LATEST NEWS
జనసేన నాయకులు, క్యాడర్ పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండటం లేదా. ప్రభుత్వంలో భాగస్వామి పార్టీ అయినప్పటికీ,  అన్ని విషయాలలోనూ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారా? అంటే తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇచ్చిన సూచనలు, వ్యక్తంచేసిన ఆగ్రహం చూస్తే ఔనన్న సమాధానమే వస్తున్నది.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మిత్రపక్షాలు, అధికారంలో  భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీల   శైలిపై  ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టే విషయంలో జనసేన ఏమంత యాక్టివ్ గా లేదన్నది వాస్తవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ విషయంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పార్టీ లీడర్లు, క్యాడర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి ప్రభుత్వంలో తమ పార్టీ తరఫున మంత్రులుగా ఉన్నవారికీ ఓ రేంజ్ లో క్లాస్ పీకారు.   ప్రత్యర్థులు చేసే ఆరోపణలను  దీటుగా తిప్పికొట్టాలని, సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారాన్ని గట్టిగా ఖండించాలనీ చాలా సీరియస్ గా పార్టీ లీడర్, క్యాడర్ కు ఆదేశాలు ఇచ్చారు.  గత రెండు మూడు నెలలుగా పవన్ కల్యాణ్ పలు సందర్భాలలో ఇదే విషయాన్ని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చెప్పారు. అయినా పార్టీ  నేతల నుంచి, శ్రేణుల నుంచీ పెద్దగా స్పందన లేకపోవడంతో ఈ సారి మరింత సీరియస్ గా ఇక యాక్టివ్ గా ఉండి తీరాలని ఒక విధంగా విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు.   పార్టీలో ఎవరో ఒకరిద్దు మాత్రమే..అది కూడా అడపాదడపా మాత్రమే స్పందిస్తున్నారని పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.    ఇటీవల  రాష్ట్ర రాజకీయాల్లో  ప్రశ్న రావణ్  అరెస్టు, అతడిపై,   ఉపా చట్టం కింద కేసుఅంశాలు పెను సంచలనంగా మారాయి. ఈ విషయంలో  వైసీపీ సామాజిక మాధ్యమ విభాగాలు పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేస్తున్నాయి.   అయినా జనసేన నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. వైసీపీ దుష్ప్రచారాన్నీ, విమర్శల దాడిని తిప్పికొట్టే ప్రయత్నాలేవీ జనసేన నుంచి జరగడం లేదు. దీంతో ఏకపక్షంగా వైసీపీ చేస్తున్న ప్రచారం జనంలోకి బలంగా వెళ్లి, అదే వాస్తవమన్న భ్రమలో ప్రజలు పడే ప్రమాదం ఉంది. దీంతో జనసేనాని తీవ్ర అసహనానికి లోనై పార్టీ లీడర్లకు గట్టిగా క్లాస్ పీకారంటున్నారు.   ఈ విషయంలో జనసేనాని.. పార్టీ లీడర్లు క్యాడర్లకు..  తెలుగుదేశం పార్టీని చూసైనా నేర్చుకోండంటూ ఒకింత ఘాటుగానే మందలించారని పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది.  తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ప్రత్యర్థులు చిన్న విమర్శ చేసినా..రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచీ తెలుగుతమ్ముళ్లంతా ఏకతాటిపైకి వచ్చి కౌంటర్లు ఇవ్వడాన్ని జనసేనాని తన పార్టీ వారికి ఉదహరించినట్లు చెబుతున్నారు. ఇక నుంచి యాక్టివ్ అయి తీరాలని జనసేనాని ఈ సందర్భంగా పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశం ఇచ్చినట్లు చెబుతున్నారు.  Pawan Kalyan, Janasena leaders, TDP leaders, Chandrababu Naidu, AP Politics
 భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడింది.  2028 ఎన్నికలలో బీఆర్ఎస్ ను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కేటీఆర్ తన పాదయాత్ర ప్రకటించారు. ఆయన ప్రకటించిన మేరకు   ఈ ఏడాదే ఆయన పాదయాత్ర ప్రారంభించాలి. కానీ  నుంచే ఈ మహా యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. తన పాదయాత్ర ద్వారా పార్టీకి ఏ మేరకు మైలేజ్ వస్తుంది.. పార్టీ అధికారంలోకి రావడానికి తన పాదయాత్ర ఏంతగా దోహదపడుతుంది వంటి వివరాలను ఆయన క్షేత్రస్థాయిలో  సర్వేలు చేయిచి ఆ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక పాదయాత్రపై కుటుంబ సభ్యులతో కూడా చర్చించారు. ఇన్నీ చేసి ఇక పాదయాత్రకు ముహూర్తం ఖరారు చేయడమే తరువాయి అని పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చిన కేటీఆర్ ఇప్పుడు పాదయాత్రను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.  ఈ ఏడాదే పాద‌యాత్ర ప్రారంభిస్తాన‌ని కేటీఆర్ స్వయంగా ప్రకటించి కూడా వెనక్కు తగ్గడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మంత వ్యతిరేకత కనిపించడం లేదన్న అవగాహనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేని ఈ సమయంలో పాదయాత్ర చేయడం వల్ల ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం లేదన్న భావనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వచ్చే ఏడాదికి వాయిదా వేసుకున్నారంటున్నారు. కాగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టదలచిన బస్సు యాత్రను కూడా ఇదే కారణంతో నిరవధికంగా వాయిదా వేసుకున్నారని అంటున్నారు.  సాధారణంగా  పాదయాత్రలు   అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పుడు చేపడితేనే  ఫలితం ఉంటుంది. అలా కాకుండా పాదయాత్ర చేపడితే.. ప్రజల నుంచి పెద్దగా స్పందన ఉండదని పరిశీలకు చెబుతారు. ప్రస్తుతం రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెద్దగా కనిపించడం లేదు కనుక మరో ఏడాది పాటు పాదయాత్ర ఊసెత్తకుండా ఉండటమే మేలని కేటీఆర్, బస్సు యాత్ర కూడా ఏడాది తరువాత చేపడితేనే ఫలితం ఉంటుందని కేసీఆర్ నిర్ణయించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   KTRs padayatra postponed, Brs, Working President, Revantah Government, Anti Incumbency
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో  పెను సంచలనం చోటుచేసుకుంది.  ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయం పాలై అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి  భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు  రాజ్యసభ మాజీ సభ్యులు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్,  ప్రకాష్ చిక్ బారాయిక్ లు కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. గురువారం (జులై 9) వీరు అధికారికంగా బీజేపీ గూటికి చేరారు. గత నెలలోనే వీరంతా తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన సంగతి విదితమే.  వీరరుముగ్గురూ గురువారం జులై 9) బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సమక్షంలో   కమలం కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. వీరు ముగ్గురూ ఇలా  బీజేపీలో చేరారో లేదో అలా బీజేపీ హైకమాండ్ వీరి రాజీనామాతో  ఖాళీ అయిన ఆ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకే  వీరినే  తమ అభ్యర్థులుగా ప్రకటించింది.  పార్టీ మారిన ఈ ముగ్గురు నేతల్లో సుఖేందు శేఖర్ రాయ్  టీఎంసీలో సీనియర్ నాయకుడు.  2024 ఆగస్టులో కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఒక జూనియర్ డాక్టర్‌పై జరిగిన   హత్యాచార ఘటనపై అప్పుడే సుఖేందు శేఖర్ రాయ్.. అప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును, పోలీసుల వైఫల్యాలను తప్పుపట్టారు. సొంత పార్టీ ప్రభుత్వంపైనే   తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో అప్పటి నుంచీ   టీఎంసీ హై కమాండ్ ఆయనను పూర్తిగా పక్కనబెట్టింది.  ఈ నేపథ్యంలోనే.. సుఖేందు శేఖర్ రాయ్   గత నెల 8న తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జూన్ 10న సుస్మితా దేవ్,  11న  ప్రకాష్ చిక్ బారాయిక్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పుడు వారు బీజేపీ గూటికి చేరి టీఎంసీకి, మాజీ సీఎం మమతా బెనర్జీకి గట్టి షాక్ ఇచ్చారు.   West Bengal Politics, BJP TMC Shock, Sukhendu Sekhar Ray, Mamata Banerjee, Rajya Sabha By Election Candidates
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా అసభ్య, అశ్లీల, అనుచిత పోస్టులు చేసిన వ్యక్తుల అరెస్టుల పర్వం సంచలనంగా మారింది. వివాదాస్పద యూట్యూబర్,   బచ్చలకూరి జోసెఫ్  అలియాస్ ప్రశ్న రావణ్  అరెస్టుపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని  చేసిన వ్యాఖ్యలు  కొత్త వివాదానికి తెర లేపాయి. దేశ భద్రతకు సంబంధించిన ఉపా యాక్ట్ ను కొడాలి నాని  ఉప్మా యాక్ట్  అని సంబోధించడంపై కూటమి వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ  తెలుగువన్ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొడాని నాని వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు.  వైఎస్ జయంతి సందర్భంగా గుడివాడలో  జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని.. ప్రశ్న రావణ్ అరెస్టు, ఆయనపై కేసుల విషయంలో చేసిన వ్యాఖ్యలు, మాట్లాడిన మాటలూ, కొడాలి నాని  రాజకీయ అజ్ఞానాన్ని సూచిస్తున్నాయని వంశీకృష్ణ అన్నారు. దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగించే శక్తులపై ప్రయోగించే ఉపా  చట్టాన్ని అపహాస్యం చేయడం దుర్మార్గమని విమర్శించారు.  దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన  అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే  ఉపా చట్టాన్ని  ఉప్మా యాక్ట్  అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.  ప్రభుత్వ పెద్దలను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను దూషించినందుకు రావణ్‌ను అరెస్ట్ చేయలేదనీ,  జోసెఫ్ ఫోన్ రికార్డులను పరిశీలించిన పోలీసులు, అతను దేశ వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, యువతను నక్సలిజం, టెర్రరిజం వైపు ప్రేరేపిస్తున్నట్లు ఆధారాలు సేకరించారని వెల్లడించారు. ఆ సాక్ష్యాధారాల ఆధారంగానే కోర్టు అతనికి రిమాండ్ విధించిందని గుర్తుచేశారు. వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు తొలుత ఈ జోసెఫ్‌కు పార్టీ తరపున లీగల్ సపోర్ట్ ఇస్తామని ప్రకటించి..  తీరా అతని ఫోన్ లోని వివాదాస్పద విషయాలు బయటపడగానే ప్లేట్ ఫిరాయించారని వంశీకృష్ణ ఆరోపించారు.  గతంలో వర్రా రవీంద్ర రెడ్డి, బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి వంటి వారిని పెంచి పోషించి..  ఇప్పుడు వారితో మాకేం సంబంధం లేదన్నట్లే వైసీపీ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేనల మధ్య ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారు గ్యాప్ తేవాలని చూస్తున్నారని, కానీ  అది అసాధ్యమన్నారు.  కొడాలి నాని  రోజూ మీడియా ముందుకు వచ్చి ఇలాంటి అడ్డదిడ్డమైన వ్యాఖ్యలు చేయాలని తాను ఒక టీడీపీ కార్యకర్తగా కోరుకుంటున్నానని వంశీకృష్ణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పోలవరం పూర్తి చేయడం, రాజధాని అమరావతి నిర్మాణం, పెట్టుబడుల సాధన వంటి అభివృద్ధి పనులపై మాట్లాడుతుంటే, వైస్సార్సీపీ నేతలు మాత్రం గొడ్డళ్లు, బూడిద వంటి భాష వాడుతున్నారని, ప్రజలే అంతిమంగా దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తారని చెప్పారు.  Kodali Nani Upma Act, TDP Bandaru Vamsi Krishna Comments, Prasna Ravana UAPA Case, AP Politics Latest News, Telugu News
వైపీపీలో అంతర్గత పరిణామాలు తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి.  2024 అసెంబ్లీ   ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారిపోయింది. దీనికి తోడు జగన్ తీరుతో పార్టీలోని సీనియర్ నాయకులు పొలిటికల్ గా ఇన్ యాక్టివ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకే కాదు.. చివరాఖరికి అధినేత జగన్ కు కూడా ముఖం చాటేస్తున్నారు. ఇవి చాలవన్నట్లు  పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా   ప్రచారం సాగుతోంది. అధినేత జగన్ ఆదేశాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో సజ్జల పూర్తిగా విఫలమవుతున్నారని,జగన్ ఆయనపై   తీవ్ర అసహనం వ్యక్తం చేశారని పార్టీ వర్గాల సమాచారం.   ఈ వివాదానికి  కేంద్ర బిందువు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన  మావిగన్ అంటున్నారు. మావిగన్ ప్రతిపాదనను పార్టీ శ్రేణుల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సజ్జల రామకృష్ణారెడ్డి  విఫలమయ్యారని జగన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతే కాదు.. సొంత మీడియాలో కూడామావిగన్ అంశానికి ఇసుమంతైనా ప్రాధాన్యత దక్కకపోవడం జగన్ కు మింగుడుపడలేదు. మావిగన్ ను  సొంత మీడియా కూడా పట్టించుకోకపోవడం వెనుక  ఉన్నారని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.  మూడు రాజధానుల స్టాండ్ కారణంగా ప్రజాదరణ, ప్రజా విశ్వాసాన్నీ కోల్పోయామనీ, ఇప్పుడు మళ్లీ మావిగన్ అంటూ ప్రజజల్లోకి వెడితే ప్రతికూలత మరింత ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో..   సజ్జల, ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని భావించారనీ, అవే సంకేతాలను క్షేత్రస్థాయికి కూడా పంపారనీ పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇక్కడే.. జగన్ కు తన ఆదేశాలను కాదని సజ్జల స్వతంత్రంగా వ్యవహరించడం రుచించలేదు. తీవ్ర ఆగ్రహానికి లోనై సజ్జలను ఒకింత తీవ్రంగానే మందలించారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.   జగన్ అధికారంలో ఉన్న సమయంలో సజ్జల ఆడింది ఆట, పాడింది పాటగా నడిచింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా,  పార్టీ సమన్వయకర్తగా, సకల శాఖల మంత్రిగా ఇటు పార్టీలోనూ, అటు ప్రభుత్వంలోనూ  సర్వస్వం తానే అన్నట్లుగా సజ్జల వ్యవహరించారు.  ఆయన కుమారుడికి వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలను కూడా అప్పగించారు. అయితే ఈ ఆధిపత్యం పార్టీలోని సీనియర్ నేతలకు అస్సలు నచ్చలేదు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా.. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడానికి సజ్జల అనుసరించిన ఏకపక్ష విధానాలే కారణమని సీనియర్లు బహిరంగంగానే ఆరోపణలు గుప్పించారు. విజయసాయిరెడ్డి వంటి   కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడానికి సజ్జల రామకృష్ణారెడ్డే  కారణమంటూ జగన్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. అయినప్పటికీ జగన్ సజ్జలపై నమ్మకం ఉంచారు. కానీ మావిగన్.. విషయంలో సజ్జల తీరుపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు.   దీంతో సజ్జల కూడా పార్టీ వ్యవహారాలలో ఇక నుంచి అంటీ ముట్టనట్లు వ్యవహరించాలని నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరి మధ్య ఈ విభేదాలు పార్టీపై ఏ మేరకు ప్రభావం చూపుతాయా అన్న ఆందోళన వైసీపీ క్యాడర్ లో వ్యక్తమౌతోంది.  YSRCP Latest News, Mavigan Capital AP, YSRCP Internal Cold War
ALSO ON TELUGUONE N E W S
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ రోజురోజుకూ సరికొత్త శిఖరాలను తాకుతోంది. 'బాహుబలి' సినిమాతో మొదలైన ఆయన బాక్సాఫీస్ ప్రభంజనం, ఆ తర్వాత వచ్చిన ప్రతి చిత్రంతోనూ నార్త్ బెల్ట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తూనే ఉంది. ప్రస్తుతం క్లాసిక్ సినిమాల దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ'.  సెకండ్ వరల్డ్ వార్ టైంలో, దేశభక్తి నేపథ్యంలో సాగే ఒక అద్భుతమైన ప్రేమకథగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై అటు ట్రేడ్ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రభాస్ తన కెరీర్‌లో ఇప్పటివరకు టచ్ చేయని సరికొత్త జోనర్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ మార్కెట్‌లో మునుపెన్నడూ లేని విధంగా భారీ క్రేజ్ నెలకొంది. ఈ క్రేజ్‌ను నిజం చేస్తూ, సినిమా షూటింగ్ ఇంకా చివరి దశలో ఉండగానే 'ఫౌజీ' బిజినెస్ వేట అత్యంత గ్రాండ్‌గా మొదలైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని మేజర్ థియేట్రికల్ డీల్స్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాన్సీ రేట్లకు క్లోజ్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ప్రభాస్ సినిమాలకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు ఎప్పుడూ ముందుంటాయి. ఇప్పుడు 'ఫౌజీ' నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానికి చెందిన 'AA Films' సంస్థ అత్యంత భారీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. బాహుబలి, సాహో, కల్కి లాంటి తిరుగులేని మైలురాయి చిత్రాల నుంచి ప్రభాస్‌తో ఉన్న విజయవంతమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ ఏఏ ఫిల్మ్స్ ఈ భారీ డీల్‌ను లాక్ చేయడం విశేషం. నార్త్ బెల్ట్‌లో ఈ సినిమాను మునుపెన్నడూ లేని విధంగా చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూషన్ రంగంలో భారీ ప్లానింగ్ జరుగుతోంది.  కేవలం నార్త్ ఇండియాలోనే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్‌లోనూ 'ఫౌజీ' బిజినెస్ సరికొత్త సంచలనాలకు తెరలేపింది. ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ 'హోంబాలే ఫిల్మ్స్' ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ ను భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. నార్త్ అమెరికాలో 'ప్రత్యంగిరా సినిమాస్' ద్వారా ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ లవ్ స్టోరీలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారని టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రతి ఫ్రేమ్ విజువల్ వండర్‌గా ఉండేలా దర్శకుడు హను రాఘవపూడి ప్లాన్ చేస్తున్నారు. సినిమా రిలీజ్‌కు ముందే ఈ స్థాయిలో థియేట్రికల్ డీల్స్ క్లోజ్ అవ్వడం రెబల్ స్టార్ బాక్సాఫీస్ స్టామినాకు నిదర్శనమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.     Prabhas, Fauzi Movie, Business, AA Films, Hombale Films  
  -సినిమాపేరు: లెనిన్  -న‌టీన‌టులు: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, ప్రమోద్ పంజు, శివాజీ, సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరి రావు  తదితరులు -సినిమాటోగ్ర‌ఫీ: లియోన్ బ్రిట్టో  -ఎడిటింగ్: నవీన్ నూలి -మ్యూజిక్: థమన్  -నిర్మాత‌లు: నాగార్జున, నాగవంశీ -బ్యానర్స్ : మనం ఎంటర్ ప్రైజెస్, సితార ఎంటర్ టైన్ మెంట్  -రచన,దర్శకత్వం: మురళి కిషోర్ అబ్బూరు -రిలీజ్ డేట్ : జులై 10 ,2026  అభిమానులు, తెలుగు సినిమా ప్రేమికుల సుదీర్ఘ నిరీక్షణకి తెరదించుతు అఖిల్ అక్కినేని(Akhil Akkineni)ఈ రోజు లెనిన్(Lenin)తో సెల్యులాయిడ్ పై అడుగుపెట్టాడు. ఉదయం ఎనిమిది గంటల నుంచే షోస్ పడటంతో అక్కినేని అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొని ఉంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ లెనిన్ (అఖిల్) మంచితనంతో పాటు ఎలాంటి కల్మషం లేని యువకుడు. అనాధగా  చిత్తూరు జిల్లాలోని భారతీమిట్ట శ్రీరామపురం అనే గ్రామం వస్తాడు.మహాభారతంలోని ద్రౌపది మాత కన్నీటి బొట్టుకి సాక్షిగా నిలిచిన ఊరు. లెనిన్ ని ఆ గ్రామవంశపారంపర్య పెద్ద జయంతి( ఈశ్వరి రావు)ఆమె కొడుకు వసంత్( ప్రమోద్ పంజు) చేరదీస్తారు. జయంతి చిన్న కొడుకులాగా పెరుగుతాడు. భారతి (భాగ్యశ్రీ బోర్సే) చలాకీ, చురుకుతనం నిండిన బాగా చదువుకున్న యువతి. భారతి, లెనిన్ ఒకరినొకరు ప్రాణానికి ప్రాణంగా  ప్రేమించుకుంటారు. దీంతో ఆ ఇద్దరికి ఈశ్వరి రావు, వసంత్ పెళ్లి చేస్తారు. మరి ఎలాంటి  నెగిటివ్ క్యారక్టర్ లేని ఈ కథలో అసలు విలన్ ఎవరు? వాళ్ళ వాళ్ళ లెనిన్ కి ఏమైనా అన్యాయం జరిగిందా? జరిగితే ఎలాంటి అన్యాయం? అందుకు లెనిన్ ఏం చేసాడు? ద్రౌపది మాత కన్నీటి బొట్టుకి, లెనిన్ ఉన్న సంబంధమేంటి? యతిరాజు(శివాజీ) తో పాటు మిగతా క్యారక్టర్ లు ఏంటి? అసలు లెనిన్ కథ ఏంటి అనేదే చిత్ర కథ ఎనాలసిస్  మొదటి పావు గంట వచ్చే కథనం నార్మల్ గానే ఉంది.  ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో ప్రతి సీన్ నడవడంతో పాటు లెనిన్, భారతి మధ్య వచ్చిన లవ్ సీన్స్ ఫ్రెష్ గా ఉన్నాయి. యతిరాజు సీన్స్ తో పాటు జయంతి, వసంత్ సీన్స్  బాగుండటంతో పాటు వాళ్ళ తాలూకు క్యారక్టర్ డిజైన్ తో నెక్స్ట్ ఏదో జరగబోతుందనే విషయం అర్దమవడంతో పాటు ఇంట్రెస్ట్ ని కలిగించాయి. ముఖ్యంగా భారతి సిస్టర్ వైదేహి ఎపిసోడ్ బాగా పేలింది. ఫస్ట్ హాఫ్ కి బలంగా నిలిచింది కూడా.   సాంగ్స్ కూడా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో లెనిన్, భారతి మ్యారేజ్ ఎపిసోడ్ తో పాటు యతిరాజు, వసంత్ క్యారక్టర్ లు టర్న్ తీసుకోవడం, ఆ సందర్భంగా వచ్చే సీన్స్ గూస్ బంప్స్ వస్తాయి. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఆ సందర్భంగా వచ్చే సీన్స్ , అందుకు థమన్ ఇచ్చిన మ్యూజిక్ రోమాలు నిక్కబరుచుకునేలా చేస్తాయి. ఎవరు ఊహించని విధంగా సన్నివేశాలు రావడంతో పాటు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. టోటల్ గా సెకండ్ హాఫ్ లెనిన్ కి అతి పెద్ద ఎసెట్ గా నిలిచింది. నటీనటులు సాంకేతిక నిపుణల పని తీరు   లెనిన్ గా  అఖిల్ తన  నట విశ్వరూపాన్ని చూపించాడు. ప్రమోషన్స్ లో  మేకర్స్ చెప్పినట్టుగానే అఖిల్  కనపడలేదు. లెనిన్ క్యారక్టర్ మాత్రమే కనపడింది. ముఖ్యంగా ప్రీ  క్లైమాక్స్, క్లైమాక్స్ లో అఖిల్ పెర్ఫార్మ్ నభూతో న భవిష్యత్. ఎంటైర్ తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా అఖిల్ కెరీర్ లో లెనిన్ నిలిచిపోతుంది. లవ్, యాక్షన్ సన్నివేశాల్లో ఒక రేంజ్ పెర్ఫార్మ్ ఇచ్చాడు. భారతిగా భాగ్య శ్రీ బోర్సే మరోసారి తన అందచందాలతో ఆకట్టుకోవడమే కాకుండా అందమైన పెర్ఫార్మ్ చేసింది. ఆ  క్యారక్టర్ లో తను తప్పించి మరొకర్ని ఉహించుకోలేం. సీనియర్ యాక్టర్స్ శివాజీ, బ్రహ్మాజీ, సునీల్ మరోసారి అద్భుతమైన పెర్ఫార్మ్ తో మెప్పించారు. నెగిటివ్ రోల్ లో చేసిన ప్రమోద్ పంజు తన సినీ క్యాలండర్ బిజీ ఉండేలా ఒక రేంజ్ పెర్ఫార్మ్ చేసాడు. ఈశ్వరి రావు తో పాటు మిగతా వాళ్ళు కూడా  తమ క్యారక్టర్ పరిధి మేరకు నటించి మెప్పించారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ థియేటర్ లో అఖండ కి థియేటర్ లో ఎలా అయితే పూనకాలు వచ్చాయో. అదే పూనకాలు లెనిన్ కి కూడా తెప్పించాడు. తెప్పించడమే కాకుండా లెనిన్ ని అతి పెద్ద ప్లస్ అయ్యాడు. సాంగ్స్ ఇంకా బాగుండాల్సింది.లియోన్ బ్రిట్టో  ఫొటోగ్రఫీ కూడా అంతే. లెనిన్ ని ప్రేక్షకులు తమ ఇంటి దాకా తీసుకెళ్లేలా ఉంది. నిర్మాణ విలువలు ప్లస్. మురళికృష్ణ అబ్బూరి నుంచి వచ్చిన కథ, కధనం ఫస్ట్ హాఫ్ సో సో గా ఉన్నా, సెకండ్ హాఫ్ లో తన హవా చాటాడు. దర్శకుడిగా భారీగా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు  బలాలు 1 . కథ  2 . అఖిల్, భాగ్యశ్రీ బోర్సే తో పాటు ఆల్ ఆర్టిస్ట్ పెర్ ఫార్మెన్స్  3 . బ్యాక్ గ్రౌండ్ స్కోర్  4 . ప్రీ క్లైమాక్స్  5 . క్లైమాక్స్  బలహీనతలు     1 . ఫస్ట్ హాఫ్ లో కథని పెద్దగా చెప్పకపోవడం. చివరిగా చెప్పుకోవాలంటే అఖిల్ తన వన్ మాన్ షో తో లెనిన్ ని నచ్చేలా చేసాడు.   రేటింగ్ 2.75 /5                                                                                     అరుణాచలం 
హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో గురువారం అర్ధరాత్రి వేళ భారీ ప్రమాదం తప్పింది. టాలీవుడ్ నటుడు ధర్మ నివాసంలోకి ఒక కారు అతివేగంగా దూసుకెళ్లడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిన ఆ అర్ధరాత్రి సమయంలో కొందరు యువకులు మద్యం మత్తులో కారు నడపడమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు కారులో ఫిల్మ్‌నగర్ రోడ్డుపై ఊహించని వేగంతో వెళ్తూ ఒక్కసారిగా వాహనంపై నియంత్రణ కోల్పోయారు. దీంతో పూర్తిగా అదుపుతప్పిన ఆ కారు నేరుగా నటుడు ధర్మ ఇంటి వైపునకు దూసుకువచ్చి, ప్రధాన గేటును బలంగా ఢీకొడుతూ లోపలికి చొచ్చుకెళ్లింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఇంట్లో గాఢనిద్రలో ఉన్న కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక కంగారుగా బయటకు వచ్చి చూడగా, గేటు ధ్వంసమై ముంగిట కారు ఆగి ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ధర్మ కుటుంబ సభ్యులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారును పరిశీలించి, అందులో ఉన్న యువకులను వెంటనే తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారు దూసుకొచ్చిన ప్రాంగణంలో ఇంట్లో ఉన్నవారెవరూ అటుగా లేకపోవడంతో ఒక పెద్ద ముప్పు తప్పినట్లయింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం కానీ, గాయాలు కానీ కాలేదని పోలీసులు వెల్లడించారు. నటుడు ధర్మ ఇంటి ప్రహరీ గోడ, మెయిన్ గేటు కొంతవరకు ధ్వంసమైనట్లు తెలుస్తోంది.     Actor Dharma, Car Accident, Film Nagar, Hyderabad  
మలయాళ స్టార్ స్టార్ దుల్కర్ సల్మాన్ సరికొత్త ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా క్రేజీ ప్రాజెక్ట్ #DQ41 టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం రివీల్ చేసింది. ఈ చిత్రానికి ఎంతో ఆహ్లాదకరంగా 'శ్రీశ్రీ' (Sri Sri) అనే టైటిల్‌ను ఖరారు చేశారు.  ఎస్‌ఎల్‌వి సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సరికొత్త కథాంశంతో, ఎమోషనల్ అండ్ రొమాంటిక్ రైడ్‌లా సాగే ఈ సినిమాను నూతన దర్శకుడు రవి నెలకుడితి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం వల్ల ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేమ, వినోదం, గుండెలను హత్తుకునే భావోద్వేగాల కలబోతగా ఈ లవ్ స్టోరీ రూపుదిద్దుకుంటోంది.  గతంలో విడుదలైన వర్కింగ్ స్టిల్స్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందులో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూశాక, వెండితెరపై ఈ జంట సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు విడుదలైన టైటిల్ పోస్టర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఈ చిత్రానికి "లవ్ విల్ స్పార్క్ అగైన్" (Love Will Spark Again) అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను పెట్టారు. కోల్పోయిన ప్రేమను, జీవితంపై ఆశను మళ్లీ ఎలా వెతుక్కున్నారనే ఒక అందమైన కథాంశంతో ఈ సినిమా సాగనుందని ఈ ట్యాగ్‌లైన్ హింట్ ఇస్తోంది.  ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికి వస్తే.. ఇందులో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ఒక కాంపౌండ్ వాల్‌పై క్యాజువల్‌గా కూర్చొని నవ్వుకుంటూ ముచ్చటించుకుంటున్నారు. దుల్కర్ సల్మాన్ లైట్ బ్లూ కలర్ షర్ట్, గ్రే కలర్ ట్రౌజర్స్ ధరించి, కళ్లద్దాలతో ఎంతో క్లాసిక్ లుక్‌లో కనిపిస్తున్నారు. పూజా హెగ్డే లైట్ బ్లూ కలర్ సల్వార్ సూట్ వేసుకుని, దుల్కర్ వైపు ఎంతో అప్యాయంగా చూస్తూ నవ్వుతోంది. వారిద్దరూ వేసుకున్న దుస్తులను బట్టి చూస్తే కాలేజీ క్లాస్‌మేట్స్‌లా కనిపిస్తున్నారు.  ఈ పోస్టర్ చూస్తుంటే పాత జ్ఞాపకాలు, అమాయకత్వంతో కూడిన ఒక స్వచ్ఛమైన ప్రేమకథ మనకు గుర్తుకు రాక మానదు. ఎటువంటి హడావుడి లేకుండా ఎంతో ప్రశాంతంగా, మనసుకు హత్తుకునేలా ఉన్న ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో ఒక పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేశారు. 'శ్రీశ్రీ' చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో థియేటర్లలో విడుదల కానుంది. https://x.com/SLVCinemasOffl/status/2075440862235070799   Dulquer Salmaan, Pooja Hegde, Sri Sri Movie, First Look, DQ41  
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్‌లతో క్షణం తీరిక లేకుండా ఉన్న డార్లింగ్ ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకోబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'స్పిరిట్' షూటింగ్‌లో ప్రభాస్ పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్‌లో హీరో ప్రభాస్, హీరోయిన్ త్రిప్తి డిమ్రి కాంబినేషనల్ సీన్స్‌తో పాటు కొన్ని హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా చిత్ర యూనిట్ శరవేగంగా చిత్రీకరిస్తోంది. అయితే ఈ స్పిరిట్ లేటెస్ట్ షెడ్యూల్ పూర్తి కాగానే ప్రభాస్ ఒక స్మాల్ బ్రేక్ ఇవ్వనున్నారు. సుమారు 10 రోజుల పాటు వెకేషన్ కోసం ఆయన యూరప్ వెళ్లనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. నిరంతర షూటింగ్‌ల వల్ల వచ్చిన అలసటను దూరం చేసుకునేందుకు, సరికొత్త ఎనర్జీతో తిరిగి వచ్చేందుకు డార్లింగ్ ఈ 10 రోజుల యూరప్ టూర్‌ను ప్లాన్ చేసుకున్నారు. ఈ చిన్న విరామం తర్వాత ప్రభాస్ మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చి తన సినిమాలపై పూర్తి ఫోకస్ పెట్టనున్నారు. యూరప్ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన వెంటనే ప్రభాస్ తన పూర్తి ఫోకస్‌ను హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న 'ఫౌజీ' సినిమాపై పెట్టనున్నారు. పీరియడ్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ చిత్రంతో ఇమాన్వి హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అందుకే ఇండియాకు రాగానే మొదటగా ఈ 'ఫౌజీ' బ్యాలెన్స్ షూటింగ్‌ను కంప్లీట్ చేయాలనే ప్లానింగ్‌లో డార్లింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్స్ అన్నింటినీ చక్కబెట్టిన తర్వాత ప్రభాస్ మళ్లీ 'స్పిరిట్' సినిమాను పూర్తి చేసే పనిలో పడతారు. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన గ్లోబల్ హిట్ 'కల్కి 2898 AD' సీక్వెల్ అయిన 'కల్కి 2' సెట్స్‌లో జాయిన్ అవుతారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోయే 'సలార్ 2' షూటింగ్ కూడా లైన్లో ఉంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు భారీ పాన్ ఇండియా సినిమాల లైనప్‌తో ప్రభాస్ రాబోయే రోజుల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. అందుకే ఈ బిజీ లైఫ్ నుండి కాస్త రిలాక్స్ అవ్వడానికి డార్లింగ్ ఈ చిన్న వెకేషన్ ట్రిప్ వేస్తున్నారు.     Prabhas, Europe Vacation, Spirit, Fauzi, Kalki 2  
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నారా అనే చర్చ రాజకీయ, సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. వెండితెరపై తనదైన నటన, డాన్సులతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ స్టార్ హీరో, ఇప్పుడు ప్రజాసేవ వైపు అడుగులు వేసేందుకు బలమైన పునాది వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.  టాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్ హీరోలు రాజకీయాల్లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం అందరిలా కాకుండా అత్యంత వ్యూహాత్మకంగా, చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తమిళనాడు సీఎం దళపతి విజయ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు సమాచారం. విజయ్ తన అభిమాన సంఘాల ద్వారా ప్రజలకు చేరువై, ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు బన్నీ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి.  ఈ క్రమంలోనే ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్‌(PK)తో  అల్లు అర్జున్ అంతర్గత సంప్రదింపులు జరిపారనే న్యూస్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సినీ గ్లామర్ మాత్రమే రాజకీయాల్లో గెలుపును తెచ్చిపెట్టదని బాగా నమ్మే బన్నీ, క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకునేందుకు పీకే టీమ్ సహాయం కోరినట్లు ప్రచారం జరుగుతోంది.  తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలు ఏమిటి? భవిష్యత్తులో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అనే అంశాలపై వీరిద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినట్లు పొలిటికల్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం భావోద్వేగాలతో కాకుండా, పక్కా డేటా, నియోజకవర్గాల వారీగా సర్వే నివేదికల ఆధారంగానే బన్నీ తన పొలిటికల్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. ఈ భారీ పొలిటికల్ ప్లాన్ వెనుక అల్లు అర్జున్ మామగారు, ప్రముఖ పారిశ్రామికవేత్త కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నుంచి లభిస్తున్న ప్రోత్సాహం, సహకారం ఎంతో కీలకంగా మారాయని తెలుస్తోంది. రాజకీయాల్లో అనుభవం ఉన్న ఆయన, తన అల్లుడిని ఒక పవర్‌ఫుల్ లీడర్‌గా ప్రొజెక్ట్ చేసేందుకు తెరవెనుక చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రయాణంలో ఎక్కడా తొందరపాటు పనికిరాదని, సరైన సమయం చూసి జనాల్లోకి వెళ్లాలని అల్లు అర్జున్ భావిస్తున్నారట.  మరి ఈ వార్తల్లో నిజమెంత? అల్లు అర్జున్ నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా? ప్రశాంత్ కిశోర్‌తో సంప్రదింపులు నిజమేనా? త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.     Allu Arjun, Political Entry, Prashant Kishor, Andhra Pradesh  
అక్కినేని అఖిల్ హీరోగా, గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ రూరల్ డ్రామా 'లెనిన్'. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అఖిల్ స్క్రీన్‌పైకి వస్తుండటంతో అక్కినేని అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. రాయలసీమ గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం నేడు (జూలై 10న) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. ట్విట్టర్ (X) వేదికగా అందుతున్న ముందస్తు రివ్యూస్ ప్రకారం, సినిమా చాలా ఇంటెన్స్ అండ్ ఎంగేజింగ్‌గా సాగిందని ప్రేక్షకులు చెబుతున్నారు. కథ ప్రారంభం నుండి ఎలాంటి ల్యాగ్ లేకుండా అసలు పాయింట్‌లోకి తీసుకువెళ్లడం, గ్రామీణ వాతావరణాన్ని చక్కగా ఎలివేట్ చేయడం సినిమాకు బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా అఖిల్, భాగ్యశ్రీ భోర్సేల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండిందని.. వారి లవ్ ట్రాక్, స్నేహానికి సంబంధించిన సన్నివేశాలను డైరెక్టర్ చాలా హృద్యంగా ఆవిష్కరించారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రీ-ఇంటర్వెల్, ఇంటర్వెల్ సాలిడ్‌గా డిజైన్ చేశారని, ఇంటర్వెల్ సీన్ థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. సెకండ్ హాఫ్ లో కూడా క్రేజీ ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ఎమోషన్స్ కూడా బాగా పండాయని చెబుతున్నారు. క్లైమాక్స్ అదిరిపోయిందని, వంద కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని టాక్ వస్తోంది.  అఖిల్ తన గత చిత్రాల కంటే భిన్నమైన సరికొత్త ఊర మాస్ అవతారంలో కనిపించారని.. అతని ట్రాన్స్‌ఫార్మేషన్, నటన అద్భుతంగా ఉన్నాయని కొనియాడుతున్నారు. ఈ సినిమాకు అసలైన ఆత్మ భాగ్యశ్రీ భోర్సే పాత్రేనని, కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఆమె అద్భుతంగా రాణించిందని అంటున్నారు. మొత్తానికి, అఖిల్ పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి 'లెనిన్' ఒక సరైన చిత్రంగా నిలిచిందని ట్విట్టర్ టాక్ స్పష్టం చేస్తోంది.     Lenin X Review, Akhil Akkineni, Bhagyashri Borse, TeluguOne  
తెలుగు చిత్ర పరిశ్రమ సోగ్గాడు, దివంగత నటుడు శోభన్ బాబు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి శాంతకుమారి (86) చెన్నైలో వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. భర్త స్టార్ ఇమేజ్‌తో ఇండస్ట్రీని ఏలుతున్నా.. ఎప్పుడూ ప్రచారానికి, ఆడంబరాలకు దూరంగా ఉంటూ, సాధారణ గృహిణిగా జీవించిన ఆమె ప్రస్థానం ఎందరికో ఆదర్శం. శోభన్ బాబు సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే, అంటే 1958 మే 15న శాంత కుమారితో ఆయన వివాహం జరిగింది. ఆయన సినీ కెరీర్ ప్రారంభ దశ నుంచి అగ్ర హీరోగా ఎదిగే వరకు శాంతకుమారి ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. ఒక స్టార్ హీరో భార్య అయి ఉండి కూడా శాంతకుమారి ఎప్పుడూ మీడియా ముందుకు రావడానికి ఇష్టపడలేదు. 2008లో శోభన్ బాబు మరణించిన తర్వాత కూడా ఆమె చెన్నైలోనే ఉంటూ తన పిల్లలతో కలిసి చాలా నిరాడంబరమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు, శాంతకుమారి మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, శోభన్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.     Sobhan Babu Wife, Santa Kumari, Passed Away
After weeks of uncertainty surrounding its censor process, CM Vijay's Jana Nayagan has finally cleared the Central Board of Film Certification (CBFC). The film has been awarded an 'A' (Adults Only) certificate, clearing the final hurdle ahead of its theatrical release and putting it firmly on track for a July 23 release. The certification comes as a major relief for the makers after reports of delays during the censor process triggered speculation about the film's release plans. With the CBFC formalities now complete, the team can now shift its complete focus towards promotions in the final countdown to release. An 'A' certificate typically points to intense violence, mature themes or strong language. Going by the film's promotional material, Jana Nayagan appears to embrace a gritty and hard-hitting narrative, making the certification consistent with its overall tone. The last film Thalapathy Vijay in the lead role, alongside Pooja Hegde and Bobby Deol in pivotal roles. Directed by H. Vinoth, Jana Nayagan features music composed by Anirudh Ravichander, with Sathyan Sooryan handling cinematography and Pradeep E. Ragav serving as the editor. The film is produced by KVN Productions on a grand scale and marks Vijay's final film before his full-fledged entry into politics, making it one of the most anticipated Tamil releases of the year. With the censor hurdle finally behind it, all eyes are now on Jana Nayagan as it gears up for its worldwide release on July 23. The combination of Vijay's star power, H. Vinoth's action-packed storytelling and Anirudh's chart-topping music has already generated significant buzz, and the coming days are expected to see the film's promotional campaign gather further momentum. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Producer Naga Vamsi appears to have struck gold with Suriya's Viswanath and Sons. Riding on the phenomenal success of Suriya's Karuppu, the upcoming project has reportedly witnessed a surge in its pre-release business, taking its overall valuation close to the ₹300 crore mark. Trade circles suggest that the film's theatrical, non-theatrical and digital rights have together generated business worth nearly ₹300 crores. The impressive figures are largely being attributed to the renewed market confidence in Suriya following the blockbuster performance of Karuppu, which significantly boosted his commercial standing across territories. Industry reports further indicate that the strong deals have translated into an estimated profit of around ₹90-100 crores for producer Naga Vamsi even before the film reaches theatres. Such healthy margins underline the confidence distributors and streaming platforms have shown in the project. The combination of Suriya's resurgent box-office pull, the scale of Viswanath and Sons, and the aggressive demand for its rights has turned the film into one of the biggest pre-release business success stories in recent times. The numbers also reflect how quickly a blockbuster can reshape an actor's market value. While the makers are yet to officially comment on the business figures, the trade buzz surrounding Venky Atluri directorial Viswanath and Sons has only heightened expectations. After Karuppu revived Suriya's box-office momentum, all eyes are now on whether the upcoming film can justify its massive valuation with a strong theatrical run. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం.  భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది.  భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది.  అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది. కానీ కోడలిగా వచ్చిన ఆడపిల్లను బాధపెట్టే అత్తమామలు ఉంటే.. ఆ ఆడపిల్లల జీవితం నరకప్రాయంగా ఉంటుంది.  అయితే.. బాధపెట్టే అత్తమామలు ఉన్నారని, వివాహ బంధాన్ని తెంచుకుని వెళ్లలేరు చాలామంది అమ్మాయిలు,  బాధపెట్టే అత్తమామలతో  ఎలా ఉండాలో,  వాళ్లతో కలిసి ఎలా జీవించాలో లైఫ్ స్టైల్ నిపుణులు చెబుతున్నారు..  వీటి గురించి తెలుసుకుంటే.. మార్చాలని అనుకోకూడదు.. కొన్నిసార్లు  అత్తమామలు కోడళ్ల మీద ఒత్తిడిని, ఇబ్బందులను కలిగిస్తారు. బాధపెట్టే అత్తమామల గురించి చాలా మంది జోక్ గా చెప్తూ ఉంటారు. కానీ బాధపెట్టే అత్తమామలు ఉండటం జోక్ కాదు.. అది ఆడపిల్లలను చాలా బాధపెడుతుంది, చాలా ఒత్తిడిలోకి నెడుతుంది.  అలాంటి అత్తమామలు  మానసిక ప్రశాంతతను, వివాహ బంధాన్ని కూడా ప్రభావితం చేస్తారు. చాలా మంది కోడళ్లు తమ అత్తమామలు మారితే బాగుండు అని అనుకుంటారు. కానీ అత్తమామలు మారాలని,  వాళ్లను  మార్చాలని అనుకోవడం వ్యర్థం. అత్తమామలు ఏ విషయాల పట్ల బాధపెడతారో తెలిసినప్పుడు వాటి గురించి పట్టించుకోకుండా ఉండటమే  మంచిది. పరిమితులు..  బాధపెట్టే అత్తమామలు ఉన్నప్పుడు, ప్రతి కోడలు తన భర్త సహాయంతో  కొన్ని సొంత పరిమితులను నిర్దేశించుకుని, వాటికి కట్టుబడి ఉండడం  మంచిది. పరిమితులు ఏర్పాటు చేసుకున్నప్పుడు పెద్దవాళ్లు, అత్తమామలు మాట్లాడే ఏ మాటలు లేదా ప్రవర్తన పరిమితులను దాటి జీవితంలోకి తీసుకుని బాధపడే పరిస్థితి రాదు.   సమస్య, పరిష్కారం.. ఏదైనా సమస్యను పరిష్కరించే ముందు, దాని మూల కారణాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. అత్తమామల చెడు  ప్రవర్తన అకస్మాత్తుగా జరగదు. వారు ప్రతీదీ తమకు నచ్చినట్టుగా జరగాలని కోరుకోవడం, తమ భావాలను అదుపు చేసుకోలేకపోవడం, లేదా గతంలోని మానసిక గాయాలను మోయడం వంటి కారణాల వల్ల ఇది తరచుగా జరుగుతుంది. కొన్నిసార్లు, అత్తమామలు కోడలు పెరిగిన విధానాన్ని, కోడలి పుట్టింటి వారి పద్దతులను,  నియమాలను అగౌరవపరుస్తారు, మరికొన్ని సార్లు  స్వార్థపరురాలు అనే ట్యాగ్ వేసి  వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘిస్తారు, లేదా కుటుంబంలో కలహాలు సృష్టించి కోడలిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ పద్ధతులను గుర్తించడమే కోడళ్లు అత్తారింట్లో బాధపెట్టే అత్తమామలతో కలిసి ఎలా జీవించాలనే విషయాన్ని అర్థమయ్యేలా చేస్తాయి.                                      *రూపశ్రీ.
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. కొత్త వాతావరణం, కొత్త ఉపాధ్యాయులు, కొత్త తరగతులు మరియు కొత్త స్నేహితులు ఉత్సాహంతో పాటు ఆందోళనను కూడా కలిగిస్తాయి. చాలా మంది పిల్లలు మొదట్లో పాఠశాలలో తమకు ఎదురయ్యే విషయాలను, తమ మనసులోని విషయాలను  మనసు విప్పి చెప్పలేరు. అయితే తల్లిదండ్రుల బాధ్యత కేవలం పిల్లలను బడికి పంపడమే కాదు.. పిల్లల గురించి ఎన్నో విషయాలు తల్లిదండ్రులు ఆలోచించాలి. మరీ ముఖ్యంగా..  కొత్తగా స్కూల్ కు వెళ్తున్న పిల్లలను కొన్ని ప్రశ్నలు తప్పకుండా అడగాలి. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. ప్రతిరోజూ పిల్లలను అడాగాల్సిన ప్రశ్నలు.. నచ్చిన విషయం.. ఈ రోజు పాఠశాలలో అన్నింటి కన్నా నీకు నచ్చిన విషయం ఏదని పిల్లలను అడగాలి.  ఈ ప్రశ్న పిల్లలో సానుకూల విషయాలను వెలికితీయడానికి సహాయపడుతుంది.  కొందరు పిల్లలు బడికి వెళ్లొచ్చిన తర్వాత మళ్లీ బడికి వెళ్లమని మారం చేస్తుంటారు. కానీ బడిలో వారికి నచ్చిన విషయాన్ని గుర్తు చేయడం వల్ల పిల్లలకు పాఠశాల పట్ల ఉత్సాహం పెరుగుతుంది.  అలాగే తల్లిదండ్రులు పిల్లలతో ఇలా మాట్లాడటం వల్ల పిల్లలు  స్వేచ్ఛగా మాట్లాడటం నేర్చుకుంటారు,  ఏ విషయాన్ని అయినా బెరుకు లేకుండా చెప్పగలుగుతారు. ఇది పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. పిల్లలకు ఏ విషయాల మీద ఆసక్తి ఉందో కూడా తల్లిదండ్రులకు అర్థం అవుతుంది. ఎవరితో ఆడుకున్నావు లేదా మాట్లాడావు అని అడగాలి.. పిల్లలు పాఠశాలలో ఎవరితో ఆడుకున్నారు, మాట్లాడారు అనే విషయాలు కొత్త స్నేహితుల గురించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది.  పిల్లలకు సామాజిక అవగాహన అర్థం అవుతుంది. పిల్లలు బడిలో ఒంటరిగా ఉంటారా లేదా ఇతరులతో కలుస్తున్నారా,  ఎవరితో అయినా కలవడంలో  ఇబ్బంది ఫీలవుతున్నారా?  అనే విషయాలు అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులకు సహాయపడుతుంది. ఏదైనా భయం లేదా బాధ పెట్టే విషయం ఉందా అని అడగాలి.. కొందరు పిల్లలు స్కూల్ లో తోటి విద్యార్థుల వల్ల, ఉపాధ్యాయుల వల్ల బాధపడటం, భయపడటం జరుగుతూ ఉంటుంది. దీని వల్ల పిలల్లు బడికి  వెళ్లాలంటే భయపడటారు.  ఈ కారణంగా చదువు మీద ఆసక్తి కూడా తగ్గిపోతుంది. పిల్లల భయాన్ని తగ్గించినప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజు ఏం నేర్చుకున్నావని అడగాలి.. పిల్లలను  ఈ రోజు ఏం నేర్చుకున్నావని ప్రతి రోజూ అడిగితే వారికి ఏ విషయం పట్ల ఆసక్తి ఎక్కువ ఉందో అర్థమవుతుంది. తద్వారా పిల్లలను ప్రోత్సహించడంలో తల్లిదండ్రులకు ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇలా అడిగినప్పుడు పిల్లలు అన్ని చెబుతూ ఉంటే.. పిల్లలలో జ్ఞాపకశక్తి,  వారిలో బావ వ్యక్తీకరణ వంటివి మెరుగు పడతాయి.                          *రూపశ్రీ.
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు,  గొడవలు, అతిగా స్పందించడం, జోక్యం చేసుకోవడం వంటివి కూడా గతంలో కంటే ఎక్కువగా పెరిగాయని చెప్పవచ్చు. వీటి వల్ల బంధాల మధ్య దూరం పెరుగుతుంది. అయితే నేటికాలంలో బంధాలు బలంగా ఉండాలంటే మైక్రో ప్రైవసీ పాటించాలట. ఇంతకీ మైక్రో ప్రైవసీ అంటే ఏంటి? ఇది బంధాలను బలంగా ఉంచడంలో ఎలా సహాయపడుతుంది? తెలుసుకుంటే.. మైక్రోప్రైవసీ.. మైక్రో-ప్రైవసీ అనేది నేటికాలంలో సంబంధాల గురించి జాగ్రత్త చేసే ఒక మార్గం. సంబంధంలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికీ కొంత పర్సనల్ స్పేస్  అవసరమని ఇది చెబుతుంది. ఈ స్పేస్  వ్యక్తికి మానసిక స్వేచ్ఛను అందిస్తుంది , సంబంధం భారంగా మారకుండా నివారిస్తుంది. ప్రేమ అంటే ప్రతీదాన్నీ నియంత్రించడం కాదని, ఒకరి హద్దులను మరొకరు గౌరవించుకోవడం కూడా అని మైక్రో ప్రైవసీ నొక్కి చెబుతుంది. మైక్రో-ప్రైవసీ సంబంధాలలో ఒక బాలెన్స్ ను క్రియేట్ చేస్తుంది.  దీనివల్ల ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నా ఎవరి ఐడెంటిటీ వారికి ఉంటుంది. మైక్రో ప్రైవసీలో అసలు అర్థం.. మైక్రోప్రైవసీలో ఉండే  ముఖ్యమైన అంశం  భాగస్వామి లేదా కుటుంబ సభ్యుని  పర్సనల్ ఫీలింగ్స్ ను, పర్సనల్  సమయాన్ని గౌరవించడం. ఎప్పుడూ వారితో టచ్‌లో ఉండటం లేదా ప్రతి కదలికను గమనించడం అనేది  సంబంధాలను బలహీనపరుస్తుంది. దానికి బదులుగా, ఒకరికొకరు కొంత స్వేచ్ఛను ఇచ్చుకుంటూ, ఒత్తిడి లేకుండా సంబంధాన్ని కొనసాగించడం ముఖ్యం. అతిగా డిపెండ్ అవడాన్ని, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ను నియంత్రణలో ఉంచడంలో కూడా మైక్రో ప్రైవసీ సహాయపడుతుంది. మైక్రో ప్రైవసీ ఎందుకు అవసరం.. మైక్రో ప్రైవసీ  సంబంధాలలో నమ్మకాన్ని, అర్థం చేసుకునే తత్వాన్ని పెంపొందిస్తుంది. ప్రతి ఒక్కరికి  వారి స్వంత సమయం, స్పేస్  ఉన్నప్పుడు, వారు మానసికంగా మరింత ప్రశాంతంగా, బాలెన్స్డ్ గా  ఉంటారు. ఇది సంబంధాలలో అనవసరమైన ఒత్తిడిని తగ్గించి ఎక్కువ కాలం బంధాలు పదిలంగా ఉండేలా చేస్తుంది. మైక్రో ప్రైవసీ పాటించే వ్యక్తులు తమ ఐడెంటిటీని కూడా కోల్పోకుండా ఉంటారు.  ఒకరి ముందు ఒకరు తక్కువ కాదు అనేలా బందాలు ఉంటే.. ఆ బంధాలు ఎన్నేళ్ళైనా పదిలంగా ఉంటాయి. ఇలా  చేయాలి.. భార్యాభర్తలలో ఎవరో ఒకరు అప్పుడప్పుడు ఒంటరిగా సమయం గడపాలని, అభిరుచులను కొనసాగించాలని, లేదా స్నేహితులతో సమయం గడపాలని కోరుకున్నప్పుడు, వారికి అంతరాయం కలిగించకుండా లేదా ప్రశ్నించకుండా వారి ఇష్టాలను గౌరవించడం, వారి అభిరుచులను కొనసాగించడంలో మద్దతు ఇవ్వడం వంటివి మైక్రో ప్రైవసీకి చక్కని ఉదాహరణ.  ఇది ఈ రోజు కొత్తగా  చెప్పాల్సిన విషయమేమీ కాదు.. కానీ కొందరికి అర్థం కావాలంటే కొన్ని ప్రత్యేక మార్గాలలో చెప్పాలి. అందుకే దీన్ని మైక్రో ప్రైవసీ అంటున్నారు.  ఈ మార్గాన్ని పాటిస్తే బంధాలు పదిలంగా ఉంటాయి.                                  *రూపశ్రీ.
టీ లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో బ్లాక్ టీ మాత్రమే కాకుండా..  గ్రీన్ టీ తో పాటు కుంకుమ పువ్వు  టీ,  కార్శీరీ ఖవ్వా టీ,  జాస్మిన్ టీ.. ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు బరువు తగ్గడంలో సహాయపడతాయని చెబుతారు.  ఇవన్నీ మొన్నటి వరకు ట్రెండ్ అయినవే. అయితే ఇప్పుడు మరొక కొత్త టీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.  పైగా బరువు తగ్గడం కోసం సెలబ్రిటీలు గ్రీన్ టీకి స్వస్తి చెప్పి ఈ కొత్త రకం టీ ను ఉపయోగిస్తున్నారని చెబుతారు. అసలు ఈ మాచా టీ ఏమిటి? దీన్నితాగడం వల్ల బరువు ఎలా తగ్గుతారు? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. మచా టీ.. సాధారణ గ్రీన్ టీని కేవలం ఆకులను  మరిగించిన నీటిలో వేడయం  ద్వారా తయారుచేస్తారు, అయితే మాచా అనేది మొత్తం ఆకులను పొడిగా తయారు చేసి దాన్ని  నీటిలో కలిపి తయారు చేసే టీ... ఈ కారణంగానే గ్రీన్ టీ కంటే మాచా ఎక్కువ ప్రయోజనకరమైనదిగా ఉంటందని చెబుతారు. సెలబ్రిటీలకు ఫేవరేట్ ఎందుకంటే.. మాచా గురించి అందరికీ తెలియడానికి కారణం.. ఈ టీను సెలబ్రిటీల నుండి సోషల్ మీడియాలో ఎంతో మంది దీన్ని తమ ఆరోగ్యం కోసం తాగుతున్నారు.  ఎందుకంటే మాచాలో కేటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా EGCG ఉంటాయి, ఇవి శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. మాచా  శరీరం కేలరీలను బర్న్ చేసే  సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని అనేక నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా, మాచాలో కెఫీన్ , ఎల్-థియానైన్ ఉంటాయి, ఇవి మనసును ప్రశాంతపరిచి శక్తిని అందిస్తాయి. అందుకే ఇప్పుడు చాలా మంది ఉదయం పూట టీ , కాఫీకి బదులుగా మాచా తాగడానికి ఇష్టపడుతున్నారు. మాచా బరువు తగ్గడానికి సహాయపడుతుందా?  బరువు తగ్గడానికి మాచా నిజంగా సహాయపడుతుందా అని  చాలామంది సందేహపడుతూ ఉంటారు.  అయితే మాచా అనేది అకస్మాత్తుగా బరువును తగ్గించే  మ్యాజిక్ డ్రింక్ ఏమీ కాదని ఆహార నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మాచా తాగినా లేదా బరువు తగ్గించే మరే ఇతర పానీయం తాగినా, అవి బరువు తగ్గడంలో మాత్రమే సహాయపడగలవు. కేవలం వాటిని తాగడం ద్వారా బరువు తగ్గేంత బలమైన ప్రభావం వాటికుండదు. అంటే.. ఆహారంపై శ్రద్ధ పెట్టకుండా , వ్యాయామం చేయకుండా కేవలం ఈ పానీయాలపై మాత్రమే ఆధారపడటం వల్ల బరువుపై ఎటువంటి ప్రభావం ఉండదని అంటున్నారు.                                                 *రూపశ్రీ.
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అన్ని విటమిన్లు , ఖనిజాలు సరైన మోతాదులో అవసరం. శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్లలో  విటమిన్ బి12 ఒకటి, ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటులో, సరైన నాడీ పనితీరులో , శక్తిని నిలుపుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే నేటికాలంలో మారుతున్న జీవనశైలి,  ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం,  పోషకాహార లోపాల కారణంగా, చాలా మంది విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ బి12 ప్రధానంగా జంతు ఆధారిత ఆహారాలలో లభిస్తుంది కాబట్టి, శాకాహారులకు విటమిన్ బి12 లోపం కనిపిస్తూ ఉంటుంది.  టెస్ట్ లలో  విటమిన్ బి12 లోపం ఉన్నట్లు తేలితే, ఆహార , జీవనశైలి మార్పుల ద్వారా విటమిన్ బి12 లోపాన్ని అధిగమించవచ్చు.  విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి కొన్ని సులభమైన మార్గాలను తెలుసుకుంటే.. విటమిన్ బి12 లోపిస్తే కనిపించే లక్షణాలు..  ఎప్పుడూ  అలసటగా మరియు బలహీనంగా అనిపించడం.  చేతులు మరియు పాదాలలో జలదరింపు లేదా తిమ్మిరిగా ఉండటం,   తలతిరగటం,  చర్మం పసుపు రంగులోకి మారడం,  దేని మీదా ఏకాగ్రత లేకపోవడం,  మానసిక స్థితిలో వేగంగా  మార్పులు ఉండటం. విటమిన్ బి12 లోపం అధిగమించడానికి తీసుకోవలసిన ఆహారాలు.. విటమిన్ బి12 లోపాన్ని అదిగమించడానికి పాలు , పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచి మార్గం. ముఖ్యంగా శాకాహారులు, పాల ఉత్పత్తులు బాగా తీసుకోవాలి.  పాలు, పెరుగు, పనీర్ , జున్ను వంటి పాల ఉత్పత్తులలో విటమిన్ బి12తో పాటు, శరీరానికి అవసరమైన అనేక పోషకాలను ఉంటాయి.  కాల్షియం మరియు ప్రోటీన్ కూడా ఉంటాయి.  గుడ్లు, చేపలు, చికెన్ , మాంసం మొదలైన వాటిలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది.  మాంసాహారులు వీటిని తీసుకోవచ్చు.   ఈ ఆహారాలలో ఉండే విటమిన్ బి12ను శరీరం సులభంగా వినియోగించుకుంటుంది. గుడ్డు సొనలో విటమిన్ బి12 ఉంటుంది. చేపలు , చికెన్‌లో ప్రోటీన్ , అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా , బాలెన్స్డ్ గా  తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ బి12 స్థాయిలను సులువుగా పెంచుకోవచ్చు. శాకాహారులకు లేదా పాల ఉత్పత్తులకు దూరంగా ఉండేవారు విటమిన్-బి12 కోసం , బలవర్ధక ఆహారాలు బాగా సహాయపడతాయి. బలవర్ధక ఆహారాలు అంటే విటమిన్లు , ఖనిజాలతో కూడిన ఆహారాలు. చాలా రకాల  బ్రేక్‌ఫాస్ట్ సెరియల్స్, సోయా పాలు లేదా బాదం పాలు వంటి మొక్కల ఆధారిత పాలు,  న్యూట్రిషనల్ ఈస్ట్‌లో విటమిన్ బి12 ఉంటుంది. వీటిని  రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్ బి12   లోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సప్లిమెంట్ల విషయంలో.. విటమిన్ బి12 లోపం తీవ్రంగా ఉంటే, కేవలం ఆహారం ద్వారా దానిని భర్తీ చేయడం కష్టం . అటువంటి సందర్భాలలో డాక్టర్ విటమిన్ బి12 సప్లిమెంట్లు, టాబ్లెట్లు లేదా ఇంజెక్షన్లను సిఫార్సు చేయవచ్చు. విటమిన్ బి12 లోపానికి చికిత్స అనేది వ్యక్తి వయస్సు, ఆరోగ్య స్థితి , లోపం యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, పరీక్షలు చేయించుకోకుండా , డాక్టర్‌ను సంప్రదించకుండా ఎక్కువ కాలం సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది కాదు.                                 *రూపశ్రీ.