LATEST NEWS
 రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి పెరిగిపోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. నందినగర్ లోని తన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా  పార్టీ నేతలతో సమావేశమైన కేటీఆర్.. ఈ రెండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిన అవినీతి, కుంభకోణాలను చూసిన ప్రజలు ఆ పార్టీకి మరో రెండు దశాబ్దాల పాటు ఓటు వేయరన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో   బీఆర్ఎస్ బ‌లోపేతం,  స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ .  స్థానిక సంస్థల ఎన్నికల్లో  మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను  ఈ సందర్భంగా అభినందించారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందన్న కేటీఆర్.. కమర్షియల్ గ్యాస్ సిలెండర్ పై ఒకే సారి దాదాపు వెయ్యి రూపాలయలు పెంచడం అందులో ఒకటన్నారు. గ్యాస్ ధర పెంపునకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.  
బీఆర్ఎస్ నుంచి కవిత నిష్క్రమించడంతో, కేటీఆర్, కవితల మధ్య మాటల యుద్ధం    అధికారికంగా మొదలైంది. తెలంగాణలో ఎన్నో రాజకీయ పార్టీలు వస్తూ పోతూ ఉంటాయని, వాటి గురించి మాట్లాడటంలో గానీ, వాటిపై మానసిక వనరులను వృధా చేయడంలో గానీ అర్థం లేదని తన సోదరి కల్వకుంట్ల కవిత కొత్తగా ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అన్నా చెళ్లెళ్ల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి.   కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు.  బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత..  ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుం టున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే..  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.  మమ్మల్ని సీరియస్‌గా తీసుకోకూడదని  అంటున్నారు. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా తొలుత చిన్నగానే మొదలవుతుంది,  పాత టీఆర్ఎస్ కూడా చాలా నెమ్మదిగానే ప్రారంభమైందని కవిత గుర్తు చేశారు. నా పార్టీ కూడా అలాంటి ధోరణినే చూడబోతోందన్నారు. తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇసుమంతైనా పట్టిచుకోనన్న కవిత..  తెలంగాణ రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి కష్టపడి పనిచేస్తానన్నారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత, ఆమె సొంత పార్టీ ప్రకటించిన తరువాత ఆమెపై పరోక్షంగానే అయినా తొలిసారి కేటీఆర్ విమర్శించారు. అంటే అన్నాచెళ్లెళ్ల మధ్య మాటల యుద్ధం దిశగా తొలి అడుగు పడిందన్నమాటేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ముందు ముందు ఈ మాటల యుద్ధం మరింత   ముదురుతుందని అంచనా వేస్తున్నారు.   ఒకప్పుడు ఐక్యంగా ఉండి ప్రత్యర్థులను ఎదుర్కొన్న కల్వకుంట్ల కుటుంబంలో ఇప్పుడు చీలిపోయింది.  బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె పార్టీతో విభేదించి బయటకు వచ్చేశారు. ఆ సందర్భంగా కేటీఆర్.. యధాలాపంగానే అయినా  గత ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమికి   ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక ప్రధాన కారణమని అన్నారు. అయితే దానికి కవిత అప్పట్లో తీవ్రంగా ఖండించారు.  దాంతో అప్పటి నుంచీ కవిత విషయంలో కేటీఆర్ మౌనం వహిస్తూ వచ్చారు. అయితే తాజాగా కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తరువాత..  రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతుంటాయి, పోతుంటాయి.. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కవిత పార్టీని తక్కువ చేసే విధంగా మాట్లాడారు.  పార్టీ   ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.  కవిత పార్టీ లాంటి  చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వొద్దని కార్యకర్తలకు సూచించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత కూడా ఘాటుగా స్పందించారు.  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నారా లోకేష్ హవా నడుస్తోంది. గతంలో ఆయనను లక్ష్యంగా చేసుకుని వైసీపీ సోషల్ మీడియా విభాగం చేసిన ప్రచారాలు ఇప్పుడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తెచ్చి, టీడీపీలో వారసత్వ చిచ్చు పెట్టాలనే  వైసీపీ ఎత్తుగడలు ఇప్పుడు నవ్వులపాలౌతున్నాయి.   2024 ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మక విజయం సాధించడం..  అందులోనూ లోకేష్ మంగళగిరిలో రికార్డు మెజారిటీతో గెలవడం.. అంతకు ముందు తన యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ ప్రజా నాయకుడిగా ఎదగడంతో ఇప్పుడు వైసీపీ ఆయనపై ఎక్కుపెడుతున్న పాత విమర్శలు, వ్యాఖ్యలు ఇసుమంతైనా ప్రభావం చూపడం లేదు.   ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన  యువగళం పాదయాత్ర లోకేష్‌ను   ప్రజలకు చేరువ చేయడమే కాకుండా..  ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న  సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి. పాత ఇమేజ్‌ను పూర్తిగా చెరిపివేసి, ఒక మాస్ లీడర్‌గా ఆయన ఎదిగిన తీరు వైసీపీ వ్యూహకర్తలకు మింగుడుపడటం లేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి వంటి కీలక శాఖల మంత్రిగా లోకేష్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రచారాల్లో వినిపించిన  పప్పు  అనే ముద్రను ఆయన తన తీరుతో  తుడిచిపెట్టేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతూ..  రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. మరోవైపు వైసీపీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ మాత్రం ఇంకా పాత వ్యూహాలతోనే లోకేష్ పై దాడి చేస్తున్నది. జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని వాడుకుంటూ లోకేష్‌ను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే వాటిని జనాలు ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు.   సినిమా రంగంలో ఎన్టీఆర్ ప్రస్థానం వేరు, రాజకీయాల్లో లోకేష్ ప్రయాణం వేరు. ఒకరితో ఒకరిని పోల్చి విద్వేషాలు సృష్టించాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నం వల్ల ఇసుమంతైనా ప్రయోజనం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  లోకేష్ పై వైసీపీయులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న విమర్శలు, ట్రోలింగ్స్ నవ్వుల పాలౌతున్నాయి. ఇటువటి చౌకబారు ప్రయత్నాలు వైసీపీ ప్రతిష్టను మరింత మసకబారుస్తున్నాయంటున్నారు.  నారా లోకేష్ ప్రస్తుతం కేవలం ఒక వారసుడిగా మాత్రమే కాకుండా, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.  యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పరిస్థితుల్లో 2019 నాటి పాత స్క్రిప్టులతో లోకేష్‌ను దెబ్బతీయాలనుకోవడం వైసీపీకి రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యమేనని పరిశీలకులు అంటున్నారు. సోషల్ మీడియాలో కృత్రిమంగా సృష్టించే వివాదాల కంటే క్షేత్రస్థాయిలో లోకేష్ సంపాదించుకున్న ప్రజాభిమానం ఎంతో బలంగా ఉందని చెబుతున్నారు.  వైసీపీ ఇంకా పాతకుట్రలు, వ్యూహాలతో చేస్తున్న ప్రయత్నాలు.. ఆ పార్టీ 2014 ఘోర పరాజయం నుంచి పాఠాలు, గుణపాఠాలూ నేర్చుకోలేదనడానికి నిదర్శనమని అంటున్నారు.   
ALSO ON TELUGUONE N E W S
ఇటీవల సోషల్ మీడియాలో గెటప్ శ్రీను (Getup Srinu) ఇంటర్వ్యూ ప్రోమో ఒకటి వైరల్ అవుతూ టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. నాగబాబు గారితో కలిసి ఒక కొత్త సిరీస్ చేస్తున్నానని, దాని టైటిల్ 'మేము కాపులం' అని గెటప్ శ్రీను చెప్పి షాకిచ్చాడు. దాంతో యాంకర్ "సినిమాలకు కులం పేరు పెట్టడం ఏంటి?" అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తొక్కలో ఇంటర్వ్యూ అంటూ గెటప్ శ్రీను వెళ్ళిపోయాడు. గెటప్ శ్రీను ఇంటర్వ్యూ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రకరకాల కామెంట్స్ వినిపించాయి. కొందరు ఆ టైటిల్ పెట్టడాన్ని తప్పుబడితే, మరికొందరు మాత్రం ఇది ప్రాంక్ అని తేలికగా తీసుకున్నారు. తాజాగా ఈ విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.  నిజానికి ఆ సిరీస్ పేరు 'మేము కాపులం' కాదు, 'మేము COPలం'. ఇక్కడ 'COP' అంటే ఇంగ్లీష్ లో పోలీస్ అని అర్థం. గెటప్ శ్రీను ఈ సిరీస్‌లో ఒక పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. తాజాగా ఈ విషయాన్ని తెలుపుతూ కొత్త వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో శ్రీను తన పోలీస్ యూనిఫామ్ చూపిస్తూ.. "మేము పోలీసులం (COPS), అందుకే మేము COPలం అని పేరు పెట్టాం" అని క్లారిటీ ఇచ్చారు. ఈ సిరీస్ జీ5 (ZEE5) ఓటీటీ వేదికగా త్వరలో విడుదల కానుంది. 'మేము COPలం' అనే విభిన్నమైన టైటిల్‌తో వస్తున్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. త్వరలోనే దీని విడుదల తేదీని జీ5 అధికారికంగా ప్రకటించనుంది.   https://x.com/Theteluguone/status/2050560252102533340
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కలయికలో సినిమా వస్తోంది అనగానే ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మాస్ యాక్షన్ అంశాలతో పాటు సామాజిక స్పృహ కలగలిపిన కథలను అందించడంలో కొరటాల దిట్ట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారు కావడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తారనే అంశంపై మళ్లింది. ముఖ్యంగా బాలయ్య లక్కీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ ప్రాజెక్ట్‌లో లేరా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. థమన్ - బాలయ్య హిట్ కాంబోకు బ్రేక్? గత కొన్నేళ్లుగా బాలకృష్ణ సినిమాలకు థమన్ వెన్నెముకగా నిలుస్తున్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి చిత్రాలకు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించింది. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా థమన్ ఇచ్చే మాస్ మ్యూజిక్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుంది. అయితే, కొరటాల శివ సినిమాలో థమన్ పేరు వినిపించకపోవడం నందమూరి అభిమానులను కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తోంది. లైన్లోకి అనిరుధ్ రవిచందర్? ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌ను తీసుకోవాలని కొరటాల భావిస్తున్నారట. గతంలో కొరటాల దర్శకత్వంలో వచ్చిన 'దేవర' చిత్రానికి అనిరుధ్ అదిరిపోయే సంగీతాన్ని అందించారు. ఆ బాండింగ్‌తోనే బాలయ్య సినిమాకు కూడా అనిరుధ్‌ను తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్ కనుక ఈ ప్రాజెక్ట్‌లోకి వస్తే, బాలయ్య సినిమాకు సరికొత్త సౌండింగ్ లభించడం ఖాయం.  
టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రీసెంట్ గా విడుదలైన  'జెట్లీ' సినిమా ప్రదర్శనను కొన్ని స్క్రీన్స్ లో నిలిపివేయడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.  తాజాగా జరిగిన 'జెట్లీ' (JETLEE) మూవీ సక్సెస్ మీట్‌లో నిర్మాత చెర్రీ పాల్గొని, ఈ ఇష్యూపై స్పందించారు. 'పెద్ది' (Peddi) వంటి భారీ చిత్రం త్వరలో విడుదల కానున్న  నేపథ్యంతో ఈ సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుందనే దానిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వివాదానికి అసలు కారణం ఏమిటి? సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా పర్సెంటేజ్ బేసిస్‌లో సినిమాలు ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. అంటే టికెట్ ఆదాయంలో తమకు నిర్ణీత వాటా ఉండాలని వారి వాదన. అయితే, మే 1 నుంచి ఈ పద్ధతిని అమలు చేస్తేనే థియేటర్లు ఇస్తామని ఎగ్జిబిటర్లు భీష్మించుకోవడంతో సమస్య మొదలైంది. దీనివల్ల 'జెట్లీ' సినిమా విడుదల రోజు ఇబ్బందులు ఎదుర్కొంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సెంటేజ్ సిస్టమ్ కి ఒప్పుకోకపోతే.. మల్టీప్లెక్స్ లోనూ ప్రదర్శించబోమని కొందరు షాకిచ్చారు. నిర్మాత చెర్రీ వివరణ: హైదరాబాద్‌లో జరిగిన 'జెట్లీ' సక్సెస్ మీట్‌లో పాల్గొన్న చెర్రీ, ఈ సమస్యపై స్పష్టత ఇచ్చారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య చర్చలు ఏప్రిల్ 30 రాత్రి వరకు జరిగినా ఒక కొలిక్కి రాలేదని ఆయన తెలిపారు. "సింగిల్ స్క్రీన్లలో ఏవైనా సమస్యలు ఉంటే అక్కడే పరిష్కరించుకోవాలి కానీ, మల్టీప్లెక్స్ స్క్రీన్లను అడ్డుపెట్టుకుని ఒత్తిడి తీసుకురావడం సరికాదు" అని డిస్ట్రిబ్యూటర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ఆయన ప్రస్తావించారు. థియేటర్ల సమస్యను పరిష్కరించేందుకు మే 8న ఒక ముఖ్యమైన మీటింగ్ జరగబోతోందని ఆయన వెల్లడించారు. ఈ మీటింగ్‌లో ఇండస్ట్రీ పెద్దలందరూ కూర్చుని చర్చించి ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. 'పెద్ది' విడుదలపై ప్రభావం ఉంటుందా? రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం 'పెద్ది' జూన్ 4న విడుదల కానుంది. ఈ సినిమాపై కూడా ఈ వివాద ప్రభావం ఉంటుందా? అన్న ప్రశ్నకు చెర్రీ సమాధానమిస్తూ.. మే 8న ఫిల్మ్ ఛాంబర్‌లో ఒక కీలక సమావేశం జరగనుందని, అప్పుడు ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 'జెట్లీ' ప్రదర్శనలకు ఎగ్జిబిటర్లు అంగీకరించారని.. నిర్మాతలైనా, ఎగ్జిబిటర్లైనా ఒకే కుటుంబం వంటి వారని ఆయన పేర్కొన్నారు. సినీ పరిశ్రమ నిలబడాలంటే అటు నిర్మాతలు, ఇటు ఎగ్జిబిటర్లు సమన్వయంతో ముందుకు సాగాలి. 'జెట్లీ' వంటి చిన్న సినిమాల నుంచి 'పెద్ది' వంటి భారీ చిత్రాల వరకు అందరికీ థియేటర్ల మద్దతు అవసరం. మే 8న జరగబోయే చర్చలతో ఈ వివాదం ముగిసి, టాలీవుడ్ సాధారణ స్థితికి చేరుకుంటుందని అందరూ భావిస్తున్నారు.  
  విక్టరీ వెంకటేష్(Venkatesh),త్రివిక్రమ్(Trivikram)కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 ఉరఫ్ ఏకే 47(Ak 47)తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అమ్మని ఆవకాయని ఎలా అయితే మర్చిపోమో, ఏకే 47   ని కూడా తెలుగు ప్రేక్షకులు మరిచిపోకుండా చేయాలనే పట్టుదలతో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఆ పట్టుదలని నిజం చేసే బాధ్యతని థమన్(Thaman)కూడా తీసుకున్నాడు.  కొన్ని రోజుల నుంచి  ఏకే 47 కి థమన్ మ్యూజిక్ ని అందించబోతున్నాడనే న్యూస్ సినీ, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇప్పుడు ఆ న్యూస్ కి తధాస్తు దేవతలు తధాస్తు అనేసారు.త్రివిక్రమ్ తో కలిసి ఉన్న ఒక  పిక్ ని థమన్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి  ఆదర్శ కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చానని  తెలిపాడు. ఏకే 47 లో మొదటి సంగీత దర్శకుడు  యానిమల్ ఫేమ్  హర్షవర్ధన్ రామేశ్వర్. also read: Bellamkonda sai sreenivas: నా పెళ్ళాం నిప్పురా అంటున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్   మరి ఏకే 47 కి థమన్ అల వైకుంఠ పురం రేంజ్ లో ట్యూన్స్ ఇచ్చి త్రివిక్రమ్ ని ఖుషి చేస్తాడేమో చూడాలి. వెంకటేష్  తో మాత్రం మూడో మూవీ. షాడో, వెంకీ మామకి థమనే.    
The Tollywood circles are buzzing with a sudden and unexpected change in the music department of director Trivikram Srinivas's highly anticipated family entertainer with Venkatesh Daggubati, tentatively titled Adarsha Kutumbam House No: 47 (AK47). In a surprising twist, music composer Thaman S has officially stepped in to take over the project, replacing Harshavardhan Rameshwar.   What makes this development pure gossip gold is the abrupt nature of the switch. Just days ago, Harshavardhan, who recently caught everyone's attention with his sensational score for Animal, confidently denied any rumors of his exit from the film. However, insiders whisper that the young composer was completely kept in the dark about the change. Word on the street is that without any formal intimation or discussion with Harshavardhan, Trivikram went ahead and roped in his trusted collaborator, Thaman.   Thaman even took to social media to share a picture with the director, confirming the start of their new musical journey together. The exact reasons for this unceremonious exit remain a closely guarded secret, though industry murmurs hint at sudden creative differences. Whatever the actual truth may be, this quiet but drastic replacement has definitely set tongues wagging across the Telugu film industry.     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బ్యాచులర్ లైఫ్ కి ఎండ్ కార్డు ఇచ్చేసి కావ్యరెడ్డితో ఇక నేను నీ మొగుడ్ని అని చెప్పిన విషయం తెలిసిందే. బెల్లంకొండ కూడా కళ్ళు తెరిచే మూసే లోపే  తిరుమల తిరుపతి ఏడుకొండల వాడి పాదాల దగ్గర పెళ్లి, హైదరాబాద్ లో రిసిప్షన్ చక చక జరిగిపోయాయి. సోషల్ మీడియా కూడా ఆ వేడుక చకచకా అయిపోయిందని డల్ గా ఉన్న సమయంలో బెల్లంకొండ చేసిన నా పెళ్ళాం నిప్పురా పోస్ట్ సోషల్ మీడియాని కళకళ లాడేలా చేస్తుంది. పూర్తి డీటెయిల్స్ చూద్దాం.  బెల్లంకొండ రీసెంట్ గా ట్విట్టర్ లో కావ్యరెడ్డిని పరిచయం చేస్తూ ‘నా పెళ్ళాం నిప్పురా' అనే పోస్ట్ చేసి పెళ్లి ఫోటోలు షేర్ చేసాడు. దీంతో  ఎందుకు అలా పోస్ట్ చేసాడో అనేది కొంత మందికి అర్ధం కాలేదు. తాను నటించిన జయ జానకి నాయక మూవీలో నటుడు జయప్రకాష్, రకుల్ ప్రీత్ సింగ్ ,శ్రీనివాస్ పై ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. జయప్రకాశ్ కూతురుగా రకుల్ కనిపించింది. సదరు సీన్ యొక్క ఉదేశ్యం ప్రకారం  రకుల్ ప్రీత్ సింగ్ ని ఉద్దేశిస్తూ  నీ కూతురు నిప్పురా అనే  డైలాగ్ ని బెల్లకొండ చెప్తాడు. ఆ డైలాగ్ నే పోస్ట్ చేసి    మంచి ఫన్ ని క్రియేట్ చేసాడు.   Also read: Kiara Advani: యష్ తో చేసిన ఆ బోల్డ్ సీన్స్ తొలగించండి.. కియారా రిక్వెస్ట్!          
విజయ్ ఆంటోని (Vijay Antony), శశి దర్శకత్వంలో వచ్చిన ‘బిచ్చగాడు’, అందులోని అమ్మ పాటకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఇప్పటికీ అమ్మ పాట అంటే అందరూ ఆ పాటనే ఎంచుకుంటారు. మళ్లీ అలాంటి ఓ ఎమోషనల్ మదర్ సాంగ్‌తో విజయ్ ఆంటోని, శశి ఆడియెన్స్ ముందుకు వచ్చారు. వీరి కాంబోలో ‘బిచ్చగాడు’ తరువాత ‘వంద దేవుళ్ళు’ (Vanda Devullu) అనే సినిమా రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌, టీజర్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా ‘వంద దేవుళ్ళు’ నుంచి ‘అమ్మ అమ్మేగా’ అంటూ అమ్మ గొప్పదనం గురించి చెప్పే పాటను విడుదల చేశారు. వంద దేవుళ్లే దిగివచ్చినా అని భాష్యశ్రీ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేశారో.. మళ్లీ ఇప్పుడు ‘అమ్మ అమ్మేగా’ అని అందరినీ మెప్పించేందుకు వచ్చారు. ‘అమ్మ అమ్మేగా’ అనే ఈ పాటకి భాష్యశ్రీ సాహిత్యం, బాలాజీ శ్రీరామ్ బాణీ, శ్రీకాంత్ హరిహరణ్ గాత్రం అన్నీ అద్భుతంగా కుదిరాయి. ఈ పాటను వింటే అమ్మ విలువ ఏంటో మరోసారి అర్థం అయ్యేలా ఉంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమాకి ఎస్. బి. దర్శన్ కిర్లోష్ కెమెరామెన్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పని చేశారు. హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా, భాష్య శ్రీ డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు. ఈ మూవీని సమ్మర్ కానుకగా మే నెలలో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.  
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో భారీ సినిమా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. బాలకృష్ణ నటిస్తున్న 112వ సినిమా ఇది. 'NBK112' వర్కింగ్ టైటిల్ రూపొందుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో బాలయ్య ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. కొరటాల మార్క్ పొలిటికల్ డ్రామా దర్శకుడు కొరటాల శివ తన సినిమాల్లో సామాజిక బాధ్యతతో కూడిన అంశాలను చర్చిస్తూనే, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను అద్భుతంగా జోడిస్తారు. గతంలో 'భరత్ అనే నేను' సినిమాలో మహేష్ బాబును ముఖ్యమంత్రిగా చూపించి మెప్పించిన కొరటాల, ఇప్పుడు బాలయ్య కోసం అంతకు మించిన పవర్‌ఫుల్ పొలిటికల్ డ్రామాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.  "పవర్ మీట్స్ పర్పస్.. మాస్ బికమ్స్ ఏ మూవ్‌మెంట్" (Power Meets Purpose.. Mass Becomes A Movement) అనే క్యాప్షన్‌తో విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమా మూడ్‌ను క్లియర్ గా ఎలివేట్ చేస్తోంది. ఈ కథలో బాలయ్య మార్క్ డైలాగులు, కొరటాల మార్క్ మేకింగ్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రిగా నటసింహాం గర్జన బాలకృష్ణకు రాజకీయ నేపథ్యంలో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో 'అధినాయకుడు' వంటి చిత్రాల్లో రాజకీయ నాయకుడిగా కనిపించినా.. ఇప్పుడు కొరటాల శివ డిజైన్ చేసిన సీఎం పాత్ర చాలా హుందాగా, అదే సమయంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా ఉంటుందని టాక్. సమాజంలోని అవినీతిని అంతం చేసే ఒక నిజాయితీ గల నాయకుడిగా బాలయ్య నటన ఈ సినిమాకు హైలైట్ కానుంది అంటున్నారు. బాలకృష్ణ మాస్ ఇమేజ్, కొరటాల శివ క్లాస్ మేకింగ్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైనట్లే. ముఖ్యంగా ముఖ్యమంత్రి పాత్రలో బాలయ్యను ఊహించుకుంటేనే అభిమానులకు పూనకాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.  
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని మీకు తెలుసా? హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ 'ఆయుర్వేద పాన్' అద్భుతంగా పనిచేస్తుంది. గుండె రక్తనాళాల్లో అడ్డంకులను (Blockages) తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడే ప్రత్యేక ఆయుర్వేద పాన్/తాంబూలం తయారీ విధానం మరియు దాని ప్రయోజనాలు ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హార్ట్ స్పెషల్ తాంబూలం తయారీని వివరించారు: ఈ ఆయుర్వేద తాంబూలానికి కావలసినవి: తమలపాకు: ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఔషధ గుణాలను రక్తంలోకి త్వరగా చేరుస్తుంది. అర్జున చెట్టు బెరడు చూర్ణం: గుండె పనితీరును మెరుగుపరచడంలో ఇది అగ్రగామి. వెల్లుల్లి: రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును (Cholesterol) కరిగించి, అడ్డంకులను తొలగిస్తుంది. అల్లం లేదా సొంఠి: రక్త ప్రసరణను సాఫీగా చేస్తుంది. దాల్చిన చెక్క: రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎలా తీసుకోవాలి? వీడియోలో చూపిన విధంగా, తమలపాకులో ఈ మూలికలను సరైన మోతాదులో ఉంచి, తాంబూలంలా చప్పరిస్తూ తీసుకోవాలి. ఇది రక్తాన్ని పల్చగా ఉంచి, గడ్డకట్టకుండా (Blood Clots) చేయడంలో సహాయపడుతుంది. ప్రయోజనాలు: గుండె రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె కండరాలను దృఢంగా మారుస్తుంది. అధిక రక్తపోటు (BP) సమస్యను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.   మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి! సూచన: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ప్రయత్నించాలి.
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే వేసవిలో పిత్త తత్వం మరింత చురుకుగా ఉంటుంది, ఇది కడుపులో మంట, జీర్ణ సమస్యలు , అలసటకు దారితీస్తుంది. అందువల్ల, ఆయుర్వేదం కొన్ని రకాల ఆహారాలను తినమని , మరికొన్నింటిని తినకుండా ఉండమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం చెప్పిన తినాల్సిన, తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. వేసవిలో ఏం తినాలి? వేసవిలో శరీరం బాగా వేడెక్కి, పిత్త దోషం పెరుగుతుంది. అందువల్ల, తేలికైన, చల్లని ఆహారాలు తినడం చాలా అవసరం. కర్బూజా, పుచ్చకాయ, మామిడి వంటి తాజా పండ్లు శరీరాన్ని చల్లబరిచి, కోల్పోయిన నీటిని తిరిగి అందిస్తాయి. చల్లని పాలు , పెరుగు శరీరాన్ని చల్లబరుస్తాయి. జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి. పీచుపదార్థాలు అధికంగా ఉండే సలాడ్‌లు , తేలికపాటి కూరగాయలు జీర్ణక్రియను సులభతరం చేసి, కడుపులో వేడి అసమతుల్యతను నివారిస్తాయి. చల్లని జ్యూస్‌లు , కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్‌లను అందించి, శరీరాన్ని తేమగా ఉంచుతాయి. వేసవిలో ఏం తినకూడదు? వేసవిలో వేయించిన , బరువైన ఆహారాలకు దూరంగా ఉండాలి,  అవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి, కడుపులో వేడిని పెంచుతాయి. అందుకే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక మసాలాలు గల వంటకాలతో పాటు, కాఫీ , టీ వంటి కెఫిన్ పానీయాలు,  అధిక నూనె లేదా తీపి పదార్థాలు పిత్త దోషాన్ని పెంచి, శరీరాన్ని అసమతుల్యం చేస్తాయి. వేసవిలో కెఫిన్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. రోజులో ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడి, శక్తిని నిలుపుతుంది.   శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉండాలంటే, తేలికైన, నీరు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.   చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల పైత్యరసం అదుపులో ఉండి, వేసవిలో అలసట , చికాకును నివారిస్తుంది.                                *రూపశ్రీ.