అలాంటి వాళ్లు దొరకడం కష్టం
సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః।
అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః॥
వినేందుకు తియతీయగా ఉండే మాటలు మాట్లాడేవాళ్లు చాలామందే దొరుకుతారు. కానీ మనసుకి కష్టం కలిగించినా సరే... మన మేలు కోరుతూ కఠినమైన మాటలు మాట్లాడేవాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు.