జూబ్లీహిల్ ఉప ఎన్నికలో మజ్లిస్ పార్టీ ఎవరివైపు అన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. నిన్న మొన్నటి దాకా జూబ్లీ బైపోల్ లో పోటీ అంటూ లీకులిచ్చిన మజ్లిస్ పార్టీ ఇప్పుడు పోటీలో లేదు. కాంగ్రెస్ జూబ్లీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను ప్రకటించడంతోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. మజ్లిస్ మద్దతు లేకుండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీ అయినా విజయం సాధించడం కష్టమే. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల సంఖ్య ఒకింత ఎక్కువే. బీఆర్ఎస్ జూబ్లీ బైపోల్ లో నిలబడే పార్టీ అభ్యర్థి పేరు అందరి కంటే ముందుగానే ప్రకటించి ప్రచారం ప్రారంభించేయడం, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించుకోలేక మల్లగుల్లాలు పడుతుండటంతో.. జూబ్లీ బైపోల్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును నిలబెట్టుకుంటుందన్న అంచనాలు పెరిగాయి. అయితే అందరూ ఊహించినట్లుగానే.. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఖరారు అయ్యారు. ఈయన ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాకచక్యంగా, ప్రణాళికాబద్ధంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పాల్సి ఉంటుంది. నవీన్ యాదవ్ వినా మరెవరిని అభ్యర్థిగా నిలబెట్టినా మజ్లిస్ మద్దతు లభించే అవకాశాలు లేవు. మజ్లిస్ మద్దతు లేకుండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం అంత తేలిక కాదు. అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అజారుద్దీన్ మొదలకుని ఈ నియోజకవర్గ టికెట్ కోసం రేసులో ఉన్న ఒక్కొక్కరినీ పక్కకు తప్పించి నవీన్ యాదవ్ కు టికెట్ ఖరారయ్యేలా చూశారు. ఇందుకోసం ఆయన అధిష్ఠానాన్ని ఒప్పించారు. ఎవరినీ నొప్పించకుండానే.. పక్కకు తప్పించి తాను కోరుకున్నట్లు నవీన్ యాదవ్ కు పార్టీ హైకమాండ్  టికెట్ కన్ ఫర్మ్ చేసేలా చూశారు.   అయితే జూబ్లీ బైపోల్ కు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత.. ఎన్నికల సంఘం ఫిర్యాదు మేరకు నవీన్ యాదవ్ పై కేసు నమోదు కావడంతో ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పునరాలోచనలో పడుతుందా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమయ్యాయి. అయితే కాంగ్రెస్ నవీన్ యాదవ్ నే అభ్యర్థిగా ఖరారు చేసింది.  ఇక నవీన్ యాదవ్ విషయానికి వస్తే..  ఆయనకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గట్టిపట్టు ఉంది. పైగా మజ్లిస్ పార్టీలో అనుబంధం ఉంది. తొలి నుంచీ కూడా జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఉంటే మద్దతు ఇస్తామని మజ్లిస్ లోపాయికారీగా చెబుతూ వస్తున్నది. మజ్లిస్ మద్దతు ఉంటే నియోజకవర్గ పరిధిలో దాదాపు 90 వేల పైచిలుకు ఉన్న మైనారిటీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ కు పడతాయి. అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా నవీన్ యాదవ్ అభ్యర్థిత్వమే ఖరారయ్యేలా పావులు కదిపారు. ఇక ఇప్పుడు సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని ఆశిస్తున్న బీఆర్ఎస్ తన ఆశ నెరవేరాలంటే చాలా అంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.  
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించనున్నారు.  ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  ఆయనీ పర్యటన చేపట్టారు. అయితే నేడు విశాఖలో మహిళల ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ జరగనున్నందున కాన్వాయ్ లో 10కి మించి వాహనాలు ఉండకూడదని, రోడ్ షో నిర్వహించడం, కూడళ్ల వద్ద ప్రసంగాలు చేయకూడదని ఆయన పర్యటనకు పోలీసులు షరతులు విధించారు. జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చిన పోలీసులు వైసీపీ ప్రతిపాదించిన మార్గంలో కాకుండా కొత్త రూట్ మ్యాప్ ఇచ్చి, దాని ప్రకారమే పర్యటన సాగాలని కండీషన్ పెట్టారు. పోలీసులు నిర్దేశించిన మార్గం ప్రకారం  విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ఎన్ఏడీ జంక్షన్, పెందుర్తి కూడలి మీదుగా అనకాపల్లి, తాళ్లపాలెం నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వరకు వెళ్లాల్సి ఉంటుంది.  నిర్దేశించిన మార్గంలో, నిబంధనలకు లోబడే జగన్ పర్యటన సాగాలని పోలీసులు స్పష్టంగా ఆదేశించారు. 
   జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర సీనియర్ నాయకత్వం నవీన్ యాదవ్‌‌కు మద్దతుగా ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. సర్వేలలో ఆయన ముందంజలో ఉండడం బీసీ సామాజికవర్గం మద్దతు ఉండటంతో ఆమోదించినట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో నిన్న జూబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు బొంతు రామ్మోహన్. జూబ్లీహిల్స్ అభ్యర్థిని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయిస్తుందని రామ్మోహన్ తెలిపారు.  మరోవైపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌లు ఇన్‌చార్జి మంత్రులు సూచించిన పేర్లపై సమీక్షించారు. నవీన్‌ యాదవ్‌, సీఎన్‌ రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌ పేర్లను అధిష్ఠానానికి పంపారు.లోకల్ నాయకుడు కావడం గతంలో  జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయటంతో నవీన్ యాదవ్‌ వైపు మొగ్గుచుపినట్లు తెలుస్తోంది.  2014లో మజ్లిస్ తరపున పోటీ చేసి .. 9వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. 2019లో బీఆర్ఎస్ తో అవగాహన కారణంగా మజ్లిస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. సొంత బలంతోనే మూడో స్థానంలో నిలిచారు. 2023లోనూ అదే అవగాహన కొనసాగడంతో  మజ్లిస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.  
ALSO ON TELUGUONE N E W S
పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద సినిమాల మధ్య పోటీ అనేది అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలగచేస్తుంది. మూవీ లవర్స్ అయితే మాత్రం ఎన్ని చిత్రాలు వచ్చినా కంటెంట్ నచ్చితే సూపర్ హిట్ చేయడం ఆనవాయితీ. కాకపోతే పోటీ అనేది మాత్రం కలెక్షన్స్ పరంగా ట్రేడ్ సర్కిల్స్ పై ప్రభావం చూపిస్తుంది.  డిసెంబర్ 5 న నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)అఖండ 2(AKhanda 2)తో పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్నాడు. ఈ చిత్రం ద్వారా సెల్యులాయిడ్ పై బాలయ్య  తాండవం చేయనున్నాడని, మరోసారి కెరీర్ లో  బిగ్ హిట్ ని అందుకోబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినపడుతుంది.అభిమానులు కూడా అదే నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు ఈ చిత్రంకి పోటీగా కార్తీ అప్ కమింగ్ మూవీ 'వా వాతియార్' డిసెంబర్ 5 నే పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ డేట్ ని అధికారంగా ప్రకటించారు. కార్తీకి సుదీర్ఘ కాలం నుండి తమిళ చిత్ర పరిశ్రమలో ఎంత ఆదరణ అయితే ఉందో, తెలుగులోను అంతే ఆదరణ ఉంది. విజయం సాధించిన చిత్రాల శాతం కూడా ఎక్కువే. అగ్ర నిర్మాణ సంస్థ 'స్టూడియోగ్రీన్' నిర్మిస్తుంది. ఈ సంస్థ గతంలో తెలుగులో ఎన్నో చిత్రాలని నెంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే అఖండ 2 , వా వాతియార్ మధ్య పోటీ ఉంటుందని  సినీ ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి.  వా వాతియార్(Vaa Vaathiyaar)పక్కా యాక్షన్ కామెడీ చిత్రంగా తెరకెక్కుతుండగా, కార్తీ(Karthi)పోలీస్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.మరి అఖండ 2 , వా వాతియార్ భిన్నమైన జోనర్స్. మరి రెండు చిత్రాలని ప్రేక్షకులు ఆదరించే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే పోటీ అనేది పాన్ ఇండియా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలుగచేస్తుంది. అఖండ 2 తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.    
Kalyani Priyadarshan has debuted with Hello and stayed away from glamorous roles since beginning of her career. But she broke those rules for Tamil movie, Genie. She went glamorous to pull off belly dance number with Krithi Shetty. While she is stunningly gorgeous, she is facing mixed reactions for her dance.  Recently, she created history in Malayalam Cinema with first Indian female superhero film, Lokah: Chapter 1 Chandra. The movie is on the verge of hitting RS.300 crores at the box office and it is set to become the first Malayalam Cinema ever to achieve this milestone.    She had been waiting for the release of Genie from a long time, as the movie had been put in the cold storage from some time. Jayam Ravi and Krithi Shetty are playing leading roles along with Kalyani. Now, song Abdi Abdi composed by AR Rahman, has been released from the movie and it contains both leading ladies in fear of Genie, performing belly dance.  The reactions have been mixed for Kalyani, as some of her fans are loving this avatar while people who enjoy dancing are calling out the choreography and her awkwardness. Well, the actress did state that she pushed herself for the song to try something new and looks like she might have second thoughts from next time.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'పెద్ది'. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అదిరిపోయే న్యూస్ వినిపిస్తోంది. (Ram Charan)   'పెద్ది' సినిమా 2026 మార్చి 27న విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ ఎడిట్ కూడా లాక్ అయినట్లు సమాచారం. ఇప్పటిదాకా వచ్చిన అవుట్ పుట్ పట్ల మూవీ టీమ్ చాలా హ్యాపీగా ఉందట. ఫస్ట్ హాఫ్ చూసి చరణ్ తో పాటు, ప్రొడ్యూసర్స్ ఇంప్రెస్ అయ్యారని వినికిడి. (Peddi)   రామ్ చరణ్ కెరీర్ లో 'రంగస్థలం' సినిమాకి ప్రత్యేక స్థానముంది. నటుడిగా గొప్ప పేరు తీసుకురావడమే కాకుండా, కమర్షియల్ గానూ భారీ సక్సెస్ సాధించింది. 'పెద్ది' సినిమా చరణ్ కెరీర్ లో మరో 'రంగస్థలం' అవుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది.    కాగా, 'పెద్ది'లో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కీలక పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.  
Rakshit Shetty has become a star with Kirik Party after he established his career over the years till then, with films like Simple Agi Ondh Love Story, Ulidavaru Kandanthe, Ricky, Godhi Banna Sadharana Mykattu. Rishab Shetty has become a sensational director with the film and it lead him to make Kantara, few years later.  Rishab, after a long struggle got recognition as an actor with films of Rakshit like Tuglak, Ulidavaru Kandante. With Ricky, he debuted as a director and Kirik Party made him super successful at the box office. He started acting as a lead and he joined hands with another talented Shetty, Raj B. Shetty, for Garuda Gamana Vrishabha Vahana.  The three Shettys have been affectionately revered as "Shetty Gang". Rakshit Shetty has also delivered a Pan-India hit like 777 Charlie while Rishab Shetty's Kantara and now, Kantara Chapter 1 with 426 crores+ gross is creating history. Recently, Raj B. Shetty's Su From So, has been a huge blockbuster for Kannada Cinema.  Hence, Kannada Cinema fans are calling it as Shetty Gang take over. They have been asking for Rakshit to release his next movie post Sapta Sagaradaache Ello Side A and Side B, that became a hit in other languages too. Rukmini Vasanth has become a star with the film gaining recognition in other languages.  Rakshit's Kirik Party has been the debut of Rakshmika Mandanna, who has become National Star, today. So, Kannada moviebuffs are celebrating the success of Shetty boys as Pride of Karnataka. Well, we have to wait and see, what more sensations are in store from this Gang of talented individuals.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
భారతీయ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు శిల్పాశెట్టి(Shilpa Shetty). హీరోయిన్ గా విభిన్నమైన క్యారెక్టర్స్ ని పోషించి ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఒక బడా వ్యాపార వేత్తని అరవై కోట్ల రూపాయిల మేర మోసం చేసిన కేసులో శిల్పాశెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా(Raj kundra)పై కేసు నమోదయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. ముంబై ఆర్ధిక నేరాల విభాగానికి చెందిన పోలీసులు కూడా ఈ కేసులో లుకౌట్ నోటీసులు జారీ చేసారు. దీంతో అనుమతి లేకుండా దేశం దాటి వెళ్ళకూడదు. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా లు శ్రీలంక దేశం రాజధాని కొలొంబో(Colombo)లో ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించే కార్యక్రమానికి  ఈ నెల 25 , 29 మధ్య హాజరు కావాల్సి ఉంది. దీంతో తమపై  లుకౌట్ ఆర్దర్స్ ఉన్న నేపథ్యంలో కొలొంబో వెళ్ళడానికి అనుమతి కోరుతు శిల్పాశెట్టి దంపతులు సంబంధిత కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసారు. తాజాగా కోర్టు ఆ పిటిషన్ ని తిరస్కరించింది. ఒక వేళ దేశం విడిచి వెళ్లాలంటే 60 కోట్ల రూపాయిలు డిపాజిట్ చెయ్యాలని, ఆ తర్వాతే తదుపరి విచారణ కొనసాగుతుందని కూడా కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.    
Choreographer Jani Master has faced sexual harassment accusations from Shrasti, who worked with him as his assistant for four years. Hence, the choreographer has been banned from working for a year. He had been arrested as well but now, he is back into prominence. Further, he is working once again with Ram Charan.    Ram Charan is set to commence a spectacular song shoot from tomorrow in Pune, for Peddi. The massive dance number will be choreographed by Jani Master and huge number of dancers are participating in it. As the combination of Jani and Charan have delivered huge chartbusters, this track composed by AR Rahman, has huge anticipation.  Written and directed by Buchi Babu Sana and produced by Venkata Satish Kilaru on an unprecedented massive scale, Peddi is progressing efficiently. The team has already completed 60% of the shoot, and the first half's edit has been nearly locked. Also, first half is stated to have come out well.  Janhvi Kapoor stars as the leading lady, and Shiva Rajkumar is playing a prominent role in this massive entertainer. Peddi is firmly on track for a grand multi-lingual, worldwide theatrical release on March 27, 2026, breaking all the rumors of postponement and delays.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ని కె.ఎల్.నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ కి 'SSMB 29' అనేది వర్కింగ్ టైటిల్.   'SSMB 29' సినిమా కోసం Gen 63, మహారాజ, చక్రవర్తి, గరుడ వంటి టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడు మరో టైటిల్ తెరపైకి వచ్చింది. అదే 'వారణాసి'. ఆమధ్య 'SSMB 29' సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో రూ.50 కోట్లతో వారణాసి పురాతన నగర సెట్ వేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఆ నగరం పేరే టైటిల్ గా పెడుతున్నారన్న వార్త మరింత ఆసక్తికరంగా మారింది.   'SSMB 29'ను గ్లోబల్ ఫిల్మ్ గా రూపొందిస్తున్నారు. కేవలం ఇండియన్ ప్రేక్షకుల కోసమే కాకుండా, గ్లోబల్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని టైటిల్ పెట్టాల్సి ఉంది. మరి ఈ సినిమాకి నిజంగానే 'వారణాసి' అనే టైటిల్ పెడతారా? లేక ఏదైనా ఇంగ్లీష్ టైటిల్ వైపు మొగ్గుచూపుతారా? అనేది చూడాలి.   కాగా, నవంబర్ లో 'SSMB 29' ఫస్ట్ లుక్ విడుదల కానుంది. అప్పుడే టైటిల్ పై కూడా క్లారిటీ వచ్చే అవకాశముంది.    
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వన్ మాన్ షో  'ఓజి'(OG)ద్వారా మరోసారి తను ఎంత బలమైన నటినో ప్రూఫ్ చేసుకుంది శ్రియారెడ్డి(Shriya Reddy).ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు తమ పోర్ట్ ని రక్షించుకోవడానికి చూసే 'గీత' క్యారక్టర్ లో విజృంభించి నటించిందని చెప్పవచ్చు.  ప్రీవియస్ మూవీ సలార్(Salaar)లో కూడా 'రాధారమ' రోల్ లో సూపర్ గా చేసింది. అసలు ఆ క్యారక్టర్ లో ఆమెని తప్ప మరొకర్ని ఉహించుకోలేం. ఆమె లుక్ కూడా ప్రభాస్, పృథ్వీ రాజ్ సుకుమారన్ కి ఏ మాత్రం తీసుకొని విధంగా చాలా శక్తివంతంగా ఉంది.  రీసెంట్ గా శ్రియారెడ్డి ఒక ఇంటర్వ్యూలో సలార్ లోని తన లుక్  గురించి మాట్లాడుతు సలార్ లో నా క్యారక్టర్ కి సంబంధించి కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు 50 ,60 ఫుష్ అప్స్ చేసేదాన్ని. కాస్ట్యూమ్స్ వేసుకొని ఉన్నా, క్యారవాన్ లో ఉన్నా ఇది తప్పనిసరి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఈ విషయం ముందుగానే చెప్పడంతో వాళ్ళు కూడా సీన్ విషయం కొంచం ముందుగానే చెప్పేవారు.  దాంతో పుష్ అప్స్ చేసి సీన్ లోకి ఎంటర్ అయ్యేదాన్ని. అందుకే నేను శక్తివంతురాలిగా కనిపించేదాన్ని. నా వరకైతే బస్కీలు తియ్యడం అనేది సులభమైన వర్క్ అవుట్ అని శ్రియారెడ్డి చెప్పుకొచ్చింది. 2002 లో సమురాయ్ అనే తమిళ చిత్రంతో హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీయారెడ్డి,ఆ తర్వాత ఏడాది 'అప్పుడప్పుడు' అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.2008 లో ప్రముఖ నటుడు, నిర్మాత విక్రమ్ కృష్ణ తో పెళ్లి తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. సలార్ తో నటిగా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిందని చెప్పవచ్చు. ప్రముఖ హీరో విశాల్(Vishal)కి విక్రమ్ కృష్ణ సోదరుడు.   
  2022లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'కాంతార'కి ప్రీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం 'కాంతార చాప్టర్ 1'. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ.. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఆరు రోజుల్లోనే రూ.400 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడం విశేషం. (Kantara Chapter 1)   'కాంతార చాప్టర్ 1' చిత్రం ఫస్ట్ వీకెండ్ లో అంటే మొదటి నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.335 కోట్ల గ్రాస్ రాబట్టింది. వీక్ డేస్ లోనూ అదే జోరు చూపిస్తూ.. ఐదు, ఆరు రోజుల్లో కలిపి రూ.95 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. అంటే మొదటి ఆరు రోజుల్లోనే ఈ సినిమా రూ.430 కోట్ల గ్రాస్ రాబట్టింది అన్నమాట. దీంతో కన్నడ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-2 మూవీగా 'కాంతార చాప్టర్ 1' నిలిచింది.   అప్పుడు 'కాంతార' చిత్రం ఫుల్ రన్ లో రూ.400 కోట్ల గ్రాస్ రాబడితే.. ఇప్పుడు 'కాంతార చాప్టర్ 1' చిత్రం మొదటి వారం కూడా పూర్తి కాకుండానే రూ.400 కోట్ల క్లబ్ లో చేరింది. మరి ఫుల్ రన్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.    
ప్రస్తుతం థియేటర్స్ లో 'కాంతార చాప్టర్ 1'(Kantara Chapter 1)తన హవా కొనసాగిస్తు ఆరు రోజులకే 400 కోట్లరూపాయలు వసూలు చేసి పాన్ ఇండియా మేకర్స్ కి సరికొత్త సవాలు విసిరింది. మూవీలోని చాలా సన్నివేశాలు ప్రేక్షకులని విజువల్ గా ఎంతగానో మెస్మరైజ్ చేస్తున్నాయి. మెస్మరైజ్ చేయడమే కాదు, సదరు సన్నివేశాలని ఎలా చిత్రీకరించారని కూడా థియేటర్ నుంచి బయటకి వచ్చిన ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. దీన్ని బట్టి ఆ సన్నివేశాలకి ఉన్న బలం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా 'చాప్టర్ 1 'కి ఛాయాగ్రాహకుడిగా పని చేసిన 'అరవింద్ కశ్యప్'(Arvind Kashyap)మూవీకి సంబంధించిన పలు విషయాలని ప్రేక్షకులతో  పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతు తొంబై ఐదు శాతం మూవీ మొత్తాన్ని కర్ణాటకలోని కుంజాపురంలోనే తెరకెక్కించాం. ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతు రెండేళ్ల పాటు అక్కడే ఉన్నాం. కెమెరా లైటింగ్ విషయంలో ప్రయోగాలు చేసేవాడిని. దర్శకుడు అనుకున్న అవుట్ ఫుట్ వచ్చే వరకు అందరం కష్టపడేవాళ్ళం. అటవీ ప్రాంతంలో సరైన లైటింగ్ రావడానికి వారం రోజుల సమయం పట్టేది.  పిల్లాడి చుట్టూ పులి తిరిగే సన్నివేశాలని మూవీ మొదలు పెట్టిన సంవత్సరంలోనే పూర్తి చేసాం.  పులిని విఎఫ్ఎక్స్ లో డిజైన్ చేశారనే ఫీలింగ్స్ ఆడియన్స్ కి రాకుండా ఉండటానికి, నిజమైన పులి వస్తే ఏఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలో తీసుకున్నాం. యువరాణి కనకవతి గుర్రంపై వచ్చే సీన్ కోసం చాలా కష్టపడ్డాం. లొకేషన్ అడవిలో చాలా దూరం. కుంజాపురం నుంచి గంటన్నర ప్రయాణం చేయాల్సి వచ్చేది. మరో అరగంట నడుచుకుంటు వెళ్లిన తర్వాత, నలభై ఐదు నిమిషాల పాటు ఒక కొండని ఎక్కి దిగాల్సి వచ్చేది. కేవలం మూడు నిమిషాల నిడివి గల సీన్ కి మూడు రోజులు షూటింగ్ చేసాం. ఇక వాతావరణం కూడా ఇబ్బంది పెట్టింది. ఒకసారి భారీ వర్షం కారణంగా మేము వేసిన బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో వారం పాటు అడవిలోనే ఉండిపోవాల్సి వచ్చిందని అరవింద్ కశ్యప్ చెప్పుకొచ్చాడు.          
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
   ఈ రోజుల్లో  ప్రతి ఒక్కరూ కొత్త స్మార్ట్‌ఫోన్ కావాలని కోరుకుంటారు. కానీ చాలామంది  తొందరపడి ముందు వెనుకా ఆలోచించకుండా  పాత ఫోన్‌ను అమ్మేస్తారు లేదంటే  వేరొకరికి ఇస్తారు. పాత ఫోన్ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుకు మరికొంత డబ్బు సమకూర్చుకుని కొత్త ఫోన్ కొనడం చాలామంది చేసే ప్లాన్. అయితే పాత ఫోన్ అమ్మే ముందు ఫోన్ డేటాను సరిగ్గా తొలగించకపోవడం అతిపెద్ద తప్పని సైబర్ నిపుణులు అంటున్నారు.  పాత ఫోన్ ఫోటోలు, వాట్సాప్ చాట్‌లు, బ్యాంకింగ్ వివరాలు, ఇమెయిల్‌లు,  పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని నిల్వ చేస్తుంది. అది పొరపాటు తప్పుచేసే వ్యక్తుల చేతుల్లోకి వెళితే చాలా నష్టాన్ని ఎదుర్కొవాల్సి ఉంటుంది. చాలా మంది ఫోన్ అమ్మే ముందు ఫ్యాక్టరీ రీసెట్ చేయడం లేదా తొలగించడం చేస్తే డేటా తొలగిపోతుంది అనుకుంటారు. కానీ ఇలా చేయడం  వల్ల డేటా పూర్తిగా తొలగించబడదు. అలా చేసిన డేటాను దాన్ని తిరిగి పొందవచ్చు. కాబట్టి పాత  ఫోన్‌ను విక్రయించే లేదా మార్పిడి చేసే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు  తీసుకోవడం చాలా ముఖ్యం. పాత ఫోన్ అమ్మే ముందు ఈ జాగ్రత్తలు  తీసుకోవాలి.. ఫోన్ Android Lollipop (5.0) లేదా ఆ తర్వాతి వెర్షన్‌ లో ఉంటే అందులో FRP (ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్) ఫీచర్ ఉంటుంది.  దానిని తీసివేయాలి, లేకుంటే  పాత ఫోన్ కొనే వ్యక్తి ఫోన్‌ను ఉపయోగించలేరు.  ఫోన్ పాత వెర్షన్‌ను అమలు చేస్తుంటే,  ఈ దశను స్కిప్ చేయవచ్చు.  ఫోన్ వెర్షన్‌ను చెక్  చేయడానికి, సెట్టింగ్‌లు > అబౌట్ ఫోన్ > ఫోన్ > సాఫ్ట్‌వేర్ సమాచారం కు వెళ్లాలి. ఫ్యాక్టరీ రీసెట్ చేసేముందు.. పాత ఫోన్ ను అమ్ముతున్నా లేదా.. కొత్త ఫోన్ కొనడానికి ఫోన్ ను ఎక్స్చెంజ్ కోసం ఇస్తున్నా  ఫ్యాక్టరీ రీసెట్ చేయడం సరిపోదు. ఎందుకంటే కొన్నిసార్లు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సహాయంతో పాత డేటాను తిరిగి పొందవచ్చు. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి, నకిలీ డేటాను అప్‌లోడ్ చేసే ఉపాయాన్ని కనిపెట్టారు. దీన్ని చేయడానికి.. ఫ్యాక్టరీ రీసెట్ చేసే ముందు  ఫోన్‌లోని అనవసరమైన (జంక్) డేటాను యాడ్ చేయాలి. ఇది  ఫోన్ స్పేస్ ను ఫుల్ చేస్తుంది. అంటే పెద్ద వీడియో ఫైల్‌లు, పాటలు, సినిమాలు లేదా మీకు అవసరం లేని ఏదైనా ఇతర డేటా యాడ్ చేయవచ్చు. దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, ఫోన్  అసలు డేటా ఇప్పటికే ఎన్‌క్రిప్ట్ చేయబడి, ఈ కొత్త అనవసరమైన డేటా అందులో యాడ్ చేశాక, పాత ఫైల్‌లు పూర్తిగా  హైడ్ అయిపోతాయి. అటువంటి పరిస్థితిలో,  పాత ఫోన్ కొనుక్కున్న కొత్త వ్యక్తి ఫోన్ నుండి డేటాను తిరిగి పొందడానికి ప్రయత్నించినప్పటికీ, వారు ఈ జంక్ ఫైల్‌లను మాత్రమే కనుగొంటారు,  వ్యక్తిగత సమాచారాన్ని కాదు. కాబట్టి పాత ఫోన్ అమ్మే ముందు లేదా కొత్త ఫోన్ కోసం ఎక్స్చేంజ్ కు ఇచ్చే ముందు ఈ పద్దతిని తప్పకుండా ఫాలో కావాలి.                         *రూపశ్రీ.
ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆర్థికంగా బలంగా ఉండాలని కోరుకుంటాడు.  ముఖ్యంగా డబ్బు కారణంగా ఎలాంటి సమస్యలు రాకూడదని అనుకుంటాడు.  అయితే.. చాలా మంది నేటి కాలంలో ఎదుర్కొనేది డబ్బు పరమైన సమస్యలే ఎక్కువ.  ఇలా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్న వేసుకుంటే చాలా కారణాలు కనిపిస్తాయి. డబ్బు సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనే విషయాలు చాలా తక్కువ మంది ఆలోచిస్తారు.  కొందరైతే డబ్బు లెక్కల గురించి ఇంట్లో వాళ్లు అడిగితే నేనేమైనా తిన్నానా అందరి కోసం ఖర్చు పెడుతున్నాగా అని అంటుంటారు. అయితే ఆర్థిక సమస్యలు రాకూడదన్నా,  ఆర్థికంగా బలంగా ఎదగాలన్నా కొన్ని మార్గాలు చాలా సహాయపడతాయి. అవేంటో తెలుసుకుంటే.. బలహీనతలు బయట పెట్టకూడదు.. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. అయితే ఇలా బలహీనత ఉన్నట్టు బయట ఎవరికీ చెప్పకపోవడం మంచిది.  ఎందుకంటే బలహీనతను క్యాష్ చేసుకునేవారు ఉంటారు.  ఆ బలహీనతల మీద తాము ప్రయోజనం పొందాలని అనుకునేవారు ఉంటారు. అందుకే ఆర్థికంగా ఎదగాలంటే బలహీనతలను బయటపెట్టకూడదు. తెలివిగా ఖర్చు చేయాలి.. డబ్బు సంపాదించడం కాదు.. ఖర్చు పెట్టడంలోనే అసలైన స్కిల్ దాగుంటుంది.  తక్కువ ఖర్చులు చేస్తూ ఎక్కువ పొదుపు చేస్తుంటే ఆర్థికంగా మెరుగవుతూ ఉంటారు.  తక్కువ ఖర్చు చేసినప్పుడు ఎవరైనా పిసినారి లాంటి పదాలు వాడినా పట్టించుకోకూడదు.  ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎవరూ ఒక్క రూపాయి ఇవ్వరు.  ఒకవేళ ఎవరైనా అలా ఇచ్చినా వంద రూపాయలు చేతిలో పెట్టి వేలాది రూపాయలు ఇచ్చినట్టు పబ్లిసిటీ చేసుకుంటారు. కాబట్టి ఖర్చు పెట్టడమే తెలివిగా చేయాలి. దీనివల్ల పొదుపు సాద్యమవుతుంది. వాదన.. మూర్ఖులు చాలామంది ఉంటారు.  తాము చెప్పిందే కరెక్ట్ అనుకేవారు ఎక్కువ.  అంతేకాదు.. నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం కూడా మూర్ఖత్వమే..  ఇలాంటి మూర్ఖులతో వాదన చేయడం వల్ల సమయం వృధా.. మనిషి ఆర్థికంగా ఎదగాలని ఎప్పుడైతే అనుకుంటాడో.. అప్పుడు సమయానికి విలువ ఇవ్వడం నేర్చుకోవాలి. లక్ష్యాలు.. నేను ఇది చేయాలని అనుకుంటున్నాను,  ఇది సాధించాలని అనుకుంటున్నాను.  ఇంత పెట్టుబడి పెడతాను.. ఇలాంటివి ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు. లక్ష్యం ఏదైనా సరే.. సాధించేవరకు ఎవరికీ చెప్పకుండా ఉండటం మంచిది. స్వ కష్టం.. తన కష్టాన్ని తాను నమ్ముకునేవాడు ఎప్పటికీ చెడిపోడు. తన పని కోసం  మరెవరిపైనా ఆధారపడకూడదు. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి సాధించలేనిది ఏదీ లేదు. కావలసిందల్లా తన పట్ల దృఢ సంకల్పం,  నిజాయితీ. విద్యపై దృష్టి.. విద్య అనేది ఒక వ్యక్తి జీవితానికి కీలకం. జీవితంలో పురోగతికి ఇది చాలా అవసరం.  గురువు ప్రతిచోటా గౌరవించబడతాడు. పుస్తకాలు కూడా ఒక వ్యక్తికి మంచి స్నేహితుడు. అవకాశాలు..  ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఉంటాయి. కానీ తెలివైన వారు  వాటిని గుర్తించి సరైన సమయంలో అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అలాంటి వారు  అవకాశాల కోసం వెతకాల్సిన అవసరం లేదు. అవి వాటంతట అవే తమ వద్దకు వస్తాయి.                           *రూపశ్రీ.
మనమందరం మన జీవితంలో ఏదో ఒక సమయంలో ఇతరులతో పోల్చుకుంటాము. కొన్నిసార్లు మనం ఇతరులను చూసి ఆశ్చర్యపోతుంటాము.  "అతనికి  నా కంటే మంచి ఉద్యోగం  ఎందుకు వచ్చింది?" "అతని దగ్గర పెద్ద కారు ఉంది,  నా దగ్గర లేదు ఎందుకు?" "అతను నా కంటే గొప్పగా ఎందుకున్నాడు?" ఈ ప్రశ్నలు మన మనస్సులను పదే పదే  సంఘర్షణలోకి నెట్టుతూ ఉంటాయి. ఎంత ఆపాలని అనుకున్నా ఆగవు. కానీ చాలామంది ఒకటి మరిచిపోతారు "నిన్నటి కంటే నేను మెరుగ్గా ఉన్నానా?" అని తమను తాము ఎప్పుడూ ప్రశ్నించుకోరు. వ్యక్తి జీవితంలో గుర్తింపు అనేది ఇతరులతో పోల్చుకుంటే వచ్చేది కాదు.. జీవితంలో ఏదో ఒకటి నేర్చుకుంటూ,  ఏదో ఒకటి చేస్తూ ఉండటం ద్వారా  ఎదుగుతూ ఉంటే అప్పుడు గుర్తింపు వస్తుంది.  అందుకే ఇతరులతో పోల్చుకోవడం చాలా హానికరం అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు. ఇతరులతో పోల్చుకోవడం ఎందుకు హానికరం? సాధారణంగా మన చుట్టూ జరిగే విషయాలను గమనించడం ద్వారా నేర్చుకోవడం మానవ స్వభావం. ఈ ప్రక్రియలో ఇతరులతో పోల్చుకోవడం కూడా జరుగుతుంది. ఇలా పోల్చుకోవడం ప్రారంభించినప్పుడు  తరచుగా నేర్చుకోవడంలో  విఫలమవుతాము. ఈ అలవాటు తెలియకుండానే  పెరుగుతుంది.  ఈ అలవాటు వ్యక్తులను  బలహీనపరుస్తుంది. దీని వల్ల  తమను తాము తక్కువ చేసుకుని చూసుకోవడం అనే పెద్ద తప్పు చేస్తుంటాం. ఇతరులతో పోల్చుకుంటే జరిగేది ఇదే.. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది.. మనం పదే పదే ఇతరులతో పోల్చుకున్నప్పుడు, మన  ప్రయత్నాలు,  విజయాలు చిన్నవిగా అనిపిస్తుంటాయి.  ఎప్పుడూ ఇతరులకంటే తక్కువ అనుకుంటూ ఉంటే పెద్ద విజయాల వైపు ఆలోచన కూడా క్రమంగా తగ్గుతుంది.చేతులారా ఎదుగుదలను నరికేసుకున్నట్టే అవుతుంది. మెదడుపై భారం పెరుగుతుంది.. సోషల్ మీడియాలో చాలామంది సక్సెస్ ఫుల్ లైఫ్ ను చూపిస్తూ ఉంటారు. తమ గెలుపును మాత్రమే చూపిస్తారు.  అయితే ఇలా కేవలం గెలుపును మాత్రమే చూసేవారికి గెలుపు వెనుక,  సంతోషం వెనుక కష్టం, బాధ,  ఇబ్బందులు ఇలా అన్నీ ఉంటాయి.   పోల్చుకున్నప్పుడు తమకు ఎప్పుడూ కష్టాలు, ఇబ్బందులు తప్ప సంతోషం అనేది లేదు అనే అభిప్రాయం ఏర్పడి మెదడుపై భారం పడుతుంది. ఎదుగుదల తగ్గుతుంది..  ఇతరుల జీవితాలపై మాత్రమే దృష్టి పెట్టినప్పుడు, మన స్వంత బలాలు,  కలలను మరచిపోతాము. మన ఆలోచన, సామర్థ్యం  తప్పుదారి పడుతుంది.  దీని వలన మనం చేయవలసిన పనులు సరైన ఎఫర్ట్ పెట్టి  చేయము. కాబట్టి పోల్చుకునే అలవాటు మనిషిని పోటీ తత్వంలోకి తీసుకెళ్తుంది అనే మాటను పక్కన పెడితే మనిషిలో కాన్పిడెంట్ తగ్గించి జీవితంలో ఎదుగుదలను నెమ్మదిచేసే అవకాశమే ఎక్కువ. అందుకే పోల్చుకోవడం మంచిది కాదు.                                      *రూపశ్రీ.
  యాలకులు ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఒకటి.  వీటి ధర ఇప్పుడు బాగానే ఉంది.  చాలామంది యాలకులను స్వీట్లు,  ట్రెడిషన్ వంటకాలలోనూ, మసాలా పొడుల తయారీలోనూ, బిర్యానీ వంటి మసాలా వంటకాల తయారీలోనూ వాడుతుంటారు. ఈ సుగంధ ద్రవ్యాలు కేవలం  రుచిని, సువాసనను మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. వీటిలో చాలా ఔషద గుణాలు ఉంటాయి. భోజనం తర్వాత కొందరికి ఏదో ఒకటి నోట్లో వేసుకుని నమిలే అలవాటు లేదా తినే అలవాటు ఉంటుంది.  ఇవి జీర్ణశక్తిని ప్రోత్సహిస్తాయని చెబుతారు. కొందరు సొంపు తింటారు. మరికొందరు తాంబూలం తింటారు. అయితే భోజనం తరువాత ఒక యాలకు నోట్లో వేసుకుని మెల్లిగా నమిలి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో తెలుసుకుంటే.. జీవక్రియను మెరుగుపరుస్తుంది.. యాలకులలో యాంటీ ఇన్ఫమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. భోజనం తర్వాత  యాలకులు తినడం వల్ల  గ్యాస్,  ఆమ్లతత్వం,  మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మౌత్ ప్రెషనర్.. యాలకులు మంచి సువాసన కలిగి ఉంటాయి. ఉల్లి, వెల్లుల్లి లాంటి వాసన కలిగిన ఆహారాలు లేదా మసాలా ఆహారాలు తిన్న తర్వాత నోరు వాసన వస్తూ ఉంటుంది.  అలాంటప్పుడు ఆహారం తిన్న తర్వాత యాలకు తింటే మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది.  శ్వాసను తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. నిద్రను మెరుగుపరుస్తుంది.. రాత్రి భోజనం తర్వాత పడుకునే ముందు పచ్చి ఏలకులు తినడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది. ఇది శరీరంలో  సెరోటోనిన్ స్థాయిలను పెంచి మంచి నిద్రకు సహాయపడుతుంది. రక్తపోటు.. యాలకులు తినడం వల్ల రక్తపోటును కూడా నియంత్రించవచ్చు. యాలకులలో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కొవ్వును తగ్గిస్తుంది.. యాలకులు ఊబకాయాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.  ఇది శరీరం నుండి టాక్సిన్లను తొలగించి ఊబకాయాన్ని తొలగిస్తుంది. ల్యుకోరియా.. ల్యుకోరియాతో బాధపడుతున్న మహిళలకు యాలకులు ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతారు.  రెండు యాలకులను బాగా నమిలి తిని, నీరు తాగడం వల్ల ఉపశమనం లభిస్తుందట. నోటి పూతలు.. నోటి పూతలు ఇబ్బంది పెడుతుంటే యాలకులను నోట్లో వేసుకుని నెమ్మదిగా నమిలి తినాలి. ఇది నోటి పూత నొప్పి, పుండు నుండి ఉపశమనం లభిస్తుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  కొంతమంది కూర్చొన్నప్పుడు, పడుకున్నప్పుడు  చేతులు లేదా కాళ్ళలో జలదరింపుగా ఉంటుందని కంప్లైంట్ చేస్తుంటారు. ఇది సాధారణంగా ఒకే స్థితిలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల నరాల కుదింపు వల్ల సంభవిస్తుంది,  ఇది కాలక్రమేణా తగ్గిపోతుంది. అయితే ఇలా  జలదరింపు  ఉండటాన్ని పదే పదే..  ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా అనుభవిస్తుంటే మాత్రం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జలధరింపుకు కారణం.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఒక ముఖ్యమైన విటమిన్  అయిన విటమిన్ B12 లోపానికి  ప్రారంభం కావచ్చని అంటున్నారు. ఈ విటమిన్ మన నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి చాలా అవసరం. విటమిన్ బి12  లోపం  నరాలు శాశ్వతంగా  నష్టానికి గురికావడానికి కారణమవుతుంది. విటమిన్ బి12 లోపిస్తే.. చేతులు,  కాళ్ళలో జలదరింపు  ఇతర వ్యాధులకుకు కూడా సంకేతంగా ఉంటుంది. వీటిలో  మధుమేహం, విటమిన్ బి12 లోపం, నరాల నొప్పి, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, థైరాయిడ్, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ మొదలైనవి ప్రధానంగా ఉన్నాయి. అయితే   చాలా సందర్భాలలో ఇది విటమిన్ బి12 లోపం వల్ల ఎక్కువగా వస్తుంది.అసలు విటమిన్ బి12 లోపం లక్షణాలు ఎలా ఉంటాయో పూర్తీగా తెలుసుకుంటే.. విటమిన్ బి 12 ఎందుకు ముఖ్యమైనది? విటమిన్-బి12 ను కోబాలమిన్ అని కూడా పిలుస్తారు.  ఇది  శరీరానికి అవసరమైన పోషకం. దీని ప్రాథమిక విధి నరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం,  వాటిని రక్షించే మైలిన్ తొడుగును ఏర్పరచడం. ఇది శరీరమంతా ఆక్సిజన్‌ను మోసుకెళ్ళే ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి12 లోపం  నాడీ వ్యవస్థను,  రక్తాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. విటమిన్ బి12 లోపం  ఇతర లక్షణాలు.. విటమిన్ బి12 లోపం ఉన్నప్పుడు చేతులు,  కాళ్ళలో జలదరింపు లేదా తిమ్మిరి మాత్రమే కాకుండా శరీరంలో ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. చాలా అలసటగా,  బలహీనంగా అనిపిస్తుంది. నడుస్తున్నప్పుడు తడబడటం లేదా బాలెన్స్డ్ గా ఉండలేకపోవడం జరుగుతుంది.  తరచుగా నోటి పూతలు, లేదా నోరు, నాలుక ఎర్రగా మారడం జరుగుతుంది. చర్మం కొద్దిగా పసుపు రంగులోకి మారడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళం లేదా చిరాకుగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. విటమిన్-బి12 లోపం ఎవరికి  వచ్చే ప్రమాదం ఎక్కువ.. శాఖాహారులు విటమిన్ బి12 లోపం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ విటమిన్ సహజంగా మాంసాహార ఆహారాలైన మాంసం, చేపలు, గుడ్లు వంటివాటిలో ఎక్కువ. అలాగే  పాల ఉత్పత్తులలో కూడా ఉంటుంది. వృద్ధులలో కడుపులో జీర్ణరసాలు తగ్గడం వల్ల   పోషకాల శోషణ తగ్గవచ్చు. జీర్ణ వ్యాధులైన క్రోన్'స్ వ్యాధి వంటివి ఉన్నవారికి కూడా విటమిన్ బి12 లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పరిష్కారమేంటి..? మాంసాహారులైతే, గుడ్లు, చేపలు,  మాంసాన్ని  ఆహారంలో చేర్చుకోవచ్చు. శాఖాహారులు పాలు, పెరుగు, జున్ను,  ఇతర పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు. ఫోర్టిఫైడ్ తృణధాన్యాలు, ఈస్ట్,  సప్లిమెంట్ల ద్వారా శాకాహారులు విటమిన్-బి12 పొందవచ్చు.  పైన పేర్కొన్న లక్షణాలను కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. విటమిన్-బి12 లోపాన్ని గుర్తించడానికి ఒక సాధారణ పరీక్ష నిర్వహిస్తారు.  ఈ పరీక్ష అనంతరం విటమిన్-బి12 లోపం ఉంటే.. ఆహారం,  సప్లిమెంట్లు సూచిస్తారు. *రూపశ్రీ.
  ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ద్రాక్షలో కూడా వివిధ రకాలు ఉన్నాయి. వీటిలో గ్రీన్ గ్రేప్స్,  బ్లాక్ గ్రేప్స్ తో పాటు.. ఎర్రగా ఉండే గ్రేప్స్,  చూడ్డానికి నేరేడు పండ్లలాగా పొడవుగా ఉండే గ్రేప్స్ ఇలా రకరకాలు ఉన్నాయి.  అయితే సీజన్ లోనే లభించే ద్రాక్షను ఎప్పుడైనా తినడానకి, ఆరోగ్యంగా ఉండటానికి డ్రై ఫ్రూట్ రూపంలో తీసుకుంటారు. వీటిలో ఒకటైన నల్ల ఎండు ద్రాక్ష గురించి చాలామందికి తెలియదు. చాలామంది గ్రీన్ ఎండు ద్రాక్షనే తింటుంటారు. కానీ నల్ల ఎండుద్రాక్ష గురించి, దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.  ఇంతకీ నల్ల ఎండుద్రాక్ష తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. ఎముకల బలం.. నల్ల ఎండు ద్రాక్షలో బోరాన్ ఉంటుంది.  ఇది ఆరోగ్యకరమైన, బలమైన ఎముకలకు చాలా మంచిది.  ఇది బాగా సహాయపడుతుంది. వీటిని రెగ్యులర్ గా కొద్ది మొత్తంలో తీసుకోవడం వల్ల అస్థియోపోరోసిస్ వంటి వ్యాధులను నివారించవచ్చు. చర్మ వ్యాధులు.. నల్ల ఎండుద్రాక్షలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి.  ఇవి చర్మ వ్యాధులను,  బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు.. నల్ల ఎండుద్రాక్ష తింటే అధిక రక్తపోటు తగ్గుతుంది. వీటిలో ఉండే ఫైబర్,  పొటాషియం,  పాలీ ఫెనాల్స్ రక్తపోటును సాధారణంగా ఉంచడంలో సహాయపడతాయి. రక్తహీనత.. సాధారణంగా రక్తహీనతతో ఇబ్బంది పడేవారికి గ్రీన్ ఎండుద్రాక్ష,  ఖర్జూరం తినమని సలహా ఇస్తుంటారు. వాటితో పాటు నల్ల ఎండుద్రాక్ష కూడా తినవచ్చు.  నల్ల ఎండుద్రాక్షలో ఐరన్ కంటెంట్ బాగుంటుంది.  ఇది రక్తహీనతను తగ్గించడానికి,  శరీరంలో హిమోగ్లోబిన్ పెరగడానికి సహాయపడుతుంది. రెగ్యులర్ గా నల్ల ఎండుద్రాక్ష తీసుకుంటూ ఉంటే శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ .. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా  ఉంటే అది గుండె,  కాలేయం, రక్తనాళాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.  ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశం కూడా ఉంటుంది.  అయితే నల్ల ఎండుద్రాక్ష తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్  కు చెక్ పెట్టవచ్చు.  నల్ల ఎండుద్రాక్షలో పాలీ ఫెనాల్స్ అధికంగా ఉంటాయి.  ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇమ్యూనిటీ.. నల్ల ఎండుద్రాక్ష రోగనిరోధక శక్తని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. నల్ల ఎండుద్రాక్షలో ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు  శరీర రోగనిరోధక శక్తిని  పెంచడంలో సహాయపడతాయి. హెయిర్ ఫాల్.. నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యల్లో హెయిర్ ఫాల్ ఖచ్చితంగా ఉంటుంది.  హెయిర్ ఫాల్ తో ఇబ్బంది పడేవారు నల్ల ఎండుద్రాక్ష తినడం వల్ల హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టవచ్చు.  ఇందులో ఉండే ఐరన్, విటమిన్-సి వంటి లక్షణాలు జుట్టు రాలడాన్నిఆపుతాయి.  అంతేకాదు.. జుట్టు ఆరోగ్యంగా పెరగడంలోనూ, జుట్టు  నల్లగా ఉండటంలోనూ సహాయపడతాయి.                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...