LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సాక్షిగా ప్రజాప్రతినిధుల మధ్య రాజకీయ విమర్శలు మరోసారి హద్దులు దాటాయి. మండలి సమావేశాల్లో ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఉద్దేశించి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రిని "ఆంబోతు" అని సంబోధిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఉన్నతమైన చట్టసభలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రిపై ఇలాంటి పదజాలం ఉపయోగించడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. వైసీపీ నేతల నోట దూషణలు, అనుచిత వ్యాఖ్యలకు అంతూ పొంతూ అనేది ఉండదని మరోసారి రుజువైంది. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాభవానికి, ఆ పార్టీ అధినేత నేడు అసెంబ్లీకి ముఖం చాటేయడానికీ, ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని స్థానాలు కూడా దక్కకపోవడానికి ప్రధాన కారణాలలో వైసీపీ నేతల బూతు పురాణం కూడా ఒకటన్నది తెలిసిందే. వైసీపీ నేతల దూషణలు, తిట్లు, బూతుపురాణాలపై ప్రజలు తన ఆగ్రహాన్ని, వ్యతిరేకతను 2024 ఎన్నికలలో తమ ఓటు ద్వారా విస్పష్టంగా తెలియజేశారు. అయినా వైసీపీయులలో ఇసుమంతైనా మార్పు రాలేదనడానికి  తాజాగా శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ నోరు పారేసుకోవడాన్ని పరిశీలకులు   ఉదాహరణగా చూపుతున్నారు.  మండలిలో దువ్వాడ ప్రసంగిస్తూ.. మంత్రి అచ్చెన్నాయుడిని అంబోతు అని సంబోధించారు. ఏకంగా  డిప్యూటీ చైర్మన్ తోనే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడేనా.. అధ్యక్షా ఆ అంబోతును రమ్మనండి అని వ్యాఖ్యానించారు.   ఒక సీనియర్ మంత్రిని,  ఇలా సంబోధించడం సభామర్యాదకు భంగకరం అనడంలో సందేహం లేదు. అన్నిటికీ మించి మంత్రిని వాడు, ఆంబోతు అని దువ్వాడ శ్రీనివాస్ దూషణ భాషలో మాట్లాడితే డిప్యూటీ చైర్మర్  వారించడం, అభ్యంతరం తెలపడం మాని చిరునవ్వుతో ప్రోత్సహిస్తున్నట్లుగా వ్యవహరించడం మరింత దారుణమని పరిశీలకులు అంటున్నారు.  సభాధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తులు తటస్థంగా వ్యవహరించాలి, అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి, అటువంటి వ్యాఖ్యలు చేసిన సభ్యులను మందలించాలి. హెచ్చరించాలి. కానీ డిప్యూటీ స్పీకర్ అందుకు భిన్నంగా చిరునవ్వులు చిందించడం దారుణం. ఆయన తీరుపై సభ్యులలోనే కాదు.. సామాన్య జనంలో కూడా విస్మయం, ఏహ్యత వ్యక్తమౌతోంది.   Duvvada Srinivas, Atchannaidu, AP Legislative Council, YCP MLC, APpolitics, TeluguOne
ఏపీ ఎడ్యుకేషన్ సెక్టార్ లో  మౌలిక వసతుల కల్పన, గ్రంథాలయ వ్యవస్థ బలోపేతం తెలుగుదేశం కూటమి ధ్యేయమని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు.   రాష్ట్ర వ్యాప్తంగా  37 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు శాశ్వత భవనాల నిర్మాణం, అలాగే రాష్ట్రంలోని  175 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ  మోడల్  లైబ్రరీల ఏర్పాటుకు నిర్ణయించినట్లు  శసన సభ వేదికగా ప్రకటించారు. అసెంబ్లీ   ప్రశ్నోత్తరాల సమయంలో  సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ఆయన   ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థితిగతులపై  ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడిగిన ప్రశ్నకు  ఆళ్లగడ్డ కళాశాలలో ప్రస్తుతం 103 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని,  తగిన భూమి కూడా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ప్రత్యేక నిధుల కేటాయింపు ద్వారా ఆ కళాశాలకు నూతన భవన నిర్మాణం, దెబ్బతిన్న కాంపౌండ్ వాల్ పునర్నిర్మాణం చేపడతామన్నారు. బోధన, బోధనేతర సిబ్బంది నియామకంతో పాటు ఎమ్మెల్యే కోటా నిధులు  ఉపయోగించి కంప్యూటర్లు, ల్యాబ్ పరికరాలు, బెంచీలను సమకూర్చుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు సూచించారు.   ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి నారా లోకేష్.. ఒక్కో కళాశాల సకల సౌకర్యాలతో రూపుదిద్దుకోవడానికి  15 కోట్ల రూపాయలు  వ్యయం అవుతుందని, దశలవారీగా నిధులు విడుదల చేస్తూ అన్ని కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పిస్తామని వివరించారు. నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు ఉంటేనే విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోగలరన్నారు.  గ్రంథాలయాల పునరుద్ధరణ అంశంపై  మంత్రి లోకేష్ సవివరంగా చెప్పారు.  కడప గ్రంథాలయ భవన నిర్మాణ పనుల ఆలస్యంపై ఎమ్మెల్యే మాధవీ రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ,   9 నెలల  వ్యవధిలో ఆ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు.  వైసీపీ హయాంలో  గ్రంథాలయ రంగానికి చెందాల్సిన సెస్ నిధులను ఖజానాకు మళ్లించారని, తమ ప్రభుత్వం రాగానే ఆ నిధులను తిరిగి గ్రంథాలయ బోర్డుకు జమ అయ్యేలా చర్యలు చేపట్టామన్న ఆయన.. మంగళగిరిలో కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మోడల్ లైబ్రరీ  మంచి  ఫలితాలను ఇస్తోందన్నారు. వందలాది మంది అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు రాత్రి వేళల్లో కూడా చదువుకునేందుకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. ఇదే నమూనాను ప్రామాణికంగా తీసుకుని రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మోడల్ గ్రంథాలయాలను నిర్మించాలని నిర్ణయించినట్లు సభా ముఖంగా తెలిపారు.  అమరావతిని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో సెంట్రల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పుస్తక పఠన అలవాటు పిల్లల్లో సృజనాత్మక ఆలోచనా శక్తిని, విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందిస్తుందన్నారు. నేటి డిజిటల్ యుగంలో ప్రతికూల ప్రభావాలు చూపుతున్న స్మార్ట్‌ఫోన్లు, టాబ్‌లకు పిల్లలను దూరం చేసి, తిరిగి పుస్తకాల వైపు మళ్లించడంలో గ్రంథాలయాలు వంతెనగా పనిచేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.   Nara Lokesh AP Assembly, 37 Government Degree Colleges AP, 175 Constituency Model Libraries AP, Amaravati World Class Central Library, AP Education Infrastructure News
బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చెందిన నాయకులెవరికీ చోటు దక్కకపోవడం ఇప్పుడు రాష్ట్ర పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.  ఇటీవల ప్రకటించిన బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీలో తెలంగాణకు చెందిన సీనియర్ నాయకులకు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ రేంజ్ లో కామెంట్లు చేశారు.   రాష్ట్ర బీజేపీలో  అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలే ఈ పరిస్థితికి  కారణమన్నారు.  గతంలో జాతీయ స్థాయిలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత లభించేదని, కానీ ఈసారి ఒక్కరంటే ఒక్క తెలంగాణ నేతకు కూడా జాతీయ కార్యవర్గంలో చోటు లభించకపోవడం పార్టీ రాష్ట్ర నాయకత్వం స్వయంకృతాపరాధమేనని రాజాసింగ్ పేర్కొన్నారు.  తెలంగాణ బీజేపీలోని కొందరు నేతలు నిరంతరం స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారన్న ఆయన కొందరైతే తమ స్వార్థం కోసం ఇతర పార్టీల నాయకులతో కుమ్మక్కు రాజకీయాలు కూడా నెరపుతున్నారని ఆరోపించారు.  ప్రతి చిన్న విషయానికి ఢిల్లీకి పరుగెత్తుకెళ్లి, ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.ఈ  వర్గపోరు సంస్కృతి వల్లే "తెలంగాణ నేతలు ఇక మారన్న అభిప్రాయానికి వచ్చిన బీజేపీ అధిష్ఠానం ఎవరినీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకోలేదని రాజాసింగ్ అన్నారు.    దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్న ఆయన..    క్రమశిక్షణ లేని నాయకత్వం, నిరంతర గ్రూపు తగదాల వల్ల పార్టీ శ్రేణుల్లో నిరాశ ఆవహిస్తుందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికలలో కూడా విజయం సాధించడం అసాధ్యమని హెచ్చరించారు.   Raja Singh,  telangana bjp leaders, Telangana BJP, BJP National Executive, Goshamahal MLA, BJP Internal Politics
ALSO ON TELUGUONE N E W S
తెలంగాణలో సినిమా టికెట్ల ధరల సవరణ మరియు థియేటర్ల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలను క్రమబద్ధీకరిస్తూ అధికారికంగా ఉత్తర్వులు (G.O.) జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ కొత్త జీవో ప్రకారం నాన్-ఏసీ, ఏసీ సింగిల్ స్క్రీన్లతో పాటు స్పెషల్ థియేటర్లు మరియు మల్టీప్లెక్స్‌లలో పాటించాల్సిన కనిష్ఠ (మినిమం), గరిష్ఠ (మాగ్జిమం) టికెట్ ధరలను స్పష్టంగా ఖరారు చేశారు. సవరించిన టికెట్ ధరలు నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియంలో  కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.70,  ప్రీమియంలో  కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.100 ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియంలో  కనిష్ఠంగా రూ.50, గరిష్ఠంగా రూ.150. ఏసీ థియేటర్లలో ప్రీమియంలో  కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.200. స్పెషల్ థియేటర్లలో నాన్ ప్రీమియంలో  కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250  సామాన్య ప్రేక్షకులకు కూడా సినిమాలు అందుబాటులో ఉండేలా ప్రతి థియేటర్‌లోనూ స్థానంతో సంబంధం లేకుండా కనీసం 25 శాతం సీట్లను తప్పనిసరిగా నాన్-ప్రీమియం కేటగిరీ కింద తక్కువ ధరలకే అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో టికెట్ ధరలపై స్పష్టత లేకపోవడంతో భారీ చిత్రాలు విడుదలైన సమయంలో టికెట్ ధరలు అడ్డగోలుగా పెంచేస్తున్నారనే విమర్శలు వ్యక్తమయ్యేవి. ఈ కొత్త మార్గదర్శకాల ద్వారా రేట్లను నియంత్రించి, ప్రేక్షకులకు సులభంగా వినోదాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మరోవైపు, ఈ నిర్ణయంపై థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్ల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. నిర్దిష్టమైన రేట్లు నిర్ణయించడం వల్ల థియేటర్ల నిర్వహణ సులభతరం అవుతుందని, ప్రేక్షకులకు కూడా పారదర్శకంగా ఉంటుందని పంపిణీదారులు భావిస్తున్నారు. ఈ కొత్త ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నాయి. దీనితో పాటు రోజుకు ఐదు షోల ప్రదర్శనకు సంబంధించిన నిబంధనలు కూడా అమలులోకి రానున్నాయి. రాబోయే పెద్ద సినిమాల విడుదల సమయానికి ఈ ధరల అమలుపై స్పష్టత రావడంతో ప్రేక్షకులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు.
భారతీయ సినీ ప్రేక్షకులను థియేటర్లలో భయపెడుతూ భారీ వసూళ్లు సాధించడంలో హాలీవుడ్ హారర్ సినిమాలు ఎప్పుడూ ముందుంటాయి. భాషతో సంబంధం లేకుండా సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు మన దగ్గర విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే 'ది కంజూరింగ్', 'ఈవిల్ డెడ్' వంటి సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హౌస్‌ఫుల్ బోర్డులతో అదరగొట్టి భారీ కలెక్షన్లు రాబట్టాయి. ఇప్పుడు అదే బాటలో హారర్ ప్రియులను భయపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాపులర్ ఫ్రాంచైజ్ నుంచి మరో భయానక చిత్రం వచ్చేస్తోంది. అదే 'ఇన్‌సిడియస్: అవుట్ ఆఫ్ ది ఫర్దర్' (Insidious: Out of the Further). హారర్ సినిమాలను ఇష్టపడే వారికి 'ఇన్‌సిడియస్' సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దుష్ట శక్తులు, ఆత్మలు సంచరించే 'ది ఫర్దర్' అనే చీకటి ప్రపంచం (డార్క్ డైమెన్షన్) కాన్సెప్ట్‌తో వచ్చిన ప్రతి భాగం ప్రేక్షకులను ఎంతగానో భయపెట్టింది. ఈ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న 6వ చిత్రమే 'ఇన్‌సిడియస్: అవుట్ ఆఫ్ ది ఫర్దర్'. ఈ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రానికి జాకబ్ చేస్ దర్శకత్వం వహించగా, సోనీ పిక్చర్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేస్తోంది. ఈ సినిమాలో అమేలియా ఈవ్, బ్రాండన్ పెరియా, మైసీ రిచర్డ్‌సన్-సెల్లర్స్ మరియు లిన్ షే వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. సినిమా కథాంశం విషయానికి వస్తే, ఒక ఇంట్లో ఒంటరిగా నివసించే తల్లి, కూతురు అనుకోకుండా ఒక భయంకరమైన డార్క్ స్పిరిట్ వరల్డ్‌లో చిక్కుకుపోతారు. అక్కడి నుంచి వారు బయటపడటానికి చేసే ప్రయత్నాలు, వారిని వెంటాడే భయానక ఆత్మల దృశ్యాలు ప్రేక్షకులకు మైండ్ బ్లాకింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు మరియు టీజర్లు సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్‌లో చూపించిన జంప్ స్కేర్స్, విజువల్స్ మరియు వెన్నులో వణుకు పుట్టించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హారర్ మూవీ లవర్స్‌ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ హారర్ మూవీ ఈ నెల 21న హాలీవుడ్‌తో పాటు భారత్‌లోనూ విడుదల కానుంది. ఇంగ్లీష్‌తో పాటు ప్రధాన భారతీయ భాషల్లోకి డబ్ చేసి మల్టీప్లెక్స్‌లలో భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు నుంచే ఏ స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తుందో వేచి చూడాలి.
The Telangana government has issued a fresh set of orders fixing cinema ticket prices across single-screen theatres and multiplexes in the state. The new GO, issued on August 14, reclassifies theatres into different categories and sets minimum and maximum admission rates, bringing a more structured ticket pricing system into effect. Under the new rates, Non-AC theatres can charge Rs.30 to Rs.70 for non-premium tickets and Rs.50 to Rs.100 for premium tickets. AC/Air Cooled theatres can charge Rs.50 to Rs.150 for non-premium and Rs.100 to Rs.200 for premium tickets. Special theatres have been permitted to charge Rs.100 to Rs.250 for non-premium and Rs.200 to Rs.300 for premium/recliner seats, while multiplexes can charge Rs.100 to Rs.250 for regular seats and Rs.200 to Rs.300 for recliners. The government has also made it mandatory for every theatre, irrespective of its category or location, to keep 25% of its seats under the non-premium category. The new order also merges air-cooled theatres with the AC category, while such theatres have been given two years to convert to AC or collect non-AC charges. The special theatre category covers standalone screens equipped with facilities such as 7.1 or higher digital surround sound, 2K/4K projection and IMAX or large screens of 75 feet and above. The revised pricing structure comes after representations from the Active Telugu Film Producers Guild and individual producers seeking higher ticket rates for high-budget films and a streamlined approval process. The government has issued the latest order superseding the relevant 2021 provisions, giving theatres and the industry a clearly defined pricing structure across categories. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Modern Missamma is being produced under the Lasya & Mithuna Creations banner by Chiranjeevi Pamidi, Shiva Pamidi, Kiran Kumar Nalluri and Sravanthi Namburi. Sai Baba has provided the story and screenplay and is also directing the film. Harsha Narra, Tanmayi Khushi, Siju AR, Pramodini, Harika, Dr. Bhadram, Shivannarayana, Rakesh Rachakonda and others play key roles. The cinematography is handled by Sheshu Raj Daddala and Vijay Pidapa, while Aditya Papishetty is the editor and Balakrishna is the choreographer. Harikrishna Jagurothi heads the script department. Somesh Eripalli serves as the VFX Director and G. Pawan Kalyan is the Sound Designer. Upputholla Babu (Bobby) is the Executive Producer. The grand launch event of the film’s first single was held on Wednesday at Prasads Labs in Hyderabad. The song, composed by music director Gopi Sundar, features lyrics penned by Kittu Vissapragada. Titled   ‘Better Be A Missamma’,  the song showcases Harsha Narra in traditional Dhoti attire and Tanmayi Khushi in a traditional outfit. The song, which revolves around the heroine expressing her reluctance towards marriage, is designed to connect strongly with women. Speaking at the event, ‘Vadala’ producer Kishore Naidu  said, “I recently watched the premiere of this film. Whenever I watch a movie, I usually look for flaws, but I couldn’t find even a single one in this film. I am confident that everyone who watches ‘Modern Missamma’ will enjoy it. Dr. Bhadram’s character, in particular, is extremely hilarious.” Hero Harsha Narra  said, “After ‘Missing’ and ‘Roti Kapada Romance’, this is my third film. Both those films did not perform well commercially, but my struggle will never stop. I will continue to work hard. We didn’t make this film just with hard work; we made it with passion and love. The entire team worked like a group of friends. Tanmayi has performed extremely well. Gopi Sundar sir has given wonderful music for this song, and Kittu Vissapragada’s lyrics are something everyone can relate to. The film too will connect with audiences.” Heroine Tanmayi Khushi  said, “‘Modern Missamma’ is the film I acted in after ‘23’. Back then, the song ‘Vaddura Sodaraa’ from Nagarjuna garu’s ‘Manmadhudu’ connected strongly with men. In the same way, I believe our song will connect with women today. I am very happy that the director has written this story from a woman’s point of view. My character will definitely connect with everyone.” Director Sai Baba said, “I am very happy with the response to this song. Elders often say, ‘Build a house, conduct a marriage, and see how it feels.’ I would like to add one more thing to that — ‘Make a film and see.’ I believe all three are equally challenging. I sincerely thank all the technicians, artists and our producer for supporting me throughout this journey.  “Choosing a classic title like ‘Missamma’ requires courage. The earlier ‘Missamma’ films featuring NTR garu and Bhumika garu were both way ahead of their time. We believed that our film too had that kind of strength. Our artists proved through their performances that the title ‘Modern Missamma’ is truly justified. Gopi Sundar garu’s music will be another major plus for the film.   “We are not saying that people should not get married through this film. Rather, if you want to understand what is required before getting married, you must watch ‘Modern Missamma’.” Producer Chiranjeevi Pamidi  said, “‘Modern Missamma’ is the second film from our banner after ‘Calling Sahasra’. We did not get the result we expected from that film, but we strongly believe that this movie will receive a good response. Our hero Harsha has performed very well, and the heroine has also delivered an excellent performance.   “We started this journey two years ago. Our intention was to make a film that suits the current trends, and we are very happy with the output. We completed the film within the planned time and budget. We consider that itself our first success. I thank everyone who worked on this film.” DOP Sheshu  said that ‘Modern Missamma’ is an important chapter in his career and that the hard work of the entire team resulted in a quality output. Choreographer Balakrishna expressed his happiness about composing the title song for the movie. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
టాలీవుడ్ ప్రముఖ అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున, నాగచైతన్య మరియు అఖిల్ కలసి సరికొత్త రాయల్ స్టైల్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఒకే ఫ్రేమ్‌లో ఈ ముగ్గురు స్టార్స్ కనిపించడంతో సినీ ప్రియులకు కన్నుల పండుగగా మారింది. ప్రముఖ అంతర్జాతీయ వినోద మీడియా సంస్థ 'వెరైటీ ఇండియా' (Variety India) రూపొందించిన ప్రత్యేక ఎడిషన్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఈ అక్కినేని త్రయం తమ డాషింగ్ లుక్స్‌తో మెరిసారు. అత్యంత ట్రెండీగా డిజైన్ చేసిన సూట్లలో ఈ ముగ్గురు హీరోలు ఇచ్చిన పోజులు ఫ్యాషన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రత్యేక సంచిక కోసం నాగార్జున, నాగచైతన్య మరియు అఖిల్ కలసి ఒక సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తమ అక్కినేని కుటుంబం నమోదు చేసిన 90 ఏళ్ల ఘనమైన వారసత్వం, నాటి అనుభవాలు మరియు తరాలు మారినా కొనసాగుతున్న సినీ పయనం గురించి ఈ ముగ్గురు అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) నెలకొల్పిన సినీ వారసత్వాన్ని కింగ్ నాగార్జున దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా, తన కుమారులు నాగచైతన్య, అఖిల్‌లను కూడా టాలీవుడ్‌లో విజయవంతమైన హీరోలుగా తీర్చిదిద్దారు. గతంలో వీరందరూ కలిసి నటించిన 'మనం' చిత్రం టాలీవుడ్ చరిత్రలోనే ఒక క్లాసిక్ మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వెరైటీ ఇండియా కవర్ పిక్ విపరీతంగా వైరల్ అవుతోంది. అక్కినేని అభిమానులు ఈ ఫోటోలను షేర్ చేస్తూ "రాయల్ అక్కినేని బ్రాండ్" అని కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లు కూడా ఈ తండ్రీకొడుకుల స్టైలిష్ కాంబినేషన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ముగ్గురు హీరోలు తమ రాబోయే చిత్రాలతో బిజీగా ఉన్నారు. నాగార్జున వైవిధ్యమైన పాత్రలతో అలరించేందుకు సిద్ధమవుతుండగా, నాగచైతన్య పాన్-ఇండియా లైనప్‌తో దూసుకుపోతున్నారు. అఖిల్ కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కొత్త లుక్‌తో సిద్ధమవుతున్నారు. వీరి రాబోయే ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలోనే వెలువడనున్నాయి.
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి పండుగ సీజన్ సృష్టించే హంగామా, తీసుకొచ్చే కలెక్షన్ల సునామీ ఏ వేరే స్థాయి. ఒకప్పుడు సంక్రాంతితో పాటు సమ్మర్, దసరా, క్రిస్మస్ పండుగలకు పెద్ద సినిమాలు క్యూ కట్టేవి. కానీ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలందరి చూపు ఒక్క సంక్రాంతి బరిపైనే కేంద్రీకృతమైంది. ఈ పెద్ద పండుగ రేసులో పోటీ పడేందుకు సీనియర్ స్టార్ల నుంచి యంగ్ హీరోల వరకు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాబోయే పొంగల్ బరిలో నిలవబోతున్న సినిమాల టైటిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆయా హీరోల లక్, సంక్రాంతి సెంటిమెంట్ కలగలిపి రూపుదిద్దుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ల వివరాలు సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి సంక్రాంతి సీజన్ అనేది ఎప్పుడూ ఒక తిరుగులేని సెంటిమెంట్. రాజకీయం నుంచి మళ్లీ వెండితెరకు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనకు బంపర్ హిట్లు అందించిన 'ఖైదీ నంబర్ 150', 'వాల్తేరు వీరయ్య', 'మన శంకరవరప్రసాద్ గారు' వంటి భారీ చిత్రాలన్నీ పొంగల్ రేసులోనే వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. అందుకే దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న తన రెండో సినిమాను కూడా మెగాస్టార్ సంక్రాంతికే థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి 'కదిరి నరసింహుడు' లేదా 'కాకాజీ' అనే ఆసక్తికరమైన టైటిల్స్ ప్రచారంలోకి రావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక సంక్రాంతి సక్సెస్ హీరోగా పేరు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ కూడా మళ్లీ అదే దారిలో వస్తున్నారు. వెంకీ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం 2025లో ఘన విజయం సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే ఆయన కేమియో రోల్ పోషించిన 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇదే జోష్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీని పొంగల్ బరిలోకి దింపుతున్నారు. ఈ సినిమాకి 'జనవరి 12 విడుదల' అనే వినూత్నమైన టైటిల్‌ను ఖరారు చేయగా, 'బావా బామ్మర్ది సౌజన్యంతో' అనేది టాగ్ లైన్‌గా పెట్టడం విశేషం. చిత్ర పేరులోనే ఉన్న రిలీజ్ డేట్ ప్రకారమే సరిగ్గా జనవరి 12వ తేదీనే థియేటర్లలోకి తెస్తుండటం మరింత ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు మాస్ మహారాజా రవితేజ కూడా సంక్రాంతి పోటీలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' చిత్రం ఆశించిన స్థాయిలో అలరించలేకపోయినప్పటికీ, పొంగల్ హంగామాను వదులుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు. ఈ సారి రవితేజ, యంగ్ హీరో శ్రీవిష్ణు కాంబినేషన్‌లో మల్టీస్టారర్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు 'వీరాధివీరులంట' లేదా 'మహిళామిత్ర మండలి తాలూకా' అనే విభిన్నమైన టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. వీరితో పాటు మిగిలిన స్టార్ హీరోలు కూడా భారీ ఆశలతో పొంగల్ బరిలోకి దిగుతున్నారు. కింగ్ నాగార్జున తన ప్రతిష్ఠాత్మక 100వ చిత్రం 'లాటరీ కింగ్' తోనూ, యంగ్ హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' తోనూ, ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న విజువల్ వండర్ 'మహాకాళి' కూడా పండుగ రేసులోనే సందడి చేయనున్నాయి. ఇక సాయిదుర్గా తేజ్ తొలిసారిగా తన 'సంబరాల ఏటిగట్టు' చిత్రంతో సంక్రాంతి బరిలోకి దూకుతుండటం విశేషం. వీరందరిలో సాయిదుర్గా తేజ్ తప్ప మిగిలిన హీరోలందరూ ఇప్పటికే సంక్రాంతికి వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్లు చూసినవారే. మరి ఈ స్టార్ల మధ్య నడిచే పొంగల్ సమరంలో ఏ సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుని సంక్రాంతి విజేతగా నిలుస్తుందో వేచి చూడాలి.   Tollywood Pongal Race, Chiranjeevi New Movie Title, Venkatesh January 12 Vidudala, Sankranthi Movies 2026, Nagarjuna Lottery King, Ravi Teja New Film
నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ తన 111వ సినిమాలో ఓ యాక్షన్ సీన్ షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. ఆయన మోకాలికి గాయం కావడంతో డాక్టర్లు సర్జరీ చేశారు. రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని కూడా సూచించారు. అయితే బాలయ్య మాత్రం సెప్టెంబర్ నుంచే షూటింగ్ కి రెడీ అంటున్నారట.  సెప్టెంబర్ లో తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని బాలకృష్ణ చూస్తున్నారు. అలా షూటింగ్ పూర్తి కాగానే అక్టోబర్ లో ప్యాచ్ వర్క్, నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేయాలని ప్లాన్. డిసెంబర్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను రిలీజ్ చేయాలన్నది బాలయ్య యోచన. అందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత వెంకట సతీశ్ కిలారు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. బాలకృష్ణకు ప్రమాదాలు కొత్తకాదు. కెరీర్ ఆరంభంలోనే 'బాబాయ్-అబ్బాయ్' షూటింగ్ లో, ఆ తరువాత 'భార్యాభర్తల బంధం' షూటింగ్ లో వరుసగా గాయాల పాలయ్యారు.అయినా డెడికేషన్ తో అప్పట్లో ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ సాగారు. ఆపై 'విజయేంద్రవర్మ' షూటింగ్ లో మోకాలుకి గాయమైంది. అప్పట్లో కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మోకాలుకే గాయం కాగా, డాక్టర్స్ రెండు నెలలు రెస్ట్ తీసుకోమని సూచించారు. అయినా బాలయ్య నిర్మాతకు ఇబ్బంది కలగరాదని షూటింగ్ లో త్వరలోనే పాల్గొనడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.  నటరత్న ఎన్టీఆర్ కెరీర్ లోనూ 'పల్లెటూరి పిల్ల' మొదలు, పలుమార్లు చేతికి యాక్సిడెంట్స్ జరిగాయి. దాంతో ఎన్టీఆర్ కుడిచేతి వేళ్ళకు పట్టు పోయింది. 'సర్దార్ పాపారాయుడు' షూటింగ్ లో మళ్ళీ అదే చేయికి గాయమైంది. వైద్యులు సూచించినా తన నిర్మాతలకు నష్టం రాకూడదని ఎన్టీఆర్ కట్టుతోనే కొన్ని చిత్రాల్లో నటించారు. ఆ అంకితభావమే బాలయ్యకూ వచ్చిందనేది ఇండస్ట్రీ మాట.         Nandamuri Balakrishna, NBK111 Movie, Balayya, NBK  
Anirudh Ravichander has recently delivered a sensational OST for DC and his work is regarded as the major reason for the movie becoming a blockbuster. Now, he is ready to serve a Malayali delight for first single of Jailer 2, Ala Bolelo. He used celebratory Malayalam beats to compose the song.  The makers have released promo of the single and it features Shamna Kasim aka Poorna in a special appearance. She is in full white costumes also representing Onam festival vibes. The makers seem to be using the Onam festival timing to release the song on 21st August to further grow the buzz for the film.  Superstar Rajinikanth is returning as Jailer in this film and the first glimpse track has already become highly popular. How Anirudh scores with this Onam celebration song needs to be seen. It is also interesting to see how director Nelson avoided any promo for track announcement and kept it simple.  If the makers will use Mohanlal glimpses into the celebration song also needs to be seen as they have hinted at a star appearance in the beginning of the video, before revealing Rajinikanth. We have to wait and see, how the track will live up to expecations that Ani has set-up with DC tracks.    Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది,  స్వేచ్ఛను సంపాదించుకుంది.  ఈ సందర్బంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం  జరుపుకుంటారు. 1947లో బ్రిటిష్ వలస పాలన నుండి దేశానికి లభించిన విముక్తికి గుర్తుగా దేశమంతా జరుపుకునే పండుగే  స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన లెక్కలేనంత మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, అవిశ్రాంత కృషికి ఈ రోజు ఒక నివాళి. స్వాతంత్ర పోరాటం ముగిసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక శకం ముగిసి,  కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి చేసిన కృషి,  జరిగిన సంఘటనలు, త్యాగాల గురించి వివరంగా తెలుసుకుంటే.. పోరాటం.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగిన ఒక సుదీర్ఘమైన, కఠిన ప్రయాణం. ఇది 1857 తిరుగుబాటుతో ప్రారంభమైంది.  దీనిని మొదటి స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు, ఇందులో భారతీయ సైనికులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన జాతీయ చైతన్యాన్ని రగిలించింది, ఇది చివరికి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. 20వ శతాబ్దం ప్రారంభంలో గాంధీజి వంటి ప్రముఖ నాయకులు ఉద్భవించారు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల ద్వారా అహింసాయుత ప్రతిఘటనను సమర్థించారు. ఈ ఉద్యమాలు బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరడానికి లక్షలాది మంది భారతీయులను ఉత్తేజపరిచాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీని భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు .   ట్రైస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం.. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన చారిత్రాత్మక "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (విధితో వాగ్వాదం) ప్రసంగాన్ని అందించారు. సుబాష్ చంద్రబోస్.. ఆజాద్ హింద్ సేన.. సుభాష్ చంద్ర బోస్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అహింసా ఉద్యమం వల్ల నెమ్మదిగా ఉన్న పోరాటానికి  నిరాశ చెందిన బోస్, స్వాతంత్ర్యం సాధించడానికి మరింత దూకుడు మార్గాలను అన్వేషించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు. భారతీయ సైనికులు , ప్రవాసులతో కూడిన ఆజాద్ హింద్ సేన, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది. భారతదేశానికి విముక్తి కల్పించడంలో సైన్యం విజయం సాధించనప్పటికీ, బోస్ చేసిన ప్రయత్నాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి . భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. స్వాతంత్ర్యం కోసం బోస్ చేసిన కృషి  వర్ణించలేనిది. గోవా, హైదరాబాద్ విమోచనం.. 1947 స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు విదేశీ లేదా రాచరిక పాలనలో ఉన్నాయి. పోర్చుగీసు వలస ప్రాంతమైన గోవా, “ఆపరేషన్ విజయ్” అనే సైనిక తిరుగుబాటు తర్వాత 1961లో విముక్తి పొందింది. భారత సాయుధ దళాలు గోవాను భారత యూనియన్‌లో విజయవంతంగా విలీనం చేసి, 451 సంవత్సరాల పోర్చుగీసు పాలనకు ముగింపు పలికాయి. హైదరాబాద్ నిజాం మొదట్లో స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు, కానీ చివరికి 1948లో “ఆపరేషన్ పోలో” అనే సైనిక తిరుగుబాటు ద్వారా భారతదేశంలో విలీనం చేయబడింది. ఇది కొత్తగా ఏర్పడిన భారత గణతంత్ర రాజ్యంలో ఆ సంస్థానం యొక్క ఏకీకరణను నిర్ధారించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్.. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్, విచ్ఛిన్నమైన సంస్థానాలను భారత యూనియన్‌గా ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా మరియు హోం మంత్రిగా, ఈ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యేలా చూడటానికి పటేల్ దౌత్యపరమైన , కొన్నిసార్లు బలప్రయోగ చర్యలను కూడా ఉపయోగించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఆయన చేసిన కృషి, ఆయనకు అపారమైన గౌరవాన్ని , భారత చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించిపెట్టింది. బలమైన, ఐక్య భారతదేశానికి పునాది వేయడంలో పటేల్ దార్శనికత, నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. దేశానికి ఆయన చేసిన సేవలకు నిదర్శనంగా నిలుస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయన వారసత్వాన్ని శాశ్వతంగా నిలిపింది.                                  *రూపశ్రీ.  
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది,  స్వేచ్ఛను సంపాదించుకుంది.  ఈ సందర్బంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం  జరుపుకుంటారు. 1947లో బ్రిటిష్ వలస పాలన నుండి దేశానికి లభించిన విముక్తికి గుర్తుగా దేశమంతా జరుపుకునే పండుగే  స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన లెక్కలేనంత మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, అవిశ్రాంత కృషికి ఈ రోజు ఒక నివాళి. స్వాతంత్ర పోరాటం ముగిసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక శకం ముగిసి,  కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి చేసిన కృషి,  జరిగిన సంఘటనలు, త్యాగాల గురించి వివరంగా తెలుసుకుంటే.. పోరాటం.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగిన ఒక సుదీర్ఘమైన, కఠిన ప్రయాణం. ఇది 1857 తిరుగుబాటుతో ప్రారంభమైంది.  దీనిని మొదటి స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు, ఇందులో భారతీయ సైనికులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన జాతీయ చైతన్యాన్ని రగిలించింది, ఇది చివరికి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. 20వ శతాబ్దం ప్రారంభంలో గాంధీజి వంటి ప్రముఖ నాయకులు ఉద్భవించారు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల ద్వారా అహింసాయుత ప్రతిఘటనను సమర్థించారు. ఈ ఉద్యమాలు బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరడానికి లక్షలాది మంది భారతీయులను ఉత్తేజపరిచాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీని భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు .   ట్రైస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం.. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన చారిత్రాత్మక "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (విధితో వాగ్వాదం) ప్రసంగాన్ని అందించారు. సుబాష్ చంద్రబోస్.. ఆజాద్ హింద్ సేన.. సుభాష్ చంద్ర బోస్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అహింసా ఉద్యమం వల్ల నెమ్మదిగా ఉన్న పోరాటానికి  నిరాశ చెందిన బోస్, స్వాతంత్ర్యం సాధించడానికి మరింత దూకుడు మార్గాలను అన్వేషించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు. భారతీయ సైనికులు , ప్రవాసులతో కూడిన ఆజాద్ హింద్ సేన, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది. భారతదేశానికి విముక్తి కల్పించడంలో సైన్యం విజయం సాధించనప్పటికీ, బోస్ చేసిన ప్రయత్నాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి . భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. స్వాతంత్ర్యం కోసం బోస్ చేసిన కృషి  వర్ణించలేనిది. గోవా, హైదరాబాద్ విమోచనం.. 1947 స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు విదేశీ లేదా రాచరిక పాలనలో ఉన్నాయి. పోర్చుగీసు వలస ప్రాంతమైన గోవా, “ఆపరేషన్ విజయ్” అనే సైనిక తిరుగుబాటు తర్వాత 1961లో విముక్తి పొందింది. భారత సాయుధ దళాలు గోవాను భారత యూనియన్‌లో విజయవంతంగా విలీనం చేసి, 451 సంవత్సరాల పోర్చుగీసు పాలనకు ముగింపు పలికాయి. హైదరాబాద్ నిజాం మొదట్లో స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు, కానీ చివరికి 1948లో “ఆపరేషన్ పోలో” అనే సైనిక తిరుగుబాటు ద్వారా భారతదేశంలో విలీనం చేయబడింది. ఇది కొత్తగా ఏర్పడిన భారత గణతంత్ర రాజ్యంలో ఆ సంస్థానం యొక్క ఏకీకరణను నిర్ధారించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్.. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్, విచ్ఛిన్నమైన సంస్థానాలను భారత యూనియన్‌గా ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా మరియు హోం మంత్రిగా, ఈ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యేలా చూడటానికి పటేల్ దౌత్యపరమైన , కొన్నిసార్లు బలప్రయోగ చర్యలను కూడా ఉపయోగించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఆయన చేసిన కృషి, ఆయనకు అపారమైన గౌరవాన్ని , భారత చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించిపెట్టింది. బలమైన, ఐక్య భారతదేశానికి పునాది వేయడంలో పటేల్ దార్శనికత, నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. దేశానికి ఆయన చేసిన సేవలకు నిదర్శనంగా నిలుస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయన వారసత్వాన్ని శాశ్వతంగా నిలిపింది.                                                                                                                                                   *రూపశ్రీ.
మనుషుల నుండి ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆహారం తీసుకోవడం పరిపాటి.  తీసుకునే ఆహారం నుండి లభించే శక్తితోనే శరీరం నిలబడుతుంది. ఇక అన్ని ప్రాణులలోకి మనిషి చాలా విభిన్నమైన వాడు. మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అలవాట్లు ఉంటాయి.  అంతేకాదు.. ఆహారం తినే విధానంలో కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది.  కొందరు నిదానంగా తింటారు.  మరికొందరు చాలా వేగంగా తింటారు.  అయితే.. వేగంగా తినే వ్యక్తుల వ్యక్తిత్వం గురించి వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. వేగంగా ఆహారం తినే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. వేగంగా తినడం... మన చుట్టూ చాలామంది ఉంటారు.  కుటుంబ సభ్యులు అయినా,  స్నేహితులు అయినా.. తెలిసిన వారు అయినా.. కలిసి భోజనం చేసేటప్పుడు లేదా ఏదైనా ఆహారం తినేటప్పుడు.. అందరూ కలిసి మొదలు పెడితే.. పక్క వాళ్లు ఇంకా సగం కూడా తినకుండానే మధ్యలోనే తమ ఆహారం పూర్తీ చేసే వారు కొందరు ఉంటారు.  వారు చాలా బిజీ లైఫ్ స్టైల్ కు అలవాటు వడటం వల్ల అలా వేగంగా తినడం అలవాటు అయి ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇది నిజమే అయినా ఇలా వేగంగా తినే వారి స్వభావం విభిన్నంగా ఉంటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు. వేగంగా తినే వారిలో ఉండే వ్యక్తిత్వ లక్షణాలు.. వేగంగా తినే వ్యక్తులు ఎక్కువగా ఫినిష్ లైన్ ను చేరుకోవడంపై దృష్టి పెడతారు. అదే మనస్తత్వం జీవితంలోని ఇతర రంగాలలో కనిపిస్తుందట. వారు చేయవలసిన పనుల లిస్ట్ నుండి పనులను మార్క్  చేయడం, సమర్థవంతంగా పనిచేయడం , ఒక పనిలో ఆలస్యం  కాకుండా ఆ తరువాత  సవాలును స్వీకరించడం వంటివి వీరిలో ఉంటాయట.   స్ట్రాంగ్ ప్రాక్టీస్  ఉన్నవారు తరచుగా భోజనంతో సహా రోజువారీ దినచర్యలో వేగాన్ని , సామర్థ్యాన్ని ఇష్టపడతారని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. తినడాన్ని ఆస్వాదించడం, అనుభూతి చెందడం  కంటే తినడాన్ని కూడా ఒక  పనిగా భావిస్తారని అంటున్నారు.  తినే వేగాన్ని బట్టి వ్యక్తిత్వం లక్షణాలను,  తినే వేగానికి,  వ్యక్తిత్వానికి మధ్య గల సంబంధాలను వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు కనుక్కున్నారు. వేగంగా తినేవారు తరచుగా వేచి ఉండటానికి ఇష్టపడరు. ఇది క్యూలలో నిలబడినా, నెమ్మదిగా మీటింగ్స్  లో ఉన్నా లేదా ఆహారం వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చినా.. ఇలా అన్ని సందర్బాలలో వారు అన్ని వేగంగానే జరగాలని కోరుకుంటారట.  అన్ని విషయాలలోనూ సహజంగా వేగాన్ని వీరు ఇష్టపడతారట. ఈ ధోరణి భోజన చేయడం వరకు తీసుకువెళుతుందట.  చాలామందిలో తినే స్వభావం మానసిక , పర్యావరణ కారకాల ద్వారా ఏర్పడతాయని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు.   వేగంగా తినే వ్యక్తులలో ఇతర పనులను కూడా వేగంగా పూర్తీ చేసే సామర్థ్యం ఉంటుందట. వర్తమానంతో పూర్తీగా నిమగ్నమవడానికి బదులుగా  తరువాత ఏమి జరుగుతుందో  అనే విషయం పై దృష్టి పెట్టేలా చేస్తుందట.  ఈ కారణంగా వీరికి భవిష్యత్తు గురించి స్పష్టమైన అంచనాలు, ప్రణాళికలు కూడా ఉంటాయట. అలాగని వేగంగా తినడాన్ని సమర్థించడం లేదు. ఎందుకంటే.. వేగంగా తినడం అనేది ఆహారం సరిగా నమలకపోవడం, తినే ఆహారం మీద దృష్టి పెట్టలేకపోవడం,  ఆహారం అతిగా తినడం.. ఇలా చాలా సమస్యలకు కారణం అవుతుంది.                                                                                                                                                   *రూపశ్రీ.  
  మోకాళ్ల నొప్పులు, కీళ్ల సమస్యలు ఒకప్పుడు 60–70 ఏళ్ల వయసులో ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు 40లలో ఉన్నవారిలో కూడా మోకాళ్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొందరికి చిన్న వయసులోనే Knee Replacement అవసరమయ్యే పరిస్థితి ఎందుకు వస్తోంది? ఈ సమస్యలకు సరైన వ్యాయామం లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం, Vitamin D, Vitamin B12 లోపం వంటి కారణాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయి? ఎముకలు, కీళ్లు, మోకాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో Dr. Anvesh Reddy (MS Ortho) మోకాళ్లు, కీళ్లు, ఎముకల ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అలాగే Vitamin D, Vitamin B12 లభించే ఆహారాలు, రోజువారీ జీవితంలో పాటించాల్సిన వ్యాయామాలు, మోకాళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలియజేస్తున్నారు. 40 ఏళ్లలోనే మోకాళ్ల సమస్యలు ఎందుకు వస్తున్నాయి? Vitamin D, B12 లోపం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఏ ఆహారాల్లో ఈ విటమిన్లు లభిస్తాయి? మోకాళ్ల ఆరోగ్యం కోసం ఎలాంటి వ్యాయామాలు చేయాలి? వంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి.  గమనిక: మోకాళ్ల నొప్పులు లేదా ఇతర కీళ్ల సమస్యలు ఉంటే స్వయంగా చికిత్స చేసుకోకుండా వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
గుడ్లు పోషకాహారం యొక్క పవర్హౌస్.  ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గుడ్డు తినడం చాలామంచిదని చెబుతూ ఉంటారు.  అయితే  రోజూ రెండు ఉడికించిన గుడ్లు తినడం  మంచిదేనా? ఫిట్‌నెస్ ట్రైనింగ్ లో ఉన్నవారు,  పోషకాహార లోపంతో ఉన్నవారు ప్రతిరోజూ గుడ్డు తినాలని చెబుతుంటారు.  రోజుకు రెండు ఉడికించిన గుడ్లు తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇది శరీరం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వివరంగా తెలుసుకుంటే.. ఎముకలను బలోపేతం చేస్తుంది.. గుడ్లలో విటమిన్ డి , కాల్షియం పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముక సాంద్రతను మెరుగుపరచడంలో , బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే ఎముకల బలానికి కావలసినంత కాల్షియం,  విటమిన్-డి పొందవచ్చు. మెదడు ఆరోగ్యానికి.. గుడ్లలో కోలిన్ ఉంటుంది, ఇది మెదడు పనితీరు,  జ్ఞాపకశక్తికి చాలా అవసరం. క్రమం తప్పకుండా రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే.. అది మెదడు  చురుగ్గా ఉండటానికి,  మెదడు  ఆరోగ్యానికి తోడ్పడుతుంది ,  అలాగే నరాల పనితీరును  కూడా మెరుగ్గా ఉంచుతుంది. కంటి ఆరోగ్యానికి.. గుడ్లలో ల్యూటిన్ , జీక్సాంథిన్ ఉంటాయి. ఇవి వయస్సు సంబంధిత మాక్యులర్ డిజెనరేషన్ నుండి కళ్ళను రక్షించే యాంటీఆక్సిడెంట్లు.  మొత్తం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి.. గుడ్లలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, సమతుల్య ఆహారంతో పాటు మితంగా గుడ్లు తినడం వల్ల మంచి HDL కొలెస్ట్రాల్ పెరిగి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ప్రోటీన్ కు మంచిది.. రెండు ఉడికించిన గుడ్లు సుమారు 12 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్‌ను అందిస్తాయి. ఇవి కండరాల నిర్మాణం, మరమ్మత్తు , కడుపు నిండిన ఫీలింగ్ ఇవవ్డంలో సహాయపడతాయి. ఫిట్‌నెస్ ప్రియులకు , లీన్ కండరాలను కాపాడుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచిది. బరువు నిర్వహణకు.. గుడ్లలో అధిక ప్రోటీన్ , తక్కువ కేలరీలు ఉంటాయి.  దీని కారణంగా ఉడికించిన గుడ్లు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి , శరీరానికి కావలసిన పోషకాలు కూడా మెరుగ్గా అందిస్తాయి. ఇవి అతిగా తినడాన్ని,  వెంటనే ఆకలి కావడాన్ని అరికట్టడానికి , బరువు నిర్వహణకు సహాయపడతాయి.                                                                                                                                                   *రూపశ్రీ.