అదెలా.. మొదటి మెట్టే

అదెలా.. మొదటి మెట్టే


ఒక ముగ్గురు స్నేహితులు ఒకచోటకి చేరి డబ్బా కబుర్లు మొదలుపెట్టారు.

‘నేను 5 అడుగుల ఎత్తున్న మంచం మీద నుంచి కింద పడినా, కొంచెం కూడా దెబ్బ తగల్లేదు తెలుసా!’ అని డప్పు కొట్టాడు మొదటివాడు.

‘5 అడుగులు ఏం లెక్క. నేను 10 అడుగుల ఎత్తున్న బల్ల మీద నుంచి కిందకి పడినా చిన్న గాటు కూడా పడలేదు. అసలు నాకు చావే లేదనిపించింది’ అని మోగాడు రెండోవాడు.

‘5, 10 కూడా ఒక ఎత్తేనా! నేను 30 అడుగుల నిచ్చెన మీద నుంచి కింద పడ్డాను. అయినా నాకు చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు’ అని కాలర్‌ ఎగరేశాడు మూడోవాడు.

మూడోవాడి మాటలకి మొదటి ఇద్దరి స్నేహితుల మొహాలూ మాడిపోయాయి. ‘ఎంత గొప్ప చెప్పుకుంటే మాత్రం మరీ 30 అడుగుల నిచ్చెన మీద నుంచి పడ్డానని చెప్పుకోవాలా’ అని కోప్పడ్డాడు మొదటివాడు.

‘అందులో గొప్ప చెప్పుకోవడానికి ఏముంది! నేను నిచ్చెన మీద నుంచి పడినప్పుడు దాని మొదటి మెట్టు మీదే ఉన్నాను కదా!’ అని సంజాయిషీ ఇచ్చుకున్నాడు మూడోవాడు