స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే అనుకుంటాం.. కానీ మన చుట్టూ ఉన్న అందమైన ప్రపంచాన్ని పట్టించుకోనప్పుడు మన చేతిలో ప్రపంచం ఉంటే మాత్రం ఏం ప్రయోజనం.     ఒకప్పుడు మన అనుకున్న వాళ్ళు దూరంగా ఉంటే ఉత్తరాలు రాసుకునే వారు.. తరువాత ఫోన్ హలో అంటూ పలకరించి ఆ దూరాన్ని దగ్గర చేసింది.. తర్వాతర్వాత ఫోన్ వాడకం పెరిగిపోయి దూరంగా ఉన్నవాళ్ళని దగ్గర చేయాల్సింది పోగా దగ్గరున్న వాళ్ళని కూడా దూరం చేస్తుంది.. ప్రతి వ్యక్తి జీవితంలో ఫోన్ ఒక భాగమైపోయింది.. ప్రస్తుతం జియో పుణ్యమా అని ఫోన్ బాడీలో ఒక పార్ట్ అయిపోయింది.. దీని ఆఫర్ల మోతతో ఇతర కంపెనీలు భయపడ్డాయి.. ప్రజలు ఆనంద పడ్డారు.. ఇక మిగతా కంపెనీలు కూడా ఆఫర్లు మొదలుపెట్టాయి..  అంతా నెట్ మయం అయిపోయింది.     గేమ్స్, వీడియోస్, చాటింగ్ ఇలా ఫోన్ లో మునిగిపోతూ పక్కన వాళ్ళకి దూరమవుతున్నారు.. ఫోన్ పుణ్యమా అని మన వాళ్ళకి దూరమవ్వడమే కాదు, మనకి మనమే దూరమవుతున్నామట.. అర్ధంకాలేదా.. 24 గంటలు ఫోన్ వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయట.. అందుకే ఫోన్ వాడకం తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.. తెలిసింది కదా.. ఫోన్ వాడకం తగ్గించండి.. మీ వాళ్ళతో ఆనందంగా గడుపుతూ, ఆరోగ్యంగా ఉండండి.
పార్లమెంట్ లో వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతుండటంతో టీడీపీ,బీజేపీపై పోరుకు సన్నద్ధమవుతున్నట్లే కనిపిస్తున్నాయి తాజా పరిణామాలు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబును సచివాలయంలో కలవటం,దాదాపు గంటకుపైగా చర్చించటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు విభజన చట్టంపై తాను గతంలో రాసిన లేఖపై చర్చించేందుకే తనను పిలిపించారని సమావేశ అనంతరం మీడియాకు తెలిపారు.     ఉండవల్లి పార్లమెంట్ లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబుకు సూచనలు చేసినట్లు తెలుస్తుంది. ఉండవల్లి మొదటి నుంచి విభజన చట్టవిరుద్ధంగా జరిగిందని కేంద్రంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టులో తాను వేసిన వ్యాజ్యం, రాష్ట్రపతి, ప్రధానికి గత ఏడాది తాను రాసిన లేఖల ప్రతులనూ బాబుకు అందజేశారు. రాష్ట్ర విభజన అంశంపైనా, దాని పై మోదీ చేసిన వ్యాఖ్యలపైనా పార్లమెంటు సమావేశాల్లో నిలదీయాలని సీఎంకు సూచించారు.విభజన చట్టవిరుద్ధంగా జరిగిందని పేర్కొంటూ స్వల్ప కాలిక చర్చకు నోటీసు ఇవ్వాలని చెప్పానన్నారు. మరి ఉండవల్లి ఇచ్చిన సూచనల్ని చంద్రబాబు ఫాలో అవుతారో?లేదో?.
నేటి బాలలే రేపటి పౌరులు అంటారు.అలాంటి పిల్లలు విద్య కోసం నిత్యం ప్రాణసంకటంగా ప్రయాణం చేయవలిసిన దుస్థితి లంక గ్రామల్లో నెలకొంటోంది. ఎంతో ప్రశాంతంగా ఉండే గోదావరి  ప్రయాణంతో ఆహ్లాదంగా  పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, కానీ విధి ఆ పిల్లల జీవితాలను హరించుకుపోయింది.ఈ నెల 14 న అనుకోని సంఘటన గోదావరిలో పడవ బోల్తా పడటంతో విద్యార్థులు గల్లంతయ్యారు.వీరంతా పశువుల్లంక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో విద్యని అభ్యసిస్తున్నవారు.       26 మంది ఆ గ్రామానికి చెందినవారు కాగా అందులో 11 మంది బాలురు, 15 మంది బాలికలున్నారు. వీరిలో ఆరుగురు విద్యార్థినులు గల్లంతవ్వటంతో తోటి విద్యార్థులు, వారి తల్లి తండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇందులో సోమవారం సాయంత్రం 5.30  గంటలకు మత్యకారులకు భైరవపాలెం మొగ వద్ద ఒకరి మృతదేహం లభ్యమవ్వగా ఇంకా ఐదుగురి ఆచూకీ లభించలేదు. యంత్రాంగం రేయంబవుళ్లు యుద్దప్రాతిపదికన గాలింపు చర్యలు చేపడుతున్నా ఫలితం కనిపించట్లేదు.
ALSO ON TELUGUONE N E W S
అద్భుతాలు అరుదుగా జరుగుతుంటాయ్. అలా జరిగిన ప్రతిసారీ.. చరిత్ర కొత్త మలుపు తీసుకుంటూ ఉంటుంది. అది ఏరంగులోనైనా. ముఖ్యంగా సినిమా రంగంలో. అడపాదడపా వచ్చే ఈ తరహా అద్భుతాలనే... కల్ట్ మూవీస్ అంటారు. సినిమా పరిభాషలో 'ట్రెండ్ సెట్టర్' అంటారు. ఈ సినిమాలూ... తెరకు కొత్త కల్చర్ నేర్పుతాయన్నమాట పాతాళభైరవి, మాయాబబార్, మిస్సమ్మ ఈతరహా సినిమాలే ఆ వరుసలోనే చెప్పుకోదగ్గ సినిమాయే 'లక్షాధికారి'. 'లక్షాధికారి'కి ముందు తెలుగు సినిమా అంటే... కష్టాలూ, కన్నీళ్లు, అనురాగాలూ, ఆప్యాయతలు, మహా అయితే... అప్పుడప్పుడు కాస్త హీరోయిజం. అయితే.. వాటితోపాటు సినిమా కథల్లోకి సస్పెన్స్ థ్రిల్లర్ అనే కొత్త అంశాన్ని కూడా చేర్చిన సినిమా 'లక్షాధికారి'. కథలో అందరూ మనసున్న మనుషులే కనిపిస్తుంటారు. కానీ... ఎవరో ఓ అపరిచితుడు హత్యలు చేస్తూ ఉంటాడు. వాడి కారణంగా అమాయకులు బలైపోతుంటారు. అసలు ఈ హత్యలెందుకు జరుగుతున్నాయ్? సదరు వ్యక్తి ఏం ఆశించి ఈ హత్యలకు తెగబడుతున్నాడు? ఆసలు ఆ వ్యక్తి ఎవరు? ఇవన్నీ చూస్తున ప్రేక్షకుడ్ని వెంటాడే ప్రశ్నలు. హీరో ఆ దుర్మార్గుడికోసం వెతుకుతుంటాడు. చివరకు ఉత్కంఠకు తెర దించుతూ... ఆ దుర్మార్గుడ్ని హీరో తుదముట్టిస్తాడు. ఇలాంటి కథలు మనం చాల చూసుంటాం కదా. అవి మొదలైంది 'లక్షాధికారి' నుంచే. తొలిసారి ఇలాంటి కథను తెరపై చూసినప్పుడు అప్పటి జనాలు ఎలా ఫీలైవుంటారో ఒక్కసారి ఊహించుకోండి. అందుకే 'లక్షాధికారి' ఓ ట్రెండ్ సెట్టర్. అందుకని ఈ సినిమాలో సస్పెన్స్ మాత్రమే ఉంటుందనుకుంటే మీరు పొరబడ్డట్టే. ఇందులో ప్రేమ ఉంటుంది. బంధాలకై వెతుకులాట ఉంటుంది. కర్ణపేయమైన టి. చలపతిరావు సంగీతం ఉంటుంది. కావాల్సినంత హీరోయిజం ఉంటుంది. టోటల్ గా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలూ ఉంటాయ్. అందుకే సినిమా విడుదలైన 65 ఏళ్లయినా... ఇంకా జన హృదయాల్లో నిలిచేవున్నాడు 'లక్షాధికారి'. ఇక ఎన్టీఆర్... ఏ ముహూర్తాన హీరో అయ్యాడో కానీ... మాస్ కి దేవుడై కూర్చున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాతో అయితే... మాస్ ని ఓ రేంజ్ లో మురిపించేశాడాయన. హిరోయిన్ కృష్ణకుమారితో రొమాన్స్ కానీయండీ... ఆ యుద్దాలు కానీయండి.. ఆ కామెడీ కానీయండి నిజంగా అద్భుతం అనుకోండి. ఈ ప్రయోగాత్మకమైన కథలో దర్శకుడు వి. మధుసూదనరావు చేసిన మరో వినూత్న ప్రయోగం రోబోలతో ఫైట్. 1963 లోనే ఆయన అంత కొత్తగా ఆలోచించాడు. కుదిరితే ఓ సారి చూడండీ... ఇప్పటి ప్రేక్షకులకు కూడా కొత్తగా ఉంటుంది. ఆ ఫైట్. ఉత్కంఠకులోను చేస్తుంది. ఇక ఈ సినిమా విషయంలో ముఖ్యంగా చెప్పుకోవలసిన వ్యక్తి గుమ్మడి. మేకతోలు కప్పుకున్న పులి... నమ్మక ద్రోహి... గోముఖ వ్యాఘ్రం.. ఇలాంటి పేర్లకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తాడు ఇందులో గుమ్మడి మహామహులు నటించిన ఈ సినిమాలో నటునిగా నంబర్ వన్ మాత్రం గుమ్మడే. ఆ పాత్ర గొప్పతనం అలాంటిది. ఎన్టీఆర్, కృష్ణకుమారి, నాగయ్య, గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి, సూర్యకాంతం, గిరిజ... ఇలా వెండితెర దిగ్గజాలన్నీ నటించిన ఈ చిత్రం తెలుగు సినిమా ఉన్నంతవరకూ మరపురానిదే. ఇంకెందుకు ఆలస్యం... చూసేయండి.  
విజయ్‌ దేవరకొండి ఎవరు అంటే వెంటనే ఎవరూ జవాబు చెప్పలేకపోవచ్చు. కానీ అర్జున్ రెడ్డి అంటే మాత్రం మన విజయ్ ఠక్కున గుర్తుకువచ్చేస్తాడు. అతనికి ఆ సినిమా ఇచ్చిన హైప్‌ అలాంటిది మరి. అందుకే అర్జున్‌రెడ్డి పాత్రకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు కూడా దాసోహం అయిపోయింది. కానీ ఆ అవార్డు చూసిన విజయ్‌కి ఓ ఆలోచన వచ్చింది. అవార్డు వల్ల పేదవాళ్లకి ఏదన్నా ఉపయోగం కలిగితే బాగుండు అనిపించింది. వెంటనే తన అవార్డుని అమ్మేస్తున్నాననీ, దాన్ని అమ్మగా వచ్చిన డబ్బుని సీఎం రిలీఫ్‌ ఫండుకి అందిస్తాననీ ప్రకటించేశాడు. అర్జున్‌రెడ్డి ఇస్తానంటే కాదనేవాళ్లు ఎవరు! ఈ ప్రకటనకు స్పందించిన దివీస్‌ కంపెనీ యాజమాన్యం జస్ట్‌ పాతిక లక్షలు పెట్టి అవార్డుని కొన్నదట. ఓ నాలుగైదు లక్షలకు మించి పలకదు అనుకున్న అవార్డు కాస్తా పాతిక లక్షలు పలికేసరికి ఉబ్బి తబ్బిబ్బైపోయారట విజయ్‌! మరి అర్జున్‌ రెడ్డా మజాకా! ఏం చేసినా రికార్డు బద్దలు కావాల్సిందే!!!
It’s no news that a biopic is being made on the life of Sunny Leone. To avoid strict censorship, the biopic is set to be released in the form of web series. The movie is named as "Karanjit Kaur: The untold story of Sunny Leone". This will follow the journey made by Sunny as a normal girl to the most googled Indian. However, the movie is now creating a controversy. Reason! The usage of the suffix KAUR in the title. Sunny leone is a sikh and Karanjit Kaur is her religious name. But the Shiromani Gurdwara Parbandhak Committee (SGPC) is objecting the actress using "Kaur" in her name. They alleged that Sunny has never followed the rules of their religion and she has no repect for their guru.
Irfan Khan, the Bollywood character actor who has won many accolades for his performances has shocked the nation recently. He revealed that he has been diagnosed with a rare disease called neuroendochrine tumour. Irfan is presently undergoing treatment in London and no one is aware whether the treatment is a success or not. It’s been months since Irfan has been admitted into hospital and there was no positive report regarding his treatment. However here is good news at last. He has released his picture on the twitter revealing that he was in a happy and healthy condition. Ifran looked weak in the photo but there were signs that he was recovering from the deadly cancer. So, we might be seeing Irfan back in action!
రామ్‌గోపాల్‌ వర్మ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన అజయ్‌భూపతి దర్శకత్వంలో వచ్చిన సినిమా RX100. విమర్శకులు ఈ సినిమాని చూసి కాస్త పెదవి విరిచినా, యూత్‌కి మాత్రం తెగ నచ్చేసింది. హీరో హీరోయిన్ల మధ్య ఉన్న రొమాంటిక్‌ సన్నివేశాలూ, విభిన్నమైన క్లైమాక్స్ చూసేందుకు కుర్రకారు ధియేటర్లకు ఎగబడుతున్నారు. అందుకనే వీకెండ్‌ కలెక్షన్లతో ఈ సినిమా పది కోట్ల మార్కుని దాటేసింది. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లు నటించిన ఈ సినిమా మొత్తానికి హిట్‌ టాక్‌ తెచ్చేసుకుంది. సాధారణంగా కొత్త సినిమాల గురించి మాట్లాడని రామ్‌గోపాల్‌ వర్మ సైతం ఈ చిత్రాన్ని పొగడ్తలతో ముంచెత్తాడు. తన అసిస్టెంటుకే అసిస్టెంటుగా చేయాలనుందని వాక్రుచ్చాడు. మొత్తానికి పంక్చర్‌ అయిపోయిందనుకున్న సినిమా కాస్తా యూత్‌ పుణ్యమా అని హిట్‌ అయిపోయిందన్నమాట!
From Rana to Sumanth... every major actor in Tollywood is getting a role in the prestigious biopic of Late NTR. But Jr. NTR is said to have been kept aside from the project. When asked about his role in the project Jr. NTR got a little bit furious and replied "I haven't received a call regarding the NTR biopic. If you know something, please tell me. If I come to know anything about NTR biopic, I will inform you." But people of film nagar knew the obvious reasons for which JR. NTR was being avoided for the film. The NTR’s family, especially the likes of Balakrishna has never accepted Jr. NTR as a part of their family. He was always treated as an outsider. Every attempt of Jr. NTR to be apart of the family was never welcomed. Only Harikrishna and Kalyan Ram embraced Jr. NTR as their relative. So, it’s no surprise that he won’t be getting a role in the biopic.
సత్యం రాజేష్! సుమంత్‌ నటించిన సత్యం సినిమాతో మంచి పేరు తెచ్చుకుని అదే సినిమాని, తన పేరుకి జోడించుకున్న నటుడు. ఆ తర్వాత తన కెరీర్‌లో పెద్ద హిట్లేమీ లేకపోయినా, దొరికిన ప్రతి అవకాశాన్నీ రెండుచేతులా అందిపుచ్చుకున్నాడు. ఇండస్ట్రీని వదలకుండా ఉన్నాడు. ఆ డెడికేషన్ ఇప్పటికి కలిసొచ్చింది. ఏకంగా హీరో అవకాశాన్నే అందించింది. రాజ్‌కిరణ్‌ దర్శకత్వంలో వాస్తవ సంఘటనల ఆధారంగా ‘విశ్వామిత్ర’ అనే హారర్‌ మూవీని నిర్మిస్తున్నారు. అందులో సత్యం రాజేష్‌ కథానాయకుడిగా నటిస్తున్నాడు. విచిత్రం ఏమిటంటే... దర్శకుడు ఈ సినిమా స్ర్కిప్ట్‌ తీసుకుని చాలామంది హీరోయిన్ల దగ్గరకు వెళ్లారట. కథంతా ఆసక్తిగా విన్న హీరోయిన్లు సినిమా చేసేందుకు ఒప్పుకున్నారట. తీరా అందులో సత్యం రాజేష్ హీరో అని తెలియగానే డ్రాప్‌ అయిపోయారట. చివరికి నందితరాజ్‌ ఈ సినిమా చేసేందుకు ఒప్పుకుందట.
Telugu people may not be aware of the name Sundar C. But they could recognize him as the husband of yester year heroine Khushboo. Sundar C is a famous director and hero in Tamil movies. Sri Reddy now has showered a few bombs on him as a part of her Tamil leaks. Her is her fb post accusing Sundar C of using her off- ``Aranmanai shoot happend in Hyderabad,while that shooting time one person called Ganesh he is an executive producer of that film..some how he got my number through some one,he called me,I went to the shooting spot he introduced me to sundar c..I met my f.b Frd senthil kumar(camera man) also..that day he convinced me that definitely 200 percent you wl be in his next movie as a one of the lead .. next day he called me to the novotel,for keeping in his next movie he and sundar c wanted to compromise (sexually)..after that perumal knows what happend.. Ganesh is a fraud he didn't help me..’’
దేశ రాజధానిలో వేడి పుట్టనుంది. గడచిన కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ వర్షాలతో సతమతమైంది. అక్కడి ప్రజలు వర్షాలతో చలి కాచుకున్నారు. బుధవారం నుంచి వారే కాదు దేశవ్యాప్తంగా ప్రజలందరికీ వేడి పుట్టించే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు తమ సమస్యల పరిష్కారం కోసం లోక్‌సభ సమావేశాలను వేదికగా చేసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ అధికార భారతీయ జనతా పార్టీపై యుద్ధం ప్రకటించింది.     ఇందుకోసం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు, ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న పవన్ కల్యాణ‌ జనసేన కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీని నిలదీస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కష్టాల పాలైన తమను ఆదుకుంటామని, ప్రత్యేక హోదాతో అక్కున చేర్చుకుంటామని హామీ ఇచ్చిన ప్రధాన మంత్రి ఇప్పుడు ఆ మాటే ఎత్తకపోవడం తెలుగు ప్రజలను వంచించడమే. గడచిన ఐదు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ప్రత్యేక హోదా చుట్టూనే తిరుగుతూండడం విశేషం. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ముందు భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టిన చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాటు వారి మాయలో పడ్డారు. ప్రధానమంత్రిని నమ్మినందుకు నాలుగేళ్ళ తర్వాత పశ్చాత్తాపం పడుతున్నారు. ఇందులో చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. అది వేరే సంగతి. నాలుగేళ్ల పాటు హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మంచిదని నమ్మబలికిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇప్పుడు కేంద్రం వంచించిందంటున్నారు. మరోవైపు ప్రత్యేక హోదా అంశంపై నాలుగేళ్ల పాటు పార్లమెంటులో మాట్లాడని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఇప్పుడే ఈ అంశంపై పోరాటం చేయడం రాజకీయ ఎత్తుగడగానే పరిగణించాలి.     ఈ మొత్తం వ్యవహారంలో సమిధులైంది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. మూడు పార్టీల మూడు ముక్కలాటలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జోకర్‌లుగా మిగిలారు. లోక్‌సభ సభ్యత్వాలకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు రాజనామా చేశారు. ఆ రాజీనామాలను స్పీకర్ అంగీకరించడం కూడా జరిగిపోయింది. దీంతో బుధవారం నుంచి జరిగే వర్షాకాల సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు పాల్గొనే అవకాశం లేదు. ఇక మిగిలింది తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యులే. బుధవారం నుంచి జరిగే లోక్‌సభ సమావేశాల్లో  ఎలాంటి వ్యూహం అనుసరించాలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇన్నాళ్లూ బద్ద శత్రువుగా చూసిన ఉండవల్లి అరుణ్ కుమార్‌తో ముఖ్యమంత్రి అమరావతిలో భేటీ అయ్యారు. ఇది మంచి పరిణామం. కొంతకాలంగా ఉంవడల్లి అరుణ్ కుమార్ ప్రత్యేక హోదాపై పలు సూచనలు చేస్తున్నారు. ఇంతకు ముందు పత్రికల ద్వారా సూచనలు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడికే నేరుగా చెప్పారు.      ఈ సూచనల్లో ప్రధానమైనది ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలే తెలుగు వారికి ఆయుధాలని చెప్పడం ప్రధానం. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలతో లోక్‌సభ సమావేశాల్లో మన వాదనను వినిపించ వచ్చునన్నది ఉండవల్లి సూచన. అయితే దీనికి మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి మద్దతు రాకపోవచ్చు. వారు వ్యతిరేకించకపోయినా సభలో ఏం మాట్లాడకుండా ఉంటే సరిపోతుందన్నది అధికార తెలుగుదేశం ఆలోచనగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా తెలుగుదేశం లోక్‌సభ ప్రజాప్రతినిధులను తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ సభ్యుల దగ్గరికి పంపించారు చంద్రబాబు నాయుడు. తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పార్లమెంటు సభ్యులు కె, కేశవరావు, జితేందర్ రెడ్డిలను  దగ్గరకు తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు సుజనా చౌదరి, కొనకళ్ల కలిసారు. తెలుగు వారి ఇబ్బందులపై కలసి పోరాడాలన్న వారి వినతికి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి సానుకూల స్పందన రావడం ముదావహం. మొత్తానికి బుధవారం నుంచి రాజధాని ఢిల్లీలో  తెలుగు వారి వాడీ, వేడీ ఎలా ఉంటుందో చూడాలి...!?
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. ఫుట్‌బాల్ అభిమానుల కేరింతలతో నెల రోజులు జరిగిన ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీల్లో విజేతగా ఫ్రాన్స్ నిలిచింది. అంచలంచెలుగా ప్రత్యర్ధులను తమ గోల్స్‌తో మట్టి కరిపించిన ఫ్రాన్స్ ఫైనల్ ప్రత్యర్ధి క్రొయేషియాపై 4 - 2 గోల్స్ తేడాతో అఖండ విజయం సాధించింది. నెల రోజులుగా ఆశగా చూస్తున్న  ఫ్రాన్స్ ఫుట్‌బాల్ అభిమానులకు అద్భుతమైన కానుక అందించారు ఆ జట్టు ఆటగాళ్లు. ఫ్రాన్స్‌కు ఇది రెండో ప్రపంచ కప్ విజయం. తొలిసాకి 1998 సంవత్సరంలో తొలిసారి ప్రసంచ కప్ గెలిచిన ఫ్రాన్స్ ఆ కల ఈడేరడం కోసం ఏకంగా రెండు దశాబ్దాల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది.  ఇరవై సంవత్సరాల తర్వాత తీరిన కలతో ఫ్రాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆ జట్టు అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దు. మన దేశంలో కూడా ఫుట్‌బాల్‌ పట్ల ఎంతో ఆదరణ ఉంది.     క్రికెట్‌ను మాత్రమే ఆదరిస్తారని ఇన్నాళ్లూ అన్నుకున్న భారత క్రికెట్ అభిమానులకు ఈ ఫుట్‌బాల్ అభిమానులు చూపించిన ఆదరణకు అదిరిపోతారు. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ పట్ల ప్రజల్లో ఎంత క్రేజ్ ఎంతో ఉందో ఈసారి పోటీలు మళ్లీ మరోసారి నిరూపించాయి. నాలుగేళ్లకొకసారి జరిగే ఈ పోటీలకు ఈసారి రష్యా ఆతిథ్యం ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 32 జట్లు పాల్గొన్న ఈ ప్రపంచ కప్ పోటీలు అన్నీ ఉత్కంఠగా జరిగినవే. చివరికి అతి చిన్న జట్టుగా అసలెలాంటి అంచనాలు లేని క్రొమేషియా ఫైనల్‌కు రావడంతో ఒక్కసారిగా అందరి చూపు ఈ ఫైనల్‌పై పడింది. జయపజయాల మాట పక్కన పెడితే ఫుట్‌బాల్ క్రీడ మనుషుల్లో ఉన్న ఓ పట్టుదలను, విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూపిస్తుంది.     అందుకే ప్రపంచవ్యాప్తంగా ఏ క్రీడకు లేని క్రేజ్ ఈ ఫుట్‌బాల్ పట్ల చూపిస్తారు అభిమానులు. క్రికెట్ పట్ల కేవలం పది పన్నెండు దేశాలు మాత్రమే ఆసక్తి చూపిస్తే ఫుట్‌బాల్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంటుంది. దానికి కారణం ఈ పోటీ గంట లోపే ఫలితం తేలడంతో పాటు బరిలో ఇరు జట్లు చూపించే వ్యూహప్రతివ్యూహాలు ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. అందుకే కోట్ల మంది ఈ క్రీడ పట్ల ఎంతో ఆసక్తిని చూపిస్తారు. భారతదేశంలో పశ్చిమ బెంగాల్‌తో పాటు అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో నూ, కేరళలోనూ మాత్రమే ఫుట్‌బాల్ పట్ల క్రేజ్ ఉంది. ఆ రాష్ట్రాల నుంచే భారత ఫుట్‌బాల్ జట్టుకు క్రీడాకారులు ఎంపికవుతారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ క్రీడపై ఆసక్తి పెంచేందుకు భారత ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రయత్నాలు చేస్తోంది. దే:శంలో ఇంతకు ముందు ప్రపంచం గర్వించే ఫుట్‌బాల్ క్రీడాకారులున్నారు.     వారిలో అగ్రగణ్యుడు నివీల్డి డిసౌజా. భారత ఫుట్‌బాల్ క్రీడకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చిన క్రీడాకారుడు డిసౌజా. 1956 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ గోల్స్ సాధించి అనూహ్య విజయాన్ని అందించింది డిసౌజానే. ఆయన తర్వాత భారత ఫుట్‌బాల్‌‌కు దేవుడిచ్చిన వరంగా చెప్పుకునే బైచుంగ్ భాటియా. ఫుట్‌బాల్ క్రీడా ప్రపంచంలో బ్రెజిల్ క్రీడాకారులు పీలే, అర్జెంటీనా క్రీడాకారుడు డిగో మరడోనాలు ఎంత గొప్పవారు మన దేశానికి భాటియా కూడా అలాంటి క్రీడాకారుడే.     దేశంలో క్రికెట్ పట్ల మాత్రమే శ్రద్ధ చూపించే ప్రభుత్వాలు ఇతర క్రీడలపై కూడా ఆదరణ చూపిస్తే మనకు పీలేలు, డిగో మరడోనాలు తయారవుతారు. భారత జాతీయ క్రీడ హాకీని పట్టించుకోకపోవడం వల్ల ఆ క్రీడ దాదాపుగా కనుమరుగవుతోంది. క్రికెట్ ఒక్కటే మన క్రీడగా మిగులుతున్న దశ ఇది. ఈ జాడ్యం పోతే హాకీ, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, గ్రామీణ క్రీడలైన కబడ్డీ, కో కో వంటి క్రీడల్లో భారత్ ప్రపంచ దేశాలకు తమ సత్తా ఎంతటిదో చూపిస్తాయి.
కుమారస్వామి కంటతడి పెట్టారు. ఇది నిజంగా షాకింగే! మరీ ఆశ్చర్యపోవాల్సిన విషయమూ కానప్పటికీ… 2019లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కర్ణాటక సీఎం కంటతడి తప్పకుండా మాట్లాడుకోవాల్సిన విషయమే. అసలింతకీ ఆయనెందుకు ఏడ్చారు? నలభై సీట్లు కూడా లేని జేడీఎస్ నేత నక్క తోక తొక్కినట్టు అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ భయంతో కాంగ్రెస్ అతడ్ని బంపరాఫర్ ఇచ్చి రథ సారథని చేసింది. యడ్యూరప్ప సీఎం అవ్వకుండా ఆపగలిగింది. మరో రాష్ట్రం మోదీ వశం కాకుండా అడ్డుకుంది. కానీ, కాంగ్రెస్ మార్కు రాజకీయం నిత్యం భరిస్తూ ముళ్లపాన్పు లాంటి సీఎం కుర్చీపై కూర్చోటం కుమారస్వామికి ఎంత కష్టమో త్వరగానే తెలిసిపోయింది!     చరిత్రలో అనేక సార్లు కాంగ్రెస్ సంకీర్ణ  ప్రభుత్వాల్లో వుంటూ వచ్చింది. కానీ, ఎప్పుడూ కూడా తాను ప్రధాన పార్టీగా వుంటేనే ఆ గవర్నమెంట్లు అయిదేళ్లు నెగ్గుకొచ్చాయి. కాంగ్రెస్ మద్దతు ఇస్తూ మరో పార్టీ ప్రభుత్వం నడుపుతుంటే … ఆ సర్కార్ అయిదేళ్లు నడవటం అసాద్యమే. ఇది పదే పదే హస్తం నేతలు నిరూపించారు. కాంగ్రెస్ వ్యవహారంతో కొందరు ప్రధాని పదవులు కోల్పోతే అనేక మంది సీఎం పదవులు కోల్పోయారు. ఇప్పుడు కుమార స్వామి వంతు అన్నట్టు కనిపిస్తోంది పరిస్థితి. తనకు విషం తాగుతున్నంత కష్టంగా వుందని పార్టీ నాయకులు, కార్యకర్తల ముందు ఏడ్చేశాడు దేవెగౌర రాజకీయ వారసుడు. ఆ విషం తాగిస్తున్నది సంకీర్ణంలోని కాంగ్రెస్సేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా! ఒకవైపు నుంచీ మాజీ సీఎం సిద్దరామయ్య, మరో వైపు నుంచీ డాక్టర్ శివ కుమార్, మధ్యలో మల్లిఖార్జున ఖర్గే… ఇలా ఎవరికి వారు కన్నడ ప్రభుత్వంలో వేలు పెడుతున్నారు. కుమార స్వామి ఫ్రస్ట్రేషన్ కి కారణం అదే! ఆయన నిమిత్తమాత్రుడైన సీఎంలా మిగిలిపోయే ప్రమాదం పొంచి వుంది. అలా రబ్బర్ స్టాంప్ లా వుండటం ఖచ్చితంగా ఓ ప్రాంతీయ పార్టీ నాయకుడైన కుమార స్వామికి రాజకీయంగా ఆత్మహత్య అవుతుంది. అదే ఆయన దుఃఖానికి కారణం!     కుమార స్వామిని ముఖ్యమంత్రిగా జనం ముందు పెట్టి తరువాత అతడ్ని ఏమీ చేయకుండా అడ్డుకుంటున్నారు కన్నడ హస్తం నేతలు. వాళ్లు అలా చేస్తుండటంతో చెడ్డ పేరంతా కుమార స్వామి భరించాల్సి వస్తుంది. ఇది ముందు ముందు జేడీఎస్ పై జనం ఆగ్రహించే స్థితి తీసుకు రావచ్చు. అదే సమయంలో మరింత మంది ఓటర్లు బీజేపి వైపు మొగ్గ చూపవచ్చు. కాంగ్రెస్ ఆకతాయితనం వల్ల పార్లమెంటు ఎన్నికల ముందో తరువాతో మళ్లీ కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు వస్తే కమలానికి జనం స్పష్టమైన మెజార్టీ ఇవ్వొచ్చు. ఇదే కుమార స్వామి భయమంతా! అయినా కూడా కర్ణాటక కాంగ్రెస్ నేతల మాటలు ఆందోళనకరంగా వుంటున్నాయి. కుమార స్వామి కంటతడిపై కామెంట్ చేసిన మల్లిఖార్జున ఖర్గే… ఆయన ఇబ్బందుల్ని పరిష్కారిస్తామని అనలేదు. కాంగ్రెస్ మరింత సహకరిస్తుంది అని కూడా అనలేదు. సంకీర్ణంలో ఇలాంటి ఒత్తిళ్లు సహజం. తట్టుకుని ముందుకు సాగాలి అని సెలవిచ్చారు! అంటే, తమ వైపు నుంచి పెద్దగా మార్పుండదని చెప్పకనే చెప్పేశారు!     జేడీఎస్ కి, కర్ణాటక కాంగ్రెస్ కి మధ్య గొడవ నిజానికి జాతీయ సమస్య కాదు. అది ఆ రాష్ట్రానికే పరిమితం. కానీ, త్వరలోనే పార్లెమంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కర్ణాటక పరిణామాలు దిల్లీపై కూడా ప్రభావం చూపుతాయి. ఎలాగంటే, ఏ క్షణమైనా కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం కూలితే అది మోదీ, షాలకు బంగారు ఆవకాశం. జనం ఎంపీ ఎన్నికల్లో బీజేపీకే జై కొట్టే చాన్స్ వుంటుంది. కాంగ్రెస్ , జేడీఎస్ లను నమ్మకపోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం కూలకపోయినా… కుమారస్వామి చేత నిత్యం విషం తాగిస్తూనే కాంగ్రెస్ వారు ఇబ్బంది పెడితే… అది కూడా రెండు పార్టీలకు నష్టమే. ఎన్నికల్లోపు ఎంతో కొంత మంచి చేస్తేనే ఓటర్లు బీజేపికి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. లేదంటే, రాహుల్, కుమారస్వామి, సిద్దరామయ్య లాంటి వారి కంటే మోదీనే బెటర్ అని ఆయన వైపు మొగ్గు చూపుతారు.పైగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి ఛరిష్మా కూడా పని చేస్తుంది. ఇలా ఎలా చూసినా కుమార స్వామి కంటతడి… యడ్యూరప్ప ఆనందభాష్పాలుగా మారే సూచనలు పుష్కలంగా వున్నాయి. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటక, దక్షిణాదిలో కాంగ్రెస్ కు ఇంకా కాస్త పట్టుమిగిలిన కన్నడ నాట… హస్తం పార్టీ చాలా జాగ్రత్తగా వుంటే తప్ప మోదీని నిలువరించటం సాద్యం కాదు. ఈ విషయం గుర్తు పెట్టుకుని రాహుల్ కన్నడ కాంగ్రెస్ నేతల్ని నియంత్రించి కుమారస్వామి కళ్లు తుడిచే ప్రయత్నం చేయాలి! లేదంటే… మోదీకి కావాల్సిన ఎంపీ సీట్లు, యడ్యూరప్పకి కావాల్సిన ఎమ్మెల్యే సీట్లు రెండూ త్వరలోనే కమలం ఖాతాలో పడిపోవచ్చు! 
అతి సర్వత్రా వర్జయేత్. ఈ నానుడి సోషల్ మీడియాకు సరిగ్గా సరిపోతుంది. ఏ అంశంలోనూ ఎక్కువగా ఆలోచించకూడదని, దేని పైనా ఎక్కువ ప్రేమను కాని, ద్వేషాన్ని కాని పెంచుకోకూడదని కూడా ఈ ఆర్యోక్తి ప్రతిసారీ రుజువు చేస్తోంది. దీనికి తాజా ఉదాహరణ బీదర్‌‌లో జరిగిన సంఘటన. అక్కడున్న తమ వ్యవసాయ క్షేత్రాన్ని చూసేందుకు వెళ్లిన ఓ కుటుంబంపై గ్రామస్థులు కిడ్నాపర్లు అనే అనుమానంతో దాడి చేశారు. దాదాపు రెండు వందల మంది గ్రామస్థులు విక్షణారహితంగా దాడి చేసి కొట్టారు. ఈ దాడిలో మహ్మద్ అజాం అనే యువకుడు మరణించగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడికి కారణం ఒకవైపు అనుమానాలైతే... మరోవైపు దావానలంలా వ్యాపించిన వాట్సప్ మెసేజ్‌లు.     ఇది ప్రపంచంలో సోషల్ మీడియాకున్న ప్రాధాన్యం చెబుతున్నా.... మరోవైపు సోషల్ మీడియా మరో రూపాన్ని కూడా చాటుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబానికి బీదర్‌లో వ్యవసాయ క్షేత్రముంది. వారాంతపు సెలవులు కావడంతో ఆ కుటుంబంలో నలుగురు తమ వ్యవసాయ క్షేత్రాన్ని చూసేందుకు తమ కారులో బీదర్ వెళ్లారు. వీరిలో ఒకరు గూగుల్ ఉద్యోగి కాగా మరొకరు ఖతర్ దేశంలో పోలీస్ ఉద్యోగం చేస్తున్న మహ్మద్ సలాం. ఆయన ఇటీవలే హైదరాబాద్ వచ్చారు. ఖతర్ నుంచి వచ్చిన మహ్మద్ సలాం వరుసకు సోదరులైన మహ్మద్ అజం, మ‌హ్మద్ సల్మాన్, నూర్ మహ్మద్ నలుగూరూ తమ సొంత వాహనంలో బీదర్‌ జిల్లా హండీకేరాలో ఉన్న వ్యవసాయ భూముల వద్దకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ముర్కి గ్రామ పరిథిలోని టోకుల్లా బ్యాండ్ వద్ద వీరి కారు నిలిపారు. అక్కడికి సమీపంలో ఉన్న పాఠశాల విద్యార్ధినులకు ఖతర్ నుంచి తీసుకువచ్చిన చాక్లెట్లు పంచిపెట్టారు.      అదే వీరు చేసిన నేరం. వీరిని కిడ్నాపర్లుగా భావించిన ఉమేష్ బరాద్ అనే యువకుడు పిల్లలకు చాక్లెట్లను ఎందుకు పంచుతున్నారని ఓ వైపు ప్రశ్నిస్తూనే గ్రామస్థులకు తన వాట్సప్ ద్వారా గ్రామంలోకి కిడ్నాపర్లు వచ్చారనే సమాచారాన్ని అందించారు. అంతే ఒక్కసారిగా వందలాది మంది గ్రామస్థులు పాఠశాల సమీపానికి చేరుకుని నలుగురు యువకులపైనా దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కారు బోల్తా పడింది. గ్రామస్ధుల విచక్షణారహిత దాడిలో గూగుల్ ఉదో్యగి మహ్మమద్ అజీం ప్రాణాలు కోల్పోయారు.     ఈ సంఘటన రెండు వాస్తవాలను చెబుతోంది. ఒకటి విచ్చలవిడిగా.... అడ్డూ అదుపు లేకుండా వాడకంలోకి వచ్చిన సోషల్ మీడియా అయితే మరొకటి దేశంలో పిల్లలకు భద్రత లోపించిందనే అంశం. ముందుగా సోషల్ మీడియా విస్తరణ కారణంగా సమాజంలో నేరాలు... ఘోరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఫేస్‌బుక్ ప్రేమలు... వివాదాలు.... దొంగ మెసేజ్‌లతో డబ్బులు దొంగిలించడం... చివరకు ఆధార్ కార్డుల రూపకల్పన, సెల్‌ఫోన్ సిమ్‌ల తయారీ వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి. ప్రజలు కూడా ఈ సోషల్ మీడియా లేకుండా ఉండలేని పరిస్థితి వచ్చేసింది. ఏ బస్సులో చూసినా... ఏ రైలులో చూసినా... పది మంది కూడిన ఏ ప్రదేశంలో చూసినా మాటల్లేవు... మాటాడుకోవడాల్లేవ్... అందరిదీ ఒకే బాట... వాట్సప్‌ మెసేజ్‌లు, ఫేస్‌బుక్‌లో చాటింగ్‌లు, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాంలో సందేశాలు. దీనికి వయసుతో సంబంధం లేదు. చిన్నాపెద్దా విచక్షణ లేదు.     ఈ సోషల్ మీడియా కారణంగా రోజురోజుకూ ఎన్ని అనర్ధాలు జరుగుతున్నా ప్రజల్లో దీని పట్ల మమకారం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఒక్క మేసేజ్‌తో వందల మంది గ్రామస్థులు ఒక చోట చేరి ఈ ఘోరం చేశారంటే  సోషల్ మీడియా ప్రభావం ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నాణానికి మరోవైపు అన్నట్లుగా దీని వల్ల కొన్ని చోట్ల మంచి జరుగుతున్నా అది చాలా తక్కువ సందర్భాల్లోనే. దీనిపై స్వీయ నియంత్రణే చేసుకోవాలి తప్ప ప్రభుత్వాలు చేయగలిగేది ఏమీ లేదు. ఎందుకంటే ప్రధానమంత్రితో పాటు అన్ని రాష్ట్రాల మఖ్యమంత్రులు, మంత్రులు, సినీ స్టార్లు, క్రికెటర్లు... ఇలా సమాజంలో పెద్దవారు అనుకునే వారంతా ఈ సోషల్ మీడియాకు దాసులైపోయారు.     ఇక దేశంలో చిన్నారుల భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఎక్కడ చూసినా చిన్నారులపై లైంగిక దాడులు, కిడ్నాపులు ఎక్కువయ్యాయి. వీటిని అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నా దేశంలో ఉన్న చట్టాలు నేరం చేసిన వారిని సునాయాశంగా జైళ్ల నుంచి విడుదల చేయిస్తున్నాయి. దీంతో ఈ ఆగడాలు నానాటికీ పెరుగుతున్నాయి. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తిస్తే ఈ దారుణాలకు స్వస్తి పలకవచ్చు. ముందుగా వ్యక్తిలో మార్పు రావాలి. అందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు క్రషి చేయాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. దేనిని ఎంత వరకూ ఉపయోగించాలో కూడా ఎరుకలో ఉండాలి.
పొరుగు దేశం పాకిస్తాన్ సంక్షోభంలో పడింది. అగ్ర నాయకుల అరెస్టులు ఒకవైపు... ఉగ్రవాదుల పంజా మరోవైపు పాకిస్తాన్‌ను  కలవరపెడుతున్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీష్‌ను, ఆయన కుమార్తె మరియంలను లాహోర్ విమానాశ్రయంలో పాకిస్తాన్ అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సుమ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. లండన్‌లో చికిత్స పొందుతున్న ఆమెను చూసేందుకు షరీఫ్ తన కుమార్తె మరియంతో కలిసి లండన్ వెళ్లారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో పాకిస్తాన్ చేరుకున్నారు. వారిద్దరు అబుదాబీ మీదుగా లాహోర్ చేరుకోగానే అరెస్టు చేశారు. ఈ అరెస్టులు దేశంలో సంచలనం రేపుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాజ్ షరీఫ్‌కు తాను అరెస్టు అవుతానని ముందుగానే తెలుసు. అయినా ఆయన వాటి నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇది ఆయనలో ఉన్న ధైర్యానికి ప్రతీక.     నవాజ్ షరీఫ్ అధికారంలో ఉండగా అవినీతికి పాల్పడ్డారని, ఈ అవినీతి సొమ్ముతో లండన్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న అవెన్‌ఫీల్డ్‌లో నాలుగు ఖరీదైన అపార్ట్‌మెంట్లు కొన్నారని అభియోగం. ఈ అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌కు పదేళ్ల జైలుశిక్షను విధించారు.  అయితే ఈ అపార్ట్‌మెంట్లేవీ నవాజ్ షరీఫ్ పేరిట లేకపోవడం గమనార్హం. తన ఎన్నికల అఫిడివిట్‌లో ఈ ఆస్తులను చేర్చలేదని పాక్ ప్రభుత్వం షరీఫ్‌పై కేసులు పెట్టింది. ఈ అక్రమాస్తుల విలువ 65 కోట్ల రూపాయలు.పాకిస్తాన్‌లో త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ అరెస్టులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారతదేశంతో పోలీస్తే 65 కోట్ల రూపాయల అక్రమార్జన ఏమంత పెద్దది కాదు. ఇంతటి అవినీతి భారత్‌లో సాధారణ గ్రామ లేదూ పట్టణ స్ధాయి నాయకులు చేస్తారు. అయితే పాకిస్తాన్‌లో మాత్రం ఇది పెద్ద నేరంగానే పరిగణించడం విశేషం.     నవాజ్ షరీఫ్ అరెస్టును అవినీతి కోణం నుంచి కాకుండా రాజకీయ కోణం నుంచి మాత్రమే చూడాలి. త్వరలో ఎన్నికలు జరుగుతున్న వేళ మాజీ ప్రధాని, దేశంలోనే సీనియర్ నాయకుడైన నవాజ్ షరీఫ్‌ను అరెస్టు చేయడం ముమ్మాటికి రాజకీయ కుట్రగానే సభ్య దేశాలు చూస్తున్నాయి. తనను అరెస్టు చేస్తారని ముందుగానే తెలిసినా... ఆ సమయానికి షరీఫ్ లండన్‌లో ఉన్నా ఆయన పారిపోవడానికి కాని, మరోచోట తలదాచుకోవడానికి కాని ప్రయత్నించలేదు. భార్య ఆరోగ్య పరిస్థితిని స్వయంగా చూపి.. ఆమెను సముదాయించి కుమార్తెతో సహా స్వదేశానికి బయలుదేరారు. ఇది కూడా రాజకీయ ఎత్తుగడలో భాగంగానే చూడాలి. అయితే భారత్‌తో పోలిస్తే మాత్రం అరెస్టు అవుతానని తెలిసీ ఇలా రావడం మాత్రం ఆశ్చర్యమే. పాకిస్తాన్‌లో  ఒకవైపు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అరెస్టు అయితే మరోచోట పెషావర్‌లో విషాదం చోటుచేసుకుంది. త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న వేళ ఉగ్రవాదులు మానవబాంబుతో ఓ పార్టీ చేపట్టిన ర్యాలీపై దాడి చేశారు. ఈ దాడిలో ఏకంగా 128 మంది అమాయకులు బలైపోయారు.     పాకిస్తాన్‌లో అంతో ఇంతో పేరున్న పార్టీగా పేరున్న బలూచిస్థాన్ అవామీ పార్టీ నాయకుడు సిరాజ్ రైసానీ మరణించారు. నిజానికి ఉగ్రవాదుల దాడి ఆయన లక్ష్యంగానే జరిగిందని అంటున్నారు. ఎవరిది ఏ లక్ష్యమైనా జరిగింది మాత్రం మహా ఘోరం. దారుణం. వందల మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు ఈ మారణహోమం వల్ల ఏమి సాధించారో మాత్రం అర్ధం కాదు. ఒకరినో.. పదిమందినో.. వందల మందినో హతమార్చడం ద్వారా అధికారంలోకి వస్తామని కాని, ఆ దేవుడు కరుణిస్తాడని కాని అనుకోవడం ముమ్మాటికి ముర్ఖత్వమే. ఇలాంటి చర్యలకు వారి దేవుడే కాదు... ఏ దేవుడైనా హర్షించడు. ఈ సత్యం ప్రపంచంలోని ఉగ్రవాదులందరికీ ఎంత త్వరగా తెలిస్తే మానవాళి మనుగడకు అంత ప్రశాంతత దొరుకుతుంది.
ధర్మానికి మరణం ఉండదని, న్యాయానికి  సంపూర్ణ ఆయుష్షు ఉంటుందని మరోసారి రుజువైంది ఎప్పుడో 23 సంవ‌త్సరాల క్రితం న‌మోదైన యూరియా కేసుకు ఇప్పుడు మోక్షం క‌లిగింది. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండ‌గా... తెలుగు వాడు పి.వి.న‌ర‌సింహారావు  ప్రధాన‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో దేశాన్ని కుదిపేసిన యూరియా స్కాం కేసుకు ఎట్టకేలకు తీర్పు వెలువడింది. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న పి.వి.నరసింహారావు సమీప బంధువు సంజీవ రావుకు కోటి రూపాయల జరిమానాతో  పాటు మూడు సంవత్సరాల జైలు శిఓ విధించింది.     ఈయనకు సహకరించిన మరో ఇద్దరు మల్లేశం గౌడ్, సాంబశివరావులకు ఐదేసి కోెట్ల జరిమానా విధించింది. ఇక ఈ కేసులో కీలకనిందితులైన టర్కీ దేశస్ధులు టంకే అలంకస్, సిహాన్ కరాన్సీలకు వంద కోట్ల జరిమానా విధించింది. ఒక కేసులో ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఒక విధంగా ఇది దేశంలోనే చారిత్రక తీర్పుగా నిలిచిపోతుంది. ఆ రోజుల్లో దేశాన్ని కుదిపేసిన యూరియా కుంభకోణం విలువ ఏకంగా 133 కోట్ల రూపాయలు. ఈ రోజుల్లో 133 కోట్ల రూపాయలు పెద్ద మొత్తంగా కనిపించకపోవచ్చు కాని... ఆ రోజులతో పోలిస్తే అది చాలా పెద్ద మొత్తం. అందుకే ఈ కుంభకోణం అప్పట్లో సంచలనం రేపింది. నైతికత... నిజయితీ ఇంకా పూర్తిగా నాశనం కాని కాలంలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.     దేశవ్యాప్తంగా ఉత్కంఠను, కలకలాన్ని రేపిన యూరియా కేసుపై సర్వత్రా చర్చ జరిగింది. ఈ కేసుపై సిబిఐ ప్రత్యేక శ్రద్ధ కనబరిచినా పెద్దగా సంచలనాలు ఏవీ వెలుగులోకి రాలేదు. టర్కీ దేశం నుంచి దేశానికి అవసరమైన రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను దిగుమతి చేసేందుకు అక్కడి కంపెనీతో ఒప్పందం చేసుకుంది భారత ప్రభుత్వం. దీనికి గాను 38 మిలియన్ డాలర్లు అంటే అక్షరాల 133 కోట్ల రూపాయలు ముందే చెల్లించాలని ఒప్పందం. ఈ తతంగమంతా పూర్తి అయిన తర్వాత చూస్తే టర్కీలో అసలు కంపెనీయే లేదని తేలింది. ఇదీ ఈ కుంభకోణంలో కీలకం.కేసులు నమోదు చేసి... విచారణ ప్రారంభించినప్పటికీ అది నత్తనడకనే సాగింది. అటల్ బిహారీ వాజపేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో తూతూ మంత్రంగా సాగిన విచారణ ఆ తర్వాత యుపిఏ పాలనలో నీరుకారింది. ఇది మన రాజకీయ వ్యవస్ధకు అద్దం పట్టింది.   అధికారంలో ఉన్న వారు ఎలాంటి చర్యలకైనా తెగబడతారని, ఎంతటి పెద్ద కుంభకోణమైనా పక్కదారి పట్టిస్తారని ప్రపంచానికి తెలియడానికి యూరియా కుంభకోణం కేసే ఓ పెద్ద ఉదాహరణ. అయితే, ధర్మం నాలుగు పాదాల కాకపోయినా... రెండు పాదాలపైనైనా నడుస్తుంది అనడానికి యూరియా కుంభకోణం కేసే ఓ నిరూపణ. దేశంలో నానాటికి పెరిగి పోతున్న అవినీతిని నిలువరించేందుకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మంచి పరిణామం. తప్పులు చేసే ముందు మనకేం కాదులే అని అనుకునే వారికి ఈ తీర్పు ఓ గగుర్పాటు. ఎలాంటి నేరమైనా... ఎంతటి భారీ కుంభకోణమైనా చేసేసి హాయిగా బయట పడవచ్చుననుకునే వారి వెన్నులో వణుకు ఈ తీర్పు.     ఈ దేశాన్ని బాగుచేయలేం.... అవినీతిని రూపుమాపలేం అంటూ అరుగుల మీదా... పట్టణాలు, నగరాల్లోనూ ప్రధాన కూడళ్ల వద్ద చర్చలు జరిపే వారికి దేశంలో న్యాయం బతికే ఉందని చెప్పింది ఈ తీర్పు. ఇలాంటి తీర్పుల వల్ల అవినీతి పూర్తిగా సమసిపోతుందని, రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుందని పూర్తిగా చెప్పలేం. అయితే తాజా తీర్పు కారణంగా నేరానికి, ఏదైనా కుంభకోణం చేసేందుకు ప్రయత్నించే వారికి మాత్రం ఐదు నిమిషాల పాటు ఆలోచించేలా చేస్తుంది. ఆ ఐదు నిమిషాలు చాలు మనిషి తన ఆలోచనలను మార్చుకోవడానికి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు చారిత్రాత్మకం... అద్భుతం... అమోఘం.
గత రెండు, మూడు రోజుల్లో జాతీయ వార్తల్ని గమనించే వారందరి కళ్లు రెండు మూడు ప్రధానమైన వార్తలపై పడ్డాయి. వాటిలో మొదటిది మన దేశం ఫ్రాన్స్ ను అధిగమించింది! దేంట్లో? ఆరో అతి పెద్ద ఆర్దిక వ్యవస్థగా భారత్ ఇప్పుడు ఫ్రాన్స్ ను దాటేసింది! ఇది చిన్న సక్సెస్ ఏం కాదు. అలాగని మరీ జబ్బలు చరచుకోవాల్సింది కూడా! ఇక రెండోది, స్టాక్ట్ మార్కెట్లు ఆకాశాన్ని అంటుతూ దూసుకుపోతున్నాయి. మరోమారు బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజ్, నేషనల్ ఎక్స్ ఛేంజ్ రెండూ ఆల్ టైం హైని టచ్ చేశాయి. ఇది కూడా ఒక కోణంలో సంతోషించాల్సిన విషయమే! ఎందుకంటే, ప్రపంచ పటంలో పెరుగుతోన్న మన ప్రాధాన్యతకి ఇలాంటివే నిదర్శనాలు! ఇప్పుడిక మూడో వార్తకొద్దాం! కాంగ్రెస్ లోని మేధావి నేత శశిథరూర్ బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏమవుతుందో జోస్యం చెప్పారు! 2019లోనూ మోదీయే పీఎం అయితే భారత్ హిందూ పాకిస్తాన్ గా మారిపోతుందట!     భారత్ ఫ్రాన్స్ ను అధిగమించటం, సెన్సెక్స్ దూసుకుపోవటం, శశిథరూర్ మాటలు… వీటి మధ్య పైకి ఎలాంటి సంబంధం కనిపించకపోవచ్చు! కానీ, అంతర్గతంగా పెద్ద లింకే వుంది! అదేంటంటే… మోదీ చేసే పనులు చాలా మందికి నచ్చకపోవచ్చు. అలాగే, డీమానిటైజేషన్ లాంటి వాటి వల్ల సామాన్య జనం ఇబ్బంది కూడా పడి వుండవచ్చు. అయినా, భారత ఆర్దిక రంగం ప్రపంచాన్ని విస్మయపరిచేలా దూసుకుపోతోంది. కామన్ ఇండియన్స్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ క్రమంగా పెరుగుతోంది. నిజంగా అద్భుతమైన లాభాల్ని సామాన్యులు చవిచూడటం లేదు. అయినప్పటికీ జరుగుతున్న అభివృద్ధి కూడా కాదనలేనిదే! రానున్న రోజుల్లో బీజేపీ జనం ముందుకు ఈ విజయాల్నే తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో విదేశాంగ విధానం, ఆర్దిక సంస్కరణల విషయంలో మోదీ గొప్ప విజయాలు సాధించాడని ఆ పార్టీ వారు చెప్పుకుంటారు! అందరూ కాకున్నా ఒక వర్గం ఓటర్లు వారి వాదనతో ఏకీభవించవచ్చు! మరి కాంగ్రెస్ ఏం చేస్తోంది?     మోదీ, అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు తమకు అవసరం అనుకుంటే హిందూత్వ ఎజెండా ఎత్తుకుంటారు. లేదంటే అభివృద్ధి జపం చేస్తారు. ఆ రెండు విషయాల్లో వారి చిత్తశుద్ధి ఎలావున్నా అవసరానికి ఏది వాడాలో కమలనాథులకి బాగా తెలుసు. కానీ, ప్రధాన ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్ మాత్రం సెక్యులర్ వ్యామోహంలో ఎంతకీ ముందుకు సాగటం లేదు! శశిథరూర్ హిందూ పాకిస్థాన్ వ్యాఖ్య అందుకు నిదర్శనం! ఒకప్పుడు మోదీ వస్తే ముస్లిమ్ లు బతకలేరని ప్రచారం చేసిన కాంగ్రెస్ వారు ఇప్పుడు మళ్లీ మోదీ వస్తే హిందూ పాకిస్తాన్ అంటున్నారు! ఇది కొంత మంది మైనార్టీలకు బావుంటుందేమో కానీ… లాజిక్ వాడే ఏ మైనార్టీకి, హిందువుకి కూడా నచ్చదు. బీజేపీ మీద , మోదీ మీద వున్న అక్కసు కాంగ్రెస్ నేతలు హిందూత్వం మీద కక్కటం దుష్పలితాలు ఇస్తుంది. గతంలో ఇలాగే హిందూ ఉగ్రవాదం అంటూ కాంగ్రెస్ అగ్రనేతలు చేతులు కాల్చుకున్నారు! మోదీ దేశదేశాలు తిరుగుతుంటే ఆయన విదేశాంగ విధానం గురించి కాక ఆయన సూటు, బూట్ల గురించి విమర్శింటం, ఒకపక్క ఆర్దికంగా దేశం పురోభివృద్ధి సాధిస్తుంటే ఇంకా సెక్యులర్ రాజకీయ కామెంట్లు చేయటం… కాంగ్రెస్ ఇదే మూసలో వుండిపోతోంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీ మీద అదే పాత కాలపు మతోన్మాద ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నాయి. మోదీకి శ్రీరామ రక్షగా మారుతోంది ఇదే! వచ్చే ఎన్నికల్లో ఆయన గెలవటం మరీ అంత సులువు కాదు. అయినా మోదీ, షా దైర్యంగా వుంటున్నారంటే… ప్రతిపక్షాలు చేస్తోన్న పొరబాటే! యంగ్ ఇండియన్స్ ఏం కావాలనుకుంటున్నారో బీజేపీ గుర్తించింది. అవి ఇచ్చినా ఇవ్వకున్నా మాటల మాయాజాలం అన్నా చేస్తోంది. కాంగ్రెస్ , కొన్ని ఇతర సెక్యులర్ పార్టీలు అది కూడా చేయటం లేదు. ఎంతసేపు హిందూత్వం గురించి, లేనిపోని, కానిపోని హిందూత్వ ఉగ్రవాదం, మతోన్మాదం గురించి మాట్లాడుతున్నాయి. అందుకే, బీజేపీని వద్దనుకునే వారు కూడా కాంగ్రెస్ ని ముద్దనుకోవటం లేదు!     భారతదేశంలోని ప్రతిపక్షాలు, ప్రధానంగా రాహుల్ ని ప్రధానిని చేయాలని తాపత్రయపడుతోన్న కాంగ్రెస్… బీజేపీని, మోదీని నియంత్రించాలంటే… ముందు హిందూ వ్యతిరేక భావజాలానికి స్వస్తి పలకాలి. అలాగే, దేశంలో పోగవుతన్న లక్షల కోట్ల సంపద ఎందుకు సామాన్యుల దాకా రావటం లేదో గుర్తించి… ఆ లొసుగుల్ని ఎత్తి చూపాలి. ఇలా సామాన్యుల సమస్యలు మాట్లాడితేనే మోదీ కార్నర్ అయ్యేది. లేదంటే 2019లోనూ ఓటర్లు అనివార్యంగా ఆయన వైపే మొగ్గు చూపాల్సి రావచ్చు!  
ఇది శుభ సూచ‌క‌మే. ఇది ఆనందించే అంశ‌మే. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఆర్థికంగా ఎంతో వెనుక‌బ‌డి ఉన్నామ‌నుకునే భార‌త్ కు ఆర్థిక రంగంలోప్రపంచ‌ బ్యాంక్ ఇచ్చిన రేటింగ్ కొత్త ఆశ‌లు చిగురింప‌జేస్తోంది. ప్రపంచ బ్యాంక్ తాజాగా విడుద‌ల చేసిన లెక్కల ప్రకారం ఫ్రాన్స్ దేశాన్ని వెన‌క్కు నెట్టి భార‌తదేశం ఆర్థికంగా ఎంతో ముందుకు వెళ్తోంది. జ‌నాభా ప్రకారం చూసుకున్నా భార‌తదేశం ఫ్రాన్స్ కంటే చాలా పెద్దది. అయినా ఆ దేశాన్ని వెన‌క్కి నెట్టి ఆర్థికంగా దేశం పురోగ‌తి సాధించ‌డం మంచి ప‌రిణామ‌మే. ఇన్నాళ్లూ ఆర్థిక ప్రగ‌తిలో ఫ్రాన్స్ 2.597 ల‌క్షల కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా ఆరో స్థానంలో ఉంది.     ప్రపంచ బ్యాంక్ కొత్త లెక్కల ప్రకారం ఫ్రాన్స్ ఆ స్ధానాన్ని కోల్పోయింది. ఆ స్థానంలోకి భార‌త్ చేరుకుంది. ఇది మంచి ప‌రిణామ‌మే. దీనికి కార‌ణం భార‌త్‌లో వ‌స్తు త‌యారీ పెర‌గడం.. దాని వినిమ‌యం కూడా అధిక స్ధాయిలో ఉండ‌డ‌మే అని ప్రపంచ‌బ్యాంక్ తేల్చింది. దీని కార‌ణంగా భార‌త ఆర్థిక వ్యవ‌స్థ పుంజుకుంది అన్నది ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ర్యాంకింగ్‌కి కార‌ణంగా చెబుతున్నారు. ఇది దేశ ప్రజ‌ల‌కు శుభ వార్తే అయినా... ఇక్కడి ఆర్థిక ప‌రిణామాలు మాత్రం మ‌ధ్యత‌ర‌గ‌తి, సామాన్యుల‌ను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. దేశంలో నోట్ల ర‌ద్దు కుదిపిన కుదుపున‌కు ఇంకా ఎవ‌రూ తేరుకోలేదు. ఏటిఎం సెంట‌ర్ల ముందు ప్రజ‌లు ఇంకా బారులు తీరి నిలుచున్న చిత్రాలు పాల‌కుల‌ను వెక్కిరిస్తున్నాయి. కేంద్రం తీసుకువ‌చ్చిన జి.ఎస్‌.టి కూడా ప్రజ‌ల న‌డ్డివిరుస్తోంది. ఏది అస‌లు ధ‌రో.... ఏదీ జిఎస్టీనో తెలియ‌క స‌గ‌టు భార‌త పౌరుడు నానా హైరానా ప‌డుతున్నాడు. నిత్యావ‌స‌రాలు ధ‌ర‌లు కొండ‌నెక్కాయి. వంటింట్లో ఆడ‌వారు పాల‌కుల‌పై శివ‌తాండ‌వం చేస్తున్నారు. పెట్రోలు ధ‌ర‌లు నిమిష నిమిషానికి కాదు... క్షణ‌క్షణానికి మారుతున్నాయి. వంట గ్యాస్ ధ‌ర‌లు వెక్కిరిస్తున్నాయి. కూర‌గాయ‌లు కొనాలంటే సామాన్యులను చుక్కలు వెక్కిరిస్తున్నాయి.      దేశంలో అంత‌ర్గతంగా ఇలాంటి ప‌రిస్థితులుంటే దేశం వెలుప‌ల మాత్రం భార‌త్ ప్రభ వెలిగిపోతోంది. అంటే దేశాన్ని, దేశ ప్రజ‌ల‌ను ఓ భ్రమ‌లో ఉంచి త‌మ ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని ప్రపంచంలో ఆర్థికంగా బ‌లంగా ఉన్న అమెరికా వంటి దేశాలు త‌ల‌పోస్తున్నాయ‌ని భావించాలా...? దేశంలో ఆర్ధిక ఇబ్బందులు అతలాకుతలం చేస్తూంటే ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు ర్యాంకింగ్‌లు ఇవ్వడం పట్ల ఆర్థికవేత్తలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఏ రంగాన్ని చూసినా ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. వ్యవసాయం కుంటుపడింది.     పారిశ్రామిక రంగం కుదేలవుతోంది. నిరుద్యోగులు పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా ఓ ఆర్థిక అనిశ్చితి కనపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ర్యాంకింగ్‌ భారత్‌ను ఏ తీరాలకు తీసుకువెళ్తుందో చూడాలి. అయినా భారత ప్రజలు ఆశావాహులు. ఉందిలే మంచి కాలం ముందు ముందునా... అనుకుని కాలం వెళ్లదీసేవారు. ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన తాజా ర్యాంకుల్లో నిజమున్నా... కుట్రలు ఉన్నా.... భారత ప్రజలు మాత్రం అన్నింటినీ దిగమింగి ఆర్థికంగా... సామాజికంగా ముందుకు వెళ్తారు. ఎందుకంటే... మేరా భారత్ మహాన్...
భారతదేశ చరిత్రలో తన స్వంత మెజార్టీతో మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రధాని అయిన కాంగ్రేసతర పార్టీ నాయకుడు… మోదీ! 2014లో ఇదో అద్భుతం! నిజానికి అంతా మోదీ ఇచ్చిన కాంగ్రెస్ హఠావ్ నినాదం నిజమైపోతుందని భావించారు కూడా! కానీ, నాలుగేళ్లు పూర్తై మరో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ మోదీ గ్రాఫ్ క్రమంగా దెబ్బతింటూ వస్తోంది. 2019లో మళ్లీ మోదీ ప్రధాని అవుతారా? అవును అని బీజేపీ కార్యకర్తలు, అభిమానులే చెప్పలేని స్థితి!     ఇప్పటికీ నరేంద్ర మోదీకి వున్న ఏకైక బలం… ప్రతిపక్షాలకు బలమైన ప్రధాని అభ్యర్థి లేకపోవటమే! రాహుల్ తప్ప మరెవరూ మోదీకి పోటీ ఇచ్చే స్థితి  లేదు. అలాగని రాహుల్ ఓటర్లందరికీ ఆశాజ్యోతిలా వున్నాడా అంటే … అదీ లేదు. మోదీ వద్దనుకునే వారు ఎందరున్నా రాహుల్ కావాలనుకునే వారు అందరు లేరు! ఇక మిగతా నాయకులదైతే మరీ సాదాసీదా పరిస్థితి. ఎవ్వర్నీ వారి పక్క రాష్ట్రంలో గుర్తించే వారు లేరు! ఇదే మోదీకి అతి పెద్ద ప్లస్ పాయింట్. కానీ, కేవలం బలహీనమైన ప్రతిపక్షం కారణంగా 2019లో నమో మరోసారి స్పష్టమైన మెజార్టీ తెచ్చుకుంటారా? డౌటే! వచ్చే ఎన్నికలపై మనకి కాదు… స్వయంగా మోదీ, అమిత్ షాలకు కూడా అనుమానాలు వున్నట్టు కనిపిస్తోంది. పైకి అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే బీజేపీ కూడా మళ్లీ అధికారం తమదేనని గాంభీర్యం ప్రదర్శిస్తోంది. కానీ, అదంత తేలిక కాదని కమలనాథులకి తెలుసు. ఆరెస్సెస్ వారికి ఇంకా బాగా తెలుసు. అందుకే, రకరకాల వ్యూహాలతో ప్రతిపక్షాల్ని ఇరుకున పెడుతున్నారు. ఎలాగైనా మాయ చేసి వచ్చే ఎన్నికల్లోనూ మోదీనే ప్రధానిగా పీఠంపై కూర్చోబెట్టాలని ఆరెస్సెస్ పెద్దలు, అమిత్ షా పని చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగమే జమిలి ఎన్నికల హడావిడి!     జమిలి విషయంలో దేశంలోని అన్ని పార్టీల అభిప్రాయాలు కోరింది లా కమీషన్! బీజేపీ, కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకూ తమ అభిప్రాయాలు చెప్పలేదు. మిగిలిన చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీల ఉద్దేశ్యాలు మాత్రం తెలుసుకునే  ప్రయత్నం చేసింది కేంద్రం. సహజంగానే మమతా బెనర్జీ లాంటి వారు నో అన్నారు. కేసీఆర్ లాంటి వారు ఓకే అన్నారు. టీడీపీ లాంటి పార్టీలు జమిలికి సై అన్నా ముందస్తుకి నై అనేశాయి. అంటే, మొత్తంగా జమిలిపై భిన్నాభిప్రాయాలే వెలువడ్డాయన్నమాట. ఇక మిగిలిన ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లలో కాషాయ పార్టీకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలాగూ ఓకే! బీజేపీ చెప్పింది కాంగ్రెస్ ఎలాగూ ఒప్పుకోదు కాబట్టి హస్తం పార్టీకి జమిలి సమ్మతం కాదు. ఇదీ పరిస్థితి! అసలు ప్రాక్టికల్ గా ఆలోచించినప్పుడు పెద్దగా వర్కవుట్ కాదని అనిపిస్తోన్న జమిలి ఎన్నికల విషయంలో మోదీ ఇంత పట్టుదలగా ఎందుకున్నారు? పైకి ఎన్నికల ఖర్చు తగ్గుతుందని, సంక్షేమ, విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవటంలో జాప్యం వుండదనీ చెబుతున్నప్పటికీ అసలు కారణం అంతరంగంలో వుంది! గతంలో డీమానిటైజేషన్ పేరుతో మోదీ వేసిన అడుగు కూడా ఇలాగే పైకి చాలా ఆదర్శవంతంగా కనిపించింది. కానీ, బ్లాక్ మనీ రాబట్టలేకపోయిన నోట్ల రద్దు తరువాత జరిగిన చాలా ఎన్నికల్లో బీజేపీకి ఉపయోగపడింది. ఇతర పార్టీలు ఎలక్షన్ టైంలో చేతిలో డబ్బులు లేకలేక విలవిలలాడిపోయాయి. ఈ పరిణామం బీజేపీ విజయాల్ని చాలా రాష్ట్రాల్లో సునాయాసం చేసింది. ఇప్పుడు జమిలి ఎన్నికల వ్యూహం కూడా అలాంటిదేనని భయపడుతున్నాయి దేశంలోని చాలా పార్టీలు!     ఒకేసారి కేంద్రానికి , రాష్ట్రాలు అన్నిటికీ ఎన్నికలంటే చిన్న పార్టీలకు ఆర్దిక భారం ఎక్కువైపోతుంది. అదే సమయంలో బీజేపీ లాంటి పెద్ద పార్టీకి పోల్ మ్యానేజ్ మెంట్ తేలికవుతుంది. రెండు నెలల కాలంలో మొత్తం రాజకీయ వ్యవహారమంతా చక్కబెట్టేస్తే అయిదేళ్లు ఇక పూర్తిగా పాలన మీద దృష్టి పెట్టవచ్చు. అలాగే, ఇప్పుడు బీజేపీ కమలం గుర్తు కంటే మోదీ ముఖమే ఎక్కువగా ఓట్లు రాబడుతోంది. అన్ని అసెంబ్లీలకూ ఎన్నికలు ఒకేసారి వస్తే ప్రధాని అభ్యర్థిగా మోదీ చేసే ప్రచారం శాసనసభలపై కూడా వుంటుంది. జనం మోదీ ఛరిష్మా ప్రభావంతో అసెంబ్లీ సీట్లకు కూడా ఓటు వేసే అవకాశం వుంది. ఇలా అనేక కారణాలు బీజేపీకి ప్లస్ గా మారతాయి ఒకేసారి దేశవ్యాప్త ఎన్నికలైతే! కొన్ని పార్టీలు ససేమీరా అంటున్నా మోదీ ఈ సంవత్సరం చివరికల్లా ముందస్తు ఎన్నిలకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఆగస్ట్ 15న ఆదాయ పన్ను రద్దు చేస్తున్నట్టు ఆయన ఎర్రకోటపై నుంచీ ప్రకటిస్తారని టాక్ వినిస్తోంది. కోర్టులో వున్న అయోధ్య రామ మందిరం కేసు కూడా ఎలానూ వుండనే వుంది. ఇలా అనేక దిక్కుల్లోంచి ఓటర్లను మెస్మరైజ్ చేసే నిర్ణయాలు తీసుకుని ఎన్నికల బరిలోకి దూకవచ్చు. ఇక ఇప్పుడు అత్యధిక శాతం రాష్ట్రాలు కూడా కమలానివే కాబట్టి వాట్ని కూడా ఓట్ల యద్ధంలోకి దింపవచ్చు. మొత్తం మీద ఏకాభిప్రాయం రాకున్నా 2018 చివర్లో మనం ఓ మోస్తరు జమిలి ఎన్నికల్ని ఎదుర్కోక తప్పదు. వాటి ఫలితాలు మోదీకి అనుకూలంగా వుంటే మాత్రం … చిరు పార్టీల భయాలు నిజమేనని తేలిపోతుంది!
ప్రభుత్వమంటే ఇలా ఉండాలి. ప్రజల్ని కన్న బిడ్డల్లా సాకే ప్రేమ ఉండాలి...ప్రజల రక్షణకు ఏమైనా చేయాలనే తపన ఉండాలి. ఈ లక్షణాలన్నీ థాయ్‌లాండ్ ప్రభుత్వానికి ఉన్నాయని ప్రపంచానికి తెలిసింది. పదిహేడు రోజులుగా థాయ్‌లాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారి ఫుట్‌బాల్ క్రీడాకారులు, వారి కోచ్‌ని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. చీకటి గుహలో చిక్కుకున్న ఆ పదిహేడు మందికి మంగళవారం నిజమైన వెలుగులు నింపిన రోజు. వారే కాదు ప్రపంచ దేశాల్లోని చిన్నారులందరికీ ఇది వెలుగులు నింపిన రోజు. ప్రజల రక్షణకు ప్రభుత్వాలు ఎంతటి విలువ ఇవ్వాలో థాయ్‌ల్యాండ్ ప్రభుత్వం నేర్పిన పాఠం. గుహలో చిక్కుకున్న పిల్లల్లో ఆదివారం నలుగురిని, సోమవారం మరో నలుగురిని బయటకు తీసుకు వచ్చిన డైవర్స్ మంగళవారంతో ఈ రక్షణ క్రతువును పూర్తి చేయాలని సంకల్పం చెప్పుకున్నారు. " ఈ ఫుట్‌బాల్ జట్టును ఈ రోజే కలుపుతాం" అని ప్రపంచానికి ప్రకటించారు. వారు చెప్పినట్లుగానే గుహాలో మిగిలిన ఐదుగురిని సుర‌క్షితంగా బయటకు తీసుకు వచ్చారు.  ఈ సంఘటన జరిగిన వెంటనే ప్రపంచ దేశాలన్ని థాయ్‌ల్యాండ్ ప్రభుత్వానికి బాసటగా నిలవడం మంచి పరిణామం. చిన్న దేశాల పట్ల కాసింత చులకనగా ఉండే ఆమెరికా అధ్యక్షుడు ట్రంప్ " ఈ ఆపరేషన్‌లో థా‍య్ ప్రభుత్వానికి సహకరిస్తాం" అని స్వయంగా ట్విట్ చేయడం చిన్నారుల పట్ల ఆయన వాత్సల్యానికి నిదర్శనం. ఈ ఆపరేషన్‌లో బ్రిటన్, ఆస్ట్రేలియా, ఆమెరికా, చైనా, జపాన్‌, స్వీడన్, దేశాలకు చెందిన 90 మంది డైవర్లు పాల్గొనడం ఈ ఘటన పట్ల ఆయా దేశాలు చూపించిన చొరవగానే పరిగణించాలి. 17 రోజుల పాటు నిద్రాహారాలకు దూరమై ఆ చిన్నారులు మనుగడ సాగించారంటే వారి మనోనిబ్బరానికి ప్రపంచం యావత్తూ జేజేలు పలకాలి. వారిలో ఆత్మస్దైర్యాన్ని నింపిన వారి కోచ్ ఎక్కా పోల్ చాంతావాంగ్‌కే ఆ ఘనత దక్కుతుంది. ఈ కోచ్ కూడా ఏమంత వయస్కుడేం కాదు. నిండా పాతికేళ్ళు కూడా లేని కోచ్ ఎక్ లో ఇంత ధైర్యానికి కారణం అతను పడ్డ కష్టాలే. నా అన్నవారిని కోల్పోయి కష్టాల కొలిమి లోంచి వచ్చిన కోచ్ ఎక్ గుహలో చిన్నారులకు ఆత్మస్దైర్యాన్ని నింపడం నిజంగా అధ్బుతం.  కోచింగ్‌ అంటే ఫుట్‌బాల్‌ను ఎలా తన్నాలో, ఎలా గో‌ల్ చేయాలో, ప్రత్యర్ది జట్టు గోల్ చేయకుండా ఎలా నిలువరించాలో చెప్పడమే కాదని, జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో నేర్పడమేనని కోచ్ ఎక్ నిరూపించారు. ఈ సంఘటన నుంచి ప్రపంచ దేశాలు... ముఖ్యంగా భారతదేశం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. వర్షాకాలంలో మ్యాన్‌హోల్స్ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోకుండా కాపాడడం అలవర్చుకోవాలి. ఒక ఘటన జరిగితే ఎంత వేగంగా స్పందించాలో నేర్చుకోవాలి. ఏలికలకు ప్రజలపై ప్రేమ, గౌరవం, వారికి రక్షణ కల్పించాలనే బాధ్యత ఉండాలి. ప్రజలంటే ఐదేళ్ళకొకసారి కనిపించే ఓటర్లుగా చూడకూడదు. కుటుంబంలో పిల్లల పట్ల తలిదండ్రులు ఎంత శ్రద్దగా, ప్రేమగా ఉంటారో పాలకులు కూడా ప్రజల పట్ల అంతే ప్రేమ, శ్రద్ద, బాధ్యతతో మెలగాలి.
  హిమదాస్‌. నిన్నమొన్నటి వరకు ఆ పిల్ల ఎవరికీ తెలియదు. ఇప్పుడూ... ఆపేరు వినని వాళ్లు చాలా రేర్‌గా కనిపిస్తారు. భారతదేశ చరిత్రలో ఇప్పుడు హీనాది ఓ ప్రత్యేక స్థానం. ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరూ అంతర్జాతీయస్థాయి పరుగుపోటీల్లో బంగారుపతకం సాధించలేదు. పీటీ ఉష, అశ్వనీ నాచప్పలాంటి వాళ్లు కూడా సాధించలేనిది ఈ హీనా ఎలా గెల్చుకుందో తెలుసుకోవాలంటే... ఆమె జీవితాన్ని ఓసారి చూడాల్సిందే! హిమదాస్‌ది అసోంలో శివసాగర్‌ అనే పల్లెటూరు. అక్కడ హిమ వాళ్ల నాన్న చిన్న రైతు. తన పిల్ల ఏదో కాస్త చదువుకుంటే చాలనుకునే మనస్తత్వం. హిమకి మాత్రం అటు చదువు, ఇటు వ్యవసాయం కంటే ఆటల మీదే శ్రద్ధ ఉండేది. ఎంత శ్రద్ధ అంటే మగపిల్లలతో కలిసి పొలాల పక్కనే ఉండే బురదలో తెగ ఫుట్‌బాల్‌ ఆడేది. ఆటలో పడితే ప్రపంచాన్నే మర్చిపోయేది. అలాంటి సమయంలో ఓ లోకల్‌ కోచ్‌ హీనాని చూశాడు. తను ఫుట్‌బాల్లో కంటే రన్నింగ్‌లో మరింత బాగా రాణించగలదనుకున్నాడు. వెంటనే హీనాని ఒప్పంచి రన్నింగ్‌లో ట్రైనింగ్‌ ఇవ్వసాగాడు.   హిమ క్రమంగా రన్నింగ్‌లో రాటుదేలింది. జిల్లా స్థాయిలో మెడల్స్ తెచ్చుకునే స్థాయికి ఎదిగింది. ఆ సమయంలోనే నిపాన్‌ అనే కోచ్‌ దృష్టి హిమ మీద పడింది. చవక బూట్లు వేసుకుని కూడా, హిమ గోల్డ్‌ మెడల్స్‌ సాధించడం చూసి ఆశ్చర్యం వేసింది. తను ఇంతకుముందు ఎప్పుడూ చూడని టాలెంట్‌ నిపాన్‌లో ఉందని నిపాన్‌ గ్రహించాడు. వెంటనే హీనాకి ప్రభుత్వ కోచింగ్‌ ఇప్పించాలని అనుకున్నాడు.   గవర్నమెంట్‌ కోచింగ్‌ తీసుకోవాలంటే అసోం రాజధాని గువాహతికి పంపించాలి. అది హిమ తల్లిదండ్రులకి ఏమాత్రం ఇష్టం లేదు. ఆడపిల్ల, అందులోనూ ఆరుగురు పిల్లల్లో అందరికంటే చిన్నది. అందుకే హిమని అంతదూరం పంపడానికి వాళ్ల మనసు ఒప్పలేదు. కానీ హీనాని వాళ్లు గువాహతికి పంపేదాకా నిపాన్‌ ఊరుకోలేదు. తీరా గువాహతికి వెళ్లాక అక్కడ అథ్లెటిక్స్ కోసం ప్రత్యేక కోచింగ్‌ లేదని తెలిసింది. అయినా హిమ వెనక్కి రాలేదు. ఆమె ప్రతిభ చూసిన అధికారులు కూడా హిమని అకాడెమీలోకి తీసుకోక తప్పలేదు. ఓ రెండేళ్లు తిరిగేసరికి... ఇదిగో ఇలా చరిత్రి సృష్టించింది. ఫిన్లాండ్‌లో జరిగిన ‘world championships’లో గోల్డ్‌ మెడల్‌ కొట్టింది.   హిమ గోల్డ్‌ మెడల్‌ సాధించిందని తెలిసి దేశం ఆశ్చర్యపోయింది. కానీ ఆమె సంపాదిస్తుందని ఆమె కోచ్‌ నిపాన్‌కు ఎప్పుడూ తెలుసు. ‘చాలా కొద్దిమందిలోనే టాలెంట్‌ ఉంటుంది. అలాంటి వాళ్లలో హీనా ఒకరు. అందుకే ఆమెను ఎప్పుడూ చిన్న చిన్న లక్ష్యాలను ఎంచుకోవద్దని చెబుతూ ఉంటాను,’ అంటాడు నిపాన్‌. మనకి నచ్చిన రంగం ఏదైనా సరే... దాని మీదే effort పెడితే ఎప్పటికైనా విజయం తప్పదని హీనా నిరూపిస్తోంది. దేని మీదైనా మనకి విపరీతమైన dedication ఉంటే, పరిస్థితులన్నీ కలిసి వస్తాయని హీనా కథతో తెలుస్తోంది. - Nirjara  
  చాలామంది ఏదో ఒక్క భాష మీద పట్టు ఉంటే చాలుకదా అనుకుంటారు. మరికొందరు అవసరం కదా అనుకుని ఇంగ్లీష్ వంటి మరో భాషని నేర్చుకుంటారు. కానీ భాష అంటే కేవలం ఇద్దరు మనుషులు మాట్లాడుకునే సాధనం మాత్రమే కాదు కదా! అది ఒక కొత్త ప్రపంచానికి ప్రతీక. భాష వెనుక ఏకంగా ఒక సంస్కృతే దాగి ఉంటుంది. అంతేకాదు! కొత్త భాషలని నేర్చుకోవడం వల్ల లెక్కలేనన్ని లాభాలు ఉంటాయంటున్నారు నిపుణులు. వాటిలో కొన్ని... ఆత్మవిశ్వాసం: ఒకటికి మించిన భాషలు నేర్చుకున్నవారిలో తాము ఇతరులకంటే ఏమాత్రం తీసిపోమన్న విశ్వాసం ఉంటుంది. భాష అనేది జ్ఞానానికి సూచన కాబట్టి, తాము ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగల సమర్థులం అన్న నమ్మకం కలుగుతుంది. ముఖ్యంగా తాము నేర్చుకున్న భాష అవసరమయ్యే పరిస్థితులలో, తమ సహచరులకంటే వారే దూకుడుగా ఉండగలుగుతారు. మెదడు పనితీరు: ఎక్కువ భాషలను నేర్చుకున్నవారి మెదడులో రకరకాల సానుకూల చర్యలు జరుగుతూ ఉంటాయి. అల్జీమర్స్, మతిమరపు వంటి వ్యాధులు ఇలాంటివారికి దూరంగా ఉంటాయని ఎన్నో పరిశోధనలు నిరూపించాయి. అంతేనా! వీరిలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందనీ, మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుందనీ తేలింది. అటు వినికిడి కూడా మెరుగుపడుతుందట! అదనపు అర్హత: కొత్త భాష అనేది ఎప్పుడూ ఒక అదనపు అర్హతే! కొత్త భాషతో కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉపాధి పరిధి విస్తరిస్తుంది. ఉదాహరణకు హిందీ వచ్చినవాడు, దేశంలో ఎక్కడైనా ఉద్యోగం సంపాదించుకునే ప్రాథమిక అర్హతను సాధిస్తాడు. అంతేకాదు! యాజమాన్య సంస్థలు ఎప్పుడూ కూడా ఒకటికి మించి భాషలు వచ్చినవారికి అదనపు ప్రాధాన్యతని ఇస్తాయి. భిన్నమైన పనులు: పరుగులెత్తే ఈ జీవితంలో ఒకేసారి రకరకాల పనులు చేయాల్సి ఉంటుంది. దీనినే మల్టీ టాస్కింగ్ అంటారు. ఒకటి మించిన భాషలను నేర్చుకునేవారు వెంటవెంటనే వేర్వేరు పనులను చేయగలుగుతారనిన పరిశోధనలు నిరూపించాయి. పైగా వీరు కొత్త పరిస్థితులలో కూడా సులువుగా ఇమిడిపోగలుగుతారంట. అప్పటికప్పుడు అవసరమయ్యే నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారట. విశాల దృక్పథం: కొత్త భాషని నేర్చుకున్న మనిషి కొత్త ప్రాంతాలలో తిరగగలుగుతాడు. ఆ భాషలో ఉన్న విజ్ఞానాన్ని నేర్చుకోగలుగుతాడు. భిన్నమైన సంస్కృతినీ, జీవన విధానాన్నీ చూసి తన అభిప్రాయాలను మెరుగుపరుచుకుంటాడు. ఎక్కువ భాషలు నేర్చుకున్న వారు ప్రయాణాలు చేయడానికీ, ప్రపంచాన్ని అన్వేషించడానికీ ఉత్సాహం చూపుతారు. ఒక భాష తెలిసినవారికి మరో భాషని నేర్చుకోవడం మరింత సులువుగా మారుతుంది. మెదడు అప్పటికే భాషకి సంబంధించిన ప్రాథమిక సూత్రాలు నమోదై ఉంటారు కాబట్టి, మరో భాషని నేర్చుకునేందుకు అది అంతగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. మరింకేం... 30 రోజుల్లో ఏదో ఒక భాషను నేర్చుకునేందుకు సిద్ధపడితే పోలా!
  Description: Dr. Purnima Nagaraja beautifully answers a question asked by a young girl and in this process explains us about how marriage is just not a social obligation but a sensitive relationship. She further elaborates a few basic yet main points which must be analyzed while choosing a life partner because our life is extremely precious...  https://www.youtube.com/watch?v=u03EMjT0jzs  
  ఈ రోజుల్లో ఫేస్‌బుక్‌ అన్న మాటతో పరిచయం లేని మనిషిని గుర్తించడం కష్టం. కాస్తో కూస్తో కంప్యూటర్‌ పరిజ్ఞానం కలగగానే ఓ ఫేస్‌బుక్‌ ఖాతాని తెరిచేయడం... కుదిరితే ఓ పోస్టు, లేకపోతే ఓ లైకు అంటూ ఫేస్‌బుక్కే జీవితంగా గడిపేయడం సహజం. కానీ విచక్షణారహితంగా ఫేస్‌బుక్‌ని వాడితే మానసిక సమస్యలు తప్పవంటూ రెండు తాజా పరిశోధనలు రుజుబుచేస్తున్నాయి.   పరిశోధన 1 - చూస్తూ ఉండిపోవద్దు: చాలామంది ఫేస్‌బుక్‌ని ఊరికే అలా చూస్తూ ఉంటారు. అందులో కనిపించే పోస్టులను గమనిస్తూ, ఎవరికెన్ని లైక్‌లు పడ్డాయో లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఇలాంటివారు డిప్రెషన్‌కి లోనయ్యే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. ఈ విషయాన్ని తేల్చుకునేందుకు ‘కోపెన్‌హేగెన్ విశ్వవిద్యాలయాని’కి చెందిన పరిశోధకులు ఓ వెయిమందిని సంప్రదించారు. సోషల్ మీడియాతో వారి అనుబంధం ఎలాంటిదో గమనించారు. ఈ వేయిమందిలో ఎక్కువగా స్త్రీలే ఉండటం గమనార్హం. వాళ్ల పోస్టులూ, వీళ్ల పోస్టులూ చూస్తూ గడపడం వల్ల వాటితో మన జీవితాలను బేరీజు వేసుకునే ప్రమాదం ఉందని తేలింది. సహజంగానే సోషల్‌మీడియాలో ఉండే వ్యక్తులు తమ ఘనతనీ, ఆడంబరాన్నీ చాటుకునేందుకు వీలుగా డాబుసరి పోస్టులు పెడుతుంటారు. వీటితో లేనిపోని పోలికలు ఏర్పడతాయి. ఇక మనలో అసూయ, క్రుంగుబాటు వంటి సమస్యలను రెచ్చగొట్టే పరిస్థితులు కలుగుతాయి.   ఇలాంటి చిత్రమైన సమస్యలకు దూరంగా ఉండాలంటే కొన్ని పరిష్కరాలు కూడా ఉన్నాయంటున్నారు పరిశోధకులు. ఊరికనే ఫేస్‌బుక్‌ వంక అలా చూస్తూ ఉండిపోవద్దనీ... అందులో మీరు కూడా పాలుపంచుకుంటూ ఉండమనీ సూచిస్తున్నారు. అలా కుదరకపోతే అసలు ఓ వారం రోజులపాటు సోషల్‌మీడియా జోలికే పోవద్దని సలహా ఇస్తున్నారు.   పరిశోధన 2 - ఎన్ని సైట్లైతే అంత డిప్రెషన్‌: సోషల్‌ మీడియా ద్వారా చెలరేగిపోవాలన్న ఆసక్తి ఉండాలే కానీ అందుకోసం చాలా మాధ్యమాలు సిద్ధంగా ఉన్నాయి. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రాం, లింక్‌డ్‌ఇన్‌, వాట్సప్‌... ఇలా నానారకాల సైట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎన్ని సోషల్‌ మీడియా సైట్లలో పాలుపంచుకుంటే మనిషిలో అంత డిప్రెషన్‌ ఉంటుందని పిట్స్‌బర్గ్‌కు చెందిన పరిశోధకులు రుజువుచేశారు.   పరిశోధకులు తమ అధ్యయనం కోసం 1,787 మంది యువకులను ఎన్నుకొన్నారు. వీరంతా కూడా 19 నుంచి 32 ఏళ్ల లోపువారే! వీరు గూగుల్‌ ప్లస్, స్నాప్‌చాట్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రాం, లింక్‌డ్‌ఇన్‌... వంటి 11 రకాల సోషల్‌ మీడియా సైట్లను ఏ తీరున అనుసరిస్తున్నారో గమనించారు. అధ్యయనం చివరికి తేలిన విషయం ఏమిటంటే... ఏడు లేక అంతకుమించి సోషల్‌ మీడియా సైట్లను అనుసరిస్తున్నవారిలో క్రుంగుబాటుకి సంబంధించిన లక్షణాలు మూడురెట్లు అధికంగా కనిపించాయట.   ఒక వ్యక్తిలో మానసిక సమస్యలు ఉండటం వల్ల, వెసులుబాటు కోసం ఇలా రకరకాల సైట్ల వంక పరుగులు తీస్తున్నాడా? లేకపోతే రకరకాల సైట్లని అనుసరించడం వల్ల మానసిక సమస్యలు ఏర్పడుతున్నాయా? అన్న విషయం మాత్రం తేలనేలేదు. అంటే పిల్ల ముందా? గుడ్డు ముందా? అన్న చందాన ఈ సమస్య ఉందన్నమాట. అందుకని ఈ విషయమై మరిన్ని పరిశోధనలు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.   ఏది ఏమైనా, అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు సోషల్‌ మీడియాని కూడా అతిగా అనుసరించడం వల్ల ఏవో ఒక సమస్యలు తప్పవంటూ పై పరిశోధనలు రెండూ రుజువుచేస్తున్నాయి. అన్నింటికీ మించి సోషల్‌ మీడియాని మంచి విషయాలను పంచుకునేందుకు కాకుండా, ఇతరులతో పోల్చుకుంటూ ఉండేందుకు ఉపయోగిస్తే... ఈర్ష్యాద్వేషాలు తప్పవని నిరూపిస్తున్నాయి.     - నిర్జర.
  కీళ్ల నొప్పులు, ఎముకలు అరిగిపోవడం, కూర్చుంటే లేవలేని పరిస్తితి, లేస్తే కూర్చోలేని పరిస్థితి, చాలా దారుణమైన హింస. ఇలాంటి హింస వయసు పైబడినవాళ్లకు తప్పట్లేదు. ముందుగా మేల్కొన్న వాళ్లకు మాత్రం ఈ విషయంలో ఇబ్బందులు కాస్త తక్కువే అని చెప్పాలి. మరి ఇలాంటి కాళ్లూ, కీళ్లూ నొప్పుల బెడదను ముందుగా గుర్తించడానికి మార్గమేదైనా ఉందా.. అని అడిగితే డాక్టర్లు ఇప్పుడు చాలా సులభమైన మార్గం కూడా రెడీగా ఉందంటున్నారు. క్రమం తప్పకుండా డెంటల్ పరీక్షలు చేయించుకునేవాళ్లకు ఎముకలు బోలుగా మారుతున్నాయా లేదా అన్న విషయాన్ని కనిపెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని లేటెస్ట్ పరిశోధనలు చెబుతున్నాయట. ఐదు వేల డెంటల్ ఎక్సరేల్ని క్షుణ్ణంగా పరిశీలించాక వైద్య శాస్త్రవేత్తలు ఈ విషయంలో ఓ నిర్థారణకొచ్చారు. ఎముకల పటుత్వం తగ్గిపోవడవల్ల ముందుగా దెబ్బతినేవి దవడ ఎముకలే కనుక, డెంటల్ ఎక్స్ రేలవల్ల ఇలాంటి విషయాల్ని తెలుసుకోవడానికి చాలా మంచి అవకాశాలున్నట్టుగా డాక్టర్లు చెబుతున్నారు. సో.. క్రమంతప్పకుండా పళ్లని పరీక్షచేయించుకుంటే పనిలోపనిగా ఎముకల పటుత్వం సంగతికూడా తేలిపోతుందన్న మాట.. పదిహేనునుంచి తొంభైనాలుగేళ్ల మధ్యలో ఉన్నవాళ్ల డెంటల్ ఎక్సరేలను పరీక్షించినప్పుడు ఈ వివరాలు బైటపడ్డాయ్.