LATEST NEWS
నిజానికి వెంకయ్య తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి మరో ఉపరాష్ట్రపతి పదవికి ఛాన్సున్నది బి. సుదర్శన్ రెడ్డి విషయంలోనే. అయితే ఇండియా కూటమి అభ్యర్ధి అయిన సుదర్శన్ రెడ్డి గెలిచే అవకాశమెంత? అన్నది అటుంచితే.. ఎన్డీఏ అభ్యర్ధి రాధాకృష్ణన్ తమిళ వ్యక్తి కాగా.. త్వరలో తమిళనాడు ఎన్నిక జరుగుతుండటంతో.. కాంగ్రెస్ సైతం ఒక తమిళ వ్యక్తినే ఎంపిక చేయాలనుకుంది. తిరుచ్చి శివ అనే డీఎంకే నేత పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. సరిగ్గా అదే సమయంలో ఒక ఇస్రో సైంటిస్టు పేరు కూడా ప్రముఖంగానే వినిపించింది. కానీ చివరి నిమిషంలో రాజకీయాలకు సంబంధం లేని బి. సుదర్శన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.  సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కి చంద్రబాబుకు పరిచయముంది. అందుకే జస్టిస్  తాను రాజకీయ పార్టీలకు కొత్తగానీ, రాజకీయాలకు కాదన్నారు. అలాంటి పరిచయం ప్రస్తుతం ఉన్న ఒకానొక సిట్యువేషన్ లో సుదర్శనరెడ్డికి ఉపయోగ పడుతుందా? అని చూస్తే అదేమంత తేలిగ్గా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన రాధాకృష్ణన్ కు తమ బేషరతు మద్దతు ప్రకటించేశాయి. ఇక సాటి రెడ్డి కులస్తుడైన సుదర్శన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి ఎలాంటి అభిమానముందో తెలీదు.  ఒక వేళ అభిమానమున్నా జగన్ మరో ఆలోచన లేకుండా బీజేపీ ప్రతిపాదించిన రాధాకృష్ణన్ కే మద్దతు పలుకుతారన్న విశ్లేషకుల అభిప్రాయాలను అనుగుణంగానే వైసీపీ సభ్యులు ఎన్డీయే అభ్యర్థికే మద్దతు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించేసింది.  ఎందుకంటే.. ఇప్పటికే జగన్ పీకలోతు కేసుల గొడవల్లో ఉన్నారు. అందుకే తనకున్న లోక్ సభ, రాజ్య సభ సభ్యులు 11 మంది కాగా.. ఈ మొత్తం అటు వైపునకు మళ్లించేశారు. అలా మళ్లించకుంటే జైలుకు వెళ్లక తప్పదన్న భయం ఆయనది.  దీంతో ఎంత రెడ్డాభిమానం ఉన్నా గానీ జగన్ రెడ్డి సుదర్శన్ రెడ్డికి  మద్దతుగా నిలవడం లేదు సరికదా..   వైసీపీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ కు బహిరంగ మద్దతు ప్రకటించారు.. కట్ చేస్తే బీఆర్ఎస్ సీనేంటో చూస్తే.. బీజేపీ|బీఆర్ఎస్ రెండూ ఒకటే అన్న మాటకు ఆస్కారమిచ్చేలా కేటీఆర్ ఒక కామెంట్ చేశారు. అదేంటో చూస్తే ఎవరైతే 2 లక్షల టన్నుల ఎరువులను తెలంగాణకు ఇస్తారో వారికే తమ మద్ధతు అన్నారు. నిజానికి ఎరువులను ఇచ్చే అధికారం ఉన్నది కేంద్రంలోని బీజేపీకి. దీన్నిబట్టీ చూస్తే వారి మద్ధతు బీజేపీకే అని చెప్పాల్సి ఉంటుంది.  మొన్నటికి మొన్న సీఎం రమేష్ మాటలను అనుసరించి చెబితే ఇప్పటికే తమపై కేసుల్లేకుండా చేయడంలో భాగంగా.. బీజేపీలో కలిసి పోవడానికైనా సిద్ధమైన బీఆర్ఎస్ ప్రత్యేకించి తెలంగాణ ప్రాంత వాసి అయిన సుదర్శన్ రెడ్డికి ఓటు వేసే అవకాశమెంతో ఈ ఎరువుల మెలికను బట్టిఇట్టే తెలిసిపోతోంది.  కాబట్టి.. తెలుగు సెంటిమెంటు కన్నా.. ఇక్కడ ఎవరి అవసరాలు, వారి వారి కేసుల వ్యవహారాలపైనే ఎక్కువగా ఈ ఎన్నిక ఆధారపడి ఉన్నట్టు తెలుస్తోంది. ఇదండీ మన తెలుగు వారి ఉప రాష్ట్రపతి ఎన్నిక కథ, కమామిషు!
తెలుగుదేశం పార్టీపై గుడ్డి వ్యతిరేకత, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ఉన్న అక్కసు  బిఆర్ఎస్, వైసీపీ లను దగ్గర చేసాయి, జగన్, కేసీఆర్ లను ఒకే తాటి మీదకు తెచ్చాయి. బాబు కి రిటర్న్ గిఫ్ట్ అంటూ మొదలైన జగన్ కేసీఆర్  రాజకీయ బంధం 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం, 2024 ఎన్నికలలో వైసీపీ పతనంతో బట్టబయలైంది ఆ ఓటముల తరువాత వైసీపీ అధినేత ప్యాలెస్ రాజకీయాలకు, బీఆర్ఎస్  ఫామ్ హౌస్ రాజకీయాలకు పరిమితం అయ్యారు. అక్కడ నుంచీ ఇరుపార్టీల బంధం తెగిపోకుండా కొనసాగించే బాద్యతను బీఆర్ఎస్ అధినేత కుమారుడు, ఆయన రాజకీయవారసుడు, అలాగే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు భుజాన వేసుకున్నారు. సొంత చెల్లెలితో విభేదాల విషయంలోనూ జగన్, కేటీఆర్ మధ్య సారూప్యాలు ఉన్నాయి.  ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ను షర్మిల, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ను కల్వకుంట్ల కవిత తీవ్రంగా విభేదిస్తున్నారు.  ఏ రకంగా చూసినా జగన్, కేటీఆర్   బాట ఒకటే అన్నట్లుగా ఇంత కాలం సాగింది.  ఇక ఇప్పుడు ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై ఆరంభించిన రాజకీయ యుద్ధం అనుంగు మిత్రులు జగన్, కేటీఆర్ దారులు వేరు చేసింది. రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంటే చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మద్దతు ప్రకటించారు. రాహుల్ చేస్తున్న విమర్శలను సమర్ధిస్తూ.. తాను మరికొన్ని విమర్శలకు ఎన్నికల సంఘంపై సంధించారు. పనిలో పనిగా కేంద్ర ప్రభుత్వంపైనా, ప్రధాని మోడీపైనా కూడా విమర్శలు గుప్పించారు.  ప్రజాస్వామ్యంలో ఈసీ కీలక పాత్ర పోషిస్తుందని, అటువంటి భారత ఎన్నికల సంఘాన్ని ప్రక్షాళన చేయాల్సిన తరుణం ఆసన్నమైందంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు.  భారత ఎన్నికల సంఘం బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో ఘోర వైఫల్యం చెందిందని దుయ్యపెట్టారు. రాహుల్ ఓట్ల చోరీ ఆరోపణలను మీడియా సమావేశం పెట్టి మరీ ఖండించిన ఈసీ అధికారుల మాటలు విన్న తరవాత సందేహాలు మరింతగా ఎక్కువయ్యాయనీ కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిత్యం నిప్పులు కక్కే కేటీఆర్ ఒక్క సారిగా రాహుల్ గాంధీకి వంత పాడుతూ.. బీజేపీ కి వ్యతిరేకంగా గళం విప్పారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ మాత్రం రాహుల్ ఓటు చోరీ ఆరోపణలను సమర్ధించలేదు, సరి కదా తమ పార్టీకి పులివెందులలో జరిగిన అన్యాయంపై రాహుల్ పన్నెత్తు మాట మాట్లాడకపోవడాన్ని తప్పుపట్టారు. అంతే కాకుండా   టీడీపీ, బీజేపీ కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. దీంతో జగన్, కేటీర్ మధ్య ఇంత కాలం ఉన్న స్నేహబంధం తెగిపోయిందా? ఇరువురూ కటీఫ్ చెప్పేసుకున్నట్లేనా అంటూ పోలిటికల్ సర్కిల్స్ లో ఓ చర్చ ఆరంభమైంది.  
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై బుధవారం (ఆగస్టు 20) జరిగిన దాడిని రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలూ ఖండించాయి. నిందితుడికి చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీ సీఎంపై ఆమె  అధికారిక నివాసంలోనే జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించింది. రేఖాగుప్తాకు జడ్ కేటగరి భద్రత లక్పించాలని నిర్ణయించింది. ఇలా నిర్ణయించడమే తరువాయి, అలా ఉత్తర్వులు జారీ చేసింది.   దీంతో గురువారం ఉదయానికే  సీఆర్పీఎఫ్ బలగాలు సీఎం నివాసానికి చేరుకున్నాయి. ఢిల్లీ  పోలీసుల నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి భద్రత బాధ్యతలను స్వీకరించాయి.  సీఎం వ్యక్తిగత భద్రతతో పాటు సీఎం నివాసానికి, క్యాంపు కార్యాలయానికి 24 గంటలూ భద్రత కల్పించేందుకు అధికారులు అదనపు బలగాలను మోహరించారు. జెడ్ కేటగిరీ భద్రతలో 20 మందికి పైగా సిబ్బంది, స్పెషల్ గార్డులు, డ్రైవర్లు, ఎస్కార్ట్ వాహనాలను ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు సమకూర్చారు.  
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దేశ రాజధాని సివిల్ లైన్స్‌లోని అధికారిక నివాసంలో జన్ సున్‌వాయ్ నిర్వహిస్తున్న సమయంలో  ఈ ఘటన జరిగింది. ముఖ్యమంత్రికి అర్జీ ఇచ్చేందుకు వచ్చిన ఓ వ్యక్తి  కొన్ని పేపర్లను ఆమెకు అందించారు. అంతలోనే  గట్టిగా అరుస్తూ సీఎంపై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని రాజ్‌కోట్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఊహించని పరిణామంతో.. సీఎం రేఖా గుప్తా షాక్‌కి గురయ్యారు.  ముఖ్యమంత్రిపై దాడి చేసిన నిందితుడు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన రాజేశ్‌ భాయ్‌ ఖిమ్జీ భాయ్‌ సకారియాగా గుర్తించారు. గుజరాత్‌లోనూ అతడిపై దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు, దాడికి గల కారణాలు తెలుసుకొనే పనిలో ఉన్నారు. అయితే,  సీఎంపై రాజేశ్ ఎందుకు దాడి చేశాడనే విషయంపై అనేక కథనాలు వినిపిస్తున్నాయి. నిందితుడి బంధువు జైల్లో ఉన్నాడని, అతనిడి రిలీజ్ చేసేందుకు.. సీఎంకు విజ్ఞప్తి చేసేందుకు ముఖ్యమంత్రి అధికార నివాసానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారం,  ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. మరోవైపు గుజరాత్‌లో నిందితుడి తల్లిని ప్రశ్నించిన అధికారులు ఆమె నుంచి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. తన కుమారుడు, ఢిల్లీ సీఎంని కలిసేందుకు వెళ్లిన విషయం తనకు తెలియదని ఆమె చెప్పినట్లు సమాచారం. అతడు  జంతు ప్రేమికుడని, ఇటీవల వీధి శునకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అసంతృప్తిగా ఉన్నాడని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే,  అతడి మానసిక పరిస్థితి బాగా లేదనీ, గతంలోనూ ఓ సారి ఢిల్లీకి వెళ్లి వచ్చాడని పోలీసులకు వివరించినట్లు సమాచారం. నిందితుడు రాజేశ్‌పై.. గుజరాత్‌లో తొమ్మిది కేసులున్నట్లు తెలుస్తోంది. బెదిరింపులు, స్థానికులపై దాడి, మద్యం మత్తులో దుష్ప్రవర్తనకు సంబంధించి.. ఈ కేసులు నమోదైనట్లు తెలిసింది. జైల్లో ఉన్న బంధువు విడుదల కోసమే.. సీఎంని కలిసేందుకు వెళ్లాడనే వార్తలు వచ్చినప్పటికీ.. అలాంటిదేమీ లేదని గుజరాత్ పోలీసులు గుర్తించినట్లు తేలింది. సీఎం రేఖా గుప్తాకు కొన్ని పేపర్లు అందించిన తర్వాత.. గట్టిగా అరుస్తూ దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనని.. బీజేపీ సహా విపక్ష పార్టీలు ఖండించాయి. దాడి చేసిన వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అతను దేనికోసం సీఎంపై దాడికి పాల్పడ్డాడు అనేది తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.
అలాస్కా సమావేశం సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ అమెరికా సిటిజన్ కు  ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. రష్యాలో తయారైన బైక్‌ను బహుమతిగా ఇవ్వడంతో సదరు అమెరికా సిటిజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇటీవల పుతిన్, ట్రంప్ అలాస్కాలో సమావేశమైన సందర్భంగా ఈ ఘటన జరిగింది. పుతిన్ కంటే ముందు ఓ రష్యా బృందం అలాస్కాకు వచ్చింది. ఆ బృందంలో ఓ టీవీ ఛానల్ వారు కూడా ఉన్నారు. ఆ సమయంలో మార్క్ వారెన్ అనే వ్యక్తి అరల్ గేర్ అప్ అనే రష్యన్ మోటర్ సైకిల్‌పై దూసుకుపోతూ కనిపించారు. తన రోజువారీ పనులపై ఆయన బైక్ ‌నడుపుతూ వెళుతుండగా వారి కంటపడ్డారు. రష్యా బైక్ అమెరికాలో కనిపించడంతో ఆశ్చర్యపోయిన టీవీ బృందం సభ్యులు మార్క్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా అతడు తన బైక్ గురించి   చెప్పుకొచ్చారు. అది తనకు చాలా చాలా ఇష్టమైన బైక్ అన్నాడు. అయితే ఇప్పుడు పాతబడిపోయిందని తెలిపాడు. దాని విడి భాగాలు   అమెరికాలో దొరకట్లేదని అన్నాడు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఆ తరువాత కొన్ని రోజులకు మార్క్‌కు రష్యా దౌత్య బృందం నుంచి కబురు అందింది. మరో కొత్త బైక్ బహుమతిగా ఇవ్వనున్నట్టు వారు చెప్పారు. కానీ మార్క్ మాత్రం నమ్మలేదు. ఇదేదో ప్రాంక్ కాల్ అయి ఉంటుందని అనుకున్నాడు. కానీ పుతిన్, ట్రంప్ మీటింగ్ ముగియానే రష్యన్ బృందం మరోసారి మార్క్‌ను సంప్రదించింది. తాము ఉంటున్న హోటల్ వద్ద అతడికి బైక్‌ను బహూకరించింది. ఇది పుతిన్ వ్యక్తిగత బహుమతి అని చెప్పి మరీ బైక్ తాళాలు ఇచ్చింది. దీంతో మార్క్ ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది. ఇది నజమేనా? నమ్మలేకపోతున్నా అని ఆ రోజున జరిగిన విషయాన్ని మార్క్ గుర్తు చేసుకున్నారు. అంతకు రెండు రోజుల ముందే బైక్‌ను తయారు చేసి  అమెరికాకు పంపించినట్టు తనకు రిజిస్ట్రేషన్‌ పేపర్లు చూడగానే అర్థమైందని అన్నాడు. అది తన కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన బైక్ అంటూ మురిసిపోయాడు. రష్యా బృందానికి ధన్యవాదాలు కూడా తెలిపారు. మార్క్ గతంలో అగ్నిమాపక దళంలో  పని చేసి రిటైర్ అయ్యారు. మరి ఈ బైక్ ఖరీదు ఎంతటి అంటారా?  మన కరెన్సీలో అక్షరాలా  19 లక్షల రూపాయలు. 
ALSO ON TELUGUONE N E W S
సినిమా పేరు: పరదా  తారాగణం: అనుపమ పరమేశ్వరన్,  దర్శనా రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్, గౌతమ్ మీనన్, హర్షవర్ధన్, బలగం సుధాకర్ రెడ్డి, తదితరులు   సంగీతం: గోపి సుందర్  ఎడిటర్: ధర్మేంద్ర కాకేందర్   రచన, దర్శకత్వం: ప్రవీణ్ కాండ్రేగుల  సినిమాటోగ్రాఫర్: మ్రిదుల్ సుజిత్ సేన్  బ్యానర్: ఆనంద మీడియా  నిర్మాతలు: శ్రీనివాసులు, విజయ్, శ్రీధర్  విడుదల తేదీ: అగస్ట్ 1 ,2025  'అనుపమ పరమేశ్వరన్'(Anupama Parameswaran)టైటిల్ రోల్ పోషించిన 'పరదా'(Paradha)చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రచార చిత్రాలతో మంచి క్రేజ్ ని సంపాదించుకోవడంతో పాటు, సినిమాపై నమ్మకంతో మేకర్స్ రెండు రోజుల ముందే  చాలా ఏరియాల్లో  ప్రీమియర్ షోస్ కూడా ప్రదర్శించడం జరిగింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ సుబ్బలక్ష్మి(అనుపమ పరమేశ్వరన్) ది  'పడతి' అనే గ్రామం. కొన్ని ఏళ్ళ తరబడిగా వస్తున్న తన ఊరి ఆచారాల ప్రకారం జీవనాన్ని కొనసాగిస్తు ఉంటుంది. ఆ ఆచారాలపై సుబ్బలక్ష్మికి  ప్రగాఢ విశ్వాసం. ఎంతలా అంటే యుక్తవయసుకొచ్చాక తన స్నేహితుడు, ప్రేమికుడు అయిన రాజేష్(రాగ్ మయూర్)  ముఖం కూడా చూడదు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండానే ఇద్దరు మాట్లాడుకుంటు ఉంటారు. సుబ్బలక్ష్మి, రాజేష్ కి నిశ్చితార్థం ఏర్పాటవుతుంది. కానీ సుబ్బలక్ష్మి ఫోటో ఫేమస్ ఇంగ్లీష్ మ్యాగజైన్ లో రావడంతో నిశ్చితార్థం ఆగిపోతుంది. దీంతో గ్రామ ఆచారం ప్రకారం సుబ్బలక్ష్మి తనంతట తానుగా   ఆత్మాహుతి చేసుకొని చనిపోవడానికి సిద్ధపడుతుంది. సుబ్బలక్ష్మి కి 'జ్వాలమ్మ' ఒక అవకాశం ఇవ్వడంతో ఆత్మాహుతి ఆగిపోతుంది. ఆ తర్వాత సుబ్బలక్ష్మి పంజాబ్ రాష్ట్రంలోని 'ధర్మస్థలి'కి  వెళ్తుంది. ఢిల్లీకి చెందిన అమిష్ట(దర్శనా రాజేంద్రన్) రత్న(సంగీత) లు సుబ్బలక్ష్మి కి  తోడుగా ఉంటారు. ఆ ప్రయాణంలో 'పరదా'కి సంబంధించిన అసలు నిజాన్ని సుబ్బలక్ష్మి తెలుసుకుంటుంది. సుబ్బలక్ష్మి పరదా గురించి  తెలుసుకున్న నిజం ఏంటి? ధర్మస్థలికి ఎందుకు వచ్చింది? సుబ్బలక్ష్మి కోసం రాజేష్ వెయిట్ చేశాడా? లేక మరో పెళ్లి చేసుకున్నాడా? మ్యాగజైన్ లో సుబ్బలక్ష్మి ఫోటో రావడం వల్ల నిశ్చితార్థం ఎందుకు ఆగింది? ఆ ఫోటో తీసింది ఎవరు?  జ్వాలమ్మ ఎవరు? పడతి  గ్రామ  ఆచారం ఏంటి? ఆ ఆచారం వెనక  రహస్యం ఏమైనా దాగి ఉందా? సుబ్బలక్ష్మిని ఆత్మాహుతి ఎందుకు చేయాలనుకున్నారు? ధర్మస్థలి నుంచి వచ్చాక  ఆత్మాహుతి ఆగిందా ? గ్రామ ఆచారం విషయంలో సుబ్బు తీసుకున్న  నిర్ణయం ఏంటనేదే  'పరదా' చిత్ర కథ  ఎనాలసిస్  ఈ రోజుల్లో మహిళా ప్రాధాన్యతని ఇతివృత్తంగా చేసుకొని, అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చేలా 'పరదా' ని  తెరకెక్కించిన దర్శకుడు 'ప్రవీణ్' కి హాట్స్ హాఫ్ చెప్పాలి. ఆడవాళ్లు సమాజం నుంచి ఎదురుకుంటున్న ఎన్నో సవాళ్ళని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే కథాంశాలపై మరింత శ్రద్ధ వహించడంతో పాటు, క్లైమాక్స్ పై మరింత ఇంట్రెస్ట్  చూపించాల్సింది. ఈ చిత్రానికి ఆయువు పట్టయిన మెయిన్ పాయింట్ ని సింపుల్ గా ముగించేసి, మిగతా విషయాలకి  గ్రాండ్ గా ఎలివేషన్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్ లోనే పరదా కథ ఉద్దేశాన్ని ఒగ్గు కథలో చెప్పించారు. దీంతో  కథలోకి ఇన్వాల్స్ అవ్వడంతో పాటు, నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియారిటీ కలుగుతుంది. ఆచారం ప్రకారం సుబ్బలక్ష్మి,రాజేష్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండానే పాడు బడిన రైలు బండిలో చెరొక బోగీలో కూర్చొని మాట్లాడుకునే సన్నివేశం చాలా బాగుంది. ఈ ఎపిసోడ్ పై ఇంకొన్ని సీన్స్ సృష్టించి ఎంటర్ టైన్ మెంట్ ని యాడ్ చేయాల్సింది. సుబ్బలక్ష్మి ఫోటో మ్యాగజైన్ లో రాగానే, నిశ్చితార్థం ఆగకుండా, పెళ్లి దాకా తీసుకొచ్చి టెన్షన్ క్రియేట్ చేయాల్సింది. సుబ్బలక్మి పెద్ద వయసుకొచ్చాక  పరాయి వ్యక్తులు ఆమె   ముఖం చూడరు. అలాంటప్పుడు మ్యాగజైన్ లో ఉన్న ముఖం తనదేనా, కాదా అనే విషయంలో టెన్షన్ ఉంటే బాగుండేది. ఇక ఈ సన్నివేశం తర్వాత  కథ చాలా వేగంగా పరిగెత్తింది. ప్రతి సన్నివేశం ఒక  పర్పస్ తో తెరకెక్కడంతో పాటు, ఒక కొత్త లోకాన్ని పరిచయం చేసింది. సెకండ్ హాఫ్ పరదా కి  అదనపు బలం. తనని తాను తెలుసుకునే ప్రాసెస్ లో సుబ్బలక్ష్మి ఎదురుకున్న ఘట్టాలు, అమిష్ట తో ప్రయాణం, అమిష్ట లైఫ్ స్టైల్ సన్నివేశాలు, రాజేంద్రప్రసాద్ గారి ఫిలాసఫీ సీన్స్, ముఖ్యంగా ధర్మశాల అందాలు, అందుకు తగ్గట్టే అందంగా సాగిన సన్నివేశాలు సూపర్ గా ఉండటంతో పాటు, చిత్ర విజయానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ని 'జ్వాలమ్మ' నేపథ్యంలో, ఆమె ఆచారానికి సంబంధించిన వాటిపై పూర్తి ఫోకస్ చెయ్యాల్సింది. 'జ్వాలమ్మ' లా సుబ్బలక్ష్మి నటించాలని అనుకోని,నిజమైన జ్వాలమ్మ సుబ్బలక్ష్మి  లోకి ప్రవేశించి అసలు రహస్యాన్ని చెప్పించి ఉంటే, పరదా  విజయం తాలూకు స్వరూపం మారిపోయేది.  నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు సుబ్బలక్ష్మి క్యారక్టర్ లో అనుపమ పరమేశ్వరన్ పెర్ ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన ఎంటైర్ కెరీర్ లో ఇలాంటి పెర్ ఫార్మ్ చేసే  అవకాశం మళ్ళీ వస్తుందో రాదో అనేలా చేసింది. పుట్టి పెరిగిన గ్రామాన్ని, ఆ గ్రామ ఆచారాల్ని, మనుషులపై ప్రేమని, నమ్మకాన్ని పెంచుకునే అమాయకత్వంతో కూడిన నటనతో పాటు,తన గురించి తాను తెలుసుకునే సన్నివేశాల్లో అద్భుతంగా చేసింది. ఇక అమిష్ట క్యారక్టర్ లో మలయాళ చిత్రసీమకి చెందిన అగ్రనటి 'దర్శనా రాజేంద్రన్'(Darshana Rajendran)తన నటనతో మెస్మరైజ్ చేసింది. ఆధునిక భావాలని అందిపుచ్చుకున్న యువతిగా,ఆమె స్క్రీన్ పై కనపడుతున్నంత సేపు చూస్తూనే ఉంటాం. సంగీత సినీ జర్నీలో రత్న క్యారక్టర్ మెమొరబుల్ గా నిలిచిపోతుంది. రాజేంద్ర ప్రసాద్(Rajendraprasad),హర్ష వర్ధన్, రాగ్ మయూర్, బలగం సుధాకర్ రెడ్డి మంచి నటనని కనపర్చారు. రచన, దర్శకత్వం పరంగా ప్రవీణ్ మంచి ప్రతిభనే  కనపరిచాడు. ధర్మశాలలో తెరకెక్కించిన  సన్నివేశాల్లో మాత్రం తన దర్శకత్వ ప్రతిభ ఎంతో మెరుగ్గా ఉంది. డైలాగ్స్ కూడా బాగుండటంతో పాటు ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి. కెమెరా, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  నిర్మాణ విలువలు కూడా హైలెట్. ఫైనల్ గా చెప్పాలంటే 'పరదా' మంచి మెసేజ్ తో తెరకెక్కింది. నటీనటుల పెర్ ఫార్మెన్స్ , కథ, దర్శకత్వప్రతిభ, ధర్మశాల' అందాలు ఆకట్టుకునే  స్థాయిలోనే ఉన్నాయి.   రేటింగ్ 2 .75 /5                                                                                                                                                                                                                                           అరుణాచలం 
Cast: Anupama Parameswaran, Darshana Rajendran, Sangeetha Krish, Rag Mayur, Gautham Vasudev Menon Crew:  Written by Praveen Kandregula, Poojitha Sreekanti, Prahaas Boppudi Editing by Dharmendra Kakarala Cinematography by Mridul Sujit Sen Music by Gopi Sundar Directed by Praveen Kandregula Produced by Sreenivasulu P. V., Vijay Donkada, Sridhar Makkuva Anupama Parameswaran has become one of the most popular actresses in Indian and Telugu Cinema. She is taking a different route with lady-orinted film like Paradha, after being part of several entertainers, romantic films. Writer - Director Praveen Kandregula, after his popular films like Cinema Bandi, Shubham, directed this film. With promotional material, the movie created good buzz and released on 22nd August. Let's discuss about the movie in detail.  Plot:  Subbalakshmi (Anupama Parameswaran) aka Subbu, hailing from Padathi village, falls in love with her schoolmate Rajesh (Rag Mayur). Their engagement is set to happen in next three days. As the preparations are underway, village goddess jathara is conducted. Goddess backstory establishes that she used to wear a veil over her head and even though she is a pregnant, she attacks her harassers, and commits suicide. Village people honor her sacrifice and make her their village goddess. The village have a rule that women who fail to wear a veil, would have to commit suicide for the betterment of the village and the prosperity of new born children. Subbu records a message for her father to sell veils, as she is getting ready to marry Rajesh. Unfortunately, her veil is blown away by the wind and a photographer (Gautam Vasudev Menon) captures it and publishes on magazine cover. As she removed her veil, she is asked to commit suicide but she gets a miraculous boon to find the photographer and prove her innocence. Ashmita (Darshana) and friend of her mother (Sangita) try to help her. Can she prove her innocence? Will she be able to understand the oppressed mindset behind veil? Watch the movie to know more.  Analysis:  Anupama Parameswaran is good in her role as a village belle. She is able to deliver a convincing performance as a girl, who got brainwashed to believe in her rural beliefs. She delivered one of her best performances in her career but her look and diction are not convincing. Hailing from an Andhra village, women do have a slang but she did not really try to grab it. But she did well in emotional scenes.  Darshana Rajendran as a career-driven woman looking to fight her way to the top against male dominant society is good in major parts. But her role doesn't have a real punch that such kind of a film requires to make her a case study to Anupama's character, to learn and grow out of her cocoon. Sangita is good but her character looses meat as the film follows. She could have been given a little bit more to perform to showcase how home-makers can think about living for themselves too.  Praveen Kandregula tried to bring to life a story that seems like a 90's driven film rather than a present story. While character conversations are current, the kind of beliefs that the writer created look more close to 80's and 90's cinema. Even if such practices still exist, it cannot be "Duck out of the water" situation for the main character. It feels the same way for watching audiences too. The rituals and practices needed to be more pronounced.  At times, it feels a tad bit under written as the characters don't really stick. It feels random with each moment seem to be artificial at places. The random change in attitudes of certain characters and the parallels drawn with goddess story, don't really bring out the desired results. The writing goes haywire in the second hour as things drag to the point of no return. Still, the performances keep the movie lively to watch to an extent.  Women empowerment doesn't start and end with male chavunism but they tend to go deeper into the oppressive ways that historically been a part of several traditions. It is important to bring out such a message to the society that not every tradition needs to be adhered at the same time, it should not be a lecture. A theme that resembles Queen, Magalir Mattum, Paradha needed even impactful independent voice to stand out yet it is watchable for the genunity in the attempt.    Bottomline:  Paradha tries to be a voice of women empowerment but stumbles over the path to find its unique pitch.    Rating: 2.75/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them. 
  'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో గ్లోబల్ లెవెల్ లో సత్తా చాటిన దర్శకధీరుడు రాజమౌళి.. తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో 29వ చిత్రంగా రానున్న ఈ ఫిల్మ్.. అత్యంత భారీ బడ్జెట్ తో యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతోంది. కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న విడుదలైన ప్రీ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ లో గ్లింప్స్ విడుదల కానుంది. అయితే ఈ గ్లింప్స్ హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ చేతుల మీదుగా విడుదల కానుందన్న వార్త ఆసక్తికరంగా మారింది.   'టైటానిక్', 'అవతార్' వంటి అద్భుతాలను సృష్టించిన జేమ్స్‌ కామెరూన్‌ వరల్డ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా గుర్తింపు పొందారు. అలాంటి దిగ్గజ దర్శకుడు సైతం.. రాజమౌళి ప్రతిభకు ఫిదా అయ్యారు. కామెరూన్‌ పలు సందర్భాల్లో 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని, దర్శకుడు రాజమౌళిని ప్రశంసించారు. ఆస్కార్ అవార్డ్స్ వేడుక సమయంలో ప్రత్యక్షంగా కలిసి మరీ జక్కన్నను అభినందించారు. ఈ క్రమంలో జేమ్స్‌ కామెరూన్‌ కి, రాజమౌళికి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ అనుబంధంతోనే 'SSMB 29' గ్లింప్స్ విడుదల చేయడానికి జేమ్స్‌ కామెరూన్‌ ఓకే చెప్పినట్లు సమాచారం.   జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న 'అవతార్: ఫైర్ అండ్ యాష్' డిసెంబర్ లో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఆయన నవంబర్ లో ఇండియాకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే ఆయన 'SSMB 29' గ్లింప్స్ విడుదల చేయనున్నారని వినికిడి.   నిజానికి గతేడాదే 'SSMB 29' లాంచ్ కి జేమ్స్‌ కామెరూన్‌ వస్తారని ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. లాంచ్ చేయకుండానే డైరెక్ట్ గా షూట్ స్టార్ట్ చేశారు రాజమౌళి. ఇక ఇప్పుడు జేమ్స్‌ కామెరూన్‌ చేతుల మీదుగా గ్లింప్స్ విడుదల కానుందని న్యూస్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే 'SSMB 29'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక గ్లింప్స్ ను జేమ్స్‌ కామెరూన్‌ లాంచ్ చేస్తే.. ఈ సినిమా గురించి ఇంటర్నేషనల్ మీడియాలో మారుమోగిపోతుంది అనడంలో సందేహం లేదు.   
ఈ నెల 14 న వరల్డ్ సిల్వర్ స్క్రీన్ వద్ద కూలీ(Coolie),వార్ 2(War 2)చిత్రాలు పోటాపోటీగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ మేరకు రెండు చిత్రాలు భారీగానే ఓపెనింగ్స్ ని  రాబట్టడంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ తో థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం ఏర్పడింది. కానీ  రెండు చిత్రాలు డివైడ్ టాక్ ని రాబట్టాయి. మరో వైపు జులై 25 న విడుదలైన 'మహావతార్ నరసింహ'(Mahavatar Narasimha)రోజు రోజుకి మౌత్ టాక్ తో రికార్డు కలెక్షన్స్ వసూలు చేస్తుండటంతో, ప్రేక్షకుల్లో ఈ మూడు చిత్రాల కలెక్షన్స్ పట్ల ఆసక్తి  ఏర్పడింది.    వార్ 2  ఫస్ట్ వీక్ కి సంబంధించి తెలుగులో 59 .95 కోట్ల గ్రాస్, తమిళంలో కోటి 50 లక్షలు, మలయాళంలో కోటి 20 లక్షలు,  హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 71 .65 కోట్లు, ఓవర్సీస్ 69 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి. దీంతో వరల్డ్ వైడ్ గా 297 .20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది. కూలీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని చూసుకుంటే తమిళంలో 113.35 కోట్లు, తెలుగు 59.50 కోట్లు, కర్ణాటక 37.70  కోట్లు,కేరళ  22.95 కోట్లు, హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 35 కోట్లు, ఓవర్సీస్ లో సుమారు 164 .80 కోట్లు రాబట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. టోటల్ గా  433 .80 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాల టాక్.  ఇక మహావతార్ నరసింహ అన్ని లాంగ్వేజెస్ లోను ఇప్పటి వరకు సుమారు 260 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది. తెలుగులో 42 కోట్ల రూపాయిల కలెక్షన్స్ ని వసూలు చేసినట్టు గణాంకాలు చెప్తున్నాయి. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind)తెలుగులో రిలీజ్ చేసాడు.  
  'దుబాయ్ శీను' సినిమాలో హోటల్ సీన్ లో "ఏం తీసుకుంటారు" అని వేణుమాధవ్ అడగ్గానే.. "మూడు ఊతప్ప, ఒక రవ్వ దోస, రెండు ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ వడ" అంటూ కమెడియన్ రామచంద్ర చెప్పిన తీరు భలే ఉంటుంది. ఈ సీన్ ఎన్నిసార్లు చూసినా నవ్వొస్తుంది. అంతలా నవ్వించిన రామచంద్ర.. ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో మంచానికి పరిమితమై, సాయం కోసం ఎదురుచూస్తున్నారు.   జూనియర్ ఎన్టీఆర్ హీరోగా లాంచ్ అయిన 'నిన్ను చూడాలని' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు రామచంద్ర. ఆనందం, సొంతం, వెంకీ, దుబాయ్ శీను, లౌక్యం వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా శ్రీను వైట్ల సినిమాలు రామచంద్రకు ఎంతో పేరు తీసుకొచ్చాయి. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన రామచంద్ర.. గత పదేళ్లుగా పెద్దగా సినిమాలు చేయట్లేదు. ఒకటి అరా సినిమాలు చేస్తూ వస్తున్న ఆయన.. ఇటీవల తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.   రీసెంట్ గా రామచంద్ర ఓ డెమో షూట్ లో పాల్గొనగా.. సడెన్ గా కాలు, చేయి నొప్పి రావడంతో మధ్యలోనే ఇంటికి తిరిగి వచ్చేశారట. అనంతరం డాక్టర్ ని సంప్రదించగా.. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని తెలిసింది. ఆ క్లాట్ వల్ల పెరలాసిస్ ఎటాక్ కాగా.. ఎడమ చేయి, ఎడమ కాలు పడిపోయాయి. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం రామచంద్ర విశ్రాంతి తీసుకుంటూ.. ఫిజియోథెరఫీ చేయించుకుంటున్నారు.   తన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడారు రామచంద్ర. ఇప్పటికే ట్రీట్మెంట్ కోసం చాలా ఖర్చయిందని.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మెంబర్ కావడంతో కొంత కవర్ అయిందని తెలిపారు. అయితే ట్రీట్మెంట్ కోసం మరిన్ని డబ్బులు అవసరమని.. ఇప్పటికే తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయని పేర్కొన్నారు. ఎవరైనా సహాయం చేస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. ఇప్పటివరకైతే సినీ పరిశ్రమ నుంచి తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆరా తీయలేదని రామచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.   రామచంద్ర పలువురు స్టార్ల సినిమాల్లో నటించారు. మరి ఎవరైనా స్టార్ ముందుకొచ్చి.. ఆయన ట్రీట్మెంట్ కి కావాల్సిన ఆర్ధిక సాయం అందిస్తారేమో చూడాలి.  
  'పుష్ప-2'తో ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, 'జవాన్'తో రూ.1000 కోట్ల క్లబ్ లో చేరిన డైరెక్టర్ అట్లీ.. ఓ భారీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కోసం చేతులు కలిపిన సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూవీ కోసం వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులను రంగంలోకి దింపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ పవర్ ఫుల్ రోల్ కోసం విజయ్ సేతుపతి రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.   ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఇతర హీరోల సినిమాలలోనూ విభిన్న పాత్రలు పోషించి మెప్పిస్తుంటారు విజయ్ సేతుపతి. షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ రూపొందించిన 'జవాన్'లో కూడా నెగటివ్ రోల్ లో ఆకట్టుకున్నారు సేతుపతి. ఇప్పుడు అల్లు అర్జున్ తో చేస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ లో సైతం ఓ కీలక పాత్ర కోసం అట్లీ ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోంది. విజయ్ కూడా ఈ సినిమా చేయడానికి వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. మరి ఇందులో ఆయన రోల్ ఎలా ఉంటుందో చూడాలి.   అల్లు అర్జున్ కెరీర్ లో 22వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బోర్సే, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.  
మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ 'విశ్వంభర'(Vishwambhara).'జగదేక వీరుడు అతిలోకసుందరి' తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను విశ్వంభర' పై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన చివరి సాంగ్ ని కూడా చిరంజీవి కంప్లీట్ చెయ్యడం జరిగింది. ఈ ఏడాది సంక్రాంతికే 'విశ్వంభర' విడుదల కావాల్సి ఉంది. రీసెంట్ గా విశ్వంభర కి సంబంధించి చిరంజీవి ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో చిరంజీవి మాట్లాడుతు 'విశ్వంభర' ఎందుకు డిలే అవుతుందని చాలా మందికి డౌట్ ఉంది. ఈ ఆలస్యం విశ్వంభర కి సంబంధించి కరెక్ట్ అని అనుకుంటున్నాను. విశ్వంభర సెకండ్ ఆఫ్ మొత్తం విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పై ఆధారపడి ఉంది. అత్యున్నత ప్రమాణాలతో, బెస్ట్ క్వాలిటీ తో విశ్వంభర ని  మీ ముందు ఉంచాలనే  దర్శక నిర్మాతల ప్రయత్నమే ఆలస్యానికి ప్రధాన కారణం. సినిమా విషయంలో ఎలాంటి విమర్శలు రాకూడదనే మా ప్రయత్నం. చందమామ కథలాగా సాగిపోయే అద్భుతమైన కథ. చిన్న పిల్లలకి, ముఖ్యంగా పెద్ద వాళ్ళల్లో ఉండే చిన్నపిల్లలకి ఎంతో వినోదాన్ని ఇస్తుంది. నా పుట్టిన రోజు సందర్భంగా  ఈ రోజు సాయంత్రం 6 .06 నిమిషాలకి విశ్వంభర నుంచి గ్లింప్స్  రాబోతుంది. అది మీ అందర్నీ ఆకట్టుకుంటుంది. వయసుతో సంబంధం లేకుండా అందరు ఎంజాయ్ చేసే సమ్మర్ సీజన్ లో    విశ్వంభర  విడుదల కాబోతుందని తెలిపాడు. అగస్ట్ 22 చిరంజీవి పుట్టిన రోజనే విషయం తెలిసిందే. విశ్వంభర లో చిరంజీవి సరసన 'త్రిష'(Trisha)తో పాటు 'ఆషిక రంగనాధ్'(Ashika Ranganath)జంటగా చేస్తుండగా యువి  క్రియేషన్స్(Uv Creations)పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ లో ఇప్పటికే  రన్ రాజా రన్, రాధే శ్యామ్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి పలు చిత్రాలు వచ్చాయి. నందమూరి కళ్యాణ్ రామ్ తో బింబిసార ని తెరకెక్కించిన వశిష్ట మల్లిడి (Vasishta Mallidi)దర్శకుడు కాగా ఆస్కార్ విన్నర్ కీరవాణి(MM.keeravani)మ్యూజిక్.    
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)అభిమానిగా గుంటూరు జిల్లా తెనాలిలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన దాసరి కిరణ్ కుమార్(Dasari Kirankumar)ఆ పై నిర్మాతగా మారి రామదూత క్రియేషన్స్ పై 'జీనియస్, వంగవీటి, వ్యూహం వంటి పలు సినిమాలని నిర్మించాడు. రీసెంట్ గా దాసరి కిరణ్ పై గాజుల మహేష్(Gajula Mahesh)అనే ట్రావెల్ ఏజెన్సీ నడుపుకునే వ్యక్తి  ఈ నెల 18 న   విజయవాడ పడమట పిఎస్ లో ఫిర్యాదు చేసాడు. తన ఫిర్యాదులో కిరణ్ నా వద్ద రెండు సంవత్సరాల క్రితం, వ్యాపార నిమిత్తం 4.5 కోట్ల రూపాయిలు  అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని నా భార్యతో పాటు విజయవాడలో ఉన్న కిరణ్ ఆఫీస్ కి వెళ్ళాను. కానీ కిరణ్ మనుషులు మమల్ని బయటకి నెట్టి వెయ్యడమే కాకుండా, దాడి చేసి గాయపరిచారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కిరణ్ ని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడ కి తరలించినట్టుగా వార్తలు వస్తున్నాయి. వ్యూహం చిత్రంలో అవాస్తవాలని వాస్తవాలుగా చూపిస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu),ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చిరంజీవిని పలు రకాలుగా విమర్శించడం జరిగింది.  రామ్ గోపాల్ వర్మ  దర్శకుడు.      
  తెలుగు సినీ పరిశ్రమలో దివంగత నటుడు శ్రీహరికి ఎంతో గొప్ప పేరుంది. ఎదుటివారికి సాయం చేయడంలో ఆయనెప్పుడూ ముందుండే వారు. ఎందరికో డబ్బు సాయం, మాట సాయం చేసి అండగా నిలబడ్డారు. అలాంటి శ్రీహరి కుటుంబాన్ని కొందరు మోసం వేసి, విలువైన ఆస్తులను కొట్టేశారు. ఈ విషయాన్ని శ్రీహరి సతీమణి డిస్కో శాంతి స్వయంగా చెప్పడం విశేషం.   తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీహరి గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు శాంతి. "బావ(శ్రీహరి) ఉదయం 7 గంటలకు షూటింగ్ ఉన్నా కూడా.. అర్థరాత్రి 2-3 గంటల వరకు మేల్కొని ఎందరో సమస్యలను పరిష్కరించిన రోజులు ఉన్నాయి. ఆయన దానం చేస్తుంటే నేనెప్పుడూ వద్దని చెప్పలేదు. ఎందుకంటే ఆయన చేస్తుంది మంచే కదా. మనం మంచి చేస్తే.. దేవుడు మనల్ని మంచిగా చూసుకుంటాడని నేను నమ్ముతాను." అని శాంతి అన్నారు.   శ్రీహరి ఆస్తుల గురించి శాంతి మాట్లాడుతూ.. "సినిమాల్లో శ్రీహరి బాగానే సంపాదించారు. వాటిలో మా అవసరాలకు ఉంచుకొని.. ఎక్కువగా దానం చేసేవారు. నేను కూడా తినడానికి, ఉండటానికి ఉంటే చాలని చెప్పేదాన్ని. ఆస్తుల్లో సగానికి పైగా స్నేహితులే మోసం చేసి కొట్టేశారు. ఎవరి పాపాన వాళ్ళే పోతారని వదిలేశాను. శ్రీహరి గారు చనిపోయాక ఇబ్బందులు పడ్డాము. ఇక్కడి ఆస్తుల విలువ మాకు తెలియకపోవడంతో.. తక్కువ ధరకే కొందరు కాజేశారు. కొంతకాలం తిండికి కూడా కష్టమైంది. బంగారం తాకట్టు పెట్టాను. మా అన్నయ్య ఖర్చులకు డబ్బులు పంపారు." అని చెప్పారు.   "మేము ఆస్తులు కూడపెట్టుకున్నామని అందరూ అనుకున్నారు. కానీ ఎక్కువగా దానాలే చేశాము. శ్రీహరి చనిపోయాక డబ్బులు ఇవ్వాల్సిన కూడా ఇవ్వలేదు. ఇప్పుడు లైఫ్ పరవాలేదు. జాగ్రత్తగా ఉంటున్నాము. ఉన్నది కాపాడుకుంటున్నాము. భవిష్యత్ లో మా పిల్లలు మళ్ళీ సంపాదించుకుంటారు." అంటూ శాంతి చెప్పుకొచ్చారు.    
  సిల్వర్ స్క్రీన్ వద్ద 'మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)కి ఉన్న క్రేజ్ చాలా ప్రత్యేకం. ఎన్టీఆర్ నుంచి సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు థియేటర్స్ వద్ద బారులు తీరుతారు. అభిమానులు అయితే బాణాసంచాలు ,డప్పు వాయిద్యాలతో పండుగ వాతావరణాన్ని తీసుకొస్తారు. ఈ ఆనవాయితీ రెండు దశాబ్దాలపై నుంచి వస్తూనే  ఉంది. అంతలా ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటు ఒక  అధ్యాయాన్ని సృష్టించుకున్నాడు. ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతున్న 'వార్ 2'(War 2)నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా ఎన్టీఆర్ వల్లనే పర్వాలేదనే స్థాయిలో  కలెక్షన్స్ ని  రాబడుతుంది. రీసెంట్ గా జపాన్(Japan)దేశానికి చెందిన యువతీ ఢిల్లీ ఎయిర్ పోర్ట్(Delhi Airport)లో ప్రత్యక్షమయింది. ఆమె ధరించిన టీ షర్ట్ పై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించి ఉంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు కొంత మంది ఆమెతో మాట్లాడగా నేను ఎన్టీఆర్ కి పెద్ద అభిమానిని. వార్ 2 చూడటం కోసం ఢిల్లీకి వచ్చాను. గతంలో కూడా ఇలాగే ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడు వచ్చాను. మళ్ళీ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడు వస్తానని చెప్పింది. ఇందుకు సంబందించి యువతీ మాట్లాడిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులైతే ఎన్టీఆర్ రేంజ్ కి ఇదొక ఉదాహరణ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ యువతీ పేరు 'క్రిసో'(Criso). 'ఆర్ఆర్ఆర్' తో ఎన్టీఆర్ కి జపాన్ లో ఎంతో మంది అభిమానులు ఏర్పడ్డారు. రీసెంట్ హిట్ 'దేవర'(Devara)ని జపాన్ లో జపాన్ భాషలోనే రిలీజ్ చేసారంటే, ఎన్టీఆర్ కి అక్కడ ఎంతటి క్రేజ్ ఏర్పడిందో అర్ధం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ కూడా దేవర ప్రమోషన్స్ నిమిత్తం  జపాన్ వెళ్లగా, అభిమానులు ఘనస్వాగతం పలకడంతో పాటు ఎన్టీఆర్ కోసం తెలుగు నేర్చుకుని మరి తెలుగులో మాట్లాడటం జరిగింది. ఇందుకు  సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నేటికీ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
   నేటి కాలంలో నడుస్తున్న  బిజీ,  ఒత్తిడితో కూడిన జీవితంలో చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ట్రాఫిక్‌లో చిక్కుకోవడం, ఇంటర్నెట్ నెమ్మదిగా ఉండటం లేదా స్నేహితుల మాటలకు వెంటనే కోపం తెచ్చుకోవడం ఇవన్నీ చాలా మంది అనుభవిస్తూ ఉంటారు. అయితే కోపం అనేది కేవలం ఒక ఎమోషన్  మాత్రమే కాదు, అది  శారీరక,  మానసిక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పదే పదే  కోపం రావడం అనేది అధిక రక్తపోటు, గుండె జబ్బులు,  జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఇది మానవ  సంబంధాలను,  వృత్తి జీవితాన్ని కూడా  ప్రభావితం చేస్తుంది.  అందువల్ల కోపాన్ని సరిగ్గా నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. అయితే కోపాన్ని నియంత్రించుకోవడం కూడా ఒక గొప్ప నైపుణ్యం అనే చెప్పవచ్చు. కోపాన్ని అదుపు చేసుకోవడం అంటే కోపాన్ని పూర్తిగా అణచివేయడం కాదు, దానిని వ్యక్తీకరించే విధానం కావచ్చు, దానిని ప్రదర్శించే ప్రాంతం కావచ్చు.. వీటిని మార్చుకోవడం.  ముఖ్యంగా  కోపానికి గల కారణాలను  అర్థం చేసుకుని, దానిని నియంత్రించుకోవడానికి పద్ధతులను అవలంబించినప్పుడు  భావోద్వేగాలపై  మంచి నియంత్రణను కలిగి ఉండగలుగుతాము. కోపాన్ని నియంత్రించుకునే పద్దతులు ఏంటో తెలుసుకుంటే.. ట్రిగ్గర్ లు..  కోపాన్ని నియంత్రించుకోవాలనుకుంటే,మొదట చేయాల్సింది ఎందుకు కోపం వస్తుంది? ఎవరి వల్ల కోపం వస్తుంది? ఎలాంటి పరిస్థితులలో కోపం వస్తుంది? ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు  పని ఒత్తిడి కావచ్చు లేదా ఒక  వ్యక్తి కావచ్చు,  కొన్నిసార్లు  రద్దీగా ఉండే ట్రాఫిక్ ప్రాంతం కావచ్చు. దేని వల్ల కోపం వస్తుందనేది గుర్తించగలిగితే ఆ కోపాన్ని నియంత్రించడానికి ఒక ప్రణాళికను తయారు చేసుకోవచ్చు.  శ్వాస సాధన..  కోపం వచ్చినప్పుడల్లా వెంటనే స్పందించే బదులు కొద్ది సేపు ఆగి లోతైన శ్వాసను ప్రాక్టీస్ చేయాలి. ఈ టెక్నిక్  శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది.  హృదయ స్పందనను సాధారణీకరిస్తుంది.  ఆలోచించడానికి సమయం ఇస్తుంది. నెమ్మదిగా ఉచ్ఛ్వాసము,  నిశ్వాసము  కోపాన్ని తక్షణమే నియంత్రించగలవు. పరిస్థితి నుండి దూరం.. ఏదైనా  పరిస్థితి  చాలా ఇబ్బంది పెడుతుంటే ఆ ప్రదేశం నుండి కొంత సమయం దూరంగా వెళ్లడం మంచిది. తర్వాత  ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడటం  లేదా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించడం చేయాలి. దూరాన్ని సృష్టించడం వల్ల పరిస్థితిని కొత్త కోణం నుండి చూసే అవకాశం లభిస్తుంది. ఇది కోపాన్ని శాంతపరుస్తుంది. వ్యాయామం,  ధ్యానం.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కోపాన్ని నియంత్రించడానికి సులువు అవుతుంది. శారీరక శ్రమ.. ఒత్తిడిని,  కోపాన్ని తగ్గించే హార్మోన్లను విడుదల చేస్తుంది. దీనితో పాటు ధ్యానం,  యోగా సాధన చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారి ఏకాగ్రత పెరుగుతుంది. తద్వారా  చిన్న విషయాలకు స్పందించడం మానేస్తారు.                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
 బొబ్బలు,  మొటిమలు చాలా సాధారణ సమస్య. ఇది తరచుగా కొంతమందిని ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య సాధారణంగా చిన్న పిల్లలలో కనిపిస్తుంది. శరీరంపై బొబ్బలు, మొటిమలు ఉండటం ఒక సాధారణ విషయం. కానీ సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే వీటి పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. బొబ్బలు ఎరుపు, వాపు,  చీముతో ఉంటాయి. అలాగే మొటిమలు కూడా పదే పదే రావడం, చీము, రక్తం రావడం వంటివి జరుగుతుంటాయి.  ఇవి ఆరోగ్యం గురించి అనేక ముఖ్యమైన సూచనలను  ఇస్తాయి. బ్యాక్టీరియా మన రంధ్రాలలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేసినప్పుడు బొబ్బలు,  మొటిమలు ఏర్పడతాయి. శరీర రోగనిరోధక వ్యవస్థ ఈ ఇన్ఫెక్షన్‌కు ప్రతిస్పందిస్తుంది. దీనివల్ల వాపు,  చీము ఏర్పడుతుంది. అయితే బాక్టీరియా మాత్రమే దీనికి కారణమని చెప్పలేం. అలవాట్లు, ఆరోగ్య పరిస్థితులు,  పర్యావరణ కారకాలు కూడా బొబ్బలు,  మొటిమల ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ కారణాలను తెలుసుకుని వాటిని నివారించడం ద్వారా  చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీని వెనుక ఉన్న మూడు అతిపెద్ద కారణాలను తెలుసుకుంటే.. వ్యక్తిగత పరిశుభ్రత సరిగా లేకపోవడం.. మొటిమలు,  బొబ్బలకు అతి పెద్ద కారణం వ్యక్తిగత పరిశుభ్రత సరిగా లేకపోవడం. శరీరాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోనప్పుడు, చర్మంపై నూనె, చెమట,  బ్యాక్టీరియా పేరుకుపోతాయి. ఈ బాక్టీరియా చర్మ రంధ్రాలలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. దీని వలన బొబ్బలు,  మొటిమలు వస్తాయి. అందువల్ల క్రమం తప్పకుండా స్నానం చేయడం,  చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ..  రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే శరీరం బయట  బ్యాక్టీరియా,  సూక్ష్మక్రిములతో సరిగ్గా పోరాడదు. డయాబెటిక్ రోగులు లేదా చాలా కాలంగా ఏదైనా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు కురుపులకు ఎక్కువగా గురవుతారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం,  తగినంత నిద్ర ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు. జీర్ణ ప్రక్రియ వల్ల బొబ్బలు వస్తాయి..  జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయనప్పుడు శరీరం ఆహారం నుండి టాక్సిన్లను పూర్తిగా తొలగించలేకపోతుంది. ఈ విషపదార్థాలు రక్తంలో పేరుకుపోవడం ప్రారంభిస్తాయి.  శరీరం చర్మం ద్వారా వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియలో ఈవిషపదార్థాలు చర్మ రంధ్రాలను మూసివేస్తాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్, బొబ్బలు లేదా మొటిమలు ఏర్పడతాయి. హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి.. పైన  మూడు ప్రధాన కారణాలతో పాటు బొబ్బలు,  మొటిమలు రావడానికి మరొక కారణం ఉంది. అది హార్మోన్ల అసమతుల్యత. ముఖ్యంగా కౌమారదశలో  మొటిమలకు ప్రధాన కారణం. దీనితో పాటు ఒత్తిడి శరీరంలో కార్టిసాల్ వంటి హార్మోన్లను కూడా పెంచుతుంది. ఇది చర్మంలో నూనె ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల రంధ్రాలు మూసుకుపోయి బొబ్బలు ఏర్పడతాయి. ఒత్తిడిని నియంత్రించడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు.  నివారణకు అవసరమైన జాగ్రత్తలు.. కురుపులను నివారించడానికి చర్మాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి.  పుష్కలంగా నీరు త్రాగాలి.  ఈ సమస్యను పదే పదే ఎదుర్కుంటుంటే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇది ఏదైనా అంతర్గత వ్యాధికి సంకేతం కావచ్చు.        రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...                            
అశ్వగంధ ఆయుర్వేదంలో ముఖ్యమైన మూలిక. ఇది ఒత్తిడిని తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో,  శారీరక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. దాని వేర్లు గుర్రపు వాసన రావడం వల్ల దీనికి అశ్వగంధ అనే పేరు వచ్చిందట. భారతదేశం, మధ్యప్రాచ్యం,  ఆఫ్రికాలో కనిపించే ఈ  మొక్క శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో భాగంగా ఉంది. పురాతన ఔషధమైన అశ్వగంధ శరీరానికి, మనస్సుకు కూడా గొప్ప వరంగా చెప్పవచ్చు.  అయితే అశ్వగంధ కొందరు వ్యక్తులకు చాలా డేంజర్ అని, దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే.. అశ్వగంధ  ప్రయోజనాలు.. అశ్వగంధను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అశ్వగంధ అనేది ఒక అడాప్టోజెన్. ఇది ఒత్తిడి హార్మోన్ (కార్టిసాల్) ను నియంత్రిస్తుంది. మానసిక ప్రశాంతతను అందిస్తుంది,  నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది జలుబు,  సీజనల్ వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది కండరాల బలం, ఓర్పు,  శక్తిని పెంచుతుంది.  ఇది వ్యాయామం చేసేవారికి ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అశ్వగంధ మధుమేహ రోగులకు,  ఆరోగ్యవంతులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది,  ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అశ్వగంధ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.  ఎముకలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది. అశ్వగంధ పొడిని అల్లం,  తులసితో టీలో కలిపి తాగడం వల్ల జలుబు,  దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. గొంతు నొప్పి,  జ్వరం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఎలా తీసుకోవాలి? అశ్వగంధను తీసుకునే పద్ధతి ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించబడింది. అశ్వగంధ  పొడిని వేడి పాలలో కలిపి తేనె లేదా బెల్లం తో తీసుకోవచ్చు.  అలాగే  అశ్వగంధ, అల్లం,  తులసి వేసి 5 నిమిషాలు మరిగించి టీగా కూడా తీసుకోవచ్చు. ఒత్తిడి, బలహీనత,  బలహీనమైన రోగనిరోధక శక్తితో బాధపడేవారికి అశ్వగంధ ఒక వరం.  అయితే ఆరోగ్య నిపుణులు  దీనిని జాగ్రత్తగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. గర్భిణీ స్త్రీలు,  పాలిచ్చే మహిళలు వైద్యుడిని సంప్రదించకుండా అశ్వగంధ వాడటం మంచిది కాదు.  ఇది థైరాయిడ్ హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. హైపర్ థైరాయిడ్ రోగులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అశ్వగంధ నిద్రను పెంచుతుంది. ఇది మందుల ప్రభావాన్ని పెంచుతుంది. కాబట్టి నిద్ర మాత్రలు తీసుకునేవారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అధిక మొత్తంలో దీనిని తీసుకోవడం వల్ల కడుపులో చికాకు లేదా విరేచనాలు సంభవించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.                                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...