జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం డివిజన్ల వారీగా మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు అప్పగించారు. యూసఫ్ గూడ డివిజన్  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్  రహమత్ నగర్ డివిజన్‌కు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంగల్ రావు నగర్ డివిజన్‌‌కు  తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి సోమాజిగూడ డివిజన్‌‌కు   శ్రీధర్‌ బాబు, అడ్లూరి లక్ష్మణ్  బోరబండ డివిజన్ మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవి  షేక్ పేట్ డివిజన్‌‌కు  కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి ఎర్రగడ్డ డివిజన్‌‌కు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు ప్రచార బాధ్యతలు ఇచ్చారు. మరోవైపు జూబ్లీ బైపోల్  కీలక దశకు చేరుకున్నది. ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఇక్కడ గెలుపు కోసం మూడు పార్టీల నేతలూ చెమటోడుస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇప్పటికే మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.  మరోవైపు బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు దానిని మరింత ముమ్మరంచేసింది. ఆ పార్టీ అగ్ర నాయకులు కేటీఆర్‌, హరీశ్‌ రావు గత వారం రోజులుగా నియోజక వర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో కమలం పార్టీకి కఠిన పరీక్ష ఎదుర్కొన్నారు.  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉండడంతో ఇక్కడ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే భారమంతా ఆయనపైనే పడుతోంది. పార్టీ గెలిచినా ఓడినా బాధ్యత అంతా కిషన్‌రెడ్డిదే అనే ప్రచారం పార్టీలో సాగుతోంది. దీంతో కిషన్‌రెడ్డి ఈ ఎన్నికను సవాల్‌గా తీసుకున్నారని కాషాయ పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం కిషన్‌రెడ్డి మార్గదర్శనంలోనే ఎన్నికల ప్రచారం జరుగుతోంది.    
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు, శ్రేణులకు మంగళవారం (అక్టోబర్ 28) ఓ పిలుపు నిచ్చారు. మొంథా తుపాను సమయంలో బాధితులకు అండగా నిలవాలి, సహాయ కార్యక్రమాలలో పాల్గొనాలన్నది ఆ పిలుపు సారాంశం. సరే  రాష్ట్రంలో విపత్తు సంభవించినప్పుడు ప్రజలకు అండగా ఉండాలన్న పిలుపునివ్వడం ముదావహం. కానీ ఇంతకీ ఆ పిలుపునిచ్చిన నాయకుడు ఎక్కడున్నారు? రాష్ట్రాన్ని పెను తుపాను అతలాకుతలం చేస్తుంటే.. దగ్గరుండి పార్టీ శ్రేణులకు సహాయ పునరావాస కార్యక్రమాలలో పాల్గొనేలా దిశా నిర్దేశం చేయాల్సిన ఆయన రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడకుండా.. బెంగళూరు ప్యాలెస్ లో విశ్రాంతిగా కూర్చుని పార్టీ నేతలూ, శ్రేణులను సహాయ పునరావాస కార్యక్రమాలలో పాల్గొనాలంటూ పిలుపునచ్చి చేతులు దులిపేసుకోవడమేంటని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.  వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు బెంగళూరు వెళ్లారు. ఆయన ముందుగా నిర్ణయించిన మేరకు మంగళవారం (అక్టోబర్ 28)కి తాడేపల్లి రావాల్సి ఉంది. అయితే వాతావరణ ప్రతికూలత కారణంగా విమానాలు రద్దు కావడం వల్ల రాలేకపోతున్నారంటూ వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ.. శుక్రవారం నుంచే రాష్ట్రాన్ని పెను తుపాను ముప్పు ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఆదివారం (అక్టోబర్ 26)నాటికి అయితే తుపాను తీవ్రత అధికంగా ఉండబోతోందన్న క్లారిటీ కూడా వాతావరణ శాఖ ఇచ్చేసింది. తుపాను కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందనీ ప్రకటించింది. అంటే జగన్ కు  తుపాను సహాయ కార్యక్రమాలలో పాల్గొనే విషయంలో సీరియస్ నెస్ ఉంటే.. ఆదివారమే బయలుదేరి తాడేపల్లికి చేరుకోవచ్చు. కానీ మంగళవారం వరకూ అంటే తుపాను తీరం దాటే రోజు వరకూ బెంగళూరులోనే ఉండిపోయారు. ఇప్పుడు తీరిగ్గా విమానాలు రద్దయ్యాయి కనుక రాలేకపోతున్నానంటూ ఓ ప్రకటన విడుదల చేయించారు.  అయితే జగన్ తీరు తొలి నుంచీ ఇదే విధంగా ఉందనీ, గతంలో కూడా ఆయన విపత్తు సమయంలో కాకుండా, ఆ తరువాత అంతా సర్దుమణిగాకా ఆర్భాటంగా పరామర్శ యాత్రలు చేసే వారనీ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.  ఆయన సీఎంగా ఉన్న సమయంలో విపత్తులు సంభవించిన సమయాలలో కూడా ఆయన తీరిగ్గా వీలు చూసుకుని ఓ సారి వెళ్లి పరామర్శించి రావడం తప్ప సహాయ పునరావాస కార్యక్ర మాలను పర్యవేక్షించి, అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసిన సందర్భం లేదని అంటున్నారు.
నాలుగు దశాబ్దాలకు పైబడిన ప్రజా జీవితంలో  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నో మైలు రాళ్లను అధిగమించారు. ఎన్నెన్నో విజయాలను సాధించారు. రాజకీయ నేపథ్యం లేకుండా ఒక సాధారణ కుటుంబం నుంచి ఆయన రాజకీయాలలోకి ప్రవేశించి అనితర సాధ్యమనదగ్గ విజయాలను అందుకున్నారు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా సుదీర్ఘకాలం ఉన్నారు. అటువంటి చంద్రబాబునాయుడిని రాజకీయ వైరంతో విమర్శలు చేసే వారు ఉంటే ఉండొచ్చు కానీ, దార్శనికత, పాలనా దక్షతకు సంబంధించి ఆయనను వేలెత్తి చూపేవారెవరూ దాదాపు ఉండరనే చెప్పాలి. ఎప్పుడో.. దాదాపు మూడు దశాబ్దాలకు పూర్వమే..  కొండలు గుట్టల నడుమ చంద్రబాబు నాయుడు  ముందు చూపుతో  నాటిన ఐటీ విత్తనం, మహావృక్షమై ఇప్పుడు సైబరాబాద్ గా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. ఆ నాడు చంద్రబాబు విజన్  యువత  భవితకు బంగరు బాటలు పరిచింది. ఈ విషయాన్ని ఎవరూ కాదనరు.. కాదనలేరు.  నిజానికి ఐటీ అంటే అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పడూ కూడా చంద్రబాబే గుర్తుకు వస్తారు.  చంద్రబాబు నాయుడు కృషి, పట్టుదల వల్లనే మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలు హైదరాబాద్ నగరానికి వచ్చాయి. చంద్రబాబు ముందు చూపు వల్లనే  ఐఎస్‌బీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్ వచ్చాయి. రాజకీయ విభేదాలతో ఆయన ఘనతను పొలిటీషియన్లు బాహాటంగా అంగీకరించకపోవచ్చు.. కానీ మేధావులు, రాజకీయాలతో సంబంధం లేని అధికారులు, అందులోనూ కేంద్రంలో ఉన్నత స్థాయిలో  వివిధ విభాగాలకు అధిపతులుగా పని చేసిన వారూ మాత్రం చంద్రబాబు దార్శనికతకు ఫిదా అవ్వడమే కాదు.. పదవీ విరమణ తరువాత వారి ఆత్మకథలలో చంద్రబాబు విశిష్ఠతను, ఆయన ఔన్నత్యాన్ని గొప్పగా ప్రస్తావించారు. ప్రస్తావిస్తున్నారు.  అలాంటి వారిలో నీతీ ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్‌.  కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్య‌ద‌ర్శి సుభాష్ చంద్ర‌గార్గ్‌ లు కూడా ఉన్నారు. వీరిద్దరూ కూడా రాజకీయాలతో ఇసుమంతైనా సంబంధం లేని వారే. పైగా వారు చంద్రబాబును ప్రస్తుతిస్తూ, ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వారి వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప.. ఎవరి ఒత్తడి, ప్రోద్బలంతో చేశారని అనుకునేందుకు అవకాశమే లేదు.    ముందుగా నీతి ఆయోగ్ మాజీ  సీఈవో అమితాబ్ కాంత్ విషయానికి వస్తే.. ఇటీవల ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో విశాఖ‌కు గూగుల్‌ డేటా కేంద్రం రావ‌డంపై స్పందించారు.  విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడం అన్నది మామూలు వ్యక్తులు, సీఎంల వల్ల సాధ్యమయ్యే పని కాదనీ,  చంద్రబాబు వంటి విజనరీ వల్ల మాత్రమే సాధ్యమౌతుందని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు. ఆయన దూరదృష్టి విశాఖపట్నాన్ని మాత్రమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ను, ఇండియాను కూడా ప్రపంచానికి మేటిగా నిలబెడతాయని పేర్కొన్నారు.   ఇది కూడా చదవండి అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్య‌ద‌ర్శి సుభాష్ చంద్ర‌గార్గ్‌ గార్గ్ కూడా చంద్రబాబు ఆంధ్రాఫస్ట్ విధానాన్ని ఒకింత క్రిటికల్ గా ప్రశంసించారు. చంద్రబాబు స్వార్థపరుడు అంటూనే.. ఆయన స్వార్థం వ్యక్తిగతమైనది కాదనీ, ఏపీని అత్యున్నతంగా నిలబట్టాలన్నదే ఆయన స్వార్థమని పేర్కొన్నారు. చంద్రబాబు   విజ‌న్‌.. ప్రణాళిక‌లు అనితర సాధ్యమంటూ ఆయన తన బయోగ్రఫిలో పేర్కొన్నారు. గ‌తం లో వాజ‌పేయిని ఒప్పించి ఉమ్మ‌డి రాష్ట్రానికి స్వ‌ర్ణ చ‌తుర్భుజి జాతీయ ర‌హ‌దారులు తెచ్చుకోవడాన్నీ, ఇప్పుడు ప్రధాని మోడీని మెప్పించి.. పలు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేలా చేసుకుంటున్నారనీ వివరించారు.  నిజమే చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలు, స్వార్థ రాజకీయాలు కాదు.. ఆంధ్రఫస్ట్ అన్నదే నినాదం. అందుకే చంద్రబాబు   అవకాశం వచ్చిన ఏ సందర్భంలోనూ ఆయన  స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాకులాడలేదు.  రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం మాత్రమే పాటుపడుతున్నారు. అవకాసం ఉన్న అన్ని విధాలుగానూ కేంద్ర నిధుల కోసం  వెంట పడుతున్నారు.   కేంద్రం ఒకదాని వెంట ఒకటిగా రాష్ట్రానికి  ప్రాజెక్టుల్ని ప్రటికటించేలా తన పరపతిని ఉపయోగిస్తున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
Adivi Sesh has established himself as a successful star at the box office with his thrillers. He started an unprecendented success streak with Kshanam and continued it with Goodachari, Evaru, Major, HIT: The Second Case. After a four year gap, he is releasing his solo-starrer Dacoit on 19th March, for Ugadi festival.  The movie stars Mrunal Thakur in the leading lady role after Shruti Haasan exited the film. Sesh took time to perfect Uttarandhra slang for the film and the shoot is going on at a slow pace giving more importance to perfection. Well, big festival releases for Tier-2 stars did not yield great results.  Siddhu Jonnalagadda's Telusu Kada released for Diwali and failed to entertain audiences. Similarly, Kiran Abbavaram K-Ramp failed despite good inital push as a youthful entertainer. Vijay Deverakonda had bad results with NOTA and The Family Star being festival releases.  Nani's Dasara became a superhit but he prefers to release most of films away from big competition during festival period around Christmas. Now, Adivi Sesh has boldly looked at Christmas day or Ugadi Day release for Dacoit. Within a week two biggies - Ram Charan's Peddi and Nani's The Paradise are releasing on massive scale.  Hoping for at least two week free run, many of the young actors look to give such gap from big movies. Teja Sajja's Mirai, Bellamkonda Srinivas's Kishkindhapuri released two weeks before Pawan Kalyan's OG. Looking at all these factors, Dacoit seems to be taking a huge risk. Let's see how Adivi Sesh thriller fares for a festival release.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Telangana Chief Minister Revanth Reddy has announced a groundbreaking measure to ensure film industry workers receive a fair share of increased movie revenues. The Chief Minister pointed out that while higher cinema ticket prices significantly boost the earnings of producers and lead actors, the financial benefit rarely reaches the thousands of technicians and laborers on the ground. To rectify this imbalance, CM Revanth Reddy proposed a clear mandate. He said, "If cinema ticket rates are increased, it generates income for the producers and heroes, but the workers see no such profit". He further added, "We must ensure that 20% of that incremental revenue is allocated to the workers." Further Revanth Reddy confirmed that the state government will issue a Government Order, GO, to formalize this directive. This initiative is expected to establish a major new welfare standard and revenue-sharing model for the Telugu film industry workforce. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  - ఇండస్ట్రీ కి షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి  - హీరోలు, నిర్మాతలు ఏం చేస్తారు - సినీ ఫెడరేషన్ కి రేవంత్ రెడ్డి గిఫ్ట్  ఇప్పడు నడుస్తుంది పాన్ ఇండియా ట్రెండ్. ఈ పాన్ ఇండియాట్రెండ్ లో ముందు వరుసలోఉంది మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ. ఇందుకు కారణం మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా అత్యంత భారీ వ్యయంతో నిర్మించడమే. మరి ఈ లెక్కన నిర్మాత ఎంత ఖర్చు చేస్తాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అందుకే సదరు నిర్మాతలని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతిని ఇస్తున్నాయి.   రీసెంట్ గా హైదరాబాద్ లో తెలుగు సినిమాకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ మీటింగ్  జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభకి ముఖ్య అతిదిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతు సినిమా టికెట్ రేట్లు  పెంచితే నిర్మాతలకి, హీరోలకి ఆదాయం వస్తుంది. కానీ కార్మికులకి  ఎలాంటి లాభం లేదు. కాబట్టి టికెట్ రేట్స్ పెంచితే వచ్చిన ఆదాయంలో 20 శాతం కార్మికులకి ఇవ్వాలి. ఈ మేరకు జివో ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది.   Also read: బాహుబలి ఎపిక్, మాస్ జాతర ని దెబ్బకొట్టబోతున్న మరో మూవీ!  
  - టాలీవుడ్ లో క్రేజీ మల్టీస్టారర్ - యంగ్ హీరోతో కలిసి రవితేజ డబుల్ ధమాకా   మల్టీస్టారర్ సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ లో ఓ క్రేజీ మల్టీస్టారర్ కి అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఓ యంగ్ హీరోతో కలిసి మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. (Ravi Teja)   కెరీర్ స్టార్టింగ్ లో పలువురు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న రవితేజ.. హీరోగా నిలదొక్కుకున్న తర్వాత ఎక్కువగా సోలో సినిమాలే చేస్తూ వస్తున్నారు. రెండేళ్ల క్రితం చిరంజీవి సినిమా 'వాల్తేరు వీరయ్య'లో ప్రత్యేక పాత్రలో కనిపించి సర్ ప్రైజ్ చేశారు. అలాంటిది ఇప్పుడు రవితేజ ఓ మల్టీస్టారర్ కి సిద్ధమవుతున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది.   రవితేజ, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందిస్తున్న ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించే అవకాశముంది అంటున్నారు. ప్రసన్నకుమార్, త్రినాథరావు నక్కిన కలిసి గతంలో రవితేజతో 'ధమాకా' సినిమా చేయడం విశేషం. (Naveen Polishetty)   ప్రసన్నకుమార్ రైటర్ అంటే కామెడీ సినిమా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. రవితేజ కామెడీ టైమింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. అలాగే నవీన్ పోలిశెట్టి కూడా చేసింది తక్కువ సినిమాలే అయినా.. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటిది రవితేజ-నవీన్ కలిస్తే ఎంటర్టైన్మెంట్ డబుల్ అవుతుంది అనడంలో డౌట్ లేదు.   Also Read: పవర్ స్టార్ ఊచకోత.. ఓటీటీలో ఓజీకి దిమ్మతిరిగే రెస్పాన్స్!   ప్రస్తుత సినిమాల విషయానికొస్తే అక్టోబర్ 31న 'మాస్ జాతర'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు రవితేజ. అలాగే 2026 సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాతో అలరించనున్నాడు. నవీన్ కూడా 'అనగనగా ఒక రాజు' చిత్రంతో 2026 సంక్రాంతి బరిలో దిగనున్నాడు.  
  - మూవీ లవర్స్ లో జోష్  - థియేటర్స్ లో పండుగ వాతావరణం  - బాహుబలి ఎపిక్, మాస్ జాతర కి షాక్  - 'మొంథా' తుఫాన్ ప్రభావం ఉంటుందా!   దసరా, దీపావళి లాంటి పండగలు అయిపోయినా మూవీ లవర్స్ అందరు మరో రెండు పండుగల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ రెండు పండుగల పేర్లే బాహుబలి ఎపిక్(Baahubali Epic), మాస్ జాతర(Mass Jathara). ప్రభాస్(Prabhas),రాజమౌళి(Rajamouli)ల బాహుబలి పార్ట్ 1 ,పార్ట్ 2 కలిపి మూడుగంటల నలభై నిమిషాలతో ఈ నెల 31 న రీ రిలీజ్ అవుతుండటం, రవితేజ మరోసారి తన మార్క్ అంశాలతో నవంబర్ 1 న మాస్ జాతర తో వస్తుండటంతో సినీ ప్రేమికులు ఫెస్టివల్ మూడ్ లో ఉన్నారు.   కానీ ఇప్పుడు ఈ రెండు చిత్రాలకి 'మొంథా'(Montha)తుఫాన్ అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొంథా తఫాన్ ప్రభావం వల్ల గత రెండు రోజుల నుంచే ఆంధ్రప్రదేశ్ లోని చాలా ఏరియాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. సెలవలు కూడా ప్రకటించడంతో అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరం అయితే బయటకి రావద్దని ప్రభుత్వం కూడా వెల్లడి చేసింది. పైగా ఈ రోజు అర్ధరాత్రి  'మొంథా' కాకినాడ సముద్రం వద్ద  తీరం దాటనుంది. దీంతో ఇది వాయుగుండంగా మారి ఏపీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.  ప్రభుత్వాలు  రెడ్ అలెర్ట్  కూడా జారీ చేసాయి. తెలంగాణలోని కూడా ఈ ప్రభావంతో  చాలా ఏరియాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంటున్నారు.    Also read: ఎందుకు ఈ బెదిరింపులు! మనమంతా ఒకటేగా   ఈ రెండు చిత్రాలు అక్టోబర్ 31 , నవంబర్ 1 విడుదల అవుతున్నాయి కాబట్టి అప్పటికి వర్షం తగ్గుతుందని అనుకున్నా, దీనిపై వాతావరణ శాఖ ఖచ్చితమైన హామీని ఇవ్వడం లేదు. వాయుగుండం రోజుకి ఒక రకంగా తన గమనాన్ని మార్చుకుంటుంది. మరి రిలీజ్ కి ఇంకా ఎన్నో రోజులు లేదు. ఒక వేళ మూవీ లవర్స్ తపస్సు ఫలించి వర్షాలు తగ్గాయే అనుకుందాం. కానీ వర్షాల నుంచి అప్పుడే తేరుకున్న ప్రేక్షకులు థియేటర్స్ కి ఎంత వరకు వెళ్తారో అనే  డౌట్ ని సోషల్ మీడియా వేదికగా పలువురు వ్యక్తం చేస్తున్నారు. జనరల్ గా ఒక సినిమాని మరో సినిమా దెబ్బ కొడుతుంది. ఈ లెక్కన 'మొంథా' ని కూడా ఒక సినిమాగా బావించవచ్చనే కామెంట్స్  కూడా సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి.   
The versatile actor Thiruveer and Teena Sravya star together in “The Great Pre-Wedding Show.” The film is jointly produced by Sandeep Agaram and Ashmitha Reddy under the By 7PM and Puppet Show Productions banners, directed by Rahul Srinivas, with Kalpana Rao as co-producer. The movie is set for a grand release on November 7. The teaser, glimpses, and title posters already created strong buzz. On Tuesday, the team launched the trailer at a grand event attended by several prominent directors including Karuna Kumar, Yadhu Vamsi, Aditya Hassan, Ram Abbaraju, Sunny, Dushyant, Uday Gurrala, Rupak, Teja, and Nand Kishore. Director Karuna Kumar (Palasa) said: “I first saw Thiruveer in a stage play and decided to cast him if I ever made a movie. When we planned ‘Palasa’ with three main roles, I was sure one would be his. Despite losing his mother during the shoot, he didn’t tell anyone and continued filming. That dedication touched me deeply. Every debut filmmaker faces struggles, and we understand that well. ‘The Great Pre-Wedding Show’ will be a 100% blockbuster hit. Audiences love rooted, real stories. The movie releases on November 7 — don’t miss it!” Director Sunny Sanjay (Anaganaga) said: “I loved Thiruveer’s acting in ‘Pareshan’. He expresses all emotions beautifully and has built his own unique mark. ‘The Great Pre-Wedding Show’ has a story everyone can relate to and will surely impress.”   Director Ram Abbaraju (Samajavaragamana) said:  “I could really connect to this movie. I’ve been married for two years but still don’t have an album (laughs). The trailer is great, and the film will be even better. It’s filled with situational comedy and strong emotions. Wishing Thiruveer a big success and best wishes to the team.” Director Aditya Hassan (#90's) said: “I love Thiruveer’s work. Rohan has become quite busy now. My good friend Suresh Bobbili deserves more success, and I wish to work with him again. Thiruveer always experiments and brings something new — I’m a big fan of his. I wish the director and producers great success with this film.” Director Yadhu Vamsi (Committee Kurrollu) said: “I really liked Thiruveer’s ‘Pareshan’. I want my actress Teena Sravya, who came from my film, to have another hit. Director Rahul has great positivity and energy. We always support new talent. ‘The Great Pre-Wedding Show’ will surely impress with its content. Wishing the entire team all the best.” Director Dushyant (Ambajipeta Marriage Band) said: “I really liked the trailer. Whenever someone brings a new concept, Thiruveer is always the first choice. I wish great success to the director and producers. Everyone should watch the movie on November 7.” Director Uday Gurrala (Mail) said: “So many directors are here today just for Thiruveer. He always chooses good scripts. Unlike star heroes who calculate stardom, he picks strong stories. I’ve seen the movie — it’s really good. Thiruveer shocked me with ‘George Reddy’ and charmed with innocence in ‘Masooda.’ He can pull off any role effortlessly. I wish this movie to become a big hit.” Director Rupak Ronaldson (Pareshan) said:  “I’ve already watched ‘The Great Pre-Wedding Show.’ It’s a sweet, simple, and sensible fun ride. Congrats to the producers for backing such a fresh idea. The cinematography by Som Sekhar and music by Suresh Bobbili are excellent. It’s a film families will enjoy together with laughter. Thiruveer will get a good success with this film.” Director Ravi Teja Marni (Johar) said: “The movie features many newcomers. These new producers will make good profits. The film is releasing on November 7 — everyone please watch and encourage new talent.” Director Nanda Kishore Emani (35 Chinna Katha Kaadu) said: “I’ve known Thiruveer since ‘George Reddy.’ He worked hard to reach this level. There’s so much natural emotion in every role he does. I wish him even more success with ‘The Great Pre-Wedding Show.’”   Actor Thiruveer said:  “I’m really happy that so many directors came for our film’s trailer launch. I’ve earned so many friends in this journey. Producer Sandeep supported us throughout. I couldn’t stop laughing when I first heard the story — it was such a fun ride to shoot. It felt like a family tour during the shoot. ‘The Great Pre-Wedding Show’ comes to you on November 7 with great content and entertainment. I’m sure audiences will love it. Huge thanks to Zee Studios for their support.” Producer Sandeep Agaram said:  “Thanks to all the directors who attended our event. Our hero Thiruveer has been a pillar of support throughout. Director Rahul made the film wonderfully. Our movie releases on November 7 — please watch and support.” Director Rahul Srinivas said:  “On and off the screen, Thiruveer is the real hero of ‘The Great Pre-Wedding Show.’ I’m glad everyone loved the trailer. The film will be 100 times better and full of entertainment. Please watch it in theatres on November 7.” Actress Teena Sravya said:  “We’re happy so many talented directors came to our event. The trailer received a great response. Audiences always support films with good content. We worked hard and passionately on this project. Thank you to my team. The movie releases on November 7 and promises wholesome entertainment.” Master Rohan said: “Thanks to all the directors who came to our event. Our film will make everyone laugh heartily. Please watch ‘The Great Pre-Wedding Show’ on November 7.” Music Director Suresh Bobbili said: “Thanks to all guests who attended the trailer launch. Special thanks to director Rahul, producer Sandeep, and Thiruveer for this opportunity. I’ll talk more about the film at the pre-release event.” Actress Yamini said:  “I loved the trailer. This is my debut film. Thank you to director Rahul and the producers for giving me such a good role. Som Sekhar’s camera work and Suresh’s music are excellent. Thanks to all co-actors and Thiruveer for their support. The movie releases on November 7 — please watch and encourage.” Actor Narendra said:  “I’m glad everyone liked the trailer. I hope the movie also wins everyone’s hearts.”
  తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. కల్పనా రావు సహ నిర్మాత. నవంబర్ 7న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్, టైటిల్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో మంగళవారం నాడు చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి దర్శకులు కరుణ కుమార్, యదు వంశీ, ఆదిత్య హాసన్, రామ్ అబ్బరాజు, సన్నీ, దుశ్యంత్, ఉదయ్ గుర్రాల, రూపక్, తేజ, నంద కిషోర్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..   దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ.. ‘తిరువీర్‌ను నేను ఓ నాటకంలో చూశాను. నేను మూవీ తీస్తే తిరువీర్‌కి పాత్ర ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. ‘పలాస’లో మూడు పాత్రలు అనుకున్నప్పుడు అందులో తిరువీర్ ఉండాలని అనుకున్నాను. ‘పలాస’ కోసం మేం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. తల్లి చనిపోయినా కూడా తిరువీర్ ఆ విషయాన్ని మాకు చెప్పకుండా షూటింగ్‌లో సీన్‌ చేశాడు. అలా తిరువీర్ మాకు ఎంతో సహకరించారు. డెబ్యూగా సినిమాలు తీసేటప్పుడు మేకర్లకు ఉండే కష్టాలు మా అందరికీ తెలుసు. ఈ చిత్రం వంద శాతం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. రూటెడ్ కథల్నే ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. నవంబర్ 7న ఈ చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.   అనగనగా దర్శకుడు సన్నీ మాట్లాడుతూ .. ‘‘పరేషాన్’లో తిరువీర్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. అన్ని రకాల ఎమోషన్స్‌ను తిరు అద్భుతంగా పలికిస్తారు. తనకంటూ ఓ మార్క్‌ను తిరు క్రియేట్ చేసుకున్నారు. అందరికీ కనెక్ట్ అయ్యే కథతో తీసిన ఈ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.   సామజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. నాకు పెళ్లై రెండేళ్లు అవుతోంది. కానీ ఇంకా ఆల్బమ్ రాలేదు (నవ్వుతూ). ట్రైలర్ బాగుంది. సినిమా మరింత బాగుంటుందని ఆశిస్తున్నాను. సిట్యువేషనల్ కామెడీతో రానున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. తిరువీర్‌కు మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.     దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడుతూ .. ‘తిరువీర్ గారి వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. రోహన్ ప్రస్తుతం బిజీగా మారిపోయాడు. నాకు సురేష్ బొబ్బిలి మంచి స్నేహితుడు. ఆయనకు మరిన్ని విజయాలు దక్కాలి. సురేష్‌తో మళ్లీ మళ్లీ పని చేయాలని అనుకుంటున్నాను. తిరువీర్ గారు ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తుంటారు. నేను ఆయనకు పెద్ద అభిమానిని. త్వరలో ఆయనతో పని చేయాలని కోరుకుంటున్నాను. ఈ మూవీతో దర్శక, నిర్మాతలకు బిగ్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.   దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ ..‘తిరువీర్ గారు చేసిన ‘పరేషాన్’ అంటే నాకు చాలా ఇష్టం. మా ‘కమిటీ కుర్రోళ్లు’ నుంచి వచ్చిన టీనా శ్రావ్యకు మళ్లీ సక్సెస్ రావాలి. రోహన్‌లో ఎంతో పాజిటివిటీ, ఎనర్జీ ఉంది. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ టీంకు ఆల్ ది బెస్ట్. కొత్త వాళ్లను సపోర్ట్ చేసేందుకు మేం ఎప్పుడూ ముందుంటాం. మంచి కంటెంట్‌తో రాబోతోన్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.   ‘అంబాజీపేట’ దర్శకుడు దుశ్యంత్ మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఎవరైనా ఏదైనా కొత్త కాన్సెప్ట్ పట్టుకొస్తుంటే.. వారికి ఫస్ట్ ఛాయిస్‌గా తిరువీర్ నిలుస్తున్నారు. దర్శక, నిర్మాతలకు మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను. నవంబర్ 7న ఈ సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.   దర్శకుడు ఉదయ్ గుర్రాల మాట్లాడుతూ .. ‘తిరువీర్ కోసమే ఇంత మంది దర్శకులు ఈ రోజు ఇలా వచ్చారు. తిరు ఎప్పుడూ మంచి కథల్ని ఎంచుకుంటూ ఉంటారు. స్టార్ హీరోలు వారి స్టార్డంను బట్టి, లెక్కల్ని బట్టి కొన్ని కథలు చేయలేరు. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీని నేను చూశాను. చాలా బాగా వచ్చింది. ‘జార్జి రెడ్డి’లో తిరువీర్ యాక్టింగ్ చూసి నేను షాక్ అయ్యాను. ‘మసూద’లో అమాయకుడిగా నటించాడు. ఎలాంటి పాత్రనైనా తిరువీర్ అవలీలగా పోషిస్తాడు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.   పరేషాన్ దర్శకుడు రూపక్ మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీని నేను ఆల్రెడీ చూశాను. చాలా అద్భుతంగా ఉంటుంది. స్వీట్, సింపుల్, సెన్సిబుల్, ఫన్ రైడ్‌గా సినిమా ఉంటుంది. ఇలాంటి ఓ ఫ్రెష్ ఐడియాను సపోర్ట్  చేసిన ప్రొడ్యూసర్‌లకు కంగ్రాట్స్. నటీనటులంతా కూడా చాలా బాగా చేశారు. సోమ శేఖర్ కెమెరా వర్క్, సురేష్ బొబ్బలి మ్యూజిక్ ఇలా అన్నీ బాగుంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి చూసి హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుంది. తిరువీర్‌కు ఈ మూవీతో మంచి సక్సెస్ వస్తుంది’ అని అన్నారు.   జోహార్ దర్శకుడు తేజ మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రంలో చాలా మంది కొత్త వాళ్లే కనిపిస్తున్నారు. కొత్త నిర్మాతలకు ఈ చిత్రంతో డబ్బులు బాగానే వస్తాయి. నవంబర్ 7న ఈ చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా సినిమా చూసి కొత్త వాళ్లని ఎంకరేజ్ చేయండి’ అని అన్నారు.   దర్శకుడు నంద కిషోర్ మాట్లాడుతూ .. ‘‘జార్జి రెడ్డి’ టైంలోనే నాకు తిరువీర్ తెలుసు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఆయన ప్రతీ సినిమాలో, ప్రతీ పాత్రలో సహజత్వం ఉట్టి పడుతుంది. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’తో ఆయనకు మరింత సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.     హీరో తిరువీర్ మాట్లాడుతూ .. ‘మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ కోసం ఇంత మంది దర్శకులు వచ్చారు. నేను ఇంత మంది మంచి ఫ్రెండ్స్‌ను దర్శకుల రూపంలో సంపాదించుకున్నందుకు ఆనందంగా ఉంది. నిర్మాత సందీప్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. కథ చెప్పినప్పుడు కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నాను. ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. ఫ్యామిలీ అంతా కలిసి టూర్‌కు వెళ్లినట్టుగా షూటింగ్ చేశాం. మంచి కంటెంట్‌తో మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ నవంబర్ 7న రాబోతోంది. మా చిత్రం అందరికీ నచ్చుతుంది. మా సినిమాను ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మాకు అండగా నిలిచిన జీ సంస్థకు థాంక్స్. ’ అని అన్నారు.   చిత్ర నిర్మాత సందీప్ అగరం మాట్లాడుతూ.. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఈవెంట్‌కు వచ్చిన దర్శకులందరికీ థాంక్స్. మా హీరో తిరువీర్ ఈ ప్రయాణంలో ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. దర్శకుడు రాహుల్ ఈ మూవీని అద్భుతంగా తీశారు. నవంబర్ 7న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.   చిత్ర దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాకి ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో హీరో తిరువీర్. మా ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ట్రైలర్‌కు వంద రెట్లు అనేట్టుగా సినిమా ఉంటుంది. అందరినీ ఎంటర్టైన్ చేసేలా మా చిత్రం ఉంటుంది. నవంబర్ 7న మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.   హీరోయిన్ టీనా శ్రావ్య మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఇంత మంచి దర్శకులంతా కూడా మా ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాల్ని ఆడియెన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. మేం ఎంతో ఇష్టపడి, కష్టపడి ఈ మూవీని చేశాం. మా టీం అందరికీ థాంక్స్. నవంబర్ 7న థియేటర్లోకి రాబోతోంది. మంచి కంటెంట్‌తో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా మా చిత్రం ఉంటుంది’ అని అన్నారు.   మాస్టర్ రోహన్ మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్క దర్శకుడికి థాంక్స్. అందరినీ హాయిగా నవ్వించేలా మా చిత్రం ఉంటుంది. నవంబర్ 7న మా సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.   సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు వచ్చిన గెస్టులందరికీ థాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాహుల్ గారికి, సందీప్ గారికి, తిరువీర్ గారికి థాంక్స్. సినిమా గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడతాను’ అని అన్నారు.  
  - బెదిరింపులు ఎందుకు! - రజనీ చిటికేస్తే ఏమవుతుంది - రజనీ, ధనుష్ ఇళ్ళకి బాంబు బెదిరింపులు - పోయస్ గార్డెన్ లో తనిఖీలు       సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth)ఏది చెప్తే అది చెయ్యడానికి తమిళనాడులోని ఆయన అభిమానులు ఎంతవరకైనా వెళ్తారు. అసలు రజనీ ఒక చిటిక వేస్తే చాలు తమిళనాడు మొత్తం ఆయన ఇంటి ముందు ఉంటుంది. రజనీ చరిష్మా కి కొలమానం అంటు కూడా లేదు. స్టార్ హీరో ధనుష్(Dhanush)కి కూడా తమిళనాడు వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. రజనీకి మాజీ అల్లుడు అయినా ఇప్పటికి రజనీ అంటే ఎంతో అభిమానాన్ని చూపిస్తాడు.   ఈ రోజు ఉదయం చెన్నై(Chennai)డిజీపీ కార్యాలయానికి మెయిల్ వచ్చింది. అందులో పోయస్ గార్డెన్(Poes Garden)లో ఉన్న రజనీకాంత్, ధనుష్ ఇంటికి బాంబులు పెడుతున్నామని  రాసి ఉంది. దీంతో డాగ్ స్క్వాడ్ బృందాలు ఆ ఇద్దరి ఇళ్ళని క్షుణ్ణంగా తనిఖీ చేసారు. ఆ తర్వాత ఆ ప్రాంగణం మొత్తాన్ని స్వాధీనం చేసుకొని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడమే కాకుండా ప్రతి ఒక్కరిని ఎంక్వ యిరీ చేస్తున్నారు.   Also read:  చిన్నప్పటి ప్రభాస్ గా మహేష్ బాబు మేనల్లుడు    కొన్ని రోజుల క్రితం త్రిష(Trisha)ఇంటికి కూడా బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా సినీ తారల ఇంటికి వరుస బెదిరింపులు రావడం తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇండియన్ సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారనే చర్చ కూడా అందరిలో జరుగుతుంది.  
Superstar Rajinikanth has lost his interest in films after Padayappa/ Narasimha. He stated that he is retiring after Baba, and entering into politics. But he changed those plans and continued to act after Chandramukhi. He even suffered a big health issue but continued to accept films with gaps in between.  He did Sivaji, Enthiran/ Robo, Lingaa, Kabali, Kaala, 2.0, Petta, Darbar, Jailer, Vettaiyan, Lal Salaam, Coolie after Chandramukhi. Now, he is finishing his portions for Jailer 2 and has accepted a film to star alongside Kamal Haasan. The reports state that after his film with Kamal Haasan, he will retire as an actor.  Before his film with Kamal go on floors, he accepted another film with director Sundar C and that will go on floors from February or March, next year. After this project, in the direction of Nelson Dilipkumar, Kamal Haasan and Rajinikanth film go on floors, say reports.  Also, as Kamal had to face a loss of Rs.178 crores due to Thug Life debacle, Rajinikanth has offered to act in both these films for Raaj Kamal Films International. While Sundar C film will be a quick comedy entertainer, Nelson's film will be the biggest multi-starrer ever in Tamil Cinema.  So, daughters of Rajinikanth and Kamal Haasan will produce that film. Well, if the reports are to be believed, it is going to be an end of iconic circle for Rajini. as he started his career with Kamal and director Balachander became guru for both of them.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
    - ప్రభాస్, ఘట్టమనేని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ - చిన్నప్పటి ప్రభాస్ గా దర్శన్  - ఫౌజీ పై భారీ అంచనాలు    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu).. ఈ ఇద్దరి పేర్లు పక్క పక్కన ఉంటేనే  ఏదో తెలియని వైబ్రేషన్. మరి ఆ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే.. సిల్వర్ స్క్రీన్ కి రెస్ట్ అనేది ఉండదు. కలెక్షన్స్ ని లెక్కపెట్టడానికి ఏదైనా కొత్త టెక్నాలజీ ని కూడా కనిపెట్టాలేమో. ప్రస్తుతానికి ఈ ఇద్దరి కాంబోలో సినిమా తెరకెక్కకపోయినా రావాలని కోరుకుందాం. అసలు విషయంలోకి వస్తే ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ తో పాటు, హను రాఘవపూడి(Hanu Raghavapudi)దర్శకత్వంలో 'ఫౌజీ'(fauzi)చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ తో అంచనాలు ఏ రేంజ్ కి వెళ్ళాయో కూడా తెలియని పరిస్థితి.    ఇప్పుడు ఈ మూవీలో మహేష్ బాబు మేనల్లుడు నటించబోతున్నాడు. అవును ఇది నిజం. మహేష్ బాబు సోదరి ప్రియదర్శని చిన్న కొడుకు దర్శన్ 'ఫౌజీ' లో చేస్తున్నాడు. ప్రియదర్శని  ఎవరో కాదు ప్రముఖ హీరో సుధీర్ బాబు భార్య.  దర్శన్ ఈ ఇద్దరికి రెండవ సంతానం. 'ఫౌజీ' లో అలాంటి ఇలాంటి క్యారక్టర్ లో దర్శన్ కనపడటం లేదు. ప్రభాస్ చిన్నప్పటి క్యారెక్టర్ ని పోషించబోతున్నాడు. అంటే జూనియర్ ప్రభాస్ రోల్. ఇప్పటికే దర్శన్ లుక్ టెస్ట్ పూర్తైందని. అతడి యాక్టింగ్ చూసి మేకర్స్ సైతం ఫిదా అయ్యారని తెలుస్తోంది.   'ఫౌజీ' లో ప్రభాస్ ఆర్మీ అధికారిగా కనపడుతున్న విషయం తెలిసిందే. ఆర్మీ అధికారి అంటే సైన్యంలో అనేక డిజిగ్నేషన్స్ ని దాటుకొని రావాల్సిందే. ఈ క్రమంలో చిన్నవయసు నుంచే కఠినమైన కసరత్తులు చేయాల్సి వస్తుంది. వాటన్నిటిని సిల్వర్ స్క్రీన్ పై దర్శన్ ప్రదర్శించి తన సత్తా చాటడం జరగడం ఖాయం. దీంతో దర్శన్ సిల్వర్ స్క్రీన్ పై తొలి సినిమాతోనే ఘట్టమనేని అభిమానులనే కాకుండా ప్రభాస్ అభిమానులని కూడా అలరిస్తాడు.    Also read: ఎంగేజ్మెంట్ విషయంలో అనుకున్నదే జరిగింది.. వాళ్ళకి మాత్రం మైండ్ బ్లాంక్   ఇది ఫ్యూచర్ లో దర్శన్ కెరీర్ కి ఎంతలా ఉపయోగపడుతుందో చెప్పక్కర్లేదు. మావయ్య మహేష్ ప్రస్తుతం ssmb 29 తో బిజీగా ఉన్నాడు. నాన్న సుధీర్ బాబు(Sudheer Babu)తన కొత్త మూవీ జటాధర(Jatadhara)తో నవంబర్ 7న  ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దర్శన్ అన్నయ్య చరిత్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. ఘట్టమనేని అభిమానులు చరిత్ ని జూనియర్ మహేష్ బాబు అని పిలవడం కూడా  స్టార్ట్ చేసారు.     
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
భార్యాభర్తలకు ఒకరి మీద మరొకరికి కోపం రావడం సహజం. ఆ కోపం చాలా మటుకు ఎలా వస్తుందో అలాగే వెళ్లిపోతుంది కూడా. కొందరి విషయాలలో మాత్రమే కోపాలు కాస్తా గొడవలకు, అవి కాస్తా తెగదెంపులకు దారి తీస్తాయి. ఎలాంటి గొడవలు జరిగినా, ఏ సమస్య వచ్చినా అవి చాలా వరకు పరిష్కారం అవడం అనేది భార్యాభర్తలు వాటికి రియాక్ట్ అవ్వడం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే.. భార్యాభర్తల సాధారణ ప్రవర్తన కూడా వారికి తమ భాగస్వామి మీద కోపం వస్తుందా? రాదా అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. సాధారణంగా మగవారు చేసే మూడు పనులు వారికి తమ భార్యల మీద కోపం వస్తుందా రాదా అనే విషయాన్ని స్పష్టం చేస్తుందట. ఇంతకీ భర్తలు చేసే ఆ మూడు పనులేంటంటే.. సహాయం..  పనిని జెండర్ ఆధారంగా విభజించకుండా అన్ని పనులు అందరూ చేయవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకుంటారో అలాంటి భర్తలు భార్యలను అస్సలు కోపగించుకోరట. పైపెచ్చు ఇలాంటి భర్తలు తమ భార్యలకు ఎంచక్కా సహాయం కూడా చేస్తారట. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే భర్తలు సహాయం చేస్తే భార్యలు చాలా సంతోషిస్తారు.  భర్తలకు అనుగుణంగా ఉంటారు. భార్యలు కూడా  ఇలాంటి భర్తలకు కోపం తెప్పించే పనులు అస్సలు చెయ్యరు. ప్రేమను వ్యక్తం చేయడం.. చాలామంది మగాళ్లకు భార్య మీద బోలెడు ప్రేమ ఉంటుంది. కానీ అదంతా ఇంట్లోనో లేక పడక గదిలోనో మాత్రమే బయట పెడుతుంటారు. కానీ భార్య మీద ఉన్న ప్రేమను ఎలాంటి సంకోచం లేకుండా బహిరంగంగా బయటపెట్టే భర్తలకు తమ భార్యలంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. ఇలాంటి భర్తలకు అస్సలు భార్యలమీద కోపం అనేది కల్లో కూడా ఉండదేమో అన్నంత ప్రేమగా ఉంటారు. నలుగురిలో భార్య మీద కోప్పడే మగాడు కాదు.. నలుగురిలో భార్య మీద ప్రేమ కురిపించే మగాడిని చూసి భార్య గర్వపడుతుంది. అలాంటి భర్తను గౌరవిస్తుంది. సమయాన్ని  గడపడం.. భార్య కోసం సమయాన్ని వెచ్చించే భర్త ఎప్పుడూ భార్య మీద కోపం చేసుకోడు. ఎందుకంటే అతను భార్య కోసం సమయాన్ని వెచ్చించడంలోనే అతని ప్రేమ వ్యక్తం అవుతుంది. ఇక తన కోసం సమయం కేటాయిచే  భర్తంటే భార్యకు కూడా గౌరవం. ఇద్దరూ కలిసి గడిపే సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరికొకరు మద్దతుగా ఉండటం ఇలా అన్నీ వారి బంధాన్ని దృఢంగా మారుస్తాయి.                                                 *నిశ్శబ్ద. 
  వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం మాత్రమే కాదు రెండు కుటుంబాల మధ్య బంధం. కొత్త సంబంధాలకు సర్దుబాటు కావడానికి సమయం పడుతుందనేది అంగీకరించాల్సిన వాస్తవం. సాధారణంగా తల్లిదండ్రులు తమ కుమార్తెను అత్తవారింటికి పంపేటప్పుడు  ఆమె అత్తమామల ఇంట్లో ఎలా ఉండాలో.. మంచి భార్యగా,  కోడలుగా ఎలా ఉండాలో కొన్ని విషయాలు చెబుతారు. అలాగే అత్తారింట్లో పనులన్నీ ఎలా చేయాలో కూడా నేర్పించి మరీ పంపుతారు. కానీ వివాహం తర్వాత మంచి భర్తగా,  అల్లుడిగా ఎలా ఉండాలో అబ్బాయిలకు నేర్పించే తల్లిదండ్రులు బహుశా చాలా అరుదుగా ఉంటారని చెప్పాలి. పెళ్లి తర్వాత అమ్మాయిలు మానసికంగా,  ఆచరణాత్మకంగా తమ అత్తమామల ఇంట్లో సర్దుబాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ అబ్బాయిలు ఈ పరిస్థితికి సిద్ధంగా ఉండరు.  అయితే పెళ్లికి ముందు కూతుళ్లకు ఎన్నో విషయాలు నేర్పించే తల్లిదండ్రులు,  పెళ్ళి తర్వాత ఎలా ఉండాలి అనే విషయం గురించి కొడుకుకు కూడా కొన్ని నేర్పించాల్సి ఉంటుంది.  ఇలా చేయడం వల్ల పెళ్లి తర్వాత  అబ్బాయి మంచి భర్తగా మాత్రమే కాకుండా, బాధ్యతాయుతమైన  అల్లుడుగా కూడా మారతాడు. అర్థం చేసుకునే కొడుకు మాత్రమే రెండు కుటుంబాలను కలిపి ఉంచగలడుయ  కోడలికి తన అత్తమామల ఇల్లు తన  'ఇల్లు' అని అనిపించేలా చేయగలడు. ఇందుకోసం పెళ్లికి ముందు కొడుకులకు తల్లిదండ్రులు ఏం చెప్పాలో.. ఏం నేర్పించాలో తెలుసుకుంటే.. సమానత్వం.. వివాహం తర్వాత భార్య తన బాధ్యత మాత్రమే కాదు, తన జీవిత భాగస్వామి కూడా అని  కొడుకుకు చెప్పాలి. ఇంటి ప్రతి నిర్ణయంలో ఆమెను అభిప్రాయం తీసుకోవాలని చెప్పాలి.  భార్య భావాలను,  అభిప్రాయాలను గౌరవించడం, కోడలు ఆ ఇంట్లో గెస్ట్ లేదా పని మనిషి లాంటిది కాదని  ఇంట్లో ఆమెకు శాశ్వత స్థానం ఉంటుందని చెప్పాలి. సమతుల్యత.. వివాహం తర్వాత కొడుకు తరచుగా తన తల్లి,  భార్య మధ్య చిక్కుకుపోతాడు. సంబంధాలలో సామరస్యం ముఖ్యమని, పోలిక కాదని కొడుకులకు  వివరించి చెప్పాలి. కొడుకు సమతుల్యతను కాపాడుకుంటే కోడలికి ఇంట్లో ఎటువంటి సమస్య ఉండదు.  లేదా తల్లికి ఎటువంటి ఫిర్యాదు ఉండదు. అతని భార్య,  తల్లి మధ్య ఏదైనా విభేదాలు ఉంటే ఇద్దరి మధ్య తేడాలు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి.  అంతే తప్ప ఒకరికే సపోర్ట్ చేస్తూ ఏకపక్షంగా ఉండకూడదు.   సహాయం.. ఇంటి పనులు కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదని పెళ్లికి ముందు  కొడుకుకు వివరించాలి. కొన్నిసార్లు  భార్యకు చిన్న విషయాలలో సహాయం చేయడం,  ఆమెను మానసికంగా  మరియు ాలా ఊరట ఇస్తుంది. భార్యతో సంబంధాన్ని బలపరుస్తుంది.  కూతుళ్ల లాగే  కొడుకు కూడా ఇంటి పనులలో సహాయం చేయమని చెప్పాలి. తద్వారా అతను తన భార్యకు సహాయం చేయడంలో సిగ్గుపడడు,  అతను ఇంటి పనులపై అవగాహన పెంచుకుంటాడు. అత్తవారిల్లు.. పెళ్లి తర్వాత కోడలు తన అత్తామామలను తన తల్లిదండ్రులుగా భావించి కుటుంబంలో కలిసిపోవాలంటే..  తన భార్య తల్లిదండ్రులను గౌరవించడం కూడా అంతే బాధ్యత అని  కొడుకుకు చెప్పాలి. కోడలు తల్లిదండ్రులను, ఆమె కుటుంబాన్ని తన సొంత కుటుంబ సభ్యులుగా భావించాలి. ఇలా ఉంటే కోడలు కూడా తన అత్తామామలను తన తల్లిదండ్రుల లాగే చూసుకోవడం జరుగుతుంది.   రెండు కుటుంబాలను ఏకం చేయడం కొడుకు బాధ్యత కూడా. ప్రైవసీ.. భార్యాభర్తల మధ్య విషయాలు వ్యక్తిగతమైనవి. చిన్న చిన్న విషయాలను బయట పంచుకోవడం లేదా తల్లిదండ్రులతో ప్రతిదీ పంచుకోవడం,  అక్కా చెల్లెళ్లు, అన్నాదమ్ములతో ప్రతీది చెప్పడం  వల్ల అపార్థాలు వస్తాయని  కొడుకుకు నేర్పాలి. మంచి భర్త లక్షణం ఏమిటంటే అతను తన సంబంధం  గౌరవాన్ని కాపాడుకోవడం. అతను ఆ గౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తే భార్య కూడా అతనికి సహకారంగా వ్యక్తిగత విషయాలను ఎవరితో పంచుకోకుండా ఉంటుంది.                           *రూపశ్రీ.
పిల్లలు పెద్దల్ని అనుకరించడం, వాళ్ళలాగే గొప్పవాళ్ళు కావాలని ఆశించడం సహజమైన విషయం. మనం మనకు తెలియకుండానే ఇతరులను అనుకరిస్తుంటాం. మన జీవితంలో ఈ'అనుకరణ'ఎంత వరకు అవసరమో తెలుసుకోవడం మంచిది. తల్లితండ్రులతో మొదలు..  పిల్లలు ప్రధానంగా తల్లి తండ్రులను అనుకరిస్తారు. కాబట్టి తల్లితండ్రులు ముందుగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపితే పిల్లలు వారంతట వారే అమ్మా నాన్నల నుంచి అన్నీ నేర్చుకుంటారు. ఈ రోజుల్లో తల్లి తండ్రులకు పిల్లలతో కాస్త సమయం గడపడానికే తీరిక లేనప్పుడు వారి నుంచి పిల్లలు ఏం నేర్చుకోగలరు? నేటి తరం వారికి టీవీ, ఇంటర్ నెట్లో మిత్రులు, బంధువులు. పిల్లలు ఏమైనా పాఠాలు నేర్పుతున్నది ఇవే.. వీటిలో ఏముంటాయో  మనకూ తెలుసు. ఇలాంటి విషయాలు పిల్లలకు అలవాటు చేస్తే వారిలో ఏ పాటి ఉన్నత విలువలు అలవడతాయో మనం ఊహించవచ్చు. నేటి యువతరం ప్రసార మాధ్యమాల ప్రభావంతో ప్రతికూల భావాలకు బానిసలై, వాటినే తమ జీవితాల్లో అనుకరిస్తోంది. ఈ ప్రభావాలకు దూరంగా ఉంటూ, మనదైన ఉన్నత సంస్కృతికీ, ఆధ్యాత్మికతకూ ప్రాధాన్యం ఇచ్చినప్పుడే యువతీ యువకులు ప్రగతిని సాధించగలరు. వివేచనతో అనుకరణ ఉండాలి.. మనం సాధారణంగా ఒక వ్యక్తి, లేదంటే  సమాజంలో బయటకు కనిపించే ఎన్నో విషయాలకు ఆకర్షితులమై, వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తాం. దీని వల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోగా నష్టం కలిగి తీరుతుంది. సింహం చర్మాన్ని వేసుకున్నంత మాత్రాన గాడిద కాస్తా సింహం కాబోదు కదా! మనం వివేచన లేకుండా గుడ్డిగా ఎవరినైనా అనుకరిస్తే పురోగతి చెందే మాట అటుంచి, అధోగతి పాలయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి అనుకరణ వల్ల మన వ్యక్తిత్వాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ కోల్పోయి జీవచ్ఛవాలుగా మారతాం. అందుకే, మనం ఉన్నత విలువలను సొంతం చేసుకునే ప్రయత్నం చేయాలి. మంచిని అనుకరిస్తేనే ఉన్నత స్థితి..  మనం చెడును అనుకరిస్తే అధోగతిని పొందినట్లే, మంచిని అనుకరిస్తే ఉన్నతమైన స్థితికి చేరుకోగలం. 'Be not an imitation of Jesus, but be Jesus. You are quite as great as Jesus, Buddha, or anybody else' అని స్వామి వివేకానంద చెప్పారు. ఈ విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుంటే.. "ఒక దొంగ అర్ధరాత్రి సమయంలో రాజమందిరానికి వెళ్ళాడు. అక్కడ రాజు, రాణితో 'మన అమ్మాయి వివాహం నదిఒడ్డున తపస్సు చేసుకుంటున్న ఒక సాధువుతో జరిపించాలి'. అన్నాడు. ఇది విన్న దొంగ 'నేను సాధువు వేషం వేసుకుంటాను. అదృష్టం బాగుంటే నన్నే రాజకుమారి వరించవచ్చు' అని మనస్సులో అనుకున్నాడు. తరువాత రోజు రాజు సేవకులు నది ఒడ్డుకు వెళ్ళి సాధువులను ఒక్కొక్కరినీ రాజకుమారిని వివాహం చేసుకోవలసిందిగా కోరారు. అయితే ఎవరూ అంగీకరించలేదు. చివరకు ఈ ‘దొంగ – సాధువు' దగ్గరకు వచ్చి అడిగారు. ఇతను మౌనం వహించాడు. మౌనాన్ని అంగీకారంగా భావించి రాజ సేవకులు వెళ్ళి, జరిగినదంతా రాజుతో చెప్పారు. రాజు స్వయంగా ఆ నది ఒడ్డుకు వచ్చి, తన కుమార్తెను వివాహం చేసుకో వలసిందిగా ఆ దొంగ సాధువును ప్రార్ధించాడు. ఆ దొంగ- సాధువు తన మనస్సులో 'నేను సాధువు వేషం వేసినంత మాత్రాన స్వయంగా రాజు నా దగ్గరకు వచ్చి బతిమాలుతున్నాడు. నేను నిజంగా సాధువును కాగలిగితే ఈ జీవితం ఎంత సార్థకమవు తుందో కదా!' అని అనుకొని, వెంటనే తన మనస్సు మార్చుకున్నాడు. భవిష్యత్తులో గొప్ప సాధువుగా ప్రఖ్యాతి చెందాడు". మనం కేవలం ఒకరిని అనుకరించడంతో ఆగిపోకుండా వారిలో ఉన్న ఉన్నత విలువలను సొంతం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే జీవితంలో మంచి స్థాయికి చెరగలం.                                  *నిశ్శబ్ద.
ఫైల్స్ ను మొలలు అని కూడా అంటారు.  మలద్వారం దగ్గర బొడిపెల్లా  ఏర్పడి మలవిసర్జనకు వెళ్లినప్పుడు ఆటంకం కలిగించే ఈ సమస్య చెప్పడానికి చాలా తేలికగా అనిపిస్తుంది కానీ ఇది అనుభవించే వారికి  నరకం చూపిస్తుంది.  మలవిసర్జన సాఫీగా జరగకపోవడం వల్ల బలవంతంగా ఒత్తిడి కలిగించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఒక్కోసారి  మలంతో పాటు రక్తం పడుతూ ఉంటుంది.  ఫైల్స్ సమస్యకు ప్రాధాన కారణంగా మలబద్దకాన్ని చెబుతారు. మలబద్దకం ఉన్నవారిలో ఫైల్స్ వచ్చే సమస్యలు  ఎక్కువ ఉంటాయని  వైద్యులు కూడా చెబుతారు. అయితే అసలు మలబద్దకం సమస్య ఎందుకు వస్తుంది? దీనికి కారణాలు ఏంటి తెలుసుకుంటే మలబద్దకం, ఫైల్స్ రెండింటికి చెక్ పెట్టవచ్చు. ఎక్కువసేపు కూర్చోవడం.. ఇప్పట్లో చాలావరకు కూర్చుని చేసే పనులే ఉన్నాయి. సిస్టమ్స్ ముందు లేదా షాపులలో కూర్చుని పనిచేయడం అన్నిచోట్లా కనిపిస్తుంది.  గంటల తరబడి ఇలా కూర్చోని పనిచేయడం వల్ల మలబద్దకం, దాని వెంట ఫైల్స్ సమస్య వస్తాయి. అందుకే ఎక్కవసేపు కూర్చోని పనిచేసేవారు కనీసం గంటకు ఒకసారి అయినా కూర్చున్న చోటి నుండి లేచి ఓ 5నిమిషాలు రిలాక్స్ గా నడవాలని  వైద్యులు చెబుతున్నారు. ధూమపానం, మధ్యపానం.. ఆల్కహాల్ అతిగా తీసుకోవడం, అలాగే ధూమపానం చేయడం వల్ల కూడా ఫైల్స్ సమస్య వస్తుంది. ఇవి జీర్ణక్రియను, ప్రేగుల పనితీరును దెబ్బతీస్తాయి. అందుకే ఈ రెండు అలవాట్లకు దూరంగా ఉండాలి. నీరు.. ప్రతి రోజూ మనిషికి మూడు నుండి నాలుగు లీటర్ల నీరు లేదా 8గ్లాసుల నీరు అవసరం అవుతుంది. వైద్యులు కూడా తప్పనిసరిగా 8గ్లాసుల నీరు తీసుకోమని చెబుతుంటారు. అయితే  నీరు తక్కువగా తాగితే జీర్ణాశయం, పేగుల పనితీరు దెబ్బతింటుంది. ఇది మలబద్దకం, పైల్స్ సమస్యకు దారితీస్తుంది. ఒత్తిడి.. ఒత్తిడి వల్ల కూడా ఫైల్స్ సమస్యలు వస్తాయి. శరీరంలో ఒత్తిడి ఫీలవుతుంటే హార్మోన్ల సమస్యల నుండి అవయవాల పనితీరు వరకు అన్ని దెబ్బతింటాయి. గట్టిగా దగ్గడం, ఒత్తిడితో కూడిన పనులు చేయడం వంటివి చేయడం వల్ల మొలల సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. దీన్ని తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ చేయాలి. మాంసాహారం.. మాంసాహారం ఎక్కువ తినేవారిలో ఫైల్స్ సమస్య చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా చికెన్, మటన్, గుడ్లలో పచ్చసొన తొందరగా ఫైల్స్ సమస్య రావడానికి కారణం అవుతుంది. వీటికి బదులు ఫైబర్ ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవడం మంచిది. గర్భం దాల్చినప్పుడు.. గర్భం దాల్చినప్పుడు మలద్వారం ప్రాంతం పైన బిడ్డ ఒత్తిడి ఉంటుంది. దీని కారణంగా గర్భవతులలో ఫైల్స్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.  అయితే ప్రసపం తరువాత ఈ సమస్య తగ్గిపోతుంది. స్పైసీ ఫుడ్.. కారం, మసాలా ఎక్కువ ఉన్న జంక్ ఫుడ్స్, ఇతర ఆహారాల వల్ల కూడా మొలల సమస్య వస్తుంది. చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, బిస్కెట్లు, మైదా ఆధారిత ఆహారాల వల్ల మలబద్దకం సమస్య, దాన్నుండి ఫైల్స్ సమస్య కూడా వస్తుంది.                                              *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
సాధారణంగా బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. అందుకు వ్యాయామంతో పాటు ఆహారంలో కూడా చాలా మార్పులు అవసరం. చాలామంది జిమ్‌లో గంటల తరబడి ఎక్సర్ సైజులు చేస్తున్నారు. అయితే బరువు తగ్గడానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదంటున్నారు పోషకాహార నిపుణులు. పోషకాహార నిపుణులు బరువు తగ్గడానికి సులభమైన మార్గాన్ని సూచించారు. ఇలా చేయడం వల్ల కేవలం 7 రోజుల్లో 5 కిలోల బరువు తగ్గవచ్చు. అందుకోసం ప్రత్యేకంగా డైట్ పాటించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే బెల్లిఫ్యాట్ తగ్గించుకునేందుకు ఎలాంటి పద్దతులు పాటించాలో తెలుసుకుందాం. డిటాక్స్ ఆహారం: బరువు తగ్గడానికి వివిధ రకాల ఆహారాలు ఉన్నాయి. చాలా మంది బరువు తగ్గడానికి డిటాక్స్ డైట్ కూడా తీసుకుంటారు. అయితే ఇలాంటి ఆహారాలు చాలా హానికరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వాటికి  బదులుగా, టాక్సిన్స్ తొలగించడానికి మీరు ఈ మూడు పనులు చేయడం ముఖ్యమని చెప్పారు.  ఆ మూడు పనులు ఏమిటో చూద్దాం. ప్రతిరోజూ 3 పనులు చేయండి: -జీలకర్ర పుదీనా డిటాక్స్ నీటిని ఖాళీ కడుపుతో త్రాగండి. -అల్పాహారం కోసం దోసకాయ స్మూతీని తీసుకోండి. -మధ్యాహ్నం, రాత్రి భోజనం మధ్య చియా గింజల నీటిని త్రాగాలి. డిటాక్స్ డైట్  ప్రతికూలతలు: డిటాక్స్ ఆహారం తరచుగా శరీరంలో ఆకలి, అలసటను కలిగిస్తుంది. బలహీనత కనిపించవచ్చు. ఇది తక్కువ శక్తి, తక్కువ రక్త చక్కెర, అలసట, తల తిరగడం, చేయి నొప్పులను కలిగిస్తుంది. అదే సమయంలో, ఇటువంటి బరువు తగ్గించే ఆహారాలు కూడా చాలా బోరింగ్. ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక కొవ్వు, అధిక చక్కెర కలిగిన ఆహారాలకు దూరంగా ఉండటం మరింత ప్రభావవంతంగా ఉంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. దీనితో పాటు, తాజా పండ్లు, కూరగాయలు తినడం, కొంత వ్యాయామం చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ప్రస్తుతకాలంలో చాలామందిలో న్యూరోపతి సమస్య కనిపిస్తోంది. శరీరంలోని నరాలు బలహీనంగా మారడం, శరీరంలో పట్టు తగ్గడం, కాళ్లూ చేతులు మొదలైన ప్రాంతాలలో చీమలు పాకినట్టు అనుభూతి కలగడం, చేతులు వనకడం ఇలా చాలా లక్షణాలు న్యూరోపతి సమస్యలో కనిపిస్తాయి. ఈ న్యూరోపతి సమస్యను మొదట్లోనే గుర్తించి దాన్ని పరిష్కరించడం ఎంతో అవసరం. లేకపోతే ఇది మొత్తం శరీరం మీద చాలా దారుణమైన ప్రభావం చూపిస్తుంది. అయితే అసలు ఈ న్యూరోపతి సమస్య ఎందుకు వస్తుంది? ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? న్యూరోపతి ఎందుకు వస్తుంది? శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉత్పత్తి అయితే అది న్యూరోపతి సమస్యకు దారితీస్తుంది. జంక్ ఫుడ్,  నూడిల్స్, బర్గర్లు, పిజ్జా, బేకింగ్ ఆహారాలు, చక్కెర అధకంగా ఉన్న ఆహారాలు తింటుంటే న్యూరోపతి సమస్య వచ్చే  అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆహారం తిన్న ప్రతిసారి లేదా అనారోగ్యం చేసినప్పుడు, శరీరంలో నొప్పులు, వాపులు వంటివి సంభవించినప్పుడు శరీరంలో ఫ్రీరాడికల్స్  తయారవుతాయి. ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆహారం తిన్న తరువాత శరీరంలో రెండు రకాల అణువులు ఏర్పడతాయి. వాటిలో ఒకటి  ఫ్రీరాడికల్స్ కాగా.. రెండవది యాంటీ ఆక్సిడెంట్లు. కానీ ఆహారం తిన్న తరువాత ఫ్రీరాడికల్స్ ఎక్కువగా ఏర్పడినా,  అవి యాంటీఆక్సిడెంట్లను కూడా డామినేట్ చేసినా ఫ్రీరాడికల్స్ ప్రభావం శరీరం మీద ఎక్కువ ఉంటుంది.  సాధారంగా వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు ఈ ఫ్రీ రాడికల్స్ వల్లే వస్తాయి. ఆహారం విషయంలో మార్పులు చేసుకోకపోతే ఇది క్రమంగా న్యూరోపతి సమస్యకు దారితీస్తుంది. న్యూరోపతి సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే.. న్యూరోపతీ సమస్య రాకుండా ఉండాలంటే  ప్రతి రోజూ కనీసం 1 గంట శారరీక శ్రమ అవసరం. ఇందులో చురుకైన నడక, యోగా, వ్యాయామం, ఇతర పనులు కూడా ఉండవచ్చు. వీటి వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్ల కంటే శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉండటం వల్ల నరాల సమస్య వస్తుంది కాబట్టి దీన్ని అరికట్టడానికి  యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఆకుపచ్చ ఆకుకూరలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఇతర ఆహారాలు తీసుకోవాలి.  సాధారణంగా న్యూరోపతి సమస్య ఉందని అనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వీలైంత తొందరగా న్యూరోపతీ వైద్యుడిని కలవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.                                               *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...