తెలంగాణ కాంగ్రెస్ లో  ఇటీవలి కాలంలో పెను సంచలనం సృష్టించిన కొండా సురేఖ ఎపిసోడ్ కు లాజికల్ కంక్లూజన్ దిశగా కాంగ్రెస్ హైకమాండ్ అడుగులు వేస్తున్నది.  పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించారనే ఆరోపణలపై కొండా సురేఖపై చర్యలకు సిఫారసు చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. దీంతో కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.  అయితే రక్షాబంధన్ రోజున కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి అప్పాయింట్ మెంట్ తీసుకుని మరీ ఆయనతో భేటీ అవ్వడం, రాఖీ కట్టడం తెలిసిందే. ఆ తరువాత రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించిన ఆమె.. తన కుమార్తె  వ్యాఖ్యలతో తనకు ఎటువంటి సంబంధం లేదని క్లియర్ కట్ గా, క్లారిటీ ఇచ్చారు. ఈనేపథ్యంలోనే కొండా సురేఖపై వేటు విషయంలో పార్టీ హైకమాండ్ వైఖరి మారిందని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నది.    పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు ఆమెపై చర్య తీసుకోవడం ఖాయమే అని చెబుతూనే.. త్వరలో రేవంత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఆమెకు ఉద్వాసన చెప్పడం కాకుండా.. రాజీనామా కోరాలని హైకమాండ్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.  మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టి కొత్తవారికి అవకాశం   పేరుతో కొండా సురేఖను రాజీనామా చేయాల్సిందిగా సూచించేందుకే హైకమాండ్ భావిస్తోందంటున్నారు. ఏది ఏమైనా రానున్న రెండు రోజుల్లో  ఈ విషయంపై క్లారిటీ వస్తుందని అంటున్నారు.   [Congress High Command Softcorner on Konda Surekha, Telangana Congress, CM Revanth, Cabinet Expanssion, Telugu One] 
వైసీపీ అధినేత జగన్.. తన వ్యాఖ్యలతో పార్టీకి కలిగిన నష్టాన్ని నివారించేందుకు బొత్స రంగంలోకి దిగారు. నష్ట నివారణ కోసం ఆయన జగన్ వ్యాఖ్యలకు కొత్త భాష్యం చెప్పారు.  స్థానిక ఎన్నికలలో ఏకగ్రీవాలు ఉండడానికి వీల్లేదన్న జగన్ ఆదేశాలకు భిన్నంగా, బొత్స సత్యనారాయణ స్థానిక ఎన్నికలలో  ఏకగ్రీవాలు రెండు రకాలుగా ఉంటాయంటూ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.  వాటిలో ఒకటి.. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం వాటిని ప్రోత్సహించడం. మరొకటి, రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలను నిర్వహించడమంటూ బొత్స చెప్పిన భాష్యంపై నెటిజనులు ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు. ఇక వైసీపీ వర్గాలైతే.. అసలు బొత్స చెప్పిందేంటో అర్ధం కాక తలలు పగలకొట్టుకుంటున్నారు. ఇంతకీ బొత్స చెప్పినదేంటంటే.. జగన్ ఆదేశించినంత మాత్రాన ఏకగ్రీవాలు జరగకుండా పోవని, అంటే పార్టీ అధినేత మాటను ఆయన ఖండిచారన్న మాట.  ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.   ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల ప్రతినిధులకు తదుపరి ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు దక్కవంటూ జగన్ చేసిన హెచ్చరిక నేపథ్యంలో బొత్స వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  అలాగే.. తాజాగా వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిపై కూడా బొత్స విరుచుకుపడ్డారు. విజయసాయిని ఆయన మరో కేఏపాల్ గా అభివర్ణించారు. విజయసాయి.. నోటికి వచ్చినట్లు మాట్లాడతారనీ, ఆయన మాటలకు ఇసుమంతైనా విలువ ఉండదని బొత్స అన్నారు.   అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చన్న స్పీకర్ హెచ్చరికపై.. తనదైన శైలిలో సవాల్ విసిరారు... నిజంగా స్పీకర్ కు ఆ అధికారం ఉంటే రద్దు చేసుకోవచ్చన్నారు. సభ్యత్వాలు రద్దు చేస్తే.. వైసీపీ రాజ్యాంగ బద్ధంగా పోరాడుతుందన్నారు.   [Botsa New Interpretation on  Jagan Comments, Botsa, YS Jagan Mohan Reddy, YCP Unanimous Elections, Localbodies,   AP Politics, Telugu One]
  బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది. ఈ మేరకు పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పార్టీ తరఫున సంస్థాగత కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటు, పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో ప్రాతినిధ్యం వహించే బాధ్యతలను మహ్మద్ ముబీన్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన AIMIM పార్టీ పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు మహ్మద్ ముబీన్‌తో సమన్వయం చేసుకుంటూ పార్టీ సంస్థాగత కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని పార్టీ సూచించింది. నియోజకవర్గంలోని పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు, ఇతర సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి ఆయనతో సంప్రదింపులు జరపాలని పేర్కొంది. ముబీన్‌కు అప్పగించిన కొత్త బాధ్యతలతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది.   MLA Mohammed Mubeen, Rajendranagar  MIM in-charge, AIMIM, Asaduddin Owaisi,  MLC Rahmat Beg, Telugu news, Telugu one 
ALSO ON TELUGUONE N E W S
Sree Vishnu’s upcoming film with Sithara Entertainments, Production No. 39, is set to showcase a story that resonates with the experiences, emotions, dreams and struggles of today’s youngsters. Promising a refreshing journey packed with relatable moments and every emotion, the film aims to strike a chord with audiences. The makers have unveiled a small glimpse into the world of the film, offering a peek into what promises to be a youthful and emotionally engaging journey. The glimpse beautifully sets the tone for the film and raises curiosity around Sree Vishnu’s next outing. Sree Vishnu's look and his attention to detail offer a new story and very hearttouching film. The shoot of the film has commenced. Produced by Haarika Suryadevara and presented by S Naga Vamsi, the film is directed by Sunny Sanjay, with Deepthi Sree Juttada as the writer.  The technical crew includes Pavan Pappula as Cinematographer, Venkatesh Chunduru as Editor, Arvind Mule as Production Designer and Chandu & Ravi as Music Directors. With its relatable premise and youthful appeal, Production No. 39 promises to be “ఇది మన అందరి కథ” a story where everyone can find a little bit of themselves.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సాధారణంగా ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ సినిమా అయినా సరే.. రోజులు గడిచే కొద్దీ రెండో వారంలో వసూళ్లు క్రమంగా తగ్గుతుంటాయి. కానీ 'ఇరుముడి' విషయంలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. రెండో వారంలో అడుగుపెట్టిన తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చూపిస్తున్న దూకుడు చూసి ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. ఇరుముడి సినిమా విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ప్రతిరోజూ సరికొత్త రికార్డును ఖాతాలో వేసుకుంటుంది. ముఖ్యంగా పదో రోజయిన రెండో ఆదివారం నాడు.. ఏకంగా 'బాహుబలి-2', 'పుష్ప-2' రికార్డులను బ్రేక్ చేయడం విశేషం. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో పదో రోజు డబుల్ డిజిట్ షేర్ సాధించిన సినిమా 'ఆర్ఆర్ఆర్' ఒక్కటే. ఆ సినిమా పదో రోజు ఏకంగా 16 కోట్ల షేర్ రాబట్టింది. ఇప్పుడు దాదాపు 10 కోట్ల షేర్ తో 'ఇరుముడి' రెండో స్థానంలో నిలిచింది. 'బాహుబలి-2', 'పుష్ప-2' వంటి భారీ పాన్ ఇండియా సినిమాలు సైతం.. తెలుగునాట పదో రోజు డబుల్ డిజిట్ షేర్ రాబట్టలేకపోయాయి. అవి 8 కోట్లకు అటూఇటూగా షేర్ రాబట్టాయి. కానీ, 'ఇరుముడి' మాత్రం ఏకంగా 10 కోట్ల షేర్ తో సత్తా చాటింది. దీనిని బట్టి తెలుగునాట ఆ సినిమా ఏ స్థాయి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గానూ 'ఇరుముడి' సునామీ కొనసాగుతోంది. పది రోజుల్లోనే ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ క్లబ్ కి చేరువైంది. ఫుల్ రన్ లో 300 కోట్ల గ్రాస్ మార్క్ కి చేరువైనా ఆశ్చర్యంలేదు.       [Irumudi Box Office, Irumudi Collections, Irumudi Day 10 Record, Irumudi Movie, RaviTeja, Baahubali 2, Pushpa 2, Telugu Film News, Telugu News]  
  సుదీర్ఘ కాలం నుంచి ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తూ వస్తున్న కింగ్ నాగార్జున ప్రస్తుతం తన వందవ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇటీవల(ఆగస్టు 29 ) తన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ ఒక రేంజ్ లో ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. రీసెంట్ గా నాగార్జున మరో సారి నెగిటివ్ షేడ్ ఉన్న క్యారక్టర్ లో చేయబోతున్నాడనే రూమర్ ఒకటి సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. Also Read: ప్రేక్షకుల పండుగ:  ఈ వారం ఓటిటి రిలీజ్ మూవీస్ ఇవే!    తమిళ స్టార్ హీరో సూర్య తన 49వ చిత్రాన్ని జన నాయగాన్ ఫేమ్  హెచ్. వినోత్  దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సూర్యకు సమానమైన ప్రాధాన్యత కలిగిన, అత్యంత బలమైన ప్రతినాయకుడి రోల్ కోసం మేకర్స్  నాగార్జునని సంప్రదించారని, వినోత్ చెప్పిన విభిన్నమైన కథాంశం, క్యారక్టర్ లోని  తీవ్రత నాగార్జునని  నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. నాగార్జున  గతంలో రజనీకాంత్ 'కూలీ'లో విలన్ గా కనిపించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారడంతో ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. ఏది ఏమైనా రూమర్ కనుక నిజమైతే సౌత్ సినీ ప్రేమికులు అదృష్టం చేసుకున్న వాళ్లవుతారనేది మాత్రం నిజం.       [Nagarjuna, Suriya, H vinoth, vilan Role, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]
Nandamuri Balakrishna’s next with Gopichand Malineni is finally set to break its biggest suspense. The makers of the yet-untitled NBK111 have announced that the film’s official title and release date will be unveiled on September 6, ending the wait that has been building since the birthday glimpse. The glimpse had already generated strong buzz with Balakrishna sporting a noticeably younger look, along with his trademark massy style, swagger and high-energy action sequences. The latest promotional video, “Who Let the Lion Out?”, has added further momentum, with S Thaman delivering another high-octane score designed perfectly around Balakrishna’s image. Thaman has become a key part of the sound and presentation of Balakrishna’s recent films, particularly after Akhanda, and the makers are once again leaning heavily on that combination of mass visuals and thumping music. The title announcement is therefore expected to be more than a routine reveal, with the film’s release date also being positioned as a major statement. Directed by Gopichand Malineni, NBK111 is being mounted on a massive scale by producer Venkata Satish Kilaru. Manchu Manoj and Kajal Aggarwal are playing prominent roles in the film, which is shaping up as a stylish action entertainer built around Balakrishna’s larger-than-life screen presence. Balakrishna is currently recovering from his recent leg surgery and has been taking rest for a complete recovery. Once he is ready to return, the makers are planning a non-stop shooting schedule to complete the remaining portions.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్'. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు? అని ప్రశ్నిస్తూ ఆయన ఒక ప్రత్యేక వీడియోని విడుదల చేశారు. "నేను కూడా ఎంతో ఆసక్తితో టాక్సిక్ సినిమా చూద్దామని థియేటర్‌కు వెళ్లాను. కానీ అందులోని తీవ్రమైన అశ్లీలత, మితిమీరిన హింస చూసి తట్టుకోలేకపోయాను. భరించలేక సినిమా పూర్తి కాకుండానే మధ్యలోనే బయటకు వచ్చేశాను" అని సంచలన విషయాలు వెల్లడించారు. దర్శకనిర్మాతలు కేవలం రక్తం చిందించే హింసను, అశ్లీలతను మాత్రమే నమ్ముకుని సినిమాలు తీయడం సరికాదని... సమాజానికి ఉపయోగపడే ధర్మాన్ని, భక్తిని, సామాజిక బాధ్యతను పెంపొందించే సినిమాలు తీయాలని ఆయన సినీ పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. యశ్ వంటి గ్లోబల్ ఇమేజ్ ఉన్న అగ్ర హీరోలు కుటుంబసమేతంగా అందరూ కలిసి కూర్చొని చూసేలాంటి మంచి కథలను ఎంచుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవలే వచ్చిన కొన్ని సినిమాలను ఉదాహరణగా చూపిస్తూ ప్రశంసలు కురిపించారు. రవితేజ నటించిన 'ఇరుముడి' చిత్రంలో ఆధ్యాత్మికత, సామాజిక స్పృహ చాలా అద్భుతంగా చూపించారని... అలాగే 'ఛావా' చిత్రంలో ధైర్యం, దేశభక్తి వంటి గొప్ప అంశాలను ప్రదర్శించారని కొనియాడారు. మన సినీ పరిశ్రమకు ఇప్పుడు ఇలాంటి ధర్మబద్ధమైన, సందేశాత్మక చిత్రాల అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.       [Toxic Movie, Controversy, Rocking Star Yash, Geetu Mohandas, MLA Raja Singh, Telugu Cinema News, Tollywood, Telugu News]  
  జనరల్ గా సోమవారం నాడు చాలా మంది మూడ్ డల్ గా ఉంటుందనే మాట  ఎప్పట్నుంచో వినిపిస్తూ వస్తుంది. కానీ  సినీ ప్రియులు, ఓటిటి ప్రియులు మాత్రం చాలా జోష్ తో  సోమవారమే మాదే అంటుంటారు. ఎందుకంటే ఓటిటిలో ఈ వారం స్ట్రీమింగ్ అయ్యే కొత్త సినిమాల లిస్ట్ తాజా న్యూస్ హోదాలో కలకాలాడుతూ ఉంటుంది.  మరి ఆ లిస్ట్ ఏంటో చూసేద్దాం. రేపట్నుంచి అంటే  సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ వారాంతంలో దాదాపు 10కి పైగా సరికొత్త సినిమాలు, ఉత్కంఠభరితమైన వెబ్ సిరీస్‌లు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయబోతున్నాయి. క్రైమ్ థ్రిల్లర్లు, హారర్ కామెడీలు, యాక్షన్ ఎంటర్‌టైనర్లు అలాగే బిగ్ బాస్ వంటి రియాలిటీ షోల హంగామాతో ఓటీటీ స్పేస్ పూర్తిగా హీటెక్కిపోతోంది. వీకెండ్‌లో హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే ప్రతి ఒక్కరికీ ఇది నిజంగా ఒక బ్లాక్‌బస్టర్ ట్రీట్ అని చెప్పవచ్చు.  ఈ వారం విడుదలయ్యే ఓటీటీ చిత్రాల్లో ప్రధానంగా ఆకట్టుకుంటున్నది వరుణ్ తేజ్ నటించిన 'కొరియన్ కనకరాజు'. గ్రామీణ ఆంధ్రప్రదేశ్ సంస్కృతికి కొరియన్ సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కించిన ఈ హారర్-కామెడీ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.  వరుణ్ తేజ్ పెర్ ఫార్మెన్స్, రితిక నాయక్ గ్లామర్  ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.  అదే రోజున లోకేష్ కనగరాజ్ కాన్సెప్ట్‌తో వచ్చిన హిట్ యాక్షన్ డ్రామా 'DC' తెలుగు వర్షన్ సన్ నెక్స్ట్ (Sun NXT) వేదికగా ప్రేక్షకులను పలకరించనుంది. దాంతో పాటు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'ఉన్మాదం' సోనీ లివ్‌లో విడుదలకు సిద్ధమైంది. ప్రకాష్ రాజ్ టైటిల్ రోల్ లో మెగా డాటర్ నీహారిక కొణిదెల నిర్మించిన జగమే సంగీతం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా అందుబాటులో ఉండనుంది. బాలీవుడ్ విషయానికి వస్తే, మనోజ్ బాజ్‌పాయ్ నటించిన నైరూప్య క్రైమ్ థ్రిల్లర్ 'ఇన్‌స్పెక్టర్ జెండే' నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సీరియల్ కిల్లర్ కార్ల్ భోజ్‌రాజ్‌ను పట్టుకోవడానికి ఇన్‌స్పెక్టర్ జెండే చేసిన ఉత్కంఠభరితమైన వేట నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది.  షానయా కపూర్ బాలీవుడ్ అరంగేట్రం చేసిన 'ఆంఖోన్ కీ గుస్తాఖియాన్' విక్రాంత్ మాస్సీతో కలసి జీ5 (Zee5) లో సెప్టెంబర్ 5న డిజిటల్ బాట పడుతోంది. యాక్షన్ ప్రియుల కోసం తాప్సీ పన్ను నటించిన అవేరింగ్ మదర్ రివెంజ్ థ్రిల్లర్ 'గాంధారి' కూడా సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యక్షం కాబోతోంది.  Also Read: డప్పు శ్రీను, డబ్బు శ్రీనుగా మారిపోయాడు: మల్లెపూల పల్లకికి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్  మలయాళంలో సంచలనం సృష్టించిన త్రిసూర్ కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ ఆధారంగా రూపొందించిన 6 ఎపిసోడ్ల పొలిటికల్ క్రైమ్ వెబ్ సిరీస్ 'కమ్మట్టం' జీ5లో సెప్టెంబర్ 5 నుంచి ప్రసారం కానుంది. ఇక తమిళం నుంచి సరికొత్త హారర్ కామెడీ 'హౌస్ మేట్స్' సెప్టెంబర్ 1 నుంచే జీ5లో అందుబాటులోకి వచ్చేసింది. హాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన బిగ్గెస్ట్ హిట్ 'ఏ మిన్‌క్రాఫ్ట్ మూవీ' సెప్టెంబర్ 4న జియో హాట్‌స్టార్‌లో రాబోతుండగా, హాలీవుడ్ యాక్షన్ సిరీస్ 'ది జెంటిల్‌మెన్ సీజన్ 2' సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది.  వీటన్నింటికీ మించి బుల్లితెర వీక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు 9' అక్కినేని నాగార్జున హోస్టింగ్‌తో సెప్టెంబర్ 7న గ్రాండ్ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. అలాగే హిందీ బిగ్ బాస్ సీజన్ 20 జియో హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 6న ప్రారంభం కానుంది. మొత్తం మీద ఉత్కంఠ, నవ్వులు, భయం, డ్రామా కలగలిపిన ఈ ఓటీటీ విందు మీ వీకెండ్‌ను ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చేయడం ఖాయం.        [Korean Kanakaraju, varun Tej, Bigg Boss, Nagarjuna, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]
'ఇరుముడి' మూవీ భారీ సక్సెస్ సెకండ్ హాఫ్ లో వచ్చే అయ్యప్పస్వామి గీతం "మల్లెపూల పల్లకి" కి కూడా  దక్కుతుందనే విషయం తెలిసిందే. సెకండ్ టైం కూడా ప్లే చేయాల్సిందే అని ప్రేక్షకులు స్క్రీన్ ముందు డిమాండ్ చేసి మరి అడుగుతున్నారంటే మల్లెపూల పల్లకి వాళ్ళని ఎంతలా మెస్మరైజ్ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. సాంగ్ వస్తున్నప్పుడు  అయ్యప్పస్వామి భక్తులతే బంగారుపళ్లెంలో కర్పూర హారతులు ఇస్తున్నారు. ఈ సాంగ్ రాసింది ప్రముఖ సింగర్, చౌడం శ్రీనివాస్. అయ్యప్పస్వామి భక్తుడు, జానపద గాయకుడు  'డప్పు శ్రీను' ఆలపించాడు. సాధారణంగా జానపద కళాకారులకు చిత్రసీమలో లభించే గుర్తింపు, పారితోషికంపై ఎన్నో అపోహలు ఉండేవి. అయితే ఈ పాట విజయం తర్వాత డప్పు శ్రీను అందుకున్న రెమ్యూనరేషన్ వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఒక్క పాట పాడినందుకు గానూ మైత్రి మూవీ మేకర్స్  9 లక్షల భారీ పారితోషికాన్ని అందించారని వార్తలు వెలువడటంతో సినీ వర్గాలు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక జానపద గాయకుడి ప్రతిభకు దక్కిన సరైన గౌరవంగా సినీ విశ్లేషకులు కొనియాడుతున్నారు.  ఒరిజినల్:  ఇరుముడి పదిరోజుల కలెక్షన్స్ ఇవే  మల్లెపూల పల్లకి  విడుదలైన అతి తక్కువ సమయంలోనే 24 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, యూట్యూబ్ ట్రెండింగ్‌లో అగ్రస్థానాన నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్, భక్తి సంబంధిత వీడియోల్లో ఈ పాట బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా విపరీతంగా మారడంతో వ్యూస్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. . జి.వి. ప్రకాష్ రీ క్రియేషన్ చేసిన తీరు, డప్పు శ్రీను పాడిన శక్తివంతమైన తీరు శ్రోతలలో పూనకాలు తెప్పిస్తున్నాయి. ఏది ఏమైనా ఇన్నిరోజులు ప్రైవేట్ గీతంగా కోట్లాది మందిని అలరించిన 'మల్లెపూల పల్లకి' సినీ పాటగా కూడా ఆవిర్భవించి  మేకర్స్ కి కోట్లరూపాయలని అందిస్తుండటం గొప్ప విషయం.     [Irumudi, Dappu Srinu, MallePoola Pallaki,  Remunaration, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]    
  సినిమా మీద అభిమానంతో నలభై సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చిన మాస్ మహారాజా సినీ జన్మ 'ఇరుముడి'తో ధన్యమైనట్టే. ఎంత పెద్ద హిట్ సినిమా అయినా వన్ వీక్ కి వీక్ అవుతున్న ప్రస్తుత రోజుల్లో నిన్న తెనాలి పక్కన 'సి' టౌన్(సినీ భాషలో) గా పరిగణించే దుగ్గిరాలలో ఇరుముడి చూడటం కోసం దుగ్గిరాల చుట్టూ పక్కల గ్రామాల మహిళలు ట్రాక్టర్లలో భోజనం కట్టుకొని మరి వచ్చారంటే ఇరుముడి ప్రేక్షక సునామీని అర్ధం చేసుకోవచ్చు. మరి రవితేజ సినీ జన్మ ధన్యమైనట్టే అని చెప్పుకోవడంలో ఈసమంతైన అతిశయోక్తి లేదు.  నిన్న 10వ రోజు ముగిసే సమయానికి వరల్డ్ వైడ్ గా 170.95 కోట్ల గ్రాస్ వసూళ్లని  రాబట్టి  సంచలనం సృష్టించింది. 170 కోట్లు అని చెప్పినా 200 కోట్లు వచ్చి ఉంటాయని ప్రేక్షకులే చెప్పే పరిస్థితి. దీన్ని బట్టి ఇరుముడి కలెక్షన్స్ ఫిగర్ ఎక్కడ ఆగుతుందో చెప్పలేని పరిస్థితి. వినాయకచవితి మూడ్  కూడా కలిసి ఉండటం ఇరుముడి చేసుకున్న అదృష్టం.   Also Read: ఊహించని దర్శకుడు: యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదేనా! డిస్ట్రిబ్యూట్ చేసిన బయ్యర్స్ కి ఇప్పటికే మూడు వంతుల లాభాలు అందించిన ఇరుముడి ఓన్లీ  నైజాం ఒక్క రీజియన్‌లోనే 70 కోట్ల వరకు వసూలు చేసి  100 కోట్ల మైలురాయిని చేరుకోవడానికి ఉవ్వళ్ళూరుతుండటం కొసమెరుపు.     [Irumudi, Raviteja, Nakshthra, Shiva Nirvana, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]  
రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్ దూకుడు తగ్గుముఖం పట్టింది. కాకపోతే 250 కోట్ల(వరల్డ్ వైడ్) వరకు గ్రాస్ రాబట్టడంతో టాక్సిక్ కి కొంచం హిట్ టాక్ వచ్చినా కలెక్షన్స్ ని లెక్కబెట్టడానికి కొత్త రకం మిషన్స్ ని కనిపెట్టాల్సిన పరిస్థితి. కంటెంట్ ని వదిలి సీన్స్ ని నమ్ముకోవడమే టాక్సిక్ బలహీనపడటానికి కారణమనే అభిప్రాయానికి ప్రేక్షకులు ఆమోదముద్రవేసారు. దీంతో ఇప్పుడు యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.     రావణుడిగా యశ్ చేస్తున్న రామాయణ దివాలి కానుకగా  నవంబర్ 6న విడుదల కానుంది. సోలో హీరోగా మాత్రం  సప్త సాగరాలు దాటి ఫేమ్ హేమంత్ దర్శకత్వంలో మూవీ ఉండబోతోందనే వార్తలు వస్తున్నాయి. సర్దార్ దర్శకుడు పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోయే మూవీ కూడా ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అధికార ప్రకటన వచ్చే వరకు పైన చెప్పుకున్నవన్నీ రూమర్స్ హోదాలోనే తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటాయి.    also read: ఏం జరిగింది: ఆ సినిమా దెబ్బకి ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్        [Toxic, yash, Hemath, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]
ఒకరు మనల్ని నమ్మి అవకాశం ఇచ్చినప్పుడు.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో.. అవకాశం ఇచ్చినవారిని గుర్తుపెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ విషయంలో విజయ్ దేవరకొండ గొప్పతనం మరోసారి రుజువైంది. 'అర్జున్ రెడ్డి'తో తనను ఓవర్ నైట్ స్టార్ ను చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై తన అభిమానాన్ని మళ్ళీ చాటుకున్నారు విజయ్. సందీప్ రెడ్డి సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన 'రోమాంచకం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరి చేత క్లాప్స్ కొట్టించాయి. సందీప్ పై  నాకున్న ప్రేమను కేవలం మాటల్లో చెప్పలేనని, మా ఇద్దరి మధ్య ఉన్నది సాధారణ డైరెక్టర్-యాక్టర్, బ్రదర్ లేదా ఫ్రెండ్ రిలేషన్‌షిప్ కాదని, అంతకుమించి అనుబంధమని స్పష్టం చేశారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా రోజులను గుర్తు చేసుకుంటూ, ఆ సమయంలో తామిద్దరం కలిసి ఒక పెద్ద యుద్ధమే చేశామని తెలిపారు. సినిమా మొదలుపెట్టినప్పుడు తమ వద్ద ఎలాంటి డబ్బులు, ఇండస్ట్రీలో ఇన్ఫ్లుయెన్స్ లేవని, పెళ్లి చూపులు సినిమా కూడా అప్పటికి రిలీజ్ కాలేదని నాటి రోజులను గుర్తుచేసుకున్నారు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రం వర్కవుట్ కాకపోతే ఇద్దరికీ పిచ్చి పట్టడం ఖాయమని భావించిన విషయాన్ని విజయ్ బయటపెట్టారు. సందీప్ మీద ఉన్న నమ్మకంతో ఆయన అన్న ప్రణయ్, తండ్రి ప్రభాకర్ గారు తమకున్న సొంత పొలాన్ని పెట్టి మరీ సినిమా తీశారని, అంత పెద్ద రిస్క్ తీసుకున్నారని చెప్పారు. సందీప్ తన కోసం ఎంతవరకు అయినా వెళ్తాడని, తాను కూడా సందీప్ కోసం ఎంతదూరమైనా వెళ్తానని చెప్పారు. ఈ ఈవెంట్ కి వచ్చినందుకు సందీప్ థాంక్స్ చెప్తుంటే అనిపించింది.. సందీప్ పిలిచినప్పుడు నేను రాకపోతే బ్రతికి కూడా వేస్ట్ అని విజయ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.       [Vijay Deverakonda, Emotional Speech, Romanchakam Pre Release Event, Sandeep Reddy Vanga, Arjun Reddy, Telugu Cinema News, Telugu News, Tollywood]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నాన్ వెజ్ ప్రియుల ఆహారపు అలవాట్లలో చికెన్‌కి ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఉంటుంది. రుచికరమైన రకరకాల వంటకాలు చేసుకోవడానికి చికెన్ అనువుగా ఉండటమే కాకుండా, మన శరీరానికి అవసరమైన అత్యంత విలువైన పోషకాలను కూడా ఇది అందిస్తుంది. చికెన్ కేవలం రుచికి మాత్రమే కాకుండా సరైన పద్ధతిలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ అజ్మీరా భగత్ సింగ్ స్పష్టం చేశారు. రోజూవారీ ఆహారంలో చికెన్ చేర్చుకోవడం వల్ల మన శరీరంలో ఎలాంటి సానుకూల మార్పులు వస్తాయో, అది ఏ విధంగా కండరాల బలానికి మరియు గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుందో తెలుసుకోవడం ఎంతో అవసరం. చికెన్ గురించి మాట్లాడగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అందులో ఉండే అత్యధిక ప్రొటీన్. చికెన్‌లో హై క్వాలిటీ ప్రొటీన్ లభిస్తుంది. ఇది మన శరీరంలోని కండరాల పెరుగుదలకు మరియు వర్కవుట్స్ లేదా కష్టమైన పనుల వల్ల దెబ్బతిన్న కండరాలు త్వరగా కోలుకోవడానికి (మజిల్ రికవరీ) అద్భుతంగా తోడ్పడుతుంది. అందుకే క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లేవారు, క్రీడాకారులు తమ డైట్‌లో చికెన్ బ్రెస్ట్ భాగాన్ని తప్పనిసరిగా చేర్చుకుంటారు. అంతేకాకుండా రోజంతా తీవ్రమైన నీరసంతో బాధపడేవారికి చికెన్ ఒక మంచి శక్తి వనరుగా పనిచేస్తుంది. చికెన్‌లో నియాసిన్ అని పిలిచే విటమిన్ B3 మరియు విటమిన్ B6 పుష్కలంగా ఉంటాయి. మనం తీసుకునే ఆహారాన్ని శరీరానికి కావలసిన శక్తిగా మార్చడంలో ఈ విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఫలితంగా బద్ధకం తగ్గి, రోజంతా ఉత్సాహంగా మరియు ఎనర్జెటిక్‌గా ఉండేందుకు ఇది దోహదపడుతుంది. చికెన్ తింటే బరువు పెరుగుతారనేది సమాజంలో ఉన్న ఒక పెద్ద అపోహ మాత్రమే. నిజానికి సరైన పద్ధతిలో వండుకుని తింటే చికెన్ బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది. చికెన్ లోని ప్రొటీన్ వల్ల కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన (సృప్తి) కలుగుతుంది. దీనివల్ల పదే పదే అనవసరమైన స్నాక్స్ తినాలనే కోరిక తగ్గి, కేలరీల స్వీకరణ అదుపులోకి వస్తుంది. ఫలితంగా శరీర బరువును వేగంగా మరియు ఆరోగ్యకరంగా నియంత్రించుకోవచ్చు.       Chicken for bone density and heart health,healthy ways to cook and eat chicken.
మన తాతముత్తాతల కాలం నుండి భారతీయ సాంప్రదాయ ఆహారంలో నల్ల శెనగలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. నిత్యం మనం తీసుకునే ఆహారంలో లభించే పోషకాల కంటే నల్ల శెనగలు అందించే పోషక విలువలు ఎంతో ప్రత్యేకమైనవి. ప్రతిరోజూ మనం 10 గుడ్లు తినడం ద్వారా లేదా లీటర్ పాలు తాగడం ద్వారా పొందే శక్తిని, కేవలం కొద్దిగా ఉడకబెట్టిన నల్ల శెనగలను తినడం ద్వారా డబుల్ చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బలహీనతతో బాధపడేవారికి, కండరాల బలం పెంచుకోవాలనుకునేవారికి మరియు ప్రతిరోజూ ఉత్సాహంగా ఉండాలనుకునేవారికి ఇది ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్‌గా నిలుస్తుంది. ఈ శెనగలను వివిధ రూపాల్లో ఆహారంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా రాత్రిపూట నానబెట్టిన శెనగలను ఉదయాన్నే లేదా సాయంత్రం వేళల్లో ఉడకబెట్టి గుగ్గిళ్ల మాదిరిగా తాలింపు పెట్టుకుని తింటే శరీరానికి అవసరమైన పుష్కలమైన ప్రోటీన్ లభిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి బాగా తక్కువగా ఉండి తరచూ నిరసించిపోయే వారికి నానబెట్టిన లేదా వేయించిన నల్ల శెనగలు తిరుగులేని శక్తిని అందిస్తాయి. వీటిలో లభించే పీచు పదార్థం (ఫైబర్) జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియ సులభతరం కావడమే కాకుండా కడుపులో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపి కడుపును పరిశుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునేవారికి నల్ల శెనగలు ఒక దివ్యౌషధంలా పనిచేస్తాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది, తద్వారా పదేపదే ఆకలి వేయకుండా ఉండి అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. రక్తం లోని గ్లూకోజ్ లేదా షుగర్ లెవెల్స్ సమతుల్యంగా ఉంచడంలో ఇవి ఎంతో తోడ్పడతాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారు అలాగే గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు వీటిని తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా హృద్రోగాల ప్రమాదం కూడా గణనీయంగా తగ్గుతుంది.         black chickpeas for weight loss and health, black chickpeas nutrition benefits in Telugu.
వాతావరణంలో హఠాత్తుగా సంభవిస్తున్న మార్పులు మరియు రుతుపవనాల ప్రభావంతో మనదేశంలో H1N1 ఇన్ఫెక్షన్లు లేదా స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది. ఆసుపత్రుల్లో సాధారణ జ్వరం, దగ్గు, గొంతు నొప్పితో చేరే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో పాటు ఫ్లూ వ్యాక్సిన్ కోసం జనం క్యూ కడుతున్నారు. ప్రారంభంలో ఇది ఒక సాధారణ జలుబు లేదా ఇన్ఫ్లుయెంజాలా కనిపించినప్పటికీ, కొందరిలో ఈ వైరస్ తీవ్రంగా మారి ఊపిరితిత్తులపై దాడి చేసి తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో H1N1 నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఫ్లూ వ్యాక్సిన్ ఎవరెవరు తప్పనిసరిగా తీసుకోవాలో వైద్య నిపుణులు స్పష్టమైన సమాచారాన్ని అందించారు. స్వైన్ ఫ్లూ బారిన పడిన సాధారణ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు అవసరం లేదని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. కానీ కొన్ని రకాల తీవ్రమైన ప్రమాదం ఉన్న హై రిస్క్ వర్గాల ప్రజలకు లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే పరీక్ష చేయించుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఆస్తమా, సీఓపీడీ, గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం లేదా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అదేవిధంగా 65 ఏళ్లు పైబడిన వయోవృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే 5 ఏళ్ల లోపు చిన్న పిల్లలలో ఈ ప్రమాదం చాలా ఎక్కువ. గర్భధారణ సమయంలో మహిళల్లో రోగనిరోధక వ్యవస్థలో అనేక మార్పులు వస్తాయి కాబట్టి, గర్భిణీలకు స్వైన్ ఫ్లూ సోకితే శ్వాసకోశ కాంప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. జ్వరంతో పాటు తీవ్రమైన అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన వారికి సరైన నివారణ చికిత్స అందించడానికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారు. ఫ్లూ ఇన్ఫెక్షన్ తీవ్రరూపం దాల్చకుండా అడ్డుకోవడానికి ఫ్లూ టీకా ఒక గొప్ప రక్షణ కవచంలా పనిచేస్తుంది. వైద్య నిపుణుల ప్రకారం 6 నెలల నుండి 5 ఏళ్ల వరకు ఉన్న చిన్న పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించడం చాలా అవసరం. 65 ఏళ్లు పైబడిన వృద్ధులలో వయస్సు పెరిగే కొద్దీ సహజ నిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి వీరు ముందస్తుగా ఫ్లూ షాట్ తీసుకోవాలి. అలాగే గర్భిణీ స్త్రీలు తమ భద్రతతో పాటు కడుపులోని బిడ్డ క్షేమం కోసం ఈ వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా, బిపి, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారితో పాటు, రోజూ ఆసుపత్రుల్లో రోగుల మధ్య ఉండే డాక్టర్లు, నర్సులు మరియు హెల్త్‌కేర్ సిబ్బందికి ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం అత్యంత ఆవశ్యకం.           Annual flu shot importance H1N1, swine flu prevention high risk groups.
భారతీయ సాంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదంలో పిప్పళ్లకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. నల్లగా, చిన్న పొడుగు ఆకారంలో ఉండే ఈ పిప్పళ్లు కేవలం వంటగదిలోని దినుసు మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న దివ్యౌషధం. శతాబ్దాల నుంచి మన పెద్దలు, ఆయుర్వేద నిపుణులు రకరకాల ఆరోగ్య సమస్యల నివారణకు పిప్పళ్లను ప్రధానంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. పిప్పళ్లు చేసే మేలు.. పిప్పళ్లలో ఉండే కెమికల్ కాంపౌండ్ పైపరీన్ శరీరంలో జీవక్రియలను వేగవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పిప్పళ్లు చేసే మేలు అపారం. జలుబు, దగ్గు, ఉబ్బసం, గొంతు నొప్పి, ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి పిప్పళ్లు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. పిప్పళ్ల పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం సులభంగా బయటకు వచ్చేస్తుంది. పిప్పళ్ల గురించి ఆయుర్వేదం ఏం చెబుతుంది? ఆయుర్వేదంలో పిప్పళ్లను రసాయన మూలికగా వర్గీకరించారు. అంటే ఇవి శరీరానికి పునరుజ్జీవనాన్ని అందిస్తాయి. ఆయుర్వేదంలో దీనిని త్రిదోషాలలో ప్రధానమైన కఫ, వాత దోషాలను సమతుల్యం చేయడానికి ఉపయోగిస్తారు. శరీరంలో జఠరాగ్నిని అంటే జీర్ణశక్తిని రగిల్చే గుణం పిప్పళ్లకు ఉంది. తిన్న ఆహారం సరిగ్గా అరగకపోయే సమస్యను, ఆకలి మందగించడాన్ని ఇది నివారిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ లేదా విష పదార్థాలను బయటకు పంపడంలో ఆయుర్వేద వైద్యంలో పిప్పళ్లను క్రియాశీలకంగా ఉపయోగిస్తారు. పిప్పళ్ల వల్ల కలిగే మరికొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. జీర్ణ వ్యవస్థ మెరుగుపడటం..  గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను పిప్పళ్లు త్వరితగతిన నివారిస్తాయి. జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి ఆహారం వేగంగా అరిగేలా చేస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుదల..  యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తరచూ వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. బరువు నియంత్రణ..  శరీరంలో జీవక్రియల వేగాన్ని పెంచి, చెడు కొవ్వును కరిగించడంలో పిప్పళ్లు ఎంతో సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి సహజ నివారణి. నొప్పులు , వాపుల నివారణ..  పిప్పళ్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాతపు నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాలేయ ఆరోగ్యం.. కాలేయంలోని వ్యర్థాలను తొలగించి, కాలేయం సరిగ్గా పనిచేయడానికి పిప్పళ్లు తోడ్పడతాయి. పిప్పళ్లను నిత్య జీవితంలో తగిన మోతాదులో వాడటం వల్ల అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ఇవి శరీరంలో వేడిని పెంచే గుణం కలిగి ఉంటాయి కాబట్టి, పిత్త ప్రకృతి ఉన్నవారు లేదా గర్భిణులు ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవడం మంచిది.                        *రూపశ్రీ.  
కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థం. ఇది శరీరంలోని కణాల నిర్మాణానికి మరియు కొన్ని రకాల హార్మోన్ల తయారీకి ఎంతో అవసరం. అయితే, రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెరిగితే అది గుండె ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడి, గుండెపోటు , పక్షవాతం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ప్రస్తుతం కాలంలో ఉన్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహార లోపం , తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో కొలెస్ట్రాల్ సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే సరైన ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడమే కాకుండా, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాలు ఏమిటో, అవి ఎలా సహాయపడతాయో తెలుసుకుంటే.. ఫైబర్.. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో  పీచు పదార్థం లేదా ఫైబర్ పాత్ర చాలా కీలకమైనది. ముఖ్యంగా కరిగే పీచు పదార్థం పుష్కలంగా ఉండే ఆహారాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఓట్స్ , బార్లీ వంటి ధాన్యాలలో కరిగే ఫైబర్  ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించి, శరీరం నుండి దాన్ని బయటకు పంపడానికి సహాయపడతాయి. రోజూ ఉదయం అల్పాహారంలో ఓట్స్ లేదా బార్లీ చేర్చుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. పప్పుధాన్యాలు, గింజలు.. వివిధ రకాల పప్పుధాన్యాలు , గింజలు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి. శనగలు, పెసలు, రాజ్మా, మినుములు , కందిపప్పు వంటి వాటిలో ప్రోటీన్లు, విటమిన్లు , పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగించి, అనవసరమైన కేలరీలు తీసుకోకుండా నిరోధిస్తాయి. అలాగే నట్స్ అని పిలిచే బాదం, వాల్‌నట్స్ , పిస్తా పప్పులు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే అసంతృప్త కొవ్వులు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. కాకపోతే వీటిని పరిమిత పరిమాణంలోనే తీసుకోవడం మంచిది. తాజా కూరగాయలు , ఆకుకూరలు.. రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. పాలకూర, తోటకూర, మెంతి కూర వంటి ఆకుకూరలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బెండకాయ, వంకాయ, క్యారట్ , బీట్‌రూట్ వంటి కూరగాయలలో కరిగే పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఇవి కొలెస్ట్రాల్ శోషణను అడ్డుకుంటాయి.  వెల్లుల్లి.. వెల్లుల్లి రక్తనాళాలను శుభ్రపరచడంలో , కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. రోజూ ఒకటో రెండో వెల్లుల్లి రెబ్బలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా తగ్గుతుంది. పండ్లు.. పండ్లు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. బొప్పాయి, ఆపిల్, నారింజ, జామ, దానిమ్మ  వంటి పండ్లలో పెక్టిన్ అనే ప్రత్యేకమైన కరిగే పీచు పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించడంలో ఎంతగానో దోహదపడుతుంది. అలాగే పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి.  నిమ్మజాతి పండ్లు.. నిమ్మ జాతి పండ్లలో ఉండే విటమిన్ సి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హెల్తీ ఫ్యాట్స్.. చేపలు , ఆరోగ్యకరమైన నూనెలు కూడా కొలెస్ట్రాల్ నిర్వహణకు సహాయపడతాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలను తినడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గుతాయి. వంటల కోసం ప్రాసెస్ చేసిన నూనెలకు బదులుగా ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె లేదా ఆవనూనె వంటి వాటిని పరిమితంగా ఉపయోగించడం మంచిది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచకుండా కాపాడతాయి. ఈ ఆహారాలు తినకూడదు.. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు కొన్ని ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన మాంసం, మైదాతో చేసిన పదార్థాలు, తీపి పదార్థాలు, బేకరీ ఆహారాలు , పూర్తి కొవ్వు ఉన్న పాల పదార్థాలను తగ్గించాలి. వీటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ , సంతృప్త కొవ్వులు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను వేగంగా పెంచుతాయి. ఆహారాలు మాత్రమే కాదు.. ఇవి కూడా ముఖ్యమే.. కేవలం మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా, రోజువారీ జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం అవసరం. ప్రతిరోజూ కనీసం ముప్పై నిమిషాల పాటు నడక లేదా ఇతర వ్యాయామాలు చేయడం, తగినంత నీరు తాగడం, ఒత్తిడిని తగ్గించుకోవడం , మంచి నిద్ర వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. సరైన ఆహార నియమాలు , ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే కొలెస్ట్రాల్‌ను సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు.                         *రూపశ్రీ.
ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మెదడు పనితీరును పెంచడంలో , శరీరంలో మంటను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా ఒమేగా3 అనగానే ఖరీదైన సప్లిమెంట్లు లేదా సాల్మన్ వంటి పెద్ద చేపలే గుర్తొస్తాయి. కానీ మనకు సులభంగా , తక్కువ ధరలో లభించే ఆహార పదార్థాల ద్వారా కూడా ఒమేగా3 ని పొందవచ్చు. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. అవిసె గింజలు.. అవిసె గింజలు ఒమేగా3 పొందడానికి అత్యంత చౌకగా లభించే పదార్థం. వీటిని కాస్త వేయించి పొడి చేసుకుని రోజువారీ ఆహారంలో, పెరుగులో లేదా నీటిలో కలుపుకుని తీసుకోవచ్చు. ఇవి గుండె ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తాయి. చియా విత్తనాలు.. శాకాహారులకు ఇవి మంచి ఎంపిక. వీటిని నీటిలో నానబెట్టి స్మూతీలు, జ్యూస్‌లు లేదా మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. ఇవి ఒమేగా3 తో పాటు శరీరానికి కావలసిన పీచు పదార్థాన్ని కూడా అందిస్తాయి. చిన్న చేపలు (సార్డిన్స్, మకేరల్).. ఖరీదైన విదేశీ చేపల జోలికి వెళ్లకుండా  స్థానిక మార్కెట్లలో దొరికే చిన్న రకం చేపలను ఎంచుకోవచ్చు. సార్డిన్స్, మకేరల్ వంటి చిన్న చేపల్లో ఒమేగా3 సమృద్ధిగా ఉంటుంది. ఇవి ధరలో తక్కువగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. సోయాబీన్స్.. మొక్కల ఆధారిత పోషకాల్లో సోయాబీన్స్ ఒకటి. వీటిని కూరగాయల రూపంలో లేదా సోయా పాలు, తోఫు రూపంలో తీసుకోవడం వల్ల ఒమేగా3 తో పాటు మంచి ప్రొటీన్ లభిస్తుంది. నువ్వులు.. భారతీయ ఇళ్లలో సాధారణంగా వాడే నువ్వులు కూడా మంచి పోషకాలను అందిస్తాయి. వీటిని వివిధ వంటకాల రూపంలో తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. పాలకూర మరియు ఆకుకూరలు.. రోజువారీ వంటల్లో వాడే ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూరలో కొంత పరిమాణంలో ఒమేగా3 లభిస్తుంది. ఇవి శరీరానికి ఇతర విటమిన్లు , ఖనిజాలను కూడా అందిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండానే మన రోజువారీ ఆహారంలో ఈ సాధారణ పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ఒమేగా3 లోపాన్ని నివారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.                                                                                                                                          *రూపశ్రీ.