ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వేళ నేతల ప్ర‌చారం హోరెత్తుతోంది. రాష్ట్రం న‌లుమూల‌లా అభ్య‌ర్థులు గెలుపుకోసం ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి ఓట్లు అభ్య‌ర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్త‌యితే గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌, మేధావి వ‌ర్గ‌మూ ఎక్కువే. అలాంటి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో  తెలుగుదేశం అభ్య‌ర్థి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. విజ‌యం ఎప్పుడో ఖాయం కాగా.. ఇప్పుడు పెమ్మసాని మెజారిటీపైనే  రాష్ట్రం వ్యాప్తంగా చ‌ర్చ‌ జరుగుతోంది బుర్రిపాలెం బుల్లోడుగా ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ముద్ర వేసుకున్న పెమ్మ‌సాని.. త‌న‌దైన శైలిలో ప్ర‌జ‌ల్లోకి వెళ్తూ ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు పట్టిస్తున్నారు. గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా కిలారు రోశ‌య్య బ‌రిలో ఉన్న‌ప్ప‌టికీ.. పెమ్మ‌సాని దూకుడుకు ఫ్యాన్ ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతున్నారు.  విద్యాభ్యాసంలోనూ, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ, యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌డంలోనూ, నీతివంత‌మైన పాల‌న అందించే విష‌యంలో.. ఇలా ఏ అంశంలో తీసుకున్నా వైసీపీ అభ్య‌ర్థికి అంద‌నంత ఎత్తులో పెమ్మ‌సాని ఉన్నారన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తీ లేదు. అమెరికాలో వైద్య విద్య అధ్యాపకుడిగా, ఫిజిషియన్‌గా  సేవలందించిన పెమ్మసాని.. వ్యాపార రంగంలోనూ అగ్ర‌స్థానాల‌కు చేరుకున్నారు. అమెరికాలో ఉన్న‌ప్ప‌టికీ త‌న సొంత ప్రాంతానికి సేవ చేయాల‌న్న ఉద్దేశంతో  పెమ్మసాని ట్రస్టు ఏర్పాటు చేసి..  పేద ప్రజలకు అండ‌గా నిలుస్తూ వ‌స్తున్నారు. ముక్కుసూటి త‌నం.. ఎలాంటి స‌మ‌స్య‌నైనా ఓపిగ్గా ప‌రిష్క‌రించే త‌త్వం.. ప్ర‌జ‌ల‌కు నిత్యం అండ‌గా నిలిచే స్వ‌భావం.. ఇలా అన్నివిధాల పెమ్మసానే మాకు స‌రైన నేత‌ అంటూ గుంటూరు పార్ల‌మెంట్ నియోజకవర్గ ప్ర‌జ‌లు ఆయనకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.  పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ , కిలారు రోశ‌య్య‌ల‌ను ప‌లు అంశాల్లో  పోల్చి చూస్తున్న  జనం అన్ని విధాల పెమ్మ‌సానే  బెట‌ర్ ఛాయిస్.. కాదు కాదు బెస్ట్ చాయిస్ అంటూ ముక్త‌కంఠంతో చెబుతున్నారు.   విద్యార్హ‌తల విష‌యంలో..  కూటమి మ‌ద్ద‌తుతో గుంటూరు పార్ల‌మెంట్‌  నియోజకవర్గ బ‌రిలో నిలిచిన తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వైద్యునిగా అత్యున్నత స్థానం సాధించారు. 1976 మార్చి 7న గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెంలో జ‌న్మించిన పెమ్మ‌సాని.. డాక్టర్ కావాలనే కలతో 1993-94లో ఎంబీబీఎస్‌ ఎంట్రన్స్‌లో 27వ  ర్యాంకు సాధించి హైదరాబాద్‌ ఉస్మానియాలో మెడిసిన్ పూర్తి  చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 2000 సంవ‌త్స‌రంలో అమెరికాకు వెళ్లిన ఆయన.. పీజీ పూర్తి చేసి అక్కడే ప్రపంచవ్యాప్తంగా పేరున్న‌ జాన్ యూనివర్సిటీలో ఐదేళ్లపాటు టీచింగ్ ఫ్యాకల్టీగా కొనసాగారు. ఈ రంగంలో అనేక మంది వైద్య విద్యార్థులకు మెటీరియల్ అందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు. వ్యాపార రంగంలోనూ రాణించి అమెరికాలో ఒక ఎంటర్ పెన్యూయర్గా ఎదిగారు. మ‌రోవైపు వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్య విద్యాభ్యాసం చూస్తే డిగ్రీ బీకాం చదివారు. యువ‌త‌కు విద్యాప‌రంగా ఆయ‌న ఎలాంటి స‌హాయ‌క స‌హ‌కారాలు అందించిన దాఖలాలు లేవు. సేవా కార్య‌క్ర‌మాల్లో..  పెమ్మ‌సాని చంద్రశేఖర్ అమెరికాలోనూ, గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేశారు. పెమ్మసాని ఫౌండేషన్‌ ను ఏర్పాటు చేసి   ఉచిత వైద్య సేవలు అందించ‌డంతోపాటు.. వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు. వ్యాపార రంగంలోనూ రాణించిన ఆయన తన పుట్టిన గడ్డకోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్వదేశానికి వ‌చ్చారు. పల్నాడు ప్రాంత వాసుల ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను తీర్చేశారు. ఈ క్రమంలో వందల సంఖ్యలో బోర్‌వెల్స్‌, ఆర్‌వోప్లాంట్స్‌ ఏర్పాటు చేశారు. అంతేకాదు.. గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందించేలా బెస్ట్ బెరీ స్కూల్ ను ప్రారంభించారు.  దీనికితోడు పెమ్మసాని ట్రస్టు ఏర్పాటు చేసి పేద ప్రజలకు, స్వచ్చంద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇక వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య  విషయానికి వస్తే ఆయన ఇప్పటి వరకు విద్యా పరంగా చేసిన సేవలు లేవు. వ్యాపార రంగంలో ఉన్నప్పటికీ యువతకు ఉపాధి, విద్యావకాశాలు కల్పించిన దాఖలాలు లేవు. ఐదేళ్ల కాలంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న పొన్నూరు నియోజకవర్గంలో ఎక్కడా నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదు. రాజ‌కీయ రంగంలో..  పెమ్మసాని చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీలో కొన‌సాగారు.  పెమ్మ‌సానికి చంద్రబాబు అంటే చాలా ఇష్టం. చంద్రబాబు సీఎం హోదాలో అమెరికాలో పర్యటించిన‌ వేళ అక్కడ ఏర్పాటు చేసిన సమావేశాలకు పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ఆ సమయంలోనే చంద్రబాబుతో ముఖాముఖి పరిచయం ఏర్పడింది. అలా రాజకీయాలపై మరింత ఆసక్తి పెంచుకొని  తెలుగుదేశం బ‌లోపేతానికి చంద్ర‌బాబుతో కలిసి పని చేయడం ప్రారంభించారు.  2014లోనే తెలుగుదేశం నుంచి నర్సరావుపేట లోక్‌సభ టిక్కెట్‌ కోసం ప్రయత్నించారు.  కానీ, 2014, 2019లో అవ‌కాశం ద‌క్క‌లేదు. గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు విరామం తీసుకోవడంతో చంద్రబాబు మరో ఆలోచన లేకుండా ఆ స్థానంలో పెమ్మసానికి టికెట్ ఇచ్చారు.   దీంతో గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పెమ్మ‌సాని తొలిసారి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు.  కిలారు రోశ‌య్య విష‌యానికి వ‌స్తే.. పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కిలారి రోశయ్యకు ఆ స్థానంలోనే  మ‌రోసారి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిరాక‌రించింది. గుంటూరు ఎంపీ అభ్య‌ర్థులుగా వైసీపీ అధిష్టానం ఇద్ద‌రిని బ‌రిలోకి దింపినా వారు పెమ్మ‌సానికి స‌రితూగ‌లేమ‌ని చేతులెత్తేశారు. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో  మరో గత్యంతరం లేక సీఎం జ‌గ‌న్ గుంటూరు పార్ల‌మెంట్ బరిలో  రోశ‌య్య‌ను బ‌రిలోకి దింపారు. ప్రజా సమస్యలపై ఎవరి అవగాహనలో ..  పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుంచీ గుంటూరు నియోజకవర్గ పరిధిలో ప్రతి గడపకూ వెళుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, లాయర్లు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపార వేత్తలు, టీచర్లు, కార్మిక, కర్షక సంఘాల నాయకులతో సమావేశమవుతున్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ నేనున్నాననే భరోసా ఇస్తున్నారు. పేద వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ జీవన ప్రమాణాలను తెలుసుకుంటూ.. వారికి ఆర్థికాభివృద్ధికి తగిన ప్రణాళికలు రచించారు. పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి సమస్యపైనా చర్చిస్తూ పరిష్కార మార్గాలు చెబుతూ పెమ్మ‌సాని గుంటూరు పార్ల‌మెంట్  నియోజకవర్గ ప‌రిధిలోని ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతున్నారు. అంతేకాదు.. అనేక సేవా కార్యక్రమాల‌ను నిర్వ‌హిస్తూ శెభాష్ పెమ్మ‌సాని అనిపించుకుంటున్నారు.   వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య గుంటూరు ప్రాంతంలో జన్మించారు. పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన ప్రజల వద్దకు పెద్ద‌గా వెళ్లింది లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్ని గడపలు ఉన్నాయో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. ప్రజా సమస్యల గురించి అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు.  రోశ‌య్యదీ రాజ‌కీయ నేప‌థ్య కుటుంబమే  అయినా.. ఆయన త‌న రాజకీయ జీవితంలోనూ సొంత నిర్ణ‌యాలు తీసుకున్న దాఖ‌లాలు లేవు. త‌న సామ‌ర్థ్యంతో రాజ‌కీయంగా ఎద‌గ‌లేదు. ఐదేళ్ల కాలంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న పొన్నూరు నియోజకవర్గంలో ఎక్కడా ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించిన పాపాన పోలేదు. ఏపీ రాజ‌ధాని విష‌యంలో..  పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ రాజధాని అమరావతిని అణువణువూ అధ్యయనం చేశారు. రాజధాని ప్రాంతంలో ఐదేళ్ల కాలంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు వివరిస్తూ.. కూట‌మి అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నామ‌ని, ప్రపంచ పటంలో రాజధాని అమరావతిని నిలిపేందుకు పక్కా ప్రణాళికతో కృషి చేస్తామ‌ని గుంటూరు పార్ల‌మెంట్ ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు.  వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో అమరావతి నిర్మాణం గురించి ఎక్కడా ప్రస్తావించడం  లేదు. ఐదేళ్లలో అమరావతిని సీఎం జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తుంటే ఎమ్మెల్యేగా ఉండి అడ్డుచెప్ప‌లేక పోయారు. అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌ను ప్ర‌భుత్వం వేధిస్తుంటే అడ్డుకునే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేదు. ఇప్పటి వరకు అమరావతి ప్రాంతంలో అడుగు కూడా పెట్టలేదు. మూడు రాజధానులు అంటున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అడుగుల‌కు మ‌డుగులొ త్త‌డం త‌ప్పితే.. అమ‌రావ‌తి రాజ‌ధాని గురించి రోశ‌య్య ప‌ట్టించుకున్నదే లేదు. యువ‌త‌కు ఆద‌ర్శం..  పెమ్మసాని చంద్రశేఖర్ వైద్య వృత్తిలో, వ్యాపార రంగంలో రాణించి ప్రపంచమే తన వైపు తిరిగి చూసేలా విజయాలు అందుకున్నారు. పేద ప్ర‌జ‌ల‌కు ,క‌ష్టాల్లో ఉన్న‌వారికి అండ‌గా నిలుస్తూ త‌న ట్ర‌స్ట్ ద్వారా సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ నేటి యువతకు మార్గదర్శకంగా నిలిచారు. అంతేకాదు.. యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించేందుకు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌ను రూపొందించారు.  వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య తన వ్యాపారాల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డార ఆరోపణలు మెండుగా ఉన్నాయి. పదవిని అడ్డు పెట్టుకుని ప్రజా సందపను దోచుకున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏ ఒక్క విష‌యంలోనూ రోశ‌య్య యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలిచేలా ప‌నులు చేయ‌లేదు.  అనేక అంశాల్లో పెమ్మ‌సాని చంద్ర‌శ‌ఖ‌ర్‌, కిలారి రోశ‌య్య‌ను గ‌మ‌నిస్తున్న‌ గుంటూరు పార్ల‌మెంట్  నియోజకవర్గ ప్ర‌జలు  పెమ్మ‌సానికి జై కొడుతున్నారు. భారీ మెజార్టీతో పెమ్మ‌సానికి ప‌ట్టం క‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌ముఖ స‌ర్వేల‌న్నీ పెమ్మ‌సాని మెజార్టీపైనే చ‌ర్చ‌ చేస్తున్నాయి. దీంతో, రాష్ట్ర రాజ‌కీయాల్లో పెమ్మ‌సానికే  అత్య‌ధిక మెజార్టీ అవ‌డం ఖాయ‌మ‌ని  విశ్లేష‌కులు గట్టిగా చెబుతున్నారు. 
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో కారణాలు వున్నప్పటికీ, చాలా ముఖ్య కారణంగా చెప్పుకోవాల్సిన విషయం... రైతుల భూమి హక్కు పత్రం అయిన పట్టాదార్ పాస్ పుస్తకం మీద జగన్ ఫొటో ప్రచురించుకోవడం. తమ పూర్వికులు వారసత్వంగా ఇచ్చిన భూమి, తాము కష్టపడి సంపాదించుకున్న భూమి హక్కు పత్రాల పుస్తకం మీద జగన్ ఫొటో వుండటాన్ని రైతులు మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే వున్నారు. అయితే బాహాటంగా వ్యతిరేకిస్తే వేధించి ఉసురు తీస్తారన్న భయంతో ఇంతవరకు ఎవరూ కిక్కురుమని కూడా అనలేదు. అయితే ఇప్పుడు ఎన్నికల సందర్భంగా రైతులకు తమ పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. తమ పట్టాదార్ పాస్ పుస్తకాల మీద జగన్ ఫొటో పోవాలంటే, జగన్‌ని గద్దెదించడం మినహా మరో మార్గం లేదని రైతులు నిర్ణయించుకున్నారు. ఎక్కడోదాకా ఎందుకూ, జగన్ నియోజకవర్గంలోని పులివెందులలోనే వైసీపీ కార్యకర్త అయిన ఓ రైతు సాక్షాత్తూ భారతి ముందే ఈ విషయంలో నిరసన వ్యక్తం చేశాడంటే ఈ అంశం మీద రైతుల్లో ఎంత వ్యతిరేకత వుందో అర్థం చేసుకోవచ్చు. అలా జగన్ ప్రభుత్వం కూలిపోగానే ఇలా పాస్ బుక్‌లో జగన్ ముఖాన్ని చించేయడానికి రైతులు సిద్ధంగా వున్నారు. పట్టాదార్ పాస్ పుస్తకం మీద జగన్ ఫొటో వుండటం వల్ల రైతుల్లో వ్యతిరేకత బాగా పెరిగిందని వైసీపీ నాయకులకు బాగా అర్థమైంది. రైతుల ఆస్తి మీద కూడా తన ఫొటోను ముద్రించుకోవాలనే దురాశకు రైతులు తగిన గుణపాఠం చెప్పబోతున్నారని తెలుసుకున్న నాయకులు ఇప్పుడు నాలుక్కరుచుకుంటున్నారు. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.
హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని మొఘల్ పురా పోలీస్ స్టేషన్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీద కేసు నమోదైంది.  కాంగ్రెస్ పార్టీ నేత నిరంజన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మీద పోలీసులు కేసు నమోదు చేయటమే కాదు.. ఎఫ్ఐఆర్ ను సిద్ధం చేశారు. అస‌లు కేసు ఏమిటంటే, ఇటీవ‌ల హైదరాబాద్ పాతబస్తీలో అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రోడ్ షో అనంతరం నిర్వహించిన సభలో.. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత మాట్లాడే వేళలో.. కొంతమంది చిన్నారుల్ని తన వద్దకు రమ్మంటూ అమిత్ షా సైగ చేశారని.. దీంతో వారు అమిత్ షా వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ఒక చిన్నారి చేతిలో ఉన్న ప్లకార్డులో కమలంపువ్వు గుర్తు ఉందని.. ఇద్దరు చిన్నారుల చేతుల్లో ఆప్ కీ బార్ 400 సీట్స్ అంటూ రాసి ఉంది.  ఇలా ప్రచారం చేయటం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లుగా కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఎన్నికల కమిషన్ నిబంధనల్ని అమత్ షా ఉల్లంఘించినట్లుగా ఈమొయిల్ ద్వారా కాంగ్రెస్  నేత‌లు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని బీజేపీ పట్టించుకోలేదని.. చిన్నారులతో ప్రచారం చేయించారని కంప్లైంట్ చేశారు.  చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు.  అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ1గా యమాన్ సింగ్.. ఏ2గా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత.. ఏ3గా అమిత్ షా.. ఏ4గా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపైనా కేసు నమోదు చేశారు. ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిపై డీప్ ఫేక్ వీడియో కేసు వెంటాడుతున్న‌ వేళ, అంతే స్థాయిలో అమిత్ షా మీద మరో కేసును సిద్ధం చేసిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రి అమిత్ షా మీద కేసు పెట్టేంత ధైర్యం చేయ‌డం దేశ రాజ‌కీయాల్లోనే ఉత్కంఠ‌గా మారింది.   సి.ఎం. రేవంత్‌రెడ్డి దూకుడుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన పలువురి మీద కేసు నమోదు కావటంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ సైతం ఈ కేసును ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ కు నోటీసులు జారీ చేయటం తెలిసిందే. ఢిల్లీ పోలీసులు సి.ఎం. రేవంత్‌ను అరెస్ట్ చేస్తారా? లేక తెలంగాణా పోలీసులు అమిత్‌షాను అరెస్ట్ చేస్తారా అనే ఉత్కంఠ‌త నెల‌కొంది.
ALSO ON TELUGUONE N E W S
ఫాహద్ ఫాజిల్.. ఈ పేరు తెలియని  తెలుగు సినీ ప్రేమికుడు లేడు. కమల్ హాసన్  విక్రమ్,  అల్లు అర్జున్  పుష్ప లతో టాప్ రేంజ్ లోకి వెళ్ళాడు. దాంతో ఆయన సినిమా కోసం ప్రేక్షకులందరు ఎదురుచూసే పరిస్థితి. గూగుల్ లో కూడా ఆయన అప్ కమింగ్ మూవీస్ గురించి సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక వార్త ఆయన అభిమానుల్లో ఆనందాన్ని నింపుతుంది. ఫాహద్ హీరోగా మొన్న ఏప్రిల్ 11 న  మలయాళంలో రిలీజైన మూవీ ఆవేశం. గ్యాంగ్ స్టార్ రంగా పాత్రలో  సూపర్ గా చేసాడు. ప్రతి ఒక్కళ్ళు ఆయన నటనకి  ఫిదా అయిపోయారు. హిట్ టాక్ ని తెచ్చుకోవడంతో  పాటు 100 కోట్ల క్లబ్ లో కూడా చేరింది. దీంతో  ఆవేశం మూవీ  తెలుగులోకి ఎప్పుడు  డబ్ అయ్యి ఎప్పుడు థియేటర్స్ లోకి అడుగుపెడుతుందా అని ఎదురుచూస్తు ఉన్నారు. కానీ ఆవేశం థియేటర్స్ లో రిలీజ్ కావటం లేదు. డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల అవుతుంది. ప్రముఖ డిజిటల్ ఛానల్ అమెజాన్ ప్రైమ్ ద్వారా మే 9 న విడుదల కానుంది .తెలుగుతో పాటుగా  తమిళ, మలయాళ,కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది ఫాహద్ 2002 లో సినీ రంగ ప్రవేశం చేసాడు. కెయుత్తామ్ దూరత్ ఫస్ట్  మూవీ. కేరళ కేఫ్,కాక్ టైల్, టోర్నమెంట్ ,చప్ప కురీషు, అకం, అన్నయుమ్ రసులం, రెడ్ వైన్, మాన్సూన్ మాంగోస్, లాంటి చిత్రాలు ఆయనకీ స్టార్ డం తెచ్చి పెట్టాయి.ఇప్పటికి వరకు సుమారు యాభై చిత్రాలకి పైనే చేసాడు. లెక్కకు మించి  ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డుల్ని కూడా గెలుచుకున్నాడు. ప్రొడ్యూసర్ గాను చాలా సినిమాలు నిర్మించాడు. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రేమలు కి  ఫాహద్ నే నిర్మాత.ప్రముఖ హీరోయిన్ నజ్రియా నజీమ్ ఎవరో కాదు  ఫాహద్ వైఫ్ నే     
బయోపిక్ లు సిల్వర్ స్క్రీన్ కి కొత్హేమీ కాదు.. దశాబ్దాల నుంచే  ఎంతో మంది గొప్ప వాళ్ళ  బయోపిక్ లు సిల్వర్ స్క్రీన్ మీద మెరిసాయి.మూవీ పర్సన్స్ , స్పోర్ట్స్ మేన్స్ ,పొలిటీషియన్స్  ఇలా చెప్పుకుంటూ పోతే సమాజాన్ని అత్యంత  ప్రభావితం చేసిన వాళ్ళందరి బయోపిక్ లు వచ్చాయి. తాజాగా వీటి సరసన ఇంకోటి చేరబోతోంది. కాకపోతే ఇది  కొంచం స్పెషల్  భారతీయ జనతా పార్టీ  ఉరఫ్  బిజెపికి  అన్ని రాష్ట్రాల్లోను అధ్యక్షులు ఉన్నారు. అలాంటి వారిలో  ఒకరు అన్నామలై. ఈయన  తమిళనాడు రాష్టానికి  అధక్షుడు గా ఉన్నాడు. ప్రాంతీయ తత్వాన్ని అణువణువునా నింపుకున్న తమిళనాడు లో బీజేపీ ఎదగడానికి అన్నామలై ఎంతగానో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా పేద ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేస్తు వస్తున్నారు.దీంతో  చాలా మంది సినీ ప్రముఖులు బీజేపీలో చేరారు. అదంతా ఆయన కృషి ఫలితమే. అంతటి విశిష్టత కల్గిన అన్నామలై జీవిత కథ ఆధారంగా తమిళనాట  సినిమా తెరకెక్కనుంది.  స్టార్ హీరో విశాల్ అన్నామలై క్యారక్టర్ ని పోషించబోతున్నారు. ఈ మేరకు విశాల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు  సమాచారం. కాకపోతే బయోపిక్ గురించి  అధికారకంగా ఎలాంటి ప్రకటన రాలేదు  కాగా విశాల్  ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో  2026 లో జరిగే ఎన్నికల లిస్ట్ లో తన పేరు ఉంటుందని చెప్పాడు. పైగా బిజెపి అధ్యక్షుడు అన్నామలై వాగ్ధాటి, పార్టీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు బాగున్నాయంటు కూడా  చెప్పాడు.ఈ నేపథ్యంలో బయోపిక్ ఖాయమనే మాటలు వినపడుతున్నాయి. అన్నామలై గతంలో పోలీసు శాఖలో ఉన్నత అధికారిగా పని చేసాడు. ఒక పోలీసు అధికారి  పొలిటీషియన్ గా ఎలా మారాడు అనే పాయింట్ తోనే మూవీ తెరకెక్కబోతుంది  
శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై కంఠంనేని రవిశంకర్ నిర్మించిన చిత్రం 'రాజధాని ఫైల్స్'. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల కన్నీటి గాథను కళ్ళకి కట్టినట్టు చూపించిన ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తెలుగునాట సంచలనం సృష్టించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. 'రాజధాని ఫైల్స్' ఫుల్ మూవీని తెలుగువన్ యూట్యూబ్ ఛానల్ వేదికగా శనివారం(మే 4న) సాయంత్రం విడుదల చేశారు. అలా విడుదలైందో లేదో.. యూట్యూబ్ లో ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి రైతుబిడ్డ చూడాల్సిన చిత్రమంటూ కామెంట్లు పెడుతున్నారు. చూస్తుంటే తక్కువ సమయంలోనే ఈ సినిమా యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సాధించేలా ఉంది. 'రాజధాని ఫైల్స్' మూవీ రివ్యూ అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ ప్రధాన పాత్రలు పోషించిన 'రాజధాని ఫైల్స్' చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. సినిమాటోగ్రాఫర్ గా రమేష్, ఆర్ట్ డైరెక్టర్ గా గాంధీ, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు వ్యవహరించారు.
Darshaka Ratna Dasari Narayana Rao's birth anniversary was grandly celebrated by the Telugu Film Directors Association. President of the Directors Association, Veera Shankar, and directors Anil Ravipudi, Vashishta, Gopichand Malineni, Vijay Kanakamedala, Shankar, Relangi Narasimha Rao, director-producer Tammareddy Bharadwaja, Producer Council President Damodara Prasad, Producer C Kalyan, Federation President Anil Kumar Vallabhaneni, and Filmnagar Corporator Kaja Suryanarayana participated in the event held at the Hyderabad Film Chamber. Telangana Film Chamber Secretary Anupama Reddy, Producer Prasanna Kumar, and others also attended. Garlands were placed on Dasari Narayana Rao's statue within the Film chamber premises. During this program, it was announced that the Director's Day celebrations would take place on the 19th of this month at 6 pm at Hyderabad's LB Stadium. The event date poster was unveiled by Tammareddy Bharadwaja. Directors Association President Veera Shankar stated, "Dasari not only resolved issues for the Directors' Association but also for all film trade unions. He was a pivotal figure in the film industry. 151 directors were honored on the occasion of Dasari's 151st film. Kalathapaswi K Vishwanath, who attended that day's program, suggested that Dasari's birthday be celebrated as Director's Day. This incident highlights the bond between the two great directors. The Director's Day event is set to be held on the 19th of this month. All our young directors are working hard to make this event a success. I extend my thanks to all of them." Tammareddy Bharadwaja commented, "Director's Day used to be celebrated in Indoors on the occasion of Dasari's birthday. I wondered why it wasn't made into a bigger event. However, I agree with Veera shankar's view that if Dasari's greatness is to be recognized globally, it should be a grand event. I am pleased that all the prominent directors are coming forward for this. If they come, heroes will follow. Only then will the event be successful. I appreciate the efforts of the directors association committee and the cultural committee in this direction." Producer Damodara Prasad remarked, "I met Dasari for the first time 40 years ago. Although he is no longer physically with us, many people have come today to commemorate his birth anniversary. It's unprecedented for a director to be remembered like this. Dasari would welcome everyone who approached him and would assist them, understanding their difficulties. Dasari is still remembered for his exceptional qualities. In the industry, he was a major guiding force. No other director could match that. It was possible only for Dasari." Producer C Kalyan stated, "Dasari's efforts in creating associations for 24 crafts, along with the directors' association, are remarkable. That is why Tollywood is number one in the welfare of film workers across the country today. This legacy is Dasari's. The current committee is making the Director's Day event a success, and you always have our support." Telangana Film Chamber Secretary Anupama Reddy remarked, "Director Rathna Dasari garu has not only directed and written words and songs but also displayed talent in acting. Many directors have contributed to the film industry, but his fame will endure forever in Tollywood." Federation President Anil Kumar Vallabhaneni expressed, "It is saddening that Mr. Dasari is no longer with us. He was a guiding force for the industry, and his absence is palpable. We are prepared to offer whatever support is necessary from our 24 trade unions for the Director's Day event." Director Shankar stated, "Dasari was a pillar of strength for the industry. The Directors Association founded by him has grown significantly today. Megastar Chiranjeevi donated 25 lakh rupees to our Directors' Trust during the Directors' Day celebrations in the past, which greatly boosted the event's popularity. We are grateful to Chiranjeevi for his support. The Director's Day event enjoys the backing of all our directors. It should be managed diligently, and any suggestions for improvement should be addressed." Filmnagar Corporator Kaja Suryanarayana observed, "Dasari's foresight is the reason why the film industry has flourished so greatly in Filmnagar. A temple was erected alongside the film chamber. As long as Dasari's statue stands here in the chamber premises, we should consider him to be among us." Director Relangi Narasimha Rao shared, "I share a strong bond with director Ratna Dasari. I joined him even before he became a director, and we traveled together for many years. It's an honor to come forward to organize Director's Day in a grand manner. I extend my gratitude to all the prominent directors contributing to this event. Their participation, despite their busy schedules, is a testament to their admiration for our mentor. I hope this program is a resounding success." Director Mehr Ramesh reminisced, "Our family has a close relationship with Dasari. Whenever he visited our home on his birthday, he would sign a hundred rupee note and gift it to me. I have five or six such notes. The Director's Day event is going to be celebrated grandly on Dasari's birthday, and I hope it turns out to be a tremendous success." Producer Prasanna Kumar reflected, "Today, we are commemorating a program in this Filmchamber office because of Dasari. He shouldered many responsibilities as a director, producer, actor, writer, and press owner. He not only made significant contributions to Telugu cinema but also served as the president of the Madras Movie Industry Association. Dasari was truly one of a kind." Director Anil Ravipudi clarified, "We are organizing Director's Day celebrations on May 19, which coincided with an IPL match. A recent statement I made about the IPL was misconstrued. I watch IPL matches, just like everyone else. I hope we can gather like this every year on director Rathna Dasari's birthday. All our directors are gearing up for the Director's Day event, where we will present skits and other engaging programs. This event is for our community and the welfare of our members. Every rupee collected through this program will benefit the members of the Directors Association." Director Gopichand Malineni conveyed, "Greetings to all my fellow directors on the occasion of Director's Day. Dasari graced the audio function of my debut film, 'Don Seenu,' as a guest. Following that, he praised my movie 'Balupu' as well. He blessed me, saying that I would gain fame as a director. Dasari's blessings continue to be with us all. We should all come together to celebrate Director's Day."
Anand Deverakonda's next Gam Gam Ganesha is fun action entertainer. This movie is being produced by Kedar Selagamshetty and Vamsi Karumanchi under the banner Hy-Life Entertainment. Uday Shetty is making his directorial debut with this film. This is Anand Devarakonda's first action movie in his career. Today makers dropped the film's second single 'Picchiga Nacchesave.' This groovy melody is composed by Chaitan Bharadwaj, who gave many energetic chartbusters. Anurag Kulkari vibrant voice adds more energy and catchiness to the song. Catchy lyrics by Suresh Banisetti makes it an instant chartbuster. Anand Deverakonda styling and simple steps are treat to watch. Anand and Nayan Sarika share beautiful chemistry on screen.  The film is releasing worldwide in theaters on May 31st. Pragati Srivastava, Karishma, Vennela Kishore, Jabardast Immanuel play other key roles in the film. Chaitan Bharadwaj took care of the music. The film is co produced by Anurag Paravatheneni.
స్టార్ హీరోల బర్త్ డే అంటే ఆ సందడే వేరు. మే 20న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పుట్టినరోజు. ఆరోజు ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన పలు అప్డేట్ లు.. అభిమానులను సర్‌ప్రైజ్‌ చేయనున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' (Devara), 'వార్ 2' (War 2) సినిమాలు చేస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా అక్టోబర్ లేదా నవంబర్ లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కీలక ప్రకటన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న రానుందట. దీనితో పాటు 'దేవర', 'వార్ 2' అప్డేట్స్ కూడా రానున్నాయట. 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్, 'వార్ 2' నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ కానున్నాయని సమాచారం. మొత్తానికి ఎన్టీఆర్ బర్త్ డేకి మూడు సినిమాల అప్డేట్స్ తో.. ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఉండనుంది అన్నమాట.
Ace producers Dilraju and Shirish gear up for another crazy project with sensational Vijay Deverakonda even after the disastrous Family Star directed by Parasuram  Petla. The film tentatively titled SVC59, promises to deliver a thrilling and authentic rural narrative, with the engaging combination of Vijay Deverakonda's dynamic screen presence and Ravi Kiran Kola's innovative directorial approach. The announcement of this project has already sparked considerable anticipation among fans and cinema enthusiasts eager for a fresh and powerful story. The film will be a rural action drama. The collaboration between Vijay Deverakonda and Sri Venkateswara Creations, following their previous successful outing, adds a layer of expectancy about the unique storytelling and cinematic excellence that the team is known for. With Dil Raju and Shirish backing the project, the production values are expected to be top-notch, ensuring that the rural settings are portrayed with authenticity and the action sequences with gripping intensity. As Vijay Deverakonda continues to shoot for VD12 under the direction of Gowtam Tinnanuri, the industry buzzes with excitement about his role and performance in SVC59. The upcoming details reveal on May 9th promises to unveil more about the cast, crew, and storyline.
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ రానాల హిట్ మూవీ బీమ్లా నాయక్..దాని ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన భామ    సంయుక్త మీనన్..రానాకీ జోడిగా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే రాబట్టింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసార, ధనుష్ సార్, సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష లో చేసి హిట్ హీరోయిన్ అనే పేరుని సంపాదించింది.తాజాగా ఈ భామ ఒక సినిమాకి ఒప్పుకుంటుందా లేదా అనే  చర్చ సినీ సర్కిల్స్ లో జరుగుతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఒక నూతన చిత్రం తెరకెక్కబోతుంది. మూన్ షైన్ పతాకంపై బెల్లంకొండ సినీ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకోనుంది. నూతన దర్శకుడు లుధిర్ బైరెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పుడు ఈ మూవీకి హీరోయిన్ గా సంయుక్త మీనన్ ని ఒప్పించే పనిలో  మేకర్స్ ఉన్నారు. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారు.ఆమె కూడా సానుకూలంగా స్పందించిందనే వార్తలు వస్తున్నాయి. అన్ని కుదిరితే  వచ్చే నెలలో షూటింగ్ కి వెళ్లే అవకాశం ఉంది సంయుక్త చేతిలో ప్రస్తుతం నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక మూవీ స్వయంభూ తో పాటు శర్వానంద్ అప్ కమింగ్ మూవీ కూడా ఉంది. మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా చర్చల దశలో ఉన్నాయి. మరి బెల్లం కొండ మూవీకి ఓకే  చెప్తుందో లేదో చూడాలి. ఆ ఇద్దరి కాంబో ఫిక్స్ అయితే మాత్రం సినీ ప్రియులకి పండగే  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
మీ ఆసక్తి, వ్యక్తిత్వానికి సరిపోయే వృత్తిని ఎంచుకోవడం వ్యక్తిగత వృద్ధికి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. జీవితంలో చాలా సార్లు డబ్బు కంటే ఆనందం, శాంతి ముఖ్యం. కాబట్టి, మీ అభిరుచులు, లక్షణాలను సరిగ్గా తెలుసుకుని కెరీర్‌ను ఎంచుకోండి. అందరూ ఇంజినీరింగ్ చేయలేరు. అందరూ డాక్టర్, లాయర్, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ కాలేరు. ప్రతి ఒక్కరూ బికామ్ లాగా కనీసం బ్యాచిలర్ డిగ్రీని కామర్స్‌లో పూర్తి చేయలేరు. మీరు ఏది చదివినా...అది జీవనోపాధి కోసమే పని చేయాలి. చాలామంది కొన్ని మంచి కోర్సులు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. చదువు తర్వాత ఉపాధిపరంగా కొన్ని కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ఉద్యోగం పొందడం సులభతరం చేసే అనేక విద్యా కోర్సులు ఉన్నాయి. కానీ, ఉద్యోగ సంతృప్తి కోసమే కాదు, వ్యక్తిత్వాన్ని కూడా వికసించాలి. చేసే పనిలో శాంతి ఉండాలి. అలా ఉండాలంటే మన వ్యక్తిత్వం, గుణం, స్వభావం, అభిరుచికి తగ్గట్టుగా ఉద్యోగం చేయాలి. ఈమధ్య ఈ కాన్సెప్ట్ బాగా పాపులర్ అయినప్పటికీ ఉద్యోగం సంపాదించాలనే కోరికతో ఏదో ఒకటి చేసేవాళ్ళు ఎక్కువ. దాంతో మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఏ వృత్తిని ఎంచుకున్నా మంచి వ్యక్తిత్వం ఉండాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. కానీ, ప్రస్తుతం అన్ని చోట్లా పోటీ నెలకొంది. అందువల్ల, చాలా మంది యువకులకు కెరీర్‌ను ఎంచుకోవడం డైలమాగా మారింది. అయితే ఉద్యోగం వస్తే చాలు అని ఆలోచించడం కంటే మీ అభిరుచికి, వ్యక్తిత్వానికి అనుగుణంగా ఉద్యోగాన్ని ఎంచుకోవడం సరైనది. దీని కోసం చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే మీ ఆసక్తుల గురించి స్పష్టంగా తెలుసుకోవడం. మీ సామర్థ్యాలను తెలుసుకోండి. మీరు మీ విలువలు, వ్యక్తిత్వానికి సరిపోయే ఉద్యోగాన్ని ఎంచుకుంటే విజయం సులభం అవుతుంది. ఏది నచ్చదు? మీకు నచ్చని వాటిని గుర్తించడం ఎంత ముఖ్యమో, మీకు ఏది ఇష్టమో గుర్తించడం కూడా అంతే ముఖ్యం. నలుగురితో కాలక్షేపం చేయనివారు మార్కెటింగ్ ఉద్యోగానికి సరిపోరు. నేడు సాధారణ విద్యను అభ్యసించిన వారికి అనేక రకాల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వాటిలో ఏది మీరు ఆనందించగలరో ఆలోచించండి. ఏది కష్టమో గ్రహించండి. బలహీనతలు ఏమిటి? ఒక వ్యక్తి ఎంత అవగాహన పెంచుకున్నా, కొన్ని స్వాభావిక గుణాలు పోవు. ఉదాహరణకు..మీది ఒంటరిగా ఉండే మనసతత్వం అయితే...ఒంటరిగా నిర్వహించగల ఉద్యోగం సరిపోతుంది. గ్రూప్ వర్క్ కు దూరంగా ఉండటం మంచిది. మీరు ఏ స్వభావాన్ని మార్చుకోలేరు అనేది మీ బలహీనత అని చెప్పవచ్చు. వాటిని గుర్తించండి. కార్యాలయంలో వారితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోండి. ఇలా చేయడం వల్ల లక్ష్యాన్ని చేరుకోవడం సులభం అవుతుంది. ఎక్కడ ఫిట్‌గా ఉంది..  కేవలం జీతం కోసం  ఇష్టం లేని ఉద్యోగం చేయనక్కర్లేదు. జీతం తక్కువే అయినా.. వేరే ఉద్యోగంలో ఆసక్తి ఉంటే.. ఆనందంగా అనిపిస్తే అక్కడికి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయవచ్చు. అయితే, ఎవరైనా ఆసక్తిని పదేపదే మార్చకూడదు. ఇది కాదు. ఒక నిర్దిష్ట వృత్తిలో ఒక సముచిత స్థానాన్ని కనుగొనాలి. అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు.
ప్రతి వ్యక్తి జీవితాన్ని పెళ్లికి ముందు, పెళ్ళి తర్వాత అని చాలా స్పష్టంగా విభజించి చెప్పవచ్చు.  ఎందుకంటే పెళ్లికి ముందు ఉన్న చాలా విషయాలు పెళ్ళి తర్వాత మారిపోతాయి. మరీ ముఖ్యంగా ఈ జనరేషన్లో  అమ్మాయిలు, అబ్బాయిలు వ్యక్తిత్వం పరంగా చాలా ఆత్మగౌరవం కలిగి ఉంటారు. ఏ చిన్న విషయాల్లోనూ రాజీ పడటానికి సిద్దంగా ఉండరు. ఈ కారణంగా ఇప్పటి కాలంలో పెళ్లవుతున్న వారి మధ్య గొడవలు, విడాకులు ఎక్కువ. పెళ్లయ్యాక భార్యాభర్తలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నా, వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ పెద్ద గొడవలకు దారి తీయకుండా సింపుల్ గా పరిష్కారం కావాలన్నా కొన్ని గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వాలి. రిలేషన్షిప్ నిపుణులు చెప్పిన ఆ గోల్డెన్ రూల్స్ ఏంటో తెలుసుకుంటే.. పెళ్ళి తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. అమ్మాయిలకు అయినా, అబ్బాయిలకు అయినా భాద్యతలు పెరుగుతాయి. ఇల్లు, ఉద్యోగం, స్నేహితులు, ఇతర పనులలో భార్యాభర్తలు ఒకరినొకరు నిర్లక్ష్యం చేయకూడదు. ఎన్ని పనులున్నా సరే.. భార్యాభర్తలిద్దరూ కొంతసమయం కేటాయించుకోవాలి.  కలసి మాట్లాడుకోవడం, కలసి భోజనం చేయడం, కలసి చర్చించడం,  ప్రతిరోజూ కనీసం గంటసేపు అయినా మాట్లాడాలనే నియమం పెట్టుకోవాలి. ఇలా చేస్తే వారి మధ్య  ఏ సమస్యలున్నా వాటిని మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు. అందుకే ఒకరికోసం ఒకరు సమయం కేటాయించుకోవడం ఎంతో ముఖ్యం. పెళ్ళికి ముందు కాబోయే జంట ఒకరి పట్ల మరొకరు చాలా ప్రేమగా ఉంటారు. ఒకరిని మరొకరు బుజ్జగించుకోవడం, ప్రేమ కురిపించడం, చాలా కేరింగ్ గా ఉండటం చేస్తారు. అయితే చాలామంది జీవతాలను గమనిస్తే పెళ్ళి తర్వాత ఈ సీన్ మొత్తం మారిపోతుంది.  కానీ ఇలా చేయడం మంచిది కాదు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు ప్రేమగా ఉండాలి. ఒకరి మీద మరొకరు అరుచుకోవడం, గొంతు పెంచి మాట్లాడటం వల్ల ఇద్దరి మధ్య  గొడవకు దారితీస్తుంది. భార్య చేసే ఏ పని అయినా భర్తకు నచ్చితే భార్యను మెచ్చుకోవడం అస్సలు మిస్ కాకూడదు.   భార్య వంట నచ్చినా, ఆమె ఇంటి పనిలో చలాకీగా ఉన్నా,  భర్తకు ప్రేమగా వడ్డించినా, ఇంటి పనిని, ఆఫీసు పనిని ఆమె సమర్థవంతంగా  బ్యాలెన్స్ చేస్తున్నా ఇలా ఏం చేసినా సరే భార్యను మెచ్చుకోవడానికి అస్సలు మొహమాటపడకూడదు. అలాగే  భర్త ప్రేమగా ఏం చేసినా భర్త వృత్తి, వ్యక్తిగతంగా ఏం చేసినా దాన్ని భార్య కూడా మెచ్చుకోవాలి. ఇలా చేస్తే భార్యాభర్తలకు ఒకరి మీద మరొకరికి ప్రేమ పెరుగుతుంది. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా మాట్లాడే తీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిని మరొకరు ఎలా మాట్లాడుతున్నారు అనేది వారి మధ్య బంధాన్ని నిర్ణయిస్తుంది. ఒకరితో ఒకరు మాట్లాడటం, ఒకరి మనసులో విషయాలు మరొకరితో షేర్ చేసుకోవడం, ఒకరు చెప్పేది మరొకరు శ్రద్దగా వినడం ఇవన్నీ బంధం పదిలంగా ఉండటానికి అవసరం. భార్యాభర్తల బంధం అంటే ఇక ఒకరి జీవితం మరొకరు చేతుల్లోకి వెళ్లినట్టే అని అనుకుంటారు కొందరు. కానీ భార్యాభర్తలు అలా ఉండకూడదు. స్పేస్ అనేది చాలా ముఖ్యం. స్పేస్ లేకపోతే బంధం కష్టంగా అనిపిస్తుంది. భాగస్వామి జీవితాన్ని మరీ గట్టిగా బంధించినట్టు, తనకు అన్ని విషయాలు తెలియాలి అన్నట్టు ఉండకూడదు. ముఖ్యంగా కంట్రోల్ చేయడం, కమాండ్ చేయడం అస్సలు మంచిది కాదు. ఎవరి సొంత అభిప్రాయాలు, ఆలోచనలు, సంతోషాలు వారికి ఉండటం మంచిది.                                             *రూపశ్రీ. 
కొంతమందికి ఎప్పుడూ ఏదో ఒక దెబ్బ తగులుతూ ఉంటుంది! ఒంటి మీద ఎప్పుడూ ఏదో ఒక గాయం కనిపిస్తూనే ఉంటుంది. వాళ్లని చూసి పాపం దురదృష్టవంతులు అని మిగతావారు జాలిపడుతూ ఉంటారు. కానీ తరచూ ఏదో ఒక ప్రమాదానికి లోనవ్వడానికీ మన వ్యక్తిత్వానికీ సంబంధం ఉండవచ్చని ఊహిస్తున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఇలాంటి మనస్తత్వాన్ని ‘Accident Prone Psychology’ అంటున్నారు. అదేమిటో తెలుసుకుంటే మనకీ కాస్త ఉపయోగపడుతుందేమో... ఓ ఆలోచన! తరచూ కొంతమందే ఎందుకు దెబ్బలు తగిలించుకుంటారన్న అనుమానం 19వ శతాబ్ది మొదటిలోనే వచ్చింది. దీని మీద మరిన్ని పరిశోధనలు చేసిన గ్రీన్‌వుడ్ వంటి నిపుణులు మన ఆలోచనా విధానానికీ, ప్రమాదాలకి సంబంధం ఉండే అవకాశం ఉందని తేల్చారు. ఆ తరువాత వచ్చిన ఎన్నో పరిశోధనల్లో ఓ 20 శాతం మంది వ్యక్తులే అధికశాతం ప్రమాదాలకి కారణం అవుతూ ఉంటారనీ... మొత్తంగా మన చుట్టూ జరిగే ప్రమాదాలలో దాదాపు 75 శాతం ప్రమాదాలు మానవ తప్పిదం వల్లే ఏర్పడతాయని చెబుతూ వస్తున్నాయి. ఈ పరిశోధనల శాస్త్రీయతని చాలామంది కొట్టిపారేసినా, వీటిలో స్పృశించిన చాలా అంశాలు చాలా తార్కికమైనవే! అందుకనే కొన్ని భీమా కంపెనీలు ప్రమాదభీమాను చెల్లించేటప్పుడు, ఉత్పాదక సంస్థలు తమ ఉద్యోగులను హెచ్చరించేందుకూ ఈ పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి.   ప్రమాదాన్ని ఆశించే వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువగా ఉన్నారు, దూకుడుగా ఉండేవారు, నిరంతరం కోపంతో రగిలిపోయేవారు... పోయి పోయి ఏదో ఒక ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారని తేలింది. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు కూడా ప్రమాదాలకి త్వరగా లోనవుతారని చాలా పరిశోధనలు వెల్లడించాయి. ఏదన్నా కుటుంబంలో ఒకరి తరువాత ఒకరు ప్రమాదానికి లోనవడం మనం గమనిస్తూ ఉంటాము. ఆ కుటుంబానికి ఏదో శాపం తగిలిందనో, వారి గ్రహస్థితి బాగోలేదనో అనుకుంటాము. నిజానికి ఇలా కుటుంబంలో ఎవరన్నా ఒకరు తీవ్ర ప్రమాదానికి లోనైతే, ఆ ప్రభావం ఇతరుల మనసు మీద కూడా పడుతుందనీ... ఆ ఒత్తిడిలో మిగతా సభ్యులు కూడా ప్రమాదానికి లోనయ్యే అవకాశం 20 శాతం ఉంటుందనీ ఓ పరిశోధన తేల్చింది. ఎవరైతే ఇతరుల సలహాలను, సహాయాన్నీ స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారో... వారు త్వరగా ప్రమాదాలకు లోనుకారని తేలింది. అహంకారం లేకుండా, తొందరపడకుండా ఉండేవారికి ప్రమాదాలు కూడా ఆమడదూరంలో ఉంటాయని 2001లో జరిగిన ఒక పరిశోధన రుజువు చేసింది. అంటే నిదానమే ప్రధానం, నోరు మంచిదైతే ఊరు మంచిది లాంటి సామెతలు యాంత్రిక జీవితానికి కూడా వర్తిస్తాయన్నమాట.     ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా తొందరపాటు, దూకుడు, ద్వేషం, అహంకారం... మనిషి విచక్షణను దెబ్బతీస్తాయి. తన మీద తనకి ఉండాల్సిన నియంత్రణను ప్రభావితం చేస్తాయి. దాంతో ఒక అనర్థం జరగడం సహజమే! కానీ ఇలాంటివారు కేవలం తమకి మాత్రమే ప్రమాదాన్ని తెచ్చుకుంటే ఫర్వాలేదు. అలా కాకుండా ఈ ‘Accident Prone Psychology’ ఉన్నవారు ఏ విమానాన్నో నడుపుతుంటే! అందుకే ఈ తరహా వ్యక్తిత్వం గురించి నానాటికీ ప్రచారం పెరుగుతోంది. మీది ప్రమాదాన్ని కొని తెచ్చుకునే వ్యక్తిత్వమేమో గమనించుకోండి అంటూ కొన్ని వెబ్‌సైట్లు పరీక్షలు పెడుతున్నాయి. మున్ముందు ఉద్యోగులకు కూడా ఇలాంటి పరీక్షలను నిర్వహించి విధుల్లోకి తీసుకునే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు!   - నిర్జర.
డ్రై ఫ్రూట్స్ అందరికీ ఇష్టమైనవి. ఖరీదు ఎక్కువని కొందరు వీటిని దూరం పెడతారు కానీ పండుగలు, శుభకార్యాలప్పుడు వంటల్లో డ్రై ప్రూట్స్ తప్పక ఉండాల్సిందే. డ్రై ఫ్రూట్స్ లో ఎండు ద్రాక్షకు చాలా ప్రత్యేకత ఉంది. ఎండుద్రాక్షను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి మరుసటిరోజు ఉదయాన్నే నానిన ఎండు ద్రాక్షలు తిని ఆ నీటిని తాగడం వల్ల  చాలా ప్రయోజనాలు కలుగుతాయని, మరీ ముఖ్యంగా వేసవి కాలంలో ఎండుద్రాక్షనీరు తాగడం మంచిదని అంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు ఎండు ద్రాక్ష నీరు వేసవి కాలంలో తాగితే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. ఎండుద్రాక్షలో ప్రోటీన్, ఫైబర్, ఇనుము, పొటాషియం, రాగి, విటమిన్ B6 మరియు మాంగనీస్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.ఎండుద్రాక్ష నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.  టైప్ 2 డయాబెటిస్,  అల్జీమర్స్ వ్యాధి వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తాయి. ఎండుద్రాక్ష తినడం వల్ల రక్తంలో యాంటీఆక్సిడెంట్ స్థాయిలు పెరుగుతాయని,  మెదడు పనితీరు మెరుగుపడుతుందని నమ్ముతారు. ఎండుద్రాక్ష నీరు ఐరన్  లోపం వల్ల కలిగే  రక్తహీనత వంటి పరిస్థితులను నివారిస్తుంది.  అలసట, శ్వాస ఆడకపోవడం, చర్మం సున్నితంగా మారడం, బలహీనత వంటి లక్షణాలు రక్తహీనత ఉన్నవారిలో ఉంటాయి. ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఎండుద్రాక్ష నీరు త్రాగడం మంచిది.  ఎందుకంటే ఇది కడుపులోని యాసిడ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.  ఇది పేగు పనితీరును మెరుగుపరచడంలో,  పేగులోని బ్యాక్టీరియాను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందుకే ఎండుద్రాక్ష నీరు  పొట్ట ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎండుద్రాక్ష నీరు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది.  జుట్టు రాలడం సమస్యను నివారిస్తుంది. అందువల్ల జుట్టు రాలే సమస్యతో బాధపడే వారికి ఇది మేలు చేస్తుంది.                                             *రూపశ్రీ.
  బాదం ఒక డ్రై ఫ్రూట్ దీనిలో ఉండే  పోషకాలు శరీరానికి చాలా అవసరమైనవి. బాదంపప్పులో శక్తి, కొవ్వు, ప్రొటీన్, ఫైబర్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్,  ఐరన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందుకే దీన్ని డైట్‌లో భాగం చేసుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ప్రతిరోజూ ఉదయాన్నే రాత్రి నానబెట్టిన బాదం పప్పులు కనీసం నాలుగైనా తినమని చెబుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బాదం పప్పు తినాలా వద్దా  కన్ఫ్యూజన్ చాలామందిలో ఉంటుంది. దీని గురించి ఆహార నిపుణులు కింది విధంగా చెబుతున్నారు. బాదంపప్పును ఏ సీజన్‌లోనైనా తినవచ్చు.  అయితే ఏ సీజన్ అయినా వాటిని నానబెట్టి తినాలి.  అయితే వేసవి కాలంలో పచ్చి బాదం పప్పుులు మాత్రం తినకూడదు. ఇవి కడుపునొప్పికి కారణం అవుతాయి. బాదం పప్పు స్వభావం సహజంగా వేడిగా ఉంటుంది. వేసవి కాలంలో బాదం పప్పులు తినడం వల్ల పిత్త దోషం సంభవించే అవకాశం ఉంటుంది.  అందుకే రాత్రంతా నానబెట్టిన బాదం పప్పును మాత్రమే తినడం అన్ని విధాలా శ్రేయస్కరం. రాత్రి నానబెట్టిన బాదం పప్పు తినడం వల్ల జీర్ణశక్తి బలపడుతుంది.  బాదం పప్పులో ఉండే మోనోఅన్శాచురేటెడ్ ఫ్యాట్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది. నానబెట్టిన బాదం పప్పు తింటే శోషణ సామర్థ్యం మెరుగుపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.  బాదం శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.   రోజుకు ఎవరు ఎన్ని బాదం పప్పులు తినాలంటే.. 5 నుండి 10 సంవత్సరాల పిల్లలు ప్రతి రోజూ 2 నుండి 4 బాదం పప్పులు తినవచ్చు.  జీర్ణశక్తి తక్కువగా పిల్లలు కనీసం రెండు కూడా తినలేకపోవచ్చు. కాబట్టి పిల్లల జీర్ణశక్తి సామర్థ్యం ను బట్టి బాదం పప్పులను ఇవ్వాలి. బాదం పప్పులు తినడం కొత్తగా మొదలుపెట్టేవారు రోజూ రెండు బాదం పప్పులతో మొదలుపెట్టాలి.  అవి బాగా అలవాటు అయ్యాక వాటి పరిమాణం పెంచుకోవచ్చు. అయితే రోజుకు 8 బాదం పప్పులకు మించి ఎప్పుడూ తినకూడదు.                                                    *నిశ్శబ్ద.