LATEST NEWS
  ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డికి జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యత..! ఆంధ్రప్రదేశ్ బీజేపీ యువ నేత, పార్టీ వక్త ఎస్. విష్ణువర్ధన్ రెడ్డికి జాతీయ స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో ఆయనను ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా నియమించారు. రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న ఆయనకు జాతీయ స్థాయిలో సంస్థాగత బాధ్యత అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివిధ రాష్ట్రాల్లో పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న సెల్స్, విభాగాల మధ్య సమన్వయం చేయడం విష్ణువర్ధన్ రెడ్డి ప్రధాన బాధ్యతగా ఉండనుంది. ఆయా విభాగాల కార్యకలాపాలను పార్టీ జాతీయ నాయకత్వంతో అనుసంధానం చేయడంతో పాటు, పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు.  దీంతో ఇప్పటివరకు ఏపీ రాజకీయాలకే పరిమితమైన ఆయన రాజకీయ బాధ్యతలు జాతీయ స్థాయికి విస్తరించనున్నాయి. విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పటికే బీజేపీ వక్తగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గుర్తింపు పొందారు. పార్టీ విధానాలను మీడియా వేదికలపై బలంగా వినిపించడం, రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు సమాధానం ఇవ్వడం, సమకాలీన అంశాలపై బీజేపీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన వాగ్దాటి, రాజకీయ అంశాలపై అవగాహనకు తోడు సంస్థాగత అనుభవం కూడా ఉండటంతో తాజాగా జాతీయ స్థాయిలో సమన్వయ బాధ్యత అప్పగించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలకు ప్రాధాన్యత లభించింది. దగ్గుబాటి పురందేశ్వరికి జాతీయ ఉపాధ్యక్షురాలిగా, రాంమాధవ్‌కు జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు దక్కగా, విష్ణువర్ధన్ రెడ్డికి కీలకమైన సమన్వయ బాధ్యత లభించింది. ఒకే జాతీయ కార్యవర్గంలో ఏపీకి చెందిన నేతలకు కీలక బాధ్యతలు దక్కడంతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. సీనియర్ నేతలతో పాటు యువ నాయకత్వానికి జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడంలో భాగంగానే విష్ణువర్ధన్ రెడ్డి నియామకాన్ని రాజకీయ వర్గాలు చూస్తున్నాయి.  యువతతో అనుసంధానం, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం వంటి అంశాల్లో ఆయనకు ఉన్న అనుభవాన్ని ఇక దేశవ్యాప్తంగా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో వినియోగించుకునే అవకాశం లభించింది. ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాలతో సమన్వయం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో పార్టీ వక్తగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విష్ణువర్ధన్ రెడ్డికి జాతీయ స్థాయిలో సంస్థాగత బాధ్యత లభించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక మైలురాయిగా నిలిచింది. S. Vishnuvardhan Reddy, BJP, D Purandeswari, Ram Madhav, Smriti Irani, Andhra Pradesh BJP, Telangana BJP, Pm modi, Nitin Nabin, Smriti Irani, Vasundhara Raje
పంద్రాగస్టున ఎర్రకోట బురుజులపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఉపయోగించిన దిమాగీ నక్సల్ అన్న పదంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా  రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఆ ప్రసంగంలో  పీఎం మోదీ ప్రయోగించిన  దిమాగీ నక్సల్  అంటే ఆలోచించే లేదా మేధో నక్సలైట్లు  అని అర్ధం.   ఈ పద ప్రయోగంపై విపక్షాలు, రాజకీయ విశ్లేషకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే మేధావులు, ప్రతిపక్ష నేతలు, విశ్లేషకులపై ముద్ర వేయడానికే ఈ పదాన్ని సృష్టించారంటున్నారు ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ.  తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన విధానాలను విమర్శించే వారికి నక్సల్ బ్రాండ్ వేసే ప్రయత్నంలో భాగమే మోడీ నోటి వెంట దిమాగీ నక్సల్ అన్న పదం రావడానికి కారణమన్నారు. గతంలో అర్బన్ నక్సలైట్లు అని మేధావులపై బ్రాండ్ వేసిన సంగతిని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో ఉన్న అర్బన్ నక్సల్,   రూరల్ నక్సల్ అనే పదాల సరసన ఇప్పుడు  దిమాగీ నక్సల్'అనే కొత్త బ్రాండ్‌ను చేర్చారన్నారు భరద్వాజ. అంతేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో  నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించి మార్చి 31 2026 డెడ్ లైన్ విధించిన సంగతిని గుర్తు చేశారు. ఇప్పుడు  ప్రభుత్వంపై ఎవరైనా విమర్శలు చేసినా,  ప్రజాసమస్యలపై ప్రశ్నించినా వారిని దిమాగీ నక్సల్  అకౌంట్‌లో వేసి, భయాందోళనలు సృష్టించేందుకు యత్నిస్తున్నారన్నారు. గతంలో నక్సల్ ముక్తి భారత్ అన్నట్లుగానే.. దిమాగి నక్సల్ విముక్తి భారత్ అని పరోక్షంగా హెచ్చరించడమే దీని ఉద్దేశమని భరధ్వాజ విశ్లేషషించారు. అంటే.. ఇండియాను  మెదడు లేదా ఆలోచన రహిత భారత్ వైపు నడిపించాలని మోడీ అనుకుంటున్నారా అన్న సందేహం వస్తుందన్నారు.  కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను, విమర్శకులను టార్గెట్ చేస్తూ వరుసగా బ్రాండింగ్ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు భరద్వాజ.  స్వాతంత్ర్య దినోత్సవం రోజున అహింసా మార్గాన్ని స్మరించుకుంటూనే, మరోవైపు ఎర్రకోట ప్రాంగణం నుంచే  దిమాగీ నక్సల్స్ అంటూ హెచ్చరించడం ద్వారా ప్రధాని జనాలకు ఏం సందేశమిచ్చారో స్పష్టమేనన్న భరద్వాజ ప్రస్తుతం ఎమర్జెన్సీ నాటి నిర్బంధాన్ని మించి దారుణ పరిస్థితులున్నాయన్నారు.   భరద్వాజ ఇంటర్వ్యూ పూర్తి పాఠం తెలుగువన్ న్యూస్ చానెల్ లో వీక్షించడండి.  PM Modi Dimagi Naxal Comments,  Red Fort,  Independence Day Speech,  controversial speech, Opposition reaction, TeluguOne   
ఏపీ అసెంబ్లీ వేదికగా  మంత్రి నారా లోకేష్  మెగా డీఎస్సీపై వైసీపీ విమర్శలను సమర్ధంగా తిప్పికొట్టారు.  మెగా డిఎస్సీ నిర్వహణ, ఫలితాలపై వైసిపి చేస్తున్న అసత్య ప్రచారాలను ఆయన అసెంబ్లీలో, మండలిలో ఆధారాలతో సహా  ఖండించారు. ప్రభుత్వం పారదర్శకంగా రికార్డు స్థాయిలో 148 రోజుల్లోనే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసిందని విద్యాశాఖ మంత్రి విస్పంష్టంగా తేల్చి చెప్పారు. లోకేష్ సభ సాక్షిగా ఇచ్చిన వివరణతో వైసీపీకి బుల్లెట్ దిగిందా అన్నట్లుగా రిప్లై ఇచ్చారు. లోకేష్ వైసీపీకి ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అక్కడ, అలా ఇచ్చేశారని విశ్లేషించారు సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ అనలిస్టు డీవీ శ్రీనివాస్.  తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన డీవీ శ్రీనివాస్.. లోకేష్ సమావేశంతో జగన్ చెబుతున్నట్లు ప్రభుత్వం పారిపోలేదనీ జగనే పారిపోతున్నారని తేటతెల్లమైందని అన్నారు. సరిపోదా జగన్ సరిపోదా లోకేష్ రిప్లై అని ప్రశ్నించారు. లోకేష్ బుల్లెట్ లాంటి రిప్లై ఇచ్చారన్న ఆయన.. ఇప్పటికి మూడు సార్లు చర్చకు రావాలని చేసిన లోకేష్... ఇప్పుడు నాలుగో సారి సవాల్ చేశారన్న డీవీ శ్రీనివాస్.. సభకు రాకుండా వైసీపీ పారిపోయిందనడానికి ఆ పార్టీ సభ్యులు సభకు రాకపోవడమే నిదర్శనమన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఐదు డీఎస్సీలు నిర్వహించాల్సిన ఆయన ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ఎందుకు నిర్వహించలేకపోయిందో చెప్పాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకూ ఇప్పుడు వైసీపీ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూ పొంతన లేదన్నారు.   డీవీ శ్రీనివాస్ ఇంటర్వ్యూ పూర్తి పాఠం తెలుగువన్ న్యూస్ చానెల్ లో వీక్షించండి.  Nara Lokesh AP Assembly Speech, Mega DSC Results Andhra Pradesh, Nara Lokesh Counter To YCP, AP Teacher Recruitment News, Mega DSC Latest News Telugu
బీజేపీ తన జాతీయ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించింది. కాగా జాతీయ కార్యవర్గంలో రాజమహేంద్ర వరం ఎంపీ పురంధేశ్వరికి స్థానం దక్కింది. ఆమెను జాతీయ  ఉపాధ్యక్షురాలిగా నియమించింది.  రానున్న ఎన్నికలు, పార్టీ  విస్తరణ వ్యూహాలకు అనుగుణంగా  బిజెపి అధిష్టానం  కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించింది. ఈ కొత్త పాలకమండలిలో వివిధ రాష్ట్రాల నుంచి కీలక నాయకులకు చోటు కల్పించారు.  కాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో మొత్తం 13 మంది నాయకులకు అవకాశం దక్కింది. వీరిలో  పురందేశ్వరి ఒకరు.  అదేవిధంగా, పార్టీ నిర్వహణలో  కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శుల జాబితాలో మాజీ మంత్రి స్మృతి ఇరానీకి చోటు దక్కింది.   ఈ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా  బీజేపీ అగ్రనాయకత్వం..  మహిళా నేతలకు, అనుభవజ్ఞులకు పదవుల్లో ప్రాముఖ్యత ఇచ్చింది.  ఇక పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన పురందేశ్వరి..  కేంద్ర మాజీ మంత్రిగా, సీనియర్ పార్లమెంటేరియన్‌గా అనుభవం ఉన్న నాయకురాలు. ఆమె బీజేపీ గూటికి చేరిన నాటి నుంచీ  జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో విభిన్న బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. ఈ నేపథ్యంలో ఆమె   అనుభవానికి గుర్తింపునిస్తూ.. అధిష్టానం ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టింది.  తెలుగు రాష్ట్రాలలో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో బిజెపి బలోపేతానికి ఈ నియామకం   తోడ్పడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   Purandeswari,  BJP Vice President, Rajahmundry MP,  BJP National Executive Committee, Smriti Irani BJP General Secretary, BJP National Office Bearers, Purandeswari National Politics, TeluguOne
  వనపర్తి కాంగ్రెస్‌లో టికెట్ వివాదం..నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతా..! ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ కేటాయింపుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి చేసిన ఆరోపణలకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఘాటుగా స్పందించారు. మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నారని, డబ్బులకు ఆశపడి అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయనకే టికెట్ ఇచ్చారని చిన్నారెడ్డి ఆరోపించారు. తనకు టికెట్ ఇచ్చిన సోనియా గాంధీ.. ఆర్థిక సమస్యలు ఉంటే స్వయంగా ఖర్చు పెట్టి గెలిపించాలని రేవంత్ రెడ్డికి సూచించారని ఆయన పేర్కొన్నారు. అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎందుకు నిలిచిపోయాయని మంత్రులను అడిగితే.. ఎమ్మెల్యే మేఘారెడ్డి పనులకు అడ్డుపడుతున్నారని, కాంట్రాక్టులు తన అనుచరులకు దక్కలేదనే కారణంతో పనులు ఆపుతున్నారని వారు చెప్పారని చిన్నారెడ్డి అన్నారు. మేఘారెడ్డి తన అనుచరులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తరహాలో తాను కూడా పార్టీపై తిరగబడాల్సి వస్తుందని చిన్నారెడ్డి హెచ్చరించారు. అయితే తాను పార్టీని వీడబోనని, మేఘారెడ్డి వంటి వారిని పార్టీ నుంచి బయటకు పంపే వరకు పోరాడతానని వ్యాఖ్యానించారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్వహించిన పలు విడతల సర్వేల ఆధారంగానే తనకు టికెట్ లభించిందని స్పష్టం చేశారు. విజయావకాశాలు ఉన్న అభ్యర్థులకే పార్టీ టికెట్లు కేటాయించిందని, ఇందులో ఎలాంటి అక్రమాలకు తావులేదని అన్నారు. తాను టికెట్ కోసం ఎవరికైనా డబ్బులు ఇచ్చానని ఆరోపిస్తున్న చిన్నారెడ్డి.. ధైర్యముంటే తాను ఎవరికి, ఎంత డబ్బు ఇచ్చానో బహిరంగంగా వెల్లడించాలని మేఘారెడ్డి సవాల్ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ద్వారా తన ప్రతిష్ఠను, పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. 2014, 2018 ఎన్నికల సమయంలో ఇకపై తాను పోటీకి దూరంగా ఉంటానని, అధిష్ఠానం ఎవరికి అవకాశం ఇచ్చినా వారి విజయానికి కృషి చేస్తానని చిన్నారెడ్డి చెప్పిన విషయాన్ని కూడా మేఘారెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తానని మేఘారెడ్డి తెలిపారు. అధికారంలో ఉన్న సమయంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన తరుణంలో సీనియర్ నేతలు, ఎమ్మెల్యే మధ్య బహిరంగంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటుచేసుకోవడం వనపర్తి కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. Vanaparthy Congress, Thudi Megha Reddy, G Chinna Reddy, Vanaparthy MLA, Congress Ticket Controversy, Telangana Congress, Congress Internal Dispute, Ticket Allegations, Congress Leaders, Political Controversy, Telangana Politics, Jivan Reddy, CM Revanth Reddy
ALSO ON TELUGUONE N E W S
న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'ది ప్యారడైజ్'. దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని దాటిపోయాయి. ఇప్పటికే విడుదలైన 'ఆయా షేర్' సాంగ్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తెచ్చుకుని, ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. ప్రతీ చోటా ఈ సాంగ్ మారుమోగిపోతోంది. రాబోయే వారంలో 'ది ప్యారడైజ్' చిత్రం నుంచి మరొక స్పెషల్ తెలంగాణ ఫోక్ సాంగ్ అప్‌డేట్ రాబోతోంది. ఈ పాట ఊర మాస్ బీట్స్‌తో, తెలంగాణ నేటివిటీని ప్రతిబింబించేలా, వింటేనే పూనకాలు వచ్చే విధంగా రూపుదిద్దుకుందట. ఈ పాట ఏకంగా 200 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టే పొటెన్షియల్ ఉందని అంటున్నారు. తెలంగాణ ఫోక్ డ్రమ్స్, పక్కా లోకల్ లిరిక్స్, నాని ఎనర్జెటిక్ మాస్ డాన్స్ మూవ్స్ ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయట. 'దసరా' సినిమాలో 'చమ్కీల అంగీలేసి' పాట ఎలాగైతే అన్ని చోట్లా మారుమోగిపోయిందో.. ఇప్పుడు రాబోతున్న ఈ కొత్త ఫోక్ సాంగ్ కూడా అదే రేంజ్‌లో సంచలనం సృష్టిస్తుందని చెబుతున్నారట. ఈ సాంగ్ అనౌన్స్‌మెంట్ వచ్చే వారంలోనే ఒక మైండ్ బ్లోయింగ్ పోస్టర్‌తో రాబోతోందని టాక్.     Nani, The Paradise, Aaya Sher Song, Telangana Folk Song  
Sunil and Akhil Uddemari play the lead roles in the upcoming psychological thriller “Fight Maha,” featuring Dr. Srivani Gopichand, Vaishnavi, Siddharth, and Srikanth Ayyangar in key roles. “If dreams come true, whose truth is it?” is the intriguing tagline of the film. Directed by Anand Chandra, the film is being presented as a fresh and innovative psychological thriller. It is produced by AVS Raju, R. Kumar Raju, and Anand Chandra under the banner of New I Movies LLP.  The teaser, which was released last month by renowned filmmaker Ram Gopal Varma, received an excellent response and has crossed more than a million views.Today the makers have now unveiled the 2-minute-20-second theatrical trailer, further raising curiosity around the film. “Fight Maha” is scheduled to release worldwide in theatres on August 21. Producer AVS Raju said- “We all liked the story immensely when director Anand Chandra narrated it to us. The story itself inspired us to produce this film. The way the director narrated the story was equally reflected in the way he brought it to the screen. We shot the film across Visakhapatnam, Kerala, and Hyderabad. Although only Sunil and Akhil Uddemari are seen on the film’s poster, nearly 40 actors have played important roles in the movie. We released the teaser last month through Ram Gopal Varma, and it received an excellent response, crossing more than a million views. We are now bringing Fight Maha to theatres worldwide on August 21st.” Director Anand Chandra said-“The concept of sleepwalking that we have explored in Fight Maha is very unique. Although films with similar concepts have been made in the past, we believe that the concept presented in this film will be fresh and new for Telugu audiences. Fight Maha is an innovative psychological thriller revolving around dreams, mental illness, destiny, guilt, and hidden truths. ‘Maha’ is the name of the male lead character in our film. He is constantly fighting against the struggles in his life, which is why we titled the film Fight Maha. The film also conveys a positive message: no matter how much disappointment or frustration we face in life, we should never give up on anything. We must continue to fight and move forward.” Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
    విశ్వనాధ్ అండ్ సన్స్ లో అభిమానులు  సెల్యులాయిడ్ పై  'సూర్య' ని విశ్వనాధ్ గా చూసుకొని మురుసిపోతున్నారు. ఇది కదా సూర్య అంటే అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ శ్రావణ మాస శోభకి మరింత కాంతులు వెదజల్లుతున్నారు. ఫ్యామిలీస్ కూడా థియేటర్స్ బాట పట్టడానికి శ్రావణ మాస శోభనే ఒక కారణం కావచ్చు.  నిజానికి  సంజయ్ విశ్వనాధ్ గా సూర్య నటన అంత ఆషామాషి తో కూడుకున్న వ్యవహారం కాదు.  క్యారక్టర్ కి తగ్గట్టుగా పిన్ టూ పిన్ బాడీ లాంగ్వేజ్ తో మెప్పించాలంటే ఎంతో శ్రమ తప్పని సరి. ఇక ఈ సినిమా నైజాం ఏరియాలో కలెక్షన్స్ తుపాన్ సృష్టిస్తుంది. ఆదివారం ఒక్క రోజే 5.2 కోట్ల గ్రాస్ ని రాబట్టి తన అర్హత ఉన్న రేంజ్ ని చాటి చెప్పింది. దీంతో మొదటి మూడు రోజులకి  కలిపి నైజాంలో మొత్తం గ్రాస్ కలెక్షన్లు 14 కోట్ల మార్కుని  తాకాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రానికి నైజాం అత్యుత్తమ వసూళ్లు నమోదు చేసిన ప్రాంతంగా కూడా నిలవడం గమనార్హం. తొలి మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు రావడంతో, ఈ సినిమా నేటితో (సోమవారం) జీఎస్టీ మినహాయించి బ్రేక్ ఈవెన్ స్థాయిని చేరుకోనుంది. వీకెండ్ తర్వాత పనిదినాల్లో కూడా ఇదే జోరు కొనసాగితే, నైజాం డిస్ట్రిబ్యూటర్లకి మంచి లాభాలు దక్కే వీలుంది. Also read: DC: డిసి తంబికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడానికి అసలు కారణాలు ఇవేనా! వెంకీ అట్లూరి దర్శకత్వం, మాటలకి, మాగి గా  మమితా బైజు నాచురల్  పెర్ ఫార్మెన్స్,    సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ విలువలు,  జి.వి. ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిమిష్ రవి ఫొటోగ్రఫీ పోటాపోటీగా విశ్వనాధ్ అండ్ సన్స్ కి కుదిరాయి. వరల్డ్ వైడ్ గా మూడు రోజులకి  సుమారు 120 కోట్ల వరకు గ్రాస్ ని రాబట్టింది. Vishwanath And Sons, Suriya, Mamitha Bhaiju
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ డ్రాగన్. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం వేయించిన ప్రత్యేకమైన భారీ సెట్ వర్క్, దాని డీటైలింగ్ చూసి యూనిట్ సభ్యులంతా ఫిదా అయ్యారట. డ్రాగన్ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రశాంత్ నీల్ అంటేనే మనకు గుర్తొచ్చేది భారీ సెట్లు, హై-వోల్టేజ్ యాక్షన్, అలాగే నెక్స్ట్ లెవెల్ ఎమోషన్స్. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేయించిన ఒక ప్రత్యేకమైన భారీ సెట్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలోని కీలకమైన సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరించడానికి ప్రశాంత్ నీల్ అండ్ ఆర్ట్ డైరెక్షన్ టీమ్ మైండ్ బ్లోయింగ్ ప్రాపర్టీస్, యూరోపియన్ స్టైల్ డిజైన్స్‌తో ఒక వింటేజ్ అట్మాస్ఫియర్‌ను క్రియేట్ చేశారు. షూటింగ్ సమయంలో సెట్‌లోకి అడుగుపెట్టిన నటీనటులు, టెక్నీషియన్లు ఆ ప్రొడక్షన్ డీటైలింగ్, ఆర్ట్ వర్క్ చూసి ఫిదా అయిపోయారట. ప్రశాంత్ నీల్ విజన్‌ను నిజం చేయడానికి ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ప్రతి చిన్న విషయాన్ని ఎంతో పర్ఫెక్ట్‌గా రీ-క్రియేట్ చేసింది. సాధారణంగా కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలలో డార్క్ మోనోక్రోమటిక్ షేడ్స్‌ను ఎక్కువగా వాడిన ప్రశాంత్ నీల్, ఈసారి డ్రాగన్ కోసం పూర్తి డిఫరెంట్ అప్రోచ్ తీసుకుంటున్నారు. ఈ భారీ సెట్‌లోనే ఎన్టీఆర్ పై తీసే యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో రచ్చ లేపుతాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్ రా అండ్ రగ్గడ్ లుక్, దానికి తోడు ఈ విజువల్ గ్రాండియర్ వెండితెరపై ఒక విజువల్ వండర్ కాబోతోంది. కాగా, ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పట్టనుంది. ఈలోపు ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ లేని సీన్స్ ని తెరకెక్కించడంతో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పారలల్ గా చేస్తున్నట్లు సమాచారం.       Dragon Movie, Jr NTR, Prashanth Neel, NTR Neel  
The makers of Itllu Arjuna have released the second single, Chinni Chinni, and the song brings a fresh, youthful energy to the film. Starring Aniesh and Anaswara Rajan, the romantic action drama has already created interest with its first single Hai Re and its glimpse. Composed by S Thaman, Chinni Chinni is built around energetic EDM beats and a catchy rhythm. Mohit Chauhan brings his distinctive vocals to the track, while lyrics by Kalyan Chakravarthy add to its youthful feel. After bringing Anirudh Ravichander on board for the first single, Thaman has once again chosen a popular voice to add more character to the film’s music. The song also gives a better glimpse of the chemistry between Aniesh and Anaswara Rajan. Aniesh’s dance moves and expressions stand out, particularly because his character cannot speak and has to communicate largely through his expressions and body language. His performance in the song gives a glimpse of the challenge he has taken up in his debut film. Anaswara Rajan adds to the song with her graceful moves and lively screen presence. The chemistry between the lead pair comes through naturally, while the choreography and vibrant visuals match the energy of the track. Director Mahesh Uppala has kept the presentation colourful and fast-paced without taking the focus away from the leads. With Hai Re and now Chinni Chinni offering two different musical flavours, Thaman’s score is emerging as one of the interesting aspects of Itllu Arjuna. Produced by Venky Kudumula, the film is gearing up for a worldwide release in October and promises a youthful love story with an action backdrop. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్-ఇండియా చిత్రం AA23 గురించి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా గ్రాండ్ లాంచ్ ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.  పుష్ప 2 సిరీస్ సృష్టించిన సంచలనం తర్వాత, అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్టులతో పాన్ ఇండియా మార్కెట్‌ని మరింత షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో తన 22వ సినిమా 'రాకా' చేస్తున్నారు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ లైన్ లో ఉంది.  ఈ మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ మూవీ లాంచ్ నవంబర్ నెలలో చాలా గ్రాండ్‌గా జరగనుందని సమాచారం. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. లోకేష్ కనగరాజ్ మార్క్ డార్క్ అండ్ రా యాక్షన్ మేకింగ్, దానికి తోడు అల్లు అర్జున్ అసాధారణమైన స్క్రీన్ ప్రెజెన్స్. వీరిద్దరి కాంబోకి రోక్‌స్టార్ అనిరుధ్ ఇచ్చే ఎనర్జెటిక్ మ్యూజిక్ యాడ్ అయితే థియేటర్లలో రచ్చ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ 'రాకా' ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేసుకొని, ఆ వెంటనే లోకేష్ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నారు.        Allu Arjun, Lokesh Kanagaraj, AA23 Launch  
సునీల్, అఖిల్ ఉడ్డెమారి, ప్రదాన పాత్రల్లో డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "ఫైట్ మహా". కలలు నిజమైతే నిజం ఎవరిది అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు ఆనంద్ చంద్ర. న్యూ ఐ మూవీస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా గత నెల విడుదల చేసిన టీజర్ అద్భుతమైన స్పందన వచ్చింది, మిలియన్ ప్లస్ వ్యూస్ తో ప్రస్తుతం ఆకట్టుకుంటుంది. కాగ ఈ రోజు 2 నిమిషాల 20 సెకండ్స్ నిడివిగల  ట్రైలర్ విడుదల చేసారు. ఈ చిత్రం ఆగస్టు 21 న  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.   ప్రొడ్యూసర్ ఏవీఎస్ రాజు మాట్లాడుతూ - "దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ కథ చెప్పినప్పుడు మా అందరికీ బాగా నచ్చింది. కథే ఈ సినిమా నిర్మించేందుకు మమ్మల్ని ఇన్స్ పైర్ చేసింది. డైరెక్టర్ మాకు కథ ఎంత బాగా చెప్పాడో అంతే బాగా రూపొందించాడు. వైజాగ్, కేరళ, హైదరాబాద్ లో ఈ సినిమాను చిత్రీకరించాం.ఈ సినిమా పోస్టర్ లో కేవలం ఇద్దరు సునీల్, అఖిల్ ఉడ్డెమారి కనిపించినా షుమారు 40 మంది నటీ నటులు ఈ చిత్రం లో అలరించనున్నారు. జూలై నెలలో టీజర్ మా రాము చేతులమీదుగా విడుదల చేసాము మిలియన్ ప్లస్ వ్యూస్ తో అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 21న  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం"   అన్నారు. డైరెక్టర్ ఆనంద్ చంద్ర మాట్లాడుతూ - " 'ఫైట్ మహా' లో మేము  చూపించిన స్లీప్ వాకింగ్ అనే కాన్సెప్ట్ చాలా యునిక్ గా వుంటుంది. గతంలో  ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమాలు వచ్చినా, మన తెలుగు  ప్రేక్షకులకు మాత్రం ఈ చిత్రంలోని కాన్సెప్ట్ కొత్తగా ఉంటుందని నమ్మకం ఉంది. ఈ చిత్రం  ఒక వినూత్నమైన సైకాలజికల్ థ్రిల్లర్. కలలు, మానసిక రుగ్మత, విధి, అపరాధ భావన, ఎక్కడో  దాగి ఉన్న నిజాల చుట్టూ తిరిగే ఈ కథ.  'మహా' అనేది మా మూవీలో మెయిల్ లీడ్ క్యారెక్టర్ పేరు. ఆయన తన జీవితంతో  ఫైట్ చేస్తుంటాడు. అందుకే ఫైట్ మహా అనే టైటిల్ మా మూవీకి పెట్టాం. లైఫ్ లో నిరాశ, నిసృహలతో ఏ విషయాన్నీ అయినా వదిలిపెట్టకూడదు. నిత్యం పోరాడుతూనే ఉండాలి అనే మంచి సందేశం ఈ సినిమాలో చూపిస్తున్నాం." అన్నారు.
    ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు సినీ ప్రియులు కలిసినా తమిళ సరుకు 'డిసి' గురించే చర్చ నడుస్తుంది. మన దగ్గర సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చిన బడా హీరోల సినిమాలనే తమిళ తంబీ పెద్దగా పట్టించుకోడు. కానీ మన తెలుగు ప్రేక్షకులు మాత్రం డి సి బాగుందని టాక్ రావడం ఆలస్యం చలో టూ 'డిసి' థియేటర్స్ అంటున్నారు. వీకెండ్ తో సంబంధం లేకుండా మంగళ, బుధవారాల్లో నైట్ సెకండ్ షో హౌస్ ఫుల్ అవుతుంటే థియేటర్ యజమానులు కూడా కల, నిజామా అంటూ గిల్లుకొనే పరిస్థితి. అందుకే  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు సినీ ప్రియులు కలిసినా 'డిసి' గురించి మాట్లాడుకుంటున్నారు  తెలుగు సినిమా ప్రియులు ఎప్పుడూ డార్క్ కథలు, ఎమోషనల్ షేడ్స్, డెప్త్ ఉన్న ఆంటి-హీరో లేదా మాస్ క్యారెక్టర్స్ కి విపరీతంగా కనెక్ట్ అవుతారు. డీసీ కామిక్స్ లోని "బ్యాట్‌మ్యాన్", "జోకర్" పాత్రలలో ఉండే తీవ్రమైన అంతర్మథనం, సైకలాజికల్ డ్రామా మన ఆడియన్స్‌కి ఎంతగానో నచ్చుతాయి. సరిగ్గా అదే తరహాలో, లోకేష్ కనగరాజ్ నటించిన "DC" మూవీలో దేవదాస్, చంద్ర అనే ఇద్దరు సమాజం చేత తీవ్రంగా గాయపడిన వ్యక్తుల వైలెంట్ రివెంజ్  డ్రామా తెలుగు ప్రేక్షకుల టేస్ట్‌కి సరిగ్గా సెట్ అయింది. లొకేషన్ల డార్క్ మూడ్, అపరిమితమైన యాక్షన్ కంటెంట్, మరియు అనిరుధ్ రవిచందర్ అందించిన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తెలుగులో మాస్ రికార్డుల దిశగా నడిపించాయి.  Also read: ఇరుముడి vs టాక్సిక్.. వాళ్ళు ఎటు వైపు!  లోకేష్ కనగరాజ్ స్వయంగా దర్శకుడిగా "LCU"తో సృష్టించిన డార్క్ సినిమాటిక్ వాతావరణం, ఆయన నటనలో కూడా కనిపించడం వల్ల కూడా మరింత బ్రహ్మరథం పట్టారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం వరల్డ్ వైడ్ గా 84.31 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే, తమిళనాడు కంటే తెలుగులోనే  ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేస్తూ దూసుకుపోతుంది. దీన్ని బట్టి   తెలుగు ప్రేక్షకులు డిసి ని  ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు..DC అంటే దేవదాస్, చంద్ర. Lokesh Kanagaraj, wamiqa Gabbi, Arun Matheswaran  
'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ తో డైరెక్టర్ గా టాలీవుడ్‌కు పరిచయమైన బుచ్చిబాబు సానా.. రెండో సినిమా 'పెద్ది'ని ఏకంగా రామ్ చరణ్ తో చేసి సంచలనం సృష్టించారు. అయితే బుచ్చిబాబు దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వకముందు రాసిన మొదటి కథ మాస్ మహారాజా రవితేజ కోసం రాశారు. ఈ విషయాన్ని తాజాగా బుచ్చిబాబు స్వయంగా రివీల్ చేయడం విశేషం. రవితేజ కొత్త సినిమా 'ఇరుముడి' ప్రీ-రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ వేడుకకు దర్శకుడు బుచ్చిబాబు గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని అందరి ముందు చెప్పారు. "నా మొదటి కథను రవితేజ గారి కోసమే రాసుకున్నాను. ఆ కథ ఇప్పటికీ నా దగ్గర అలాగే ఉంది. ఎప్పటికైనా ఆ కథను రవితేజ గారికి నేరేట్ చేస్తాను." అని చెప్పారు.  బుచ్చిబాబు మాటలను బట్టి చూస్తే.. త్వరలోనే ఆయన రవితేజతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు అనిపిస్తోంది.  ప్రస్తుతం బుచ్చిబాబు 'పెద్ది' సినిమాతో సూపర్ సక్సెస్ మీదున్నారు. ఆయన ఏ ప్రాజెక్ట్ చేసినా అది పాన్ ఇండియా రేంజ్‌లో ఉంటోంది. మరోవైపు రవితేజ కూడా 'ఇరుముడి'తో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టించాలని పట్టుదలగా ఉన్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే, అది టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది క్రేజీ ప్రాజెక్ట్ అయ్యే అవకాశముంది.       Irumudi Movie, Ravi Teja, Buchi Babu Sana, Peddi Movie  
  పాజిటివ్ వైబ్రేషన్స్ తో వస్తున్న ఇరుముడి హిట్ అయ్యి రవితేజని ప్లాప్స్ భూతం నుంచి  బయట పడేస్తుందని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ తో పాటు అజయ్ ఘోష్ భూతులు మాట్లాడారనే విమర్శలు వస్తున్నా సినిమా బాగుంటే అవన్నీ జుజుబీ.. కానీ సినీ ట్రేడ్ సర్కిల్స్ లో ఇప్పట్నుంచే టాక్సిక్ వర్సెస్ ఇరుముడి నినాదం తన ప్రతాపాన్ని చూపిస్తుంది.  'ఇరుముడి' ఈ నెల 21న అంటే ఇంకో మూడు రోజుల్లో రిలీజ్ అవుతుండగా ఐదు రోజుల వ్యవధిలోనే, అంటే 26న యశ్ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'టాక్సిక్' థియేటర్లలోకి వస్తోంది. దీనివల్ల 'ఇరుముడి'కి ఫుల్ లెంగ్త్ 2 వారాల సోలో లాంగ్ రన్  లభించని పరిస్థితి ఏర్పడింది. కెజియఫ్ సిరీస్ తర్వాత యశ్ మార్కెట్ రేంజ్ విపరీతంగా పెరగడం, 'టాక్సిక్' సినిమాపై ఉన్న మైండ్ బ్లాకింగ్ అంచనాల వల్ల ఎక్కువ సంఖ్యలో థియేటర్లు, ప్రైమ్ షోలు ఆ సినిమాకే కేటాయించాల్సి వస్తుంది. మొదటి 3 రోజుల్లోనే 'ఇరుముడి' అత్యంత వేగంగా పాజిటివ్ టాక్ తెచ్చుకుని, భారీగా కలెక్షన్లు రాబడితేనే థియేటర్లను నిలబెట్టుకోవడం సాధ్యమవుతుంది. 'ఇరుముడి'లోని భక్తి, ఎమోషన్, డ్రామా కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే కలెక్షన్లు స్థిరంగా ఉంటాయి. కానీ బాక్సాఫీస్ టైమింగ్ లెక్కల్లో 5 రోజుల గ్యాప్ మాత్రమే ఉండటంతో, రవితేజ తన మార్కెట్ హోల్డ్‌ను మొదటి వీకెండ్‌లోనే 100% నిరూపించుకోవాల్సి ఉంది. మరి 'టాక్సిక్' సునామీని తట్టుకుని మాస్ మహారాజా 'ఇరుముడి' విజయం సాధిస్తుందో లేదో చూడాలి. Also read: ఆ రాజకీయ పార్టీలో చేరిన శ్రష్టి వర్మ.. అసలు ఆట ఇప్పుడు మొదలు కానుందా! ఏది ఏమైనా ఈ రసవత్తు పోరు అభిమానుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుండగా సినీ అభిమానులు, ప్రేక్షకులు మంత్ ఎండింగ్ సమీపిస్తుండటంతో రెండు సినిమాలని ఫ్యామిలీ తో సహా చూడటానికి కావాల్సిన  సరిపడా అమౌంట్ ని సెట్ చేసుకునే పనిలో ఉన్నారు. పైగా  పృథ్వీరాజ్ సుకుమారన్ వన్ మాన్ షో  'ఖలీఫా' 20 వ తారీకు విడుదల కావడం బోనస్.  Irumudi, Toxic, Raviteja, Yash
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది,  స్వేచ్ఛను సంపాదించుకుంది.  ఈ సందర్బంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం  జరుపుకుంటారు. 1947లో బ్రిటిష్ వలస పాలన నుండి దేశానికి లభించిన విముక్తికి గుర్తుగా దేశమంతా జరుపుకునే పండుగే  స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన లెక్కలేనంత మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, అవిశ్రాంత కృషికి ఈ రోజు ఒక నివాళి. స్వాతంత్ర పోరాటం ముగిసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక శకం ముగిసి,  కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి చేసిన కృషి,  జరిగిన సంఘటనలు, త్యాగాల గురించి వివరంగా తెలుసుకుంటే.. పోరాటం.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగిన ఒక సుదీర్ఘమైన, కఠిన ప్రయాణం. ఇది 1857 తిరుగుబాటుతో ప్రారంభమైంది.  దీనిని మొదటి స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు, ఇందులో భారతీయ సైనికులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన జాతీయ చైతన్యాన్ని రగిలించింది, ఇది చివరికి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. 20వ శతాబ్దం ప్రారంభంలో గాంధీజి వంటి ప్రముఖ నాయకులు ఉద్భవించారు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల ద్వారా అహింసాయుత ప్రతిఘటనను సమర్థించారు. ఈ ఉద్యమాలు బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరడానికి లక్షలాది మంది భారతీయులను ఉత్తేజపరిచాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీని భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు .   ట్రైస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం.. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన చారిత్రాత్మక "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (విధితో వాగ్వాదం) ప్రసంగాన్ని అందించారు. సుబాష్ చంద్రబోస్.. ఆజాద్ హింద్ సేన.. సుభాష్ చంద్ర బోస్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అహింసా ఉద్యమం వల్ల నెమ్మదిగా ఉన్న పోరాటానికి  నిరాశ చెందిన బోస్, స్వాతంత్ర్యం సాధించడానికి మరింత దూకుడు మార్గాలను అన్వేషించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు. భారతీయ సైనికులు , ప్రవాసులతో కూడిన ఆజాద్ హింద్ సేన, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది. భారతదేశానికి విముక్తి కల్పించడంలో సైన్యం విజయం సాధించనప్పటికీ, బోస్ చేసిన ప్రయత్నాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి . భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. స్వాతంత్ర్యం కోసం బోస్ చేసిన కృషి  వర్ణించలేనిది. గోవా, హైదరాబాద్ విమోచనం.. 1947 స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు విదేశీ లేదా రాచరిక పాలనలో ఉన్నాయి. పోర్చుగీసు వలస ప్రాంతమైన గోవా, “ఆపరేషన్ విజయ్” అనే సైనిక తిరుగుబాటు తర్వాత 1961లో విముక్తి పొందింది. భారత సాయుధ దళాలు గోవాను భారత యూనియన్‌లో విజయవంతంగా విలీనం చేసి, 451 సంవత్సరాల పోర్చుగీసు పాలనకు ముగింపు పలికాయి. హైదరాబాద్ నిజాం మొదట్లో స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు, కానీ చివరికి 1948లో “ఆపరేషన్ పోలో” అనే సైనిక తిరుగుబాటు ద్వారా భారతదేశంలో విలీనం చేయబడింది. ఇది కొత్తగా ఏర్పడిన భారత గణతంత్ర రాజ్యంలో ఆ సంస్థానం యొక్క ఏకీకరణను నిర్ధారించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్.. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్, విచ్ఛిన్నమైన సంస్థానాలను భారత యూనియన్‌గా ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా మరియు హోం మంత్రిగా, ఈ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యేలా చూడటానికి పటేల్ దౌత్యపరమైన , కొన్నిసార్లు బలప్రయోగ చర్యలను కూడా ఉపయోగించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఆయన చేసిన కృషి, ఆయనకు అపారమైన గౌరవాన్ని , భారత చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించిపెట్టింది. బలమైన, ఐక్య భారతదేశానికి పునాది వేయడంలో పటేల్ దార్శనికత, నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. దేశానికి ఆయన చేసిన సేవలకు నిదర్శనంగా నిలుస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయన వారసత్వాన్ని శాశ్వతంగా నిలిపింది.                                  *రూపశ్రీ.  
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది,  స్వేచ్ఛను సంపాదించుకుంది.  ఈ సందర్బంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం  జరుపుకుంటారు. 1947లో బ్రిటిష్ వలస పాలన నుండి దేశానికి లభించిన విముక్తికి గుర్తుగా దేశమంతా జరుపుకునే పండుగే  స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన లెక్కలేనంత మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, అవిశ్రాంత కృషికి ఈ రోజు ఒక నివాళి. స్వాతంత్ర పోరాటం ముగిసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక శకం ముగిసి,  కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి చేసిన కృషి,  జరిగిన సంఘటనలు, త్యాగాల గురించి వివరంగా తెలుసుకుంటే.. పోరాటం.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగిన ఒక సుదీర్ఘమైన, కఠిన ప్రయాణం. ఇది 1857 తిరుగుబాటుతో ప్రారంభమైంది.  దీనిని మొదటి స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు, ఇందులో భారతీయ సైనికులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన జాతీయ చైతన్యాన్ని రగిలించింది, ఇది చివరికి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. 20వ శతాబ్దం ప్రారంభంలో గాంధీజి వంటి ప్రముఖ నాయకులు ఉద్భవించారు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల ద్వారా అహింసాయుత ప్రతిఘటనను సమర్థించారు. ఈ ఉద్యమాలు బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరడానికి లక్షలాది మంది భారతీయులను ఉత్తేజపరిచాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీని భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు .   ట్రైస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం.. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన చారిత్రాత్మక "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (విధితో వాగ్వాదం) ప్రసంగాన్ని అందించారు. సుబాష్ చంద్రబోస్.. ఆజాద్ హింద్ సేన.. సుభాష్ చంద్ర బోస్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అహింసా ఉద్యమం వల్ల నెమ్మదిగా ఉన్న పోరాటానికి  నిరాశ చెందిన బోస్, స్వాతంత్ర్యం సాధించడానికి మరింత దూకుడు మార్గాలను అన్వేషించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు. భారతీయ సైనికులు , ప్రవాసులతో కూడిన ఆజాద్ హింద్ సేన, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది. భారతదేశానికి విముక్తి కల్పించడంలో సైన్యం విజయం సాధించనప్పటికీ, బోస్ చేసిన ప్రయత్నాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి . భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. స్వాతంత్ర్యం కోసం బోస్ చేసిన కృషి  వర్ణించలేనిది. గోవా, హైదరాబాద్ విమోచనం.. 1947 స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు విదేశీ లేదా రాచరిక పాలనలో ఉన్నాయి. పోర్చుగీసు వలస ప్రాంతమైన గోవా, “ఆపరేషన్ విజయ్” అనే సైనిక తిరుగుబాటు తర్వాత 1961లో విముక్తి పొందింది. భారత సాయుధ దళాలు గోవాను భారత యూనియన్‌లో విజయవంతంగా విలీనం చేసి, 451 సంవత్సరాల పోర్చుగీసు పాలనకు ముగింపు పలికాయి. హైదరాబాద్ నిజాం మొదట్లో స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు, కానీ చివరికి 1948లో “ఆపరేషన్ పోలో” అనే సైనిక తిరుగుబాటు ద్వారా భారతదేశంలో విలీనం చేయబడింది. ఇది కొత్తగా ఏర్పడిన భారత గణతంత్ర రాజ్యంలో ఆ సంస్థానం యొక్క ఏకీకరణను నిర్ధారించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్.. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్, విచ్ఛిన్నమైన సంస్థానాలను భారత యూనియన్‌గా ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా మరియు హోం మంత్రిగా, ఈ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యేలా చూడటానికి పటేల్ దౌత్యపరమైన , కొన్నిసార్లు బలప్రయోగ చర్యలను కూడా ఉపయోగించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఆయన చేసిన కృషి, ఆయనకు అపారమైన గౌరవాన్ని , భారత చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించిపెట్టింది. బలమైన, ఐక్య భారతదేశానికి పునాది వేయడంలో పటేల్ దార్శనికత, నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. దేశానికి ఆయన చేసిన సేవలకు నిదర్శనంగా నిలుస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయన వారసత్వాన్ని శాశ్వతంగా నిలిపింది.                                                                                                                                                   *రూపశ్రీ.
మనుషుల నుండి ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆహారం తీసుకోవడం పరిపాటి.  తీసుకునే ఆహారం నుండి లభించే శక్తితోనే శరీరం నిలబడుతుంది. ఇక అన్ని ప్రాణులలోకి మనిషి చాలా విభిన్నమైన వాడు. మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అలవాట్లు ఉంటాయి.  అంతేకాదు.. ఆహారం తినే విధానంలో కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది.  కొందరు నిదానంగా తింటారు.  మరికొందరు చాలా వేగంగా తింటారు.  అయితే.. వేగంగా తినే వ్యక్తుల వ్యక్తిత్వం గురించి వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. వేగంగా ఆహారం తినే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. వేగంగా తినడం... మన చుట్టూ చాలామంది ఉంటారు.  కుటుంబ సభ్యులు అయినా,  స్నేహితులు అయినా.. తెలిసిన వారు అయినా.. కలిసి భోజనం చేసేటప్పుడు లేదా ఏదైనా ఆహారం తినేటప్పుడు.. అందరూ కలిసి మొదలు పెడితే.. పక్క వాళ్లు ఇంకా సగం కూడా తినకుండానే మధ్యలోనే తమ ఆహారం పూర్తీ చేసే వారు కొందరు ఉంటారు.  వారు చాలా బిజీ లైఫ్ స్టైల్ కు అలవాటు వడటం వల్ల అలా వేగంగా తినడం అలవాటు అయి ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇది నిజమే అయినా ఇలా వేగంగా తినే వారి స్వభావం విభిన్నంగా ఉంటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు. వేగంగా తినే వారిలో ఉండే వ్యక్తిత్వ లక్షణాలు.. వేగంగా తినే వ్యక్తులు ఎక్కువగా ఫినిష్ లైన్ ను చేరుకోవడంపై దృష్టి పెడతారు. అదే మనస్తత్వం జీవితంలోని ఇతర రంగాలలో కనిపిస్తుందట. వారు చేయవలసిన పనుల లిస్ట్ నుండి పనులను మార్క్  చేయడం, సమర్థవంతంగా పనిచేయడం , ఒక పనిలో ఆలస్యం  కాకుండా ఆ తరువాత  సవాలును స్వీకరించడం వంటివి వీరిలో ఉంటాయట.   స్ట్రాంగ్ ప్రాక్టీస్  ఉన్నవారు తరచుగా భోజనంతో సహా రోజువారీ దినచర్యలో వేగాన్ని , సామర్థ్యాన్ని ఇష్టపడతారని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. తినడాన్ని ఆస్వాదించడం, అనుభూతి చెందడం  కంటే తినడాన్ని కూడా ఒక  పనిగా భావిస్తారని అంటున్నారు.  తినే వేగాన్ని బట్టి వ్యక్తిత్వం లక్షణాలను,  తినే వేగానికి,  వ్యక్తిత్వానికి మధ్య గల సంబంధాలను వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు కనుక్కున్నారు. వేగంగా తినేవారు తరచుగా వేచి ఉండటానికి ఇష్టపడరు. ఇది క్యూలలో నిలబడినా, నెమ్మదిగా మీటింగ్స్  లో ఉన్నా లేదా ఆహారం వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చినా.. ఇలా అన్ని సందర్బాలలో వారు అన్ని వేగంగానే జరగాలని కోరుకుంటారట.  అన్ని విషయాలలోనూ సహజంగా వేగాన్ని వీరు ఇష్టపడతారట. ఈ ధోరణి భోజన చేయడం వరకు తీసుకువెళుతుందట.  చాలామందిలో తినే స్వభావం మానసిక , పర్యావరణ కారకాల ద్వారా ఏర్పడతాయని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు.   వేగంగా తినే వ్యక్తులలో ఇతర పనులను కూడా వేగంగా పూర్తీ చేసే సామర్థ్యం ఉంటుందట. వర్తమానంతో పూర్తీగా నిమగ్నమవడానికి బదులుగా  తరువాత ఏమి జరుగుతుందో  అనే విషయం పై దృష్టి పెట్టేలా చేస్తుందట.  ఈ కారణంగా వీరికి భవిష్యత్తు గురించి స్పష్టమైన అంచనాలు, ప్రణాళికలు కూడా ఉంటాయట. అలాగని వేగంగా తినడాన్ని సమర్థించడం లేదు. ఎందుకంటే.. వేగంగా తినడం అనేది ఆహారం సరిగా నమలకపోవడం, తినే ఆహారం మీద దృష్టి పెట్టలేకపోవడం,  ఆహారం అతిగా తినడం.. ఇలా చాలా సమస్యలకు కారణం అవుతుంది.                                                                                                                                                   *రూపశ్రీ.  
గుడ్లు పోషకాహారం యొక్క పవర్హౌస్.  ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గుడ్డు తినడం చాలామంచిదని చెబుతూ ఉంటారు.  అయితే  రోజూ రెండు ఉడికించిన గుడ్లు తినడం  మంచిదేనా? ఫిట్‌నెస్ ట్రైనింగ్ లో ఉన్నవారు,  పోషకాహార లోపంతో ఉన్నవారు ప్రతిరోజూ గుడ్డు తినాలని చెబుతుంటారు.  రోజుకు రెండు ఉడికించిన గుడ్లు తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇది శరీరం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వివరంగా తెలుసుకుంటే.. ఎముకలను బలోపేతం చేస్తుంది.. గుడ్లలో విటమిన్ డి , కాల్షియం పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముక సాంద్రతను మెరుగుపరచడంలో , బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే ఎముకల బలానికి కావలసినంత కాల్షియం,  విటమిన్-డి పొందవచ్చు. మెదడు ఆరోగ్యానికి.. గుడ్లలో కోలిన్ ఉంటుంది, ఇది మెదడు పనితీరు,  జ్ఞాపకశక్తికి చాలా అవసరం. క్రమం తప్పకుండా రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే.. అది మెదడు  చురుగ్గా ఉండటానికి,  మెదడు  ఆరోగ్యానికి తోడ్పడుతుంది ,  అలాగే నరాల పనితీరును  కూడా మెరుగ్గా ఉంచుతుంది. కంటి ఆరోగ్యానికి.. గుడ్లలో ల్యూటిన్ , జీక్సాంథిన్ ఉంటాయి. ఇవి వయస్సు సంబంధిత మాక్యులర్ డిజెనరేషన్ నుండి కళ్ళను రక్షించే యాంటీఆక్సిడెంట్లు.  మొత్తం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి.. గుడ్లలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, సమతుల్య ఆహారంతో పాటు మితంగా గుడ్లు తినడం వల్ల మంచి HDL కొలెస్ట్రాల్ పెరిగి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ప్రోటీన్ కు మంచిది.. రెండు ఉడికించిన గుడ్లు సుమారు 12 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్‌ను అందిస్తాయి. ఇవి కండరాల నిర్మాణం, మరమ్మత్తు , కడుపు నిండిన ఫీలింగ్ ఇవవ్డంలో సహాయపడతాయి. ఫిట్‌నెస్ ప్రియులకు , లీన్ కండరాలను కాపాడుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచిది. బరువు నిర్వహణకు.. గుడ్లలో అధిక ప్రోటీన్ , తక్కువ కేలరీలు ఉంటాయి.  దీని కారణంగా ఉడికించిన గుడ్లు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి , శరీరానికి కావలసిన పోషకాలు కూడా మెరుగ్గా అందిస్తాయి. ఇవి అతిగా తినడాన్ని,  వెంటనే ఆకలి కావడాన్ని అరికట్టడానికి , బరువు నిర్వహణకు సహాయపడతాయి.                                                                                                                                                   *రూపశ్రీ.
కాళ్లు, చేతులు తిమ్మిరిగా అనిపించడం, జలదరింపు రావడం చాలామందికి అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్య. ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చోవడం లేదా నరాలపై ఒత్తిడి పడటం వల్ల తాత్కాలికంగా తిమ్మిర్లు రావచ్చు. అయితే పదేపదే తిమ్మిర్లు రావడం, ఎక్కువసేపు తగ్గకపోవడం లేదా శరీరంలో ఒక వైపు మాత్రమే అకస్మాత్తుగా తిమ్మిరి రావడం మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడానికి నరాలకు సంబంధించిన సమస్యలు ఒక కారణం కావచ్చు. నరాలు దెబ్బతిన్నప్పుడు తిమ్మిరితో పాటు మంట, జలదరింపు, సూదులు గుచ్చినట్టుగా అనిపించడం, నొప్పి లేదా చేతులు, కాళ్లలో బలహీనత వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అయితే శరీరంలో ఒక వైపు అకస్మాత్తుగా చేయి లేదా కాలు తిమ్మిరిగా మారడం, బలహీనంగా అనిపించడం వంటి లక్షణాలను మాత్రం ప్రత్యేకంగా గమనించాలి. ముఖ్యంగా వీటితో పాటు ముఖం ఒక వైపు వంగడం, మాట స్పష్టంగా రాకపోవడం, నడవడంలో ఇబ్బంది, అకస్మాత్తుగా తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే అవి బ్రెయిన్ స్ట్రోక్‌కు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు కావచ్చు. ఇలాంటి సమయంలో ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే సాధారణంగా వచ్చే తిమ్మిరికి, నరాల దెబ్బతినడం లేదా స్ట్రోక్‌కు సంబంధించిన తిమ్మిరికి తేడా ఏమిటి? ఏ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు? శరీరంలో ఒక వైపు మాత్రమే తిమ్మిరి ఎందుకు వస్తుంది? ఈ విషయాలపై Dr. Anirudh Deshmukh ఈ వీడియోలో సులభంగా వివరిస్తున్నారు. సాధారణ తిమ్మిరి ఎప్పుడు ఆందోళన చెందాల్సిన సమస్యగా మారుతుంది? నరాల సమస్యకు సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి? స్ట్రోక్‌ను సూచించే సంకేతాలు ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. అకస్మాత్తుగా ఒక వైపు తిమ్మిరి, బలహీనత లేదా స్ట్రోక్‌ను సూచించే ఇతర లక్షణాలు కనిపిస్తే స్వయంగా చికిత్స చేసుకోకుండా వెంటనే వైద్య సహాయం పొందండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
స్ట్రెస్, ఆందోళన, బీపీ వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ జీవితంలో ఒత్తిడి పెరగడంతో మనసుతో పాటు శరీరంపై కూడా ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో శ్వాసపై దృష్టి పెట్టే ప్రాణాయామాలు కొంతమందికి రిలాక్సేషన్‌కు సహాయపడవచ్చు. అనులోమ విలోమ ప్రాణాయామం శ్వాసను నియంత్రిస్తూ చేసే ఒక సాధారణ యోగాభ్యాసం. దీన్ని సరైన పద్ధతిలో, సరైన సమయంలో చేయడం ముఖ్యమని యోగా నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ప్రాణాయామం చేయడం సరికాదు. వయసు, ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం ఉన్న సమస్యలను బట్టి విధానం మారవచ్చు. ఈ వీడియోలో సీనియర్ యోగా థెరపిస్ట్, ఆయుర్వేద డైటీషియన్ శ్రావంతి రఘు అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎవరు చేయవచ్చు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అనులోమ విలోమ ప్రాణాయామం ఎలా చేయాలి? వీడియోలో అనులోమ విలోమాన్ని స్టెప్ బై స్టెప్‌గా ఎలా చేయాలో చూపించారు. శ్వాసను నెమ్మదిగా, నియంత్రణతో తీసుకోవడం, వదలడం వంటి అంశాలను సరైన పద్ధతిలో పాటించడం గురించి వివరించారు. ప్రాణాయామం చేసేటప్పుడు శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచడం, తొందరపడకుండా శ్వాసపై దృష్టి పెట్టడం ముఖ్యమైన అంశాలు. మొదటిసారి ప్రయత్నించేవారు నిపుణుల సూచనతో ప్రారంభించడం మంచిది. BP ఉన్నవారు చేయవచ్చా? అధిక రక్తపోటు ఉన్నవారు కూడా కొన్ని శ్వాసాభ్యాసాలను తగిన జాగ్రత్తలతో చేయవచ్చు. అయితే అధిక బీపీ ఉన్న ప్రతి వ్యక్తికి ఒకే విధమైన ప్రాణాయామ పద్ధతి సరిపోదు. ముఖ్యంగా శ్వాసను బిగపట్టడం వంటి పద్ధతులను స్వయంగా ప్రయత్నించకుండా, నిపుణుల సూచనలు పాటించడం మంచిది. డయాబెటిస్ ఉన్నవారు చేయవచ్చా? డయాబెటిస్ ఉన్నవారు కూడా అనులోమ విలోమ ప్రాణాయామం గురించి నిపుణుల సలహా తీసుకుని సాధన చేయవచ్చు. అయితే ప్రాణాయామం ఏదైనా వ్యాధికి మందులకు ప్రత్యామ్నాయం కాదు. వైద్యులు సూచించిన మందులు, ఆహారం, వ్యాయామాన్ని కొనసాగిస్తూ మాత్రమే యోగాభ్యాసాన్ని జీవనశైలిలో భాగంగా చేసుకోవాలి. సైనసైటిస్ ఉన్నవారు? సైనసైటిస్ లేదా ముక్కు సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రాణాయామం చేసే ముందు తమ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి. ముక్కు పూర్తిగా బ్లాక్‌గా ఉన్నప్పుడు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు బలవంతంగా శ్వాసాభ్యాసం చేయకూడదు. అవసరమైతే యోగా థెరపిస్ట్ లేదా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి. రోజూ 10 నిమిషాలు చేస్తే స్ట్రెస్, BP శాశ్వతంగా పోతాయా? ప్రాణాయామం వల్ల రిలాక్సేషన్, శ్వాస నియంత్రణ, మానసిక ప్రశాంతతకు సహాయం లభించవచ్చు. అయితే రోజూ 10 నిమిషాలు అనులోమ విలోమం చేస్తే స్ట్రెస్ లేదా బీపీ శాశ్వతంగా పూర్తిగా నయమవుతాయని చెప్పడం సరైనది కాదు. ముఖ్యంగా అధిక రక్తపోటు ఒక వైద్య పరిస్థితి. దాని కోసం వైద్యుల సూచనలు, మందులు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అవసరం. ఈ వీడియోలో అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎవరు చేయవచ్చు? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? సరైన పద్ధతి ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను సీనియర్ యోగా థెరపిస్ట్ శ్రావంతి రఘు వివరిస్తున్నారు. గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు బీపీ, డయాబెటిస్, సైనసైటిస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రాణాయామం ప్రారంభించే ముందు మీ వైద్యుడు లేదా అర్హత కలిగిన యోగా థెరపిస్ట్‌ను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)