తెలంగాణలో  అధికార, ప్రతిపక్షాల మధ్య సాగే  విమర్శలు, ప్రతి విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.  విమర్శల జోరు పెరిగుతోంది. తీవ్రత ఎక్కువ అవుతోంది. అనకూడని మాటే అంటూ.. అనుచిత వ్యాఖ్యలు కూడా దొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్ లో విమర్శల వర్షం కురిపించారు. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.  ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చేయించుకున్న సొంత సర్వేలోనే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు స్పష్టంగా తేలాయని కేటీఆర్ సంచలన అంచనాను ప్రకటించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 78 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆ నివేదికల ఆధారంగా ధీమా వ్యక్తం చేశారు. కేవలం సీఎం సొంత సర్వే మాత్రమే కాకుండా, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు, స్వతంత్ర మీడియా సంస్థలు క్షేత్ర స్థాయిలో సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణలలో కూడా ఇదే సత్యం వెల్లడైందని ఆయన నొక్కి చెప్పారు. ఈ గణాంకాలు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు అద్దం పడుతున్నాయని అన్నారు. అనకూడని మాటే అయినా అనక తప్పడం లేదని చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి అనే దరిద్రుడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారంటూ దుయ్యబట్టిన కేటీఆర్..   అధికారులు ఇంజనీర్లు చెబుతున్న మాటలను కూడా పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సీఎం  రేవంత్ రెడ్డిని బుర్ర తక్కువోడు అనాలా,దరిద్రుడు అనాలా,సన్నాసి అనాలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏర్పడిన కరవు పరిస్థితులు కేసీఆర్ మీద కోపంతో రేవంత్ రెడ్డి తీసుకువచ్చారని కేటీఆర్ విమర్శించారు.   KTR Sensational Comments, CM Revanth Reddy Survey, BRS 78 Seats, Telangana Politics, Hydra Demolitions 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబునాయుడు వైసీపీకి ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన కనీస లక్షణాలు లేవని విమర్శించారు. గొడ్డలి, ఫేక్ ప్రచారాలే వైసీపీ అస్త్రాలన్న చంద్రబాబు.. వైసీపీ చరిత్ర మొత్తం రక్త చరిత్రేనన్నారు.  తెలంగాణ షాబాద్ లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ కు, సొంత బాబాయిపై గొడ్డలి వేటు, సొంత తల్లీ, చెల్లిని గెంటేసిన జగన్ కూ మనస్తత్వ పరంగా పోలీకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణలో  ఒక వ్యక్తి తనపై పోక్సో   కేసు పెట్టిందన్న కక్షతో బాధితురాలితో పాటు ఆమె కుటుంబాన్ని, అలాగే తనకు సహకరించలేదనే కోపంతో సొంత కుటుంబాన్ని కలిపి మొత్తం ఆరుగురిని అత్యంత క్రూరంగా హతమార్చిన వ్యక్తికీ, సరిగ్గా అలాగే..  సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపడం, కన్నతల్లి మరియు చెల్లిని దూరం పెట్టే విషయంలో జగన్ ప్రవర్తించిన తీరుకూ చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు.  నేర ప్రవృత్తిని, దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యపరచాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు.   కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో కేవలం ఒకే ఒక్క వ్యక్తి అవినీతి దాహానికి లక్షల కోట్ల రూపాయల విలువైన ఆంధ్రప్రదేశ్ సహజ సంపద పూర్తిగా ఆవిరైపోయిందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ నెపంతో యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని దుయ్యబట్టారు. బ్రహ్మణీ స్టీల్స్‌కు గతంలో కేటాయించిన భూములను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా వెనక్కి తీసుకుందని,  ఓబులాపురం మైనింగ్ అంశంపై విచారణ ఇంకా ముగియలేదని చెప్పిన చంద్రబాబు. జగన్   స్వార్థపూరిత నిర్ణయాల వల్ల ఎంతోమంది ఐఏఎస్  అధికారులు జైలుపాలయ్యారనీ, ఎంతోమంది వ్యాపారవేత్తలు సర్వనాశనమయ్యారని వివరించారు.  వైసీపీ నైజాన్ని చంద్రబాబు  హిట్, రన్ అండ్ ఎస్కేప్ (కొట్టడం, పారిపోవడం, దాక్కోవడం) గా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక విధ్వంసం సృష్టించడం, ఆ వెంటనే పక్క రాష్ట్రమైన కర్ణాటకలోని బెంగళూరు ప్యాలెస్‌కు వెళ్లి తలదాచుకోవడం   అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే భయంతోనే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను బెదిరించి, పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, పోలవరం ప్రాజెక్టు, వెలిగొండ ప్రాజెక్టులు వేగంగా పూర్తికావస్తుండటంతో ఈ గొడ్డలి పార్టీలో తీవ్రమైన టెన్షన్ మరియు భయం మొదలైందని చంద్రబాబు పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న వ్యక్తిత్వ హననంపై చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను వాడుకుని మహిళలను బ్లాక్ మెయిల్ చేయడం, తప్పుడు పోస్టులతో సమాజంలో అలజడి సృష్టించడం అత్యంత ప్రమాదకరంగా మారిందన్నారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలను, అసత్య పోస్టులను పూర్తిగా కట్టడి చేసేందుకు త్వరలోనే ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్  ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు.   Chandrababu makes sensational comments, Chandrababu Naidu, YS Jagan Mohan Reddy, YSRCP Axe Party, Andhra Pradesh Politics, Social Media Task Force AP, Kadapa Steel Plant Corruption
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్.! కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ పరిశ్రమ ఏర్పాటు కోసం గతంలో కేటాయించిన వేల ఎకరాల భూములను వెనక్కి తీసుకోవాలని  చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.  దాదాపు 19 ఏళ్లు గడుస్తున్నా అక్కడ ఎలాంటి పరిశ్రమ ఏర్పాటు కాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ ఏర్పాటుకు భారీగా భూములు కేటాయించారు.  ఎకరం భూమి  18 వేల రూపాయల చొప్పున దాదాపు 10 వేల ఎకరాలకు పైగా భూములను అప్పట్లో గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె పేరిట ఉన్నబ్రాహ్మిణి స్టీల్స్  సంస్థకు కేటాయించింది. దీనికోసం కేవలం 19 కోట్ల రూపాయలను గాలి జనార్ధన్ రెడ్డి ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు. ఆ తర్వాత 2008లో విమానాశ్రయం ఏర్పాటు నెపంతో మరో 3,115 ఎకరాల భూములను 25 కోట్ల రూపాయలకే రాసిచ్చారు. పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. గతంలో ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు, రుణాలు ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్ వంటి జాతీయ బ్యాంకులు కోర్టులను ఆశ్రయించాయి. భూములు తమ అధీనంలో ఉన్నాయని వాదించాయి. అయితే, పూర్తి హక్కులు లేని భూములపై బ్యాంకులు ఏ విధంగా రుణాలు ఇస్తాయని కోర్టులు సైతం తీవ్రంగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ప్రస్తుత జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఈ 10,000 ఎకరాల భూములను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియ ఊపందుకుంది. ఈ ఉదంతంపై  విశ్లేషకుడు  మధుసూదన్ రెడ్డి తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  నాటి వైఎస్సార్ క్యాబినెట్ లో మంత్రులుగా ఉండి, నేడు కూటమి ప్రభుత్వంలోనూ మంత్రులుగా కొనసాగుతున్న కొందరు నేతల సమష్టి బాధ్యతను ప్రశ్నించారు. పరిశ్రమలు పెట్టకుండా కాలయాపన చేయడం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లడమే కాకుండా, స్థానిక నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.  భవిష్యత్తులోనైనా ఏ ప్రభుత్వమైనా పరిశ్రమలకు భూములను శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేయకుండా, కేవలం లీజు ప్రాతిపదికన మాత్రమే ఇవ్వాలనన్నారు. అప్పుడే పారిశ్రామికవేత్తలు భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టకుండా, నిజాయితీతో పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గాలి జనార్ధన్ రెడ్డి ఆర్థిక సామ్రాజ్యానికి, బ్రాహ్మణి స్టీల్స్ భూముల ఉదంతం ఒక పెద్ద ఎదురుదెబ్బేనని మధుసూదన్ రెడ్డి  అన్నారు.  పూర్తి ఇంటర్వ్యూ తెలుగువన్ న్యూస్ చానల్ లో వీక్షించండి.  
ALSO ON TELUGUONE N E W S
సినీ పరిశ్రమలో గ్లామర్, టాలెంట్ ఎంత ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఒక సాలిడ్ సక్సెస్ పడితేనే ఆ క్రేజ్ మరియు గుర్తింపు శాశ్వతంగా నిలబడతాయి. ఈ చేదు నిజాన్ని బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే చాలా త్వరగానే అనుభవపూర్వకంగా తెలుసుకుంది. మాస్ మహారాజా రవితేజ సరసన నటించిన 'మిస్టర్ బచ్చన్' లాంటి భారీ అంచనాల సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు, ఆరంభంలోనే తీవ్ర నిరాశ ఎదురైంది. మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలుకావడం, ఆ తర్వాత చేసిన చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆమెపై ఇండస్ట్రీలో చాలా వేగంగా 'ఐరన్ లెగ్' అనే ఒక అపవాదు, ముద్ర వేసే ప్రయత్నాలు జరిగాయి. ఒక నటిగా వరుస ఫ్లాపులు వస్తున్నా ఆమెకు అవకాశాలు తగ్గకపోయినప్పటికీ, తనపై ఉన్న ఆ ఫ్లాప్ ముద్రను చెరిపేసే ఒకే ఒక్క కమర్షియల్ హిట్ కోసం ఆమె మనసులో ఎంతో ఆరాటపడింది. ఎట్టకేలకు అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని సరసన హీరోయిన్‌గా నటించిన 'లెనిన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఈ భామ కళ్లల్లో ఆనంద బాష్పాలు కురిశాయి. అఖిల్ అక్కినేని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్స్‌తో పాత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ 'లెనిన్' సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక గ్రాండ్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేశారు. సక్సెస్ మీట్ వేదికపై మైక్ పట్టుకుని మాట్లాడేందుకు ముందుకు వచ్చిన భాగ్యశ్రీ బోర్సే, ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనై స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి ఎదుర్కొన్న విమర్శలు, నెగెటివిటీ, ఈ సినిమా కోసం పడిన కష్టం, వీటన్నింటినీ మించి కింగ్ నాగార్జున స్వయంగా వేదికపై తన నటనను ప్రశంసించడాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె భావోద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టారు. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి వేదికపై ఉన్న చిత్ర యూనిట్ సభ్యులతో పాటు అక్కడున్న అభిమానులు కూడా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఈ వేడుకలో భాగ్యశ్రీ కొద్దికొద్దిగా తెలుగులో మాట్లాడుతూ తన క్యూట్ స్పీచ్‌తో అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "నా అభిమానులు నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో నాపై వారు చూపిస్తున్న అమితమైన ప్రేమ, నాపై చేస్తున్న స్పెషల్ రీల్స్, ఇస్తున్న సపోర్ట్ వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ధైర్యంగా నిలబడగలిగాను. ఈ చిత్ర బృందం నాకు ఒక సొంత కుటుంబంలా అండగా నిలిచింది" అని ఎంతో కృతజ్ఞతతో చెప్పుకొచ్చారు. టాలీవుడ్‌తో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ, "హైదరాబాద్ నా కర్మభూమి. ఇక్కడి ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మరువలేనిది. నా సినీ ప్రయాణంలో ఆఖరి సినిమా కూడా ఈ టాలీవుడ్‌లోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ తెలుగు సినిమా పరిశ్రమపై తనకున్న అమితమైన ప్రేమను చాటుకున్నారు. 'లెనిన్' చిత్రం భాగ్యశ్రీ బోర్సే కెరీర్‌కు టాలీవుడ్‌లో ఒక లక్కీ టర్నింగ్ పాయింట్‌గా మారిందని చెప్పాలి. ఈ సినిమాలో ఒక చక్కటి పల్లెటూరి అమ్మాయి 'భారతి' పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరుకు ప్రేక్షకుల నుండే కాకుండా సినీ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా హీరో అఖిల్‌తో ఆమె పండించిన లవ్ ట్రాక్, ఎమోషనల్ సన్నివేశాలు మరియు వారిద్దరి మధ్య ఉన్న స్క్రీన్ కెమిస్ట్రీ థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఒకవైపు హీరో అఖిల్ అక్కినేని తన కెరీర్‌లో తొలి భారీ కమర్షియల్ విజయం దక్కడంతో తండ్రి నాగార్జున కాళ్లపై పడి ఎమోషనల్ అవ్వగా, మరోవైపు హీరోయిన్ భాగ్యశ్రీ కూడా తనపై ఉన్న ఫ్లాప్ ముద్ర తొలిగిపోవడంతో కన్నీటి పర్యంతమవడం ఈ సక్సెస్ మీట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి 'లెనిన్' సాధించిన ఈ భారీ బ్లాక్‌బస్టర్ సక్సెస్ భాగ్యశ్రీ బోర్సే కెరీర్ గ్రాఫ్‌ను టాలీవుడ్‌లో సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.     Bhagyashri Borse, Lenin Success Meet, Akhil Akkineni, Nagarjuna, Bhagyashri Borse Crying, Lenin Movie Blockbuster
కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ ఆఖరి చిత్రం కావడంతో ‘జననాయగన్’ (తెలుగులో 'జననాయకుడు') సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దళపతి విజయ్ రాజకీయ రంగప్రవేశానికి ముందు నటించిన చివరి చిత్రం కావడం, ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా కావడంతో దీనిపై భారీ క్రేజ్ నెలకొంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి సంబంధించి తాజాగా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఏకంగా “A” సర్టిఫికెట్‌ను జారీ చేస్తూ క్లియరెన్స్ ఇచ్చింది. సాధారణంగా విజయ్ నటించే సినిమాలకు U/A సర్టిఫికెట్లు రావడం సర్వసాధారణం. కానీ ఆయన కెరీర్‌లో దాదాపు 24 సంవత్సరాల తర్వాత, అంటే 2002లో వచ్చిన ‘భగవతి’ సినిమా తర్వాత మళ్లీ ‘A’ సర్టిఫికెట్ పొందిన రెండవ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ గత కొన్ని నెలలుగా అనేక వివాదాలు, న్యాయపరమైన చిక్కుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు సెన్సార్ బోర్డు సూచించిన కొన్ని కీలక మార్పులు, కట్స్ తర్వాత ఈ సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమాలో మొత్తం 20 సెకన్ల పాటు సాగే విజువల్స్, డైలాగ్స్‌కు కట్స్ విధించగా, మరో 10 సెకన్ల కంటెంట్‌ను రీప్లేస్ చేశారు. వీటిలో రాజకీయ పరమైన డైలాగులు, కొన్ని సున్నితమైన మతపరమైన ప్రస్తావనలతో పాటు టీవీకే పార్టీకి సంబంధించిన కొన్ని రిఫరెన్స్‌ల మ్యూటింగ్‌ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ కట్స్ అన్నింటి తర్వాత కూడా సినిమా రన్‌టైమ్‌ను 183 నిమిషాల 11 సెకన్ల ( 3 గంటల 3 నిమిషాల) సుదీర్ఘమైన నిడివితో లాక్ చేశారు. సెన్సార్ బోర్డు క్లియరెన్స్ పూర్తి చేసుకున్న తరుణంలో మేకర్స్ విడుదల చేసిన సరికొత్త పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సరికొత్త పోస్టర్‌లో దళపతి విజయ్ అత్యంత రగ్గడ్ అండ్ వయోలెంట్ లుక్‌లో, చేతిలో కొరడా పట్టుకుని ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో పెద్దగా ‘A’ అనే అక్షరాన్ని బ్లడ్ రెడ్ కలర్‌లో డిజైన్ చేసి, దానిపై 'CERTIFIED' అని ముద్రించారు. విజయ్ ముఖంలో కనిపిస్తున్న తీవ్రత, చుట్టూ ఉన్న జనం ఆయన వైపు దీనంగా చూస్తున్న తీరు సినిమాలోని ఇంటెన్సిటీని స్పష్టం చేస్తోంది. పోస్టర్‌పైనే "ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు సి. జోసెఫ్ విజయ్" అని ప్రస్తావించడం, కింద "జననాయగన్" టైటిల్ డిజైన్ పవర్‌ఫుల్‌గా ఉండటం ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఈ చిత్రంలో విజయ్‌తో పాటు పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ప్రధాన విలన్‌గా నటిస్తున్నారు. వీరికి తోడు ప్రకాష్ రాజ్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి వంటి భారీ తారాగణం ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమా జూలై 24న థియేటర్లలో అడుగుపెట్టే అవకాశముంది. త్వరలోనే రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.  https://x.com/KvnProductions/status/2075876817131766237 Thalapathy Vijay, Jana Nayagan, Jana Nayakudu, TeluguOne  
Super Hero Babu, which is titled Super Hero in Tamil, is shaping up to be one of the most interesting films. For the past few days, social media has lapped up the film's three looks and given the film a thumbs-up. The colourful posters, featuring the film's characters, indicate that the film is going to be a universal superhero entertainer suitable for all ages.  Cinema enthusiasts surely have something to look forward to from the movie. The film’s world and premise are going to be totally out of the box. Super Hero Babu will have a proper Telugu-Tamil bilingual release, ensuring it reaches a wider audience across the two languages. Super Hero Babu is presented by National Award-winning producer K.S. Sinish under the banner of Soldiers Film Factory and jointly produced by Shanjan G of Redacted Studios, which with its passionate drive to create more intriguing movies has lined up more projects scheduled at different stages of production. Having made his directorial debut with Balloon, K.S. Sinish steadily evolved as a producer by backing films such as Dikkiloona and the National Award-winning Parking, both of which reflected his consistent inclination towards fresh and engaging storytelling. Continuing that journey, Super Hero Babu stands as another significant addition to the banner's growing repertoire of content-driven entertainers crafted for audiences across all sections. The versatile Arjun Das, who has carved a remarkable niche through his effortless transition from a powerful antagonist to an accomplished protagonist, headlines Super Hero in what promises to be another compelling addition to his evolving filmography. He has already amassed a massive popularity among the Telugu audience, thanks to his role in Pawan Kalyan’s They Call Him OG. This growing fame in the Telugu states makes his presence in Super Hero a huge asset. Sharing screen space with him is the trending heroine Teju Ashwini, whose impressive performances in her movies have elevated expectations around this film. Sandy Master, who essays the antagonist in Super Hero Babu, has also been attracting widespread attention with his growing body of work. Notably, his gripping performance in Lokah – Chapter One was highly praised by Telugu viewers, who appreciated his intense acting chops. We also liked him immensely in Kishkindhapuri, whose flashback was powered by his poignant performance. Along with his work in many hit movies including the recent release Parimala & Co, Sandy's inclusion in Super Hero Babu makes this face-off one of the film's exciting highlights. Sandy has done this movie at a time when he has been busy choreographing dance numbers for big-ticket entertainers. Firestorm from Pawan Kalyan's OG and Monica from Rajinikanth's Coolie were done by him. He has collaborated in the past with big names such as Anirudh Ravichander.  Super Hero Babu marks the directorial debut of Vignesh Venugopal, who previously worked as an assistant director to K.S. Sinish during the making of Balloon. Continuing his long-standing commitment to nurturing promising filmmaking talent, Sinish introduces yet another fresh directorial voice after successfully launching Karthik Yogi through Dikkiloona and Ram through the National Award-winning Parking. Despite this being his first directorial venture, Vignesh's clarity of vision, disciplined approach, and confident storytelling have earned the appreciation of the entire team. Incidentally, the film's protagonist (Arjun Das) and antagonist (Sandy), have both made a name for themselves for playing negative roles. And they are locking horns in Super Hero Babu. Music for Super Hero Babu is composed by Hesham Abdul Wahab, who did emotionally appealing compositions in Telugu like Kushi, Hi Nanna and The Girlfriend. His Midas-touch to this film has already raised the bars of expectations for Super Hero. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రైమ్ కామెడీ జోనర్‌కు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు కాస్త నవ్వులు తోడైతే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారు. సరిగ్గా ఇదే నమ్మకంతో వైవిధ్యమైన కథాంశంతో మన ముందుకు రాబోతున్న సరికొత్త చిత్రం 'ఎంఆర్‌పీ: నీకెంత.. నాకెంత'. నరేష్ అగస్త్య, వెన్నెల కిశోర్, సుదర్శన్ వంటి టాలెంటెడ్ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శ్రవణ్ జేస్తా దర్శకత్వం వహించారు. ఆయనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం కూడా విశేషం. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోంది. ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కాకుండా, డార్క్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచేస్తోంది. ఈ కథ అంతా ఒక విచిత్రమైన, ప్రమాదకరమైన ప్లాన్ చుట్టూ తిరుగుతుంది. ఆస్పత్రిలోని మార్చురీలో పనిచేసే నలుగురు యువకులు ఎలాగైనా ఈజీగా డబ్బు సంపాదించాలని కలలు కంటారు. ఈ క్రమంలోనే వారికి ఒక వింత ఆలోచన వస్తుంది. మార్చురీలోకి వచ్చిన ఒక గుర్తుతెలియని శవాన్ని కిడ్నాప్ చేసి, దాని ద్వారా భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేయాలని ప్లాన్ వేస్తారు. ఒక బ్రతికున్న మనిషిని కాకుండా, శవాన్ని కిడ్నాప్ చేయడం అనే వినూత్నమైన పాయింట్ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదూ? అయితే ఆ అనామక శవాన్ని దాచే క్రమంలో వారు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఈ పిచ్చి నిర్ణయం వారి జీవితాలను ఏ విధంగా మలుపు తిప్పిందనేది చాలా ఉత్కంఠభరితంగా చూపించారు. ట్రైలర్ ప్రారంభం నుంచే కథలోని అసలు పాయింట్‌ను రివీల్ చేస్తూ, ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచడంలో దర్శకుడు శ్రవణ్ జేస్తా పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఒకవైపు క్రైమ్, థ్రిల్ ఎలిమెంట్స్ రన్ అవుతుంటే, మరోవైపు వెన్నెల కిశోర్, సుదర్శన్ తమదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. సినిమా అంతా ఒక సీరియస్ టెన్షన్ నడుస్తున్నప్పటికీ, ఈ పాత్రల మధ్య వచ్చే సంభాషణలు థియేటర్లలో నవ్వుల పండగ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 'మత్తు వదలరా' వంటి సూపర్ హిట్ చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నరేష్ అగస్త్య, ఈ సినిమాలో మరోసారి వైవిధ్యమైన, నేచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. కామెడీతో పాటు సీరియస్ సీన్స్‌లో కూడా ఆయన పండించిన హావభావాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ డోనాల్ బిష్ట్ హీరోయిన్‌గా నటిస్తుండగా, హర్షవర్ధన్, కసిరెడ్డి రాజ్‌కుమార్, చైతన్య జొన్నలగడ్డ, పృథ్వీరాజ్, గగన్ విహారి, నందగోపాల్, స్నేహ సింగ్ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు. సాంకేతికంగా కూడా ఈ సినిమా చాలా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అజయ్ అరసాడ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌లోని థ్రిల్లింగ్ మూమెంట్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. రాకేష్ కొలాంచి సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి, అలాగే మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ కథలోని వేగాన్ని సరిగ్గా మేనేజ్ చేసింది. కథలోని అసలు ట్విస్టులను దాచిపెట్టి కేవలం ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని మరియు ఉత్కంఠను మాత్రమే ట్రైలర్‌లో చూపించారు. ఈ విభిన్నమైన క్రైమ్ కామెడీ డ్రామా జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.   MRP Neekentha Naakentha, MRP Trailer Review, Naresh Agastya, Vennela Kishore, Telugu Crime Comedy, Tollywood Latest Movie Updates
తారాగణం: అథర్వ, ప్రీతి ముకుందన్, కాయడు లోహర్, నట్టి సుబ్రమణ్యం, థమన్ ఎస్, నిహారిక ఎన్ఎమ్, రక్షణ్, ద్రావిడ్ సెల్వం, సుధాకర్, జోనితా గాంధీ, ఫహద్ ఫాజిల్, మాళవిక మోహనన్ సాంకేతిక బృందం: రచన: ఆకాష్ భాస్కరన్, ద్రావిడ్ సెల్వం, ఎస్. రమణ గిరివాసన్ ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, సి.హెచ్. సాయి కూర్పు: ప్రదీప్ ఇ. రాఘవ్ సంగీతం: థమన్ ఎస్ దర్శకత్వం, నిర్మాణం: ఆకాష్ భాస్కరన్ ఒకప్పటి సీనియర్ నటుడు మురళి కుమారుడైన అథర్వ, తన తండ్రికి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టిన 'హృదయం మురళి' అనే టైటిల్‌ తో  సినిమా చేస్తుండటం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ప్రీతి ముకుందన్, కయడు లోహర్, నిహారిక ఎన్ఎమ్, మాళవిక మోహనన్, ఫహద్ ఫాజిల్, థమన్ ఎస్ తదితరులు ఈ చిత్రంలో భాగం కావడం ప్రాజెక్ట్‌పై మరింత క్యూరియాసిటీని పెంచింది. ఎంతో నిరీక్షణ తర్వాత ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో వివరంగా చూద్దాం. కథ: హృదయం మురళి (Atharvaa) తన స్నేహితులతో కలిసి అమెరికా నుండి భారతదేశానికి తిరిగి వస్తుంటాడు. వాళ్లు ప్రయాణంలో ఒక అపరిచితుడితో (Fahadh Faasil) మాట్లాడుతూ,  మురళి ప్రేమకథలను చెప్పడం ప్రారంభిస్తారు. పాఠశాల దశలో ఉన్నప్పుడు, అతను తన టీచర్ గీత (Jonitha Gandhi)తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ప్లస్ వన్, ప్లస్ టూ సమయంలో సామ్ (Preity Mukundhan) ను ప్రేమిస్తాడు. ఇక కాలేజీ పూర్తయ్యాక తన వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో అమృత (Kayadu Lohar)పై మనసు పారేసుకుంటాడు. కానీ అతను తన భావాలను వారిలో ఎవరికీ వ్యక్తపరచలేకపోతాడు, కొంత కాలానికి  అతని మామ (Natty) అతనికి పెళ్లి నిశ్చయిస్తాడు. మరి మురళి తను నిజంగా ప్రేమించిన వ్యక్తి  ప్రేమను పొంది సంతోషంగా ఉన్నాడా  అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ: అతిగా భావోద్వేగాలు పండించే దృశ్యాల కంటే, కాస్త నిగ్రహంతో నటించే సన్నివేశాల్లో అథర్వ చాలా సౌకర్యంగా కనిపించాడు. అతను రెండింటినీ ఒకేలా బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ రచయితలు బిడియాన్ని, ఆందోళనను, భావవ్యక్తీకరణ లోపాన్ని కలిపేసి గందరగోళానికి గురిచేశారు. ఒక పాత్ర తన భావాలను మాటల్లో చెప్పలేనంత సిగ్గుపడే స్వభావం కలదైతే, ఆ లక్షణం సినిమా ఆసాంతం కనిపించాలి కానీ ఎంపిక చేసిన కొన్ని చోట్ల మాత్రమే కాదు. ఒకవేళ ఆ ఆందోళన లేదా సిగ్గునే రచయితలు చూపించాలనుకున్నా, దానికి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేంత సమయం ఇవ్వాల్సింది. 'హృదయం మురళి' (Hrudayam Murali) కథలో ఒకదాని తర్వాత మరొక కీలక ఘట్టంలోకి దూసుకుపోవాలనే ఆత్రుత ఎక్కువగా కనిపించింది. నిశ్శబ్దంతో పండాల్సిన సన్నివేశాలను కూడా పాత్రల సంభాషణలు లేదా నేపథ్య సంగీతంతో నింపేయాలని చూశారు. కొన్ని సినిమాలు, పాత్రలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆత్మపరిశీలన, నిశ్శబ్దం, కాస్త స్పేస్ అవసరం. సినిమాలో ఉన్న ప్రతి పాత్రా హీరోకి ఏదో ఒక విధంగా సలహా ఇచ్చేలా డిజైన్ చేస్తే, ఇక హీరో ప్రయాణం ఎలా సాగుతుందనే భావన కలుగుతుంది. దర్శకుడు ఆకాష్ భాస్కరన్ తెరపై ఎక్కడా ఖాళీ కనిపించకుండా ఫహద్ ఫాజిల్, రక్షణ్, ద్రావిడ్, సుధాకర్, థమన్, నిహారికతో పాటు జోనితా గాంధీ, మాళవిక మోహనన్, రైజా విల్సన్ లాంటి నటీనటులతో నింపేశాడు. కానీ స్క్రిప్ట్‌లోని ప్రధాన పాత్రలకు ఎప్పుడూ ఇతరుల సలహాలు అవసరమైనట్లుగా అనిపించదు. తమ అంతర్గత సంఘర్షణలను వారే సమర్థవంతంగా ఎదుర్కోగలరనిపిస్తుంది. ఎవరూ సలహాలు ఇవ్వని లేదా ప్రోత్సహించని ఇంటర్వెల్ ఎపిసోడ్‌లో కయడు లోహర్ మరియు అథర్వ మధ్య వచ్చే సన్నివేశాన్ని చూస్తే, ఆ ఇద్దరు ఆ క్షణాలను ఎంత సహజంగా పండించారో అర్థమవుతుంది. ప్రీతి ముకుందన్ సన్నివేశాల్లో ఈ సహజత్వం లోపించింది. దీనివల్ల అసలైన ప్రేమకథ కంటే, స్నేహితుల గురించే ఈ సినిమా అన్నట్లుగా మారుతుంది. ఫస్ట్ హాఫ్‌లోని నాస్టాల్జిక్ మూమెంట్స్, ట్విస్ట్ బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ ఆ తర్వాత, ప్రధాన పాత్ర దాని నుండి ఎలా బయటపడాలని నిర్ణయించుకున్నాడనే దానికి సరైన సమాధానాలు దొరకవు. ఇంటర్వెల్ ఎపిసోడ్ తర్వాత కూడా దాని ప్రభావం పెద్దగా కనిపించదు. ముఖ్యంగా సెకండాఫ్‌లో టైటిల్ పాత్ర యొక్క పూర్తి కథను కాకుండా, కొన్ని ముక్కలు ముక్కలైన సన్నివేశాలను మాత్రమే చూస్తున్నామన్న భావన కలుగుతుంది. ఇది సినిమాకు మైనస్ అయింది. అథర్వ తన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రీతి ముకుందన్ కూడా తనకు ఇచ్చిన పరిధిలో బాగా చేసింది. ఇంటర్వెల్, మార్ట్ సన్నివేశాల్లో కయడు లోహర్ తన బెస్ట్ ఇచ్చింది. ఫహద్ ఫాజిల్ పాత్రను సరిగ్గా వాడుకోలేదు. ద్రావిడ్, రక్షణ్ నవ్వించడంలో విఫలమయ్యారు. సుధాకర్ కొన్ని సన్నివేశాల్లో పర్వాలేదు. నిహారిక, థమన్ పాత్రలు చికాకు తెప్పిస్తాయి. థమన్ సంగీతం, నేపథ్య సంగీతం బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. అయితే మహిళలు తన ప్రేమను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నా, ఒక యువకుడు తన ప్రేమను వ్యక్తపరచలేకపోయే  సన్నివేశాలలో  పదే పదే అవే ఐడియాలు రిపీట్ చేయడం తో   సినిమా ఆసక్తిని కోల్పోయి ఒక డీసెంట్ అటెంప్ట్‌గా మిగిలిపోయింది. పాజిటివ్స్: అథర్వ, ప్రీతి ముకుందన్ సన్నివేశాలు 90ల నాటి నాస్టాల్జిక్ మూమెంట్స్ కయడు లోహర్ సన్నివేశాలు ఇంటర్వెల్ ఎపిసోడ్ నేపథ్య సంగీతం నెగటివ్స్: థమన్ పాత్ర, నటన సాగదీతగా, పదే పదే రిపీట్ అయ్యే సెకండాఫ్ పాత్రలు అతిగా మాట్లాడే సన్నివేశాలు   చివరి గా : డీసెంట్ ఎగ్జిక్యూషన్ ఉన్నప్పటికీ, రైటింగ్ మరీ రిపీటెడ్‌గా, గందరగోళంగా అనిపిస్తుంది.   రేటింగ్: 2.5/5   డిస్‌క్లైమర్: ఈ రివ్యూలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు/భావాలు పూర్తిగా రచయిత వ్యక్తిగతమైనవి, వీటికి సంస్థ ఎలాంటి బాధ్యత వహించదు. వీటిపై స్పందించే ముందు పాఠకులు తమ సొంత విచక్షణను ఉపయోగించవలసిందిగా సూచిస్తున్నాము.
Cast: Atharvaa, Preity Mukhundhan, Kayadu Lohar, Natty Subramaniam, Thaman S, Niharika NM, Rakshan, Dravid Selvam, Sudhakar, Jonita Gandhi, Fahadh Faasil, Malavika Mohanan Crew:  Written by Aakash Baskaran, Dravid Selvam, S. Ramana Girivasan  Cinematography by Manoj Paramahamsa, CH Sai Edited by Pradeep E. Ragav Music by Thaman S Directed and Produced by Aakash Baskaran Atharvaa being son of yesteryear actor Murali, who became hugely popular as Idhayam Murali, taking that title and making a movie around it, immediately sparked huge interest. Preity Mukundhan, Kayadu Lohar, Niharika NM, Malavaika Mohanan, Fahadh Faasil, Thaman S and many others being part of it added more curiosity to the project. The movie finally released after a long wait and let's discuss about it in detail.  Plot: Idhayam Murali (Atharvaa) is travelling back to India from US with his friends. They talk to a stranger (Fahadh Faasil) and start narrating the love stories of Idhaya. As a school going kid, he falls in love with his teacher, Geetha (Jonitha Gandhi). Later, at plus one and plus two stage, he falls in love with Sam (Preity Mukundhan). As a man looking to expand his business post college, he falls in love with Amudha (Kayadu Lohar). But he is unable to express his feelings to anyone of them and his uncle (Natty) fixes his marriage. Can he truly find his love and be happy? Watch the movie to know more.  Analysis: Atharvaa is more comfortable in scenes that demand restraint than him being over expressive. He tries to approach both with similar consistency but writing confuses shyness with anxiety and lack of expression. If a character is so shy that they fail to express emotions with words then that characteristic should appear throughout not selectively at few places. Even if that selective anxiousness or shyness is what writing is pointing at, it should be given time to register.  Idhayam Murali rushes so much that it wants to jump to next big moment and have characters talking or background score fill it up rather than let silences take over. Certain films and characters need that introspection, those silences and some space for them to be able to solve those problems. If every character is designed to some way or somehow advise the main lead, then what journey would be go through.  Aakash Baskaran fills up the screen with actors like Fahadh Faasil, Rakshan, Dravid, Sudhakar, Thaman, Niharika and then even adds Jonitha Gandhi, Malavika Mohanan, Raiza Wilson so that no scene or shot feels empty. But the main characters in his script doesn't seem like they are in constant need of advice. They look more than capable of handling internal conflicts. See Kayadu Lohar and Atharvaa Interval episode when no one is trying to egg them or constantly advising, we see how two characters behave and bring moments from those interactions.  The similar thing is missing with Preity Mukundhan scenes and the movie ends up being more about friends rather than the love story which forms the basic crux. Nostalic moments in the first half and the twist works. Later, we don't get answers about how the lead characte decided to look past it. Even after Interval episode, we don't see any reflection on it. More or less it feels like we are left to see fragments rather than complete story of the titular character which works against in second hour.  Atharvaa is good. Preity Mukundhan is also good in the portions she is given. Kayadu Lohar did her best in Interval scene and Mart scene. Fahadh Faasil is wasted. Dravid, Rakshan fail to evoke laughs. Sudhakar is fine in few portions. Niharika and Thaman just irritate. Score and music by Thaman are good, cinematography, production values are glossy. But the intention of presenting a man who is unable to express his love when the other women are ready to accept troupe feels repetitive and hence, losses value making the movie a decent attempt.  Positives: Atharvaa and Preity Mukundhan scenes 90's Nostalgia Moments Kayadu Lohar scenes  Interval portion BGM Negatives: Thaman's character and performance Draggy and Repetitive Second Hour Over chatty scenes  Bottomline: Decently Executed but writing feels too repetitive and convoluted.  Rating: 2.5/5    Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ రూరల్ యాక్షన్ డ్రామా 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి దూసుకుపోతోంది. ఈ సినిమా సాధించిన భారీ సక్సెస్ అక్కినేని క్యాంప్‌లో సరికొత్త జోష్ నింపింది. ఈ బ్లాక్‌బస్టర్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ తాజాగా సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో కింగ్ అక్కినేని నాగార్జున మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్ క్రెడిట్‌ను తన చిన్న కోడలికి అప్పగించడం ఆసక్తికరంగా మారింది. అఖిల్ గతేడాది జైనాబ్ రావ్‌డ్జీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్ళి తర్వాత అఖిల్ నుంచి వచ్చిన మొదటి లెనిన్ కావడం విశేషం. కెరీర్ స్టార్టింగ్ నుంచి భారీ కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కి.. లెనిన్ తో అది నెరవేరింది. ఆ ఆనందంలోనే తన కొడుకు లెనిన్ సక్సెస్ క్రెడిట్ ని కోడలికి ఇచ్చేశాడు నాగార్జున.  "అఖిల్ కి పెద్ద సర్జరీ అయ్యింది. ఆ తర్వాత మనిషి కామ్ అయిపోయాడు. కామ్ గా ఆలోచించడం మొదలుపెట్టాడు. అదే టైంలో తనకి ఒక తోడు వచ్చింది. అప్పటి నుంచి గుడ్ టైం స్టార్ట్ అయింది. బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇదే కంటిన్యూ చేస్తే, భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్తాడు." అని నాగార్జున మాట్లాడాడు. అఖిల్ లైఫ్ లోకి ఒక తోడు వచ్చాక, గుడ్ టైం స్టార్ట్ అయిందని నాగార్జున మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. "లెనిన్ సక్సెస్ క్రెడిట్ చిన్న కోడలికి ఇచ్చిన నాగార్జున" అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. https://x.com/Theteluguone/status/2075873535264948648 Akhil Akkineni, Lenin Movie, Nagarjuna, TeluguOne  
ఇటీవల విడుదలైన అక్కినేని అఖిల్ సరికొత్త యాక్షన్ డ్రామా చిత్రం 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా సాధించిన ఘన విజయం పట్ల అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం వైభవంగా నిర్వహించిన 'లెనిన్' సక్సెస్ మీట్ వేడుకలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అందించిన వాయిస్ ఓవర్ ఎంతటి కీలక పాత్ర పోషించిందో నాగార్జున ఈ వేదికపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. "నా పెద్ద పెద్ద అబ్బాయి తారక్" అంటూ లెనిన్ లో ఎన్టీఆర్ ఎలా భాగమయ్యారో నాగార్జున గుర్తు చేసుకున్నారు. సినిమా ప్రారంభంలో కథను సరికొత్తగా, ఆసక్తికరంగా ముందుకు నడిపించడానికి ఒక బలమైన వాయిస్ ఓవర్ అవసరమని చిత్ర బృందం భావించిందని నాగార్జున వెల్లడించారు. ఈ విషయంలో నేను, చిత్ర దర్శకుడు, అఖిల్, నిర్మాత నాగవంశీ, ఎడిటర్ నవీన్ అందరం కలిసి చర్చించామని ఆయన చెప్పారు. ఈ కథకు ప్రాణం పోస్తూ, సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే ఆ పవర్‌ఫుల్ వాయిస్ ఎవరిదైతే బాగుంటుంది అని ఆలోచిస్తున్నప్పుడు, అందరి నోట వినిపించిన ఒకే ఒక్క పేరు తారక్ అని నాగార్జున స్పష్టం చేశారు. నా పెద్ద పెద్ద అబ్బాయి లాంటి తారక్‌ను ఈ వాయిస్ ఓవర్ కోసం అడగగానే, ఆయన ఏమాత్రం సంకోచించకుండా, కథలోని ప్రాధాన్యతను గుర్తించి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని నాగార్జున ఎంతో సంతోషంగా పంచుకున్నారు. సినిమా బిగినింగ్ స్టేజ్ నుండి ఎంతో ఆసక్తిని కలిగిస్తూ, ప్రేక్షకులను కథలోకి తీసుకువెళ్లడంలో తారక్ వాయిస్ వంద శాతం న్యాయం చేసిందని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌కు నాగార్జున వేదికపై హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.  నాగార్జున తన స్పీచ్ లో తారక్‌ను 'నా పెద్ద పెద్ద అబ్బాయి' అని సంబోధించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతంలో అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను' మూవీ ఈవెంట్ ఎన్టీఆర్ గెస్ట్ గా రాగా.. అప్పుడు నాగ్ ఇలాగే  తారక్‌ను 'నా పెద్ద పెద్ద అబ్బాయి' అని పిలవడం విశేషం.      Akhil Akkineni, Lenin Movie, Nagarjuna, Jr NTR  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
  ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.. బయట ఎన్ని సమస్యలు ఉన్నా,  ఎంత ఇబ్బందులు ఎదుర్కున్నా ఇంటికి రాగానే సంతోషం బోలెడు ప్రశాంతత,  జీవితంలో ఊరట కలుగుతోంది అంటే.. ఆ కుటుంబం ఎంతో ఆరోగ్యంగా ఉందని అర్థం. కానీ కొన్ని కుటుంబాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండదు. ఇలా ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోతే కుటుంబ సభ్యులు చాలా వరకు మానసికంగా డిస్టర్బ్ అవుతుంటారు. అయితే  కుటుంబ వాతావరణం అనారోగ్యంగా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో తరాల అంతరం వల్ల కుటుంబంలో వాతావరణం సరిగా లేకుండా ఉండే అవకాశం ఉంది, అలాగే కుటుంబ అలవాట్ల వల్ల కూడా వాతావరణం దెబ్బతింటుంది. కానీ కుటుంబ జీవితంలో నిర్లక్ష్యం చేయకూడని విషయాలు కొన్ని ఉన్నాయి.  వాటిని తెలుసుకుంటే.. కుటుంబం తిరిగి ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు.  ఇంతకీ ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే.. ఎమోషన్స్ దుర్వినియోగం.. కుటుంబంలో సులభంగా గుర్తించగలిగే ప్రమాదకరమైన విషయాలు ఏవీ ఉండవు. కానీ చాలా సున్నితంగా ఉంటూనే మనుషుల్ని బాధపెడతారు. ఎమోషన్స్ తో ఇబ్బంది పెడతారు. కుటుంబ సభ్యులు తమదే తప్పు అన్న భావనను కుటుంబంలో  వ్యక్తికి కలిగిస్తారు. కొన్నిసార్లు, వారు బాధితులుగా నటిస్తూ ఎదుటివారిని ఎక్కువగా నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాతావరణం ఉన్న ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం, సంతోషం ఉండవు. నిర్ణయాల దగ్గర బంధనం..  కుటుంబంలో జీవిత నిర్ణయాల గురించి మిమ్మల్ని అడగకుండా, తమకు తాము నిర్ణయాలు తీసుకుని ఆఖరిగా మీకు చెబుతూ ఉంటే.. ఒకవేళ అదే నిజమైతే, ఇది నిర్లక్ష్యం చేయకూడని విషయమని లైఫ్ స్టైల్ నిపుణులు చెబుతున్నారు. . ఈ నియంత్రణ చిన్నతనం నుండి కౌమారదశ వరకు ఆరోగ్యకరంగానే ఉంటుంది. , కానీ  పెద్దయ్యాక కుటుంబ సభ్యుల నుండి ఇదే వైఖరి కొనసాగడం మంచిది కాదు. హద్దులు లేకపోవడం.. ప్రతిఒక్కరూ ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు గౌరవించుకున్నప్పుడే కుటుంబ సంబంధాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. అలా చేయడంలో విఫలమైతే, కాలక్రమేణా విషపూరితమైన సంబంధాలకు దారితీయవచ్చు. అంతేకాకుండా, ఈ విషయాలు  వ్యక్తి యొక్క భావోద్వేగ ఎదుగుదలకు చాలా కీలకమైనవి. గొడవల పరిష్కారం.. పరిష్కారం కాని కుటుంబ వివాదాలు చాలా కుటుంబాలలో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి పదేపదే మరో వాదనకు లేదా ఘర్షణకు దారితీసి, పరిస్థితిని మరింత తీవ్రం చేస్తాయి. దీనివల్ల, ఆ విషయం పరిష్కారమైన తర్వాత కూడా ఎమోషనల్ దూరం పెరగవచ్చు. పట్టించుకోకపోవడం.. కుటుంబంలో మీ భావాలను లేదా అభిప్రాయాలను ఎప్పుడూ  పట్టించుకోవడం జరిగితే అది కుటుంబ సభ్యుల నుండి దూరాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఎప్పుడైతై ఎమోషనల్ సపోర్ట్ లేదా అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం జరుగుతుందో అప్పుడు ఆ ఇంట్లో వ్యక్తి పరాయివాడుగా ఫీలవుతారు.                                     *రూపశ్రీ.
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం.  భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది.  భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది.  అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది. కానీ కోడలిగా వచ్చిన ఆడపిల్లను బాధపెట్టే అత్తమామలు ఉంటే.. ఆ ఆడపిల్లల జీవితం నరకప్రాయంగా ఉంటుంది.  అయితే.. బాధపెట్టే అత్తమామలు ఉన్నారని, వివాహ బంధాన్ని తెంచుకుని వెళ్లలేరు చాలామంది అమ్మాయిలు,  బాధపెట్టే అత్తమామలతో  ఎలా ఉండాలో,  వాళ్లతో కలిసి ఎలా జీవించాలో లైఫ్ స్టైల్ నిపుణులు చెబుతున్నారు..  వీటి గురించి తెలుసుకుంటే.. మార్చాలని అనుకోకూడదు.. కొన్నిసార్లు  అత్తమామలు కోడళ్ల మీద ఒత్తిడిని, ఇబ్బందులను కలిగిస్తారు. బాధపెట్టే అత్తమామల గురించి చాలా మంది జోక్ గా చెప్తూ ఉంటారు. కానీ బాధపెట్టే అత్తమామలు ఉండటం జోక్ కాదు.. అది ఆడపిల్లలను చాలా బాధపెడుతుంది, చాలా ఒత్తిడిలోకి నెడుతుంది.  అలాంటి అత్తమామలు  మానసిక ప్రశాంతతను, వివాహ బంధాన్ని కూడా ప్రభావితం చేస్తారు. చాలా మంది కోడళ్లు తమ అత్తమామలు మారితే బాగుండు అని అనుకుంటారు. కానీ అత్తమామలు మారాలని,  వాళ్లను  మార్చాలని అనుకోవడం వ్యర్థం. అత్తమామలు ఏ విషయాల పట్ల బాధపెడతారో తెలిసినప్పుడు వాటి గురించి పట్టించుకోకుండా ఉండటమే  మంచిది. పరిమితులు..  బాధపెట్టే అత్తమామలు ఉన్నప్పుడు, ప్రతి కోడలు తన భర్త సహాయంతో  కొన్ని సొంత పరిమితులను నిర్దేశించుకుని, వాటికి కట్టుబడి ఉండడం  మంచిది. పరిమితులు ఏర్పాటు చేసుకున్నప్పుడు పెద్దవాళ్లు, అత్తమామలు మాట్లాడే ఏ మాటలు లేదా ప్రవర్తన పరిమితులను దాటి జీవితంలోకి తీసుకుని బాధపడే పరిస్థితి రాదు.   సమస్య, పరిష్కారం.. ఏదైనా సమస్యను పరిష్కరించే ముందు, దాని మూల కారణాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. అత్తమామల చెడు  ప్రవర్తన అకస్మాత్తుగా జరగదు. వారు ప్రతీదీ తమకు నచ్చినట్టుగా జరగాలని కోరుకోవడం, తమ భావాలను అదుపు చేసుకోలేకపోవడం, లేదా గతంలోని మానసిక గాయాలను మోయడం వంటి కారణాల వల్ల ఇది తరచుగా జరుగుతుంది. కొన్నిసార్లు, అత్తమామలు కోడలు పెరిగిన విధానాన్ని, కోడలి పుట్టింటి వారి పద్దతులను,  నియమాలను అగౌరవపరుస్తారు, మరికొన్ని సార్లు  స్వార్థపరురాలు అనే ట్యాగ్ వేసి  వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘిస్తారు, లేదా కుటుంబంలో కలహాలు సృష్టించి కోడలిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ పద్ధతులను గుర్తించడమే కోడళ్లు అత్తారింట్లో బాధపెట్టే అత్తమామలతో కలిసి ఎలా జీవించాలనే విషయాన్ని అర్థమయ్యేలా చేస్తాయి.                                      *రూపశ్రీ.
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. కొత్త వాతావరణం, కొత్త ఉపాధ్యాయులు, కొత్త తరగతులు మరియు కొత్త స్నేహితులు ఉత్సాహంతో పాటు ఆందోళనను కూడా కలిగిస్తాయి. చాలా మంది పిల్లలు మొదట్లో పాఠశాలలో తమకు ఎదురయ్యే విషయాలను, తమ మనసులోని విషయాలను  మనసు విప్పి చెప్పలేరు. అయితే తల్లిదండ్రుల బాధ్యత కేవలం పిల్లలను బడికి పంపడమే కాదు.. పిల్లల గురించి ఎన్నో విషయాలు తల్లిదండ్రులు ఆలోచించాలి. మరీ ముఖ్యంగా..  కొత్తగా స్కూల్ కు వెళ్తున్న పిల్లలను కొన్ని ప్రశ్నలు తప్పకుండా అడగాలి. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. ప్రతిరోజూ పిల్లలను అడాగాల్సిన ప్రశ్నలు.. నచ్చిన విషయం.. ఈ రోజు పాఠశాలలో అన్నింటి కన్నా నీకు నచ్చిన విషయం ఏదని పిల్లలను అడగాలి.  ఈ ప్రశ్న పిల్లలో సానుకూల విషయాలను వెలికితీయడానికి సహాయపడుతుంది.  కొందరు పిల్లలు బడికి వెళ్లొచ్చిన తర్వాత మళ్లీ బడికి వెళ్లమని మారం చేస్తుంటారు. కానీ బడిలో వారికి నచ్చిన విషయాన్ని గుర్తు చేయడం వల్ల పిల్లలకు పాఠశాల పట్ల ఉత్సాహం పెరుగుతుంది.  అలాగే తల్లిదండ్రులు పిల్లలతో ఇలా మాట్లాడటం వల్ల పిల్లలు  స్వేచ్ఛగా మాట్లాడటం నేర్చుకుంటారు,  ఏ విషయాన్ని అయినా బెరుకు లేకుండా చెప్పగలుగుతారు. ఇది పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. పిల్లలకు ఏ విషయాల మీద ఆసక్తి ఉందో కూడా తల్లిదండ్రులకు అర్థం అవుతుంది. ఎవరితో ఆడుకున్నావు లేదా మాట్లాడావు అని అడగాలి.. పిల్లలు పాఠశాలలో ఎవరితో ఆడుకున్నారు, మాట్లాడారు అనే విషయాలు కొత్త స్నేహితుల గురించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది.  పిల్లలకు సామాజిక అవగాహన అర్థం అవుతుంది. పిల్లలు బడిలో ఒంటరిగా ఉంటారా లేదా ఇతరులతో కలుస్తున్నారా,  ఎవరితో అయినా కలవడంలో  ఇబ్బంది ఫీలవుతున్నారా?  అనే విషయాలు అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులకు సహాయపడుతుంది. ఏదైనా భయం లేదా బాధ పెట్టే విషయం ఉందా అని అడగాలి.. కొందరు పిల్లలు స్కూల్ లో తోటి విద్యార్థుల వల్ల, ఉపాధ్యాయుల వల్ల బాధపడటం, భయపడటం జరుగుతూ ఉంటుంది. దీని వల్ల పిలల్లు బడికి  వెళ్లాలంటే భయపడటారు.  ఈ కారణంగా చదువు మీద ఆసక్తి కూడా తగ్గిపోతుంది. పిల్లల భయాన్ని తగ్గించినప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజు ఏం నేర్చుకున్నావని అడగాలి.. పిల్లలను  ఈ రోజు ఏం నేర్చుకున్నావని ప్రతి రోజూ అడిగితే వారికి ఏ విషయం పట్ల ఆసక్తి ఎక్కువ ఉందో అర్థమవుతుంది. తద్వారా పిల్లలను ప్రోత్సహించడంలో తల్లిదండ్రులకు ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇలా అడిగినప్పుడు పిల్లలు అన్ని చెబుతూ ఉంటే.. పిల్లలలో జ్ఞాపకశక్తి,  వారిలో బావ వ్యక్తీకరణ వంటివి మెరుగు పడతాయి.                          *రూపశ్రీ.
నేటికాలంలో ఉపవాసం కేవలం దేవుడు, సంప్రదాయం, మతానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు..  ఫిట్‌నెస్ ప్రపంచంలో కూడా ఉపవాసం  బాగా ప్రాచుర్యం పొందింది. 16:8 డైట్ వంటి పద్ధతుల నుండి రోజుకు ఒకసారి తినడం వరకు,  తక్కువ తినడానికి, త్వరగా బరువు తగ్గడానికి , ఆరోగ్యంగా ఉండటానికి ఉపవాసం  ఒక సులభమైన మార్గంగా అందరికీ కనిపిస్తుంది. ఇలాంటి వాటిలో ఇంటర్మిట్టన్ ఫాస్టింగ్ కూడా ఉంది. దీన్నే మధ్యంతర ఉపవాసం అని కూడా పిలుస్తారు.  అయితే ఇది ఆరోగ్యానికి మేలు చేయడం కంటే.. హాని చేయడమే ఎక్కువ ఉంటుందని అంటున్నారు. ఇది పరిశోధనలలో తేలిందని కూడా అంటున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. పరిశోధనలు తేల్చిన నిజం.. ఇటీవల 20,000 మందికి పైగా ప్రజలపై జరిపిన ఒక విశ్లేషణలో, రోజుకు ఎనిమిది గంటలు లేదా అంతకంటే ఎక్కువ  సమయం వరకు  ఆహారం తీసుకోకుండా ఉండే వారికి గుండె జబ్బులతో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రమాదం 91 శాతం వరకు ఎక్కువగా ఉంటుందట. దీని అర్థం ఉపవాసం అందరికీ హానికరం అని కాదు, కానీ తక్కువ తినడం, ఎక్కువ సమయం ఆహారం లేకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు. వైద్యులు ఏం చెప్తున్నారంటే.. ఎక్కువసేపు ఆహారం తీసుకోకుండా ఉండటం  అనేది  శరీరంలో అనేక ఆకస్మిక మార్పులకు కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా హెచ్చుతగ్గులకు గురవుతాయి, ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి, , కొవ్వు స్థాయిలు కూడా ప్రభావితమవుతాయి. ఈ మార్పులన్నీ గుండెపై ఒత్తిడిని కలిగిస్తాయట. మరోవైపు ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల  చక్కెర, ఖనిజాలు , హార్మోన్లలో హెచ్చుతగ్గులకు కారణమవుతుందని, ఇది  హృదయ స్పందనలు గాడి తప్పే పరిస్థితి తీసుకొస్తుందని అంటున్నారు. నీటి కొరత.. ఆహారం ఎక్కువ సేపు తీసుకోకుండా ఉపవాసం ఉండటం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది.  శరీరం డీహైడ్రేషన్ అవుతుంది.  ప్రజలు ఎక్కువ సేపు ఆహారం తీసుకోనప్పుడు, తక్కువ నీరు తాగుతారు. దీనివల్ల సాధారణ గుండె కొట్టుకోవడానికి అవసరమైన పొటాషియం , మెగ్నీషియం వంటి అవసరమైన ఖనిజాలు శరీరంలో తగ్గిపోతాయి. ఈ ఖనిజ లోపాలు డీహైడ్రేషన్  కారణంగా హృదయ స్పందన సజావుగా సాగడం కోసం గుండె చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఉపవాసం ఆరోగ్యానికి మంచిది కాకపోయినా.. ఇది అందరికీ ఒకే ఫలితాన్ని ఇవ్వదు. కొందరికి ఇది సమస్య కలిగిస్తుంది, మరికొందరికి మంచి ఫలితాలు కూడా ఇవ్వవచ్చు.  ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు లేదా గుండె సమస్యలు,  ముందు నుంచే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా, కొన్ని రకాల మందులు తీసుకునే వారికి  ఉపవాసం మంచిది కాదు,, ఆహారం తినకుండా మందులు వేసుకోలేం, ఆహారం తినకుండా మందులు వేసుకున్నా అది  ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉంటే..  తరచుగా అలసట, తలతిరగడం, ఛాతిలో ఇబ్బందిగా ఉండటం లేదా గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు శరీరం మీద ఒత్తిడి ఎక్కువగా ఉందని చెప్పే లక్షణాలు. కాబట్టి ఉపవాసం పేరుతో ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉండటం,  శరీరాన్ని ఇబ్బందికి గురిచేసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది.  అందుకే.. బరువు తగ్గాలన్నా, ఫిట్ గా ఉండాలన్నా మంచి పద్దతులలో ఆహారం తీసుకుంటూనే గోల్ రీచ్ అవ్వాలి.                                    *రూపశ్రీ.
మెనోపాజ్ (Menopause) వచ్చిన తర్వాత మళ్లీ బ్లీడింగ్ రావడం సాధారణ విషయం కాదు. చాలా మంది మహిళలు దీనిని చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇది కొన్ని సందర్భాల్లో గర్భసంచి క్యాన్సర్ (Endometrial Cancer / Uterine Cancer) కు తొలి హెచ్చరిక కావచ్చు.  ఈ వీడియోలో ప్రముఖ గైనకాలజిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్నేహా సాగర్ గారు గర్భసంచి క్యాన్సర్ గురించి ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను చాలా సులభంగా వివరించారు.  ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యమైన విషయాలు:  ✅ మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ రావడానికి కారణాలు ఏమిటి? ✅ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే ఏమిటి? ✅ గర్భసంచి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఏమిటి? ✅ ఎవరికి ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ? ✅ ఎప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి? ✅ బయాప్సీ ఎందుకు అవసరం? ✅ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో ఎలా గుర్తిస్తారు? ✅ శస్త్రచికిత్స (Surgery), కీమోథెరపీ (Chemotherapy), రేడియేషన్ థెరపీ (Radiation Therapy) వంటి చికిత్సల గురించి పూర్తి వివరాలు.  ప్రారంభ దశలో గర్భసంచి క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్స విజయవంతంగా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మెనోపాజ్ తర్వాత ఎలాంటి బ్లీడింగ్ వచ్చినా ఆలస్యం చేయకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం ఎంతో ముఖ్యం.