Home » Jokes » Vrudda Cinenatudi Aarogya Rahasyam

Vrudda Cinenatudi Aarogya Rahasyam

Vrudda Cinenatudi Aarogya Rahasyam

వృద్ద సినీనటుడి ఆరోగ్య రహస్యం

ఎనభై సంవత్సరాలు నిండిన ఒక సీనియర్ సినీ నటుడిని ఇంటార్య్వూ చెయ్యడానికి ఒక

పత్రిక విలేకరి వెళ్లాడు. ఇంటార్వ్యూ మొదలయింది. ఆ విలేకరి ఆ సినీ నటుడిని మొదటి

చిత్రం గురించీ, అతని నటన అనుభవం గురించి, అతని ఇష్టాయిష్టాల గురించి అడిగి

తెలుసుకున్నాడు. దాదాపు ఇంటార్య్వూ పూర్తయింది.

" అన్నట్టు ఇంత పెద్ద వయస్సులో కూడా మీరు ఆరోగ్యంగా ఉండటంలో గల రహస్యం

ఏమిటో మా పాఠకులకు చెప్తారా ? " అని చివరగా ప్రశ్నించాడు విలేకరి.

" ఏముందీ ! చాలా సింపుల్ ! నేను సిగరెట్లు తాగలేదు, మందు ముట్టలేదు, అమ్మాయిల

వంక కన్నెత్తి చూడలేదు, నాకు పన్నెండేళ్ళ వయసు వచ్చేదాకా ...." అని కులాసాగా

జవాబు చెప్పాడు ఆ వృద్ధ సినీ నటుడు.

 

google-banner