఎం విజయన్‌కు, రేవంత్ రెడ్డికి మధ్య జరిగిన మాటల యుద్ధం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. రేవంత్ రెడ్డి వ్యూహాలు,  కాంగ్రెస్ జాతీయ నాయకత్వం చేసిన ప్రచారం ఓటర్లను ఆకట్టుకోవడంలో సఫలమైనట్లు సర్వేల ఫలితాలు సూచిస్తున్నాయి.  యాక్సిస్ మై ఇండియా సర్వే కేరళలో యూడీఎఫ్‌కు 78 నుంచి 90 స్థానాలు దక్కుతాయని పేర్కొనగా,  పోల్ ల్యాబ్ సర్వే  ఏకంగా 90 నుంచి 92 సీట్లు వస్తాయని అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీస్  అయితే కాంగ్రెస్ కూటమి 72 నుంచి 80 , పీపుల్స్ పల్స్ 75నుంచి 85 స్థానాలను యూడీఎఫ్ సాధిస్తుందని అంచనా వేశాయి.  ఎస్ఏఎస్ గ్రూప్ సర్వే కూడా కాంగ్రెస్ కూటమికి 76 నుంచి 81 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.  ఇక సర్వే సంస్థల అంచనాల మేరకు అధికార ఎల్‌డీఎఫ్ కూటమి  45 - 66 స్థానాలకే  మధ్యే పరిమితమయ్యే అవకాశం ఉంది  బీజేపీ  కేరళలో తన ఉనికిని చాటుకోవాలని తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఫలితాల్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని సర్వేలు పేర్కొన్నాయి. చాలా వరకూ సర్వే సంస్థలు రాష్ట్రంలో బీజేపీ ఖాతా తెరిచే అవకాశం లేదని అంచనా వేశాయి.   ప్రస్తుత ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే, కేరళలో ఐదేళ్లకోసారి అధికారం మారే సాంప్రదాయం మళ్లీ పునరావృతమైనట్లు అవుతుంది. గత ఎన్నికల్లో విజయన్ ఈ సంప్రదాయాన్ని చెరిపివేస్తూ వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకున్నారు. కానీ ఈసారి ప్రజలు మార్పును కోరుకున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.  పెరిగిన ధరలు, నిరుద్యోగం మరియు పాలనపై వ్యతిరేకత వంటి అంశాలు విజయన్ ప్రభుత్వానికి ప్రతికూలంగా మారాయని తెలుస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ శ్రేణులు ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పండుగ చేసుకుంటున్నాయి. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ తర్వాత కేరళలో కూడా పట్టు సాధించడం ద్వారా జాతీయ స్థాయిలో పార్టీకి పునర్వైభవం వస్తుందని హస్తం నేతలు అంటున్నారు.  
ఏప్రిల్ 29న‌ విడుదలైన తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. ప్రదీప్ గుప్తాకి చెందిన‌ యాక్సిస్ మై ఇండియా సర్వే ఫలితాలు అందరినీ విశ్మయ పరిచాయి.  తమిళనాట  విజయ్  టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది. తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.  అంటే తమిళనాడులో టీవీకే పార్టీ విజయం సాధిస్తుందన్నది ఆయన అంచనా అన్నమాట.   ఇక డీఎంకే కూటమికి 92 నుంచి110 సీట్లు, అన్నాడీఎంకేకి 22 - 32 సీట్లు వ‌స్తాయ‌ని యాక్సిస్ మై ఇండియా సర్వే పేర్కొంది.  ప్ర‌దీప్ గుప్తా  విశ్లేషణ ప్రకారం.. ముఖ్యంగా 18 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న యువత తమిళనాట సుమారు 42శాతంగా ఉన్నారు. వీరంతా గంప‌గుత్త‌గా విజయ్ వైపు మొగ్గు చూపారు. అందుకే ఆయన టీవీకే విజయం సాధిస్తుందనీ, ఆ విజయం 1983లో ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనంతో  పోల్చదగినదిగా ఉంటుందనీ పేర్కొన్నారు.  అదలా ఉంటే.. మిగిలిన ప్రముఖ సర్వేలన్నీ..  డీఎంకే  మళ్లీ అధికారం చేపడుతుందని చెబుతున్నాయి. పీపుల్స్ ప‌ల్స్ సర్వే అయితే డీఎంకే కూటమికి 125 నుంచి 145 సీట్లు వస్తాయనీ, విజయ్ టీవీకే   18 నుంచి 24 సీట్లలో మాత్రమే విజయం సాధిస్తుందనీ పేర్కొంది. అదే విధంగా  మాట్రిజ్ సర్వే టీవీకే పార్టీకి  పది నుంచి పన్నెండ్లు సీట్లు రావడమే గగనమని పేర్కొంది.ఇక పోతే..  పీమార్క్ సర్వీ విజయ్ పార్టీ 16 నుంచి 26 సీట్లలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.   అంటే..  ఒకవైపు దాదాపు అన్ని సర్వేలూ..  స్టాలిన్ హవా కొనసాగుతుందని చెబుతుంటే, ప్రదీప్ గుప్తా యాక్సిస్ మై ఇండియా మాత్రం  విజయ్  విజయం ఖాయమని పేర్కొంది.  అయితే.. ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే.. యాక్సిస్ మై ఇండియా  గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తాయని అంచనా వేసింది.  అది తప్పవడంతో ప్రదీప్ గుప్తా టీవీ లైవ్ డిబేట్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పట్లో ఆయన అంచనాలు తప్పినా.. అంతకు ముందు.. అంటే  గతంలో  దాదాపు 90శాతం పైగా.. ఆయన అంచనాలు నిజమయ్యాయి. అందుకే ఈసారి ఆయన  విజయ్ పై వేసిన విజిల్ నిజమవుతుందా లేదా? అన్న ఉత్కంఠ వ్యక్తమౌతోంది.  
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై నటుడు ప్రకాష్ రాజ్  మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు  సెలెక్టివ్ గా ఉంటున్నాయని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్  కొన్ని అంశాలపై మాత్రమే  గళం ఎత్తుతున్నారన్న  ప్రకాష్ రాజ్ . ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. కేవలం మతపరమైన భావోద్వేగాలకు సంబంధించిన అంశాలపైనే స్పందిస్తూ, ఇతర దేశవ్యాప్త సమస్యలను పవన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.  ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్   స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.  ముఖ్యంగా మణిపూర్‌  హింసాకాండ, అక్కడ మహిళలపై జరిగిన దాడుల వంటి సున్నితమైన అంశాల గురించి మౌనానికి కారణమేంటన్నారు.  కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ఒక నిర్దిష్ట వర్గాన్ని ఆకట్టుకోవడం కోసం పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారనేది ప్రకాష్ రాజ్ ప్రధాన వాదన. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న పవన్..  అదే ధర్మంలో భాగంగా ఇతర అన్యాయాలు జరిగినప్పుడు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇలా సెలెక్టివ్ అంశాలనే ఎంచుకుని విమర్శలు చేయడం వల్ల సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వివాదం కేవలం లడ్డూ ప్రసాదానికి మాత్రమే పరిమితం కాకుండా, రాజకీయ నాయకుల నైతిక బాధ్యతపై చర్చకు దారితీసింది. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదని, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అని, ఆయన తన విమర్శల్లో నిష్పక్షపాతంగా ఉండాలని ప్రకాష్ రాజ్ సూచించారు. మరోవైపు, పవన్ కళ్యాణ్ అభిమానులు, కూటమి నాయకులు ప్రకాష్ రాజ్ విమర్శలను తిప్పి కొడుతున్నారు. మతపరమైన సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న అంశం కాబట్టే పవన్ గట్టిగా స్పందిస్తున్నారంటున్నారు. అయితే..  ప్రకాష్ రాజ్ మాత్రం తన పంథా మార్చుకోకుండా, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సెలెక్టివ్ పాలిటిక్స్ కు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.ఇక ప్రకాశ్ రాజ్ విమర్శలపై  పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్న ఉత్కంఠ ఏపీ రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతోంది.  
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో దేశమంతా ఇప్పుడు కోల్‌కతా వైపు ఆసక్తిగా చూస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల చివరి విడత ఓటింగ్ ముగిసిన వెంటనే పలు జాతీయ మీడియా సంస్థలు,  సర్వే ఏజెన్సీలు తమ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెలువరించాయి. బెంగాల్ పీఠంపై మరోసారి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్   జెండా ఎగురవేస్తుందా?  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ) అధికారంలోకి వస్తుందా అనే ఉత్కంఠకు ఈ సర్వేలు మరింత ఆజ్యం పోశాయి. వివిధ సర్వే సంస్థల అంచనాల ప్రకారం.. బెంగాల్ పోరు హోరా  సాగినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా  యాక్సిస్ మై ఇండియా'తన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా..  బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక  సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం టీఎంసీకి 148 నుంచి 160 స్థానాలు, బీజేపీకి 120 నుంచి 135 స్థానాలు దక్కుతాయి.  అదలా ఉండగా.. కొన్ని సర్వేలు బెంగాల్‌లో కమలం వికాసం తథ్యమని పేర్కొన్నాయి.  చాణక్య స్ట్రాటజీస్,  జన్ కీ బాత్ వంటి సంస్థల సర్వేలు బెంగాల్ లో అధికారం బీజేపీకే అని పేర్కొన్నాయి.  చాణక్య అంచనాల ప్రకారం బీజేపీకి 150 నుంచి 160 స్థానాలు వచ్చే అవకాశం ఉండగా.. , టీఎంసీకి 130 నుంచి 140 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇక  పీ-మార్క్   సర్వే అయితే బీజేపీకి గరిష్టంగా 175 స్థానాలు రావచ్చని..  టీఎంసీ.. 118 నుంచి 138 స్థానాలకే పరిమితం అవుతుందని పేర్కొంది. ఇక కొన్ని సర్వేలైతే..  బెంగాల్ లో టీఎమ్సీ, బీజేపీ మధ్య తేడా అత్యంత స్వల్పమని తేల్చాయి.  పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్  సగటు అంచనాల ప్రకారం టీఎంసీ 144 స్థానాలు, బీజేపీ 143 స్థానాలు సాధించవచ్చని పేర్కొనడం గమనార్హం. అంటే ఇక్కడ కేవలం ఒక్క సీటు తేడాతో అధికారం ఎవరికి దక్కుతుందనేది  తేలే అవకాశం కనిపిస్తోంది. టైమ్స్ నౌ-సీఎన్ఎక్స్ మాత్రం మమతా బెనర్జీకే  ఆధిక్యం ఉంటుందనీ.. ఆ పార్టీ 155 నుంచి 170 స్థానాలలో విజయం సాధిస్తుందనీ అంచనా వేసింది.  మొత్తంగా పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారం ఆరంభం నుంచీ ఉద్రిక్తతలు కొనసాగాయి.  మమతా బెనర్జీ తన సొంత ఇలాకాను కాపాడుకోవడానికీ,  కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, మోదీ బెంగాల్‌లో పాగా వేయడానికి సర్వశక్తులూ ఒడ్డారు. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ తన బలాన్ని గణనీయంగా పెంచుకున్నట్లు ఎగ్జిట్ పోల్స్ ద్వారా స్పష్టమవుతోంది. అయితే..  బెంగాల్ ప్రజలు 'దీదీ' పక్షాన నిలిచారా లేక మోదీ  పరివర్తన్  నినాదానికి జై కొట్టారా అనేది ఫలితాలు వల్లడయ్యే వరకూ వేచి చూడాల్సింది.  గతంలో నందిగ్రామ్ వంటి కీలక నియోజకవర్గాల్లో మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారనే వార్తలు వచ్చినా..  రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ   బలంగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు మతపరమైన ధ్రువీకరణ..  కేంద్ర ప్రభుత్వ పథకాలు తమకు లాభిస్తాయని బీజేపీ ఆశాభావంతో ఉంది. కాంగ్రెస్,   లెఫ్ట్ కూటమి ఈ ఎన్నికల్లో నామమాత్రపు ప్రభావానికే పరిమితం కావచ్చని దాదాపు అన్ని సర్వేలూ తేల్చేశాయి.  చాలా సర్వేల్లో వారు ఒంటి సంఖ్యకే పరిమితమవుతారని అంచనా వేశారు.  మొత్తానికి బెంగాల్ ఓటర్ల తీర్పు ఈసారి ఎవరికి పట్టం కడుతుందనేది ఆసక్తికరంగా మారింది. దీదీ తన పట్టు నిలుపుకుంటారా?  మోదీ హవా బెంగాల్ కోటను దాటుతుందా అన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమౌతోంది.  
ALSO ON TELUGUONE N E W S
రితేష్ రాణా దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ 'జెట్లీ' (JETLEE). 'మత్తు వదలరా' వంటి వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకున్న రితేష్ రాణా, ఈసారి కమెడియన్ సత్యను ప్రధాన పాత్రలో పెట్టి ఒక క్రేజీ అడ్వెంచర్‌ను మన ముందుకు తీసుకురాబోతున్నారు. మే 1న 'జెట్లీ' థియేటర్లలో ల్యాండ్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ విశేషాలు: ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ట్రైలర్ ప్రారంభం నుండి ముగింపు వరకు రితేష్ రాణా మార్క్ కామెడీ, యాక్షన్ అదిరిపోయాయి. ముఖ్యంగా సత్య తనదైన టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ట్రైలర్‌ను ఆద్యంతం వినోదాత్మకంగా మార్చాడు.  ఫ్లయిట్ జర్నీ నేపథ్యంలో సాగే కామెడీ అండ్ అడ్వెంచర్‌ ఫిల్మ్ లా ఇది కనిపిస్తోంది. తన కడుపులో పెన్ను గుచ్చుకోవడంతో.. అనుకోకుండా పొడుచుకుందా? ఎవరైనా కావాలని పొడిచారా? అంటూ సత్య వేసే లెక్కలు నవ్వులు పూయించాయి.  తాను ఎవరన్నది మర్చిపోయి, తనను తాను తెలుసుకునే పాత్రలో సత్య కనిపిస్తున్నాడు. తనను తాను యాక్షన్ హీరోలా ఊహించుకుంటూ ఫైట్లు కూడా చేయడం విశేషం. ఇక 'నన్ను చూసి ఏడవకురా" అని టీషర్ట్ వెనుక రాసుకోవడం హైలైట్ అని చెప్పవచ్చు.  రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ట్రైలర్ లో కాల భైరవ అందించిన సంగీతం, సురేష్ సారంగం విజువల్స్ ఆకట్టుకున్నాయి.  క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను సమర్పిస్తోంది. 'జెట్లీ' చిత్రం మే 1న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని కలిగిస్తోంది. మరి సత్య హీరోగా మారి చేసిన ఈ ‘జెట్లీ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.  
    ప్రభాస్(Prabhas),నాగ్ అశ్విన్(Nag Ashwin)ల కల్కి 2 పార్ట్ 1 ని మించి తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.  బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట షురూ అనే నమ్మకం కూడా అందరిలో ఉంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా గత కొన్ని రోజులుగా ఈ సీక్వెల్‌లో  జేడీ చక్రవర్తి(Jd Chakravarthy)ఒక ముఖ్యమైన క్యారక్టర్ లో కనిపించబోతున్నాడనే న్యూస్ ని తనకి ఎదురే లేదు నేను చెప్పేది నిజమంటూ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటా ఉంది. ఇప్పుడు ఆ ప్రచారానికి జెడి నే ముక్కుతాడు వేయడం కొసమెరుపు. ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం.     రీసెంట్ గా  ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జేడీకి 'కల్కి 2'లో మీరు చేస్తున్నారా అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన చాలా స్పష్టంగా, తనదైన శైలిలో సమాధానమిచ్చారు. సోషల్ మీడియాలో ఏదైనా వార్త ఎంత వేగంగా స్ప్రెడ్ అవుతుందో  కల్కి 2 విషయంలో నా పేరు వినిపించడం చూస్తే అర్థమవుతోంది. సీక్వెల్‌లో నేను చేస్తునట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇప్పటి వరకు చిత్ర యూనిట్ నుంచి  నాకు ఎలాంటి పిలుపు కూడా రాలేదు. నేను ఉన్నాననే  ప్రచారం కేవలం పుకారు మాత్రమే.. కానీ ప్రస్తుతానికి నేను ఆ ప్రాజెక్టులో భాగం కాదు. 'కల్కి' మొదటి భాగం చూసి ఎంతో ఎంజాయ్ చేశాను.  నాగ్ అశ్విన్ లాంటి దర్శకులు తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు. ఆయన మేకింగ్ స్టైల్ సూపర్. ప్రభాస్  భైరవ క్యారక్టర్ ని అద్భుతంగా పోషించాడు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం గర్వకారణం. నాకు  ఇలాంటి భారీ ప్రాజెక్టులలో చేయాలనీ  ఉన్నప్పటికీ, పిలవనిదే వెళ్లలేము కదా అని వ్యాఖ్యానించారు. Also read: Peddi: పెద్ది నుంచి మరో లుక్ రీలీజ్..చరణ్ గెటప్ ఇదేనా!  జేడీ చక్రవర్తి వంటి విలక్షణ నటుడు 'కల్కి' ప్రపంచంలో ఉంటే బాగుంటుందని ఆశించిన అభిమానులకు ఆయన మాటలు కొంత నిరాశ కలిగించవచ్చు. అయితే సినిమాల్లో ఏదైనా జరగచ్చు కాబట్టి భవిష్యత్తులో జేడీ కోసం నాగ్  అశ్విన్  ఏదైనా పవర్‌ఫుల్ క్యారక్టర్ ని డిజైన్ చేస్తాడేమో చూడాలి. జెడి  రేపు గాయపడ్డ సింహం తో అభిమానులని, ప్రేక్షకులని కలవనున్నాడు.    
పెద్ది(Peddi)కి సంబంధించిన న్యూస్ రాకపోతే సోషల్ మీడియాకి పొద్దు పొడవదేమో అనేలా ఉంది పరిస్థితి. ఆ హింట్ ప్రకారమే రోజుకొక న్యూస్ హల్ చేస్తూ అభిమానులు,మూవీ లవర్స్ లో జోష్ ని తీసుకొస్తున్నాయి. ఈ కోవలోనే రీసెంట్ గా మరో క్రేజీ న్యూస్ హల్ చల్ చేస్తుంది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం. పెద్దికి సంబంధించి ఇప్పటికి వరకు రెండు లుక్స్ వచ్చిన విషయం తెలిసిందే  సదరు లుక్స్ తో చరణ్(Ram Charan)క్రికెటర్ గా,  కుస్తీ ఫైటర్ గా రెండు షేడ్స్ లో కనిపించబోతున్నాడని అర్ధమయ్యింది ఇప్పుడు మూడో లుక్  త్వరలోనే రాబోతుందనే మాటలు వినపడుతున్నాయి. దీంతో ఆ లుక్ ఏమై ఉంటుందనే చర్చల్లో ఫ్యాన్స్ మునిగిపోయారు. కొత్త ముందైతే పలనా గెటప్ అంటూ నెట్టింట్లో తిష్ట వేశారు. మరి పెద్దిలో చరణ్ పలు క్రీడలో ప్రావిణ్యం ఉన్న వ్యక్తిగా చేస్తున్న నేపథ్యంలో ఈ సారి ఎలాంటి గేమ్ కి సంబంధించిన లుక్ లో కనిపిస్తాడో చూడాలి.    also read: Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు హెడ్ లైన్స్ చూద్దాం ప్రస్తుతం చిత్ర యూనిట్ పెద్ది కి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉంది. అందులో భాగంగా ఇటీవల శృతి హాసన్, చరణ్ పై స్పెషల్ సాంగ్ ని చిత్రీకరించారు. ఇక పెద్ది రిలీజ్ డేట్ వాయిదా పడుతుందనే రూమర్స్ కి కౌంటర్ గా పెద్ది దర్శకుడు బుచ్చిబాబు(Buchi Babu)రిలీజ్ డేట్ మారదని ఘంటా పదంగా చెప్పకొచ్చాడు.  
ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. తాజాగా అనుపమ నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ (Bhogi) నుండి విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఆమె గతంలో ఎన్నడూ చూడని ఒక విభిన్నమైన, రగ్గడ్ లుక్‌లో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. కందుల సులోచన రాణిగా సరికొత్త అవతార్ ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ 'కందుల సులోచన రాణి' అనే శక్తివంతమైన గ్రామీణ మహిళ పాత్రను పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో ఆమె తలపై గంప పెట్టుకుని, ఒక చేత్తో క్యారియర్ పట్టుకుని నడుచుకుంటూ వస్తున్న తీరు చాలా సహజంగా ఉంది. గ్లామరస్ పాత్రలకు భిన్నంగా, ఈ సినిమాలో అనుపమ డీ-గ్లామరైజ్డ్ మరియు ఇంటెన్సివ్ లుక్‌లో మెప్పిస్తున్నారు. ఈ సినిమా 1960ల కాలం నాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. మాస్ సినిమాల స్పెషలిస్ట్ సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన తనదైన శైలిలో ఈ పీరియడ్ డ్రామాను భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 28, 2026న థియేటర్లలో అడుగు పెట్టనుంది.  శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ ఇప్పటికే ప్రేక్షకులలో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇప్పుడు ‘భోగి’ వంటి ఇంటెన్స్ పీరియడ్ డ్రామాలో వీరిద్దరూ ఎలా అలరిస్తారో చూడాలి. ముఖ్యంగా అనుపమ చేస్తున్న కందుల సులోచన రాణి పాత్ర ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోతుందని అభిమానులు ఆశిస్తున్నారు.  
  నీకు ఎవరున్నా లేకపోయినా నేను ఉన్నాను, జోష్ గ్యారంటీ అంటూ ఏ రోజు కా రోజు సరికొత్త సినీ క్రేజీ న్యూస్ టాలీవుడ్ ట్రెండింగ్ రంపంలో మన ముందుకు వస్తూనే ఉన్నాయి. మరి ఈ రోజు  టాలీవుడ్ ట్రెండింగ్ చూద్దాం. 1 .పవన్ పై ఘాటైన విమర్శలు చేసిన ప్రకాష్ రాజ్  పవన్ కళ్యాణ్ గురించి రీసెంట్ గా ప్రకాష్ రాజ్ మాట్లాడుతు పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు సెలెక్టివ్ గా ఉంటున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కేవలం మతపరమైన భావోద్వేగాలకి సంబంధించిన అంశాలపైనే స్పందిస్తూ, ఇతర దేశవ్యాప్త సమస్యలని పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చాడు. సదరు  ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్, జనసేన నాయకులూ కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు. ప్రకాష్ రాజ్ నే తన  పంథా మార్చుకొని సెలెక్టివ్ పాలిటిక్స్ కి  స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తున్నారు. 2 .పూజాహెగ్డే ఆ హీరోతో పెళ్లి పీటలు ఎక్కబోతుందా! బుట్టబొమ్మ పూజాహెగ్డే ప్రముఖ బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో వివాహం చేసుకోబోతుందనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిజానికి ఈ ఇద్దరు  రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే వార్తలు ఎప్పట్నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో కూడా ఆ ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటోలు, ఒకరి గురించి ఒకరు చేసుకొనే సోషల్ మీడియా పోస్టులు వైరల్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఒకే కారులో ఆ ఇద్దరు కనపడటంతో పెళ్లి టాపిక్స్ వస్తున్నాయి 3 .బాలకృష్ణ, శేఖర్ కమ్ముల కాంబో ఫిక్స్ అవ్వబోతుందా! గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కలిసి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారని న్యూస్ వినిపిస్తోంది. వినడానికి ఇది కాస్త ఆశ్చర్యంగా ఉన్నా, ఈ కాంబో సెట్ అయితే టాలీవుడ్‌లో ఒక మోస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ వండర్ అవుతుందనడంలో సందేహం లేదు. శేఖర్ కమ్ముల అనగానే మనకి గుర్తొచ్చే సినిమాలు తెలిసిందే. మరి   బాలయ్య అనగానే గుర్తొచ్చే ఊర మాస్ సినిమాలు తెలిసిందే. 4 . థియేటర్స్ లో అడుగుపెట్టిన కర ధనుష్ ఈ రోజు 'కర' తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. మూవీ చూసిన ప్రేక్షకుల నుంచైతే  టాక్ కొంచం తేడాగానే వస్తుంది. అసలు బుకింగ్స్ రెస్పాన్స్ కూడా పెద్దగా లేకపోవడం గమనార్హం. ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్  5 .ఎట్టకేలకు థియేటర్స్ లో అడుగుపెడుతున్న ధ్రువ నక్షత్రం  చియాన్ విక్రమ్, విభిన్న చిత్రాల దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ కాంబోలో తెరకెక్కిన మూవీ ధ్రువ నక్షత్రం. దగ్గర దగ్గరగా ఏడేళ్ల నుంచి రిలీజ్ కష్టాలని మోస్తూ వస్తుంది. ఎట్టకేలకు ఆ కష్టాలకి సెండ్ ఆఫ్ ఇచ్చి మే 22 న రిలీజ్ కాబోతున్నటుగా టాక్. ఈ మేరకు మేకర్స్ నుంచి అధికార ప్రకటన కూడా రానుంది. 6 . కందుల సులోచన రాణిగా అనుపమ పరమేశ్వరన్  శర్వానంద్, సంపత్ నంది కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం భోగి. ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్స్ తో తెరకెకక్కుతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ అనుపమ లుక్ రిలీజ్ చేసారు. కందుల సులోచన రాణిగా అనుపమ కనిపించబోతుంది. నెత్తి పైన కూరగాయల గంప పెట్టుకొని చేతిలో టిఫిన్ క్యారేజ్ పట్టుకుని ఉన్న అనుపమ లుక్ సోషల్ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్ హోదాలో కొనసాగుతుంది. 7 .పెద్ది మూడో లుక్ రాబోతోందా! పెద్దికి సంబంధించి ఇప్పటికి వరకు రెండు లుక్స్ వచ్చాయి. సదరు లుక్స్ తో చరణ్ క్రికెటర్ గా,  కుస్తీ ఫైటర్ గా రెండు షేడ్స్ లో కనిపించబోతున్నాడని అర్ధమయ్యింది . ఇప్పుడు మూడో లుక్  త్వరలోనే రాబోతుందనే మాటలు సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. పెద్దిలో చరణ్ పలు క్రీడలో ప్రావిణ్యం ఉన్న వ్యక్తిగా చేస్తున్న నేపథ్యంలో   ఈ సారి ఎలాంటి గేమ్ కి సంబంధించిన పిక్ బయటకి వస్తుందా అనే ఆసక్తి మొదలైంది. 8 .డ్రాగన్ లో ఊహించని లుక్ లో ఎన్టీఆర్!  ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న డ్రాగన్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిసిందే.  ఎవరు ఊహించని మేకోవర్ లో ఎన్టీఆర్ కనిపించనున్నాడనే టాక్ వినపడుతుంది. ప్రెజెంట్ ఉన్న సన్నటి లుక్ నుంచి నెక్స్ట్ బరువు పెరిగి బల్క్ బాడీ తో ఫిట్ గా కనిపించనున్నట్టుగా టాక్. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. నెక్స్ట్ ఇయర్ జూన్ 11  డ్రాగన్ రిలీజ్ డేట్ 9 . లెజెండరీ డైరెక్టర్ సినిమాకి  వెరైటీ టైటిల్‌! సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం లో నాగ్ అశ్విన్ నిర్మాతగా ఒక చిత్రం రూపు దిద్దు కుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి 'Sing - Geetham' అనే టైటిల్ ఖరారు చేసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సంగీత నేపథ్యంలో సాగే స్టోరీ . దాదాపు డజను పాటలు ఉంటాయట. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. 10 .కల్కి 2 లో నేను లేనంటున్న జెడి చక్రవర్తి  ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో తెలియదు గాని కల్కి 2 లో జె డి చక్రవర్తి చేస్తున్నాడనే  న్యూస్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆ వార్తలపై జె డి స్పందిస్తు నేను కల్కి 2 లో చేయలేదని చెప్పాడు. జేడి రేపు 'గాయపడ్డ సింహం' తో థియేటర్స్ లో అడుగుపెడుతున్నాడు  
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ పెళ్లి వేడుకలో ఆడంబరాల కంటే కూడా నూతన వధూవరుల మధ్య ఉన్న అనుబంధం, చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో బెల్లంకొండ శ్రీనివాస్ ఎంత కేరింగ్ పర్సన్ అనే విషయాన్ని చాటిచెబుతోంది. ముహూర్తం వేళ ముచ్చటైన దృశ్యం హిందూ సంప్రదాయ వివాహాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం ‘జీలకర్ర-బెల్లం’. వధూవరులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర-బెల్లం ఉంచే సమయంలో తీసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.  ఆ పవిత్రమైన ముహూర్తం సమయంలో తన భార్య తలపై జీలకర్ర-బెల్లం పెడుతూనే, ఆమె నగలు కొంచెం చెదిరిపోవడాన్ని శ్రీనివాస్ గమనించారు. ఎంతో ఏకాగ్రతతో ఉండాల్సిన ఆ సమయంలో కూడా ఆయన తన భార్య ధరించిన నగలను (పాపిడి బిళ్ళ వంటివి) ఎంతో సున్నితంగా సరిచేశారు.  ఈ చిన్న దృశ్యం చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. "బెల్లంకొండ ఎంత క్యూటో.. ఎంత కేరింగో!" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  సోషల్ మీడియాలో ట్రెండింగ్ పెళ్లిలో బావమరిదికి 500 నోట్ల కట్టలు ఇచ్చిన వీడియో ఒకవైపు హల్చల్ చేస్తుంటే, ఇప్పుడు ఈ క్యూట్ వీడియో కూడా యూట్యూబ్ షార్ట్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ వీడియో చూస్తుంటే తన వ్యక్తిగత జీవితంలో కూడా శ్రీనివాస్ ఎంత బాధ్యతగా, ప్రేమగా ఉంటారో అర్థమవుతోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.  
న‌టీన‌టులు: ధ‌నుష్‌, మ‌మితా బైజు, కె.ఎస్‌.ర‌విర‌కుమార్‌, క‌రుణాస్‌, జ‌య‌రామ్‌, సూర‌జ్ వెంజ‌నాయుడు త‌దిత‌రులు సంగీతం: జి.వి.ప్ర‌కాష్‌కుమార్‌ సినిమాటోగ్ర‌ఫీ: తెని ఈశ్వ‌ర్‌ ఎడిటింగ్: శ్రీ‌జిత్ సారంగ్  ర‌చ‌న: ఆల్‌ఫ్రెడ్ ప్ర‌కాష్‌, విఘ్నేష్ రాజా నిర్మాత: ఇషారి కె.గ‌ణేష్‌ బ్యాన‌ర్స్:వేల్స్ ఫిలిం ఇంట‌ర్నేష‌న‌ల్‌, థింక్ స్టూడియోస్‌ ద‌ర్శ‌క‌త్వం: విఘ్నేష్ రాజా విడుద‌ల లేదీ: 30.04.26 సినిమా నిడివి: 161 నిమిషాలు ధ‌నుష్ హీరోగా సినిమా వ‌స్తోందీ అంటే ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఉంటాయి. తెలుగులో కూడా అత‌నికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. త‌మిళ్ నుంచి అనువాద‌మై ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ అయిన చాలా సినిమా తెలుగులో హిట్ అయ్యాయి. తాజాగా విఘ్నేష్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన క‌ర చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది?  ప్రేక్ష‌కుల నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తోంది? ఈ సినిమాతో ధ‌నుష్ మ‌రో స‌క్సెస్ అందుకున్నాడా? అనేది తెలుసుకుందాం.  క‌థ: త‌న ఇంట్లోనే దొంగ‌త‌నం చేసి డ‌బ్బుతో పారిపోయిన క‌ర‌స్వామి అలియాస్ క‌ర‌(ధ‌నుష్‌).. కొన్ని సంవ‌త్స‌రాల పాటు దొంగ‌త‌నాలు చేస్తూనే జీవిస్తాడు. ఆ త‌ర్వాత త‌న ప్రియురాలి కోసం దొంగ‌త‌నాలు మానెయ్యాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. స్నేహితుడితో క‌లిసి చివ‌రి దొంగ‌త‌నానికి పాల్ప‌డ‌తాడు. ఆ క్ర‌మంలో క‌ర పోలీసుల‌కు దొరికిపోతాడు. అత‌ని స్నేహితుడు త‌ప్పించుకుంటాడు. పోలీసుల నిర్బంధంలో ఉన్న క‌ర‌పై అత‌ను చేసిన నేర‌మే కాకుండా మ‌రికొన్ని దొంగ‌త‌నాలు కూడా చేర్చి కేసును ప‌టిష్టం చెయ్యాల‌ని చూస్తాడు ఓ పోలీస్ ఆఫీస‌ర్‌. దీంతో క‌ర అత‌నిపై దాడి చేసి పోలీస్ స్టేష‌న్ నుంచి త‌ప్పించుకుంటాడు. క‌ట్ చేస్తే.. ఆరు నెల‌ల త‌ర్వాత త‌న భార్య‌తో క‌లిసి ఓ హోటల్‌లో ప‌నిచేస్తుంటాడు. అలా వ‌చ్చే డ‌బ్బు చాలా త‌క్కువ‌గా ఉండ‌డంతో త‌నే ఓ హోట‌ల్ పెట్టాల‌ని డిసైడ్ అవుతాడు. తాకట్టు పెట్ట‌డానికి అత‌ని ద‌గ్గ‌ర ఎలాంటి ఆస్తీ లేక‌పోవ‌డంతో బ్యాంకు వారు లోన్ ఇచ్చేందుకు నిరాక‌రిస్తారు. చివ‌రికి త‌న తండ్రి పేరు మీద ఉన్న పొలాన్ని తాక‌ట్టు పెట్టాల‌నుకుంటాడు. కొన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత వాళ్ల ఊరికి వెళ్తాడు. తండ్రికి విష‌యం చెబుతాడు. అప్ప‌టికే పొలం తాక‌ట్టు పెట్టి ట్రాక్ట‌ర్ తీసుకున్నాన‌ని చెబుతాడు తండ్రి. అయితే పొలాన్ని అమ్మేస్తే డ‌బ్బు వ‌స్తుంద‌ని, అందులో త‌న‌కు కొంత డ‌బ్బు ఇస్తే వ్యాపారం చేస్తాన‌ని తండ్రితో చెబుతాడు క‌ర‌. పొలం అమ్మ‌డానికి క‌ర తండ్రి ఒప్పుకోడు. అదే స‌మ‌యంలో బ్యాంక్ లోన్ క‌ట్ట‌ని కార‌ణంగా పొలం జ‌ప్తు చేస్తామ‌ని నోటీసు వ‌స్తుంది. ఒక‌రోజు క‌ర తండ్రి చ‌నిపోతాడు. అత‌ని శ‌వాన్ని ఖ‌న‌నం చేసే స‌మ‌యంలో బ్యాంకు అధికారులు వ‌చ్చి జ‌ప్తు నోటీసు వ‌చ్చిన త‌ర్వాత ఆ భూమిని దేనికీ ఉప‌యోగించ‌కూడ‌ద‌ని చెబుతారు. లోన్ క్లియ‌ర్ చేసిన త‌ర్వాతే శ‌వాన్ని ఖ‌న‌నం చెయ్యాలంటారు. అలాంటి ప‌రిస్థితిలో క‌ర ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడు? త‌న పొలంలోనే త‌న‌ని ఖ‌న‌నం చెయ్యాల‌న్న చివ‌రి కోరిక‌ను తీర్చేందుకు, బ్యాంకు లోన్ క‌ట్టేందుకు డ‌బ్బు ఎలా సంపాదించాడు? ఈ క్ర‌మంలో అత‌నికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి?  త‌న తండ్రిలా బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఆస్తులు పోగొట్టుకునే స్థితికి వ‌చ్చిన ఆ ఊరి వారి కోసం క‌ర ఏం చేశాడు? అనేది మిగ‌తా క‌థ‌.  విశ్లేష‌ణ: ఒక చిన్న పాయింట్‌తో అల్లిన పెద్ద క‌థ ఇది. ఈ క‌థ చుట్టూ అనేక అంశాలను జోడించారు. అయితే డైరెక్ట‌ర్‌లోని గొప్ప‌త‌నం ఏమిటంటే.. సినిమా స్టార్ట్ అయిన మొద‌టి నిమిషంలోనే క‌థ‌లోకి వెళ్లిపోయాడు. ఎలాంటి ఇంట్ర‌డ‌క్ష‌న్స్‌గానీ, హీరో ఎలివేష‌న్స్‌గానీ లేకుండా కేవ‌లం త‌ను అనుకున్న క‌థ‌పై, క‌థ‌నంపై దృష్టి పెట్టాడు. సినిమా స్టార్ట్ అయిన త‌ర్వాత ఫ‌స్ట్‌హాఫ్ వ‌ర‌కు ప్రేక్ష‌కుల్ని సీట్ల నుంచి క‌ద‌లకుండా చేయ‌డంలో డైరెక్ట‌ర్ స‌క్సెస్ అయ్యాడ‌ని చెప్పాలి. అయితే ఫ‌స్ట్ హాఫ్‌లో ఉన్న గ్రిప్‌గానీ, స‌స్పెన్స్‌గానీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌గానీ సెకండాఫ్‌లో లేవు.  సెకండాఫ్ మొద‌లైన కొంత సేప‌టి త‌ర్వాత సినిమా నెమ్మ‌దించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌పై క‌నిపించే ర‌క‌ర‌కాల సీన్స్‌పై ఆడియ‌న్స్‌కి ఇంట్రెస్ట్ త‌గ్గుతుంది. సెకండాఫ్‌లో చూపించిన చాలా అంశాలు అంత‌కుముందు చాలా సినిమాల్లో చూసి ఉండ‌డం వ‌ల్ల ప్రేక్ష‌కుల‌కు కొత్త‌గా అనిపించ‌వు. అలాగే క్లైమాక్స్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. సినిమాలో కొన్ని మెరుపులు మాత్రం ఆడియ‌న్స్‌కి కొత్త‌గా అనిపించాయి. అవి కూడా ఫ‌స్టాఫ్‌లోనే ఎక్కువ‌గా ఉన్నాయి. రొటీన్‌గా వ‌స్తున్న కొన్ని సినిమాల మ‌ధ్య‌లో ఎంతో కొంత కొత్త‌ద‌నాన్ని చూపించేందుకు డైరెక్ట‌ర్ ప‌డిన త‌ప‌న మ‌న‌కు ప్ర‌తి ఫ్రేమ్‌లో క‌నిపిస్తుంది. టెక్నిక‌ల్‌గా అన్ని విష‌యాల్లో తీసుకున్న జాగ్ర‌త్త‌లు కూడా మ‌న‌కు అర్థ‌మ‌వుతాయి.  న‌టీన‌టులు: క‌ర పాత్ర‌కు ధ‌నుష్ ప‌ర్‌ఫెక్ట్‌గా స‌రిపోయాడు. ఇలాంటి క్యారెక్టర్లు చెయ్య‌డం అత‌నికి కొట్టిన పిండి కాబ‌ట్టి పెర్‌ఫార్మెన్స్ విష‌యంలో అత‌నికి వంక పెట్ట‌డానికి లేదు. క‌ర భార్యగా న‌టించిన మ‌మిత బైజు పెర్‌ఫార్మెన్స్ గురించి చెప్పుకోవ‌డానికి ఏమీ లేదు. చాలా రొటీన్‌గా ఉండే క్యారెక్ట‌ర్‌. అద్బుతంగా పెర్‌ఫార్మ్ చేసే స్కోప్ కూడా ఆమెకు లేదు. ఇక డిఎస్‌పి భ‌ర‌త‌న్‌గా న‌టించిన సూర‌జ్ వెంజ‌నామూడు సినిమాలో ఎక్కువ భాగం క‌నిపిస్తాడు. అత‌ని న‌ట‌న బాగుంది. బ్యాంక్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించిన జ‌య‌రామ్ త‌న పెర్‌ఫార్మెన్స్‌లో ర‌క‌ర‌కాల షేడ్స్ చూపించారు. క‌ర తండ్రిగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ అద్భుతంగా న‌టించార‌ని చెప్పాలి. క‌ర మామ‌గా క‌రుణాస్ కూడా మంచి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు.  సాంకేతిక నిపుణులు: టెక్నిక‌ల్ సైడ్ ఈ సినిమాలో గొప్ప విశేషాలు ఏమీ లేవు. ఎందుకంటే ఇంది ఎంతో నేచుర‌ల్‌గా తీసిన సినిమా. ఏ సీన్‌లోనూ ఎలాంటి ఆర్భాటాల‌కు పోలేదు. తెని ఈశ్వ‌ర్ ఫోటోగ్ర‌ఫీ బాగుంది. సిట్యుయేష‌న్‌కి త‌గ్గట్టు, మూడ్‌కి త‌గ్గ‌ట్టు మంచి లైటింగ్‌తో చేశారు. ఇక జి.వి.ప్ర‌కాష్‌కుమార్ మ్యూజిక్ విష‌యానికి వ‌స్తే.. క‌థను న‌డిపే పాట‌ల‌ను సంద‌ర్భానుసారం బాగా ట్యూన్ చేశాడు. బ్యాక్‌స్కోర్ చాలా బాగా కుదిరింది. శ్రీ‌జిత్ సారంగ్ ఎడిటింగ్ కూడా బాగుంది. డైరెక్ట‌ర్ విఘ్నేష్ రాజా గురించి చెప్పాలంటే.. ఒక మంచి క‌థ అనుకొని దాన్ని ఫ‌స్ట్‌హాఫ్ వ‌ర‌కు ఎంతో గ్రిప్పింగ్‌గా న‌డిపారు. సెకండాఫ్‌కి వ‌చ్చేస‌రికి బ్యాంకు వారి మోసాలు అనే ఓ కొత్త క‌థ వ‌చ్చి చేర‌డంతో సినిమా నెమ్మ‌దించింది. ఆ త‌ర్వాత హీరో  చేసే కార్య‌క్ర‌మాలు ఎన్నో సినిమాల్లో చూసేసిన ఫీలింగ్ క‌లుగుతుంది. ఆ విష‌యంలో డైరెక్ట‌ర్ కొత్త‌ద‌నాన్ని చూపించ‌లేక‌పోయాడు.  ప్ల‌స్ పాయింట్స్: ఫ‌స్ట‌హాఫ్‌ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ ధ‌నుష్ పెర్‌ఫార్మెన్స్‌ మైన‌స్ పాయింట్స్: సెకండాఫ్‌ సెకండాఫ్‌లో రొటీన్ అనిపించే అంశాలు ఇంట్రెస్టింగ్‌గా లేని క్లైమాక్స్‌ ప‌క్క‌దారి ప‌ట్టిన క‌థ‌ ఫైన‌ల్‌గా చెప్పాలంటే.. ఈ త‌ర‌హా సినిమాలు గ‌తంలో ఎన్నో వ‌చ్చిన‌ప్ప‌టికీ ఫ‌స్ట్‌హాఫ్ వ‌ర‌కు ప్రేక్ష‌కుల్ని సీట్ల‌లో క‌ద‌ల‌కుండా కూర్చోబెట్టాడు డైరెక్ట‌ర్‌. ధ‌నుష్ పెర్‌ఫార్మెన్స్‌, డైరెక్ట‌ర్ టేకింగ్ కోసం ఒక‌సారి ఈ సినిమా చూడొచ్చు.  రేటింగ్: 2.5/5 - జి.హరా   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
Bellamkonda Sreenivas and Kavya Reddy recently tied the knot in a private and traditional ceremony. The couple exchanged their vows at Karnataka Bhavan in Tirumala, with the wedding rituals concluding late in the evening at 11:13 PM, on 29th April.  Keeping the focus on the spiritual significance of the location and their personal connection, the families opted for an intimate gathering restricted to close relatives rather than a massive public event. Both the bride and groom looked radiant in their traditional wedding attire, which was custom-designed by Shravan Kumar. The photographs from the event capture their genuine happiness as they took their first steps into married life together, seeking the blessings of Lord Venkateshwara. While the wedding itself was kept away from the media glare, the film industry will still get a chance to celebrate with the newlyweds. A grand reception is scheduled to take place tomorrow, May 1st.  Several prominent figures and colleagues from the Telugu film fraternity are expected to attend the upcoming event to congratulate Sreenivas and Kavya in person and celebrate their new journey.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) ఓ ఇంటివాడయ్యారు. గత కొన్ని రోజులుగా ఆయన వివాహ వేడుకకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మెగా వెడ్డింగ్ అత్యంత వైభవంగా, సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగింది. అయితే ఈ పెళ్లి వేడుకలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఘనంగా వివాహ వేడుక ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీనివాస్, అతి తక్కువ సమయంలోనే మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పెళ్లి వేడుకను కుటుంబ సభ్యులు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ కళ్యాణంలో వధూవరులిద్దరూ మెరిసిపోయారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. బావమరిదికి భారీ గిఫ్ట్! హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లిలో బావమరిది వరుడి కాళ్ళు కడిగే ఆచారం ఉంటుంది. బెల్లంకొండ శ్రీనివాస్ వివాహంలో కూడా ఈ ఘట్టం ఎంతో సరదాగా సాగింది. శ్రీనివాస్ కాళ్ళు కడిగిన బావమరిదికి, బావ గారు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు.  కాళ్ళు కడిగినందుకు గానూ బెల్లంకొండ శ్రీనివాస్ తన బావమరిదికి పెద్ద మొత్తంలో డబ్బులు కానుకగా ఇచ్చారు. ఆ సమయంలో అక్కడున్న వారంతా సందడి చేస్తూ నవ్వులు పూయించారు. ఈ సరదా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసి "బావ అంటే ఇలా ఉండాలి" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.   https://x.com/Theteluguone/status/2049713786286957048
The theatrical release of Ram Charan's upcoming sports drama, Peddi, has become a fascinating waiting game filled with strategy. Initially slated for an April 30th release, the film was pushed back to allow the team enough time to wrap up post-production and extensive visual effects. Recently, director Buchi Babu Sana confirmed a June 25th release. This was a calculated move to avoid a direct box office clash with Yash's highly anticipated film, Toxic, which had already locked June 4th.   However, the industry landscape just shifted. With recent reports confirming that Toxic is stepping away from its June 5th date, that prime theatrical window is suddenly wide open. This unexpected development has sparked intense discussions. June 5th offers a lucrative summer release and a clear two-week run.  On the other hand, the currently planned June 25th date places Peddi just one day before Akhil Akkineni's Lenin, creating an unnecessary box office bottleneck. So, the makers have now locked 5th June release as soon as Toxic makers confirmed postponement, say reports. Venkata Satish Kilaru is producing the film with AR Rahman composing music. Janhvi Kapoor, Shiva Rajkumar are playing prominent leading roles in the film.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది. అదే బెల్లం జిగటగా మారడం.  గాలిలోని వేడి, తేమ కారణంగా బెల్లం తరచుగా కరిగి జిగటగా మారుతుంది. అంతేకాకుండా, కొన్నిసార్లు దానికి బూజు కూడా పడుతుంది. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం వల్ల వేసవి కాలంలో కూడా బెల్లం తాజాగా, పొడిగా ఉండేలా చేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ఎయిర్ టైట్ కంటైనర్.. బెల్లానికి గాలి, తేమ అనేవి అతిపెద్ద శత్రువులు. అందువల్ల బెల్లాన్ని నిల్వ చేయడానికి ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల ఎయిర్ టైట్ కంటైనర్ ను  ఉపయోగించాలి. వీలైతే గాజు లేదా స్టీల్‌తో చేసిన పాత్రను ఎంచుకోవాలి. ప్లాస్టిక్ పాత్రలలోకి తరచుగా తేమ చేరి, బెల్లం కరిగిపోతుంది. చిన్న ముక్కలు.. మార్కెట్  నుండి తెచ్చిన బెల్లం ముద్ద మొత్తాన్ని ఒకేసారి డబ్బాలో వేస్తుంటారు. అయితే ఈ పద్ధతిని మానుకోవాలి. బెల్లాన్ని నిల్వ చేసే ముందు చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనివల్ల  అవసరమైనంత మాత్రమే బయటకు తీయడం వీలవుతుంది. బెల్లం మొత్తం పదేపదే బయటి గాలికి గురికాకుండా సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు.. అవసరైమనప్పుడల్లా  బెల్లాన్ని బయటకు తీసి దాన్ని ఏదైనా రాయి లేదా రాడ్ లాంటి దానితో కొట్టి చిన్న ముక్క తీసుకుని,  తిరిగి దాన్ని మళ్లీ కంటైనర్ లో పెట్టడం లాంటివి చేస్తుంటే బెల్లం తొందరగా మెత్తబడి జిగటగా మారుతుంది. నీరు, తడి చేతులకు దూరం.. ఇది చాలా చిన్న విషయమే అయినా చాలా ముఖ్యమైనది. హడావిడిలో బెల్లం తీయడానికి తడి చేతులను గానీ, తడి చెంచాను గానీ ఎప్పుడూ ఉపయోగించకూడదు. చిన్న నీటి చుక్క కూడా  బెల్లం డబ్బా మొత్తాన్ని జిగటగా మార్చి, దానిని పాడుచేస్తుంది. బెల్లం తీసేటప్పుడు ఎల్లప్పుడూ పూర్తిగా పొడి చెంచాను  లేదా పొడి చేతులను మాత్రమే వాడాలి. బియ్యం చిట్కా.. బియ్యం చిట్కా మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్న ఒక పాత చిట్కా.. కానీ ఇది చాలా ప్రభావవంతమైన చిట్కా. కొద్దిగా  బియ్యాన్ని ఒక శుభ్రమైన పత్తి లేదా మస్లిన్ గుడ్డలో కట్టి,  బెల్లం నిల్వ చేసే పాత్ర అడుగున ఉంచాలి. ఆ బియ్యం పాత్రలోని అదనపు తేమను పీల్చుకుంటుంది, దీనివల్ల  బెల్లం పూర్తిగా పొడిగా ఉంటుంది. ఫ్రిజ్ లో నిల్వ.. వేసవిలో  విపరీతమైన వేడి, తేమ ఉంటే , బెల్లాన్ని బయట కాకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. అయితే, దానిని నేరుగా డబ్బాలో ఉంచి నిల్వ చేయకూడదు. బెల్లం ముక్కలను జిప్-లాక్ బ్యాగ్‌లో లేదా శుభ్రమైన కాగితంలో గట్టిగా చుట్టి, ఆ తర్వాత వాటిని ఫ్రిజ్‌లోని ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే బెల్లం జిగటగా మారడం, కరగడం వంటివి జరగవు.                      *రూపశ్రీ.
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పక్కనే ఉన్నా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నాం. నేటి కాలంలో మొబైల్ ఫోన్ మన అందరికీ "మొదటి లైఫ్ పార్ట్నర్" (First Life Partner) గా మారిపోయింది. ఈ డిజిటల్ వ్యసనం వల్ల మన మధ్య ఉండాల్సిన క్వాలిటీ టైమ్ మాయమైపోతోంది. ఈ పరిస్థితిని మార్చుకుని, మళ్ళీ మన బంధాలను ఎలా చిగురింపజేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొబైల్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలి? (Why Should We?) మొబైల్ పక్కన పెట్టి మనుషులతో గడపడం ఎందుకు ముఖ్యం అంటే: సరైన నిర్ణయాలు తీసుకోవడానికి: ముఖాముఖి మాట్లాడుకున్నప్పుడే ఒక విషయంపై చర్చించి సరైన నిర్ణయం (Decision making) తీసుకోగలం. గౌరవం ఇవ్వడం: ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూసుకోకుండా ఉండటం కనీస గౌరవం. బంధం బలపడటానికి: వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేదా ఫ్యామిలీ మధ్య క్వాలిటీ టైమ్ గడపడం వల్ల అనుబంధం పెరుగుతుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) మనకు తెలియకుండానే చేసే ఈ తప్పులు బంధాలను దూరం చేస్తున్నాయి: మొదటి ప్రాధాన్యత ఇవ్వకండి: ఫోన్ కంటే ముందు మనిషికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోన్ ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ కాకూడదు. మధ్యలో మాట్లాడకండి: ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఫోన్ కాల్ వస్తే అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదా గట్టిగా మాట్లాడటం చేయకూడదు. దీనివల్ల అవతలి వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. ముఖ్యమైన సందర్భాల్లో వాడొద్దు: పెళ్లి చూపులు వంటి ముఖ్యమైన చర్చల్లో పాల్గొన్నప్పుడు మొబైల్స్ చూస్తూ కూర్చోవడం వల్ల వచ్చిన అసలు ఉద్దేశమే మర్చిపోయే ప్రమాదం ఉంది. ముందుకు వెళ్ళే మార్గం - చిట్కాలు (How-To Points): మొబైల్ వ్యసనం నుండి బయటపడటానికి ఈ చిన్న మార్పులు చేయండి: సెల్ఫ్ డిసిప్లిన్ (Self-discipline): మొబైల్ వాడకం విషయంలో మనకు మనమే ఒక క్రమశిక్షణ విధించుకోవాలి. సైలెంట్ మోడ్‌లో పెట్టండి: ఎవరితోనైనా క్వాలిటీ టైమ్ గడుపుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి దూరంగా ఉంచండి. ముందే చెప్పండి: ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే, వారికి "నేను ఒక గంట పాటు బిజీగా ఉంటాను, తర్వాత కాల్ చేస్తాను" అని మెసేజ్ పెట్టి మీ క్వాలిటీ టైమ్‌ను ఆస్వాదించండి. పరస్పర అంగీకారం: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి "మనం బయటికి వెళ్ళినప్పుడు మొబైల్స్ వాడొద్దు" అని ఒక రూల్ పెట్టుకోవాలి. ఎవరైనా వాడితే రెండో వ్యక్తి నిర్మొహమాటంగా గుర్తు చేయాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A): ప్రశ్న: బోర్ కొట్టినప్పుడు మొబైల్ చూడటం తప్పా? సమాధానం: బోర్ కొట్టినప్పుడు ఫోన్ చూడటం సహజమే, కానీ ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు వారిని వదిలేసి ఫోన్ చూస్తూ కూర్చోవడం సరైన పద్ధతి కాదు. ఇది గౌరవం మరియు కామన్ సెన్స్ (Common sense) కి సంబంధించిన విషయం. ప్రశ్న: ఫోన్ వాడొద్దు అని చెబితే అవతలి వారు కోప్పడితే ఏం చేయాలి? సమాధానం: ఇది కోప్పడాల్సిన విషయం కాదు. "మనం ఈ సమయాన్ని సరదాగా గడపడానికి వచ్చాం, కాసేపు ఫోన్ పక్కన పెడదాం" అని సున్నితంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ అనేది మన అవసరానికి మాత్రమే, మన జీవితం అవ్వకూడదు. మన కళ్ళ ముందు ఉన్న మనుషుల కంటే, ఆ స్క్రీన్ లో కనిపించే ప్రపంచం ముఖ్యం కాదు. కాబట్టి, నేటి నుండే మీ మొబైల్‌ను కాసేపు పక్కన పెట్టి మీ ప్రియమైన వారితో ఆనందంగా గడపండి. అది మీ సెల్ఫ్ డిసిప్లిన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా Naveena Column యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో 'ఫ్రోజెన్ షోల్డర్' (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో 'అడెసివ్ క్యాప్సులైటిస్' అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి, కనీసం చేయి పైకి ఎత్తడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడి దైనందిన జీవితం స్తంభించిపోతుంది. దీనిని కేవలం సాధారణ నొప్పి అని సరిపెట్టుకొని నిర్లక్ష్యం చేస్తే మున్ముందు కదలికలు మరింత కష్టతరంగా మారుతాయి. ఆధునిక వైద్యంలోని పెయిన్ కిల్లర్స్ కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుండగా, ఆయుర్వేదం ఈ వ్యాధిని మూలాల నుండి నయం చేసే అద్భుతమైన మార్గాలను చూపుతోంది. ఈ క్రమంలో ఫ్రోజెన్ షోల్డర్ లక్షణాలు, కారణాలు మరియు దీనిని శాశ్వతంగా నయం చేసే ఆయుర్వేద చికిత్సా పద్ధతుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రోజెన్ షోల్డర్ అంటే ఏమిటి? మన భుజంలోని కీలు చుట్టూ ఉండే కణజాలం (Capsule) వాపునకు గురై, మందంగా మారడం వల్ల భుజం కదలికలు తగ్గిపోతాయి. దీనివల్ల తీవ్రమైన నొప్పి మరియు బిగుతుగా ఉన్న భావన కలుగుతుంది. ప్రధాన కారణాలు: మధుమేహం (Diabetes): షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  గాయాలు: భుజానికి తగిలిన పాత గాయాలు లేదా శస్త్రచికిత్సల వల్ల.  థైరాయిడ్ సమస్యలు: హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా భుజం కండరాలు దెబ్బతినవచ్చు.  కదలిక లేకపోవడం: ఎక్కువ కాలం చేతికి పని చెప్పకపోవడం వల్ల కీళ్లు బిగుసుకుపోతాయి. ఆయుర్వేద చికిత్స - సహజ సిద్ధమైన పరిష్కారం: ఆయుర్వేదం ప్రకారం, శరీరంలో 'వాత దోషం' పెరగడం వల్ల కీళ్లలో ద్రవాలు తగ్గి ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. ఆయుర్వేదంలో ఫ్రోజెన్ షోల్డర్‌ను 'అవబాహుక' అని అంటారు. దీనికి అందుబాటులో ఉన్న కొన్ని అద్భుతమైన చికిత్సలు: అభ్యంగనం (Abhyangam): వేడి చేసిన ఆయుర్వేద తైలాలతో (మహానారాయణ తైలం వంటివి) మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి నొప్పి తగ్గుతుంది.   స్వేదనం (Swedanam): మూలికల ఆవిరి పట్టడం ద్వారా బిగుసుకుపోయిన కండరాలు వదులవుతాయి.   గ్రీవ వస్తి / పీచు: నొప్పి ఉన్న భాగంలో ప్రత్యేకమైన నూనెను నిల్వ ఉంచే ప్రక్రియ.   పౌష్టిక ఆహారం: వాతాన్ని తగ్గించే ఆహార పదార్థాలను తీసుకోవడం మరియు శొంఠి, గుగ్గులు వంటి మూలికలను వాడటం. ఫ్రోజెన్ షోల్డర్ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ఫిజియోథెరపీ మరియు ఆయుర్వేద చికిత్సలతో సులభంగా నయం చేసుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో చేతి కదలికలు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం మరియు ఆయుర్వేద జీవనశైలితో మీ భుజం ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే వేసవిలో పిత్త తత్వం మరింత చురుకుగా ఉంటుంది, ఇది కడుపులో మంట, జీర్ణ సమస్యలు , అలసటకు దారితీస్తుంది. అందువల్ల, ఆయుర్వేదం కొన్ని రకాల ఆహారాలను తినమని , మరికొన్నింటిని తినకుండా ఉండమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం చెప్పిన తినాల్సిన, తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. వేసవిలో ఏం తినాలి? వేసవిలో శరీరం బాగా వేడెక్కి, పిత్త దోషం పెరుగుతుంది. అందువల్ల, తేలికైన, చల్లని ఆహారాలు తినడం చాలా అవసరం. కర్బూజా, పుచ్చకాయ, మామిడి వంటి తాజా పండ్లు శరీరాన్ని చల్లబరిచి, కోల్పోయిన నీటిని తిరిగి అందిస్తాయి. చల్లని పాలు , పెరుగు శరీరాన్ని చల్లబరుస్తాయి. జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి. పీచుపదార్థాలు అధికంగా ఉండే సలాడ్‌లు , తేలికపాటి కూరగాయలు జీర్ణక్రియను సులభతరం చేసి, కడుపులో వేడి అసమతుల్యతను నివారిస్తాయి. చల్లని జ్యూస్‌లు , కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్‌లను అందించి, శరీరాన్ని తేమగా ఉంచుతాయి. వేసవిలో ఏం తినకూడదు? వేసవిలో వేయించిన , బరువైన ఆహారాలకు దూరంగా ఉండాలి,  అవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి, కడుపులో వేడిని పెంచుతాయి. అందుకే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక మసాలాలు గల వంటకాలతో పాటు, కాఫీ , టీ వంటి కెఫిన్ పానీయాలు,  అధిక నూనె లేదా తీపి పదార్థాలు పిత్త దోషాన్ని పెంచి, శరీరాన్ని అసమతుల్యం చేస్తాయి. వేసవిలో కెఫిన్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. రోజులో ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడి, శక్తిని నిలుపుతుంది.   శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉండాలంటే, తేలికైన, నీరు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.   చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల పైత్యరసం అదుపులో ఉండి, వేసవిలో అలసట , చికాకును నివారిస్తుంది.                                *రూపశ్రీ.  
మలబద్ధకం (Constipation) సమస్యకు ప్రధాన కారణాలు, లక్షణాలు మరియు సులభమైన ఆయుర్వేద గృహ చిట్కాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం (Constipation). దీనినే తెలుగులో 'మలబద్ధకం' అని కూడా అంటారు. ఇది కేవలం ఒక సమస్య మాత్రమే కాదు, సకాలంలో దీనిని నివారించకపోతే ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఈ వీడియోలో మలబద్ధకం గురించి పూర్తి సమాచారాన్ని నిపుణులు వివరించారు: మలబద్ధకం రావడానికి ప్రధాన కారణాలు: ఆహారంలో పీచు పదార్థం (Fiber) తక్కువగా ఉండటం. శరీరానికి సరిపడా నీరు తాగకపోవడం. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం.  శారీరక శ్రమ లేకపోవడం లేదా రోజంతా కూర్చుని పనిచేయడం. మానసిక ఒత్తిడి మరియు నిద్రలేమి. లక్షణాలు: వారానికి మూడు సార్లు కంటే తక్కువ మలవిసర్జన జరగడం. కడుపు ఉబ్బరంగా ఉండటం మరియు గ్యాస్ సమస్యలు. మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి లేదా ఇబ్బంది కలగడం. ఆకలి మందగించడం. ఆయుర్వేద గృహ చిట్కాలు (Home Remedies): మలబద్ధకాన్ని వదిలించుకోవడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. ఈ వీడియోలో సూచించిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు: త్రిఫల చూర్ణం: ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో త్రిఫల చూర్ణం కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆముదం (Castor Oil): తక్కువ మోతాదులో ఆముదాన్ని పాలలో కలిపి తీసుకోవడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది.  పండ్లు మరియు కూరగాయలు: పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, బొప్పాయి మరియు అరటిపండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.  నీరు: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.  మలబద్ధకం సమస్య నుండి శాశ్వత ఉపశమనం పొందడానికి మరియు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను పెంపొందించుకోవడానికి ఈ వీడియోలో చెప్పిన సూచనలను తప్పక పాటించండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్, మధుమేహం, PCOD వంటి సమస్యలు మన జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. మందులు వాడుతున్నా పూర్తి ఉపశమనం లభించడం లేదా? అయితే మీకు 'థెరప్యూటిక్ యోగా' ఒక అద్భుతమైన మార్గం. ఇది కేవలం శరీరాన్ని కదిలించడం మాత్రమే కాదు, మీ మనస్సును మరియు ఆత్మను పునరుజ్జీవింపజేసే ఒక దివ్యౌషధం. మనం థెరప్యూటిక్ యోగాను ఎందుకు ఎంచుకోవాలి? (Why Should We?) రోజంతా ఉత్సాహం: మీరు రోజుకు కేవలం గంటన్నర సమయం యోగాకు కేటాయిస్తే, మిగిలిన 22.5 గంటల సమయం ఎంతో శక్తివంతంగా మరియు ఆనందంగా గడుస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి: థైరాయిడ్ సమస్య ఉన్నవారు కేవలం 3 నెలల్లో మార్పును గమనించవచ్చు, అలాగే PCOD సమస్యలు 4 నుండి 5 నెలల్లో నయమయ్యే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత: ఈ ప్రపంచంలో మానసిక సమస్యలను సమూలంగా నయం చేసే శక్తి కేవలం యోగాకు మాత్రమే ఉంది. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, బద్ధకాన్ని వదిలిస్తుంది. అంతర్గత మార్పు: యోగా మిమ్మల్ని లోపలి నుండి మారుస్తుంది. అది ఒక చిన్న పిల్లవాడి నవ్వులో ఉండే స్వచ్ఛతను మీ జీవితంలోకి తీసుకువస్తుంది. ఏం చేయకూడదు? (What Not to Do) నియమాలను విస్మరించవద్దు: మధుమేహం లేదా రక్తపోటు ఉన్నవారు యోగా చేస్తున్నాం కదా అని ఆహార నియమాలను పూర్తిగా వదిలేయకూడదు. వ్యాధి పూర్తిగా నయమయ్యే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తక్షణ ఫలితాల కోసం ఆరాటపడవద్దు: యోగా అనేది ఏటీఎం మిషన్ నుండి డబ్బులు వచ్చినట్లు తక్షణమే రాదు, కానీ సాధన మొదలుపెట్టిన కొద్దిసేపటికే మీరు ఆ మార్పును అనుభూతి చెందుతారు. ఆనందాన్ని వదులుకోవద్దు: జీవితంలో దేనికైనా రాజీ పడండి కానీ మీ సంతోషం విషయంలో మాత్రం ఎప్పుడూ రాజీ పడకండి. ప్రారంభించడం ఎలా? (How to Start) శ్వాసపై ధ్యాస: మన శ్వాస మరియు మనస్సు భార్యాభర్తల వంటివి. శ్వాస దీర్ఘంగా, ప్రశాంతంగా ఉంటే మనస్సు కూడా అంతే ప్రశాంతంగా మారుతుంది. సరైన భంగిమలు: 'సుప్త ఆసనం' (Subtasana) వంటి భంగిమలు కేవలం 10 నిమిషాల్లోనే మిమ్మల్ని ఎంతో రిలాక్స్‌గా మరియు శక్తివంతంగా మారుస్తాయి. ఆధారాలతో సాధన (Props): శారీరక ఇబ్బందుల వల్ల ఆసనాలు వేయలేకపోయేవారు రకరకాల ప్రాప్స్ (Props) సహాయంతో సులభంగా యోగా చేయవచ్చు. ఇది క్యాన్సర్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: థైరాయిడ్ సమస్య యోగాతో నయమవుతుందా?  జ: అవును, క్రమం తప్పకుండా థెరప్యూటిక్ యోగా చేయడం ద్వారా 3 నెలల్లో థైరాయిడ్ మందుల మోతాదును తగ్గించుకోవచ్చు. ప్ర: క్యాన్సర్ రోగులకు యోగా ఎలా సహాయపడుతుంది?  జ: యోగా క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయకపోవచ్చు, కానీ రోగిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు శరీరంలో ప్రాణవాయువును (Oxygenation) పెంచి మనశ్శాంతిని చేకూరుస్తుంది. ప్ర: వ్యాయామం చేయడానికి సమయం లేని వారి పరిస్థితి ఏంటి?  జ: మీ శరీరం కోసం మీరు రోజుకు కనీసం గంటన్నర కేటాయించలేకపోతే, అనారోగ్యం పాలైనప్పుడు అంతకంటే ఎక్కువ సమయాన్ని ఆసుపత్రుల్లో గడపాల్సి వస్తుందని గుర్తుంచుకోండి. మీరు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలన్నా, ఆత్మవిశ్వాసంతో మెరవాలన్నా యోగా ఒక్కటే మార్గం. మాటల కంటే సాధన ద్వారానే మీరు ఆ వ్యత్యాసాన్ని గమనించగలరు. ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది, దాన్ని నిర్లక్ష్యం చేయకండి. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు యోగా ప్రాక్టికల్ వీడియోల కోసం మా యూట్యూబ్ (YouTube) ఛానెల్‌ని సందర్శించండి! ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి మరియు ఆరోగ్యవంతులుగా మారండి.