గన్నవరం రాజకీయాల్లో ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం మరొకసారి పీక్స్ కు చేరింది. మాజీ, ఎమ్మెల్యే  వైసీపీ సీనియర్ నాయకుడు  వల్లభనేని వంశీ విసిరిన విమర్శలు, సవాళ్లకు ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాస్  కౌంటర్ ఇచ్చారు. గురువారం (అక్టోబర్ 15) మీడియాతో మాట్లాడిన యార్లగడ్డ.. తన వెనుక ఒక బలమైన నాయకుడు ఉన్నారని, ఆయన కుమారుడు ప్రతి అంశంలోనూ లెక్కలు సరిగ్గా సరిచేస్తారని పరోక్షంగా చంద్రబాబు, లోకేష్ లను ప్రస్తావిస్తూ వల్లభనేని వంశీకి గట్టి కౌంటర్ ఇచ్చారు.  గన్నవరం నియోజకవర్గంలో గతంలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తూ వంశీని నిలదీశారు.     ప్రతికూల పరిస్థితులను ఎదిరించి  గెలిచి, నిలిచిన  తనను పపారిపోయానని వంశీ విమర్శించడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.  గత రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ, గతంలో గన్నవరం అసెంబ్లీ టికెట్ దక్కక నియోజకవర్గాన్ని వదిలి విజయవాడకు పారిపోయింది తాము కాదని,   వంశీయేనని స్పష్టం చేశారు. తాము ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉన్నామని, పారిపోయే తత్వం తని కాదని యార్లగడ్డ అన్నారు.    అనవసరమైన ఆరోపణలు చేయడం మాని, చేసిన తప్పులను ఒప్పకోవాలని వంశీకి  హితవు పలికారు. గన్నవరం అభివృద్ధి, నియోజకవర్గ ప్రజల సంక్షేమమే తమ ప్రాధాన్యమని, నిందలు వేసే నాయకులకు స్థానిక ప్రజలే త  బుద్ధి చెబుతారన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ప్రతి అంశంపైనా స్పష్టత వస్తుందని, అక్రమాలకు, అనవసర విమర్శలకు కాలమే సమాధానం చెబుతుందని యార్లగడ్డ విశ్వాసం వ్యక్తం చేశారు.   [Yarlagadda Venkat Rao Counter Vallabhaneni Vamsi, Gannavaram Politics, Gannavaram MLA, AP Political News, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. స్వయంగా పవన్ కల్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గత కొంతకాలంగా వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తుపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన జనసేనలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆయనకు అనుచరులు, అభిమానులు ఉండటంతో ఈ చేరిక రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. విజయవాడ మేయర్ అభ్యర్థిగా రాధా.? వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరడంతో విజయవాడ నగర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. రానున్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన తరఫున ఆయన మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగవచ్చనే ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాధా చేరిక జనసేనకు ఎంతవరకు కలిసివస్తుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ నుంచి జనసేన వరకు.. రాధా రాజకీయ ప్రస్థానం.! వంగవీటి రాధాకృష్ణ తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించారు. దివంగత వంగవీటి మోహనరంగా తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో పనిచేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ కార్యకలాపాల్లో కొనసాగారు. ఇప్పుడు జనసేనలో చేరడంతో ఆయన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక ఘట్టం మొదలైంది. విజయవాడ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.? విజయవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా వంగవీటి మోహనరంగా అభిమానులు, రాధాకృష్ణ అనుచరుల మద్దతు రాజకీయంగా ప్రాధాన్యం కలిగిన అంశంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో రాధా జనసేనలో చేరడం ద్వారా పార్టీకి విజయవాడలో మరింత బలం చేకూరుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, రానున్న ఎన్నికల్లో రాధాకృష్ణకు జనసేన ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది? విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఆయనను ప్రకటిస్తుందా? కూటమిలో సీట్ల కేటాయింపులపై ఈ పరిణామం ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. దీనిపై జనసేన నాయకత్వం తీసుకునే నిర్ణయంపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.         [ Vangaveeti Radhakrishna, Vangaveeti Radha Joins Janasena, Pawan Kalyan, Janasena Party, Andhra Pradesh Politics, Vijayawada Mayor Candidate, Mangalagiri Janasena Office, Vangaveeti Mohana Ranga, Vijayawada Politics, AP Local Body Elections ]  
దక్షిణాది రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలో..  తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం (అక్టోబర్ 13) ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భేటీ కావడం రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది,  విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని, ఆ తరువాత విజయవాడ ఉత్సవ్ లో పాల్గొన్నారు విజయ్.   అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో చెన్నైకి తిరిగి వెళ్లారు. అయితే ఈ పర్యటన పైకి సాధారణ పర్యటనగానే కనిపించినా,   తెరవెనుక కీలక రాజకీయ చర్చలు, వ్యూహాలకు వేదికగా మారిందన్నది పరిశీలకుల విశ్లేషణ.  ఏపీ, తమిళనాడు  మధ్య నీటి సమస్యలు  నదుల అనుసంధానం,  జాతీయ రాజకీయ సమీకరణాలపై విజయ్ చంద్రబాబుతో కీలక చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా విజయవాడ ఉత్సవ్ లో చెప్పారు కూడా.  చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గోదావరి, కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుకు తమిళనాడు మద్దతుపై చంద్రబాబు, విజయ్ మధ్య సంభాషణలో ప్రస్తావనకు వచ్చింది.   ఈ ప్రాజెక్టు కృష్ణా డెల్టాను పరిరక్షించడంతో పాటు రాయలసీమ ప్రాంతానికి సాగునీటిని అందించడానికి అలాగే  కర్ణాటక  తమిళనాడు మధ్య నెలకొన్న కావేరి జల వివాదాలను శాశ్వత పరిష్కారానికీ కూడా దోహదపడుతుందంటున్నారు.  అంతే కాకుండా చంద్రబాబుతో భేటీకి ముందు రోజు తమిళనాడు సీఎం విజయ్ చెన్నైలో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వేదిక పంచుకున్నారు. తన డిమాండ్లను ఆయన ముందుంచారు. ఈ రెండు సంఘటనలనూ బేరీజు వేసుకుంటే.. పొలిటికల్ గా విజయ్ ఎన్డీయే కూటమికి చేరువ అవుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. పరిశీలకులు కూడా ఇదే అంటున్నారు.   ఇటీవల తమిళనాడులో ద్రావిడ రాజకీయాల సంప్రదాయానికి భిన్నంగా తనకంటూ ప్రత్యేక ప్రజా మద్దతును కూడగట్టుకుంటున్న విజయ్, జాతీయ స్థాయిలోనూ తన ప్రభావాన్ని విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారనడానికి కూడా దీనినే తార్కానంగా చూపుతున్నారు పరిశీలకులు.   ఇక పోతే చంద్రబాబుతో భేటీ అనంతరం తమిళనాడు సీఎం విజయ్  మీడియా ఎదుట  చంద్రబాబు మాదిరిగా విక్టరీ సింబల్ గా రెండు వేళ్లూ చూపుతూ అభివాదం చేయడం ద్వారా తన పర్యటన సక్సెస్ అయ్యిందన్న సంకేతం ఇచ్చారు. విజయ్ బెజవాడ పర్యటన  దక్షిణాదిన రాజకీయ సమీకరణాల్లో స్పష్టమైన మార్పుకు సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  [Tamilnadu CM Vijay Victory Symbol,  Chandrababu Naidu Meeting, Godavari Cauvery Linking, Telugu Ganga Project, NDA Alliance Politics, South Political Equations, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
విక్టరీ వెంకటేశ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నంబర్‌ 47’. ఈ సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. గతంలోనే పలుమార్లు విడుదల తేదీ మారగా.. తాజాగా అక్టోబర్‌ 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. దీంతో వెంకటేశ్‌ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. అయితే ఈసారి సినిమా విడుదల ఎప్పుడు ఉంటుందనే దానిపై ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. వాస్తవానికి ఈ సినిమా అక్టోబర్‌ 9న థియేటర్లలోకి వస్తుందని చిత్రబృందం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ప్రమోషన్లు కూడా ప్రారంభించారు. అయితే చివరి దశలో సాంకేతిక పనులు అనుకున్న సమయానికి పూర్తికాకపోవడంతో విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు నిర్మాత నాగవంశీ వెల్లడించారు. ముఖ్యంగా ఫైనల్‌ ఆడియో, విజువల్‌ మిక్సింగ్‌ పనులకు మరింత సమయం అవసరమైందని తెలిపారు. సినిమాను హడావుడిగా విడుదల చేసి నాణ్యత విషయంలో రాజీ పడటం తమకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా అక్టోబర్‌ 30న విడుదలయ్యే అవకాశం ఉందంటూ ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఆ తేదీపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయలేదు. అక్టోబర్‌ 30న విడుదల చేయాలనే ఆలోచన ఉందంటూ ట్రేడ్‌ వర్గాల్లో వార్తలు వచ్చినప్పటికీ, తాజాగా అందిన సమాచారం ప్రకారం మేకర్స్‌ ఇంకా సరైన విడుదల తేదీని ఖరారు చేయలేదు. వెంకటేశ్‌, నిర్మాతలతో చర్చించిన తర్వాతే కొత్త తేదీని ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు.. ‘ఆదర్శ కుటుంబం’లో వెంకటేశ్‌ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపించనున్నారు. కుటుంబంలో జరిగే సంఘటనలు, భావోద్వేగాలు, వినోదంతో పాటు కొన్ని ఆసక్తికరమైన మలుపులతో కథ సాగనున్నట్లు ఇప్పటికే విడుదలైన టీజర్‌ ద్వారా తెలుస్తోంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, నారా రోహిత్‌, నివేదా పేతురాజ్‌, రావు రమేశ్‌, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తుండగా, తమన్‌ సంగీతం అందిస్తున్నారు. మొత్తంగా.. వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు మరికొంత కాలం వేచి చూడాల్సిందే. అక్టోబర్‌ 30న విడుదలవుతుందనే ప్రచారానికి అధికారిక ధృవీకరణ లేనందున, కొత్త రిలీజ్‌ డేట్‌పై మేకర్స్‌ ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.     [Venkatesh, Trivikram Srinivas, Aadarsha Kutumbam, Aadarsha Kutumbam Release Date, Aadarsha Kutumbam Postponed, Venkatesh New Movie, Trivikram New Movie, Naga Vamsi, Srinidhi Shetty, Telugu Movie News]
Designer Jishad Shamsudeen has expressed strong disappointment over the removal of Mohanlal's scenes from Rajinikanth's Jailer 2. In a statement shared with his followers, Jishad said he would not be associated with a sequel if the Malayalam superstar's role were treated similarly again. Jishad revealed that he was confident about the film based on what was shot, even when Mohanlal's appearance was reduced to a brief glimpse in the trailer. However, he claimed that three distinct looks of Mohanlal were completely removed from the final cut, including the scene featured in the trailer. "From my experience in cinema, trimming scenes involving a superstar like Mohanlal Sir is simply unnecessary," he stated, explaining his disappointment with the decision. Jishad also made his position clear regarding a possible sequel. "Seeing our superstar reduced like this, if there is a Sequel, I will not be a part of it. I am truly sorry to everyone who trusted me," he wrote. Emphasising that his stand was not about commercial gains, he added, "I don't stand for favors, profits, crore clubs, or stardom. I stand solely for the fans, lovers of the craft, and Mohanlal Sir." His statement has drawn attention to Mohanlal's screen presence in Jailer 2 and the reported removal of his scenes from the final version. Jishad concluded by thanking those who had supported his journey, reiterating his regard for Mohanlal and his contribution to cinema. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2023లో విడుదలైన ‘జైలర్’ భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సీక్వెల్‌పై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ 15న సినిమా విడుదల కావడంతో తలైవా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా థియేటర్లకు క్యూ కట్టారు. ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన కుమారులు యాత్ర, లింగాతో కలిసి చెన్నైలోని రోహిణి థియేటర్‌లో ‘జైలర్ 2’ చిత్రాన్ని వీక్షించారు. సినిమా చూసిన వెంటనే ఆయన ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధనుష్ తన ఎక్స్ ఖాతాలో ‘జైలర్ 2’ గురించి స్పందిస్తూ.. ఈ సినిమా తప్పనిసరిగా చూడాల్సిన చిత్రమని పేర్కొన్నారు. అంతేకాదు, దీనిని బ్లాక్‌బస్టర్‌గా అభివర్ణిస్తూ తలైవా అభిమానులకు ఇది ఒక పండగలాంటి అనుభూతిని ఇస్తుందని ప్రశంసించారు. “జైలర్ 2 తప్పనిసరిగా చూడాల్సిన సినిమా.. బ్లాక్‌బస్టర్.. ప్రతి తలైవర్ అభిమానికీ ఒక విందు” అనే అర్థం వచ్చేలా ఆయన చేసిన పోస్ట్ రజినీకాంత్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమా విడుదలైన రోజే ధనుష్ నుంచి ఇలాంటి ప్రశంసలు రావడంతో అభిమానులు ఈ పోస్టును విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ధనుష్‌తో పాటు రజినీకాంత్ కుటుంబ సభ్యులు కూడా చెన్నైలోని అదే థియేటర్‌లో సినిమా చూశారు. రజినీకాంత్ భార్య లత, కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ కూడా తమ పిల్లలతో కలిసి థియేటర్‌కు వచ్చారు. ధనుష్, ఐశ్వర్య వేర్వేరు కార్లలో అక్కడికి చేరుకోవడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవలే వీరిద్దరికీ విడాకులు మంజూరైన నేపథ్యంలో, రజినీకాంత్ సినిమాను వీక్షించేందుకు ధనుష్ రావడం చర్చనీయాంశమైంది. అయితే, ఈ పరిణామాల మధ్య కూడా రజినీకాంత్‌పై తనకున్న అభిమానాన్ని ధనుష్ తన రివ్యూతో చాటుకున్నారు. మరోవైపు, ‘జైలర్ 2’లో రజినీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. మొదటి భాగంలో ముత్తువేల్ పాండియన్ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రజినీకాంత్, ఈ సీక్వెల్‌లోనూ తనదైన స్టైల్‌తో అభిమానులను అలరిస్తారని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. విడుదలైన తొలిరోజే ధనుష్ వంటి స్టార్ హీరో నుంచి ప్రశంసలు రావడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. అయితే, ధనుష్ ఇచ్చినది ఆయన వ్యక్తిగత అభిప్రాయంతో కూడిన రివ్యూ మాత్రమే. సినిమా పూర్తి స్థాయి ఫలితం ప్రేక్షకుల ఆదరణ, బాక్సాఫీస్ వసూళ్లపై ఆధారపడి ఉంటుంది.     [Dhanush Jailer 2 Review, Rajinikanth Jailer 2, Jailer 2 Movie, Dhanush Review Today, Nelson Dilipkumar, Thalaivar Fans, Jailer 2 Blockbuster Review]
మరికొన్ని గంటల్లో విజయ్ దేవరకొండ, రష్మిక సెల్యులాయిడ్ 'రణబాలి' తో ప్రత్యక్షం కానున్నారు. ఇండియాకి స్వాతంత్య్రం రానప్పుడు రాయలసీమలో బ్రిటిష్ వాళ్లపై తిరగబడిన ఒక వీరుడి నిజ జీవిత  కథ కావడంతో అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.   ఇది కూడా చదవండి: ఆ విషయంలో తప్పు మాదే: అసలు నిజం చెప్పేసిన హీరో! కాసేపటి క్రితం  విజయ్‌ దేవరకొండ, రష్మిక  ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పుట్టపర్తికి చేరుకున్నారు. శ్రీ సత్యసాయిబాబా దివ్య సన్నిధి అయిన ప్రశాంతి నిలయంలో  బాబా మహా సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈ జంట ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ సినిమాలతో, షూటింగ్ బిజీతో గడిపే ఈ రూమర్డ్ కపుల్, ఆధ్యాత్మిక ప్రదేశానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.     ప్రశాంతి నిలయంలో వీరిద్దరూ కలిసి అడుగుపెట్టడం, అక్కడి ఆధ్యాత్మిక వాతావరణంలో గడపడం చూసిన స్థానికులు మరియు అభిమానులు ఎంతో ఆశ్చర్యపోయారు.బాబా సమాధిని దర్శించుకున్న అనంతరం వారు అక్కడ కొన్ని నిమిషాలు ప్రశాంతంగా గడిపినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో, అభిమానులు షేర్ చేయడంలో బిజీగా ఉన్నారు.   [vijay Deverakonda And Rashmika Puttaparthi visit, Vijay Deverakonda, Rashmika Mandanna, Puttaparthi,Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywood News]
Naga Chaitanya's action adventure Vrushakarma has reaffirmed its worldwide theatrical release date as December 4. Even though few other films have started announcing release for the same date like Alias Rukmini and Sri Sri, the makers are not budging. They started 50-day release countdown with a new poster.  The poster showcases Naga Chaitanya aiming a hook-ended wire at a mountain peak as an explosion erupts in the background. The visual hints at a dangerous mission involving hidden mysteries and puts the actor in a daring, action-packed avatar. The film promises to present him in a different space, combining adventure, suspense and large-scale action. Directed by Karthik Dandu, Vrushakarma is produced by BVSN Prasad on what is being described as the biggest budget in Naga Chaitanya's career. Meenakshi Chaudhary plays the female lead, while Sparsh Srivastav appears in a prominent role. The film has generated curiosity since its announcement, with its promotional material offering glimpses of an intriguing world built around mystery and adventure. Post-production work is progressing, and the makers are preparing for a December 4 release across multiple languages. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఫుల్ బిజీగా ఉన్నారు . దీంతో ఓజి సీక్వెల్ కోసం ఎప్పుడెప్పుడు షూట్ కి వెళ్లి, కంప్లీట్ చేసుకొని, తమ ముందుకొస్తుందా అని ఎదురుచూడని అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు.  అసలు విషయానికి వస్తే ఈ రోజు సుప్రీం హీరో సాయిదుర్గ తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులతో FNCC లో ముచ్చటించాడు.  ఒక అభిమాని' మామ పవన్ కళ్యాణ్ తో మూవీ ఎప్పుడు అని అడిగాడు. అందుకు సాయి దుర్గ తేజ్ బదులిస్తూ ఆల్రెడీ బ్రో చేశాను బ్రో. నువ్వు చూడకపోయి ఉంటే ఓటిటిలో వెళ్లి చూడు. అయినా తప్పు మాదే.బ్రో ని సరిగ్గా మేము ప్రమోట్ చేయలేదని బదులిచ్చాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇది కూడా చదవండి: ఆ కామెడీ కింగ్ నోటి నుంచి మాట వస్తే నవ్వులే.. కానీ 35 ఏళ్లకే రైల్వే ట్రాక్ పక్కన శవమై!   బ్రో మూవీ 2023 లో విడుదలవ్వగా  ఆశించినంత విజయాన్ని మాత్రం అందుకోలేదనేది సినీ సత్యం. ప్రస్తుతం సాయిదుర్గా తేజ్  'సంబరాల ఏటిగట్టు' తో బిజీగా ఉన్నాడు. 2027 జనవరి 12 రిలీజ్ డేట్.   [Sai Durgha Tej About Pawan Kalyan, Sai Durgha Tej, Pawan Kalyan, Bro Movie, Sambarala Etigattu, Tollywood News, Mega Hero, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywood News]
సందీప్ కిషన్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మాణంలో యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న చిత్రం ‘కరికాల’.  ‘కరికాల’ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ‘కరికాల’ మొదటి చాప్టర్‌ 2027 జూలై 2న , రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న విడుదల కాబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గురువారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముగ్గురు కథానాయికలు కేథరిన్ థ్రెసా, గాయత్రి భరద్వాజ్, సాక్షి మడోల్కర్ సందడి చేశారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజశేఖర్ తల్లి సత్యవతి గారు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మహిధర్ తల్లి పద్మారెడ్డి గారు క్లాప్ కొట్టారు. తొలి సన్నివేశానికి ఆది సాయి కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత రాజశేఖర్ తండ్రి వీరభద్రాచారి గారు స్క్రిప్ట్‌ను అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది. సందీప్ కిషన్ మాట్లాడుతూ .. ‘‘కరికాల’ చిత్ర ప్రారంభోత్సవంలో నేను ముందుగా నా ఫ్రెండ్ ఆదికి థాంక్స్ చెప్పాలి. ఆది ‘శంబాల’ వల్లే యుగంధర్ గారు, రాజశేఖర్ గారు, మహిధర్ గారు పరిచయం అయ్యారు. కథ చెప్పడమే రెండు పార్టులుగా ఉంటుందని వివరించారు. అయితే నాకు ఒక్క నిమిషం కూడా బోర్ అనిపించలేదు. ఆరేడు నెలలుగా మా దర్శకుడు 24 గంటలు ఈ ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉంటూ వచ్చారు. నిర్మాతలు కూడా ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటారు. ఇలాంటి దర్శక, నిర్మాతలు నాకు దొరకడం ఆనందంగా ఉంది. ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ అవుతుందని అనుకుంటున్నాను. మా కథకు ఓకే చెప్పిన సాక్షి, గాయత్రి, కేథరిన్‌లకు థాంక్స్.  శ్రీ చరణ్ ఈ సినిమాకి అద్భుతమైన ఆల్బమ్ రెడీ చేస్తున్నారు. ప్రతీ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. మాకెప్పుడూ సపోర్ట్ చేస్తున్న మీడియాకి థాంక్స్’ అని అన్నారు. దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ .. ‘‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతలు రాజశేఖర్ గారు, మహిధర్ గారికి థాంక్స్. నాపై నమ్మకం పెట్టుకుని సినిమాకి ఓకే చెప్పిన సందీప్ కిషన్ గారికి థాంక్స్. అందమైన చందమామ కథలా ఈ చిత్రం ఉంటుంది. అందమైన ఊహా ప్రపంచం, నాగలోకం, వానర లోకం అని ఇలా ఓ ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతోన్నాం. మేం రెండు పార్టులుగా సినిమాని ప్లాన్ చేశాం. వచ్చే ఏడాది మూవీని రిలీజ్ చేస్తామ’ని అన్నారు. నిర్మాత రాజశేఖర్ మాట్లాడుతూ .. ‘మా ‘శంబాల’ సినిమాకి మీడియా సపోర్ట్ చేసింది. అలానే మా ‘కరికాల’ చిత్రాన్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వచ్చే వారం నుంచి మూవీ షూటింగ్‌ను ప్రారంభిస్తున్నాం. యుగంధర్ గారు ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించబోతోన్నారు. కథ విన్న వెంటనే సందీప్ గారు ఓకే చెప్పారు. మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు. కేథరిన్ థ్రెసా మాట్లాడుతూ .. ‘‘కరికాల’ జర్నీని ఈ పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తున్నాం. చాలా రోజుల తర్వాత ఓ సినిమా గురించి, నా పాత్ర గురించి ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నాను. యుగంధర్ గారు ఈ ప్రాజెక్ట్ కోసం, ఈ ప్రపంచాన్ని నిర్మించేందుకు ఎంతో కష్టపడుతున్నారు. ఆయన విజన్‌కి హ్యాట్సాఫ్. సందీప్ కిషన్ నాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు. మేం ఇలా ఈ సినిమాకి కలిసి పని చేస్తుండటం ఆనందంగా ఉంది. రాజశేఖర్, మహిధర్ గార్లకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. మా టీంకి ఇలానే అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. గాయత్రి భరద్వాజ్ మాట్లాడుతూ .. ‘‘కరికాల’ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. దర్శక, నిర్మాతలు ప్రాణం పెట్టి సినిమాని చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అద్భుతంగా జరుగుతున్నాయి. వర్త్ వాచ్ అనేలా ఈ చిత్రం ఉంటుంది. ‘కరికాల’ సినిమా అందమైన మాయాలోకాన్ని చూపిస్తుంది. మాకు సపోర్ట్ చేస్తూ ప్రేమను కురిపిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు. సాక్షి మడోల్కర్ మాట్లాడుతూ .. ‘‘కరికాల’ ప్రపంచం నాకెంతో నచ్చింది. ఇందులోని మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. ఇది నాకు తెలుగులో రెండో చిత్రం. ఇంత మంచి సినిమాలో సందీప్ కిషన్‌ పక్కన నటిస్తుండటం ఆనందంగా ఉంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్.ఇలానే మా సినిమాకి ఎప్పుడూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ .. ‘సందీప్ కిషన్‌తో నాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ‘శంబాల’ తర్వాత మళ్లీ రాజశేఖర్ గారు, మహిధర్ గారు, యుగంధర్ గారితో పని చేస్తుండటం ఆనందంగా ఉంది. ఇది నా కెరీర్‌లో 58వ సినిమా. ఇలాంటి ఓ సినిమాకి పని చేస్తుండటం సంతోషంగా ఉంది. ‘కరికాల’తో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఇందులో మ్యూజిక్, పాటలకు ఎంతో స్కోప్ ఉంది. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.     [telugu movie karikala, sandeep kishan, gayatri bharadwaj, telugu movie karikala, telugu movie] news
    నవ్వించే వాడు దేవుడుకంటే గొప్పవాడనే నానుడి సినీ ప్రేక్షకుల్లో చాలా బలంగానే ఉంది. పైగా పొట్టచెక్కలయ్యేలా నవ్వుతు నవ్వుతు నీ కడుపు చల్ల గుండా అని   నిండు నూరేళ్లు జీవించమనే ఆశీర్వచనాలకి కూడా కొదవ లేదు. కానీ విధి 35 ఏళ్ళు కూడా నిండకుండనే ప్రముఖ కామెడి నటుడు కె వి చలంని పొట్టనపెట్టుకుంది.  తెలుగు సినీ చరిత్రలో కొందరు నటులు తమదైన ముద్ర వేసి, కాలాతీతంగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు. అలాంటి వారిలో కేవీ చలం ఒకరు. ఈ తరం ప్రేక్షకులకు ఆయన అంతగా పరిచయం లేకపోవచ్చు, కానీ ఆయన పోషించిన పాత్రలు, హాస్య చతురత, ప్రత్యేకమైన వ్యక్తిత్వం పరిశ్రమలో ఆయనకు అరుదైన గౌరవాన్ని సంపాదించి పెట్టాయి. నోటి వెంట వచ్చిన ప్రతి మాట జోకుగానే ఉండేది.  ఎంతో మందికి  ఆయన జోక్స్ ఓ టానిక్‌లా పనిచేసేవి. మనసు బాగోలేని ఆర్టిస్టులు, కాలక్షేపం కావాలనుకునే దర్శకులు ఆయన్ను ప్రత్యేకంగా పిలిపించుకుని జోక్స్ చెప్పించుకునేవారు. ముఖ్యంగా దాసరి నారాయణరావు, శోభన్ బాబు వంటి వారితో చలం గారికి ప్రత్యేక అనుబంధం ఉండేది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పక్కన ఉన్న చివటం గ్రామంలో పుట్టిన కేవీ చలం, విజయవాడ రేడియో స్టేషన్‌లో కొంతకాలం పనిచేశారు. అక్కడి నుంచి మద్రాస్ చేరి దాదాపు ఏడేళ్ల పాటు కష్టాలు పడి రంగస్థల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన తేనె మనసులు చిత్రంతో నటుడిగా ప్రయాణం ప్రారంభించారు. ఈ చిత్రంలో ఇంగ్లీషును తెలుగులా మాట్లాడే మేనేజర్ పాత్రలో ఆయన నటనకు మంచి స్పందన లభించింది. కమ్ము, హీరో వాట్ డు యు వాంట్ టు.. వంటి డైలాగులు జనంలోకి వెళ్ళాయి. అలాగే బందిపోటు దొంగలు చిత్రంలో మిస్టర్ అమెరికా వేషం కూడా అందరినీ అలరించింది. తెరపై నవ్వులు పంచే కేవీ చలం, ఇంట్లో మాత్రం చాలా సీరియస్‌గా ఉండేవారు. ముఖ్యంగా  ఇంటి బాధలు, భరించలేని ఆందోళనలు ఉండేవి. అయితే, గడప దాటి బయటకు వచ్చారంటే ఆ బాధలన్నీ స్విచ్ ఆఫ్ చేసి, ఆయనలోని హాస్య నటుడు బయటకు వచ్చేసేవాడు. దాసరి నారాయణరావు తీసిన పెద్ద ఇల్లు, చిన్న ఇల్లు సినిమాలో ఒకరికి అన్యాయం చేసి మరో ఇంటికి ప్రేమ చూపినట్లు, కేవీ చలం నిజ జీవితంలోనూ రెండు కుటుంబాలను కలిగి ఉండేవారు. ఇద్దరి భార్యలకు న్యాయం చేయడానికి ప్రయత్నించేవారు. ఇదే ఆయన జీవితంలో గొప్ప ఆందోళనకు కారణమైంది. ఇది కూడా చదవండి: అనుపమ పరమేశ్వరన్‌పై క్రష్.. మనసులో మాట బయటపెట్టిన ప్రముఖ లిరిసిస్ట్!  హాస్యం కేవలం మాటలకే పరిమితం కాలేదు.  రకరకాల యాసల్లో మాట్లాడటం ఆయనకి ఒక  సరదా. మద్రాసులో ఇంటి అద్దె కోసం తిరుగుతున్నప్పుడు, ఇంటి యజమాని వచ్చి రాని తెలుగులో మాట్లాడే విధానాన్ని ఆయన బాగా గమనించారు. దాన్నే ప్రాక్టీస్ చేసి, అల్లూరి సీతారామరాజు చిత్రంలో సంతానం పిళ్లై రోల్ కి  ఉపయోగించారు. “పెద్దసార్ వాడు ఆ ఫారెస్ట్ గార్డ్ వాడు నిండా కుక్క మాదిరి ఉంటాడో ఈ డివిజన్లో ఉండే ఆడవాండ్లో మగవాండ్లో సీతారామరాజు కాళ్ళ మీద పడి మొక్కుతాండ్లు సార్ వాడు” అంటూ ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటికీ గుర్తుండిపోతాయి. శివరంజని చిత్రంలో తమిళ చిత్ర నిర్మాత పాత్రలో కూడా ఆయన బాగా నవ్వించారు. 1972 జూన్ 30న చివటంలో నరసమాంబతో ఆయన వివాహం జరిగింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. రత్నకుమారి అనే మరో మహిళతోనూ ఆయన సహజీవనం చేసేవారు. రెండు ఇళ్ల మధ్య ఆయన జీవితం కొనసాగింది. 1980 డిసెంబర్ 5 రాత్రి, మాంబళం రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీ కొట్టడంతో కేవీ చలం దుర్మరణం పాలయ్యారు. మరణించే నాటికి ఆయన వయసు కేవలం 35 ఏళ్లు. రోజులాగే షూటింగ్‌కు రాని చలం గురించి దాసరి ఆరా తీయగా, ఆయన మరణవార్త తెలిసింది. ఈ విషయం తెలిసి దాసరి, శోభన్ బాబుతో సహా చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. మద్రాసులోని తెలుగు చిత్రాల షూటింగ్స్ ఆపేశారు. కేవీ చలం అంతిమయాత్రకు దాసరి, శోభన్ బాబు, మురళీమోహన్, మోహన్ బాబు, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య వంటి ప్రముఖులు హాజరయ్యారు. చాయాగ్రాహకుడు కేఎస్ మణి ఈ అంతిమయాత్రను చిత్రీకరించగా, దాసరి దర్శకత్వంలో రూపొందిన అద్దాల మేడ చిత్రం చివరలో ఆ దృశ్యాలను చేర్చారు. కేవీ చలం కుమార్తె దేవిని ఎమ్మెల్యే ఏడుకొండలు చిత్రంతో నటిగా పరిచయం చేశారు దాసరి. ఏది ఏమైనా తన హాస్యంతో అందరినీ నవ్వించిన కేవీ చలం జీవితం మాత్రం విషాదంగా ముగిసింది.   [Telugu Comedian kv Chalam Untold Story, KV Chalam, Telugu comedian history, Chalam biography, Tollywood untold stories, Sambarala Rambabu, Mattilo Manikyam movie, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywood News]
సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా తనదైన స్టైల్, మేనరిజమ్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న రజినీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా జపాన్‌లోనూ ఆయన సినిమాలకు మంచి ఆదరణ ఉంది. అయితే ఇంతటి ఇమేజ్ ఉన్న హీరోతో సినిమా చేయడం ఎంతటి దర్శకుడికైనా ఒక సవాలే. ఎందుకంటే రజినీ స్థాయికి తగ్గట్టుగా కథను సిద్ధం చేయడంతో పాటు, ఆయన అభిమానులు ఆశించే మాస్ ఎలిమెంట్స్‌ను అందులో జోడించాలి. అదే సమయంలో కొత్తదనం కూడా చూపించాలి. ఈ విషయంలో చాలామంది దర్శకులు తడబడితే.. నెల్సన్ దిలీప్‌కుమార్ మాత్రం తనదైన శైలిలో ముందుకెళ్లారు. రజినీకాంత్‌తో ఆయన చేసిన ‘జైలర్’, దాని సీక్వెల్ ‘జైలర్ 2’ విషయంలో ఇదే వ్యూహం కనిపిస్తోంది. సాధారణంగా ఒక స్టార్ హీరోతో సినిమా చేస్తున్నప్పుడు దర్శకులు ఆయన ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కథను రూపొందిస్తుంటారు. హీరో ఎంట్రీ ఎలా ఉండాలి? ఆయనను ఎలివేట్ చేసే సన్నివేశాలు ఎక్కడ ఉండాలి? అభిమానులు చప్పట్లు కొట్టే డైలాగులు ఏమిటి? వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇందులో తప్పేమీ లేకపోయినా, ప్రతి సినిమాలోనూ ఇదే పద్ధతిని అనుసరించడం వల్ల కథలు ఒకే మూసలో సాగుతున్న భావన కలుగుతుంది. రజినీకాంత్ విషయంలోనూ గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయనకు ఉన్న భారీ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. అయితే నెల్సన్ మాత్రం రజినీ ఇమేజ్‌కు తగ్గట్టుగా కథను మార్చడం కాకుండా, తన కథలో రజినీని భాగం చేశారు. ఇదే ఆయనను మిగతా దర్శకుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టిన అంశం. ‘జైలర్’ సినిమాను గమనిస్తే.. ఇందులో రజినీకాంత్‌ను కేవలం సూపర్‌స్టార్‌గా కాకుండా, ఒక కుటుంబ పెద్దగా, గతంలో శక్తిమంతమైన వ్యక్తిగా ఉన్నప్పటికీ ప్రస్తుతం సాధారణ జీవితాన్ని గడుపుతున్న ముత్తువేల్ పాండియన్‌గా చూపించారు. కథలోని పరిస్థితులు ఆయనలోని మరో కోణాన్ని బయటకు తీసుకొచ్చేలా దర్శకుడు సన్నివేశాలను రూపొందించారు. పాత్రకు అవసరమైన చోట ప్రశాంతతను, మరికొన్ని సందర్భాల్లో క్రూరత్వాన్ని, ఇంకొన్ని చోట్ల హాస్యాన్ని జోడించారు. రజినీకాంత్ నుంచి అభిమానులు ఆశించే స్టైల్, మాస్ ఎలివేషన్లు ఉన్నప్పటికీ.. అవి కథకు అనుగుణంగా వచ్చాయి. దీంతో సినిమాలో రజినీకాంత్ స్టార్‌డమ్ మాత్రమే కాకుండా, ముత్తువేల్ పాండియన్ అనే పాత్ర కూడా బలంగా కనిపించింది. ఇదే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రజినీకాంత్ ఇమేజ్‌ను పూర్తిగా పక్కన పెట్టకుండా, దాన్ని తన కథకు అనుకూలంగా నెల్సన్ ఉపయోగించుకున్నారు. రజినీ స్టైల్‌ను ప్రేక్షకులకు గుర్తు చేస్తూనే, ఆయనను కొత్త తరహా పాత్రలో చూపించారు. సన్నివేశాల్లోని హాస్యం, అనూహ్యమైన మలుపులు, ఇతర భాషల స్టార్ హీరోల అతిథి పాత్రలు, అనిరుధ్ సంగీతం.. ఇలా ప్రతి అంశాన్ని తన కథనానికి అనుగుణంగా మలిచారు. ముఖ్యంగా రజినీకాంత్ పాత్రలోని రెండు విభిన్న కోణాలను బయటకు తీసుకొచ్చిన విధానం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. రజినీని ఎలా చూపించాలనే దానికంటే, తాను చెప్పాలనుకున్న కథలో రజినీ పాత్ర ఎలా ఉండాలనే విషయానికే నెల్సన్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ఆలోచనే ‘జైలర్’ విజయానికి కీలకమైన కారణాల్లో ఒకటిగా నిలిచింది. ‘జైలర్ 2’ విషయంలోనూ నెల్సన్ తనదైన కథన శైలిని కొనసాగించడం, రజినీకాంత్‌తో మరోసారి పనిచేయడం ఆసక్తిని పెంచింది. ఒక సినిమా విజయవంతమైన తర్వాత అదే ఫార్ములాను యథాతథంగా అనుసరించడం కంటే, ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకొని కొత్త సన్నివేశాలు, కొత్త మలుపులతో కథను ముందుకు తీసుకెళ్లడం దర్శకుడికి పెద్ద పరీక్ష. రజినీ లాంటి స్టార్‌తో ఈ ప్రయోగం చేయడం మరింత కష్టం. అయినప్పటికీ, ఆయన ఇమేజ్‌ను కథకు ఉపయోగించుకుంటూ తనదైన ముద్ర వేయాలన్న నెల్సన్ ఆలోచన ప్రత్యేకంగా నిలుస్తోంది. ఒక స్టార్ హీరోను తన కథలోని పాత్రగా మార్చగలగడం, అదే సమయంలో ఆయన అభిమానుల అంచనాలను కూడా అందుకోవడం అంత సులభం కాదు. ఈ సమతుల్యతను సాధించడమే నెల్సన్ విజయ రహస్యం అని చెప్పొచ్చు. రజినీకాంత్ స్టార్‌డమ్‌ను మాత్రమే నమ్ముకోకుండా, బలమైన పాత్రను, తనదైన కథనాన్ని నమ్ముకున్నందువల్లే ఆయన సినిమాలు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి.     [Nelson Dilipkumar, Rajinikanth, Jailer Movie, Jailer 2, Nelson Rajinikanth Combination, Rajinikanth Success Movies, Jailer Movie Success Secret]
  లింగ బేధంతో సంబంధం లేకుండా ప్రతి మనిషికి ఎవరి ఒకరిపై 'క్రష్ ' అనేది ఉంటుంది. అది తప్పు కూడా ఏం కాదు.ఈ కోవలోనే అందాల భామ  అనుపమ పరమేశ్వరన్ పై క్రష్ ఉండే దని ప్రముఖ గేయ రచయిత చెప్పడం ఆటోమేటిక్ గా వైరల్ హోదాలో దూసుకుపోతూ ఉంది.     అనుపమ పరమేశ్వరన్ గురించి కాసర్ల శ్యామ్ మాట్లాడుతు 'అనుపమ అంటే నాకు  క్రష్ అని, ఆమెని  మొదటిసారి చూసినప్పుడే మనసు పారేసుకున్నానని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆమెపై తనకున్న అభిమానాన్ని వివరిస్తూ తాను అనుపమని 'అఆ' అని పిలుస్తానని చెప్పారు. ఇందులో 'అ' అంటే అనుపమ అని, 'ఆ' అంటే ఆరాధన అని ఆయన ఎంతో సృజనాత్మకంగా వివరించారు. అనుపమను తాను అంతలా ఆరాధిస్తానని, ఆమెకు పెద్ద అభిమానిని అయిపోయానని కాసర్ల శ్యామ్ చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి:  త్రివిక్రమ్ పై పూనమ్‌ కౌర్‌ వ్యాఖ్యలు వైరల్: నటి కోసం భార్యని కోమాలోకి వెళ్లేలా కొట్టాడు!   అనుపమ పరమేశ్వరన్ కీ రోల్ పోషించిన తాజా చిత్రం 'క్రేజీ కల్యాణం'. బద్రప్ప గాజుల దర్శకుడు. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఈవెంట్ లోనే  కాసర్ల శ్యామ్ క్రష్ వ్యాఖ్యలు చేసాడు.   [kasarla shyam Interesting Comments On Anupama Parameswaran, Kasarla shyam crush on anupama parameswaran, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywood News]    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం, క్రమం తప్పని వ్యాయామం ఎంత ముఖ్యమో, శరీరానికి సరిపడా నిద్రపోవడం కూడా అంతే కీలకం. అయితే నేటి ఆధునిక జీవనశైలిలో పనులు, మొబైల్ ఫోన్ల అతిగా వాడకం కారణంగా చాలామంది రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారు. మరికొందరు ఎక్కువసేపు నిద్రపోయినా ఉదయం లేచిన వెంటనే తీవ్రమైన అలసటగా ఉంటోందని బాధపడుతుంటారు. ఈ నేపథ్యంలో నిద్ర సమయం మన శరీర ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా గుండె, మెదడు, ఊపిరితిత్తులు మరియు రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి నాణ్యమైన నిద్ర ఎంతో అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల ప్రతిష్టాత్మక 'నేచర్' జర్నల్‌లో ప్రచురితమైన ఒక కీలక అధ్యయనంలో, రోజూ ఎంతసేపు నిద్రపోతున్నారనే అంశానికి, శరీరంలోని వివిధ అవయవాల జీవ సంబంధ వృద్ధాప్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని నిపుణులు లోతుగా పరిశీలించారు. సుమారు 5 లక్షల మందికి పైగా వ్యక్తుల ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించిన ఈ భారీ అధ్యయనంలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. రోజుకు దాదాపు 6.4 నుంచి 7.8 గంటల వరకు నిద్రపోయే వారిలో వివిధ అవయవాల జీవ సంబంధ వయస్సుకు సంబంధించిన వృద్ధాప్య సూచనలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయితే, రోజూ ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోయేవారితో పాటు, ఎనిమిది గంటల కంటే ఎక్కువగా నిద్రపోయే వారిలోనూ వేగవంతమైన జీవ సంబంధ వృద్ధాప్యానికి సంబంధించిన సంకేతాలు ఎక్కువగా నమోదైనట్లు ఈ పరిశోధన తేల్చింది. అలాగని తక్కువ లేదా ఎక్కువ నిద్ర నేరుగా వృద్ధాప్యానికి కారణమవుతుందని దీని అర్థం కాదని, ఇది కేవలం ఒక ధోరణిని సూచిస్తుందని పరిశోధకులు తెలిపారు. అయినప్పటికీ, అమెరికా నేషనల్ స్లీప్ ఫౌండేషన్ మార్గదర్శకాల ప్రకారం సాధారణంగా వయోజనులకు ప్రతిరోజూ రాత్రి పూట 7 నుంచి 9 గంటల వరకు నిద్ర అవసరం ఉంటుందని ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. ప్రతిరోజూ తగినంత నిద్ర లేకపోతే పగటిపూట విపరీతమైన అలసట, ఏకాగ్రత తగ్గడం మరియు జ్ఞాపకశక్తి మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీర్ఘకాలంగా నిద్ర సరిపోకపోవడం వల్ల ఊబకాయం, టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటు మరియు గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. మరోవైపు, ఎక్కువసేపు నిద్రపోవడం కూడా కొన్నిసార్లు అనారోగ్య సంకేతం కావచ్చు. శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా అనారోగ్యం నుంచి కోలుకునేటప్పుడు అదనపు విశ్రాంతి అవసరం అయినప్పటికీ, రోజూ గంటల తరబడి నిద్రపోయినా అలసట తగ్గకపోతే స్లీప్ అప్నియా లేదా ఇతర సమస్యలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ శరీర తత్వానికి తగినట్లుగా తగినంత విశ్రాంతి తీసుకుంటూ, ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను పాటించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.     Ideal sleep duration, how many hours to sleep, sleep study 500k people, optimal sleep time, sleep and brain health, ideal sleep for adults, sleep scientific research.
జీవితంలో ఎన్నో సమస్యలు, తీరిక లేని పనుల ఒత్తిడి మధ్య నవ్వును కోల్పోతున్న రోజులివి. చిన్నారి బొసినోటి నవ్వులను చూసినప్పుడు లేదా పెరట్లో పూసిన గులాబీని ఆస్వాదించినప్పుడు మన ప్రమేయం లేకుండానే ముఖంలో చిరునవ్వు మెరుస్తుంది. అయితే నిత్య జీవితంలో ప్రతిరోజూ మనసారా ఎంతమంది నవ్వగలుగుతున్నారు అంటే దానికి సమాధానం కష్టమే. ఆరోగ్యకరమైన జీవితం కోసం లాఫింగ్ క్లబ్‌లకు వెళ్లనవసరం లేదు కానీ, ముఖం మీద చిన్న చిరునవ్వును ఎప్పుడూ కదలాడేలా చూసుకోవడం ద్వారా బోలెడు ఆరోగ్య లాభాలను పొందవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండేవారికి శరీరంలో రక్తపోటు అదుపులో ఉంటుంది మరియు టెన్షన్ కూడా దూరమవుతుంది. ఎంతటి కష్ట సమయంలోనైనా ముఖంపై చిరునవ్వు ఉంటే ఆ సమస్యను చాలా సులభంగా ఎదుర్కొని విజయవంతంగా పరిష్కరించుకోవచ్చు. అంతేకాకుండా, నవ్వు శరీరంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచడంతో పాటు గుండె సంబంధిత వ్యాధుల నివారణకు అత్యంత ప్రభావవంతమైన సహజ ఔషధంగా పనిచేస్తుంది. మానసిక ఉల్లాసాన్ని అందించడంలో చాక్లెట్ కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైనది చిరునవ్వు. ఒక మంచి నవ్వు దాదాపు రెండు వేల చాక్లెట్ల తో సమానమైన ఉత్సాహాన్ని ఇస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కేవలం మానసికానందమే కాకుండా, నవ్వు మన శరీరంలోని కండరాలను రిలాక్స్ చేసి రోగనిరోధక శక్తిని (ఇమ్యూనిటీ) గణనీయంగా పెంచుతుంది. అంతేకాకుండా, శరీరంలో దెబ్బతిన్న కణాలకు మరమ్మతు చేయడంలోనూ నవ్వు అద్భుతంగా సహాయపడుతుంది. ఎప్పుడూ నవ్వుతూ, ఇతరులను నవ్విస్తూ ఉండే వారి వయసు వారి అసలు వయసు కంటే చాలా తక్కువగా కనిపిస్తుంది. కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలను బలపరచడంలోనూ, బయట సామాజిక సంబంధాలను మెరుగుపరచడంలోనూ నవ్వు కీలక పాత్ర పోషిస్తుంది. ఆఖరికి వ్యాపారాలు అభివృద్ధి చెందాలన్నా, మనసంతా ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలన్నా ప్రతిరోజూ మనసారా నవ్వడం చాలా అవసరం. కాబట్టి చిన్న విషయాలకే దిగులు చెందకుండా, పెదవులపై చిరునవ్వును ఎప్పుడూ చెరగనివ్వకుండా ఆనందంగా జీవించండి.     health benefits of laughter, laughter therapy, laughter for stress relief, laughter reduces anxiety, mental health benefits of laughing, daily laughter wellness, stress buster tips.
ప్రతిరోజూ ఉరుకుల పరుగుల జీవితంలో అందమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని మరియు ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవాలని ఎవరు మాత్రం కోరుకోరు? ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు ఉండే బిజీ షెడ్యూల్ మధ్య మన శరీరంపై, ముఖ్యంగా చర్మం మరియు జుట్టుపై మనం తగిన శ్రద్ధ పెట్టలేకపోతుంటాము. దీనికోసం మార్కెట్లో లభించే రకరకాల ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ మరియు కెమికల్ క్రీమ్స్‌ను అమాయకంగా ఎంచుకుంటూ ఉంటాము. కానీ అవి తాత్కాలిక మెరుపును మాత్రమే ఇచ్చి, దీర్ఘకాలంలో దుష్ప్రభావాలను చూపే అవకాశం ఉంటుంది. అయితే, మన వంటింట్లో ఎప్పుడూ అత్యంత చౌకగా, సులభంగా అందుబాటులో ఉండే నువ్వులలో చర్మానికి, జుట్టుకు అవసరమైన అద్భుతమైన పోషకాలు దాగున్నాయని ప్రముఖ పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ చిన్న గింజలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, శరీరానికి అత్యంత అవసరమైన నాణ్యమైన ప్రోటీన్లు, విటమిన్ ఇ, జింక్ అలాగే ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన చర్మం యొక్క తేమను కాపాడుకోవడానికి మరియు జుట్టు కుదుళ్ల నుంచి బలంగా పెరగడానికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా చర్మం పొడిబారి గరుకుగా మారుతున్న వారికి నువ్వుల్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు చక్కటి శాశ్వత పరిష్కారాన్ని అందిస్తాయి. చర్మంలో తేమను నిలుపుతూ నిర్జీవ రూపాన్ని తొలగించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా, నువ్వుల్లో సమృద్ధిగా లభించే విటమిన్ ఇ, సెసమిన్ మరియు సెసమాల్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో వచ్చే మార్పులను, ముడతలను మరియు వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో నువ్వుల్లోని జింక్, ప్రోటీన్ వంటి పోషకాలు అద్భుతంగా సహాయపడతాయి. శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ మరియు ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో ఈ యాంటీఆక్సిడెంట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. కేవలం చర్మానికి మాత్రమే కాకుండా, జుట్టు ఆరోగ్యానికి కూడా నువ్వులు అద్భుతమైన పోషణను అందిస్తాయి. జుట్టు ఒత్తుగా మరియు బలంగా పెరగడానికి ప్రోటీన్, ఐరన్ మరియు జింక్ అత్యంత అవసరం. మన ఆహారంలో ఈ పోషకాల లోపం ఏర్పడినప్పుడు జుట్టు రాలే సమస్య విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి సమతుల్య ఆహారంలో భాగంగా నువ్వులను క్రమం తప్పకుండా చేర్చుకోవడం ద్వారా జుట్టుకు కావలసిన సమగ్ర పోషణ లభిస్తుంది. నువ్వుల్లోని కొవ్వులు మరియు జింక్ తల చర్మం అలియాస్ స్కాల్ప్ ఆరోగ్యానికి తోడ్పడతాయి. జుట్టు పొడిగా మరియు నిర్జీవంగా మారినప్పుడు నువ్వుల నూనెను వాడటం ద్వారా జుట్టు కుదుళ్లపై ఒక రక్షణ పూతలా ఏర్పడి తేమ నష్టపోకుండా కాపాడుతుంది. దీనివల్ల జుట్టు మృదువుగా, సిల్కీగా మరియు ఆరోగ్యంగా కనిపిస్తుంది. అయితే రోజువారీ ఆహారంలో వీటిని ఏ విధంగా తీసుకోవాలనే ప్రశ్న చాలామందిలో వస్తుంది. వేయించిన నువ్వులను మెత్తని పొడిగా మార్చి కూరలు, పప్పులు లేదా రుచికరమైన చట్నీలలో కలుపుకోవడం చాలా సులభం. అంతేకాకుండా, ఈ నువ్వుల పొడిని వేడివేడి అన్నంలో కొద్దిగా స్వచ్ఛమైన నెయ్యితో కలిపి తీసుకోవడం వల్ల మంచి రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందుతాయి. నువ్వులు మరియు బెల్లంతో తయారు చేసిన లడ్డూలను లేదా ఉండలను కూడా శీతాకాలంలో లేదా అప్పుడప్పుడు మితంగా తీసుకోవచ్చు. అలాగే వంటల్లో నువ్వుల నూనెను ఉపయోగించడం ద్వారా కూడా తగిన పోషకాలను సులభంగా పొందవచ్చు. అయితే జుట్టు విపరీతంగా రాలడానికి థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ల మార్పులు, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి మరియు కాలుష్యం వంటి అనేక ఇతర కారణాలు ఉండవచ్చు కాబట్టి, సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు సరైన కారణాన్ని గుర్తించి వైద్యుల సలహా తీసుకోవడం ఎప్పుడూ ఉత్తమం.     sesame seeds for glowing skin, sesame seeds for hair growth, til benefits for beauty, sesame seeds health benefits, natural remedies for hair growth, natural skin care tips, sesame seeds oil for hair.
థైరాయిడ్ సమస్యలు మహిళల్లోనే ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి? బరువు పెరగడం, నెలసరి సక్రమంగా రాకపోవడం, అలసట, మానసిక ఒత్తిడి వంటి సమస్యల వెనుక థైరాయిడ్ హార్మోన్ల పాత్ర ఎంత? మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి, థైరాయిడ్ పనితీరుకు మధ్య సంబంధం ఉందా? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన సందేహాలకు ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణులు, Cell Health Clinics వ్యవస్థాపకులు డాక్టర్ చింతా రవికుమార్ వివరణ ఇచ్చారు. మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? మహిళల శరీరంలో యుక్తవయస్సు, నెలసరి, గర్భధారణ, ప్రసవం, మెనోపాజ్ వంటి వివిధ దశల్లో హార్మోన్లలో మార్పులు చోటుచేసుకుంటాయి. రోగనిరోధక వ్యవస్థలోని కొన్ని మార్పుల వల్ల కూడా మహిళలకు థైరాయిడ్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రతి మహిళకూ థైరాయిడ్ సమస్య వస్తుందని కాదు. లక్షణాలను గుర్తించడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. TSH, T3, T4 హార్మోన్లు ఏం చేస్తాయి? థైరాయిడ్ గ్రంథి శరీరంలో జీవక్రియలు, శక్తి వినియోగం, బరువు నియంత్రణ వంటి అనేక ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. TSH పరీక్ష ద్వారా థైరాయిడ్ పనితీరు గురించి ప్రాథమిక సమాచారం తెలుసుకోవచ్చు. T4 హార్మోన్ శరీరంలో T3 అనే క్రియాశీల హార్మోన్‌గా మారుతుంది. ఈ మార్పిడిని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? థైరాయిడ్ పరీక్షల్లో వచ్చే ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి? అనే విషయాలను డాక్టర్ వివరిస్తారు. గట్ హెల్త్‌కు థైరాయిడ్‌కు సంబంధం ఏమిటి? మన పేగుల్లో ఉండే సూక్ష్మజీవులు జీర్ణక్రియతో పాటు శరీరంలోని కొన్ని జీవక్రియల్లోనూ పాత్ర పోషిస్తాయి. పోషకాలు సరిగా అందడం, పేగుల ఆరోగ్యం, శరీరంలోని హార్మోన్ల ప్రక్రియలు పరస్పరం ప్రభావితం చేసుకోవచ్చు. థైరాయిడ్ హార్మోన్ల పనితీరులో గట్ హెల్త్ పాత్ర ఏమిటి? జీర్ణవ్యవస్థ ఆరోగ్యంపై ఎందుకు శ్రద్ధ పెట్టాలి? అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. హషిమోటోస్ థైరాయిడిటిస్ అంటే ఏమిటి? రోగనిరోధక వ్యవస్థ పొరపాటున థైరాయిడ్ గ్రంథిపై దాడి చేసే ఆటో ఇమ్యూన్ పరిస్థితిని హషిమోటోస్ థైరాయిడిటిస్ అంటారు. ఇది థైరాయిడ్ పనితీరును ప్రభావితం చేయవచ్చు. ఈ సమస్యకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు, వైద్య పరీక్షల ప్రాధాన్యత గురించి డాక్టర్ వివరిస్తారు. PCOS, బరువు పెరగడం, నెలసరి సమస్యలకు థైరాయిడ్ కారణమా? PCOS ఉన్న మహిళల్లో నెలసరి క్రమం తప్పడం, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. థైరాయిడ్ సమస్యల్లోనూ ఇలాంటి కొన్ని లక్షణాలు ఉండవచ్చు. అయితే ఈ సమస్యలన్నింటికీ థైరాయిడ్ ఒక్కటే కారణం కాదు. లక్షణాలను బట్టి సరైన వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. థైరాయిడ్ ఆరోగ్యానికి అయోడిన్, సెలీనియం, జింక్ ఎందుకు అవసరం? థైరాయిడ్ హార్మోన్ల తయారీకి అయోడిన్ అవసరం. సెలీనియం, జింక్ వంటి పోషకాలు కూడా శరీరంలోని సాధారణ జీవక్రియలకు, థైరాయిడ్ హార్మోన్ల ప్రక్రియలకు తోడ్పడతాయి. వీటిని ఆహారం ద్వారా తగినంతగా పొందడం ఎందుకు ముఖ్యం? పోషకాల లోపం ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చు? అనే విషయాలపై ఈ వీడియోలో అవగాహన పొందవచ్చు. మెదడు ఆరోగ్యం, డోపమైన్, సెరోటోనిన్‌తో సంబంధం ఏమిటి? డోపమైన్, సెరోటోనిన్ వంటి రసాయనాలు మెదడులో మానసిక స్థితి, ప్రేరణ, నిద్ర వంటి విధులకు సంబంధించిన ప్రక్రియల్లో పాత్ర పోషిస్తాయి. థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత శక్తి స్థాయులు, ఏకాగ్రత, మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపవచ్చు? ఈ అంశాల గురించి కూడా డాక్టర్ వివరిస్తారు. గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యలను ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు? గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యంతో పాటు శిశువు ఎదుగుదలకు కూడా థైరాయిడ్ హార్మోన్లు ముఖ్యమైనవి. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనల ప్రకారం పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన చికిత్సను కొనసాగించడం ముఖ్యం. గర్భం దాల్చాలని ఆలోచిస్తున్న మహిళలు కూడా తమ థైరాయిడ్ ఆరోగ్యం గురించి వైద్యులను సంప్రదించాలి. మహిళల్లో థైరాయిడ్ సమస్యలకు గల కారణాలు, TSH స్థాయులు, T4 నుంచి T3గా మారే ప్రక్రియ, హషిమోటోస్ థైరాయిడిటిస్, PCOS, గట్ హెల్త్, అవసరమైన పోషకాలు, మెదడు ఆరోగ్యం, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి ముఖ్యమైన అంశాలపై డాక్టర్ చింతా రవికుమార్ అందించే పూర్తి వివరణను ఈ వీడియోలో చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. థైరాయిడ్ సమస్య ఉన్నట్లు అనుమానం వచ్చినా, పరీక్షల్లో మార్పులు కనిపించినా వైద్యులను సంప్రదించండి. వైద్యుల సలహా లేకుండా థైరాయిడ్ మందులను ఆపడం లేదా వాటి మోతాదును మార్చడం చేయకండి. పోషకాహార సప్లిమెంట్లను కూడా వైద్యుల సూచనల మేరకే ఉపయోగించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా...మన హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
మహిళల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల్లో అండాశయ క్యాన్సర్ (Ovarian Cancer) గురించి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ క్యాన్సర్ ప్రారంభ దశల్లో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. కొన్నిసార్లు సాధారణ జీర్ణ సమస్యలుగా లేదా రోజువారీ ఆరోగ్య ఇబ్బందులుగా భావించే లక్షణాల వెనుక కూడా అండాశయాలకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. అందుకే శరీరంలో తరచూ కనిపించే మార్పులను గమనించడం, అవసరమైనప్పుడు వైద్య సలహా తీసుకోవడం ఎంతో ముఖ్యం. అండాశయ క్యాన్సర్‌కు సూచనగా ఉండే లక్షణాలు ఏమిటి? కడుపు తరచూ ఉబ్బరంగా అనిపించడం, పొత్తికడుపు కింది భాగంలో నొప్పి రావడం, కొద్దిగా ఆహారం తిన్నా కడుపు నిండినట్లు అనిపించడం, తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ఈ సమస్యలు తరచూ రావడం, తగ్గకుండా కొనసాగడం లేదా సాధారణ స్థితికి భిన్నంగా అనిపించడం గమనించాల్సిన విషయం. అయితే ఈ లక్షణాలు కనిపించినంత మాత్రాన అండాశయ క్యాన్సర్ ఉందని నిర్ధారించలేం. ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు రావచ్చు. లక్షణాలు ఎంతకాలంగా ఉన్నాయి, ఎంత తరచుగా వస్తున్నాయి, వాటితో పాటు ఇతర మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయా అనే విషయాలను వైద్యులు పరిశీలించి అవసరమైన పరీక్షలను సూచిస్తారు. అండాశయ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం? అండాశయ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే దీని లక్షణాలు ఇతర సాధారణ సమస్యలను పోలి ఉండవచ్చు. కాబట్టి కడుపు ఉబ్బరం, పొత్తికడుపు నొప్పి, ఆకలి తగ్గడం లేదా తరచూ మూత్రం రావడం వంటి సమస్యలు నిరంతరం కొనసాగితే వాటిని చిన్నవిగా భావించి వాయిదా వేయకూడదు. సరైన సమయంలో వైద్యులను సంప్రదించడం ద్వారా సమస్యకు కారణాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో డాక్టర్ రాహుల్  గారు అండాశయ క్యాన్సర్‌కు సంబంధించిన ముఖ్యమైన లక్షణాలు, వాటిని గుర్తించాల్సిన అవసరం, ఆరోగ్య సమస్యల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పుడు వైద్యులను సంప్రదించాలనే అంశాల గురించి వివరిస్తారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవడానికి, శరీరంలో కనిపించే అసాధారణ మార్పులను గమనించడానికి, అండాశయ క్యాన్సర్ లక్షణాల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ముఖ్య గమనిక: కడుపు ఉబ్బరం, పొత్తికడుపు నొప్పి, త్వరగా కడుపు నిండిన భావన లేదా తరచూ మూత్రం రావడం వంటి లక్షణాలు నిరంతరం కొనసాగితే వైద్యులను సంప్రదించండి. లక్షణాల ఆధారంగా మాత్రమే క్యాన్సర్‌ను నిర్ధారించలేం. వైద్య పరీక్షల ద్వారా మాత్రమే సరైన నిర్ధారణ సాధ్యమవుతుంది. ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే, వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా...మన హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
  నేటి వేగవంతమైన జీవనశైలిలో సరిగ్గా సమయానికి తినకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, సరిపడా నిద్రపోకపోవడం వంటి అలవాట్ల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి అలవాట్ల వల్ల శరీరంలోని జీవక్రియలు దెబ్బతిని దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేదం చెప్తోంది. ముఖ్యంగా మన శరీరంలో ఉండే వాత, పిత్త, కఫ అనే మూడు దోషాల సమతుల్యత దెబ్బతిన్నప్పుడే వ్యాధులు మొదలవుతాయి. ఈ మూడు దోషాలు సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలి, ఆయుర్వేదం సూచించే ముఖ్యమైన నియమాలు ఏమిటో  వివరంగా తెలుసుకుంటే.. జీవనశైలి లోపాల వల్ల వచ్చే ముప్పు.. రోజువారీ జీవితంలో వ్యాయామం లేకపోవడం, వేళపాళ లేని ఆహారం తీసుకోవడం, మద్యం లేదా ఇతర అలవాట్లు ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోక్, అధిక బరువు, టైప్ 2 మధుమేహం , ఊపిరితిత్తుల సమస్యల వంటి అనేక తీవ్రమైన రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది. చిన్న వయస్సు నుంచే ఆహారపు అలవాట్లను, జీవనశైలిని సరిదిద్దుకోవడం ద్వారా ఈ ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల ఆహారంతో దోషాల నివారణ.. ఆయుర్వేద ప్రకారం సరైన ఆహారం అంటే కేవలం కొన్ని పదార్థాలు తినడం మాత్రమే కాదు. ఆహారంలో ఉండే రుచులు, గుణాలు , వాటి కలయికను కూడా అర్థం చేసుకోవాలి. ఆయుర్వేదంలో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు ఉన్నాయి. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఈ ఆరు రుచులు తగిన పాళ్లలో ఉండేలా చూసుకుంటే వాత, పిత్త, కఫ దోషాలు సమతుల్యంగా ఉంటాయి. ఆహారంలో తాజా కూరగాయలు, ఆయా కాలాల్లో దొరికే పండ్లు తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. సరియైన దినచర్య చాలా ముఖ్యం.. మంచి ఆరోగ్యం కోసం సరైన రోజువారీ అలవాట్లు కలిగి ఉండటం చాలా అవసరం. ఉదయాన్నే త్వరగా లేవడం, శరీరానికి నూనె మర్దన చేసుకోవడం, అభ్యంగన స్నానం , యోగా వంటి ప్రక్రియలు శరీరానికి విశ్రాంతినిస్తాయి.  ఉదయాన్నే ఆరోగ్యకరమైన టిఫిన్ చేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనస్సు, ఆరోగ్యకరమైన శరీరం కోసం ప్రతిరోజూ రాత్రి 7 నుండి 8 గంటల నిద్ర అవసరం. యోగా , ధ్యానంతో ప్రయోజనాలు.. యోగా , ప్రాణాయామం చేయడం వల్ల శరీరం, మనస్సు , ఆత్మ సమన్వయంతో పనిచేస్తాయి. ఇవి శరీరంలో ప్రాణశక్తి ప్రవాహాన్ని మెరుగుపరచడమే కాకుండా పట్టుత్వాన్ని, శారీరక బలాన్ని పెంచుతాయి. రోజూ సూర్య నమస్కారాలు, ఊపిరితిత్తుల వ్యాయామాలు , ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇది మూడు దోషాలను సమతుల్యంగా ఉంచి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది.                           *రూపశ్రీ.