LATEST NEWS
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా  బీజేపీ) వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్  పార్టీ తెలంగాణ నాయకత్వానికి దిశా నిర్దేశం చేశారు.   ఈ ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని, అక్కడ క్షేత్రస్థాయిలో చేసిన ప్రజా పోరాటాలను తెలంగాణ బీజేపీ నేతలు స్ఫూర్తిగా తీసుకోవాలని  పిలుపునిచ్చారు. బెంగాల్ మోడల్ తరహాలోనే ఇక్కడ కూడా ప్రజా సమస్యలపై పోరాడి విజయం సాధించాలన్న నితిన్ నబీన్.. రాష్ట్ర నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణ రాహిత్యాన్ని ఇక ఎంత మాత్రం సహించబోమని స్పష్టమైన హెచ్చరిక చేశారు. అయితే తెలంగాణలో బెంగాల్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అంటే పరిశీలకులు మాత్రం ఆ అవకాశం ఇసుమంతైనా లేదంటున్నారు.  బెంగాల్‌తో తెలంగాణను పోల్చడం సాధ్యం కాదని కుండబద్దలు కొడుతున్నారు.   పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల మధ్య  రాజకీయంగా  భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. బెంగాల్‌లో సుదీర్ఘ కాలం పాటు పని చేసిన కమ్యూనిస్టులు క్షేత్రస్థాయిలో పూర్తిగా పట్టు కోల్పోవడం బీజేపీకి  ప్లస్ పాయింట్‌ అయ్యింది. దానికి తోడు అక్కడ  తృణమూల్ కాంగ్రెస్పై తీవ్రమైన అవినీతి, అక్రమాల ముద్ర పడటం, మమతా బెనర్జీ తర్వాత వారసుడిగా కుటుంబ సభ్యులను ముందుకు తీసుకురావడాన్ని బెంగాల్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. వీటన్నింటికీ మించి బెంగాల్‌లో సువేందు అధికారి లాంటి బలమైన, మాస్ ఇమేజ్ ఉన్న ఒక ఐకాన్ లీడర్ బీజేపీకి దొరకడం కలిసి వచ్చింది. ఈ రాజకీయ, సామాజిక సమీకరణాలే అక్కడ బీజేపీ విజయానికి మార్గం సుగమం చేశాయి. కానీ..  అటువంటి పరిస్థితి లేదు.  రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై గానీ, సీఎంపై గానీ ప్రజల్లో పెద్దగా  వ్యతిరేకత కనిపించడం లేదు. అదే సమయంలో ఈ మూడేళ్లలో కాంగ్రెస్ సర్కార్ పై అవినీతి ముద్ర పడిన దాఖలాలు కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో   కొన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ..  వాటిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తోంది.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల్లో   బలమైన   నేతగా, మాస్  లీడర్‌గా, అసెంబ్లీ లోపలా  బయటా గట్టిగా గళం ఎత్తగల నాయకుడిగా  గుర్తింపు పొందారు. ఇటువంటి బలమైన వ్యూహకర్తను ఢీకొట్టడం బీజేపీ అంత సులభ సాధ్యం కాదని పరిశీలకులు అంటున్నారు.  మరోవైపు..  బెంగాల్‌లో సువేందు అధికారి తరహాలో రాష్ట్రం మొత్తం ప్రభావం చూపించగల  నాయకుడు ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ఎవరూ కనిపించడం లేదని చెబుతున్నారు. అలాగే తెలంగాణ బీజేపీలో ముఖ్య నేతల మధ్య  అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరాటాలు, కుమ్ములాటలు క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను గందరగోళంలో పడేశాయని చెబుతున్నారు.   అలాగే.. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితికి క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంక్  ఇప్పటికీ బలంగానే ఉండటం కూడా బీజేపీకి అధికారం అంత సులువుగా దక్కదన్న అభిప్రాయానికి కారణం అవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో   త్రిముఖ పోటీ తధ్యమని పరిశీలకులు అంటున్నారు. ఆ కారణంగానే.. బెంగాల్ తరహా ఏకపక్ష వ్యూహాలు ఇక్కడ ఫలించే అవకాశాలు అంతంత మాత్రమేనని విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి  రాష్ట్ర విభజన జరిగి దాదాపు 12 సంవత్సరాలు గడుస్తున్నా..  విభజన చట్టంలో పేర్కొన్న ప‌లు కీలక ప్రాజెక్టులు, హామీలు, తెలంగాణకు రావాల్సిన నిధులు వంటి హామీలను  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిగా నెరవేర్చలేదనే అసంతృప్తి స్థానికంగా చాలా చాలా బలంగా ఉంది.  తెలంగాణ ఆవిర్భావానికి  పార్లమెంట్‌లో తాము కూడా మద్దతు తెలిపామని బీజేపీ క్రెడిట్ కోరుకుంటున్నప్పటికీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ పుష్కర కాలంలో  రాష్ట్రానికి చేసిన ఆర్థిక సాయం ఎంత అనే ప్రశ్నకు రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పలేక తడబడుతున్న పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే..   కేవలం బెంగాల్ ఫార్ములాను నమ్ముకుని తెలంగాణలో పాగా వేయాలనుకోవడం నేల విడిచి సాము చేయడంగా మారుతుందన్నది పరిశీలకుల విశ్లేషణ. 
భారతీయ రాజకీయాలలొప్రశాంత్ కిషోర్ (పీకే) పేరుకు పరిచయం అక్కర్లేదు.  రాజకీయ వ్యూహకర్తగా పీకే ఎన్నో చారిత్రాత్మక విజయాల వెనుక పీకే ఉన్నారు. అయితే సొంత రాష్ట్రం బీహార్ లో సొంత రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగి బొక్కబోర్లా పడ్డారు. అయితే ఇప్పుడు ఆయన మరో సారి ఎన్నికల బరిలోకి దిగనున్నారు.  సొంత పార్టీ పెట్టి  బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాలలోనూ  తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన ప్రశాంత్ కిశోర్ అప్పుడు తాను స్వయంగా పోటీ చేయలేదు. పార్టీ ఘోర పరాజయం తరువాత ఇప్పుడు ఆయన బీహార్ అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు  సిద్ధమౌతున్నారు.    బిహార్‌లో ఆయన స్థాపించిన  జన్ సూరజ్  పార్టీకి ఏ మాత్రం ఆదరణ లభించలేదు. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయినా వెనుకడుగు వేయని ప్రశాంత్ కిశోర్..  ఇప్పుడు బీహార్ కొత్త పాట్నా పరిధిలోని  బాంకీపూర్  నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో తానే స్వయంగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.   బాంకీపూర్ నియోజకర్గం దశాబ్దాలుగా  బీజేపీ కి బలమైన కోటగా నిలబడుతోంది. 1995 నుండి ఈ నియోజకవర్గం నుంచి  బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విజయం సాధించారు. ఆయన తాజాగా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ నియోజకవర్గానికి రాజీనామా చేశారు.  దీంతో బాకింపూర్ కు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. బీజేపీకి బలమైన నియోజకవర్గమే అయినప్పటికీ..  పీకే ఇక్కడ నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు.  ఈ విషయాన్ని ఆయన సూచన ప్రాయంగా వెళ్లడడించారు.  బాంకీపూర్‌లో బీజేపీ ఆధిపత్యాన్ని ఎలాగైనా తగ్గించడమే తన ప్రధాన లక్ష్యమనీ.. అవసరమైతే తానే స్వయంగా బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు   పొలిటికల్ స్క్రీన్‌ప్లే లకే పరిమితమైన  ప్రశాంత్ కిషోర్..    ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. అదీ బీజేపీకి గట్టిపట్టున్న బాంకీపూర్ నియోజకవర్గం నుంచి. బీజేపీ కోటలాంటి బాంకీపూర్ లో పీకే గెలుపు కష్టసాధ్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ప్రాశాంత్ కిశోర్ మాత్రం  దశాబ్దాల బీజేపీ కోటను బద్దలు కొడతానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి  ఆ పార్టీ హైకమాండ్   గట్టి షాక్ ఇచ్చింది. తాజాగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన బీజేపీ   జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం (జూన్ 28)  అర్ధరాత్రి తెలంగాణ బీజేపీ కీలక నేతలతో అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన రాష్ట్ర నాయకుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయకుండా..  గ్రూపు రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తే చూస్తూ ఊరుకోబోమని కుండబద్దలు కొట్టారు.  తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు, బయటి నుంచి వచ్చే రాజకీయ మద్దతుపై ఆధారపడటం మానుకోవాలని ఈ సందర్భంగా నితిన్ నబీన్ విస్పష్టంగా చెప్పారు.  బయటి నుంచి  మద్దతు లభిస్తుంది, దానితో ఎన్నికల్లో గెలిచేయవచ్చు అనే భ్రమల నుంచి తెలంగాణ బీజేపీ నాయకులు వెంటనే బయటకు రావాలనీ, . నాయకత్వంలో అలసత్వాని ఇకపై ఇసుమంతైనా సహించేది లేదనీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.  పశ్చిమ బెంగాల్ లాంటి   రాష్ట్రంలోనే బీజేపీ కేవలం తన సొంత బలంతో, క్షేత్రస్థాయి పోరాటాలతో  ఎదిగి అధికారాన్ని చేజిక్కించుకుందని చెప్పిన నితిన్ నబీన్.. అందుకు భిన్నంగా తెలంగాణలో సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ, నాయకుల అలసత్వం, గ్రూపు రాజకీయాలు, విభేదాల కారణంగా పార్టీ వెనుకబడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.   రాష్ట్రంలోని ఏ నాయకుడు ఏం చేస్తున్నారో, ఎవరెవరు ఏ ఏ ప్రాంతాల్లో యాక్టివ్‌గా ఉన్నారో, ఎవరు పార్టీ కార్యక్రమాలను లైట్ తీసుకుంటున్నారో అనే పూర్తి వివరాలు, గణాంకాలు  తన వద్ద ఉన్నాయని  నితిన్ నబీన్ చెప్పారు.  రాబోయే మున్సిపల్ ఎన్నికలు, అలాగే జీహఎచ్ఎంసీ సంస్థల ఎన్నికలను తెలంగాణ బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశించారు. 
  ఉప్పల్‌లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ..  తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కార్పొరేట్ శక్తులు కుట్రలు చేస్తున్నాయని, వాటిని బలపరుస్తున్నది బీఆర్ఎస్‌లోని కొందరు నాయకులేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఉప్పల్‌లో నిర్వహించిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, తెలంగాణ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మౌనం వహిస్తున్నాయని విమర్శించారు. ఉప్పల్ తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువని పేర్కొన్న కవిత, అలాంటి ప్రాంతంలో పార్టీ జెండాను ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ హామీ ఇచ్చిన 250 గజాల స్థలాల కోసం జూలై 2న ఉప్పల్ భగాయత్‌లో భారీ భూపోరాటం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులు, మహిళలు, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన పోరాడుతుందని, అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని గతంలో అవహేళన చేసినవారే ఇప్పుడు మళ్లీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 'ఇడుపు కాగితం' అనే పదాన్ని ఎగతాళి చేస్తున్న వారిపై స్పందిస్తూ, దాని అర్థం తెలుసుకోవాలంటే పవన్ కళ్యాణ్‌ను అడిగితే వివరిస్తారని వ్యాఖ్యానించారు. తెలంగాణ భాషను అవమానిస్తే సహించబోమని స్పష్టం చేశారు. గతంలో అవమానాలను ఎదుర్కొని తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు. భాషలన్నింటినీ గౌరవించాలని, అయితే తెలంగాణ భాషను కించపరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ భాషను అవమానిస్తున్న వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదని విమర్శించారు. బీజేపీ దేశ ప్రయోజనాల పేరుతో తెలంగాణ సమస్యలను విస్మరిస్తోందని, బీఆర్ఎస్ కూడా స్పందించడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్‌లోని కొందరు నాయకులు నారాయణ, చైతన్య విద్యాసంస్థలతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నందువల్లే తెలంగాణ ప్రయోజనాలపై మాట్లాడడం లేదని ఆరోపించారు. నారాయణ, చైతన్యతో పాటు ఇతర కార్పొరేట్ విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లో మదర్ డెయిరీ, ముల్కానూరు, విజయ డెయిరీల పాలనే వినియోగించేలా ప్రభుత్వం జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని, పాఠశాల ఫీజులను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. టీచర్లలో అధిక శాతం కేరళ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారినే నియమిస్తున్నారని, ఉత్తర భారతదేశానికి చెందిన విద్యాసంస్థలు కూడా చిన్న ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడేది తెలంగాణ రక్షణ సేన మాత్రమేనని కవిత పేర్కొన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన కార్పొరేట్ శక్తులను పెంచి పోషిస్తున్నది బీఆర్ఎస్‌లోని నాయకత్వమేనని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు, ఉద్యమకారుల కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటానని, లాఠీలు, రబ్బరు తూటాలకు కూడా భయపడబోనని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉప్పల్‌లోని అన్ని డివిజన్లలో పోటీ చేస్తామని, భవిష్యత్తులో ఉప్పల్ ఎమ్మెల్యే స్థానాన్ని కూడా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసే రాజకీయ పార్టీగా తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ అమలయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
  నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో భారీ మార్పులు తీసుకువచ్చేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్టానం సరికొత్త వ్యూహాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం, కేంద్ర పెద్దలు తమ పూర్తి దృష్టిని తెలంగాణపై కేంద్రీకరించినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడమే కాకుండా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలో సరికొత్త రాజకీయ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. యువత, మేధావులు, మరియు మహిళలను పెద్ద ఎత్తున పార్టీలోకి ఆకర్షించడం ద్వారా క్షేత్రస్థాయిలో కేడర్‌ను బలోపేతం చేసే ప్రక్రియ వేగవంతమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం నుంచి తెలంగాణలో మూడు రోజుల పర్యటన చేపట్టనున్నారు. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడం, భవిష్యత్తులో అధికార పీఠాన్ని కైవసం చేసుకునే లక్ష్యంతో ఈ పర్యటనను పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. క్షేత్రస్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంతో పాటు వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. పర్యటనలో భాగంగా ఆదివారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ సమావేశానికి బీజేపీ ‘విజయ సంకల్ప సమ్మేళనం’గా పేరు పెట్టింది. జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని సుమారు 15 వేల మంది పోలింగ్ బూత్ అధ్యక్షులు, బూత్ ఏజెంట్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్ పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కీలక సందేశం ఇవ్వనున్నారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 90 శాతం సీట్లను యువ నాయకులకే కేటాయించాలని తెలంగాణ బీజేపీ సరికొత్త నిర్ణయం తీసుకోవడం విశేషం. జెన్ జీ (Gen Z) ఓటర్లలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, ఉపాధి అవకాశాల పట్ల ఉన్న సానుకూలతను ఓట్లుగా మలుచుకోవాలని పార్టీ భావిస్తోంది. గత ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే, తెలంగాణలో బీజేపీ బలం అంచెలంచెలుగా పెరుగుతూ వస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 19.6 శాతం ఓట్ల షేర్ సాధించిన బీజేపీ, 2024 సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి ఆ శాతాన్ని ఏకంగా 35.1 శాతానికి పెంచుకుంది. అంతేకాకుండా, రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను 8 స్థానాలను కైవసం చేసుకుని తన సీట్ల సంఖ్యను రెట్టింపు చేసుకుంది. మల్కాజ్‌గిరి, చేవెళ్ల, మెదక్, మహబూబ్‌నగర్ వంటి కీలక ప్రాంతాలలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కోటలను బద్దలు కొట్టి మరీ విజయం సాధించడం గమనార్హం.   మరోవైపు, ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. నకిలీ, డూప్లికేట్ మరియు మరణించిన ఓటర్ల గుర్తింపు కోసమే ఈ ప్రక్రియ జరుగుతోందని, ఏ ఒక్క నిజమైన ఓటరు హక్కుకూ భంగం కలగదని రాంచందర్ రావు స్పష్టం చేశారు. కేవలం తమ బూత్ స్థాయి నెట్‌వర్క్ బలహీనపడటంతోనే బీఆర్‌ఎస్ వంటి పార్టీలు ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) కాలంలో రాజ్యాంగాన్ని అణచివేసిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టడమే అంతిమ లక్ష్యంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలను కలుపుకుంటూ, క్షేత్రస్థాయి నుండి పార్టీని పటిష్టం చేసేందుకు కమలనాథులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.    
ALSO ON TELUGUONE N E W S
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)పక్కన హీరోయిన్ గా ఛాన్స్ అంటే పెట్టి పుట్టాలనే సామెత ఇండస్ట్రీ వర్గాల్లో చాలా బలంగానే ఉంది. ఇప్పుడు ఈ అదృష్టం ఒకప్పుడు వరుస విజయాలతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌ లలో మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డేకి దక్కిందనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.   పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో  'OG' (ఓజీ) సీక్వెల్ ‘ఓజీ 2’ (OG 2) తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. అనౌన్స్ మెంట్ వీడియో అయితే ఒక రేంజ్ లోనే వైరల్ గా మారింది. ఈ మూవీలోనే  పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. దీంతో ఫస్ట్ టైమ్ పవన్ సరసన పూజా హెగ్డే   జోడీ కట్టబోతుండటం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో హరీష్ శంకర్ చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్', అంతకుముందు క్రిష్ జాగర్లమూడి చిత్రాల్లోనూ పవన్ సరసన పూజ పేరు వినిపించినప్పటికీ, రకరకాల కారణాల వల్ల ఆ కాంబినేషన్ కుదరలేదు. అయితే ఈసారి డైరెక్టర్ సుజీత్ క్రియేట్ చేస్తున్న ‘ఓజీ యూనివర్స్’ లో ఈ బుట్టబొమ్మకి కు పక్కాగా స్థానం దక్కిందని టాక్ వినిపిస్తోంది. సుజీత్ ఇప్పటికే నేచురల్ స్టార్ నానితో 'బ్లడీ రొమియో' అనే క్రేజీ ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, నాని సినిమా కంటే ముందే పవన్ కళ్యాణ్ 'ఓజీ 2' ని సెట్స్‌పైకి తీసుకెళ్తారా, లేక షెడ్యూల్స్ మార్చుతారా అనేది తెలియాల్సి ఉంది. Also read: Samantha: సమంత దెబ్బకి జేజెమ్మ రికార్డు గల్లంతు.. మా ఇంటి బంగారం అరుదైన రికార్డు  పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పై  పవన్ నిర్మిస్తున్న ఓజి 2  పూజా హెగ్డేకి  భారీ కమ్‌బ్యాక్ లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే పూజాని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు అధికార ప్రకటన రానుందనేది ఇండస్ట్రీ తాజా టాక్.   
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం #RAPO23 ను అధికారికంగా లాంచ్ చేశారు. ఈ చిత్రంతో రామ్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై  కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఈ చిత్రం ఈరోజు సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. నిర్మాత కృష్ణ పోతినేని స్క్రిప్ట్ ను రామ్ పోతినేనికి అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి పి. మురళీ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, పి.వి. రవి కిషోర్ క్లాప్ కొట్టారు. దర్శకుడిగా తన ప్రయాణానికి శ్రీకారం చుడుతూ తొలి షాట్‌కు రామ్ పోతినేని స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ రోజు హైదరాబాద్ శివార్లలో ప్రారంభమైంది. చిత్రంలోని ప్రధాన తారాగణంతో కలిసి హీరో రామ్ పోతినేని షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్ర కథను స్వయంగా రామ్ పోతినేని రాశారు. నియో-నోయర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీనిని రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని విభిన్న అంశాలను, ఆసక్తికరమైన పాత్రల ప్రయాణంతో ఈ చిత్రం ఉండబోతోంది.  దర్శకత్వం, కథతో పాటు ఈ చిత్రంలో రామ్ హీరోగానూ నటిస్తున్నారు. కెమెరా ముందు, వెనుక బాధ్యతలు చేపట్టడం ద్వారా ఈ ప్రాజెక్ట్‌పై ఆయనకున్న అంకితభావం స్పష్టమవుతోంది. తన కెరీర్‌లోనే అత్యంత సవాల్‌తో కూడిన పాత్రను ఆయన ఇందులో పోషించబోతున్నారు. ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం పలువురు ప్రముఖ నటీనటులను ఎంపిక చేస్తున్నారు. తారాగణానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.   అత్యున్నత స్థాయి సాంకేతిక  బృందం ఈ చిత్రానికి పని చేస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత తిరునావుకరసు (తిరు) సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హైన్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.  విభిన్నమైన కథ, భారీ తారాగణం, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల కలయికతో తెరకెక్కుతున్న #RAPO23, రామ్ పోతినేని కెరీర్‌లోనే ఒక మైలురాయి చిత్రంగా నిలవనుంది.   
The cameras have officially started rolling for RAPO23, the ambitious new project that marks a significant milestone in Ram Pothineni's career. After creating buzz with its announcement as his directorial debut, the film was formally launched with a traditional pooja ceremony before beginning regular production. The launch event was attended by the film's core team, with producer Krishna Pothineni handing over the script to Ram. P. Murali Mohan switched on the camera, while P.V. Ravi Kishore gave the ceremonial clap for the muhurtham shot. Adding a symbolic touch to the occasion, Ram himself directed the first shot, officially kicking off the shoot. Unlike his previous ventures, RAPO23 sees Ram taking on multiple responsibilities. Besides playing the lead role, he has also conceived the story and is directing the film. The project is said to be a psychological action thriller set in a dark neo-noir world, a genre rarely explored in mainstream Telugu cinema. The first-look poster had already hinted at a stylish and intense makeover for the actor, raising expectations among fans. The regular shoot commenced immediately after the launch ceremony, with Ram and several cast members joining the production. While the complete cast is yet to be announced, the makers have confirmed that a top-tier ensemble has been brought on board for key roles. Cinematographer Thirru is handling the visuals, adding further intrigue to the project. Billed as the biggest-budget film of Ram Pothineni's career, RAPO23 is shaping up to be one of his most ambitious ventures. With production now underway, the makers are expected to reveal more details about the cast and other key aspects of the film in the coming weeks. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Nandamuri Balakrishna's upcoming action entertainer with Gopichand Malineni has been progressing at a brisk pace, and fresh industry buzz suggests the makers are keeping two release windows open instead of locking a single date. While there has been no official announcement yet, sources indicate that the team is planning the production schedule around both October 16 and December 4. The film recently wrapped up a major schedule in Mumbai before shifting to specially erected sets in Hyderabad for its next leg. According to trade circles, the production team is pushing for an October release by maintaining a tight shooting schedule. However, they reportedly do not want to rush the extensive post-production work if it affects the film's quality. As a result, December 4 is said to have been identified as a backup release date should the visual effects and post-production require additional time. The strategy would allow the makers to avoid unnecessary pressure while ensuring the film gets a polished theatrical release. Expectations for the project have been soaring ever since Balakrishna's birthday glimpse showcased him in a youthful and stylish avatar. The makers have also confirmed Kajal Aggarwal in a de-glam role as an IAS officer, while Manchu Manoj's inclusion in a prominent role has added another layer of curiosity. Produced by Venkata Satish Kilaru, NBK111 is being mounted on a lavish scale and is expected to be one of the biggest action films in Balakrishna's career. Whether the team arrives in theatres for Dasara or opts for a December release will likely depend on how quickly the remaining shoot and post-production are completed. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) సరికొత్త ఆధ్యాత్మిక, మాస్ అవతారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం 'ఇరుముడి' (Irumudi) నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన "ఇరుముడి కట్టు" (Irumudi Kattu) భక్తిరస గీతాన్ని ఈరోజు అధికారికంగా విడుదల చేశారు. ఈ పాట విడుదలైన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సంచలనం సృష్టిస్తూ, శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. 4 నిమిషాల నిడివి గల ఈ గీతం వినేకొద్దీ భక్తులలోనూ, సినిమా అభిమానులలోనూ సరికొత్త ఉత్తేజాన్ని, భక్తి భావాన్ని రగిలిస్తోంది. రాబోయే శబరిమల యాత్రా సీజన్‌కు ఈ పాట ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అద్భుతమైన గీతానికి జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు. ఒకవైపు సంప్రదాయ భక్తి సంగీతాన్ని, మరోవైపు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే బీట్లను మేళవించి ఆయన అందించిన ట్యూన్ అద్భుతంగా కుదిరింది. ప్రముఖ గాయకుడు అనంతు తన గంభీరమైన గొంతుతో ఈ పాటను ఆలపించి, దీనికి మరింత ప్రాణప్రతిష్ట చేశారు. ఆయన గాత్రంలో ఉన్న తీవ్రత, భక్తి శ్రద్ధలు ప్రతి శ్రోత హృదయాన్ని ఆకట్టుకుంటున్నాయి.  ముఖ్యంగా దర్శకుడు శివ నిర్వాణ ఈ పాటను తెరకెక్కించిన విధానం, సినిమాలో దీని ప్రాధాన్యత ఎంత బలంగా ఉండబోతుందో స్పష్టం చేస్తోంది. రవితేజ మార్క్ ఎనర్జీకి, శివ నిర్వాణ ఎమోషనల్ టేకింగ్ తోడవడంతో ఈ భక్తి గీతం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో వచ్చే భక్తి పాటల కంటే ఇది ఎంతో భిన్నంగా, ప్రత్యేకంగా ఉందంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. "ఇరుముడి కట్టు" పాటలో శివ నిర్వాణ, కళ్యాణ్ చక్రవర్తి అందించిన సాహిత్యం ప్రతి అయ్యప్ప స్వామి భక్తుడి యాత్రా అనుభవాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. మండల దీక్ష ముగిసిన తర్వాత మాల వేసుకున్న అసలు అర్థాన్ని తెలుసుకుని, శబరి కొండ పిలుపును అందుకుని మణికంఠుని దర్శనానికి బయలుదేరే భక్తుల ఆరాటాన్ని ఇందులో అద్భుతంగా వర్ణించారు. కొబ్బరికాయలో నెయ్యిని పోసి, కర్పూర ధూపం వేసి, ఎంతో ఇష్టంగా ఇరుముడి కట్టే సంప్రదాయ ఘట్టాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పాటలో ప్రతిఫలించారు. ఎరుమేలి దాటి, పవిత్ర పంపా నదిలో స్నానాలు ఆచరించి, కష్టతరమైన అపాచిమేడు కొండను ఎక్కుతూ స్వామి అనుగ్రహం కోసం భక్తులు చేసే ప్రయాణాన్ని ఎంతో ఎమోషనల్‌గా ఈ పాటలో పొందుపరిచారు. "స్వామియే శరణం అయ్యప్ప" అనే మంత్రోచ్ఛారణలతో సాగే ఈ గీతం వింటుంటే నిజంగానే శబరిమల కొండల్లో ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది. రవితేజ కెరీర్‌లో ఇలాంటి ఒక పవర్‌ఫుల్ అయ్యప్ప భక్తి గీతం రావడం ఇదే మొదటిసారి కావడంతో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. పాట ప్రారంభం నుండి ముగింపు వరకు ఉన్న హై-ఎనర్జీ బీట్స్, బ్యాక్‌గ్రౌండ్ కోరస్ ప్రేక్షకులలో పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చినప్పుడు ఈ పాట థియేటర్లను హోరెత్తించడం ఖాయమని స్పష్టమవుతోంది. రవితేజ, శివ నిర్వాణ, జి.వి. ప్రకాష్ కుమార్ త్రయం అందించిన ఈ విజువల్ అండ్ మ్యూజికల్ ఫీస్ట్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. భక్తిని, మాస్ ఎలిమెంట్స్‌ను సమానంగా ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ఈ "ఇరుముడి కట్టు" సాంగ్ ఒక మధురమైన అనుభవంగా మిగిలిపోతుంది.  
  సమంత(Samantha)వన్ ఉమెన్ షో  'మా ఇంటి బంగారం' (Maa Inti bangaram)బాక్సాఫీస్ వద్ద  రికార్డుల సునామీని సృష్టిస్తోంది. పైగా సదరు రికార్డుల వయసు కేవలం పది రోజులు. దీంతో  పదహారేళ్ల క్రితం 2009లో విడుదలైన అనుష్క శెట్టి  వన్ ఉమెన్ షో ‘అరుంధతి’ నెలకొల్పిన 70 కోట్ల లైఫ్‌టైమ్ రికార్డుని సమంత కేవలం పది రోజుల్లోనే అధిగమించడం విశేషం. దీంతో  తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన మహిళా ప్రాధాన్యత కలిగిన (Woman-led) చిత్రంగా మా ఇంటి బంగారం సరికొత్త రికార్డుని  లిఖించింది. ఎటువంటి కమర్షియల్ స్టార్ హీరో అండ లేకుండా, కేవలం సమంత నటన, యాక్షన్ సీక్వెన్స్, నందినీ రెడ్డి భావోద్వేగాల కథనమే ముడి సరుకుగా  ఈ అద్భుతం సాధ్యమైంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం కేవలం  20 కోట్ల పరిమిత బడ్జెట్‌తో నిర్మితమైంది. కానీ, విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా  78.71 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, తన నిర్మాణ వ్యయానికి దాదాపు నాలుగు రెట్లు లాభాలని  తెచ్చిపెట్టింది. రెండవ వీకెండ్‌లో కూడా  బాక్సాఫీస్ వేటని ఏమాత్రం తగ్గించకుండా భారీ వసూళ్లని  నమోదు చేసింది. శనివారం (9వ రోజు) 4.90 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించగా, ఆదివారం (10వ రోజు)  5.30 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. దీనితో భారతదేశం మొత్తం మీద ఈ చిత్రం రూ. 48.25 కోట్ల నెట్ వసూళ్లని  55.86 కోట్ల గ్రాస్ కలెక్షన్లని  తన ఖాతాలో వేసుకుంది. Also read: Pawan Kalyan: నైట్ మొత్తం పాముల పక్కన పడుకున్న పవన్ కళ్యాణ్!  నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కగా  చీరకట్టులో సమంత చేసిన అద్భుతమైన యాక్షన్ స్టంట్స్, మిలిటెంట్లకు వ్యతిరేకంగా సాగే ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ఇప్పుడు  100 కోట్ల క్లబ్ వైపు శరవేగంగా దూసుకుపోతోంది.  
The promotional campaign for Irumudi has moved into its musical phase with the release of its first single, "Irumudi Kattu." Starring Ravi Teja, Priya Bhavani Shankar, and Baby Nakshatra, the film has already generated curiosity with its first glimpse, which introduced an emotional father-daughter story layered with a spiritual backdrop centered on Lord Ayyappa. The newly released song leans heavily into the devotional atmosphere associated with the Ayyappa Deeksha. Composer GV Prakash Kumar takes inspiration from traditional Ayyappa chants to create a tune that blends devotional flavour with a commercial appeal. Rather than being a conventional film song, "Irumudi Kattu" is designed to recreate the festive spirit of the pilgrimage season while retaining Ravi Teja's trademark energy. Visually, the song stands out with its elaborate Padi Puja setting and vibrant production design. Ravi Teja is seen participating in the rituals alongside fellow devotees, while his energetic screen presence keeps the devotional number engaging. Priya Bhavani Shankar also makes her presence felt in the song, adding to its emotional appeal. The lyrics, penned by director Shiva Nirvana along with Kalyan Chakravarthy, focus on devotion towards Lord Ayyappa and could resonate strongly with devotees during the Swamy Maala season. The combination of traditional references, grand visuals and a catchy composition gives the song the potential to connect beyond the film's promotional campaign. Produced by Mythri Movie Makers, Irumudi is positioned as an emotional family drama with a spiritual core. The film is slated for a worldwide theatrical release on August 21, with the makers expected to intensify promotions in the coming weeks. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  -ఫిలిం సర్కిల్స్ లో వైరల్ గా మారిన పవన్ తాజా న్యూస్  -నైట్ మొత్తం పాముల పక్కన పడుకున్నాడా! -పూర్తి డీటెయిల్స్ ఏంటో చూద్దాం పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)కి తన చాలా సినిమాల డబ్బింగ్ ని రామానాయడు స్టూడియోస్ లో చెప్పడం అలవాటు. ఈ మేరకు నైట్ మొత్తం రామానాయుడు స్టూడియోస్ లోనే  పడుకొని తెల్లవారు జామున నాలుగు గంటలకి డబ్బింగ్ చేపి వెళ్తుంటాడు. తన దర్శకత్వంలో వచ్చిన 'జానీ'(JOhnny)మూవీకి కూడా అలవాటు ప్రకారమే రాత్రంతా రామానాయుడు స్టూడియోస్ లోనే ఒక సోఫాలో పడుకొని నాలుగు గంటలకి డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళాడు. పవన్ వెళ్ళగానే సోఫాలో నుంచి ఒక పాము బయటకి వచ్చింది. ఈ విషయాన్నీ డబ్బింగ్ ఇన్ ఛార్జ్ గమనించాడు. దాంతో సోఫా మొత్తాన్ని చెక్ చేయగా  ఇంకో మూడు పాము పిల్లలు కూడా సోఫాలో ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు. 'జానీ' టైంలో జరిగిన ఈ సంఘటన రీసెంట్ గా  ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.  చాలా సంవత్సరాల క్రితం  రామానాయుడు స్టూడియో చుట్టూ కొండలు చాలా ఎక్కువగా ఉండేవి. స్వచ్ఛమైన గాలి కోసం స్టూడియోస్ లోని ఫ్లోర్ ల తలుపులని నైట్ పూట తెరిచి ఉంచడంతో  వాటిల్లో ఉన్న పాములతో పాటు పలురకాల కీటకాలు  నైట్ అయితే స్టూడియోస్ లో కి వచ్చేవి. ఇప్పుడు ఈ సంఘటన ఫిలిం సర్కిల్స్ లో వైరల్ గా మారడంతో రాత్రంతా పవన్ కళ్యాణ్ పాములు  పైన పడుకొని ఉన్నాడా! అని నోరెళ్లబెడుతున్నారు. ఇక ఇప్పుడైతే రామానాయుడు స్టూడియోస్ పక్కల నూతనంగా సుందరీకరించబడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంది.    
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' (Varanasi) గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఫ్రాన్స్‌లో జరిగిన 'అన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్'లో పాల్గొన్న రాజమౌళి, ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.  బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాల తర్వాత వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతుండగా, జక్కన్న ఇచ్చిన సరికొత్త అప్‌డేట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తుందా లేదా అనే సస్పెన్స్‌కు రాజమౌళి పూర్తిగా తెరదించారు. 'వారణాసి' చిత్రం బాహుబలి తరహాలో ఫ్రాంచైజీగా రావడం లేదని, ఇదొక సింగిల్ స్టాండ్‌లోన్ మూవీగా మాత్రమే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ సినిమా సీక్వెల్స్ గురించిన ఊహాగానాలకు బ్రేక్ పడింది. ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో వివరిస్తూ రాజమౌళి చెప్పిన మాటలు అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తున్నాయి. ఒకే సినిమాలో ప్రేక్షకులు ఆఫ్రికాలోని దట్టమైన అడవులను, అంటార్కిటికాలోని గడ్డకట్టే మంచు ఖండాలను, రామాయణానికి సంబంధించిన దైవిక అంశాలను, ప్రకృతి వైపరీత్యాలను మరియు అద్భుతమైన ఫాంటసీ ఎలిమెంట్స్‌ను ఒకేసారి థియేటర్లలో అనుభూతి చెందబోతున్నారని ఆయన వివరించారు.  అయితే ఈ సినిమాలో ఎంతటి భారీ విజువల్స్, అడ్వెంచర్స్ ఉన్నప్పటికీ, కథ యొక్క అసలైన బలం మాత్రం భావోద్వేగాల్లోనే ఉందని రాజమౌళి చెప్పారు. తండ్రి, కొడుకు మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ ఈ సినిమాకు ప్రాణం అని, ఆ బలమైన ఎమోషన్ నుంచే మిగిలిన కథ, యాక్షన్, విజువల్స్ విస్తరిస్తాయని ఆయన పేర్కొన్నారు. కేవలం యాక్షన్, గ్రాఫిక్స్ మాత్రమే కాకుండా హృదయాలను కదిలించే భావోద్వేగాలు ఉన్నప్పుడే ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అవుతారని ఆయన నమ్ముతున్నారు.  ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అక్టోబర్ నాటికి మొత్తం షూట్ పూర్తి చేయాలని టీం ప్లాన్ చేస్తోంది. విజువల్ వండర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 7, 2027 న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మహేష్ బాబు స్టార్ పవర్, రాజమౌళి విజన్ తోడై వస్తున్న ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.  
ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ లో రానున్న భారీ మైథలాజికల్ ఫిల్మ్ 'గాడ్ ఆఫ్ వార్' (God Of War) అనౌన్స్‌మెంట్‌ న్యూస్ తో మారుమోగిపోతోంది. ఇలాంటి సమయంలో ప్రముఖ నిర్మాత సంస్థ హోంబలే ఫిలిమ్స్ (Hombale Films) బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ తాజాగా సంచలన ట్వీట్ చేసింది. "కొన్ని ఆరంభాలు ఎలాంటి శబ్దం చేయవు. కానీ అవి శాశ్వతంగా నిలిచిపోయే ప్రతిధ్వనులను సృష్టిస్తాయి. తదుపరి గర్జన గుసగుసగా రాదు.. సిద్ధంగా ఉండండి. ఈరోజు మధ్యాహ్నం 2:19 గంటలకు ఆవిష్కరణ." అంటూ హోంబలే ఫిలిమ్స్ ట్వీట్ చేసింది. ఒక వైపు 'గాడ్ ఆఫ్ వార్' అనౌన్స్‌మెంట్‌ న్యూస్ తో మారుమోగిపోతుండగా.. ఇప్పుడు హోంబలే ఫిలిమ్స్ ట్వీట్ సంచలనంగా మారింది. ఇంతకీ హోంబలే చేయబోతున్న ఆ భారీ అనౌన్స్‌మెంట్‌ ఏంటనే చర్చ మొదలైంది. హోంబలే ఫిలిమ్స్ లో ప్రభాస్ మూడు సినిమాలు కమిటై ఉన్నాడు. దీంతో ప్రభాస్ సినిమా ప్రకటన అయ్యుంటుందని కొందరు భావిస్తున్నారు. మరికొందరేమో హృతిక్ రోషన్ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ అంటున్నారు. మరి ఈ ఇద్దరు స్టార్స్ లో ఎవరో ఒకరి ప్రాజెక్ట్ అప్డేట్ రాబోతుందా? లేక హోంబలే ఫిలిమ్స్ మరేదైనా ఊహించని అనౌన్స్‌మెంట్‌ తో సర్ప్రైజ్ చేయబోతుందా? అనేది మరికొద్ది సేపట్లో క్లారిటీ రానుంది.   https://x.com/hombalefilms/status/2071443288452952362
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో పెళ్లిలో ఆడపిల్ల తల్లిదండ్రులు కట్నం ఇస్తుంటారు. చాలా కుటుంబాలు కట్నం ఇవ్వడం తమ ప్రతిష్టకు చిహ్నంగా కూడా భావిస్తారు.  కానీ కట్నానికి బదులుగా కొన్ని వస్తువులు ఇవ్వడం వల్ల ఆడపిల్లల జీవితాలు, వారి భవిష్యత్తులో కూడా సురక్షితంగా,  బంగారంలా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయని లైఫ్ స్టైల్ నిపుణులు అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే.. కట్నానికి బదులు ఆడపిల్లకు ఇవ్వాల్సినవి.. విద్య, నైపుణ్యాలు.. విద్యను ప్రపంచంలోనే గొప్ప సంపదగా పరిగణిస్తారు. ఆడపిల్ల  విద్యావంతురాలై, ఏదైనా నైపుణ్యంలో ప్రావీణ్యం సంపాదిస్తే, ఆమె ఏ పరిస్థితిలోనైనా స్వయం సమృద్ధి సాధించగలదు. విద్య ఆడపిల్లలకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని  ఇస్తుంది,  ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.  మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందుబాటులో నేటి కాలంలో ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఆడపిల్లలను బాగా చదివిస్తే అది వారికి  కష్ట సమయాల్లో అండగా నిలుస్తుంది. పెళ్లి సమయంలో ఖరీదైన వస్తువులు కొనడం కంటే, ముందునుంచే  కూతురి చదువు కోసం డబ్బు ఖర్చు చేసి విద్యావంతురాలిగా మారిస్తే.. అదే ఆమె భవిష్యత్తుకు గొప్ప బహుమానం అవుతుంది.   ఆర్థిక భద్రత.. నేటి కాలంలో ప్రతి మహిళకు ఆర్థిక అవగాహన చాలా ముఖ్యం. ఆడపిల్లలకు  బ్యాంకింగ్, పెట్టుబడి, బీమా . పొదుపు గురించి సమాచారం ఇవ్వడం ఆమె భవిష్యత్తును సురక్షితం చేస్తుంది. అందుకోసం, ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా పొదుపు కోసం ధనం  ఉంచుకోవాలి. ఇంటి ఆడపిల్లకు  ఆరోగ్య బీమా చేయించాలి. అలాగే  పెట్టుబడికి సంబంధించిన సమాచారాన్ని తప్పకుండా  తెలపాలి.  అలాగే ఆడపిల్లల  ఆర్థిక ప్రణాళికపై అవగాహన ఉండాలి. ఈ ఆస్తి ఏ కట్నం కన్నా ఎక్కువ విలువైనదిగా ఏదో ఒకరోజు అనుభవం అవుతుంది. ఆత్మవిశ్వాసం.. జీవితంలో చాలాసార్లు మన భవిష్యత్తును నిర్ణయించే నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఆత్మవిశ్వాసం, సరైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యమే అతిపెద్ద బలాలు అవుతాయి.  ఇది ఆడపిల్లలో అభివృద్ది చెందాలి అంటే.. వారి అభిప్రాయాలకు, నిర్ణయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. స్వతంత్రంగా ఆలోచించేలా ఆడపిల్లలను  ప్రోత్సహించాలి.  జీవిత అనుభవాలను వారితో పంచుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉన్న ఆడపిల్ల  ప్రతి ఛాలెంజ్ ను మరింత మెరుగ్గా ఎదుర్కోగలదు. నడవడిక, విలువలు.. సంస్కృతి అంటే కేవలం సంప్రదాయాలను పాటించడం మాత్రమే కాదు, ఇతరులను గౌరవించడం, నిజాయితీగా, బాధ్యతగా ఉండటం కూడా. ఇది సంబంధాలను బలపరుస్తుంది.  కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. జీవితంలో సమతుల్యత ఏర్పడటానికి సహాయపడుతుంది.  మంచి విలువలు ఉన్న ఆడపిల్లకు  ప్రతిచోటా గౌరవం ఉంటుంది. ఎమోషనల్ సపోర్ట్, నమ్మకం.. పెళ్లి తర్వాత కూడా తన తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తనకు అండగా ఉంటారని కూతురు అనుకోవాలి.  ఇలాంటి నమ్మకాన్ని తల్లిదండ్రులే ఆడపిల్లకు కలిగించాలి  ఇది ఆడపిల్లలకు మానసిక బలాన్ని ఇస్తుంది.  ఆడపిల్లలకు  కష్ట సమయాల్లో సపోర్ట్ గా నిలుస్తుంది.  సంబంధాల పట్ల  నమ్మకం కూడా నిలిచి ఉంటుంది.  తల్లిదండ్రుల నమ్మకం, సపోర్ట్  ఉంటే.. ఆడపిల్లలకు వస్తువులు, ఆస్తుల కంటే ఎక్కువ ధైర్యం ఉంటుంది.                               *రూపశ్రీయ
  మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం.  అయితే ప్రతి మనిషి తన జీవితంలో కొన్ని విషయాలను ఎవరికీ చెప్పకూడదు అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు.  మనిషి జీవితంలో ఏ విషయాలు ఇతరులకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు? తెలుసుకుంటే.. ఆర్థిక పరిస్థితి గురించి  ఆదాయం, బ్యాంకు బ్యాలెన్స్, పెట్టుబడులు లేదా ఏ రకమైన లోన్ గురించైనా సమాచారాన్ని ఎవరితోనైనా పంచుకోవడం ప్రమాదకరం కావచ్చు.  కొన్నిసార్లు ఇలాంటి  సమాచారాన్ని చాలా మంది పుకారు అని వ్యక్తిత్వాన్ని చిన్నతనం చేయడం, లేదా సమాచారాన్ని అనుసరించి తప్పుడు పనులకు పాల్పడటం జరిగే అవకాశం ఉంటుంది.  ఉదాహరణకు.. ఏదైనా పెద్ద ఆస్తిని కొనుగోలు చేశారని లేదా ఏదైనా పెద్ద వస్తువు లేదా బంగారం లాంటివి కొనుగోలు చేశారని  ఎవరికైనా చెబితే..అది కాస్తా అందరికీ తెలుస్తూ చివరికి  దొంగతనం లేదా మోసపోవడానికి  దారితీయవచ్చు. అందువల్ల, ఆర్థిక విషయాలలో గోప్యతను పాటించడం ఎల్లప్పుడూ సురక్షితం. ఆరోగ్యం, వైద్య సమాచారం.. ఆరోగ్యం,  మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం చాలా సున్నితమైనది.  తీవ్రమైన అనారోగ్యాలు, మందుల అవసరాలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలను నమ్మకమైన వ్యక్తికి లేదా వైద్యుడికి మాత్రమే చెప్పడం మంచిది.   ఉదాహరణకు..  దీర్ఘకాలిక అనారోగ్యం ఉందని ఎవరికైనా చెబితే.. ఆ విషయం తప్పుడు వ్యక్తుల చేతికి వెళితే సామాజికంగా లేదా వృత్తిపరంగా నష్టం చేకూరే స్థితికి దారితీయవచ్చు. ఇష్టమైన, ఇష్టం లేని విషయాలు.. మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కూడా కొన్నిసార్లు ఇతరుల నుండి వ్యంగ్యానికి లేదా విమర్శకు మూలంగా మారవచ్చు.  వ్యక్తిగత ఇష్టాఇష్టాలను ఇతరులకు చెప్పినప్పుడు వాటిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటే  ఎగతాళి చేయవచ్చు. కాబట్టి,  ఇష్టాయిష్టాలను నమ్మకమైన స్నేహితులకు మాత్రమే తెలియజేయండి. రిలేషన్స్, పర్సనల్ లైఫ్.. రిలేషన్స్ గురించి,  వ్యక్తిగత విషయాల గురించి బహిరంగపరచడం  గోప్యతకు భంగం కలిగించవచ్చు.  ఉదాహరణకు.. ఒక వివాదాన్ని లేదా కుటుంబ సమస్యను సోషల్ మీడియాలో లేదా మూడవ వ్యక్తితో పంచుకోవడం  ప్రతిష్టను దెబ్బతీస్తుంది. అలాగే  ఆత్మగౌరవానికి భంగం కలిగేలా చేస్తుంది.  అంతేకాదు..  బంధాల మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది.                                 *రూపశ్రీ.
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం వల్ల అవి ఎక్కువుగా  కుళ్ళిపోతాయి.  ఇది చాలా మంది ఎదుర్కునే  సాధారణ సమస్య. వాటిని సరిగ్గా నిల్వ చేయడం ద్వారా పాడవకుండా నివారించవచ్చు. అందుకోసం టమాటాలను ఎలా నిల్వ చేయాలి తెలుసుకుంటే.. పచ్చి టమాటాలు.. టమాటా పూర్తిగా పండకపోయినా, ఇంకా కొంచెం గట్టిగా ఉంటే, దానిని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకోవచ్చు. పండని టమాటాలను డైరెక్ట్ సన్ లైట్ కు  దూరంగా ఉంచాలి. పచ్చి గా ఉన్నవి, పూర్తీగా  పండని టమాటాలను ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. దీనివల్ల అవి  రుచిని కోల్పోయి, సరిగ్గా పండకుండా ఉంటాయి. పండిన టమోటాలు.. టమోటాలు పూర్తిగా పండి, ఎర్రగా ఉంటే, అవి గట్టిగా ఉంటే..  వాటిని గది ఉష్ణోగ్రత వద్ద కౌంటర్‌పై నిల్వ చేయాలి.  ఈ టమోటాలను 1 నుండి 2 రోజుల వరకు ఉపయోగించవచ్చు. టమోటాలను కాడ భాగం కిందికి ఉండేలా నిల్వ చేయాలి. దీనివల్ల కాడ చుట్టూ ఉన్న తేమ బయటకు పోతుంది , అవి త్వరగా వాడిపోకుండా  ఉంటాయి. టమోటాలను ఒకదాని మీద ఒకటి కాకుండా అన్నింటికి పక్కన పక్కన ఉంచి నిల్వ చేయాలి. బాగా పండిన టమోటాలు.. టమోటాలు బాగా పండితే పాడైపోతాయని చాలామంది భయపడతారు. వాటిని రిఫ్రిజిరేటర్‌లోని చల్లదనంలో ఉంచడం వల్ల పండే ప్రక్రియ నెమ్మదిస్తుంది. రిఫ్రిజిరేటర్ నుండి తీసిన వెంటనే టమోటాలను తినకూడదు. అవి గది ఉష్ణోగ్రతకు వచ్చినప్పుడు మాత్రమే తినాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. టమోటాలను కడగకుండా, ఆరబెట్టకుండా ప్లాస్టిక్ సంచులలో నిల్వ చేయకూడదు. దీనివల్ల అవి త్వరగా పాడైపోతాయి. టమోటాలు పండినప్పుడు, అవి ఇథిలీన్ వాయువును విడుదల చేస్తాయి. అందువల్ల, బాగా పండిన టమోటాలను ఎక్కువగా ఒకేచోట నిల్వ చేయడం వల్ల అవి త్వరగా పాడైపోతాయి. టమోటాలను అతి చల్లని ఉష్ణోగ్రతలలో నిల్వ చేయడం వాటి రుచిని పాడు చేస్తుంది. దీనివల్ల వాటి తొక్క బలహీనపడి, మరింత త్వరగా పాడైపోతాయి.                                         *రూపశ్రీ.
మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో మెగ్నీషియం (Magnesium) ఒకటి. ఇది కండరాల పనితీరు, నరాల వ్యవస్థ, గుండె ఆరోగ్యం, ఎముకల బలం, రక్తంలో చక్కెర నియంత్రణ వంటి అనేక కీలక శారీరక ప్రక్రియల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ వీడియోలో డాక్టర్ హరిత మెగ్నీషియం లోపం వల్ల కనిపించే ప్రధాన లక్షణాలు, ఆ లోపం శరీరంపై చూపే ప్రభావం గురించి సులభంగా వివరిస్తారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: మెగ్నీషియం అంటే ఏమిటి? మెగ్నీషియం శరీరానికి ఎందుకు అవసరం? మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు కండరాల తిమ్మిర్లు, అలసట, నిద్రలేమి వంటి సమస్యలకు మెగ్నీషియం సంబంధం డయాబెటిస్ ఉన్నవారిలో మెగ్నీషియం ప్రాముఖ్యత ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం ఎలా సహాయపడుతుంది? మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలు ఎప్పుడు సప్లిమెంట్లు అవసరం అవుతాయి? మెగ్నీషియం తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు మెగ్నీషియం లోపాన్ని ముందుగానే గుర్తించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. సరైన ఆహారం, జీవనశైలి, వైద్యుల సూచనలతో మెగ్నీషియం స్థాయిని సమతుల్యంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
మంచి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం.  తరచుగా ఏమి తినాలి అనే దానిపై చాలా మంది దృష్టి పెడతారు.  నిజానికి ఆరోగ్యం కోసం ఏం తినాలో అనే కాదు..  ఎప్పుడు తినాలనే విషయం  కూడా అంతే ముఖ్యమని  ఆహార నిపుణులు అంటున్నారు. కొన్ని ఆహార పదార్థాలు పోషకాలతో నిండి ఉండి, పగటిపూట శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి, కానీ వాటిని రాత్రిపూట తింటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆహార  నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రిపూట తప్పుడు ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ, నిద్ర , విశ్రాంతిపై ప్రభావం చూపుతుంది. కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు పగటిపూట శరీరానికి మేలు చేస్తాయని  అనుకుంటారు, , కానీ  ఆ ఆహారాలను రాత్రిపూట తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం , నిద్ర సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి, ఉదయం అమృతంలా ఉండి రాత్రికి విషంగా మారే ఆహారాలు ఏమిటో, వాటిని తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకుంటే.. పెరుగు.. పెరుగు అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పెరుగులోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది ఎముకలను బలపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని కూడా నమ్ముతారు. అయితే, రాత్రిపూట పెరుగు తినడం హానికరం కావచ్చని ఆహార నిపుణులు అంటున్నారు. పెరుగులో ఉండే చలువ చేసే గుణం శ్లేష్మం ఉత్పత్తికి కారణం కావచ్చని, కొంతమందికి కడుపులో గ్యాస్ , బరువుగా ఉన్నట్లు కూడా అనిపించవచ్చని అంటున్నారు. పండ్లు.. పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి , దాదాపు ప్రతిఒక్కరికీ పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు.  అయితే పండ్లను  పగటిపూట తినడం ఉత్తమం. రాత్రిపూట పండ్లు తినడం కొంతమందికి వివిధ అనారోగ్య  సమస్యలను కలిగిస్తుంది. పండ్లలో సహజ చక్కెరలు , కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి, నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో రాత్రిపూట పండ్లు తినడం వల్ల గ్యాస్ , మలబద్ధకం కూడా కలగవచ్చు. చికెన్.. కోడి మాంసం లేదా చికెన్ ను ప్రోటీన్‌కు మంచి మూలంగా చెబుతారు. అయితే అందులో ఉండే ప్రోటీన్‌ను జీర్ణం చేసుకోవడానికి శరీరానికి ఎక్కువ సమయం , శక్తి అవసరం. అందుకే రాత్రిపూట చికెన్  తినడం జీర్ణక్రియ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది, ఇది నిద్రపై ప్రభావం చూపుతుంది. ఒకవేళ  రాత్రిపూట చికెన్  తినాలని అనుకుంటే దానిని పరిమిత పరిమాణంలో , సమతుల్యంగా తినడం మంచిది. ఆయిల్, ఫ్యాట్ ఫుడ్స్.. రాత్రిపూట నూనె, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల, వాటిని విచ్ఛిన్నం చేసి జీర్ణం చేయడానికి జీర్ణవ్యవస్థ ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల తగినంత విశ్రాంతి లభించక, నిద్రకు ఆటంకం కలగవచ్చు. అందుకే నిపుణులు రాత్రిపూట కొవ్వు పదార్థాలను తినవద్దని సిఫార్సు చేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్.. ఎండిన పండ్లలో కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వాటిని ఉదయం పూట తినడం వల్ల శక్తి , పోషణ లభిస్తాయి. అయితే, వాటిని సాయంత్రం ఆలస్యంగా లేదా రాత్రిపూట తినడం వల్ల జీర్ణ సమస్యలు , కడుపులో భారంగా అనిపించడం వంటివి ఎదురవుతాయట, ఎందుకంటే కడుపులోని ఎంజైమ్‌లు డ్రై ప్రూట్స్ ను  సులభంగా విచ్ఛిన్నం చేయలేవు. క్రూసిఫెరస్ కూరగాయలు.. క్రూసిఫెరస్ కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, వీటిలో కార్బోహైడ్రేట్లు , ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. వీటిని రాత్రి ఆలస్యంగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ , జీర్ణ సమస్యల ప్రమాదం పెరగవచ్చు. అందువల్ల, ఈ కూరగాయలను పగటిపూట తినడం మంచిది.                                      *రూపశ్రీ.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న జీవనశైలి వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. చాలా మంది రక్తంలో చక్కెర స్థాయిలను మాత్రమే నియంత్రిస్తే సరిపోతుందని భావిస్తారు. అయితే డయాబెటిస్ వల్ల గుండె, కిడ్నీలు, కళ్ళు, నరాలు వంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణుడు డా. హరిచరణ్ డయాబెటిస్‌కు సంబంధించిన ముఖ్యమైన అంశాలను వివరించారు. ఈ వీడియోలో తెలుసుకునే విషయాలు: ✔ నార్మల్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎంత ఉండాలి? ✔ భోజనం తర్వాత షుగర్ స్థాయిలు ఎంత వరకు సాధారణంగా పరిగణిస్తారు? ✔ HbA1c అంటే ఏమిటి? ✔ HbA1c విలువల ఆధారంగా ప్రీ-డయాబెటిస్ మరియు డయాబెటిస్‌ను ఎలా గుర్తిస్తారు? ✔ ప్రీ-డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ✔ డయాబెటిస్ వల్ల గుండె జబ్బులు ఎందుకు వస్తాయి? ✔ సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే ఏమిటి? ✔ షుగర్ ఉన్నవారిలో హార్ట్ ఎటాక్ లక్షణాలు ఎందుకు స్పష్టంగా కనిపించకపోవచ్చు? ✔ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు అవసరం? డయాబెటిస్ ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే నరాల దెబ్బతినడం వల్ల కొంతమందిలో హార్ట్ ఎటాక్ వచ్చినా సాధారణ ఛాతినొప్పి కనిపించకపోవచ్చు. దీనినే "సైలెంట్ హార్ట్ ఎటాక్" అంటారు. అందుకే షుగర్ ఉన్నవారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, HbA1c స్థాయిలను పర్యవేక్షించడం మరియు గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. డయాబెటిస్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన ఆహారం, వ్యాయామం మరియు వైద్యుల సూచనలతో నియంత్రిస్తే అనేక సమస్యలను నివారించవచ్చు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!