Previous Page Next Page 
పాకుడురాళ్ళు పేజి 45

మంజరి నిర్ణయం ఆవిడ కేమ్టగా ఉపయేగ పడిందో, అంత కన్నా ఎక్కువగా ఆవిడ విరోధుల కుపయోగించింది. పనిగట్టుకుని విరోధులంతా ఏకమయి, ఆమెను గురిచి చిలవలూ పలవలూ అల్లి ప్రచారం చేయ్యసాగారు. ఇలాంటి పుకారులు ఎంత వేగంగా వ్యాప్తిస్తాయో అనుభవమున్నవారికి గాని తెలీవు.
మంజరికి చిన్న పెద్ద తారతమ్యం పోయిందనీ,తోటి ఆర్టిస్టులను పురుగులను చూసినట్లు చూస్తున్నదనీ,ప్రొడ్యూసర్లునుకుక్కను విదిలించి నట్లు విదిలించి పారేస్తున్నదనీ ప్రచారం సాగించారు. ఆవిడకు తలబిరుచు తనం పెరిగిందన్నారు,కళ్ళకు పావురాలు కమ్మాయన్నారు. తన అభివృద్దికి కారణమయిన వారినే తూలనాడుతున్నాదనీ, ప్రేక్షకులను నిరసిస్తుందనీ అనేశారు.
ఈ ప్రచారం మంజరిదాకా వచ్చినప్పుడు ఆవిడ రవంత కలవరం చెందింది.
"నా జాతకం బావోలేదు చలపతీ! నా మంచితనం మట్టిలో కలసిపోతున్నది. నేనేమన్నా నలుగురూ ఆ పార్దం చేసుకుంటున్నారు" అనివాపోయింది మంజరి.
చలపతి ఏమీ అనలేదు.
"దీని కెవరు కారణమంటావ్ చలపతీ? అన్నది మంజరి.
"మీకు నిజంగా తెలీదా? అన్నాడు చలపతి.
ఆవిడ తెలీదన్నాక చెప్పకొచ్చాడు.
"ఇంతకు ముందు నువ్వున్నమాటే ఇప్పుడు నేనూ అంటున్నాను. నా మాటలకు నువ్వపార్డం చేసుకోనని హామీ యిస్తే తప్ప నేనేమనడానికి దైర్యం చాలదు" అన్నాడు చలపతి.
ఇదేదో పెద్ద విషయమేననుకోన్నది మంజరి.
చెట్టు వెళ్ళి గొడ్డలిలో ఇరుక్కోంటే తప్ప, అది కొమ్మల్ని నరకలేదని తెలుసుకొంటే దీనిక్కారణం నీకూ తేలిసోస్తుంది. మన వాళ్ళు,మనవాళ్ళుగా ఉండాలి గానీ, విభీషణలుగా మారిపోకూడదు.బ్రహ్మండమైనా లంకా నగరమే నాశనం కాగా లేనిది,ఓ మంజరి మీద ఇన్నిరాళ్ళు పడటంలో ఆశ్చర్యమేమీ లేదు" అన్నాడతను.
చలపతి వసంతనూ,రాజమణినీ దృష్టిలో ఉంచుకొని మాట్లాడుతున్నాడని మంజరి గ్రహించింది.
"అయితే ఇప్పుడేం చేద్దాం"
చలపతి సన్నగా నవ్వాడు.
"ఇలాంటి సందర్బంల్లో ఇంకొకరిని సలహా అడక్కూడదు. మంజరీ! మన మనసెం చెబితే అదే చేయాలి.దాని ఫలితాలు మనమే బాధ్యత తీసుకోవాలి. సలహాలిచ్చే వారికీ ఘట్టం ప్రాణం మీదకి తెస్తుంది."
"వారిని వేళ్ళగోడితేనే?" అన్నది మంజరి., అతన్ని వోరగా చూస్తూ.
చలపతి నవ్వి, మరోసిగరేట్ వెలిగించుకుని,కిటికీలోంచి దూరంగా చూడసాగాడు.
"మాట్లాడవేం చలపతీ!" అని రెట్టించింది మంజరి.
"ఏం మాట్లాడాలో తోచందేమరి అన్నాడు చలపతి. అదేదో నువ్వే ఆలోచించడం మంచిదమ్మా! నేను విన్నదేదో నీకు చెప్పాను.నేను చెప్పిందే నిజమనుకోకు. నువ్వూ నిజా నిజాలు ఆలోచించాలి. ఆ పైన_"
"నీ మాటమీద?"  అందామనుకొన్నాడు చలపతి.ఆమాట అని అవిణ్ను మరింత గాయపరచడం ఉచితంగా ఉండదనిపించిందేమో-అనడం మానేశాడు.
మంజరి ధర్మమా అంటూ,ఎన్నడూలేని ఐకమత్యం ఈ నాడు మ పరిశ్రమలో ఏర్పడింది. మజరిని చూసి అసూయపడుతున్న వారూ గిట్టని వారందరూ ఏకమయ్యారు. తమకు అండగా కొన్ని పత్రికలను కూడా ఎన్నుకొన్నారు. మంజరిని అధః పాతాళానికి తొక్కేయ్యడానికి కావలసిన సరంజామా అంతా సిద్దం చటేసుకొన్నారు.
చిత్రమేమిటంటే- గత పదిహేనేళ్ళుగా ఏనిమిషానా కలవనిరావుగారు ముఠా, మూర్తి గారీ ముఠా, మంజరి విషయంలో చేతులు కలిపాయి. రావుగారూ, మూర్తిగారూ, కలుసుకుని,మాట్లాడుకొన్నారు.
"మన మందరం పనికిరాని వాళ్ళమైనట్ట్లూ - పెద్ద- తనకేదో - ఈ పరిశ్రమలో చచ్చినంత పలుకుబడి ఉన్నట్లు మంజరి ప్రవర్తించడం అసహ్యంగా ఉంది" అన్నాడు మూర్తి.
"అవును.అవుడకు కాళ్ళు తెచ్చింది మీరే!" అన్నాడు రావుగారు.
ఆయన చాలా తెలివైనావాడు. పిల్లికాలుతో, పోయిలోని జీడి పిక్కలు తీసే కోటి మనస్తత్వం  వారిది! ఇలాంటి విషయాల్లో చప్పిన తేలడు.
"అది పాపమే అయితే,అందులో మీకూ భాగమున్నది. మనిద్దరం కలిసి ఆవిడకు కాళ్ళు తెచ్చామనడం ధర్మం" అన్నాడు మూర్తి.
"ఏం చేదాం?" అన్నాడు రావు.
"మజరికిక్కడ మంచినీళ్ళు పుట్టకుండా చేయాలి. అవిడకొక్క బుకింగ్ కూడా లేకుండా పోవాలి" అన్నాడు మూర్తి.
"అదెలా సాద్యం?" అన్నాడు రావు అమ్మయక్త్వం నటిస్తూ.
"మీరూ నేనూ ఒక్కమాటమీద నిలబడితే ఈ ఇండస్ట్రిలో సాద్యం కానిదేమీ లేదు... అదీగాక మనిద్దరం ఒక జిల్లా వాళ్ళం. ఓకే కులం వాళ్ళం. మనలో మనకు భేదాభిప్రాయలుంటే అది మన అంతరంగకమైన విషయంగానీ, ఇంకొకరోచ్చి చెప్పవలసింది కాదు" అన్నాడు మూర్తి.
"ఎంతబాగా చెప్పవన్నాయ్! అన్నాడు రావు. అతన్ని ఆలింగనం చేసుకుంటూ."
"నేననుకొన్న దేమిటంటే - మజారి నటిస్తున్న ఏ పిక్చర్ లోనూ నేను వేషం వెయ్యకూడదనుకొన్నాను."
"అరె! నిజమా?" అని ఆశ్చర్యం నటించాడు రావు.
"యస్"
"బ్యూటిపుల్" అంటూ చేతులు కలిపాడు రావు.
"నువ్వు బృహస్పతి లాంటి వాడివి మూర్తన్నాయ్! నాకీ ఆలోచనే రాలేడు సుమా!" అని ఎక్కేశాడు రావు.
"మూర్తిగారూ, ఓ గ్లాసుచిక్కని మజ్జిగ పుచ్చుకొని చెప్పసాగాడు.
"ఇందువల్ల నాకు రావలసిన పిక్చర్లు తగ్గిపోతాయి అయినా నాకు బాధలేదు. మారి నీ అభిప్రాయమేమిటో చెబితే విందామని ఉంది" అన్నాడు మూర్తి.
"మనిద్దరిదీ చెరొక దారీకాదు. నీ అభిప్రాయమే ణ అభిప్రాయం. నేనుకూడా, అవిడున్న పిక్చర్లో ఉండను" అని చేతులు కలిపాడు రావుగారు.
ఆ రోజు సాయంత్రమే పత్రికలవాళ్ళను పిలిచి ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారువారు. అందులో 'మంజరి' అన్న పేరు లేకుండా 'ఓ పేరు పొందిన ఆర్టిస్టు' అంటూ,అ ఆర్టిస్టును ఎడాపెడా ఏకి పారేసారు.చివరకి- అనివార్య కారణాల వలన మంజరి బుక్కయిన చిత్రాల్లో తాము నటించబోవడం లేదని చెప్పారు.
పత్రికలవారికిదో పిడుగుపాటు లాంటిది.వారు ఊహించని విధంగా ఇది జరిగిపోయింది.
"ఎందుకని?"
ఈ ప్రశ్నచాలామందగి అడిగారు.
"ప్రస్తుతం అంతకన్నా మేము ఎక్కువ చెప్పగలిగిందేమీ లేదు. మా నిర్ణయానికి తిరుగుకూడా లేదు. ఇందులో ఎవరినీ నొప్పించడం గానీ,ఇబ్బంది పెట్టగానీ మా అభిప్రాయం ఎంతమాత్రం కాదు" అన్నాడు రావు.
"ఈ శపధం ఎంతకాలమంటారు" అన్నాడు శర్మ.
రావుగారు అతనికేసి నిశితంగా చూశాడు.
"చెప్పలేరా?" అన్నాడు శర్మ.
"చెప్పకేం. మంజరిగారో,మేమో మారాలి. ఎదటివారితో గౌరవంగా మెలగడం తెలీని వారితో కలిసి పనిచేయడం మావల్ల కాదు.... ఇదేమీ అపురూపమైన విషయం కాదే! మనకు తెలీని ఎన్నో విషయాలు, మనం ఎదతవారి నుండి నేర్చుకొంటున్నాం. మంజరిగారు కూడా నేర్చుకోవచ్చు" అన్నాడు రావు.
మూర్తిగారేమీ పలకలేదు.
పత్రికల వారికి- ముఖ్యంగా సినిమా పత్రికల వారికి కావలసినంత మేటర్! ఈ నిర్ణయాలనపు ఆదారం చేసుకొని, చిలవలూ పలవలూ కల్పించి ప్రచారం చేసుకోవాడానికి, ఇప్పుడున్నంత ఛాన్స్ మరెప్పుడూ ఉండదు.
మంజరికీ సంగతి ముందుగా అందజేసినవాడు శర్మగారే! ఆయన సమావేశం నుండి సరాసరిగా మంజరి యింటికి వెళ్ళి, టాక్సీ డబ్బులు కూడా ఆమె చేతనే ఇప్పించాక, కుర్చీలో జారగాలబడి పోయాడు. ఏదో కొంప మునిగిందని మంజరి అనికునే అనుకోన్నది. ఆమె చేత బ్రతిమలాడించుకొని గానీ శర్మ ఆశలు సంగతి బయట పెట్టలేదు.
మంత్రి ముఖం మాడిపోయింది. "ఇలా జరుగుతుందనుకోలేదు శర్మాజీ!" అన్నది మంజరి.
"నాకూ తెలీదు అయితే ఈ నిర్ణయం హాఠాత్తుగా జరిగింది కాదు. చాలాకాలం నుండీ నలిగితూనే ఉండాలి. పెద్ద పెద్ద ఆర్టిస్టుల ను గురించి, రకరకాల పుకార్లు ప్రచారం కావడం అబ్బురం కాదు గానీ, ఇంతకు ముందెప్పుడూ కలగని పరిణామాలు, ఇప్పుడొచ్చి కూచున్నాయి. ఇలా - ఒక ఆర్టిస్టుమీదకు- పరిశ్రమంతా విరుచుకు పడడం ఇదే తొలిసారి" అన్నాడు శర్మ.
"నాకేమీ తోచడంలేదు శర్మాజీ! అన్నది మంజరి.
"మీ మేడగల అసూయ కారణమనుకుంటాను. మీరంటే కిట్టనివాళ్ళు- చాలామంది ఉన్నారు. మీకన్నా ముందునుండి ఈ మద్రాసు లో ఉన్నవారికి, మే కొచ్చిన పిక్చర్స్ లో నాలుగోవంతు రాలేదు. మీకున్నకీర్తిలో పదోభాగం కీర్తిలేదు. చాలామంది ఇంకా అద్దే కొంపల్లోనే ఉంటుంటే మీరు రాజభవనాలవంటి వాటిని కొనిపారేశాడు ఎవరికయినా కన్ను కుట్టిందంటే ఆశ్చర్యమేముందీ?" అన్నాడు శర్మ.
"మనమేం చేదామంతారు?" అన్నది మంజరి, గోళ్ళు కొరుక్కుంటూ. "రావుతోనూ, మూర్తి తోనూ  మాట్లాడి చూడమంటారా పోనీ - నేనే వారి దగ్గర కేడతాను"
"ఛఛ" అనేశాడు శర్మ.
మంజరి కిమ్మనలేదు.
అంతకన్నా పరువు తక్కువపని ఇంకొకటి లేదు. శత్రువులతో రాజీపడటంకన్నా ఆత్మహత్య చేసుకోవడం నయం.... నువ్విలా ప్రతి దానికి బెదిరిపోకూడదు.గట్టిగా నిలబడి ఉండు.... ఈ క్షణం నుండీ నీ కొక్క పిక్చర్ రాకపోయినా ఫర్వాలేదు... మూడు తరాలదాకా సరిపడేంత సంపాదించావు- అయినప్పుడు భయపడడంలో అర్ధం లేదు" అన్నాడు శర్మ.
"నా జాతకం భావోలేదు శర్మాజీ! భగవంతుడు నాకు విషయ పరీక్షలన్నీ ఏరి కోరి పెడుతున్నాడజు. నన్నుక్కిరిబిక్కిరి చేసి పారేస్తున్నాడు. మెదడంతా నిప్పుల కుంపటిలా మండిపోతున్నది" అన్నదావిడ.
అప్పుడే వచ్చిన చలపతి పత్రికల్లో వ్యాసాలూ రాయింమన్నాడు. అదెంతవరకుపయేగిస్తుందో చూడాలి. ఆశలు మన రారుపున నిలపడే పత్రిక లేపాటివో ముందు తెలుసుకోవాలి. మన శత్రువు మనకన్నా బలంగా ఉన్నప్పుడు, తలపడడం తెలివి తక్కువవుతుంది అని లొంగిపోవడమూ మంచిదికాదు" అన్నాడు శర్మ.
"ముక్కు మూసుకొని మూడు నిమిషాలురుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు" అన్నాడు చలపతి కసిగా.
శర్మగారేదో అనబోయి మానేశాడు.
"మనమేం చేస్తే బావుంటుందో చూడరూ మారి?" అన్నది మంజరి. ఆ ఇద్దర్ని ఉద్దేసించి.
"రావుగారూ, మూర్తిగారూ చేతులుకలపడం మనదురదృష్టం. వారిద్దరూ ఎదమేఖం పెడముఖంగా ఉంటుంన్నంత కాలమూ, మన ఆటలు సాగుతాయి.... అయినా - ప్రాణాలు పోయేదేమీ లేదు. చూదాం! కాస్త ఆలస్యంగా నైనా మంచి స్టేప్ తీసుకోవడం అవసరం" అన్నాడు శర్మ.
మంజరీగానీ, చలపతిగానీ పలకలేదు.
"మారి నేను వెళ్ళానా?" అన్నాడు శర్మ లేచే ప్రయత్నమేమీ చెయ్యకుండానే.
అంటే డబ్బుకావాలని అర్ధం.
"చూడండి చలపతీ! కేకినీ ఫాంటసీస్ వారిఫైల్ చూడాలనుకున్నాం కదూ, దాన్ని తీస్తారేమిటి?" అన్నది మంజరి.
చలపతి రుసరుసలాడుకొంటూ కిందికెళ్ళాడు.
"నాకో రెండొందలు కావాలి. అయిదో తారీఖున రావసినన పత్రిక ఇంకా ప్రెస్ కు కూడా పోలేదు. పేపరుకే నూటయాబై దాకా కావాలి. ప్రింటింగ్, పోస్టేజదీ " అన్నాడు శర్మ.
"అంతదాకా దొరకవేమో!" అంటూ మంజరి బీరువా తెరిచివెతికి "ఓ యాబై ఉన్నారండీ! సరిపెట్టుకోలేరా?" అన్నది.
"మీరసలేమీ ఇవ్వక పోయినా నా పత్రిక వస్తుంది" అంటూ లేచాడు శర్మ. మంజరి ఫక్కన నవ్వి, బీరువా తలుపు మూసేసింది.
"కోపంలో నే ముఖం ఎంత అందంగా ఉంటుంది సర్మాజీ! ఇంత చిరాకులో ఉన్నా మ రిలీఫ్ గా ఉంటుందని ఈ ముక్క విసిరాను- వెరీగుడ్ ఇంద-తీసుకెళ్ళు" అంటూ ఓ కవరిచ్చింది మంజరి.
సర్మాజీ నిశబ్దంగా దాన్ని జేబులో పెట్టుకొన్నాడు.
"అయిదోందలున్నాయి. వాడుకో. నీకెప్పుడు ఎంత కావాలన్న, మొఖమాట పడకుండా నన్నడుగుతుండు. అవును గానీ శర్మాజీ! నేనిలా డబ్బిస్తున్నానని చలపతితో అనం అలవాటా నీకు?" అన్నదావిడ.
"లేదే!"
"బ్రతికాం. ఇలా ఇస్తున్నట్టు చెప్పకు ఏడిచి పోతాడు." ఈల వేసుకొంటూ శర్మ వీధిలోకొచ్చాడు. సరాసరి రూముకేడదామా అనుకొన్నాడు. వెళ్ళి  చేసేదేమీ కనిపించలేదు. జేబులోంచి కవరు తీసి చ్ఘూసుకొన్నాడు. అందులో వందరూపాయలనోట్లు అయిదు కాదు- అరున్నాయి. మంజరి తనతో అయిదేనని చెప్పినట్లు గుర్తు కొచ్చింది. అంటే - వంద రూపాయలకు మంజరి దృష్టిలో పెద్ద విలువేమీ లేదన్నమాట!
రూము కెళ్ళాడనికి బదులుగా అతను సరాసరి జయరాం ఇంటికొచ్చాడు. ఆ వేళకు జయరాం, కుర్టీలో కూచుని బీడీ కాల్చుకొంటున్నాడు.
"నేను పనిమాలా మీకోసం- వచాను" అన్నాడు శర్మ.
జయరాం, ఇంకో కుర్చీ తెచ్చివేశాడు. శర్మ కూచున్నదాకా ఆగి, తరవాతనే టాను కూచున్నాడు   
"చెప్పండి!" అన్నది జయారాం.
"ఏం లేదు గానీ జయారాం గారూ, మీరూ ఆఖరిసారిగా పిక్చర్ లో బుక్కయి ఎన్నేళ్ళయింది?" అన్నాడు  శర్మ.
"అయిదారేళ్ళ పైచిల్లరమాట!" అన్నాడతను.
"ఈ లోగా మీకు పిక్చార్లెందుకు లేవుట?" అన్నాడు శర్మ. జయారాం పలకలేదు.
"ఫర్వాలేదు చెప్పండి" అన్నాడు శర్మ.
"ఏం చెప్పాను శర్మగారూ! ఈ లోగట్టు వ్యవాహారాలు అందరికి తెలిసినవే! కడుపు చించుకొంటే కాళ్ళమీద పడుతుంది. అంతకు ముందుదాకా నాదే పైలంతా అంతా ఓ పదేల్లనుమ్ది చక్రం అడ్డంగా తిరిగిపోసాగింది. మరీ- అయిదేళ్ళనుండీ కేకేసిన వారేలేరు.... కారణాలు ఏమని చెప్పనండీ! కుల ప్రభావం. నాకులం వాడు వొక్క డైరెక్టర్ లేడు, వొక్కప్రొడ్యూసరులేడు. కనీసం ఏ దిస్తిబ్యూటింగ్ కంపెనీలో నైనా భాగస్టుడుగా కూడా కాడు. ఇకనన్ను పిలిచే డెవరు చెప్పండి!" అన్నాడు జయరాం.
"నేను మీమీద కొన్ని ఎక్స్ పెరిమేంట్లు చేదామనుకొన్నాను." అన్నాడు శర్మ.
ఏం చేసినా నా జాతకం మారదనుకొంటాను. బాగా ఉన్న రోజులనాటి అలవాట్లు మానుకోవాడానికి లేదు? అమ్మడానికి వీలయిన వన్నీ అమ్మేశాను. మేడ, కారు కుదుపబెట్టాను, రెండింటిని అమ్మితే తప్ప అప్పులు తీరవు" అన్నాడు జయరాం.
"అదే చూదాం" అన్నాడు శర్మ.
"ప్రస్తుతం మనకున్న ఇద్దరు హీరోలు, మంజరిమీద పంతం పట్టారు. అవిడున్న పిక్చర్ లో వేషం వేయ్యమన్నారు. వేయరు కూడాను. వేషం వేయకుండా నేను చూసుకొంటాను. మంజరి కావాలనుకొనే ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారు. వారందరూ మంజరికోసం. హీరోలను వదులుకోవడానికి సిద్ధపడతారు. మరి- మీరు ప్రయత్నము చేయ్యరాదా? మనం ఇకే జిల్లా వాళ్ళం. తాలుకాలు కూడా పక్కపక్కనే! తిరగేస్తే మీకు మాకూ బండుత్వం ఉండకపోదు. వీటన్నింటికన్న మీ ఆర్దిక బాధలు నన్ను మరీ కలవర పెడతున్నాయి. ఈ దెబ్బతో మీకు పదిబుకింగులు దొరికితే మా దరిద్రం వొదిలి పోతుంది" అని సలహా యిచ్చాడు శర్మ.    జయరాం కళ్ళు ఆనందంతో మిలమిల లాడాయి. అతను అమాంతం శర్మను కావలించుకొన్నాడు.
"నీమాట పుణ్యాన అలా జరిగితే నా చర్మంతో మీకు చెప్పులు కుట్టిస్తాను శర్మాజీ!" అన్నాడు జయరాం.
"అలాగే చూదాం ముందు పని కానివ్వండి. ప్రపంచమంతా పెడదారిన పోతున్నప్పుడు, మీరు నేనూ మడిగట్టుక్కూచుని లాభం లేదు. మనం కూడా మందతో పాటు కలిసిపోవలసిందే" అన్నాడు శర్మ.
తను పూర్తిగా ఫుల్ అయిపోయినట్లు తెలుసుకోవడానికి రెండు రోజులకన్నా అవసరం లేకపోయింది శర్మకు. ఈ తగాదాకు తనకూ తనవారికీ అనుకూలంగా వాడుకొందామని, శర్మ కన్న కలలన్నీ కరిగిపోయాయి. మాజీ "అందాల నటుడు" జయరాం నడుం బిగించి రంగంలోకి దిగేవేళకు అతనికి పోటీగా ఇంకో ముగ్గురు రంగంలో కనిపించారు. ఈ ముగ్గురూ కొత్తగా ఈ రంగంలో కొచ్చినవారు. అట్టే పేరు ప్రతిష్టలు లేనివారు. తొలిసారిగా హీరో వేషాలు వేసిన వారు. ఆ కారణంగా బాధపడుతున్నారు కూడా వీరే!
ఏ డబ్బు దగ్గరో కధ దగ్గరో పేచీ వచ్చినప్పుడల్లా, గుండె గల ప్రొడ్యూసరు పాత హీరోను కాదని ఓ కొత్త ముఖాన్ని పట్టుకొచ్చి హీరో వేషం ఇవ్వడమూ, ఆ కొత్తవాజు బాగా చేసినా చేయక పోయినా అదే అతని ఆఖరి పిక్చరు కావడమూ, కొంతకాలం కిందట ఈ పరిశ్రమలో జరిగింది. ఇంకో కొత్తవాడు తమకు పోటీకి రావడం అటు రావుగారికి గానీ, ఇటు మూర్తిగారికి గానీ ఇష్టంలేదు. అందుకని ఇద్దరూ కూడబలుక్కుని పై వాడెవ్వడూ రాకుండా పకడ్భందీగా ఏర్పాట్లు చేసుకొన్నారు అలాంటి ఏర్పాట్లు జరగనప్పుడు వచ్చిన వారే ఈ ముగ్గురూ. వీరిలో ప్రతిభ లేదనడం అన్యాయం, ఇప్పుడు పేరు పతిష్టలు సంపాదించిన వారందరూ, తొలిసారిగా ఇంతకన్నా బాగా నటించారనడానికి దాఖలాలు లేవు. కానీ - లోలోపల రాజకీయాలవల్ల కుట్రలు, కుహనాలవల్ల, కుళ్లు వల్ల, ప్రతిభావంతుడైన వాడు కూడా నెగ్గుకు రాలేకపోతున్నారు. అదీగాక - తమశక్తి సామర్ధ్యాలను చూపుకొనేందుగ్గూడా వారికి అవకాశాలు లభించలేదు. బాగా చెయ్యని వారికి దారకం లేకపోవడంలో తప్పులేదు. గానీ- 'మోహన్' బాగా చేశాడు. చేశాడని పత్రికలూ, ప్రజలూ కూడా అన్నారు. కానీ అతనిక్కూడా రెండో బుకింగ్ లేదు. అతని కులం, అతని వృత్తిని, ప్రతిభను చావుదెబ్బతీసింది. 'రాజు' కూడా మంచి ఆర్టిస్టే! అతను తొలిసారిగా "బరువైన పాత్ర" తీసుకొని ఎంతో అనుభవం ఉన్నవాడిలాగా  పనిచేశాడు. అతనికి బుకింగ్ లేకుండా పోవడానికి అతని ప్రతిభే కారణమయింది రాజు ఎక్కిరావడం ఎంత ప్రమాదమో గ్రహించిన వారు అతనికి రెండో పిక్చరు దొరక్కుండా చేశారు. అతని కిచ్చే డబ్బుకే తాము కూడా వేషాలిస్తామన్నారు. అయినప్పుడు కొత్త వారిమీద లక్షలు ఖర్చు చెయ్యాలని ఎవరికి గానీ, ఎందుకుంటుందిట, మూడో వాడు చంద్రం - తొలి, మలి పిక్చర్సులో హీరోగా వేశాడు. అతను బాగానే పని చేసినా అసలు పిక్చరే పరమ బోరుగా ఉండటం వల్ల, డబ్బాలా వారం లోపుగా తిరిగొచ్చాయి. చంద్రం జాతకం దరిద్ర జాతకమనీ, అతనున్న పిక్చరు ధ్వంసమయి తీరడం ఖాయమనీ ఓ వాదుప్రచారంలో ఉన్నది. అందువల్ల చంద్రానికి కూడా బుకింగులు లేవు. ఏదో చిన్న చిన్న కంపెనీలు తరువాత డబ్బిచ్చే పంపిణీమీద, వీరిని బుక్ చేయడానికి చూశాయి. అయితే ఆ కంపెనీ లిచ్చిన వేషాలు వేయడానికి వీరు సిద్దంగా లేరు. సినిమా ప్రపంచంలో హీరోగా అడుగుపెట్టిన వాదు హీరోగానే ఉండాలి గానీ, దిగజారడం ప్రారంభిస్తే, ఆ పతనానికి అంత మంటూ ఉండదు. తొలిసారిగా హీరో వేషం వేసినవాడు, అందరిలా చిన్న చిన్న చిల్లర వేషాలు వేయడానికి అంగీకరించడం అసాధ్యం. గనుక - ఆ కారణంగా  కూడా వారికి పిక్చర్లు లేకుండా పోయాయి.
ఈ ప్రత్యర్ధులను తను వోడించగలనన్న నమ్మకం జయరాంకు లేదు. ఎందువల్లనో గానీ, అతనికి లోలోపల తనీ పోటీలో గెలవడం అసంభవమన్న భావం పదే పదే మెదలసాగింది.
జయరాంను వెంట దీసుకొని శర్మగారు మంజరిని కలుసుకోవడానికి నలభైగంటలు ముందుగా చంద్రం, ఓ పెద్దమనిషి దగ్గరనుంచి ఉత్తరం తీసుకొని ఆమె దర్శనం చేసుకొన్నాడు.
"ఏమిటి?" అన్నది మంజరి. అతన్ని అంత దూరంలోనే ఆపి చంద్రం ఆమెకు జాబిచ్చాడు.
పై అడ్రసు చదివి - 'కూచోండి' అన్నది మంజరి. తరువాత ఉత్తరం తీసింది. అందులో నాలుగంటే నాలుగే పంక్తులున్నాయి.
"ఈ చంద్రం మనవాడు నాకు ఆప్తుడు. నీకూ, హీరోలకు పడక పోవడం దురదృష్టం" నీ దగ్గర కొచ్చిన కంపెనీలకు "చంద్రాన్ని రికమెండ్ చెయ్యి-" మణ్యం.
కాగితం మడిచి పక్కనే ఉంచింది మంజరి.
"మీకు మణ్యం గారు తెలుసా?" అన్నదావిడ ఆప్యాయంగా.
"మా బంధువేనండమ్మాయిగారూ?" అన్నాడు చంద్రం.
"కాఫీ తాగుతారా?....గుడ్ తెప్పిస్తాను" అంటూ మంజరి బెల్ నొక్కింది.
చంద్రం చాలా జాగ్రత్తగా ప్రారంభించాడు.
"మీకు చెప్పవలసిందేమీ లేదనుకోండి అమ్మాయి గారు. ఈ ఫీల్డంత చిత్రమైనది ఇంకోటి లేదు ముఖ్యంగా అన్ని చోట్లా వాళ్ళే ఉంటున్నా, మొన్నటి దాకా మనవాళ్ళు అసలే లేరు. అంతా ఓ పది పదిహేనేళ్ళ నుంచీ....ఏం ఏడిచి పోతున్నార్లెండి. మరీ మీకు బొంబాయి ఫీల్డులో గిరాకి ఉన్నదని తెలిశాక చాలా మందికి కడుపులు భగ్గున రగిలి పోయాయంటే నమ్మండి! మరీ ఫస్టుక్లాస్ ఆర్టిస్టులు వలవలా వొకటే ఏడ్చిపోవడం దానికి మనం మాత్రం ఏం చెయ్యగలం? వాళ్ళను బొంబాయి పోవద్దన్న దెవరు? పిక్చర్లు తెచ్చుకోవద్దన్న దెవరు?" అన్నాడు చంద్రం.
"కాఫీ తీసుకోండి!" అన్నది మంజరి, తను కూడా కప్పునందుకొంటూ.
చంద్రం సగంతాగి కప్పును సాసర్ లో నెట్టేశాడు.
"మన మెక్కడ ఆగిపోయాం?" అన్నది మంజరి, అతన్ని మాట్లాడించాలని.
"రావుగారు, మూర్తిగారూ మీరంటే హడలు పోతున్నారు అమ్మాయిగారూ! మీ పక్కన యాక్ట్ చెయ్యాలంటే వారికి భయంగా ఉన్నదిట. అయినప్పుడు ఆమాటే అనొచ్చుగా. దానికిమసి పూసి మారేడుకాయ చెయ్యడమెందుకుట? మీమీద లేనిపోని అభాండాలు వెయ్యడ మెందుకుట? మిమ్మల్ని గిరించి అవాకులూ చెవాకులూ పత్రికల్లో రాయించడమెందుకుట?" అన్నాడు చంద్రం.
"చెప్పండి! వింటున్నాను" అన్నది మంజరి.
"మీ మీదకు పెద్ద సన్నాహంతో రాబోతున్నారు అమ్మాయిగారూ! ఏనాటికైనా మీరే లొంగి రావాలంటున్నారు. వారి దగ్గర కొచ్చి మన్నించమని మీరు వేడుకోవాలిట. అప్పటిదాకా మీతో మాట్లాడరట!" అని మంటను ఇంకాస్త ఎగదోశాడు చంద్రం.మంజరి హృదయం క్రోధంతో జ్వలించి పోయింది. ఆమె కన్నులు కెంపుల్లా అరుణారుణాలయ్యాయి.
"ఈ వెధవలు మాట్లాడక పోతే నాకు అడ్డిపోయిందేమీ లేదు" అన్నది మంజరి.
ఆ తరువాత గానీ ఆమె వస్తాయించలేదు. అంతకోపం రావడమే తప్ప వచ్చినా బయట పెట్టుకోవడం అంతకన్నా తప్పు. కోపం పెంచుకొని తాను సాధించే దేమీ లేదని తనకు తెలుసు. అయినా ఈ బలహీనత తనను వేధిస్తూనే ఉన్నదనుకొన్నదావిడ.
"ఇంతకన్నా వేరే కారణమేమీ లేదంటారా?" అన్నది మంజరి ఉద్రేకాన్నుండి తేరుకొని.
చంద్రాని కాప్రశ్న  అర్ధం కాలేదు.
"అదేనండీ! రావుగారు, మూర్తిగారు నా  మీద  కక్ష గట్టడానికి  ఇంకేమన్నా కారణాలున్నాయంటారా?" అన్నది మంజరి మళ్ళీ.
చంద్రం రవంత కంగారు పడ్డాడు.
"అమ్మాయి గారూ! నాకు తెలిసినంత వరకూ కారణాలివే! అసూయ మనుషుల చేత ఎంత అఘాయిత్య మైనా చేయిస్తుందండి అమ్మాయిగారూ! మీకు తెలియందేముంది చెప్పండి?"
మంజరి కళ్ళు మూసుకొని, సోఫాలో చేరగిల బడిపోయింది. కాస్సేపయ్యాక సన్నగా నిట్టూరుస్తూ ముందుకు వంగింది.
ఆవిడేదో చెప్పబోతున్న దనుకొని చంద్రం ముందుకు వంగాడు.
"మీకు మణ్యంగారు బాగా తెలుసా?"
"మరేనండీ అమ్మాయిగారూ!"
"ఇప్పుడు వారి వ్యాపారం ఎలా ఉంది?" అన్నది మంజరి.
"బాగానే ఉందండీ! ఈ మధ్యనే రష్యాకు యాభైవేస బేళ్ళ  చవకరకం పొగాకు ఎగుమతి చేయడానికి పర్మిట్ సంపాదించారు. ఇహ రెండు చేతులా డబ్బే ననుకోండి!" అన్నాడు చంద్రం.
మంజరికి పాత కాలపు సుబ్రహ్మణ్యం జ్ఞాపకం వచ్చాడు. రోజుల్లో తను నాగమణి దగ్గర ఉంటుండేది. సుబ్రహ్మణ్యం జ్ఞాపకం వచ్చాడు. రోజుల్లో తను నాగమణి దగ్గర ఉంటుండేది. సుబ్రహ్మణ్యం ఏదో పొగాకు కంపెనీలో గ్రేడింగ్ మేస్త్రీగా ఉంటుండేవాడు. నెలకో అయిదారు సార్లు తన దగ్గర కొస్తుండేవాడు. అతని దగ్గర  ఎప్పుడూ పొగాకు వాసనే వస్తుండేది! బేడ దగ్గర్నించీ గీసి గీసి బేరమాడుతుండేవాడు. ఒకసారి పూలు కొనుక్కొంటాను ఓ అనా ఇవ్వమని అడిగింది తను. దానికతనిచ్చిన జవాబు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది.
"బేరం ప్రకారం ఇవ్వవలసిందంతా నాగమణి కిచ్చాను. మధ్యలో ఈ కొసర్లు నా దగ్గర పనికిరావు. ఇంకో గంట సేపు నేనీ గదిలో ఉంటానంటే నువ్వొప్పుకోవు గదా? మరో అణా కాసు అదనంగా నీకెందుకివ్వాలిట?" అన్నాడు సుబ్రహ్మణ్యం.
తన మనస్సు చివుక్కు మన్నది.
"వ్యాపారంలో ఘటికుడే గదూ?" అన్నది మంజరి.
"చాలా గట్టివాడండీ అమ్మాయిగారూ! వ్యాపారంలో ఉండే లరువు బిగువులన్నీ అతనికి తెలుసు. పదేళ్ళక్రిందట ఆయన గ్రేడింగ్ మేస్త్రీగా వుండేవాడుట. ఇవ్వాళ ఎంత హీనంగా చూసుకొన్నా ఏడెనిమిది లకారాలు సంపాదించాడు. అదీగాక రాష్ట్రంలోనూ, సెంట్రల్ లోనూ ఆయనకు చాలా పలుకుబడి ఉంది!"
మంజరి పెదవులు బిగబట్టి అతను చెబుతున్నదంతా శ్రద్దగా వింటున్నది.
"సరే లెండి!" అంటూ మంజరి హఠాత్తుగా లేచి నిలబడింది.
చంద్రంకూడా నించున్నాడు.
"మీరు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండండి. మీ అడ్రస్ ను చలపతి గారి కిచ్చిపోండి....మీకు ఫోన్ ఉందా?
....ఫర్వాలేదు."
"సుబ్రహ్మణ్యంగారు ఏ సంగతీ రాయమన్నారండీ అమ్మాయి గారూ" అన్నాడు చంద్రం.
"నేనీ పూట వారికి ఉత్తరం రాయలనుకొంటున్నాను. అందులో -మీరిలా వచ్చి కలుసుకొన్నారని రాస్తాను..
...దట్సాల్ వెల్....మీరు వెళ్ళండి! అవసరమైతే నేనే కబురు పంపుతాను...."
చంద్రం నమస్కారం చేసి బయటపడ్డాడు.
మంజరి కబురు పెట్టిందాకా అతనూరుకోలేదు. అలా వూరు కోవడం, పైకొచ్చేవాడి లక్షణాలు కూడా కాదు మరి! పని ఉన్నా లేకపోయినా, అతను మంజరిని కలుసుకొంటూ ఉండేవాడు. కలుసుకొన్న  ప్రతిసారీ ఏదో కొత్త వార్తను మోసుకొస్తూనే ఉండేవాడు. ఆ వార్తలు వింటూ ఉంటే మంజరికి గంగ వెర్రులెత్తుతూ ఉండేవి.
"రావుగారూ, మూర్తిగారూ గత మూడు రోజులనుండి షూటింగ్సు కెళ్ళలేదండీ! ఉన్న కాల్ షీట్సన్నీ కాన్సిల్ చేసేశారండీ!" అన్నాడొకసారి.
"ఎందుకని?" అన్నది మంజరి.
"వారు పనిమాలా ప్రతి కంపెనీకి వెళ్ళి మిమ్మల్ని బుక్ చెయ్యొద్దని కాన్వాస్ చేశారండీ! ఇంకా చేస్తూనే ఉన్నారండీ?" అన్నాడు చంద్రం.
మంజరి -ఏమావ్వాలో అదే అయింది.
"వాళ్ళకు సుఖపడే గీత లనుకొంటాను చంద్రంగారూ! ఈ ఇండస్ట్రీ అంతా వారి చేతుల్లోనే ఉన్నదనుకోవడం భ్రమ! వారిమాట వినే కంపెనీలు కొన్ని ఉన్నట్లే. నామాట ప్రకారం నడిచేవి కూడా కొన్ని ఉంటాయని, వారికి తెలీక పోవడం దురదృష్టం. నేనింతకాలం అట్టే పట్టించుకోకుండా ఉన్నాను. వాళ్ళ అంతు నేనూ తేల్చుకొంటాను" అన్నది మంజరి.
ఇంతకన్నా మంచి అవకాశం దొరకదనుకొన్నాడు చంద్రం. ఉన్నవీ లేనివీ పోగుచేసి మంజరికి అంటించాడు. మంటను ఇంకాస్త ఎగసన దోశాడు. చంద్రం ఊదుతున్న కొద్దీ మంజరి కోపం జ్వలింపసాగింది. వారిని నేలబెట్టి కాలరాచిందాకా తను నిద్రపోనన్నది మంజరీ.
"బాగా అన్నారండీ అమ్మాయిగారూ! దూరంగా ఉండి చూస్తున్న నాకే కడుపు మండిపోతూ ఉంటే నిజంగా అనుభవిస్తున్న మీకెలా ఉంటుందో ఊహించగలను. ఈ దెబ్బతో ఎవరి బలా బలాలేపాటివో తేల్చుకో వలసిందే! సత్తువున్న వాళ్ళుంటారు. లేనివాళ్ళు తోకముడుచుకు పోతారు." అన్నాడు చంద్రం.
"ఎవరు తోక ముడుచుకొనేదీ చూద్దాం" అన్నది మంజరి బుసలు కొడుతూ.
అంతటితో చంద్రం ఊరుకోలేదు. ఈ సంఘటనలను చిత్ర విచిత్రాలుగా మార్చి అతను పనిమాలా ప్రచారం చేశాడు. తనను మంజరి పిలిపించిందని అనేక విషయాలను గురించి సంప్రదించిందనీ చంద్రం చెప్పుకొన్నాడు. మంజరి మిగతావారనుకొంటున్నట్టు అమాయకురాలు కాదన్నాడు. ఇంకొద్ది రోజుల్లో కనీవినీ ఎరుగని అద్బుతాలు జరుగుతాయన్నాడు. అవేమిటని  అడిగితే చెప్పేవాడు కాదు.
ఇందువల్ల మంజరికీ అతనికీ పరిచయమున్నదని  ఇప్పుడు చాలా మందికి తెలిసిపోయింది. సామాన్యులు ఆ పరిచయాన్ని భూతద్దం గుండా చూసి దడుచుకొన్నారు. తెలివైన వాళ్ళు తమలో తాము నవ్వుకున్నారు.
"మంజరీ వీణ్నెందుకు చేరదీసిందీ ఇంకా తెలిసినట్లు లేదు. వీడిమీద ఆధారపడేటంత తెలివితక్కువ దయినట్లయితే ఈ ఫీల్డులో అసలు ఎక్కి వచ్చేదికాదు. ఈ వెధవే బుక్కింగ్స్  కోసం ఆవిడచుట్టూ తిరిగి ఉంటాడు. ఇప్పుడున్న హీరోలమీద కోపంవల్ల - బహుశా మంజరి వీణ్ని ప్రొడ్యూసర్లకు  రికమెండ్ చేసినా చెయ్యొచ్చు. అంతే గానీ-" అన్నాడొకాయన.
ఆయన చాలాకాలం నుండి ఈ పరిశ్రమలో పాతుకుపోయినవాడు. అతని అంచనా అక్షరాలా సత్యమే!
తనను బుక్ చెయ్యడాని కొచ్చిన  ప్రొడ్యూసర్లతో  మంజరి ఈ విషయం స్పష్టంగా చెప్పింది.
"నేను కేవలం డబ్బు మనిషినే కాను. పిక్చరు బాగుండాలి. ప్రొడ్యూసరుకు పది రూపాయలు రావాలి. నాకేమిచ్చారన్నది ముఖ్యం కాదు. ప్రొడ్యూసరుకేం మిగిలిందన్నదే ముఖ్యం. ఫీల్డులో కొచ్చిన ప్రొడ్యూసర్లందరూ అణగారి పోతుంటే ఇండస్ట్రీ నాశనం కావడం తధ్యం. పొదుగు కోసుకొని పాలు త్రాగడం ఎవ్వరికీ మంచిది  కాదు....మీరు పదివేలు తక్కువిచ్చినా మాబాగే కానీ వారితో మాత్రం పని చెయ్యను. మీకు నేను కావాలో, వారు కావాలో ఆలోచించుకోండి" అన్నది మంజరి.
ప్రొడ్యూసర్లు ఏమీ అనలేక పోయేవారు.
"మీరు చంద్రం గార్ని బుక్ చెయ్యరాదా! వాళ్ళు తీసుకొనే దాంట్లో సగం మొత్తానికే వస్తాడు కష్టపడి పని చేస్తాడు. అవసరమయితే నేనూ అతనితో చెబుతాను".
"అతను పనిచేసిన పిక్చర్లు ఫెయిలయ్యాయండీ! అతని పాదం మంచిది కాదంటున్నారు చాలామంది. అతను అడుగు పెట్టిన  చోట నిప్పత్సరం అయిపోయిందట....అది నిజం కూడానూ. చంద్రంగారు లోగడ పనిచేసిన రెండు కంపెనీలు అయిపూ ఆనమాలూ లేకుండా పోయాయి" అని ప్రొడ్యూసర్లు గోలకెత్తారు.
"అప్పట్లో అతని జాతకం బాగా ఉండనిమాట  నిజమే! అందుకనే అతనింత కాలమూ, దిక్కు మొక్కు లేకుండా ఉన్నాడు....మొన్ననే సాయిబాబా భక్తుడొకాయన్ని పిలిపించి అడిగాను. అతనికా పీరిడ్ పోయిందట. ఇక నుండి వేస్తే వేయి రూపులుగా ఉంటుందట. అవన్నీ విచారించకనే మీకు చెబుతున్నాను....."
ప్రొడ్యూసర్లు కాదు - ఎవరయితే మట్టుకు ఏమన డానికైనా  అవకాశ మేదీ?
మంజరి ఉంటే చాలుననీ, ఆమె పేరు మీద లక్షలు పోగు చేసుకోవచ్చుననీ  అనుకొన్నవారు ఆమెను హీరోయిన్ గానూ, చంద్రాన్ని హీరోగానూ బుక్ చేసుకొన్నారు. మెహతా కంపెనీకే పిక్చర్సు డిస్ట్రిబ్యూటింగ్ కిచ్చారు. ఆమె షరతులన్నిటినీ పాటించారు.
తనీ పరిశ్రమలో స్థిరపడడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఉండదని చంద్రానికీ తెలుసు. ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో అతనే మాత్రం ఏమరలేదు. తను నూటికి నూరు పాళ్ళూ  మంజరి మనిషినన్న అభిప్రాయాన్ని స్థిర పరిచాడు. రావుగారికి, మూర్తిగారికీ ప్రత్యర్ధిగా నిలిచాడు ఫలితంగా అతనికి అయిదారు పిక్చర్లు చేతికొచ్చాయి. వీటన్నింటిలోనూ మంజరి హీరోయిన్ గా పనిచేస్తూనే ఉంది.
"మీరు నాకు చేసిన ఉపకారం జన్మ జన్మలకూ మరచిపోలేనండీ అమ్మాయిగారూ? మీరు చేయూత నివ్వకపోతే ఈ మద్రాసులో నాకు మంచినీళ్ళు కూడా పుట్టేవికావు" అన్నాడు చంద్రం.
మంజరి కళ్ళు మిల మిల్లాడాయి.
అయినా పైకి నిర్లక్ష్యంగా నవ్వేసింది.
మంజరి ప్రయత్నాలు అన్ని విష్నాలనూ అధిగమించి ప్రదంకావడం రావుగారూ, మూర్తిగారూ చూశారు. ఆవిడ చంద్రం దగ్గరకు తీసిందనీ, ప్రొడ్యూసర్లకు అతన్ని రికమెండ్ చేస్తూ ఉన్నదనీ ఎవరో చెప్పారు.
"ఇప్పుడేం చేదాం?" అన్నాడు రావుగారు.
ఫలానా విధంగా చేదామని రావుగారే అనవచ్చు. కానీ అలా అనడంవల్ల ఆపని తాలూకు ఫలిత�


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS