జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.  జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో, గ్రామ స్థాయిలో ఆవిర్భావ వేడుకలను పరిమితం  చేయాలని క్యాడర్‌కు సూచించింది.  జనసేన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తుంది. 100 శాతం స్ట్రైక్ రేటుతో అధికారంలోకి వచ్చిన జనసేన... గెలిచిన మొదటి ఏడాది అంగరంగ వైభవంగా పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంది.  రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కార్యకర్తలు, నేతలు పిఠాపురం ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాదు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా.. గతంలో ఎన్నడూ లేని విధంగా పిఠాపురం సభలో సుదీర్ఘ ప్రసంగాన్ని ఇచ్చారు . సీన్ కట్ చేస్తే.... ఏడాది తర్వాత.. అంటే ఈ సంవత్సరం జనసేన పార్టీ ఆవిర్భావ  దినోత్సవ వేడుకలను   రాష్ట్రస్థాయిలో  నిర్వహించడం లేదని స్వయంగా పార్టీ ప్రకటించింది. జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, గ్రామస్థాయిలో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని, ఇది పవన్ కళ్యాణ్ ఆదేశాలంటూ.. జనసేన ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది..  దీని మీద ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతుందట. ఏడాది ముందు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్న సభను.. ఇప్పుడు ఉన్నపలంగా ఎందుకు రద్దు చేసుకున్నారన్నది జనసైనికులను కూడా విస్మయానికి గురి చేస్తుందట. వాస్తవంగా పార్టీ సభ్యత్వ నమోదు మీద దృష్టి పెట్టాలని, ఉష్ణోగ్రతలు ప్రతికూలంగా ఉన్నాయని.. అందుకే రాష్ట్ర స్థాయి వేడుకలను రద్దు చేశామని జనసేన పార్టీ ప్రకటించినా.. అసలు కారణాలు వేరే ఉన్నాయని చర్చ పొలిటికల్ సర్కిల్లో సాగుతుందట. ప్రధానంగా పార్టీ నాయకత్వ తీరుపై కార్యకర్తల్లో,  నేతల్లో అసంతృప్తి పెరుగుతుందట. గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్న పరిణామాలను పార్టీ నాయకత్వం పట్టించుకోకపోవడం, కూటమిలో అంతర్గత విభేదాలు వంటి కారణాలతో, జనసేన కార్యకర్తలు, నేతలు తీవ్ర గందరగోళంలో ఉన్నారంటున్నారు. నామినేటెడ్ పదవులు విషయంలో సైతం జనసేన నాయకులు,  కార్యకర్తల్లో తీవ్ర సంతృప్తి వ్యక్తం అవుతుందట. అంతేకాదు కూటమి 15 ఏళ్లు కలిసి ఉండాలని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్లీ కొనసాగాలని, కూటమి  ధర్మాన్ని పాటించకపోతే  మొహమాటం లేకుండా  బయటికి వెళ్ళిపోవచ్చని  పవన్ కళ్యాణ్ అంటుండటం జనసైనికులకు నచ్చడం లేదంటున్నారు.  జనసైనికుల కారణంగా పొత్తుకు ఇబ్బందికర పరిస్థితులు తేవద్దంటూ పదేపదే పవన్ కళ్యాణ్ మాట్లాడడం, వారికి నచ్చడం లేదనేదని పొలిటికల్ సర్కిల్స్ నడుస్తున్న టాక్. వాస్తవానికి ఈసారి కూడా పిఠాపురంలో  ఆవిర్భావ సభ నిర్వహించాలని జనసేన పార్టీ మొదట భావించింది.. గత ఏడాది జరిగిన చిత్రాడ ప్రాంగణాన్ని పరిశీలించాలని పార్టీ అధిష్టానం, పిఠాపురం నేతలను ఆదేశించింది. అయితే ఏం జరిగింది ఏమో గాని, రాష్ట్ర స్థాయి వేడుకలు రద్దు చేసాం.. దాని స్థానంలో  యూత్ మీటింగ్ నిర్వహిద్దామని, అందుకు స్థలాన్ని చూడాలంటూ పిఠాపురం నేతలకు పార్టీ అధిష్టానం సమాచారం ఇచ్చింది.  చివరికి దాన్ని కూడా రద్దు చేసి .. ఆవిర్భావ వేడుకలను జిల్లాలకు మండలాలకు మాత్రమే పరిమితం చేసింది జనసేన పార్టీ.. మరోవైపు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రద్దు చేయడానికి కారణం... సభ్యత్వ నమోదు మీద ఫోకస్ చేయడానికే అంటూ జనసేన మరో ప్రకటన కూడా చేసింది.. వాస్తవానికి సభ్యత్వ నమోదు కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదనే చర్చ ఆ పార్టీలోనే సాగుతోందట. సభ్యత్వ నమోదు ప్రారంభించి 15 రోజులు అవుతుందా కేవలం 7, 8 లక్షల మాత్రమే చేయగాలిగారు. ఐదు రాష్ట్రాల్లో కలిపి ఇంత తక్కువ స్థాయిలో సభ్యత్వం నమోదు కావడంపై ఆ పార్టీ నాయకత్వం అసంతృప్తిగా ఉందట.  వైసీపీ ప్రభుత్వం హయాంలో  ప్రతికూల పరిస్థితుల్లో కూడా జనసేన వరుసగా రెండు సంవత్సరాలు  పార్టీ ఆవిర్భావ సభలు నిర్వహించింది. 2022 లో ఇప్పటం గ్రామంలో, 2023 మచిలీపట్నంలో ఆ పార్టీ వరుసగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించింది. అయితే అధికారంలో ఉన్న సమయంలో... పార్టీకి అత్యంత కీలకమైనటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్రస్థాయిలో నిర్వహించకపోవడం జనసేన పార్టీలో చాలామందికి మింగుడు పడడం లేదట. ఏది ఏమైనప్పటికీ... పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల కారణంగానే ఈసారి జనసేన పార్టీ ఆవిర్భావ సభలు రాష్ట్రస్థాయిలో నిర్వహించడం లేదంటున్నారు.  
  తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన ఫిర్యా దులను పరిశీలించిన స్పీకర్ తుది నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ ఇద్దరు ఎమ్మె ల్యేలు పార్టీ మార్పిడి చేశా రని ఆరోపిస్తూ దాఖలైన ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించిన అనంతరం స్పీకర్ వాటిని డిస్మిస్ చేశారు. దీంతో దానం నాగేందర్, కడియం శ్రీహరి పై ఉన్న పార్టీ ఫిరాయింపు ఆరోపణల నుంచి వారికి క్లీన్ చిట్ లభించింది. ఫిర్యాదులపై అందిన పత్రాలు, ఆధారాలు, చట్టపరమైన అంశాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ కార్యాలయం వెల్ల డించింది.  పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత విధించాలనే అభ్యర్థనలను స్పీకర్ తిరస్కరించారు. ఇటీవలి కాలంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై పార్టీ మార్పిడి ఆరోపణలు రావడంతో వారి సభ్యత్వంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. ప్రతిపక్షం నుంచి కూడా ఈ వ్యవహారంపై పలుమార్లు ప్రశ్నలు లేవనెత్తబడ్డాయి. అయితే అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత స్పీకర్ ఈ ఫిర్యాదులను కొట్టివే యడంతో వారి సభ్యత్వాలు కొనసాగనున్నాయి. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారి తీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు. ఈ నిర్ణయం పై వివిధ రాజకీయ పార్టీల నుంచి ఎలా స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.
బీజేపీ ఎట్టకేలకు మౌనం వీడింది. తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు విషయంలో జరుగుతున్న ప్రచారంపై బీజేపీఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది.  రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో  బీజేపీ పొత్తు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదని కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  ఇటీవల మీడియాతో మాట్లాడుతూ..  బీఆర్ఎస్‌తో పొత్తు  ప్రసక్తే లేదన్నారు. ఇది బీజేపీ తుదినిర్ణయమని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో   బీఆర్ఎస్‌  రెండుసార్లు, కాంగ్రెస్‌  ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.   బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు భారీగా బీజేపీలోకి వస్తున్నారని, వారిని ఆపుకోవడానికే కేసీఆర్, కేటీఆర్ పొత్తుల డ్రామాకు తెరతీశారన్నారు.  తమ క్యాడర్ ను, లీడర్ లను కాపాడుకోవడానికే కేసీఆర్, కేటీఆర్ లు బీజేపీతో పొత్తు అంటూ లీకులు ఇస్తున్నారని విమర్శించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే తమ బలమన్న రామచందర్ రావు.. రేవంత్ సర్కార్  ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో  ఘోరాతి ఘోరంగా విఫలమైందన్నారు.  ఇక కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, కుటుంబ పాలన వంటి అంశాల కారణంగా బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న ఆయన అటువంటి బీఆర్ఎస్ తో చేతులు కలిపే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు.   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు క్లారిటీతో.. తెలంగాణలో  రానున్న అసెంబ్లీ ఎన్నికలలో త్రిముఖపోరు అనివార్యం అని తేలిపోయింది. అలాగే బీఆర్ఎస్, బీజేపీల మధ్య చీకటి పొత్తు అంటే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను బీజేపీ నిర్ద్వంద్వంగా ఖండించినట్లైంది.  అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ సర్కార్ పై కూడా విమర్శలు గుప్పించడంతో  బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం అన్న బీఆర్ఎస్ విమర్శలను కూడా బీజేపీ ఖండించింది. ఇంత కాలంగా బీజేపీ చీకటి ఒప్పందాలు, పొత్తులు అన్న విమర్శలు బీఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి గట్టిగా వినిపిస్తున్నా.. ఇంత వరకూ కమలం పార్టీ వాటిపై స్పందించలేదు. దీంతో అసలు రాష్ట్రంలో బీజేపీ వ్యూహం ఏమిటి? రాష్ట్రంలో సొంతంగా అధికారం చేపట్టే అవకాశం లేకుంటే.. ఏదో ఒక పొత్తు కుదుర్చుకుని అధికారంలో భాగస్వామ్యం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు పొత్తుల ప్రశక్తే లేదంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చారు.  
ALSO ON TELUGUONE N E W S
The global blockbuster set for a rare international re-release as fans gear up for the sequel on March 19. The storm of Dhurandhar is far from over. Ahead of the highly anticipated release of Dhurandhar The Revenge on March 19, Jio Studios and B62 Studios are bringing the global blockbuster Dhurandhar back to the big screen in a rare and exciting theatrical re-release across approximately 500 screens worldwide, including 250 screens across India beginning March 12 (today) and 250 overseas, beginning March 13. For fans of the franchise, the re-release offers a thrilling opportunity to relive the phenomenon that redefined the spy-action genre and follow it up with the sequel just days later, experiencing the two chapters of the saga back-to-back on the big screen. While re-releases of major films have occasionally been seen in India, international re-releases of Hindi films remain extremely rare, making this move a significant moment for the franchise and a testament to the immense global demand for Dhurandhar. In North America alone, the film will return to theatres across nearly 185 screens, signalling the extraordinary anticipation for the next chapter.  Adding to the excitement, Dhurandhar The Revenge will host special Wednesday premiere shows across the USA and Canada on March 18, a day ahead of its global release. These premieres will take place largely on Premium Large Format (PLF) screens, which feature expansive wall-to-wall screens, immersive sound systems such as Dolby Atmos, enhanced projection, and luxury seating, formats typically reserved for major Hollywood event films. The mid-week premieres are already witnessing sold-out shows, underscoring the massive demand and the scale at which the sequel is poised to arrive. The recently launched trailer of Dhurandhar The Revenge has already become a global talking point, with trade and exhibitors betting big on the film’s international run. With the first instalment returning to cinemas just days before the sequel’s release, the stage is set for audiences worldwide to once again experience the thrill, scale, and intrigue that made Dhurandhar a cinematic phenomenon. Jio Studios presents a B62 Studios production, an Aditya Dhar film - Dhurandhar The Revenge. The high-octane spy-action thriller, written, directed and produced by Aditya Dhar and produced by Jyoti Deshpande and Lokesh Dhar, will release worldwide on March 19, 2026, in five languages — Hindi, Tamil, Telugu, Malayalam and Kannada. The story of unknown men unfolds in cinemas worldwide on March 19, 2026, on the occasion of Gudi Padwa and Ugadi, and ahead of Eid.  
  కుంభమేళాతో ఫుల్ ఫేమస్ వివాహ బంధంతో బ్యాచులర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ లవ్ జిహాద్ ఆరోపణలు ఎందుకు  కేరళలో ఎందుకు పెళ్లి చేసుకుంది.    ఇండియా వైడ్ గా ఓవర్ నైట్  స్టార్ స్టేటస్ పొందాలంటే పెట్టి పుట్టాలనే సామెతని కొంత మంది మాత్రమే ఓన్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళల్లో మోనాలిసా(Monalisa)ఒకటి. బహుశా కుంభమేళ మోనాలిసా అనాలేమో. దీంతో ఆమె ప్రయాగరాజ్ లో జరిగిన కుంభమేళాలో  ఏం చేసిందో, ఎలా ఫేమస్ అయ్యిందో  ఇండియా మొత్తం చెప్పేస్తుంది. అసలు గత సంవత్సరం జరిగిన కుంభమేళా వేడుకలు మోనాలిసా కోసమే వచ్చాయేమో. రీసెంట్ గా మోనాలిసా మరోసారి ఇండియన్ స్ట్రీట్స్, సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది డే గా కూర్చొని ఉంది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం.   మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ ని నిన్న వివాహం చేసుకుంది. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో జరగగా ముందుగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత గుడిలో సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఈ తతంగం మొత్తం పోలీసుల రక్షణలో జరిగినట్లుగా తెలుస్తుంది. మోనాలిసా కుటుంబ సభ్యులు మాత్రం వివాహానికి హాజరు కాలేదు. మతాంతర వివాహం కావడమే అందుకు కారణమని తెలుస్తుంది. also read: MGR: రాజేంద్రప్రసాద్‌కి చుక్కలు చూపిస్తున్న తమిళులు.. కరెక్టేనా అలా చేయడం      ఫర్మాన్ ఖాన్‌(Farman Khan)మోనాలిసాకి ఏడాదిన్నర క్రితం ఫేస్ బుక్ లో పరిచయం జరిగింది. ఆ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు వివాహ బంధంతో ఒకటయ్యారు. మోనాలిసా సినిమా రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చి గత ఏడాది లైఫ్ అనే తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక హిందీ మూవీ కూడా ఆమె ఖాతాలో ఉంది. ఆ సినిమా దర్శకుడు సనోజ్ మిశ్రా. మోనాలిసా వివాహంపై ఆయన మాట్లాడుతు మోనాలిసా జీవితాన్ని మార్చాలని నటనలో నేనే శిక్షణ ఇచ్చి సినీ రంగంలోకి తీసుకొచ్చాను. కానీ నా దగ్గర పనిచేసిన ఒక వ్యక్తి ఆమెని తప్పుదోవ పట్టించాడు. సౌత్ ఇండస్ట్రీలో ఆమెకి సినిమా అవకాశాలు కూడా అతడే కల్పించాడు.  మోనాలిసా ఈ వివాహాన్ని ప్రేమతో కాకుండా ప్రలోభాలకి లోనై చేసుకుంది. ఇది సాధారణ ప్రేమ వివాహం కాదు. లవ్ జిహాద్ లో భాగమని సనోజ్ మిశ్రా చెప్పుకొచ్చాడు. ప్రెజెంట్  మోనాలిసా పెళ్లికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి.        
సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా కొరియన్ రొమాంటిక్ డ్రామా ఫ్రెండ్ తమ్ముడితో 35 ఏళ్ళ మహిళ లవ్ స్టోరీ కొరియన్ సిరీస్ లకు తెలుగులోనూ మంచి ఆదరణ ఉంటుంది. పలు సిరీస్ లు రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా కొరియన్ రొమాంటిక్ డ్రామాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ఓ రొమాంటిక్ డ్రామా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 2018 లో వచ్చిన కొరియన్ సిరీస్ 'సంథింగ్ ఇన్ ది రెయిన్'(Something in the Rain). సన్ యే-జిన్, జంగ్ హే-ఇన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ కి.. అహ్న్ పాన్-సియోక్ దర్శకత్వం వహించారు. 35 ఏళ్ల వయసున్న ఓ మహిళ, తనకంటే ఆరేళ్ళు చిన్నవాడైన స్నేహితురాలి తమ్ముడితో ప్రేమలో పడితే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే కోణంలో ఈ సిరీస్ నడుస్తుంది. ఓటీటీ వేదికలు నెట్ ఫ్లిక్స్, ఎంఎక్స్ ప్లేయర్ లలో ఇది స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. కథ ఏంటంటే.. జిన్-ఆహ్ అనే మహిళ ఓ కాఫీ హౌస్ లో పనిచేస్తుంటుంది. అక్కడ మహిళలను చిన్నచూపు చూస్తుంటారు. మహిళా ఉద్యోగులకు బాస్ నుంచి లైంగిక వేధింపులు కూడా ఎదురవుతుంటాయి. 30 ఏళ్ళు దాటినా పెళ్లి కాకుండా, ఆఫీస్ లో బాస్ వేధింపులతో జీవితాన్ని నెట్టుకొస్తున్న జిన్-ఆహ్ జీవితంలోకి.. జూన్-హుయి అనే యువకుడు వస్తాడు. అతను ఎవరో కాదు.. ఆమె ఫ్రెండ్ తమ్ముడే.  వీడియో గేమ్ డెవలపర్ గా పని చేసే అతను.. విదేశాల నుంచి తిరిగి వస్తాడు. మొదట్లో అతన్ని ఓ తమ్ముడు లాగానే చూస్తుంది. క్రమంగా ఇద్దరి మధ్య చనువు పెరుగుతుంది. ముఖ్యంగా ఓ రోజు వర్షంలో గొడుగు కింద నడుస్తున్నప్పుడు ఇద్దరూ బాగా దగ్గరవుతారు. అప్పటినుంచి ముద్దు ముచ్చట్లతో సీక్రెట్ గా లవ్ ట్రాక్ నడిపిస్తుంటారు. అయితే ఈ విషయం ఇంట్లో తెలుస్తుంది. వయస్సు తేడా వల్ల వారి ప్రేమ కథకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అలాగే ఆఫీస్ లో వేధిస్తున్న బాస్ కి 'జిన్-ఆహ్' బుద్ధి చెప్పిందా? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. మంచి లవ్ స్టోరీతో పాటు మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపిన ఈ సిరీస్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఐఎండీబీలో ఈ సిరీస్ కి 8 రేటింగ్ ఉంది. Also Read: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ 'పెన్నుమ్ పోరాట్టమ్'
  -మొన్న ఎంజిఆర్ పై నోరు జారిన రాజేంద్రప్రసాద్  -స్పందించిన విశాల్, నాజర్  -క్షమాపణ చెప్పాలని డిమాండ్  ఇటీవల 'కళాప్రపూర్ణ కత్తి కాంతారావు'(kantharao)జాతీయ పురస్కారంని నటకిరీటి రాజేంద్రప్రసాద్(Rajendraprasad)అందుకున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతు జానపద చిత్రాల్లో కాంతారావు ప్రతిభని చూసి తమిళ గొప్ప నటుడు ఎంజిఆర్ ఉచ్చపోసుకునే వాడని మాట్లాడాడు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనే దిగులు తెలుగు సినిమా ప్రేమికుల్లో ఉంది.వాళ్ళు అనుకున్నట్టుగానే స్పందించడం స్టార్ట్ అయ్యింది. ఆ డీటెయిల్స్ చూద్దాం.  ప్రముఖ నటుడు విశాల్(Vishal)ఎక్స్ వేదికగా స్పందిస్తు 'డియర్ రాజేంద్రప్రసాద్ సర్, మీ మీద ఎంతో గౌరవం ఉంది. కానీ మీరు దివంగత లెజెండరీ నటుడు, వన్ అండ్ ఓన్లీ ఎంజిఆర్ గురించి చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు, తమిళనాడుకి గొప్ప లీడర్. కాంతారావు గారిని పొగడాలనే ఉద్దేశంతో మీరు ఈ వ్యాఖ్యలు చేశారని అర్థమైంది. అయితే అదే సమయంలో ఎంజిఆర్ ని తక్కువగా, చులకనగా చేసి మాట్లాడిన అవసరం లేదు. ఆయన, మా ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయా  రు. అలాంటి నటుడి గురించి ఇలా మాట్లాడి, తమిళనాడు ప్రజల మనోభావాలని  దెబ్బతీశారు. దయచేసి ముగింపు ఇస్తారని కోరుతున్నా. మిమ్మల్ని క్షమాపణలు చెప్పాలని కోరుతున్నందుకు నన్ను క్షమించండి, కానీ ఒక వేళ భవిష్యత్తులో నేను ఏదైనా నోరుజారి మాట్లాడితే, బహిరంగంగా క్షమాపణలు చెప్పడానికి వెనకాడనని తెలిపాడు. సదరు ట్వీట్ ని తెలుగు మూవీ అసోసియేషన్‌ని కూడా ట్యాగ్ చేశాడు. also read: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న తెలంగాణ సాంగ్.. కానీ డబ్బులు ఎంత వచ్చాయో తెలుసా!  సీనియర్ అండ్ లెజండ్రీ యాక్టర్ నాజర్(Naasar)కూడా రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలని ఖండిస్తు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసాడు. పలువురు నటులు, టెక్నీషయన్స్ నుంచి కూడా క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ ఊపందుకుంటుంది. విశాల్, నాజర్ ఎంటైర్ తమిళ చిత్ర పరిశ్రమ నటుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన నడిగర్ సంఘంకి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీగా ఉన్నారు.    
  -యూట్యూబ్ లో తెలంగాణ సాంగ్స్ జోరు  -రికార్డు వ్యూస్ తో ఎన్నో సాంగ్స్  -అదే దారిలో మరో పాట తెలంగాణ(Telangana)పల్లెల పరిమళాన్ని వెదజెల్లే ఎన్నో పాటలు సంగీత, సాహిత్య ప్రియుల్ని అలరిస్తూ వస్తున్నాయి. దీంతో రికార్డు వ్యూస్ వాటి వశమవుతున్నాయి. అదే సమయంలో తెలంగాణ ఆడపడుచుల మనో వేదనని పూస గుచ్చినట్టుగా చెప్పే  సాంగ్స్ కూడా పైన చెప్పుకున్న విషయాల్లో వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా తమ పెనిమిటి, పరాయి స్త్రీ మోజులో పడి తనని పట్టించుకోవడంలేదనే సాంగ్స్ ఎక్స్ పైరీ డేట్ కి చాలా దూరంగా ఉంటున్నాయి. అలాంటి ఒక సాంగ్ యూట్యూబ్ లో తన హవాని కొనసాగిస్తు వస్తుంది. డీటెయిల్స్ ఏంటో చూద్దాం.   'ఉడుకుడుకు రొట్టెలు ఉట్టిమీదుండంగా పాస్ పోయిన రొట్టెలకు పోతివా నాద ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ'.. జానపద స్టైల్ లో కూడిన ఈ సాంగ్ ఒన్ ఇయర్ బ్యాక్ రిలీజ్ అయ్యింది. రిలీజ్ రోజు నుంచే యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ ని రాబడుతు ప్రస్తుతం 47 మిలియన్ల వ్యూస్ దగ్గర ఉంది. దీన్ని బట్టి తెలంగాణ జానపద సాంగ్స్ కి ఉన్న క్రేజ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ పల్లెల్లో ఉన్న ఎన్నో అచ్చ తెలుగు పదాల్ని తెలియచెప్పడం కూడా ఈ సాంగ్ స్టైల్. also read:  Anupama Parameswaran: ప్రెగ్నెంట్‌గా అనుపమ పరమేశ్వరన్.. సైలెంట్‌గా ఓటీటీలోకి   ఈ సాంగ్ ని చాలా మంది డీజే రీమిక్స్ చేసారు. అవి కూడా రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.  కాని సాంగ్ ని రాసిన జోగుల వెంకటేష్ కి ఎలాంటి రెమ్యునరేషన్ ని ఇవ్వలేదు. ఈ విషయాన్నీ స్వయంగా  తానే గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో వెల్లడి చేసాడు.లావణ్య ఆలపించగా  జోగుల వెంకటేష్ , సౌజన్య అయాన్. మన్ప్రీత్ కౌర్ ముఖ్యమైన క్యారెక్టర్స్. సుమారు ఐదు లక్షలతో సాంగ్ ని రూపొందించారు.    
-అనుపమ పరమేశ్వరన్ కొత్త మూవీ -ఎప్పుడు రిలీజ్ అయ్యింది. -సదరు సబ్జెట్ ఏంటి  తెలుగుప్రేక్షకుల హృదయాలని ఖాళీగా ఉంచని మరో ముద్దుగుమ్మ 'అనుపమ పరమేశ్వరన్'(Anupama parameswaran). షార్ట్ పీరియడ్ లోనే ఆ హృదయాల్ని గెలుచుకొని అభిమాన నటిగా కూడా మారింది. ఆ అభిమానం యొక్క  రేంజ్ ఎంత స్థాయికి వెళ్లిందంటే టిల్లు స్క్వేర్ లో కొంచం రొమాంటిక్ యాంగిల్ ఉన్న క్యారక్టర్ లో కనిపిస్తేనే అభిమానులు విలవిలలాడిపోయారు. అంతలా ఆమెని ఆరాధిస్తున్నారు. మరి ఆమె కొత్త సినిమా ఓటిటి లో కి వచ్చిందంటే ఊరుకుంటారా! ఎప్ప్పుడు వచ్చింది అనే ప్రశ్నలు వేస్తూ ఓటిటి ముందు వాలిపోతారు. పైగా ప్రీవియస్ మూవీ బైసన్ లో అనుపమకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదనే అప్ సెట్ లో కూడా వాళ్లంతా ఉన్నారు. మరి ఓటిటిలో ఉన్న మూవీ చుద్దాం   లాక్ డౌన్..(lockDown)థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కగా అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ పోషించింది. ఇదేంటి ఎప్పుడు తెరకెక్కించారు, ప్రమోషన్స్ కూడా ఎక్కడ కనపడలేదు కదా అని అనుకుంటున్నారా! మీరు అనుకునేది నిజమే. లాక్ డౌన్ మూవీ ఈ ఏడాది స్టార్టింగ్ లో జనవరి 30 న తమిళనాట రిలీజయ్యింది. కాకపోతే పెద్దగా పబ్లిసిటీ లేదు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ వేదికగా నిన్న అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఇప్పుడు కూడా ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా  వచ్చేసింది. తమిళంతో పాటు  తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. also read: Tammareddy: ఇండస్ట్రీ పెద్ద దిక్కుపై తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలు వైరల్.. ఉంటే కనుక ఎవరు ! కథ పరంగా చూసుకుంటే మధ్యతరగతికి చెందిన అనిత అనే పెళ్లి కాని యువతి గర్భం దాలుస్తుంది. షాక్ అయిన అనిత గర్భాన్ని తొలగించుకోవాలని అనుకుంటే కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల అనిత బయటకి వెళ్లలేకపోతుంది. అన్ని హాస్పిటల్స్ లో కరోనా పేషెంట్లనే ట్రీట్ చేస్తారు. మరి అనిత పరిస్థితి ఏంటనేదే లాక్ డౌన్ కథ. లైకా ప్రొడక్షన్స్ నిర్మించగా ఎ.ఆర్.జీవా(Mr jeeva)డైరెక్టర్. చార్లీ, లివింగ్ స్టోన్, నిరోషా ముఖ్యమైన క్యారక్టర్ లలో కనిపించారు.    
  మూవీ : జాకీ నటీనటులు: యువన్ కృష్ణ,  రిధాన్ కృష్ణ, అమ్ము అభిరామి, మధుసూదన్ రావు ఎడిటింగ్: ఎన్. బి శ్రీకాంత్ మ్యూజిక్: శక్తి బాలాజీ సినిమాటోగ్రఫీ: ఎన్. ఎస్ ఉత్తయ్ కుమార్ నిర్మాతలు: ప్రేమ కృష్ణదాస్ దర్శకత్వం: ప్రగభాల్ ఓటీటీ : అమోజాన్ ప్రైమ్ కథ: మధురైలో రాముడు (యువన్ కృష్ణ) అనే యువకుడు షేర్ ఆటో నడుపుకుంటూ బ్రతుకుతుంటాడు. అతనికి ఒక అక్క, మేనకోడలు ఉంటారు. వారే అతని కుటుంబం. ఆటో నడుపుతున్న రాముడికి 'మీను' (అమ్ము అభిరాభి) పరిచయమవుతుంది. ఆ ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. అదే విలేజ్ కి పెద్దమనిషిగా చక్రవర్తి (మధు సూదన్ రావు) ఉంటాడు. ఆయన మేనల్లుడే కోబ్రా కార్తీక్ ( రిధాన్ కృష్ణ). అతను ఎక్కువగా పొట్టేళ్ల పోటీలలో పాల్గొంటాడు. అయితే ఆ ఊర్లో పొట్టేళ్ల పోటీలో గెలిచినవారికి 'జాకీ' అనే ఒక మెడల్ ఇస్తుంటారు. ఆ మెడల్ కారణంగా వాళ్లకి ఊళ్లో ఎంతో గౌరవం లభిస్తుంటుంది. ఆ మెడల్ ఏడాది నుంచి కార్తీక్ దగ్గరే ఉంటుంది. అలాంటి కార్తీక్ పొట్టేలుతో, రాముడి పొట్టేలు 'కాళీ' తలపడుతుంది. ఆ పోటీలో అనుకోకుండా కాళీ గెలుస్తుంది. దాంతో రాముడికి జాకీ మెడల్ వస్తుంది. తను చేజారిపోయిన మెడల్, రాముడికి దక్కడాన్ని కార్తీక్ తట్టుకోలేకపోతాడు. అందుకోసం మరోసారి తనతో పోటీకి తలపడేలా రాముడిని రెచ్చగొడతాడు. ఫలితంగా ఏం జరుగుతుంది? రాముడు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందనేది మిగతా కథ. విశ్లేషణ: సినిమా మొత్తం పొట్టేళ్ళ మధ్య పందెం సాగుతుంది. ఇందులో లవ్, రిలేషన్స్, ఫ్రెంఢ్ షిప్ ఉన్నప్పటికి పొట్టేళ్ళ మధ్య పోటీనే హైలైట్ చేశారు మేకర్స్. దానివల్ల క్యారెక్టర్ల కంటే కూడా పొట్టేళ్ళే ముఖ్యపాత్రలుగా కనిపిస్తాయి.‌ ఇది ఆడియన్ కి అంతగా కనెక్ట్ కాలేకపోవచ్చు. హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ పెద్దగా లేకపోవడం.. సినిమా ‌మొదల్లో హీరో ఫ్యామిలీతో హ్యాపీగా గడిపే సీన్లు చూపించినా ఆ తర్వాత అవి ఎక్కడా కనపడవు..ఎంత సేపు పొట్టేళ్ళ పోటీ.. అందులో‌.. గెలవాలి.. లేదంటే వ్యూహం‌ పన్నాలని ఎక్కువగా ఉంది. అది సినిమాకి పెద్ద మైనస్ గా ఉంది. అటు హీరో, ఇటు విలన్ నటన కాస్త వీక్ గానే అనిపిస్తుంది. ఎక్స్ ప్రెషన్స్ పెద్దగా పలకలేదు. క్లైమాక్స్ పర్వాలేదు. కొన్ని సీన్లు కొత్తగా ఉన్నాయి. అయితే వాటి కోసం సినిమా చూడాలా అంటే లేదనే చెప్పాలి. కొత్తదనం లేని పాయింట్ తో వచ్చిన ఈ జాకీకి ఎవరు పెద్దగా కనెక్ట్ కాలేరు.  పొట్టేళ్ల ఫైట్ కి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువైపోవడం, మిగతా ఎమోషన్స్ శాతం తగ్గడం వలన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. అడల్ట్ సీన్లు లేవు. అసభ్య పదజాలం వాడలేదు. ఎన్. ఎస్ ఉత్తయ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. శక్తి బాలాజీ బిజిఎమ్ అండ్ ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.  నటీనటుల పనితీరు: రాముడుగా యువన్ కృష్ణ,కోబ్రా కార్తీక్ గా రిధాన్ కృష్ణ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక మిగతా వారు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.  ఫైనల్ గా : జస్ట్ ఓకే. రేటింగ్ : 1.5 / 5  ✍️. దాసరి మల్లేశ్
-హాట్ టాపిక్ గా మారిన తమ్మారెడ్డి వ్యాఖ్యలు  -ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు! -దాసరి తర్వాత ఎవరైనా ఉన్నారా! -ఇంక పెద్ద దిక్కు రానట్టేనా! సుదీర్గ కాలం నుంచి తెలుగు సినిమా తన మనుగడ కొనసాగిస్తు కోట్లాది మంది ప్రేక్షకులని అలరిస్తూ వస్తుంది. సినిమా అలవాటు లేని వాళ్ళు సైతం అనుకోకుండా సినిమా చూస్తే ఇక సినిమా చూడటం అనేది తన నిత్య దినచర్యగా చేసుకుంటారు. ఈ విషయంలో తిండి, నిద్ర, కాలకృత్యాలు అనేవి తనకి ఎదురొచ్చినా డోంట్ కేర్ అనే నైజం. అంతటి బలమైన సాధనం సినిమా. మరి అలాంటి సినిమాని తెరకెక్కించే 24 క్రాఫ్ట్స్ లో ఒక్కోసారి సమస్యలు వస్తాయి. తద్వారా సినిమా కూడా సమస్యలు ఎదుర్కొంటుంది. అలాంటి సమయంలో ఇండస్ట్రీ పెద్దగా దర్శకరత్న దాసరి నారాయణరావు(Dasari Narayanarao)వ్యవహరించేవాడు. కానీ ఆయన తర్వాత పెద్ద దిక్కు ఎవరనే మాటలు తరచుగా వస్తూనే ఉన్నాయి. ఈ విషయంపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja)చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా నిలుస్తున్నాయి. ఆ మాటలేంటో చూద్దాం. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత తమ్మారెడ్డి 'వదలా'(vadhala)అనే మూవీతో మరోసారి నిర్మాతగా అడుగుపెడుతున్నాడు. నిన్న ఈ మూవీ నుంచి గ్లింప్స్‌ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒక మీడియా ప్రతినిది తమ్మారెడ్డితో 'ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు అని అడగటం జరిగింది. అందుకు తమ్మారెడ్డి మాట్లాడుతు 'ఇండస్ట్రీలో పదవులు ఉండవు. పెద్ద దిక్కు అనేది పదవి కాదు. ఎవరైనా సరే వాళ్లు చేసే పనులని బట్టి పెద్ద దిక్కు అవుతారు. అప్పట్లో దాసరి నారాయణరావు గారు తాను చేసే పనుల వల్ల పెద్ద దిక్కు అయ్యారు. దాంతో అందరం ఆయన దగ్గరకి వెళ్ళేవాళ్ళం. ఇవాళ ఆయన లేరు కాబట్టి, పెద్ద దిక్కు కూడా ఇంకెవరూ లేరు. నాకు తెలిసి అలాంటి వ్యక్తి రావడం కూడా జరగదని బదులిచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. also read: UStaad Bhagat Singh: మహేష్ బాబు ఫ్యాన్స్ కి క్షమాపణలు.. ఉస్తాద్ భగత్ సింగ్ కి మద్దతు ఇస్తారా!    'వదలా'మూవీ చూసుకుంటే జగపతి బాబు(Jagapathibabu)లయ, హృతిక శ్రీనివాసన్ జత కడుతుండగా వంశీ కృష్ణ ఆకెళ్ల(Vamsikrishna akella)దర్శకుడు. కిషోర్ నాయుడు మరో నిర్మాత. గ్లింప్స్‌ అయితే ఆసక్తికరంగా ఉంది.  
ప్రస్తుతం గ్రాఫిక్స్ తో ముడిపడిన భారీ బడ్జెట్ సినిమాల హవా నడుస్తోంది. అయితే సీజీ ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో కెమెరామెన్ పాత్ర అత్యంత కీలకం. తాజాగా 'వదలా' మూవీ ఈవెంట్ లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు(Chota K Naidu ) ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీజీ సినిమాల్లో కెమెరామెన్ పోరాటం ఇప్పుడు సినిమాల్లో 24 క్రాఫ్ట్స్ కాకుండా, సీజీ కోసం ప్రత్యేకంగా ఒక టెక్నీషియన్ ఉంటున్నాడు. ఆ టెక్నీషియన్ అనుమతి లేకుండా ఇప్పుడు ఒక్క ఫ్రేమ్ కూడా తీయడం లేదని ఛోటా కె. నాయుడు వివరించారు.  "నేను పెద్ద పుడింగిని, నాకు నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి అని నా ఇగో చూపిస్తే ఇక్కడ వర్కవుట్ అవ్వదు" అని ఛోటా చాలా నిజాయితీగా చెప్పారు. సీజీ టెక్నీషియన్ కి ఏం కావాలో అదే చేస్తున్నామని అన్నారు. సీజీ టెక్నీషియన్ అప్రెంటిస్ అయినా, ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాడైనా సరే.. వాళ్లకు ఏం కావాలో అదే అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే కొందరు అవుట్ పుట్ బాగుంటే వాళ్ళు క్రెడిట్ తీసుకొని, అవుట్ పుట్ బాలేకపోతే మాత్రం సినిమాటోగ్రాఫర్స్ ని నిందిస్తున్నారని ఛోటా కె. నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అంజి 'తల ఎత్తుకుని'.. విశ్వంభర 'తల వంచుకుని'.. గతంలో 'అంజి' వంటి అద్భుత దృశ్య కావ్యాన్ని కెమెరామెన్ గా పనిచేసిన ఛోటా కె. నాయుడు, ఇప్పుడు 'విశ్వంభర'(Vishwambhara) సినిమాకు పని చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ పనిచేసే విధానం మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. అంజి సినిమా కోసం మేము ఎంతో గర్వంగా, తల ఎత్తుకుని పని చేశాం. విశ్వంభర విషయానికి వస్తే, తల వంచుకుని పని చేయాల్సి వస్తోంది. దీనికి కారణం ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలు. సుమారు 400 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోంది. అంత భారీ సినిమా తీస్తున్నప్పుడు, తన అహం కంటే సినిమా అవుట్‌పుట్ ముఖ్యమని అన్నారు. ఈ సినిమా కోసం చాలా సమయం తీసుకుని, ది బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడానికి చిత్ర యూనిట్ శ్రమిస్తోందని ఛోటా కె. నాయుడు తెలిపారు. మరిన్ని ఆసక్తికరమైన సినీ విశేషాలు, ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూలు, తాజా అప్‌డేట్స్ కోసం మా 'తెలుగువన్ సినిమా'(TeluguOne Cinema) యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
జీవితంలో మనం చేసే ప్రతి పోరాటం, పడే ప్రతి కష్టం మన వారి కోసమే. కానీ, మనం ఎవరి కోసమైతే రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతున్నామో, అదే వ్యక్తులు మనల్ని అపార్థం చేసుకుంటే ఆ మనసు పడే వేదన వర్ణనాతీతం. ‘ఎవరి కోసమే ఆ సంపాదన?’ అనే ప్రశ్న వెనుక దాగి ఉన్న కన్నీటి కథ ఇది. ఒకవైపు అనారోగ్యంతో ఉన్న వదిన, మరోవైపు కనీసం తిండికి కూడా లేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఇంటి ఆడబిడ్డ తన అవసరాలను సైతం పక్కన పెట్టి ఆఫీసుకెళ్లి కష్టపడుతుంటే, తోటివారు ఆమెను విమర్శించడం ఎంతటి దౌర్భాగ్యం? ‘నోరు ఉంది కదా అని ఎదుటివారిని తప్ప్పుబడితే ఏమొస్తుంది?’ అనే ఆవేదన ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె సంపాదించే 600 రూపాయల జీతం ఆమె విలాసాల కోసం కాదు. అది ఒక గొప్ప లక్ష్యం కోసం. ఆ వివరాలు తెలిస్తే ఎవరికైనా కళ్ళు చెమరుస్తాయి. తన సోదరి హారతి భవిష్యత్తు కోసం, కళ్ళు లేని తమ్ముడు రాజు కంటి ఆపరేషన్ కోసం, మరో సోదరి సుమతి వివాహం కోసం, అన్నయ్య మూర్తి పిల్లలు కుమార్,  సీత బంగారు భవిష్యత్తు కోసం.. ఇలా తను సంపాదించినదంతా ఆ కుటుంబం కోసమే దాచిపెడుతోంది. ఒక పిచ్చుక తన గూడు కోసం ఒక్కో గింజా తెచ్చినట్లుగా, ఆమె తన కుటుంబం కోసం ఒక్కో రూపాయిని కూడబెడుతోంది. తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా, అందరి కోసం బతుకుతున్న ఆ ఆడబిడ్డ త్యాగం నిజంగా వెలకట్టలేనిది. ‘ఈ సంసారం బరువు బాధ్యతలు మోయడానికి ఒక మగాడు అంటూ ఏనాడు నిలబడతాడో, ఆనాడే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను’ అని ఆమె చెప్పే మాటలు నేటి సమాజానికి ఒక హెచ్చరిక. తాగుడుకు బానిసైన వ్యక్తి ఇంటి పెద్దగా మారినప్పుడు, బాధ్యతను తన భుజాన వేసుకున్నప్పుడు మాత్రమే ఆమె మనసు శాంతిస్తుంది. మూర్తి వంటి వ్యక్తులు తమ తప్పు తెలుసుకుని, ‘నువ్వు లేకపోతే మాకు దిక్కు లేదు’ అని గ్రహించినప్పుడే ఆ కుటుంబానికి నిజమైన వెలుగు వస్తుంది. బంధాలు అంటే కేవలం కలిసి ఉండటం కాదు, ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకోవడం. స్వార్థం వీడి, కుటుంబం కోసం కష్టపడే వారిని గౌరవించినప్పుడే ఆ ఇల్లు స్వర్గమవుతుంది. మన కోసం శ్రమించే వారి కన్నీటి వెనుక ఉన్న కారణాన్ని గుర్తించమని తెలియజెప్పే ఈ గాథ మనందరికీ ఒక పాఠం. ఇంతటి ఉద్వేగభరితమైన సన్నివేశం ‘అంతులేని కథ’ చిత్రంలోనిది. కె.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జయప్రద ప్రధాన పాత్ర పోషించారు. ఆమెకు అన్నయ్యగా రజినీకాంత్ ఓ విభిన్నమైన పాత్రలో కనిపిస్తారు. ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా, ఆలోచన రేకెత్తించే విధంగా సాగే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల సమాహారమే ఈ వీడియో. వీక్షించండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
అపజయాలు ప్రతి మనిషి జీవితంలో వస్తూనే ఉంటాయి. అపజయాలు లేకపోతే అసలు విజయానికి విలువ, విజయాలు అనుభూతి చెందలేదు. కానీ ప్రతి ఒక్కరూ అపజయం అనేది తమకు ఎదురు కాకూడదు అని అనుకుంటారు. అయితే అపజయాల విషయంలో మనిషి వైఖరి ఎలా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.  "ఒక వ్యక్తి వెయ్యిమార్లు విఫలుడైనా ఉన్నతమైన ఆదర్శానికి అంటిపెట్టుకుని ఉండాలి. అబద్ధాలు చెప్పడం రాని గోడలా ఉండడం కన్నా, తప్పు చేస్తూ ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ఉత్తమం" అని అనేవారు స్వామి వివేకానంద. అబ్రహమ్ లింకన్ తమ దేశ పార్లమెంటు సభ్యుడవ్వాలనుకున్నాడు. అయితే అతని మొదటి ప్రయత్నం విఫలమైంది. వ్యాపారంలో భాగస్వామి అతణ్ణి మోసం చేశాడు. వ్యాపారం కోసం చేసిన అప్పుల బారినుంచి బయటపడడానికి 17 సంవత్సరాల కాలం పట్టింది. అతను వివాహం చేసుకున్న కొద్దికాలానికే మొదటి భార్య మరణించింది. గయ్యాళి అయిన రెండవ భార్య అతనికి పెద్ద తలనొప్పిగా మారింది. అయినా అతడు తన లక్ష్యసాధనకై శక్తినంతా ఉపయోగిస్తూ, చేస్తున్న ప్రయత్నాలను మానలేదు. చివరకు అతను ఎన్నికల్లో నెగ్గడమే కాకుండా, అమెరికా అధ్యక్షుడై, చరిత్రపుటల్లోకి ఎక్కాడు. వ్యక్తిగత సమస్యలకు జడవకుండా, ఉన్నత ఆదర్శాన్ని విడవకుండా ప్రయత్నించిన వారే ఏ కార్యాన్నైనా సాధించగలరు. మనిషి వ్యక్తిగత, సామాజిక, మానసిక రంగాలలో తప్పకుండా అభివృద్ధి సాధించాలి. అలా సాధించినప్పుడు మనిషికి అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఆ విషయం లోతు ఎంత అనేది అర్థం అవుతుంది. లేకపోతే ఎప్పటికీ ఏమీ తెలియకుండా బెల్లం కొట్టిన రాయి చందాన మనిషి ప్రవర్తన కూడా ఏమీ పట్టనట్టు, ఏమీ తెలియని ముర్ఖుడిలా ఉండిపోతారు. ఇలా ఉంటే అపజయాలు ఎదురైనప్పుడు వాటి నుండి ఏమీ నేర్చుకోలేరు. అపజయాల గురించి అసలు ఆలోచించలేరు. కేవలం అపజయాల కారణంగా తాము ఎదగలేక పోయామనే అసంతృప్తి మాత్రమే వాళ్ళలో కనిపిస్తుంది. కాబట్టి అపజయాలను అనుభవాలుగా చూసినప్పుడే మనిషి సరైన ఆలోచనా మార్గంలో ఉండగలుగుతారు.                                  *నిశ్శబ్ద.
వివాహం అనేది ఒక ముఖ్యమైన సంబంధం.  అటు ఏడు తరాలు,  ఇటు ఏడు తరాలు చూసి పెళ్ళి నిశ్చయించాలని పెద్దలు చెప్పేవారు. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది.  పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉంటే చాలు.. నిర్ణయాలు చాలా వేగంగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత జరిగే ఏ పర్యవసానం అయినా ఎక్కువగా అమ్మాయిలే భరించాల్సి వస్తుంది.  అబ్బాయి విషయంలో అయినా, అతని కుటుంబం పరంగా అయినా, ఆర్థిక విషయాలు అయినా.. ఏ సమస్య వచ్చినా అమ్మాయిలు ఎక్కువ ఇబ్బందుల పాలవుతారు. ఒకప్పుడు సమస్య వస్తే.. సర్దుకుపోవాలని అనుకునేవారు అమ్మాయిలు. కానీ.. నేటికాలంలో అలా లేదు.. సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్యకు ముఖ్య కారణం.. అబ్బాయిలు, అతని కుటుంబ సభ్యులు అయినప్పుడు ఆమె వారిని ఎదిరించడానికి సిద్దపడుతోంది, ప్రశ్నిస్తోంది,  కానీ ఒత్తిడి అనుభవించేది కూడా అమ్మాయిలే. ఈ గొడవలు ఏమీ లేకుండా వివాహం తర్వాత జీవితం బాగుండాలంటే.. పెళ్లికి ఒప్పుకోవడానికి ముందు ప్రతి అమ్మాయి చేసుకోబోయే అబ్బాయిని అడగవలసిన ప్రశ్నలు కొన్నిఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. కెరీర్ లక్ష్యం..  సంబంధం ఫైనల్ కాబోతుంటే లేదా ఇప్పటికే ఫైనల్ అయి ఉంటే,  కాబోయే భర్తను అతని కెరీర్ లక్ష్యాల గురించి అడగాలి. దీని గురించి ముందుగానే చర్చించడం మంచిది. అతను తన కెరీర్ గురించే కాదు.. అమ్మాయి  కెరీర్‌కు మద్దతు ఇస్తాడా?  లేదా.. ఈ విషయాలు ముందే మాట్లాడటం మంచిది.  ఎందుకంటే వివాహం తర్వాత కెరీర్ ను పక్కన పెట్టి ఇంటిని చూసుకోమని చెప్పేవారు చాలా ఎక్కువమంది ఉంటారు. డబ్బు.. డబ్బు గురించి మాట్లాడితే.. ఈ అమ్మాయి మనీ మైండెడ్ అని ఎవరైనా అనుకుంటారేమో అని వెనకడుగు వేసే అమ్మాయిలు చాలా మంది ఉంటారు. కానీ పెళ్లి తర్వాత జీవితంలో చాలా వరకు డబ్బు కారణంగా గొడవలు వస్తుంటాయి.  కాబోయే భర్తతో ముందుగానే డబ్బు నిర్వహణ గురించి చర్చించాలి. అతను డబ్బును ఎలా తెలివిగా ఆదా చేస్తాడో, అతను అప్పుల్లో ఉన్నాడా లేదా  అనే విషయాలు మాట్లాడాలి. అంతేకాదు.. ఇద్దరూ కలిసి ఇంటిని  ఎలా మెయింటైన్  చేస్తారనే విషయం కూడా చర్చించాలి. లైఫ్ స్టైల్.. సంబంధాన్ని నిర్ధారించుకునే ముందు అతని జీవనశైలి గురించి ప్రశ్నలు అడగాలి.  భర్త జీవిత లక్ష్యాలను ప్రతి అమ్మాయి అడిగి  తెలుసుకోవాలి. అతనికి ప్రయాణం చేయడం ఇష్టమా? అతనికి సినిమాలు చూడటం ఇష్టమా?  రోజును ఎలా మలచుకుంటాడు.. ఇవన్నీ చర్చిస్తే.. వీటి సమాధానల మీదే అతని వ్యక్తిత్వం కూడా స్పష్టంగా తెలుస్తుంది. పర్సనల్ సేవింగ్స్.. సంబంధం ఇక ఖాయం అనుకున్నప్పుడు వారితో వ్యక్తిగత పొదుపు గురించి చర్చించాలి.  వారి భవిష్యత్తు ప్రణాళికలను కూడా ముందుగానే తెలుసుకోవాలి. వారి ప్లానింగ్స్ ప్రకారమే భార్య భవిష్యత్తు అతనితో ఎలా ఉంటుంది అనే విషయం కూడా తెలుస్తుంది. దీని వల్ల ఏవైనా సమస్యలు ఉంటే ముందే పరిష్కారమవుతాయి. లోన్ లు,  అప్పులు..  కాబోయే భర్తకు ఏవైనా అప్పులు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం. అతని కుటుంబానికి ఏవైనా పెద్ద అప్పులు ఉన్నాయా లేదా బ్యాంక్ లోన్లు వంటివి ఉన్నాయా  అని కూడా ముందుగానే అడగాలి. పైన చెప్పుకున్న విషయాలను పెళ్లికి ముందే అమ్మాయిలు కాబోయే భర్తను అడిగి క్లియర్ చేసుకుంటే వివాహం తర్వాత జీవితం చాలా వరకు సంతోషంగా గడిచిపోతుంది.                                        *రూపశ్రీ.
ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవగానే దిండు మీద రాలిన జుట్టును చూసినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. జుట్టు అనేది కేవలం మన శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసానికి మరియు మన వ్యక్తిత్వానికి ప్రతీక. ఆడవారికైనా, మగవారికైనా ఒత్తైన కురులు ఉండాలని కోరుకోవడం సహజం. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో జుట్టు రాలడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. అసలు జుట్టు ఎందుకు రాలుతుంది? దీనికి పరిష్కారాలు ఏమిటి? డాక్టర్ల అభిప్రాయం ప్రకారం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను Expert Dermatologist Dr. Sunaina Shaik (MD, DNB Dermatology, FRGUHS Trichology) విషయాలు Video Link క్లిక్ చేసి తెలుసుకోండి.  మనం జుట్టుపై ఎందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి? (Why Should We?) జుట్టు రాలడం అనేది కేవలం పైకి కనిపించే సమస్య మాత్రమే కాదు, అది మన శరీరంలో ఉన్న అంతర్గత మార్పులకు లేదా ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. • ఆత్మవిశ్వాసం: ఒత్తైన జుట్టు మన అందాన్ని పెంచడమే కాకుండా మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. • ఆరోగ్య సూచిక: జుట్టు అధికంగా రాలుతుంటే అది మన శరీరంలో పోషకాహార లోపం (Vitamin D, Iron, Zinc) లేదా థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నాయని సూచిస్తుంది. • ముందస్తు జాగ్రత్త: ప్రారంభంలోనే జుట్టు రాలడాన్ని గమనించి తగిన చర్యలు తీసుకుంటే, భవిష్యత్తులో జుట్టు పల్చబడకుండా (Hair Thinning) చూసుకోవచ్చు. ఏం చేయకూడదు? (What Not To Do) తెలిసో తెలియకో మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు జుట్టు విపరీతంగా రాలడానికి కారణమవుతాయి. వాటిని వెంటనే ఆపండి: 1. బిగుతైన హెయిర్ స్టైల్స్ (Tight Hairstyles): జుట్టును గట్టిగా లాగి ముడి వేయడం లేదా పోనీటైల్స్ వేయడం వల్ల 'ట్రాక్షన్ అలోపేషియా' (Traction Alopecia) వచ్చి నుదురు భాగంలో జుట్టు రాలిపోతుంది. 2. టైట్ హెల్మెట్లు వాడటం: మగవారిలో టైట్ హెల్మెట్లు వాడటం వల్ల కలిగే ఘర్షణ (Friction) జుట్టు షాఫ్ట్ బలహీనపడి విరిగిపోవడానికి కారణమవుతుంది. 3. ఇతరుల వస్తువులు వాడటం: ఒకరు వాడిన హెల్మెట్ లేదా దువ్వెన మరొకరు వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఉంది. 4. జంక్ ఫుడ్‌పై ఆధారపడటం: సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల జుట్టుకు అందాల్సిన ప్రోటీన్ అందదు. జుట్టును ఎలా సంరక్షించుకోవాలి? (How To) జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే కేవలం పైన రాసే నూనెలు, సీరమ్స్ మాత్రమే కాదు, లోపలి నుండి పోషణ అవసరం. • సరైన డైట్ (High Protein Diet): జుట్టు అనేది కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతుంది. కాబట్టి మీ బరువులో ప్రతి కిలోగ్రాముకు 1 గ్రాము ప్రోటీన్ అవసరం (ఉదాహరణకు 60 కేజీల బరువు ఉంటే 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి). మీ ఆహారంలో పన్నీర్, సోయా, చికెన్, చేపలు మరియు గుడ్లు ఉండేలా చూసుకోండి. • గింజలు మరియు విత్తనాలు (Nuts & Seeds): ప్రతిరోజూ గుప్పెడు నట్స్, గుమ్మడి గింజలు (Pumpkin Seeds), పొద్దుతిరుగుడు గింజలు (Sunflower Seeds) మరియు నువ్వులు తీసుకోవడం జుట్టుకు చాలా మేలు చేస్తుంది. • ఒత్తిడి తగ్గించుకోండి: అధిక ఒత్తిడి వల్ల జుట్టు రాలడం పెరుగుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి. • స్కాల్ప్ పరిశుభ్రత: చెమట పట్టినప్పుడు జుట్టును తరచుగా వాష్ చేయడం మరియు హెల్మెట్ లోపల ఉండే ప్యాడింగ్‌ను శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. తరచుగా అడిగే ప్రశ్నలు (Q&A) ప్ర: రోజుకు ఎన్ని వెంట్రుకలు రాలడం సహజం?  జ: సాధారణంగా రోజుకు 100 వెంట్రుకల వరకు రాలడం సహజమే. అయితే మీ జుట్టు పల్చగా ఉంటే, 50 వెంట్రుకలు రాలినా అది సమస్యగానే పరిగణించాలి. ప్ర: హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు ఊడిపోతుందా?  జ: కేవలం హెల్మెట్ వల్ల జుట్టు ఊడదు. కానీ టైట్ హెల్మెట్ వల్ల కలిగే ఘర్షణ మరియు చెమట వల్ల ఇన్ఫెక్షన్లు ఉంటే జుట్టు రాలవచ్చు. ప్ర: జుట్టు రాలడం మొదలైన వెంటనే చికిత్స తీసుకోవాలా?  జ: సాధారణంగా ఏదైనా స్ట్రెస్ లేదా అనారోగ్యం (జ్వరం వంటివి) వచ్చిన మూడు నెలల తర్వాత జుట్టు రాలడం మొదలవుతుంది. అది ఆరు నెలల వరకు ఉంటే పర్వాలేదు కానీ, ఏడాది కంటే ఎక్కువ కాలం విపరీతంగా రాలుతుంటే తప్పనిసరిగా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. జుట్టు సంరక్షణ అనేది ఒక ప్రయాణం. మనం తీసుకునే ఆహారం, మన జీవనశైలి మరియు మనం చేసే చిన్న చిన్న మార్పులే మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ, మీ జుట్టును ప్రేమించండి. మీకు మరిన్ని ఆరోగ్య చిట్కాలు మరియు నిపుణుల సలహాలు కావాలా? అయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ను క్లిక్ చేయండి (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవాలు.  అయితే  ప్రపంచవ్యాప్తంగా  కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  పెరుగుతున్న కిడ్నీ  వ్యాధి వ్యాప్తి గురించి అవగాహన కల్పించడానికి,  అవగాహన పెంచడానికి,  కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యల గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రతి సంవత్సరం మార్చి రెండవ గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అది ఈ ఏడాది మార్చి 12వ తేదీన వచ్చింది.  అన్ని వయసుల వారిలో కిడ్నీ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. . పిల్లలు కూడా కిడ్నీ సమస్యల ప్రమాదంలో ఉన్నారు. మూత్రపిండాలు  శరీరానికి ఫిల్టర్లలా పనిచేస్తాయి. అవి రక్తం నుండి మలినాలను,  అదనపు నీటిని ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా విసర్జిస్తాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడం మానేస్తే, శరీరంలో విషపూరితం పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మూత్రపిండాల పరీక్షల సమయంలో క్రియేటినిన్ స్థాయిలు గురించి ప్రస్తావన వస్తూ ఉంటుంది. అసలు క్రియోటినిన్ అంటే ఏంటి?  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. క్రియాటినిన్.. క్రియాటినిన్ అనేది శరీర కండరాలలో ఉత్పత్తి అయ్యే క్రియాటిన్ అనే సమ్మేళనం విచ్ఛిన్నం కావడం ద్వారా ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థం. మనం శారీరక శ్రమలో పాల్గొన్నప్పుడు, మన కండరాలు శక్తిని ఉపయోగిస్తాయి,  ఈ ప్రక్రియలో క్రియాటినిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తంలో నిరంతరం ఉత్పత్తి అవుతుంది.  సాధారణ పరిస్థితులలో మూత్రపిండాలు దానిని రక్తం నుండి వడపోసి మూత్రం ద్వారా విసర్జిస్తాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేసినప్పుడు, రక్తంలో క్రియాటినిన్ స్థాయి సమతుల్యంగా మారుతుంది.  క్రియేటినిన్ పెరగడం అనేది మూత్రపిండాలు రక్తాన్ని తగినంతగా ఫిల్టర్ చేయడం లేదని సంకేతాన్ని ఇస్తుంది. క్రియాటినిన్ స్థాయి.. క్రియాటినిన్ స్థాయి ఎలా ఉండాలి? రక్త పరీక్ష ద్వారా క్రియాటినిన్ స్థాయిలను గుర్తిస్తారు.    పురుషులలో సాధారణ క్రియాటినిన్ స్థాయిలు 0.7 నుండి 1.3 mg/dL వరకు ఉంటాయి. మహిళల్లో, ఇది 0.6 నుండి 1.1 mg/dL మధ్య  ఉంటే అది సాధారణం అని పరిగణిస్తారు. క్రియాటినిన్ స్థాయి నిరంతరం పెరుగుతూ ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. క్రియాటినిన్ స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే,  మూత్రపిండాలు అంత ప్రమాదంలో ఉంటాయి. క్రియాటినిన్ ఎక్కువైతే ఏ సమస్యలు వస్తాయి.. మూత్రపిండాల వడపోత సామర్థ్యం బలహీనపడటంతో క్రియాటినిన్ స్థాయిలు పెరుగుతాయి, దీని వలన శరీరంలో యూరియా,  ఇతర విషపదార్థాలు పేరుకుపోతాయి.   మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, తరచుగా నొప్పి నివారణ మందులు వాడటం,  శరీరం ఎక్కువగా డీహైడ్రేట్ అవ్వడం మొదలైనవన్నీ మూత్రపిండాలను దెబ్బతీస్తాయి,  అధిక క్రియాటినిన్ స్థాయిలకు దారితీస్తాయి. ఈ పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగితే, ఇది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD) ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. క్రియాటినిన్ పెరగడం వల్ల మూత్రపిండాలే కాకుండా మొత్తం శరీరంపై ప్రభావం చూపుతుంది. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనప్పుడు, శరీరంలో ద్రవం,  ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది. దీని వలన పాదాలు, ముఖం లేదా చేతులు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,  రక్తపోటు సమస్యలు పెరుగుతాయి. రక్తంలో విషపదార్థాలు పేరుకుపోవడం వల్ల అలసట, బలహీనత, వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.  కొన్ని సందర్భాల్లో,  పొటాషియం స్థాయిలు అసమతుల్యంగా మారడం,  హృదయ స్పందనలు క్రమబద్దంగా లేకపోవడం వంటి సమస్యలకు కారణమవుతుంది. క్రియాటినిన్ పెరిగితే ఏం చేయాలి? క్రియాటినిన్ స్థాయి తరచుగా ఎక్కువగా ఉంటే, కిడ్నీ సమస్య ఉందో లేదో తెలుసుకోవడానికి  ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. మందులతో పాటు, క్రియాటినిన్ స్థాయిలను నియంత్రించడానికి  ఆహారాన్ని మెరుగుపరుచుకోవాలి.   మూత్రపిండాలపై ఒత్తిడిని తగ్గించే ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తక్కువగా తినాలి.  ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాల పరిమాణాన్ని పెంచాలి. ఉదాహరణకు పండ్లు,  కూరగాయలు. రక్తపోటును అదుపులో ఉంచడానికి, ఉప్పు,  ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. నీరు పుష్కలంగా త్రాగాలి. కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజూ 2-3 లీటర్ల నీరు త్రాగడం చాలా అవసరం.                        *రూపశ్రీ.
మూత్రపిండాలు శరీరంలో వడపోత  అవయవాలు. ఇవి రక్తాన్ని శుద్ది చేస్తాయి. అలాగే శరీరంలో ద్రవాల నుండి వెలువడే వ్యర్థాలను మూత్రం రూపంలో విసర్జించడానికి సహాయపడతాయి. అయితే నేటి కాలంలో చాలామంది మూత్రపిండాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.  కిడ్నీ ఫెయిల్యూర్,  మూత్రనాళ ఆరోగ్యం దెబ్బతినడం, కిడ్నీలలో రాళ్లు..ఇలా మూత్రపిండాలకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి.  మూత్రపిండాల ఆరోగ్యం బాగుండాలన్నా, వాటి పనితీరు మెరుగ్గా ఉండాలన్నా కొన్ని పండ్లు చాలా బాగా సహాయపడతాయి.  ఈ పండ్లు మూత్రపిండాల ఆరోగ్యానికి వరం అని చెప్పవచ్చు.  ఆ పండ్లు ఏమిటో.. ఆ పండ్లు మూత్రపిండాల ఆరోగ్యానికి ఎందుకు సహాయపడతాయో తెలుసుకుంటే.. బెర్రీస్.. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  అలాగే పొటాషియం తక్కువగా ఉంటుంది.  ఇది ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది.  మూత్రపిండాల ఆరోగ్యానికి మంచివి. చెర్రీస్.. చెర్రీస్ ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, ముత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేసే యూరిక్ ఆమ్లాన్ని తగ్గించడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా కలిగి ఉంటాయి.   ద్రాక్ష.. ద్రాక్ష పండ్లలో రెస్వెరాట్రాల్ ఉంటుంది.  ఇది గుండె మరియు మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.  ద్రాక్షలో పొటాషియం తక్కువగా ఉంటుంది.   పైనాపిల్.. పైనాపిల్ పొటాషియం అధికంగా కలిగి ఉంటుంది. ఇది ఉష్ణ మండల పండు. ఇందులో బ్రోమెలైన్ అధికంగా ఉంటుంది.  ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉన్న ఎంజైమ్. పుచ్చకాయ.. పుచ్చకాయ చర్మాన్ని హెడ్రేట్ చేస్తుంది.  శరీరంలో టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది వాపును కూడా తగ్గిస్తుంది.  మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.  యాపిల్స్.. యాపిల్స్ లో పొటాషియం తక్కువగా ఉంటుంది.  ఫైబర్ అధికంగా ఉంటుంది.  ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోనూ,  శరీరంలో ఉండే వాపును తగ్గించడంలోనూ సహాయపడుతుంది. పీచ్.. పీచ్ పండ్లలో పొటాషియం తక్కువగా ఉంటుంది. కానీ విటమిన్-ఎ,  విటమిన్-సి అధికంగా ఉంటాయి. ఇది మూత్రపిండ రోగులకు చాలా మంచి పండు.  అందులోనూ ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. అంతేకాదు.. ఈ పండు వేసవిలో విరివిగా దొరుకుతుంది. క్రాన్బెర్రీ.. క్రాన్బెర్రీ పండ్లు మూత్ర మార్గ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది.  అలాగే కాల్ఫియం,  ఆక్సలేట్ తో  మూత్రపిండాలలో తయారయ్యే రాళ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. బేరి.. బేరి పండ్లలో జీర్ణక్రియకు సహాయపడే ఫైబర్ ఉంటుంది.  అలాగే ఈ పండులో సోడియం తక్కువగా ఉంటుంది.  ఇది రక్తపోటును నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. పైన చెప్పుకున్న పండ్లన్నీ మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో బాగా సహాయపడతాయి.  మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే పైన పేర్కొన్న పండ్లను తప్పక తినండి.                                  *రూపశ్రీ.
మంచి నీరు అంటే నేటికాలంలో అందరికీ మినరల్ వాటర్ ఏ తెలుసు. ఇక చాలామందికి తాగే నీరు అంటే RO వాటరే. ఇప్పట్లో ధనికుల ఇళ్ళ నుండి మధ్య తరగతి కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఇంట్లో రివర్స్ ఆస్మాసిస్ టెక్నాలజీ ఉపయోగించే ఫ్యూరిఫైయర్లు వాడుతున్నారు.  వీటినే సింపుల్ గా RO ఫ్యూరిఫైయర్లు అని అంటున్నారు. నీటిలో ఉండే  మలినాలను, భారీ లోహాలను,  ఇతర హానికరమైన కలుషితాలను తొలగించడంలో ఈ ప్యూరిఫైయర్లు బాగా సహాయపడతాయని చెబుతారు.  ఈ కారణంగానే ప్రతి ఇంట్లో వాటర్ ఫ్యూరిపైయర్లు వాడటం సహజం అయిపోయింది. ప్రతిరోజూ ఆర్.ఓ వాటర్ తాగడం సహజం.  అయితే ప్రతిరోజూ ఈ ఆర్.ఓ వాటర్ ను తాగడం మంచిదేనా?  ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుందా లేదా చెడు చేస్తుందా? వైద్యులు దీని గురించి ఏం చెబుతున్నారు?  తెలుసుకుంటే.. ఆర్.ఓ శుద్దీకరణ ఎలా పనిచేస్తుంది? RO టెక్నాలజీలో, నీరు పొర గుండా వెళుతుంది, బ్యాక్టీరియా, వైరస్‌లు, కరిగిన లవణాలు, భారీ లోహాలు,  ఇతర హానికరమైన మూలకాలను తొలగిస్తుంది. అందుకే ఆహార కాలుష్యం లేదా మలినాలకు గురయ్యే ప్రాంతాలలో నీటిని శుద్ధి చేయడంలో RO వ్యవస్థ ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. అయితే ఈ ప్రక్రియ నీటిలోని కాల్షియం,  మెగ్నీషియం వంటి కొన్ని సహజ ఖనిజాల పరిమాణాన్ని తగ్గిస్తుంది. అందుకే చాలామంది RO నీరు అధికంగా శుద్ధి చేయబడిందని, ఈ నీటిలో  అవసరమైన పోషకాలు ఉండవని చెబుతారు.   ఖనిజ లోపాలు.. ఆహారం.. శరీరానికి అవసరమైన ఖనిజాలకు  ప్రధాన వనరు నీరు కాదని,  మనం రోజువారీ తీసుకునే  ఆహారమే ఖనిజాలు భర్తీ చేస్తుందని  పోషకాహార నిపుణులు అంటున్నారు. త్రాగునీటి నుండి శరీరం పొందే ఖనిజాల పరిమాణం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. చాలా పోషకాలు ఆహారం నుండి లభిస్తాయి, అయితే ప్రతిరోజూ సమతుల్య,  పోషకమైన ఆహారం తీసుకుంటే, RO నీటిలో కొద్దిగా ఖనిజాలు లోపం ఉన్నా అదేమీ సమస్య కాదని అంటున్నారు. . పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు,  ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు శరీర పోషక అవసరాలను సులభంగా తీర్చగలుగుతాయని అంటున్నారు. ఆర్.ఓ నీరు.. మూత్రపిండాల ఆరోగ్యం.. మూత్రపిండ వైద్యులు, నిపుణుల అభిప్రాయం ప్రకారం, RO నీరు సాధారణంగా మూత్రపిండాల ఆరోగ్యంపై ఎటువంటి పెద్ద ప్రతికూల ప్రభావాలను చూపదట.  నీటి నుండి మలినాలను తొలగించడానికి, త్రాగడానికి సురక్షితంగా చేయడానికి RO వ్యవస్థ రూపొందించబడిందని వైద్యులు అంటున్నారు. ఈ ప్రక్రియలో కొన్ని ఖనిజాలు కోల్పోవచ్చు, మూత్రపిండాల ఆరోగ్యంగా ఉండటానికి నీరు తగినంతగా తాగడం చాలా ముఖ్యమట. సమతుల్య ఆహారం తీసుకోవడం,  ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం. శుభ్రమైన,  సురక్షితమైన నీటిని తాగడం మూత్రపిండాలకు ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఆర్.ఓ నీరు.. ఎలక్ట్రోలైట్లు.. కొంతమంది RO నీటిని ఎక్కువ కాలం తాగడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుందని చెబుతారు. కానీ ఆరోగ్యవంతమైన వ్యక్తులలో ఇది చాలా అరుదని ఆరోగ్య నిపుణులు  చెబుతున్నారు. శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యత మూత్రపిండాల హార్మోన్లు,  ఆహారం నుండి పొందిన పోషకాల ద్వారా నియంత్రించబడుతుంది. సోడియం, పొటాషియం, కాల్షియం,  మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు ప్రధానంగా ఆహారం నుండి లభిస్తాయి. కాబట్టి సాధారణ సమయాలలో ఆర్.ఓ నీరు తాగడం వల్ల ఎలాంటి ఎలక్ట్రోలైట్ సమతుల్యత ప్రబావితం కాదు.                                  *రూపశ్రీ.