మంచివారి సావాసం ఉంటే
జాడ్యం ధియో హరతి సించతి వాచి సత్యం
మానోన్నతిం దిశతి పాపమపాకరోతి ।
చేతః ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిం
సత్సంగతిః కథయ కిం న కరోతి పుంసామ్ ॥
మంచివారి సహవాసంతో మౌఢ్యము నశించిపోతుంది, వారి సావాసంతో సత్యమే పలుకబడుతుంది, పాపాలు నశించిపోతాయి, మనసు స్వచ్ఛంగా మారుతుంది, కీర్తి నలుదిశలా వ్యాపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే... సత్సాంగత్యం వల్ల లభించేదానితో పోల్చగలిగే లాభం లోకంలో మరేదీ లేదు.