జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం సాయంత్రం వెంకటేశ్వర కాలనీలో 116, 117 పోలింగ్‌ బూత్‌ వద్ద వైసిపి, కూటమి అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఎంపీ అభ్యర్థి భూపేష్‌ సుబ్బరామిరెడ్డి కింద పడిపోవడంతో కూటమి శ్రేణులు ఇటుక రాళ్లతో దాడికి దిగారు. ఈ సంఘటనలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మూలే సుధీర్‌రెడ్డి తలకు రాయి తగిలింది. అక్కడే ఉన్న డిఎస్‌పి యస్వంత్‌ జోక్యం చేసుకొని ఇరు గ్రూపుల వారిని సర్ధిజెప్పి అక్కడి నుంచి పంపించారు. దాడిలో ఆది నారాj ుణరెడ్డిరెడ్డి, వైసిపికి చెందిన వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. టిడిపి కార్యాలయం నుంచి సోమవారం రాత్రి 9 గంటలకు ఆదినా రాయణరెడ్డిని, భూపేష్‌ సుబ్బరామిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని దేవగుడికి సెక్యూ రిటీతో పంపారు. సుధీర్‌రెడ్డిని నిడిజువ్వికి పంపారు. మంగళవారం మళ్ళీ జమ్మలమడుగుకు రావడానికి ఇరువురు పార్టీల అభ్యర్థులు ప్రయత్నం చేయగా సుధీర్‌ రెడ్డిని ముద్దనూరులో అదుపులోకి తీసుకుని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అలాగే ఇటు వైపు ఆది, భూపేష్‌లను కూడా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. వారికి 2ం2 గన్‌ మెన్‌లను నియమించారు. మొత్తంపై జమ్మలమడుగులో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతుంది. అందులో భాగంగానే 144 సెక్షన్‌ కొనసాగుతుందని, అవసరమైతే ఫైరింగ్‌ చేయడానికి కూడా వెనకాడబోమని డిఎస్‌పి హెచ్చ రించారు. టిడిపి, బిజెపి, వైసిపి కార్యాలయాల వద్ద పోలీస్‌ బలగాలు మోహరించాయి. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు : డిఎస్‌పి జమ్మలమడుగులో 144 సెక్షన్‌ కొనసాగుతోందని డిఎస్‌పి టిడి యశ్వంత్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌ రోజు సోమవారం తలెత్తిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జమ్మలమడుగులో 144 సెక్షన్‌ కొనసాగుతుందన్నారు. టీ బంకులు, దుకాణాల్లో నలుగురు కంటే ఎక్కువ ఉంటే కేసు నమోదు చేస్తామన్నారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, అల్లలు సృష్టించేందుకు ప్రయత్నించినా, కవ్వింపు చర్యలకు పాల్పడినా లాఠీఛార్జి చేయాల్సి వస్తుందన్నారు. అవసరమైతే ఫైరింగ్‌ చేసేందుకైనా వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. అల్లర్లకు ప్రయత్నిస్తే నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెడతామని పేర్కొన్నారు. శాంతిభద్రత దృష్ట్యా పట్టణ ప్రజలు పోలీసు వారికి సహకరించాలని డిఎస్‌పి కోరారు. జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం సాయంత్రం వెంకటేశ్వర కాలనీలో 116, 117 పోలింగ్‌ బూత్‌ వద్ద వైసిపి, కూటమి అభ్యర్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఎంపీ అభ్యర్థి భూపేష్‌ సుబ్బరామిరెడ్డి కింద పడిపోవడంతో కూటమి శ్రేణులు ఇటుక రాళ్లతో దాడికి దిగారు. ఈ సంఘటనలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మూలే సుధీర్‌రెడ్డి తలకు రాయి తగిలింది. అక్కడే ఉన్న డిఎస్‌పి యస్వంత్‌ జోక్యం చేసుకొని ఇరు గ్రూపుల వారిని సర్ధిజెప్పి అక్కడి నుంచి పంపించారు. దాడిలో ఆది నారాయణరెడ్డిరెడ్డి, వైసిపికి చెందిన వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. టిడిపి కార్యాలయం నుంచి సోమవారం రాత్రి 9 గంటలకు ఆదినా రాయణరెడ్డిని, భూపేష్‌ సుబ్బరామిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని దేవగుడికి సెక్యూ రిటీతో పంపారు. సుధీర్‌రెడ్డిని నిడిజువ్వికి పంపారు. మంగళవారం మళ్ళీ జమ్మలమడుగుకు రావడానికి ఇరువురు పార్టీల అభ్యర్థులు ప్రయత్నం చేయగా సుధీర్‌ రెడ్డిని ముద్దనూరులో అదుపులోకి తీసుకుని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అలాగే ఇటు వైపు ఆది, భూపేష్‌లను కూడా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. మొత్తంపై జమ్మలమడుగులో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతుంది. అందులో భాగంగానే 144 సెక్షన్‌ కొనసాగుతుందని, అవసరమైతే ఫైరింగ్‌ చేయడానికి కూడా వెనకాడబోమని డిఎస్‌పి హెచ్చ రించారు. టిడిపి, బిజెపి, వైసిపి కార్యాలయాల వద్ద పోలీస్‌ బలగాలు మోహరించాయి. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు : డిఎస్‌పి జమ్మలమడుగులో 144 సెక్షన్‌ కొనసాగుతోందని డిఎస్‌పి టిడి యశ్వంత్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌ రోజు సోమవారం తలెత్తిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జమ్మలమడుగులో 144 సెక్షన్‌ కొనసాగుతుందన్నారు. టీ బంకులు, దుకాణాల్లో నలుగురు కంటే ఎక్కువ ఉంటే కేసు నమోదు చేస్తామన్నారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, అల్లలు సృష్టించేందుకు ప్రయత్నించినా, కవ్వింపు చర్యలకు పాల్పడినా లాఠీఛార్జి చేయాల్సి వస్తుందన్నారు. అవసరమైతే ఫైరింగ్‌ చేసేందుకైనా వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. అల్లర్లకు ప్రయత్నిస్తే నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెడతామని పేర్కొన్నారు. శాంతిభద్రత దృష్ట్యా పట్టణ ప్రజలు పోలీసు వారికి సహకరించాలని డిఎస్‌పి కోరారు.
ఎపిలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి  రిలీఫ్ అయ్యింది. మళ్లీ అధికారంలో వచ్చే సంకేతాలు వెలువడటంతో ఆపార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు పుణ్యక్షేత్రాల బాట పట్టారు.  రేపు మహారాష్ట్రలోని కొల్హాపూర్ వెళ్లనున్నారు. అక్కడి శ్రీమహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం షిర్డీ చేరుకుని సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుంటారు.ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్న చంద్రబాబు ఆ తర్వాత మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి వెళ్లారు. రేపు మహారాష్ట్ర వెళ్తున్నారు. కాగా, ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తమదేనని చంద్రబాబు ధీమాగా ఉన్నారు.  ఆలయాల సందర్శనలో బిజీబిజీగా గడుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరో స్వతంత్ర పోరాటాన్ని తలపిస్తున్నాయి. స్వతంత్ర పోరాటం జరిగిన సమయంలో బ్రిటీష్ వాళ్ళ భవంతుల మీద మన పతాకాన్ని ఎగరేయడానికి స్వతంత్ర  సమరయోధులు ఎంత రిస్క్ అయినా చేసేవారు. అదే తరహాలో ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం కార్యకర్తలు పనిచేస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో దారుణాలకు పాల్పడుతున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎదిరించి నిలబడుతున్నారు. ఈ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి పోటీలో నిలిచారు. తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా పెద్దారెడ్డి, ఆయన అనుచరులు రెచ్చిపోయారు. పలువురు టీడీపీ కార్యకర్తల మీద దాడులకు పాల్పడ్డారు. భారీ స్థాయిలో అల్లర్లు సృష్టించారు. టీడీపీ నాయకుడు మునిరెడ్డి ఇంటి మీదకి పెద్దారెడ్డి తన అనుచరులతో కలసి వెళ్ళి రాళ్ళ దాడి చేశారు. ఈ దాడిలో పో్లీసులకు కూడా తీవ్ర గాయాలు అయ్యేలా పరిస్థితి తయారయింది. ఈ నేపథంలో జేసీ దివాకర్‌రెడ్డి అనుచరులు పెద్దారెడ్డి ఇంటి మీదకి వెళ్ళారు. దాంతో భయపడిపోయిన పెద్దారెడ్డి ఇంటి నుంచి పరారయ్యారు. జేసీ  దివాకర్ రెడ్డి అనుచరులు పెద్దారెడ్డి ఇంటి మీద తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. తాడిపత్రిలో టీడీపీ జెండా ఎగరబోతోందనేదానికి దీన్ని సింబాలిక్‌గా చెప్పుకోవచ్చు.
ALSO ON TELUGUONE N E W S
ఒకప్పుడు డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు కూడా పోటీ పడేవారు. ఎందుకంటే ఆయన హీరోలను ప్రజెంట్ చేసే విధానం కొత్తగా ఉంటుంది. పూరి సినిమాల్లోని హీరోల ఆటిట్యూడ్, మ్యానరిజమ్స్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతాయి. అందుకే జయాపజయాలతో సంబంధం లేకుండా పూరి డైరెక్షన్ లో ఒక్క సినిమా అయినా చేయాలని హీరోలు అనుకునేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కొంతకాలంగా పూరి ట్రాక్ రికార్డు అంతగా బాలేదు. పైగా స్టార్ హీరోలంతా భారీ బడ్జెట్ తో రూపొందే పాన్ ఇండియా సినిమాల జపం చేస్తూ, పూరి వైపు చూడటం మానేశారు. దీంతో పూరి ఈమధ్య ఎక్కువగా యంగ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు మరో యంగ్ హీరోతో పూరి సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా 'డబుల్ ఇస్మార్ట్' (Double iSmart) అనే సినిమాని రూపొందిస్తున్నాడు పూరి జగన్నాథ్‌. 2019 లో రామ్-పూరి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఇస్మార్ట్ శంకర్'కి సీక్వెల్ గా వస్తున్న 'డబుల్ ఇస్మార్ట్'పై మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్ (double ismart teaser) కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా టీజర్ మాస్ ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే, పూరి తన తదుపరి సినిమాని తేజ సజ్జాతో చేయనున్నట్లు సమాచారం. 'హనుమాన్'తో సంచలన విజయాన్ని అందుకొని, పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న తేజ.. ప్రస్తుతం కార్తీక్ ఘట్టమేనని డైరెక్షన్ లో 'మిరాయ్' సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాత తేజ.. పూరితో చేతులు కలపబోతున్నట్లు వినికిడి. ఇప్పటికే కథా చర్చలు జరిగాయని, 'డబుల్ ఇస్మార్ట్' విడుదలయ్యాక తేజ-పూరి కాంబినేషన్ మూవీ ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు.
అభిమానులు అయితే ఏమి  ప్రేక్షకులు అయితే  ఏమి  సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తుండటం ఆనవాయితీ. కానీ టీజర్ కోసం ఎదురుచూస్తుంటే. ఏంటి  టీజర్  కోసం కూడా ఎదురుచూస్తుంటారా  అని అనుకోవద్దు. హైదరాబాద్ షాన్ కోసం ఎదురుచూస్తుంటారు. అదేనండీ మన ఇస్మార్ట్ శంకర్ కోసం. వాళ్ళ ఎదురుచూపులు నేడు ఫలించాయి రామ్ పోతినేని (Ram Pothineni)హీరోగా పూరి జగన్నాధ్(puri jagannadh) దర్శకత్వంలో వస్తున్న మూవీ డబుల్ ఇస్మార్ట్ (Double ismart)2019 లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్( ismart shankar)కి సీక్వెల్ గా తెరకెక్కుతుంది.  ఈ రోజు టీజర్ రిలీజ్ అయ్యింది. ఒక నిమిషం ఇరవై ఆరు సెకన్లు నిడివితో అలా రిలీజ్ అయ్యిందో లేదో సోషల్ మీడియాలో రికార్ట్డ్ వ్యూస్  తో ముందుకు దూసుకుపోతుంది.నాకు తెలియకుండా సినిమా ప్లాన్ చేస్తే ఎలా అంటూ రామ్ తన స్టైల్ ఆఫ్ మాట తీరుతో చెప్పడం  చూస్తుంటే  ప్రేక్షకుల్లో మళ్ళీ  శంకర్ మానియా ప్రారంభం అయినట్టయ్యింది. నాకు తెలియకుండా సినిమా ప్లాన్ చేస్తే బాగోదు అని చెప్పడం కూడా చాలా  బాగుంది .అలాగే రామ్ కి కొంత మంది డాక్టర్స్ ట్రీట్ మెంట్ చేస్తుండటం కథ విషయంలో  క్యూరియాసిటీ ని కలిగిస్తుంది.ఒక్కటి మాత్రం నిజం.రామ్  మరోసారి శంకర్ క్యారక్టర్ లో తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు .ఇక విలన్ గా సంజయ్ దత్  మెరుపులు కూడా ఉండబోతున్నాయనే విషయం అర్ధమవుతుంది.  మణిశర్మ (mani sharma) అందించిన ఆర్ ఆర్ కూడా సూపర్ గా ఉంది. దీంతో అందరు సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు  ఇక పూరి మరోసారి తన సత్తా చాట బోతున్నాడనే విషయం క్లియర్ గా అర్ధం అవుతుంది. రామ్ సరసన  కావ్య థాపర్  చేస్తుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా టీజర్ రిలీజ్ అయ్యింది. దీన్ని బట్టి శంకర్ రేంజ్ అర్ధం చేసుకోవచ్చు.ఇక టీజర్ చూసిన రామ్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. టైటిల్ కి తగ్గట్టే వాళ్ళకి డబుల్ పండుగ తెచ్చింది. ఎందుకంటే ఈ రోజు రామ్ పుట్టిన రోజు. దీంతో సంబరాల్లో మునిగిపోయారు.పూరి జగన్నాధ్,  ఛార్మి లు నిర్మాతలుగా వ్యవరిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో ఉన్న శంకర్ ప్రాబ్లమ్ కి డబుల్ ఇస్మార్ట్ లో సొల్యూషన్ దొరుకుతుందేమో చూడాలి      
Allu Sirish is all set for his latest movie, 'Buddy,' a fantasy action drama that marks the first Telugu film to explore a Teddy bear theme. The initial glimpse released by the filmmakers has already captured the audience's interest with its compelling storyline. The musical journey for 'Buddy' kicked off today with the release of a catchy track titled 'Aa Pilla Kanule.' This song, characteristic of Hip Hop Tamizha’s signature style, features lively beats and a peppy melody that instantly grabs attention. The lyrics, penned by Sai Hemanth, are engaging and add to the track's appeal. Vocal performances by Hip Hop Tamizha, Sanjith Hegde, Airaa, and Vishnu Priya enhance the energetic vibe of this trendy melody, which is likely to become a dance favorite. Given the song's immediate popularity, expectations are high for the rest of the album from Hip Hop Tamizha. Gayathri Bharadwaj stars as the female lead in the film, which is produced by KE Gnanavel Raja and Adhana Gnanavel Raja under Studio Green Films, directed by Sam Anton, and co-produced by Neha Gnanavel Raja. 'Buddy' is gearing up for its release soon.
'మంత్ర', 'మంగళ' సినిమాలతో టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఓషో తులసిరామ్ మళ్ళీ "దక్షిణ " మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కల్ట్ కాన్సెప్ట్స్ మూవీ బ్యానర్ నిర్మాణంలో అశోక్ షిండే నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'కబాలి' ఫేమ్ సాయి ధన్షిక కథానాయికగా నటిస్తుండగా.. మహాభారత్ మర్డర్స్ ఫేమ్ రిషవ్ బసు మరొక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్ కు విశేష స్పందన లభించింది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు బుచ్చిబాబు విడుదల చేసారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబు మాట్లాడుతూ... ఈ మధ్య కాలం లొ నన్ను భయపెట్టిన ట్రైలర్ ఇదే అన్నారు. మళ్ళీ తులసి రామ్ గారు టాలీవుడ్ కి మరో ట్రెండ్ సెట్టర్ సైకో థ్రిల్లర్ ని 'దక్షిణ' సినిమాతో ఇవ్వబోతున్నారు అంటూ అభినందించారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు చిత్ర బృందం పాల్గొన్నది. దక్షిణ సినిమా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేవుతోందని  త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర నిర్మాత అశోక్ షిండే తెలిపారు.
Ustaad Ram Pothineni and sensational director Puri Jagannadh are back with the sequel for their massive blockbuster iSmart Shankar. As the title suggests, the movie Double ISMART is going to be double the madness to the prequel. Extending birthday wishes to the dynamic star Ram, the makers dropped diMAAKIKIRIKIRI teaser of Double ISMART. The teaser opens with a voiceover that uses all the filthy words to describe the character of the protagonist who is now in a lab in Hyderabad with some scientists around him. Ram is back as Ustaad iSmart Shankar alias Double ISMART who flirts with Kiraak girls and taps feet for Khatarnaak beat.  Kavya Thapar was introduced as the leading lady. Sanjay Dutt makes a powerful entry as Big Bull. The last sequence is exceptional. Like for iSmart Shankar, Double ISMART also has a heavy and action-packed climax sequence with a spiritual touch. The enormous Shiva Linga and the massive crowd where the climax fight takes place offer goosebumps. The teaser surely ignited the iSmart madness. Puri Jagannadh yet again presented his hero in the best stylish, mass, and action-packed avatar. The one-liners in typical Hyderabadi slang keep you entertained throughout. Ram reprised Double ISMART with double the flair. His energetic acting and on-screen charisma are exceptional. There is a sense of déjà vu to see Ali in a funny role. Puri and Ali indeed is a hilarious combination. Sam K Naidu and Gianni Gianneli’s visuals are fantastic and their choice of colours needs to be appreciated. Mani Sharma’s background elevates the mood. While Steppa Maar and Kiri Kiri sounds uplift the mass hysteria, the Shiva sound in the end portion adds a divine touch. The production design of Puri Connects is double the grandness of the first instalment. This diMAAKIKIRIKIRI teaser augmented the enthusiasm for the movie produced by Puri Jagannadh and Charmme Kaur. Double ISMART will be released in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi languages.
నిఖిల్ తో నాటకాలు పేరుతో యూట్యూబ్ లో సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూస్ చేసే నిఖిల్ విజయేంద్ర సింహ మూవీలో హీరోగా నటించబోతున్నాడు.  సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నిఖిల్ హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యవ్ సోదరుడు.. ఇప్పుడు అతన్ని "సంగీత్” మూవీ ద్వారా లహరి ఫిల్మ్స్ పరిచయం చేస్తోంది. నిఖిల్ కి జోడిగా తేజు అశ్విని కనిపించనుంది. సమర్థ్ పాత్రలో నిఖిల్ కనిపించబోతున్నాడు.  "ఎట్టకేలకు మ్యాజిక్ జరిగిపోయింది. మిమ్మల్నందరినీ సంగీత్ ప్రపంచానికి ఆహ్వానిస్తున్నాం. నేను ఎంతో పుణ్యం చేసుకున్నా. నటుడిగా నా ప్రయాణం మొదలు కాబోతోంది. నేను వేసిన ప్రతీ అడుగును మీరంతా ప్రేమతో సపోర్ట్ చేశారు. మీ లవ్, సపోర్ట్, సాక్రిఫైస్ నన్నింత దూరం తీసుకొచ్చింది. మీ అందరి వల్లనే ఇదంతా జరిగింది...మీరు లేకుండా నేను లేను. కృతజ్ఞతతో , ఎన్నో కలలతో కొత్త  అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాను...ప్రేమతో మీ నిఖిల్ విజయేంద్ర సింహ" అని ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. "సంగీత్" మూవీ ప్రొడ్యూసర్స్ పూజ చేసి తమ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేశారు . సంగీత్‌లో నిఖిల్ విజయేంద్ర సింహ కథానాయకుడిగా నటించారు. నిహారిక కొణిదెల స్క్రిప్ట్ అందించగా, హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యవ్ కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు షాట్ కోసం ఎస్.ఎస్. కార్తికేయ క్లాప్ కొట్టారు.  కన్నడలో 'హంబుల్ పొలిటీషియన్ నోగ్రాజ్'తో గుర్తింపు తెచ్చుకున్న రైటర్ ,డైరెక్టర్   సాద్ ఖాన్ "సంగీత్” ఈ మూవీకి  దర్శకత్వం వహిస్తున్నారు. లహరి ఫిలిమ్స్, ఆర్.బి. స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.  
కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలోనూ, ఏదైనా మంచి కార్యానికి విరాళం ఇవ్వడంలోనూ తెలుగు హీరోలు ఎప్పుడూ ముందుంటారు. అలా సాయానికి ముందుండే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకరు. ఎటువంటి ప్రచారం లేకుండా.. సాయం చేయడం, విరాళం ఇవ్వడం ఆయన శైలి. ఆ తర్వాత ఎప్పటికో ఎన్టీఆర్ చేసిన మంచి పని గురించి అందరికీ తెలుస్తుంది. అలా ఇటీవల ఆయన ఇచ్చిన ఓ భారీ విరాళం.. అభిమానుల ద్వారా వెలుగులోకి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్నపేటలో ఇటీవల శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయంతో పాటు ప్రహరీ గోడ నిర్మాణం కోసం ఎన్టీఆర్ రూ.12.50 లక్షలు (12 లక్షల 50 వేలు) విరాళం ఇచ్చారు. అయితే ఈ విషయం ముందుగా మీడియాకి కూడా తెలియలేదు. ఆలయ ప్రాంగణంలో విరాళ వివరాలు తెలుపుతూ ఓ శిలాఫలకం ఉండగా.. దానిని ఒకరు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో ఆలయ నిర్మాత దాతగా ఎన్టీఆర్ మరియు ఆయన కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ అభిమానులు పొంగిపోతున్నారు. చేసిన సాయాన్ని ప్రచారం చేసుకోని నైజం మా హీరోది అంటూ మురిసిపోతున్నారు. కాగా, తన పెళ్లి జరిపించిన పూజారుల్లో ఒకరి ద్వారా జగ్గన్నపేట వీరభద్రస్వామి ఆలయ నిర్మాణం గురించి తెలుసుకున్న ఎన్టీఆర్.. తన వంతుగా ఈ విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. సినిమాల విషయానికొస్తే, ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' (Devara) చేస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న మొదటి సాంగ్ విడుదల కానుంది.
మనిషికి  కల్లా కపటం లేని ఆనందాన్ని, కల్లా కపటం లేని అభిమానాన్ని ఇచ్చే ఏకైక సాధనం సినిమా. దేవుడ్ని అయినా కొలవని వారు ఉంటారేమో గాని సినిమా వాళ్ళని కొలవని వాళ్ళు ఉండరు. సినిమాకి అంతటి  శక్తీ ఉంది.అసలు  సినిమా చూడకుండా నిద్రపోని వారు కూడా  చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఆ సినిమాకి కష్టం వచ్చి పడింది.  17 - 5 - 2024   శుక్రవారం నుండి  తెలంగాణాలో ఒక  పది రోజులు పాటు  థియేటర్స్ మూతపడనున్నాయి. ప్రస్తుతం  మార్కెట్ లో  బడా హీరోల నుంచి ఒక మోస్తరు హీరోల దాకా  ఎలాంటి సినిమాలు లేవు. దీంతో  థియేటర్లు నడపటం భారం కావడంతో తెలంగాణ  థియేటర్స్ యాజమాన్యం ఈ నిర్ణయo తీసుకుంది.  సింగల్ స్క్రీన్ థియేటర్స్ వరకు  బంద్ కానున్నాయి.  ఈ వార్త సినీ ప్రేమికులకి అయితే బ్యాడ్ న్యూసే. వారంతా  కొన్ని రోజులు  సినీ పండుగకి దూరం కాక తప్పదు తిరిగి  ఎప్పుడు ప్రారంభించేది మళ్ళీ అధికారకంగా ప్రకటిస్తారు. ఏం చేస్తాం కష్టాలు మనుషులకే కాదు సినిమాలకి వస్తాయి గతంలో కూడా ఒక సారి ఇలాగే జరిగింది. కరెంట్ బిల్, స్టాఫ్ సాలరీస్ పెను భారం కావడంతో క్లోజ్ చేసారు. ఇక మల్టి ప్లెక్స్ థియేటర్స్ మాత్రం యధావిధిగా ఉంటాయి. సింగల్ స్క్రీన్  థియేటర్స్ మూసివేత విషయం మాత్రం ఇప్పుడు ప్రేక్షకుల్లో  హాట్ టాపిక్ గా మారింది  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ఏడవడం  ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చేసే పనే.. అయితే ఎప్పుడు ఏడుస్తున్నాం, ఎందుకు ఏడుస్తున్నాం అనేది మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు ఇతరులతో ఏదైనా వాదిస్తున్నప్పుడో.. గొడవ పడుతున్నప్పుడో అప్రయత్నంగా ఏడ్చేస్తుంటాం. మనిషిలో ఎమోషన్ స్థాయి పెరిగినప్పుడు ఎంత కంట్రోల్ చేసుకుందాం అన్నా కొన్ని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేరు. అదే ఏడుపుగా బయటకు వస్తూంటుంది. అయితే ఇలా ఏడ్చిన తరువాత.. అయ్యో ఎందుకు ఏడ్చాము అని ఎవరిని వారు అనుకుంటూంటారు. కొన్ని సార్లు తమని తాము నిందించుకునే వారు కూడా ఉంటారు. అయితే కింది చిట్కాలతో ఎలాంటి సిట్యుయేషన్ లో అయినా ఏడుపును నియంత్రించుకోవచ్చు. కారణం.. ఎవరితో అయినా వాదిస్తున్నప్పుడు, గొడవ పడుతున్నప్పుడు ఏడుపు వస్తుంటే అసలు ఏడుపు ఎందుకు వస్తోంది అని ఆలోచించాలి. దాని కారణం అర్థం అయ్యాక అసలు ఏడవాలని అనుకున్నా కూడ ఏడుపు రాదు. అంతేకాదు.. అలా ఏడవడానికి బదులుగా ఇతరులతో లాజిక్ గా మాట్లాడతారు. డైవర్ట్ కావాలి.. ఆర్గ్యూ చేసుకున్నప్పుడు  ఏడుపు వస్తుంటే దాన్ని బయటపడనివ్వకుండా డైవర్ట్ కావాలి.  ఇందుకోసం పిడికిలి బిగించడం, లోతుగా శ్వాస తీసుకోవడం,  గట్టిగా కళ్లు మూసుకోవడం వంటి చర్యల ద్వారా కోపాన్ని డైవర్ట్ చేయాలి. సైలెంట్.. గొడవ లేదా వాదన జరుగుతున్నప్పుడు ఏడుపు వచ్చినా దాన్ని అణుచుకోవాలన్నా, ఎదుటివారితో లాజిక్ గా మాట్లాడాలన్నా సింపుల్ గా కాసేపు సైలెంట్ గా ఉండటం మంచిది. దీని వల్ల విషయాన్ని బాగా అర్థం చేసుకుని  లాజిక్ గా వాదించి మీరే కరెక్ట్ అనిపించుకోవచ్చు.                                               *నిశ్శబ్ద.
ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే అంటారు. అందుకే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అంటూ పాటను రాశారు రచయితలు. బ్రహ్మకు మారు పేరు అమ్మ. మనకు దెబ్బ తగిలినా వెంటనే అమ్మా అని అంటాము. అంటే మనకు ఆనందం కలిగినా..బాధ కలిగినా వెంటనే అమ్మ గుర్తొస్తుంది. రెండు గంటల పాలు మనల్ని వినోదంలో ముంచెత్తే మన తారలైనా అమ్మకు ముద్దుల బిడ్డలే. మన తెరవేల్పుల్లో చాలా మంది అమ్మతో అనుబంధం గురించి వేదికలపైనో ప్రెస్ మీట్‌లలోనో చెబుతూ ఉంటారు. మన హీరోలు వాళ్ల అమ్మతో దిగిన చిత్రమాలిక మీ కోసం..   అమ్మ రమాబాయితో  రజనీకాంత్ అమ్మ అంజనాదేవితో  చిరంజీవి, నాగబాబు    అమ్మ అంజనాదేవితో  పవన్ కళ్యాణ్  అమ్మ ఇందిరాదేవితో  మహేశ్  అమ్మ షాలినితో ఎన్టీఆర్ అమ్మ రాజ్యలక్ష్మీతో  రవితేజ అమ్మ శివకుమారితో  ప్రభాస్  అమ్మ సురేఖతో రామ్‌చరణ్ అమ్మ నిర్మలతో అల్లు అర్జున్, అల్లు శిరీష్ అమ్మ విజయలక్ష్మీతో నాని
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం కాస్త కష్టమైన పనే. చదివిన చదువుకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షించేవారు ప్రస్తుతం తక్కువే. పట్టణాలలో మంచి మంచి కంపెనీలలో గౌరవప్రదమైన వేతనంతో, హుందాగా ఉండే ఉద్యోగాలు చాలానే ఉన్నాయి. చాలామంది ఆ ఉద్యోగాల విషయంలో కూడా గందరగోళానికి గురవుతూ ఉంటారు. కారణం ఇంటర్వ్యూ లో సక్సెస్ కాకపోవడం. ఎంతో బాగా చదివి, మంచి ర్యాంక్ లు సాధించిన వారు కూడా ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేసరికి ఫెయిల్ అవుతూ ఉంటారు. మరి ఇంటర్వ్యూ లో సక్సెస్ కావాలంటే ఏమి చేయాలి??  ఎంపిక: కొంతమంది ఖాళీగా ఉన్నాం ఏదో ఒక జాబ్ తొందరగా చూసుకోవాలి, ఏదో ఒకటి క్లిక్ అవ్వకపోతుందా అనే ఆలోచనతో వరుసపెట్టి అన్నిటికి అప్లై చేసేస్తూ ఉంటారు. దీనివల్ల నెలకొనేదే పెద్ద గందరగోళం. కాన్ఫిడెంట్ లేకుండా పది కంపెనీలలో ఇంటర్వ్యూ కు వెళ్లడం కంటే కాన్ఫిడెంట్ తో ఒక్కదానికి అటెండ్ అవ్వడం మంచిదనే విషయం మర్చిపోకండి.  నాట్ ఓన్లీ దట్: ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పటి నుండి అందరూ చేసే పని, తాము అప్లై చేసిన జాబ్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మననం చేసుకుంటూ వాటిని బట్టి పట్టడం. దీనివల్ల ఒనగూరేది ఏమి ఉండదు. ఎందుకంటే వాటిని మననం చేసుకుంటూ మిగిలిన వాటిని ఎంతో సులువుగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. పైపెచ్చు ఇంటర్వ్యూ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది సంస్థకు సంబంధించిన వారి ఇష్టం. వారు పూర్తి జాబ్ కు సంబంధం లేని విషయం అయినా అడగవచ్చు. ఎందుకంటే వాళ్లకు కావలసింది పని చేయడం మాత్రమే కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి వర్క్ కు సంబంధించిన విషయాలు ఒక అంశం మాత్రమే. మరింకేం కావాలి?? నమ్మకం ఇవ్వగలగాలి. బాధ్యతాయుతంగా ఉండగలరు అనే నమ్మకాన్ని ఇవ్వగలగాలి. చాలా సంస్థల్లో మొదట ప్రాధాన్యత ఇచ్చే విషయం కూడా ఇదే.  పని చేయబోయే సంస్థ  విషయంలో, చేయబోయే వృత్తి విషయంలో ఎంత బాధ్యతాయుతంగా ఉండగలరు అనే విషయం మీదనే ఎంపిక ఎక్కువగా జరుగుతుంది. అలాగే పని పట్ల నిబద్ధత ఎంతో అవసరం. పనికి ప్రాధాన్యత ఇచ్చేవారి వైపు కంపెనీ మొగ్గు చూపుతుంది. కాబట్టి పని విషయంలో భరోసా ఇవ్వగలగాలి. స్పృహ కలిగి ఉండాలి: ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు కంపెనీ భవంతిలో అడుగుపెట్టినప్పటి నుండి చుట్టుపక్కల వాతావరణం ను గమనించుకుంటూ వెళ్ళాలి. కంపెనీలలో ప్రతిచోటా సీసీ కెమెరాల నిఘా ఉంటుందనే విషయం మరువకూడదు. మనిషి కదలిక నుండి ఆహార్యం వరకు ప్రతి విషయంలో ఒక నిజాయితీ కనిపించాలి. నటించాలని చూస్తే ఖాళీ చేతులతో బయటకు రావడం ఖాయం. తన పని మాత్రమే చూసుకుని పోయే వాళ్లకు ప్రాధాన్యత తక్కువగానే ఉంటుంది. ఇంటర్వ్యూ రూమ్ దగ్గరకు వెళ్లే మార్గంలో ఉన్న క్యాబిన్ లలో ఎవరు లేకుండా ఉండి, ఫ్యాన్ లు, లైట్ లు వంటివి ఆన్ లో ఉంటే వాటిని ఆఫ్ చేయడం. నీటిని వృథా చేయకపోవడం, లిఫ్ట్ సౌకర్యం ఉన్నా మెట్లెక్కి వెళ్లడం. మంచినీళ్లు వంటివి ఇచ్చే బాయ్ ని నవ్వుతూ పలకరించడం, థాంక్స్ చెప్పడం. ముఖ్యంగా సంస్థ గూర్చి ఇంటర్వ్యూ కు వచ్చిన తోటి వ్యక్తులతో ఎలాంటి చర్చా చేయకుండా ఉండటం. సంస్థ గురించి ముందుగానే వివరంగా తెలుసుకోవడం. అంటే సంస్థ స్థాపన నుండి ప్రస్తుతం అధికారుల వరకు అన్నిటి గూర్చి వారి కృషి గురించి కూడా అధ్యయనం చేసి తెలుసుకోవడం. స్కిల్స్ ఎప్పుడు కిల్ చేయకూడదు: కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంటర్వ్యూ లో అధికారులతో మాట్లాడేటపుడు కావాలని వారిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించకూడదు. లేకపోతే మీ స్కిల్స్ ను మీరే కిల్ చేసుకున్నట్టు అవుతుంది.  ముందుగా మరింత ఉత్సాహంగా: ఇక చివరగా చెప్పుకున్నా అన్నిటికంటే ముందు చేయవలసిన పని. ఇంటర్వ్యూ కు హడావిడిగా చివరి నిమిషంలో వెళ్లకుండా, వీలైనంత ముందుగా వెళ్లడం. దీనివల్ల కంపెనీని అక్కడి వాతావరణాన్ని, పని విధానాన్ని అంతో ఇంతో గమనించే వెసులుబాటు ఉంటుంది. తద్వారా సహజంగానే గందరగోళం తగ్గిపోతుంది.  ట్రస్ట్ యువర్ కాన్ఫిడెన్స్: మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు నమ్మండి. ఎవరో ఏదో భయపెట్టేలా చెప్పే మాటలు, విషయాలు ఏవి పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఉన్నట్లయితే, మీ వ్యక్తిత్వం నుండి, పని విషయం వరకు మీ అభిప్రాయాలు నచ్చాయంటే ఏ కంపెనీ ఎం.డి కూడా మిమ్మల్ని వదులుకోడు.  సక్సెస్ మీ చేతుల్లోనే ఉంది సుమా!! ◆ వెంకటేష్ పువ్వాడ
వేసవి వచ్చిందంటే చాలామంది పుచ్చకాయలు, చెరకు రసం, మామిడి పండ్లు, తాటిముంజలు మొదలైనవి తినడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. మరీ ముఖ్యంగా ఎక్కువశాతం నీటితో నిండి ఉండే పుచ్చకాయ అంటే పిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టం. తియ్యగా, జ్యూసీగా ఉండే పుచ్చకాయను ఎర్రటి ఎండలో తింటూంటే వేసవి తాపం మొత్తం మాయమైపోతుంది. అందుకే శీతల పానీయాలు, సోడాలు తీసుకోవడానికి బదులు పుచ్చకాయ తినడం మంచిదని ఆహార నిపుణులు కూడా చెప్తారు. అయితే పుచ్చకాయ బాగుంటుంది కదా అని మరీ ఎక్కువగా తినేస్తే మాత్రం ఆరోగ్య లాభాలకు బదులు నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పుచ్చకాయ తియ్యగా ఉంటుంది. కేలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. వేసవి దాహాన్ని తీరుస్తోంది కదా అని పుచ్చకాయను అధికంగా తింటే మాత్రం తక్కువగా ఉన్న కేలరీలు కాస్తా శరీరానికి అధికంగా మారతాయి. వీటిలో ఉండే చక్కెరల  కారణంగా బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది.  అందుకే పుచ్చకాయ మంచిదే  అయినా ఎక్కువ తింటే అధికబరువుకు దారితీస్తుంది. పుచ్చకాయలో ఫైబర్, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి మంచిదే అయినా అతిగా తింటే జీర్ణం కావడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది కాస్తా  గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలకు కారణం అవుతుంది. అన్ని వయసుల వారు పుచ్చకాయను తినచ్చు. అదేవిధంగా  మధుమేహం ఉన్నవారు కూడా దీన్ని మితంగా తీసుకోవచ్చు. అయితే పుచ్చకాయను  అధికంగా తీసుకుంటే మాత్రం మధుమేహ రోగులకు ప్రమాదం. ఎందుకంటే కేలరీలు తక్కువగా ఉన్నా పుచ్చకాయలో తియ్యదనం ఎక్కువగా ఉంటుంది. అతిగా తింటే ప్రమాదం.   ఆరోగ్యవంతమైన శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు అన్నీ  కూడా ముఖ్యమే. అయితే పుచ్చకాయ అధికంగా తినడం వల్ల శరీరంలో ఖనిజాలు విచ్చిన్నమవుతాయి. శరీరంలో ఖనిజాల కొరత ఏర్పడుతుంది.  ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదం. పుచ్చకాయలో నీటి శాతం, ఫైబర్  అధికంగా ఉంటాయి. కడుపుకు సంబంధించిన సమస్యలతో  ఇబ్బంది పడేవారు   పుచ్చకాయను ఎక్కువగా తినడం వల్ల సమస్యలు మరింత పెరుగుతాయి.                                                          *రూపశ్రీ  
  శరీరంలో ప్యూరిన్ పెరుగుదల కారణంగా యూరిక్ యాసిడ్ పెరగడం ప్రారంభమవుతుంది. అధిక యూరిక్ యాసిడ్‌తో బాధపడేవారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తినడం,  త్రాగడంలో ఏ కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కీళ్ళు,  ఎముకలలో నొప్పి, వాపు, పెరుగుతుంది. ప్యూరిన్ అనే రసాయనం శరీరంలో విచ్ఛిన్నమైతే, యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అతిగా తాగడం, తక్కువ శారీరక శ్రమ, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం, ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త కారణంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. వేసవిలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న రోగులు ఏ పండ్లు తినాలో తెలుసుకుంటే.. బ్లాక్బెర్రీస్.. బ్లాక్బెర్రీస్  వేసవిలో సీజన్లో అందుబాటులో ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ లు అధికంహా ఉన్న బెర్రీ పండ్లు  అధిక యూరిక్ యాసిడ్ ఉన్నవారికి  ప్రయోజనకరంగా ఉంటాయి.  బెర్రీలు జీవక్రియను పెంచడంలో,  శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి. ఇది శరీరంలో వాపును తగ్గిస్తుంది.  యాసిడ్ స్థాయి కూడా సమతుల్యంగా ఉంటుంది. అధిక యూరిక్ యాసిడ్ ఉన్నవారు  బ్లాక్బెర్రీస్ తినవచ్చు. చెర్రీలు.. యూరిక్ యాసిడ్ రోగికి చెర్రీలు కూడా  చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆమ్లాన్ని నియంత్రించే మూలకాలు చెర్రీస్‌లో ఉంటాయి. విటమిన్ బి-6, విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఎ,  విటమిన్ బి రెడ్  చెర్రీస్‌లో ఉంటాయి. చెర్రీస్ అధిక యూరిక్ యాసిడ్‌ను తగ్గించే అనేక ఖనిజాలను కలిగి ఉంటుంది. అరటిపండు.. యూరిక్ యాసిడ్ ప్రమాదాన్ని నివారించాలనుకుంటే రోజూ అరటిపండ్లను తినడం మంచిది. అరటిపండ్లలో ప్యూరిన్ తక్కువగా ఉంటుంది. అరటిపండ్లు తినడం ద్వారా అధిక యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. గౌట్ సమస్యలో అరటిపండ్లు కూడా మేలు చేస్తాయి. అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి కూడా అందుతుంది. కివీ.. పుల్లటి,  జ్యుసి పండ్లను తినడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంటే వాటి స్థానంలో  కివీని తినవచ్చు. కివి వినియోగం యూరిక్ యాసిడ్‌ను నియంత్రిస్తుంది. కివి తినడం వల్ల విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం,  ఫోలేట్ లభిస్తాయి. దీని వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి. కివిని రోజూ తినడం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. యాపిల్.. ఎండాకాలం అయినా, చలికాలం అయినా పండ్ల దుకాణంలో యాపిల్స్ ఎప్పుడూ దొరుకుతాయి. యాపిల్ ఫైబర్ అధికంగా ఉండే  పండు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. యాపిల్ రక్తంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. యాపిల్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ ప్రభావం తగ్గుతుంది.  రోజువారీ పనులు చేయడానికి తగినంత  శక్తి అందిస్తుంది. ప్రతిరోజూ ఒక యాపిల్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు.                                                *రూపశ్రీ.