LATEST NEWS
ఒక దేశంలోని 150 కోట్ల మంది ప్రజలను ఎల్లకాలం మోసం చేయడం సాధ్యమేనా? ఒక మహా సామ్రాజ్యాన్ని నిరంతరం ఏలగలరా? అంటే అది అసాద్యం అన్న సమాధానమే వస్తుంది.   నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కాక్రోచ్‌ లు వీధుల్లోకి వచ్చాయి! ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ  కాక్రోచ్ జనతా పార్టీ  రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.   సరిహద్దు గోడలు, ముళ్ల కంచెలు, పోలీసు లారీలు, వాటర్ క్యానన్లు, లాఠీచార్జీలు... వీటివేవీ   యువత ఆక్రోశాన్ని, ఆగ్రహాన్నీ  ఆపలేకపోతున్నాయి. పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, వ్యవస్థాగత అవినీతి, ప్రశ్నించే గొంతుకలపై నిర్బంధాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటం కేవలం ఒక మంత్రి రాజీనామాకో, పరీక్షల రద్దుకో పరిమితం కాదని, ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యమని ఉద్యమకారులు చెబుతున్నారు.   మతం, కులం, వర్గం ఆధారంగా పౌరుల మధ్య వ్యత్యాసం చూపే విభజన రాజకీయాలను ఎండగడుతూ, ఎలాంటి ఆయుధాలు లేకుండానే శాంతియుతంగా జరుగుతున్న ఈ ఉద్యమం ప్రస్తుత పాలక వ్యవస్థ పునాదులను కదిలించివేస్తున్నది.     Delhi students protest,  Cockroach Janata Party,  Competitive exam paper leak, Demand for Education Ministers resignation
దేశవ్యాప్తంగా ప్రస్తుతం నీట్   లీకేజీ వ్యవహారం   కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీ వీధుల నుంచి మొదలైన విద్యార్థుల నిరసన జ్వాలలు దేశమంతటికీ వ్యాపించాయి. తమ భవిష్యత్తు, విద్యా హక్కుల రక్షణ కోసం లక్షల మంది విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. ఎలాంటి జకీయ ప్రమేయం లేకుండా,   విద్యార్థుల హక్కుల కోసం సాగుతున్న ఈ  పోరాటానికి జనబాహుల్యం నుంచి విశేష మద్దతు లభిస్తోంది.    ఇక్కడే.. ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది.   జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ   మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని   జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.   రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక  అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ,  నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైసిపి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీల్లో విద్యార్థులు, నిరుద్యోగ యువత, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరింది. వైసిపి ప్రధానంగా మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నీట్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని,  ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తోంది. నీట్ వివాదంతో డీఎస్సీని ముడిపెట్టడం ద్వారా యువతలో ఆందోళన రేకెత్తించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. నీట్ పరీక్షల తీవ్రతకు, ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ అంశానికి అసలు పోలికే లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భవిష్యత్తుతో ముడిపడిన నీట్ వ్యవహారం జాతీయ మీడియాలో, సుప్రీం కోర్టులో,  పార్లమెంటులో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో వైసీపీ లేవనెత్తుతున్న ఏపీ డీఎస్సీ విషయంలో స్థానికంగా అంటే రాష్ట్రంలో కూడా పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు.   జాతీయ స్థాయిలో హోరెత్తుతున్న ఒక స్వచ్ఛంద  విద్యార్థి ఉద్యమంలోకి, రాష్ట్రంలో కూడా ఎవరూ ప్రాధాన్యత ఇవ్వడానికి ముందుకు రాని డీఎస్సీ అంశాన్ని తీసుకురావాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నం వృధా ప్రయాసే, కాకుండా ఆ ప్రయత్నాలు వైసీపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.   YCP NEET Protests, AP Mega DSC Issue, YSRCP July 28 Rally
  దేశవ్యాప్తంగా నీట్  పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి. భావి వైద్యుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందంటూ విద్యార్థులు, యువజన సంఘాలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపడుతుండగా, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలపై టోన్ న్యూస్ వాస్తవ వేదిక కార్యక్రమంలో తెలుగువన్‌ మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో విశ్లేషణాత్మకంగా చర్చ నిర్వహించారు.   పార్లమెంటు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ లీకేజీ బాధ్యులైన 13 మందిని అరెస్ట్ చేశామని, కఠిన శిక్షలు అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ, ఈ ప్రతిస్పందన సమస్య తీవ్రతకు తగినట్లు లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ పరిస్థితి – విద్యార్థుల ఆగ్రహం నీట్ వివాదం కేవలం ఒక పరీక్ష అక్రమానికి పరిమితం కాకుండా తీవ్ర రాజకీయ రూపం దాల్చింది. ఈ వివాదంలో ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేయాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది.  విద్యార్థుల ఆవేదనను, భయాందోళనలను పరిష్కరించడంలో ప్రభుత్వం నెమ్మదిగా స్పందిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గతంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన సుదీర్ఘ రైతు ఉద్యమం మాదిరిగానే, ఈ నీట్ ఆందోళన కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది.వ్యూహం  అంతర్లీన రాజకీయాలుఈ ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని పరిశీలిస్తే, ఆందోళన తీవ్రతను తగ్గించి, కాలక్రమేణా దాన్ని సర్దుమణిగేలా చేయడం అనే వ్యూహం కనిపిస్తోంది.  ప్రస్తుత తరం విద్యార్థులు తమ కెరీర్, చదువుపై ఎక్కువ దృష్టి పెడతారని, హింసాత్మక లేదా తీవ్రస్థాయి ఉద్యమాల్లో సుదీర్ఘకాలం పాల్గొనలేరనే అంచనాతో ప్రభుత్వం 'సైలెంట్ వెయిట్ అండ్ వాచ్' విధానాన్ని అనుసరిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌ను తిరస్కరించడం ద్వారా తన పట్టును నిలబెట్టుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, ఇది విద్యార్థుల ఆవేదనను మరింత పెంచుతోంది.  కేంద్ర ప్రభుత్వంలో జరగాల్సిన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ  వాయిదా పడటానికి కూడా ఈ రాజకీయ ఒత్తిళ్లే కారణమనే ప్రచారం సాగుతోంది.  రాజకీయ పరిణామాలు  భవిష్యత్ ప్రభావం నీట్ వివాదాన్ని సకాలంలో మరియు పారదర్శకంగా పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఇది తీవ్ర రాజకీయ పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. యువతలో నమ్మకం సడలడం: దేశంలోని కోట్లాది మంది యువత, విద్యార్థులలో పరీక్షల వ్యవస్థ మరియు విద్యాశాఖ నిర్వహణపై నమ్మకం దెబ్బతింటుంది. ప్రతిపక్షాలకు బలమైన ఆయుధం.. రానున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విద్యార్థుల నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాన ప్రచార అంశాలుగా మారతాయి.  విద్యా సంస్కరణల ఆవశ్యకత: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వంటి సంస్థల స్వయంప్రతిపత్తి, నిర్వహణ లోపాలను సరిదిద్దకపోతే, విద్యా వ్యవస్థ విశ్వసనీయత శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ముగింపుగా, విద్యార్థుల ఆవేదనను కేవలం రాజకీయ కోణంలో కాకుండా, వ్యవస్థాగత లోపాలను సరిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగవంతమైన, పారదర్శకమైన చర్యలు చేపడితేనే ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.   NEET Controversy, NEET Paper Leak, Dharmendra Pradhan Resignation, Narendra Modi, Vaastava vedika, NTA, Kanthamneni Ravi Shankar
ఒక అమ్మాయి అడిగిన ఒక్క ప్రశ్న... మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు...? అని  ఆ ప్రశ్నకు... ఎవరూ సమాధానం చెప్పలేదు.  నమస్తే...చరిత్రలో...కొన్ని రోజులు...క్యాలెండర్‌లో ఒక తేదీగా మాత్రమే మిగిలిపోతాయి.కానీ...కొన్ని రోజులు మాత్రం...ఒక దేశం...తన భవిష్యత్తును...తన చేతులతో రాయడం మొదలుపెట్టిన రోజులుగా నిలిచిపోతాయి. ఇప్పుడు...నేను మీకు చెప్పబోయేది...రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.   ...ఢిల్లీ వీధుల్లో...వేలాది మంది యువత నడిచారు. వాళ్ల చేతుల్లో...తుపాకులు లేవు.కత్తులు లేవు.రాళ్లు కూడా లేవు.ఉన్నదల్లా...కొన్ని ప్లకార్డులు...కొన్ని ప్రశ్నలు...ఆపై ... భవిష్యత్తుపై భయం. ఆ వీడియోలు...నేను చాలాసార్లు చూశాను. ప్రతిసారి...ఒకే ప్రశ్న...నా మనసులో వినిపించింది. ఒకవేళ...ఆ పోలీసుల ముందు నిలబడి... మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు...?' అని అడుగుతున్నది...నా కూతురే అయితే...?  ఆ ఒక్క ఆలోచనే...గుండెను భారంగా మార్చేసింది. జంతర్ మంతర్...గత కొన్ని వారాలుగా...ఒక నిరసన వేదికగా మారింది. మొదట...నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి...బాధ్యత వహిస్తూ...కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కొంతమంది విద్యార్థులు...నిరాహార దీక్ష ప్రారంభించారు. రోజులు గడిచాయి.ఆ నిరసన...కొద్దిమంది నుంచి...వందల మందికి...వందల మంది నుంచి...వేల మందికి చేరింది.  అలా     సోమవారం...పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజున..ఆ యువత... చలో సంసద్ అని పిలుపునిచ్చింది. ప్రభుత్వం...ముందుగానే సిద్ధమైంది.నగరాన్ని...నాలుగైదు భద్రతా జోన్లుగా విభజించింది.రాపిడ్ యాక్షన్ ఫోర్స్...సీఆర్పీఎఫ్...ఢిల్లీ పోలీసులు...ఇంకా భారీ బలగాలను మోహరించింది.మెట్రో స్టేషన్లు మూసివేసింది.కొన్ని ప్రాంతాల్లో...ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అన్ని ఏర్పాట్లు...చేసి...ఆ యువత...పార్లమెంట్ గేటు దగ్గరకు చేరకుండా ఆపాలనుకుంది. కానీ...జరిగింది మాత్రం...వేరే. వేలాది మంది యువత...అన్ని అడ్డంకులను దాటుకుంటూ...ముందుకు దూసుకొచ్చారు. పోలీసులు...లాఠీలు ఎత్తారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు.అయినా...వాళ్లు వెనక్కి తగ్గలేదు. ఒక్కసారి...ఆ వీడియోలను...చుడండి.ఒక అమ్మాయి...పోలీసుల ముందు నిలబడి...భయంతో కాదు...ఆవేదనతో...ఒక్క ప్రశ్న అడుగుతోంది. "ఆప్ హమే క్యూ మార్ రహే హై...?" "మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు...?" ఆమె గొంతులో...కోపం లేదు.ద్వేషం లేదు.ఉన్నదల్లా...ఒక సమాధానం కోసం ఎదురుచూస్తున్న...అసహాయత. మరో వీడియోలో...ఒక మహిళా కార్యకర్త...పోలీసుల వైపు తిరిగి...గట్టిగా ప్రశ్నిస్తోంది. "ఆప్ లడ్కియోంకే కప్డే క్యూ ఫాడ్ రహే హై...?" "అమ్మాయిల బట్టలు ఎందుకు చింపేస్తున్నారు...?" ఆ ప్రశ్న...ఒక పోలీసును కాదు.ఒక వ్యవస్థను నిలదీస్తోంది.    ఆ రోజు...ఢిల్లీ వీధుల్లో...కేవలం ఒక నిరసన జరగలేదు.ఒక ప్రశ్న...దేశమంతా వినిపించింది.ఆ ప్రశ్న...ప్రభుత్వాన్ని మాత్రమే కాదు...అందరినీ ఆలోచింపజేసింది. "ఈ యువత...కేవలం ఒక పరీక్ష కోసం పోరాడుతోందా...?లేక...తన భవిష్యత్తు కోసం పోరాడుతోందా...?" ఇంకో వీడియో...ఇంకా బాధాకరం.చుట్టూ...డజన్ల కొద్దీ పోలీసులు.మధ్యలో...ఒక్కడే యువకుడు.లాఠీలు...వర్షంలా కురుస్తున్నాయి.కానీ...అతను...వెనక్కి తగ్గలేదు.పైగా...పోలీసుల కళ్లలోకి...నేరుగా చూస్తూ...ఒకే మాట అంటున్నాడు. "మారో...ముఝే ఔర్ మారో...""ఇంకా కొట్టండి..." ఆ మాటలో...నొప్పి ఉంది.కానీ...భయం మాత్రం లేదు. ఇలా ఎంతో మంది యువతీ యువకులు గాయాల  పాలై రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి లో చేరారు... ఆ రోజు...అది ఒక ఆసుపత్రి మాత్రమే కాదు. ఆ నిరసన...ఎంత తీవ్రంగా అణచివేయబడిందో...చెప్పిన...మౌన సాక్షిగా నిలిచింది. ఈ యువత...కేవలం...నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ గురించే...రోడ్డు మీదికి వచ్చిందా...?" లేదు..."ఈ యువతను...కేవలం...ఒక పరీక్ష...రోడ్డు మీదికి తీసుకురాలేదు. ఏళ్లుగా...వారి మనసుల్లో పేరుకుపోయిన...నిరాశ...నిరుద్యోగం...చాలీచాలని జీతాలు...వ్యవస్థపై నమ్మకం కోల్పోవడం...ఇవన్నీ...ఒకేసారి...పేలిపోయాయి.  ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే .జంతర్ మంతర్‌కు వచ్చిన...చాలామంది యువతను...ఏ రాజకీయ పార్టీ...బస్సులు పెట్టి తీసుకురాలేదు. ఎవరూ...డబ్బులు ఇచ్చి పిలవలేదు.ఎవరూ...రైళ్లు ఏర్పాటు చేయలేదు. మరి ఎలా జరిగింది..? సోషల్ మీడియాలో...ఒక చర్చ మొదలైంది. ఆ చర్చ...ఒక పిలుపుగా మారింది.ఆ పిలుపు...వేల అడుగులుగా మారింది. దాని పేరే క్రాకోచ్..    కాక్రోచ్ దండు... ఒక్క బొద్దింకను...ఎవరైనా...సులభంగా తొక్కేయొచ్చు. కానీ...వేల బొద్దింకలు...ఒకేసారి...కదలడం మొదలుపెడితే...వాటిని...అంత సులభంగా...ఆపలేరు. ఈ ఉద్యమం కూడా...అలాంటిదే. ఇది...ఒక పార్టీ ఉద్యమం కంటే...ఒక తరం...తన భవిష్యత్తు గురించి...అడుగుతున్న ప్రశ్నగా...మారింది. కానీ...ఈ యువతను...ప్రభుత్వం...సరైన సమయంలో...అర్థం చేసుకుందా...? లేక... శాంతిభద్రతల సమస్యగా మాత్రమే...చూసిందా...? చాలామంది అనుకుంటున్నారు...ఇది...ఒక రాజకీయ పార్టీ ఉద్యమమని.కానీ...నేను చూసింది మాత్రం...అది కాదు.నాకు కనిపించింది...దిక్కుతోచని...ఒక తరం. జంతర్ మంతర్‌కు వచ్చిన...ఆ యువతను...ఒక్కసారి గమనించండి. దేశం నలుమూలల నుంచి...వేల మంది యువత...ఢిల్లీకి ఎలా వచ్చారు...? ఒకప్పుడు...మనుషులను..రోడ్ల మీదకు తీసుకొచ్చేది...రాజకీయ పార్టీలు.ఇప్పుడు...ఒక మొబైల్ ఫోన్...ఒక వీడియో...ఒక పోస్ట్...ఒక రీల్...చాలు.అదే...వేల అడుగులను...ఒకే దారిలో నడిపిస్తోంది. ఈ యువత...కేవలం...నీట్ ప్రశ్నపత్రం కోసం...రోడ్డు మీదకు వచ్చిందా...? నాకు మాత్రం...అలా అనిపించడం లేదు. ఇది...ఏళ్లుగా...వారి మనసుల్లో...నిశ్శబ్దంగా పేరుకుపోతున్న...నిరాశ. ఉద్యోగాల కోసం...ఎదురుచూస్తూ...అలసిపోయిన కళ్ల బాధ. చదివినా...భవిష్యత్తు కనిపించక...ఆగిపోయిన అడుగుల బాధ. చాలీచాలని జీతాలతో...కలలను...రోజూ కొంచెం కొంచెంగా...చంపుకుంటున్న...ఒక తరం బాధ. ఇవన్నీ...ఒకేసారి...బయటకు వచ్చాయి. ఈ తరం...గతాన్ని చూసి...రోడ్డెక్కలేదు.ఎమర్జెన్సీని... చూడలేదు.జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం...వాళ్లకు జ్ఞాపకం లేదు.మండల్...కమండల్...వాళ్ల రాజకీయ అనుభవంలో భాగం కాదు. వాళ్లు...చరిత్ర పుస్తకాలు చదివి...ప్రశ్నించడం లేదు.తమ జీవితాన్ని చూసి...ప్రశ్నిస్తున్నారు. అందుకే...ఈ తరాన్ని...తప్పు అని చెప్పలేం. రైట్ అని కూడా చెప్పలేం. వాళ్లు...ఒక సిద్ధాంతాన్ని కాదు...ఒక సమాధానాన్ని వెతుకుతున్నారు.వాళ్ల చేతుల్లో...జెండాల కంటే...మొబైల్ ఫోన్లు ఎక్కువ. వాళ్ల నోట...నినాదాల కంటే...ప్రశ్నలే ఎక్కువ.  ఒకప్పుడు...టెలివిజన్...ఏది చూపిస్తే...దేశం అదే చూసేది. ఇప్పుడు...దేశం...తన ఫోన్‌లో...తానే చూసేది నమ్ముతోంది. ఒక వీడియో...లక్షల మందికి చేరుతోంది. ఒక ప్రశ్న...కోట్ల మందిలో...ప్రతిధ్వనిస్తోంది. ఇప్పుడు...వార్తలు...ప్రజల దగ్గరకు వెళ్లడం లేదు.ప్రజలే...వార్తలుగా మారుతున్నారు. అలా...ఈ ఉద్యమం...ముందు...సోషల్ మీడియాలో పుట్టింది. తర్వాత...జంతర్ మంతర్‌కు చేరింది.చివరికి...పార్లమెంట్ గేటు వరకు...నడిచింది. ఈ ఉద్యమం...ఒక పార్టీ చేస్తున్న ఉద్యమంలా  కనిపించలేదు.సమాధానం కోసం...దేశాన్ని నిలదీస్తున్న...ఒక తరం లా కనిపించింది....అదే...ఇక్కడ...అత్యంత ప్రమాదకరమైన విషయం కూడా. ఎందుకంటే... ప్రశ్నలు అడగడం మొదలుపెట్టిన తరం...సమాధానం దొరికే వరకు...ఆగదు. కానీ...ప్రశ్న...ఇంకా మిగిలే ఉంది.ఈ యువత...రోడ్డు మీదికి వచ్చింది.ఆ తర్వాత...ఏమైంది...? మొదట...వాళ్లది...ఒక సాధారణ నిరసనగా చూశారు. తర్వాత...ఒక శాంతిభద్రతల సమస్యగా చూశారు.ఆ తర్వాత...లాఠీలతో...చెదరగొట్టాలని ప్రయత్నించారు.కానీ...ఒక విషయం...ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఒక మనిషిని...ఆపొచ్చు.వంద మందిని...భయపెట్టొచ్చు.కానీ...ఒక తరం...ప్రశ్నించడం మొదలుపెడితే...దాన్ని...లాఠీలతో ఆపలేం. బహుశా...అందుకేనేమో...ఇది...ముందు జరిగిన ఉద్యమాల్లా కాదు.వాళ్లు...ఎవరో చెప్పారని...నమ్మరు. చూసినదాన్ని...విన్నదాన్ని...తమంతట తామే...ప్రశ్నిస్తారు.సమాధానం...సంతృప్తికరంగా అనిపించకపోతే...మళ్లీ ప్రశ్నిస్తారు. ప్రతిపక్షాలు...తమ బాధ్యతను...ఎంతవరకు నిర్వర్తించాయి...? ప్రభుత్వం...ప్రజల ఆందోళనలను...ఎంతవరకు వినగలిగింది...?ఈ ప్రశ్నలకు...కాలమే సమాధానం చెబుతుంది.కానీ...ఒక విషయం మాత్రం...ఈ రోజు స్పష్టంగా కనిపిస్తోంది. రోడ్డు మీద నిలబడ్డ...ఆ యువత...కేవలం...ఈ రోజు గురించి మాట్లాడటం లేదు.రేపటి గురించి...మాట్లాడుతోంది.   ప్రజాస్వామ్యంలో...ప్రశ్న అడగడం...నేరం కాదు. ప్రశ్నను వినకుండా ఉండిపోవడమే...ప్రమాదం. అందుకే వాళ్ళు నిరసనను తీవ్రతరం చేసారు.  చరిత్ర...మనకు...ఒక విషయం నేర్పింది. మార్పు...ఎప్పుడూ...గొప్ప నాయకులతోనే...ప్రారంభం కాదు.కొన్నిసార్లు...ఒక చిన్న ప్రశ్నతో మొదలవుతుంది. ఆ ప్రశ్న...ఒక గొంతు నుంచి...వంద గొంతులకు...వేల గొంతులకు...చివరికి...ఒక దేశం గొంతుగా మారుతుంది. బహుశా...ఈరోజు...మనమూ...అలాంటి ఒక క్షణాన్నే...చూస్తున్నామేమో. నేను...మీరు...మనందరం...చరిత్రలో మరో పేజీ తిరుగుతున్న శబ్దాన్ని...వింటున్నామేమో.  చివరికీ ప్రతి ఉద్యమం...ఒకే కారణంతో పుట్టకపోవచ్చు. కానీ...ప్రతి ఉద్యమం వెనుక...ఒక అసంతృప్తి మాత్రం ఉంటుంది. యువత అసంతృప్తిని అర్థం చేసుకొని ప్రభుత్వం దానిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని ఆశిద్దాం...      Batons witnessed blood of  innocent, Jantarmantar, Agitation, Youth, Question, Nation, Future
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. ఇటీవల కొంత కాలంగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్న వల్లభనేని వంశీ ఈ లేఖ ద్వారా తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నించారు.  ఆయన రాసిన లేఖలో   పోలవరం కుడి కాల్వ ద్వారా పట్టిసీమ నీటిని గన్నవరం   మెట్ట భూములకు   సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ మోటార్ల నిలిపివేత చర్యలను తక్షణమే సమీక్షించి ఉపసంహరించుకోవాలని  కోరారు. అయితే విశేషం ఏమిటంటే.. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు. ఆ లేఖలో గతంలో తాను గన్నవరం ఎమ్మెల్యేగా   కాలంలో అధికారుల నుంచి అనేక అభ్యంతరాలు వచ్చినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు చొరవతోనే  నిరాటంకంగా పట్టిసీమ నీటిని మెట్ట ప్రాంతాలకు అందించగలిగామని  పేర్కొన్నారు.   అంతే కాదు.. వైసీపీ వట్టి సీమ అంటూ విమర్శలు గుప్పించిన పట్టిసీమను ఆయన అత్యంత ప్రాధాన్యమైన ప్రాజెక్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు.  గన్నవరం ప్రాంత రైతాంగానికి పట్టిసీమ ద్వారా  అందుతున్న ప్రయోజనాలను వివరించారు.  2015లో పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించడం వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులకు ఎంతో మేలు చేకూరిందని పేర్కొన్నారు.  ఆ సమయంలో   తాను గన్నవరం నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఉన్న సంగతిని గుర్తు చేస్తూ..  పోలవరం కుడి కాల్వ పక్కనే ఉన్న మెట్ట ప్రాంత గ్రామాల రైతులకు కూడా పట్టిసీమ నీటిని వినియోగించుకునే సదవకాశాన్ని అప్పటి చంద్రబాబు సర్కార్ కల్పించిందని ప్రశంసలు గుప్పించారు.    Vallabhaneni Vamshi letter to CBN, Praises, Pattiseema, Babu, Vision
ALSO ON TELUGUONE N E W S
తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చిన ఆయన, 'కిల్లింగ్ వీరప్పన్', 'వంగవీటి', 'అటాక్' వంటి విభిన్న చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి దర్శకత్వ మెళకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా తెరకెక్కించిన 'ఆర్ఎక్స్ 100' చిత్రంతో దర్శకుడిగా మారి మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో వచ్చిన 'మహాసముద్రం' అనుకున్న స్థాయిలో అలరించలేకపోయినప్పటికీ, 2023లో గ్రామీణ నేపథ్యంతో వచ్చిన మిస్టీరియస్ థ్రిల్లర్ 'మంగళవారం' చిత్రంతో మళ్లీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఈ కల్ట్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా 'మంగళవారం 2' రాబోతోందంటూ అజయ్ భూపతి ఇచ్చిన తాజా ప్రకటన టాలీవుడ్‌ వ్యాప్తంగా విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం అజయ్ భూపతి దివంగత ప్రముఖ నటుడు రమేష్ బాబు కుమారుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడైన జయకృష్ణ ఘట్టమనేనిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ 'శ్రీనివాస మంగాపురం' అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ కథానాయికగా టాలీవుడ్‌కు పరిచయం అవుతుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 'వెంకటప్పయ్య నాయుడు' అనే అత్యంత పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్, బ్రహ్మాజీ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్న ఈ ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాకి ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు. జూలై 30న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూల వేదికగానే అజయ్ భూపతి తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మంగళవారం 2' గురించి సంచలన నిజాలను వెల్లడించారు. 'మంగళవారం 2' ఖచ్చితంగా తెరకెక్కుతుందని, ఈసారి ప్రేక్షకులు అస్సలు ఊహించని రీతిలో నెక్స్ట్ లెవెల్ మైండ్ బ్లాకింగ్ థ్రిల్స్ ఉండబోతున్నాయని అజయ్ భూపతి స్పష్టం చేశారు. మొదటి భాగంలో కేవలం గ్రామీణ మిస్టరీ, మానసిక అంశాలు ప్రధానంగా సాగితే, ఈ సీక్వెల్‌లో మాత్రం పూర్తిస్థాయి సూపర్ నేచురల్ క్యారెక్టర్స్ ప్రేక్షకాభిమానులను భయపెట్టి థ్రిల్ చేయబోతున్నాయని చెప్పారు. ప్రతి సన్నివేశం ఆడియన్స్‌ను సీటు అంచున కూర్చోబెట్టేలా చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాను 'శ్రీనివాస మంగాపురం' సినిమా విడుదలతో బిజీగా ఉన్నానని, ఆ మూడ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చి 'మంగళవారం 2' ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి కాస్త సమయం పడుతుందని ఆయన వివరంగా తెలియజేశారు. ఇక ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న ఆసక్తికరమైన సమాచారం ప్రకారం, అజయ్ భూపతి ఈ సీక్వెల్ కథాంశాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివకు వినిపించారట. కథలోని లైన్, గూస్‌బంప్స్ తెప్పించే ఎలిమెంట్స్ ఎంతగానో నచ్చడంతో కొరటాల శివ తన స్వంత నిర్మాణ సంస్థ 'యువసుధా ఆర్ట్స్' బ్యానర్‌పై ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 1990ల కాలం నాటి మారుమూల గ్రామీణ నేపథ్యంలో సాగే వింత మరణాలు, గోడల మీద రహస్య రాతలు, పాయల్ రాజ్‌పుత్ పోషించిన 'శైలజ' పాత్రలోని అరుదైన మానసిక స్థితి, అజనీష్ లోక్‌నాథ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ 'మంగళవారం' చిత్రానికి ప్రాణం పోశాయి. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రాబోతున్న రెండో భాగంలో అంతకుమించిన సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఏ స్థాయిలో భయపెట్టి అలరించబోతున్నాయో అని సినీ ప్రేమికుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. రూరల్ మిస్టరీకి సూపర్ నేచురల్ టచ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద విజృంభణ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అజయ్ భూపతి మార్క్ రా అండ్ బోల్డ్ టేకింగ్, కొరటాల శివ నిర్మాణ ప్లానింగ్ కలిస్తే 'మంగళవారం 2' టాలీవుడ్‌లో మరో సంచలనంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.   Mangalavaaram 2 Ajay Bhupathi Koratala Siva, Srinivasa Mangapuram 
  చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు కోదండరామిరెడ్డి. ముఖ్యంగా చిరంజీవితో అయితే వరుస బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందించాడు   నాగేశ్వరరావు, కృష్ణతో కూడా అదిరిపోయే హిట్ సినిమాలు ఇచ్చి కమర్షియల్ గా తెలుగు సినిమా ఎదుగుదలలో కీలక భూమిక పోషించాడని చెప్పవచ్చు. కోదండరామి రెడ్డి కొడుకు పేరు వైభవ్ రెడ్డి. ప్రస్తుతం తమిళ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న వైభవ్  టాలీవుడ్‌లో సోలో హీరోగా స్థిరపడలేకపోవడం వెనుక ఉన్న కారణాలు, ప్రస్తుత సినిమా పరిణామాలు, భవిష్యత్తు అవకాశాలపై ఒక లుక్ వేద్దాం. వైభవ్ రెడ్డి 2007లో వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన 'గొడవ' చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టాడు. కోదండరామి రెడ్డి వంటి దిగ్గజ దర్శకుడి వారసుడిగా రావడంతో ఆ  సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత 'గోలమారి' వంటి కొన్ని తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా విజయం సాధించలేకపోయాయి. దీంతో వైభవ్ తన దృష్టిని తమిళ చిత్రసీమ వైపు మళ్లించారు. కోలీవుడ్‌లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన 'సరోజా' చిత్రం వైభవ్ కెరీర్‌ని మలుపు తిప్పింది. ఆ తర్వాత 'గోవా', 'మంగత్తా' (తెలుగులో గ్యాంబ్లర్) వంటి మల్టీస్టారర్ చిత్రాలలో నటించి కోలీవుడ్‌లో ఒక ప్రామిసింగ్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. తమిళంలో 'మేయాద మాన్' వంటి చిత్రాలతో సోలో హీరోగా 10 కోట్లకు పైగా వసూళ్లని  సాధించి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. కెరీర్‌లో ఇప్పటివరకు 25కి పైగా సినిమాల్లో నటించిన వైభవ్, కామెడి, థ్రిల్లర్, డ్రామా విభాగాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. అయితే తమిళంలో సాధించిన ఈ విజయాన్ని తెలుగులో సోలో హీరోగా పునరావృతం చేయడంలో ఆయన తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. తెలుగులో వైభవ్ నటించిన 'అనామిక' లేదా ఇతర ప్రాజెక్టులు మల్టీస్టారర్ లేదా ముఖ్య పాత్రలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ రూపురేఖలు వేగంగా మారుతున్నాయి. టాలీవుడ్‌లో సోలో హీరోగా మార్కెట్ ఏర్పడాలంటే కేవలం వారసత్వం లేదా నటనా నైపుణ్యం మాత్రమే సరిపోవు. సరైన కథల ఎంపిక, బలమైన నిర్మాణ సంస్థల మద్దతు, ప్రమోషన్లు,బాక్సాఫీస్ వద్ద కనీసం15 నుండి 20 కోట్ల వసూళ్లని  రాబట్టగల స్టామినా అవసరం. నేటి రోజుల్లో చిన్న, మధ్య తరహా సినిమాలకు థియేటర్లలో ప్రేక్షకులు రావడం పెద్ద సవాలుగా మారింది. అలాగే OTT ప్లాట్‌ఫారమ్‌ల రాకతో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. కొత్తగా వచ్చే సోలో హీరోలు యూనిక్ కాన్సెప్ట్‌లతో వస్తేనే థియేటర్లకు జనాలు వస్తున్నారు. Also read: అగస్ట్ 1 న థియేటర్స్ లోకి వచ్చేస్తున్నా..మీరు రెడీనా!  ఈ పరిస్థితుల్లో వైభవ్ రెడ్డి తెలుగులో నేరుగా సోలో హీరోగా నిలదొక్కుకోవడం కష్టమేనా అంటే, పూర్తిగా కాదని చెప్పలేం కానీ అత్యంత సవాలుతో కూడుకున్న విషయమనే చెప్పాలి. కోలీవుడ్‌లో ఆయనకున్న మార్కెట్ మరియు క్రేజ్ తెలుగులో లేదు. అక్కడ వరుస ఆఫర్లు వస్తుండటంతో, తమిళ సినిమాల పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అయితే ప్రస్తుతం పాన్-ఇండియా సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో, వైభవ్ తమిళంలో చేసే విభిన్నమైన కాన్సెప్ట్ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయి మంచి విజయం సాధించే అవకాశం ఉంది. అంతేకాకుండా, OTT సిరీస్‌లు మరియు నెట్‌ఫ్లిక్స్, ఆహా వంటి ప్లాట్‌ఫారమ్‌లలో వస్తున్న వెబ్ ప్రాజెక్టులు వైభవ్‌కి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. సోలో హీరోగా కాకుండా శక్తివంతమైన పాత్రలు లేదా మల్టీస్టారర్ సినిమాల ద్వారా తెలుగులో రీ ఎంట్రీ ఇస్తే  తిరుగులేని ఆదరణ లభించే అవకాశం ఉంది. chiranjeevi, balakrishna, vaibhav reddy, kondanda ramireddy
కంటెంట్ బాగుండి స్నేహం నేపథ్యంగా వచ్చిన అనేక చిత్రాలకి ప్రేక్షకుల ఆదరణ ఎక్కువ. ఆ కోవలోనే స్నేహానికి నిజమైన అర్థాన్ని, దానికోసం చేసే త్యాగాలని  అత్యంత తీవ్రమైన భావోద్వేగాలతో ఆవిష్కరించిన అరుదైన చిత్రాల్లో 'శంభో శివ శంభో' ఒకటి. 2010 సంవత్సరంలో విడుదలైన ఈ సంచలన చిత్రం, అప్పట్లో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. మాస్ మహారాజా రవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీల త్రయం తమ అద్భుతమైన నటనతో వెండితెరపై మైమరిపించారు. నటుడు, దర్శకుడు సముద్రఖని తెరకెక్కించగా ,ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఇప్పుడు, దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఈ ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.  ఆగస్టు 1వ తేదీన అంతర్జాతీయ 'ఫ్రెండ్‌షిప్ డే'  పురస్కరించుకుని 'శంభో శివ శంభో' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఈసారి కేవలం సాధారణ రీ రిలీజ్ మాత్రమే కాకుండా, అత్యాధునిక 4K డిజిటల్ క్వాలిటీ, రీ మాస్టర్డ్ ఆడియో సాంకేతికతతో సరికొత్త దృశ్యరూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.  రీ-రిలీజ్ హంగామాను ముందే మొదలుపెడుతూ చిత్రయూనిట్ అభిమానులకు ఒక మాస్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది. శనివారం సాయంత్రం సరిగ్గా 5:04 గంటలకి  ప్రత్యేక 4K ట్రైలర్‌ను ప్రముఖ ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ నాటి జ్ఞాపకాలను రిఫ్రెష్ చేయడమే కాకుండా, రీ-రిలీజ్ వేడుకలకు మరిన్ని ఊపునిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి  టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.  సోషల్ మీడియాలో ఇప్పటికే మూవీకి  సంబంధించిన ప్రత్యేక పోస్టర్లు  వైరల్ అవుతూ ట్రెండ్ సృష్టిస్తున్నాయి. Also read: చిరంజీవి ఇంట్లో బాలకృష్ణ షూటింగ్.. వైరల్ గా మారిన క్రేజీ అప్డేట్  కర్ణ, సుధాకర్, చందు అనే ముగ్గురు స్నేహితుల మధ్య ఉండే అమితమైన బంధం, ఒక స్నేహితుడి ప్రేమ పెళ్లి కోసం వారు చేసే ప్రాణ త్యాగాలు, ఆ తర్వాత ఎదురయ్యే సమాజపు ఒడిదుడుకులు ఈ చిత్రంలో ఎంతో అద్భుతంగా  చిత్రీకరించబడ్డాయి. ప్రియమణి, అభినయ కథానాయికలుగా చెయ్యగా  ప్రతి ఒక్క క్యారక్టర్ ప్రేక్షకుల హృదయాలని నేరుగా హత్తుకుంటుంది.    
Varun Tej's upcoming horror comedy Korean Kanakaraju appears to have scored its first big victory even before hitting theatres. The film has reportedly generated an impressive Rs. 26 crore through its non-theatrical rights, putting the makers in a comfortable position ahead of its worldwide release on August 7. Trade circles suggest the film has been mounted on a budget of around Rs. 38 crore, meaning the production has already recovered a significant portion of its investment through satellite, digital and other non-theatrical deals. This has reportedly strengthened the film's market value, with distributors showing increased interest in acquiring theatrical rights across territories. The buzz surrounding the film has steadily grown ever since its promotional campaign began. The teaser and songs have received a positive response online, while Varun Tej's makeover has become one of the biggest talking points. The actor will be seen in two contrasting avatars—a Rayalaseema youngster and a Korean mob boss—in what is being promoted as a cross-cultural horror comedy. Directed by Merlapaka Gandhi and produced by UV Creations, the film also banks heavily on the comic chemistry between Varun Tej and Satya. With the non-theatrical business already placing the project in a financially secure position, all eyes are now on its theatrical performance. If the current momentum translates into box office numbers, Korean Kanakaraju could emerge as one of the profitable ventures in Varun Tej's career. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి, తమిళ స్టార్ హీరో సూర్య కలయికలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' చుట్టూ ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గతంలో 'లక్కీ భాస్కర్' వంటి భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకని జోరుమీదున్న వెంకీ అట్లూరి, ఈసారి ఏకంగా సూర్యతో జతకట్టడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించగా, సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, పాటలకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. అయితే, తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు వెంకీ అట్లూరి చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. చాలా కాలంగా ఇది తెలుగు, తమిళ ద్విభాషా చిత్రమని అనుకుంటుండగా.. వెంకీ అట్లూరి స్పందిస్తూ ఇది ఔట్ అండ్ ఔట్ తమిళ సినిమానే అని, తెలుగులోకి కేవలం డబ్ మాత్రమే చేశామని స్పష్టం చేశారు. గతంలో ధనుష్‌తో 'సార్ (వాతి)' సినిమా తీసినప్పుడు ద్విభాషా చిత్రంగా ఒకేసారి తెలుగు, తమిళాల్లో చిత్రీకరించే ప్రయోగం చేశామని, కానీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' కథా వస్తువు దృష్ట్యా ముందుగా తమిళంలోనే షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత తెలుగులోకి డబ్ చేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు. సూర్యతో సినిమా చేయాలనేది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, భవిష్యత్తులో ఆయనతో ఖచ్చితంగా ఒక నేరుగా తెలుగు సినిమా చేస్తానని కూడా పేర్కొన్నారు. ఈ వార్త బయటకు రావడంతో టాలీవుడ్‌లోని సూర్య అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు. 'తెలుగులో దత్తపుత్రుడిలా' ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న సూర్య, తెలుగు దర్శకుడితో పని చేస్తూ కూడా స్ట్రెయిట్ తెలుగు సినిమా ఎందుకు చేయలేకపోయారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. 2026 ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ తమిళ డబ్బింగ్ చిత్రం తెలుగు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి వసూళ్లను సాధిస్తుందో వేచి చూడాలి.     Suriya, Viswanath and Sons, Venky Atluri, Mamitha Baiju  
The makers of Pallaburusu have released the film's first single, Kotha Soku, giving audiences a glimpse into the film's rustic world after the title poster and glimpse generated curiosity. Unlike the high-energy action and urban entertainers dominating recent releases, the song leans into the simplicity, humour and warmth of village life. Composed by Pawan Ch, Kotha Soku is sung by Kumara Vagdevi, with lyrics penned by Suresh Gangula. The folk track captures the flavour of rural India through lively visuals and earthy music. The song's picturisation focuses on a lived-in village atmosphere, with vibrant celebrations and quirky moments that reflect everyday rural life. Veteran actor Sudhakar Reddy grabs attention with his energetic screen presence, while his stylish appearance with cooling glasses adds a fun contrast to the traditional setting. Muralidhar Goud, who plays another key role, also features in the film, which promises a different cinematic experience compared to conventional commercial entertainers. Directed by Uday Chauhan, Pallaburusu is presented by Annapurna Studios and produced by Aditya Pittie and Vivek Krishnani. Scheduled to release in theatres on August 14, the film appears to be banking on its rooted storytelling and rural backdrop to stand out. With Kotha Soku setting the tone, the makers are expected to unveil more promotional material in the coming weeks.   Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
ప్రేమకథలకు సరికొత్త భాష్యం చెప్పిన దిగ్గజ దర్శకుడు మణిరత్నం. దశాబ్దాలుగా తనదైన మేకింగ్‌తో, హృదయాన్ని తాకే కవితాత్మక ప్రేమకథలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ వస్తున్నారు. 'మౌనరాగం' సినిమాలో గత ప్రేమను కోల్పోయిన ఒక యువతి పెళ్లి తర్వాత పడే ఆవేదనను హృద్యంగా ఆవిష్కరించినా, 'గీతాంజలి' చిత్రంలో ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న ఇద్దరి మధ్య పూచిన అనురాగాన్ని చూపించినా అది ఒక్క మణిరత్నానికే సాధ్యమైంది. అలాగే బొంబాబ‌యి సినిమాలో విభిన్న మతాల నేపథ్యం ఉన్న జంట సమాజపు ఒత్తిళ్లను ఎదుర్కొంటూ సాగించిన ప్రయాణాన్ని అత్యంత శక్తివంతంగా తెరకెక్కించి లవ్ క్లాసిక్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. కాలం ఎంత మారినా ఆయన అందించిన లవ్ సినిమాలు ఇచ్చిన ఫీల్ ఇప్పటికీ ప్రతి సినీ ప్రియుడి గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు మళ్లీ ఆ వెండితెర మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు మణిరత్నం ఒక భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఏ పాత్ర ఇచ్చినా జీవించేసే విజయ్ సేతుపతి, నేచురల్ బ్యూటీ సాయి పల్లవిలను తొలిసారిగా ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకొస్తున్నారు. మద్రాస్ టాకీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 23గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన నాటి నుంచే సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలు సిసలైన విశేషం ఏమిటంటే.. ఇంకా టైటిల్ కూడా ఖరారు కాని ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే ఇండస్ట్రీలో ఒక కొత్త రికార్డు సృష్టించింది. కేవలం ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ బజ్ చూసి డిజిటల్ రైట్స్ రూపంలో ఏకంగా రూ. 20 కోట్ల (Rs. 20 Crore) భారీ బిజినెస్ ఆఫర్ రావడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఓటీటీ వేదికల మధ్య నెలకొన్న తీవ్ర పోటీ, మణిరత్నం బ్రాండ్ వాల్యూకు, ఈ క్రేజీ కాంబినేషన్‌కు ఉన్న డిమాండ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి చేసిన మేక్ ఓవర్ కూడా సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇన్నాళ్లూ గడ్డం, కాస్త బొద్దుగా ఉండే రఫ్ అండ్ టఫ్ లుక్‌లో కనిపించిన ఆయన, ఈ ప్రేమకథ కోసం తొలిసారి క్లీన్ షేవ్ చేసి, గణనీయంగా బరువు తగ్గి నయా యంగ్ అండ్ హ్యాండ్‌సమ్ లుక్‌లోకి మారిపోయారు. ఇటీవల కలకత్తా ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన ఆయన కొత్త లుక్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చిత్రీకరణ పరంగా మేకర్స్ పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. కలకత్తా పరిసరాల్లో ప్రధాన షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత చెన్నై, పాండిచ్చేరి వంటి మనోహరమైన ప్రదేశాలలో మిగిలిన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఎలాంటి హంగులు లేకుండా భావోద్వేగాలనే నమ్ముకునే మణిరత్నం, నేచురల్ యాక్టర్స్ విజయ్ సేతుపతి, సాయి పల్లవిలతో ఎలాంటి క్లాసిక్‌ను ఆవిష్కరించబోతున్నారో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సమాయత్తమవుతున్నారు.     Mani Ratnam, Vijay Sethupathi, Sai Pallavi
  మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi),గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna).. ఈ ఇద్దరి నుంచి సినిమా వస్తుందంటే చాలు బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు సినిమా చేసే చిందులని చూడటానికి రెండు కళ్ళు చాలవు.   మాస్ అభిమానుల ఆనందాన్ని చూస్తే తెలుగు సినిమా ఎంత అదృష్టం చేసుకుందో కదా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఇద్దరికి సంబంధించిన ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  నారీ నారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari).తెలుగు సినిమా ఒడిలో ఒదిగిన మణిహారం లాంటి మూవీ. సువాసనలతో కూడిన ఈ చిత్రం తాలూకు వైభవం సాంగ్స్ నేటికీ మారుమోగిపోతుంటాయి. విలన్, భారీ ఫైట్స్, చేజింగ్స్, రణగొన ధ్వనులు   అంటూ లేని ఈ మూవీ బాలయ్య తన నట జీవితం మొత్తంలో ఎనీ టైం సగర్వంగా చెప్పుకొనే మూవీ కూడా. ఈ మూవీ షూటింగ్ కి సంబంధించిన లొకేషన్ విషయానికి వస్తే, చెన్నైలోని వేలచ్చేరి ఏరియాలో చిరంజీవికి 'హనీ హౌస్' పేరుతో ఎంతో ఇష్టమైన భారీ గెస్ట్ హౌస్ ఉండేది. 'నారీ నారీ నడుమ మురారి' కి సంబంధించిన షూటింగ్ ని  90 శాతం చిత్రీకరణని ఈ చిరంజీవి గెస్ట్ హౌస్‌లోనే పూర్తి చేశారు.ఆ హౌస్ పక్కనే దాదాపు 2 ఎకరాల విశాలమైన భూమి కూడా చిరు దే. ఆ ల్యాండ్ ని సైతం చిత్ర యూనిట్ ఉపయోగించుకుంది. ఒక అగ్ర హీరో సినిమా షూటింగ్ కోసం మరో అగ్ర హీరో తన ప్రియమైన గెస్ట్ హౌస్‌ను సంతోషంగా కేటాయించడం ఆ ఇద్దరి మధ్య ఉన్న గొప్ప అనుబంధానికి  నిదర్శనంగా నిలిచింది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు ఆ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏ పాటిదో మరో సారి ఇరువురి అభిమానులకి తెలిసొచ్చింది. Also read: jana nayakudu: జన నాయకుడు తెలుగు ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్ !  బాలకృష్ణ నుంచి 1990 సంక్రాంతికి విడుదలైన 'ప్రాణానికి ప్రాణం' మూవీ  ఫ్లాప్ కావడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో, ఏప్రిల్ 27న విడుదలైన 'నారీ నారీ నడుమ మురారి' హిట్ అయి వారికి ఫుల్ జోష్ ఇచ్చింది. ఈ మూవీ విడుదలైన సరిగ్గా 12 రోజులకి  చిరంజీవి నుంచి 'జగదేకవీరుడు అతిలోకసుందరి' విడుదలైంది. ఆ చిత్రం విజయ ప్రభంజనాన్ని నారీ నారీ నడుమ మురారి  తట్టుకొని నిలబడి వంద రోజులు పూర్తి చేసుకుంది..కేవీ మహదేవన్ స్వరపరిచిన పాటలు అన్నీ హిట్టే. చిత్రం విడుదలకు ముందే భారీ స్థాయిలో క్యాసెట్లు అమ్ముడై గోల్డ్ డిస్క్ అందుకుంది. 11 మంది రచయితలు 28 నెలల పాటు చర్చలు జరిపి తయారు చేసిన కథ ఇది. ఫైట్స్, బ్రేక్ డ్యాన్సులు లేకుండా వచ్చి  45 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.. బాలయ్య కి 50 వ చిత్రం. శోభన, నిరోషా హీరోయిన్స్ గా చేయగా, శారద, కైకాల సత్యనారాయణ కీ రోల్స్ లో కనిపించారు.  chiranjeevi, balakrishna, nari nari naduma murari  
తెలుగు చిత్రసీమలో ఘట్టమనేని కుటుంబానికి ఉన్న ఆదరణ, అభిమానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ తన నట విశ్వరూపంతో కోట్లాదిమంది ప్రేక్షకులను అలరిస్తే, ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తన అద్భుతమైన నటన, శైలితో టాలీవుడ్‌లో తిరుగులేని రాజ్యాన్ని ఏలుతున్నారు. ఇప్పుడు అదే ఘట్టమనేని ఘనమైన వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మరో కొత్త నటుడు వెండితెరకు పరిచయమవుతున్నారు. దివంగత నటుడు, నిర్మాత రమేష్ బాబు తనయుడు, మహేష్ బాబు మేనల్లుడైన జయకృష్ణ ఘట్టమనేని కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. అత్యంత భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతూ సెన్సార్ హర్డిల్‌ను విజయవంతంగా దాటేసింది. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి ‘యు/ఎ’ సర్టిఫికెట్ లభించింది. కుటుంబ ప్రేక్షకులు మరియు యూత్ అందరూ కలసి థియేటర్లలో చూడదగ్గ కంటెంట్‌తో ఈ సినిమా రూపొందిందని సెన్సార్ బోర్డ్ స్పష్టం చేసింది. 'ఆర్‌ఎక్స్‌ 100', 'మంగళవారం' వంటి సంచలనాత్మక, విలక్షణమైన చిత్రాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అజయ్ భూపతి కథనాలు ఎప్పుడూ రౌద్రం, రొమాన్స్, ఇంటెన్సిటీతో నిండి ఉంటాయని మనకు తెలిసిందే. ఈ సారి పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రం నేపథ్యంలో ఒక అద్భుతమైన ప్రేమకథను తెరకెక్కించి అందరినీ అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో జయకృష్ణ సరసన బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ కథానాయికగా నటిస్తూ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతోంది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో సాగే ఈ కథలో వాసుబాబుగా జయకృష్ణ, మంగా పాత్రలో రాషా థడానీ కనిపించనున్నారు. చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉన్న వాసుబాబు, మంగా మధ్య చిగురించిన ఆత్మీయమైన ప్రేమ, ఆ తర్వాత వారి జీవితాల్లో అనుకోకుండా ఎదురైన ఒక అనూహ్యమైన సమస్య చుట్టూ ఈ చిత్ర కథాంశం తిరుగుతుంది. ఒక విపత్కర పరిస్థితుల వల్ల వారి సంతోషకరమైన జీవితం ఒడిదుడుకులకు లోనైనప్పుడు, ఎంతటి ప్రమాదం ఎదురైనా సరే తన ప్రేమికురాలి కోసం వాసుబాబు ఏ విధంగా పోరాడాడు అనేదే ఈ చిత్రంలో ప్రధానమైన ఆకర్షణగా నిలవనుంది. ఈ చిత్రంలో మరో ప్రధాన ఆకర్షణ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ పాత్రలో నటించడం. ఆయన నటన, డైలాగ్ డెలివరీ ఈ సినిమాకు ప్రత్యేక బలంగా నిలవనున్నాయి. వైవిధ్యభరితమైన స్వరాలకు పేరుగాంచిన జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి మంత్రముగ్ధులను చేసే సంగీతాన్ని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించారు. దిగ్గజ నిర్మాత అశ్వినీదత్ సమర్పణలో చంద్రమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'శ్రీనివాస మంగాపురం' చిత్రం ఈ నెల జులై 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఘట్టమనేని అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేమికులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ‘యు/ఎ’ సర్టిఫికెట్ లభించడంతో మేకర్స్ ప్రమోషన్లను మరింత వేగవంతం చేశారు. అజయ్ భూపతి మార్క్ ఇంటెన్స్ రొమాన్స్, జయకృష్ణ డెబ్యూ పర్ఫార్మెన్స్, మోహన్ బాబు విలనిజం కలిపి థియేటర్లలో ఏ స్థాయిలో రికార్డులు సృష్టిస్తాయో చూడాలి.     Jaya Krishna Ghattamaneni, Srinivasa Mangapuram, Ajay Bhupathi
కోలీవుడ్ సూపర్‌స్టార్ దళపతి విజయ్ చిత్రంలో నటించే చిన్న అవకాశం దక్కినా చాలు, తమ సినీ కెరీర్ మలుపు తిరుగుతుందని ఎంతోమంది నటీనటులు నిరీక్షిస్తుంటారు. అలాంటి ఒక అద్భుతమైన అవకాశం లభించినప్పుడు పొందే ఆనందం వర్ణనాతీతం. కానీ, ఏడాదంతా శ్రమించి, ఎన్నో ఆశలతో షూటింగ్‌ పూర్తి చేసుకున్న తర్వాత, చివరి క్షణంలో ఆ సన్నివేశాలను సినిమా నుంచి పూర్తిగా తొలగిస్తే ఆ మనోవేదన ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. సరిగ్గా ఇలాంటి ఒక చేదు అనుభవాన్నే తమిళ చిన్నతెర నటి, ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్ ఆనంది అజయ్ అనుభవిస్తున్నారు. విజయ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'జన నాయగన్' నుంచి తన సన్నివేశాలను ఎడిటింగ్‌లో తీసివేసినట్లు తెలుసుకున్న ఆమె తీవ్ర మానసిక ఆవేదనకు గురైంది. తన బాధను తట్టుకోలేక సోషల్ మీడియా వేదికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక భావోద్వేగ వీడియోను పంచుకోవడంతో ఈ వార్త ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆనంది అజయ్ షేర్ చేసిన ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరి హృదయం ద్రవిస్తోంది. తన ఆవేదనను వ్యక్తపరుస్తూ.. ఈ 'జన నాయగన్' సినిమా కోసం తాను దాదాపు 1 సంవత్సరం పాటు ఎంతో కష్టపడి పనిచేశానని ఆమె తెలిపారు. సూపర్‌స్టార్ విజయ్‌గారితో కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించే గొప్ప అవకాశం వచ్చినందుకు మొదట్లో ఎంతో ఉప్పొంగిపోయానని, తన డ్రీమ్ నెరవేరిందని భావించానని చెప్పారు. అయితే ఇప్పుడు తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రం నుంచి పూర్తిగా తొలగించారనే వార్త వినగానే గుండె పగిలినంత పనైందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో 'జన నాయగన్' ఆయన నటిస్తున్న చివరి చిత్రంగా జోరుగా ప్రచారం సాగుతోంది. దాంతో దళపతి విజయ్‌తో కలిసి మళ్లీ పనిచేసే అవకాశం జీవితంలో ఇంకెప్పుడూ రాదనే చేదు నిజాన్ని తట్టుకోలేకే తాను తీవ్ర నిరాశలో కూరుకుపోయానని ఆమె వివరించారు. ఈ కన్నీటి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే అభిమానులు, నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. చిన్నతెరపై ఎంతో ప్రతిభ చూపిన నటికి ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం పట్ల చాలామంది సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. "మీ బాధను మేము మనస్ఫూర్తిగా అర్థం చేసుకోగలము. పరిశ్రమలో ఇలాంటి ఒడుదొడుకులు సాధారణం. ధైర్యంగా ఉండండి, మేము ఎల్లప్పుడూ మీ వెంట ఉంటాం" అంటూ కామెంట్ల రూపంలో ధైర్యం చెబుతున్నారు. అలాగే "ప్రతి సంఘటన వెనుక ఒక మంచి కారణం ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించి, త్వరలోనే అంతకంటే పెద్ద కథానాయిక పాత్రలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి" అని మరికొందరు నెటిజన్లు భరోసా కల్పిస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు అందిస్తున్న ఈ అపూర్వమైన మద్దతు, ప్రేమాభిమానాలు ప్రస్తుతం ఆనందికి కొంతవరకు ఊరటనిస్తున్నాయి. ఇక ఆనంది అజయ్ ప్రయాణాన్ని గమనిస్తే, ఆమె తమిళ చిన్నతెర ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన నటి. 'కార్తిగై పెంగళ్', 'యమునా', 'కనా కానుమ్ కాలంగళ్' వంటి ప్రజాదరణ పొందిన సూపర్ హిట్ టీవీ సీరియల్స్ ద్వారా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నటనే కాకుండా ఆమె అద్భుతమైన క్లాసికల్ డ్యాన్సర్ మరియు క్రమం తప్పకుండా సాధన చేసే యోగా ప్రాక్టీషనర్ కూడా. బుల్లితెరపై ప్రసారమైన 'డ్యాన్స్ జోడీ డ్యాన్స్ 3.0', 'జోడీ నెం.1' వంటి ప్రతిష్టాత్మక డ్యాన్స్ రియాలిటీ షోలలో తన అద్భుతమైన నృత్య ప్రతిభతో వేలమంది అభిమానులను సంపాదించుకున్నారు. వెండితెరపై దళపతి విజయ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే ఆమె ఆశ నెరవేరకపోవడం వృత్తిపరంగా తీవ్ర నిరాశ కలిగించినప్పటికీ, ఆమె నటనపై ఉన్న అంకితభావం, అభిమానుల తోడ్పాటుతో ఆమె మున్ముందు మరిన్ని మంచి అవకాశాలు సాధిస్తారని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి.     Aanandhi Ajay, Jana Nayagan, Thalapathy Vijay   https://www.instagram.com/reel/DbJF-GTzZuV/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
అంతులేని అలసట వెనుక అసలు కారణం ఏమిటి..డాక్టర్ చెప్పిన నిజాలు.! రోజంతా అలసటగా, నీరసంగా అనిపిస్తుందా? ఎంత విశ్రాంతి తీసుకున్నా శరీరంలో శక్తి లేకపోతే, అది కేవలం సాధారణ అలసట మాత్రమే కాకుండా Chronic Fatigue Syndrome (CFS) అనే ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణులు డా. చిట్టిభొట్ల మధుసూదన శర్మ గారు Chronic Fatigue Syndrome గురించి సులభమైన భాషలో వివరించారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: Chronic Fatigue Syndrome అంటే ఏమిటి? సాధారణ అలసటకు, Chronic Fatigue Syndrome కు ఉన్న తేడా ఏమిటి? ఈ సమస్య వచ్చే ప్రధాన కారణాలు ఏమిటి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి? ఈ సమస్యను తగ్గించేందుకు జీవనశైలిలో చేయాల్సిన మార్పులు సరైన ఆహారం, నిద్ర, వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిపుణుల సూచనలు ఎప్పుడూ అలసటగా ఉండటం, ఏ పని చేయాలన్నా శక్తి లేకపోవడం, ఏకాగ్రత తగ్గిపోవడం వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. సరైన సమయంలో కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ సమస్యను నియంత్రించుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవుతూ ఉండండి. గమనిక: ఈ వీడియోలో అందించిన సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సలహా, నిర్ధారణ లేదా చికిత్స కోసం వైద్య నిపుణులను సంప్రదించండి.  
తిన్న వెంటనే గ్యాస్ వస్తుందా..అయితే మీరు చేస్తున్న తప్పులు ఇవే..! నేటి కాలంలో రోజులో మూడు పూటలా ఆహారం తీసుకోవడం కామన్.  ఉదయం టిఫిన్, మద్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తప్పకుండా చేస్తారు. చాలామంది ఉదయం సమయంలో టిఫిన్ స్కిప్ చేస్తే గ్యాస్ సమస్యలు వస్తాయని,  ఆహారం సమయానికి తినకపోతే గ్యాస్ సమస్యలు వస్తాయని చెబుతుంటారు. కానీ కొందరికి ఒక సమస్య ఉంటుంది. అదే ఆహారం తినగానే గ్యాస్ సమస్య రావడం. రోజూ మూడు పూటలా ఆహారం తింటున్నా సరే.. గ్యాస్ సమస్య ఎందుకు వస్తోంది అనేది చాలామందికి అర్థం కాదు.. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. ఇప్పటి కాలంలో చాలామందికి తొందరగా తినడం అలవాటు.  ఆహారాన్ని వేగంగా మింగినప్పుడు దాన్ని సరిగ్గా నమలలేం. ఆహారాన్ని పూర్తిగా నమలడం అనేది జీర్ణక్రియలో మొదటి , అత్యంత ముఖ్యమైన దశ, ఎందుకంటే నోటిలోని లాలాజలం ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. ఆహారం సరిగ్గా నమలకుండా కడుపులోకి ప్రవేశిస్తే, దానిని జీర్ణం చేయడానికి కడుపు మరింత కష్టపడాల్సి వస్తుంది, దీనివల్ల గ్యాస్ , బరువుగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి చాలా మందికి భోజనం చేసేటప్పుడు లేదా తిన్న వెంటనే ఎక్కువగా నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. దీనివల్ల కడుపులోని జీర్ణరసాలు పలుచబడి, సరైన జీర్ణక్రియ జరగదు. ఫలితంగా గ్యాస్, అజీర్ణం కలుగుతాయి. జీర్ణక్రియ సరిగ్గా జరగాలంటే, భోజనానికి సుమారు అరగంట ముందు లేదా భోజనం చేసిన గంట తర్వాత నీళ్లు తాగడం మంచిది. తిన్న వెంటనే మంచం మీద పడుకోవడం లేదా నిద్రపోవడం కూడా గ్యాస్ ఏర్పడటానికి ఒక ప్రధాన కారణం. పడుకోవడం వల్ల కడుపులోని ఆహారం , ఆమ్లం పైకి వచ్చి, కడుపు ఉబ్బరం, గ్యాస్ , గుండెల్లో మంటకు కారణమవుతాయి. తిన్న తర్వాత కనీసం 20 నుండి 30 నిమిషాల పాటు నిటారుగా కూర్చోవడం లేదా తేలికపాటి నడక  జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అతిగా వేయించిన, మసాలా దినుసులు లేదా నూనెతో కూడిన ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది . ఇవి కడుపుపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ ఆహారాలను అధిక పరిమాణంలో తినడం వల్ల గ్యాస్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా, రాజ్మా బీన్స్, శనగలు , క్యాబేజీ వంటి కొన్ని కూరగాయలు , పప్పుధాన్యాలు కూడా సహజంగా గ్యాస్ ను ఉత్పత్తి చేసే  ఆహారాలుగా  పరిగణిస్తారు, కాబట్టి వాటిని సరైన పరిమాణంలో , సరిగ్గా వండిన తర్వాత తినడం ముఖ్యం. ఆహారం తింటూ ఎక్కువగా మాట్లాడటం, వేగంగా శ్వాస తీసుకోవడం, లేదా స్ట్రాతో తాగడం వంటివి కూడా కడుపులోకి గాలి చేరడానికి కారణమవుతాయి. ఈ విధంగా మింగిన గాలి కడుపు ఉబ్బరానికి, గ్యాస్ కు కూడా కారణం కావచ్చు. అందువల్ల, నిశ్శబ్దంగా, సౌకర్యవంతంగా, తక్కువ మాట్లాడుతూ తినడం మంచిది. పైన చెప్పుకున్న ఐదు అలవాట్లు ఎవరిలో అయినా ఉంటే వారు తప్పకుండా గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. నెమ్మదిగా తినడం, ఆహారాన్ని బాగా నమలడం, భోజనాల మధ్య అధికంగా నీరు త్రాగకుండా ఉండటం, తిన్న వెంటనే పడుకోకుండా ఉండటం, బరువైన , వేయించిన ఆహారాలను తగ్గించడం,  నిశ్శబ్దంగా తినే అలవాటును అలవర్చుకోవడం వంటివి గ్యాస్ సమస్యను తగ్గించుకోవడంలో సహాయపడతాయి.                                  *రూపశ్రీ.  
టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రమాదం.! మధుమేహం అనేది వేగంగా పెరుగుతున్న ఒక  వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ వ్యాధి బారిన 10 కోట్లకు పైగా యువకులు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ఒక్కసారి మధుమేహం వచ్చిందంటే.. దాన్ని నయం చేయలేము. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప దాన్ని నియంత్రణలో ఉంచుకోలేం. మధుమేహంలో రెండు రకాలు ఉన్నాయి. టైప్ 1 ,  టైప్ 2 గా మధుమేహాన్ని పరిగణిస్తారు.  అయితే  వీటిలో ఏ రకం ఎక్కువ ప్రమాదకరం.. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటిస్ మధ్య తేడా..   టైప్ 1 డయాబెటిస్.. టైప్ 1 డయాబెటిస్‌లో, క్లోమం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడం పూర్తిగా ఆపేస్తుంది, దీనివల్ల రోగి ప్రతిరోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవలసి వస్తుంది. టైప్ 2 డయాబెటిస్.. టైప్ 2 డయాబెటిస్‌లో, శరీరం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది, కానీ ఆ ఇన్సులిన్ సరిగ్గా ఉపయోగపడదు. ఈ పరిస్థితిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీర్ఘకాలం పాటు ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఏది ఎక్కువ ప్రమాదకరమైనది? రక్తంలో చక్కెర స్థాయిలను ఎక్కువ కాలం నియంత్రించకపోతే మధుమేహం ప్రమాదకరంగా మారుతుంది. ఈ నియంత్రణ లేకపోవడం వల్ల కళ్ళు, మూత్రపిండాలు, గుండె, మెదడు , ఇతర అవయవాలకు గణనీయమైన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. టైప్ 1 డయాబెటిస్‌లో, ఇన్సులిన్ తీసుకోకపోవడం వల్ల డయాబెటిక్ కీటోయాసిడోసిస్ అనే తీవ్రమైన పరిస్థితి వచ్చే ప్రమాదం పెరుగుతుంది, ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. టైప్ 2 మధుమేహం సంవత్సరాల తరబడి ఎలాంటి లక్షణాలు లేకుండా ఉండవచ్చు. మూత్రపిండాలు, కళ్ళు, గుండె లేదా నరాలు వంటి ఇతర అవయవాలపై మధుమేహం ప్రభావం చూపినప్పుడు చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ బయటపడుతుంది. టైప్ 2 మధుమేహం నియంత్రణ.. వైద్యుల ప్రకారం, టైప్ 2 మధుమేహాన్ని నియంత్రించడం వల్ల దాని ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి,  బరువును అదుపులో ఉంచుకోవాలి,  సమతుల్య ఆహారం తీసుకోవాలి,   తగినంత నిద్రపోవాలి,  ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. టైప్ 1 డయాబెటిస్‌ను నియంత్రణ.. జీవనశైలి మార్పుల ద్వారా టైప్ 1 మధుమేహాన్ని నియంత్రించలేము. టైప్ 1 మధుమేహానికి ఇన్సులిన్ ఇంజెక్షన్లు తప్పనిసరిగా తీసుకోవాలి.                                            *రూపశ్రీ.