LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా అసభ్య, అశ్లీల, అనుచిత పోస్టులు చేసిన వ్యక్తుల అరెస్టుల పర్వం సంచలనంగా మారింది. వివాదాస్పద యూట్యూబర్,   బచ్చలకూరి జోసెఫ్  అలియాస్ ప్రశ్న రావణ్  అరెస్టుపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని  చేసిన వ్యాఖ్యలు  కొత్త వివాదానికి తెర లేపాయి. దేశ భద్రతకు సంబంధించిన ఉపా యాక్ట్ ను కొడాలి నాని  ఉప్మా యాక్ట్  అని సంబోధించడంపై కూటమి వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ  తెలుగువన్ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొడాని నాని వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు.  వైఎస్ జయంతి సందర్భంగా గుడివాడలో  జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని.. ప్రశ్న రావణ్ అరెస్టు, ఆయనపై కేసుల విషయంలో చేసిన వ్యాఖ్యలు, మాట్లాడిన మాటలూ, కొడాలి నాని  రాజకీయ అజ్ఞానాన్ని సూచిస్తున్నాయని వంశీకృష్ణ అన్నారు. దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగించే శక్తులపై ప్రయోగించే ఉపా  చట్టాన్ని అపహాస్యం చేయడం దుర్మార్గమని విమర్శించారు.  దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన  అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే  ఉపా చట్టాన్ని  ఉప్మా యాక్ట్  అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.  ప్రభుత్వ పెద్దలను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను దూషించినందుకు రావణ్‌ను అరెస్ట్ చేయలేదనీ,  జోసెఫ్ ఫోన్ రికార్డులను పరిశీలించిన పోలీసులు, అతను దేశ వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, యువతను నక్సలిజం, టెర్రరిజం వైపు ప్రేరేపిస్తున్నట్లు ఆధారాలు సేకరించారని వెల్లడించారు. ఆ సాక్ష్యాధారాల ఆధారంగానే కోర్టు అతనికి రిమాండ్ విధించిందని గుర్తుచేశారు. వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు తొలుత ఈ జోసెఫ్‌కు పార్టీ తరపున లీగల్ సపోర్ట్ ఇస్తామని ప్రకటించి..  తీరా అతని ఫోన్ లోని వివాదాస్పద విషయాలు బయటపడగానే ప్లేట్ ఫిరాయించారని వంశీకృష్ణ ఆరోపించారు.  గతంలో వర్రా రవీంద్ర రెడ్డి, బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి వంటి వారిని పెంచి పోషించి..  ఇప్పుడు వారితో మాకేం సంబంధం లేదన్నట్లే వైసీపీ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేనల మధ్య ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారు గ్యాప్ తేవాలని చూస్తున్నారని, కానీ  అది అసాధ్యమన్నారు.  కొడాలి నాని  రోజూ మీడియా ముందుకు వచ్చి ఇలాంటి అడ్డదిడ్డమైన వ్యాఖ్యలు చేయాలని తాను ఒక టీడీపీ కార్యకర్తగా కోరుకుంటున్నానని వంశీకృష్ణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పోలవరం పూర్తి చేయడం, రాజధాని అమరావతి నిర్మాణం, పెట్టుబడుల సాధన వంటి అభివృద్ధి పనులపై మాట్లాడుతుంటే, వైస్సార్సీపీ నేతలు మాత్రం గొడ్డళ్లు, బూడిద వంటి భాష వాడుతున్నారని, ప్రజలే అంతిమంగా దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తారని చెప్పారు.  Kodali Nani Upma Act, TDP Bandaru Vamsi Krishna Comments, Prasna Ravana UAPA Case, AP Politics Latest News, Telugu News
వైపీపీలో అంతర్గత పరిణామాలు తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి.  2024 అసెంబ్లీ   ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారిపోయింది. దీనికి తోడు జగన్ తీరుతో పార్టీలోని సీనియర్ నాయకులు పొలిటికల్ గా ఇన్ యాక్టివ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకే కాదు.. చివరాఖరికి అధినేత జగన్ కు కూడా ముఖం చాటేస్తున్నారు. ఇవి చాలవన్నట్లు  పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా   ప్రచారం సాగుతోంది. అధినేత జగన్ ఆదేశాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో సజ్జల పూర్తిగా విఫలమవుతున్నారని,జగన్ ఆయనపై   తీవ్ర అసహనం వ్యక్తం చేశారని పార్టీ వర్గాల సమాచారం.   ఈ వివాదానికి  కేంద్ర బిందువు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన  మావిగన్ అంటున్నారు. మావిగన్ ప్రతిపాదనను పార్టీ శ్రేణుల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సజ్జల రామకృష్ణారెడ్డి  విఫలమయ్యారని జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతే కాదు.. సొంత మీడియాలో కూడామావిగన్ అంశానికి ఇసుమంతైనా ప్రాధాన్యత దక్కకపోవడం జగన్ కు మింగుడుపడలేదు. మావిగన్ ను  సొంత మీడియా కూడా పట్టించుకోకపోవడం వెనుక  ఉన్నారని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.  మూడు రాజధానుల స్టాండ్ కారణంగా ప్రజాదరణ, ప్రజా విశ్వాసాన్నీ కోల్పోయామనీ, ఇప్పుడు మళ్లీ మావిగన్ అంటూ ప్రజజల్లోకి వెడితే ప్రతికూలత మరింత ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో..   సజ్జల, ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని భావించారనీ, అవే సంకేతాలను క్షేత్రస్థాయికి కూడా పంపారనీ పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇక్కడే.. జగన్ కు తన ఆదేశాలను కాదని సజ్జల స్వతంత్రంగా వ్యవహరించడం రుచించలేదు. తీవ్ర ఆగ్రహానికి లోనై సజ్జలను ఒకింత తీవ్రంగానే మందలించారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.   జగన్ అధికారంలో ఉన్న సమయంలో సజ్జల ఆడింది ఆట, పాడింది పాటగా నడిచింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా,  పార్టీ సమన్వయకర్తగా, సకల శాఖల మంత్రిగా ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలోనూ  సర్వస్వం తానే అన్నట్లుగా సజ్జల వ్యవహరించారు.  ఆయన కుమారుడికి వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలను కూడా అప్పగించారు. అయితే ఈ ఆధిపత్యం పార్టీలోని సీనియర్ నేతలకు అస్సలు నచ్చలేదు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా.. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడానికి సజ్జల అనుసరించిన ఏకపక్ష విధానాలే కారణమని సీనియర్లు బహిరంగంగానే ఆరోపణలు గుప్పించారు. విజయసాయిరెడ్డి వంటి   కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడానికి సజ్జల రామకృష్ణారెడ్డే  కారణమంటూ జగన్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. అయినప్పటికీ జగన్ సజ్జలపై నమ్మకం ఉంచారు. కానీ మావిగన్.. విషయంలో సజ్జల తీరుపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు.   దీంతో సజ్జల కూడా పార్టీ వ్యవహారాలలో ఇక నుంచి అంటీ ముట్టనట్లు వ్యవహరించాలని నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరి మధ్య ఈ విభేదాలు పార్టీపై ఏ మేరకు ప్రభావం చూపుతాయా అన్న ఆందోళన వైసీపీ క్యాడర్ లో వ్యక్తమౌతోంది.  YSRCP Latest News, Mavigan Capital AP, YSRCP Internal Cold War
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని వ్యతిరేకిస్తూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  జగన్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. పార్లమెంట్‌లో తీర్మానం పూర్తయి, రాష్ట్రపతి ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చినప్పటికీ.. జగన్ మాత్రం తన విధానం అమరావతి కాదు  మావిగాన్ (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) అని ఒకసారి విజయవాడ అంటూ మరోసారి మాట్లాడుతూ.. తన గందరగోళాన్ని తానే బయటపెట్టుకుంటూ, ప్రజలను కూడా గందరగోళంలో పడేయాలని ప్రయత్నిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై  పొలిటికల్ ఎనలిస్ట్ మధుసూదన్ రెడ్డి తెలుగువన్‌తో మాట్లాడుతూ జగన్ వైఖరి వెనుక ఉన్న ఆసక్తికరమైన అంశాలను, రాజకీయ వ్యూహాలను బయటపెట్టారు.  2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత వైసీపీ నాయకులు ప్రకాశం జిల్లాలోని దొనకొండను రాజధాని చేయాలని  ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అక్కడ ప్రభుత్వ భూములు విస్తారంగా ఉండటం, రైల్వే కనెక్టివిటీ, నాగార్జున సాగర్ కుడి కాల్వ నీటి లభ్యత వంటి సానుకూల అంశాలు,  రాయలసీమకు కూడా దగ్గరగా ఉంటుందని భావించారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని కాదని మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడిన జగన్, గడిచిన ఐదేళ్ల పాటు చంద్రబాబు నిర్మించిన సచివాలయం, అసెంబ్లీ భవనాల నుంచే పరిపాలన సాగించారని గుర్తు చేశారు. విశాఖపట్నంలో రాజధాని పేరిట 30 వేల ఎకరాలు సేకరించకపోగా..  కేవలం ఋషికొండపై  వందల కోట్ల రూపాయలతో పర్యాటక భవనాలను కూల్చి తన కోసం ఓ  ప్యాలెస్ నిర్మించుకున్నారని విమర్శించారు.  2024 ఎన్నికలలో మూడు రాజధానుల అంశంపైనే ప్రజలు వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం చేసి తిరస్కరించినా జగన్ తీరు మారలేదన్నారు.  ప్రస్తుతం జగన్ తెరపైకి తెచ్చిన  మావిగన్ అనే ఆలోచన ఆయన సొంతం కాదనీ.. తిరుపతికి చెందిన ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి ఇచ్చిన ఐడియా అని మధుసూదన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని నిర్మిస్తే చరిత్రలో చంద్రబాబు నాయుడి పేరు శాశ్వతంగా ఉండిపోతుందనే ఏకైక వ్యక్తిగత ద్వేషం,  అసూయతోనే జగన్ ఈ విధ్వంసకర రాజకీయాలకు పాల్పడుతున్నారని విశ్లేషించారు. హైదరాబాద్‌కు హైటెక్ సిటీ  నిర్మాతగా చంద్రబాబు పేరు ఎలా చిరస్థాయిగా నిలిచిపోతుందో..  అమరావతి విషయంలో కూడా  చంద్రబాబు పేరు శాశ్వతంగా నిలిచిపోతుందనీ, ఒక రాజధాని నగరాన్ని నిర్మించిన వ్యక్తిగా చంద్రబాబు కీర్తి శాశ్వతంగా నిలుస్తుందన్న భయం, ఆసూయా, ద్వేషం కారణంగానే  జగన్ అమరావతిపై విషం చిమ్ముతున్నారని మధుసూదన్ రెడ్డి అన్నారు.  అమరావతి  సెల్ఫ్ సస్టేయినబుల్ క్యాపిటల్  అన్నారు.  అమరావతి కోసం తీసుకువచ్చే అప్పులను అమరావతే తీర్చుకుంటుంది తప్ప రాష్ట్ర ప్రజలపై భారం పడదనే సత్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. YS Jagan Mohan Reddy, Amaravati capital controversy, Madhusudan Reddys analysis, Chandrababu Naidu,  AP capital, Mavigan slogan,  Telugu One
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.  ముఖ్యంగా  రాయలసీమ పరిధిలోని ఉమ్మడి ఆరు జిల్లాలలో వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోతోంది. ఇందుకు కారణం ఈ ప్రాంతంపై  పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ప్రత్యేక దృష్టి సారించడమే అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన  ఆపరేషన్ ఆకర్ష్‌ కు తెరలేపి.. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే.. తాజాగా  జనసేనలోకి  చేరికలను సమీక్షించడానికి 14 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి చేరికల కమిటీని జనసేనాని ఏర్పాటు చేశారు.   ఈ కమిటీలో ఇటీవలే వైసీపీని వీడి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి  కీలకమైన బాధ్యతలను అప్పగించారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల రాజకీయాలపై బాలినేనికి ఉన్న పట్టును ఉపయోగించుకుని..  ఆయా జిల్లాలలో వైసీపీ అసంతృప్తి నేతలను జనసేనలోకి ఆకర్షించాలన్న వ్యూహంతో పవన్ కల్యాణ్ ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.   గ్రేటర్ రాయలసీమ పరిధిలోని ఆరు ఉమ్మడి జిల్లాల నుంచి కనీసం  పాతిక నుంచి ముఫ్ఫై మంది వరకు వైసీపీ ద్వితీయ శ్రేణి, అలాగే పది మంది వరకూ సీనియర్, కీలక వైసీపీ నేతలు జనసేనలోకి చేరుందుకు ఇప్పటికే మాటాముచ్చటా జరిగిందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.  బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ నేతలతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారని తెలుస్తోంది.  గత ఎన్నికలలో కేవలం కొన్ని స్థానాలకే పరిమితమైనప్పటికీ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోయిన జనసేనకు ఇప్పుడు క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకోవడినికీ, మరీ ముఖ్యంగా రాయలసీమలో పాగా వేయడానికి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని చెబుతున్నారు. ఓటమి తరువాత వైసీపీలో నైరాశ్యం కమ్ముకుంది. అటు క్యాడర్, ఇటు లీడర్ కూడా పెద్దగా యాక్టివ్ గా ఉంటున్న దాఖలాలు కనిపించడంలేదు.  దీంతో తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళనలో పడ్డ వైసీపీ నేతలు, పార్టీ వీడే యోచన చేస్తున్నట్లు రాజకీయవర్గాలలోచర్చ జరుగుతోంది. అలా పార్టీని వీడాలనుకునే వారికి ఉన్న ఆప్షన్లు తెలుగుదేశం, జనసేన మాత్రమే. అయితే తెలుగుదేశంలో చేరికకు అవకాశం లభించినా, అక్కడ ఇప్పటికే సీనియర్లు చాలా మంది ఉండటంతో తమకు సముచిత స్థానం లభించే విషయంలో అనుమానాలు ఉన్న వైసీపీ నేతలు జనసేన వైపు చూస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా పార్టీలోకి చేరికలకు పచ్చ జెండా ఊపారు.   Pawan Kalyan, Balineni Srinivasa Reddy, Greater Rayalaseema, YSRCP Leaders, Telugu One
ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు, అతనిపై ఉపా  కేసు నమోదు చేయడం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. సోషల్ మీడియాలో వ్యాఖ్యల ఆధారంగా ఏకంగా దేశద్రోహం, తీవ్రవాద నిరోధక చట్టాల కింద కేసులు పెట్టడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ  ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు    తాజా వ్యాఖ్యలు, హోమ్ శాఖకు ఆయన చేసిన హెచ్చరికలపై ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రశ్నరావణ్ పై ఉపా కేసు కేవలం..  ఒక యూట్యూబర్ అభ్యంతరకర వ్యాఖ్యలకు పరిమితం కాలేదనీ,  దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రావణ్‌కు ఇప్పటికే నాలుగు కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉపా చట్టాన్ని ప్రయోగించిందని విమర్శలు వస్తున్న వేళ భరద్వాజ..  సాధారణ ఐపీసీ సెక్షన్ల ద్వారా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఉపా కేసు పెట్టడంతో..  సంవత్సరాల తరబడి జైల్లో ఉంచాలనే కక్ష సాధింపు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.  ఏపీ ఇంటెలిజజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. పోలీసులు కోర్టుకు సమర్పించిన ఆధారాల్లో కొన్ని వీడియోలు ఎడిట్ చేసినవని, కాంటెక్స్ట్ (సందర్భం) మార్చి రూపొందించిన లింకులను న్యాయస్థానానికి సమర్పించారని ఆయన చెప్పారు. ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే..  న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు. రాజకీయంగా చూస్తే..  ఈ మొత్తం ఎపిసోడ్‌ను జనసేన వర్సెస్ రావణ్ వివాదంగా మార్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని భరద్వాజ అన్నారు. టీడీపీ ఈ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తుండగా, జనసైనికులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ వివాదాన్ని వైసీపీకి  ముడిపెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రావణ్‌కు జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక సాయం అందిస్తున్నారనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చి, వైసీపీని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.  యూట్యూబ్‌లో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, అసభ్య పదజాలం వాడటం కచ్చితంగా తప్పే అయినప్పటికీ, చట్టాన్ని దుర్వినియోగం చేయడం సరైంది కాదని భరద్వాజ అన్నారు. కేవలం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోకుండా, సోషల్ మీడియాలో హద్దులు మీరుతున్న అధికార, ప్రతిపక్షాలకు చెందిన అందరు యూట్యూబర్లపై కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం ఈ ఉపా కేసు వ్యవహారం విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌లో పౌరహక్కుల సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలకు దారితీసింది. ప్రభుత్వం చట్టాన్ని ఆయుధంగా మార్చుకుని పౌర హక్కులను కాలరాస్తోందనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి.   Youtuber Ravan Arrest, UAPA Case on Ravan, Pawan Kalyan, Chandrababu Naidu, Jagan Mohan Reddy, AB Venkateswara Rao, Journalist Bharadwaj Analysis, AP Politics
ALSO ON TELUGUONE N E W S
After weeks of uncertainty surrounding its censor process, CM Vijay's Jana Nayagan has finally cleared the Central Board of Film Certification (CBFC). The film has been awarded an 'A' (Adults Only) certificate, clearing the final hurdle ahead of its theatrical release and putting it firmly on track for a July 23 release. The certification comes as a major relief for the makers after reports of delays during the censor process triggered speculation about the film's release plans. With the CBFC formalities now complete, the team can now shift its complete focus towards promotions in the final countdown to release. An 'A' certificate typically points to intense violence, mature themes or strong language. Going by the film's promotional material, Jana Nayagan appears to embrace a gritty and hard-hitting narrative, making the certification consistent with its overall tone. The last film Thalapathy Vijay in the lead role, alongside Pooja Hegde and Bobby Deol in pivotal roles. Directed by H. Vinoth, Jana Nayagan features music composed by Anirudh Ravichander, with Sathyan Sooryan handling cinematography and Pradeep E. Ragav serving as the editor. The film is produced by KVN Productions on a grand scale and marks Vijay's final film before his full-fledged entry into politics, making it one of the most anticipated Tamil releases of the year. With the censor hurdle finally behind it, all eyes are now on Jana Nayagan as it gears up for its worldwide release on July 23. The combination of Vijay's star power, H. Vinoth's action-packed storytelling and Anirudh's chart-topping music has already generated significant buzz, and the coming days are expected to see the film's promotional campaign gather further momentum. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Producer Naga Vamsi appears to have struck gold with Suriya's Viswanath and Sons. Riding on the phenomenal success of Suriya's Karuppu, the upcoming project has reportedly witnessed a surge in its pre-release business, taking its overall valuation close to the ₹300 crore mark. Trade circles suggest that the film's theatrical, non-theatrical and digital rights have together generated business worth nearly ₹300 crores. The impressive figures are largely being attributed to the renewed market confidence in Suriya following the blockbuster performance of Karuppu, which significantly boosted his commercial standing across territories. Industry reports further indicate that the strong deals have translated into an estimated profit of around ₹90-100 crores for producer Naga Vamsi even before the film reaches theatres. Such healthy margins underline the confidence distributors and streaming platforms have shown in the project. The combination of Suriya's resurgent box-office pull, the scale of Viswanath and Sons, and the aggressive demand for its rights has turned the film into one of the biggest pre-release business success stories in recent times. The numbers also reflect how quickly a blockbuster can reshape an actor's market value. While the makers are yet to officially comment on the business figures, the trade buzz surrounding Venky Atluri directorial Viswanath and Sons has only heightened expectations. After Karuppu revived Suriya's box-office momentum, all eyes are now on whether the upcoming film can justify its massive valuation with a strong theatrical run. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  ఒక్క సినిమాలోనే ఏదైనా సాధ్యమవుతుంది. అది కూడా న్యాయబద్దంగా, ధర్మ బద్దంగానే. దీంతో అంతిమంగా అభిమానులకి, ప్రేక్షకులకి కావాల్సినంత జోష్.. తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా వెట్రిమారన్‌కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ క్రైమ్ డ్రామా ప్రాజెక్ట్ ‘అరాసన్’. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుంచే భారీ అంచనాలను మూటగట్టుకుంది. వర్సటైల్ హీరో శింబు అలియాస్ సిలంబరసన్ టిఆర్ (STR) నుంచి వస్తున్న మూవీ కావడంతో కోలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియా మొత్తం ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.  ఈ క్రమంలో ఈ చిత్ర కాస్టింగ్ గురించిన ఒక షాకింగ్, అత్యంత ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.స్టార్ హీరోయిన్, సింగర్ ఆండ్రియా జెర్మియా అరాసన్ లో సిలంబరసన్‌కు తల్లి క్యారక్టర్ లో కనిపిస్తుంది. ఈ కాంబినేషన్ వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా, కథ డిమాండ్ మేరకే వెట్రిమారన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆండ్రియా, శింబు ఇద్దరూ గతంలో ‘ఇదు నమ్మ ఆళు’ వంటి రొమాంటిక్ సినిమాల్లో జంటగా నటించారు. ఆ చిత్రంలో వారిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అలాంటిది ఇప్పుడు శింబుకి తల్లిగా ఆండ్రియా నటించడం అనేది ప్రేక్షకులని  థ్రిల్ కి గురిచేస్తోంది. అయితే దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. ‘అరాసన్’ చిత్రం రెండు వేర్వేరు టైమ్‌లైన్స్‌తో నడిచే కథ అని సమాచారం. ఈ సినిమా వెట్రిమారన్ గతంలో అద్భుత విజయాన్ని అందుకున్న ‘వడ చెన్నై’ సినిమా విశ్వానికి (Vada Chennai Universe) అనుసంధానంగా ఉండబోతోంది. ‘వడ చెన్నై’ చిత్రంలో చంద్ర అనే పవర్‌ఫుల్ , గంభీరమైన రోల్ లో  ఆండ్రియా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాబోయే ‘అరాసన్’ కథలో కూడా ఆమె అదే ‘చంద్ర;' రోల్ లో కనిపిస్తుందని   టాక్. కథ ప్రకారం ఆ క్యారక్టర్  ప్రయాణంలో భాగంగా  తల్లిగా కనిపించాల్సి ఉంటుందట. Also read: టాలీవుడ్ హీరోల లక్కీ నంబర్ '7'.. 'లెనిన్'తో అఖిల్ అక్కినేని హిట్టు కొడతాడా? simbu, Andrea jeremiah, vetrimaaran, Arasan
చందమామ కాజల్ అగర్వాల్ టాలీవుడ్‌లో దశాబ్ద కాలానికి పైగా స్టార్ హీరోయిన్‌గా తన హవా కొనసాగించింది. పెళ్లి తర్వాత, ఒక బాబుకు జన్మనిచ్చిన తర్వాత కూడా తన గ్లామర్, ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. త్వరలో 'ది ఇండియా స్టోరీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆహార కల్తీ వల్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడిందనే పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది. 'ది ఇండియా స్టోరీ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా, తాజాగా కాజల్ అగర్వాల్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత ఆహారపు అలవాట్లకు సంబంధించి ఒక సంచలన విషయాన్ని పంచుకుంది. తానే స్వయంగా ఒకప్పుడు ఎంతో ఇష్టంగా తినే పుచ్చకాయలను ఇప్పుడు పూర్తిగా తినడం మానేశానని, వాటిని చూస్తేనే తనకు ఎంతో భయం వేస్తోందని ఆవిడ వెల్లడించింది. స్టార్ హీరోయిన్ నోటి నుండి వచ్చిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో, హెల్త్ సర్కిల్స్‌లో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ ఆపిల్స్ వంటి పండ్లకు ఇంజెక్ట్ చేస్తున్న రసాయనాలు, కూరగాయలకు వాడుతున్న మందుల గురించి ప్రస్తావించగా, కాజల్ స్పందిస్తూ మార్కెట్‌లో జరుగుతున్న ఫుడ్ అడల్ట్రేషన్ (ఆహార కల్తీ) గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. "మార్కెట్‌లో పుచ్చకాయలకు సంబంధించి జరిగిన ఒక కల్తీ కేసు గురించి నేను విన్నాను. ఆ వార్త విన్నప్పటి నుండి నాకు ఎంతగానో భయం వేసింది. ఆ భయంతోనే నేను పుచ్చకాయలు తినడం పూర్తిగా ఆపేశాను. ఇది నవ్వులాటగా అనిపించినప్పటికీ, నిజానికి ఇది అస్సలు జోక్ కాదు. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది" అని కాజల్ అగర్వాల్ ఎంతో ఆవేదనగా పేర్కొంది. కేవలం పండ్ల వ్యాపారంలోనే కాకుండా మనం రోజువారీగా వాడే కనీస వస్తువులలో కూడా కల్తీ ఏ రేంజ్‌లో ఉందో ఆవిడ వివరించింది. మనం నిత్యం అమాయకంగా తాగే ప్యాకెట్ పాలు గురించి కూడా కాజల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో దొరుకుతున్న కమర్షియల్ మిల్క్ ప్యాకెట్లలో అసలు పాల కంటెంట్ అనేది చాలా తక్కువ శాతంలో ఉంటోందని, కేవలం కెమికల్స్, పౌడర్లతో వాటిని తయారు చేస్తున్నారని ఆవిడ చెప్పింది. "నిజానికి మనం ప్రతిరోజూ ఉదయం లేచింది మొదలు మన జీవితాంతం ఆ పాలనే వాడుతున్నాం. మన పిల్లలకు కూడా ఇస్తున్నాం. కానీ అందులో ఏమాత్రం అసలైన పాలు లేవనేది చేదు నిజం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏది నిజమైన ఆహారం? దేన్ని మనం నమ్మి తినాలి? ఏది తినకూడదు? అనేది ఒక సామాన్యుడు ఎలా అర్థం చేసుకోగలడు?" అంటూ కాజల్ అగర్వాల్ నేటి సమాజంలో జరుగుతున్న వ్యాపార కల్తీ విధానాన్ని ప్రశ్నించింది. సెలబ్రిటీ హోదాలో ఉండి కాజల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, ఆహార భద్రతపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.     Kajal Aggarwal, Interview, The India Story, TeluguOne  
  '7'.. తర్వాత వచ్చేది '8', ముందు వచ్చేది '6' అని చెప్పుకోవడానికి సినీ పరిభాషలో '7' అనేది  కేవలం నెంబర్ మాత్రమే కాదు. బడా హీరోల సాక్షిగా రికార్డులు సృష్టించాను అని చెప్పడానికి సజీవ సాక్ష్యం. ఈ నెంబర్ కి రేపు లెనిన్ తో రాబోతున్న అఖిల్ 'లెనిన్' చిత్రానికి సంబంధం ఉంది. అభిమానులు మాత్రం '7 'డేట్ ని దృష్టిలో పెట్టుకొని అఖిల్(Akhil)రికార్డులు సృష్టిస్తాడనే నమ్మకంతో ఉన్నారు.  టాలీవుడ్ చరిత్రని ఒకసారి పరిశీలిస్తే, దాదాపు 90 శాతం మంది అగ్ర హీరోల కెరీర్‌లో వారి 7వ సినిమాలు ఇండస్ట్రీ హిట్ లుగా లేదా మైల్ స్టోన్ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఉదాహరణకు సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 7వ చిత్రంగా వచ్చిన 'ఒక్కడు' టాలీవుడ్ రికార్డులని  తిరగరాసి  టాప్ లీగ్‌లో నిలబెట్టింది.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 7వ చిత్రం 'ఖుషి' అప్పట్లో సృష్టించిన ట్రెండ్ సెట్టింగ్ సక్సెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మాన్ ఆఫ్ మాసెస్  ఎన్టీఆర్ కెరీర్ రేంజ్‌  మార్చేసిన 'సింహాద్రి'  కూడా 7వ చిత్రమే కావడం గమనార్హం. ఈ అద్భుతమైన సెంటిమెంట్ కేవలం వీరితోనే ఆగిపోలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో మైల్ స్టోన్‌గా నిలిచిన 'ఆర్య 2', మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాస్ ఇమేజ్‌ని  పెంచిన 'ఎవడు', న్యాచురల్ స్టార్ నాని కామెడీ టైమింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన 'పిల్ల జమిందార్', ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని 'కందిరీగ' ,విజయ్ దేవరకొండ కెరీర్‌లో 100 కోట్ల క్లబ్‌లో చేరిన 'గీత గోవిందం'.. ఇవన్నీ ఆయా హీరోల కెరీర్‌లలో 7వ సినిమాలే  . రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక్కరి విషయంలో మాత్రమే ఈ సెంటిమెంట్ మినహాయింపుగా నిలిచింది. మిగిలిన అందరు స్టార్స్ ఈ 7వ నంబర్ మ్యాజిక్‌తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని  సాధించి సత్తా చాటారు. అక్కినేని వంశంలో కూడా ఈ సెంటిమెంట్‌కు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. అక్కినేని నాగార్జున నటించిన 7వ సినిమా 'అగ్నిపుత్రుడు' బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్ హిట్టయిన 'మనం' సినిమా కూడా ఆయనకు 7వ చిత్రం కావడం విశేషం. ఇప్పుడు అఖిల్ అక్కినేని 'లెనిన్' సినిమాతో సరిగ్గా అదే స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు అఖిల్ నటించిన 'అఖిల్', 'హలో', 'మిస్టర్ మజ్ను', 'ఏజెంట్' వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్‌గా నిలిచినా, అది అఖిల్ కెరీర్‌కి ఆశించినంత బూస్ట్ ఇవ్వలేకపోయింది. jana nayagan: 'జన నాయగన్' రిలీజ్ డేట్ ఫిక్స్!.. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కెనడా డిస్ట్రిబ్యూటర్  మరి టాలీవుడ్ లక్కీ నంబర్ '7' సెంటిమెంట్ నిజమై, అయ్యగారు  'లెనిన్'తో టాలీవుడ్‌లో తన మొదటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడని  అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మాములుగా చూస్తే అఖిల్ హీరోగా లెనిన్  6వ సినిమా. కానీ చిన్నతనంలో లీడ్ రోల్‌లో నటించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ 'సిసింద్రీ' మూవీని కూడా లెక్కిస్తే,  లెనిన్ 7 నే. లెక్క లెక్కేగా.  
జగపతి బాబు, లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘వదల’. కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 2 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ కంప్లీట్ సస్పెన్స్, ఎమోషనల్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కూడి ప్రేక్షకులలో సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ట్రైలర్ ప్రారంభంలో జగపతి బాబు (యోగి), లయల మధ్య జరిగే ఒక రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ కన్వర్జేషన్‌తో కథ మొదలవుతుంది. పెళ్లై 20 ఏళ్లు దాటినా, ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా భార్యతో యోగి చేసే ఫ్లర్టింగ్, వారి మధ్య ఉండే కెమిస్ట్రీ ఒక అందమైన ఫ్యామిలీ డ్రామాను తలపిస్తుంది. కూతురు, అల్లుడు, మనవడు, మనవరాలితో కూడిన ఒక హ్యాపీ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌ను చూపిస్తూనే కథలోకి ఒక అనోన్ నంబర్ నుండి వచ్చే హరాస్‌మెంట్ మెసేజెస్ రూపంలో అసలు ట్విస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. యోగి కుటుంబంలోకి రితికా శ్రీనివాస్ పాత్ర ప్రవేశించిన తర్వాత కథ మొత్తం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. "నా యోగి నాకు కావాలి, ఎవరు అడ్డుపడినా యోగిని పట్టుకుపోతాను" అంటూ ఆమె చెప్పే డైలాగ్స్, సైకో తరహా ప్రవర్తన సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను ఎలివేట్ చేశాయి. సాంకేతికంగా ఈ సినిమా చాలా ఉన్నతంగా కనిపిస్తోంది. సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు అందించిన విజువల్స్ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. అలాగే కార్తీక్ బి. కొడకండ్ల అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ట్రైలర్‌లోని ప్రతి సీన్‌ను, సస్పెన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చాలా షార్ప్‌గా ఉంది.  ఒక హ్యాపీ ఫ్యామిలీలోకి వచ్చిన ఒక అపరిచిత యువతి ఆ కుటుంబాన్ని ఎలా అతలాకుతలం చేసింది, యోగి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనే ఆసక్తికరమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం జూలై 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.     Vadala Trailer, Jagapathi Babu, Laya, TeluguOne  
సూపర్ స్టార్ కృష్ణ నటవారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఘట్టమనేని కుటుంబం నుండి మరో కొత్త హీరో వెండితెరకు పరిచయమవుతున్నాడు. రమేష్ బాబు తనయుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు అయిన ఘట్టమనేని జయకృష్ణ.. త్వరలోనే 'శ్రీనివాస మంగాపురం' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు.  ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి ఘట్టమనేని అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. అయితే ఈ నయా హీరో గురించి చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన ఫ్లాష్‌బ్యాక్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. జయకృష్ణ కొత్తగా ఇప్పుడు కెమెరా ముందుకు రాలేదు. అతను చిన్నప్పుడే తన బాబాయ్ మహేష్ బాబు సినిమాలో మెరిశాడు. డైరెక్టర్ తేజ కాంబినేషన్‌లో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సెన్సేషనల్ మూవీ 'నిజం'. ఆ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రలో నటించిన ఆ క్యూట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదు.. ఘట్టమనేని జయకృష్ణే. ఈ విషయాన్ని అప్పట్లో తేజ ఎంతో ఘనంగా ప్రకటించారు. 'నిజం' రిలీజ్ కి ముందు, జయకృష్ణ ఫోటోను చూపిస్తూ.. ఈ సినిమాతో మరో హీరోని ఇంట్రడ్యూస్ చేస్తున్నామని తేజ చెప్పారు. దాంతో చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటోని చూపించి, హీరో అంటారేంటని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత "ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదు.. కృష్ణ గారి మనవడు. షూటింగ్ చేస్తున్నప్పుడే ఫ్యూచర్‌లో హీరో అవుతాడనిపించింది. అందుకే మరో హీరోని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అన్నాను." అంటూ డైరెక్టర్ తేజ అసలు మేటర్ రివీల్ చేశారు. తేజ ఏ ముహూర్తాన ఆ మాట అన్నారో కానీ.. రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు నిజంగానే ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. బాబాయ్ బాటలో పయనిస్తూ, జయకృష్ణ కూడా సక్సెస్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకుంటాడేమో చూడాలి.     Ghattamaneni Jaya Krishna, Srinivasa Mangapuram, Mahesh Babu, Nijam Movie, TeluguOne  
Megastar Chiranjeevi is once again demonstrating why his passion for cinema remains unmatched. The shooting of his much-awaited film with blockbuster director Bobby Kolli, tentatively titled #ChiruBobby2 / #Chiru158, is progressing at a brisk pace in Hyderabad, where the team is currently filming one of the most ambitious action episodes of the project. Produced on a lavish scale by Venkat K. Narayana under the KVN Productions banner, the film reunites Chiranjeevi and Bobby Kolli after the blockbuster success of Waltair Veerayya. The ongoing schedule features a grand rain action sequence choreographed by renowned stunt masters Ram-Lakshman, with a large number of fighters participating in what is set to be one of the biggest action blocks not only in the film but also in Chiranjeevi's career. Chiranjeevi's extraordinary commitment during the shoot has become the biggest talking point. He reached the location at 9 AM and spent nearly 12 hours filming continuously in the rain, taking only a brief lunch break. Despite the physically demanding conditions, he performed the action portions with remarkable energy and precision, leaving the entire unit impressed by his discipline and endurance. Chiranjeevi insisted on giving every shot his full effort, maintaining the same enthusiasm from the first take to the last. His dedication during this demanding schedule has drawn admiration from the cast and crew alike, further reinforcing his reputation as one of Indian cinema's hardest-working stars. The massive rain fight is expected to be a standout moment in the film, promising an adrenaline-pumping theatrical experience. With production moving ahead at full speed, the makers are also preparing to unveil the film's title teaser soon. Backing the film is a strong technical team that includes music composer Thaman S, cinematographer Vijay Karthik Kannan, production designer Avinash Kolla, and editor Antony Ruben. The screenplay has been written by Kona Venkat and K. Chakravarthy Reddy, with additional screenplay by Hari Mohana Krishna and Vineeth Potluri, while Bhanu-Nandu are penning the dialogues. Mounted as a grand-scale commercial entertainer packed with action, emotion, and mass appeal, #ChiruBobby2 / #Chiru158 is shaping up to be one of the most anticipated Telugu films currently in production. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  కోట్లాది మంది అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఇళయ దళపతి విజయ్(Vijay)వన్ మాన్ షో 'జన నాయగన్'(jana nayagan)విడుదలపై ఎట్టకేలకు ఒక భారీ అప్‌డేట్ వచ్చేసింది. విజయ్ నుంచి వస్తున్న  ఆఖరి మూవీ కావడం, తమిళనాడు ముఖ్యమంత్రిగా  బాధ్యతలు స్వీకరించిన తర్వాత వస్తున్న మూవీ కావడంతో, అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత ఆరు నెలలుగా సెన్సార్ వివాదాలు, కోర్టు కేసులతో నలుగుతూ వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా, ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.  తాజాగా కెనడాకు చెందిన ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ 'యార్క్ సినిమాస్' (York Cinemas) సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ప్రకటన నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. తమ ఓన్ దళపతి విజయ్ థియేటర్లలో అగ్గి రాజేయడానికి సిద్ధంగా ఉన్నాడంటూ, కెనడాలో జూలై 24 నుండి 'జన నాయగన్' స్క్రీన్స్‌పై సందడి చేయనుంది. త్వరలోనే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవుతాయి అంటు అధికారికంగా ట్వీట్ చేశాడు . ఈ ఒక్క అప్‌డేట్‌తో దళపతి అభిమానుల్లో పూనకాలు మొదలయ్యాయి. Also read: Vaishnav Tej: వైష్ణవ్ తేజ్ సైలెన్స్ వెనుక అసలు కారణం ఇదేనా.. మెగా ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్! విశ్వసనీయ సమాచారం ప్రకారం, జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేయడానికి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లందరికీ చిత్ర యూనిట్ ఇప్పటికే ముందస్తు సమాచారం ఇచ్చేసింది. ఒకవేళ అంతా అనుకూలిస్తే ఒక రోజు ముందుగానే, అంటే జూలై 23నే ప్రీమియర్స్ పడే అవకాశం కూడా ఉంది. విజయ్‌తో పాటు పూజా హెగ్డే, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, మమితా బైజు, ప్రియమణి వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే జనగణమన నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడనుంది.    
Ram Pothineni has already generated curiosity with his upcoming project, tentatively titled RAPO23, which marks his debut as a writer-director. The neo-noir psychological action thriller recently went on floors with a formal pooja ceremony in Hyderabad, and the first shooting schedule is currently underway. The latest buzz from industry circles suggests that Samyuktha Menon has been roped in as the female lead. While the makers are yet to make an official announcement, reports indicate that the actress has completed negotiations and is expected to join the shoot soon. According to the buzz, the team considered multiple names before zeroing in on Samyuktha for the role. Given the dark, intense nature of the film, the actress is said to have fit the character envisioned by Ram, who is mounting the project on a pan-India scale with a strong focus on action and psychological drama. Backed by Krishna Pothineni, the film features cinematography by Thirru and is expected to be one of the most ambitious projects in Ram Pothineni's career. An official confirmation regarding the female lead is awaited from the makers. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. కొత్త వాతావరణం, కొత్త ఉపాధ్యాయులు, కొత్త తరగతులు మరియు కొత్త స్నేహితులు ఉత్సాహంతో పాటు ఆందోళనను కూడా కలిగిస్తాయి. చాలా మంది పిల్లలు మొదట్లో పాఠశాలలో తమకు ఎదురయ్యే విషయాలను, తమ మనసులోని విషయాలను  మనసు విప్పి చెప్పలేరు. అయితే తల్లిదండ్రుల బాధ్యత కేవలం పిల్లలను బడికి పంపడమే కాదు.. పిల్లల గురించి ఎన్నో విషయాలు తల్లిదండ్రులు ఆలోచించాలి. మరీ ముఖ్యంగా..  కొత్తగా స్కూల్ కు వెళ్తున్న పిల్లలను కొన్ని ప్రశ్నలు తప్పకుండా అడగాలి. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. ప్రతిరోజూ పిల్లలను అడాగాల్సిన ప్రశ్నలు.. నచ్చిన విషయం.. ఈ రోజు పాఠశాలలో అన్నింటి కన్నా నీకు నచ్చిన విషయం ఏదని పిల్లలను అడగాలి.  ఈ ప్రశ్న పిల్లలో సానుకూల విషయాలను వెలికితీయడానికి సహాయపడుతుంది.  కొందరు పిల్లలు బడికి వెళ్లొచ్చిన తర్వాత మళ్లీ బడికి వెళ్లమని మారం చేస్తుంటారు. కానీ బడిలో వారికి నచ్చిన విషయాన్ని గుర్తు చేయడం వల్ల పిల్లలకు పాఠశాల పట్ల ఉత్సాహం పెరుగుతుంది.  అలాగే తల్లిదండ్రులు పిల్లలతో ఇలా మాట్లాడటం వల్ల పిల్లలు  స్వేచ్ఛగా మాట్లాడటం నేర్చుకుంటారు,  ఏ విషయాన్ని అయినా బెరుకు లేకుండా చెప్పగలుగుతారు. ఇది పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. పిల్లలకు ఏ విషయాల మీద ఆసక్తి ఉందో కూడా తల్లిదండ్రులకు అర్థం అవుతుంది. ఎవరితో ఆడుకున్నావు లేదా మాట్లాడావు అని అడగాలి.. పిల్లలు పాఠశాలలో ఎవరితో ఆడుకున్నారు, మాట్లాడారు అనే విషయాలు కొత్త స్నేహితుల గురించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది.  పిల్లలకు సామాజిక అవగాహన అర్థం అవుతుంది. పిల్లలు బడిలో ఒంటరిగా ఉంటారా లేదా ఇతరులతో కలుస్తున్నారా,  ఎవరితో అయినా కలవడంలో  ఇబ్బంది ఫీలవుతున్నారా?  అనే విషయాలు అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులకు సహాయపడుతుంది. ఏదైనా భయం లేదా బాధ పెట్టే విషయం ఉందా అని అడగాలి.. కొందరు పిల్లలు స్కూల్ లో తోటి విద్యార్థుల వల్ల, ఉపాధ్యాయుల వల్ల బాధపడటం, భయపడటం జరుగుతూ ఉంటుంది. దీని వల్ల పిలల్లు బడికి  వెళ్లాలంటే భయపడటారు.  ఈ కారణంగా చదువు మీద ఆసక్తి కూడా తగ్గిపోతుంది. పిల్లల భయాన్ని తగ్గించినప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజు ఏం నేర్చుకున్నావని అడగాలి.. పిల్లలను  ఈ రోజు ఏం నేర్చుకున్నావని ప్రతి రోజూ అడిగితే వారికి ఏ విషయం పట్ల ఆసక్తి ఎక్కువ ఉందో అర్థమవుతుంది. తద్వారా పిల్లలను ప్రోత్సహించడంలో తల్లిదండ్రులకు ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇలా అడిగినప్పుడు పిల్లలు అన్ని చెబుతూ ఉంటే.. పిల్లలలో జ్ఞాపకశక్తి,  వారిలో బావ వ్యక్తీకరణ వంటివి మెరుగు పడతాయి.                          *రూపశ్రీ.
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు,  గొడవలు, అతిగా స్పందించడం, జోక్యం చేసుకోవడం వంటివి కూడా గతంలో కంటే ఎక్కువగా పెరిగాయని చెప్పవచ్చు. వీటి వల్ల బంధాల మధ్య దూరం పెరుగుతుంది. అయితే నేటికాలంలో బంధాలు బలంగా ఉండాలంటే మైక్రో ప్రైవసీ పాటించాలట. ఇంతకీ మైక్రో ప్రైవసీ అంటే ఏంటి? ఇది బంధాలను బలంగా ఉంచడంలో ఎలా సహాయపడుతుంది? తెలుసుకుంటే.. మైక్రోప్రైవసీ.. మైక్రో-ప్రైవసీ అనేది నేటికాలంలో సంబంధాల గురించి జాగ్రత్త చేసే ఒక మార్గం. సంబంధంలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికీ కొంత పర్సనల్ స్పేస్  అవసరమని ఇది చెబుతుంది. ఈ స్పేస్  వ్యక్తికి మానసిక స్వేచ్ఛను అందిస్తుంది , సంబంధం భారంగా మారకుండా నివారిస్తుంది. ప్రేమ అంటే ప్రతీదాన్నీ నియంత్రించడం కాదని, ఒకరి హద్దులను మరొకరు గౌరవించుకోవడం కూడా అని మైక్రో ప్రైవసీ నొక్కి చెబుతుంది. మైక్రో-ప్రైవసీ సంబంధాలలో ఒక బాలెన్స్ ను క్రియేట్ చేస్తుంది.  దీనివల్ల ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నా ఎవరి ఐడెంటిటీ వారికి ఉంటుంది. మైక్రో ప్రైవసీలో అసలు అర్థం.. మైక్రోప్రైవసీలో ఉండే  ముఖ్యమైన అంశం  భాగస్వామి లేదా కుటుంబ సభ్యుని  పర్సనల్ ఫీలింగ్స్ ను, పర్సనల్  సమయాన్ని గౌరవించడం. ఎప్పుడూ వారితో టచ్‌లో ఉండటం లేదా ప్రతి కదలికను గమనించడం అనేది  సంబంధాలను బలహీనపరుస్తుంది. దానికి బదులుగా, ఒకరికొకరు కొంత స్వేచ్ఛను ఇచ్చుకుంటూ, ఒత్తిడి లేకుండా సంబంధాన్ని కొనసాగించడం ముఖ్యం. అతిగా డిపెండ్ అవడాన్ని, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ను నియంత్రణలో ఉంచడంలో కూడా మైక్రో ప్రైవసీ సహాయపడుతుంది. మైక్రో ప్రైవసీ ఎందుకు అవసరం.. మైక్రో ప్రైవసీ  సంబంధాలలో నమ్మకాన్ని, అర్థం చేసుకునే తత్వాన్ని పెంపొందిస్తుంది. ప్రతి ఒక్కరికి  వారి స్వంత సమయం, స్పేస్  ఉన్నప్పుడు, వారు మానసికంగా మరింత ప్రశాంతంగా, బాలెన్స్డ్ గా  ఉంటారు. ఇది సంబంధాలలో అనవసరమైన ఒత్తిడిని తగ్గించి ఎక్కువ కాలం బంధాలు పదిలంగా ఉండేలా చేస్తుంది. మైక్రో ప్రైవసీ పాటించే వ్యక్తులు తమ ఐడెంటిటీని కూడా కోల్పోకుండా ఉంటారు.  ఒకరి ముందు ఒకరు తక్కువ కాదు అనేలా బందాలు ఉంటే.. ఆ బంధాలు ఎన్నేళ్ళైనా పదిలంగా ఉంటాయి. ఇలా  చేయాలి.. భార్యాభర్తలలో ఎవరో ఒకరు అప్పుడప్పుడు ఒంటరిగా సమయం గడపాలని, అభిరుచులను కొనసాగించాలని, లేదా స్నేహితులతో సమయం గడపాలని కోరుకున్నప్పుడు, వారికి అంతరాయం కలిగించకుండా లేదా ప్రశ్నించకుండా వారి ఇష్టాలను గౌరవించడం, వారి అభిరుచులను కొనసాగించడంలో మద్దతు ఇవ్వడం వంటివి మైక్రో ప్రైవసీకి చక్కని ఉదాహరణ.  ఇది ఈ రోజు కొత్తగా  చెప్పాల్సిన విషయమేమీ కాదు.. కానీ కొందరికి అర్థం కావాలంటే కొన్ని ప్రత్యేక మార్గాలలో చెప్పాలి. అందుకే దీన్ని మైక్రో ప్రైవసీ అంటున్నారు.  ఈ మార్గాన్ని పాటిస్తే బంధాలు పదిలంగా ఉంటాయి.                                  *రూపశ్రీ.
ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అయితే అవసరానికి మించి మొబైల్ వాడటం క్రమంగా వ్యసనంగా మారి మన ఆరోగ్యంతో పాటు మెదడు పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వీడియోలో Dr. వేణుగోపాల్ మొబైల్ వ్యసనం వల్ల మెదడులో జరిగే మార్పులు, ఏకాగ్రత తగ్గిపోవడం, జ్ఞాపకశక్తిపై పడే ప్రభావం, నిద్ర సమస్యలు, ఆందోళన, ఒత్తిడి వంటి అంశాలను చాలా సులభంగా వివరించారు.  అలాగే మొబైల్‌కు బానిస కాకుండా ఉండేందుకు పాటించాల్సిన అలవాట్లు, స్క్రీన్ టైమ్‌ను ఎలా తగ్గించుకోవాలి, పిల్లలు మరియు యువతలో మొబైల్ వినియోగాన్ని ఎలా నియంత్రించాలి అనే విషయాలపై కూడా విలువైన సూచనలు అందించారు.  మొబైల్‌ను పూర్తిగా వదిలేయడం అవసరం లేదు. కానీ దానిని సరైన విధంగా ఉపయోగించడం ద్వారా మన మెదడు ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను మరియు జీవన నాణ్యతను కాపాడుకోవచ్చు. మొబైల్ వ్యసనం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి.  
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అన్ని విటమిన్లు , ఖనిజాలు సరైన మోతాదులో అవసరం. శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్లలో  విటమిన్ బి12 ఒకటి, ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటులో, సరైన నాడీ పనితీరులో , శక్తిని నిలుపుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే నేటికాలంలో మారుతున్న జీవనశైలి,  ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం,  పోషకాహార లోపాల కారణంగా, చాలా మంది విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ బి12 ప్రధానంగా జంతు ఆధారిత ఆహారాలలో లభిస్తుంది కాబట్టి, శాకాహారులకు విటమిన్ బి12 లోపం కనిపిస్తూ ఉంటుంది.  టెస్ట్ లలో  విటమిన్ బి12 లోపం ఉన్నట్లు తేలితే, ఆహార , జీవనశైలి మార్పుల ద్వారా విటమిన్ బి12 లోపాన్ని అధిగమించవచ్చు.  విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి కొన్ని సులభమైన మార్గాలను తెలుసుకుంటే.. విటమిన్ బి12 లోపిస్తే కనిపించే లక్షణాలు..  ఎప్పుడూ  అలసటగా మరియు బలహీనంగా అనిపించడం.  చేతులు మరియు పాదాలలో జలదరింపు లేదా తిమ్మిరిగా ఉండటం,   తలతిరగటం,  చర్మం పసుపు రంగులోకి మారడం,  దేని మీదా ఏకాగ్రత లేకపోవడం,  మానసిక స్థితిలో వేగంగా  మార్పులు ఉండటం. విటమిన్ బి12 లోపం అధిగమించడానికి తీసుకోవలసిన ఆహారాలు.. విటమిన్ బి12 లోపాన్ని అదిగమించడానికి పాలు , పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచి మార్గం. ముఖ్యంగా శాకాహారులు, పాల ఉత్పత్తులు బాగా తీసుకోవాలి.  పాలు, పెరుగు, పనీర్ , జున్ను వంటి పాల ఉత్పత్తులలో విటమిన్ బి12తో పాటు, శరీరానికి అవసరమైన అనేక పోషకాలను ఉంటాయి.  కాల్షియం మరియు ప్రోటీన్ కూడా ఉంటాయి.  గుడ్లు, చేపలు, చికెన్ , మాంసం మొదలైన వాటిలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది.  మాంసాహారులు వీటిని తీసుకోవచ్చు.   ఈ ఆహారాలలో ఉండే విటమిన్ బి12ను శరీరం సులభంగా వినియోగించుకుంటుంది. గుడ్డు సొనలో విటమిన్ బి12 ఉంటుంది. చేపలు , చికెన్‌లో ప్రోటీన్ , అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా , బాలెన్స్డ్ గా  తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ బి12 స్థాయిలను సులువుగా పెంచుకోవచ్చు. శాకాహారులకు లేదా పాల ఉత్పత్తులకు దూరంగా ఉండేవారు విటమిన్-బి12 కోసం , బలవర్ధక ఆహారాలు బాగా సహాయపడతాయి. బలవర్ధక ఆహారాలు అంటే విటమిన్లు , ఖనిజాలతో కూడిన ఆహారాలు. చాలా రకాల  బ్రేక్‌ఫాస్ట్ సెరియల్స్, సోయా పాలు లేదా బాదం పాలు వంటి మొక్కల ఆధారిత పాలు,  న్యూట్రిషనల్ ఈస్ట్‌లో విటమిన్ బి12 ఉంటుంది. వీటిని  రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్ బి12   లోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సప్లిమెంట్ల విషయంలో.. విటమిన్ బి12 లోపం తీవ్రంగా ఉంటే, కేవలం ఆహారం ద్వారా దానిని భర్తీ చేయడం కష్టం . అటువంటి సందర్భాలలో డాక్టర్ విటమిన్ బి12 సప్లిమెంట్లు, టాబ్లెట్లు లేదా ఇంజెక్షన్లను సిఫార్సు చేయవచ్చు. విటమిన్ బి12 లోపానికి చికిత్స అనేది వ్యక్తి వయస్సు, ఆరోగ్య స్థితి , లోపం యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, పరీక్షలు చేయించుకోకుండా , డాక్టర్‌ను సంప్రదించకుండా ఎక్కువ కాలం సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది కాదు.                                 *రూపశ్రీ.
థైరాయిడ్ సమస్యలు ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఒకటి. అయితే, థైరాయిడ్ రావడానికి మన ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణమా? థైరాయిడ్ ఉన్నవారు ఏ ఆహారం తీసుకోవాలి? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి? అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. ఈ వీడియోలో సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డా. పి. జానకి శ్రీనాథ్ థైరాయిడ్ సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా థైరాయిడ్ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో, రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఆహారపు అలవాట్లు ఏమిటో వివరంగా చెబుతున్నారు.  ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యమైన విషయాలు: థైరాయిడ్ అంటే ఏమిటి? థైరాయిడ్ రావడానికి ఆహారపు అలవాట్లు ఎంతవరకు కారణం? థైరాయిడ్ ఉన్నవారు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు తగ్గించాల్సిన లేదా మానాల్సిన ఆహారాలు అయోడిన్, సెలీనియం, జింక్ వంటి పోషకాల ప్రాముఖ్యత థైరాయిడ్ రోగులు పాటించాల్సిన ఆరోగ్యకరమైన డైట్ చిట్కాలు జీవనశైలిలో చేయాల్సిన మార్పులు థైరాయిడ్ సమస్యలను నియంత్రించుకోవాలనుకునే వారు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవరుచుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది.
భారతీయుల భోజనంలో అన్నం చాలా ప్రధానమైనది. అన్నం తినడం వల్ల వచ్చే సాటిసిఫాక్షన్ వేరే ఏ విధంగా రాదని చాలామంది అంటారు.  ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మూడు పూటలా అన్నం తినాలన్నా చక్కగా తినేస్తారు. కానీ ప్రస్తుతం డయాబెటిస్,  అధిక బరువు వంటి సమస్యలతో అన్నం అంటే దూరం జరిగే వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారు ఆహారంలో రొట్టెలు తీసుకోవడం మంచిదని అనుకుంటారు.  చపాతీలు, సజ్జ, జొన్న రొట్టెలు ఆరోగ్యానికి ఎంతో మంచివి.  ముఖ్యంగా జొన్నరొట్టెలు శరీరానికి చక్కని పోషణ ఇస్తాయి.  అంతేకాదు.. 30 రోజులు అన్నానికి బదులుగా జొన్న రొట్టెలు తింటే ఆరోగ్య పరంగా  అద్బుతమైన ఫలితాలు చూస్తారు.  30రోజులు జొన్న రొట్టెలు తింటే ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. 30రోజులు అన్నానికి బదులు జొన్న రొట్టెలు తింటే కలిగే ఫలితాలు.. భారతీయులు ఉపయోగించే తృణదాన్యాలలో జొన్నలు చాలా శ్రేష్టమైనవి. జొన్నలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఈ కారణంగా అన్నానికి బదులు జొన్న రొట్టెలు తినడం వల్ల చాలాసేపటి వరకు ఆకలి అవ్వదు.  ఈ కారణంగా పదే పదే ఏదో ఒకటి తినడం అనే అలవాటు కూడా తగ్గుతుంది.  దీనివల్ల బరువు తగ్గడం కూడా సులువు అవుతుంది.  రోజూ అన్నానికి బదులు జొన్నరొట్టెలు తినేవారు బరువు సులువుగా తగ్గుతారు. డయాబెటిస్ ఉన్న వారికి జొన్నలు గొప్ప వరం అని చెప్పవచ్చు. అన్నంతో పోలిస్తే జొన్నరొట్టెలలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల జొన్నరొట్టెలు తింటే షుగర్ లెవెల్స్ నిలకడగా ఉంటాయి.  డయాబెటిస్ ఉన్నవారు అన్నం, చపాతీ బదులు రోజూ జొన్నరొట్టెలు తింటే బ్లడ్ షుగర్ చాలా కంట్రోల్ అవుతాయి. జొన్నలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  దీనివల్ల ఆహారం జీర్ణం కావడంలో ఎలా ఇబ్బందులు ఉండవు. మలబద్దకంతో ఇబ్బంది పడేవారు రోజూ జొన్నరొట్టెలు తీసుకుంటే మలబద్దకం సమస్య తొగ్గిపోతుంది. జీర్ణాశయం స్థితి మెరుగవుతుంది. జొన్నరొట్టెలలో ఉండే గ్లైసెమిక్ సూచీ చాలా తక్కువ.  ఇది రక్తంలో గ్లూకోజ్ ను చాలా నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఈ కారణంగా నెమ్మదిగా అరుగుతుంది.  దీనివల్ల చాలాసేపటి వరకు ఆకలి వేయకుండా ఉండటమే కాదు.. చాలా సేపు ఎనర్జీగా కూడా ఉంచుతుంది. అన్నం అయితే తొందరగా అరిగిపోతుంది. అందుకే జొన్నరొట్టెలు తింటే ఎక్కువ సేపు ఎనర్జీగా ఉండవచ్చు. పూరీ,  బేకరీ ఫుడ్స్,  కేక్స్, ఆయిల్ ఫుడ్స్  వంటివి తినడం వల్ల శరీరంలో  చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.  అయితే చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు ఏ ఆహారం తినాలన్నా చాలా భయపడుతూ ఉంటారు. కానీ రోజూ జొన్న రొట్టెలు తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.  గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.   జొన్నరొట్టెలు శరీరానికి చలువ చేస్తాయి,  బలాన్ని ఇస్తాయి,  ఎక్కువ సేపు శరీరానికి శక్తిని ఇస్తాయి, రోజూ కనీసం ఒక్కపూట అయినా జొన్న రొట్టెలు తింటే శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అందుకే కనీసం రోజులో ఒక్క పూట అయినా జొన్న రొట్టెను ఆహారంలో తీసుకోవడం మంచి అలవాటని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు.                               *రూపశ్రీ.