Chakkarakeli Aratipallu

Chakkarakeli Aratipallu

చక్కరకేళీ అరటి పళ్ళు

" యాభై రూపాయలకి ఈ చక్కరకేళీ అరటి పళ్ళు ఎన్ని వస్తాయి ? " అని ఆ బండివాడిని

అడిగాడు సుందరం.

" డజన్ ఇస్తాను తీసుకోండి సార్ " అని వినయంగా అన్నాడు ఆ బండివాడు.

" ఈ రోజు సంక్రాంతి పండుగ కదా...ఐదు డజన్లు తీసుకుంటే ఏమైనా తగ్గుతుందా ? "

అని ఆ పళ్ళను చూస్తూ అడిగాడు సుందరం.

" ఐదు పళ్ళు తగ్గుతాయి సార్ " అని చెప్పాడు ఆ బండివాడు.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు సుందరం.