LATEST NEWS
కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం: మే 30న కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్!  కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర నాయకత్వంలో  మార్పు  చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం (మే 30) నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.   ఢిల్లీ వేదికగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంతర్గత చర్చల అనంతరం అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చడంలో డీకే శివకుమార్   కీలక పాత్ర పోషించారు. నాటి నుంచి ఆయనకు సీఎం పీఠం దక్కుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ, సీనియార్టీ దృష్ట్యా అధిష్టానం సిద్ధరామయ్యకు తొలి ప్రాధాన్యత ఇచ్చింది. అయితే తాజాగా మారిన సమీకరణాల నేపథ్యంలో రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.   ఈ అధికార బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా  చకచకా సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని అంటున్నారు. అధిష్టానం సూచనల మేరకు  రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఆ వెంటనే నూతన సీఎం ఎంపిక ప్రక్రియ లాంఛనంగా ముగుస్తుందని అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్ శనివారం (మే30)  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు  ముహూర్తం కూడా ఖరారైందని అంటున్నారు.  ఇందుకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటనే తరువాయి అని అంటున్నారు.  కర్ణాటకలో గత ఎన్నికల ఫలితాల సమయంలోనే ముఖ్యమంత్రి పదవి విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీపడ్డారు.   ఆ సమయంలో అధిష్టానం ఇద్దరు నేతలను ఒప్పించి అధికార పంపకాల ఫార్ములాను కుదిర్చినట్లు వార్తలు వచ్చాయి. అందులో భాగంగానే ఇప్పుడు నిర్ణీత కాలపరిమితి ముగియడంతో సిద్ధరామయ్య తప్పుకుని, శివకుమార్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   రానున్న రెండు రోజుల్లో ఈ నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన మరియు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.   
  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ మరోసారి తీవ్ర రాజకీయ దుమారానికి, తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. పార్టీ పటిష్టత, భవిష్యత్తు కార్యాచరణను సమీక్షించేందుకు అత్యున్నత స్థాయిలో ఏర్పాటు చేసిన ఒక ప్రతిష్టాత్మక సమావేశం, ఊహించని విధంగా నేతల మధ్య వీధిపోరాటంగా మారిపోయింది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలంపై చర్చించేందుకు ఈ కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.  అయితే, సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే నేతల మధ్య అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ తీవ్ర ఘర్షణకు ప్రధాన కారణం ప్రోటోకాల్ వివాదమేనని తెలుస్తోంది. సీనియర్ నాయకులకు దక్కాల్సిన గౌరవం, ప్రాధాన్యత విషయంలో ఇరు వర్గాల మధ్య మొదలైన చిన్నపాటి వాగ్వాదం, చూస్తుండగానే పెద్ద వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ హజారీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ, నీవా-నేనా అన్నట్లుగా దూషణలకు దిగారు. వాతావరణం వేడెక్కడంతో పరస్పరం చొక్కాలు పట్టుకుని భౌతిక దాడులకు దిగడం అక్కడ ఉన్న వారందరినీ షాక్‌కు గురిచేసింది.  తీవ్ర ఉద్రేగానికి లోనైన ఉస్మాన్ హాజారీ, ఫిరోజ్‌ఖాన్‌పై నేరుగా చేయిచేసుకుని చెంపదెబ్బ కొట్టడంతో ఆయన కింద పడిపోయారు. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ ఘోరమైన ఘర్షణ అంతా రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్ వంటి అత్యున్నత స్థాయి ముగ్గురు కీలక నేతల సమక్షంలోనే జరగడం గమనార్హం. దాదాపు వంద మందికి పైగా పార్టీ కార్యకర్తలు, సమన్వయకర్తలు ఉన్న ఆ హాల్‌లోనే ఈ భౌతిక దాడి జరగడం పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసింది. సమావేశ మందిరంలో గొడవ పెద్దది కావడంతో ఇరు వర్గాల అనుచరులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు తోపులాటకు దిగారు. దీంతో గాంధీ భవన్‌ ఆవరణ మొత్తం కేకలు, నినాదాలతో రసాభాసగా మారింది. అక్కడ ఉన్న మంత్రులు, సీనియర్ నేతలు ఇరువర్గాలకు నచ్చజెప్పి, శాంతింపజేసేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నేతలు ఎవ్వరూ శాంతించకపోవడంతో, తీవ్ర అసహనానికి గురైన మంత్రులు తమ సమీక్షా సమావేశాన్ని మధ్యలోనే, అర్ధాంతరంగా ముగించుకుని అక్కడి నుంచి వెనుదిరిగారు.  నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించడం పక్కన పెడితే, ఇలా సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం కార్యకర్తల్లో తీవ్ర నైరాశ్యాన్ని నింపుతోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడమే కాకుండా, విపక్షాలకు ఒక బలమైన అస్త్రంగా దొరికినట్లయింది.
తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేశ్ మహానాడు వేదికగా సంచలన ప్రకటన చేశారు.  తెలుగుదేశం  పార్టీలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు  పేర్కొన్న ఆయన మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని  చెప్పారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసైనా, అవ్వకపోయినా, తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి తీరుతాం అని మహానాడు వేదికగా లోకేష్ ప్రకటించారు.  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నారా లోకేశ్ తొలిసారిగా మహానాడులో పాల్గొన్నారు. అంతకుముందు రోజు తాను ఒక భారీ ప్రకటన చేయబోతున్నట్లు సామాజిక మాధ్యమ వేదికగా లోకేష్ చేసిన పోస్టుతో ఆ ప్రకటన ఏమై ఉంటుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.  అందుకు తగ్గట్టుగానే.. పార్టీ అంతర్గత రాజకీయాల్లో మహిళలకు 33 శాతం సీట్ల కేటాయింపును ప్రకటిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయంపై మహిళా నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  తెలుగుదేశం పార్టీ  పండుగ  మహానాడు సందర్భంగా  మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు  తెలుగుదేశం జెండాను ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాపకుడు   నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 
తెలుగుదేశం   మహానాడు   బుధవారం (మే 27) ఘనంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోని ప్రధాన వేదిక వద్ద ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఉదయం  ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రసంగంతో  కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా  మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది.  టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా  మహానాడు వేదికగా ఆయన   తొలి ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే ఆయన మధ్యాహ్నం 12 గంటలకు  ఓ  భారీ ప్రకటన చేయనున్నానంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన వ్యాఖ్యతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అసలు లోకేష్ ఏం ప్రకటన చేయనున్నారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.  లోకేష్ పోస్టుపై నెటిజనులు ఓ రేంజ్ లో స్పందిస్తున్నారు. లోకేష్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆయన ప్రయాణం సక్సెస్ ఫుల్ గా జరగాలంటూ నెట్టింట లోకేష్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.  
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బుధవారం (మే 27) హస్తినలో పర్యటించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత విజయ్ ఢిల్లీ వెళ్లడం ఇదే మొదటి సారి.  విజయ్ హస్తిన పర్యటన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అవుతాయి. విజయ్ ఢిల్లీ పర్యటేన కేవలం ఒక మర్యాదపూర్వకంగా మాత్రమే కాకుండా,  తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా  సాగనుందని సమాచారం ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో   రాష్ట్ర  అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చిం చే అవకాశం ఉన్నాయని అంటున్నారు.  ముఖ్యంగా  పారిశ్రామిక  రంగ అభివృద్ధి,  సంక్షేమ పథకాలు,   మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి  కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు.   ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో  కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.  కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలపై నిర్మలాసీతారామన్ తో సీఎం విజయ్ చర్చించే అవకాశం ఉంది.  బుధవారం ( మే 28) ఉదయమే  చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న విజయ్.. వరుస భేటీలతో బిజీబిజీగా ఉన్నారు. ఇదే రోజు రాత్రి ఆయన తిరిగి చెన్నై చేరుకుంటారు.  ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పెద్దలతో జరుపుతున్న తొలి అధికారిక భేటీ కావడంతో, తమిళనాడు ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర హక్కుల సాధనలో విజయ్ ఎలాంటి ముద్ర వేయబోతున్నారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ALSO ON TELUGUONE N E W S
ప్రముఖ అగ్ర నిర్మాత దిల్ రాజు(Dil Raju)రీసెంట్ గా జరిగిన సమ్మర్‌ హాలీడేస్‌(Summer HOlidays)మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి  ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన మాటల ద్వారా ప్రస్తుత సినీ పరిశ్రమ ఎదుర్కుంటున్న  గడ్డు పరిస్థితులని  వివరిస్తూ ఇండస్ట్రీ వర్గాల్లో ఒక పెద్ద చర్చకు తెరలేపారు. ఆయన మాట్లాడుతు గతంలో కంటే ఇప్పుడు థియేటర్లకి  ప్రేక్షకులని  తీసుకురావడం అనేది నిర్మాత,దర్శకులకి  ఒక అతిపెద్ద సవాల్‌గా మారింది. కమర్షియల్ ఫార్ములాలు, రొటీన్ కథలతో వచ్చే చిత్రాలకి  ప్రేక్షకులు మునుపటిలా స్పందించడం లేదు. అందుకే థియేటర్ల వైపు వారు అడుగులు వేయడం తగ్గించేశారు.దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం ఎవరూ ఊహించని విధంగా అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఉంది. ఈ నిజాన్ని బహిరంగంగా ఒప్పుకోవడానికి చాలా మంది వెనకాడుతుంటారు. కానీ నేను  మాత్రం ఈ చేదు నిజాన్ని చెప్పడానికి అస్సలు భయపడను. ఇలాంటి క్లిష్ట సమయంలో చిత్ర పరిశ్రమని మళ్లీ గాడిన పెట్టే బాధ్యత కొత్త దర్శకులు, చిన్న చిత్రాలపైనే ఉంది.  కొత్త వాళ్లతో, వినూత్నమైన కాన్సెప్టులతో సినిమాలు చేసినప్పుడే చిత్ర పరిశ్రమకి  కొత్త ఊపిరి అందుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ మనుగడ సాగించాలన్నా, థియేటర్లు కలకలలాడాలన్నా వైవిధ్యమైన కంటెంట్ చాలా అవసరమని పేర్కొన్నారు. చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయాన్ని సాధిస్తే, తెలుగు సినీ పరిశ్రమ అంత ఆరోగ్యంగా, పటిష్టంగా ముందుకు సాగుతుంది 'సమ్మర్‌ హాలీడేస్‌' లాంటి వినూత్న ప్రయత్నాలే ప్రేక్షకులని  మళ్లీ థియేటర్ల సీట్లలో కూర్చో బెడతాయి. aslo read: ప్రైమ్ వీడియోలో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. చీకటి పడితే తలుపులు క్లోజ్ చేసుకోవాల్సిందే  కొత్త దర్శకులు కేవలం స్టార్ హీరోల వెంటే పడకుండా, కథ బలాన్ని నమ్ముకుని అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కొత్త ఆలోచనలతో వచ్చే యువ దర్శకులు తమ ప్రతిభతో పరిశ్రమని  నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న సినిమాల ద్వారానే చాలా మంది దర్శకులు ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని , మంచి పేరును తెచ్చుకుంటున్నారని గుర్తు చేశారు. ఇండస్ట్రీలో ఒడిదొడుకులు సహజమే అయినప్పటికీ, ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా మారకపోతే  మనుగడ కష్టం. ఈ కష్టకాలాన్ని దాటడానికి చిన్న సినిమాలు, విభిన్నమైన కథాంశాలే ఏకైక మార్గమని చెప్పుకొచ్చాడు. దిల్‌ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌ వ్యాప్తంగా తీవ్ర హాట్ టాపిక్‌గా మారాయి. ఇండస్ట్రీ అసలు పరిస్థితిని ఉన్నదున్నట్లుగా ధైర్యంగా మాట్లాడిన ఆయన నిజాయితీని పలువురు అభినందిస్తున్నారు.    
సెల్యులాయిడ్ పై సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకి ఉండే క్రేజే వేరు. ఆ కోవలోనే  ప్రేక్షకులని అలరించిన సరికొత్త మరాఠీ మిస్టరీ థ్రిల్లర్  ‘సాల్బర్డి’(salbardi)ఇప్పుడు ఓటీటీ ప్రియులని అలరించడానికి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులో ఉంది. ప్రముఖ నటి పూజా సావంత్  కీ రోల్ పోషించగా గ్రామీణ నేపథ్యంలో సాగే అంధవిశ్వాసాలు, రహస్య మరణాల చుట్టూ తిరుగుతుంది. ఏప్రిల్ 17, 2026న థియేటర్లలో విడుదలవ్వగా నెల రోజుల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. ఓటీటీలో సస్పెన్స్ ఎలిమెంట్స్ ఇష్టపడే ప్రేక్షకులకు ఇదొక చక్కటి ఎంపికగా నిలుస్తోంది.  కథ మొత్తం 'సాల్బర్డి' అనే ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రామంలో వరుసగా 10 సంవత్సరాల లోపు వయసున్న చిన్నపిల్లలు, ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక్కడే ఉన్న మగపిల్లలు ఒకరి తర్వాత ఒకరు అదృశ్యమవుతూ, శవాలై కనిపిస్తుంటారు. ఈ వింత మరణాలు గ్రామంలో తీవ్ర భయాందోళనలని  రేకెత్తిస్తాయి. గ్రామస్థులంతా ఇది ఏదో క్షుద్ర శక్తులు, అపశకునాల వల్లే జరుగుతోందని నమ్ముతుంటారు. ఈ మిస్టరీని ఛేదించడానికి 'మనోరమ' అనే పవర్‌ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ ఆ గ్రామానికి వస్తుంది. ఆమె కేసు దర్యాప్తును లోతుగా విచారించే కొద్దీ, గ్రామంలోని ఒక పాత బంగళాకి  సంబంధించిన భయంకరమైన నల్లటి నిజాలు, స్థానిక రాజకీయ నాయకుల కుతంత్రాలు బయటపడతాయి. గ్రామస్థుల నుండి ఎదురయ్యే తీవ్ర వ్యతిరేకత, రాజకీయ ఒత్తిళ్లని  అధిగమించి ఆమె ఈ కేసుని  ఎలా ముగించిందనేదే అసలు కథ. Also read: Upendra: హీరో ఉపేంద్ర ఇంట్లో పెళ్లి బాజాలు.. వరుడు కూడా ప్రముఖ హీరోనే రమేష్ సాహెబ్‌రావ్ చౌదరి దర్శకత్వం వహించగా రోహిత్ శుక్రే స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. నటన పరంగా పూజా సావంత్ పోలీస్ ఆఫీసర్ మనోరమ పాత్రలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ప్రధాన బలంగా నిలిచింది.  సోనాలి కులకర్ణి, గష్మీర్ మహాజని ప్రత్యేకమైన క్యారెక్టర్స్ లో  మెరిశారు. శశాంక్ షెండే, భరత్ గణేష్‌పురే, ఓంకార్ భోజనేలు తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి అమర్ మోహిలే అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ భయానక వాతావరణాన్ని మరింత పెంచింది. బుక్‌మై షోలో 600 కంటే ఎక్కువ ఓట్లతో 8.6/10 రేటింగ్‌ని, అలాగే ఐఎమ్‌డిబి (IMDb) లో ఏకంగా 9.1/10 రేటింగ్‌ను సొంతం చేసుకుని ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవారు అమేజాన్ ప్రైమ్ వీడియోలో ఈ 2 గంటల 25 నిమిషాల సస్పెన్స్ రైడ్‌ ని  మిస్ అవ్వకండి.    
Shah Rukh Khan agreed to be part of Superstar Rajinikanth's Jailer 2 but he pulled out due to date issues and his commitment to appear for the first time in a particular salt and pepper look in his next, King. Now, the industry gossip is that makers of Jailer 2 are discussing with Hrithik Roshan about the same role.  As a senior officer when Rajini is in a tough situation, this character will help and take story forward, it seems. Hence, Nelson Dilipkumar, the writer-director, is very particular about a big star acting in it. Even though it might delay the release further, he wants to complete shoot with a big star and cannot remove the portion at any cost, according to the reports.  Before Hrithik Roshan, the makers considered Pawan Kalyan, but he declined as he is busy with politics and duties as Deputy CM of AP. Currently, talks are going on with Roshan and soon, they are planning to complete shoot for his portions and release the film by 3rd September.  Already, Mohanlal and Shiva Rajkumar, who appeared in Jailer have shot for their portions along with Vijay Sethupathi. Now, they are waiting for a big star to accept and conclude the shoot. After completing edit and post production of Jailer 2, Nelson will take a 6-month break and start working on KHXRK movie.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual accuracy of the reports. While we do try to do thorough research, some sources could misguide or be untruthful. So, we would encourage viewers' discretion before reacting to them.
  కన్నడ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న రియల్ స్టార్ ఉపేంద్ర గురించి టాలీవుడ్ ప్రేక్షకులకి  కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలక్షణ నటన, విభిన్నమైన సబ్జక్ట్స్ తో  భారీ సంఖ్యలో కల్ట్ ఫ్యాన్స్ ని కూడా సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ విలక్షణ నటుడి ఇంట్లో ఘనంగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఉపేంద్ర అన్న సుధీంద్ర కుమార్, వీణ దంపతుల కుమారుడు, యువ హీరో నిరంజన్ సుధీంద్ర త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ మేరకు  మే 25వ తేదీన సోమవారం నాడు బెంగళూరులోని ఒక ప్రముఖ ప్రైవేట్ రిసార్ట్‌లో నిరంజన్ సుధీంద్ర నిశ్చితార్థ వేడుక  సంజనా బి రాజ్ తో ఘనంగా జరిగింది.  వృత్తిరీత్యా గాైనకాలజిస్ట్ వైద్యురాలైన సంజనాతో సుధీంద్రకి  గత కొంతకాలంగా పరిచయం ఉంది. ఈ వేడుకకి కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఒకవైపు క్లాసిక్ సాంప్రదాయ లుక్‌లో నిరంజన్ కనిపించగా, మరోవైపు ఎంతో అందమైన లెహంగాలో  సంజన మెరిసిపోయింది. ఈ వేడుకకి  సంబంధించిన అందమైన ఫోటోలని ఉపేంద్ర సతీమణి  ప్రియాంక ఉపేంద్ర తన అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా అభిమానులతో పంచుకోవడంతో  నెట్టింట  ట్రెండ్ అవుతున్నాయి. నిరంజన్ సుధీంద్ర సినీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే, ఆయన తన బాబాయ్ ఉపేంద్ర మార్గదర్శకత్వంలోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. మొదట 'బళ్లారి నాగ' అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత 2018 లో వచ్చిన 'సెకండాఫ్' అనే కన్నడ సినిమా ద్వారా హీరోగా మారాడు. ఈ సినిమాలో ప్రియాంక ఉపేంద్ర ప్రధాన పాత్ర పోషించడం విశేషం. ఆపై 2022 లో విడుదలైన 'నమ్మ హుడుగురు' చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం కన్నడలోనే కాకుండా ఈ ఏడాది ఫిబ్రవరి 2026 లో విడుదలైన 'సీతా పయనం' (Seetha Payana) అనే ద్విభాషా చిత్రం ద్వారా నిరంజన్ తెలుగు ప్రేక్షకులని పలకరించాడు. ప్రముఖ సీనియర్ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వం వహించిన  సీతాపయణంలో లో అర్జున్ కుమార్తె ఐశ్వర్య సర్జా టైటిల్ రోల్ పోషించింది.    
టాలీవుడ్‌లో విలక్షణమైన చిత్రాలతో దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్న మధుర శ్రీధర్ రెడ్డి (Madhura Sreedhar Reddy) తాజాగా సినిమా పరిశ్రమ తీరుపై, కొందరు నిర్మాతలు మరియు పరిశ్రమ వర్గాల ప్రవర్తనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా రంగాన్ని కేవలం ఒక కళగానో లేదా బాధలను వెళ్లగక్కే వేదికగానో చూడవద్దని, ఇదొక పక్కా వ్యాపారమని ఆయన కుండబద్దలు కొట్టారు. ఏ బిజినెస్‌లోనైనా రిస్కులు, ఒత్తిడులు, ఆర్థిక నష్టాలు అనేవి చాలా సహజమైన విషయాలని, వాటిని ముందే పూర్తిగా అర్థం చేసుకుని, లాభనష్టాల అంచనాలతోనే ఎవరైనా సరే ఈ రంగంలోకి అడుగుపెట్టాలని ఆయన స్పష్టం చేశారు. అంతేగానీ, ప్రతి చిన్న విషయానికి పరిశ్రమ అతలాకుతలం అయిపోతోందనే రేంజ్‌లో బిల్డప్ ఇవ్వడం సరికాదని హితవు పలికారు. నిజంగా ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవనిపిస్తే, సినిమా బిజినెస్ చేయడం చేతకాకపోతే సినిమాలు తీయడం ఆపేయాలని మధుర శ్రీధర్ రెడ్డి కఠినంగా చెప్పారు. అంతేకాకుండా, ఇండస్ట్రీ నుంచి గౌరవంగా బయటకు వెళ్లిపోవాలే తప్ప.. ప్రతిసారి మీడియా ముందుకు, మైకుల ముందుకు వచ్చి “సమస్యలు… సమస్యలు…” అంటూ ఏడవడం అస్సలు బాలేదని తీవ్రంగా తప్పుపట్టారు. ఇలా పదే పదే బహిరంగంగా విలపించడం వల్ల ఇండస్ట్రీ పరువు పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేదో ప్రపంచాన్ని కుదిపేస్తున్న అతిపెద్ద సమస్య అయినట్టు, లేదా భారతదేశం మొత్తం ఎదుర్కొంటున్న ఒక ఊహించని మహా సంక్షోభం అయినట్టు కొందరు మైకుల ముందు ప్రవర్తించే తీరు చూస్తుంటే నవ్వొస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. సినిమా అనేది పక్కా బిజినెస్ అని, ఇది ఎంతమాత్రం ఛారిటీ కాదని అందరూ గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇండస్ట్రీలో కొనసాగాలనుకుంటే కథలను నమ్మి సిన్సియర్‌గా సినిమాలు తీయాలని సలహా ఇచ్చారు. ఒకవేళ ఇక్కడ మీ ఐడియాలు, మీ బిజినెస్ ప్లాన్లు వర్కౌట్ అయితే హ్యాపీగా ఇండస్ట్రీలో ఉండవచ్చని, ఒకవేళ ఇక్కడ వర్కౌట్ కాకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బయటికి వెళ్లిపోయి వేరే ఏదైనా లాభసాటి బిజినెస్ చేసుకోవడం ఉత్తమమని సూచించారు. ఒక సినిమాలో నష్టం వస్తే, ఆ నష్టాన్ని తట్టుకుని నిలబడే ఆర్థిక శక్తి మరియు ధైర్యం ఉంటేనే ఇంకో సినిమా తీయడానికి సాహసించాలని, లేదంటే సైలెంట్‌గా ఆగిపోవడమే మంచిదని ప్రాక్టికల్ వాస్తవాలను మాట్లాడారు. మీ కంపెనీ సమస్యలు, మీ వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులు లేదా మీ అంతర్గత సమస్యలు అన్నింటినీ తీసుకొచ్చి సినిమా ప్రాజెక్ట్‌పై రుద్దకండి అని శ్రీధర్ రెడ్డి చెప్పారు. సినిమా ఒక అద్భుతమైన మీడియం. దాన్ని బాధల వేదికగా మార్చొద్దు. సిన్సియర్‌గా సినిమాలు తీయండి.. ప్రతి మంచి సినిమాకి ప్రేక్షకుల్లో ఒక మంచి స్థానం తప్పకుండా ఉంటుంది అని శ్రీధర్ రెడ్డి చెప్పుకొచ్చారు. మధుర శ్రీధర్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   https://x.com/madhurasreedhar/status/2059563691096576065
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటన, అందంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ సొగసరి నివేదా పేతురాజ్ టాలీవుడ్‌లో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. వ్యక్తిగత కారణాల వల్ల గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు ఒక భారీ ప్రాజెక్టు ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టాలీవుడ్ టాప్ డైరెక్టరైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆమెకు ఒక లక్కీ ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ (హౌస్ నెం 47) చిత్రంలో నివేదా ఒక కీలకమైన పాత్ర పోషిస్తోందని ఫిలింనగర్ సమాచారం. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నివేదా పాత్ర చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, నివేదా పేతురాజ్ సెకండ్ లీడ్‌గా లేదా ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్‌లో మెరవబోతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో దుబాయ్‌కి చెందిన ఒక వ్యాపారవేత్తతో నడిచిన విఫల ప్రేమాయణం, ఆ తర్వాతి వ్యక్తిగత ఒడిదుడుకుల వల్ల మానసికంగా కుంగిపోయిన నివేదా, దాదాపు మూడేళ్లపాటు సినిమాలకు విరామం ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ చేదు జ్ఞాపకాల నుంచి కోలుకుని పరిశ్రమలోని పాత పరిచయాలను పునరుద్ధరిస్తూ వరుస అవకాశాల కోసం గట్టి ప్రయత్నాలే మొదలుపెట్టింది. కేవలం సోలో హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా, కథలో బలం ఉంటే ఎలాంటి కీలక పాత్రలైనా చేయడానికి ఆమె సుముఖత వ్యక్తం చేసింది. దర్శకుడు త్రివిక్రమ్‌తో నివేదాకు ఇది రెండో సినిమా కావడం విశేషం. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంలో సుశాంత్ సరసన ఆమె ఒక ముఖ్య పాత్రలో మెరిసి మెప్పించింది. ఆ సినిమా మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ, ఆ తర్వాత ఆమెకు ఆశించిన స్థాయిలో పెద్ద ఆఫర్లు రాలేదు. చివరిగా విశ్వక్ సేన్ సరసన ‘దాస్ కా ధమ్కీ’ సినిమాలో మెరిసిన నివేదా, అందులోని ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా’ పాటతో కుర్రకారును ఎంతగానో ఆకట్టుకుంది. టాలీవుడ్‌లో నివేదా రీఎంట్రీ ఇస్తోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందం, అభినయం ఉన్న నటి కావడంతో ఆమెకు మరిన్ని మంచి అవకాశాలు రావాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. అటు వెంకటేష్ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్ చిత్రంలోనూ ఆమె పేరు పరిశీలనలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అక్టోబర్ నెలలో విడుదల కానున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై భవిష్యత్తులో నివేదా కెరీర్ గ్రాఫ్ ఎలా ఉండబోతుందో ఆధారపడి ఉంది.
  సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా భారీ తారాగణంతో 2016 లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా చిత్రం 'బ్రహ్మోత్సవం'. క్లాసిక్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమాస్ బ్యానర్‌పై పొట్లూరి వీరప్రసాద్ (పీవీపీ)  దాదాపు 75 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించాడు . భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం 63.70 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించి, డిస్ట్రిబ్యూటర్లకి ,ఎగ్జిబిటర్లకి భారీ నష్టాలని మిగిల్చింది. మూవీ రిలీజైన చాలా రోజుల తర్వాత తాజాగా పీవీపీ బ్రహ్మోత్సవం గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో సరికొత్త హాట్ టాపిక్‌గా మారాయి. డిజాస్టర్‌ కి అసలు కారణం ఎవరో  ఓపెన్‌గా వెల్లడించాడు .  పివిపి మాట్లాడుతు బ్రహ్మోత్సవం ఫ్లాప్ కావడానికి పూర్తి బాధ్యత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలదే. షూటింగ్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే దర్శకుడికి ఒక అధికారిక ఈమెయిల్ పంపాను. సదరు మెయిల్ లో  స్క్రిప్ట్ వర్క్ పూర్తిగా పూర్తి కాకుండా ఎటువంటి పరిస్థితుల్లోను షూటింగ్ ప్రారంభించవద్దని హెచ్చరించాను. సినిమా అనేది కేవలం ఒకరి ఇష్టం కాదు .డిస్ట్రిబ్యూటర్స్ ,ఎగ్జిబిటర్స్ పెట్టిన పెట్టుబడులతో, వారి నమ్మకంతో మనం సినిమా చేస్తున్నాం. సరైన ప్రణాళిక లేకపోతే వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని  దర్శకుడికి ముందే చెప్పాను. Also read: ఫ్యాన్స్‌కి బిగ్ షాక్.. ఆ ఏరియాలో పెద్ది రిలీజ్ క్యాన్సిల్  బ్రహ్మోత్సవం అనేది ఒక మంచి లైన్, అద్భుతమైన కుటుంబ కథాంశం. కానీ దర్శకుడు సినిమా సెట్స్‌పైకి వెళ్లే ముందు పూర్తి స్థాయి కథని, బౌండ్ స్క్రిప్ట్‌ సిద్ధం చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దర్శకుడి నిర్లక్ష్యం, క్రమశిక్షణ లేకపోవడం వల్లే అంత పెద్ద ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బతింది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో బాధ్యతారాహిత్యం, పక్కా డిసిప్లిన్ లేకపోవడం కూడా ఒకటని పీవీపీ విమర్శించారు. ప్రస్తుతం  పీవీపీ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.   
టాలీవుడ్ లో ఫాంటసీ, అడ్వెంచర్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. విభిన్నమైన కథాంశాలతో, సరికొత్త విజువల్స్ ని జోడించి వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో ఒక భారీ మైథలాజికల్ ఫాంటసీ మరియు మిస్టరీ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషన్ చిత్రం 'నాగబంధం' (Nagabandham).  అభిషేక్ నామా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక అదిరిపోయే అప్‌డేట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమాను జూలై 3, 2026 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ చిత్ర యూనిట్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది. తాజాగా విడుదలైన ఈ అఫీషియల్ పోస్టర్ చూస్తుంటే సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో స్పష్టంగా అర్థమవుతోంది. "ప్రతి ముఖం వెనుక ఒక కథ దాగి ఉన్నప్పుడు... ప్రతి నీడ ఒక రహస్యాన్ని కాపాడుతున్నప్పుడు" అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో వచ్చిన ఈ లుక్ ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేస్తోంది. పోస్టర్ లో రా రగ్గడ్ లుక్‌లో ఇంటెన్స్ కళ్లతో చూస్తున్న విరాట్ కర్ణ అరాచకంగా కనిపిస్తున్నాడు. అతని మెడలో చుట్టుకుని ఉన్న నల్లత్రాచు పాము, బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న పురాతన కోటలు, మండుతున్న అగ్ని జ్వాలలు, నాగుపాములు సినిమాలోని మిస్టరీ ఎలిమెంట్స్‌ని పీక్స్‌కి తీసుకువెళ్లాయి.  ఈ చిత్రంలో విరాట్ కర్ణ హీరోగా నటిస్తుండగా, నభా నటేష్, దక్ష నగార్కర్, ఇషీ మీనన్ ముఖ్య పాత్రల్లో మెరిసిపోతున్నారు. నెగిటివ్ షేడ్స్ లో రిషబ్ సాహ్ని పోస్టర్‌లో భయంకరమైన బ్లడీ లుక్‌తో కనిపిస్తుండగా, వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు, అనసూయ భరద్వాజ్, గరుడ రామ్ తదితరులు తమదైన ఇంటెన్స్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నారు.  చుట్టూ నాగుపాములు, ఒకవైపు సముద్రపు అలల మధ్య తుపాకీ పట్టుకుని బోటులో వస్తున్న వ్యక్తి, మరోవైపు కోట్ల విలువైన గుప్త నిధులు, బంగారు నాణేల రాశి మధ్య నిలబడి ఉన్న క్యారెక్టర్లు చూస్తుంటే ఇదొక హై-వోల్టేజ్ నిధుల వేట (Treasure Hunt) నేపథ్యంతో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.   
Nagabandham makers have unveiled a new poster from the film, and it is already drawing attention for its mythological adventure tone and large-scale visual presentation. The poster hints at a treasure-hunt narrative rooted in ancient Indian mythology, while also teasing action-heavy moments from the film. Directed by Abhishek Nama, the film has been in discussion for quite some time due to its ambitious scale and pan-India positioning. According to the team, the newly released artwork will also be installed as life-sized standees across theatres in Andhra Pradesh and Telangana as part of the promotions leading up to the release. The film stars Virat Karrna in the lead role alongside Nabha Natesh and Iswarya Menon. The supporting cast includes Jagapathi Babu, Mahesh Manjrekar, Murli Sharma, Ramachandra Raju, Anasuya Bharadwaj and several others. While the promotional material has generated decent curiosity online, the film’s success will largely depend on how effectively it balances mythology, fantasy, and adventure elements on screen. With Indian audiences increasingly responding to visually mounted spectacles, Nagabandham appears to be positioning itself in that space ahead of its July 3 release. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual accuracy of the reports. While we do try to do thorough research, some sources could misguide or be untruthful. So, we would encourage viewers' discretion before reacting to them.
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అడ్డాగా నిలిచిన హైదరాబాద్ తరహాలోనే, ఆంధ్రప్రదేశ్‌లోనూ మరో అంతర్జాతీయ స్థాయి సినీ కేంద్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు ముమ్మరమవుతున్నాయి. నవ్యాంధ్రలో సినిమా, టెలివిజన్ తో పాటు రంగస్థల రంగాన్ని కూడా సమాంతరంగా అభివృద్ధి చేయాలనే పట్టుదలతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ చిత్రసీమ విస్తరణకు హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలు తమ పూర్తి మద్దతును ప్రకటించారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమా- టెలివిజన్- రంగస్థల అభివృద్ధి సంస్థ (APSFTVTDC) నూతన పాలకమండలి బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ కార్పొరేషన్ డైరెక్టర్‌గా సీనియర్ మేకర్ చదలవాడ శ్రీనివాసరావు, ఛైర్మన్‌గా భరత్ భూషణ్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో ఈ కొత్త బృందాన్ని ఇండస్ట్రీ ప్రముఖులు ఘనంగా సత్కరించారు. డి. సురేష్ బాబు, భరత్ చౌదరి, అశోక్ కుమార్, మోహన్ వడ్లపట్ల సహా పలువురు ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఈ వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో షూటింగుల సంస్కృతిని పెంచేందుకు, సరికొత్త మౌలిక వసతుల కల్పనకు చదలవాడ నేతృత్వంలోని ఎఫ్‌డీసీ బృందం బృహత్తర ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వంటి ప్రముఖులు ఏపీలో సరికొత్త టాలీవుడ్ హబ్‌ను తీసుకురావాలని భావిస్తున్నారు. చిత్ర పరిశ్రమకు అవసరమైన అన్ని అనుమతులను సింగిల్ విండో విధానం ద్వారా వేగంగా మంజూరు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చెన్నై నుంచి హైదరాబాద్‌కు చిత్ర పరిశ్రమ తరలివచ్చిన తరహాలోనే.. ఇప్పుడు వైజాగ్, రాజమండ్రి, అమరావతి పరిసర ప్రాంతాలను ప్రధాన షూటింగ్ స్పాట్స్‌గా మార్చాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తుండగా, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా పోటీ పడుతూ సరికొత్త సినీ హబ్‌ను నిర్మించేందుకు పూనుకోవడం విశేషం. మరోవైపు ఈ రెండు రాష్ట్రాల సమాంతర వృద్ధిపై అటు నటీనటులు, ఇటు సినీ అభిమానులు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు ప్రాంతాల్లోనూ స్టూడియోలు, అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వస్తే మరిన్ని విభిన్నమైన కథలతో సినిమాలు రూపొందుతాయని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మునుముందు రోజుల్లో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రోత్సాహంతో తెలుగు సినిమా గ్లోబల్ మార్కెట్‌లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పదం నౌతప.. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం.  గత ఒకటి రెండు నెలలుగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వడగాలులు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఈ  వడగాలులు మరింత తీవ్రతరం కాబోతున్నాయి. నౌతప ఎంటర్ అయ్యింది. ఇది మే 25న ప్రారంభమై, జూన్ 2వ తేదీ వరకు కొనసాగుతుంది. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ రోజులలో గ్రహాల స్థానాలు అనుకూలంగా ఉండటం వల్ల సూర్యకిరణాలు నేరుగా భూమిపై పడతాయట, దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..  నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం. నౌతప అనేక విధాలుగా అవసరమైనదనే చెబుతారు. ఇది పొలాల్లోని హానికరమైన కీటకాలను, తెగుళ్లను నాశనం చేసి, పంట నష్టాన్ని నివారిస్తుంది, ఈ తొమ్మిది రోజులు ఆరోగ్య పరంగా చాలా సవాలుగా ఉంటాయి. ఇప్పటికే తీవ్రంగా ఉన్న వేడికి తోడు ఈ తొమ్మిది రోుల  సమయంలో ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉంది, ఇది వడదెబ్బ , డీహైడ్రేషన్ వంటి సమస్యలను తీవ్రతరం చేస్తుంది. అనేక ప్రాంతాలలో నౌతప సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణంగా 45 డిగ్రీల సెల్సియస్‌ను మించిపోతాయి, ఇది శరీరంలోని అనేక భాగాలపై ప్రమాదకరమైన ప్రభావాలను కలిగిస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో  ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేదే పెద్ద ప్రశ్న. నౌతప సమయంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు? తెలుసుకుంటే.. ఆరోగ్య నిపుణుల అబిప్రాయం.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, నౌతప అందరికీ ప్రమాదకరమైనప్పటికీ, పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు,  ముందు నుంచే గుండె మరియు మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారు ఈ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక శరీర ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం పెరుగుతుంది, ఇది ప్రాణాంతకం కూడా కావచ్చని వైద్యులు చెబుతున్నారు. వడదెబ్బ , ఎండదెబ్బ, శరీరంలో నీటి శాతం కోల్పోవడం, అలసట, నిద్ర సమస్యలు , చిరాకును గణనీయంగా పెంచుతాయి. తీవ్రమైన వేడి కారణంగా ప్రతి సంవత్సరం వేలాది మంది మరణిస్తున్నారు. ఈ తొమ్మిది రోజుల కాలం గుండె , మూత్రపిండాల రోగులకు ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. తీవ్రమైన వేడి కారణంగా గుండె దడ , గుండెపోటు వచ్చే ప్రమాదం పెరగవచ్చు. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? నౌతప సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీరు , ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం, ఎండకు దూరంగా ఉండటం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిన్నపాటి అజాగ్రత్త కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. పిల్లలు, వృద్ధులు , గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే వారి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యం బలహీనంగా ఉంటుంది. వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి, మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లడం మానుకోవాలి. ఈ సమయంలో లేత రంగు దుస్తులు ధరించడం, పుష్కలంగా నీరు త్రాగడం , శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా అవసరం. ఈ తొమ్మిది రోజులు ఇవి తప్పనిసరిగా చేయాలి.. వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి దాహం వేయకపోయినా రోజంతా పుష్కలంగా నీరు త్రాగడం చాలా అవసరం. నీటితో పాటు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ , ఓఆర్ఎస్ (ORS) తాగాలి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయి. తేలికపాటి భోజనం చేయడం ఉత్తమం. పుచ్చకాయ, దోసకాయ, కర్బూజా , పెరుగు వంటి ఆహారాలు శరీరాన్ని చల్లబరచడానికి సహాయపడతాయి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ లేదా టవల్ ఉపయోగించాలి. ఈ తొమ్మిది రోజులు ఏం చేయకూడదు? తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలి, ఖాళీ కడుపుతో బయటకు వెళ్లకూడదు. ఏదైనా పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే, శరీరాన్ని పూర్తీగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి.  అలాగే గొడుగు వాడాలి. అధికంగా టీ, కాఫీ , మద్యం తీసుకోవడం వల్ల శరీరంలో నీటి కొరత పెరగవచ్చు. కాబట్టి వాటిని చాలా తగ్గింతాలి. మూసివున్న, వేడి గదిలో ఎక్కువసేపు ఉండటం కూడా ప్రమాదకరం. అధిక జ్వరం, తల తిరగడం, స్పృహ కోల్పోవడం, వాంతులు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే,  వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇవి వడదెబ్బకు సంకేతాలు కావచ్చు.                                       *రూపశ్రీ.
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల యువతలోనూ వేగంగా విస్తరిస్తోంది. అసలు క్యాన్సర్ అంటే ఏమిటి? కుటుంబంలో ఒకరికి ఉంటే మిగతా వారికి కూడా వస్తుందా? (Family Cancer Syndromes). దీనికి గల కారణాలు, అధునాతన చికిత్సల గురించి నిమ్స్ (NIMS) హాస్పిటల్ మాజీ సీనియర్ ప్రొఫెసర్ & హెడ్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ మరియు అశ్విన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ జి. సూర్యనారాయణ రాజు (Dr. GSN Raju) గారు ఈ VIDEO లో అందించిన పూర్తి వివరాలు మీకోసం... క్యాన్సర్ అంటే ఏమిటి? (What is Cancer?) మన శరీరంలో కోట్లాది కణాలు ఉంటాయి. ఇవి క్రమపద్ధతిలో విభజన చెందుతూ, పాత కణాలు చనిపోయాక కొత్త కణాలు పుడుతుంటాయి. కానీ, ఈ కణాల విభజన ప్రక్రియపై నియంత్రణ తప్పినప్పుడు, కణాలు అసాధారణంగా, అమితంగా పెరిగిపోతాయి. అలా పెరిగిన కణాల సమూహాన్నే గడ్డలు లేదా ‘ట్యూమర్లు’ అంటారు. ఇవి శరీరంలోని ఇతర భాగాలకు పాకినప్పుడు దానిని క్యాన్సర్ (Malignant) గా గుర్తిస్తారు. ఫ్యామిలీ క్యాన్సర్ సిండ్రోమ్స్ అంటే ఏమిటి? (Family Cancer Syndromes / Hereditary Cancer) చాలా మందిలో ఉండే పెద్ద అనుమానం—"మా కుటుంబంలో ఒకరికి క్యాన్సర్ ఉంది, అది మాకు కూడా వస్తుందా?". డాక్టర్ జి.ఎస్.ఎన్. రాజు గారి వివరణ ప్రకారం, అన్ని క్యాన్సర్లు వంశపారంపర్యంగా రావు. కేవలం 5 నుండి 10 శాతం క్యాన్సర్లు మాత్రమే జన్యుపరమైన లోపాలు (Genetic Mutations) తర్వాతి తరాలకు బదిలీ అవ్వడం వల్ల వస్తాయి. దీనినే 'ఫ్యామిలీ క్యాన్సర్ సిండ్రోమ్' అంటారు. ముఖ్య లక్షణాలు: కుటుంబంలో ఒకే తరానికి చెందిన ఇద్దరు ముగ్గురికి క్యాన్సర్ రావడం, చాలా తక్కువ వయసులోనే (ఉదాహరణకు 30 లేదా 40 ఏళ్లకే) క్యాన్సర్ బారిన పడటం, లేదా ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ రకాల క్యాన్సర్లు (ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్ మరియు అండాశయ క్యాన్సర్ రెండూ) రావడం వంటివి జరిగితే అది వంశపారంపర్య క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణలు: బ్రెస్ట్ క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్), ఒవేరియన్ క్యాన్సర్ (అండాశయ క్యాన్సర్), మరియు కోలోరెక్టల్ క్యాన్సర్ (ప్రేగు క్యాన్సర్) లలో ఈ వంశపారంపర్య ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు (Causes of Cancer) వంశపారంపర్య కారణాలు కాకుండా, మిగిలిన 90% క్యాన్సర్లకు మన చేతులారా చేసుకునే పొరపాట్లే కారణమని డాక్టర్ గారు హెచ్చరిస్తున్నారు. అందులో ముఖ్యమైనవి: ధూమపానం మరియు మద్యపానం: సిగరెట్లు, బీడీలు తాగడం, గుట్కా నమలడం వల్ల ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లు వస్తాయి. అనారోగ్యకరమైన ఆహారం: జంక్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉన్న ఆహారం, మైదా, అతిగా వేయించిన మాంసాహారం తీసుకోవడం. స్థూలకాయం (Obesity): శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరిగి క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. రసాయనాలు & కాలుష్యం: ఫ్యాక్టరీల నుండి వచ్చే రసాయనాలు, పురుగుమందుల ప్రభావం ఉన్న ఆహార పదార్థాలు. వైరల్ ఇన్‌ఫెక్షన్లు: హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV), హెపటైటిస్-B వంటి వైరస్ల వల్ల కూడా క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స (Diagnosis and Treatment) క్యాన్సర్‌ను మొదటి లేదా రెండో దశలోనే గుర్తిస్తే 100% నయం చేయవచ్చని డాక్టర్ జి.ఎస్.ఎన్. రాజు గారు స్పష్టం చేశారు. కుటుంబ చరిత్రలో క్యాన్సర్ ఉన్నవారు ముందుగానే 'జెనెటిక్ స్క్రీనింగ్' (Genetic Testing) మరియు క్రమంతప్పకుండా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం మంచిది. ప్రస్తుతం వైద్యరంగంలో అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి: సర్జరీ (Surgery): క్యాన్సర్ గడ్డను శస్త్రచికిత్స ద్వారా తొలగించడం. కీమోథెరపీ (Chemotherapy): శక్తివంతమైన మందుల ద్వారా క్యాన్సర్ కణాలను నిర్మూలించడం. రేడియేషన్ థెరపీ (Radiation Therapy): హై-ఎనర్జీ ఎక్స్-రేల ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేయడం. ఇమ్యునోథెరపీ (Immunotherapy): శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్‌తో పోరాడేలా చేయడం. క్యాన్సర్ పట్ల భయం వద్దు... అవగాహన ముఖ్యం! సరైన జీవనశైలిని అలవర్చుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పండ్లు-కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పు నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. జీవనశైలి సరిగా లేకపోవడం,  ఊబకాయం,  శారీరక శ్రమ తక్కువగా ఉండటం లేదా అసలు శారీరక శ్రమ లేకపోవడం కీళ్ల వాతానికి దారి తీస్తుంది.  కీళ్లవాతం దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండాలంటే.. కొన్ని పనులు చేయాలి.  అవేంటో తెలుసుకుంటే.. ఊబకాయం.. సాధారణంగా ఎత్తుకు తగ్గ బరువు ఉండాలని చెబుతూ ఉంటారు.  దీన్ని బిఎమ్ఐ అని చెబుతారు. అయితే ఎత్తుకు తగ్గ బరువు కాకుండా ఎక్కువ బరువు ఉండే అధిక బరువు అంటారు.  ఈ అధిక బరువు కంటే కూడా ఎక్కువ బరువు ఉంటే దాన్ని ఊబకాయం అని అంటారు.  కీళ్లవాతం సమస్య ఎక్కువగా ఊబకాయం ఉన్నవారికే వస్తుంది.  అందుకే కీళ్లవాతం రాకూడదంటే ఊబకాయం రాకుండా చూసుకోవాలి.  బరువును అదుపులో ఉంచుకోవాలి.  అదిక బరువు సమస్యలు.. అధిక బరువు ఉంటే మోకాళ్లు, కీళ్లపై ఒత్తిడిని పెంచి ఆర్థరైటిస్ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. పరిష్కారం.. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయాలి. అలాగే వాకింగ్,  యోగా,  స్ట్రెచింగ్ వ్యాయామాలు కూడా చేయాలి.  ఇది కీళ్లను బలపరుస్తుంది. కీళ్ల వాతం రాకుండా చేస్తుంది. ఎముకల బలం.. ఎముకలు బలంగా ఉంటే కీళ్ల వాతం కూడా అంత సులువుగా రాదు.  అందుకే ఎముకలను బలంగా ఉంచేందుకు కాల్షియం,  విటమిన్-డి ఉన్న ఆహారాలు చాలా బాగా తీసుకోవాలి. సిట్టింగ్ పొజిషన్.. నేటికాలంలో ఉద్యోగాలు అన్నీ ఒకేచోట కూర్చుని చేసేవే.  ఈ సిట్టింగ్ వర్క్ వల్ల కీళ్లు బిగుసుకుపోయి నొప్రి పెరగడానికి దారితీస్తుంది. అందుకే సిట్టింగ్ వర్క్ చేసేవారు కనీసం అరగంట లేదా గంటకు ఒకసారి లేచి కాస్త అటు ఇటు తిరుగుతూ ఉండాలి. దీనివల్ల కీళ్లు రిలాక్స్ అవుతాయి. ఆహారం.. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు,  ప్రాసెస్ చేసిన ఆహారాలు శరీరంలో వాపును పెంచడం ద్వారా కీళ్ల సమస్యలకు కారణం అవుతాయి.  అందుకే చక్కెర అధికంగా ఉన్న ఆహారాలను, ప్రాసెస్ చేసిన ఆహారాలను వీలైనంత తక్కువగా లేదా అసలు తీసుకోకుండా ఉండటం మంచిది.                                  *రూపశ్రీ.