తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డికి జనం తిరుగుబాటు సెగ గట్టిగా తగిలింది. అధికారం ఉందికదా అని ఈ ఐదేళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆయనను భయంతో భరించిన జనం ఇప్పుడు ఎన్నికల వేళ గట్టిగా బుద్ధి చెప్పారు. ఓ పొలింగ్ బూత్ వద్దకు వచ్చి ప్రజలను బెదరించి ఓటు వేయించుకోవాలని చూసిన ఆయనకు జనం తిరగబడి నిలదీశారు. ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక ఆయన వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.   తాడిపత్రి ఎమ్మెల్యే తనకు ఓటు వేయకపోతే నరికేస్తానంటూ చేసిన హెచ్చరికకు జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తీవ్ర ఆగ్రహంతో జనం ఆయనపై తిరగబడ్డారు. జనాగ్రహాన్ని ఒకింత ఆలస్యంగానైనా గుర్తించిన కేతిరెడ్డి అక్కడ నుంచి పలాయనం చిత్తగించారు. 
గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య దళిత మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు. పెదకాకాని మండలం తక్కెళ్ళపాడు గ్రామంలోని పోలింగ్ స్టేషన్‌ని పరిశీలించేందుకు కిలారు రోశయ్య  వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడేందుకు స్థానిక మహిళలు ప్రయత్నించారు. దాంతో ఆవేశపడిపోయిన రోశయ్య కారుతో మహిళల మీదకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. మహిళల మీద దాడి చేయాలంటూ తన అనుచరులను ఆదేశించారు. దాంతో స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. 
ఏపీలో పోలింగ్  సాగుతోంది . మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు జనం ఓ ఉత్సాహంతో, ఓ జోష్ తో పోలింగ్ బూత్ లకు బారులు తీస్తున్నారు.  వేల సంఖ్యలో ఓటర్లతో పోలింగ్ బూత్‌లు కిటకిటలాడుతున్నాయి. ఉత్సాహంగా ఓటు వేయడానికి అన్ని వర్గాల ప్రజలూ ఉత్సాహం చూపుతున్నారు.  గ్రామీణ ప్రాంతాలతోపాటు ఈ సారి పట్టణ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున పోలింగ్ జరుగుతోంది. మాచర్ల, పుంగనూరు వంటి చోట్ల దాడులు జరిగినా పోలింగ్‌పై వాటి ప్రభావం ఇసుమంతైనా కనిపించడం లేదు.   ఉదయం11 గంటలకే దాదాపు పాతిక శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్ శాతం భారీగా పెరుగుతుండడం  కూటమి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుంటే, అధికార వైసీపీలో నిరుత్సాహం పెరిగిపోతోంది.  ఊహించిన దానికంటే భారీగా ప్రజామద్దతు కూటమిపై ఉన్నట్లు పోలింగ్ సరళిని బట్టి అర్ధమౌతోందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రచారం జగనే కావాలి అంటూ జగన్ చేసుకున్న ప్రచారంపై నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు.   వై ఏపీ నీడ్స్ జగన్ (ఏపీకి జగనే ఎందుకు కావాలి) పేరుతో వైసీపీ పెద్ద ఎత్తున చేసుకున్న ప్రచారాన్ని గుర్తు చేస్తూ  జగనే కావాలి అని జనంచెప్పాలి కానీ, వారి చేత బలవంతంగా చెప్పిస్తే ఫలితం ఇలాగే ఉంటుందని అంటున్నారు.  వైఏపీ నీడ్స్ జగన్ అంటూ జనంలోకి వెళ్లడానికి ధైర్యంలేని వైసీపీ నేతలు తమ పార్టీ కార్యకర్తల్లాంటి వలంటీర్లను, అధికారులను జనం ముందుకు పంపి వారి చేత జగనే కావలని బలవంతంగా చెప్పించారు. అలా  చెప్పకపోతే పథకాలు ఆగిపోతాయంటూ బెదిరింపుకు కూడా దిగారు. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల వేళ జగన్ తమకు ఎందుకు వద్దో చెప్పడానికి జనం పోలింగ్ బూతులకు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు.  ఓటింగ్ సరళిని గమనిస్తున్న పరిశీలకులు ప్రభుత్వ వ్యతిరేకత జనంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. వైసీపీ మూకలు రెచ్చిపోయి శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నా అవేమీ పోలింగ్ పై ప్రభావం చూపడం లేదనీ, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తమ ఓటు హక్కు వినియోగించుకు తీరుతామన్న పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. ఏపీలో పోలింగ్ సరళిని పరిశీలకులు ప్రజాస్వామిక ఓట్ల సునామీగా అభివర్ణిస్తున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా సామాన్యులు అధికారపార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను నిలదీస్తున్న తీరును చూస్తే ప్రజలలో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రత అవగతమౌతోందంటున్నారు. సాక్షాత్తూ ఎమ్మెల్యే చెంపే ఛెళ్లుమనిపించిన ఉదంతమే ఇందుకు నిదర్శనమంటున్నారు. తెనాలిలో అధికార పార్టీ ఎమ్మెల్యే దాష్టీకాన్ని ఓ సామాన్య ఓటరు ఎదిరిస్తే, పిఠాపురంలో ఓ పోలింగ్ బూత్ లో వైసీపీ అభ్యర్థి వంగా గీతకు నిబంధనలు గుర్తు చేసి మరీ నిలదీశారు ఇంకో ఓటరు.   వైసీపీ మూకల దాడులు, దౌర్జన్యాలూ, దాష్టీకాలకు వెరవకుండా ఓటర్లు ఎదురుతిరుగుతున్న పరిస్థితి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నది.  
ALSO ON TELUGUONE N E W S
దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు, ప్రభాస్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘కల్కి 2898ఎడి’. నాగ్‌ అశ్విన్‌ డైరెక్షన్‌లో వైజయంతి మూవీస్‌ నిర్మిస్తున్న ఈ భారీ సినిమా జూన్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. 22 భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. పాన్‌ వరల్డ్‌ మూవీగా రిలీజ్‌ కాబోతున్న ‘కల్కి’ చిత్రం ప్రమోషన్‌ను త్వరలోనే స్టార్ట్‌ చేసేందుకు చిత్ర యూనిట్‌ కసరత్తు చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చింది. ఇది ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌ లాంటింది.  ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఫ్యాన్స్‌ మీట్‌ కూడా ఉండబోతోందనేది ఆ వార్త. ఈ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ అంతా ప్రభాస్‌కి బెస్ట్‌ విషెస్‌ చెబుతారు. వచ్చే వారం నుంచే ప్రభాస్‌ ‘కల్కి’ ప్రమోషన్స్‌లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఈ సినిమాకి ప్రమోషన్స్‌ను విస్తృత స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సినిమా ప్రజల్లో ఎంత ఎక్కువగా వెళితే అంత ప్రయోజనం ఉంటుందని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. అందుకే అన్నిరకాలుగా ప్రమోషన్‌ చేయబోతోంది. ఇందులో భాగంగానే నేషనల్‌ మీడియాకి కూడా స్పెషల్‌ ఇంటర్వ్యూలు ఇచ్చేలా ప్లానింగ్‌ చేస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృషిస్తుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు మేకర్స్‌.   
లోక్‌సభ, కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో సాధారణ ప్రజలతోపాటు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సినీ ప్రముఖులు.  ఎన్టీఆర్‌ ఉదయం 7 గంటలకే భార్య ప్రణతి, తల్లితో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే అల్లు అర్జున్‌ తన ఓటు హక్కును జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌లో వినియోగించుకున్నారు. ఉదయం 7.30 గంటలకే వచ్చిన బన్నీ.. అందరితో పాటు క్యూలో నిలబడి తన వంతు రాగానే ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అందరికీ పిలుపునిచ్చారు బన్నీ.  మెగాస్టార్‌ చిరంజీవి కూడా తన భార్య సురేఖ, కూతురితో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ క్లబ్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, భార్య రమా రాజమౌళి, కొడుకు కార్తికేయతో కలిసి హైదరాబాద్‌ లోని షేక్‌ పేటలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీ పోలింగ్‌ బూత్‌లో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. హైదరాబాద్‌లోని ఎఫ్‌ఎన్‌సిసిలో ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు తిరుపతి జిల్లాలోని ఎ.రంగంపేటలో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సికింద్రాబాద్‌ పద్మారావునగర్‌ వాకర్స్‌ టౌన్‌ హాల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు దర్శకుడు శేఖర్‌ కమ్ముల.  
Ram Charan's much-anticipated project, titled "Game Changer," has solid buzz among the audience and fans alike. This political action drama directed by Shankar. The film shoot is going at snail pace. This much delayed social drama may not make it to this october. The schedules aren't going according to the plan and the film may have to be delayed again. As Kamal Haasan and Shankar's Indian2 shifted to July. The Game Changer might take some more time as Shankar will be involved in promotions. Game Changer eyeing for festival release. Dilraju not want to miss the Dusshera season as it will be good to create sensation at box office. There are reports that NTR's much awaited Devara might prepone to OG release date, September 27th. Now, Ram Charan wants to steal Devara release date, i.e, October 10th. Kiara Advani is playing the female lead. SJ Suryah, Anjali, Srikanth, Naveen Chandra, Sunil, Jayaram, and Samuthirakani are playing pivotal roles. Dil Raju is bankrolling this film and Thaman is the tunesmith. Karthik Subbaraj penned the film’s story.
"Krishnamma," featuring the talented Satyadev Kancharana and directed by VV Gopalakrishna, released in theatres yesterday. The film sets a new career record for its star with a day one global gross of 1 crore. Produced by Krishna Kommalapati under the Arunachala Creations banner and presented by acclaimed director Koratala Siva. Released amidst a busy season of elections and IPL matches, "Krishnamma's" decent opening is particularly noteworthy, establishing it as Satyadev's career best opening till date. The film continued the same run at box office with excellent reviews and a strong word-of-mouth trend. The film collected 2.24 crores on day 2. It collected 14 lakhs more than Day 1 with the holiday effect. With no major releases anticipated until the end of May, "Krishnamma" stands out as the leading choice for audiences seeking engaging cinema and actioner, promising an extended successful run in theaters.
‘HanuMan’, starring Teja Sajja, was directed by Prasanth Varma, who took viewers by surprise in January 2024. The movie was a huge hit in Telugu and Hindi, and there is a lot of talk about the sequel, ‘Jai HanuMan’. Although it's still a work in progress, Prasanth Varma and Ranveer Singh are making a massively budgeted period film. We've reported that the film's formal Pooja done recently and makers will begin the shoot very soon. Ranveer Singh, Prasanth Varma and Mythri Movie Makers are confirmed to team up for a film. It will be the immediate film in Prasanth Varma's cinematic universe. The Project with a fixed title of Brahmarakshasa will be the immediate next of actor Ranveer Singh too. Its a part of the movie Universe PVCU as well. The film will release in 2025. The film will.be made with mammoth budget of 300 crores.
Eternity Entertainment is thrilled to announce the release of the teaser for their upcoming film, 'Vidya Vasula Aham' ('A Long Long Ego Story'). Directed by Manikant Gelli, the film promises an engaging narrative centered around the dynamics of a couple's relationship. Starring Rahul Vijay and Shivani Rajasekhar in the lead roles, 'Vidya Vasula Aham' explores the journey of Vasu and Vidya, two individuals thrust into marriage against their will. As they navigate the ups and downs of married life, the backdrop of the story adds depth and intrigue. Produced by Mahesh Dutta Mothuru and Lakshmi Navya Makkapati under the banner of Tanvika and Jasvika Creations, 'Vidya Vasula Aham' boasts a talented ensemble cast including Avasarala Srinivas, Abhinaya, Srinivas Reddy, Tanikella Bharani, Mounika Reddy, Ravi Varma Adduri, Kashi Vishwanath, Rupalakshmi, Rajasrinayar, and Viva Raghava. 'Vidya Vasula Aham' will be available for streaming from May 17th on Aha, as audiences prepare to embark on an emotional journey filled with love, laughter, and introspection.
Disney Plus Hotstar, a favorite among OTT lovers for its variety of web series, is set to release another intriguing series titled "Yakshini." This web series is produced by Shobu Yarlagadda and Prasad Devineni of the Baahubali fame production house, Arka Media Works. Vedhika, Manchu Lakshmi, Rahul Vijay, and Ajay star in leading roles. Teja Marni, recognized for his direction in films like Arjuna Phalguna, Johar, and Kota Bommali PS, is at the helm of the "Yakshini" series. Recently, the first look poster of "Yakshini" was released, indicating its upcoming release. "Yakshini" is crafted with a unique concept distinct from other socio-fantasy movies and web series. Further details about the series will be revealed soon. The "Yakshini" web series will be available for streaming in Tamil, Kannada, Malayalam, Hindi, and Telugu.
'Shivam Bhaje' has quite a divine ring to it. And that's the title of Ashwin Babu's upcoming movie directed by Apsar and produced by Maheswara Reddy of Ganga Entertainments, which is making its debut. The film's first look was released today. The first look is in tune with the title poster released recently. In the title poster, Lord Shiva's imagery was indicated. And now, we see Ashwin Babu in his Raudra form, baying for the blood of villains. He is seen single-handedly holding a heavy-bodied goon and attempting to cast him away. Seen in the poster also is a Trident and the idol of a powerful divine. Action, thrills and sentiment can be expected from the movie. Ashwin, who has previously done 'Hidimbha' and 'Raju Gari Gadhi', is gearing up for the movie's release in June. 'Shivam Bhaje' has already completed its shoot. Starring Bollywood actor Arbaaz Khan in a key role, the film has Digangana Suryavanshi as the heroine. The makers said that Hyper Aadi, Sai Dheena, Murali Sharma, Brahmaji and Tulasi have key roles. Devi Prasad, Ayyappa Sharma and comedian Shakalaka Shankar will also be seen. Vikas Badisa and Dasaradhi Shivendra of 'HanuMan' fame are the film's music director and cinematographer, respectively. The latter recently won the Best Cinematography Award at the Dadasaheb Phalke Film Festival.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే అంటారు. అందుకే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అంటూ పాటను రాశారు రచయితలు. బ్రహ్మకు మారు పేరు అమ్మ. మనకు దెబ్బ తగిలినా వెంటనే అమ్మా అని అంటాము. అంటే మనకు ఆనందం కలిగినా..బాధ కలిగినా వెంటనే అమ్మ గుర్తొస్తుంది. రెండు గంటల పాలు మనల్ని వినోదంలో ముంచెత్తే మన తారలైనా అమ్మకు ముద్దుల బిడ్డలే. మన తెరవేల్పుల్లో చాలా మంది అమ్మతో అనుబంధం గురించి వేదికలపైనో ప్రెస్ మీట్‌లలోనో చెబుతూ ఉంటారు. మన హీరోలు వాళ్ల అమ్మతో దిగిన చిత్రమాలిక మీ కోసం..   అమ్మ రమాబాయితో  రజనీకాంత్ అమ్మ అంజనాదేవితో  చిరంజీవి, నాగబాబు    అమ్మ అంజనాదేవితో  పవన్ కళ్యాణ్  అమ్మ ఇందిరాదేవితో  మహేశ్  అమ్మ షాలినితో ఎన్టీఆర్ అమ్మ రాజ్యలక్ష్మీతో  రవితేజ అమ్మ శివకుమారితో  ప్రభాస్  అమ్మ సురేఖతో రామ్‌చరణ్ అమ్మ నిర్మలతో అల్లు అర్జున్, అల్లు శిరీష్ అమ్మ విజయలక్ష్మీతో నాని
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం కాస్త కష్టమైన పనే. చదివిన చదువుకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షించేవారు ప్రస్తుతం తక్కువే. పట్టణాలలో మంచి మంచి కంపెనీలలో గౌరవప్రదమైన వేతనంతో, హుందాగా ఉండే ఉద్యోగాలు చాలానే ఉన్నాయి. చాలామంది ఆ ఉద్యోగాల విషయంలో కూడా గందరగోళానికి గురవుతూ ఉంటారు. కారణం ఇంటర్వ్యూ లో సక్సెస్ కాకపోవడం. ఎంతో బాగా చదివి, మంచి ర్యాంక్ లు సాధించిన వారు కూడా ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేసరికి ఫెయిల్ అవుతూ ఉంటారు. మరి ఇంటర్వ్యూ లో సక్సెస్ కావాలంటే ఏమి చేయాలి??  ఎంపిక: కొంతమంది ఖాళీగా ఉన్నాం ఏదో ఒక జాబ్ తొందరగా చూసుకోవాలి, ఏదో ఒకటి క్లిక్ అవ్వకపోతుందా అనే ఆలోచనతో వరుసపెట్టి అన్నిటికి అప్లై చేసేస్తూ ఉంటారు. దీనివల్ల నెలకొనేదే పెద్ద గందరగోళం. కాన్ఫిడెంట్ లేకుండా పది కంపెనీలలో ఇంటర్వ్యూ కు వెళ్లడం కంటే కాన్ఫిడెంట్ తో ఒక్కదానికి అటెండ్ అవ్వడం మంచిదనే విషయం మర్చిపోకండి.  నాట్ ఓన్లీ దట్: ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పటి నుండి అందరూ చేసే పని, తాము అప్లై చేసిన జాబ్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మననం చేసుకుంటూ వాటిని బట్టి పట్టడం. దీనివల్ల ఒనగూరేది ఏమి ఉండదు. ఎందుకంటే వాటిని మననం చేసుకుంటూ మిగిలిన వాటిని ఎంతో సులువుగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. పైపెచ్చు ఇంటర్వ్యూ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది సంస్థకు సంబంధించిన వారి ఇష్టం. వారు పూర్తి జాబ్ కు సంబంధం లేని విషయం అయినా అడగవచ్చు. ఎందుకంటే వాళ్లకు కావలసింది పని చేయడం మాత్రమే కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి వర్క్ కు సంబంధించిన విషయాలు ఒక అంశం మాత్రమే. మరింకేం కావాలి?? నమ్మకం ఇవ్వగలగాలి. బాధ్యతాయుతంగా ఉండగలరు అనే నమ్మకాన్ని ఇవ్వగలగాలి. చాలా సంస్థల్లో మొదట ప్రాధాన్యత ఇచ్చే విషయం కూడా ఇదే.  పని చేయబోయే సంస్థ  విషయంలో, చేయబోయే వృత్తి విషయంలో ఎంత బాధ్యతాయుతంగా ఉండగలరు అనే విషయం మీదనే ఎంపిక ఎక్కువగా జరుగుతుంది. అలాగే పని పట్ల నిబద్ధత ఎంతో అవసరం. పనికి ప్రాధాన్యత ఇచ్చేవారి వైపు కంపెనీ మొగ్గు చూపుతుంది. కాబట్టి పని విషయంలో భరోసా ఇవ్వగలగాలి. స్పృహ కలిగి ఉండాలి: ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు కంపెనీ భవంతిలో అడుగుపెట్టినప్పటి నుండి చుట్టుపక్కల వాతావరణం ను గమనించుకుంటూ వెళ్ళాలి. కంపెనీలలో ప్రతిచోటా సీసీ కెమెరాల నిఘా ఉంటుందనే విషయం మరువకూడదు. మనిషి కదలిక నుండి ఆహార్యం వరకు ప్రతి విషయంలో ఒక నిజాయితీ కనిపించాలి. నటించాలని చూస్తే ఖాళీ చేతులతో బయటకు రావడం ఖాయం. తన పని మాత్రమే చూసుకుని పోయే వాళ్లకు ప్రాధాన్యత తక్కువగానే ఉంటుంది. ఇంటర్వ్యూ రూమ్ దగ్గరకు వెళ్లే మార్గంలో ఉన్న క్యాబిన్ లలో ఎవరు లేకుండా ఉండి, ఫ్యాన్ లు, లైట్ లు వంటివి ఆన్ లో ఉంటే వాటిని ఆఫ్ చేయడం. నీటిని వృథా చేయకపోవడం, లిఫ్ట్ సౌకర్యం ఉన్నా మెట్లెక్కి వెళ్లడం. మంచినీళ్లు వంటివి ఇచ్చే బాయ్ ని నవ్వుతూ పలకరించడం, థాంక్స్ చెప్పడం. ముఖ్యంగా సంస్థ గూర్చి ఇంటర్వ్యూ కు వచ్చిన తోటి వ్యక్తులతో ఎలాంటి చర్చా చేయకుండా ఉండటం. సంస్థ గురించి ముందుగానే వివరంగా తెలుసుకోవడం. అంటే సంస్థ స్థాపన నుండి ప్రస్తుతం అధికారుల వరకు అన్నిటి గూర్చి వారి కృషి గురించి కూడా అధ్యయనం చేసి తెలుసుకోవడం. స్కిల్స్ ఎప్పుడు కిల్ చేయకూడదు: కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంటర్వ్యూ లో అధికారులతో మాట్లాడేటపుడు కావాలని వారిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించకూడదు. లేకపోతే మీ స్కిల్స్ ను మీరే కిల్ చేసుకున్నట్టు అవుతుంది.  ముందుగా మరింత ఉత్సాహంగా: ఇక చివరగా చెప్పుకున్నా అన్నిటికంటే ముందు చేయవలసిన పని. ఇంటర్వ్యూ కు హడావిడిగా చివరి నిమిషంలో వెళ్లకుండా, వీలైనంత ముందుగా వెళ్లడం. దీనివల్ల కంపెనీని అక్కడి వాతావరణాన్ని, పని విధానాన్ని అంతో ఇంతో గమనించే వెసులుబాటు ఉంటుంది. తద్వారా సహజంగానే గందరగోళం తగ్గిపోతుంది.  ట్రస్ట్ యువర్ కాన్ఫిడెన్స్: మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు నమ్మండి. ఎవరో ఏదో భయపెట్టేలా చెప్పే మాటలు, విషయాలు ఏవి పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఉన్నట్లయితే, మీ వ్యక్తిత్వం నుండి, పని విషయం వరకు మీ అభిప్రాయాలు నచ్చాయంటే ఏ కంపెనీ ఎం.డి కూడా మిమ్మల్ని వదులుకోడు.  సక్సెస్ మీ చేతుల్లోనే ఉంది సుమా!! ◆ వెంకటేష్ పువ్వాడ
ఎక్కువసేపు టీవీ చూస్తున్నారా? అయితే మిమ్మల్ని త్వరలోనే మతిమరుపు పలకరిస్తుంది అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు. రోజుకి గంటకన్నా తక్కువ సమయం మాత్రమే టీవీ చూస్తున్న వారికి మధ్య జ్ఞాపకశక్తి విషయంలో చాలా తేడా వుందని వీరి పరిశోధనలో తేలింది. కొన్ని వేలమందిపై రకరకాల పరీక్షలు నిర్వహించి తేల్చిన విషయమిది. చిన్న చిన్న విషయాలని కూడా టీవీని అతిగా చూసేవారు మర్చిపోతుండటం గమనించారట వీరు. ముఖ్యంగా పిల్లల జ్ఞాపకశక్తిపై టీవీ చాలా ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు వీరు. స్కూలుకి వెళ్ళేముందు లేదా చదువుకోవటానికి కూర్చునే ముందు టీవీ చూస్తే వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిపై ప్రభావం ఖాయమని గట్టిగా చెబుతున్నారు. మరి జ్ఞాపకశక్తి పెరగడానికి ఏం చేయమంటారు అని వీరిని అడిగితే అందుకు చాలా మార్గాలున్నాయ్. అయితే టీవీ చూడటం తగ్గించమంటున్నాం కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మిమ్మల్ని ఆహ్లాదపరిచే మరో మార్గం ఉంది. దానివల్ల మానసిక, శారీరక ఆరోగ్యం కూడా స్వంతమవుతుంది జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు అంటున్నారు. ‘కాల్పనిక సాహిత్యం’ చదివితే మెదడు పదునెక్కుతుంది. జ్ఞాపకశక్తి పెరగుతుంది. మతిమరుపు తగ్గుతుంది. మానసిక ఉల్లాసం సొంతమవుతుంది. నమ్మకం లేకపోతే ఓ 20 రోజులపాటు మేం చెప్పింది పాటించి చూడండి అని చెబుతున్నారు ఈ ఆస్ట్రేలియా పరిశోధకులు. మరి టీవీ చూడటం తగ్గించి చదవటం మొదలుపెడదామా!? -రమ
  శరీరంలో ప్యూరిన్ పెరుగుదల కారణంగా యూరిక్ యాసిడ్ పెరగడం ప్రారంభమవుతుంది. అధిక యూరిక్ యాసిడ్‌తో బాధపడేవారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తినడం,  త్రాగడంలో ఏ కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కీళ్ళు,  ఎముకలలో నొప్పి, వాపు, పెరుగుతుంది. ప్యూరిన్ అనే రసాయనం శరీరంలో విచ్ఛిన్నమైతే, యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అతిగా తాగడం, తక్కువ శారీరక శ్రమ, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం, ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త కారణంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. వేసవిలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న రోగులు ఏ పండ్లు తినాలో తెలుసుకుంటే.. బ్లాక్బెర్రీస్.. బ్లాక్బెర్రీస్  వేసవిలో సీజన్లో అందుబాటులో ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ లు అధికంహా ఉన్న బెర్రీ పండ్లు  అధిక యూరిక్ యాసిడ్ ఉన్నవారికి  ప్రయోజనకరంగా ఉంటాయి.  బెర్రీలు జీవక్రియను పెంచడంలో,  శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి. ఇది శరీరంలో వాపును తగ్గిస్తుంది.  యాసిడ్ స్థాయి కూడా సమతుల్యంగా ఉంటుంది. అధిక యూరిక్ యాసిడ్ ఉన్నవారు  బ్లాక్బెర్రీస్ తినవచ్చు. చెర్రీలు.. యూరిక్ యాసిడ్ రోగికి చెర్రీలు కూడా  చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆమ్లాన్ని నియంత్రించే మూలకాలు చెర్రీస్‌లో ఉంటాయి. విటమిన్ బి-6, విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఎ,  విటమిన్ బి రెడ్  చెర్రీస్‌లో ఉంటాయి. చెర్రీస్ అధిక యూరిక్ యాసిడ్‌ను తగ్గించే అనేక ఖనిజాలను కలిగి ఉంటుంది. అరటిపండు.. యూరిక్ యాసిడ్ ప్రమాదాన్ని నివారించాలనుకుంటే రోజూ అరటిపండ్లను తినడం మంచిది. అరటిపండ్లలో ప్యూరిన్ తక్కువగా ఉంటుంది. అరటిపండ్లు తినడం ద్వారా అధిక యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. గౌట్ సమస్యలో అరటిపండ్లు కూడా మేలు చేస్తాయి. అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి కూడా అందుతుంది. కివీ.. పుల్లటి,  జ్యుసి పండ్లను తినడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంటే వాటి స్థానంలో  కివీని తినవచ్చు. కివి వినియోగం యూరిక్ యాసిడ్‌ను నియంత్రిస్తుంది. కివి తినడం వల్ల విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం,  ఫోలేట్ లభిస్తాయి. దీని వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి. కివిని రోజూ తినడం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. యాపిల్.. ఎండాకాలం అయినా, చలికాలం అయినా పండ్ల దుకాణంలో యాపిల్స్ ఎప్పుడూ దొరుకుతాయి. యాపిల్ ఫైబర్ అధికంగా ఉండే  పండు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. యాపిల్ రక్తంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. యాపిల్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ ప్రభావం తగ్గుతుంది.  రోజువారీ పనులు చేయడానికి తగినంత  శక్తి అందిస్తుంది. ప్రతిరోజూ ఒక యాపిల్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు.                                                *రూపశ్రీ.  
అరటి చాలా  శక్తివంతమైన పండు. దీన్ని తినడం వల్ల శరీరానికి ప్రాణశక్తి లభిస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు ఓ అరటిపండు తింటే చాలాసేపటి వరకు ఆకలి బాధ దూరంగా ఉంటుంది. ఇది మెత్తగా ఉండటం వల్ల చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరూ తినదగిన పండు. జీర్ణం కావడానికి సులువుగానే ఉంటుంది. ఎక్కువసేపు ఆకలిని అదుపులో ఉంచుతుంది. కండరబలాన్ని, పోషకాలను ఇస్తుంది. వర్కౌట్ తర్వాత అరటిపండు తినడం ఫిట్నెస్ ఫాలో అయ్యేవారికి తప్పనిసరి. పైపెచ్చు అరటిపండు మిగిలిన పండ్లతో పోలిస్తే ధర తక్కువే. కాబట్టి అందరూ కొనుక్కుని తినగలుగుతారు. కానీ  అరటిపండు అందరికీ మంచిది కాదు. ఆయుర్వేదంలో అరటిపండు కొంతమందికి ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. అరటిపండు తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో? దీన్ని ఎవరు తినకూడదో  తెలుసుకుంటే.. పోషకాలు.. అరటిపండు తినడం వల్ల  విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ బి6తో పాటు గ్లూటాతియోన్, ఫినాలిక్స్, డెల్ఫిడినిన్, రుటిన్, నారింగిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. 80వ్యాధులకు చికిత్స చేయగలదు.. పోషకాహార నిపుణులు అరటిపండులో ఉన్న గొప్పదానాన్ని చెబుతూ ఇది 80రకాల వ్యాధులకు చికిత్స చేయగలదని పేర్కొన్నారు. అరటి పండు వాత పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తుంది. వాతం క్షీణించడం వల్ల దాదాపు 80 రకాల వ్యాధులు వస్తాయని ఆయుర్వేదంలో చెప్పబడింది. ఇది పొడిబారడం, ముడతలు పడటం, ఎముకలలో అంతరం, మలబద్ధకం, చేదు రుచి మొదలైన అనేక సమస్యలు ఇందులో ఉన్నాయి. వీటన్నింటికి అరటిపండు చికిత్స చేయగలుగుతుంది. అరటిపండు ఎవరు తినాలంటే.. ఆయుర్వేదం ప్రకారం అరటిపండు  చల్లని గుణం కలిగి ఉంటుంది. ఇది  జీర్ణం కావడానికి బరువుగా ఉంటుంది.   ఇది లూబ్రికేషన్‌గా పనిచేస్తుంది. శరీరం ఎండిపోయి, ఎప్పుడూ అలసిపోయినట్టు, బాగా నిద్రపోనట్టు, శరీరంలో ఎప్పుడూ మంటగా ఉన్నట్టు అనిపించేవారు, చాలా దాహంతో ఉన్నవారు,  ఎక్కువ  కోపంగా ఉన్నవారు అరటిపండును తినాలి. దీనివల్ల ఆ కోపస్వభావం, అతిదాహం వంటి సమస్యలు అణిచివేయబడతాయి. ఎవరు తినకూడదంటే.. అరటిపండు కఫ దోషాన్ని పెంచుతుంది. కాబట్టి అధిక కఫ శరీర తత్వం గలవారు దీనిని తినకూడదు. పెరిగిన కఫం కారణంగా జీర్ణాశయంలో  అగ్నితత్వం  బలహీనంగా ఉంటే అరటి పండు దానిని మరింత నెమ్మదిస్తుంది. అధిక కొవ్వు, దగ్గు,  జలుబు ఉన్నవారు, ఆస్తమా రోగులు దీనిని తినకూడదు. ఒకవేళ తినాలని అనిపిస్తే  చాలా ఆలోచించి దీని పర్యావసానాలు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉంటేనే తినాలి.                                              *నిశ్శబ్ద