మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంత దుర్మార్గ, దుష్ట, నీచ, నికృష్ణ, కమీనేనా అని ఎన్నికల కమిషన్ అధికారులు నోళ్ళు తెరిచారట. ఇలా నోళ్ళు తెరిచింది ఎప్పుడూ.... పోలింగ్ బూత్‌లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు, వీవీ ప్యాట్లు నేలకేసి కొట్టడం, పోలింగ్ బూత్‌ల దగ్గర మహిళల మీద విరుచుకుపడటం.. ఇలాంటి వీడియో ఆధారాలు చూశాకగానీ ఈసీకి అసలు విషయం అర్థం కాలేదు. కెమెరాల దయవల్ల ఈ వీడియోలు ఉన్నాయిగానీ, లేకపోతే ఎన్నికల కమిషన్ కూడా పిన్నెల్లి పిల్లి కాదు పులి అని అనుకుంటూ వుండేదేమో. పిన్నెల్లి పోలింగ్ స్టేషన్లో దూరి అంత రచ్చ చేస్తుంటే గాడిదల్లాగా చూస్తూ నిల్చున్న పోలీసులు, పిన్నెల్లి రాగానే దణ్ణాలు పెట్టేసిన అధికారులు, జరిగిన తతంగాన్నంతా వీడియో తీసిన ఉద్యోగులు ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ని చెప్పాలి కదా.. అలా చెప్పలేదు. పిన్నెల్లి టైమ్ బాగాలేక సీసీ టీవీ ఫుటేజ్ చూడాలని అనుకోవడం వల్ల పిన్నెల్లి దారుణాలు బయటపడ్డాయి. పిన్నెల్లి విషయంలో ఈసీ చాలా సీరియస్‌గా వుందన్న వార్తలు వస్తున్నాయి. అరెస్టుకు ఆదేశాలు ఇవ్వబోతున్నట్టుగా సమాచారం వస్తోంది. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, పిన్నెల్లిని ఎమ్మెల్యే పదవికి, ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించే అవకాశాలను కూడా ఈసీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసీ ఏ నిర్ణయమైనా లాగకుండా త్వరగా తీసుకుంటే మంచిది.
మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్రిమినల్ కేసు నమోదైంది. పోలింగ్ సందర్భంగా ఆయన ఒక పోలింగ్ బూత్ లో ఈవీఎమ్ ధ్వంసం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన తరువాత మాత్రమే ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. పూర్తి స్థాయి వెబ్ కాస్టింగ్ అమలు చేసిన నియోజకవర్గాలలో పిన్నెల్లి పోటీ చేసిన మాచర్ల నియోజకవర్గం కూడా ఒకటి. అయినా ఆయన ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై పోలింగ్ ముగిసిన పది రోజులకు గానీ, అదీ కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సిట్ నివేదిక తరువాత మాత్రమే ఆయనపై కేసు బుక్కైంది. చర్యలు తీసుకోవాలన్న ఈసీ ఆదేశాలపై పోలీసులు ఎలా ముందుకు కదులుతారో చూడాలి. హౌస్ అరెస్టు నుంచి సునాయాసంగా పరారైపోయిన పిన్నెళ్లి.. హైదరాబాద్ లో ఉన్నట్లు తెలియసేసినా పోలీసులు ఆయనను తిరిగి తీసుకువచ్చి హౌస్ అరెస్టులో ఉంచే దిశగా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు.  మాచర్లలో పోలీసులు, అధికారయంత్రాంగం అంతగా  పిన్నెల్లితో అంటకాగి విధ్వంసం ద్వారా ఓటింగ్ ప్రక్రియకు ఆటంకాలు కలిగించి, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునే పరిస్థితి లేకుండా చేయడానికి ఎంత చేయాలో అంత చేసినా.. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. నియోజకవర్గంలో ఆయన ఎంత వ్యతిరేకత మూటగట్టుకున్నారో ఇట్టే అర్ధం అవుతుంది.   అయినా పోలింగ్ బూత్ లోకి చొరబడి, అక్కడి సిబ్బందిని బెదరించి ఈవీఎంను ధ్వంసం చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఈసీ ఇప్పటి వరకూ చర్య ఎందుకు తీసుకోలేదో అర్ధం కాదు. వాస్తవానికి ఆయనపై అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది. తమ వైఫల్యానికి సిగ్గుపడి పోలీసు వ్యవస్థ సిగ్గుతో తలవంచుకోవాలి.    ఇక్కడ ఈసీ వైఫల్యాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ కు ముందు నుంచీ కూడా విపక్ష కూటమి నేతలు ఏపీలో శాంతి భద్రతల గురించి ఫిర్యాదులు చేసినప్పటికీ తక్షణ  చర్యలు తీసుకోకుండా పోలింగ్ తేదీకి కొద్ది రోజుల ముందు ఇన్  చార్జి డీజీపీని బదిలీ చేసి ఈసీ సాధించింది శూన్యమని పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటనతో తేలిపోయింది. ఇప్పటికీ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను సైతం బుట్టదాఖలు చేసిన సీఎస్పై చర్యలే లేవు. పోలింగ్ రోజున భారీ హింస ఒకెత్తయితే.. కౌంటింగ్ రోజు అంతకు మించి హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా భద్రత పెంపునకు, అదనపు బలగాల మోహరింపునకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే సీఎస్ ను మార్చకుండా భద్రతా ఏర్పాట్లు చేసినా పెద్దగా ఫలితం ఉండదని, కొత్త డీజీపీ వచ్చిన తరువాత కూడా అధికార పార్టీకి అనుకూలంగా పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరు చూసిన ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. మరి ఈ విషయంలో ఈసీ ఎందుకు స్పందించడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.  
తమ్మినేని సీతారాం.. జగన్ హయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు. స్పీకర్ గా ఆయన వ్యవహారశైలి ఎంత వివాదాస్పందంగా ఉందో అందరికీ తెలిసిందే. అసెంబ్లీ లోపలా, బయటా కూడా ఆయన తీరు, భాష అనుచితంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే ఆయన విద్యార్హతలకు సంబంధించి వివాదం కూడా పెద్ద ఎత్తున రచ్చరచ్చ అయ్యింది. ఇక ఆయన సొంత నియోజకవర్గం అయిన ఆముదాలవలసలో కూడా జనం ఆయన తీరు పట్ల వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి కూడా తమ్మినేని సీతారాం వ్యవహారశైలి ఆ స్థాయికి తగ్గట్టుగా లేదని విమర్శలూ వెల్లువెత్తాయి. ఇక ఆముదాల వలస నియోజకవర్గాన్ని తమ్మినేని ఏ మాత్రం పట్టించుకోలేదని అక్కడి జనం గట్టిగా చెబుతున్నారు. ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చిన పాపాన పోలేదని అంటున్నారు. తమ్మినేని సీతారాంపై ఆ ఆగ్రహం, ఆ అసంతృప్తే ఎన్నికలలో  ప్రతిఫలించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన తీరు, పొగరు, అహంభావం ఆయన ప్రకటనలలో ప్రతిఫలించేది. ఇదే ఆయనకు పూడ్చకోలేని నష్టాన్ని చేకూర్చింది. ఆముదాల వలసలో  తమ్మినేని ఓటమి ఖాయమని  తెలుగుదేశం శ్రేణులు ధీమాగా ఉంటే.. పరిశీలకులు సైతం తమ్మినేని ఆగ్రహం, అనుచిత భాష, అహంభావం ఆయనను ప్రజలకు దూరం చేసిందని విశ్లేషిస్తున్నారు.   ఇక సమస్యల పరిష్కారం విషయంలో తమ్మినేని ఆముదాలవలసను అస్సలు పట్టించుకోలేదని అంటున్నారు. రాష్ట్రంలో అత్యంత అధ్వానంగా ఉన్న రోడ్డు ఏది అంటే ఎవరైనా ఆముదాలవలస, శ్రీకాకుళం హైవే అని ఠక్కున చెప్పేస్తారు. ఆ రోడ్డు మరమ్మతుల కోసం ప్రజల నుంచి ఎన్ని విజ్ణప్తులు వచ్చినా తమ్మినేని పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ రహదారి ప్రమాదాలకు నెలవుగా మారిపోయినా తమ్మినేని పట్టించుకోలేదు. దీంతో ఆ రోడ్డుపై ప్రయాణించిన ప్రతి ఒక్కరూ ఎట్టిపరిస్థితుల్లోనూ తమ్మినేనికి ఓటు వేయకూడదని నిర్ణయించేసుకున్నారు.  ఇక ఆముదాలవలసలో చక్కెరకర్మాగారం వాగ్దానం కూడా నీటిమూటగానే మిగిలిపోయింది.  వీటన్నిటికీ తోడు ఆముదాలవలస నియోజకవర్గంలో వైసీపీ నాలుగు గ్రూపులుగా చీలిపోయింది. వైసీసీ స్వయంగా నిర్వహించుకున్న సర్వేలోనే నియోజకవర్గ ప్రజలలో తమ్మినేని పట్ల తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత ఉందని తేలింది. అలాగే నియోజకవర్గంలో అధికారపార్టీ అవినీతి పెచ్చరిల్లిందని కూడా ఆ సర్వే పేర్కొంది. అయినప్పటికీ జగన్ తమ్మినేనికే మరో సారి ఆముదాల వలస టికెట్ కేటాయించారు.    ఎన్నికలకు ముందే తమ్మినేని ఓటమి ఖరారైపోయిందని వైసీపీ శ్రేణులే బాహాటంగా చెబుతున్నాయి.   ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న సెంటిమెంట్ ప్రకారం అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన ఎవరూ కూడా ఆ తరువాతి ఎన్నికలలో విజయం సాధించలేరు. అయితే తమ్మినేనికి ఆ సెంటిమెంట్ మాత్రమే కాకుండా  నియోజకవర్గ వైసీపీలో గ్రూపు తగాదాలూ కూడా స్పీకర్ తమ్మినేని ఓటమిని ఖాయం చేసేశాయి.  గత ఎన్నికలలో తమ్మినేని  విజయం కోసం సర్వం తానై పని చేసిన వైసీపీ నేత సువ్వారి గాంధీ.. ఇప్పుడు తమ్మినేనికే కాకుండా ఆయన కారణంగా వైసీపీకి కూడా దూరమయ్యారు.  దీంతో ఆముదాలవలస నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ  చేసిన  కూన రవికుమార్  విజయం నల్లేరుమీద బండి నడకేనని అంటున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
సీరియల్ నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. ఆమె మరణాన్ని తట్టుకోలేక సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒకరికి ఏదైనా అయితే, మిగతా వారంతా అండగా నిలిచే వారు. ఇప్పుడు అలాంటి కల్చర్ లేదు. ఈ తరం వారు ఎవరికి వారే అన్నట్టుగా ఉంటున్నారు. మా అమ్మ విజయనిర్మల గారు మరణించినప్పుడు.. నేను, కృష్ణ గారు ఎంతో కృంగిపోయాము. ఆ సమయంలో ఒకరికొకరు మద్దతుగా నిలిచాం. అలాగే కుటుంబ సభ్యులు కూడా అండగా నిలిచారు. అలా ఆ బాధ నుంచి చిన్నగా బయటకు వచ్చాము. ఒక వ్యక్తి బాధపడుతుంటే.. పది మంది మనకి ఉన్నారు అనే భావన అతనికి కలిగేలా చేయగలగాలి. అప్పుడే వారు ఆ బాధ నుంచి బయటకు వస్తారు. ఒకప్పుడు మానవ సంబంధాలు బాగుండేవి. ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు ఫోన్లతో బిజీగా ఉంటూ పక్కన వాళ్ళతో కూడా మాట్లాడటం లేదు. ఈ పరిస్థితి మారాలి." అని నరేష్ అన్నారు. పవిత్ర మరణం తర్వాత.. చందు తనకిక ఎవరు లేరని ఒంటరిగా ఫీల్ అయ్యాడని, అదే అతని ఆత్మహత్యకు కారణమైందనే అభిప్రాయాన్ని నరేష్ వ్యక్తం చేశారు.  
  భగవంతుడి చూపు  మనుషుల మీదే  కాదు సమస్త జీవరాశుల మీద ఉంటుంది. ఇళయరాజా సంగీతం కూడా అంతే మనుషులకి మాత్రమే సొంతం కాదు. సమస్త  జీవరాశులకి  సొంతం. ఈ మాట అబద్దమని నిరూపించడం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. సంగీత సినీ ప్రపంచంలో ఎన్నో సరికొత్త బాణీలని పరిచయం చేసి అందరి హృదయాల్లో  నిత్యం  అమృత ధార  ప్రవహించేలా చేసాడు. అంతటి కీర్తి సంపాదించిన  సంగీత శిఖామణి కి తాజాగా ఒక అరుదైన గౌరవం లభించింది ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌. షార్ట్ కట్ లో చెప్పుకోవాలంటే ఐఐటీఎం. తమిళనాడు మొత్తం మీద    ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇన్‌స్టిట్యూట్. 1956 లో  స్థాపించారు. ఎన్నో గొప్ప గొప్ప ఫ్యాకల్టీలని ఈ ఇనిస్టిట్యూట్ అందిస్తుంది. ఇక్కడ చదువుకోవాలని ఎంతో మందో ఆశ పడతారు. ఇప్పుడు ఇందులో  ఇళయరాజా సంగీత పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.అంటే ఆయన సంగీతం మీద పరిశోధన జరగనుంది. ఇది సంగీత ప్రపంచానికే గర్వంగా భావించవచ్చు.పైగా  ఇండియాలో ఇదే మొట్ట మొదటి సారి. సెంటర్‌ ఫర్‌ మ్యూజిక్‌ లెర్నింగ్, రీసెర్చ్‌ కేంద్రం పేరుతో ఏర్పాటు అయ్యే ఈ కేంద్రానికి త్రిపుర గవర్నర్‌ ఎన్‌.ఇంద్రసేనారెడ్డి, ఇళయరాజా లు   శంకుస్థాపన చేశారు ఇళయ రాజా  ఇప్పటివరకు వెయ్యి సినిమాలకి దాకా సంగీతాన్ని అందించాడు. ఎనిమిది వేల పాటలకి  స్వర రచన చేసాడు. ప్రతి పాట కూడా ఒక అధ్బుతమే.  గుణ, చంటి, జగదేక వీరుడు అతిలోక సుందరి, ధర్మ క్షేత్రం, అశ్వమేధం,  బొబ్బిలి రాజా, కొండవీటి దొంగ, నాయకుడు, అభినందన, మహర్షి, రాక్షసుడు, శివ,  శ్రీరామరాజ్యం ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నో సినిమాల్లో హిట్ పాటలని అందించాడు. ఆయన సంగీతం వల్ల   సినిమా రేంజ్ పెరుగుతుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆయన సంగీతం వల్ల  అట్టర్ ప్లాప్ సినిమాలు కూడా యావరేజ్ గా నిలిచాయి   
సేవ్ ది టైగర్స్, మిస్ పర్ ఫెక్ట్ లాంటి‌ వెబ్ సిరీస్ లు ఫ్యామిలీతో కలిసి చూసేలా చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థ నుండి త్వరలో సోషియో ఫాంటసీ హారర్ వెబ్ సిరీస్ ఒకటి రానుంది.  ఈ సిరీస్ కి ఓ ప్రత్యేకత ఉంది. బాహుబలి మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ సిరీస్‌కు త్వరలో హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఇంతకి అదేంటంటే ఆరకా మీడియా, హాట్‌స్టార్‌ కలిసి నిర్మించిన లేటెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ 'యాక్షిణి'. సోషియా ఫాంటసీ నేపథ్యంలో రొమాన్స్‌, కామెడీ, హారర్‌ ఎలిమెంట్స్‌తో తెరక్కింది ఈ వెబ్‌ సిరీస్‌. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌ సిరీస్‌ ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అవుతుంది. తాజాగా దీనిపై హాట్‌స్టార్ అధికారిక ప్రకటన ఇచ్చింది. "అబ్బాయి జాగ్రత్త. మీ కోసం త్వరలో యక్షిణి వస్తుంది. ఆమె చివరి వేట త్వరలో ప్రారంభం కాబోతుంది" హాట్‌స్టార్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్ చేసింది. ఈ వెబ్‌ సిరీస్‌ను తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలి, మరాఠీ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. కాగా యాక్షిణిలో నటి వేదిక.. లీడ్‌ రోల్‌ పోషించగా మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అర్జున ఫాల్గుణ, జోహార్, కోట బొమ్మాళి పీఎస్ వంటి సినిమాలు తెరకెక్కించిన తేజ మార్ని "యక్షిణి" సిరీస్ ను రూపొందిస్తున్నారు. కృష్ణ, మాయ పాత్రలతో సోషియా ఫాంటసీ నేపథ్యాన్ని దర్శకుడు తేజ ఎంచుకున్నారు. ఈ వెబ్ సిరీస్ ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించారు.  
Payal Rajput is a bold and beautiful force to be reckoned with in the Indian film industry. Known for her stunning on-screen presence and captivating social media influence, she has made a name for herself by taking on riveting, intense, and impactful roles. Her choice of unique and diverse movie projects showcases her exceptional talent and continually captivates her audience. With her astounding performances, Payal Rajput has left many in awe. She is now set to thrill her fans once again with another powerful crime thriller, "Rakshana." The movie's first look and teaser have already created a buzz among fans, and the recent teaser release has only amplified the excitement. The teaser of "Rakshana" starts with a mysterious murder, followed by Payal Rajput's character, a powerful police officer, determined to catch the culprit. The impactful background music and captivating cinematography heighten the intensity of the teaser, leaving the audience craving more. "Rakshana," inspired by real-life incidents, promises to be intriguing and impactful. The teaser has already piqued curiosity among movie lovers, eagerly anticipating its release on June 7. Payal Rajput's incredible talent and dedication to her craft make her an exceptional performer and a formidable presence in the film industry. In addition to Payal Rajput's stellar presence, the film features Roshan and Manas in pivotal roles, adding depth and intrigue to the story. Pranadeesh Thakore, who serves as both director and producer, brings a passion for the project, ensuring a high-quality production under the banner of Haripriya Creations. Mahati Sagar, the talented music director, enhances the film's emotional depth through his compositions, while cinematographer Anil Bhandari captures each frame's essence, enriching the visual storytelling. With a stellar cast, a dedicated director-producer, a talented music director, and a skilled cinematographer, "Rakshana" promises to be a complete package of entertainment and quality. Audiences can look forward to a captivating and immersive experience that will keep them engrossed from beginning to end.
HanuMan director Prasanth Varma is making a massively budgeted period film with Bollywood star Ranveer Singh. We've revealed that this biggie titled as "Brahmarakshasa." Ranveer Singh, Prasanth Varma and Mythri Movie Makers are confirmed to team up for a film. It will be the immediate film in Prasanth Varma's cinematic universe and will got onto the floors even before Jai Hanuman. VThe film's formal Pooja was recently held. Ranveer Singh joined test shoot recently in Hyderabad for the glimpse, which makers planned to release as a announcement video. A massive set was constructed for the shoot. The film is rumored to be titled Brahmarakshasa and is said to be a periodic drama with loads and loads of action. The ongoing rumors say that Ranveer Singh walked out of the film due to creative differences with Prasanth Varma. He decided not to sign the film. Mythri Movie Makers are the producers of this mega budget film. An official announcement is expected to be made soon. Ranveer Singh will soon commence the shoot of Don 3 in the direction of Farhan Akhtar. We have to wait to see if Prasanth Varma locks one more lead actor for Brahmarakshasa or if he convinces Ranveer Singh and brings him back in. Its a part of the movie Universe PVCU as well. The film will release in 2025.
In an exciting announcement yesterday, Disney+ Hotstar revealed its latest original series, Hotstar Specials "Yakshini," a captivating blend of romance, fantasy, and comedy. Directed by Teja Marni, this ambitious project represents a significant milestone for the streaming platform, offering viewers an engaging journey where the power of love intertwines with the mission of a Yakshini. This announcement underscores Disney+ Hotstar's dedication to providing diverse and compelling entertainment experiences to its global audience. Set against ancient lore and modern-day romance, "Yakshini" tells the story of Krishna, a hopeless romantic longing for true love, and Maya, a Yakshini bound to Earth by an ancient curse. Maya's quest to save her clan by eliminating a hundred men intertwines fatefully with Krishna's life. Their journey together is fraught with challenges that test their beliefs and alter their destinies. Led by a stellar cast, including Vedhika Kumar and Rahul Vijay, alongside Manchu Laxmi and Ajay, "Hotstar Specials Yakshini" promises to captivate audiences with its enchanting narrative and visually stunning production. Produced by Shobu Yarlagadda and Prasad Devineni of Arka Media Works, renowned for their grand-scale storytelling, and helmed by Teja Marni's visionary direction, "Yakshini" represents a pinnacle in original content creation. This Hotstar Special series will be released in June, marking the third collaboration between Disney+ Hotstar and Arka Media Works, following the success of the acclaimed seasons of "Parampara."
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలకి వెళ్లయినా.. పవర్‌ హౌస్ ప్రాజెక్ట్ కోసం మీరు సిద్ధమా అని అడగడం  ఆలస్యం. ఎన్టీఆర్ (ntr) ప్రశాంత్ నీల్ (prashanth neel)మూవీ అప్ డేట్ ఏమైనా వచ్చిందా అని ఆత్రంగా అడిగే పరిస్థితి. గూగుల్ లో  కూడా నిత్యం  మూవీ అప్ డేట్ కోసం సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఇలా సెర్చ్ చేసే వాళ్లలో ఫ్యాన్స్ మాత్రమే కాదు. మూవీ లవర్స్ కూడా ఉన్నారు.దీన్ని బట్టి ఆ కాంబో క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ఎన్టీఆర్ తో జత కట్టబోయే హీరోయిన్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.     యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ సినిమా ప్రకటన వచ్చింది.ఎన్టీఆర్ నుంచి వస్తున్న 31 వ సినిమా ఇది. ఇందులో ఎన్టీఆర్ సరసన కియారా అద్వానీ (kiara advani) ఛాన్స్ దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు  త్వరలోనే  మేకర్స్ నుంచి అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు. ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ సరసన గేమ్ చేంజర్ (game chanjer)లో చేస్తుంది. గతంలో చరణ్ తోనే  వినయ విధేయ రామ లో చేసి భారీ ప్లాప్ ని అందుకుంది. కానీ చరణ్ పట్టుబట్టి మరి కియారా ని గేమ్ చేంజర్ లో తీసుకున్నాడు. దాంతో ఆమెకి తెలుగు నాట తన సత్తా చూపించుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తన సినిమాలో అవకాశం ఇస్తే  ఇక ఆమె దశ తిరిగినట్టే. చరణ్,ఎన్టీఆర్ ల స్నేహం కియారా కి కలిసి వస్తే ఆమెకి గోల్డెన్ ఆఫర్ గా భావించవచ్చు.మహేష్ బాబుతో చేసిన  భరత్ అనే నేను మూవీ మాత్రమే కియారా  ఖాతాలో ఉన్న ఏకైక హిట్. అలాగే కథ ప్రకారం ఇంకో హీరోయిన్ కి ఛాన్స్  ఉందనే మాటలు  కూడా వినిపిస్తున్నాయి. ఒక స్టార్ హీరోయిన్ ని కన్ఫార్మ్ చేయబోతున్నారని కూడా అంటున్నారు ఇక ఎన్టీఆర్ ఫాన్స్ అయితే  ప్రశాంత్ మూవీ ప్రకటనతో మంచి జోష్ లో ఉన్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఆ ఇద్దరి కాంబో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని కూడా అంటున్నారు.అదే టైం లో  కథ ఎలా ఉంటుంది అనే దానిపై కూడా వాళ్ళల్లో చర్చలు మొదలయ్యాయి. ప్రశాంత్  సలార్ 2 ని పక్కన పెట్టి మరి ఎన్టీఆర్ మూవీ పనిలో ఉన్నాడు. అగస్ట్ నుంచి షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. మైత్రి మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ అత్యంత భారీ వ్యయంతో  నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర(devara)ని కంప్లీట్  చేసే పనిలో ఉన్నాడు. ఇటీవల రిలీజైన సాంగ్  సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది   
'జయజయహే తెలంగాణ' పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ఇటీవల రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందెశ్రీ రచించిన ఈ పాట తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని గత కేసీఆర్ సర్కార్ చెప్పినా.. అది జరగలేదు. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించింది. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఇదిలా ఉంటే ఈ గీతం విషయంలో ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఎం.ఎం. కీరవాణితో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారితో పాటు రచయిత అందెశ్రీ, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో 'జయజయహే తెలంగాణ' గీతం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ గీతాన్ని స్వరపరచి, ఆలపించే బాధ్యతను కీరవాణికి అప్పగించినట్లు సమాచారం.  ఈ జూన్ 2 తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్భంగా.. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఆ లోగా పాటను రూపొందించాలని కీరవాణికి సీఎం చెప్పినట్టు వినికిడి.
అప్పట్లో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు విజయశాంతి (Vijayashanthi) పెట్టింది పేరు. ఆమె హీరోలకు ధీటుగా క్రేజ్ సంపాదించుకొని.. లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్నారు. ఇక ఈ జనరేషన్ లో విజయశాంతి తరహాలో.. ఓ వైపు గ్లామర్ రోల్స్, మరోవైపు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటి లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న హీరోయిన్ అంటే అనుష్క (Anushka Shetty) అని చెప్పవచ్చు. అలాంటిది ఈ ఇద్దరు లేడీ సూపర్ స్టార్లు కలిసి నటిస్తే ఎలా ఉంటుంది?. ప్రస్తుతం ఓ నిర్మాత ఈ ఇద్దరితో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. 2007లో అల్లరి నరేష్, వేణు హీరోలుగా అల్లరే అల్లరి సినిమాతో టాలీవుడ్ లో నిర్మాతగా తన ప్రస్థానం మొదలుపెట్టారు ఎస్.కె. బషీద్. ఆ తర్వాత పలు చిత్రాలను నిర్మించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. తాను ఎన్నికల్లో గెలుస్తానని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అలాగే, తన కొత్త సినిమా విశేషాలను పంచుకున్నారు.  నిర్మాత ఎస్.కె. బషీద్ మాట్లాడుతూ.. "నేను అల్లరే అల్లరి సినిమాతో నిర్మాతగా చిత్ర పరిశ్రమకు వచ్చాను. వ్యాపారవేత్తగా, నిర్మాతగా కొనసాగుతున్నాను. గతంలో దర్శకుడు సురేష్ కృష్ణకు అడ్వాన్స్ ఇచ్చాను. ఆయన దర్శకత్వంలో విజయేంద్రప్రసాద్ గారి కథతో అనుష్క, విజయశాంతి ప్రధాన పాత్రల్లో ఓ సినిమాకు సన్నాహాలు చేసుకుంటున్నాను. ఇంకా వారితో నేరుగా సంప్రదింపులు జరపలేదు. డిస్కషన్స్ చేయబోతున్నాం. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తారు. ఒక పాట కంపోజిషన్ జరుగుతోంది." అన్నారు.
బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ప్రముఖ నటి హేమ (Actress Hema) పేరు వార్తల్లో వచ్చిన సంగతి తెలిసిందే. మొదట ఈ వార్తలను హేమ ఖండించగా.. కర్ణాటక పోలీసులు రంగంలోకి దిగి, ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ప్రకటించారు. దీంతో హేమపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా మరో నటి కరాటే కళ్యాణి (Karate Kalyani) కూడా హేమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "హేమ నన్ను చెల్లి అని పిలుస్తుంది. ఒక చెల్లిగా అక్క బాగుండాలని, ఆమె దీని నుండి బయటపడాలని కోరుకుంటాను. అయితే హేమ చేసింది మాత్రం ముమ్మాటికీ తప్పే. ముందుగా తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదంటూ వీడియో చేసి తప్పుదోవ పట్టించినందుకు.. ఆమె మీడియాకి క్షమాపణలు చెప్పాలి. డ్రగ్స్, రేవ్ పార్టీల పేరుతో మన కల్చర్ ని నాశనం చేస్తున్నారు. ఇలా చేసే వారిని కఠినంగా శిక్షించాలి. ఒకరిద్దరు చేసే దానివల్ల సినీ పరిశ్రమ మొత్తానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. నటిగా హేమ అంటే నాకు ఇష్టమే. కానీ ఆమె వివాదాలకు ముందుంటారు. వార్తల్లో నిలవడం కోసం హల్చర్ చేస్తుంటారు. మా ఎన్నికల సమయంలో కూడా ఎన్నో వివాదాలు చేశారు. అన్ని ఫేక్ మాటలు చెబుతుంటారు. ఇలా ఆమె చేసినవే, ఇప్పుడు ఆమెకి కొట్టాయి. రేవ్ పార్టీలో పాల్గొనడం అనేది చిన్న విషయం కాదు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ హేమపై చర్యలు తీసుకునే అవకాశముంది. ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు." అని కరాటే కళ్యాణి అన్నారు.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
చాలారోజుల క్రితం ఒక గొప్ప వ్యాపారి ఉండేవాడు. వ్యాపార నిమిత్తం అతను ఓసారి దూరదేశాలకు బయల్దేరాడు. వెళ్తూ వెళ్తూ అతను, తన దగ్గర పని చేసే ముగ్గురు పనివాళ్లని పిలిచాడు. ‘చూడండి! నేను తిరిగి రావడానికి కాస్త సమయం పడుతుంది. ఈలోగా నేను మీకో పని అప్పచెబుతున్నాను. మీ ముగ్గురికీ నేను కొంత డబ్బుని ఇస్తున్నాను,’ అంటూ మొదటి వ్యక్తికి ఐదువేలు, రెండో వ్యక్తికి రెండువేలు, మూడో వ్యక్తికి వేయి రూపాయల డబ్బుని చేతికిచ్చాడు.   అలా యజమాని తన ముగ్గురు పనివాళ్లకీ డబ్బుని అందించి ప్రయాణమైపోయాడు. కొంతకాలం తర్వాత యజమాని తిరిగివచ్చాడు. ‘నేను మీకిచ్చిన డబ్బుని ఏం చేశారు?’ అని ఆ ముగ్గురినీ అడిగాడు.   ‘ప్రభూ! వ్యాపారం చేయడం మీ లక్షణం. డబ్బుని స్థిరంగా ఉంచడం మీకు ఇష్టం ఉండదు. మీ మనస్తత్వం తెలిసినవాడిని కనుక మీరిచ్చిన డబ్బుని పెట్టుబడి పెట్టాను. రాత్రింబగళ్లు కష్టపడ్డాను. ప్రస్తుతానికి మీరు ఇచ్చిన డబ్బు రెట్టింపైంది,’ అని పదివేల రూపాయలని చేతిలో పెట్టాడు మొదటి పనివాడు.   ‘ప్రభూ! వ్యాపారం చేయడం నాకు అలవాటైన విద్య కాదు. కానీ డబ్బుని అలా నిరుపయోగంగా ఉండటం నాకు ఇష్టం లేకపోయింది. అందుకనే నష్టం వచ్చే ప్రమాదం ఉందన్న భయం ఉన్నా కూడా ఆ డబ్బుతో వ్యాపారం చేశాను. ఒళ్లు వంచి పనిచేశాను. అదృష్టవశాత్తూ ఫలితం దక్కింది. రెండు వేలు కాస్తా నాలుగు వేలు అయ్యాయి,’ అని చెప్పుకొచ్చాడు రెండో పనివాడు.   ‘ప్రభూ! మీరు పాపం డబ్బుని ఎంతో కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. డబ్బు కోసం ఇల్లు విడిచి ఎక్కడెక్కడో వ్యాపారం చేసి వస్తుంటారు. అలాంటి డబ్బుని ఏదో ఒకటి చేసి పాడు చేయడం నాకు ఇష్టం లేకపోయింది. అందుకే ఓ గొయ్యి తీసి ఎవరికీ కనిపించకుండా ఆ డబ్బుని దాచిపెట్టాను. ఇదిగోండి మీరు ఇచ్చిన సొమ్ముని యథావిధిగా మీ చేతిలో పెడుతున్నాను,’ అంటూ వెయ్యి రూపాయలు ఉన్న మూటని వ్యాపారి చేతిలో పెట్టాడు మూడో పనివాడు.   ‘మూర్ఖుడా! డబ్బయినా, ప్రతిభ అయినా ఒక వరంలాంటిది. దాన్ని ఉపయోగించకపోతే ఎవరికీ పనికిరాకుండా పోతుంది. నీకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోలేకపోయావు. ఆ డబ్బు నీకూ ఉపయోగపడలేదు, నాకూ ఉపయోగపడలేదు. మొదటి ఇద్దరూ నేను ఇచ్చిన డబ్బులతో పాటు, వచ్చిన లాభాలని అట్టిపెట్టుకోండి. కానీ మూడో వ్యక్తికి ఇచ్చిన వేయి రూపాయలని కూడా నేను తిరిగి తీసేసుకుంటున్నాను,’ అన్నాడు వ్యాపారి.   ఇది బైబిల్‌లో Parable of the Talents అనే కథ ఆధారంగా రాయబడింది. ఇందులో వ్యాపారి తన ముగ్గురు పనివాళ్లకీ ఇచ్చిన సొమ్ముని ‘Talent’ అని పిలుస్తాడు. Talent అనేది పూర్వకాలంలో డబ్బుకి ఓ కొలబడ్డగా వాడేవారు (మిలియన్, లక్ష, వేయి లాగా). వ్యాపారి మొదటి పనివాడికి ఎనిమిది టాలెంట్లు, రెండోవాడికి రెండు టాలెంట్లు, మూడోవాడికి ఒక్క టాలెంటు ఇచ్చి వెళ్తాడన్నమాట. కానీ ఇక్కడ టాలెంట్ అంటే ప్రతిభ అన్న అర్థం కూడా వస్తుంది! ప్రకృతి మనలో ప్రతి ఒక్కరికీ కొన్ని టాలెంట్స్ ఇస్తుంది. వాటిని సవ్యంగా వాడుకున్నవాడు జీవితంలో పైకి వస్తాడు. ఉన్న ఒక్క టాలెంటునీ వాడుకోకుండా దాచుకున్నవాడు ఎందుకూ కొరగాకుండా పోతాడు. ఎక్కడ ఏ నష్టం వస్తుందో అని భయపడుతూ తన ప్రతిభని అణచివేసిననాడు జీవితం వృధా అయిపోతుంది. - నిర్జర.  
  మనసులో ఏదీ దాచుకోలేకపోవడం చాలా మంది బలహీనత. బాధ అయినా, సంతోషం అయినా, దుఃఖం అయినా తనకు తెలిసిన వారికో లేక స్నేహితులు, ఆత్మీయులకో ఏదో ఒక  సందర్భంలో చెప్పుకుని తీరతారు. అయితే ఇలా చెప్పడం తప్పని కాదు కానీ.. కొన్ని విషయాలు మాత్రం ఇతరులతో అస్సలు చెప్పడం మంచిది కాదని అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేష నిపుణులు. ఏ వ్యక్తి అయినా ఇతరులతో అస్సలు చెప్పకూడని 5 విషయాలేంటో తెలుసుకుని వాటిని పాటిస్తే  వారి జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది. ఆ అయిదు విషయాలేంటో తెలుసుకుంటే.. ఆర్థిక స్థితి.. ఉద్యోగం చేసేవారు అయినా వ్యాపారం చేసేవారు అయినా పొదుపు చేసేవారు అయినా తమ ఆర్థిక స్థితి గురించి మరో వ్యక్తికి చెప్పడం మంచిది కాదు. ప్రతి వ్యక్తి ఆర్థిక స్థితి సామాజిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. డబ్బును చూసి మనుషులు మసలుకునే కాలమిది. ఎవరిదగ్గరైనా డబ్బు ఎక్కువ ఉందని తెలిసినా, ఎక్కువ సంపాదిస్తున్నారని తెలిసినా అప్పు కోసం, సహాయాల కోసం సులువుగా చుట్టూ చేరతారు. పక్క మనిషి గురించి పట్టించుకోని ఈ కాలంలో ఆర్థిక సహాయాలు చెయ్యడం అంత మంచిది కాదు. అందుకే ఆర్థిక స్థితి గురించి ఎవరికీ చెప్పకూడదు. ఇంటి సమస్యలు.. ప్రతి ఇంట్లోనూ సమస్యలుంటాయి. ఇంటి సమస్యలను ఇంటి వారితో చర్చించి వాటిని చక్కబెట్టుకోవడం శ్రేయస్కరం. అలా కాకుండా సలహాలు, సూచనలు ఇస్తారనో లేదా మనసులో భారం దించుకోవాలనే ఆలోచనతోనో ఇంటి సమస్యలు బయటి వారికి, తెలిసిన వారికి చెప్పడం మంచిది కాదు. రిలేషన్ గొడవలు..  నిజానికి తోబుట్టువులు, చుట్టాలు, బాగా దగ్గరి వారైనా సరే.. భార్యాభర్తల సమస్యలలో జోక్యం చేసుకోవడం, తీర్పులు ఇవ్వడం మంచిది కాదు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గొడవలు, సమస్యలు వారే పరిష్కరించుకుంటే వారిద్దరికి ఒకరి మీద మరొకరికి గౌరవం పెరుగుతుంది. ఏ సమస్యకైనా ప్రతి వ్యక్తి స్పందన వేరుగా ఉంటుంది. అనుభవాలు కూడా వేరుగా ఉంటాయి. కాబట్టి సమస్యలను బయటకు, లేదా ఇతరుల దగ్గరకు తీసుకెళ్లడం, చెప్పడం మంచిది కాదు. మూడవ వ్యక్తికి భార్యాభర్తల సమస్యలు చెబితే వారు దాన్ని ఎంటర్టైన్మెంట్ గా చూస్తారు. బలహీనతలు.. ప్రతి వ్యక్తిలోనూ బలాలతో పాటూ బలహీనతలు ఉంటాయి. చాలామంది వ్యక్తులలో లోపాలు, బలహీనతలను వెతుకుతారు. వాటిని వేలెత్తి చూపిస్తారు. విమర్శిస్తారు. అందుకే వ్యక్తులలో బలాలు బయటపెట్టినా సమస్య లేదు కానీ బలహీనతల గురించి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరికీ చెప్పకూడదు. ప్రణాళికలు.. పెద్ద పెద్ద విషయాల గురించి నిర్ణయాలు తీసుకునే ముందు, పెద్ద ప్రణాళికలు వేసుకునేటప్పుడు వాటిని మరొక వ్యక్తితో చెప్పకూడదు. జీవితంలో ఇంకా ఎదిగే దశలో వేసుకునే ప్రణాళికలు ఇతరులతో చెప్పకూడదు.                                                      *రూపశ్రీ.  
ప్రతి మనిషి జీవితంలో ఎన్నో బంధాలు ఉంటాయి. తల్లిదండ్రులు, స్నేహితులు, చుట్టాలు, తెలిసిన వారు ఇలా చాలామంది జీవితంలో  ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. తల్లిదండ్రులు కన్నవారు కాబట్టి వారు జీవితాంతం పిల్లల విషియంలో పాజిటివ్ గానే ఉంటారు. ఇక స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు ఈ బంధాలన్నీ బయటినుండి వచ్చేవే.. అయితే అన్నింటి కంటే భాగస్వామి పాత్ర మాత్రం చాలా పెద్దది. జీవితంలో ఓ దశలో బంధంలోకి వచ్చి చివరి వరకు కలసి ఉండేవారు జీవిత భాగస్వాములు.  జీవిత భాగస్వాములతో బంధం  ఎంత బలంగా ఉంటే ఇద్దరి జీవితం, ఇద్దరి భవిష్యత్తు  అంతే గొప్పగా ఉంటుంది. ఈ బంధం ఎంత బలంగా ఉందో నిర్ణయించే   5 ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు దొరికే సమాధానాలే బంధం బలాన్ని స్పష్టం చేస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. ప్రభావవంతంగా కమ్యూనికేట్ చేస్తున్నారా.. ఒక బంధం బలంగా ఉండాలంటే దానికి ముఖ్యంగా మంచి కమ్యూనికేషన్ అవసరం. మీరు,  మీ భాగస్వామి,  మీ ఆలోచనలు, భావాలు,  అవసరాలను బహిరంగంగా వ్యక్తపరచగలరో లేదో అంచనా వేయాలి.  ఒకరు చెప్పేది మరొకరు శ్రద్దగా వింటున్నారా? ఇద్దరి మధ్య చర్చలు వివాదాలు  వాదనలుగా మారుతున్నాయా? ఇలాంటివి  వివాదాలుగా మారకుండా   పరిష్కరించగలుగుతున్నారా? ఇవన్నీ కమ్యూనికేషన్  సమర్థవంతంగా ఉందా లేదా అనే విషయాన్ని నిర్ణయిస్తాయి.  కమ్యూనికేషన్ బాగుంటే ఇద్దరికి ఒకరి మీద మరొకరికి గౌరవం, నమ్మకం పెరుగుతాయి. ఏకభావం.. బలమైన బంధానికి  భాగస్వాముల విలువలు, ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు ఎలా ఉంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది . మీరు అయినా,  మీ భాగస్వామి అయినా, ఇద్దరి  ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నారా? ఇద్దరి నిర్ణయాలు  కెరీర్, కుటుంబం, జీవనశైలి లేదా వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించినవా అని ఆలోచించాలి. ఇద్దరూ జీవితంలో ఎలాంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు?  వంటివి ఇద్దరూ భవిష్యత్తు కోసం ఎంత మాత్రం ఏకభావంతో ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.  సంఘర్షణలు.. ఏ సంబంధంలోనైనా సంఘర్షణలు  తప్పనిసరిగా ఉంటాయి. అయితే వాటిని ఎలా డీల్ చేస్తారనే దానిపైనే బంధం ఆధారపడి ఉంటుంది.   భాగస్వామితో కలిగే  విభేదాలు,  సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో, ఎలా ఎదుర్కోవాలో పరిశీలించాలి. గొడవలు జరిగినప్పుడు రాజీ పడటం,  పరిష్కారం కోసం ప్రయత్నించడం వంటివి ఏ మేరకు జరుగుతున్నాయో తరచి చూసుకోవాలి.    వివాదాలు పెరుగుతున్నాయా?  వాటిని పరిష్కరించుకోవడానికి ఎంత సమయం తీసుకుంటున్నారు?  ఆరోగ్యకరమైన  రీతిలో గౌరవం మరియు పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాలను కనుగొనే సుముఖత ఉంటాయి. భావోద్వేగాలు.. భావోద్వేగ సాన్నిహిత్యం భౌతిక సాన్నిహిత్యానికి మించినది.  భాగస్వామితో భావోద్వేగ పరంగా లోతుగా కనెక్ట్  అయితే  ఇద్దరి మధ్య బంధం కూడా బలంగా ఉంటుంది. ఇద్దరి ఆలోచనలు, భయాలు , ఇబ్బందులను ఒకరితో మరొకరు సరిగా ఓపెన్ అయ్యి చెప్పుకుంటున్నారా?  అవసరమైన సందర్భాలలో ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారా?  ఇవన్నీ ఇద్దరి మధ్య బంధం ఎంత గాఢంగా ఉందో తెలియజేస్తుంది.  పెట్టుబడి.. ఏ వ్యాపారానికి అయినా ఎలాగైతే డబ్బు, కష్టం పెట్టుబడిగా పెడతారో.. అదే విధంగా  బంధం బలంగా ఉండటానికి సమయం పెట్టుబడి పెట్టాలి. ఇద్దరూ ఒకరికోసం ఒకరు సమయం ఎలా కేటాయించుకుంటున్నారనే దానిపై బంధం ఆధారపడి ఉంటుంది. ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో చురుకుగా ఉంటున్నారా?. ఇద్దరూ  కలిసి  క్వాలిటీ టైమ్ మెయింటైన్ చేస్తున్నారా?  ఒకరి అవసరాలకు మరొకరు ప్రాధాన్యత ఇస్తున్నారా? ఒకరిని మరొకరు మెచ్చుకోవడం, ప్రోత్సహించడం, సపోర్ట్ ఇవ్వడం  వంటివి చేస్తున్నారా? ఇవన్నీ ఒక బంధం బలపడటానికి పెట్టుబడులే.                                                       *రూపశ్రీ.
బరువు తగ్గాలని అనుకునే వాళ్లకి శుభవార్త. ఇకమీరు బరువు తగ్గడానికి కొత్తమందులు వచ్చేసాయి. అయితే నియమ నిబందనల  ప్రకారం మందులు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఊబకాయం తగ్గాలంటే... ఊబకాయం తగ్గించుకోడానికి చాలామంది చలారకాల పద్దతులు అనుసరిస్తూ ఉంటారు. అందుకోసం పెద్దమొత్తంలో డబ్భులు వెచ్చిస్తూ ఉంటారు.  చేయని ప్రయత్నము లేదు అవసరమైన పక్షం లో సర్జరీ లకైనా వెనుకాడరు ఒక్కోసారి సర్జరీ కూడా ప్రాణంతకం అవుతుంది. లిపోసక్షన్,లేదా టమ్మీటక్ సర్జరీ,వెయిట్ రిడేక్షన్ కోసం రకరకాలక్లినిక్స్ ను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇక్కడ ఆహారం లో మార్పులు, వ్యాయామం పూర్తిగా దీర్ఘకాలం పాటు పాటించినా ఊబకాయం తగ్గని పరిస్థితి.అయితే ఊబాకాయం ఒక బయోలాజికల్ డిసీజ్ గా పేర్కొన్నారు. అప్పుడప్పుడు దానికి మందులతో చికిత్చ అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.   * ఎవరైతే ఊబకాయం తో బాధపడుతున్నారో ఓబెసిటి  మందులు వాడాలంటే వారి జీవన శైలి ని మార్చుకోవాలన్న నూతన నిబందన లు విధించింది. *ఇవి కొన్ని మల్టిపుల్ డ్రగ్స్ వే గో వై ,క్య్యస్ ఎం జే ఏ, సక్ష్ ఎండా ,కాంట్రోవ్, వీటిని మాత్రమే అనుమతించినట్లు బృందం వెల్లడించింది. *ఏ జి ఏ అమెరికన్ గ్యాస్ట్రో లాజికల్ సంస్థ సూచనల ప్రకారం డాక్టర్స్ ఇచ్చే ప్రిస్కిప్షన్ మేరకు ఊబకాయం తగ్గించే మందులు వాడాలని సూచించింది. జీవన శైలి లో మార్పులు చేయాలని సూచించింది పరిమిత ఆహారం తోపాటు వ్యాయామం చేస్తే బరువు తగ్గవచ్చని పేర్కొంది. *ఈ అంశాన్ని గ్యాస్ట్రో ఎంట్రాలజీ జర్నల్ లో నియమనిబందనలను వెల్లడించారు. ఊబకాయానికి ఆధునిక పద్దతిలో చేసేందుకు వీలుందని నిపుణులు వెల్లడించారు. *నియమిత ఆహారం వ్యాయామం ఒక్కటే చేస్తే ఊబకాయం నియంత్రించలేరు. అలా చేయడం వల్ల విఫల మయ్యరని ఒబెసిటి బయోలాజికల్ డిసీజ్ అయినందున అప్పుడప్పుడు తరచుగా మందులు ఫార్మాకో తెరఫీ తో చికిత్చ అవసరమని పేర్కొన్నారు. యాలె స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందినా ప్రొఫెసర్ డాక్టర్ జోన్ మోర్టాన్ బెరియాట్రిక్  విభాగం చీఫ్ మినిమల్లి ఇన్వి జివ్ సర్జన్ మాట్లాడుతూ ఎఫ్ డి ఏ నిబంధనల ప్రకారం ఊబాకాయాన్ని రక్షణతో కూడిన నిపుణులతో కూడిన సారధ్యం అవసరమని నిపుణుల సమక్షం లోనే రోగులయోక్క రోగి యొక్క అందం ఆకారం చెడకుండా వారు కోరు కున్న విధంగా ఊబకాయాన్ని తగ్గించవచ్చని.ఊబకాయం కేవలం బయోలాజికల్ దిజార్దర్ అంటే దాని ఆర్ధం స్వతసిద్ధంగా వారిని మొటివేట్ చేసేందుకు వారిని మానసిక సంబంధమైన శారీరక నిర్మాణం గా డాక్టర్ మోర్గాన్ పేర్కొన్నారు. *అమెరికన్ గ్యాస్ట్రో లాజికల్ సంస్థ కొన్నిమండులను ఊబకాయాన్ని తగ్గించేందుకు సూచించింది.మోర్గాన్ నేతృత్వం లోని బృందందీనిని తెరఫీ సహకారం అవసరమని సమర్ధించండి.ఫార్మా కో తెరఫీ తోపాటు జీవన శైలిలో మార్పులు ఆరోగ్యంగా ఉండేందుకు మంచిఫలితాలు సాధించవచ్చు అని అంటున్నారు మోర్గాన్. ఊబకాయాన్ని బి ఎం ఐ అంటే బోడి మాస ఇండెక్స్ ప్రకారం నిర్ధారిస్తారు. ౩౦ కే జి అంటే 27 కన్నా తక్కువ లేదా ఎక్కువ ఉంటారని బరువు ఆధారంగా శరీర నిర్మాణం ఉంటుంది. ఒక్కోసారి అండర్ వెయిట్ ఉన్నప్పుడు నష్టం కలిగిస్తుంది.ఏ జి ఏ అమెరికన్ గ్యాస్ట్రో ఎంత్రలాజికల్ సంస్థ కొన్ని మందులను కొన్ని మందులకు సంబందించిన పనితీరు ఎలాఉంటుందో సంరక్షణ వంటి వాటిగురించి వివరించింది. వే గొవై ,క్వెస్మియా, సక్సేండా, కాంటేరోవ్ వంటి మందులు ఎలా పనిచేస్తాయో వివరించారు.. వే గోవేవై- (సేమాగ్లుటైడ్ ) తరచుగా ఇది ఊబకాయానికి ఒక ప్రత్యామ్న్సయం. వేగోవై గ్లూకోజ్ ను నియంత్రిస్తుంది. వేగో వై వల్ల లాభాలు గ్యస్టిక్ ను ఖాళీ చేయకుండా నియంత్రిస్తుంది. ఈ మందు ప్యాక్రియాటిక్ నుండి వచ్చే ప్రమాదాన్ని నియంత్రిస్తుంది. క్య్ స్మియా- (ఫెంటర్ మైన్ టోపిరామూట్ ఇ ఆర్ )క్య్ స్మియా ఊబకాయానికి మైగ్రైన్ నియంతరించడానికి ,లేదా హ్హృద్రోగసంబంధమైన హై బిపి ఇక్కడ కీలక మైన అంశం ఏమిటి అంటే పిల్లల ఒబెసిటి విషయం లో కౌన్సిలింగ్ తరువాతే వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. సక్షెన్ డా-(లీరా గ్లు టైడ్ )సక్షెన్ దా గ్లూకోజ్ ను నియంత్రించే శక్తి ఉంటుంది. గ్యస్టిక్ విడుదలను తగ్గిస్తున్బ్ది టైప్ 2 డయాబెటిస్ ను నియంత్రించడం లో సహకరిస్తుంది.పెంక్రియాటిక్ ప్రమాదం నుండి రక్షణ కల్పిస్తుంది. కాంట్రావే-(నత్రెక్ష్ వన్-బుప్రో ప్లాన్)ఇ ఆర్ రోగులకు కాంట్రావే పోగతాగే ప్రయాత్నం చేస్తారో ఒత్తిడికి గురి అవుతారో అలాగే మూర్చరోగుల సమస్యలు ఉన్నవారికి అంటే ఫిట్స్ వచ్చినవారికి ఈ మందు పనిచేస్తుంది.ఊబకాయానికి ఒర్లి స్టాల్ ను వినియోగించరాదనీ బృందం సూచించింది. దీనిపనితీరు చాలా ప్రతక్కువే అని ఎక్కువస్తాయిలో వివిదరకాల రియాక్షన్స్ గెలిసిస్ట్ 1౦౦ ను క్లినికల్ ట్రైల్స్ లో మాత్రమే వినియోగించాల ని ఏ ఐ జి సభ్యుల బృందం సూచించింది.చివరగా ఫెంటర్ మైన్ ఆహారం జీవనశైలి లో మార్పులు తప్పనిసరిగా చేపట్టాలి.డాక్టర్ మోర్గాన్ బృందం ఇచ్చిన సూచనలు అద్భుతమని. ఊబకాయానికి వ్యతిరేకంగా పనిచేసే సామర్ధ్యం ఉన్నట్లు రుజువైంది. ఒబెసిటి నియంత్రణలో వైద్యం పెద్దలు, అధికబరువు ఉన్నవాళ్ళు ఊబకాయం వల్ల వచ్చే ఇతర సమస్యలు బరువు తగ్గించడం లో ఆహారం వ్యాయామం పెద్దగాసహాయ పడలేదని డాక్టర్ జార్జ్ మోరానో యాలె మెడిసిన్ విదేశీ గుర్తింపు పొందిన వైద్య నిపుణులు వివరించారు. ఒబెసిటి స్థాయి పెరుగుతోంది... కొన్ని దశాబ్దాలుగా యునైటెడ్ స్టేట్స్ ఊబాకాయం తో బాధపడుతున్న వారిసంఖ్య పెరుగుతోంది. ౩౦5% 2౦౦౦-2౦౦9 లో 41.9% 2౦19-2౦2౦ నాటికి పిల్లలో 6.2% 197౦-8౦ ౩౩% 2౦17-2౦18 లో వివిదరకాల అనారోగ్య సమస్యలు ముడి పడి ఉన్నాయి.ఉదా ---గుండె సంబంధిత వ్యాధులు టైప్ 2 డయాబెటిస్ ,నిద్రలేమి ఆస్టియో ఆర్తరైటిస్, కొలస్ట్రాల్, లెవెల్స్ క్యాన్సర్, బి పి,ఒబెస్ ను క్రాస్కేడ్ ఎఫెక్ట్ గ్లుకోజ్ నియంత్రణ కొలస్ట్రాల్ ను నియంత్రించవచ్చు.దేశం లో ఊబకాయానికి చికిత్చ చేస్తే ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్యను బరువు తగ్గడం ఊబకాయానికి జీవనశైలి కీలకమని మందులు లేకుండా ఒబెసిటి చికిత్చలు ఫెయిల్ విషయాన్ని గుర్తుచేశారు దీర్ఘకాలంగా మీరు ఊబకాయం సమస్యనుండి బయట పడవచ్చు.మీశరీరం బరువు ఆపగలదా?ఆపలేదా?అయితే చికిత్చ తప్పదా అప్పుడే మీకు మేటాబాలిక్ ఇంటర్ వెంక్షన్ మందులు అవసరం.దీర్ఘకాలం గా ఊబకాయ నియంత్రణకు వీతిగురించిన అవగాహన లేనివారు ప్రిస్క్రిబ్  చేయరు..ఊబకాయానికి వాడే మందు రోగి హెల్త్ ఇన్సూరెన్స్ లో కవర్ కాలేదు. ప్రజలలో అవగాహన ప్రిస్కిప్షన్ ఈ మందులు కేవలం వెయిట్ లాస్ కు మాత్రమే వినియోగిస్తారు. ఎవరైతే రిస్క్ భరించగలరో డాక్టర్ సలహా తీసుకుని లాభం ,నష్టం అంచనా వేయాల్సిందే.ఇతర ఆమ్శాలాను మదిమ్పుచేసిన తరువాత నిర్ణయించుకోవచ్చు. బెరియాట్రిక్ సర్జరీ మీకు ఉపయోగపడితే చేయించుకోవచ్చు. రోగి స్థితిని బట్టి ఏమి నిర్ణయించు కోవచ్చు రోగి గత చరిత్ర రోగి ఇచ్చే ప్రాధాన్యత ఆధారంగానే చికిత్చ చేస్తారు.
ఇంట్లో ఉన్నప్పుడు టీవీ చూస్తున్నా, ఏదైనా పని చేసుకుంటున్నా  పక్కనే ఒక ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు పెట్టుకుని ఉంటారు. ఇక భోజనం చేసేటప్పుడు అయితే ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని ప్లాస్టిక్ బాటిళ్లతో నీళ్ళు పక్కన పెట్టుకుంటారు. రాత్రి నిద్రపోయే ముందు పక్కనే ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్ళు పెట్టుకుంటారు.  ఇక బయటకు వెళ్లినా  వెంట ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్ళు తీసుకెళ్లాల్సిందే. లేకపోతే బయట 20 నుండి 30 రుపాయలు పెట్టి నీళ్ళ బాటిల్ కొనాల్సి వస్తుంది. ఎక్కడైనా తాగుదామా అంటే పరిశుభ్రత గురించి, నీటి క్వాలిటీ గురించి ఆలోచిస్తాం. కొందరు అయితే ఆరోగ్యం మీద స్పృహతో ప్రయాణాలలోనూ, హోటళ్లలోనూ వాటర్ బాటిళ్లు కొనుగోలు చేసి నీరు తాగుతారు. కానీ ఇలా బాటిళ్లలో నీరు తాగడం అంత మంచిది కాదని ఎప్పటినుండో చెబుతున్నా ఇప్పుడు ఓ దారుణమైన నిజం బయటపడింది. ప్లాస్టిక్ బాటిళ్ళలో నీరు తాగడం గురించి శాస్త్రవేత్తలు షాకింగ్ నిజాలు బయటపెట్టారు. అందరూ వాటర్ బాటిళ్లలో నీరు తాగుతారు. ఇంట్లో అయినా, బయట నేరుగా బాటిళ్లతో కొనే నీరు అయినా పరిశుభ్రంగా ఉన్నాయని అనుకుంటారు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు  డబుల్ లేజర్ సూక్ష్మదర్శిని ఉపయోగించి ఈ బాటిళ్లలో నీటిని పరిశీలించగా దిమ్మతిరిగిపోయే విషయాలు బయటపడ్డాయి. సగటు లీటర్ వాటర్ బాటిల్ లో రెండు మిలియన్ల కంటే ప్లాస్టిక్ ముక్కలు సూక్ష్మరూపంలో ఉంటాయట. ఇవి అదృశ్యరూపంలో ఉండే నానోప్లాస్టిక్ ముక్కలుగా తేలింది. కొలంబియా,  రట్జర్స్ విశ్వవిద్యాలయాల పరిశోధకులు మూడు సాధారణ బాటిల్ వాటర్ బ్రాండ్‌ల నుంచి  ఐదు బాటిళ్ల నీటిని  పరిశీలిస్తే, ఒక లీటరు నీటిలో 1,10,000, మరొక దాంట్లో  4,00,000 ఇలా ఉన్నాయి. మొత్తం మీద  ప్లాస్టిక్ ముక్కల సంఖ్య ప్రతి బాటిల్ కు  సగటున 2,40,000 ఉన్నాయి.  ఇవి ఒక మైక్రాన్ కంటే తక్కువ పరిమాణంలో ఉండే కణాలు. ఒక అంగుళంలో 25,400 మైక్రాన్లు ఉంటాయి.  ఇది మీటర్‌లో మిలియన్ వంతు. కాబట్టి మైక్రోమీటర్ అని కూడా పిలుస్తారు. మనిషి  జుట్టు దాదాపు 83 మైక్రాన్ల వెడల్పు ఉంటుంది. ఇంతకు ముందు ప్లాస్టిక్ బాటిళ్లలో నీటి గురించి జరిపిన అధ్యయనంలో 5 మిల్లీమీటర్ల నుండి పావు అంగుళం కంటే తక్కువగానూ, ఒక మైక్రాన్ వరకు ఉండే కొంచెం పెద్ద మైక్రోప్లాస్టిక్‌లను కనుగొన్నాయి. మైక్రోప్లాస్టిక్‌ల కంటే బాటిల్ వాటర్‌లో దాదాపు 10 నుండి 100 రెట్లు ఎక్కువ నానోప్లాస్టిక్‌లు ఉన్నాయని అధ్యయనాలు కనుగొన్నాయి.  ప్లాస్టిక్ బాటిళ్లలో ఇలాంటి నీరు తాగడం వల్ల కలిగే ఇబ్బందులు  ఏమిటంటే..  ఈ చిన్న కణాలు మెదడుకు రక్త సరఫరాకు అంతరాయం కలిగించడం,   వివిధ అవయవాలు,  క్రాస్ మెమ్బ్రేన్‌లను ప్రభావితం చేయడం చేస్తాయి. అదే విధంగా  ఈ  నానోప్లాస్టిక్‌లు పేగుల్లో పేరుకుపోయి వాటిని నిరోధించే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు ఈ కణాలు మెల్లిగా రక్త నాళాల వైపు కదులుతాయి. మనిషి  శరీరంలో ఆల్వియోలస్ అనేది ఊపిరితిత్తుల భాగం. ఇది రక్తంలోకి ఆక్సిజన్‌ను విడుదల చేయడానికి,  రక్తం నుండి కార్బన్ డయాక్సైడ్‌ను స్వీకరించడానికి పెద్ద రంధ్రాలను కలిగి ఉంటుంది. ఈ కణాలు ఊపిరితిత్తులలోకి ప్రవేశించి రక్తం-గాలి ప్రసరణకు అవరోధాన్ని కలిగిస్తాయి. మరీ ముఖ్యంగా చిన్న ప్లాస్టిక్ కణాలు గర్భవతులలో మావిని ప్రభావితం చేస్తాయి. తల్లీబిడ్డలను కలిపే  అవయవం మావి. ఇది ప్రభావితం కావడం వల్ల  ఆక్సిజన్,  పోషకాలను తల్లి నుండి పిండానికి రవాణా చేయడం కష్టతరమవుతుంది.                                               *నిశ్శబ్ద.  
నేడు దేశంలో ని సగానికి పైగా యువత తక్కువ వయసులోనే జుట్టు ఊడిపోవడం, బట్టతల సమస్య ఎదుర్కుంటున్నారు.ఈ సమస్యవల్లె చాలామందికి పెళ్ళికూడా కాక పోవడం సంభవిస్తోంది అందరిముందు బట్టతల తో తిరగాలంటే సిగ్గుపడడం గమనించవచ్చు. ఇందుకోసం అందంగా కనపడడానికి బాగా జుట్టుపెరగాదానికి చేయని ప్రయాత్నం అంటూ లేదు అందుకోసం పడుతున్న పడరాని పాట్లు వర్ణనాతీతం చివరగా ఎదిక్కులేక హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ అంటే జుట్టు మార్పిడి చేయించుకోడానికి సిద్ధమౌతున్నారు.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసేందుకు ఇబ్బిడి ముబ్బిడిగా పుట్టుకొస్తున్న నేపధ్యంలో మే నెలలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వల్ల ౩5 సంవత్సరాల వ్యక్తి మృతి చెందం తీవ్ర కలకలం రేపింది. డిల్లి నార్త్ వెస్ట్ ప్రాంతం లోనిరోహిణి లో  హెయిర్ టాన్స్ ప్లాంట్ చేస్తున్న సమయంలో రోగి మరణిం చడం పై డిల్లి హైకోర్ట్ తీవ్రంగా పరిగణిస్తూ కేంద్రం ప్రభుత్వాలు హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసేవారిపట్ల వైద్య నియమ నిబందనలు అనుగుణంగా ఉన్నాయో లేదో చూడాలని డిల్లి హైకోర్ట్ ఆదేశించింది. ఇందుకోసం జాతీయ స్థాయి ప్రమాణాలు నియమ నిబందనలకు అనుగుణంగా పరిశీలించాలని నష్నల్ మెడికల్ కమీషన్ కు ఆదేశాలు జారీచేసింది. హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సమయంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించేందుకు అత్యవసర సమయంలో అందించాల్సిన చికిత్చలు కు సత్వరం అందించేందుకు సమీపంలో పెద్ద ఆసుపత్రులలో నిర్వహించాలని క్లినిక్ నిర్వాహకులకు సూచించింది.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వల్ల జీవితం అంతమై పోదు, మరనిస్తారాని కాదు నష్నల్ మెడికల్ కమీషన్ తీసుకున్న నిర్ణయం పట్ల హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది ప్రముఖ ఆసుపత్రులలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ నిర్వహిస్తే ఇబ్బందులు తప్పవని ప్రైవేట్ ఆసుపత్రులలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ బృందం ఉంటుందని క్లినిక్లకు పెద్దసవాలు కాగలదని హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ చండి జైన్ గుప్తాఅన్నారు ప్రైవేట్ క్లినిక్లను కార్పోరేట్ పెద్ద ఆసుపత్రులు అనుమతించ బోవని ఆయా ఆసుపత్రుల నుండి సవాళ్లు తప్పవని డాక్టర్ మయాంక్ సింగ్ అన్నారు.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సమయం లో అనుసరించే పద్ధతి అలసటతో కూడుకున్నది పెద్ద పెద్ద వసతులు ఉన్నప్పుడు ఎంపిక సులభమని అన్ని సదుపాయాలు ఉన్న చోట అనుభవజ్ఞులైన వైద్యుల సేవలు అందుతాయని పి ఎస్ ఆర్ ఐ ఆసుపత్రి ఎల్లప్పుడూ స్వగాతిస్తుందని వైద్యులు అన్నారు.అయితే దీనికోసం నూతన విధి విధానాలు అమలు చేయాలని సరైన సదుపాయాలూ శిక్షణ లేని వారుహెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ నిర్వహించడం వల్ల ప్రజల ప్రాణాలకు హానికలిగే అవకాసం ఉంది. డిల్లి లో సరైన సదుపాయాలు లేని ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ లు చాలానే ఉన్నాయాని పద్దతి ప్రకారం నిర్వహించే ట్రాన్స్ ప్లాంట్ కు 1.5 నుండి 2 లక్షలు అవుతుందని అంటున్నారు నిపుణులు.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ పరిశ్రమను నూతన జవసత్వాలు కల్పించడం నాణ్యత ప్రమాణాలు సాడుపాయాలు లేని ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ లపై ఉక్కు పాదం మోపడం అంటే నియంత్రించడం. జాతీయ ఆరోగ్య మిషాన్ ఎన్ ఎం సి నియమ నిబంధనల అనుగుణంగా పనిచేయాలని పేర్కొంది.ఈ విషయాన్ని మోడ్రన్ ఈస్థటిక్స్ స్వాగతించింది.ఇది కేవలం డే కేర్ సర్జరీ మాత్రమే అనిస్పష్టం చేసారు. ఎన్ ఎం సి నిబందనల ప్రకారం ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ కు సమీపం లో నర్సింగ్ హోం ఉండాలన్న నిబంధన విధించిందన్న విషయం గుర్తుచేశారు. అత్యవసర మైన పక్షం లో అవసరమైన సమయం లో చేర్చేందుకు అవసరమైన వైద్య సదుపాయాలు ఉండడం అత్యవసరమని పేర్కొంది తద్వారా రోగిని ప్రమాదం నుండి తపాయించావచ్చని పేర్కొంది. అయితే ట్రాన్స్ ప్లాంట్ లో సమయంలో ప్రమాదం జరగడం అరుదని డాక్టర్ గుప్తా అన్నారు.ఈ మధ్యకాలం లో దేశవ్యాప్తంగా చోటు చేసుకోవడం పై గుప్తా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. సర్జరీ సమయం లో ప్రత్యేక పద్దతి అనుసరించాలాని బలమైన అనస్తీషియా బృందం ఉండాలాని ఎందుకంటే దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయాని చాలా క్లినిక్స్ లో డర్మటాలాజిస్ట్ లు లేదా ప్లాస్టిక్ సర్జన్స్ ఎనేస్తీషియా ఎక్స్ పర్ట్ గా వ్యవహరిస్తున్నారని వారి వద్ద సురక్షిత మైన వారు లేరని రోగులు తీవ్రమైన విచిత్ర మైన పరిస్థితులు ఎదుర్కోవడం సంభవిస్తుందని అందుకే అప్రమత్తం గా ఉండాలని ఎన్ ఎం సి హేచారించింది.ఎన్ ఎం సి నియనిబంధనలకు లోబడే ప్లాస్టిక్ సర్జన్లు ఉండాలి. అర్హత లేని వ్యక్తుల పై చట్టప్రకారం చర్యలు ఉంటాయాని ఎన్ ఎం సి హెచ్చరించింది.