కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తీహార్ జైలుకు వెళ్ళి రెండు నెలలు దాటిపోయింది. కవిత ఎన్నిరకాల కారణాలు చెప్పి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఎప్పటికప్పుడు వినాయకుడి పెళ్ళిలాగా వాయిదా పడుతూనే వుంది. అంతేకాకుండా..  పురుగుమీద పుట్రలాగా ఈడీ కేసుకు తోడు, సీబీఐ కేసు కూడా చేరి మూలిగే అక్క మీద తాటికాయ పడ్డట్టుగా పరిస్థితి మారింది. తల్లి దగ్గర లేకుండానే కవిత పిల్లల పరీక్షలు ముగిశాయి. బీఆర్ఎస్‌కి స్టార్ కాంపైనర్ లేకుండానే ఎలక్షన్లు ముగిశాయి. తెలంగాణ ప్రజలు కవిత అనే ఒక కేరెక్టర్ వుంది అనే విషయం కూడా మెల్లగా మర్చిపోతున్నారు. ఈడీ, మోడీ, బోడి ఎవరొచ్చినా మమ్మల్నేమీ చేయలేరు...  మా జోలికి వస్తే తెలంగాణ సమాజం మొత్తం తిరగబడుతుంది. మీద పడి రక్కుతుంది అని బిల్డప్పు ఇచ్చుకున్న కవితను ప్రస్తుతం జనం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. మందుబాబులు మందు కొట్టడం ఎంతమాత్రం మానలేదు.. అరె.. మన మందు కోసం కవితమ్మ జైల్లోకి వెళ్ళింది కదా.. ఆమెకి మద్దతుగా మందు కొట్టడం ఆపేద్దాం అని ఎవరూ అనుకోవడం లేదు. తెలంగాణ జనం కవిత అరెస్టుని లైట్‌గా తీసుకున్నారు.. ఓకే.. కవితని జనం పట్టించుకోకపో్తే పట్టించుకోకపోయారు.. వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి.  చివరికి కవిత తండ్రి కేసీఆర్, కవిత అన్న కేటీఆర్ కూడా కవిత అరెస్టుని లైట్‌గా తీసుకున్నట్టు అనిపిస్తోంది.  ఢిల్లీలో చక్రం తిప్పుతా, నేను లేస్తే మనిషిని కాదు అన్నట్టుగా మాట్లాడిన కేసీఆర్, తన కుమార్తెని విడిపించుకునే విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు తప్ప, కవితని విడిపించడానికి రాజకీయంగా చాణక్యం ఏదైనా చేయాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్టులేరు. ఆయన వ్యవహార శైలి చూస్తుంటే, అసలు తన కూతురు అరెస్టు కాలేదు అన్నట్టుగానే వుంది. మరోవైపు కేటీఆర్ అయితే, పాపం ఆయనకి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అర్జెంటుగా ఎలా కూలదోయాలా అన్న ఆలోచనలోనే వున్నారు తప్ప, తోబుట్టువును బయటకి తీసుకురావడానికి తన తండ్రి మీద ఒత్తిడి తేవాలన్న ఆలోచనలో ఉన్నట్టులేరు. ఇక హరీష్‌రావుకి, గానీ సంతోష్‌రావుకి గానీ కవిత జైల్లో వుండటం పెద్ద బాధ కలిగించే విషయం కాదు. వీళ్ళంతా కవిత విషయంలో చాలా రిలాక్స్.గా వున్నారు. కానీ, ఒక్క మనిషి మాత్రం కవిత అరెస్టు అయినప్పటి నుంచి కుమిలిపోతూ వున్నారు. ఆమె ఎవరో కాదు.. కవిత మాతృమూర్తి శోభ! అల్లారుముద్దుగా పెంచిన కన్న కూతురు జైల్లో వుంటే, ఇటు భర్త, అటు కొడుకు ఇద్దరూ కవితని విడిపించడానికి రాజకీయంగా ఏం చేయాలన్నది ఆలోచించకుండా మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలా అనే ఆలోచిస్తూ వుండటం ఆమెకు ఎంతమాత్రం నచ్చడం లేదని తెలుస్తోంది. ఇద్దర్నీ ఎంత బతిమాలినా కొంచెం వెయిట్ చెయ్యి, పరిస్థితులు అన్నీ అవే సర్దుకుంటాయి అని చెబుతున్నారట. ఎంత ఒత్తిడి చేసినా ఎలక్షన్లు అయ్యాక పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారతాయి. అప్పుడు కవితని విడిపించడం ఈజీ అవుతుందని చెబుతూ ఆమెని శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారట. ఆమె మాత్రం జైల్లో కూతురు ఎలా వుందో, ఎన్ని బాధలు పడుతోందో అని మనోవేదనతో కుమిలిపోతూ వున్నట్టు సమాచారం.
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా శనివారం (మే 25) జరిగిన ఆరో విడత పోలింగ్ లో కాంగ్రెస్ అగ్రనేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. న్యూఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో  తల్లీ కుమారులిద్దరూ తమ ఓటు వేశారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు. తమ జీవితంలో తొలి సారిగా కాంగ్రెస్సేతర పార్టీకి తమ ఓటు వేశారు. అయితే ఇందులో వారిని తప్పుపట్టాల్సిందేమీ లేదు. ఎందుకంటే పొత్తులో భాగంగా  ఈ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. అంటే ఇండియా కూటమి అభ్యర్థిగా ఆప్ నాయకుడు సోమనాథ్ భారతి నిలబడ్డారు. దీంతో సోనియాగాంధీ,  రాహుల్ గాంధీ తమ ఓటును సోమనాథ్ భారతికి వేశారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిందేమిటంటే వీరిరువురూ  కాంగ్రెస్ కు కాకుండా మరో పార్టీకి ఓటు వేసిన సందర్భం ఇదే మొదటిది. 
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అయినా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఆందోళ‌న‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే ప‌దేళ్ల త‌ర్వాత విభ‌జ‌న చ‌ట్టంలోని ప‌లు అంశాల‌కు కాలం చెల్లుతుంది. అయితే ఏపీ నేత‌లు త‌మ‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు త‌డిబ‌ట్ట వేసుకొని నిద్దుర‌పోతున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం హైదరాబాద్ రాజధాని నగరం పూర్తిగా తెలంగాణకు చెందుతుంది. అధికారిక వర్గాల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో జాబితా చేసిన వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన, అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విభ‌జ‌న పూర్తి కాలేదు.  1. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు తొమ్మిదో షెడ్యూల్‌లో జాబితా చేశారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కంపెనీలు, కార్పొరేషన్‌లు ఉన్నాయి.  చట్టంలోని 10వ షెడ్యూల్‌లో ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ యూనియన్, ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఏపీ ఫారెస్ట్ అకాడమీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ వంటి 107 శిక్షణా సంస్థలు ఉన్నాయి. రిటైర్డ్ బ్యూరోక్రాట్ షీలా భిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీ షెడ్యూల్ 9, 10 షెడ్యూల్ సంస్థల విభజనపై సిఫార్సులు చేసినప్పటికీ, ఈ అంశం అపరిష్కృతంగానే ఉంది.  2. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్ ఈ ఏడాది జూన్ 2వతేదీ నుంచి తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పటికీ, 2016వ సంవత్సరంలోనే అప్పటి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సచివాలయం, దాదాపు రాష్ట్ర పరిపాలన కార్యాలయాలను ఏపీలోని అమరావతికి మార్చారు. అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్ ప్రపంచ స్థాయి రాజధానిని అభివృద్ధి చేయాలని అప్పటి సీఎం చంద్రబాబు ప్రణాళిక రూపొందించారు.  ఏపీకి ఇప్ప‌టికీ పూర్తిస్థాయి రాజ‌ధాని అందుబాటులోకి రాలేదు.  మ‌రో వైపు ఉమ్మ‌డి రాజ‌ధాని విష‌యంపై ఏపీ చేతులు ఎత్తేసింది. 3. ఆర్టీసీ ఆస్తుల వివాదం ఇప్ప‌టి వ‌ర‌కు తేల‌లేదు. విభ‌జ‌న చ‌ట్టంలో ఆర్టీసీ ఆస్తుల‌ను 10 ఏళ్ల‌లోగా ప‌రిష్క‌రించుకోవాలని.. చెప్పారు. ఆ త‌ర్వాత‌.. అని ఎక్క‌డా చెప్ప‌లేదు. దీనిని అడ్వాంటేజ్ గా తీసుకున్న తెలంగాణ ప్ర‌భుత్వం తెలంగాణాలోని ఆర్టీసీ ఆస్తుల్ని పూర్తిగా తీసుకునేలా చ‌క్రం తిప్పుతోంది. ఇది ఏపీ ఆర్టీసీకి ఇబ్బందిక‌రంగా మారింది. హైదరాబాద్‌లో ఉన్న ఆర్టీసీ ఆస్తుల్లో వాటా కావాలని ఏపీ కోరింది. దానికి టీఎస్‌ఆర్‌టీసీ నిరాకరించింది. షీలా భిడే ప్యానెల్ ఇచ్చిన హెడ్‌క్వార్టర్స్ నిర్వచనం ప్రకారం ఆర్టీసీ ఆస్తులు తమకు చెందినవని టీఎస్ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ ఆస్తులు తెలంగాణకు చెందినవేనని, తెలంగాణ గడ్డపై ఉన్న ఆస్తుల్లో ఏపీకి వాటా ఎలా ఇస్తామని తెలంగాణా నేత‌లు చెబుతున్నారు.  ఆర్టీసీ ఆస్తుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం వాటా ఇవ్వాల్సిందేనని ఏపీ నేత‌లు చెబుతున్నారు. ఆర్టీసీ ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఓ కొలిక్కి రాలేదు.  4. హైద‌రాబాద్‌లోని ఏపీ భ‌వ‌నాలు.. కార్యాల‌యాల విష‌యం కూడా తేల‌లేదు. 5. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు, తెలంగాణా నుంచి  6,111 కోట్ల రూపాయల విద్యుత్ బ‌కాయిలు రావాల్సి ఉంది. విభజన తర్వాత విద్యుత్ సరఫరాకు సంబంధించి బకాయిల చెల్లింపు విషయంలో  రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరలేదు.  6. ఉద్యోగుల పంపిణీ కూడా అలానే ఉంది.  రాష్ట్ర విభజన తర్వాత 144 మంది తెలంగాణ ఉద్యోగులు 2014 నుంచి ఏపీలో పనిచేస్తున్నారు. వీరిని వెనక్కి తీసుకురావాలని, తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ అధికారుల సంఘం మే 18వతేదీన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు వినతి పత్రం అందించింది.  7. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవ‌ల‌ సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చారు. అదేమిటంటే,  జూన్ 2 త‌ర్వాత‌ త‌మ ప‌రిధిలో ఉన్న అన్ని కార్యాల‌యాల‌ను తెలంగాణ‌లో క‌లిపేయాలని లిఖిత పూర్వ‌క ఆదేశాలు ఇచ్చారు. ఏపీకు పదేళ్లపాటు ఇచ్చిన హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ ప్రభుత్వ అతిథి గృహం వంటి భవనాలను జూన్ 2వతేదీ తర్వాత స్వాధీనం చేసుకోవాలని సి.ఎం. అధికారులకు ఆదేశించారు.  ఆంధ్ర రాష్ట్ర సమస్యలను జగన్ రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదు. వైసీపీ ఎంపీలు ఏనాడూ పార్లమెంట్‌లో నోరెత్తలేదు.  విభజన హామీల‌న్నీ కాగితాలకే పరిమితమయ్యాయి.  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల మధ్య ఆస్తుల విభజన, విద్యుత్‌ బిల్లుల బకాయిలు వంటి అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. విభ‌జిత రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. అలా ప‌దేళ్ళు గ‌డిచిపోయాయి.  అయితే రాష్ట్రం ఇబ్బందులు త‌న‌కేమీ ప‌ట్ట‌నట్టుగా కేంద్రం ఉద్దేశ‌పూర్వ‌కంగానే నిర్లక్ష్య వైఖ‌రి అవ‌లంభిస్తోంది.  తెలుగువారు రెండు ముక్క‌లు కావ‌డం. త‌ద్వారా ఢిల్లీ స్థాయిలో వారి ప‌లుకుబ‌డి, ప్రాభ‌వం త‌గ్గింది. అస‌లు ప్రాంతీయ పార్టీల‌ను క‌నుమ‌రుగు చేసేందుకు జాతీయ పార్టీలు  ఉమ్మ‌డిగా చేసిన కుట్ర‌లో భాగ‌మే రాష్ట్ర విభ‌జ‌న  అని ఆంధ్ర మేధావులు చెబుతున్నారు. ఇప్పుడు జాతీయ పార్టీలు రెండు రాష్ట్రాల‌ను త‌మ రాజ‌కీయ ప్ర‌యోగ‌శాల‌లుగా మార్చేశాయి. అయితే ఈ ఆట‌లో కాంగ్రెస్ తీవ్రంగా న‌ష్ట‌పోయింది.  బీజేపీ ఏమాత్రం ప్ర‌యోజ‌నం పొంద‌గ‌ల‌దనేది భ‌విష్య‌త్తులో తేల‌నుంది. ఒక‌టి మాత్రం నిజం ఈ క్రూర‌మైన రాజ‌కీయ క్రీడ‌లో దారుణంగా న‌ష్ట‌పోయింది మాత్రం సీమాంధ్ర ప్ర‌జ‌లు. - ఎం.కె. ఫ‌జ‌ల్‌
ALSO ON TELUGUONE N E W S
Bandi Saroj Kumar, who is known for the digital release 'Mangalyam', has directed a new movie titled 'Parakramam' on his banner, BSK Mainstream. The film's awesome teaser was released today. Saroj, who is not only directing the movie but is also its music director, writer and editor, invited Mass Ka Das Vishwak Sen, directors Buchi Babu Sana, Gnanasagar Dwarka and producer SKN as the chief guests. Speaking on the occasion, Director Bandi Saroj Kumar said, "I entered the industry in 2004 as a junior artist. I gave auditions to many directors. They didn't understand my acting. They found my dialogue delivery too natural. I became a director thinking that I needed a director who knew my acting. I came to know about movie-making when I saw Chiranjeevi on TV as a child. People like Ilaiyaraaja, Sirivennela Sitaramasastry, PC Sreeram, and Srikar Prasad have inspired me. Taking inspiration from all of them, I have been improving my natural talent because I have to be extraordinarily talented to catch the producers. I stayed away from normal life for 20 years. I have done two Tamil films and one Telugu film as a director. All three were disasters. Knowing that I am a failed director, I decided to act myself and did the films 'Nirbhandam', 'Nirbhandam 2' and 'Mangalyam'. I put those movies on YouTube. There was a lot of response from all sections of the audience, who supported me with as much money as they were willing to pay. Movie lovers wanted me to do a mainstream movie for the family audience. I made this film with their support and encouragement. I don't move around much in the industry. Most people don't like me because I am straightforward. The three people I like in the industry are SKN, Buchi Babu and Vishwak Sen. We are happy to have these three guests at our teaser release event today. SKN is a straightforward, talented producer. His taste is evident in his movies. Buchi Babu is a proven director. He is a good-hearted person. When I met him once, he told me he had sent Rs 5,000 for 'Mangalyam'. Vishwak Sen also speaks straightforwardly like me. As an actor, he sees me as myself without comparing me to anyone else. We did a Yajna for the movie 'Parakramam'. Thanks to Vishwak Sen, who supported me at this important juncture. My previous films were limited to certain sections of audience but this movie will be seen by all sections of audience. That's why I named my banner BSK Mainstream." https://www.youtube.com/watch?v=uAN83vSCgMc Mass Ka Das Vishwak Sen said, "I have been hearing the name of Bandi Saroj Kumar in our circles ever since I was doing animation and editing courses. He did a movie called 'Porkalam' in Tamil. The movie did not click but there was a section of audience who loved it. I saw the trailer of Bandi Saroj Kumar's 'Nirbandam' and sent him a message. You want to have a strong voice, I told him. Saroj Kumar has created a movie world of his own. He is continuously making his own kind of films. I am one of those people who want him to grow. The teaser released today is very good. Saroj Kumar performs better as an actor than as a director." Director Buchi Babu said, "Prasad worked as DoP for this movie and worked for '100% Love' as well. Since then, he has been my acquaintance. Cinematographer Prasad who received awards for 'Prem Katha' and 'Pournami' is associated with Saroj's project. Upendra garu does all the major crafts in Kannada cinema. Likewise, Bandi Saroj Kumar does it in Telugu. It's amazing how he does so many crafts when direction alone is so difficult. Bandi Saroj Kumar is a cult man. His movie 'Porkkalam' is my favorite movie." Director Gnanasagar Dwaraka said, "Bandi Saroj Kumar's movies' titles are very good. As Vishwak said, Saroj impresses with his performance as an actor. His performance is very genuine. You cannot perform like that unless you are very honest to the character. He lives away from the society like a saint." Producer SKN said, "I have a short acquaintance with Bandi Saroj Kumar. A good impression was formed on him. He is a person who is passionate about cinema. Bandi Saroj Kumar's answers in interviews are so genuine. If he is doing seven or eight crafts, that's because of his passion and talent. After watching the teaser of the movie 'Parakramam', the flame in his heart was seen in every frame. Bandi Saroj Kumar should get good recognition with this movie. I will offer any support he needs for the release and promotion of this film. I have a small suggestion for the Producers Council regarding the exhibition of small films. As small films pick up their potential only from the second and third week onwards, we want a bigger share to be given to the distributor and producer." Actor Mohan Senapati said, "Bandi Saroj Kumar liked my frankness and gave me a good character in this movie. He became a good friend of mine." Actor Shashank Vennelakanti said, "Bandi Saroj Kumar approached me through Facebook earlier. He saw the actor in me. He said that he would give a character in his film. I could not do that film at that time. After that, he gave me the opportunity to write songs for 'Mangalyam'. Since then we have become good friends. With this prowess as an actor and director, Bandi Saroj Kumar's prowess will reach more audiences." Actress Shruti Samanvi said, "I am a classical dancer who has been awarded at the national level. I played a key role in this movie. I hope this film will bring success to all my team along with me." Actor Nikhil Gopu said, "I have been trying for opportunities in the film industry for four years. I was rejected on repeat. Bandi Saroj Kumar anna saw the talent in me and gave me the opportunity. I would like to thank my parents who supported me along with him." Actor Anil Kumar said, "Thanks to the director Bandi Saroj Kumar for giving a good character in this movie. I believe that the release of this movie will be famous for all of us as actors."
  బెంగళూర్ రేవ్ పార్టీ ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్న అంశం. ఈ పార్టీ వేడి ఇంకా చాలారలేదు.. రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది..కొత్త కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. రీసెంట్ గా కరాటే కళ్యాణి ఒక ఇంటర్వ్యూలో ఒక బాంబు పేల్చింది.  "హేమ మా అసోసియేషన్ లో  లైఫ్ మెంబర్.  నరేష్ 'మా' అధ్యక్షుడిగా ఉన్న టైములో "మా" వాట్సాప్ గ్రూప్ లో జబర్ధస్త్ అమ్మాయి వర్ష ఫోటోను హేమ పోస్ట్ చేసింది. ఈ ఫోటో ఎందుకు పెట్టారు అని అందరు అడిగేసరికి  హేమ వెంటనే  వర్ష ఫోటోను డిలీట్ చేసింది. ఎవరికో ఫోటో పంపబోయి గ్రూపులో వచ్చిందనే విషయాన్ని ఆ తర్వాత చెప్పింది. ఈ వాట్సాప్ గ్రూపు మా వార్ రూమ్ లాంటిది. అక్కడ మా పర్సనల్ విషయాలు అవి మాట్లాడుకుంటాం. అసలు గ్రూపుల్లో అమ్మాయిల ఫోటోలు ఎందుకొస్తున్నాయి అనే విషయం మాకు అర్ధం కాలేదు. హేమ ఇలా తప్పుల మీద తప్పలు చేసి దొరికిపోతూనే ఉంది. తాజాగా హేమ బ్లడ్ శాంపుల్స్‌లో డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. బ్లడ్ శాంపిల్ ని ఎవరూ మార్చలేరు కదా.  ఆమె ఈ కేసు నుంచి బయట పడాలని  కొరుకుంటున్నాను. కానీ బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లానని చెప్పకుండా హేమ తన ఇంట్లో ఉన్నట్టు నిరూపించుకోవడానికి  ఏవేవో చేసి చివరికి అడ్డంగా బుక్ అయ్యింది.  ఇంట్లో బిర్యానీ చేస్తున్నట్టు, మామిడి కాయ పచ్చడి పడుతున్నట్టు అసలేమీ తెలియనట్టు వీడియోల మీద వీడియోలు పోస్ట్ చేస్తోంది..ఇదో పెద్ద కేసు...దీని నుంచి ఎవరూ తప్పించలేరు  " అని చెప్పింది. ఐతే నెటిజన్స్ మాత్రం "అనవసరంగా ఎందుకు వర్ష పేరు తెస్తున్నారు. వర్ష మీ మీద పరువు నష్టం దావా వేయొచ్చు" అని కామెంట్స్ చేస్తున్నారు.
అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ...’ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించి విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై తెలంగాణ సినీ మ్యూజిషియన్స్‌ అసోసియేషన్‌ స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అందెశ్రీ రచించిన ఆ గీతానికి గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం, తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించకపోవడాన్ని ప్రస్తావించడమే కాదు, ప్రస్తుత ప్రభుత్వం ఆ గీతానికి సంగీతాన్ని అందించే బాధ్యతను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి అప్పగించడంపై అసోసియేషన్‌ తమ నిరసన వ్యక్తం చేసింది. తెలంగాణ సినీ మ్యూజిషియన్స్‌ అసోసియేషన్‌ విడుదల చేసిన ప్రకటన సారాంశం ఇలా ఉంది. ‘అందెశ్రీగారు రచించిన ‘జయ జయహే తెలంగాణ...’ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా మీరు ప్రకటించి విడుదల చేయబోతున్నందుకు తెలంగాణ ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే తెలంగాణ కళాకారులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మా తెలంగాణ సినీ మ్యూజిషియన్స్‌ అసోసియేషన్‌ కూడా గర్వపడుతున్న గొప్ప సందర్భం ఇది. పదేళ్ల క్రితమే ఈ గీతాన్ని గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రజలకు అందిస్తే ఎంతో బాగుండేది. అలా జరగకపోవడం దురదృష్టకరం. గత ప్రభుత్వం ఈ పాట విషయంలో ఎన్నో తప్పులు చేసింది. రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఈ పాట ప్రజలకు ఎంతో చేరువైంది. అలాంటి పాటని గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం. ఈ పాట కొందరు తెలంగాణ రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో నలిగి నలిగి చచ్చిపోయింది. మళ్ళీ మీ వల్ల పుట్టి పురుడు పోసుకుంటున్న శుభ తరుణమిది. ఈ పాటని బతికిస్తున్నందుకు ధన్యవాదాలు. అన్నీ బాగానే ఉన్నా ఇంతటి గొప్ప పాటని సంగీత దర్శకులు కీరవాణి గారిని సంగీతం అందించమని కోరటం చారిత్రక తప్పిదం అవుతుందని మీకు తెలియజేస్తున్నాము. తెలంగాణ అస్తిత్వం మీకు తెలియనిది కాదు. తెలంగాణ ఉద్యమం ఎందుకు మొదలైందో మీకు తెలియనిది కాదు. ‘మన ఉద్యోగాలు మనకే రావాలి, మన అవకాశాలు మనకే కావాలి’ అనే నినాదంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సకల జనుల సహకారంతో ఎంతో మంది అమర వీరుల త్యాగఫలంగా ఏర్పడింది మన తెలంగాణ రాష్ట్రం. ఇంతటి ఖ్యాతి గడించిన మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు పాడటమేంటి, అలాగే పక్క రాష్ట్రాల వాళ్ళు ఆ పాటకి సంగీతాన్ని అందించడమేంటి.. అలా చేయడం అంటే మన తెలంగాణ కళాకారులని అవమానించడమే అవుతుంది. ఇది మీరు గ్రహిస్తారని తెలంగాణ సినీ మ్యూజిషియన్స్‌ అసోసియేషన్‌ కళాకారులుగా కోరుతున్నాము.ఎంతో ప్రతిభావంతులు మన తెలంగాణాలో ఉన్నారు. మన తెలంగాణ కళాకారులకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చి తెలంగాణ కళాకారులకి గౌరవాన్ని ఇస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని వివాదాలకు దూరంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలంగాణ పిల్లలతో ఒక బృంద గానంగా పాడించి విడుదల చేస్తే... ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అనే గీతంలా గౌరవింపబడుతుందనేది మా అభిప్రాయం. ఇది మా సలహా మాత్రమే. ఈ చారిత్రక గీతాన్ని ఒక చారిత్రక తప్పిదంగా చేయకూడదని మిమ్మల్ని కోరుకుంటూ.... తెలంగాణ సినీ మ్యూజిషియన్స్‌ అసోసియేషన్‌.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) అప్ కమింగ్ మూవీ  పుష్ప 2 (pushpa 2) ఈ మూవీకి ముందు  ఆగస్టు 15 డేట్ కి ఉన్న స్పెషల్ ఏంటని అడిగితే.. ఇది కూడా ఒక ప్రశ్ననా..  ఆ రోజు ఇండియాకి  స్వాతంత్రం వచ్చిన రోజు అని చెప్తారు. కానీ ఇప్పుడు పుష్ప 2 కూడా ఉందిగా అని అంటున్నారు. అంతలా పుష్ప 2 భారతీయుల్లో భాగమయ్యిపోయింది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న ఒక న్యూస్ పుష్ప రేంజ్ ని చెప్తుంది       పుష్ప  2  రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ అన్ని ఏరియాల  బిజినెస్ లో కూడా వేగం పెరిగింది. నార్త్ అమెరికాలో   సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది.   ఏకంగా 60 కోట్ల మేర బిజినెస్ పూర్తి చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.  ఈ మధ్య కాలంలో ఏ హీరో  సినిమాని చూసుకున్నా కూడా ఇదే హయ్యస్ట్ ఫిగర్.. మరి ప్రభాస్ కల్కి ఎంత బిజినెస్ చేసుకుందో తెలియాలి.అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల తో పాటు  ఓటిటి హక్కులు, నార్త్ ఇండియా మార్కెట్ లో కూడా  కనీ వినీ ఎరుగని రీతిలో బిజినెస్ చేసుకుంది. వాటి వివరాలు త్వరలోనే బయటకి రానున్నాయి.     ఇక  పార్ట్ 1 హిట్ కావడంతో  పార్ట్ టూ పై  అందరిలోను  భారీ అంచనాలు  ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే పుష్ప 2 ఎప్పటికప్పుడు సరికొత్త హంగులతో ముస్తాబవుతు వస్తుంది.  యానిమల్ తో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన త్రిప్తి డిమ్రి (tripti dimri)బన్నీ తో కలిసి పుష్ప 2 కి సంబంధించిన  ఐటెం సాంగ్ లో  చిందులేయనుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా  అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్, ఫహాద్ ఫాసిల్ తదితరులు కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన పుష్ప సాంగ్ అయితే సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తుంది. సుకుమార్ దర్శకుడు గా వ్యవహరిస్తున్నాడు  
మరో కొత్త సంచలనానికి ఇంకా నెలరోజులు సమయం ఉంది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కొత్త సినిమా ‘కల్కి 2898ఎడి’ చిత్రం జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్‌ అభిమానుల్ని థ్రిల్‌ చేయనుంది. ఈ సినిమాకి సంబంధించి వస్తున్న ఒక్కో అప్‌డేట్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిన ‘బుజ్జి’ని పరిచయం చేసింది చిత్ర యూనిట్‌. దాని కోసం ఓ భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేసి ప్రేక్షకులకు, అభిమానులకు కనువిందు చేశారు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి మహామహులు ఈ సినిమాలో భాగం కావడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ రోజురోజుకీ పెరిగిపోతోంది.  ఇటీవల జరిగిన బుజ్జి, భైరవ ఈవెంట్‌లో విచిత్రంగా ఉండే వాహనం బుజ్జిని డ్రైవ్‌ చేస్తూ ప్రభాస్‌ అందర్నీ అలరించాడు. తాజాగా బుజ్జి వాహనాన్ని అక్కినేని నాగచైతన్య కూడా నడిపాడు. దాన్ని డ్రైవ్‌ చేసిన అనుభవాన్ని తెలియజేస్తూ.. తాను బుజ్జిని చూసి బాగా షాక్‌ అయ్యానని అన్నారు. బుజ్జిని తయారు చేయడం కోసం ఇంజనీరింగ్‌లో వున్న రూల్స్‌ అన్నింటినీ బ్రేక్‌ చేశారని చిత్ర యూనిట్‌ని ప్రశంసించారు. నాగచైతన్య.. బుజ్జిని డ్రైవ్‌ చేసిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది చిత్ర యూనిట్‌.
  ఆర్జీవీ ఎవరైన అమ్మాయిని పొగిడినా కలిసినా నెట్టింట ఆ వార్త వైరల్ అవుతుంది. అలాగే కొంతకాలం క్రితం ఇన్ స్టాగ్రామ్ లో ఓ అమ్మాయి శారీలో అందంగా ఉందని.. ఆ అమ్మాయి అడ్రెస్ ఎక్కడ అని ఓ పోస్ట్ చేశాడు. ఆ తర్వాత తను ఫుల్ పాపులర్ అయింది. దాంతో తను ఆర్జీవీని కలిసింది. ఆవిడే శ్రీలక్ష్మీ సతీష్. శ్రీలక్ష్మీ సతీష్ కాస్త ఆరాధ్యదేవిగా మారిన సంగతి తెలిసిందే. ఇన్ స్టాలో చీరకట్టుతో రీల్ వీడియోలు చేసుకుంటూ ఉండే శ్రీలక్ష్మీ సతీష్ వర్మ కంట్లో పడటం.. ఆమె శారీ అనే మూవీని తీస్తానని అప్పుడే ప్రకటించడం అందరికి తెలిసిందే. వర్మ ఈ బ్యూటీ మీద కన్నేసిన తరువాత ఆమె ఫాలోయింగ్ ఎక్కువగా పెరిగింది. లక్షల్లో ఫాలోవర్లు వచ్చి పడ్డారు. తాజాగా తను నెటిజన్లతో మాట్లాడింది. అందులో ఓ నెటిజన్.. నీ ఏజ్ ఎంత అని  అడిగాడు. 22 అని చెబితే చాలా మంది నమ్మలేదు. హైట్ ఎంత అని అడిగితే.. 5 ఫీట్స్ 8 ఇంచెస్ అని చెప్పింది. ఇక నీ షేపులు, కర్వ్స్ అంటే చాలా ఇష్టం, అదే నీలోని అందం అంటూ చాలా మంది పొగిడేశారు. అయితే ఆ షేపులు, కర్వ్స్ అంత ఈజీగా రాలేదని, ఎన్నో త్యాగాలు చేశాను.. ఎంతో వర్కౌట్ చేశాను.. ఎంతో కష్టపడితే వచ్చిందని ఆరాధ్య చెప్పుకొచ్చింది.  ఆరాధ్య దేవీ ఇండస్ట్రీకి రావటానికి చాలా సమస్యలు ఎదుర్కుందని చెప్పింది. ఒకప్పుడు తన మీద కూడా బాడీ షేమింగ్, ట్రోలింగ్ వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇక ఈ పొట్టి బట్టల్లో కనిపించే దాని కన్నా.. నిండుగా చీరకట్టులో కనిపిస్తేనే అందంగా ఉంటావ్ అని ఓ నెటిజన్ అంటే.. తనకు శ్రీదేవీ అంటే చాాలా ఇష్టమని, ఆవిడ ఎలాంటి దుస్తుల్లోనైనా అందరినీ ఆకట్టుకునేది.. నేను కూడా అలానే ఓ నటిగా అన్ని రకాల దుస్తుల్లో అందరినీ మెప్పించేందుకు ప్రయత్నిస్తాను అని  ఆరాధ్య చెప్పుకొచ్చింది. ఆర్జీవీ కంట్లో పడితే ఈ బ్యూటీ అయిన హిట్ లిస్ట్ లో ఉండాల్సిందేనని నెటిజన్లు అంటున్నారు. మరికొందరు ఆర్జీవీ ఖాతాలో మరో పాప అని కామెంట్లు చేస్తున్నారు.
ఒకప్పుడు సినిమా చూడాలంటే ప్రేక్షకులకు థియేటర్లే శరణ్యం. అందుకే అప్పుడు థియేటర్ల పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేది. ఇప్పుడు ఉన్న మాధ్యమాలు అప్పుడు అందుబాటులో లేకపోవడంవల్ల ఎగ్జిబిటర్లకు నష్టం అనే మాట వినిపించేది కాదు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ థియేటర్ల అవసరం తగ్గుతూ వచ్చింది. దశలవారీగా జరిగిన ఈ మార్పుతో దేశంలోని ఎన్నో థియేటర్లు మూతపడ్డాయి. మరికొన్ని నష్టాలతోనే నడుస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ సమస్య మరింత ఎక్కువైంది. ఈ ఏడాది నాలుగు నెలలపాటు థియేటర్లకు సరైన ఫీడిరగ్‌ లేకపోవడంతో కొన్ని రోజులు థియేటర్లను బంద్‌ చెయ్యాలన్న ఆలోచన కూడా చేశారు.  ఈ క్రమంలోనే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి నైజాంలో షేరింగ్‌ పద్ధతిని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నిర్ణయం పట్ల టాలీవుడ్‌లోని చాలా మంది నిర్మాతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.  దీనిపై స్పందించిన నిర్మాత బన్ని వాసు నాలుగు నెలలు వ్యాపారం లేనంత మాత్రాన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న నిర్ణయం దీనికి పరిష్కారం కాదంటున్నారు. ఈ షేరింగ్‌ అగ్రిమెంట్‌ వల్ల చిన్న సినిమాల నిర్మాతలు బాగా నష్టపోతారని అభిప్రాయపడుతున్నారు. భారీ సినిమాల్లా చిన్న సినిమాలకు ఓపెనింగ్స్‌ ఆశించినంత ఉండవని, తొలి వారంలో సినిమాకి వచ్చిన టాక్‌, మౌత్‌టాక్‌, రివ్యూల ఆధారంగా రెండో వారం నుంచి కలెక్షన్స్‌ పెరుగుతాయంటున్నారు బన్నివాసు. ఆ సమయంలోనే వచ్చే ఆదాయంలో 70 శాతం ఎగ్జిబిటర్‌కే ఇచ్చేస్తే చిన్న నిర్మాతల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్‌ అయిన చిన్న సినిమాల్లో ఎక్కువ శాతం రెండో వారం నుంచే లాభాల్లోకి వెళ్ళాయన్న విషయాన్ని అందరూ గుర్తించాలంటున్నారు.  తాను కూడా ఎగ్జిబిటర్నేనని, ఈ సంవత్సరంలో ఇప్పటివరకు రెండు కోట్ల రూపాయల వరకు తనకు నష్టం వచ్చిందని చెబుతున్నారు వాసు. తనకే అంత నష్టం వస్తే ఎన్నో థియేటర్లు కలిగి వున్నవారికి ఎన్ని కోట్లలో నష్టం వచ్చి వుంటుందో అంచనా వేసుకోవచ్చంటున్నారు. అయినప్పటికీ ఒక నిర్మాతగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు చేసుకున్న అగ్రిమెంట్‌ని తాను సమర్థించలేనంటున్నారు. ఎందుకంటే ఈ అగ్రిమెంట్‌ చిన్న నిర్మాతలను ఆర్థికంగా బాగా దెబ్బతీస్తుందని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఛాంబర్‌లో కూడా చర్చకు తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నానని బన్నీవాసు అంటున్నారు.  ఎగ్జిబిటర్లకు ఇంతలా నష్టం రావడానికి కారణం ఓటీటీలని, నిజానికి వాటిమీద పోరాటం చెయ్యాలన్నారు. ఒక సినిమా ఓటీటీకి రావడానికి కనీసం ఎనిమిది వారాల సమయం ఇవ్వాలన్నారు. కానీ, ఒక వారం నుంచి రెండు వారాలలోపే ఓటీటీలోకి సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇలాగే జరిగితే థియేటర్ల వల్ల తమకు ఆదాయం రాదని నిర్మాతలు భావిస్తారని, ఆ కారణంగానే సినిమాలు ఇంకా త్వరగా ఓటీటీలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. ఈ విషయంలో పోరాటం చెయ్యాల్సి ఉంది తప్ప ఇలాంటి అగ్రిమెంట్ల వల్ల నిర్మాతకు ఒరిగేదేమీ లేదని అభిప్రాయపడుతున్నారు వాసు. అసలు చిన్న సినిమాలే లేకపోతే థియేటర్లకు మనుగడ లేదని, పెద్ద సినిమాలు ఏడాది పొడవునా వుండవన్న విషయాన్ని ఎగ్జిబిటర్లు తెలుసుకోవాలని బన్నీవాసు అన్నారు. ఈ విషయాన్ని ఫిలింఛాంబర్‌తోపాటు ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ కూడా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు.
జబర్దస్త్ తో తెలుగు ప్రజల అభిమాన నటుడుగా మారిన హీరో  గెటప్ శ్రీను(getup srinu)హీరో అని ఎందుకు అంటున్నానంటే రీసెంట్ గా  రాజు యాదవ్ తో  సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిన్న  రెండు తెలుగు రాష్ట్రాల్లో  అత్యధిక థియేటర్స్ లో విడుదలయ్యింది.మరి  కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రాజు యాదవ్ (raju yadav) తొలి ఆట నుంచే  బాగుందనే టాక్ సంపాదించుకుంది. రాజు యాదవ్ క్యారక్టర్ లో  గెటప్ శ్రీను సూపర్ గా నటించాడని కొన్ని సీన్స్ లో కన్నీళ్లు కూడా తెప్పించాడనే మాటలు ప్రేక్షకుల దగ్గరనుంచి వినిపిస్తున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలి రోజు ఎనభై ఐదు లక్షలు సాధించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర సీడెడ్ లో కలుపుకొని నలబై ఏడు లక్షలు, నైజాం లో నలభై లక్షలు రాబట్టింది. మౌత్ టాక్ తో ఈ కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అలాగే మూవీ చూసిన వారందరు థియేటర్స్ లోనే రాజు యాదవ్ ని చూడండంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు  గెటప్ శ్రీను సరసన నూతన కధానాయిక అంకిత కారత్ చెయ్యగా వకీల్ సాబ్ ఫేమ్ ఆనంద్ చక్రపాణి ,నమని ప్రశాంత్ లు ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రశాంత్ రెడ్డి, రాజేష్, స్వాతి లు కలిసి సంయుక్తంగా నిర్మించగా కృష్ణమా చారి రచనా దర్శకత్వాన్ని అందించాడు.సురేష్ బొబ్బిలి, సంగీతాన్ని అందించగా చంద్రబోస్, కాకర్ల శ్యాం సాహిత్య రచన చేసారు  
అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ సినిమా ఎంతో ప్రత్యేకం. అంతేకాదు, అక్కినేని అభిమానులు కూడా ఆ సినిమాని ఎవర్‌గ్రీన్‌ మూవీగా భావిస్తారు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, సమంత, అక్కినేని నాగేశ్వరరావు, అఖిల్‌.. ఇలా ఫ్యామిలీలోని వారంతా కలిసి నటించిన ఈ సినిమాని అపురూపంగా భావిస్తారు అభిమానులు. ఈ సినిమా రిలీజ్‌ అయి పదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఇటీవల రిరిలీజ్‌ చేశారు. హైదరాబాద్‌ క్రాస్‌ రోడ్స్‌లోని దేవి థియేటర్‌లో ఈ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమాను మరోసారి వీక్షించేందుకు అక్కినేని ఫ్యామిలీతోపాటు అభిమానులు కూడా వచ్చారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున, నాగచైతన్య, సుప్రియ హాజరయ్యారు.  ఆల్రెడీ చూసిన సినిమానే అయినా మూవీని మళ్లీ చూస్తూ అందరూ ఎమోషనల్‌ అయ్యారు. ముఖ్యంగా సుప్రియ తాతని స్క్రీన్‌పై చూసి  పెట్టుకుంది. దీనికి సంబంధంచిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇదిలా ఉంటే నాగచైతన్య, సమంత రొమాంటిక్‌ సీన్స్‌కి థియేటర్‌లో అద్భుతమైన స్పందన వచ్చింది. అభిమానులు ఆ సీన్స్‌ వచ్చినపుడు రెచ్చిపోయారు. విజిల్స్‌ వేస్తూ, పేపర్స్‌ జల్లుతూ హడావిడి చేశారు. ఇది చూసిన నాగచైతన్య అసహనం వ్యక్తం చేస్తూ సీరియస్‌ అయ్యారు. ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 
ఎని లాంగ్వేజ్ హీరోయిన్ ని తీసుకోండి. అందరకి లక్ష్యం ఒక్కటే.. బాలీవుడ్ లో కూడా తమ సత్తా చాటాలని. తద్వారా నేషనల్ హీరోయిన్ అనిపించుకోవాలనే ఆశతో ఉంటారు. అది అత్యాశ కిందకి కూడా రాదు. నటిగా వాళ్ళకి ఉన్న హక్కు. రీసెంట్ గా సంయుక్త మీనన్ (Samyuktha Menon)కి కూడా బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. ఈ నేపథ్యంలో  ఆమె పోషిస్తున్న క్యారక్టర్ చర్చినీయాంశ మయ్యింది ప్రభుదేవా, ఒకప్పటి మాజీ హీరోయిన్  కాజోల్ ల కాంబోలో ఒక నూతన చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో  సంయుక్త మీనన్ కూడా నటించబోతుంది.దీంతో ఆమె తన అందచందాలని ఒక రేంజ్ లో ప్రదర్శించడం ఖాయమని అందరు అనుకున్నారు. ఎందుకంటే బాలీవుడ్ అంటేనే గ్లామర్ షో కి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు సంయుక్త ఎటువంటి గ్లామర్ రోల్ లో కనిపించడం లేదు.ప్యూర్ పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారక్టర్ లో కనిపించబోతుంది.దీంతో మొదటి సినిమాకే బాలీవుడ్ కి తన నటనలో ఉన్న సత్తా చూపించే అవకాశం వచ్చింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష లో ఆమె ప్రదర్శించిన నటనని ఎవరు అంత త్వరగా మర్చిపోరు.     2016 లో పాప్ కార్న్ అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత  పవన్ కళ్యాణ్ (pawan kalyan)హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ లో రానా కి జోడిగా నటించి తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరయింది.అక్కడనుంచి ఆమె సినీ ప్రస్థానం చాలా ఫాస్ట్ గా సాగింది.  టాప్ హీరోయిలకే సినిమాలు సరిగా లేకపోతుంటే తనకి  మాత్రం చేతి నిండా సినిమాలు. . తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలో కలిసి ఇప్పటి  వరకు ఇరవై సినిమాలకు పైనే చేసింది.  సార్,  విరూపాక్ష, బింబి సార,డెవిల్ లాంటి చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. నిఖిల్ న్యూ మూవీ స్వయంభూ లోను చేస్తుంది    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  నేటి కాలంలో చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. కొందరి ప్రేమకథ పెళ్లికి దారితీయదు. ఏదైనా ప్రేమ బంధం దృఢంగా ఉండాలంటే సద్గురువు చెప్పిన ఈ మాటలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.  కొన్నిసార్లు ఇది బంధాన్ని విజయవంతం చేయడానికి సరిపోదు. బంధంలో నివసిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య అలాంటి కొన్ని సమస్యలు తలెత్తుతాయి. వారు తమ కోసం వేర్వేరు మార్గాలను ఎంచుకోవాలి.  వివాహాన్ని ప్రేమకు గమ్యస్థానంగా పరిగణించనప్పటికీ, జీవితాంతం కలిసి ఉండటమే అత్యంత అందమైన, పవిత్రమైన బంధం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు తమ ప్రేమికుడితో కలిసి కుటుంబాన్ని గడపాలని కలలు కంటారు. కానీ మీ ప్రేమను పెళ్లి దశకు ఎలా తీసుకురావాలో మీకు తెలియదు. అలాంటి వారికి సద్గురు సలహా ఉపయోగపడుతుంది. సంబంధాన్ని కాపాడుకోవడానికి సద్గురు సలహా: ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడైన సద్గురు, యువ తరం సమస్యలను బాగా అర్థం చేసుకుని, వారికి బాధ కలిగించకుండా వాటిని ఎలా పరిష్కరించాలో తెలిసిన మత గురువులలో ఒకరిగా పరిగణిస్తున్నారు. ప్రేమ సంబంధాన్ని మెరుగుపరచడానికి.. అతను ఇచ్చిన చిట్కాలను అనుసరించడం ద్వారా, మీరు మీ సంబంధాన్ని ప్రతి సమస్య నుండి కాపాడుకోవచ్చు. దానిని విజయవంతం చేయవచ్చు. ఈ విషయం మాత్రమే ప్రేమ సంబంధాన్ని విజయవంతం చేస్తుంది: సద్గురు చెప్పినట్లుగా, మీలో ఉన్న ప్రేమ సఫలీకృతం కావాలంటే, మీరు ముందుగా ఓడిపోవడం నేర్చుకోవాలి, ఎక్కువ కాలం ఉండకూడదు లేదా అంతం కాదు. మీ సంబంధాన్ని గెలవాలంటే మీరు ప్రేమలో ఓడిపోయిన వ్యక్తి అయి ఉండాలి. సంబంధంలో జీవిస్తున్న ఇద్దరూ దీనిని అర్థం చేసుకున్నప్పుడు, వారి జీవితమంతా ఏదీ వారిని వేరు చేయదు. వారి ప్రేమ అజరామరం. ప్రేమలో ఓడిపోవడం అంటే ఏమిటి? జీవితంలో ఎప్పుడూ ఓడిపోకండి, కానీ మీ ప్రేమికుడితో మీ సంబంధాన్ని చిరస్థాయిగా మార్చుకోవడానికి మీరు ఓడిపోవడం మంచిది. యుద్ధాల్లో గెలవాలంటే ఓడిపోయినట్లే, ప్రేమ కూడా వీటిలో ఒకటి మాత్రమే. అయితే అంతకు ముందు రిలేషన్ షిప్ లో లూజర్ అంటే అర్థం తెలుసుకోండి. మీ భాగస్వామి కోసం ఏదైనా చేయండి: ప్రతి ఒక్కరూ ప్రేమలో లావాదేవీల గురించి మాట్లాడుతారని సద్గురు చెప్పారు. అయితే అందులో ఓడిపోయిన వారిని ఎంచుకుంటేనే మీరు మీ ప్రేమ వ్యవహారాన్ని విజయవంతం చేయగలరు. దీని కోసం మీరు కోల్పోయేది ఏమీ లేదు. మీ భాగస్వామి నుండి మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ చేయడం అంటే. ఇలా చేయడం వల్ల మాత్రమే ప్రేమ పెరుగుతుంది. సంబంధాలు చిరస్థాయిగా ఉంటాయి. అటువంటి వ్యక్తుల సంబంధం విజయవంతం కాదు: ఇతరులు మీ నుండి తీసుకోవాలని మీరు ఎల్లప్పుడూ ఆశించినట్లయితే, ఎవరూ మీతో సంబంధాన్ని కలిగి ఉండకూడదని సద్గురు వివరిస్తున్నారు. మీరు ఎల్లప్పుడూ మీ గురించి ఆలోచించకూడదు: రిలేషన్‌షిప్‌లో ప్రతి ఒక్కరికీ కొన్ని అంచనాలు ఉంటాయి. భాగస్వామి మీతో నిజాయితీగా ఉండాలి, మిమ్మల్ని గౌరవించాలి, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు. అంతే కాకుండా అనవసరమైన అంచనాల భారాన్ని వారి భుజాలపై వేసుకోవడం సరికాదు. ఇది మీ సంబంధాన్ని నాశనం చేస్తుంది. విజయవంతమైన ప్రేమ సంబంధం అంటే ఏమిటి? ప్రేమ సంబంధం  విజయం ప్రతి జంటకు భిన్నంగా ఉంటుంది. కొందరు వివాహ దశకు చేరుకోవడం ద్వారా తమ సంబంధాన్ని విజయవంతంగా భావిస్తారు, కొందరు దీనిని ఎల్లప్పుడూ ఒకరికొకరు సుఖంగా ఉన్నట్లు భావిస్తారు, తద్వారా మూడవ వ్యక్తి రాక వారి సంబంధాన్ని మార్చదు.
ఈ ప్రపంచంలో వ్యక్తులకు న్యాయం జరిగేలా చూసేది న్యాయవ్యవస్థ. స్వాతంత్య్రం పొందిన ప్రతి దేశంలో న్యాయవ్యవస్థ ఉంది. ఈ న్యాయ వ్యవస్థ అనేది ఈనాటిది కాదు. ఒకప్పుడు రాజ్యాల పేరుతో ఈ భూమండలాన్ని పాలించిన రాజులు, రాణులు కూడా న్యాయవ్యవస్థను పాటించారు. ఎక్కడో కొందరు నియంతలు మాత్రం తాము చెప్పిందే వేదమనే ధోరణిలో రాజ్యపాలన చేశారు. అయితే ఇదంతా అధికారం చేతిలో ఉన్నవాళ్లకే తప్ప సాధారణ పౌరులు తలవంచుకుని పోయే పరిస్థితులే ఉండేవి.  దేశాలు నాగరిక ప్రపంచంలో అడుగుపెట్టినా, ఎంత అభివృద్ధి సాధించినా మహిళలకు న్యాయం అనేది విభిన్నంగానే ఉండేది, బడుగు బలహీన వర్గాలకు బానిసత్వం తప్ప న్యాయం అనే పదానికి తావుండేది కాదు. ఈక్రమంలో ఎన్నో పోరాటాలు, మరెన్నో నిరసనలు, ప్రపంచం మీద కాలుతున్న కత్తిపై సమ్మెట దెబ్బల్లా మారాయి. ఫలితంగా న్యాయవ్యవస్థలోని వివిధ స్థాయిలలో మహిళలకు సమాన మరియు సంపూర్ణ భాగస్వామ్యం వైపు అడుగులు పడ్డాయి.   ప్రతి సంవత్సరం మార్చి 10న అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. న్యాయస్థానాలు మహిళా న్యాయమూర్తులకు తగిన ప్రాధాన్యత ఇస్తూ.. మగవారితో సమానంగా ఆడవారు ఉండాలని భావించారు. జనాభాకు ప్రాతినిధ్యం వహించడానికి, వారి ఆందోళనలకు ప్రతిస్పందించడానికి, సమర్థ నిర్ణయాలను జారీ చేయడానికి న్యాయవ్యవస్థలో మహిళల పాత్ర చాలా కీలకం. మహిళా న్యాయమూర్తులు తమ విధులకు హాజరు కావడం ద్వారా న్యాయస్థానాల విశ్వసనీయతను పెంచుతారు, వారు బహిరంగంగా న్యాయం కోరుకునే ఎవరికైనా అందుబాటులో ఉంటామనే బలమైన సందేశాన్ని, భరోసాను ఇస్తారు.  సహజంగా ఓ కుటుంబంలో మహిళల నిర్ణయాల కంటే పురుషుల అభిప్రాయాలకు ప్రాధాన్యత, వారి నిర్ణయాలే పైచేయిగా ఉంటాయి. సమాజంలో ఇక మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. స్త్రీలు ఎప్పుడూ పురుషుల కంటే తక్కువ అని భావించబడుతున్నారు, అందువల్ల జీవితంలోని వివిధ రంగాలలో సమాన ప్రాతినిధ్యం ఇవ్వబడలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కానీ అవి అలానే కొనసాగుతున్నాయి. గత సంవత్సరం, దోహాలో జరిగిన UNODC గ్లోబల్ జ్యుడీషియల్ ఇంటెగ్రిటీ నెట్‌వర్క్ యొక్క రెండవ ఉన్నత-స్థాయి సమావేశంలో, ప్రెసిడెంట్ వెనెస్సా రూయిజ్, ఖతార్ ప్రధాన న్యాయమూర్తి సంయుక్తంగా మహిళా న్యాయమూర్తుల విజయాలను గౌరవించే అంతర్జాతీయ దినోత్సవ ఆలోచనను ప్రతిపాదించారు.  కోర్టు బెంచ్‌లో సమాన సంఖ్యలో పురుషులు మరియు మహిళలు ఉండటం న్యాయవ్యవస్థ  నిష్పాక్షిక తీర్పుల సామర్థ్యాన్ని పెంచుతుంది. మహిళా న్యాయమూర్తులు ధర్మాసనానికి విభిన్న దృక్కోణాలను అనుభవాలను అందిస్తారు, వారు సేవ చేసే సమాజాన్ని చిత్రీకరిస్తూ మానవ హక్కులు, చట్ట నియమాలను రక్షించే న్యాయవ్యవస్థ సామర్థ్యంపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేస్తారు. నాయకత్వ స్థానాల్లో ఉన్న మహిళలు అవినీతిని ఎదుర్కోవడానికి, కుట్రలను నాశనం చేయడానికి కూడా సహాయపడతారు. మహిళా న్యాయమూర్తులను గతంలో నిషేధించారు కానీ తరువాత వీటిని తిరిగి చేర్చడం ద్వారా న్యాయ వ్యవస్థలను మరింత పారదర్శకంగా వారు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. న్యాయ వ్యవస్థలు, నిర్వాహక నాయకత్వ సంస్థలు, ఇతర స్థాయిలలో మహిళల అభివృద్ధి కోసం సంబంధిత విజయవంతమైన జాతీయ విధానాలు, ప్రణాళికలను స్థాపించడానికి మరియు అమలు చేయడానికి నిబద్ధత ఏర్పడింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క మహిళ చేయాల్సిన కొన్ని పనులను చూస్తే.. •ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కుల కోసం ఒక స్టాండ్ తీసుకోండి మీరు ప్రస్తుతం మహిళల కోసం మాట్లాడటానికి మీ వాయిస్‌ని ఉపయోగించవచ్చు. ఈ రోజున, సోషల్ మీడియాలో లింగసమానత్వం మీకు ఎందుకు ముఖ్యమైనదో షేర్ చేయవచ్చు.   •మహిళా శక్తిని ప్రోత్సహించండి మహిళలు తమ హక్కుల కోసం తమ మద్దతును చూపించడానికి మరిన్ని అవకాశాలను ప్రోత్సహించండి. మహిళా సాధికారతను పెంపొందించడానికి కొన్ని ఆలోచనలు మహిళల కోసం మాత్రమే ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను రూపొందించవచ్చు. •అణగారిన మహిళలకు న్యాయవాది ప్రాథమిక అవసరాలు లేదా హక్కుల విషయానికి వస్తే అందరికీ సమాన హక్కు లేదు. సమాజం ద్వారా వారి ప్రాథమిక అవసరాలు ఏర్పాటయ్యేలా చేయడం, మానవ హక్కులను కోల్పోతున్న మహిళల కోసం మీరు ఎక్కడెక్కడికో వెళ్లి సహాయం చేయలేకపోయినా మీ చుట్టూ  ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి. న్యాయం విస్తృతమవ్వాలంటే.. న్యాయవ్యవస్థలో మహిళల సంఖ్య పెరగాలి. ◆నిశ్శబ్ద.
ఈరోజుల్లో యువతలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పెరగడం బాధాకర విషయం. ఇంచుమించు వార్తా పత్రికలలో ప్రతిరోజూ ఆత్మహత్య సంఘటల్ని చూస్తున్నాము. ఆత్మహత్య గురించి ఆలోచించడం చాలా తెలివి తక్కువ పని. మానవ శరీరం దేవుడిచ్చిన విలువైన బహుమతి. చిన్న చిన్న విషయాల కోసం ప్రాణాలను విడవటం మంచిదికాదు. పిరికిపందలు,బలహీన మనష్కులే జీవితపు సవాళ్ళను ఎదుర్కోవడానికి భయపడతారు. అటువంటివారే ఇటువంటి తెలివితక్కువ పనులకు ఒడిగడతారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా సవాళ్లను ఎదుర్కునేవాడు ఎప్పుడూ ఇలాంటి ఆలోచన చేయడు. ఆ సవాళ్లకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తాడు. చాలామంది తమ కోరికలు నెరవేరలేదు అని నిస్పృహ చెంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మనకు ఏది ప్రాప్తమో అదే దక్కుతుంది అనే సత్యాన్ని గ్రహించుకోలేరు. చిత్తశుద్ధితో, నిజాయితీతో పనిచేసి మనకు ఆ అర్హత కలిగించే శక్తిని ఎందుకు పెంచుకోకూడదు. ఓ క్షణం ఆలోచిస్తే ప్రాణం తీసుకోవడానికి మించిన ధైర్యం ఈ లోకంలో ఇంకోటి ఉందని నేను భావించను. అలాంటి నీ ధైర్యాన్ని కొంచెం నీ జ్ఞానికి జత చేసి సమస్యపై పోరాటం చేస్తే అసాధ్యమైనా సుసాధ్యం కాగలదు. కష్టాల్లో మన మనసు ఆలోచనా విధానం రాకెట్ వేగంతో ఉండాలి. మన నిర్ణయాలు,కార్యాచరణ మిస్సైల్ లా సాగాలి. మనో నిబ్బరాన్ని మించిన ఆయుధం ఇంకోటి లేదు. అది ఎప్పుడూ కోల్పోకూడదు. కనుక చిన్న చిన్న విషయాలకు ప్రాణాలను త్యజించి ఎంతో విలువైన జీవితాన్ని కోల్పోయి దేవుడు ఇచ్చిన దేహాన్ని హత్య చేసి వెళ్లిపోతే దేవుడు కూడా క్షమించడు. ◆ వెంకటేష్ పువ్వాడ  
సీజన్ల వారిగా లభించే పండ్లలో నేరేడు పండ్లు కూడా ప్రముఖమైనవి.  వేసవి కాలం ఇక ముగుస్తుందనగా మార్కెట్లలోకి చొచ్చుకువచ్చి సందడి చేసే నేరేడు పండ్లు రుచిగా ఉండటమే కాదు, బోలెడు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. వైలెట్ కలర్ లో ఉంటూ ఉప్పగా, వగరుగా ఉండే ఈ నేరేడు కాయలు  క్రమంగా నల్లగా మారి నిగనిగలాడుతూ చెప్పలేనంత తియ్యదనంగా మారుతాయి.  జామూన్ ఫ్రూట్ గా పిలిచే ఈ నేరేడు లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యం దీనికున్న ప్రత్యేక లక్షణం. అయితే నేరేడు పండ్లు అందరూ తింటారు. కానీ గింజలు ఉపయోగించే వారు తక్కువ. నేరేడు పండ్లలానే వాటి గింజలు కూడా అంతే ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే అవి మధుమేహం నియంత్రించడంలో అద్భుతాలు చేయడమే కాకుండా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. నేరేడు గింజల పొడి ప్రయోజనాలను తెలుసుకుంటే నేరేడు పండ్లు తినగానే ఆ విత్తనాలను ఇకమీదట పడెయ్యరు. నేరేడు గింజలు పొడి తీసుకోవడం ద్వారా కలిగే అయిదు అద్భుత ప్రయోజనాలు ఏమిటంటే.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి, గ్లైకోసూరియాను తగ్గించడానికి నేరేడు విత్తనాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పండు గింజలు జంబోలిన్ మరియు జాంబోసిన్ అనే క్రియాశీల పదార్ధాలను కలిగి ఉంటాయి, ఇవి రక్తంలోకి విడుదలయ్యే చక్కెర రేటును నెమ్మదిస్తాయి. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. శాస్త్రీయంగా, ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంది, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఫలితంగా  మూత్రవిసర్జన, చెమటలను సహజంగా నిర్వహించడంలో సహాయపడుతుంది.  నేరేడు విత్తనాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణం కారణంగా, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టానికి వ్యతిరేకంగా పోరాడుతాయి, కాలేయ కణాలను రక్షిస్తాయి. ఇంకా ఈ గింజలు పొడిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి, ఇది కాలేయంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.  నేరేడు గింజల పొడిలో ఎల్లాజిక్ యాసిడ్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి రక్తపోటు వేగవంతమైన హెచ్చుతగ్గులను నియంత్రించడంలో  సహాయపడతాయి. నేరేడు గింజలు ఫ్లేవనాయిడ్లు, ఫినాలిక్ సమ్మేళనాల వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ అయిదు ప్రయోజనాలు పొందడానికి నేరేడు గింజల పొడిని తీసుకోవడం మంచిది. ◆నిశ్శబ్ద
ద్రాక్ష ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనది. దీని రుచి చాలా బాగుంటుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ద్రాక్షలో అనేక రకాలు ఉన్నాయి.  ఎరుపు, నలుపు,  ఆకుపచ్చ రంగులలో లభిస్తుంది. వీటిలో ఎర్ర ద్రాక్ష కాస్త ప్రత్యేకం. ఎర్ర ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. ఎర్ర ద్రాక్షలో విటమిన్ ఎ,  సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం, కాపర్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ  శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలు. ఎర్ర ద్రాక్ష వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓ లుక్కేస్తే...  రోగనిరోధక వ్యవస్థ.. ఎర్ర ద్రాక్షను క్రమం తప్పకుండా తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు ఎముకలతో పాటు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. కంటి ఆరోగ్యం.. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎర్ర ద్రాక్ష మంచి ఎంపిక. ఎర్ర ద్రాక్ష ఆక్సీకరణ ఒత్తిడిని,  కళ్ల మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎర్ర ద్రాక్షను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కంటిశుక్లం రాకుండా చేస్తుంది. బీపీ పై నియంత్రణ.. ఎర్ర ద్రాక్ష తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్,  ఫినోలిక్ యాసిడ్లు గుండెను వ్యాధుల నుండి రక్షించడానికి పని చేస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని  మెరుగుపరుస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యం.. ఎర్ర ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్,  యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కిడ్నీ సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి.  కిడ్నీ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియ.. ఎర్ర ద్రాక్షలో ఉండే పొటాషియం,  ఫైబర్  జీర్ణక్రియకు సహాయపడతాయి. జీర్ణ సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా ఎర్ర ద్రాక్షను ఆహారంలో చేర్చుకోవాలి. కొలెస్ట్రాల్‌.. ఎర్ర ద్రాక్ష కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది.  ఆహారంలో ఎర్ర ద్రాక్షను చేర్చుకోవడం ద్వారా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. ఇది జ్ఞాపకశక్తిని,  మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా అల్జీమర్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.                                                    *నిశ్శబ్ద.
ఆ స్ప్రిరిన్ ,వార్ ఫారిన్ మందులతో రక్త శ్రావం నిపుణుల పరిశోదనలో వెల్లడి.. ఒకవేళ మీరు రక్తం పల్చబడేందుకు వాడే మందులు అవసరం లేదని.వాస్తవానికి సహజంగా రోగులకు ఇచ్చే బ్లడ్ తిన్నర్స్ అస్టిలిన్ ను తీసుకోవడం మానాలని దీనివల్ల అధిక రక్తశ్రావం  జరగడం వల్ల వచ్చే పరిణామాలు నియంత్రించ కుంటే ముప్పే.7౦౦ మందిపై జరిపిన పరిశోదనలో మిచిగన్ లోని క్లినిక్ లో వీనస్ త్రాంబో  ఎంబాలిజం లేదా గడ్డ కట్టడం లేదా ఆర్టియాల్ ఫైబ్రి లేషన్ లో గుండె సరిగా కొట్టు కోక పోవడం వల్ల గుండె పోటు వస్తుంది. రోగులకు సాధారణంగా లభించ్గే బ్లడ్ తిన్నేర్స్ వార్న్ ఫారిన్ గుండె సమస్య లేకపోయినా ఆస్ప్రిన్ తీసుకునే వారు అని పరిశోదనలో వెల్లడించారు.మనకు తెలిసిన విషయం  ఏమిటి అంటే ఆస్ప్రిరిన్  పెనేషియా డ్రగ్ కాదని కొంతమందిలో ఎక్కువశాతం రక్త్గ శ్రావం జరిగింది.అయితే క్లినిక్స్ లో అస్ప్రిరిన్ వినియోగం  తగ్గించే ప్రయాత్నం చేశామని పేర్కొన్నారు.  ఎవరికి అయితే అవసరం లేదో వారికి అస్ప్రిరిన్ ఇవ్వలేదని మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన కార్దియలజిస్ట్ హెల్త్ ఫ్రాంకల్ కార్డియో వాస్క్యులార్ సెంటర్ కర్దియలజిస్ట్ డాక్టర్ జాఫ్రీ బార్నేస్ అన్నారు.పరిశోదనలో ఎస్ప్రిరిన్ వినియోగం తగ్గించామని 46.6 % తగ్గించడం వల్ల రక్త శ్రావం తగ్గించగలిగామని రక్తశ్రావం ౩2.౩% వినియోగం తగ్గిందని వివరించారు. ప్రతి వెయ్యి మందిలో ఆస్పిరిన్ మానివేయడం వల్ల రక్త స్రావం తగ్గిందని పేర్కొన్నారు.అస్పిరిన్ ఆపడం వల్ల వచ్చిన ఫలితాలను జామా నెట్వర్క్ లో ప్రచురించారు.మేము పరిశోదన ప్రారంభించగానే అప్పటికే వైద్యులు అస్ప్రిరిన్ వినియోగం తగ్గించారని మాపరిశోదనలో రక్త శ్రావం వంటి సంఘటనలు పరిణామాలు తీవ్ర రక్త శ్రావం ఆపడం ద్వారారోగులను కాపాడగలిగా మని ఇంటర్నల్ మెడిసిన్ స్కూల్ జనరల్ ఫిజీషియన్లకు ఆరోగ్య శాఖ సిబ్బందికి  రోగుల కు బ్లడ్ తిన్నర్ గా అస్టిలిన్ ను వినియోగించరాదనిపరిశోధకులు సూచించారు. ఆస్టిలిన్ వాడే వారి కొంతమేర తక్కువ స్థాయిలో తగ్గించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు వెల్లడించారు.ఇందులో  రక్తం పల్చబడితే ఇతర మందులతో పాటు ఎస్ప్రిరిన్ ను పరిసీలించినట్లు తెలుస్తోంది.మరో పరిశోదనలో వార్ ఫారిన్ తీసుకుంటున్న రోగులలో అస్పిరిన్ అర్తియాల్ ఫైబిలేషణ్,వి టి ఇ వీనస్ త్రాంబో ఎంబాలిజం లో రక్త శ్రావం ఎక్కువగా ఉందని వార్ ఫారిన్ తీసుకున్న వారిలోనూ రక్తశ్రావం జరగడం గమనించారు.అస్పిరిన్ తీసుకునే వారిలో ఇలాంటి సమస్యలు గమనించమని అయితే రక్తం గడ్డకట్టడం కన్నా రక్త శ్రావం ఎక్కువజరిగిందని పరిశోధకులు వెల్లడించారు.కొంత మందికి అస్టిలిన్ ప్రాణాలు రక్షిస్తే కొంతమందికి ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చిన చరిత్ర ఉందని గుండెపోటు అవసరమైన సమయంలో గుండెకు స్టంట్ పెట్టాల్సిన  పరిస్థితి వచ్చిందని రక్త ప్రవాహం పెరగడం గుండె సంబంధిత రక్త్గానాళా లలో సమస్యలు ఉన్నవారికి అందించడం అత్యవరం లాభం. మనం ఎదుర్కున్న సవాలు ఏమిటి అంటే గుండె సంబందిత సమస్యలు లేనివారు సైతం అస్పిరిన్ తీసుకుంటే యాంటి కాగులెంట్ గా సూచించవచ్చని ప్రముఖ హేపటాలజిస్ట్ ప్రొఫెసర్ జోడాన్ స్చేఫెర్ జనరల్ మెడిసిన్ వివరించారు.ప్రాధమిక స్థాయిలో నివారణకు అస్పిరిన్ వాడతారని గుండెపోటుకు చాలా తక్కువ ప్రభావం ఉంటుందని వార్ ఫారిన్ వాడినట్లైతే గుండె పోటును ఎదుర్కునేందుకు వాడరాదని అస్పిరిన్ పై సమీక్షించాలని మీసంరక్షణ చూసేవారు లేదా మీ ఫ్యామిలీ డాక్టర్ వీటి ప్రభావం నుండి బయట పడితే కొంతమేరా ప్రాణ హాని తీవ్ర రక్త్గశ్రావాని నివారించవచ్చు.