Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 52

                                                           32
''అరికన్ జీవితవిదానం గురించి చెప్పడం వోకంతట సాద్యం కాదు.... అయినా నేను కన్నదీ విన్నదీ మీముందుంచటానికి ప్రయత్నిస్తాను. అతిది సత్కారంలో అరికనులు- ప్రపంచంలో ఎవరికి తీసిపోరని నా అభిప్రాయం, నేను చాలా, ప్రాచ్య పశ్చాత్యి దేశాలలో పర్యటించాను. ఆయా ప్రజల ఆదరాభిమానాలు నన్ను ఆనంద సాగరంలో మునకలు వేయించాయి...... అరికనులలో ఉత్సాహం, ఉద్వేగం అధికం. పట్టుదల అత్యధికం, కృషి అనన్యం. అసాధ్యమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, దాన్ని సాధించేందుకు రక్తతర్పమం చేగల జాతి అరికన్ జాతి అయినా వారి హృదయాలు ఆర్థంగా ఉంటాయి. ప్రాచ్యదేశాల సంస్కృతీ అంటే - ముఖ్యంగా భారతీయ కళలన్నా, సంస్కృతి అన్నా, వారికెంతో మక్కువ..... కొన్ని ఇతర దేశాలలోలాగా, నా ప్రయాణానికి  నిర్భంధాలుకావు. స్వేచ్ఛగా నేను దేశమంతటా తిరిగాను. అరికనుల వ్వవసాయ క్షేత్రాలు, ఫ్యాక్టరీలు, హోటళ్ళు, షాపులు, ఫిలిం స్టూడియోలు, నాటకశాలలు టేలివిజన్ కేంద్రాలు, పల్లె సీమలు, మహానగరాలు - అన్నీ తిరిగాను.  అన్ని చోట్ల నాకా ప్రజల్లోని జీవ చైతన్యమే కొట్టివచ్చినట్లుగా కనిపించింది. అతిధి సేవలో, శతాబ్దులుగా పేరు మోసిన భారతీయులు అరికనులను చూసి నేర్చుకోవలసింది. చాలా వుంది.  వారి కళాభిజ్ఞత, సాహిత్యపిపాస, లలిత కళల పట్ల వారికి గల ప్రగాఢానురాగం అనేక సందర్బాలలోనన్ను విచలితం చేశాయి.  అధునిక జీవనంలోని వైవిద్యాలన్నీ మనకాదేశంలో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి.....''
ఇంతవరకూ చదివి వినిపించి''ఎలా ఉంది?'' అన్నాడు.
మంజరి అదోలాగా తలపింకించింది.
'' నీకు నచ్చినట్లుగా లేదనుకుంటాను?'' అన్నాడు శర్మ.
'' నచ్చక పోవటమని కాదుగానీ, అరికనులకు టైర్ కొట్టినట్లుగా ఉన్నదేమోనని నా అనుమానం, నిజంగా - మీరూ, అలా ఫీలవుతున్నారా చలపతీ?'' అన్నది మంజరి.
''నేనంతగా గమనించలేదే!'' అని తప్పుకొన్నాడు చలపతి.
'' అంతో ఇంతో ఆకాశానికేత్తినమాట నిజమే! అందులో తప్పేమిటట? రేపు వారితో మనకు చాలా పనులున్నాయి. బోలిడంత డబ్బు మన ప్రాజెక్ట్ క్రింద ఖర్చు చెయ్య బోతున్నారు.... వారికి మన మిస్తున్నది ఎందుకూ కోరగాని  పుబ్లిసిటీయేనా ఇంకేమన్నాన?''  అని కోపగించుకోన్నాడు శర్మ.
''అక్కడ సినీ పరిశ్రమను గురించి యింకా రాయలేదా?''
''అన్ని టన్నుల సబ్బును నేను మాత్రం ఏం చేసుకోను బాబూ!'' అన్నది మంజరి నవ్వుతూ.
''సరుకుచూడండి'' అన్నాడు కనకసుందరం. అరడజను సబ్బు బిళ్ళలు బల్లమీద పెరుస్తూ '' మంచివాసన, త్వరగా అరగదు, వాటర్కంటెంట్, మిగతా సబ్బులన్నింటికన్నా తక్కువ, ఇలారుద్దితే మీగడలాంటి నురగ బోలెడంత వస్తుంది, చుడండి మీరే!''
''చూద్దాం !'' అన్నది మంజరి.
'' నాస్థితి చూసి రాజన్గరిక్కడకు పంపించారండి! మరేంలేదు.... ఈ సబ్బు మీరు వాడుతునట్లు, ఇది తమకెంతో నచ్చినట్లు ఓ సర్టిఫికేట్ ఇప్పించండి చాలు. మీ పేరు మీదుగా ఈ సరుకును అమ్ముకొంటాను'' అన్నాడు కనకసుందరం.
మంజరి మీలా అనలేకపోయింది. నిజానికిలాంటి వ్వవహారాలంటే ఆవిడకు గిట్టవు. అప్పు డెప్పుడో, వోపెద్ద సబ్బుల కంపెనీ వారు, తన అభిప్రాయంకోసం చాలా సార్లు తిరిగారు. పదే పదే అడిగారు. అయినా తను కాదన్నది. దేశంలో పేరుపొందిన స్టార్స్ అంతా ఈ  సబ్బునే వాడుతునట్లు పేపర్లో ప్రకటన లిచ్చారన్నారు. వాళ్ళు '' ఇందువల్ల మీకే వల్లమాలిన పుబ్లిసిటి!'' అన్నారు. తనూ ''ఛా పో'' అన్నది. తను మిగతావారందరి కన్నాగొప్పదాన్నన్నది. ఆ సన్యాసులు వాడే సబ్బును తను వాడమంటే, అది తనకు అవమానమే నన్నది. వాళ్ళిక నిరాశచేసుకొని పోయారు. వారి నైతే తను కసిరికొట్టింది. కానీ ఈ కనకసుందరాన్నలా అనడానికి లేదు. ఇతగాడు రాజన్ నుండి ఉత్తరం పట్టుకొచ్కాడు. ఇతన్ని కాదంటే రాజన్ ను కదన్నట్లే! రాజన్ తో తనకింకా చాలా వ్వవహారాలున్నాయి. కాబట్టి తనకిష్టమున్నా, లెకపోయినా, ఈ పని  చేయవలసిందే ! అయినా ఎందుకన్నామంచిదని చలపతి సలహా అడిగింది మంజరి.
''తప్పకుండా వొప్పుకో, డబ్బు ఎదురిచ్చి, సబ్బుల కంపెనీల ద్వారా, తల నూనెల మన్యుఫాక్చరర్సు ద్వారా, పబ్లిసిటీ ఇచ్చుకొంటున్నవారు పుంజీలకొద్దీ ఉండగాలేనిది, మనకేమయిందిట? నన్నడిగితే, ఈ తరహా ప్రచారం లేకపోవడం మనకొక లోటే నంటాను. 'నిజంగామంజరికంత కీర్తే ఉంటే ఏ సబ్బుల కంపెనీ, ఆమె నేందుకు ఉపయోగించుకో' దని ఎవరన్నా అడిగితే ఏమిటి చెప్పడం?'' అన్నాడు చలపతి.
'' ఏం రాయమంటారండీ?'' అన్నది మంజరి తపీగా.
''మీరేమీ రాయనవసరంలేదు. నేను రాసే పట్టుకొచ్చాను. తమరొకసారి చిత్తగించి, సంతకం  చేస్తేచాలు'' అన్నాడు కనకసుందరం.
మంజరి ఆకాగితాన్నందుకొన్నది.
'' ఈ సబ్బు నాకెంతో అభిమానము పాలమీగడ వంటి దీని నురగను, నా చర్మములోనికి సున్నితముగా అదుముకొందును. నా సౌందర్య రహస్యము ఈ సబ్బే!''
అని అందాల రాణి మంజరి చెప్పుచున్నది.
''ఇక్కడ మీ బొమ్మవేస్తా మండీ !'' అని, అప్లానంతా చూపించాడు కనకసుందరం.
మంజరి ఆ కాగితం మీద సంతకం చేసి నిట్టూర్చింది.
కనకసుందరం వెళ్ళిపోయాడు.
'' నువ్విలా బలవంతం చేస్తావనుకోలేదు చలపతి! లేకపోతే నిన్ను సలహా అడక్కనేపోదును'' అన్నది మంజరి ఆ తరువాత.
'' దీన్ని గురించి ఇంతగా నువ్వు మదన పడటం పూలిష్నెస్. నీ మార్లిన్ మన్రో లక్స్ సబ్బుల
కంపెనీ ఎడ్వర్ టైజ్ మెంటు కోసారి పోజిచ్చింది. కావలిస్తే జాబురాశికనుక్కో. కోన్ని పనులు కాదన్నా ఆగవు. జరిగిపోతాయి. అప్పుడెప్పుడో ఓ క్యాలెండర్ కంపెనీవాడు, నీ బొమ్మ నడిగితే వాణ్ణి తన్ని తగలేశావు. అయినా జరగవలసిందేదో జరిగిపోయింది. నీ అనుఅమతి  లేకుండానే, నీ బొమ్మతో వందరకాల కాలెండర్లు మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. వీళ్ళందరిమీదా నువ్వు కేసులు పెట్టలేవు. కోర్టులచుట్టు తిరగనులేవు. అలా చూసీ చూడనట్టు పోనిస్తుండాలి. నువ్వప్పుడే గనుక ఆ క్యాలెండరు కంపెనీ వాడి మాటను విన్నట్లయితే ఎంత బాగుండును. నువ్వు కదన్నాక, వాడు 'సరోజ' బొమ్మను తీసుకొన్నాడు. రెండు లక్షల క్యాలెండర్లు 'స్విస్' లో ప్రింట్ చేయించాడు.....'' అన్నాడు చలపతి.
''ఈ దఫా అలాంటి అవకాశమొస్తే జారవిడుచుకోను. సరా!'' అన్నది మంజరి మొండిగా.
చలపతి తనలో నవ్వుకొన్నాడు.
                                                   34
లలారాం నీళ్ళు నములుతూ కూచున్నాడు. మంజరి సోఫాలో జారగిల పడింది.
ఆమె చేతిలో వందరూపాయల నోట్లకట్టలు బంతుల్లాగా ఆడుతున్నాయి.
''ఊఁ తరువాత?'' అన్నది మంజరి.
''ఏం లేదు. ఇంతకన్నా నేను మాత్రం ఏం చేయగలనుమంజరి లోగడ నా పిక్చర్లన్నీ సెంచరీ కొట్టాయి. లక్షలకు నిలబడ్డాను. ఒకప్పుడు, నాదయా దాక్షిణ్యాలకోసం వీధివాకిల దగ్గర ప్రాణాచారం పడినవాళ్ళు కోట్లు ఆర్జించారు. నేను బికారినయ్యాను. ఇలా మారుతుందనుకోలేదు'' అన్నాడు లాలారాం.
''అంటే - ఇప్పుడు ప్రాణాచారంపడే దశ నీకు పట్టిందంటావ్.  అంతేనా?'' అన్నది మంజరి.
లలారాం మాట్లాడలేదు.
మంజరి అతనికేసి కొరకొర చూసి, ఓ నోట్లకట్టను, కాలితో అతనిమీదికి విసిరేసింది!.
''తీసుకో, నీకెంతకావాలో తీసుకో, నాపట్ల విశ్వాసంగా ఉంనంతకాలం నికొచ్సిన భయంలేదు.... పిక్చర్లు లేవని బెంగపడకు. ఇండో అరికన్ కల్చరల్ డెవలప్మెంట్ సొసైటీవారు పిక్చర్ తీస్తారు. అందులో నీకు తప్పకుండా ఛాన్స్ ఇప్పిస్తాను. డోంట్ వర్రీ'' అన్నది మంజరి.
''దాంక్యూ'' మేడమ్ అన్నాడు లలారాం '' ఇందులో ఎన్ని తీసుకోమంటారు?''
''నీక్కావలసినన్ని!''
''కాదు చెప్పండి!'' అన్నాడు లాలారాం మొహమాటపడిపోయి.
'' ఓ యబై నోట్లుచాలా?''
''అయిదు వేలా?''
''చలాకపోతే ఇంకో యాభై తీసుకో లాలూ! డబ్బును మనం సంపాదించాం. మనల్నది ఆడించకూడదు''.
లలారాం, నోట్లు లేక్కపెట్టడం చూసి పండ్లు కొరికింది మంజరి.
''చూడు లాలూ! ఇంకో చోట మంచి పని దొరికిందాకా, నువ్వు నా దగ్గరే ఉండు. నాకు గార్డియన్ వనుకో, పర్సనల్ సెక్రటరీ వనుకో, డైరెక్టర్ వనుకో, ఇంకోటనుకో - నా  కభ్యంతరం లేదు. కానీ, ఎక్కడా మన స్టేటస్ కు భంగకరంగా ప్రవర్తించకు '' అన్నది మంజరి.
''అలాగే !'' అన్నాడు లలారాం.
''ఇందాక తాజ్లో ఓ గమ్మత్తు జరిగింది. నేనూ,సితారా,హేమ, అనవర్, రూప, మనోజ్, కుంచీ - కూచున్నాం. ఏదో తిన్నాం. తాగాం. అయిపోయింది. సితారా వెయిటర్కు పది రూపాయలు బక్షీస్ ఇచ్చింది. అన్వర్ రెండు పదులిచ్సింది నేను రెండు వందనోట్లు కాలితో వాడి ముందుకు     విసిరాను. వాడానోట్లు కళ్ళకద్దుకోని,నాపాదాలు తాకి దణ్ణం పెట్టాడు.నా జరీ చెప్పులు జారిపోయాయి. జేబుగుడ్డతో  తుడిచి కాలికి తొడిగాడు.... చెప్పోచ్చిందేమిటంటే, అ సితారా పొగరు అలా అణిగిపోయింది. నేను చేసిన పని మంచిదంటావా కదా ?''అన్నది మంజరి.    
''మంచిదే!'' అన్నాడు లలారాం.
''ఆవిడకు సిషోర్ లో ఇల్లుందటగా?'' అన్నది మంజరి.
''ఉంది.... అవిడ కేమిటి? చాలామంది కావరసలో ఇళ్ళున్నాయి. భాను, అనవర్, కుంతి, ముంతాజ్, మాలా, తరుణి, వీరందరికీ, అక్కడే ఇళ్ళున్నాయి.
మద్రాసునుండి వచ్చిన జయంతి మాల, పద్మలత,  - వీళ్ళక్కూడా అక్కడే ఇళ్ళు కట్టారు''
''మనమూ కడదాం!''
లలారాం మాట్లాదలేదు.
''ఏం?'' అన్నది మంజరి.
'' మీరింకా, బొంబాయి పరిశ్రమలో స్థిరపడలేదనుకొంటాను.... ఏ వొక్క పిక్చరో హిందీలో సక్సెసయితే లభంలేదు. అల్లాగ - మూడు నాలుగు బొమ్మలు, దేశమంతటా హోరెత్తించాలి. అప్పుడు ప్రొడ్యూసర్ల్లు, నీ ఇంటి చుట్టూ కుక్కల్లాగా తిరగమంటే తిరుగుతారు. అందాకా మీరా ప్రయత్నం చేయడం మంచిదికాదు..... అనిసలహా ఇచ్చాడు లలారాం.
మంజరి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అయినా ఆవిడ, తన ఉద్రేకాన్నంతా అణుసుకొని,        '' అయితే ఏం చేద్దాం లలారాం?'' అని సలహా కొచ్చింది.
''మీకు తెలియందిలేదు. మద్రాసులో పరిస్థితులే ఇక్కడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కాంపీటీషన్  ఎక్కువ అవకాశాలు ఎక్కువే!'' అన్నాడు  లలారాం.
''తనోక్కో పిక్చర్కు, ఆరు లక్షలు తీసుకొంటుందట . సితార చెప్పింది మిగతా వాళ్ళుకూడా 'అవునవు'' నన్నారు నిజమేనా..... ?''
''కావచ్చు, ఇచ్చేవాళ్ళుంటే మీరు పదమూడు లక్షలు డిమాండ్ చేస్తారు..... సితారా, అన్వర్, మాలా, వీళ్ళందరకూ వేనక్కాతల మనుషులున్నారు. మీకు లేరు.
అంతే భేదం .... '' అన్నాడు లలారాం.
''నిజమే!'' అనుకొన్నది మంజరి.
''నేను అరికా వెళ్ళడానికి ముందుగా, ఎవరో 'త్రిపాఠి' అనీ 'జోగీందర్' అనీ నీవెంట వచ్చారే! వారేమయ్యారు?'' అన్నది మంజరి.
''ఉన్నారు, వారిప్పుడు లాభంలేదు. త్రిపాఠినీ మంజులత పట్టేసింది.  జోగీంధర్ ను అన్వర్ పట్టుకొన్నది. వారికామోజు వదిలిందాకా మనమేమీ కదలించలేం..... అవునుగానీ, లోగడ - చాలా జులకిందటనుకో సేఠ్ షన్ దాస్ తో నువ్వో సారి జుహులో కనిపించావే! జ్ఞాపకముందా?'' అన్నాడు లలారాం.
''ఆఁ లేకపోవమేం కర్మం. పరమ కర్కోటకుడు. బద్మాష్'' అన్నది మంజరి.
''అయినా కోటీశ్వరుడు చాలా ఫిలిం కంపెనీలకు అతనే నిజమైన ప్రొడ్యూసర్. నువ్వతన్ని పట్టగలిగితే బొంబాయంతట్నీ జయించినట్లే ! అతని మాటను చాలామంది కాదనరు''
''నాకప్పుడే అతనంటే అసహ్యమేసింది లాలూ! చాలామందిని మోసం చేశాడని విన్నాను. నిజమేనా?'' అన్నది మంజరి.
'' ఆఁ  ఎవర్నీ ఏమీ అనందే, కోట్లు పోగుపడటం అసంభవం! నీకతని మంచితనం కావాలా? డబ్బుకావాలా? అతనయినా, అంత సులభంగా బోల్తాపడే మనిషికాడు, ఢక్కాముక్కలు చాలా తిన్నవాడు. ఆతను నీకు చిక్కితే చాలు....... చక్రం అడ్డంగా తిప్పుతాను''.
''చూద్దాం!'' అన్నది మంజరి.
అనవర్, రూప,కుంతీ, కూడా అతన్ని గురించి లలారాం చెప్పినట్లే చెప్పారు.
''మేమందరం ఏదో వొరగపెడతాడని పోయిన వాళ్ళమే! చివరికి చేతులు   ఝాడించుకొంటూ వచ్చాం'' అన్నది రుప.
''నాకా వోపిక కూడా లేకపోయింది. రెండు రోజులపాటు కాల్ షీట్సన్నీ కాన్సిల్ చేయించుకొన్నాను. శరీరమంతా మాసం ముద్ద  లగాయింది... '' అన్నది కుంతి నవ్వి.
మంజరి ''ప్చ్'' అని చప్పరించేసింది?.
ఎదటివారికి అనుమానం కలక్కుండా ఉండేందుకు అలా నటించినా, నిజానికి దొక సవాలు కిందనే మంజరి భావించింది.
''ఇన్నేళ్ళ నా అనుఅభవం, నా తెలివితేటలు, వీడిముందు ఎందుకూ పనికిరాలేదంటే, విడేవడో లోకోత్తరపురుషుడన్నా మాటే! అలాంటి వాణ్ణి కాలికి బలపంకట్టి తిప్పినా విజయమే! వాడికి దాసోహమన్నా విజయమే!'' అనుకోన్నది మంజరి.
మూడు మాసాలపాటు ఆవిడ అహారాత్రులు శ్రమించింది. చివరికి ముక్కుకు తాడువేసి కిషన్ దాసును తన ఇంటికి లాక్కొచ్చి పడేసింది.
ఆ రోజున రాజామణికి రాసిన ఉత్తరంలో ఈ విషయం కూడా చేర్చింది మంజరి!
''కొంతకాలంపాటు వొక్కో మనిషి జాతకం అద్భుతంగా ఉంటుందనుకోటున్నాను! ఇప్పుడిప్పుడే, నా జీవిత చక్రం, సులభంగా తిరుగుతున్నది. వాణ్ణి చిత్రహింస పెట్టిగానీ వదలను.... ఇక్కడ ఇల్లుకట్టాలన్న ఆలోచనకొక రుపమిస్తున్నాను. బహుశా  మరో పదిరోజుల్లోస్థలం తెసుకోగల ననుకొంటాను, అందర్నీ కనిపెట్టి చూస్తూ ఉండు. వసంతకు, మరీ అంత అతుక్కుపోయి. ఆ శర్మగాడితో తిరగవద్దనిచెప్పు, వాడింకా ఆ పెళ్లిమైకంలోనే ఉంటే ఉండనీ, క్రమంగా, మైకం విడిలిపోయాక, వాడే తప్పుకొంటాడు. చలపతిగాడు, మరీ దుబారా చేస్తే, నువ్వే మందలించవచ్చును. వసంతకు మంచి మందు లిప్పించు.... నాకు మందిచ్సిన డాక్టర్ నీకూ తెలుసుగదా! విప్పుడప్పుడే నేను రావడం పడదు. ఉంటాను.....''
అని పూర్తిచేసింది మంజరి.
ఆవిడనుకొన్నట్లు పది రోజులలో స్థలనిర్ణయం జరగలేదు. అందుకోసం మల్లీ చాలా బాధలు పడవలసి వచ్చింది.
''మలబార్ హిల్స్ మీద బాగా ఉంటుంది!'' అని సలహా ఇచ్చాడు లలారాం.
''నీ సలహా అడిగినప్పుడు చెప్పు లాలూ! అనవసరంగా తొందర పడకు ''అని మందలించింది మంజరి.
లాలారాం తలొంచుకొని వెళ్ళిపోయాడు.
''నాకు మరోచోట, మరోచోట అవసరంలేదు. సితారా ఇంటి ప్రక్కనే కావాలి. అంతకన్నా రెట్టింపు ఎత్తూ, రెండింతల వైశాల్యమూ ఉండాలి.'' అన్నది మంజరి, సేఠ్ కళ్ళల్లోకి చూస్తూ.
''లాభంలేదు'' అని పెదవి విరిచాడు కిషన్ దాసుయ
మంజరి,  అతని చెంపమీద చిటుక్కు మనిపించింది గోముగా,
''ఆ మాటలనడానికి మీ రెందుకు సిగ్గుపడ్డారో నా కర్ధంకాదు. ఫలానా మంజరి. ఫలానా కొటీశ్వరున్ని నమ్ముకోని కూడా అద్దె కొంపలో ఉంటుందని నలుగురూ  అనుకోవడం, నాకు చిన్నతనమో, మీకు చీమ కుట్టినట్లు కూడా లేకపోతే నాకూ లేదు. కందకులేని దురద కత్తిపీటకెందుకుట?'' అని అన్నది మంజరి.
కిసాన్ దాసు అసలు సంగతి చెప్పాడు.
''అక్కడ స్థలంలేదు. ఉన్నదంతా సముద్రమే! దాన్ని కొని పూడ్చుకోవాలి. ఇల్లు కట్టే వేళకు, గజం వేయి రూపాయల ఖరీదుకు మానతు గిట్టుబాటవుతుంది!'' అన్నాడు కిషన్ దాసు.
''అయితే మానేద్దాం!''  అని చప్పున జారిపోయింది మంజరి.
కిషన్ దాసు ఉక్కిరి బిక్కిరయ్యాడు.
ఏదో ఉన్నదని అనుమానించాడతను.  కానీ ఏమున్నదో మాత్రం కనుక్కోలేక పోయాడు.
''స్థలమంటే, పదో పాతికో ఉంటుందనుకొన్నాను గానీ, ఇలా వేలకు వేలు తింటుదనుకోలేదు. మీరన్నట్లుగా, అన్నేసి వేలు నీళ్ళపాలు, రాళ్ళపాలు చేయడం నాకూ ఇష్టంలేదు. ప్రస్తుతానికి మనేద్దాం. తరువాత చూసుకొందాం'' అని నచ్చబలికింది మంజరి.
ఆ రాత్రి పదకొండు ప్రాతాల కిషన్ దాసు వెళ్ళిపోయాక, అనవర్ కు ఫోను చేసింది మంజరి.
గొంతు వింటూనే గుర్తుపట్టింది అనవర్.
''మీ పక్షి ఏం చేస్తునట్లు?'' అన్నది మంజరి నవ్వుతూ.
''మీదో ?'' అన్నది అనవర్.
''ఇప్పుడేపోయింది...... అయినా దోవకొచ్చేట్లులేదు. అనవర్, గడ్డితిని సంపాయించిన డబ్బెమోనని, లెక్కించి లెక్కించి ఖర్చు చేస్తాడు.... అందుక్కాదు. నా డబ్బుతో అలాంటి కొంపలు అరడజను కట్టగలను.... కానీ ఆ పని నాకిష్టంలేదు. ఇంకో వేధవాయ డబ్బుతో నేను ఇల్లు కడదామనుకోన్నాను..... అది నేనింకా అసంభవం అనుకోలేదు అనవర్ ..... నాకింకా నా మీద విశ్వాసం ఉంది.  నువ్వూ  విషయంలో నాక్కాస్త సాయపడితే పని సానుకూల మవుతుంది!''
అనవర్ పకపక నవ్వి-
''నేనుగానీ మీ పక్షికి కావాలట్నా?'' అన్నది.
 ''కాదు...... ఒకవేళ అంటే- ?'' అన్నది మంజరి.
''నీకోసం వోప్పుకొంటాను. నీకేమోగానీ, నాకూ మగవాళ్ళందరూ వోక్కలాగే కనిపిస్తారు మంజూ! జోగిందర్ కూ, కిసాన్ దసుకూ భేదంలేదు... '' అన్నది అనవర్.
''అదేం కాదు డార్లింగ్ ! కిషన్ దాసుకూ రేపో ఎల్లుండో మీ పక్షి కలుసు కోనేటట్లు చేసి,
ఊదరగొట్టి వోదలమని చెప్పు. కనిసం సిగ్గుపడయినా లోంగుతాడేమో చూద్దాం. ఈ పనే జరిగితే నీవు కోరిన బహుమానం'' అని ఊరించింది మంజరి.
''ఏమిస్తావ్?'' అన్నది  అన్వర్ ఎగతాళీ, ఇటు నిజమా గాని గోంతుతో.
'' నా దగ్గరున్న దేదికావాలన్నా నీకు సంకోచం లేకుండా ఇస్తాను'' అన్నది మంజరి.
''బహుశా నా నిజాయితి గురించి నీకు అనుమానం లేదనుకొంటాను''.
''ఎంతమాట మంజూ! నాకు చాలాకాలంనుండీ, పచ్చలహారం మీద మనస్సుంది.
అలాంటి దానికోసం నేను చాలా ప్రయత్నించాను.... ఎంత ఖరీదిచ్సినా ఇక్కడలాంటి పచ్చలు దోరకవన్నారు. మరి నువ్వెలా'' అన్నది అనవర్.
''ఆ మధ్య రేస్ లకు  రాజాభవానీ ప్రసాద్ వచ్చాడు అనవర్! అపుడతన్ని రేస్ గ్రౌండ్స్ లో కలిశాను..... గోప్ప రాసికుడు. సుఖపడటమంటే అతనిదగ్గరే చూడాలి. మనల్ని స్వర్గంలోకి తీసుకుపోతాడు. అతనిచ్చాడు. దాన్ని కాశ్మీర్ లో ఎవరో ముస్లిం జమిందార్ దగ్గర ''హారం కొన్నాట్ట అతను! తన జ్ఞాపకంగా నన్నంచుకోమని ఇచ్చాడు'' అన్నది మంజరి.
''పోనీ అలాగే ఉంచుకో !'' అన్నది అనవర్.
''కావాలన్నావుగదా మరి?''
''అన్నాను, దాని వెనుక ఇంత చరిత్ర ఉన్నదని తెలీక, పోనీ గానీ, నువ్వా హారం ఉంచుకొని, నాకా రాజాను పరిచయం చెయ్యి మంజరీ! ఆ సుఖమేపాటిదో నేనూ చూస్తాను.... సరే ఉంటాను. మా పక్షి గుటికోస్తున్నది. ఈ రాత్రే 'కీ' ఇచ్చి వాదులుతాను. దేబ్బకు దెయ్యం పోకపోతే అప్పుడడుగు'' ఫోన్ పెట్టేసింది అనవర్.
మంజరి సన్నగా ఈలవేసి, ఎగిరి మంచంమీద పడుకొంది. స్పింగ్ మట్రేన్ పైకి కిందకి ఊగిసలాడి మంజరికి జోల పాడినట్లయింది.
''మరీ ఈ అనవర్ ముండకు ఇంత శారీర కణుతెందుకో ఇదంతా నిజమే ననుకొన్నదన్న మాట! ఓసి నా పిచ్చి తల్లీ!''
మంజరి కళ్ళు మూసుకుంది.
చిత్రం!
పది నిమిషాలకలా ఆవిడకు హయిగా నిద్ర పట్టింది.
సితార ఇంటి వైశాల్యం అయిదు వందల గజాలు. మంజరి ఇల్లు అంతకు రెండు రెట్లు వైశాల్యం ఉండాలి. అంటే ఆవిడ పదిహేను వందల గజాల స్థలం కొనాలి. స్థలమంటే అక్కడ నెలేమీ ఉండదు. సముద్రాన్ని కొని మనమే పుడ్చుకోవాలి. డెవలప్ చేసిన భూమిలో మూడోవంతు కార్పోరేషన్ కిచ్చి మిగిలిన రెండు వంతుల్లోనూ, మనం ఇళ్ళు కట్టుకోవాలి. అక్కడి పద్దతి అదీ!
''నేను వద్దన్నానుగా! అంత డబ్బు వెదజల్లడం దేనికీ?'' అన్నది మంజరి.
''ఇది ప్రిస్టేజ్ కొశ్చిన్. నువ్వేమీ అనకు'' అన్నాడు సేఠ్ కిషన్ దాస్.
ఆమాట లంటునప్పటి కిషన్ దాసు ముఖ కవళికలు పరిశీలించింది మంజరి.
ఎందుకో ఆవిడ మనస్సు అనుమానంతో గిజగిజలాడి పోయింది.
''ఏం జరుగుతుందో చూదాం '' అనుకోన్న్దదావిడ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS