Next Page 
నిరాశలో నిండు గుండె పేజి 1

           
                                  నిరాశలో నిండు గుండె
                                                                             __ డా" సి " ఆనందారామం __

                       

                                    

    

        మానవత్వం చిరంజీవి. అది మానవజాతి ఉన్నన్నాళ్ళూ, అన్ని కాలాలల్లోనూ అన్ని సమాజాల్లోను ఎక్కడో, ఏ అడుగు పోరలోనో చిరంజీవిగా నిలిచే ఉంటుంది.
    అతడొక ఎదుగుతొన్న కుర్రవాడు.
    తెనుగు దేశపు నడిబొడ్డున పుట్టినవాడు.
    'నా' అనేవాళ్ళు ఉన్నారో ; లేదో తెలియనివాడు.
    ఆ కారణంగా అందర్నీ 'నా' అనుకుంటున్న వాడు.
    అతనిలో ప్రత్యేకించి చెప్పుకోదగిన దేమీ లేదు.
    అతని చిరునవ్వు మాత్రమె ఎవరినో ఛాలెంజ్ చేస్తున్నట్లుగా ఉంది. దేనినో ఎదుర్కోంటున్నట్లుగా ఉంది.
    అతడు ఆ రోజే జైలునుండి విడుదలయ్యాడు. పోలీస్ జవాను అతణ్ణి వెంట పెట్టుకుని తీసుకోచ్చాడు.
    అతణ్ణి చూడగానే పోలీస్ ఆఫీసర్ కి బాధ తోచింది. భుద్ధులు చెప్పాలనిపించింది . అలా చెప్పాలనుకోగానే శంకర రామానుజాది దివ్యపురుషుల ప్రభోధాలన్నీ ఒక్క సారిగా గుర్తుకొచ్చాయి .... ఒక ప్రవక్తలాగ శాంతస్వరంతో తియ్యగా అన్నాడు.
    "ఎందుకు  ఇలా పాడుపనులు చేస్తావ్? దొంగతనాలు చెయ్యకూడదు అబద్దాలు ఆడకూడదు. పెద్దలను ఎదిరించకూడదు ....."
    ఇంకా ఏమేమీ 'కూడదో' చెప్పటానికి ఆలోచిస్తూ ఒక్క క్షణం ఆగాడు ఆఫీసర్. ఆ కుర్రాడు "ఇహిహి" అని గట్టిగా నవ్వాడు. ఆ నవ్వుచూసస్తే వొళ్ళు మండిపోయింది ఆఫీసర్ కి. తన అమూల్యమైన బోధలన్నీ వ్యర్ధమవుతున్నా యనిపించింది.
    బయటకి వెళ్ళాక ఏం చేస్తావ్?" కరుగ్గా అడిగాడు,
    సంఘర్షణలో సతమతమవుతోన్న జీవిలా ఖంగున పలికాడు కుర్రవాడు.    
    "ఇదివరకు ఏం చేశానో, అదే!"
    నివ్వెరపోయాడు ఆఫీసర్.
    "ఛ! నువ్విక బాగుపడవు!" నిరాశగా అన్నాడు.
    "బాగుపడడం అంటే ఏమిటి సార్! మంచి బట్టలు  తోడుక్కుని కడుపునిండా తిని కార్లలో తిరగటమా? కుర్చీలో కూర్చుని కర్రపెత్తనం చెలాయించటమా? లేక ఈ నాగరి కారణ్యంలో గర్జించే క్రూరమృగాలకు దాసోహం చేస్తూ __ ఆత్మాహుతి కావించుకుంటూ కుక్కిన పేనులా కూలబడి పోవటమా?"
    ప్లీస్ ఆఫీసర్ కి చాలా కోపం వచ్చింది. అంత కోపం రావటానికి కారణం తను ఆకుర్రవాడికి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోవటమేనని ఆయనకు అర్ధంకాలేదు. "గెటవుట్ !" అని అరిచాడు . ఆ కుర్రవాడు నవ్వుతూ బయటకు నడిచాడు.
    సి.ఐ.డి. ఆఫీసర్ మోహన్ ఆ పిల్లవాడ్ని బయటకు వచ్చినప్పటినుండి పరిశీలిస్తూనే ఉన్నాడు. అతనిని చూసిన దగ్గరనుంఛీ మోహన్ మనసులో ఏదో విచిత్రమయియన తంత్రు లేవో తన మనసులో కదులుతున్నట్లనిపించింది. ఆ పిల్లవాడ్ని అనుసరించలనిపించింది.
    వాడు బయటకి రాగానే ఎంతోమండి పిల్లలు __ అతని ఈడువాళ్ళే _ అతణ్ణి చుట్టుముట్టారు. వాళ్ళలో చింకిరి బట్టల దరిద్రులున్నారు. తెర్లీన్ షర్టుల షోకిల్లాలున్నారు. సిగరెట్లు కాలుస్తున్న వాళ్ళు, కిళ్ళీలు నములుతున్న వాళ్ళు, దాహంతో నోరెండుకుపోతున్నవాళ్ళు _ అన్ని రకాలవాళ్ళు వున్నారు. వాళ్ళందరూ ఒకరినీ మించి మరొకరు వాడినేవేవావు అడుగుతున్నారు. వాడు నవ్వుతూ హుషారుగా సమాధానాలు చెపుతున్నాడు. ఎవరో వాడికేదో తినడానికి కూడా తెచ్చారు. తను తింటూ మిగిలిన వాళ్ళకు పెడుతూ ఏవో కబుర్లు చెబుతున్నాడు.
    ఉన్నట్లుండి వాడి చూపు మోహన్ మీద పడింది. వెంటనే మోహన్ దగ్గిర కొచ్చాడు.
    "ఏం కావాలి సార్?"
    "నాకేం కావాలి?"
    "మరి, మీరు నన్నెందుకు  చూస్తున్నారు?  ఆహా! నన్నే ఎందుకు చూస్తూన్నారూ అని ....."
    వాడి మాటల తీరుకు మోహన్ కు నువ్వు వచ్చింది.
    "వీలయితే సాయంత్రం ఒకసారి మా యింటికి రా."
    "అలాగే సార్!"
    "ఇల్లు తెలుసా?"
    "తెలుసు సార్! తెలుసుకోగలను."
    మోహన్ వెళ్ళిపోయాడు.
    ఆ సాయంత్రం ఆ కుర్రవాడు నిజంగానే తన ఇంటికి వచ్చేసరికి, వచ్చి నిర్భంయంగా సోఫాలో కూచున్నందుకా ? ఇందుకు తిట్టేవారెవరో సంతోషించే వారువరో, నేను కనిపెత్తగాలను సార్. మమ్మల్ని సంతోష పెడదామని."  
    మోహన్ నవ్వకుండా వుండలేకపోయాడు.
    "ఇంతచురుకైన వాడివి. చదువుకోరదూ!"
    "అదేమిటి సార్! నేను చదువుకోవటం లేదని ఎవరు చెప్పారు?" తెల్లబోయాడు మోహన్.
    "ఏం చదువుతున్నావ్?"
    "ఇంటర్ సీనియర్ లో వున్నాను సార్."
    "నిజంగా ! మరి ...."
    ఆగిపోయాడు మోహన్. ఆ రోజు పోలీస్ ఆఫీసర్ బుద్ధులు చెప్పడం గుర్తుకొచ్చింది. అలా తను చెప్పాలేడు.
    "నైట్ కాలేజీలో చదువుతున్నాను. సార్. పగటి వేళ బొత్తిగా తీరిక వుండడు. అల్ వేస్ బిజీ ."
    "అంత తీరిక లేని వుద్యోగం ఏం చేస్తున్నావ్?"
    "ఒకటా సార్! లక్ష ఉద్యోగాలు . పేపర్లమ్ముతాను. బట్టలమ్ముతాను. పరీక్షలముందు పదోక్లాస్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ క్లాసుల వరకూ కాఫీలు తయారుచేసి అందిస్తాను. ఇది భలే లాభిస్తుంది. కాని సీజన్ లోనే సార్! సరిగ్గా పరీక్షల ముందే . ఆ మాట కొస్తే పరీక్షలలలోనే అందరికి శ్రద్ధ. అంతకుముందు ఎవడికీ పట్టదు. పరవాలేదు సార్! బాగానే గడిచిపోతోంది."
    "నువ్వు ఒక పోలీసును కోట్టావనీ , అందుకే నిన్ను జైలులో పెట్టారనీ విన్నాను. నిజమేనా?"
    "నిజమే సార్!"
    "తప్పు కాదూ!"
    కాదని ఎలా అనగలను సార్! దొంగతనము చేయరాదు __ ఇలాంటి సూత్రాలు కాదనటానికి ఎవరికీ గుండెలు సార్! కాని, ఒక్క నిముషం ఓపికగా వింటనంటే జరిగింది చెప్తాను సార్! ఏ నూనెతో చేస్తేనేం, ఎలా చేస్తేనేం, వాడు మిఠాయిలు కాస్త చావగా అమ్ముతాడు అదీ ఆ రద్దీకి కారణం. ఒక ముసలిది ఆ దికనంముందు అడుక్కుంటుంది __ అక్కడయితే నలుగురూ వస్తారు కదా. మరి రెండుపైసలు వస్తాయని దాని ఆశ __ తన దికనం మరి రెండుపైసలు వస్తాయని దాని ఆశ _ తన దుకాణం ముందు కూచుని అది అలా అరుస్తూంటే శేఠ్ జీకి చిరాకనిపించింది. _ అక్కణ్నుంచి పొమ్మన్నాడు _ ఆ ముసలిది పోలేదు __ పోలేదు సరిగదా, " ఈ రోడ్డు నీయబ్బసోమ్మా! నేను పోను!" అని దబాయించింది. ఒక ముసలిది ... ముష్టిముసలిది తనను ఎదురించటం  శేఠ్సహించలేక పోయాడు __ ఎదురుగా యూనిఫారంలో ఉన్న పోలీస్ కనిపించాడు __ ఆ పోలీస్ ఇదివరకు కాస్త తెలుసు శేఠ్ జీకి. ఆ పోలీసును దగ్గరకు పిలిచి కల్తిమిఠాయి చేతిలో పేట్టి ముసలమ్మా సంగతి చెప్పాడు __
    ఇక్కణ్ణుంచి పోతావా లేదా అని గద్దించాడు పోలీస్. కాకీ బట్టల్నీ చూసి ముసలిది కొంచెం జడుసుకుంది  __ అయినా వెంటనే లేవలేక కొన్ని క్షణాలు తటపటాయించింది. పోలీస్ దాన్ని ఒక్క గెంటు గెంటాడు __ అది బోర్లాపడింది __ కెవ్వున కేక పేట్టి రాగాలుతీస్తూ గోలచేసింది _ జనం  పోగయ్యారు _ పోలీస్ కొంచెం గాభరా పడ్డాడు __ కానీ అనవసరం - శుద్ధ దండుగ . మన వాళ్ళు అంత తెలివితక్కువ వాళ్ళెంకాదు __ చోద్యం చూస్తారేగాని దేనిలోనూ కల్పించుకోరు _ అందులో పోలీసులకు సంబంధించిన విషయాల్లో అసలు కలిగించుకోరు _ కానీ, నేను కల్పించుకునాన్నను _ ఆ ముసలిదాన్ని అలా తోసేసే అధికారం పోలీస్ కు లేదన్నాను __ పోలీస్ సహించలేక పోయాడు. నేను చిన్నవాణ్ణి _ అంచేత  నామీద లాఠీ ఎత్తికొట్టాడు లెండి! .... "ఆహా ఇహిహి " అని అమాయకంగా నవ్వాడువాడు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS