ఎద్దు చేలో పడి మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పరిస్థితి కూడా ఇలాగే వుంది. పేర్ని కిట్టు తండ్రి పేర్ని నాని నాటకాల్లో నటనను పండిస్తే, ఇప్పుడు పేర్ని కిట్టు రౌడీయిజంలో నటనను పండిస్తున్నాడు. పేర్ని నాని ఇంతకాలం నియోజకవర్గంలో అరాచకాలు చేశారు. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని అంది పుచ్చుకున్న పేర్ని కిట్టు ఆ అరాచకాలను కంటిన్యూ చేస్తున్నాడు. తండ్రి ఎమ్మెల్యే, మంత్రి అయ్యాక, కాస్త ముదిరాక  అరాచకాలు చేస్తే, పేర్ని కిట్టు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడే టాలెంట్ చూపించడం ప్రారంభించాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని ప్రూవ్ చేసుకుంటున్నాడు. ప్రశాంతంగా వుండే మచిలీపట్నంలో అరాచకాలకు శ్రీకారం చుట్టిందే పేర్ని నాని. ఇప్పుడు పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారం పేరుతో అరాచకాలకు అన్నప్రాశన చేసుకుంటున్నాడు. పేర్ని కిట్టు అభ్యర్థిత్వాన్ని వైసీపీ నాయకులలో చాలామంది అంగీకరించడం లేదు. అందుకే వారు పేర్ని కిట్టుతో కలసి ప్రచారం చేయడం ఇష్టం లేక దూరంగా వుంటున్నారు. మచిలీపట్నంలో గంజాయి బ్యాచ్‌తో స్నేహసంబంధాలు, వ్యాపార అనుబంధాలు కొనసాగిస్తున్న పేర్ని కిట్టు ఇప్పుడు ఆ బ్యాచ్‌నే వెంటేసుకుని మచిలీపట్నంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్‌తో కలసి చేస్తున్నది పేరుకే ప్రచారం. అతని ప్రధాన టార్గెట్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులే. ప్రచారం పేరుతో  కూటమి నాయకుల ఇళ్ళ దగ్గరకి వెళ్తున్న పేర్ని కిట్టు తన గంజాయి బ్యాచ్‌తో కూటమి నాయకుల ఇళ్ళముందు మందుగుండు సామగ్రి విసురుతూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అదేమని ప్రశ్నిస్తే కూటమి నాయకులతో గొడవకి దిగుతూ, వారి ఇళ్ళలోకి వెళ్ళి విధ్వంసం సృష్టిస్తున్నారు. మొన్నీమధ్య పోతేపల్లిలో జనసేన కార్యకర్త మీద దాడి చేశారు. నిన్న కోన గ్రామంలో తెలుగుదేశం నాయకుడి మీద దాడి చేశారు. ఈరోజు మచిలీపట్నం ఎనిమిదో డివిజన్లో జనసేన నేత కర్రి మహేష్ ఇంటి మీద మీద గంజాయి బ్యాచ్‌తో దాడి చేయించాడు. గురువారం నాడు మచిలీపట్నంలోని విశ్వబ్రాహ్మణ వీధిలోకి గంజాయి బ్యాచ్‌తో కలసి ప్రచారానికి వచ్చిన పేర్ని కిట్టు కర్రి మహేష్ ఇంటి ముందు బాణసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. ఇదేంటని ప్రశ్నించినందుకు పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్ మహేష్ ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేశారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ సందర్భంగా కర్రి మహేష్ కుటుంబ సభ్యులు, పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్ మధ్య తోపులాట జరిగింది.  తమ ఇంటి ముందు పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్ దాడి చేసిందని కర్రి మహేష్ కుటుంబ సభ్యులతో కలసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు. దాంతో జనసేన శ్రేణులు, టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించాయి. ఆందోళన చేస్తున్న జనసేన, టీడీపీ కార్యకర్తలకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన నేత బండి రామకృష్ణ సంఘీభావం పలికారు. కర్రి మహేష్ ఇంటి మీద దాడి చేసిన పేర్ని కిట్టు గంజాయి బ్యాచ్‌ మీద చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.  ఇదిలా వుంటే, అధికారంలోకి రాకముందే పేర్ని కిట్టు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు.. రేపు పొరపాటున అధికారంలోకి వస్తే పరిస్థితి ఇంకెంత దారుణంగా వుంటుందోనని మచిలీపట్నం ఓటర్లు భయపడుతున్నారు.
మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, కర్నాటకలోని హసన్ నియోజకవర్గ ఎంపీ, మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన కేసులో నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణను రాహుల్ గాంధీ ‘మాస్ రేపిస్ట్’ అని సంబోధించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ గురువారం కర్నాటకలోని శివమొగ్గలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. ప్రజ్వల్ రేవణ్ణను ‘మాస్ రేపిస్ట్’ అని పేర్కొన్న రాహుల్ గాంధీ, ఇలాంటి వ్యక్తి ఓట్లు వేయాలని కోరిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ప్రజ్వల్ రేవణ్ణ నాలుగు వందల మంది మహిళల మీద అఘాయిత్యం చేశాడు. వారి వీడియోలు చిత్రీకరించాడు. ఇది దేశంలోనే అతి పెద్ద అత్యాచార ఘటన.. ప్రధాన మంత్రికి ప్రజ్వల్ రేవణ్ణ ఘనకార్యాల గురించి ముందే తెలుసు. అలాంటి వ్యక్తికి మద్దతుగా మోడీ మాట్లాడారు’ అని రాహుల్ గాంధీ అన్నారు.
ఒకవైపు పూర్తిగా గ్రామీణ వాతావరణం, మరోవైపు అత్యంత ఆధునిక జీవనం మిళితమైందే చేవెళ్ళ పార్లమెంటరీ నియోజకవర్గం. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, సాఫ్ట్‌వేర్ రంగానికి ఆయువుపట్టు హైటెక్ సిటీ కూడా చేవెళ్ళ పరిధిలోకే వస్తాయి. అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్‌ఎస్‌, బీజేపీలు నువ్వా-నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి.  చేవెళ్ళలో మూడు పార్టీల పరిస్థితి ఏంటి? ముఖ్యంగా  మూడు ప్ర‌ధాన పార్టీల బ‌లాబ‌లాలు ఏమిటి? బ‌ల‌హీన‌త‌లు ఏమిటో చూద్దాం.  చేవెళ్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి హేమాహేమీలు త‌ల‌ప‌డుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్ర‌స్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్‌ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వ‌ర్ రెడ్డి, జ్ఞానేశ్వ‌ర్ స్థానికులు.  బీజేపీ అభ్య‌ర్థి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిః 2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిపై, బీఆరెస్ అభ్య‌ర్థి రంజిత్ రెడ్డి గెలుపొందారు.  ఓడిపోయిన  విశ్వేశ్వ‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విడిచి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రంలో న‌రేంద్ర మోదీ స్వ‌చ్ఛ‌మైన పాల‌న‌ను చూసి త‌న‌ను గెలిపించాల‌ని విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఓట‌ర్ల‌ను కోరుతున్నారు.  విశ్వేశ్వరెడ్డి గెలుపుకోసం బీజేపీ అనుబంధ సంస్థలు క్షేత్రస్థాయిలోముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ముందుగానే అభ్యర్ధిగా ప్రకటించడం బీజేపీకి సానుకూలంగా మారింది. గతంలో ఆయన ఎంపీగా చేయడంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నివర్గాల వారితో సత్ససంబంధాలు కలిగి ఉండడం ఆయనకు కలిసివస్తోంది. ప్రధాని మోదీ పేరునే ప్రధాన ప్రచారస్త్రాంగా మలుచుకుని ఓట్లు అడుగుతున్నారు.  బీజేపీ శ్రేణులతో పాటు ఆర్ ఎస్ ఎస్‌ అనుబంధ సంస్థలు చాపకింద నీరులా పనిచేస్తున్నాయి. స్థానికంగానే బసచేస్తూ క్షేత్రస్థాయిలో ముమ్మర ప్రచారం చేస్తున్నాయి.  మోదీ ఛరిష్మా కలిసి వస్తుందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో రాజేంద్రనగర్, మహేశ్వరం అసెంబ్లీ స్థానాల్లో మైనార్టీ ఓట్లు చాలా కీలకంగా మారే ఛాన్స్ ఉంది. ఎంఐఎం పార్టీ ప్రత్యేకంగా అభ్యర్థిని నిలబెడితే ఇక్క‌డ బీజేపీ ఈజీగా గెలిచేది. కానీ ఎంఐఎం త‌న అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌లేదు. కాబ‌ట్టి పోటీ  కాంగ్రెస్ బీఆర్ ఎస్ మ‌ధ్య ముఖాముఖి పోటీ వుంది. బీఆర్ ఎస్ పార్టీకే ఇక్క‌డ క‌లిసి వ‌చ్చే అవకాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కాంగ్రెస్ అభ్య‌ర్థి రంజిత్ రెడ్డిః చేవెళ్ళ సిట్టింగ్ ఎంపి. కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. రెండోసారి విజ‌యం సాధించి త‌న అదృష్టాన్ని ప‌రిశీలించుకోవాల‌ని రంజిత్ రెడ్డి ఉన్నారు. త‌న‌కు ఉన్న వ్య‌క్తిగ‌త ప‌రిచ‌యాల‌తో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం ప్రారంభించారు.  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రంజిత్ రెడ్డి గెలుపుకోసం వ్యూహ‌ర‌చ‌న చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి.  చేవెళ్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించారు. అయితే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ ఎదురీదుతోంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటోంది. టీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి తో పాటు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ నేతలు కూడా తరలివస్తారని కాంగ్రెస్‌ నాయకత్వం భావించింది. కానీ ఇప్పటి వరకు ఆ స్థాయిలో చేరికలు జరడంగలేదు. దీంతో కాంగ్రెస్‌ ఆశించిన స్థాయిలో బలం పుంజుకోవడంలేదు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్ర‌కాష్ గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరతానని ప్రకటించినా తరువాత ఆయన వెనక్కి తగ్గారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన మరుసటి రోజే ఆయన వెనక్కి తగ్గి బీఆర్ ఎస్ లో కొనసాగుతానని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ నాయకత్వం అభాసుపాలైంది. పైగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విష‌యంలోనూ ఓట‌ర్ల‌లో అస‌హ‌నం వ్య‌క్తం అవుతుంది. కాబ‌ట్టి కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే బీఆర్ ఎస్ అభ్య‌ర్థి వైపే ఓట‌ర్లు మొగ్గు చూపుతున్నారు.   బీ ఆర్ ఎస్ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వ‌ర్ః తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత.. జరిగిన రెండు పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. 2014లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, 2019 ఎన్నికల్లో గ‌డ్డం రంజిత్ రెడ్డి గెలుపొందారు. గత రెండు ఎన్నికల్లోనూ రాజ‌కీయంగా అనుభ‌వం లేని నేత‌ల‌ను రంగంలోకి దింపి గెలిపించుకున్నారు గులాబీబాస్‌. ప్ర‌స్తుత బీఆరెస్ అభ్య‌ర్థి కాసాని జ్ఞానేశ్వ‌ర్ స్థానికుడు. గ‌తంలో ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ప‌రిష‌త్ చైర్మన్‌గా జిల్లాలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేశారు.  ఎమ్మెల్సీగా జిల్లాకు సేవ చేశారు. బీసీ సామాజిక వ‌ర్గంలో మంచి ప‌ట్టు వుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీసీ జ‌నాభా కూడా 50 శాతానికి మించి వుంది. ఇవ‌న్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే కాసాని గెలిచిన‌ట్లేన‌ని స్థానిక ఓట‌ర్లు  చెప్పుకుంటున్నారు.  ఇక్క‌డ బీఆర్ఎస్‌కు బ‌ల‌మైన క్యాడ‌ర్ వుంది కాబ‌ట్టి ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి బీఆర్ ఎస్ చేవెళ్ళ‌లో హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని గులాబీ శ్రేణుల్లో ధీమా క‌నిపిస్తోంది.  స్థానికుడ‌నైన త‌న‌ను గెలిపించాల‌ని కాసాని కోరుతున్నారు. పైగా బీసీలంతా కాసానికే అండ‌గా వున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బీఆర్‌ఎస్‌ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. బీఆర్‌ఎస్ అభ్యర్ధి కాసాని జ్ఞానేశ్వర్‌ ప్రణాళిక బద్ధంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు గెలుపుకోసం బీఆర్ ఎస్‌ అనుబంధ సంస్థలు, బీసీ కుల‌సంఘాలు క్షేత్రస్థాయిలోముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. కాసాని జ్ఞానేశ్వర్‌  అభ్యర్ధి గా వుండ‌టం బీఆర్ ఎస్‌కు సానుకూలంగా మారింది. గతంలో ఆయన జ‌డ్పీ ఛైర్మ‌న్‌గా, ఎమ్మెల్సీగా చేయడంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నివర్గాల వారితో సత్ససంబంధాలు కలిగి ఉండడం ఆయనకు కలిసివస్తోంది. కేసీఆర్ పాల‌నే  ప్రచారస్త్రాంగా మలుచుకుని ఓట్లు అడుగుతున్నారు. మరో వైపు  బీఆర్ ఎస్ సోషల్‌ మీడియా వింగ్‌ కూడా తెర వెనుక విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. బీఆర్ ఎస్‌ ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేసింది.   క్షేత్రస్థాయిలో ముమ్మర ప్రచారం చేస్తూ కాసాని ప్రచారంలో ముందంజలో ఉన్నారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్‌ పరిధిలో అత్యధిక ఓట్లు సాధించిన బీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికల్లో కూడా పట్టునిలుపుకునేయత్నం చేస్తోంది.  బీసీ కార్డును ప్రయోగిస్తోంది. మాజీ మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి రోజు వారీ నియోజకవర్గంపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార బాధ్యత సబితారెడ్డి తీసుకున్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌
ALSO ON TELUGUONE N E W S
'ఉయ్యాల జంపాల', 'మజ్ను' సినిమాలతో ఆకట్టుకున్న డైరెక్టర్ విరించి వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'జితేందర్ రెడ్డి'. రాకేష్‌ వర్రె లీడ్‌ రోల్‌ లో నటించిన ఈ సినిమాని ముదుగంటి క్రియేషన్స్‌ పై ముదుగంటి రవీందర్‌ రెడ్డి నిర్మించారు. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కించింది. మే 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ ట్రైలర్ లో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. 1983-89 ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ సీఎంగా పనిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన 'జితేందర్ రెడ్డి' ట్రైలర్ ఎన్టీఆర్ పాత్రను కూడా చూపించారు. ఈ ట్రైలర్ లో నక్సలిజాన్ని వ్యతిరేకిస్తూ, హిందూయిజంకి మద్దతుగా ఉన్నట్టుగా జితేందర్ రెడ్డి పాత్ర కనిపిస్తుంది. అలాగే, "ప్రజల కోసం అడవుల బాట పట్టిన నక్సల్స్ దేశ భక్తులు. వారి పోరాట స్ఫూర్తి గొప్పది." అని ఎన్టీఆర్ అన్నట్టుగా సంభాషణలు ఉండగా, దానికి కౌంటర్ గా కథానాయకుడు "నక్సలైట్లు దేశభక్తులు కాదు సార్. దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు దేశభక్తులు.. ప్రాణాలు తీసేవాళ్ళు కాదు సార్." అంటూ ఎన్టీఆర్ తో చెప్పినట్లుగా ట్రైలర్ లో ఉంది. మొత్తానికి ట్రైలర్ లో ఎన్టీఆర్ ని టార్గెట్ చేసినట్లుగా ఉంది.
ఇప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద బయోపిక్ ల ట్రెండ్ నడుస్తు ఉంది. సమాజంలోని రకరకాల వ్యక్తుల జీవిత చరిత్రలని తెర మీదకి తీసుకొస్తున్నారు. తాజాగా ప్రముఖ హీరోయిన్  నివేత థామస్( Nivetha Thomas)కూడా బయోపిక్ లో నటించబోతుంది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హైలెట్ గా నిలుస్తుంది.     గరివిడి లక్ష్మి(Garividi Lakshmi)ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖ  బుర్రకథ కళాకారిణి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చారు. బుర్రకథ చెప్పడంలో గుంటూరు నాజర్ వంటి అగ్రగణ్యులు ఉన్నా కూడా  తన కంటూ ఒక ప్రత్యేక బాణి ని ఏర్పరచుకొని ఎంతో కీర్తిని సంపాదించింది. అసలు ఆమె బుర్ర కథ చెప్పడం ప్రారంభిస్తే ఇంక జనం అన్ని పనులు మానుకొని ఆమె ప్రదర్శననని తిలకిస్తుంటారు. ఇప్పుడు  లక్ష్మి బయోపిక్ లోనే నివేదిత నటిస్తుంది. ప్రముఖ అగ్రనిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా  గౌరీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. గరివిడి లక్ష్మి అసలు పేరు రెడ్డి లక్ష్మి నివేదిత  2008 లో వేరుతే ఓరు భార్య అనే మలయాళ మూవీతో  బాలనటిగా పరిచయం అయ్యింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కలిపి మొత్తం 20 సినిమాలకి పైనే చేసింది.ఎన్టీఆర్ జై లవ కుశ, నాని జెంటిల్మన్ ,నిన్ను కోరి హీరోయిన్ గా మంచి గుర్తింపుని తెచ్చాయి. పవన్ వకీల్ సాబ్, రజనీ దర్బార్ లో కూడా  ముఖ్య పాత్రల్లో నటించింది.   
The movie "Aarambham," featuring Mohan Bhagath, Supritha Satyanarayan, Bhushan Kalyan, and Ravindra Vijay in pivotal roles, is being produced by Abhishek Viti under the banner of AVT Entertainment and directed by Ajay Nag V. "Aarambham," a film touted as a distinctive thriller trailer was released today during a launch event, presenting a captivating narrative. The trailer opens with the scene of a convict vanishing from jail, leaving no clues behind. This mysterious escape is being probed by a special office, drawing widespread interest. The trailer showcases the visuals of investigation and the story of escaped convict with his mother and love and also a scientist who inspired him. Packed with mysterious elements, compelling storylines and powerful performers, the film promises a seat edge thriller. With the absorbing story, rich visuals and a powerful soundtrack, is all set to deliver a gripping experience, enriched with mythological elements. The intertwining plotlines enhance the suspense and anticipation surrounding this thrilling movie. The movie team is planning to release "Aarambham" in theaters on May 10th. Srinjith Yerramilli is the music director while Devdeep Gandhi Kundu is handling the cinematography.
‘Love Today’ bankrolled by South India's leading production company AGS Entertainment and directed by Pradeep Ranganathan, who had also played the lead, emerged a blockbuster by winning the praise of audience from all walks of life. This success combo is joining forces once again. To be produced by Kalpathi S. Aghoram, Kalpathi S. Ganesh, and Kalpathi S. Suresh, this new film is written and directed by 'Oh My Kadavule' fame Ashwath Marimuthu and Pradeep Ranganathan is playing the protagonist. The yet-to-be-titled movie, which will have popular actors in its cast, will commence shooting from May. This is the 26th production of AGS Entertainment. The team has released an announcement video, which is making huge waves on the internet. The fun-filled video reflects the real-life friendship of Pradeep Ranganathan and Ashwath Marimuthu and it has won widespread acclaim within minutes of its launch. Archana Kalpathi is the Creative Producer of this lively emotional film. Aishwarya Kalpathi is the Associate Creative Producer. Music is by Leon James, cinematography by Niketh Bommi, and editing by Pradeep E. Ragav. Announcements including the title of the film, information about other actors and actresses will be made officially by AGS Entertainment in due course.
The movie 'Krishnamma' stars the versatile hero Satyadev and is directed by V.V. Gopalakrishna. It is produced by Krishna Kommalapati under the banner of Arunachala Creations, while the renowned director Koratala Siva presenting the film. Famous distribution companies, Mythri Movie Makers and Prime Show Entertainments, known for delivering many successful films, are set to release the film on a grand scale on May 10. The pre-release event was held in Hyderabad on Wednesday. Pan-India director S.S. Rajamouli, star directors Koratala Siva, Anil Ravipudi, and Gopichand Malineni were present as chief guests at this program and released the trailer of 'Krishnamma'. Music director Kaala Bhairava said, "We are eagerly awaiting the release of the movie 'Krishnamma.' I have been involved from post-production, and some scenes are haunting. It seems like everyone will enjoy this movie as much as I did. It will release on May 10. Our director, V.V. Gopalakrishna, has a close association with Vijayawada. With 'Krishnamma,' the audience will be taken to a new world. Satyadev acted brilliantly—I became his fan. Congratulations to our entire team and thanks for the support provided by Koratala Siva." Heroine Athira Raj said, "Thanks to SS Rajamouli garu, Koratala Siva garu, Gopichand garu, and Anil Ravipudi garu for coming to support our team. 'Krishnamma' is my first Telugu movie, and I am eagerly waiting for its release. Thanks to Gopalakrishna, producer Krishna garu, and Koratala Siva for giving me this opportunity. Kaala Bhairava has provided wonderful music. Thanks to Mythri Movie Makers and Prime Show Entertainments who are releasing our movie. Hero Satyadev is an inspiration for actors like us. Thanks to the entire team." Heroine Archana Iyer said, "Thanks to the legendary directors who came to support 'Krishnamma.' My character, Padma, would not have made sense without Gopal. This is a movie made with great love and hard work. I want the audience to watch and bless our film, which is coming out on May 10." B.V.S. Ravi said, "I am familiar with the story of 'Krishnamma.' It’s an honest story that feels like it really happened. We see the characters more than the actors. There is a small pain in the movie. Satyadev is an actor who conveys emotions well. Arunachala Creations is a company close to me; I worked on 'Jaawan' under this banner. Krishna is a good producer. Watching the trailer, it's clear that director Gopalakrishna has shot the movie well. Kaala Bhairava is provided good music. Congratulations to the entire team." Film director V.V. Gopalakrishna said, "There is truth in the story. I am also behind the scenes. It is because of him that the film has reached this point. If you watch the movie after May 10, you will understand the title. Watch the movie and bless us." Ravi Shankar of Mythri Movie Makers said, "When I heard the title 'Krishnamma', I got connected. The trailer is touching. Koratala Siva tells the story honestly. I am happy that this movie is coming under his supervision. Satyadev's acting in 'Krishnamma' is as intense as Allu Arjun's acting in 'Pushpa''. The director has presented the movie brilliantly. Everyone should watch 'Krishnamma' on May 10." Hero Satyadev said, "The love shown by Rajamouli garu, Anil Anna, Gopi Anna, and Siva garu gave me courage. I have been hearing positive things about this movie for two weeks now. What sometimes inspires me are my fans and moviegoers. Everyone will talk about the movie 'Krishnamma'. When Koratala garu approved the movie, we thought it was half a success already. As soon as he liked the story, he was ready to act as a presenter for this movie. His support in this journey cannot be forgotten. Our Krishna garu produced the film without hesitation. Our director Gopalakrishna has directed the movie well. What Sachin is to cricket, Rajamouli is to our Indian cinema. He proved that we can dream big. We feel proud to see him. When it comes to the movie 'Krishnamma'. our director shot it for two hours and ten minutes. As soon as I heard the story, I knew that this is a movie with content worth 100 crores and I told him the same. Laxman and Krishna, who acted in this movie, performed wonderfully as my friends. Athira, Archana, and Nandagopal all acted brilliantly. Kaala Bhairava has done the music. After the release of the movie, the songs will become even bigger hits. Thanks to our cinematographer Sunny. There are many twists and turns in our story, just like the many turns the Krishna River takes to reach its destination. Our director has created such rustic characters and emotions. I am indebted to him. Thanks to Mythri Movie Makers and Prime Show Entertainments who are releasing our movie. Everyone should watch the movie on May 10." Director Gopichand Malineni said, "Koratala Siva's films are methodical and have good content. There is also good content in his upcoming film as presenter 'Krishnamma'. I had a good relationship with the producer of this movie, Krishna garu. Cinema is about passion. Satyadev's acting is very natural and impresses with its intensity. A look at the trailer shows a realistic approach in every character. I am a big fan of Kaala Bhairava’s voice. He composed the music for this movie and provided a solid background score. I want this movie, which is releasing on May 10, to be a big hit." Director Anil Ravipudi said, "The trailer of 'Krishnamma' is extraordinary. Congratulations to the entire team including Satyadev, director Gopalakrishna, and producer Krishna Kommalapati garu. Kaala Bhairava’s music is very impactful. Film is a lot about respect, and Satyadev has earned his own identity as a hero by playing good roles. Kudos to producer Krishna. I hope this movie will be a big hit. I wish that 'Krishnamma', with Koratala Siva acting as a presenter, will be successful enough to lead to more movies. 'Krishnamma' will release on May 10. I want everyone to see it and bless the team." Presenter Koratala Siva said, "Special thanks to Rajamouli garu. Thanks to Gopi and Anil as well. Director Gopalakrishna came and narrated the story, Krishna, told him to listen to the story of the movie 'Krishnamma'. As soon as I heard it, I decided to be a part of this film. That's how I came to serve as the presenter for this film. Director Gopalakrishna has written the movie well. After finishing the shooting, he showed us the film. Good team—made the movie with great effort. Satyadev is one of the best actors I have ever seen. He can perform any big dialogue or scene with ease. I hope he reaches greater heights with 'Krishnamma'. Kudos to the other actors and technicians as well. Kaala Bhairava provided excellent music, creating great scores appropriate for each scene. All the best to him. I have known producer Krishna for a long time and wish him great success with this film. I hope 'Krishnamma', which is releasing on May 10, will be a big success." Pan India Director S.S. Rajamouli said, "I heartily congratulate Koratala Siva, who is becoming a presenter with the movie 'Krishnamma'. His involvement adds a special attraction to the movie. I wish Siva garu great success with this movie. Director Gopalakrishna has made the movie very appealing with just a few shots in the teaser and trailers, making audiences eager to watch the movie in theaters. All the best to him. Satyadev can capture any emotion in his acting—such talents are rare. If he gets the right film, he will become a star. I think he will become a star with 'Krishnamma'. All the best to the team including Satyadev. While listening to the story, Kaala Bhairava thinks deeply about the main emotion of the story and what he should do. He also composes music with intensity. I felt proud listening to the music he provided for the teaser and trailer. All the best to the entire team."
ఇండియన్ సినిమా ఉన్నంత కాలం బాహుబలి (Bahubali)గురించి  చెప్పుకుంటునే  ఉంటారు. కాకపోతే  తెలుగు వాళ్ళు ఇంకొంచం ఎక్కువగా  చెప్పుకుంటారు. తెలుగు సినిమాని అంతర్జాతీయ యవనిక మీద కూర్చోపెట్టి  ఆస్కార్ ని కూడా అందించింది. అలాంటప్పుడు బాహుబలి గురించి నిత్యం ఆలోచిస్తూనే ఉంటారు. మూవీ గురించి ఎక్కడ ఏ  న్యూస్ వచ్చినా సరే ఇంట్రెస్టింగ్ గా ఆరా తీస్తుంటారు. ఈ క్రమంలో బాహుబలి కి సంబంధించిన ఇంట్రెస్ట్ న్యూస్ పలువురిని ఆకర్షిస్తుంది  బాహుబలి సిరీస్  2015 ,2017 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలు సిసలు పాన్ ఇండియా మూవీగా నిలిచి రికార్డు కలెక్షన్స్ ని సాధించింది.చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరు బాహుబలికి బ్రహ్మ రధం పట్టారు. తాజాగా  బాహుబలి కి  యానిమేటెడ్ సిరీస్ రాబోతుందనే విషయం అందరకి తెలిసిందే. దానికి బాహుబలి  క్రౌన్ ఆఫ్ బ్లడ్ ( bahubali crown of blood)అనే  టైటిల్ ని కూడా ఫిక్స్ చేసారు.ఇప్పడు దాని ట్రైలర్ రిలీజ్ అయ్యింది. డిస్ని + హాట్ స్టార్ లో రిలీజ్ అయిన  ట్రైలర్  ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ట్రైలర్ చూస్తున్నంత సేపు  యానిమేటెడ్ సిరీస్ ని మంచి  క్వాలిటీతో చేశారనే విషయం అర్ధమతుంది. ఈ నెల 17 నుంచి  డిస్ని + హాట్ స్టార్ లోనే టెలికాస్ట్ కానుంది.ఈ విషయాన్నీ కూడా అధికారకంగా ప్రకటించారు.  కాకపోతే  ఓన్లీ హిందీ వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. మరి తెలుగు వెర్షన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. ఇనిస్టాగ్రమ్ లో ట్రైలర్ రిలీజ్ చేసారు. హిందీ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే  యానిమేటెడ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) కి తెలుగులో కంటే నార్త్ లోనే ఎక్కువ క్రేజ్ ఉందా!  సోషల్ మీడియాని ఫాలో అయ్యే వాళ్ళందరు  ఇప్పుడు ఇదే మాట అనుకుంటున్నారు. నిజానికి మన తెలుగు హీరోల్లో చాలా మందికి నార్త్ లో క్రేజ్ ఉంది.అది నిజమని ప్రూవ్ చేస్తు రికార్డు కలెక్షన్స్ తో తమ సత్తా చాటుతున్నారు.  ఇప్పడు బన్నీ అంతకు మించి సత్తా చాటాడు    రీసెంట్ గా పుష్ప 2 (Pushpa 2) నుంచి ఫస్ట్  సాంగ్ రిలీజ్ అయ్యింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ,మలయాళ ,కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అన్ని చోట్ల మంచి వ్యూస్ ని సాధిస్తు ముందుకు దూసుకెళ్తుంది. ఇక హిందీ ప్రేక్షకులు అయితే  మేము పుష్ప 2 సాంగ్ కోసమే ఎదురుచూస్తున్నాం అన్నట్టుగా ఒక సరికొత్త రికార్డుని బన్నీకి ఇచ్చారు. 14 గంటల్లో 77లక్షల మంది పుష్ప 2 ఫస్ట్ సాంగ్ ని వీక్షించారు. తెలుగు ప్రేక్షకులు  57 లక్షలు మంది వీక్షించారు. దీన్ని బట్టి  నార్త్ ఆడియెన్స్ లో బన్నీ రూల్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.పైగా లైక్స్  కూడా హిందీ వెర్షన్ కే ఎక్కువ  వచ్చాయి ఇక ఈ న్యూస్ తో  బన్నీ ఫ్యాన్స్  ఆనందానికి అయితే అవధులు లేవు. ముందు ముందు మా బన్నీ రికార్డుల రారాజు గా మారడం ఖాయమని అంటున్నారు. వరల్డ్ వైడ్ గా పుష్ప 2  అగస్ట్ 15 న విడుదల కానుంది. బన్నీ సరసన రష్మిక జోడి కట్టగా అనసూయ ,సునీల్,, ఫాహద్ ఫాజిల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా  సుకుమార్ దర్శకుడు.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు   
Pride of Indian cinema, SS Rajamouli, jokingly offered ₹10,000 to anyone who could beat fellow director Anil Ravipudi when Ravipudi inquired about the SSMB29 update. It is known that directors SS Rajamouli, Koratala Siva, Anil Ravipudi, and Gopichand Malineni attended the pre-release event of Satyadev's intense thriller, Krishnamma, yesterday and wished the team all the best. During the event, Anil Ravipudi gave his speech and asked director SS Rajamouli for updates on SSMB29 or its opening date. In response, SS Rajamouli sarcastically said, "If someone beats director Anil Ravipudi, I will give them ₹10,000." The related video is now going viral on social media. SS Rajamouli's next globetrotting project with superstar Mahesh Babu is in pre-production mode, and the makers have been silent about the updates. SS Rajamouli will soon announce the opening date and reveal the storyline of SSMB29. "Krishnamma," an intense thriller starring Satyadev Kancharana, is directed by talented filmmaker VV Gopalakrishna and presented by renowned filmmaker Koratala Siva. Mythri Movie Makers and Prime Show Entertainments are releasing the film grandly on May 10th. The film promises a potential summer hit. Produced by producer Krishna Kommalapati's Arunachala Creations, the movie features Athira Raj opposite Satyadev, Krishna, Archana Iyer, and Nandagopal in pivotal roles.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
కొంతమందికి ఎప్పుడూ ఏదో ఒక దెబ్బ తగులుతూ ఉంటుంది! ఒంటి మీద ఎప్పుడూ ఏదో ఒక గాయం కనిపిస్తూనే ఉంటుంది. వాళ్లని చూసి పాపం దురదృష్టవంతులు అని మిగతావారు జాలిపడుతూ ఉంటారు. కానీ తరచూ ఏదో ఒక ప్రమాదానికి లోనవ్వడానికీ మన వ్యక్తిత్వానికీ సంబంధం ఉండవచ్చని ఊహిస్తున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఇలాంటి మనస్తత్వాన్ని ‘Accident Prone Psychology’ అంటున్నారు. అదేమిటో తెలుసుకుంటే మనకీ కాస్త ఉపయోగపడుతుందేమో... ఓ ఆలోచన! తరచూ కొంతమందే ఎందుకు దెబ్బలు తగిలించుకుంటారన్న అనుమానం 19వ శతాబ్ది మొదటిలోనే వచ్చింది. దీని మీద మరిన్ని పరిశోధనలు చేసిన గ్రీన్‌వుడ్ వంటి నిపుణులు మన ఆలోచనా విధానానికీ, ప్రమాదాలకి సంబంధం ఉండే అవకాశం ఉందని తేల్చారు. ఆ తరువాత వచ్చిన ఎన్నో పరిశోధనల్లో ఓ 20 శాతం మంది వ్యక్తులే అధికశాతం ప్రమాదాలకి కారణం అవుతూ ఉంటారనీ... మొత్తంగా మన చుట్టూ జరిగే ప్రమాదాలలో దాదాపు 75 శాతం ప్రమాదాలు మానవ తప్పిదం వల్లే ఏర్పడతాయని చెబుతూ వస్తున్నాయి. ఈ పరిశోధనల శాస్త్రీయతని చాలామంది కొట్టిపారేసినా, వీటిలో స్పృశించిన చాలా అంశాలు చాలా తార్కికమైనవే! అందుకనే కొన్ని భీమా కంపెనీలు ప్రమాదభీమాను చెల్లించేటప్పుడు, ఉత్పాదక సంస్థలు తమ ఉద్యోగులను హెచ్చరించేందుకూ ఈ పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి.   ప్రమాదాన్ని ఆశించే వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువగా ఉన్నారు, దూకుడుగా ఉండేవారు, నిరంతరం కోపంతో రగిలిపోయేవారు... పోయి పోయి ఏదో ఒక ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారని తేలింది. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు కూడా ప్రమాదాలకి త్వరగా లోనవుతారని చాలా పరిశోధనలు వెల్లడించాయి. ఏదన్నా కుటుంబంలో ఒకరి తరువాత ఒకరు ప్రమాదానికి లోనవడం మనం గమనిస్తూ ఉంటాము. ఆ కుటుంబానికి ఏదో శాపం తగిలిందనో, వారి గ్రహస్థితి బాగోలేదనో అనుకుంటాము. నిజానికి ఇలా కుటుంబంలో ఎవరన్నా ఒకరు తీవ్ర ప్రమాదానికి లోనైతే, ఆ ప్రభావం ఇతరుల మనసు మీద కూడా పడుతుందనీ... ఆ ఒత్తిడిలో మిగతా సభ్యులు కూడా ప్రమాదానికి లోనయ్యే అవకాశం 20 శాతం ఉంటుందనీ ఓ పరిశోధన తేల్చింది. ఎవరైతే ఇతరుల సలహాలను, సహాయాన్నీ స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారో... వారు త్వరగా ప్రమాదాలకు లోనుకారని తేలింది. అహంకారం లేకుండా, తొందరపడకుండా ఉండేవారికి ప్రమాదాలు కూడా ఆమడదూరంలో ఉంటాయని 2001లో జరిగిన ఒక పరిశోధన రుజువు చేసింది. అంటే నిదానమే ప్రధానం, నోరు మంచిదైతే ఊరు మంచిది లాంటి సామెతలు యాంత్రిక జీవితానికి కూడా వర్తిస్తాయన్నమాట.     ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా తొందరపాటు, దూకుడు, ద్వేషం, అహంకారం... మనిషి విచక్షణను దెబ్బతీస్తాయి. తన మీద తనకి ఉండాల్సిన నియంత్రణను ప్రభావితం చేస్తాయి. దాంతో ఒక అనర్థం జరగడం సహజమే! కానీ ఇలాంటివారు కేవలం తమకి మాత్రమే ప్రమాదాన్ని తెచ్చుకుంటే ఫర్వాలేదు. అలా కాకుండా ఈ ‘Accident Prone Psychology’ ఉన్నవారు ఏ విమానాన్నో నడుపుతుంటే! అందుకే ఈ తరహా వ్యక్తిత్వం గురించి నానాటికీ ప్రచారం పెరుగుతోంది. మీది ప్రమాదాన్ని కొని తెచ్చుకునే వ్యక్తిత్వమేమో గమనించుకోండి అంటూ కొన్ని వెబ్‌సైట్లు పరీక్షలు పెడుతున్నాయి. మున్ముందు ఉద్యోగులకు కూడా ఇలాంటి పరీక్షలను నిర్వహించి విధుల్లోకి తీసుకునే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు!   - నిర్జర.
ప్రేమ అనేది  ఇప్పట్లో చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు ప్రేమ అంటే అబ్బాయిలు మాత్రమే ధైర్యం చేసి చెప్పేది.. అమ్మాయిలకు అంగీకారం ఉంటే తదుపరి వారి బంధం మరో మలుపు తిరిగేది.. కానీ ఇప్పుడు అట్లా కాదు.. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ ప్రేమ విషయంలో బాగా అడ్వాంటేజ్ గా ఉంటున్నారు. అయితే చిక్కల్లా ఒకమ్మాయి తమకు బాగా తెలిసి, తమతో సన్నిహితంగా ఉంటూ తమను లవ్ చేస్తుందా లేదా  అనే విషయం అర్థం కాక జట్టు  పీక్కునే అబ్బాయిల గురించే..   అయితే దీనికి ఈజీగానే చెక్ పెట్టవచ్చు అమ్మాయిలు తమను ప్రేమిస్తున్నారా లేదా అనే విషయాన్ని అబ్బాయిలు ఈ 7 విషయాల ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటంటే.. అమ్మాయిలు తమకు ఎంత పని ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా వారి మనసులో ఒక అబ్బాయి పట్ల ప్రేమ ఉంటే వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఫోన్ లో అయినా, మెసేజ్ లో అయినా, వ్యక్తిగతంగా కలవడంలో అయినా తను ప్రేమించిన అబ్బాయిని ఎప్పుడూ లైట్ తీసుకోదు. తను ఇష్టపడుతున్న అబ్బాయితో సన్నిహితంగా ఉండటానికి అమ్మాయిలు అబద్దాలు చెప్తారు. మాట్లాడటానికో, కలసి నడుస్తున్నప్పుడో, పక్కపక్కన కూర్చున్నప్పుడో తాకడం, చెయ్యి పట్టుకోవడం, నవ్వడం, నవ్వించడం వంటివి చేస్తారు. ప్రతి అమ్మాయికి తను ఇష్టపడే అబ్బాయి మరొకరితో సన్నిహితంగా మాట్లాడితే కోపం వస్తుంది. అలాగే అసూయ పడుతుంది. ఒకమ్మాయి తను ఇష్టపడుతున్న అబ్బాయి ఇతర అమ్మాయిలతో మాట్లాడుతుంటే అలాగే ఫీలవుతుంది. కొన్నిసార్లు తను ప్రేమించిన అబ్బాయి  ముందు కోపాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. అమ్మాయి తను ప్రేమిస్తున్న అబ్బాయి కళ్లలోకి చూసి మాట్లాడాలంటే చాలా ఇష్టపడుతుంది. అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్లలోకి చూస్తూ మాట్లాడుతుంటే ఆమెకు ప్రేమ ఉన్నట్టే. అమ్మాయిలు తాము ప్రేమిస్తున్న అబ్బాయిలు అందుబాటులో కాస్త దూరంగా ఉంటే ఇక చూపులన్నీ తను ప్రేమిస్తున్న అబ్బాయి వైపే ఉంచుతుంది. ఎలాంటి పరిస్థితిలో అయినా సరే.. అమ్మాయి తను ఇష్టపడే అబ్బాయి కదలికలను గమనించడానికి, అతన్ని చూడటానికి ఇష్టపడుతుంది. అబ్బాయికి నచ్చిన పని చేయడానికి, నచ్చిన వస్తువులు, నచ్చిన ఆహారం తీసుకొచ్చి ఇవ్వడానికి అమ్మాయి శ్రద్ద చూపిస్తున్నట్టైతే అది సాధారణ పరిచయం లేదా స్నేహం అనుకోవడానికి వీల్లేదు. ఏ మూలో అమ్మాయికి తప్పకుండా అబ్బాయి మీద ఇష్టముందని అర్థం. అమ్మాయిలు తమకు ఏ చిన్న బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా అబ్బాయితో చెబుతుంటే ఆమెకు అతను చాలా స్పెషలని అర్థం. అంతేకాదు తను ఇష్టపడుతున్న అబ్బాయి పక్కన ఉంటే ఆమె తన బాధలన్నీ మర్చిపోతుంది. అమ్మాయి ఇలా చేస్తుంటే ఆమె ప్రేమిస్తోందనే అర్థం.                                                         *నిశ్శబ్ద.  
  మనసులో ఏదీ దాచుకోలేకపోవడం చాలా మంది బలహీనత. బాధ అయినా, సంతోషం అయినా, దుఃఖం అయినా తనకు తెలిసిన వారికో లేక స్నేహితులు, ఆత్మీయులకో ఏదో ఒక  సందర్భంలో చెప్పుకుని తీరతారు. అయితే ఇలా చెప్పడం తప్పని కాదు కానీ.. కొన్ని విషయాలు మాత్రం ఇతరులతో అస్సలు చెప్పడం మంచిది కాదని అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేష నిపుణులు. ఏ వ్యక్తి అయినా ఇతరులతో అస్సలు చెప్పకూడని 5 విషయాలేంటో తెలుసుకుని వాటిని పాటిస్తే  వారి జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది. ఆ అయిదు విషయాలేంటో తెలుసుకుంటే.. ఆర్థిక స్థితి.. ఉద్యోగం చేసేవారు అయినా వ్యాపారం చేసేవారు అయినా పొదుపు చేసేవారు అయినా తమ ఆర్థిక స్థితి గురించి మరో వ్యక్తికి చెప్పడం మంచిది కాదు. ప్రతి వ్యక్తి ఆర్థిక స్థితి సామాజిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. డబ్బును చూసి మనుషులు మసలుకునే కాలమిది. ఎవరిదగ్గరైనా డబ్బు ఎక్కువ ఉందని తెలిసినా, ఎక్కువ సంపాదిస్తున్నారని తెలిసినా అప్పు కోసం, సహాయాల కోసం సులువుగా చుట్టూ చేరతారు. పక్క మనిషి గురించి పట్టించుకోని ఈ కాలంలో ఆర్థిక సహాయాలు చెయ్యడం అంత మంచిది కాదు. అందుకే ఆర్థిక స్థితి గురించి ఎవరికీ చెప్పకూడదు. ఇంటి సమస్యలు.. ప్రతి ఇంట్లోనూ సమస్యలుంటాయి. ఇంటి సమస్యలను ఇంటి వారితో చర్చించి వాటిని చక్కబెట్టుకోవడం శ్రేయస్కరం. అలా కాకుండా సలహాలు, సూచనలు ఇస్తారనో లేదా మనసులో భారం దించుకోవాలనే ఆలోచనతోనో ఇంటి సమస్యలు బయటి వారికి, తెలిసిన వారికి చెప్పడం మంచిది కాదు. రిలేషన్ గొడవలు..  నిజానికి తోబుట్టువులు, చుట్టాలు, బాగా దగ్గరి వారైనా సరే.. భార్యాభర్తల సమస్యలలో జోక్యం చేసుకోవడం, తీర్పులు ఇవ్వడం మంచిది కాదు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గొడవలు, సమస్యలు వారే పరిష్కరించుకుంటే వారిద్దరికి ఒకరి మీద మరొకరికి గౌరవం పెరుగుతుంది. ఏ సమస్యకైనా ప్రతి వ్యక్తి స్పందన వేరుగా ఉంటుంది. అనుభవాలు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి సమస్యలను బయటకు, లేదా ఇతరుల దగ్గరకు తీసుకెళ్లడం, చెప్పడం మంచిది కాదు. మూడవ వ్యక్తికి భార్యాభర్తల సమస్యలు చెబితే వారు దాన్ని ఎంటర్టైన్మెంట్ గా చూస్తారు. బలహీనతలు.. ప్రతి వ్యక్తిలోనూ బలాలతో పాటూ బలహీనతలు ఉంటాయి. చాలామంది వ్యక్తులలో లోపాలు, బలహీనతలను వెతుకుతారు. వాటిని వేలెత్తి చూపిస్తారు. విమర్శిస్తారు. అందుకే వ్యక్తులలో బలాలు బయటపెట్టినా సమస్య లేదు కానీ బలహీనతల గురించి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరికీ చెప్పకూడదు. ప్రణాళికలు.. పెద్ద పెద్ద విషయాల గురించి నిర్ణయాలు తీసుకునే ముందు, పెద్ద ప్రణాళికలు వేసుకునేటప్పుడు వాటిని మరొక వ్యక్తితో చెప్పకూడదు. జీవితంలో ఇంకా ఎదిగే దశలో వేసుకునే ప్రణాళికలు ఇతరులతో చెప్పకూడదు.                                                      *రూపశ్రీ.  
భారతీయ వంటిల్లు గొప్ప ఔషదాల వేదిక. వంటింట్లో ఉండే ప్రతి మసాలా దినుసు, వంటకు ఉపయోగించే ప్రతి వస్తువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే అయ్యుంటాయి. వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం.. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి దానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇక  రెస్టారెంట్లో భోజనానికి వెళితే చివరగా వాళ్లు ఇచ్చే సొంపు  లేదా సోపు కూడా చాలా ఇళ్లలో ఉంటుంది. భోజనం తరువాత పొట్ట సమస్యలు ఏవీ ఉండకూడదని, ఆహారం బాగా జీర్ణం కావాలని సోపు ఇస్తుంటారు. అయితే అది స్వీట్ సోపు.. సాధారణంగా ఇళ్లలో ఉండే ప్లెయిన్ సోపు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే దీన్ని ఎప్పుడూ లైట్ తీసుకోరు.. సోపు వంటింటి  దినుసుల మధ్య ఉండే జీలకర్రను పోలి ఉంటుంది.  కానీ దీని సువాసన నుండి రుచి వరకు, ఆరోగ్య ప్రయోజనాల నుండి ధర వరకు అన్నీ వేర్వేరుగానే ఉంటాయి. ఎండలు దంచేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో సోపును తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుందని ఆయుర్వేద ఆహార నిపుణులు అంటున్నారు. సోపును వేసవి కాలంలో తీసకుంటే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. సాధారణంగా వేసవికాలంలో బయటి వాతావరణం వల్ల శరీరం కూడా వేడెక్కుతుంది. కానీ ఈ వేడిని సోపు నియంత్రిస్తుంది. సోపులో శీతలీకరణ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇది శరీరాన్ని శాంతపరచడంతో పాటూ హీట్ స్ట్రోక్ నుండి శరీరాన్ని రక్షించడంలో కూడా మెరుగ్గా ఉంటుంది. కేవలం శరీరాన్ని చల్లబరచడం, హీట్ స్ట్రోక్ నుండి రక్షించడమే కాదు.. జీర్ణ లక్షణాలు కూడా సోపులో మెండుగా ఉంటాయి. ఈ కారణంగానే వేసవిలో ఎదురయ్యే జీర్ణ సంబంధ సమస్యలకు సోపు చెక్ పెడుతుంది. సోపును నేరుగా కానీ, సోపును నీటిలో ఉడికించి టీలా కానీ తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. సోపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే టాక్సిన్లను తగ్గించడంలోనూ, బయటకు పంపడంలోనూ సహాయపడతాయి. శరీరాన్ని శుద్ది చేసుకోవాలని అనుకునేవారు సోపు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పట్లో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. సోపు టీని ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉంటే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు.  ఇది శరీరంలోనూ, పొట్ట భాగంలోనూ పేరుకున్న అదనపు కొవ్వులను కరిగించడంలో సహాయపడుతుంది.                                                  *రూపశ్రీ.
మనిషి శరీరానికి ఆహారమే గొప్ప ఔషదం. సరైన ఆహారం తిన్నా, సరైన వేళకు తిన్నా అది శరీరానికి చాలా బాగా పనిచేస్తుంది. గ్రామాల లైఫ్ స్టైల్ గమనిస్తే సాయంత్రం దీపాలు పెట్టే వేళకు వంట పూర్తీ చేయడం,  ఆ తరువాత రాత్రి 7 గంటల లోపే భోజనం చేయడం జరుగుతుంది. ఆ తరువాత ఇరుగు పొరుగు వారు, కుటుంబ సభ్యులు కాసేపు కబుర్లు చెప్పుకుని 8 నుండి 9 గంటల్లోపు నిద్రపోయేవారు. తర్వాత ఉదయం నాలుగు గంటలకే లేచి పనులు చక్కబెట్టుకునేవారు. గ్రామాలలో ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఇది బలమైన కారణం. కానీ ఈ అలవాటు ఇప్పుడెక్కడా కనిపించట్లేదు..  గ్రామాలలో కూడా కాంక్రీటు సొగసులు అద్దుకుని తమ అలవాట్లను కూడా కోల్పోయాయి. అయితే  రాత్రి 7 గంటలలోపే భోజనం చెయ్యడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఒక్కసారి తెలుసుకుంటే... ఆహారం తినడానికి, నిద్రపోవడానికి మధ్య తగినంత సమయం ఉండాలని వైద్యులు చెబుతారు.   ఎందుకంటే తినడానికి నిద్రించడానికి మధ్య  సమయం ఉండచం వల్ల  ఆహారం జీర్ణం కావడానికి అనువుగా ఉంటుంది.  ఆహారం సరిగా జీర్ణమైతే జీర్ణాశయ సమస్యలు ఏమీ ఉండవు. జీర్ణాశయ సమస్యలు  లేకపోతే ఉదర ఆరోగ్యం బాగుంటుంది.  దీంతో నిద్ర కూడా బాగా పడుతుంది. రోజూ రాత్రి 7 గంటలలోపు తినడం అలవాటు చేసుకునే వారికి తరువాత రోజు ఉదయం 8 గంటలలోపు బాగా ఆకలి అవుతుంది. ఉదయం 8 గంటలలోపు అల్పాహారం కానీ లేదా ఇతర ఆహారాలు కానీ ఉదయాన్నే తింటారు. దీని వల్ల ఉదయం ఆహారం ఎగ్గొట్టే అలవాటు తప్పుతుంది. ఆకళి కూడా వేళకు ఠంచనుగా అవుతుంది.   రాత్రి నిద్రపోయే ముందు ఆహారం తినేటప్పుడు అదొక హడావిడి ఉంటుంది. సమయం అయిపోతోందని, తొందరగా నిద్రపోవాలని కంగారు పడేవారు కొందరు ఉంటారు. దీని వల్ల ఆహారాన్ని ఆస్వాదించలేరు. అదే 7 గంటలప్పుడు వాతావరణం బాగుంటుంది. ఆహ్లదకరమైన వాతావరణంలో తినడం వల్ల ఆహారం కూడా శరీరానికి ఒంటబడుతుంది. ఆహారం బాగా జీర్ణం కావాలంటే తిన్న వెంటనే పడుకోకూడదు. 7గంటలలోపు భోజనం చేస్తే పడుకునే లోపు ఏదో ఒక పని చేస్తూ సమయం గడుస్తుంది. దీనివల్ల తిన్న ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది.  కడుపులో గ్యాస్, ఉబ్బరం, జీర్ణసమస్యలు వంటివి ఎదురుకావు. చాలామంది బరువు పెరగడానికి కారణం రాత్రి భోజన వేళలు సరిగా లేకపోవడమే. తిన్న వెంటనే కాసేపు నడక, ఇతర పనులు చేయడం వల్ల తిన్న ఆహారం జీర్ణం కావడానికి సమయం దొరకడమే కాకుండా  కేలరీలు కూడా బర్న్ అవుతాయి. జీవక్రియ బాగుండటం వల్ల బరువు పెరగే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. ప్రతి వ్యక్తిలో సిర్కాడియన్ రిథమ్ అనే చక్రం ఉంటుంది. ఇది నిద్రా చక్రం నుండి జీవక్రియ వరకు చాలా విధులు సక్రమంగా ఉండేలా చూస్తుంది. రాత్రి 7గంటల లోపు తింటే సిర్కాడియన్ రిథమ్  ఆరోగ్యకరంగా ఉంటుంది.                                                           *నిశ్శబ్ద.