‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఒక కీలక సీన్ వుంటుంది. ముఖ్యమంత్రి పోస్టులో వున్న రఘువరన్‌ని జర్నలిస్టు పాత్రలో అర్జున్ ఇంటర్వ్యూ చేస్తాడు. ఆ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి అనవసరంగా నోరు జారి తన పదవిని, పరువుని పోగొట్టుకుంటాడు. క్లైమాక్స్.లో రఘువరన్ బాల్చీ తన్నేస్తూ హీరోతో ‘‘అది చాలా గొప్ప ఇంటర్వ్యూ’’ అంటాడు. అంటే, ఒక్క ఇంటర్వ్యూ ముఖ్యమంత్రి అంత స్థాయి వున్న వ్యక్తిని పూర్తిగా పతనం అయ్యేలా చేసింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మొన్నీమధ్య నేషనల్ మీడియాకి.. ముఖ్యంగా టైమ్స్ నౌ ఎడిటర్ నవికా కుమార్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా సేమ్ టు సేమ్ ‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఇంటర్వ్యూ  లాంటిదే. ఆ సినిమాలో ముఖ్యమంత్రి పదవి పోయింది.. ఈ రియాల్టీలో ముఖ్యమంత్రి పరువు పోయింది. జగన్ గెలవబోతున్నాడా.. ఓడుతున్నాడా అని అప్పటి వరకు జాతీయ స్థాయిలో గానీ, స్థానికంగా గానీ వున్న డోలాయమాన పరిస్థితికి ఆ ఇంటర్వ్యూ ఫుల్‌స్టాప్ పెట్టింది. నవికా కుమార్ అడిగిన ప్రశ్నలకు జగన్ ఇచ్చిన సమాధానాలు, హావభావాలు జగన్ ఓటమిని ఫిక్స్ చేశాయి. ఇక జగన్ తట్టాబుట్టా సర్దుకోవడం ఖాయమన్న క్లారిటీ జాతీయ స్థాయిలో కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో జగన్ ఆ ఇంటర్వ్యూ ఇవ్వకుండా వుండాల్సిందనే అభిప్రాయాలు వైసీపీలో వ్యక్తమవుతున్నాయి. గతజలసేతు బంధనం మాదిరిగా, జరిగిపోయిన నష్టం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వైసీపీ వర్గాలు తీరిగ్గా బాధపడుతున్నాయి. ఇకమీదట జగన్ ఏ జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వకూడదని వైసీపీ వర్గాలు ఫిక్సయ్యాయి. అసలే ఓటమి భయం నిలువెల్లా ఆవరించి వున్న జగన్ ఢిల్లీ జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి తడబడిపోతున్న పరిస్థితి. జాతీయ రాజకీయాల మీద మీ వ్యూ ఏమిటని అడిగితే, నాకు జాతీయ రాజకీయాల గురించి అంతగా తెలియదు అని సమాధానం చెప్పడం... అది కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా అనడం చాలా మైనస్ అయింది. అందుకే, ఎందుకొచ్చిన గొడవ.. నేషనల్ మీడియాకి దూరంగా వుంటే సరిపోతుంది కదా అని వైసీపీ వర్గాలు ఫిక్సయ్యాయి. ఏపీలో మీడియాకి జగన్ అంతట జగనే చెప్పడం తప్ప, జర్నలిస్టులు అడిగిన దానికి సమాధానం చెప్పే అలవాటు జగన్‌కి లేదు. గత ఐదు సంవత్సరాలుగా ఇదే వ్యవహారం. మరి నేషనల్ మీడియా జర్నలిస్టులు అలా కాదు.. కోడి ఈకలు పీకినట్టు ప్రశ్నలు సంధిస్తారు. ఆ పీకుడుని తట్టుకునే పరిస్థితిలో జగన్ లేరు. మరీ ముఖ్యంగా... బాబాయ్ హత్య గురించి, చెల్లెమ్మ షర్మిల తిరుగుబాటు గురించి ప్రశ్నలు అడిగితే మాత్రం జగన్ తడబడిపోతున్నారు. ఆయా ప్రశ్నలకు ఏ సమాధానం చెబుతున్నారో జగన్‌కే అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. అందువల్ల ప్రభుత్వం పోతే పోయింది.. ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చి జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకోవడం ఎందుకన్న అభిప్రాయంలో వైసీపీ వర్గాలు వున్నట్టు సమాచారం.
ఏపీలో ఎన్నికలు వారం రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అధికార వైసీపీ ఈ ఐదేళ్ల కాలంలో చేసిందేమిటన్నది చెప్పుకోవడానికి ఏమీ లేక.. చెప్పుకునే గొప్పలు జనం నమ్మడం లేదని ఖరారు కావడంతో  ఇక విపక్షాలపై దుష్ప్రచారం, అబద్ధాల వ్యాప్తికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే తెలగుదేశం మేనిఫెస్టో 2024ను   ఆ పార్టీ వెబ్ సైట్ నుంచి తొలగించిందంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ పెద్ద ఎత్తున ప్రచారానికి తెరలేపింది. తెలుగుదేశం, వైసీపీ మేనిఫెస్లోలు విడుదల చేసినప్పటికీ, వైసీపీ మేనిఫెస్టోపై ప్రజలలో స్పందన కనిపించలేదు. ఆ మేనిఫెస్టోపై కనీసం చర్చ కూడా జరగలేదు. అందుకు భిన్నంగా తెలుగుదేశం మేనిఫెస్టో ప్రజలను ఆకర్షించింది. ఆ పార్టీ గ్యారెంటీలపై ప్రజలలో విశ్వాసం కనిపించింది.  తెలుగుదేశం మేనిఫెస్టో కూటమికి బ్రహ్మాండమైన మైలేజీని తీసుకువచ్చింది. అదే సమయంలో వైసీపీ మేనిఫెస్టో పట్ల సర్వత్రా పెదవి విరుపే కనిపించింది. దీంతో తెలుగుదేశం మేనిఫెస్టోలో ఇచ్చి హామీల అమలు సాధ్యం కాదంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్  ప్రచారానికి తెరలేపింది. ఆ ప్రయత్నంలో భాగంగా తెలుగుదేశం కూటమిని మించి విపక్ష పార్టీ మేనిఫెస్టోకు ప్రచారం కల్పించింది. అది ఫలించలేదని గ్రహించిన వైసీపీ ఇప్పుడు తెలుగుదేశం తన వెబ్ సైట్ నుంచి మేనిఫెస్టో తొలగించేసిందంటూ  వదంతులను వ్యాప్తి చేయడానికి తెరతీసింది. ఇందుకు నిదర్శనమంటూ తెలుగుదేశం వెబ్ సైట్ స్క్రీన్ షాట్ ను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసింది.  ఆ స్క్రిన్ షాట్ ఏమిటంటే.. పేజ్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అని కనిపిస్తోంది. అయితే వాస్తవం ఏమిటంటే..  తప్పు యూఆర్ఎల్ ను టైప్ చేసి ఎర్రర్ మెసేజ్ వచ్చిన స్క్రీన్ షాట్ ను  వైసీపీ వైరల్ చేయడానికి ప్రయత్నిస్తున్నది.  తెలుగుదేశం వెబ్ సైట్ హోం పేజ్ ఓపెన్ కాగానే ఆ పార్టీ మేనిఫెస్టో డిస్ ప్లే అవుతోంది. అయినా సరిగ్గా ఎన్నికల వేళ ఏ పార్టీ కూడా తన మేనిఫెస్టోను తొలగించదన్న కనీస ఇంగితాన్ని కూడా వైసీపీ కోల్పోయిందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అవాస్తవ ప్రచారంలో ఎన్నికల గండం గట్టెక్కేందుకు  వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు బూమరాంగ్ అయ్యి ఆ పార్టీనే నవ్వుల పాలు చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గట్టిగా చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమనీ ప్రజల భూములను దోచుకునేందుకు కుట్రపూరితంగా జగన్ సర్కార్ దీనిని తీసుకువచ్చిందని విమర్శిస్తున్నారు. వారి ప్రసంగాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల భూములను ఎలా  వారికి దూరం చేస్తుందో వివరిస్తున్న తీరు ప్రజలలో చైతన్యం కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలోనే తాను అధికారంలోకి రాగానే చేసే రెండో సంతకం ఈ చట్టం రద్దుపైనే అంటూ చంద్రబాబు చేస్తున్న ప్రకటన, ఇస్తున్న హామీ ప్రజలకు భరోసా కలిగిస్తోంది. చంద్రబాబు ఇప్పటికే మెగా డీఎస్సీపైనే తన తొలలి సంతకం అని ప్రకటించిన సంగతి తెలిసిందే.  కాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలకు జగన్ ను, ఆయన సర్కార్ ను మరింత దూరం చేసిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  ఈ తరుణంలో వైసీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ట్ర చట్టం కాదనీ, దానిని రద్దు చేయడం సాధ్యం కాదనీ పేర్కొంటూ తన సామాజిక మాధ్యమ వేదికలలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది.  అయతే వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం చట్టం ఎంత మాత్రమూ కాదు. భూమి అన్నది రాష్ట్రానికి చెందిన అంశం. ఈ విషయంలో కేంద్రం చట్టాలు చేయజాలదు. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ను నీతి ఆయోగ్ ప్రతిపాదన మాత్రమే. ఆ ప్రతిపాదనను పరిగణననలోనికి  తీసుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. కానీ దుష్ట యోచనతో ఒక్క జగన్ సర్కార్ మాత్రమే ఆ నీతీ ఆయోగ్ ప్రతిపాదనను చట్టం చేసింది. హడావుడిగా అమలులోకి తీసుకువచ్చేసింది.   తాను కూడా ఆ చట్టానికి బాధితుడినేనంటూ మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ట్వీట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమైనదో కళ్లకు కట్టింది. ఈ నేపథ్యంలోనే ఆ చట్టాన్ని రద్దు చేసే హక్కు రాబోయే ప్రభుత్వానికి  పూర్తిగా ఉంది. అంటే ఎన్నికలలో విజయం సాధించి చంద్రబాబు అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడానికి ఎటువంటి అవరోధాలూ ఉండవు. ఇది కేంద్రం చట్టం అంటూ చేస్తున్న వైసీపీ ప్రచారం పూర్తి అవాస్తవమని పరిశీలకులు సోదాహరణంగా వివరిస్తున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
The first look of National Award Winning actor Dhanush from Sekhar Kammula’s Kubera was unveiled for Maha Shivaratri to an overwhelming response. The movie stars King Nagarjuna playing another lead role. As promised, the makers revealed the first look of Nagarjuna exclusively on Star Sports. Nagarjuna, in this intense first look poster, is seen sporting spectacles and holding an umbrella as it is raining. He looks normal and there’s no enthusiasm in his face, despite the truck behind him loaded with currency notes. The first look glimpse reveals more about his character. He walks away from the truck, and he finds a 500 note on the ground. He picks another note from his pocket and places it in the truck, which shows his uprightness. What is he in the movie? An honest government officer or something else. We need to wait for some more time to know. However, like the first look of Dhanush, the first look of Nagarjuna and the glimpse raise curiosity for the movie. Rockstar Devi Sri Prasad’s background score is exceptional, while the visuals and production values are top-notch. The shoot of this high-budget entertainer is presently taking place in Mumbai. Dhanush and Rashmika Mandanna are part of this Mumbai chapter. This crazy Pan India film is produced by Suniel Narang and Puskur Ram Mohan Rao, with the blessings of Shri Narayan Das K Narang, under their banner Sree Venkateswara Cinemas LLP (A Unit Of Asian Group), in association with Amigos Creations Pvt Ltd. Sonali Narang presents the movie. Sekhar Kammula is coming up with another unique concept and making it as a commercial entertainer. It will be eye pleasing to see the fans of Dhanush and Nagarjuna together on screen. Niketh Bommi handles the cinematography of the movie.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. మే 13న పోలింగ్ జరగనుంది. పోలింగ్ కి ఇంకా వారం కూడా సమయం లేదు. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో జోరు పెంచాయి. అయితే ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. పిఠాపురం (Pithapuram) నుంచి ఎమ్మెల్యే బరిలో ఉన్న ఆయన.. భారీ మెజారిటీతో గెలుస్తారనే అంచనాలు ఉన్నాయి. పవన్ కి మద్దతుగా ఇప్పటికే పలువురు మెగా హీరోలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. తాజాగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind) సైతం పవన్ కి తన మద్దతుని తెలిపారు. దర్శకరత్న దాసరి నారాయణరావు 77వ జయంతిని పురస్కరించుకుని శిల్పకళావేదికలో డి.ఎన్.ఆర్. ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అల్లు అరవింద్.. పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలకి చేశారు. దాసరి గారు లేకుండా తన కెరీర్ లేదని అరవింద్ తెలిపారు. అలాగే, "ఆయనకు అత్యంత ఆప్తుడైన పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నాడు. గురువు గారి దీవెనలు పవన్ కు తప్పకుండా లభిస్తాయని ఆశిస్తున్నాను" అన్నారు అరవింద్.
లవర్స్ అయినా లవ్ ని వదిలేసే  ఛాన్స్ ఉంది గాని  సినీ లవర్స్  మాత్రం సినిమాని వదిలిపెట్టరు. ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. పైగా రోజు వారి  పనుల్లో ఎంత  బిజీగా ఉన్నా సరే  కొత్త సినిమాల రిలీజ్ గురించి ఎంక్వయిరీ చేస్తుంటారు. పైగా ఓటిటి కూడా తోడవ్వడంతో వాళ్ళని ఆపడం ఎవరి తరం కావడం లేదు. వాళ్ళందరి కోసం ఈ వారం థియేటర్స్, ఓటీటీ లో సందడి చెయ్యబోతున్న సినిమాల లిస్ట్ ఉంచుతున్నాం. మే 10 న  థియేటర్లలో.. 1. కృష్ణమ్మ: సత్యదేవ్‌ కథానాయకుడిగా వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వంలో  తెరకెక్కగా  అతిరా రాజ్ హీరోయిన్ గా చేసింది.  2. ప్రతినిధి 2 : నారా రోహిత్‌ కథానాయకుడిగా టీవీ 5  మూర్తి దర్శకత్వం వహించాడు. పక్కా పొలిటికల్‌ మూవీ. 3. జితేందర్‌రెడ్డి: విరించి వ‌ర్మ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ.రాకేష్ వర్రే, రియా సుమన్ లు నటించారు   అలాగే 'ఆరంభం', హాలీవుడ్ మూవీ 'కింగ్ డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' కూడా మే 10న విడుదల కానున్నాయి.  ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు: నెట్‌ఫ్లిక్స్‌ : బోడ్కిన్‌ (వెబ్‌సిరీస్‌) - మే 09 మదర్‌ ఆఫ్‌ ది బ్రైడ్‌ (హాలీవుడ్ మూవీ - మే 09 థాంక్యూ నెక్ట్స్‌ (వెబ్‌సిరీస్‌) - మే 09 అమెజాన్‌ ప్రైమ్‌: ఆవేశం(మలయాళం) - మే 09 ది గోట్‌(వెబ్‌ సిరీస్‌) - మే 09 జీ5 : 8ఏఎం. మెట్రో (హిందీ) - మే 10 డిస్నీ+హాట్‌స్టార్‌: ఆల్‌ఆఫ్‌ అజ్‌ స్ట్రేంజర్స్‌ (హాలీవుడ్‌) - మే 08 సోనీలివ్‌: అన్‌ దేఖీ 3 (హిందీ సిరీస్‌) - మే 10  లయన్స్‌ గేట్‌ప్లే: ది మార్ష్‌ కింగ్స్‌ డాటర్‌ (హాలీవుడ్) - మే 10 ఆపిల్‌ టీవీ ప్లస్‌: డార్క్‌ మేటర్‌ (వెబ్‌సిరీస్) - మే 08  హాలీవుడ్‌ కాన్‌ క్వీన్‌ (వెబ్‌సిరీస్‌) - మే 08  మాక్స్‌టన్‌ హాల్‌ (వెబ్‌సిరీస్‌) - మే 09   
It is known that megastar Chiranjeevi recently released the teaser of the movie "Bhaje Vaayu Vegam" starring hero Kartikeya Gummakonda, produced under the prestigious UV Concepts banner by production company UV Creations.  Continuing the momentum, the makers have announced that the first song of the film, 'Set Ayyindhe', is going to be released on the May 9th at 9:09 AM. Saraswati Putra Ramajogaiah Shastry wrote the lyrics for this mass beat song composed by Radhan. Karthikeya and Iswarya Menon will impress with a hook step that could go viral in this song. Rahul Tyson, famed from Happy Days, plays a pivotal role in "Bhaje Vayu Velya". The movie is directed by Prashant Reddy Chandrapu, with Ajay Kumar Raju.P acting as co-producer. The film’s theatrical release date and trailer date are going to be announced soon.
Malayalam star Prithviraj Sukumaran's movie "The Goat Life" is released in Malayalam, along with Hindi, Telugu, Tamil, and Kannada languages on March 28th and received good success. Based on Benjamin's novel "Goat Days," the film is directed by award-winning director Blessy and produced by Visual Romance banner as a prestigious project in the Malayalam film industry. Prithviraj Sukumaran is one of the best actor and dedicated too. He gave his life for the Najeeb role. He travelled with the film for 16 years. Prithviraj’s efforts are getting paid off as the movie became the fastest 100 crore grosser in Mollywood history. The film collected almost 150 crores in its theatrical run. Even though, the film didn't get the deserved appreciattion in Telugu, it collected well in other languages. Now, the latest we hear is that the film will be available for streaming in Telugu, Tamil, Malayalam, Hindi and Kannada from May 26th.
The movie "Aarambham," featuring Mohan Bhagath, Supritha Satyanarayan, Bhushan Kalyan, and Ravindra Vijay in pivotal roles, is being produced by Abhishek Viti under the banner of AVT Entertainment and directed by Ajay Nag V. "Aarambham," a film touted as a distinctive thriller trailer was impressed everyone. Packed with mysterious elements, compelling storylines and powerful performers, the film promises a seat edge thriller. Impressed with the trailer, the passionate producer and distributor Dheeraj Mogilineni is releasing the film across AP and TS on May 10th. This is a huge boost for the film. The movie team is planning to release "Aarambham" in theaters on May 10th. Srinjith Yerramilli is the music director while Devdeep Gandhi Kundu is handling the cinematography.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కలిసి నటిస్తే చూడాలనేది మెగా అభిమానుల ఆశ. ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకుంటే.. బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనడంలో సందేహం లేదు. అయితే త్వరలోనే చిరంజీవి, పవన్ కళ్యాణ్ తెరను పంచుకొని, అభిమానులను ఖుషీ చేసే అవకాశముందని తెలుస్తోంది. చిరంజీవి కథానాయకుడిగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'విశ్వంభర' (Vishwambhara) . యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ లో త్రిష కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా 2025, జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అతిథి పాత్రలో మెరవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిడివి తక్కువైనప్పటికీ, కథని మలుపు తిప్పే కీలక పాత్ర కావడంతో.. పవన్ ని రంగంలోకి దింపుతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజమైతే మాత్రం, వచ్చే సంక్రాంతికి థియేటర్లలో అసలుసిసలైన మెగా మాస్ జాతర చూస్తాం అనడంలో డౌట్ లేదు. కాగా, గతంలో చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'శంకర్ దాదా జిందాబాద్' చిత్రంలో పవన్ ఒక పాటలో సందడి చేశారు.
మంచు విష్ణు చారిత్రాత్మక  మూవీ క‌న్న‌ప్ప‌ మీద అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.పరమేశ్వరుడి కి భక్తితో తన రెండు కళ్ళని సమర్పించిన  భక్త కన్నప్ప  జీవిత కథ ఆధారంగా ఆ చిత్రం తెరకెక్కుతుంది. మొట్టమొదటి సారిగా విష్ణు  పాన్ ఇండియా హీరోగా కూడా  మారబోతున్నాడు.పైగా తన కెరీర్ లోనే ఫస్ట్  హై బడ్జట్ మూవీ కూడా. తాజాగా ఒక ఆర్టిస్ట్ కి సంబంధించిన  రెమ్యునరేషన్ న్యూస్ కన్నప్ప రేంజ్ ని చెప్తుంది బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కన్నప్ప లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ వార్త చాలా సార్లు సోషల్ మీడియాలో వచ్చింది.పైగా విష్ణు ముంబై వెళ్లి అక్షయ్ కుమార్ ని కలిసాడు కూడా. ఇక తాజా వార్తల ప్రకారం  అక్షయ్ కుమార్  కన్నప్పలో  శివుడిగా కనిపించబోతున్నాడనే టాక్ వస్తుంది. ఈ మేరకు  తన పాత్రకు సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ అయ్యిందని అంటున్నారు.  ఇందుకు గాను అక్షయ్  అక్షరాలా ఆరు కోట్లు రూపాయిల  రెమ్యునరేషన్ ని అందుకున్నట్లు తెలుస్తుంది.ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచింది. గతంలో శివుడి క్యారక్టర్ ని  ప్రభాస్ పోషిస్తాడనే  వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో అక్షయ్ న్యూస్ ప్రాధాన్యతని కూడా సంతరించుకుంది. కానీ ప్రభాస్  మాత్రం  ఖచ్చితంగా సినిమాలో ఉన్నాడని యూనిట్ చెప్తుంది. మ‌ల‌యాళ స్టార్ హీరో మోహ‌న్ లాల్ ఆదివాసీ తెగ‌కు సంబంధించిన  పాత్ర‌లో  మెర‌వ‌నున్నాడు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. విష్ణు,మోహన్ బాబు తమ సొంత బ్యానర్లో కన్నప్ప ని నిర్మిస్తుండగా  ముకేశ్ కుమార్ సింగ్  దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రీతి ముకుందన్ కథానాయిక   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత అయిన జంధ్యాల. ఈయన నవ్వు గురించి చెప్పినప్పుడు ఆ నవ్వు ప్రాముఖ్యత ప్రజలకు అంతగా తెలియలేదు. కానీ ఇప్పుడూ లాఫింగ్ క్లబ్బులు పెట్టుకుని మరీ నవ్వేస్తున్నారు. నవ్వు ఓ గొప్ప ఔషధం అని వైద్యులు కూడా క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నారు. ఒక చిన్న నవ్వుతో ఎలాంటి వారిని అయినా గెలవచ్చు, ఎంత కఠిన హృదయం గలవారిని అయినా మార్చేయచ్చు అంటారు. అసలు నవ్వుకు ఇంత గొప్ప శక్తి ఉందంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నవ్వుకున్న గొప్పదనాన్ని గుర్తుచేసుకుంటూ, నవ్వుతో ప్రపంచాన్ని కాస్తో కూస్తూ మార్చాలనే తపనతో ప్రతి ఏడాది నవ్వుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు కూడా. ఒక మనిషి జీవితంలో నవ్వు ఎంత మార్పు తెస్తుందో.. ఎలాంటి మార్పు తెస్తుందో కాసింత వివరంగా తెలుసుకుంటే ఔషధం.. నవ్వును ఔషధం అంటుంటే చాలామందికి కామెడీగా అనిపిస్తుంది కానీ ఇది అక్షరాలా నిజం. సైన్సే కూడా ఇదే నిజమని చెప్పింది. నవ్వినప్పుడు శరీరంలో విడుదల అయ్యే హ్యాపీ హార్మోన్లు మనిషికి ఉన్న ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటి మానసిక రుగ్మతలను సులువుగా తగ్గిస్తుంది. అందుకే నవ్వును ఔషధం అన్నారు. ప్రతి రోజూ ఉదయాన్నే ఎలాంటి సంకోచం లేకుండా కొన్ని సెకెన్ల నుండి నిమిషాల పాటూ  అలా పెదవులు సాగదీసి నవ్వితే ఇక ఆ రోజంతా చాలా హ్యాపీ మూమెంట్లోనే గడిచిపోతుంది. పాజిటివ్.. మనిషి జీవితంలో పాజిటివ్, నెగిటివ్ అంటూ రెండూ ఉన్నాయి. పాజిటివ్ ఆలోచనలు మనిషి జీవితంలో ఉన్నతికి తోడ్పడతాయి. నెగిటివ్ ఆలోచనలు ఉంటే మనిషి పతనానికి కారణం అవుతాయి. పాజిటివ్ వైబ్రేషన్ ను కలిగించడంలో నవ్వుదే కీలక  పాత్ర. ఎవరితోనైనా బాగా గొడవ పడినప్పుడు వారితో విభేదాలు వచ్చినప్పుడు ఇక వారితో మాట్లాడకుండా ఉండిపోతారు. కానీ వారు ఎప్పుడైనా తారసపడినప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వి చూడండి. పాత గొడవలు, కలహాలు అన్నీ మర్చిపోయి వారు కూడా తిరిగి నవ్వుతారు. మళ్ళీ బంధం చిగురిస్తుంది. విజయానికి మెట్టు.. నవ్వు విజయానికి తొలిమెట్టు అవుతుంది. నవ్వు వల్ల జీవితంలో ఎంత కష్టాన్ని అయినా సునాయాసంగా అధిగమించగలుగుతారు. ఎక్కడలేని ఓర్పు, సహనం, నవ్వుతో వచ్చేస్తాయి. నవ్వుతూ ఇంకొకరిని ఎంకరేజ్ చేస్తే ఇంకొకరు విజయంలో భాగస్వాములు కూడా అవుతారు. సంబంధాలు.. పైన చెప్పుకున్నట్టు.. మనుషుల మధ్య ఎలాంటి సమస్యలున్నా నవ్వు పరిష్కరిస్తుంది. ఎంత గొడవ వచ్చినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నవ్వుతూ సర్థి చెప్పడం వల్ల పెద్దగా మారాల్సిన గొడవలను చిన్నగా ఉండగానే పరిష్కరించుకోవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతరులు, ఆఫీసులో కొలీగ్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే నవ్వు వల్ల బలంగా ఉండే బంధాలు బోలెడు.                                                   *నిశ్శబ్ద.
మీ ఆసక్తి, వ్యక్తిత్వానికి సరిపోయే వృత్తిని ఎంచుకోవడం వ్యక్తిగత వృద్ధికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. జీవితంలో చాలా సార్లు డబ్బు కంటే ఆనందం, శాంతి ముఖ్యం. కాబట్టి, మీ అభిరుచులు, లక్షణాలను సరిగ్గా తెలుసుకుని కెరీర్‌ను ఎంచుకోండి. అందరూ ఇంజినీరింగ్ చేయలేరు. అందరూ డాక్టర్, లాయర్, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ కాలేరు. ప్రతి ఒక్కరూ బికామ్ లాగా కనీసం బ్యాచిలర్ డిగ్రీని కామర్స్‌లో పూర్తి చేయలేరు. మీరు ఏది చదివినా...అది జీవనోపాధి కోసమే పని చేయాలి. చాలామంది కొన్ని మంచి కోర్సులు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. చదువు తర్వాత ఉపాధిపరంగా కొన్ని కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ఉద్యోగం పొందడం సులభతరం చేసే అనేక విద్యా కోర్సులు ఉన్నాయి. కానీ, ఉద్యోగ సంతృప్తి కోసమే కాదు, వ్యక్తిత్వాన్ని కూడా వికసించాలి. చేసే పనిలో శాంతి ఉండాలి. అలా ఉండాలంటే మన వ్యక్తిత్వం, గుణం, స్వభావం, అభిరుచికి తగ్గట్టుగా ఉద్యోగం చేయాలి. ఈమధ్య ఈ కాన్సెప్ట్ బాగా పాపులర్ అయినప్పటికీ ఉద్యోగం సంపాదించాలనే కోరికతో ఏదో ఒకటి చేసేవాళ్ళు ఎక్కువ. దాంతో మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఏ వృత్తిని ఎంచుకున్నా మంచి వ్యక్తిత్వం ఉండాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. కానీ, ప్రస్తుతం అన్ని చోట్లా పోటీ నెలకొంది. అందువల్ల, చాలా మంది యువకులకు కెరీర్‌ను ఎంచుకోవడం డైలమాగా మారింది. అయితే ఉద్యోగం వస్తే చాలు అని ఆలోచించడం కంటే మీ అభిరుచికి, వ్యక్తిత్వానికి అనుగుణంగా ఉద్యోగాన్ని ఎంచుకోవడం సరైనది. దీని కోసం చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే మీ ఆసక్తుల గురించి స్పష్టంగా తెలుసుకోవడం. మీ సామర్థ్యాలను తెలుసుకోండి. మీరు మీ విలువలు, వ్యక్తిత్వానికి సరిపోయే ఉద్యోగాన్ని ఎంచుకుంటే విజయం సులభం అవుతుంది. ఏది నచ్చదు? మీకు నచ్చని వాటిని గుర్తించడం ఎంత ముఖ్యమో, మీకు ఏది ఇష్టమో గుర్తించడం కూడా అంతే ముఖ్యం. నలుగురితో కాలక్షేపం చేయనివారు మార్కెటింగ్ ఉద్యోగానికి సరిపోరు. నేడు సాధారణ విద్యను అభ్యసించిన వారికి అనేక రకాల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వాటిలో ఏది మీరు ఆనందించగలరో ఆలోచించండి. ఏది కష్టమో గ్రహించండి. బలహీనతలు ఏమిటి? ఒక వ్యక్తి ఎంత అవగాహన పెంచుకున్నా, కొన్ని స్వాభావిక గుణాలు పోవు. ఉదాహరణకు..మీది ఒంటరిగా ఉండే మనసతత్వం అయితే...ఒంటరిగా నిర్వహించగల ఉద్యోగం సరిపోతుంది. గ్రూప్ వర్క్ కు దూరంగా ఉండటం మంచిది. మీరు ఏ స్వభావాన్ని మార్చుకోలేరు అనేది మీ బలహీనత అని చెప్పవచ్చు. వాటిని గుర్తించండి. కార్యాలయంలో వారితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోండి. ఇలా చేయడం వల్ల లక్ష్యాన్ని చేరుకోవడం సులభం అవుతుంది. ఎక్కడ ఫిట్‌గా ఉంది..  కేవలం జీతం కోసం  ఇష్టం లేని ఉద్యోగం చేయనక్కర్లేదు. జీతం తక్కువే అయినా.. వేరే ఉద్యోగంలో ఆసక్తి ఉంటే.. ఆనందంగా అనిపిస్తే అక్కడికి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయవచ్చు. అయితే, ఎవరైనా ఆసక్తిని పదేపదే మార్చకూడదు. ఇది కాదు. ఒక నిర్దిష్ట వృత్తిలో ఒక సముచిత స్థానాన్ని కనుగొనాలి. అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు.
ప్రతి వ్యక్తి జీవితాన్ని పెళ్లికి ముందు, పెళ్ళి తర్వాత అని చాలా స్పష్టంగా విభజించి చెప్పవచ్చు.  ఎందుకంటే పెళ్లికి ముందు ఉన్న చాలా విషయాలు పెళ్ళి తర్వాత మారిపోతాయి. మరీ ముఖ్యంగా ఈ జనరేషన్లో  అమ్మాయిలు, అబ్బాయిలు వ్యక్తిత్వం పరంగా చాలా ఆత్మగౌరవం కలిగి ఉంటారు. ఏ చిన్న విషయాల్లోనూ రాజీ పడటానికి సిద్దంగా ఉండరు. ఈ కారణంగా ఇప్పటి కాలంలో పెళ్లవుతున్న వారి మధ్య గొడవలు, విడాకులు ఎక్కువ. పెళ్లయ్యాక భార్యాభర్తలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నా, వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ పెద్ద గొడవలకు దారి తీయకుండా సింపుల్ గా పరిష్కారం కావాలన్నా కొన్ని గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వాలి. రిలేషన్షిప్ నిపుణులు చెప్పిన ఆ గోల్డెన్ రూల్స్ ఏంటో తెలుసుకుంటే.. పెళ్ళి తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. అమ్మాయిలకు అయినా, అబ్బాయిలకు అయినా భాద్యతలు పెరుగుతాయి. ఇల్లు, ఉద్యోగం, స్నేహితులు, ఇతర పనులలో భార్యాభర్తలు ఒకరినొకరు నిర్లక్ష్యం చేయకూడదు. ఎన్ని పనులున్నా సరే.. భార్యాభర్తలిద్దరూ కొంతసమయం కేటాయించుకోవాలి.  కలసి మాట్లాడుకోవడం, కలసి భోజనం చేయడం, కలసి చర్చించడం,  ప్రతిరోజూ కనీసం గంటసేపు అయినా మాట్లాడాలనే నియమం పెట్టుకోవాలి. ఇలా చేస్తే వారి మధ్య  ఏ సమస్యలున్నా వాటిని మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు. అందుకే ఒకరికోసం ఒకరు సమయం కేటాయించుకోవడం ఎంతో ముఖ్యం. పెళ్ళికి ముందు కాబోయే జంట ఒకరి పట్ల మరొకరు చాలా ప్రేమగా ఉంటారు. ఒకరిని మరొకరు బుజ్జగించుకోవడం, ప్రేమ కురిపించడం, చాలా కేరింగ్ గా ఉండటం చేస్తారు. అయితే చాలామంది జీవతాలను గమనిస్తే పెళ్ళి తర్వాత ఈ సీన్ మొత్తం మారిపోతుంది.  కానీ ఇలా చేయడం మంచిది కాదు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు ప్రేమగా ఉండాలి. ఒకరి మీద మరొకరు అరుచుకోవడం, గొంతు పెంచి మాట్లాడటం వల్ల ఇద్దరి మధ్య  గొడవకు దారితీస్తుంది. భార్య చేసే ఏ పని అయినా భర్తకు నచ్చితే భార్యను మెచ్చుకోవడం అస్సలు మిస్ కాకూడదు.   భార్య వంట నచ్చినా, ఆమె ఇంటి పనిలో చలాకీగా ఉన్నా,  భర్తకు ప్రేమగా వడ్డించినా, ఇంటి పనిని, ఆఫీసు పనిని ఆమె సమర్థవంతంగా  బ్యాలెన్స్ చేస్తున్నా ఇలా ఏం చేసినా సరే భార్యను మెచ్చుకోవడానికి అస్సలు మొహమాటపడకూడదు. అలాగే  భర్త ప్రేమగా ఏం చేసినా భర్త వృత్తి, వ్యక్తిగతంగా ఏం చేసినా దాన్ని భార్య కూడా మెచ్చుకోవాలి. ఇలా చేస్తే భార్యాభర్తలకు ఒకరి మీద మరొకరికి ప్రేమ పెరుగుతుంది. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా మాట్లాడే తీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిని మరొకరు ఎలా మాట్లాడుతున్నారు అనేది వారి మధ్య బంధాన్ని నిర్ణయిస్తుంది. ఒకరితో ఒకరు మాట్లాడటం, ఒకరి మనసులో విషయాలు మరొకరితో షేర్ చేసుకోవడం, ఒకరు చెప్పేది మరొకరు శ్రద్దగా వినడం ఇవన్నీ బంధం పదిలంగా ఉండటానికి అవసరం. భార్యాభర్తల బంధం అంటే ఇక ఒకరి జీవితం మరొకరు చేతుల్లోకి వెళ్లినట్టే అని అనుకుంటారు కొందరు. కానీ భార్యాభర్తలు అలా ఉండకూడదు. స్పేస్ అనేది చాలా ముఖ్యం. స్పేస్ లేకపోతే బంధం కష్టంగా అనిపిస్తుంది. భాగస్వామి జీవితాన్ని మరీ గట్టిగా బంధించినట్టు, తనకు అన్ని విషయాలు తెలియాలి అన్నట్టు ఉండకూడదు. ముఖ్యంగా కంట్రోల్ చేయడం, కమాండ్ చేయడం అస్సలు మంచిది కాదు. ఎవరి సొంత అభిప్రాయాలు, ఆలోచనలు, సంతోషాలు వారికి ఉండటం మంచిది.                                             *రూపశ్రీ. 
టమోటా భారతీయ వంటల్లో తప్పనిసరిగా.. ఎక్కువగా వాడే కూరగాయ. దీన్ని కూరగాయ అంటుంటాం కానీ టమోటా పండుగానే పిలవబడుతుంది. ఉల్లిపాయ తర్వాత వంటల్లో లేకపోతే అస్సలు బాగోదు అనుకునే కూరగాయ టమోటానే..  అయితే టమోటాను వంటల్లో వాడటం కాకుండా జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిదని, అది కూడా సమ్మర్ లో అయితే దీనివల్ల బోలెడు ప్రయోజనాలుంటాయని అంటున్నారు ఆహార నిపుణులు.. టమోటా జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓ లుక్కేస్తే.. సాధారణంగా కూరల్లో మాత్రమే వాడే టమోటా ఇప్పటికే కెచప్ రూపంలో చాలా విరివిగా వినియోగించబడుతోంది. కొందరికి దీని కెచప్ లేకపోతే అస్సలు గడవదంటే అతిశయోక్తి కాదు. కానీ ఇది నిజమే.. టమోటా సూప్, టమోటా కెచప్, టమోటా ఉరగాయ.. ఇలా చెప్పుకుంటూ పోతే టమోటా పాత్ర చాలానే ఉంది. టమోటా జ్యూస్ చేసుకుని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. టమోటా  లో విటమిన్-సి అధికంగా ఉంటుంది. శరీరం ఐరన్ గ్రహించడంలో ఇది సహాయపడుతుంది. ఇక ఇందులో ఉండే విటమిన్-కె పునరుత్పత్తి ఆరోగ్యాన్ని బలంగా ఉంచుతుంది. టమోటాలు ఆహారంలో భాగంగా తీసుకున్నా, టమోటా జ్యూస్ తాగుతున్నా పిల్లలు పుట్టడంలో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. టమోటాలలో లైకోపీన్, బీటా కెరోటిన్, గామా కెరోటిన్ మొదలైనవి ఉంటాయి. గుండె సంబంధ సమస్యలను తగ్గించడంలో ఇవి చాలా బాగా  సహాయపడతాయి. వేసవిలో టమోటా జ్యూస్ తాగుతుంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్ లలో సోడియం ఒకటి.   ఈ సోడియం కండరాల మరమ్మత్తులకు, సెల్ కమ్యూనికేషన్ కు చాలా అవసరం. టమటాలలో ఈ సోడియం ఉండటం మూలానా టమోటా జ్యూస్ తీసుకుంటే కండరాలు, సెల్ కమ్యూనికేషన్ ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పట్లో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. బరువు  తగ్గాలని అనుకునేవారు టమోటా రసాన్ని తీసుకుంటే శరీరంలో కొవ్వు కరిగించి బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. కొందరు పోషకాహారం తీసుకున్నా శరీరంలో తగినంత శక్తి లేక ఇబ్బంది పడుతుంటారు. అయితే తీసుకునే పోషకాలను శరీరం సరిగా గ్రహించలేకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. కానీ  ఖాళీ కడుపుతో టమోటా జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాల శోషణ పెరుగుతుంది. టమోటా జ్యూస్ కేవలం ఆరోగ్య ప్రయోజనాలనే కాదు.. శరీరాన్ని డిటాక్స్ చేసే మంచి డిటాక్స్ డ్రింక్ గా కూడా పనిచేస్తుంది. శరీరంలో విషాలు తొలగించడంలో సహాయపడుతుంది. రోజూ టమోటా జ్యూస్ తీసుకుంటే శరీరం శుద్ది అవుతుంది.  టమోటాలలో జీర్ణ ఎంజైమ్ లు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల  జీర్ణవ్యవస్థకు మంచి టానిక్ లాగా పనిచేస్తుంది. కడుపుకు సంబంధించిన సమస్యలు,  జీర్ణ ఇబ్బందులు ఉన్నవారు టమోటా జ్యూస్ తీసుకుంటే చక్కని ఉపశమనం ఉంటుంది.                                                                *రూపశ్రీ.
డ్రై ఫ్రూట్స్ అందరికీ ఇష్టమైనవి. ఖరీదు ఎక్కువని కొందరు వీటిని దూరం పెడతారు కానీ పండుగలు, శుభకార్యాలప్పుడు వంటల్లో డ్రై ప్రూట్స్ తప్పక ఉండాల్సిందే. డ్రై ఫ్రూట్స్ లో ఎండు ద్రాక్షకు చాలా ప్రత్యేకత ఉంది. ఎండుద్రాక్షను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి మరుసటిరోజు ఉదయాన్నే నానిన ఎండు ద్రాక్షలు తిని ఆ నీటిని తాగడం వల్ల  చాలా ప్రయోజనాలు కలుగుతాయని, మరీ ముఖ్యంగా వేసవి కాలంలో ఎండుద్రాక్షనీరు తాగడం మంచిదని అంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు ఎండు ద్రాక్ష నీరు వేసవి కాలంలో తాగితే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. ఎండుద్రాక్షలో ప్రోటీన్, ఫైబర్, ఇనుము, పొటాషియం, రాగి, విటమిన్ B6 మరియు మాంగనీస్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.ఎండుద్రాక్ష నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.  టైప్ 2 డయాబెటిస్,  అల్జీమర్స్ వ్యాధి వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తాయి. ఎండుద్రాక్ష తినడం వల్ల రక్తంలో యాంటీఆక్సిడెంట్ స్థాయిలు పెరుగుతాయని,  మెదడు పనితీరు మెరుగుపడుతుందని నమ్ముతారు. ఎండుద్రాక్ష నీరు ఐరన్  లోపం వల్ల కలిగే  రక్తహీనత వంటి పరిస్థితులను నివారిస్తుంది.  అలసట, శ్వాస ఆడకపోవడం, చర్మం సున్నితంగా మారడం, బలహీనత వంటి లక్షణాలు రక్తహీనత ఉన్నవారిలో ఉంటాయి. ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఎండుద్రాక్ష నీరు త్రాగడం మంచిది.  ఎందుకంటే ఇది కడుపులోని యాసిడ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.  ఇది పేగు పనితీరును మెరుగుపరచడంలో,  పేగులోని బ్యాక్టీరియాను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందుకే ఎండుద్రాక్ష నీరు  పొట్ట ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎండుద్రాక్ష నీరు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది.  జుట్టు రాలడం సమస్యను నివారిస్తుంది. అందువల్ల జుట్టు రాలే సమస్యతో బాధపడే వారికి ఇది మేలు చేస్తుంది.                                             *రూపశ్రీ.