అబ్బ... ఇంతకంటే పెద్ద శుభవార్త వుంటుందా? చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారోత్సవానికి జగన్ పార్టీ దండుపాళ్యం బ్యాచ్ హాజరు కాకూడదని నిర్ణయించుకుందట. ఈ దండుపాళ్యం బ్యాచ్ నాయకుడు జగన్‌‌ని ఆహ్వానించాలని చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసినా ఆ పోటుగాడు అందుబాటులోకి రాలేదంట. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావడం ఇష్టం లేకనే జగన్ ఫోన్‌‌కి అందుబాటులో లేకుండా పోయాడంట. దరిద్రం వదిలింది. ఈ దరిద్రపు బ్యాచ్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చి, ఎదురుగా కూర్చుని కళ్ళలో నిప్పులు పోసుకుని ఏడ్చి చస్తారు. శాపనార్థాలు పెడతారు. కుళ్ళుకుంటారు.. దిష్టిపెడతారు. ఈ అపశకునపు పక్షులని ఎదురుగా పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేయడం కూడా రాష్ట్రానికి అంత మంచిది కాదు. జగన్ పార్టీ చేసిన మంచి పని ఏదైనా వుందీ అంటే... చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాకూడదని నిర్ణయించుకోవడం. చాలా వైభవంగా, ఆనందోత్సాహాలతో జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో ఏడుపు ముఖాలు వేసుకుని ఈ వైసీపీ పిశాచాలు కూర్చుని వుంటే ఎంతమాత్రం బాగోదు. ప్రమాణ స్వీకారోత్సవంలో అందరూ ఒకర్నొకరు ఆనందంగా పలకరించుకుంటూ, కౌగిలించుకుంటూ, నవ్వుకుంటూ, తుళ్ళుకుంటూ, జై అమరావతి అని నినాదాలు చేసుకుంటూ వుంటే, అక్కడే వున్న ఈ వైసీపీ మూకలు కర్రల్లాగా బిగుసుకుపోయి, దేభ్యం ముఖాలు వేసుకుని కూర్చుని వుంటే ఏమన్నా బాగుంటుందా? అందువల్ల వైసీపీ బ్యాచ్ వాళ్ళు చంద్రబాబు ప్రమాణానికి రాకూడదని నిర్ణయించుకోవడమే చాలా మంచిదైంది. శుభమా అని చంద్రుడు ప్రమాణ స్వీకారం చేసుకుంటూ వుంటే, అక్కడ ఈ వైసీపీ మచ్చలెందుకు? 
అమరావతి మహానగరాన్ని పురిట్లోనే చంపేయాలని అనుకున్న యముడు జగన్ పోయాడు... అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి ఆ మయబ్రహ్మకు ప్రతినిధిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. దీనికి సంకేతాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. చీకటి పడితే చాలు.. స్ట్రీట్ లైట్లు జిగేల్‌మంటున్నాయి.. ఇప్పుడు అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేసేస్తున్నారు. ఇప్పుడే ఇలా వుంది... రేపు అభినవ మయుడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక అమరావతి అభివృద్ధి సాక్షాత్తూ ఆ మయుడు కూడా ముచ్చడపడేలా వుంటుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పదేళ్ల తర్వాత  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చీ రాగానే ఫోన్ ట్యాపింగ్ తెరమీదకు తెచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని నిందితులుగా చేర్చారు. సిట్ దర్యాఫ్తు బృందం కస్టడీలో వారి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. మరోవైపు, భుజంగరావు, తిరుపతన్నలు తమకు బెయిల్ ఇవ్వాలని నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తమను రాజకీయ దురుద్దేశంతో అరెస్ట్ చేశారని నిందితులు కోర్టుకు తెలిపారు. అయితే వారిని ఇంకా విచారించాల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. ఇద్దరి బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. నాంపల్లి కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది.
ALSO ON TELUGUONE N E W S
Talented hero Varun Sandesh is coming up with a unique crime thriller ‘Nindha’ which is carrying a strong buzz, thanks to impressive promotional material. The teaser received a tremendous response from all corners. The movie was written, directed, and produced by Rajesh Jagannadham under the banner of The Fervent Indie Productions. Kandrakota Mystery is the tagline of the movie. Today, heroes Sundeep Kishan and Vishwak Sen launched the film’s trailer. While the teaser introduced all the lead actors of the movie and also hinted that the movie will be a riveting thriller, the theatrical trailer which is out now divulges the core point of the movie. The trailer begins on an interesting note with someone kidnapping a group of people who have a connection with a rape and murder of a girl. An innocent was framed in the case. https://youtu.be/hP8uTeUaFbI The storyline sounds very fascinating, and Rajesh Jagannadham wins brownie points for his writing and direction. Particularly, the dialogues are stimulating. Varun Sandesh appeared in an intense character and he played it exceptionally. The frames captured by Ramiz Naveeth is a great value addition, while Santhu Omkar scored a wonderful BGM. Anil Kumar is the editor. On the whole, the trailer sets the ball rolling for the movie. Nindha is up for release on the 21st of this month. Leading Production and Distribution house Mythri Movies Distributors LLP will be releasing the movie in Nizam area.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు స్టార్ హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఇప్పుడు మెగా అభిమానులకు అలాంటి ఆనందమే కలగనుంది. ఒకే వేదికపై మెగా త్రయం సందడి చేయనుంది. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో ఏపీ నూతన ముఖ్యమంత్రిగా బుధవారం(జూన్ 12) చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హాజరవుతారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనతో పాటు మెగా కుటుంబానికి చెందిన చిరంజీవి (Chiranjeevi), రామ్ చరణ్ (Ram Charan) కి కూడా ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. ఆ ఇద్దరు కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు. అంటే ఒకే వేదికపై మెగా త్రయం చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సందడి చేయనున్నారన్నమాట. ఈ ముగ్గురూ ఒకే వేదికపై కనిపిస్తే.. వారిని చూడటానికి మెగా అభిమానులకు రెండు కళ్ళు సరిపోవు అని చెప్పవచ్చు. మొత్తానికి బాబు ప్రమాణ స్వీకారోత్సవంలో మెగా త్రయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.
ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కల్కి 2898 AD' (Kalki 2898 AD). భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. జూన్ 27న విడుదల కానున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండ, నాని, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలలో మెరవనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్ పాత్రకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. 'కల్కి' సినిమాలో అశ్వత్థామ సహా ఎన్నో పురాణ పాత్రలు కనిపించనున్నాయి. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనువిందు చేయనున్నట్లు ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. అలాగే మహాభారతంలో గొప్ప యోధుడుగా పేరు తెచ్చుకున్న అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఇదొక బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు. అలాగే విజయ్ కెరీర్ లో ఈ పాత్ర స్పెషల్ గా నిలిచే అవకాశముంది. దర్శకుడిగా నాగ్ అశ్విన్ కి ఇది మూడో సినిమా. ఆయన డైరెక్ట్ చేసిన మొదటి రెండు సినిమాలు 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'మహానటి'లో విజయ్ కీలక పాత్రలు పోషించాడు. ఇప్పుడు 'కల్కి'లోనూ కీలకమైన అర్జునుడి పాత్ర పోషిస్తున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.
ఈమధ్య కొన్ని సినిమాలు అధికారిక ప్రకటన రాకుండానే లాంచ్ అవుతున్నాయి. మరికొన్ని సినిమాలు సైలెంట్ గా షూటింగ్ కి కూడా వెళ్లిపోతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓ సినిమా విషయంలో ఇదే ట్రెండ్ ఫాలో అవుతోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'డబుల్ ఇస్మార్ట్' సినిమా చేస్తున్న రామ్ పోతినేని.. తన తదుపరి చిత్రాన్ని 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు కానీ.. జూన్ 10న పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారట. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. మరి షూటింగ్ కి వెళ్లే ముందైనా అధికారికంగా ప్రకటిస్తారో లేదో చూడాలి.
In the Tollywood film industry, it’s common for a heroine to be approached for multiple projects if she delivers a hit, leading to a busy schedule with several films in a short span. Now, even before her first release, a stunning model-turned-actress is receiving numerous offers from the Telugu film industry. The actress is set to make her Tollywood debut in "Mr. Bachchan," starring Ravi Teja. The film, a remake of the Hindi movie "Raid," is directed by Harish Shankar. With the shooting nearing completion, the film is expected to release in September. Even before her debut film hits the screens, Bhagyashri Borse has already signed two new films. She has joined the cast of Vijay Deverakonda’s upcoming movie, directed by Gowtam Tinnanuri. The shoot took place over a month in Vizag, where Bhagyashri Borse replaced Sree Leela in the film and actively participated in the filming. Bhagyashri Borse has now signed her third Telugu film, in which she will be paired opposite Malayalam actor Dulquer Salmaan in his next straight Telugu film. The film, an intriguing project directed by debutant Ravi, will be produced by Sudhakar Cherukuri under the SLV Cinemas banner. An official announcement regarding this project will be made soon. The movie is a romantic entertainer, with a significant portion of the shoot planned in the USA. Bhagyashri Borse is on track to become one of the busiest actresses in the industry.
Following massive anticipation, the much-awaited trailer of the upcoming sci-fi epic ‘Kalki 2898 AD’ has finally been unveiled yesterday. Offering an extraordinary introduction to the ‘Kalki 2898 AD’ cinematic universe, the trailer, draws audiences into a world of Indian mythology, complemented by top-notch sci-fi and VFX.  Featuring an ensemble star cast including Amitabh Bachchan, Kamal Haasan, Prabhas, Deepika Padukone and Disha Patani in key roles, ‘Kalki 2898 AD’ is directed by Nag Ashwin and produced by Vyjayanthi Movies. A multilingual, mythology-inspired sci-fi spectacle set in the future, the film hits the screens on 27th June 2024. It is known that Vyjayanthi heroes like Nani, Vijay Deverakonda and Dulquer Salmaan are playing key roles in Nag Ashwin's biggie. We've exclusively heard that Vijay Deverakonda is playing a role with Arjuna traits. Arjuna is a fierce warrior in Mahabharata and his role is full of elevations.
Hero Vijay Deverakonda, along with his family members, is on tour in America. Vijay's father Govardhan, mother Madhavi, and brother Anand Deverakonda also went on this trip. Vijay Deverakonda's US tour is getting a huge response. Telugu people there are expressing happiness that Vijay Deverakonda is coming to America with his family members. Telugu people competed to meet Vijay and take pictures with him. This tour is a proof of Vijay Deverakonda's massive craze in America. Vijay Deverakonda participated as a guest in an event organized by the American Telugu Association (ATA). Sreemukhi hosted the event. After that, Vijay Deverakonda also attended a women's organization meeting as a guest. At the event, posters of movies produced by Vijay, along with movies starring Vijay, were displayed. Vijay Deverakonda said at the ATA event: "I am happy to be a guest at the ATA event. It gives me a happy feeling to meet and talk with our Telugu people here. Thanks for the love and affection they show me. Our Telugu people came to the US for studies and jobs. It's a recession time now. Stay strong everyone. Better days will come again. I want to say hi to aunts and uncles who came to America for their children." Vijay Deverakonda's America tour with family members is going on in full swing. Photos and videos from Vijay's US tour are going viral on social media.
ఒకప్పటి స్టార్లు ఏడాదికి ఐదు నుంచి పది సినిమాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పటి స్టార్ల నుంచి ఏడాదికి ఒక్క సినిమా రావడమే గగనమైపోయింది. పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. రెండు మూడేళ్లకు ఒక సినిమా వస్తే గొప్ప అన్నట్టుగా ఉంది. అయితే ఈ పాన్ ఇండియా ట్రెండ్ లోనూ ప్రభాస్ (Prabhas) మాత్రం వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. టాలీవుడ్ నుంచి మొదట పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నది ప్రభాసే. అయితే 'బాహుబలి-2' తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్' సినిమాల కోసం కాస్త సమయం తీసుకున్న ప్రభాస్.. ఇప్పుడు ఎటువంటి గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. చేస్తున్నవన్నీ భారీ సినిమాలే అయినప్పటికీ.. విశ్రాంతి అనేది లేకుండా, వీలైనంత త్వరగా సినిమాలను పూర్తి చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గతేడాది జూన్ లో 'ఆదిపురుష్', డిసెంబర్ లో 'సలార్-1'తో పలకరించిన ప్రభాస్.. ఈ జూన్ లో 'కల్కి 2898 AD'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అంటే ఏడాది వ్యవధిలో ప్రభాస్ నుంచి ఏకంగా మూడు భారీ సినిమాలు వచ్చినట్లు. అంతేకాదు ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్ ల లిస్టు కూడా పెద్దదే. 'రాజా సాబ్', 'సలార్-2', 'కల్కి-2', 'స్పిరిట్', 'హను రాఘవపూడి ప్రాజెక్ట్' ఇలా ఎన్నో ఉన్నాయి. ప్రభాస్ దూకుడు చూస్తుంటే.. ఏడాదికి కనీసం రెండు సినిమాలు వచ్చేలా ఉన్నాయి. ప్రభాస్ తో పోలిస్తే మిగతా స్టార్ హీరోలు పూర్తిగా వెనకబడిపోయారు. గత ఆరేళ్లలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నుంచి కేవలం రెండు సినిమాలే వచ్చాయి. 2018లో 'అరవింద సమేత', 2022లో 'ఆర్ఆర్ఆర్' విడుదలయ్యాయి. ఈ అక్టోబర్ లో 'దేవర'తో పలకరించనున్నాడు. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో.. తన ప్రైమ్ టైంలో ఇంత నెమ్మదిగా సినిమాలు చేయడం.. తన కెరీర్ కే కాదు సినీ పరిశ్రమకి కూడా మంచిది కాదు. కానీ ఇదే బాటలో మిగతా స్టార్ హీరోలు కూడా పయనిస్తున్నారు.  రామ్ చరణ్ (Ram Charan) ఒక్కో సినిమాకి రెండు మూడేళ్ళ సమయం తీసుకుంటున్నాడు. 2019 లో 'వినయ విధేయ రామ' విడుదలైతే.. 2022లో 'ఆర్ఆర్ఆర్' వచ్చింది. నెక్స్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్' ఈ ఏడాది చివరిలో రానుంది. ఇక అల్లు అర్జున్ (Allu Arjun) అయితే గత నాలుగేళ్లుగా 'పుష్ప' ఫ్రాంచైజ్ కి పరిమితమయ్యాడు. 2021లో 'పుష్ప-1' వచ్చింది. ఈ ఏడాది 'పుష్ప-2' రానుంది.  మహేష్ బాబు (Mahesh Babu) పాన్ ఇండియా స్టార్ గా మారకముందే ఒక్కో సినిమాకి రెండేళ్ల సమయం తీసుకున్నాడు. 2020లో 'సరిలేరు నీకెవ్వరు', 2022లో 'సర్కారు వారి పాట', 2024లో 'గుంటూరు కారం' విడుదలయ్యాయి. తన తదుపరి సినిమాని రాజమౌళితో చేస్తున్నాడు కాబట్టి.. ఇంకో రెండు మూడేళ్లు మహేష్ సినిమా వచ్చే పరిస్థితి లేదు. ఈ లెక్కన చూస్తే.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎంతో నయమని చెప్పవచ్చు. రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ.. గత మూడేళ్ళుగా ఏడాదికి కనీసం ఒక సినిమా విడుదల చేస్తూ ఉన్నాడు. అలాగే పలు సినిమాలు చేతిలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ని వదిలేస్తే.. మిగతా స్టార్ హీరోలు మాత్రం ప్రభాస్ ని చూసి నేర్చుకోవాల్సి ఉంది. ఏడాదికి రెండు మూడు సినిమాలు కాకపోయినా.. కనీసం ఒక్క సినిమా అయినా విడుదలయ్యేలా చేస్తే.. వారి కెరీర్ బాగుండటంతో పాటు సినీ పరిశ్రమకు కూడా ఎంతో మేలు చేసినవారు అవుతారు.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
  ప్రపంచంలోని అన్ని దేశాలలోకి భారతదేశానికి, ఇక్కడి కుటుంబ వ్యవస్థకు చాలా ప్రత్యేకత ఉంటుంది.  భారతదేశ కుటుంబంలో తండ్రిని ఇంటి పెద్దగా భావిస్తారు.  ప్రతి కుటుంబానికి ఇంటి పెద్దనే మార్గనిర్థేశనం చేస్తాడు. కుటుంబ సభ్యుల మంచి చెడులు ఇంటి పెద్దనే చూసుకుంటాడు. ఎవరికీ ఏ లోటు రాకుండా ఇంటి పెద్దనే అందరి పట్లా బాధ్యతగా ఉంటాడు. ఇంటి పెద్దలో మంచి గుణాలు, అలవాట్లు,  మంచి నడవడిక ఉన్నప్పుడే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. కానీ ఇంటి పెద్దకు కొన్ని లక్షణాలు ఉంటే మాత్రం ఆ కుటుంబం మొత్తం నాశనం అయిపోతుందట. ఇంతకీ ఇంటి పెద్దకు ఉండకూడని లక్షణాలేంటో తెలుసుకుంటే.. కుటుంబ పెద్ద తన సోదరులతో ఎల్లప్పుడూ మంచి సంబంధాలను కొనసాగించాలట. కుటుంబంలో సోదరభావం ఉంటే కుటుంబం మొత్తం ఒకరికొకరు బలంగా ఉంటారట. ఇది జరగకపోతే, ఇంట్లో ప్రతికూలత ప్రారంభమవుతుంది.  ఆ ఇల్లు ఏ విషయంలోనూ ఐక్య భావంతో ఉండదు. కుటుంబంలో ఎదుగుదల అనేది ఉండదు. ఇంటి పెద్దలు మొదట నియమాలను పాటించాలి.  ఆ తరువాత కుటుంబ సభ్యులను కూడా నియమాలను పాటించమని చెప్పాలి. అప్పుడే అది కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతుంది. చాలా సార్లు ఇంట్లో పెద్దలు ప్రతి ఒక్కరికీ నియమాలు, నిబంధనల గురించి చెప్తారు కానీ వాటిని స్వయంగా పాటించరు. అలాంటి ఇంట్లో సంతోషం ఎక్కువ కాలం ఉండదు. అందుకే సభ్యులతో పాటు ఇంటి పెద్దలు కూడా  నియమాలను పాటించాలి. కుటుంబ సభ్యులకు  స్ఫూర్తిగా ఉండాలి. ఇంటి పెద్ద ఆహారం వృధా చేస్తే ఆ ఇంట్లో శుభాలు ఆగిపోతాయి. చాణక్యుడు చెప్పిన దాని  ప్రకారం ఇంట్లోని అన్ని వస్తువుల విలువను ఇంటి పెద్ద   అర్థం చేసుకోవాలి. ఆహారం, నీరు,  డబ్బు వృధా చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.  లేకపోతే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. కుటుంబంలో విభేదాలు ఉంటే దానిని పరిష్కరించే బాధ్యత ఇంటి యజమానిపై ఉంటుంది. ఇంటి పెద్ద ఎవరి పట్లా వివక్ష చూపకూడదు. కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలను చర్చల ద్వారా ముగించాలి. ఇలా చేయకుంటే అందరిలో విభేదాలు వస్తాయి. ఇంటి పెద్దలు ఎప్పుడూ కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డబ్బు ఖర్చు చేయాలి.  పిల్లల భవిష్యత్తు కోసం కూడా పొదుపు చేయాలి. అనవసరంగా ఖర్చు చేస్తే ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉంటుంది.                                                   *రూపశ్రీ.
  అమ్మాయిలు, అబ్బాయిలు.. ఈ జెండర్ మధ్య బేధమే పెద్ద అట్రాక్షన్. అబ్బాయిల పట్ల అమ్మాయిలు.. అమ్మాయిల పట్ల అబ్బాయిలు ఆకర్షితులవడం చాలా కామన్. వ్యక్తిత్వం వల్ల కావచ్చు, అందం వల్ల కావచ్చు, స్టైల్ వల్ల కావచ్చు.. ఏదో ఒక విషయానికి ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులవడం అనేది మాత్రం జరిగేదే. అయితే అబ్బాయిలు ఎవరైనా అమ్మాయిలను చూసి ఆకర్షితులైతే మనసులో దాచుకోలేరు. ఆ ఆకర్షణ ఎక్కువ రోజులు కొనసాగి అదలా ప్రేమగా మారే సందర్భాలు కూడా ఉంటాయి. కానీ అమ్మాయిలు మాత్రం ఎవరైనా అబ్బాయి తనకు నచ్చినా, అబ్బాయిలో కొన్ని విషయాలు నచ్చినా అస్సలు బయట పడరు. బయటకు చెప్పరు కూడా. అమ్మాయిలకు అబ్బాయిలలో నచ్చే విషయాలు కొన్ని ఉన్నాయి. వాటి వైపు ఓ లుక్కేస్తే.. ఫొటోలంటే చాలా ఇష్టం.. అమ్మాయిలకు ఫొటోలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా తనకు నచ్చిన అబ్బాయితో ఫొటో దిగడమంటే ఎక్కడలేని సంతోషం వారిలో ఉంటుంది. అబ్బాయిలు తమకు తాము ఇద్దరికీ కలిసి ఫొటోలు తీయాలని, వీడియోలు తీయాలని  అమ్మాయిలు కోరుకుంటారు. ఇలా ఫొటోలు తీసే అబ్బాయిల పట్ల వారు మరింత ప్రేమతో ఉంటారు. ఓపెన్ గా మాట్లాడటం.. ఓపెన్ గా మాట్లాడే అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టం.  జీవితం గురించి ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలు, ఇద్దరికి సంబంధించిన కలల గురించి ఓపెన్ గా మాట్లాడటం, ఏదైనా విషయం గురించి లోతుగా మాట్లాడటం లేదా చర్చించడం మొదలైనవి చేయడం వల్ల ఇద్దరి మధ్య బంధం చాలా డీప్ గా ఉన్నట్టు వారు ఫీలవుతారు. అంతేనా అమ్మాయి చెప్పే విషయాన్ని శ్రద్దగా వినేవారు అయితే ఇక అమ్మాయిలకు చాలా పిచ్చి ప్రేమ ఏర్పడుతుంది.  అందుకే అమ్మాయిని ప్రేమిస్తే వారు చెప్పేది శ్రద్దగా వినడం ముఖ్యం. కౌగిలి.. ఒక కౌగిలి బోలెడు ధైర్యాన్ని, నీకు నేనున్నా అనే నమ్మకాన్ని, జీవితం మీద భరోసాను  ఇస్తుంది. తన భాగస్వామి తనను కౌగిలించుకోవడం వల్ల అమ్మాయికి తన భాగస్వామి మీద ప్రేమ పెరుగుతుంది. అమ్మాయిలు బాధలో ఉన్నప్పుడు,  ఆమె దిగులుగా ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు దగ్గరకు తీసుకోవడం, కౌగిలించుకోవడం,  ఆమె వీపును ప్రేమగా నిమరడం లాంటివి చేస్తే తన అలసట, బాధ అన్నీ మర్చిపోతుంది.                                          *రూపశ్రీ.
  ప్రేమ ఇప్పట్లో స్కూల్ పిల్లల మధ్యన కూడా వినిపిస్తున్న మాట. కాలేజీ వయసు వచ్చేసరికి ప్రేమ పేరుతో శృతి మించిపోయేవారు కూడా అధికంగా ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ అనేది చాలా వరకు కనిపించట్లేదు. ఆకర్షణ లేదా స్వార్థం కోసం చాలామంది చనువు పెంచుకుని దాన్నే ప్రేమ అని పిలుస్తున్నారు కూడా.  ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉందా లేదా? తెలుసుకోవడం ఎలా అని చాలామంది గందరగోళానికి గురవుతూ ఉంటారు. అయితే నిజమైన ప్రేమ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కొన్ని విషయాలు చాలా దోహదపడతాయి. అవేంటో తెలుసుకుంటే.. చాలామంది లవ్ పార్టర్ నుండి ఖరీదైన బహుమతులు ఆశిస్తుంటారు. నాకు అది కావాలి, ఇది కావాలి  అని అడుగుతూ ఉంటారు కూడా. ఒకవేళ డిమాండ్ కు తగ్గట్టు ఏమైనా ఇవ్వకపోతే నీకు అసలు నా మీద ప్రేమ లేదు అనేస్తుంటారు. ఇలా ఖరీదైన బహుమతులు ఇస్తేనే ఇద్దరి  మధ్య ప్రేమ ఉందని అంటూంటే ఆ రిలేషన్ లో ప్రేమ లేదని అర్థం. ప్రేమ ఉన్నంత మాత్రానా అన్నీ ఓపెన్ గా చెప్పేయాలని కాదు అర్థం. ప్రేమలో ఉన్న భాగస్వామి వ్యక్తిగతానికి సంబంధించిన పాస్వర్డ్ లు, ఇతర విషయాలు చెప్పమని బలవంతం చేస్తుంటారు కొందరు. ఇలా చేసేవారి  మధ్య ప్రేమ లేనట్టేనని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు.  అలాంటి బంధాలు ఎక్కువ కాలం నిలవడం కూడా కష్టమేనట. ఎప్పుడైతే ఒకరి స్పేస్ ను గౌరవిస్తామో.. అప్పుడే ప్రేమ కూడా ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య స్పేస్ అనేది చాలా ముఖ్యం. ఒకరి గురించి మరొకరికి ప్రతీదీ తెలియాలి అనుకునే మెంటాలిటీ చాలామందిలో ఉంటుంది. అలాంటి వారికి పోసెసివ్ నెస్ ఎక్కువ కూడా. అయితే ఇలాంటి వారి మధ్య కూడా   ప్రేమ కంటే అభద్రతా భావమే ఎక్కువ ఉంటుంది. అభద్రతా భావం ఉన్న రిలేషన్ లో వ్యక్తి పట్ల నమ్మకం, ప్రేమ అనేవి ఉండవు. రానురాను అభద్రతాభావం కాస్తా అనుమానంగా మారే అవకాశం కూడా ఉంటుంది. లవ్ లో ఇద్దరి మధ్య స్పేస్ తగినంత ఉండకపోవడమే కాదు.. అస్సలు  భాగస్వామిని పట్టించుకోకుండా  తన మానాన తనును  ఉండనివ్వడం కూడా ప్రేమ లేకపోవడాన్ని సూచిస్తుంది.  ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడు సాధారణమైన విషయాలను అంతగా పట్టించుకోకుండా ఎలా లైట్ తీసుకుంటారో.. తన పార్ట్నర్ కు ఏం కావాలి? ఏం అవసరం అనేది పట్టించుకోవడం బాగోగులు, అవసరాల గురించి తెలుసుకోవడం కూడా అంతే అవసరం. ఏదైనా ఒక పని చేయాలని అనుకొనేటప్పుడు ఖచ్చితంగా చెప్పే చేయాలి అనే మెంటాలిటీ ఉంటే మాత్రం ఆ ఇద్దరి మధ్య ప్రేమ కొరవడినట్టే. అందులో ఆధిపత్యం, అహంకారం, తన భాగస్వామికి స్వేచ్ఛ ఇవ్వకపోవడం వంటివి ప్రేమను డామినేట్ చేస్తాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఫోన్ కు చాలాప్రాముఖ్యత ఉంది. భాగస్వామి కంటే ఫోన్ కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నా, ఫోన్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నా.. పార్ట్నర్ మీద ప్రేమ విషయంలో ఆలోచించుకోవాల్సిందే. అంతేకాదు.. భాగస్వామి ఫోన్ చెక్ చేయడం,  ఫోన్ లో జరిగే ప్రతి కార్యకలాపం తనకు తెలిసే జరగాలని అనుకోవడం.. అలాంటివన్నీ ప్రేమకంటే ఎక్కువ అభద్రతాభావం, అనుమానం లాంటి వాటిని బలపరుస్తాయి. కాబట్టి అలాంటివి ఉన్న బంధం ప్రేమ అనుకోవడం పొరపాటు.                                                        *రూపశ్రీ.
ఉప్పు వంటకు రుచిని ఇస్తుంది.  ఉప్పు లేని వంట ఎవరూ తినలేరు కూడా.  ఉప్పులో చాలా రకాలున్నాయి. వాటిలో రాతి ఉప్పు, సాధారణ ఉప్పు మాత్రమే కాకుండా కొన్ని రకాల స్నాక్స్ లోనూ, వంటలలోనూ  ప్రత్యేకంగా నల్ల ఉప్పును వాడుతుంటారు.  బ్లాక్ సాల్ట్ అని పిలుచుకునే ఈ నల్ల ఉప్పును నీటిలో కలిపి ప్రతి రోజూ ఉదయమే ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలుంటాయని అంటున్నారు.  నల్ల ఉప్పును, నల్ల ఉప్పు నీటిని ఆరోగ్య ప్రయోజనాల కోసం.. ఆయుర్వేదంలో చాలా ఏళ్ల నుండి ఉపయోగిస్తున్నారు.  నల్ల ఉప్పులో సోడియం క్లోరైడ్,  పొటాషియం,  మెగ్నీషియం,  ఐరన్ వంటి ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. నల్ల ఉప్పు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే ఏం జరుగుతుందంటే.. నల్ల ఉప్పు నీరు కాలేయాన్ని శుధి చేయడంలో  సహాయపడుతుంది. ఈ ఉప్పు ప్రత్యేకత ఏమిటంటే ఇది కాలేయ కణాలలో పేరుకుపోయిన మురికిని బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది మాత్రమే కాకుండా కాలేయం  పనితీరును వేగవంతం చేస్తుంది.  కాలేయానికి పొంచి ఉండే ఇతర  వ్యాధులను నివారిస్తుంది. కేవలం కాలేయాన్ని మాత్రమే కాదు..  నల్ల ఉప్పు నీరు తాగితే శరీరం కుడా శుద్ది అవుతుంది.  శరీరంలో ఉండే టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. చర్మ సంబంధ సమస్యలను తగ్గించడంలో నల్ల ఉప్పు నీరు చాలా సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ది చేస్తుంది.  చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నల్ల ఉప్పు నీరు తాగడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.  మలబద్దకం సమస్యను  తగ్గించడంలో సహాయపడుతుంది. మలబద్దకాన్ని తగ్గించడం ద్వారా ఫైల్స్ సమస్య కూడా తగ్గుతుంది.   ఒకే రకమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది ఎసిడిటీ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే నల్ల  ఉప్పు నీటిలో ఆల్కలీన్ స్వభావం ఉంటుంది.  ఇది ఎసిడిటీని తగ్గించడంలో.. కడుపులో ఆమ్లాలను తటస్థం చేయడంలో సహాయపడుతుంది.  గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ నుండి ఉపశమం కలిగిస్తుంది.  ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నల్ల ఉప్పు,  కాసింత నిమ్మరసం కలిపి తీసుకుంటే ఎసిడిటీ సమస్య మరింత తొందరగా తగ్గుతుంది. జీవక్రియ కూడా బాగుంటుంది.                                                *రూపశ్రీ.
మన చుట్టూ చాలా మొక్కలు ఉంటాయి. చాలా వరకు మొక్కల పేర్లు కూడా చాలామందికి తెలియవు,  కానీ ఆయర్వేద పరంగా చూసినప్పుడు ప్రతి మొక్క ఆద్బుతం అనిపిస్తుంది.  అలాంటి మొక్కలలో నేల ఉసిరి కూడా ఒకటి.  ఉసిరి చెట్టు ఆకులను పోలి ఉండి  నేలమీద పెరిగే ఈ నేల ఉసిరి మొక్క ఫ్యాటీ లివర్ సమస్యలకు అధ్భుతంగా పనిచేస్తుంది. అసలు ఫ్యాటీ  లివర్ అంటే ఏంటి? ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి నేల ఉసిరి ఎలా పని చేస్తుంది? తెలుసుకుంటే.. ఫ్యాటీ లివర్ లో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఇది అధికంగా తాగడం వల్ల వస్తుంది. రెండవది ఆల్కహాలిక్ లేని ఫ్యాటీ లివర్.  ఇది జీవనశైలి, జన్యుశాస్త్రం, తినడం,  త్రాగడంలో అజాగ్రత్త లేదా కొన్ని ఔషధాల  దుష్ప్రభావాల వల్ల కూడా వస్తుంది. ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్  పెద్ద వ్యాధిగా రూపాంతరం చెందుతోంది. వైద్యుల ప్రకారం 10 మందిలో 6-7 మందికి ఫ్యాటీ లివర్ సమస్య ఉండవచ్చు. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదకరమని వైద్యులు కూడా చెబుతున్నారు. ఇది ఎక్కువగా పెరిగితే లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాలేయం సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో ఉండే కొవ్వు,  ప్రోటీన్ చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీన్ని LDL లేదా తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ అంటారు. ఈ చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా వేగంగా పెరుగుతుంది.  ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారిలో కడుపు  కుడి ఎగువ భాగంలో నొప్పి ఉంటుంది. బరువు తగ్గడం, బలహీనంగా అనిపించడం, కళ్లు,  చర్మం పసుపు రంగులోకి మారడం, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, ఎసిడిటీ లేదా పొట్టలో ఉబ్బరం.. ఇవన్నీ ఫ్యాటీ లివర్ వ్యాధికి సంకేతాలు.   నేల ఉసిరి ఎలా పనిచేస్తుందంటే.. నేల ఉసిరి ఒక ఆయుర్వేద ఔషధం. దీని పండ్లు సరిగ్గా ఉసిరి లాగా ఉంటాయి. అలాగే దీని ఆకులు కూడా ఉసిరి చెట్టు ఆకులను పోలి ఉంటాయి. కానీ  ఇది చాలా చిన్న మొక్క. అందుకే దీనిని  నేల ఉసిరి అంటారు.  నేల ఉసిరి మాత్రలు అందుబాటులో ఉంటాయి.  ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు వీటిని తీసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ సహజంగా నయమవుతుంది. ఇది మాత్రమే కాకుండా పునర్నవ లేదా తెల్ల గలిజేరు కూడా   ఫ్యాటీ లివర్ తగ్గిస్తుంది. పునర్నవలో పునరుత్పత్తి అంటే కొత్త కణాలను తయారు చేసే గుణం ఉంది.   ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.  భోజనం చేసే ముందు పునర్నవ రసం తీసుకోవడం వల్ల గ్యాస్ ఏర్పడదు, అలాగే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. పునర్నవలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.  ఇవి కాలేయ సంబంధిత వ్యాధులను నయం చేస్తాయి.                       *రూపశ్రీ.