ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసేశారు. ఉగాది తరువాత ఏక్షణంలోనైనా కేబినెట్ ఎక్స్ పాన్షన్ ఉంటుందా అంటే తెలుగుదేశం వర్గాల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. కేవలం విస్తరణకే పరిమితం కాకుండా కేబినెట్ లో మార్పులూ, చేర్పులతో పూర్తి స్థాయి ప్రక్షాళన జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని దేశం వర్గాలు అంటున్నాయి. మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున  మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.  తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే  కూటమి భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీల నుంచి కూడా కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు ఆయా పార్టీలతో చర్చలు జరపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.    ఇటీవలి కాలంలో ఆయన కొందరు మంత్రుల పనితీరును విమర్శించిన సందర్భాలను ఇందుకు ఉదాహరణగా తెలుగుదేశం వర్గాలు ఉటంకిస్తున్నాయి. మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి పని తీరు సంతృప్తికరంగా లేని మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత మంత్రివర్గ ప్రక్షాళనపై చంద్రబాబు దృష్టి కేంద్రీకరించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.  
  రాజ్యసభ  ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. కమలం పార్టీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్, శివేశ్ కుమార్, బిహార్ నుంచి ఎంపిక కానున్నారు. అస్సాం నుంచి తెరాశ్ గోవల్ల, జోగెన్ మోహన్, ఛత్తీస్‌గఢ్ నుంచి లక్ష్మీ వర్శ, హరియాణా నుంచి సంజయ్ భాటియా, ఒడిశా నుంచి మన్మోహన్ సమాల్, సుజీత్ కుమార్, పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హాను కాషాయ పార్టీ ఎంపిక చేసింది. ఈ నెల 16న ఎన్నికలు జరగనున్నాయి.10 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో తెలంగాణ నుంచి 2 స్థానాలు ఖాళీ కానున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ పదవీ కాలం ముగియనుంది. వీరి పదవి కాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగియనుండటంతో  రాజ్యసభ ఎంపీల ఎన్నిక అనివార్యమైంది.  కాగా రాజ్యసభ ఎన్నికకు సంబంధంచి ఫిబ్రవరి 26న నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. మార్చి 5న నామినేషన్లకు చివరి తేదీ కావడంతో రెండు రోజుల్లో రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. కాగా రాజ్యసభ సభ్యుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ చేసింది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్‌ ఆశించి  రాకపోయినప్పటికీ పార్టీ గెలుపుకు కృషి చేసిన నేతలకు ఈ సీట్లు కేటాయించాలనే అంశంపై పార్టీ నాయకుల మధ్య చర్చ జరిగింది. కాగా, రాజ్యసభ ఎంపీల రేసులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వీ హన్మంతరావు, బెల్లయ్య నాయక్, దొమ్మాటి సాంబయ్య పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.   
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.  తాజాగా దైవ సన్నిధిలో వీరిరువురి మధ్యా విభేదాలు రచ్చకెక్కాయి.  ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఎంపీ చేతిలో ఉన్న పట్టువస్త్రాలను ఎమ్మెల్యే కొలికపూడి బలవంతంగా లాక్కుని సమర్పించడం వివాదానికి దారి తీసింది. వివరాలిలా ఉన్నాయి.   నెమలి వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో  భాగంగా సోమవారం (మార్చి 2) రాత్రి  స్వామివారి కల్యాణం జరిగింది. దీనికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి  శ్రీనివాసరావులు హాజరయ్యారు.  ఈ సందర్భంగా, స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్యా  తోపులాట జరిగింది.   పోలీసుల జోక్యంతో  పరిస్థితి సద్దుమణిగింది. ఎంపీ కేశినేని చిన్ని సంయమనంతో వ్యవహరించి తన తన వర్గీయుల వారించి ఘర్షణ జరగకుండా నివారించారు.   అనంతరం కల్యాణ మండపంలో ముందు వరుసలో ఎమ్మెల్యే దంపతులు, వెనుక వరుసలో ఎంపీ దంపతులు కూర్చున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు.  https://youtube.com/shorts/cqEuEY4upRA?si=1HJqGIXv6Othn2Ip
ALSO ON TELUGUONE N E W S
  -వరలక్ష్మి శరత్ కుమార్ మరో నట విశ్వరూపం  -దర్శకురాలిగా హిట్ ని అందుకుంటుందా! -ట్రైలర్ తో భారీ అంచనాలు  ఆడ అయినా, మగ అయినా సినీ వారసత్వం పొందడం సులభం. కానీ వారసత్వాన్ని మించిన గుర్తింపు తెచ్చుకోవడం ఏ కొద్దీ మంది వల్లనో అవుతుంది. ఆ కొద్దీ మందిలో వరలక్ష్మి శరత్ కుమార్(Varalaxmi sarath kumar)ఒకరు. సుప్రీం స్టార్ శరత్ కుమార్(Sarath Kumar)నట వారసురాలిగా అడుగుపెట్టి తన కోసమే క్యారెక్టర్స్ క్రియేట్ చేసే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు 'సరస్వతి' అనే మూవీతో దర్శకురాలిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించి ఈ నెల 6 న సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టనుంది. కొత్త ప్రయాణం అని అనుకుంటుంది గాని సరస్వతి ట్రైలర్ రిలీజ్ తర్వాత కొత్త డైరెక్టర్ అని ఎవరు అనుకోవడం లేదు. ట్రైలర్ తోనే సినిమా పరిస్థితి అర్ధమవుతుంది. రీసెంట్ గా ప్రమోషన్స్ లో భాగంగా  శరత్ కుమార్, తల్లి రాధిక, సోదరి పూజ, భర్త నికోలయ్ సచ్ దేవ్ తో వరలక్ష్మి  పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు మీకోసం.  శరత్ కుమార్ మాట్లాడుతు నటిగా ఎంత బిజీగా ఉన్నా దర్శకురాలిగా మారాలనే నిర్ణయం వరలక్ష్మికి చాలా స్పష్టంగా ఉంది. సెట్‌లో పనితీరుని చూసి ఆశ్చర్యపోయాను. సినిమాకి సంబంధించి ఏం కావాలో  ముందే తెలుసు. చాలా ఫోకస్ గా పని చేసింది. పాతకాలపు దర్శకుల్లాగా, మానిటర్ల సహాయం లేకుండానే షాట్ ఓకే చేయగలిగే నైపుణ్యం సొంతం. ఒక్కోసారి నిద్ర లేకుండా పని చేసేది. మల్టీటాస్కింగ్ చేయడంలో చాలా సమర్థురాలు. ఒక తండ్రిగా నా కూతుర్ని 'లయన్ హార్ట్' (Lion Heart) అని పిలవడం తన  ధైర్యానికి, సంకల్పానికి నిదర్శనమని శరత్ కుమార్  చెప్పుకొచ్చాడు. మిగతా వారు కూడా మాట్లాడుతు సరస్వతి కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, సమాజంలోని మహిళల కోసం ఒక బలమైన సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం. 'సరస్వతి' అంటే వరలక్ష్మికి ఒక విజన్. మహిళలని తక్కువ అంచనా వేయకూడదని, వారికి ఉండాల్సిన గౌరవం మరియు హక్కుల గురించి  మాట్లాడుతుంది. తన నిజ జీవితంలో కూడా ఫెమినిజం, స్త్రీత్వం (Femininity) మధ్య సమతుల్యతని పాటిస్తూ, అవే విలువలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు వరలక్ష్మి. సింపుల్ గా చెప్పాలంటే సరస్వతి’మూవీ విజన్ మహిళా సాధికారత. వరలక్ష్మి సోదరి పూజ నిర్మాతగా కీలక పాత్ర పోషించడంతో పాటు అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే అనుబంధం పని దగ్గరకి వచ్చేసరికి  ప్రొఫెషనల్ గా ఉండేది. ఒకరి సృజనాత్మకతలో మరొకరు జోక్యం చేసుకోకుండా, ఒకరినొకరు నమ్ముతూ ‘సరస్వతి’ని అద్భుతంగా తీర్చిదిద్దారు. రాధిక గారి క్యారక్టర్ మూవీలో చాలా ముఖ్యమైనదని చెప్పుకొచ్చారు. వారసత్వాన్ని బాధ్యతగా స్వీకరించి, తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైన వరలక్ష్మి శరత్ కుమార్ గారి ‘సరస్వతి’ మనందరినీ ఆలోచింపజేస్తుందని ఆశిద్దాం. ఒక కూతురి ఎదుగుదలను చూసి మురిసిపోయే తండ్రి, తోడుగా నిలిచే సోదరి, అండగా ఉండే కుటుంబం... ఇవన్నీ కలిస్తేనే 'సరస్వతి'.ఈ సంభాషణ కేవలం సినిమా గురించే కాదు, ఒక కుటుంబం మధ్య ఉండే బంధం, వృత్తి పట్ల వారికి ఉన్న అంకితభావం గురించి కూడా చెబుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్, రాధిక తో పాటు ప్రియమణి(Priyamani),ప్రకాష్ రాజ్(Prakash Raj)చేస్తుండటం సరస్వతి కి ఉన్న మరో బలమైన అట్రాక్షన్. థ్రిల్లర్ డ్రామా గా తెరకెక్కింది. also read:  Peddi.. 1000 కోట్లు పక్కా!.. ఈ ఇద్దరే సాక్ష్యం మరిన్ని ఆసక్తికరమైన ఇంటర్వ్యూలు మరియు సినిమా అప్‌డేట్స్ కోసం మా తెలుగు వన్ సినిమా(Telugu One cinema) యూట్యూబ్ ఛానల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి! స్టే ట్యూన్ తెలుగు వన్ సినిమా. ఛానల్ మటుకు మార్చకండి.    
Rumours in Film Circles about high budget and highly popular films are not new. Several reports do rounds until the release. Some state facts, some try to force a narrative, some are released by makers to gain even more buzz while some end up being over speculations taking one small idea discussed by director or producer in meetings.  Now, a rumor is going around about Kamal Haasan and Rajinikanth reunion film, directed by Nelson Dilipkumar. The movie makers have approached Rajiv Menon, a renowned cinematographer to work for the film. Many thought, he would be able to balance both of them, given his experience.  But recent rumors state that the makers brought him on board to shoot the film in 70MM film format, giving an ode to their peak stardom, time period. Both seniors worked during film camera innovation till the digital age without great dip in their popularity.  On top of it, makers are planning this move as Christopher Nolan been doing it for his films for years. The makers want to explore shooting on film roll without digital cameras. As Nolan does it, they believe it can be pulled off and that too bringing retro style would be perfect in such condition, it seems. Let's see if that is the case or not.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
'ఐరన్ మ్యాన్' సుబ్బారావు ప్రేమ కథ! 30 ఏళ్ళ క్రితం ఈ ఆలోచన ఎలా వచ్చింది? తెలుగు సినిమాల్లో ఎస్.వి. కృష్ణారెడ్డి మార్కు కామెడీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వైవిధ్యమైన కథను తీసుకొని, కుటుంబ సమేతంగా చూసేలా వినోదభరితంగా తెరకెక్కించడం ఆయన శైలి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన విజయవంతమైన చిత్రాలలో 'ఘటోత్కచుడు'(Ghatothkachudu) ఒకటి. ఎప్పుడో 30 ఏళ్ళ క్రితమే రోబో పాత్రను సినిమాలో చూపించడం కృష్ణారెడ్డికే చెల్లింది. 1995లో వచ్చిన ఫాంటసీ కామెడీ ఫిల్మ్ 'ఘటోత్కచుడు'లో రోబో అయిన సుబ్బారావు, నటి రోజా మధ్య జరిగే సంభాషణలు అత్యంత హాస్యాస్పదంగా ఉంటాయి. రోజా ప్రేమలో రోబో పడటం అనేది భలే ఉంటుంది. 2010 లో రజినీకాంత్-శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 'రోబో' సినిమాలో ఇదే తరహా ట్రాక్ ఉండటం విశేషం.  'ఘటోత్కచుడు'లో రోబో సుబ్బారావు తనను తాను "మిస్టర్ బోన్స్ బాండ్" అని పిలుచుకుంటూ, రోజాపై తనకున్న ప్రేమను వినూత్నంగా వ్యక్తపరుస్తాడు. "నా బాడీలోని ప్రతి బోల్టు, ప్రతి వైరు, ప్రతి చిప్పు రోజా కోసం షేక్ అయిపోతున్నాయి" అంటూ ఆ రోబో చెప్పే డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. ఒక సందర్భంలో ఈ రోబో తనను కౌగిలించుకోమని రోజాను అడుగుతాడు. దానికి ఆమె సీరియస్ అవ్వడంతో, "నన్ను హర్ట్ చేస్తున్నావ్, నా మోటార్ బాధపడుతోంది" అంటూ ఆ రోబో ఏడవడం హైలైట్ అని చెప్పవచ్చు.  అంతేకాకుండా, రంగ(ఆలీ)తో కలిసి ఈ రోబో చేసే రచ్చ, ఒక కిడ్నాపర్‌ను పట్టుకోవడానికి "టీజింగ్ చిప్" మరియు రిమోట్ కంట్రోల్ ఫుట్‌బాల్‌ను ఉపయోగించి అతడిని ఆటాడుకునే సీక్వెన్స్ కూడా భలే ఉంటాయి. 'ఘటోత్కచుడు'లో ఇలాంటి ఎన్నో గొప్ప సీన్స్ ఉన్నాయి. 90వ దశకంలోనే తెలుగు సినిమాలో రోబో అనే వినూత్నమైన కాన్సెప్ట్‌ను, అప్పటి కాలమానానికి తగ్గట్టుగా గ్రాఫిక్స్‌ను ఉపయోగించి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలోని సోషియో-ఫాంటసీ అంశాలు, రోబో కామెడీ ట్రాక్ అప్పట్లో పిల్లలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 'ఘటోత్కచుడు' సినిమాలోని అద్భుతమైన సన్నివేశాలను 'తెలుగువన్'(TeluguOne) యూట్యూబ్ ఛానల్ లో చూడండి.  
  -'రైరై రారా' ప్రకంపనలు -యువతకి మోటివేషన్  -నిమిషాల్లోనే రికార్డు వ్యూస్  -అంచనాలు రెట్టింపు  మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న 'పెద్ది'(Peddi)సెకండ్ సాంగ్ రికార్డింగ్ స్టూడియో నుంచి ప్రత్యక్ష సినీ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. అడుగుపెట్టడమే కాదు అభిమానులు కాలర్ ఎగేరేసుకునేలా చేయడంతో పాటు చరణ్ ఆంజనేయుడు లాంటోడు, ఆంజనేయుడు లాగా చరణ్ కి తన శక్తి తెలియదని చెప్పిన రాజమౌళి మాటని కళ్ళ ముందు ఉంచాడు. ఇందుకు నిదర్శనంగా సెకండ్ సాంగ్  'రైరై రారా' యూ ట్యూబ్ చరిత్రలో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. పాటగానే కాకుండా, ఒక పవర్ ఫుల్ మోటివేషనల్ ఆంథమ్‌ అనే కీర్తిని కూడా పొందింది.  ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్(Ar Rehman)మ్యూజిక్ ని అందించడమే కాకుండా, స్వయంగా 'రైరై రారా'(Rai Rai Raa Raa)ని ఆలపించారు. చాలా మనసు పెట్టి  పాడాడనిపించడంతో పాటు పెద్ది కి పర్ఫెక్ట్ గా సూటయ్యిందనే కితాబు అందుకుంటున్నాడు. అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం ప్రతి యువకుడిని ఆలోచింపజేసేలా ఉంది. "నీ అయ్య చేసిన అప్పుకి నీ కొడుకు వడ్డీ కడితే ఎలా? నువ్వు మధ్యలో ఏదో ఒకటి చేయాలి కదా'. 'పాతికేళ్లకే పాతపడిపోకు"  మాట అనుకోకోయ్, గెలుపోంటోయ్ వెలుగు.. మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే.. ఆరు నూరైనా మందల్లో నుంచి వేరై రా.. నిన్నే నీ లోపల పాతేసుకోకు వంటి పదాలు యువతని లక్ష్యం వైపు నడిపించేలా ఉన్నాయి. టోటల్ గా సాంగ్ గురించి చెప్పాలంటే జీవితాన్ని ఆటలా కాకుండా సీరియస్‌గా ఒక లక్ష్యం వైపు సాగాలని, నిన్ను నువ్వు అంతం చేసుకోకుండా, ఎప్పటికప్పుడు కొత్తగా ప్రేరణ పొందుతు బతకాలని  చెబుతుంది. నిరాశ నిస్పృహలో ఉన్న వాళ్ళని సదరు సాంగ్  వెన్నుతట్టి ప్రోత్సహించడం గ్యారంటీ. ఇక సాంగ్ లో చరణ్ ఎనర్జీ చూస్తుంటే అభిమానులకి మొదటి మూవీ 'చిరుత' రోజులు గుర్తుకు వస్తున్నాయి. చరణ్ తన అభినయంతో, ఎనర్జిటిక్ మూమెంట్స్‌తో యువతని ఒక లక్ష్యం వైపు నడిపించే నాయకుడిగా ఫుల్ ఎనర్జి తో కనిపిస్తున్నాడు. అయితే ఆ ఎనర్జీకి ఇప్పుడు మరింత మెచ్యూరిటీ, పవర్ తోడయ్యాయి. జానీ మాస్టర్(Jani Master)కొరియోగ్రఫీలో వచ్చిన 'సిగ్నేచర్ స్టెప్స్', ముఖ్యంగా అలలు దొర్లుతున్నట్లుగా ఉండే చరణ్  మూమెంట్స్ ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులు చేస్తున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు(Buchibabu)కూడా పెద్ది మ్యూజిక్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా తెలుస్తుండటంతో పాటుపాన్ ఇండియా డైరెక్టర్‌గా తన ముద్ర వేయడం ఖాయమనిపిస్తోంది. సాంకేతిక కారణాల వల్ల పాట విడుదల కొంచెం ఆలస్యమైనా,  బుచ్చిబాబు ఒక చిన్న వీడియో క్లిప్ ని వదిలి  ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచాడు. ఆ కమిట్ మెంట్ ని బట్టి రెహమాన్ నుండి తనకి కావాల్సిన అవుట్‌పుట్‌ ని  బుచ్చిబాబు చాలా ఓపిగ్గా, స్నేహపూర్వకంగా అడిగి మరీ చేయించుకుంటున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన చికిరి సాంగ్ ఒక్క తెలుగులోనే 178 మిలియన్స్ వ్యూస్ ని క్రాస్ చేసి, ఏ రికార్డు నంబర్ దగ్గర ఆగుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు  'రై రై రా రా' కూడా అదే బాటలో పయనిస్తుండటం విశేషం. ఇక ఈ సాంగ్ ద్వారా అర్ధమైన కొత్త విషయం ఏంటంటే కేవలం పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ మార్కెట్‌ ని పెద్ది టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఏప్రిల్‌ 30 న విడుదల కానున్న నేపథ్యంలో 'రై రై రా రా' ఇచ్చిన జోష్‌తో ప్రమోషన్లు మరింత వేగవంతం కానున్నాయి. డబ్బింగ్ పనులు కూడా ఇప్పటికే మొదలయినట్టుగా తెలుస్తుంది. చరణ్ సరసన అచ్చాయమ్మా గా జాన్వీ కపూర్(Janhvi Kapoor)జత కడుతుండగా, శివ రాజ్ కుమార్, జగపతి బాబు ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన ముఖ్యమైన క్యారెక్టర్స్.పెద్ది లోని కంటెంట్ తో పాటు చరణ్ లుక్స్  చూస్తుంటే సులభంగా 700 నుంచి 1000 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే  ఈ ఏడాది 'మెగా ఫెస్టివల్' ఖాయమని చెప్పవచ్చు.  also read: renu desai: పోలీస్ స్టేషన్ కి రేణుదేశాయ్.. కంప్లైంట్ లో వాళ్ళ పేర్లు ఉండటం కరెక్టేనా! పెద్ది కి సంబంధించిన ప్రతి అప్ డేట్ ఎక్స్ క్లూజివ్ గా మా తెలుగు వన్ సినిమా(Telugu one Cinema)ఛానల్ లో అందుబాటులో ఉంటుంది. మరిన్ని సినీ న్యూ  అప్‌డేట్స్ కూడా అందుబాటులో ఉంటాయి .ఇంకా మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోకపోతే సబ్ స్క్రైబ్ చేసుకోవడంతో పాటు కింద ఉన్న వీడియో కూడా చూడండి. స్టే ట్యూన్ తెలుగు వన్ సినిమా.  
శివాజీతో 'తెలుగువన్' ప్రత్యేక ఇంటర్వ్యూ టాలీవుడ్ ని అవమానిస్తే సహించేది లేదు తాప్సీ తీరుపై అసహనం నోటికొచ్చినట్లు మాట్లాడకూడదు ప్రముఖ నటుడు శివాజీ(Sivaji) ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు. మార్చి 6న 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్న ఆయన.. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా 'తెలుగువన్'కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. (Sampradayini Suppini Suddapoosani) ఈ ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారు. ముఖ్యంగా సౌత్ సినిమాలతో పేరు తెచ్చుకొని.. బాలీవుడ్ కి వెళ్ళాక సౌత్ ఇండస్ట్రీ గురించి చులకనగా మాట్లాడుతున్న వారిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇటీవల తాప్సీ తాను సౌత్ ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కామెంట్స్ చేయగా, ఆమె తీరుని శివాజీ తప్పుబట్టారు. తెలుగు ఇండస్ట్రీ మహాసముద్రం.. అవమానిస్తే సహించేది లేదు తెలుగు చిత్ర పరిశ్రమ అంటే కేవలం రంగుల ప్రపంచం మాత్రమే కాదు, అది వేల మందికి అన్నం పెట్టే ఒక మహాసముద్రం. ఈ మధ్య కాలంలో కొందరు నటీనటులు సౌత్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుని, ఇక్కడ సంపాదించుకుని, బాలీవుడ్ వెళ్ళాక మన ఇండస్ట్రీని చులకనగా మాట్లాడటం ఒక అలవాటుగా మార్చుకున్నారని శివాజీ తీవ్రంగా మండిపడ్డారు. గతాన్ని మర్చిపోవద్దు: ఇక్కడ పని చేసి, లాంగ్ టర్మ్ కెరీర్ నిర్మించుకుని, తీరా వెళ్ళిపోయేటప్పుడు ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడటం ఏంటని ఆయన ప్రశ్నించారు.  డ్రామాలు వద్దు: ఏదైనా సమస్య ఉంటే అది జరిగినప్పుడే మాట్లాడాలి కానీ, 15 లేదా 20 ఏళ్ళ తర్వాత మైకులు ఉన్నాయి కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడితే అది కేవలం అటెన్షన్ కోసమే అవుతుంది. సాక్ష్యాలు లేకుండా ఎవరిపైన పడితే వారిపై ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు. మౌనమే సమాధానం: ఇలాంటి అనవసరపు విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మన ఇండస్ట్రీ గొప్పతనం మనకు తెలుసని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియా: ఒక విప్లవం.. ఒక ప్రమాదం సోషల్ మీడియా అనేది నేడు ఒక రెవల్యూషన్(విప్లవం) అని శివాజీ అభిప్రాయపడ్డారు. దీని వల్ల మంచి జరుగుతున్నప్పటికీ, నెగిటివిటీ కూడా అంతే వేగంగా వ్యాపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వానికి నిదర్శనం: ఒక చిన్న పాప(పునర్విక) వైద్యం కోసం కోట్ల రూపాయలు సోషల్ మీడియా ద్వారా వసూలవ్వడం మన సమాజంలోని గొప్పతనానికి నిదర్శనం. శివాజీ కూడా స్వయంగా ఆ పాపకు సహాయం చేయడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే భారీగా విరాళాలు రావడంతో ఆ ట్రాన్సాక్షన్ బ్లాక్ అయిందని ఆయన వివరించారు. నియంత్రణ అవసరం: ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పిల్లల కోసం సోషల్ మీడియాను కంట్రోల్ చేసినట్లు, మన దగ్గర కూడా అలాంటి కట్టుదిట్టమైన చర్యలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.  ప్రైవసీ కరువు: ఈ రోజుల్లో ప్రతి మాటా ఒక కంటెంట్ అయిపోతోందని, ఎక్కడ కెమెరాలు ఉంటాయో తెలియని అభద్రతా భావంలో బతుకుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు,. నిత్యం ప్రజల కోసం.. నిరంతరం సినిమా కోసం సినిమా షూటింగ్ లేకపోయినా శివాజీ దినచర్య చాలా క్రమశిక్షణతో కూడి ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం: స్క్రీన్ మీద సన్నగా, ఫిట్‌గా కనిపించడానికి ఆయన కఠినమైన డైట్ మరియు ఎక్సర్సైజ్ పాటిస్తారు.  జనం కోసం మాట: తను ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటానని, జనం కోసం మాట్లాడటం ఎప్పటికీ ఆపనని ఆయన ధీమాగా చెప్పారు. శివాజీ మాటలు వింటుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ పట్ల ఆయనకు ఉన్న గౌరవం, సమాజం పట్ల ఉన్న బాధ్యత స్పష్టంగా కనిపిస్తున్నాయి.  పూర్తి ఇంటర్వ్యూ మరియు మరిన్ని ఆసక్తికర అప్‌డేట్స్ కోసం మా తెలుగువన్ యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి.  
  -అప్పుడే  అయిపోందనుకోకండి  -ఇప్పుడే మొదలైంది  -రేణుదేశాయ్ అంటే ఏమనుకుంటున్నారు -కేసు నమోదు చేసిన పోలీసులు రేణుదేశాయ్(Renu Desai)..వరుసగా సినిమాలు చేస్తుండకపోయినా సినీ సెలబ్రటీ హోదా మాత్రం తనని వదిలి వెళ్లడం లేదు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan)మాజీ వైఫ్ అనే ట్యాగ్ లైన్ తో పాటు బద్రి, జానీ మూవీల హీరోయిన్ అవ్వడమే అందుకు కారణం. మంచి క్యారెక్టర్స్ వస్తే సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా ఇటీవల చెప్పిన రేణు దేశాయ్ రీసెంట్ గా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. దీంతో సోషల్ మీడియా మిగతా వైరల్ న్యూస్ ని పక్కన పెట్టి రేణుదేశాయ్ ని లూప్ లైన్ లోకి తీసుకొచ్చింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.  ఇటీవల రేణు దేశాయ్ వీధి కుక్కల విషయంలో మాట్లాడుతు 'కొన్ని స్ట్రీట్ డాగ్స్ దాడి చేస్తే మిగతా వాటిపై దాడులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ వ్యాఖ్యలని వక్రీకరిస్తూ కొంత మంది హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. పర్సనల్ లైఫ్, పిల్లలపై అసభ్యకరమైన కామెంట్స్ చెయ్యడంతో పాటు జుగుప్స కలిగించే విధంగా ట్రోల్ చేస్తున్నారు. సదరు ట్రోల్ల్స్ తారా స్థాయికి చేరుకోవడంతో రేణు దేశాయ్ తాజాగా హైదరాబాద్ నగర పరిధిలోని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించింది. ట్రోల్స్ స్క్రీన్ షాట్లని పోలీసులకి అందచేయడంతో పాటు అసభ్యకర పోస్టులు చేసిన వారి వివరాలతో పాటు కామెంట్స్ స్క్రీన్ షాట్లని పోలీసులకి అందజేశారు. also read:  మెగా ఫ్యాన్స్ కి షాక్... నోట్ రిలీజ్  తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌పై కూడా చర్యలు తీసుకోవాలని రేణు దేశాయ్ తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రేణు దేశాయ్ ఇందుకు సంబంధించి వీడియో కూడా రిలీజ్ చేసింది. సదరు వీడియోలో ఆమె మాట్లాడుతు నా వ్యక్తిత్వాన్నే కాకుండా, శరీర భాగాల గురించి, పిల్లల గురించి అత్యంత దారుణమైన భాషలో కామెంట్స్ చేసారు. కాశీ లాంటి పవిత్ర స్థలంలో ఉన్నప్పుడు కూడా అసహ్యమైన  మాటలతో దాడి చేసే స్థాయికి కొందరు దిగజారారని చెప్తు కన్నీటి పర్యంతమైంది.    
The highly anticipated song Rai Rai Raa Raa from the film Peddi has received a glowing endorsement from Megastar Chiranjeevi, who described the track as sheer fire on screen. Expressing his excitement, the legendary actor noted that the song is a stunning blend of energy, emotion, and cinematic brilliance. Watching Ram Charan perform with such effortless grace and electrifying speed filled him with immense pride, making it a joy to witness on the big screen. Chiranjeevi was quick to credit the creative minds who shaped this audio-visual treat, starting with director Buchi Babu Sana for his brilliant picturization. He praised the legendary A.R. Rahman for his magical composition and vocals, which added a unique soul to the high-octane track. The choreography by Jani Master also earned high marks for its power-packed execution, perfectly matching the intensity of the music and the lead actor’s agility. The technical excellence of the song was further highlighted by Chiranjeevi, who complimented cinematographer Rathnavelu for the magnificent visuals and Anantha Sriram for the meaningful lyrics. He also extended his appreciation to producer Venkata Skilaru for his unwavering support and for backing such a spectacular vision. According to the Megastar, the collaboration of these talented individuals has resulted in a world-class cinematic experience that resonates with the audience. In his concluding remarks, Chiranjeevi wished the entire team of Peddi many more milestones ahead as they continue their journey toward the film's release. His heartfelt appreciation has added to the massive buzz surrounding the project, solidifying the song’s position as a major highlight of the season. As fans celebrate this recognition, the momentum for Peddi continues to build, promising a high-energy cinematic treat for movie lovers everywhere.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
బంగళాలో ఉండేవాడికి బజారు బుద్ధులు ఉండొచ్చు, బజార్లో ఉండేవాడికి బంగారం లాంటి మనసు ఉండొచ్చు.. ఇదీ సన్నివేశంలోని ప్రధాన అంశం. నందమూరి బాలకష్ణ పవర్‌ఫుల్ డైలాగుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కత్తి పట్టి డైలాగులు చెప్తే అభిమానులు వెర్రెత్తి పోతారు. అయితే అలాంటి ఫెరోషియస్ క్యారెక్టర్‌లోనే కాదు, ఫ్యామిలీ డ్రామాను నడిపించడంలో, సెంటిమెంట్‌ను పండించడంలోనూ ఆయనకు ఒక శైలి ఉంది. ఫ్యామిలీని సరిదిద్దే బాధ్యతగల కొడుకుగా, చెల్లెలి కాపురాన్ని నిలబెట్టే అన్నయ్యగా కనిపించే ఈ సినిమా పేరు ‘టాప్ హీరో’. నందమూరి బాలకష్ణ, ఎస్.వి.కష్ణారెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ఏకైక సినిమా ఇది. సౌందర్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రోహిణి హట్టంగడి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, తనికెళ్ళ భరణి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కథ విషయానికి వస్తే.. అస్తవ్యస్తంగా ఉన్న కుటుంబాన్ని ఒక దారికి తెచ్చేందుకు, అక్కడ ఉన్న దుష్ట శక్తులకు బుద్ధి చెప్పేందుకు హీరో కంకణం కట్టుకుంటాడు. అందులో భాగంగానే చెల్లెలి కాపురాన్ని నిలబెడతాడు. అయితే అతను ఆ ఇంట్లో ఉండడం ఎవరికీ ఇష్టం ఉండదు. ఆఖరికి చెల్లెలు కూడా అతన్ని అసహ్యించుకుంటుంది. ఆమె భర్త తిరుగుబోతు. ఆమె కళ్ళ ముందే మరో స్త్రీతో సరసాలాడుతూ ఉంటాడు.  ఇది చూసి ఆమె కుమిలిపోతుంది. వాళ్ల కాపురాన్ని సరిదిద్దుతానని చెల్లెలితో చెప్తాడు. కానీ, ఒక బజారు రౌడీ సహాయం తనకు అక్కర్లేదు అని ఇంట్లోకి వెళ్లి ఏడుస్తుంటుంది. ఇదే అదనుగా వారి ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్న దాసు ఆమెపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నిస్తాడు. అతన్నుంచి తప్పించుకొని బయటికి వస్తుంది. అప్ప్పుడు బాలకష్ణ ‘బంగళాలో ఉండేవాడికి బజారు బుద్ధులు ఉండొచ్చు, బజార్లో ఉండేవాడికి బంగారం లాంటి మనసు ఉండొచ్చు’ అంటాడు.  ఆమెపై అఘాయిత్యం చెయ్యాలని ప్రయత్నించిన దాసుకి బుద్ధి చెప్పాలంటే.. నర్తనశాల సినిమాలో భీముడు ఏం చేశాడో అదే చేస్తే సరి అని చెల్లెలికి చెప్తాడు. ఒక పథకం ద్వారా దాసుకి ఇద్దరూ కలిసి బుద్ధి చెబుతారు. దాసుని అలా చెయ్యమని చెప్పింది హీరో మామ. దాసుని తీసుకొని అక్కడికి వెళ్లి తనదైన శైలిలో ‘మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేసావనుకో, వీడికి నర్తనశాల సీన్ పెట్టినట్టు నీకు కురుక్షేత్రం సీన్ పెడతా” అంటూ వార్నింగ్ ఇస్తాడు. సినిమాలో ఈ సీన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.  ఈ సన్నివేశంలో వినోదం మాత్రమే కాదు, ఆత్మాభిమానం, మహిళా గౌరవం పట్ల ఉన్న నిబద్ధత వంటి విషయాలు కనిపిస్తాయి. బాలకృష్ణ సినిమాల్లో ఇలాంటి సామాజిక అంశాలను మాస్ ఎలిమెంట్స్‌తో కలిపి చూపిస్తుంటారు. అన్యాయం ఎక్కడ జరిగినా, ఎవరికి జరిగినా దాన్ని ఎదిరించే ధైర్యం, వారికి బుద్ధి చెప్పే తెలివి ఉండాలని ఈ సీన్ ద్వారా అర్థమవుతుంది. ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియోను క్రింద ఇస్తున్నాం. వీక్షించండి. అలాగే మా Teluguone Cinema ఛానల్‌ను Subscribe చేసుకోండి.  
    -లావణ్య త్రిపాఠి కోసం అంతా ఎదురుచూపులు  -నోట్ రిలీజ్ చేసిన బృందం   -కొత్త తేదీ ఎప్పుడు!  నాన్న నాకు త్వరగా పెళ్లి చేసెయ్యండి అనే ఒకే ఒక డైలాగ్ తో 'అందాల రాక్షసి' హోదాలో  ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi). సదరు చిత్రంలోని ఆమె రూపాన్ని స్క్రీన్ వాల్ పేపర్ గా పెట్టుకున్న యువత సంఖ్యకి లెక్కే లేదు. అందాల రాక్షసి డైలాగ్ ని నిజం చేస్తూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని తన రాకుమారుడిగా చేసుకున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా తన అప్ కమింగ్ మూవీకి సంబంధించిన న్యూస్ తో సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. లావణ్య త్రిపాఠి అప్ కమింగ్ మూవీ 'సతీ లీలావతి'(Sathi leelavathi). శాకుంతలం మూవీ ఫేమ్  దేవ్ మోహన్(Dev MOhan)హీరో. రిలీజ్ డేట్ మార్చి 6 అని గతంలోనే ప్రకటించారు. ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాలు బాగుండటంతో పాటు వివాహం తర్వాత లావణ్య ఫుల్ ఫ్లెడ్జెడ్ రోల్ లో కనిపిస్తున్న తెలుగు మూవీ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు సతీలీలావతి కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు మార్చి 6 న థియేటర్స్ లోకి అడుగుపెట్టడం లేదు. ఈ విషయమై మేకర్స్ ఒక నోట్ రిలీజ్ చేసారు. సదరు నోట్ లో సాంకేతిక కారణాల వల్ల నిర్ణయించిన తేదీన రిలీజ్ చేయలేకపోతున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం. ఏ విషయంలోను రాజీ పడకుండా అందరి  అంచనాలకి  అనుగుణంగా సతీలీలావతిని సిద్ధం చేస్తున్నామని నిర్మాణ సంస్థ 'దుర్గాదేవి పిక్చర్స్' పేర్కొంది. also read: Sivaji raja: శివాజీ రాజా ఇంట్లో తీవ్ర విషాదం  కామెడీ అండ్ థ్రిల్లింగ్ జోనర్ లో తెరకెక్కుతున్న సతీలీలావతికి  తాతినేని సత్య(Thathineni sathya)దర్శకుడు.   సత్య నుంచి ఇప్పటికే భీమిలి కబడ్డీ జట్టు, శివ మనసులో శ్రుతి, శంకర వంటి చిత్రాలు వచ్చాయి. నరేష్, వీటీవీ గణేష్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్, జాఫర్ సాదిక్, జోషి ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపిస్తుండగా సీనియర్ ప్రొడక్షన్ సంస్థ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పించడం విశేషం.      
  -ప్రత్యేకమైన నటుడిగా గుర్తింపు  -ఈ రోజు ఉదయమే జరిగిన సంఘటన  -శివాజీ రాజా కి పరామర్శల వెల్లువ  ప్రముఖ నటుడు 'శివాజీరాజా'(Sivaji Raja)కి సినీ రంగంతో ఉన్న అనుబంధం సుదీర్ఘమైనది. పది మంది నటుల్లో ఒకడిగా కాకుండా శివాజీ రాజా అనే ప్రత్యేకమైన నటుడు ఉన్నాడనే కీర్తిని ప్రేక్షకుల నోటి నుంచి వచ్చేలా చేసుకున్నాడు. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకి ఆయన తండ్రి  చనిపోవడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ చూద్దాం   శివాజీ రాజా తండ్రిపేరు రామరాజు. వయసు ఎనభై ఐదు సంవత్సరాలు. వయోభారంతో వచ్చే సమస్యల వల్ల గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చివరికి పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని మధురానగర్ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.దీంతో పలువురు సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు రామరాజు భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తూ శివాజీ రాజా కి తమ సానుభూతిని తెలియచేస్తున్నారు.ఈ రోజు జూబ్లీ హిల్స్ లో ఉన్న మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నట్టుగా తెలుస్తుంది. Also read: Peddi: రయ్ రయ్ రా రా సాంగ్ రెస్పాన్స్ ఇదే.. కావాలనే వాళ్ళని టార్గెట్ చేసారు  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
హోళీ అంటే భారతీయులకి మాత్రమే ప్రత్యేకమైన పండుగ. ఎక్కడో ఈశాన్యంలోని మణిపూర్లో ఉన్నా, ఖండాలు దాటుకుని ఏ అమెరికాలో ఉన్నా.... హోళీనాడు రంగు చేతపట్టని భారతీయుడు ఉండదు. ఇందులో ఒకో ప్రాంతానిదీ ఒకో ప్రత్యేకత. ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడం ప్రపంచంలో బహుశా మన హోళీ సందర్భంలో మాత్రమే కనిపిస్తుంది. కానీ జీవితాన్ని రంగులమయం చేసుకునే ప్రయత్నం మాత్రం చాలా దేశాల్లో ఉంది... టమాటాల పండుగ స్పెయిన్‌లోని వలెన్‌సియాన్ నగరంలో ఏటా ఈ పండుగ చేసుకుంటారు. ఆగస్టు చివరి బుధవారం  జరుపుకొనే ఈ పండుగలో ఒకరి మీద ఒకరు టమోటాలు విసురుకుంటారు. 1945 నుంచి మొదలైన ఈ పండుగ రాన్రానూ ప్రచారాన్ని అందుకుంటోంది. నిజానికి ఈ సంప్రదాయం ఎలా మొదలైందో ఎవరికీ తెలియదు. కొందరు కుర్రకారు టమాటాలతో కొట్టుకున్న గొడవ ఇలా మారిందనీ, ఓ టమాటా లారీ బోల్తా పడటంతో ఈ సంప్రదాయం మొదలైందనీ, ఊళ్లో కౌన్సిల్‌ సభ్యుల మీద కోపం వచ్చిన పౌరులు టమాటాలను విసరడంతో ఈ ఆచారానికి పునాది ఏర్పడిందనీ రకరకాల వాదనలు ఉన్నాయి. కారణం ఏదైనా ఆ రోజు సంబరం మాత్రం అంబరాన్ని అంటుతుంది. ఆ సందర్భంగా ఎవ్వరికీ ఎలాంటి గాయం జరగకుండా చాలా నియమాలనూ పాటించాల్సి ఉంటుంది. ఒకటే రంగు నెదర్లాండ్‌ రాజుగారైనా విలియం అలగ్జాండర్ పుట్టినరోజు సందర్భంగా ఆ దేశంలో జరుపుకొనే సంబరాలే ‘Koningsdag’. ఈ రోజున నెదర్లాండ్స్ యావత్తూ ఆ దేశపు రంగైన నారింజరంగుతో నిండిపోతుంది. గోడల మీద నారింజ రంగు కనిపిస్తుంది. జనమంతా నారింజరంగు బట్టలు వేసుకుని తిరుగుతారు. ఆఖరికి జుట్టుకి కూడా నారింజ రంగు వేసుకుంటారు. ద్రాక్ష ఎరుపులో మందుప్రియులందరి నోరూరేలాంటి ఓ పండుగ ఉంది. అదే స్పెయిన్‌లో జరిగే ‘హారో వైన్‌ ఫెస్టివల్‌’. ఏటా జూన్‌ 29న ఆ దేశంలోని క్రైస్తవ సన్యాసి ‘శాన్‌ పెడ్రో’ జ్ఞాపకార్థం ఈ పండుగ జరుగుతుంది. హారో అనే ఊరిలో జరిగే ఈ పండుగలో ఊరి జనమంతా ఉదయం నుంచే ద్రాక్షసారాయి నిండిన పాత్రలతో బయల్దేరతారు. దారిలో తమకు ఎదురుపడినవారందరి మీదా ఈ సారాయిని ఒంపుతూ ముందకుసాగుతారు. సాయంత్రం అయ్యేసరికి ఊరంతా ద్రాక్షమయంగా మారిపోతుందన్నమాట. ఇక ద్రాక్షసారాని ఒంపుకోవడమే కాదు... దానిని తాగడంలో కూడా బోలెడు పోటీలు జరుగుతాయి. నారింజ యుద్ధం ఇటలీలోని ఇవ్రియా అనే పట్నంలో జరిగే పండుగ ఇది. దీని మూలాలు ఎప్పుడో 13వ శతాబ్దంలో ఉన్నాయని చెబతారు. అప్పట్లో రాజవంశానికి చెందిన వ్యక్తి, ఓ పల్లెటూరి పిల్లని బలాత్కారం చేయబోయాడట. దానికి తిప్పికొట్టిన ఆ అమ్మాయి, ఏకంగా ఆ వ్యక్తి తలని నరికేసిందని చెబుతారు. అంతేకాదు! విషయం తెలుసుకున్న పౌరులంతా కలిసి రాజవంశం మీద తిరగబడ్డారట. ఆనాటి ప్రతిఘటనకు గుర్తుగా ఇవ్రియావాసులు నారింజపండ్లని ఒకరిమీద ఒకరికి విసురుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా హోళీని తలపిస్తూ రంగులతో నిండే ఇలాంటి పండుగలు చాలానే ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి మాత్రం పైన పేర్కొన్నవే!   - నిర్జర.
మనకిష్టమైన వాళ్ళు మన ఎదురుగా ఉంటే నిజంగానే లైఫ్ కలర్ ఫుల్ గానే  కనిపిస్తుంది. కాని కొన్ని రోజులు అయ్యాకా దాటాకా రోటీన్ లైఫ్ తో బోర్ కొడుతుంది ఎవరికైనా. పొద్దున్నే లేవటం అవే ఉరుకులు పరుగులు, అదే టైం టేబుల్. జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు ఉండే బ్రైట్నెస్ రానురాను కరువవుతుంది. అందులోనూ ఇంట్లోనే ఉండే హోం మేకర్స్ ఇంకా ఇంకా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడూ చేసిన పనే చేస్తూ, మళ్ళీ తెల్లారిందా అనుకుంటూ వాళ్ళు పడే పాట్లు అన్ని ఇన్ని కావు. అలాంటి లైఫ్ లో కాస్త రంగులు నింపితే.....ఆనందాలు రెట్టింపయ్యి, అనురాగాలు విరబూస్తాయి, కదూ. మరి ఆ రంగుల్ని నింపటానికి ఏం చెయ్యాలంటే...... రొటీన్ లైఫ్ కి కాస్త భిన్నంగా ఉండాలంటే వీకెండ్స్ లో ఏదైనా లాంగ్ డ్రైవ్ గాని, లేదా చిన్న ట్రిప్ గాని ప్లాన్ చేసుకోవచ్చు. అలా వెళ్లివస్తే మన మూడ్ హాయిగా ఉంది నిజంగానే జీవితం రంగులమయంగా కనిపిస్తుంది. మనం రోజూ వాడే బట్టల్ని పక్కకి పెట్టి ఏదో ఒక న్యూ స్టైల్ ని మార్చాలి. రోజూ పంజాబీ డ్రెస్, సారీ వేసుకునే వాళ్ళు కాస్త డిఫెరెంట్ గా జీన్స్, కుర్తీ లాంటివి ట్రై చేస్తే మీలో వచ్చే మార్పు మీరే గమనించచ్చు. ఇంట్లో ఉండే ఫర్నిచర్ ఎప్పుడు ఒకేలా ఉంటే మజానే రాదు. అందుకే ఇంటికి కొత్త కళ రావాలంటే వాటి ప్లేస్ లు మారుస్తూ ఉండాలి.  మీ భాగస్వామి ఇంటికి వచ్చేసరికి ఒక స్వీట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసుకోండి. ప్రతిరోజులా కాకుండా ఇంట్లోనే కేండేల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసుకుంటే రొటీన్ కి బిన్నంగా ఉంటుంది. మీకు సన్నిహితమైన వాళ్ళని ఇంటికి భోజనానికి పిలవండి. వాళ్ళు వచ్చారు వెళ్లారు అనేలా కాకుండా కాస్త వెరైటీగా కార్డ్స్ గేమ్ గాని, డంషరాడ్స్ లాంటి ఫన్నీ గేమ్స్ గాని ప్లాన్ చేసుకుంటే మనసు హాయిగా రంగులతో నిండిపోతుంది.  మాములుగా ఇంట్లో అందరు ఉన్నప్పుడు మీకు ఇష్టమైన సినిమా వస్తున్నా అది చూసే అవకాశం మీకు ఉండదు. పిల్లలు కార్టూన్ చూస్తామని, మిగిలిన వాళ్ళు సీరియల్స్ చూస్తామని రిమోట్ మీ చేతికి అందనీయరు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు హాయిగా మీకిష్టమైన సినిమాని ప్లే చేసి చూడండి. మీకిష్టమైన కలర్ డ్రెస్, అది మీ పార్టనర్ కి నచ్చకపోతే మీరు వేసుకోటానికి సాహసించరు. అందుకే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు లేదా మీ ఫ్రెండ్స్ తో బైటకి వెళ్ళినప్పుడు ఆ కలర్ డ్రెస్ వేసుకుని మీ కోరికని తీర్చుకోవచ్చు. ఇంట్లో మీకు బాగా ఇష్టమైన పెంపుడు జంతువుని పెంచుకుంటే మీకు బోర్ కొడుతోంది అనే మాటే గుర్తు రాదు. ఖాళీగా ఉన్న సమయంలో వాటితో ఆడుకుంటూ టైం ఇట్టే గడిచిపోతుంది. మీకిష్టమైన వాళ్ళ స్పెషల్ డేస్ గుర్తుపెట్టుకుని వాళ్ళకి గ్రీటింగ్ గాని, ఫ్లవర్ బొకే గాని పంపితే వాళ్ళు తిరిగి మీకు రెస్పాండ్ అయ్యే విధానం మీ లైఫ్ లో ఖచ్చితంగా కలర్స్ నింపుతుంది. మనకున్నదే చిన్న లైఫ్, అందులో మనకి దొరికే టైం కూడా చిన్నదే. ఆ టైంని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ, ప్రతి సారి ఏదో ఒక కొత్త కోణంలో లైఫ్ ని చూసినట్లయితే మన లైఫ్ మనకి ఎప్పటికి బోర్ కొట్టదు. అది మన కళ్ళకి ఎప్పటికీ కలర్ ఫుల్ గానే కనిపిస్తుంది.  ...కళ్యాణి     
హోళీ అంటే ప్రపంచానికి రంగుల పండుగే కావచ్చు. కానీ భారతీయుల దృష్టిలో అంతకంటే ఎక్కువే! ఆధ్మాత్మికంగానూ, భౌతికంగానూ భారతీయుల జీవనవిధానానికి హోళీ ఓ రంగుల ప్రతీక. అందుకనే వారు హోళీని ఇలా మాత్రమే జరుపుకోవాలి అని నిశ్చయించుకోలేదు. ఒకో ప్రాంతంవారు రంగులతో ఆడుకునేందుకు ఒకో తీరున హోళీ ఆచారాన్ని సాగిస్తుంటారు. కావాలంటే చూడండి... లాఠ్మార్ హోళీ ఉత్తర్ప్రదేశ్లో జరిగే హోళీ మిగతా దేశానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుని జీవితంతో ముడిపడిన మధుర, బృందావన్ వంటి ప్రాంతాలన్నింటినీ కలిపి వ్రజభూమిగా పిలుస్తారు. ఈ వ్రజభూమిలో హోళీ లాఠ్మార్ పేరుతో జరుగుతుంది. అలనాడు శ్రీకృష్ణుడు, రాధాదేవితో కలిసి హోళీ ఆడేందుకు ఆమె పుట్టిళ్లయిన బర్సానాకు చేరుకున్నాడట. తనని ఆటపట్టిస్తున్న కృష్ణుని ఎదుర్కొనేందుకు రాధాదేవి లాఠీతో కృష్ణుని వెంటపడిందట. ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ ఈ వ్రజభూమిలో మగవారేమో ఆడవారి మీద రంగులు చల్లే ప్రయత్నం చేయడం, ఆడవారేమో ఆ ఆకతాయితనాన్ని ఎదుర్కొనేందుకు లాఠీలు ఝుళిపించడం చేస్తుంటారు. షిమోగా గోవాలో సంప్రదాయంగా జరుపుకొనే వసంత ఉత్సవం ‘షిమోగా’. హోళీ పౌర్ణమికి ఐదు రోజుల ముందునుంచే మొదలయ్యే ఈ పండుగకు హోళీ ఓ ముగింపునిస్తుంది. ఇందులో భాగంగా ఊరూరా తమ చరిత్రను గుర్తుచేసుకునేలా సంప్రదాయ నృత్యాలు సాగుతాయి. డప్పు వాయించేవాళ్లు ఇంటింటికీ తిరుగుతూ భిక్షమెత్తుకుంటారు. గ్రామదేవతలకు బలులు సాగుతాయి. గుళ్లలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. హోళీనాటికి షిమోగా పండుగ పతాకస్థాయిని చేరుకుంటుంది. స్థానికులతో కలిసి ఈ పండుగను చేసుకునేందుకు వేలమంది విదేశీయులు వస్తారు. ఈ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కూడా పెరేడ్లు నిర్వహిస్తుంటుంది. కుమౌనీ హోళీ ఎక్కడన్నా పండుగ ఒకరోజు జరుగుతుంది, రెండు రోజులు జరుగుతుంది... ఇంకా మాట్లాడితే పదిరోజులు జరుగుతుంది. కానీ కుమౌనీ హోళీని దాదాపు 40 రోజుల పాటు జరుపుకుంటారు. వసంత పంచమి రోజున మొదలవుతుంది వీరి హోళీ పండుగ. అందులో బోలెడు రకాలు, ఆచారాలు ఇమిడి ఉంటాయి. ఉదాహరణకు ‘బైఠకీ హోళీ’లో సంగీతకారులు ఒకచోటకు చేరి కొన్ని ప్రత్యేక రాగాలను ఆలపిస్తారు. వీటిని వినేందుకు జనం గ్రామగ్రామంలోనూ ఒకచోటకి చేరతారు. ఇలా సంగీతాన్ని కూర్చుని వినే అవకాశం కల్పిస్తుంది కాబట్టి దీనికి బైఠకీ హోళీ అని పేరు వచ్చింది. ఇక ఈ హోళీ సమయంలో సంప్రదాయ ఖాదీ వస్త్రాలను ధరిస్తారు కాబట్టి ‘ఖాదీ హోళీ’ అని పిలుచుకుంటారు. ఈ సమయంలోనే మహిళలు ప్రత్యేకించి ఒక చోట చేరి గీతాలను ఆలపిస్తారు. ఆ సందర్భాన్ని ‘మహిళా హోళీ’ అంటారు. ఫాల్గుణ పౌర్ణమి నాటి హోళీ ఘట్టానికి రంగులు చల్లుకునేందుకు ఈ నలభై రోజుల నుంచీ కూడా చెట్టూపుట్టా తిరుగుతారు. అక్కడ వేర్వేరు రంగు పూలను సేకరించి, పొడిచేసి సిద్ధంగా ఉంచుకుంటారు. హోళీ ముందు రోజు... హోళిక అనే రాక్షసి మంటల నుంచి ప్రహ్లాదుడు తప్పించుకోవడాన్ని గుర్తుచేసుకుంటూనే మంటలు వేసుకుంటారు. హోళీకి ముందే ఇంత హడావుడి ఉంటుందంటే, ఇక హోళీనాడు ఎంత సంబరం సాగుతుందో చెప్పేదేముంది! హోళా మొహల్లా పంజాబులో హోళీ మరునాడు జరుపుకొనే ఈ పండుగలో సిక్కులు తమ యుద్ధవిద్యలను ప్రదర్శిస్తారు. సిక్కులలోని యుద్ధనైపుణ్యాలను మెరుగుపరిచేందుకు సాక్షాత్తూ వారి గురువైన గోవింద్ సింగ్ ఏర్పరిచిన సంప్రదాయం ఇది. హోళీ మర్నాడే ఈ ఆచారాన్ని మొదలుపెట్టడం వెనుక ఆయన ఉద్దేశం ఏమైనప్పటికీ... పంజాబువాసులు అటు హోళీనీ, ఇటు హోళా మొహల్లాను కూడా ఘనంగా జరుపుకుంటారు. ఇంతేనా! గుజరాత్లో హోళీ సందర్భంగా ఉట్టి కొడతారు, ఒడిషాలో రాధాకృష్ణులను ఊరేగించి వారికి రంగులను అర్పిస్తారు, పశ్చిమబెంగాల్లో దీనిని డోలీ పూర్ణిమ పేరుతో ఓ సంగీతోత్సవంగా నిర్వహిస్తారు. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతి రాష్ట్రంలోనూ హోళీకి ఒకో ప్రత్యేకత కనిపిస్తుంది. రంగుల ప్రపంచం అన్నా, ఆ ప్రపంచంలో లయబద్ధంగా జీవించడం అన్నా భారతీయులకు ఎంత ఇష్టమో హోళీ తెలియచేస్తుంటుంది. - నిర్జర.
హోళి అంటే ఇష్టం లేనిది ఎవరికి?? చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు హోళి సందడిలో తమవంతు పాత్ర పోషిస్తారు. అయితే హోళి సంబరాలలో అక్కడక్కడా అపశ్రుతులు చోటుచేసుకుంటు ఉంటాయి. హోళిని హాయిగా ఎంజాయ్ చేస్తూ.. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. మీ చర్మ సంరక్షణ తప్పనిసరి:  చర్మాన్ని వీలైనంత జిడ్డుగా చేయడం చాలా ముఖ్యం, తద్వారా రంగులు చర్మం మీద  వ్యాప్తి చెందడానికి లేదా అంటుకునే అవకాశం ఉండదు. ఇందుకోసం కొబ్బరి నూనె రాసుకోవచ్చు. కొబ్బరి నూనె వల్ల మరొక లాభం ఏంటంటే చర్మం పొడిబారకుండా చేస్తుంది. అలాగే శరీరం మీద రంగులు క్లీన్ చేయడం సులువు అవుతుంది.   సేంద్రీయ రంగుల ఎంపిక:   పర్యావరణ అనుకూలంగానే కాకుండా మన చర్మానికి కూడా అనుకూలమైన రంగులతో హోలీని జరుపుకోవాలి. హానికరమైన రసాయనాలు కలిపిన రంగులను నివారించాలి. రసాయనాలు కలిపిన రంగులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి అంతేకాఫు ఇవి నీటిలో చాలా తొందరగా కలిసిపోతాయి. ఈ రంగులు  చర్మం నుండి తొలగించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఇన్ఫెక్షన్లు, సైడ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. బంతి పువ్వు, గులాబీ, మందారం, చెట్ల ఆకులు, పసుపు ఇలా పువ్వుల రెక్కల నుండి రంగులు తయారుచేసుకోవచ్చు. .  హైడ్రేటెడ్ గా ఉండాలి:  హోలీ వేసవిలో వస్తుంది, హోళి సమయానికి వేసవి మొదలైపోయి ఉంటుంది. దీనివల్ల బయట ఎండలు భగ్గుమంటుంటాయి. ఈ ఎండల్లో రంగులు చల్లుకుని ఎంజాయ్ చేసినా.. మరొకవైపు ఎండ దెబ్బ మాములుగా ఉండదు.  కాబట్టి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. నీరు, గ్లూకోజ్, జ్యూస్‌లు, శరీరాన్ని తిరిగి శక్తివంతం చేయడంలో సహాయపడతాయి.  పైగా ఇవి చర్మం పొడిబారకుండా తేమగా ఉండేలా చేస్తాయి.   కళ్ళను తేలిగ్గా తీసుకోవద్దు:  మీరు రోజూ  కాంటాక్ట్ లెన్స్‌లను ధరించేవారు అయితే, రంగులతో ఆడుకునే ముందు వాటిని తీసివేయడం మంచిది. కళ్ళజోడు మీద రంగులు లేదా నీళ్లు పడితే ఎదుటి ప్రాంతాన్ని మసగ్గా కనిపించేలా చేస్తాయి. ఇది ఇబ్బందే అనుకోవచ్చు. అలాగని కళ్ళజోడు లేకుండా హొలీ ఆడేటప్పుడు రంగులు నేరుగా కళ్ళలోకి పడకుండా అజాగ్రత్త పడాలి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కాబట్టి కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి.  స్వీట్ల దగ్గరా జాగ్రత్త:  హోలీ సమయంలో మార్కెట్‌లో కల్తీ ఖోయా, మావా అమ్ముతారు. ఇంకా ఇలాంటి కల్తీ పదార్థాలతో స్వీట్లు తయారుచేస్తారు. ఇలాంటివే ఆఫర్స్ కింద, డిస్కౌంట్ల కింద అమ్మేస్తారు. కాబట్టి స్వీట్స్ కొనేముందు జాగ్రత్తగా ఉండాలి. .  శరీరాన్ని ఇలా కవర్ చేయాలి: హొలీ ఆడేటప్పుడు యావరేజ్ గా ఉన్న బట్టలు వేసుకోవాలి. దీనివల్ల వాటిమీద రంగులు వదలకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ కొత్త బట్టలు అయితే నాశనం అయిపోతాయి. ఫుల్ హాండ్స్ ఉన్న టాప్స్, ఫుల్ గా కాళ్లను కవర్ చేసే ప్యాంట్స్ వేసుకోవాలి. దీనీవల్ల రంగులు శరీరాన్ని పాడుచేసే అవకాశం తక్కువ. పాత డెనిమ్ జీన్స్, పొడవాటి పైజామాలను ఎంచుకోవచ్చు.  ఇలా ఆరోగ్యకరమైన హోళిని ఎంజాయ్ చేసి, ఆరోగ్యంగా ఉండండి.                                    ◆నిశ్శబ్ద.
హోళీ ఓ రంగుల పండుగ. కానీ అజాగ్రత్తగా ఉంటే, అవే రంగుల ఇతరుల జీవితాలలో చీకటిని నింపుతాయని హెచ్చరిస్తున్నారు. పిల్లవాడు తాగే పాల దగ్గర నుంచీ అంతా కలుషితం అయిపోతున్న ఈ రోజులలో, హోళీ సందర్భంగా ఎక్కడపడితే అక్కడ చవకగా దొరికే రంగుల గురించి చెప్పేదేముంది. మరి హోళీలో వాడే రంగులలో ఎలాంటి రసాయనాలు ఉంటాయో, వాటికి ఎలాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలో ఆలోచించాల్సిందే రంగు – ఆకుపచ్చ ఉపయోగించే రసాయనం – కాపర్ సల్ఫేట్. విషప్రభావం – కొంట్లో పడితే చాలా ప్రమాదకరం. కళ్లు నీరుకారడం, ఎర్రబడటం, వాయడం జరగవచ్చు. ఒకోసారి తాత్కాలికంగా చూపు కూడా కనిపించకుండా పోవచ్చు. రంగు – ఎరుపు ఉపయోగించే రసాయనం – మెర్క్యురీ సల్ఫేట్. విషప్రభావం – చర్మం మీద ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకోసారి చర్మ కేన్సర్కు కూడా దారితీయవచ్చు. గర్భిణీల శరీరంలోకి కనుక ఇది చేరితే వారి కడుపులో ఉన్న శిశువు ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఒకోసారి ఆ శిశువుకి ప్రాణాంతకంగా కూడా మారుతుంది ఈ రసాయనం. రంగు – నీలం ఉపయోగించే రసాయనం – ప్రష్యన్ బ్లూ. విషప్రభావం – మాడు మీదా చర్మం మీదా దద్దుర్లు. రంగు – సిల్వర్ ఉపయోగించే రసాయనం – అల్యూమినియం బ్రొమైడ్. విషప్రభావం – చర్మం, ఊపిరితిత్తుల మీద తీవ్ర ప్రభావం. కేన్సర్ కారకం. రంగు – నలుపు ఉపయోగించే రసాయనం – రెడ్ ఆక్సైడ్. విషప్రభావం – మూత్ర పిండాల మీద ప్రభావం. గర్భస్రావం అయ్యే ప్రమాదం. చాంతాడంత జాబితా! గులాల్ పొడులలో లెడ్, క్రోమియం, కాడ్మియం, నికెల్, జింక్, సిలికా, మైకా... వంటి నానారకాల రసాయనాలూ కలుస్తాయని తేలింది. వీటిలో ఒకో రసాయనానిదీ ఒకో దుష్ఫ్రభావం! ఇక హోళీ రంగులు మెరిసిపోతూ ఉండేందుకు వాటిలో గాజుపొడి కలుపుతారన్న ఆరోపణమూ వినిపిస్తున్నాయి. పేస్టు లేదా ద్రవరూపంలో ఉండే రంగులది మరో సమస్య. వీటిలో ఇంజన్ ఆయల్ వంటి చవకబారు ద్రవాలను కలిపే ప్రమాదం ఉంది. ఈ రసాయనాలతో ఆరోగ్యం ఎలాగూ దెబ్బతింటుంది. హోళీ రోజున అవి నీటిలోనూ, నేలమీదా పడితే పర్యావరణం కూడా దెబ్బతింటుంది. కొత్త పోకడలూ ప్రమాదమే! ఇప్పుడు కొత్తగా హోళీ రంగులను చల్లుకునేందుకు చైనావారి పిచికారీలు దొరుకుతున్నాయి. వీటికి తోడు రంగులతో నింపిన బెలూన్లు కూడా లభిస్తున్నాయి. అసలే రసాయనాలు... ఆపై వాటిని వేగంగా చల్లేందుకు పరికరాలు. దీంతో ఏ రంగు ఎవరి కంట్లో పడుతుందో, అది ఎవరి జీవితాన్ని చీకటి చేస్తుందో తెలియని పరిస్థితి. ఒక్కసారిగా మీదపడే బెలూన్ల వల్ల ఒకోసారి వినికిడి కూడా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి రంగుకీ ఓ  ప్రత్యామ్నాయం హోళీలో ఇతరులు చల్లే కృత్రిమమైన రంగుల నుంచి జాగ్రత్తపడటం ఒక ఎత్తు. మనవరకు మనం అలాంటి రంగుల జోలికి పోకుండా సహజసిద్ధమైన రంగులు వాడటం మరో ఎత్తు. ప్రతి ఇంట్లోనూ దొరికే పసుపు, కుంకుమ, చందనం, బొగ్గు లాంటి రంగులు పదార్థాలు ఎలాగూ బోలెడు రంగలకు ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ఇక ఆకుకూరలు, గోరింట పొడి, బీట్రూట్, కరక్కాయలు, మందారపూలు, నేరేడు పండ్లు లాంటివాటితో చాలా రంగులే సిద్ధమవుతాయి. కాస్త ఓపిక చేసుకుంటే తేలికగా అమరిపోయే సహజసిద్ధమైన రంగులను వదిలేసి ఏరికోరి రసాయనాలు కొనితెచ్చుకోవడం ఎందకన్నదే పెద్దల ప్రశ్న! - నిర్జర.  
భారతదేశంలో దాదాపు ప్రతి ఇంట్లో పెరుగు ఉంటుంది. కొందరు  భోజనాన్ని పెరుగుతో ముగిస్తారు. మరికొందరు రైతా చేసుకుంటారు.  ఇంకొందరు  తీపి పెరుగును ఇష్టపడతారు. వేసవిలో పెరుగు చల్లదనాన్ని ఇస్తుందని చెబుతారు. కానీ పెరుగును శీతాకాలంలో తక్కువ తినమని చెబుతారు.  మరికొందరు శీతాకాలంలో పెరుగు వాడటం ఆపేయమని చెబుతారు.  పెరుగు చుట్టూ చాలా అపోహలు,  నమ్మకాలు ఉన్నాయి, పెరుగు తినడం వల్ల జలుబు వస్తుందని కొందరు, రాత్రిపూట పెరుగు తినడం వల్ల కడుపు భారంగా ఉంటుందని, పెరుగు తింటే వాతం చేస్తుందని.. ఇలా చాలా అపోహలు ఉన్నాయి. పెరుగు గురించి చాలామందిలో అపోహలు,  వాస్తవాలు ఏంటో తెలుసుకుంటే.. పెరుగు ఆరోగ్యానికి మంచిది. ఇందులో ప్రోటీన్, కాల్షియం,  మంచి బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్) ఉంటాయి. ఈ బ్యాక్టీరియా  పేగు ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో,  జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పెరుగును క్రమం తప్పకుండా  సరైన మొత్తంలో తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. పెరుగు చాలా మందికి జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇందులో ఉండే బ్యాక్టీరియా పేగులలో మంచి,  చెడు బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఇది గ్యాస్, మలబద్ధకం,  అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. పెరుగు తింటే జలుబు వస్తుందనేది చాలామంది నమ్మకం. కానీ ఇది అందరికీ నిజం కాదు. చాలా మందికి పెరుగు వల్ల జలుబు రాదు. అయితే, ఎవరైనా జలుబుకు సెన్సిటివ్ గా  ఉంటే లేదా ఇప్పటికే జలుబుతో ఇబ్బంది పడుతుంటే.. ఆ తరువాత పెరుగు తినడం వల్ల ఇబ్బంది కలగవచ్చు అంతే. రాత్రిపూట పెరుగు తినడం వల్ల  ఎలాంటి సమస్యలు లేకపోతే పెరుగు తినవచ్చు. అయితే రాత్రి భోజనం చాలా ఆలస్యంగా తినకూడదు.  7 గంటల లోపు భోజనం చేస్తే అప్పుడు పెరుగు తీసుకుంటే ఏమీ కాదు. చాలా మందికి, పాలు కంటే పెరుగు జీర్ణం కావడం సులభం. పెరుగులోని బ్యాక్టీరియా పాలలోని లాక్టోస్‌ను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. ఇది కడుపులో తేలికగా ఉంటుంది. అందువల్ల జీర్ణక్రియ పరంగా పెరుగు పాల కంటే మంచిదని చెబుతారు. ఒక సాధారణ వ్యక్తికి రోజుకు ఒక కప్పు పెరుగు సరిపోతుంది. ఎక్కువ పరిమాణంలో అవసరం లేదు. పెరుగును బాలెన్స్ గా తీసుకున్నప్పుడే అది మంచి ఫలితాలు ఇస్తుంది.  షుగర్ వ్యాధిగ్రస్తులు సాదా పెరుగు తినవచ్చు. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా నిరోధిస్తుంది. అయితే స్వీట్  పెరుగును నివారించాలి. చాలా మందికి పెరుగు వల్ల కడుపు ఉబ్బరం కలగదు. కానీ లాక్టోస్ అసహనం ఉన్నవారికి కొంత గ్యాస్ లేదా ఉబ్బరం కలగవచ్చు. శరీరం పాల ఉత్పత్తులను సులభంగా జీర్ణం చేసుకోగలిగితే ప్రతిరోజూ పెరుగు తినడం సురక్షితం.  పెరుగును చేపలు, చికెన్ లేదా మటన్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలతో కలిపి తినవచ్చు. దీని చుట్టూ ఉన్న భయం,  గందరగోళానికి శాస్త్రీయ ఆధారం లేదు. ఇది కేవలం జీర్ణ సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుంది.                                    *రూపశ్రీ.