ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నేడు ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని సుస్థిరం చేస్తూ, దానికి తిరుగులేని చట్టబద్ధత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.    శనివారం (మార్చి 28) ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ, దానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.  గత కొన్నేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళానికి శాశ్వతంగా స్వస్తి పలకడమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.   ఆంధ్రప్రదేశ్ ఏకైక,  శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ, భవిష్యత్తులో ఏ శక్తులు కూడా దీనిని మార్చలేని విధంగా రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా సభ్యులను కోరారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఒకే రాజధాని విధానం అత్యంత అవసరమన్నారు.   ఈ తీర్మానం  ప్రధాన ఉద్దేశ్యం కేవలం ఒక నగరాన్ని నిర్మించడం మాత్రమే కాదు, దానికి చట్టపరమైన భరోసా కల్పించడమని చెప్పారు.  గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వాలు మారినా,  రాజధాని మార్పు వంటి అంశాలు పునరావృతం కాకూడదనీ అందుకే ఈ తీర్మానాన్ని ఆమోదించాలనీ కోరారు. అసెంబ్లీలో ఈ తీర్మానం ఆమోందం పొందిన తరువాత  దీనిని తదుపరి చర్యల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా  స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రసంగిస్తూ.. రాజధాని అనేది ఐదు కోట్ల ప్రజల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న అంశమన్నారు.  రాజధాని నిర్మాణం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, రాజకీయ ప్రయోజనాల కోసం దానిని అడ్డుకోవడం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని ఆయన ప్రస్తుతించారు. గత ఐదేళ్లలో అమరావతి ఎదుర్కొన్న ఆటంకాలు, న్యాయపరమైన చిక్కులు,  రైతుల పోరాటాలను దృష్టిలో ఉంచుకుని  ఈ కొత్త తీర్మానం ద్వారా అందరిలోనూ భరోసా నింపడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  కాగా రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వల్ల  ఈ ప్రాంతంలో భూముల విలువ పెరగడంతో పాటు  పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరుగుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.    
లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ఈ యాప్ ల వలలో పడి ఎందరో నిండు ప్రాణాలను బలవంతంగా తీసేసుకుంటున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీటిని నియంత్రించడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు అంతగా సత్ఫలితాలను ఇస్తున్నట్లు కనిపించదు. తాజాగా కాకినాడ జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.  వివకాలిలా ఉన్నాయి.  అనకాపల్లి జిల్లా వడ్డాదిమాడుగుల గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహమ్మద్ బషీర్   కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఒక  ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మెరుగైన భవిష్యత్తు కోసం పట్టణానికి వచ్చిన బషీర్, కొంతకాలం క్రితం అవసరాల నిమిత్తం ఒక ఆన్‌లైన్ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. తీసుకున్న అప్పును సకాలంలో చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవడంతో, లోన్ యాప్ నిర్వాహకులు బషీర్‌పై ఒత్తిడి పెంచారు. ఫోన్ కాల్స్ ద్వారా వేధించడమే కాకుండా, అసభ్యకరంగా మాట్లాడుతూ మానసిక క్షోభకు గురిచేశారు. ఈ క్రమంలోనే యాప్ నిర్వాహకుల వేధింపులు మితిమీరిపోవడంతో..  తీవ్ర మనస్తాపానికి గురైన బషీర్ తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  తమ కుమారుడి మృతికి కారణమైన లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆన్‌లైన్ రుణాల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని, లేనిపక్షంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని సామాజిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి అక్రమ లోన్ యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.
  క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి  సెంటిమెంట్లు బాగా  ఎక్కువ‌. ఎందుకంటే  ఆ కుటుంబం ఎదిగిందే ఇలాంటి  సెంటిమెంట్ల  ద్వారా. అలా త‌న తండ్రి  తెలంగాణ  రాష్ట్ర స‌మితి అనే పార్టీని ఏప్రిల్ 27, 2001లో స్థాపించ‌గా.. కూతురు క‌విత, పాతికేళ్ల త‌ర్వాత‌.. అంటే 2026, ఏప్రిల్ 25న పార్టీ ప్ర‌క‌ట‌న‌కు సుముహుర్తం ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌క‌టించారు.ఇంత‌కీ ఈ పార్టీ పేరు ఏమై ఉంటుంది? అంటే, తెలంగాణ ప్రజా జాగృతి అని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆమె తెలంగాణ  జాగృతి అనే సామాజిక సంస్థ‌ను న‌డుపుతున్నారు. దీనికే ప్ర‌జా అనే ప‌దం  చేర్చుతూ దాన్ని రాజ‌కీయ పార్టీగా మార్చుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.   ఇక పార్టీ గుర్తులు ఏవి ఉంటాయో ప‌రిశీలిస్తే.. ధ‌ర్మ గంటను ఖ‌రారు చేసే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. జెండా, అజెండా  ఎలాంటివో గ‌మ‌నిస్తే ఇప్ప‌టికే జాగ్ర‌త్తికంటూ తెలుపు, లేత ప‌చ్చతో కూడిన జెండా రంగులున్నాయి. వీటికి అజెండాను జోడిస్తే.. సామాజిక తెలంగాణ లేదా తెలంగాణ  ఫ‌స్ట్.. ఆమె తీసుకున్న రాజ‌కీయ విధానంగా స‌మాచారం.  ఇక యువ‌త‌, మ‌హిళ‌లు, అణ‌గారిన వ‌ర్గాల హ‌క్కులు, మ‌రీ ముఖ్యంగా అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు అండ‌గా నిల‌బ‌డ్డం వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇక బీసీ  సంగ‌తి స‌రే స‌రి. మ‌హిళ‌ల రిజ‌ర్వేష‌న్ల‌పై పోరాటం కూడా ఆమె తీసుకుంటున్న పొలిటిక‌ల్ లైన్ల‌లో భాగ‌మే.  వ‌చ్చే ఎన్నిక‌ల  నాటికి డీలిమిటేష‌న్లో భాగంగా తెలంగాణ నియోజ‌క‌వ‌ర్గాలు సైతం పెర‌గ‌నుండ‌టంతో ఆమె పార్టీ నుంచి కూడా ఎంద‌రో కొత్త రాజ‌కీయ నాయ‌కులు పుట్టుకొచ్చేలా  తెలుస్తోంది.ఇక ఏప్రిల్ 25న ఎందుకు? ఈ ముహుర్తం  ఖ‌రారు చేయ‌డం వెనక ఉన్న ఉద్దేశ‌మేంటో ప‌రిశీలిస్తే.. కొన్ని జ్యోతిష శాస్త్ర ప‌ర‌మైన అంశాలు ఇందులో దాగి  ఉన్నట్టు స‌మాచారం. ఏప్రిల్ ఇర‌వై ఐదున రాజ‌యోగాన్నిచ్చే గ్ర‌హ‌గ‌తుల సంచారం  క‌నిపిస్తోందని అంటారు పండితులు. కొత్త  ప‌నులు ప్రారంభించ‌డానికి  ఇది సుదినంగా  చెబుతున్నారు.  దానికి తోడు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్స‌వానికి కూడా ఈ తేదీతో కొంత సంబంధ‌ముంది. పాతికేళ్ల క్రితం కేసీఆర్ 2001, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్రారంభించారు క‌విత తండ్రి కేసీఆర్. అదే తేదీకి అటు ఇటుగా తెలంగాణ ప్ర‌జా జాగృతి ప్రారంభిస్తున్నారు కేసీఆర్ త‌న‌య‌ క‌విత‌. ఆ పార్టీ  ఆనాడు ఎంతగా ఎదిగిందో, త‌న పార్టీ  కూడా అంతేలా  ఎదుగుతుంద‌ని బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు క‌విత‌. ఉగాది త‌ర్వాత వ‌చ్చే శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ల అనంత‌రం త‌న పార్టీ  జెండా ఎగుర‌వేయ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్ల‌వ‌చ్చ‌న్న  న‌మ్మ‌కాలు కూడా క‌విత‌కు ఉన్న‌ట్టు స‌మాచారం.  బీఆర్ఎస్ లో తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు అన్యాయం జ‌రిగింది. అలాంటి వారికి త‌మ పార్టీలో స‌ముచిత స్థానం క‌ల్పిస్తాన‌ని అంటున్నారు క‌విత‌. ఇక చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళా సాధికార‌త‌ను తీసుకొచ్చేలా 33 శాతం రిజ‌ర్వేష‌న్ల‌కు కూడా ప్ర‌యారిటీ ఇస్తున్నారు. ప్ర‌త్యేకించీ యువ‌త కోసం ఉద్యోగ నోటిఫికేష‌న్లు.. నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌పై రాజీలేని పోరాటం కూడా క‌విత త‌న విధానంగా  చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌విత  పార్టీ ఎఫెక్ట్ ఎంత‌?  కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కి దీటుగా ఆమె పార్టీ టీపీజే  ఎదిగే అవ‌కాశం ఎంత‌? ద‌క్షిణాది నుంచి జ‌య త‌ర్వాత ఆ స్థాయిలో ఒక మ‌హిళ‌గా ఆమె రాజ‌కీయంగా ఎదిగి సీఎం కాగ‌ల‌రా?  తేలాల్సి ఉంది.
ALSO ON TELUGUONE N E W S
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం తెలుగు సంవత్సరాది సందర్భంగా జర్నలిస్టుల కోసం డైరీ విడుదల చేయడం, ఇన్సూరెన్స్ ప్లాన్‌ను రెన్యువల్ చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. 2026–2027 సంవత్సరానికి సంబంధించిన డైరీ మరియు ఇన్సూరెన్స్ రెన్యువల్‌ను మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఈ ఏడాది ప్రత్యేకంగా, ప్రతి ఫిల్మ్ జర్నలిస్ట్ కుటుంబానికి (2+2) అందించే ఇన్సూరెన్స్ కవరేజీని ₹5 లక్షల నుంచి ₹10 లక్షలకు పెంచడం జరిగింది. అదేవిధంగా, ప్రమాదాల సమయంలో జర్నలిస్టులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రత్యేక యాక్సిడెంట్ పాలసీ ప్రవేశపెట్టారు. ఏదైనా ప్రమాదం కారణంగా 2 నుంచి 12 నెలలు బెడ్ రెస్ట్ అవసరమైన పరిస్థితుల్లో, ప్రతి వారం ₹10,000 చొప్పున సహాయం అందేలా ఈ పాలసీ రూపొందించబడింది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులకు గుర్తింపు కల్పించే విధంగా అసోసియేషన్ తరఫున ఐడి కార్డులు జారీ చేయగా, వాటిని కూడా చిరంజీవి గారు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు TFJA చేపడుతున్న కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందిస్తూ ₹5 లక్షల చెక్కును అందించి, సభ్యుల సంక్షేమానికి వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో TFJA ప్రెసిడెంట్ వై.జె.రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, ట్రెజరర్ నాయుడు సురేంద్ర, పోలిట్ బ్యూరో కన్వీనర్ వారణాసి లక్ష్మీనారాయణతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు పోలిట్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.
 -హృతిక్ రోషన్ మాజీ ప్రియురాలు ఎవరు -హాస్పిటల్ లో ఉండటానికి కారణం ఏంటి! -అసలు ఆమెకొచ్చిన వ్యాధి తీవ్రత ఎంత  స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan)ఒకప్పటి ప్రియురాలుగా ప్రముఖ నటి సబా ఆజాద్(Saba Azad)కి గుర్తింపు ఉంది. ఆ తర్వాతి కాలంలో మంచి స్నేహితులుగా మిగిలిపోయారు. రీసెంట్ గా సబా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ పోస్ట్ చూసిన వాళ్లంతా  సబా ఆరోగ్య విషయంపై బాధపడుతున్నారు. ఆ న్యూస్ ఏంటో చూద్దాం. ఇనిస్టా వేదికగా బెడ్ పై పడుకొని ఉన్న తన పిక్ ని షేర్ చేస్తు నేను ‘సైక్లోస్పోరా కయెటానెన్సిస్’అనే ప్రమాదకర పరాన్నజీవి వల్ల వచ్చిన 'సైక్లోస్పోరియాసిస్ అనే వ్యాధి  బారిన పడ్డాను. గడిచిన 14 రోజులు నా లైఫ్ లోనే అత్యంత దారుణమైనవి. రోజుకి రెండు సార్లు జిమ్‌లో కఠినమైన వర్కౌట్లు చేసే నేను, ఇప్పుడు కనీసం ఒక టూత్‌పిక్ ఎత్తేంత బలం కూడా లేని స్థితికి చేరుకున్నాను. కేవలం రెండు వారాల వ్యవధిలోనే నాలుగు కిలోల బరువు తగ్గిపోయాను. కనీసం నడవడానికి కూడా ఓపిక లేని స్థితిలో ఉన్నాను. అలాంటి ఈ కష్ట సమయంలో హృతిక్ రోషన్ తన పక్కనే ఉండి ధైర్యం చెబుతున్నాడు. Also read: Rishab Shetty: స్టార్ హీరోయిన్ ని అన్ ఫాలో చేసిన రిషబ్ శెట్టి.. అందులో ఆమె హ్యాండ్ కూడా ఉంది ఈ ఇన్ఫెక్షన్ సోకడం వెనుక ఉన్న కారణం నన్ను షాక్ కి గురిచేసింది. ఎప్పుడూ ఇంటి భోజనమే తింటాను. బయటకు వెళ్లినా సొంత వాటర్ బాటిల్‌నే వెంట తీసుకెళ్తాను. ఇంతలా వ్యక్తిగత పరిశుభ్రత పాటించినా సదరు పరాన్నజీవి శరీరంలోకి ఎలా చేరిందో అర్థం కావడం లేదని చెప్పింది. అంతే కాకుండా నెటిజన్లని హెచ్చరిస్తూ మనం తినే ఆకుకూరలు, సలాడ్స్,కూరగాయల  విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.  కూరగాయలని కేవలం నీటితో కడిగితే సరిపోదు. బేకింగ్ సోడా లేదా వెజీ వాష్ ఉపయోగించి శుభ్రం చేయాలి. పచ్చిగా తినే ఆహార పదార్థాల ద్వారానే ఇలాంటి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఢిల్లీకి చెందిన సబా పూర్తి పేరు సబా సింగ్ గ్రేవాల్. ఇప్పటకి వరకు సుమారు పది చిత్రాల వరకు చేసింది. గత ఏడాది బాబీ డియోల్ హీరోగా వచ్చిన బందర్ అనే మూవీలో ఖుషి గా బాబీ డియోల్ ప్రేమికురాలిగా కనిపించింది. సింగర్ గాను తన సత్తా చాటింది.    
సినిమా ఇండస్ట్రీలో అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. కొంతమంది హీరోయిన్లు వరుస హిట్లు అందుకుని స్టార్ హోదా పొందితే, మరికొంతమంది ఒకటి రెండు సినిమాలతోనే కనుమరుగవుతుంటారు. కానీ, వెండితెరపై ఆశించిన స్థాయిలో మెరవకపోయినా, నిజ జీవితంలో మాత్రం మహారాణిలా సెటిల్ అయిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. అచ్చం అలాంటి అదృష్టమే వరించింది టాలీవుడ్ హీరోయిన్ అదితి ఆర్యను. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇజం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ, ప్రస్తుతం దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ వారసుడిని వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. అదితి ఆర్య గురించి చెప్పాలంటే.. ఆమె కేవలం ఒక నటి మాత్రమే కాదు, మేధావి కూడా. 2015లో 'ఫెమినా మిస్ ఇండియా వరల్డ్' కిరీటాన్ని గెలుచుకున్న ఈ సుందరి, ఆ తర్వాత సినీ రంగంలో అడుగుపెట్టింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పూరీ జగన్నాధ్ రూపొందించిన ‘ఇజం’ మూవీలో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమాలో తన గ్లామర్, నటనతో పర్వాలేదనిపించినా, దురదృష్టవశాత్తూ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో ‘సెవెన్’, ‘నిన్ను వదిలి నేను పోలేనులే’ వంటి సినిమాల్లో నటించినా అవేవీ ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. తెలుగులో అవకాశాలు తగ్గడంతో అదితి ఆర్య తన ఫోకస్‌ను బాలీవుడ్ వైపు మళ్ళించింది. అక్కడ రణవీర్ సింగ్ నటించిన ‘83’ చిత్రంలో ఒక చిన్న పాత్రలో మెరిసింది. అయితే సినిమాల్లో తన కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతున్న క్రమంలో, అదితి తన చదువుపై దృష్టి పెట్టింది. ప్రపంచ ప్రఖ్యాత ‘యేల్ యూనివర్సిటీ’ (Yale University) నుంచి ఎంబీఏ పూర్తి చేసి తన ప్రతిభను చాటుకుంది. కేవలం గ్లామర్ ప్రపంచానికే పరిమితం కాకుండా, విద్యా రంగంలోనూ ఆమె సాధించిన ఈ విజయం అందరినీ ఆశ్చర్యపరిచింది.అయితే అదితి ఆర్య జీవితంలో అతిపెద్ద మలుపు ఆమె వివాహం. ప్రముఖ వ్యాపారవేత్త, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ కుమారుడు జై కోటక్‌తో ఆమె కొన్నాళ్ల పాటు ప్రేమాయణం సాగించింది. వీరిద్దరూ ఉదయ్‌పూర్‌ వేదికగా అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నారు. అంబానీ కుటుంబంతో సహా దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. జై కోటక్ ప్రస్తుతం కోటక్ 811 విభాగానికి కో-హెడ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఉదయ్ కోటక్ నికర ఆస్తి విలువ సుమారు 1.2 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. అటు అదితి సొంత సంపాదన, ఇటు కోటక్ కుటుంబ కోడలిగా ఆమె హోదాను బట్టి చూస్తే, సుమారు 12,000 కోట్ల రూపాయల ఆస్తికి ఆమె యజమానిగా మారిందని టాక్ వినిపిస్తోంది. సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయినా, వ్యక్తిగత జీవితంలో మాత్రం అదితి ఆర్య ఒక బిలియనీర్ కోడలిగా రాజభోగాలను అనుభవిస్తోంది. ప్రస్తుతం అదితి ఆర్య సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ, తన కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఆమె సోషల్ మీడియా పోస్టులు చూస్తుంటే, గ్లామర్ ప్రపంచాన్ని వదిలేసి బిజినెస్ మరియు ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్ అయిపోయినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు వెండితెరపై చూసిన ఈ హీరోయిన్ రేంజ్ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోవడంతో నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
  -కాంతార, కాంతార చాప్టర్ 1 తో క్రేజీ హీరోగా రిషబ్ శెట్టి  -సోషల్ మీడియాలోను ఫుల్ యాక్టీవ్  -కానీ ఆ హీరోయిన్ ని ఎందుకు అన్ ఫాలో చేసాడు రిషబ్ శెట్టి(Rishab Shetty)..స్తబ్దుగా ఉన్న సౌత్ చిత్ర పరిశ్రమకి కాంతార, కాంతార చాప్టర్ 1(Kantara Chapter 1)తో సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చాడు. ఎంతలా అంటే ఎంటైర్ ఇండియన్ సినీ పరిశ్రమకి చెందిన మేకర్స్ మొత్తం కాంతార టైప్ లో మూవీ తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యేంతలా. దీంతో రిషబ్ శెట్టి గురించిన నిత్య తాజా అప్డేట్ గురించి తెలుసుకొనే అభిమానుల నెంబర్ ఏ రోజుకా రోజు పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఒక న్యూస్ వాళ్ళందరిని  షాక్ కి గురవ్వలా! ఆలోచనలలో పడాలా! అనే అయోమయంలో పడేలా చేసింది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం. రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటాడు. రీసెంట్ గా తన ఇనిస్టాగ్రామ్ అకౌంట్ నుంచి ప్రముఖ హీరోయిన్ రుక్మిణి వసంత్(Rukmini vasanth)ని అన్ ఫాలో చేసాడు.కాంతార చాప్టర్ 1 లో ప్రిన్సెస్ కనకవతి గా రుక్మిణి వసంత్ అత్యద్భుతమైన పెర్ఫార్మ్ తో మెస్మరైజ్ చేసింది. చిత్ర విజయంలో కూడా ఆమె భాగముందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.  అలాంటిది రిషబ్ శెట్టి అన్ ఫాలో చేసిన న్యూస్ ఇప్పుడు అభిమానుల్లో వైరల్ గా మారింది. ప్రముఖ నిర్మాత, నటుడు రాజ్ బి శెట్టి ని కూడా రిషబ్ అన్ ఫాలో చేసాడు. పైగా రిషబ్, రాజ్ సుదీర్ఘ కాలం నుచి మంచి మిత్రులు. రెండు రోజుల క్రితం కాంతార ని నిర్మించిన హోంబులే ఫిలిమ్స్ ని కూడా రిషబ్  అన్ ఫాలో చెయ్యడం గమనార్హం. also read: Varun Tej: అన్నయ్యకే ఎదురొస్తున్న తమ్ముడు.. 2027 సంక్రాంతి ఎవరిది  రిషబ్ అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే జై హనుమాన్ తో పాటు ది ప్రైడ్ ఆఫ్ భారత్  ఛత్రపతి శివాజీ మహారాజ్" అనే చిత్రాల్లో చేస్తున్నాడు. మరి ఈ రెండు చిత్రాలపై అంచనాలు ఏ విధంగా ఉంటాయో చెప్పక్కర్లేదు. రుక్మిణి వసంత్ అప్ కమింగ్ సినీ జర్నీని చూసుకుంటే ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ ల డ్రాగన్ లో చేస్తుంది.            
తెలుగు సాహిత్యంలో కొన్ని పుస్తకాలు కాలాతీతమైనవి. దశాబ్దాలు గడిచినా ఆ కథల్లోని సజీవత్వం ఏమాత్రం తగ్గదు. అటువంటి అరుదైన అద్భుతాల్లో డాక్టర్ దాశరథి రంగాచార్య రాసిన 'చిల్లర దేవుళ్లు' నవల ఒకటి. ఇప్పుడు ఈ అపురూప సాహితీ సంపదను వెండితెరపై ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో ఇదే నవలను ఆధారంగా చేసుకుని సినిమా వచ్చినప్పటికీ, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో ఈ పీరియడ్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నిజాం కాలం నాటి తెలంగాణ సామాజిక పరిస్థితులు, దొరల గడీల్లో నలిగిపోయిన సామాన్యుల జీవితాలు, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం సాగిన పోరాటాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ముఖ్యంగా 1930ల నాటి తెలంగాణ పల్లెటూరి వాతావరణాన్ని, అప్పటి మనుషుల ప్రవృత్తులను రంగాచార్య గారు ఈ నవలలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇప్పుడు అటువంటి బలమైన కంటెంట్‌తో నేటి తరం ప్రేక్షకులను మెప్పించేలా ఒక భారీ ప్రాజెక్ట్‌ను రూపొందించే పనిలో టాలీవుడ్‌కు చెందిన ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఉన్నట్లు సమాచారం. నిజానికి 1977లోనే 'చిల్లర దేవుళ్లు' సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది. టి. మాధవరావు దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రానికి దాశరథి రంగాచార్య స్వయంగా సంభాషణలు సమకూర్చడం విశేషం. అప్పట్లో కె.వి. మహదేవన్ సంగీతంలో వచ్చిన 'కలువకు చంద్రుడు ఎంతో దూరం' వంటి పాటలు ఇప్పటికీ శ్రోతల మనసుల్లో నిలిచే ఉన్నాయి. తాజాగా ఈ కథను మళ్ళీ సినిమాగా తీయాలనే ఆలోచన రావడం వెనుక ప్రస్తుతం టాలీవుడ్‌లో నడుస్తున్న 'నేటివిటీ' ట్రెండ్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో 'బలగం' వంటి చిత్రాలు తెలంగాణ సంస్కృతిని, నేటివిటీని ప్రతిబింబిస్తూ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. దీంతో పాత తరం నాటి క్లాసిక్ కథలపై సినీ మేకర్స్ దృష్టి పడింది. ముఖ్యంగా పీరియడ్ చిత్రాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో, చిల్లర దేవుళ్లు లాంటి కథను సరికొత్తగా ప్రెజెంట్ చేస్తే అది మరో లెవల్‌లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును హ్యాండిల్ చేయబోయే దర్శకుడు ఎవరు? నటీనటులు ఎవరనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచే సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సాహితీ ప్రియులు అయితే ఈ అద్భుత కావ్యానికి సరైన న్యాయం జరిగితే మరో 'రంగస్థలం' లేదా 'పుష్ప' రేంజ్ ఇంపాక్ట్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ మాండలికం, ఆనాటి గడీల వాతావరణం పర్ఫెక్ట్‌గా సెట్ అయితే ఈ సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా గుర్తింపు పొందే అవకాశం ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు ప్రాథమిక దశలో ఉన్నట్లు తెలుస్తోంది. నవలను వెండితెరపైకి అనువదించే క్రమంలో కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలా లేక ఒరిజినల్ ఆత్మ దెబ్బతినకుండా తెరకెక్కించాలా అనే కోణంలో స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టాలీవుడ్ అగ్ర నటుల్లో ఎవరో ఒకరు ఈ చారిత్రాత్మక పాత్రను పోషించే అవకాశం ఉందని ఫిలిం నగర్ టాక్.  ఇదిలా ఉంటే.. క‌న్యాశుల్కం న‌వ‌ల ఇప్పుడు వెబ్ సిరీస్‌గా రాబోతోంది. ఇందులో ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. గ‌తంలో ఎన్టీఆర్ న‌టించిన క‌న్యాశుల్కం సినిమా వ‌చ్చింది. అలాగే చ‌లం మైదానం వంటి న‌వ‌ల‌లు కూడా సినిమాలుగా రాబోతున్నాయి. ఇలాంటి కంటెంట్‌ను ఓటీటీలు ఎక్కువ‌గా ప్రోత్స‌హిస్తున్నాయి. దీన్నిబ‌ట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో క్లాసిక్ న‌వ‌ల‌ల‌కు పూర్వ వైభ‌వం రావ‌డం ఖాయ‌మ‌ని అర్థ‌మ‌వుతోంది. 
  -పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభమైన వరుణ్ తేజ్ న్యూ మూవీ  -నీహారిక కొణిదెల నిర్మాత  -2027 సంక్రాంతికి రిలీజ్  -మరి వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడితో పోటీ తప్పదా! కొంత కాలంగా కట్ అవుట్ కి తగ్గ హిట్ ని అందుకోవడానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)అష్టకష్టాలు పడుతున్నాడు. తన క్యారక్టర్ పరిధి మేరకు బాగానే చేస్తున్నా కథ, కథనంలోని లోపాల వల్ల డిజాస్టర్స్ అనేవి చుట్టపు చూపుగా రావాల్సింది పోయి పర్మినెంట్ గా తిష్ట వేస్తున్నాయి. సోలో హీరోగా 2019 లో వచ్చిన 'గద్దలకొండ గణేష్' తప్ప మరో సినిమా హిట్ లేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడితో చేసిన F3 హిట్ నే తన ఖాతాలో ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరికే వరుణ్ పోటీ రాబోతున్నాడు. డిటైల్స్ ఏంటో చూద్దాం. వరుణ్ తేజ్ ప్రెజంట్ మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi)దర్శకత్వంలో కొరియన్ కనకరాజు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే మరో మూవీ స్టార్ట్ చేసాడు. టైటిల్ 'బరి'(Bari). వాలీబాల్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కనుంది. నిర్మాత ఎవరో కాదు వరుణ్ సోదరి నిహారిక కొణిదెల(Niharika Konidela). ఈ రోజు పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చేతుల మీదుగా పూజా కార్యక్రమాలతో సదరు మూవీ స్టార్ట్ అయ్యింది. నీహారిక నిర్మాణంలో  గతంలోనే వచ్చిన కమిటీ కుర్రాళ్లు దర్శకుడు యదువంశీ(Yadhu vamsi)దర్శకుడు. ఇప్పుడు ఈ మూవీ 2027 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ విషయాన్నీ నీహారిక అధికారకంగా ప్రకటించడం రసవత్తరంగా మారింది. Also read: Sridevi: శ్రీదేవి తర్వాత అందమైన హీరోయిన్ ఈమెనే.  కానీ తన అమ్మ వల్ల ఆమె జీవితం అందుకు కారణం లేకపోలేదు. వెంకటేష్(venkatesh),అనిల్ రావిపూడి(Anilravipudi)మూవీ త్వరలోనే స్టార్ట్ కానుంది. కళ్యాణ్ రామ్ కూడా ఒక హీరో. ఈ మూవీ కూడా సంక్రాంతి బరిలో నిలబడటం తధ్యం. అనిల్ రావిపూడితో పాటు ప్రేక్షకుల డ్రీం కూడా. మరి సెల్యులాయిడ్ పై తన F3  టీంతో వరుణ్ తేజ్ పోటీపడటం అంటే అన్నయ్య వెంకీ కే వరుణ్ యాదవ్ ఎదురొస్తున్నట్టుగానే ప్రేక్షకులు ఫీలవుతారు. అంతలా F 2 , F 3 తో వెంకీ, వరుణ్ మెస్మరైజ్ చేసారు.     
  - బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్  - 'పెద్ది'లో రామ్ చరణ్ కుస్తీ పోరాటం..  - మెగా ప‌వ‌ర్‌స్టార్ న‌ట‌ విశ్వరూపం  - స్పోర్ట్స్ డ్రామాలో కొత్త ట్రెండ్  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు ఈ సినిమా కేవలం క్రికెట్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా అని అందరూ భావించారు. కానీ, మేకర్స్ తాజాగా వదిలిన అప్‌డేట్ చూస్తుంటే దర్శకుడు బుచ్చిబాబు ఒక రేంజ్ లో ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో క్రికెట్‌తో పాటు ‘కుస్తీ’ (Wrestling) ఎలిమెంట్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. కేవలం ఆట మాత్రమే కాదు, ఆ ఆట వెనుక ఉన్న భావోద్వేగాలను కూడా అద్భుతంగా ఆవిష్కరించ బోతున్నారు. తాజాగా విడుదలైన ‘పెద్ది పహిల్వాన్’ అనే చిన్న వీడియో గ్లింప్స్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. "కుస్తీ అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదురా.. ప్రాణంతో చావుకు ఎదురెళ్లే ఆట" అంటూ వినిపిస్తున్న డైలాగ్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. అంటే, కథానాయకుడు క్రికెట్‌లో సత్తా చాటినప్పటికీ, పరిస్థితుల దృష్ట్యా కుస్తీ బరిలోకి దిగాల్సి వస్తుందనే పాయింట్‌ను ఈ వీడియో హింట్ చేస్తోంది. ఒకే సినిమాలో రెండు విభిన్నమైన క్రీడలను జోడించి, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో బుచ్చిబాబు ఒక వండర్ క్రియేట్ చేయబోతున్నాడని స్పష్టమవుతోంది. గతంలో క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ‘లగాన్’, కుస్తీ నేపథ్యంలో వచ్చిన ‘దంగల్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించాయో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ రెండింటి కలయికతో ‘పెద్ది’ రాబోతుండటంతో, ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో మరో మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రామ్ చరణ్ తన కెరీర్‌లో ఇంతవరకు ఇలాంటి రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాలో నటించలేదు. అందుకే చరణ్ మేకోవర్, ఫిజిక్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండటం మరో విశేషం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ మరియు పాటలు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ బ్యాటింగ్ స్టైల్ చూసి మురిసిపోయిన అభిమానులు, ఇప్పుడు ‘పహిల్వాన్’ గెటప్‌లో ఆయన్ని చూడటానికి మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలవుతున్న ఈ మూవీ రామ్ చరణ్ ఇమేజ్‌ను మరో మెట్టు ఎక్కిస్తుందనడంలో సందేహం లేదు. టెక్నికల్ పరంగా కూడా టాప్ క్లాస్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. ముఖ్యంగా ఏ.ఆర్. రెహమాన్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుంది. మరికొద్ది రోజుల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ రాబోతున్నాయనే వార్త మెగా ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది.
- 'ధురంధర్ 2'పై ఎంపీ ఘాటు విమర్శలు. - 1100 కోట్లు కొల్లగొట్టిన రణవీర్ సినిమా..  - రణవీర్ సింగ్ వర్సెస్ ఓవైసీ  - ముస్లింల చిత్రీకరణపై తీవ్ర అభ్యంతరం ముక్కుసూటిగా మాట్లాడే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన రాజకీయ అంశాలపై కాకుండా, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్న బాలీవుడ్ చిత్రం 'ధురంధర్ 2'పై విరుచుకుపడ్డారు. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పై థ్రిల్లర్‌ను ఆయన ఘాటు పదజాలంతో విమర్శించడం ఇప్పుడు సినిమా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన ఒక సదస్సులో పాల్గొన్న ఓవైసీకి 'ధురంధర్ 2' సినిమా గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ.. "అసలు అది ఒక సినిమానా? మూడు గంటల పాటు సాగే అదొక బక్వాస్ (చెత్త)" అంటూ కొట్టిపారేశారు. సినిమాలో కేవలం బూతులు, హింసను ప్రోత్సహించే సన్నివేశాలు తప్ప మరేమీ లేవని ఆయన అభిప్రాయపడ్డారు. మూడు గంటల పాటు సమయం వృధా చేసుకుని ఇటువంటి సినిమాలు చూసే తీరిక తనకు లేదని, ప్రజలు తన ప్రసంగాలను ఒక గంట విన్నా ఎంతో కొంత జ్ఞానం లభిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ముస్లింలను చూపించిన తీరుపై ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా చూశాక ముస్లింలను దూషించాలనే భావన కలిగేలా సన్నివేశాలు ఉన్నాయని, సమాజంలో విద్వేషాన్ని పెంచేలా సినిమాను మలిచారని ఆయన ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వస్తున్న ఆదరణ గురించి ప్రస్తావించగా, తనదైన హైదరాబాదీ శైలిలో స్పందిస్తూ అటువంటి విషయాలను తాను పట్టించుకోనని తేల్చి చెప్పారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధురంధర్ 2' చిత్రం గతేడాది వచ్చిన 'ధురంధర్'కు సీక్వెల్. ఇందులో రణవీర్ సింగ్ 'జస్కిరత్ సింగ్ రంగీ' అలియాస్ 'హమ్జా అలీ మజారీ' అనే భారతీయ గూఢచారి పాత్రలో నటించారు. పాకిస్థాన్‌లోని కరాచీ అండర్ వరల్డ్‌లోకి చొరబడి ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసే మిషన్‌లో భాగంగా సాగే ఈ కథలో సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించారు. గూఢచారిగా రణవీర్ నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. ఒకవైపు విమర్శలు వస్తున్నా, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా అన్-స్టాపబుల్‌గా దూసుకుపోతోంది. విడుదలైన కేవలం 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 1140 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. గతంలో భారీ విజయం సాధించిన 'పుష్ప' వంటి సినిమాల రికార్డులను సైతం ఈ చిత్రం అధిగమించడం విశేషం. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం వంటి దక్షిణాది భాషల్లో కూడా ఈ స్పై థ్రిల్లర్‌కు మంచి వసూళ్లు వస్తున్నాయి. రాజమౌళి, అల్లు అర్జున్ వంటి దిగ్గజాలు ఇప్పటికే ఈ సినిమా సాంకేతిక విలువలను, రణవీర్ నటనను ప్రశంసించారు. అయితే రాజకీయ నాయకుల నుండి వస్తున్న ఇటువంటి విమర్శలు సినిమా వసూళ్లపై ఏమైనా ప్రభావం చూపుతాయా లేదా అన్నది వేచి చూడాలి. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ చిత్రం, లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథాంశాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్లకు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంటుంది. 'డీజే టిల్లు' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు విమల్ కృష్ణ, ఇప్పుడు మరో ఆసక్తికరమైన టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాగ్ మయూర్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి 'అనుమాన పక్షి' అనే వెరైటీ పేరును ఫిక్స్ చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలోని "గులాబ్ జామ్" అనే సాంగ్‌ను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తాజాగా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు. డీజే టిల్లు తర్వాత విమల్ కృష్ణ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీలో దీనిపై మంచి బజ్ ఉంది. ఈ పాటలో ఉన్న ఎనర్జీ, బీట్ వింటుంటే మరో మ్యూజికల్ హిట్ ఖాయమనిపిస్తోంది. సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల స్వరపరిచిన ఈ గీతానికి కిట్టు విస్సాప్రగడ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. మరీ ముఖ్యంగా, సీనియర్ సింగర్ రమణ గోగుల తనదైన శైలిలో ఈ పాటను ఆలపించడం విశేషం. చాలా కాలం తర్వాత రమణ గోగుల వాయిస్‌లో వస్తున్న ఈ సాంగ్ వినడానికి చాలా హుషారుగా ఉందనే టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ పాట త్వరగానే వైరల్ అవుతోంది. సినిమా కాన్సెప్ట్ గురించి దర్శకుడు విమల్ కృష్ణ స్పందిస్తూ.. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక విషయంలో అనుమానం కలుగుతుంటుందని, ఆ పాయింట్‌ను బేస్ చేసుకునే ఈ కథను రాసుకున్నట్లు తెలిపారు. ఇది కేవలం కామెడీ మాత్రమే కాదు, ఇందులో ఒక చిన్న సైకలాజికల్ సస్పెన్స్ ఎలిమెంట్ కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 'డీజే టిల్లు'లో హీరో క్యారెక్టరైజేషన్ ఎంతలా క్లిక్ అయిందో, ఈ సినిమాలో రాగ్ మయూర్ పాత్ర కూడా అదే స్థాయిలో మెప్పిస్తుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది. ఈ చిత్రంలో రాగ్ మయూర్ సరసన మెరిన్ ఫిలిప్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ప్రిన్స్, రాశి, బ్రహ్మాజీ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ప్రమోషన్ల జోరు పెంచిన 'అనుమాన పక్షి' టీమ్, సినిమాను మే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ వేసవిలో ప్రేక్షకులకు కావాల్సిన ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమా ద్వారా లభిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రాగ్ మయూర్ కెరీర్‌లో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని, అలాగే విమల్ కృష్ణ తన సక్సెస్ ట్రాక్‌ను కొనసాగిస్తారని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ మరియు ట్రైలర్ గురించి మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి.
  -శ్రీదేవి గ్లామర్ కి ఉన్న చరిష్మా తెలిసిందే   -మరి శ్రీదేవిలా మెస్మరైజ్ చేసే నటి తెలుసా! -మురళీమోహన్ చెప్పిన ఆ విశేషాలేంటి!     శ్రీదేవి(Sridevi)రూపం చూస్తే అందమే ఆమె కోసం పెట్టిపుట్టినట్టుగా అనిపిస్తుంది. ఆ అందాన్ని కొలిచే విషయంలో కూడా స్పష్టమైన కొలమానాలు ఉండవు. అంత అందం శ్రీదేవి సొంతం. మరి శ్రీదేవి కంటే అందమైన హీరోయిన్ ఉందని చెప్తున్నారు లెజండ్రీ యాక్టర్ మురళీమోహన్.. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మురళీ మోహన్(Murali Mohan)రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు శ్రీదేవి ఐదు అడుగుల  ఎనిమిది అంగుళాల పొడవుతో నాకు ఈక్వల్‌గా ఉండేవారు. ఆమె బిహేవియర్  వండర్‌ఫుల్‌గా ఉండేది. ఎప్పుడూ తప్పుగా మాట్లాడటం, చిలిపి పనులు చేయడం వంటివి చేసేవారు కాదు. ఆ తర్వాత అంత అందగత్తె ఎవరంటే దీప. అద్భుతంగా అందంగా ఉండేది. దీప చాలా చిన్న వయసులోనే సినీ రంగంలోకి వచ్చింది. ఆమె తల్లి షూటింగ్ తర్వాత బిస్కెట్లు, జీడిపప్పులు, బాదం పప్పులు బ్యాగ్‌లో పెట్టేవారు. ఆ అలవాటు తర్వాత రోజుల్లో బరువు పెరగడానికి ఒక కారణమయ్యి ఉండవచ్చు.  ఎంతవరకు నిజమో తెలియదు గాని కొందరు ముందే ఆమెని ఆర్టిస్ట్ చేయాలనే ఉద్దేశంతో స్టెరాయిడ్స్ ఇచ్చారని కూడా అంటారు. ఏది ఏమైనా దీప శరీరంలో మార్పులు వచ్చి, బ్లోట్ అయ్యింది. లేకపోతే ఒక అద్భుతమైన నటి అయ్యేదని మురళీ మోహన్ అన్నారు. also read: Dhurandhar 2: బాహుబలి సామ్రాజ్యాన్ని కూల్చబోతున్న ధురంధర్ 2  మురళీ మోహన్ లాంటి నటుడు దీప గురించి ఆ ఆమాటలు చెప్పడంతో ఒక్కసారిగా మూవీ లవర్స్ అందరు దీప సినిమాల గురించి సెర్చ్ చెయ్యడం ప్రారంభించారు. 1976 లో 'అమెరికా అమ్మాయి' అనే మూవీతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన దీప తన పదేళ్ల వయసు నుంచే బాలనటిగా మలయాళ సినీ రంగంలో కొనగాసాగుతు ఉంది.ప్రేమ లేఖలు, రంగూన్ రౌడీ, తాతయ్య ప్రేమలీలలు, కొంగు ముడి, పిల్ల జమిందార్, అక్బర్ సలీం అనార్కలి, దశతిరిగింది ఇలా చెప్పుకుంటే పోతే తన హవా మాత్రమే స్పష్టంగా కనపడే ఎన్నో చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.మురళీ మోహన్ సరసన కూడా పలు చిత్రాల్లో కనపడి హిట్ పెయిర్ అనిపించుకున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన  దీప అసలు పేరు ఉన్నికుట్టి . సుమారు 150 చిత్రాల వరకు ఆమె ఖాతాలో ఉన్నాయి. స్వస్థలం కేరళలోని ఎర్నాకులం. శ్రీదేవి, దీప కలిసి కమల్ హాసన్ తో  స్క్రీన్ షేర్ చేసుకున్నారు.     
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత నెల ఆఖరున వచ్చే విద్యుత్ బిల్లు ఒక ఎత్తు.  చాలా మంది విత్యుద్ బిల్లుకు భయపడి ఏసీ వినియోగించే విషయంలో వెనకడుగు వేస్తారు.  అయితే ఇలాంటి వాటికి సోలార్ ఏసీ ఒక పర్మినెంట్ సొల్యూషన్ ఇస్తుంది. ఇవి హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించి పనిచేస్తాయి. పగటిపూట సూర్యరశ్మితో, రాత్రిపూట గ్రిడ్ లేదా బ్యాటరీ బ్యాకప్‌తో నడుస్తాయి. ఇవి ఆర్థికంగా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి మాత్రమే కాకుండా, కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడటం ద్వారా పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ఎంత ఏసీకి ఎంత సోలార్ సెటప్ ఉండాలి? 1 టన్ను సోలార్ ఏసీని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే, అది సరిగ్గా పనిచేయడానికి కనీసం 1.5KW (1500 వాట్స్) సామర్థ్యం గల సోలార్ ప్యానెల్ అవసరం అవుతుంది. పగటిపూట సూర్యరశ్మి  తీవ్రంగా ఉన్నప్పుడు, ఏసీ పూర్తిగా సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో పనిచేస్తుంది.  ఇది నేరుగా DC పవర్‌పై పనిచేసే మోడళ్లలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది, ఎందుకంటే ఇది పవర్ నష్టాన్ని తగ్గించి, మెరుగైన కూలింగ్  పనితీరును అందిస్తుంది. నైట్ బ్యాకప్ సెలక్షన్.. సోలార్ ఏసీ  అతిపెద్ద ప్రయోజనం దాని సౌలభ్యం. అంటే, ఒకవేళ రాత్రిపూట  బ్యాటరీ బ్యాకప్ అయిపోతే,  దానిని విద్యుత్‌తో నడపవచ్చు. ఈ సాంకేతికత రాత్రిపూట కూడా  ఏసీ పనితీరుకు ఎలాంటి సమస్య ఉండదని హామీ ఇస్తుంది.  సులభంగా చెప్పాలంటే,  సౌరశక్తితో పాటు విద్యుత్తుతో కూడా ఏసీని నడపవచ్చు. పైన పేర్కొన్న సోలార్ ఏసీ ని ఆన్లైన్ మార్కెట్లో అయినా, ఆఫ్ లైన్ మార్కెట్ లో అయినా కొనుగోలు చేయవచ్చు. ఇంటి పైకప్పు మీద తగినంత స్థలం ఉంటే.. సోలార్ ఏసీ ఎంపిక చాలా మంచిది.                                         *రూపశ్రీ.
రాముడు రాఘవుడు రవికులుడితడు అనే పాటను వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. చిన్నప్పుడు పుస్తకాల్లో శ్రీరాముడు పితృవాఖ్య పరిపాలకుడు అనే మాటను విని ఉంటాము. ఇంకా చక్కని నడవడిక కలిగిన అబ్బాయిలను చూస్తే రాముడు అనే టాగ్ వేస్తాము. ఇలా మన జీవితాలలో రాముడు ఒక భాగం. అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరామచంద్రుడు యావత్ భారతదేశానికి కూడా గర్వకారణం అంటారు. కొన్ని విమర్శలు ఉన్నా వాటి వెనుక కూడా సరైన హేతువులతో ఆలోచిస్తే దశావతారాలలో రాముడి అవతారం ప్రజలకు ఏదో చెప్పడానికే ఈ భూమి మీదకు వచ్చిందని ఖచ్చితంగా నమ్ముతారు. నవమి వైభవం!! నవమి రోజు రాముడు పుట్టాడు. అయితే అన్నిచోట్లా శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణం జరుపుతారు. భారతదేశంలో ఉన్న ఎన్నో ప్రసిద్ధ గుడులలో ఇంకా చిన్న చిన్న రాముడి కోవెలలో కూడా సీతారాముల కల్యాణం ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. తెలంగాణలో భద్రాచలంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట లోనూ రాముడి కల్యాణం, శ్రీరాముడి పట్టాభిషేకం ఎంతో బాగా చేస్తారు.  ఏకపత్నీ వ్రతుడు!! ఒకటే మాట, ఒకటే బాణం అనే క్రమంలో సాగే రాముడు జీవితంలో కూడా ఒక భార్యను మాత్రమే కలిగి ఉండటం చక్కని సందేశం. ఆ కాలానికి ఒకటికి పదిమందిని పెళ్లిళ్లు చేసుకుని వందలకొద్ది పిల్లల్ని కలిగిన రాజుల కాలంలో రాముడు సీతకు మాత్రమే జీవితంలో చోటిచ్చాడు. శివదనస్సును విరిచి మరీ సీతను సొంతం చేసుకున్న ఈ కౌసల్యా కుమారుడు తన జీవితంలో ఏ ఇతర ఆడదాని వైపు కన్నెత్తి చూడలేదంటే ఆశ్చర్యమేస్తుంది.  రామాయణం!! భారతీయ సాహిత్య చరిత్రలో ఇదొక అద్భుత గ్రంధం. ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన ఈ రామాయణం ఏడు కాండలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నతనం నుండి పిల్లలకు రామాయణాన్ని చెబుతూ ఉండటం వల్ల పిల్లల్లో గొప్ప వ్యక్తిత్వం అలవడుతుందని అంటారు. ఇదే నిజం కూడా.  ఇంకా ఇందులో రాముడు మాత్రమే కాకుండా సీత, లక్ష్మణుడు, రాముడి ప్రయాణంలో ఎదురయ్యే ఎందరో గొప్ప వ్యక్తిత్వాలుగా మనకు కనబడతారు.  హనుమంతుడు, జటాయువు, విభీషణుడు, సుగ్రీవుడు, వానర సైన్యం. ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు రామాయణంలో ఉంటారు.  వీళ్ళు మాత్రమే కాకుండా గుహుడు, శబరి లాంటి గొప్ప రామభక్తులు కూడా కనిపిస్తారు. అందుకే రామాయణం అంత గోపోయా గ్రంథమయ్యింది. కాలంతో పాటు నిలిచే ఉంది. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా సరే!! అవన్నీ పనిగట్టుకుని పుడుతున్నవి కాబట్టి ఈ రామాయణం ఆ రామ నామం ధర్మబద్ధమైన జీవితం మనిషి మనుగడ ఉన్నంతవరకు ఉంటాయి. రామనామం!! రాముడు గొప్పవాడా రామ నామం గొప్పదా అంటే రామ నామమే గొప్పది అంటారు. ఒక్కసారి రమానామాన్ని జపిస్తే వెయ్యిసార్లు ఇతర దేవుళ్లను జపించినట్టని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. వారధి కడుతున్న వానరసైన్యం ప్రతి రాయి మీద రామా అని రాసి సముద్రంలో వేస్తే అవి తేలుతున్నాయి. కానీ స్వయంగా రాముడే వాటిని సముద్రంలో వేస్తే అవి మునిగిపోయాయి. దీనిని బట్టి రాముడి కంటే రామ నామమే ఎంతో గొప్పది అని అర్థమవుతుంది. త్యాగరాజు అంటాడు  నిధి చాల సుఖమా రాముని స న్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనసా అని రామదాసు అంటాడు ఓ రామ నీనామ శ్రీరామ నీనామ మేమి రుచిరా అని ఎన్ని రకాలుగా చూసినా రాముడి వంటి పురుషుడు, రామ నామమంత సులువైన శక్తివంతమైన అద్భుత మార్గం మరొకటి ఉండదు అని నిక్కచ్చిగా చెప్పచ్చు. ఈ శ్రీరామ నవమి నాడు ఆ రామచంద్రుడిని పలుకే బంగారయాయేనా కోదండపాణి అంటూ లాలనగా ప్రార్థిస్తూ పునీతులవుదాం. ఇంకా గుడిలో వడపప్పు, పానకం వేసవిలో కమ్మగా తినేసొద్దాం.  ◆వెంకటేష్ పువ్వాడ.                           
  మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం.  అయితే ప్రతి మనిషి తన జీవితంలో కొన్ని విషయాలను ఎవరికీ చెప్పకూడదు అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు.  మనిషి జీవితంలో ఏ విషయాలు ఇతరులకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు? తెలుసుకుంటే.. ఆర్థిక పరిస్థితి గురించి  ఆదాయం, బ్యాంకు బ్యాలెన్స్, పెట్టుబడులు లేదా ఏ రకమైన లోన్ గురించైనా సమాచారాన్ని ఎవరితోనైనా పంచుకోవడం ప్రమాదకరం కావచ్చు.  కొన్నిసార్లు ఇలాంటి  సమాచారాన్ని చాలా మంది పుకారు అని వ్యక్తిత్వాన్ని చిన్నతనం చేయడం, లేదా సమాచారాన్ని అనుసరించి తప్పుడు పనులకు పాల్పడటం జరిగే అవకాశం ఉంటుంది.  ఉదాహరణకు.. ఏదైనా పెద్ద ఆస్తిని కొనుగోలు చేశారని లేదా ఏదైనా పెద్ద వస్తువు లేదా బంగారం లాంటివి కొనుగోలు చేశారని  ఎవరికైనా చెబితే..అది కాస్తా అందరికీ తెలుస్తూ చివరికి  దొంగతనం లేదా మోసపోవడానికి  దారితీయవచ్చు. అందువల్ల, ఆర్థిక విషయాలలో గోప్యతను పాటించడం ఎల్లప్పుడూ సురక్షితం. ఆరోగ్యం, వైద్య సమాచారం.. ఆరోగ్యం,  మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం చాలా సున్నితమైనది.  తీవ్రమైన అనారోగ్యాలు, మందుల అవసరాలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలను నమ్మకమైన వ్యక్తికి లేదా వైద్యుడికి మాత్రమే చెప్పడం మంచిది.   ఉదాహరణకు..  దీర్ఘకాలిక అనారోగ్యం ఉందని ఎవరికైనా చెబితే.. ఆ విషయం తప్పుడు వ్యక్తుల చేతికి వెళితే సామాజికంగా లేదా వృత్తిపరంగా నష్టం చేకూరే స్థితికి దారితీయవచ్చు. ఇష్టమైన, ఇష్టం లేని విషయాలు.. మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కూడా కొన్నిసార్లు ఇతరుల నుండి వ్యంగ్యానికి లేదా విమర్శకు మూలంగా మారవచ్చు.  వ్యక్తిగత ఇష్టాఇష్టాలను ఇతరులకు చెప్పినప్పుడు వాటిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటే  ఎగతాళి చేయవచ్చు. కాబట్టి,  ఇష్టాయిష్టాలను నమ్మకమైన స్నేహితులకు మాత్రమే తెలియజేయండి. రిలేషన్స్, పర్సనల్ లైఫ్.. రిలేషన్స్ గురించి,  వ్యక్తిగత విషయాల గురించి బహిరంగపరచడం  గోప్యతకు భంగం కలిగించవచ్చు.  ఉదాహరణకు.. ఒక వివాదాన్ని లేదా కుటుంబ సమస్యను సోషల్ మీడియాలో లేదా మూడవ వ్యక్తితో పంచుకోవడం  ప్రతిష్టను దెబ్బతీస్తుంది. అలాగే  ఆత్మగౌరవానికి భంగం కలిగేలా చేస్తుంది.  అంతేకాదు..  బంధాల మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది.                                 *రూపశ్రీ.
భారతీయ వంటగదిలో వెల్లుల్లి ఒక ముఖ్యమైన పదార్థం. వెల్లుల్లి లేకుండా చాలా కూరలకు ఆ రుచి ఉండదు. కానీ వెల్లుల్లి కేవలం రుచిని పెంచేది మాత్రమే కాదు, చాలా వ్యాధులకు ఔషధం కూడా. ఆయుర్వేదం వెల్లుల్లిని వైద్య చికిత్సలో ఉపయోగిస్తుంది.  వెల్లుల్లి వాసన, ఘాటైన రుచితో ఆహారానికి రెట్టింపు రుచిని ఇస్తుంది.  అయితే  వెల్లుల్లి తినడం కంటే.. వెల్లుల్లి నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు.  ఇంతకీ వెల్లుల్లి నీరు ఆరోగ్యానికి  చేసే మలు ఏమిటి? వెల్లుల్లి నీటిని ఎలా తయారు చేసుకోవాలి?  పూర్తీగా తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తి.. వెల్లుల్లి నీరు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడే ఒక పానీయం. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వైరస్‌లు, బ్యాక్టీరియా మరియు ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి బలాన్ని ఇస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది వెల్లుల్లి నీరు తాగడం గుండె ఆరోగ్యానికి మంచిది. వెల్లుల్లికి రక్తపోటును తగ్గించే సామర్థ్యం ఉంది. ఇది రక్తనాళాలను విస్తరింపజేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, వెల్లుల్లి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. దీనివల్ల గుండెపోటు మరియు పక్షవాతం వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది వెల్లుల్లి నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగుల నుండి వ్యర్థాలను తొలగించి, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అజీర్ణం, గ్యాస్,  మలబద్ధకం వంటి సమస్యలకు ఇది ఒక మంచి ఔషదంగా పనిచేస్తుంది.. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీరు తాగితే చాలా మంచిది. బరువు.. వెల్లుల్లి నీరు బరువు అదుపులో ఉంచుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఇది శరీర జీవక్రియను పెంచి కొవ్వును కరిగిస్తుంది. ఆకలిని నియంత్రించడం ద్వారా   పదే పదే ఏదో ఒకటి తినాలని అనిపించే వారికి చాలా చక్కగా సహాయపడుతుంది. అందువల్ల, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి డ్రింక్. వ్యాధులు.. వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి నీరు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది,   చర్మం మీద ముడుతలు వంటివి పడకుండా చర్మం యవ్వనంగా ఉండటంలో సహాయపడుతుంది. వెల్లుల్లి నీరు ఎలా తయారు చేసుకోవాలంటే.. రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి పరగడుపున తాగాలి. కొన్ని రోజుల్లోనే చాలా మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు.                                      *రూపశ్రీ.
  హైందవులు జరుపుకొనే ప్రతి పండుగకీ ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. దాంతో పాటుగా ఆ సమయాలలో ఉండే వాతావరణం, లభించే వనరులు, ప్రబలే అనారోగ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని వివిధ సంప్రదాయాలను రూపొందించినట్లు కనిస్తుంది. వినాయకచవితి నాడు పత్రిపూజ, దీపావళి నాడు బాణాసంచా, ఉగాది నాడు వేపపచ్చడి... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగకీ కాలానుగుణమైన ఓ సంప్రదాయం జతగా సాగుతోంది. శ్రీరామనవమినాటి పానంకం కూడా అంతే! శ్రీరామనవమి మండువేసవిలో వస్తుంది. ఈ సమయానికి ఎండలే కాదు, గాడ్పులు కూడా మొదలవుతాయి. వేసవిలో బెల్లపు పానకాన్ని తీసుకోవడం వల్ల చాలా మేలే జరుగుతుంది. వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల... మన ఒంట్లో ఉండే ఖనిజాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కేల్షియంలు ఆ చెమట ద్వారా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. పానకంలో ఈ నాలుగు ఖనిజాలూ ఉంటాయి. శరీరం నుంచి వెళ్లిపోయిన ఖనిజాలను అలా పానకం భర్తీ చేస్తుందన్నమాట! ఇక బెల్లంలో ఉండే ఇనుము వేసవి తాపాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. అంతేకాదు, వేసవిలో అటూఇటూ ఊగిసలాడే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి. ఆయుర్వేదం ప్రకారం చూసినా పానకం వల్ల లాభాలెన్నో ఉన్నాయి. వేసవిలో తాపానికి పిత్తదోషాలు ప్రబలుతాయని ఆయుర్వేదం చెబుతోంది. దీనివల్ల అజీర్ణం, గుండెల్లో మంట, జుట్టు రాలడం, దద్దుర్లు, నిద్రలేమి లాంటి లక్షణాలు కనిపిస్తాయట. బెల్లానికి ఈ దోషాలను నివారించే గుణం ఉందంటారు ఆయుర్వేద వైద్యులు. ఇక బెల్లానికి ఉన్న మరో లక్షణం చలవ చేయడం. పైగా వేసవిలో వీలైనంత ఎక్కువగా నీరు తాగాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటి నీటిలో బెల్లాన్ని కలుపుకుని పానకంగా తాగడం ఎవరికి మాత్రం ఇష్టముండదు! తెలుగునాట పెళ్లిళ్లలో విడిదికి చేరుకున్న వరుని కుటుంబానికి పానకపు బిందెలను అందించే సంప్రదాయం ఉంది. పెళ్లిళ్లు ఎక్కువగా వేసవిలో జరుగుతాయి కాబట్టి... ఒక పక్క పెళ్లి పనులు, ప్రయాణాలు సాగించి మరో పక్క వేసవి తాపానికి అలసిన మగపెళ్లివారికి తిరిగి ఉత్సాహాన్ని కలిగించేందుకు, ఈ సంప్రదాయాన్ని నెలకొల్పి ఉంటారు.   బెల్లపు పానకంలో మిరియాలు, యాలుకలు కూడా వేస్తుంటారు. ఆయుర్వేదం ప్రకారం మిరియాలు, యాలుకలు కూడా జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయేలా తోడ్పడతాయి. వేసవిలో వచ్చే పొడిదగ్గుకి మిరియాలు గొప్ప ఔషధంలా పనిచేస్తే, యాలుకలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. పానకం గురించి ఇంత చెప్పుకున్నాక వడపప్పు గురించి కూడా ప్రస్తావించి తీరాల్సిందే! పెసరప్పుకి చలవ చేసే గుణం ఉందంటారు. అంతేకాదు! అతి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలలో పెసరపప్పు ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించేందుకు, బరువు తగ్గించుకునేందుకు ఇప్పడు చాలామంది పాశ్చాత్యులు కూడా పెసరపప్పుతో చేసిన కట్టుని (సూప్‌) తాగడం మొదలుపెట్టారు. మనం ఆడుతూపాడుతూ తాగే వడపప్పు, పానకాల వెనుకాల ఇంత శాస్త్రం ఉందన్నమాట!   ..నిర్జర.
మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలో కనిపించే చాలా లక్షణాలను చాలా సార్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా శరీరంలో కనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం అనేది  కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతాలు కావచ్చని వైద్యులు అంటున్నారు. మరీ ముఖ్యంగా అందరికీ కాకుండా కొందరికి మాత్రమే మూత్రపిండాల సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నేటికాలంలో చర్మ సంరక్షణలో భాగంగా చాలా రకాల క్రీములు వాడుతూ ఉంటారు.  ఇవి కూడా మూత్రపిండాల సమస్యకు కారణం అవుతాయి అనే మాట చాలా చర్చలకు దారి తీస్తోంది.   మూత్రపిండాల సమస్యకు అసలు కారణాలు ఏంటి? మూత్రపిండాల సమస్య ఎవరిలో ఎక్కువ వస్తుంది? వివరంగా తెలుసుకుంటే.. రెండు రూపాలు.. మూత్రపిండాల వ్యాధులు రెండు రూపాలలో వస్తాయి.  మధుమేహం వల్ల వచ్చే మూత్రపిండాల వ్యాధి మొదటిది. 50 శాతం మందికి మధుమేహం కారణంగా మూత్రపిండాల వ్యాధి వస్తుంది. అధిక రక్తపోటు మరొక కారణం. మూత్రపిండాల్లో రాళ్లు,  ఇన్ఫెక్షన్లు కూడా ఈ వ్యాధికి ఇతర కారణాలు. జన్యుపరంగా,  ఇతర మందులు తీసుకోవడం వల్ల కూడా మూత్రపిండాల వ్యాధి రావచ్చు. తాత్కాలిక,  శాశ్వత మూత్రపిండాల వ్యాధులు కూడా ఉన్నాయి. తాత్కాలిక మూత్రపిండాల వ్యాధి.. మలేరియా, డెంగ్యూ జ్వరం లేదా లెప్టోస్పిరోసిస్ వంటి వ్యాధి వచ్చినప్పుడు,  మూత్రపిండాలు తాత్కాలికంగా పనిచేయడం ఆగిపోతాయి. ఈ పరిస్థితిలో డయాలసిస్ అవసరం కావచ్చు. లేదా మందులతో దీనిని నయం చేయవచ్చు. ధీర్షకాల మూత్రపిండాల వ్యాధి.. కొంతమందికి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉండవచ్చు. ఇది మధుమేహం,  అధిక రక్తపోటు కారణంగా వచ్చే అవకాశం ఉంటుంది. సరైన సమయంలో చికిత్స చేయకపోతే, చివరికి  డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడి అవసరం  ఏర్పడుతుంది. లక్షణాలు.. మూత్రపిండాల వ్యాధికి తరచుగా ఎలాంటి లక్షణాలు ఉండవు. అందుకే చాలామంది  దానిని పట్టించుకోరు. ఏదైనా అనుమానం వచ్చి పరీక్ష చేయించుకున్నప్పుడు మాత్రమే రక్తంలో క్రియాటినిన్ స్థాయి ఎక్కువగా ఉందని తెలుస్తుంది. మూత్రపిండాల వైఫల్యానికి అత్యంత సాధారణ లక్షణం కాళ్ళలో నీరు చేరడం. ఇతర లక్షణాలలో లైట్ గా చలి, నొప్పి, జ్వరం, లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే చలి,  వెన్నెముకకు ఇరువైపులా నొప్పి వంటివి  ఉంటాయి. పాదాల వాపు మూత్రపిండాల వ్యాధి లక్షణం అని ఖచ్చితంగా చెప్పలేము. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా పాదాల వాపు రావచ్చు. జీవనశైలిలో మార్పులు కూడా మూత్రపిండాల వ్యాధికి కారణం కావచ్చు. మద్యపానం, ధూమపానం, జంక్ ఫుడ్ తినడం,  ఊబకాయం వంటివన్నీ మూత్రపిండాల వ్యాధికి దారితీసే పరిస్థితులు. మూత్రం రంగు మారడం, మూత్రంలో రక్తం కనిపించడం,  మూత్ర విసర్జనలో ఇబ్బంది కూడా మూత్రపిండాల వ్యాధి లక్షణాలే. చర్మాన్ని తెల్లబరిచే క్రీములతో మూత్రపిండ వ్యాధులు.. చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ఉపయోగించే క్రీములు మూత్రపిండాలకు హాని కలిగించవచ్చని వైద్యులు అంటున్నారు. వైద్యపరంగా ఉపయోగించే క్రీములు సాధారణంగా పెద్ద సమస్యలను కలిగించవు.  కానీ చాలామంది అందం మీద పిచ్చితో సోషల్ మీడియాలో కనిపించే ప్రమోషన్ యాడ్స్,  ఇంటర్నెట్ లో కనిపించే పేక్ రివ్యూస్ చూసి సొంతంగా క్రీములు ఎంచుకుని వాడుతుంటారు. అలాంటి క్రీములలో అధిక పరిమాణంలో పాదరసం ఉండవచ్చని అంటున్నారు. పాదరసానికి చర్మాన్ని తెల్లగా చేసే గుణం ఉంది. పాదరసం మూత్రపిండాలకు ప్రమాదకరమైన పదార్థం. మూత్రపిండాలకు హాని కలిగించే మరొక పదార్థం ఆర్సెనిక్. చాలా క్రీములలో వీటన్నింటి పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలం పాటు  వాడటం వల్ల, ఇది చర్మం ద్వారా రక్తంలో కలిసి మూత్రపిండాలకు చేరి ప్రమాదం కలిగిస్తుందని పరిశీలనలలో తేలింది. వైద్య సలహా లేకుండా ఎలాంటి క్రీములు వాడకుండా ఉండటం చాలా ఉత్తమం అని వైద్యులు చెబుతున్నారు.                                  *రూపశ్రీ.